ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
13, ఫిబ్రవరి 2021, శనివారం
మన మహర్షులు -21
మన మహర్షులు -21
తండి మహర్షి
🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
పూర్వం తండి అనే పేరుగల బ్రాహ్మణుడుండేవాడు. అతడు బ్రహ్మచర్యం తీసుకుని అన్ని వేదాలు శాస్త్రాలు చదివి యోగి, జ్ఞాని, మహర్షి అయ్యాడు.
సమాధిలో ఉండి పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
తండి పరమేశ్వరుడ్ని చూసి ఆనందంతో 'ఓ పరమేశ్వరా యోగీశ్వరులు ఎప్పుడూ ఎవరినైతే గొప్పవాడని స్తోత్రం చేసి, ప్రధానమైనవాడని భావించి, పురుషుడని పూజచేసి, అధిష్ఠాన దేవతని అర్చన చేసి, ఈశ్వరుడని ఎంచి ఊహిస్తారో అతడే నువ్వు నువ్వు ఆజుడివి, అనాదినిధనుడివి, విభుడివి, ఈశానుడివి, అత్యంతసుఖివి, అనఘుడివి నిన్ను నేను భక్తితో శరణు కోరుతున్నాను' అన్నాడు
పరమేశ్వరుణ్ణి చూసిన తండికి ఇంకా ఆనందం తగ్గక 'పరమేశ్వరా ! కామ క్రోధాలు నువ్వే, ఊర్ధ్వ అధోభాగాలు నువ్వే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నువ్వే, నిత్యానందుడవు, పరమపదమవు, దేహకర్తవు, దేహభర్తవు, దేహివి, ప్రాణుగతివి అన్నీ నువ్వే జనన మరణాలు కలిగించేది నువ్వే, దిక్కులు, యుగాలు, అయనాలు నువ్వే. రాత్రి పగలు చెవులు, కళ్ళుగా, పక్షాలు శిరస్సుగా, మాసాలు భుజాలుగా, సంవత్సరాలు పాదాలుగా అంతట నువ్వే నిండి వున్నావు,,'
ఈ విధంగా స్తోత్రం చేసిన తండి మహర్షి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు 'వత్సా నువ్వు తేజశాలివి, కీర్తిమంతుడివి, జ్ఞానివి, ఋషుల్లో గొప్పవాడివి అవుతావు. నీకేం కావాలో' అడగమన్నాడు
ఈశ్వరా! నీ దయకంటే నాకు కావలసింది ఏమీ లేదు. ఎప్పుడూ నాకు నీ పాదాల
దగ్గరే భక్తితో ఉండేటట్లు అనుగ్రహించమన్నాడు -తండి మహర్షి .
తర్వాత తండి ఒక ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు.
ఉపమన్యు మహర్షి తండి దగ్గరకు వచ్చి పరమేశ్వరుడి సహస్ర నామాలు చెప్పమని అడిగాడు .
ఇంతకు ముందు దేవతలకి పదివేల నామాలు బ్రహ్మ చెప్పాడు. వాటి నుండి వెయ్యి నామాలు స్వర్గలోకంలో వున్న వాళ్ళకోసం బ్రహ్మ ఇచ్చాడు.
భూలోక వాసుల కోసం తండి వెయ్యి నామాలు భూలోకంలోకి తెచ్చాడు. దీన్నే 'తండి కృత శివసహస్రనామస్తోత్రం' అన్నారు
ఇది సర్వమంగళములను సమకూర్చునది. సర్వకల్మషములను నశింపజేయునది. బ్రహ్మలకు బ్రహ్మ, పరులకు బరుడు, తేజములకు దేజము, తపములకు దపము, శాంతములకు శాంతము, ద్యుతలకు ద్యుతి, దాంతులకు దాంతుడు, ధీమంతులకు దీ, దేవతలకు దేవత, మహర్షులకు యజ్ఞములకు యజ్ఞము, శివులకు శివుడు, రుద్రులకు రుద్రుడు, యోగులకు యోగి, కారణములకు గారణము, నగు హరుని అష్టోత్తర సహస్రనామములు:
ఇలా తండిమహర్షి శివ సహస్రనామ స్తోత్రమును తెలియజేసెను. వీనిని జపించినవారు సర్వకామ్య సంసిద్ధిగాంచి ముక్తులగుదురు.
దీని వివరాలు మహాభారతంలోని అనుశాసనిక పర్వం లో లభ్యమవుతాయి.
