27, జూన్ 2023, మంగళవారం

గొప్ప సందేశo

 👩‍🦯👨‍🦯👩‍🦯👨‍🦯👩‍🦯👨‍🦯👩‍🦯


*🖤 సీనియర్ సిటిజన్స్ కోసం :*

*⚫ మాడిపోయిన బల్బ్ లు...*                                                                                                                                  

                  *****

       *🗣️ ఉన్నతోద్యోగం చేసి పదవీ విరమణ చేసిన ఒక వ్యక్తి అప్పటివరకు తాను నివసించిన అధికారిక నివాసం నుంచి ఒక కాలనీ లోని తన స్వంత ఇంటిలోకి మారాడు.  తాను పెద్ద ఉద్యోగస్టుడినని అహంభావం మెండుగా ఉన్నవాడు.  ప్రతిరోజూ ఆ కాలనీ లో ఉన్న పార్క్ లో సాయంత్రపు నడకకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు కనీసం వారివంక చూసేవాడు కూడా కాదు.  వారంతా తన స్థాయికి తగినవారు కాదనే భావన అతడికి మెండుగా ఉంది.*


     *🗣️ ఒకరోజు అతడు పార్క్ లోని బెంచ్ పై కూర్చుని ఉండగా మరో వృద్ధుడు వ్యక్తి వచ్చి పక్కన కూర్చుని సంభాషణ ప్రారంభించాడు.  ఈ వ్యక్తి మాత్రం ఎదుటివ్యక్తి చెప్పే మాటలను ఏమాత్రం విలువ ఇవ్వకుండా తాను నిర్వర్తించిన ఉద్యోగం, హోదా గురించి, తన గొప్పతనం మాత్రమే చెప్పేవాడు.  తన వంటి ఉన్నత స్థాయి వ్యక్తి గతిలేక స్వంత ఇల్లు ఉన్నందుకు ఈ కాలనీ ఉంటున్నట్లు చెప్పుకున్నాడు.  కొన్ని రోజుల పాటు ఇలా కొనసాగింది.  ఆ ముసలాయన మాత్రం ఓపిగ్గా వినేవాడు.  ఒక రోజు ఆ వృద్ధుడు నోరు విప్పాడు.*

  

     *🗣️ “చూడు నాయనా!  విద్యుత్ బల్బు లు వెలుగుతున్నంత వరకే వాటికి విలువ, అవి మాడిపోయిన తరువాత అన్నీ ఒకటే.  వాటి రూపం, అవి అందించిన వెలుగులు అన్నీ మరుగున పడిపోతాయి.  నేను ఈ కాలనీలో  ఐదు సంవత్సరాల నుండి నివస్తున్నాను,  నేను రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా సేవలు అందించానని ఎవ్వరికీ చెప్పలేదు ఇప్పటిదాకా.*

                                                                                                            *🗣️ అంతే... ఆ అహంభావి మొహంలో రంగులు మారాయి.*


     *🗣️ ఆ పెద్ద మనిషి కొనసాగించాడు.  "నీకు కుడి పక్కన దూరంగా కూర్చుని ఉన్న ఆ వర్మ గారు భారత రైల్వే లో జనరల్ మేనేజర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు.  ఎదురుగా నిలబడి నవ్వుతూ మాట్లాడుతున్న సింగ్ గారు ఆర్మీలో మేజర్ జనరల్ గా ఉద్యోగ విరమణ చేశారు.  ఆ మూలగా తెల్లటి బట్టల్లో ఉన్న మెహ్రా గారు ఇస్రో ఛైర్మన్ గా సేవలు అందించారు.  ఈ విషయం  ఆయన ఎవరితోనూ చెప్పుకోలేదు.  నాకు తెలిసిన విషయం నీకు చెబుతున్నాను"  "మాడిపోయిన బల్బ్ లు అన్నీ ఒకే కోవకు చెందినవని ముందే  చెప్పాను కదా.  జీరో, 10, 20, 40, 60,100 వాట్ల ఏ బల్బ్ అయినా అవి వెలుగుతున్నంత వరకే వాటి విలువ.  ఫ్యూజ్ పోయి మాడిపోయిన తరువాత వాటి కి చెందిన వాట్, అవి విరజిమ్మిన వెలుగులకు విలువ ఉండదు.  అవి మామూలు బల్బ్, ట్యూబు లైట్, లెడ్, సి. ఎఫ్. ఎల్., హలోజెన్, డెకోరేటివ్ బల్బ్...  ఏది  అయినా ఒకటే.*