ఋషులు ఎప్పుడు ఎదుటి వాళ్ళ కోసం ఏదో ఒకటి చేస్తుంటారు. కాని వాళ్ళకి కావల్సింది ఏమీ ఉండదు. ముక్తి తప్ప...🙏
🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
భగవంతుడితో
🛕🦚 *knvr* 🦚🛕
********************
*శుభోదయం*
*శనివారం*
********************
ఒక రోజు రాత్రి కలలో, భగవంతుడితో, నరేంద్ర సముద్రపు ఒడ్డున నడుస్తున్నట్టు .
అప్పటిదాకా తన జీవితంలో జరిగిన సంఘటనలు అన్నీ కనిపిస్తున్నాయి. ప్రతి సంఘటన లో చూస్తే నాలుగు అడుగులు కనిపించాయి. రెండు అడుగులు తనవి , రెండు అడుగులు భగవంతుడివి.
కానీ ఆఖరి సంఘటన లో చాలా కష్టమైన సమయం లో చూస్తే, రెండు అడుగులే కనిపించాయి. అప్పుడు నరేంద్రకు ఆశ్చర్యం అనిపించి
భగవంతుడిని ఇలా అడిగాడు , స్వామీ; “మీరు అన్నారు కదా, ఒక్కసారి నా భక్తుడి చేయి పట్టుకుంటే చివరిదాకా వదలిపెట్టను అని, మరి కష్టమైన సమయం లో ఎందుకు రెండు అడుగులే కనిపిస్తున్నాయి. మీరు నన్ను ఒంటరిగా వదిలేసారా ??”
దానికి భగవంతుడు ఇలా సమాధానం చెప్పారు ” నా ప్రియమైన భక్తురాలా, కష్టసమయం లో నువ్వు చూసిన రెండు అడుగులు నావే. ఆ సమయంలో నేను నిన్ను ఎత్తు కున్నాను. నేను నిన్ను ఎల్లవేళలా కంటికిరెప్పలా కాపాడుతూనే ఉంటాను.”
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
*నీతి:*
భగవంతుడి పై ప్రేమ, నమ్మకం, భక్తి మనల్ని ఎప్పుడూ కాపాడతాయి. భగవంతుడు కష్టముల నుంచి మనము బయట పడడానికి మనము బయట పడే మార్గాన్ని చూపిస్తాడు , అంతే కాకుండా అతి కష్టమైన పరిస్థితిలో, ఆయన మనతో పాటే ఉంటూ మన కూడా కుడా నడుస్తారు
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
మొగలిచెర్ల
*నియమం లో మార్పు..*
ప్రతి శుక్రవారం నాడు మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం శుద్ధి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది..అర్చకస్వాములు సిబ్బందీ అందరూ ఇందులో పాల్గొంటారు..అందుబాటులో ఉన్న భక్తులు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు..శ్రీ స్వామివారి సమాధి ని శుభ్రం చేయడం..అదీ తమ స్వ హస్తాలతో చేయడం అరుదైన అవకాశం గా భక్తులు భావిస్తారు..ఇది ప్రతివారం జరిగే ఒక తప్పనిసరి కార్యక్రమం..ఒక శుక్రవారం నాడు జరిగిన సంఘటన ఈరోజు వివరిస్తాను..
ఆరోజు ఉదయం ఎనిమిది గంటల వేళ..కార్లో దంపతులిద్దరు వచ్చారు..సరిగ్గా ఆ సమయానికి స్వామివారి మందిరం శుభ్రం చేయడానికి అర్చకస్వాములు సమాయత్తం అవుతున్నారు..ఈ దంపతులు మందిర ప్రాంగణం లోకి రావడం చూసి.."ఎవరో దూర ప్రాంతం నుంచి వచ్చినట్లు వున్నారు..వీళ్లకు అర్చన జరిపించి..వీళ్ళు దర్శనం చేసుకున్న తరువాత మనం ఆలయం శుద్ధి చేసుకుందాము.." అని అర్చకస్వాములే ఒక నిర్ణయం తీసుకొని..వేచి వున్నారు..ఆ దంపతులు మందిరం లోకి వచ్చి.."మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము..నిన్న రాత్రి మేము ఇక్కడకు వచ్చి నిద్ర చేయాలని అనుకున్నాము..కానీ మా పనుల వత్తిడి వల్ల మేము హైదరాబాద్ లో బైలుదేరడమే ఆలస్యం అయింది..అందుకని రాత్రి కందుకూరులో మా బంధువుల వద్ద ఆగిపోయి..ఉదయాన్నే స్నానాదికాలు ముగించుకొని ఇక్కడకు వచ్చాము..స్వామివారి సమాధి దర్శనం చేసుకునే అవకాశం కల్పించండి.." అన్నారు.."లోపలికి వెళ్లి దర్శనం చేసుకోండి..అర్చక స్వాములు కూడా మీకోసమే వేచి వున్నారు..మీరు త్వరగా దర్శనం చేసుకుంటే..ఆలయాన్ని శుభ్రం చేసుకోవాలి.." అని చెప్పాను.."మేమూ త్వరగా వెళ్ళాలి..ఈరోజు శుక్రవారం కదా.." అని అన్నారు..అలా ఎందుకు అన్నారో అప్పుడు అర్ధం కాలేదు..