     *🗣️ అందుకే నీతో సహా మనమందరము మాడిపోయిన బల్బ్ లమే.  ఉదయిస్తున్న సూర్యుడు, అస్తమిస్తున్న సూర్యుడు ఒకేలా అందంగా ఉంటారు.  అయితే ఉదయిస్తున్న సూర్యుడికి అందరూ నమస్కారం చేస్తారు, పూజలు చేస్తారు.  అస్తమిస్తున్న సూర్యుడికి చేయరు కదా!  ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి.*


       *🗣️ మనం చేస్తున్న, ఉద్యోగం, హోదా శాశ్వతం కాదని తెలుసుకోవాలి.  వాటి కి విలువ ఇచ్చి అవే జీవితం అనుకుంటే... ఏదో ఒక రోజు అవి మనలను వదలి పోతాయనే వాస్తవాన్ని గుర్తించాలి.  చదరంగం ఆటలో రాజు, మంత్రి... వాటి విలువలు ఆ బోర్డు పై ఉన్నంత వరకే...  ఆట ముగిసిన తరువాత అన్నింటినీ ఒకే డబ్బా లో వేసి మూత పెడతాము.*


     *🗣️ ఈ రోజు నేను సంతోషంగా ఉన్నానని భావించు, ముందు ముందు కూడా సంతోషంగా ఉండాలని ఆశించు...*

 

     *🗣️ మన జీవితంలో ఎన్ని సర్టిఫికట్లు పొందినా... చివరికి అందరూ సాధించే సర్టిఫికెట్ ఒకటే... అదే డెత్ సర్టిఫికేట్.*

👩‍🦯👨‍🦯👩‍🦯👨‍🦯👩‍🦯👨‍🦯👩‍🦯

*🗣️ (ఎంత గొప్ప సందేశమో కదా!)*

👩‍🦯👨‍🦯👩‍🦯👨‍🦯👩‍🦯👨‍🦯

ఈశ్వరార్పణ

 ఈశ్వరార్పణ

ఒక హరిదాసుగారు నాయనలారా మీరు ఏదో ఒకటి రోజు ఈశ్వరార్పణ చేయండి అందువలన మీకు పుణ్యం వస్తుంది అని చెప్పారట.  ఇది బాగానే వుంది ఏది ఈశ్వరార్పణ చేయాలి ఏది చేయాలన్నా మనసు రావటం లేదే అని  రమణయ్య  అనే ఒక పౌరుడు ఆలోచించాడు. అప్పుడు అతనికి ఒక అపూర్వమైన ఆలోచనవచ్చింది అదేమిటంటే నేను ఉపయోగించుకునేది ఏది కూడా ఈశ్వరార్పణ చేయటానికి మనసు రాదు కాబట్టి ఏదైనా నాకు పనికి రానిది నేను ఉపయోగించుకోలేనిది ఈశ్వరార్పణ చేస్తే అటు ఈశ్వరార్పణ చేసిన ఫలితం వస్తుంది ఇటు నాకు ఎలాంటి నష్టము రాదు అని అనుకున్నాడట. 