దంపతులిద్దరూ లోపలికి వెళ్లారు..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని..స్వామివారి పాదుకులకు తమ శిరస్సు ఆనించి కొద్దిసేపు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నారు..ఆ తరువాత బైటకు వచ్చారు..స్వామివారి ఉత్సవ మూర్తి ముందు నిలబడ్డారు.."మీ గోత్రం తెలుపండి.." అని పూజారి గారు అడిగారు..ఆ దంపతులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని.."పంతులు గారూ..మేము ముస్లిం వాళ్ళము..మాకు గోత్రం ఉండదు..నాపేరు ఖాజావలి..ఈమె నా భార్య రజియా..మా పేర్ల తోనే అర్చన చేయండి.." అన్నారు..పూజారిగారు అర్చన చేశారు..ఆ దంపతులు శుక్రవారం త్వరగా వెళ్ళాలి అని ఎందుకు అన్నారో అప్పుడు అర్ధమైంది..నమాజు చేసుకోవడానికి అని అనుకున్నాను..
ఆ దంపతులు ఇవతలికి వచ్చి..వాళ్లలో వాళ్ళు ఉర్దూ లో ఏదో మాట్లాడుకున్నారు..ఆ తరువాత నా దగ్గరకు వచ్చి.. "అయ్యా..ఇందాక మీరు మాతో మాట్లాడినప్పుడు..ఆలయం శుభ్రం చేసే కార్యక్రమం అన్నారు..ఇప్పుడు ఈ మందిరం అంతా శుభ్రం చేస్తారా..? " అని ఆ భర్త అడిగాడు.."అవును.." అన్నాను.."మేము కూడా పాల్గొనవచ్చా..?" అన్నాడు.."గర్భాలయం లో ఉన్న స్వామివారి సమాధి శుభ్రం చేయడానికి స్త్రీలను అనుమతించము..బైట ప్రాంగణం అంతా శుద్ధి చేసే పనిలో స్త్రీలు కూడా పాల్గొనవచ్చు..స్వామివారి పూజా కార్యక్రమానికి వాడే వస్తువులను కడిగి పెట్టడం వంటి పనులు స్త్రీలు చేయవచ్చు.." అని చెప్పాను...వెంటనే ఖాజావలి తన చొక్కా విప్పేసి, తన భార్య చేతికి ఇచ్చాడు..ఆరోజు ఆలయ శుద్ధి కార్యక్రమం లో ఆ ముస్లిం దంపతులు అత్యంత భక్తితో పాల్గొన్నారు..
స్వామివారి మందిరం శుభ్రం చేయడం..ఆపై స్వామివారి సమాధి వద్ద అభిషేకము నిర్వహించి..హారతి ఇవ్వడం జరిగిపోయింది...
"అయ్యగారూ..మాకు చాలా ఆనందంగా వుందండీ..స్వామివారికి నేరుగా సేవ చేసుకున్నంత సంతోషంగా ఉంది..మీరు.. మీ సిబ్బంది..మీ పూజారులు..ఎవ్వరూ మమ్మల్ని వేరుగా చూడలేదు..ప్రతి శుక్రవారం ఎన్ని పనులున్నా..నేను నమాజు చేయడం తప్పనిసరి..అటువంటిది ఈరోజు ఈ భాగ్యం కలిగింది..మాకూ మీతో సమానంగా అవకాశం ఇచ్చారు..ఇక మీదట మేము తరచూ ఈ గుడికి వస్తాము..వెళ్ళొస్తాము.." అని ఖాజావలి చెప్పాడు.."మంచిది.." అన్నాను...ఈలోపల అతని భార్య తన సంచీ లోంచి గోధుమ వర్ణం తో ఉన్న శాలువాను తీసింది.."అయ్యగారూ..ఈ శాలువాను స్వామివారి సమాధి మీద పరుస్తారా..? దీనిని హైదరాబాద్ లో ఇక్కడకు వచ్చేముందు కొన్నాము.." అన్నది..నా ప్రక్కనే నిలబడి ఉన్న పూజారిగారు ఆ శాలువాను చేతిలో తీసుకొని.."అమ్మా..స్వామివారి సమాధి పై పరుస్తాము..కాకుంటే..ఈరోజు కాదు..ఈసారి సమాధి కి అభిషేకం చేసిన తరువాత పరుస్తాము.." అని చెప్పారు.."చాలా సంతోషం.." అన్నారు ఆ దంపతులు..ఆ తరువాత వాళ్లిద్దరూ హైదరాబాద్ కు వెళ్లిపోయారు..
ఆ దంపతుల కు అత్యంత అరుదైన అవకాశాన్ని స్వామివారు కల్పించి నట్లుగా తోచింది..నిజానికి వాళ్ళు గురువారం నాడే స్వామివారి సమాధిని దర్శించుకోవాలి అని అనుకున్నారు..కానీ వాళ్లకు శుక్రవారం నాడు ఆ భాగ్యం కలిగిస్తూ..నమాజు చేసే నియమాన్ని మారుస్తూ..దానితో పాటు తన సేవ చేసుకునే అదృష్టాన్ని కూడా కల్పించారు..ఆ దంపతుల మనస్సులో మతం కన్నా అతీతమైన భక్తిని స్థిరీకరించారు..
ఒక్కొక్కరి మనస్సులో ఒక్కొక్క అనుభవాన్ని పొందుపరుస్తారు స్వామివారు అని మరోసారి ఋజువుఅయింది..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
జాబాలి మహర్షి
మన మహర్షులు - 20
జాబాలి మహర్షి
🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
జాబాలి మహర్షి వాల్మీకి రామాయణంలో అయోధ్య కాండలో కనిపించే ఒక గొప్ప పాత్ర.
త్రేతాయుగంలో జాబాల అనే ఒక బ్రాహ్మణ వనిత మృకండు మహర్షిని కొన్ని సంవత్సరాల పాటు తీవ్రంగా శుశ్రూష చేసింది. తన తపస్సు నిర్విఘ్నంగా సాగినందుకు సంతోషించి మహర్షి గొప్ప ప్రజ్ఞాశాలి, సర్వవేదాలను అభ్యసించిన వేదవేత్త, గొప్ప తపస్సంపన్నుడు అయిన కుమారుడు జన్మిస్తాడని వరం ఇచ్చాడు. అలా వరప్రభావంతో జనించిన కుమారునికి జాబాలి అని నామకరణం చేసి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు.
జాబాలికి యుక్త వయస్సు రాగానే అతని తల్లి గౌతమ గోత్రీకుడైన హరిద్రుమతుడు అనే గురువు గారి వద్ద విద్యాభ్యాసం కోసం అప్పగించింది.
అతనికి ఉపనయనం చేయగోరి గురువు పూజాసంకల్పం కోసం కులగోత్రాలను అడుగగా అవి తనకు తెలియవని సమాధానం ఇస్తాడు.
మీ తల్లిదండ్రులను అడిగి తెలుసుకుని రావల్సిందిగా గురువు ఆదేశిస్తాడు.
కుమారుని సందేహాన్ని విన్న తల్లి తనకు భర్త లేడని, దాసీ వృత్తినే స్వీకరించి అనేక ప్రదేశాలలో తిరగానని, ఒక మహర్షి ఆశీర్వాదం కారణంగా నువ్వు పుత్రునిగా లభించావని తెలుపుతుంది.
తిరుగి తన వద్దకు తిరిగి వచ్చిన జాబాలి జన్మ కథను దివ్య దృష్టితో తెలుసుకున్న హరిద్రుమతుడు అతడు కారణజన్ముడని తెలుసుకుని ఉపనయనంతో పాటు గాయత్రీ మంత్రోపదేశం చేస్తాడు.
అంతేగాక నాటి నుండి అతని పేరును సత్యకామజాబాలిగా మారుస్తాడు.