ఒకరోజు పేలాలను వేయించి (పేలాలు అంటే వడ్లు జొన్నలు, మొక్కజొన్నలను వేయించటం వలన వచ్చేవి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ రోజుల్లో మనం పాప్కార్న్ అనేవి మొక్కజొన్న పేలాలు) పిండి పడుతున్నాడట ఇంతలో పెద్దగా గాలి వీచింది. ఆ గాలికి కొంత పేలపిండి కొట్టుకొని వెళ్ళింది.  అప్పుడు మన రమణయ్యకు హరిదాసుగారు చెప్పిన ఈశ్వరార్పణ గురుంచి జ్ఞ్యాపకం వచ్చింది. వెంటనే గాలికి పోయింన పేలపిండి మొత్తము ఈశ్వరార్పణమస్తు అని సంకల్పం  చేసాడట. తనకు చెందలేనిది కూడా వృధాకాలేదు తనకు ఈశ్వరార్పణ ఫలితం లభించిందని సంతోషపడ్డాడట.

ప్రతి మనిషికూడా నేను నాది, నావాళ్లు అనే భావాన్ని ఒక గిరిగీసుకొని వుంటారు.  ఆ చక్రపరిధిలోనుంచే ప్రతిదీ ఆలోచిస్తారు. తను చూసే తాను అనుభవించే ప్రతిదీ ఈ చక్రానికి ముడిపెట్టుకొని మసలుతారు.  నిజానికి నేను అనేది ఏమిటి అని ఆలోచిస్తే అప్పుడు కానీ తత్త్వం బోధపడదు. 

సగటు మానవుని అభిప్రాయం ఏమిటంటే నేను అంటే తన శరీరం అలానే నాది అంటే తన శరీరముతో ముడివేసుకున్న సంబాధలు అవి మరల రెండు  రకాలు ఒకటి శరీరంతో ఏర్పాటు చేసుకున్న మనుష్యసంబందాలు అంటే, తల్లిదండ్రులు, అన్నాతమ్ములు, అక్కాచెల్లెళ్లు ఇంకా భార్యా పిల్లలు ఇక రెండవది నిర్జీవయిన వస్తువులు అంటే నా ఇల్లు నా ఇంటి వస్తువులు, నా పొలము ఇలా చెప్పుకుంటూ పొతే అనేకమైనవి నాతొ ముడి పది వున్నవి.  వీటిచుట్టూనే ప్రతి మనిషి సంబంధం కలిగి ఉండి అదే సర్వస్వముగా భావిస్తారు. ప్రతి క్షణం తన ఆలోచనలు వీటి చుట్టూ పరిబ్రమిస్తూవుంటాయి.  ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ బంధాల కోసమే భగవంతుని ప్రార్ధిస్తూ వుంటారు.  భగవంతుడా నా భార్యా పిల్లలను చల్లగా చూడు, నా కొడుకుకు పరీక్షలో మంచి మార్కులు వచ్చేటట్లు చేయి, నా కూతురుకు మంచి సంబంధం దొరికేటట్లు చేయి నాకు మంచి ఇల్లు కొనుకున్నేటట్లు దీవించు, మంచి కారు ఇప్పించు ఇలా ఇలా అనేక కోరికలు నిత్యము మదినిండా నిండిపోయి ఎప్పుడు మనస్సును తొలుస్ తువుంటాయి. ఈ ఉచ్చులోంచి తప్పించుకోవటం అంటే అది అంత సులభసాధ్యం కాదు.  ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అసాధ్యం అని కూడా అనవచ్చు. సాధకుడు అయిన వాడు ఈ సుడిగుండం నుండి ఎలా బయటపడాలి అని సదా ఆలోచిస్తాడు. 

సాధకుడు తనకు వున్న బంధాలు కూడా కేవలం తన శరీరానికి చెందినవి మాత్రమే కానీ తనకు చెందినవి కావనే సత్యాన్ని తెలుసుకునే అన్ని బంధాలతో వున్న సంబంధాలను కేవలం కర్తవ్యభావనతో మాత్రమే నెరవేరుస్తాడు. నిజానికి ఆలా నడవటం చాలా అంటే చాలా కష్టమైన పని ఎంతో సాధనచేస్తేనే కానీ ఆ సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు. నిజానికి ఈ ప్రపంచంలో ఈశ్వరార్పణ అనేదే ఏది లేదు అదేమిటి నేను ఈశ్వరార్పణ ఎందుకు చేయటంలేదు అని చాలామంది అంటూవుంటారు.  నేను నిత్యం చేసే జపతపాలను ఈశ్వరార్పణగా చేస్తున్నాను. నేను చేసే ప్రతి పూజను ఈశ్వరార్పణగా చేస్తున్నాను అని కొంతమంది భక్తులు అనవచ్చు.  అది కొంతవరకు నిజమే ఎందుకంటె భక్తులు త్రికరణ శుద్ధిగా ఈశ్వరార్పణగా చేసే  ప్రతి కర్మ తప్పకుండా ఈశ్వరునికి చెందవచ్చు. అందరు తప్పకుండ ఈశ్వరార్పణగా కర్మలు చేయాలి.  అప్పుడు కర్మఫలం కేవలం ఈశ్వరునికి చెందుతుంది. 

భక్తుడు కొంత పరిపక్వత చెందిన తరువాత జ్ఞ్యాన మార్గాన్ని  చేరుకుంటాడు. ఎప్పుడైతే జ్ఞ్యాన మార్గాన్ని చేరుకుంటాడో అప్పుడు సాధకుని మానసిక స్థితి మారుతుంది. ఇప్పడిదాకా నేను వేరు భగవంతుడు వేరు అనే భావనతో పూజా, అర్చన చేసాడు. తన స్థితి పరి పక్వతకు చెందిన తరువాత నేను వేరు కాదు ఈశ్వరుడు వేరుకాదు అనే భావనలోకి  వస్తాడు. ఆ స్థితే "త్వమేవ అహం" అనే స్థితి ఈ స్థితిలో సాధకుడు వేరుగా ఈశ్వరుడు వేరుగా గోచరించడు అప్పుడు ప్రత్యేకించి ఈశ్వరార్పణగా చేసే కర్మలు ఉండనే వుండవు. సాధకుడు చేసే ప్రతి కర్మకూడా ఈశ్వరార్పణగానే భాసిల్లుతోంది. 

ఈశావాసోపనిషత్ లోని ఈ మంత్రాన్ని గమనించండి. 

"ఓం ఈశా వాస్య మిదగ్గ్ సర్వం" 

జగత్తులో ఏవేవైతే ఉన్నవో అన్నీఈశ్వరుడే అయి వున్నది. అంటే ఈ జగత్తులో ఈశ్వరుడు కానిది ఏది లేదు.  ఆ విషయం ప్రతి సాధకుడు తన సాధనలో  కొంత ముందుకు సాగితే కాని ఈ సత్యం తెలుసుకోలేడు. అప్పటిదాకా తానూ వేరు ఈశ్వరుడు (భగవంతుడు) వేరు అనే అజ్ఞ్యానంలో ఉంటాడు ఎప్పుడైతే అజ్ఞ్యానం తొలగి జ్ఞ్యానోదయం అవుతుందో అప్పుడు తెలుసుకుంటాడు తానూ ఈశ్వరునికన్నా బిన్నంగా లేడని.  అప్పుడు తానూ చేసే ప్రతి కర్మకూడా ఈశ్వరార్పణ కర్మ గానే  గోచరిస్తుంది.  ప్రత్యేకించి ఏ కర్మను కూడా ఈశ్వరార్పణగా చేయనవసరం లేదు. అప్పుడు సాధకుడు నిత్య సంతోషంగా ఆనందమూర్తిగా తానె ఈశ్వరుడిగా బాసిల్లుతాడు "బ్రహ్మవిత్ బ్రెహ్మయేవ భవత్" అందుకే బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మె అవుతాడు.