బ్రహ్మ విద్యను అభ్యసించేందుకు తగిన అర్హత కోసం అతనిని గోసేవ చేసుకొమ్మని గురువు ఆదేశిస్తాడు.
సత్యసంధత, గురుభక్తి అచంచలమైన భక్తి విశ్వాసాలతో జాబాలి అహర్నిశలు గో సేవ చేసుకుంటూ ఉండేవాడు.
అతని భక్తి తత్పరత, సేవాదృక్పధాలకు మెచ్చి వాయుదేవుడు వృషభరూపంలో వచ్చి మంత్రోపదేశం చేసాడు.
అనంతరం గోవుల రూపంలో ఇంద్రుడు, అగ్నిదేవుడు, సూర్యుడు, బృహస్పతులు వచ్చి జాబాలికి బ్రహ్మోపదేశం, వేదాలు , ఉపనిషత్తులను ఉపదేశించడం వలన జాబాలి బ్రహ్మ జ్ఞాన సంపన్నుడయ్యాడు.
ఆత్మసాక్షాత్కారం పొందిన జాబాలి గురువు ఆదేశం మేరకు ఒక ఆశ్రమం నిర్మించుకుని నిత్యం వేదపారాయణ, సత్గంధపఠన, గురుధ్యానము నందే నిమగ్నుడయ్యేవాడు.
గురుధ్యానం, గురునామం జపించనిదే పచ్చి గంగైనా ముట్టేవాడు కాదు. జాబాలి గురుభక్తికి మెచ్చి హరిద్రుమతుడు స్వయంగా శిష్యుని ఆశ్రమానికి వచ్చి సర్వవేదసారం, బ్రహ్మజ్ఞానం ఉపదేశించి తన సర్వ తప్పశ్శక్తిని ధారపోస్తాడు.
కలియుగదైవం శ్రీవేంకటేశ్వరస్వామి వెలసిన తిరుమల పవిత్ర రపదేశంలో ఆశ్రమం నిర్మించుకొని ఘోరతపస్సు ఆచరించాడు.
ఆయన ఆశ్రమ ప్రాంతాన్ని జాబాలి తీర్థం అని పిలుస్తారు.
అశేష భక్త జనావళి తమ గృహ, నక్షత్ర దోషాలను పరిష్కరించుకునేందుకు జాబాలి తీర్థం దర్శించుకుని అక్కడే ఉన్న వినాయక, ఆంజనేయ స్వామి మూర్తులను పూజించుకుంటారు.
అనంతర కాలంలో చిత్రకూట పర్వత ప్రాంతంలో జాబాలి మహర్షి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించి, ఆ స్వామి అనుగ్రహంతో పరతత్వ రహస్యాలను గ్రహించారు.
అనంతరం బ్రహ్మజ్ఞాన సాధనకు తనను ఆశ్రయించిన పిప్పలాద మహర్షికి సకల వేద సారాన్ని బోధించాడు. వీరిద్దరి నడుమ సాగిన సంవాదం జాబాల్యుపనిషత్తు పేరిట సుప్రసిద్ధం అయింది.
రామాయణంలో అయోధ్యకాండలో తండ్రి ఆజ్ఞను అనుసరించి అడవులకు బయలుదేరుతుండగా జాబాలి మహర్షి అక్కడి వచ్చి తన వాక్పటిమ, తర్కం, అపారమైన శ్రస్తసంపదను రామునితో వాదనకు దిగి అతనిని అడవులకు వెళ్లకుండా ఆపేందుకు విఫలయత్నం చేస్తాడు.
ఆ వాదనలో ఎన్నో తత్వ రహస్యాలు, వేదవిజ్ఞానం, బ్రహ్మసూత్రాలు వచ్చి వినేవారికి సంపూర్ణ జ్ఞానోదయం అవుతుంది.
అయితే చివరకు శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్లే యోచనలో ఎంతో పరమార్ధం ఉందన్న విషయం తపశ్శక్తి ద్వారా గ్రహించి తన వాదనను ఉపసంహరించుకుంటాడు.
జాబాలి ఎంతో కాలం దశరథునికి ముఖ్య సలహా దారునిగా ఉంటూ ప్రజాసంక్షేమమే ధ్యేంగా సత్యం, ధర్మం, న్యాయం, అహింసలనీ నాలుగు పునాదులపై కోసల దేశంలో సుపరిపాలనను సాగించేందుకు కృషి చేసాడు.
🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