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ 

భార్గవ శర్మ

హంసక్షీర న్యాయం*

 *హంసక్షీర న్యాయం* అన్నవాక్యం అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా. దాని అర్ధం :

 

హంసకి పాలని,నీరుని వేరుచేసే నైపుణ్యం ఉంది . ఒక విషయం చెప్పినపుడు కాని మాట్లాడేటప్పుడుకాని అందులోని మంచి చెడు విషయాలలో, మంచిని గ్రహించి చెడుని విడిచిపెట్టాలని తెలపడానికి పై న్యాయాన్ని ఉదాహరిస్తారు .అట్లే మరికొన్ని న్యాయాలను చూద్దాం.


స్థాలీపులాక న్యాయం .

భ్రమర కీటక న్య్యాయం .

మర్కట కిశోరన్యాయం .

మార్జాల కిశోర న్యాయం .

తిల తండుల న్యాయం . 

దర్వీ పాక న్యాయం .

శాఖా చంక్రమణం న్యాయం


ఇవే గాకుండా అహి నకులుక న్యాయం అని మరొక న్యాయం కూడా ఉన్నది. 


దీని వివరణ ఎవరైనా ఇవ్వగలరా. 


అహి మూషిక న్యాయం అన్నది కూడా విన్నాను. పై రెండు ఒకటేనా తెలియటం లేదు. కాస్తా వివరించరూ

ఉత్తరకోసమంగై

 🔱ఉత్తరకోసమంగై

మంగళనాధుడు🔱

       


 


పరమేశ్వరుడు ప్రధమంగా వెలసిన  పుణ్యస్ధలం  

ఉత్తరకోసమంగై.

ప్రాచీన కాల  ఋషులు, యోగులు, 

మహాత్ములు, సిధ్ధులు అందరు దర్శించి పూజించిన   పురాతన ఆలయం. నవగ్రహాలు అవతరించడానికి ముందే

ఆవిర్భవించిన ఆలయంగా  నాలుగు యుగాలకి ముందే వున్న ఆలయంగా ఈ ఆలయం ప్రసిధ్ధిపొందింది.

 వేయి మంది శివ భక్తులు ఒకే సమయంలో మోక్షం పొంది సహస్రలింగోద్భవం జరిగిన పుణ్యక్షేత్రం యిది. ఇక్కడ 3000 సంవత్సరాలు గా పూవులు పూస్తూ కాయలు కాస్తున్న బదరీ వృక్షం ఈ ఆలయంలోనే వుంది.

 దక్షిణేశ్వరా, సర్వేశ్వరా అని కీర్తించబడే మంగళనాధుడు ఈ ఆలయం మూలవిరాట్.

అత్యంత మహిమాన్వితమైన మరకత నటరాజస్వామి విగ్రహం యీ 

ఆలయంలోనే వున్నది.

ఈ ఆలయం లోని అమ్మవారు మంగళనాయకిగా భక్తుల కోరికలు తీరుస్తున్నది.


ఉత్తరకోసమంగైలో వున్న శివలింగం స్వయంభూ లింగం, 3000 వేల సంవత్సరముల

నాటిదని  నిర్ణయించబడింది.

ఈ ఆలయం

సుమారు  20 ఎకరాల సువిశాలస్ధలంలో వున్నది.

ప్రాచీన కాలంలో యీ ప్రాంతమంతా శివపురం, దక్షిణ 

కైలాసం, చతుర్వేది మంగళం, ఇలందికై పళ్ళి, బదరికా క్షేత్రం , బ్రహ్మపురం,

వ్యాఘ్రపురం,

మంగళపురి,

బదరిశయన క్షేత్రం అనే పేర్ల తో పిలువబడినది.

ఇక్కడ వున్న శిలా శాసనాలలో రావణుని భార్య మండోదరి పేరు కనిపిస్తుంది.


ఈ ఆలయంలోని పంచలోహ నటరాజస్వామి వ్యత్యాసంగా దర్శనమిస్తాడు. ఈ విగ్రహంలో  కుడి ప్రక్కన

పురుషులు చేసే తాండవం, ఎడమ ప్రక్కన ముగ్ధమనోహర స్త్రీ లావణ్యం రెండూ  గోచరిస్తాయి.


ఆలయ ప్రాంగణంలో వినాయకుడు, కుమారస్వామి దర్శనమిస్తారు.


ఈ ఆలయంలోని కుమారస్వామికి వాహనంగా ఏనుగు వున్నది.

కుమారస్వామికి  ఇంద్రుడు తన ఐరావతాన్ని

యీ ఆలయంలోనే కానుకగా యిచ్చాడని ఈ స్ధల మహాత్య

చరిత్ర అయిన 

'ఆది చిదంబర మహాత్యం' వివరిస్తున్నది.


రామేశ్వరం నుండి 83 కి.మీ దూరం లోను, 

రామనాధపురం నుండి 18 కి.మీ దూరంలోను యీ ఆలయం వున్నది.

 


సరిగ్గా 70 సంవత్సరాల క్రితం ఇదే ప్రదేశం లో dr శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారిని అత్యంత దారుణంగా హత్య చేశారు..


మళ్ళీ ఖచ్చితంగా అదే రోజు అదే పార్టీ కి చెందిన అదే సిద్ధాంతం తో అధికారం లోకి వచ్చి ఆ మహనీయుడుని స్మరించుకుంటూ జమ్మూ లో దేవాలయాన్ని ప్రారంభం చేసి ఘనమైన నివాళి అర్పుంచారు మోటా భాయ్..


ఒకప్పుడు ఇక్కడ తుపాకులు పేలేవి..

మన సైనికుల రక్తం ఎరులై పారేది..


ఇప్పుడు అంతా మారిపోయింది..

ఇప్పుడు వేద మంత్రాలు వినిపిస్తున్నాయి..

శత్రువుల అర్థనాదాలు వినిపిస్తున్నాయి..


శారదా అమ్మవారు వచ్చారు..

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు..


జమ్మూకాశ్మిర్ లో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన కేంద్ర హోమ్ మంత్రి శ్రీ Amit Shah గారు..


ఇదీ మార్పు అంటే..

ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్..

భారత్ మాతా కి జై 🙏🙏

ఇంటింటి చాగంటి"

 "ఇంటింటి చాగంటి"


సనాతన ధర్మాన్ని అనుసరించే తెలుగువారందరూ  ఒక్కసారైనా శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనం  వినే ఉంటారు ! 


వైదిక ధర్మం లుప్తమైపోతుందేమో, ఇప్పటి తరానికి దిశానిర్దేశం చేసేవారెవరూ ఉండరేమో అని భయపడుతున్న దశలో తెలుగు ప్రవచనాల రంగస్థలం మీద ఒక వెలుగు రేఖలా ప్రసరించి, 'ఇంతింతై వటుడింతై' అన్నట్టు తన వాగ్ఝరి, అసమాన ధారణా కౌశలంతో చాగంటి గారు ఇంటింటి మనిషైపోయారు. ప్రొద్దున్న లేవగానే ప్రక్కింట్లోనో, ఎదురింట్లోనో లేదా గుడిలోనో ఆయన కంఠం మోగుతూనే ఉంటుంది.


సనాతన ధర్మం మీద ఉన్న అచంచల విశ్వాసం, తల్లిదండ్రులు, గురువుల మీద గల గౌరవం, వాఙయాన్ని ఇచ్చిన ఋషులపట్ల విధేయత, పెద్దల పట్ల గల గౌరవం ఆయన ప్రసంగాల్లో ఉట్టిపడుతూ ఉంటుంది.  ఆయన ప్రవచనాలు విని పులకరించని మది ఉంటుందా? నిరాశా, నిస్పృహలతో నిండిన జీవితానికి ఆశ చిగురించకుండా ఉండగలదా? ఆచరించగలిగీ ఆచారాన్ని విడిచిపెట్టేసిన వారి మనస్సాక్షి 'నువ్వు చేస్తున్నదేమిట'ని నిలదీయకుండా ఉంటుందా!  


'పూజామందిరంలో ఉన్నది బొమ్మ కాదు, నీ మొర ఆలకించే భగవంతుడే అక్కడున్నాడ'ని చాగంటి గారు నొక్కి వక్కాణించడం విన్నాకా మన పూజా విధానం మనకి తెలియకుండానే మార్పు చెందుతుంది. భగవంతుడికి అవసరార్థం ఓ దణ్ణం పెట్టి 'నీకిదిస్తే నాకేమిస్తావ్' అనే బేరసారాల స్థాయి నుండి భగవంతుడంటే నమ్మినవారి బాగోగులు చూసే ఒక అద్భుతశక్తి అనే నమ్మకం  కొన్ని వందలు, వేలమందికి కలగడానికి కారణం ఆయన ప్రవచనాలే కదూ!


శివకేశవుల అభేదం పాటిస్తూ ఆయన ప్రవచించిన పురాణాలు, ఇతిహాసాలు వింటోంటే సూత మహామునే స్వయంగా మనముందుకి వచ్చి ప్రవచించినట్టు ఉంటుందనడంలో కించిత్ అతిశయోక్తి కూడా లేదు. నిత్య నైమిత్తిక కర్మలని ఎలా ఆచరించాలి, సమయం లేకపోతే లఘువుగా పూజ ఎలా చేసుకోవాలి అని ఇంటిపెద్దలా వివరిస్తోంటే ఎన్ని వేల చేతులు మౌనంగా మనస్సులోనే ఆయనకి నమస్కరిస్తూ ఉంటాయో!


ప్రత్యేక తిథుల్లో పారాయణ చేయవలసిన శ్లోకాలని ఆయన పఠిస్తుండగా సభికులు గొంతు కలిపినప్పుడు వెలువడే ఆ పాజిటివ్ ఎనర్జీని అనుభవించాలే తప్ప మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. ఎన్నో వందల ప్రవచనాలు చేసినా తాను భగవత్స్సేవ చేస్తున్నాను అనుకుంటూ ఈ సేవకి రూపాయి తీసుకోకూడదని ఆయన మాతృమూర్తి పెట్టిన నిబంధనని గత రెండు దశాబ్దాలుగా తు.చ. పాటిస్తున్న శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి నిష్ఠకి చేతులెత్తి మొక్కకుండా ఎలా ఉండగలం ! 


చాగంటి గారి ప్రవచన ఝరి ప్రేక్షకులని మంత్రముగ్ధులని చేయడంతో పాటు కూర్చున్నవారిని కూర్చున్నట్టుగా వివిధ ఆలయాల సందర్శనకి కూడా తీసుకెళ్ళిపోతుంది. తన ప్రవచనాల్లో తిరుమల వేంకటేశ్వరుడి ఆలయం లేదా తాను సందర్శించిన ఏ ఇతర ఆలయం ప్రస్తావన వచ్చినా చాగంటిగారు పులకరించిపోయి ఆ ఆలయాన్ని అణువణువూ వర్ణిస్తూ, తన ప్రవచన ప్రఙతో శ్రోతలకి ఆలయ విశేషాలని శాబ్దిక ప్రత్యక్షప్రసారం చేసి దానిని కళ్ళముందు  సాక్షాత్కరింపజేస్తారు. ఆయా ఆలయాలని సందర్శించినప్పుడు నిర్మల భక్తితో, ఏకాగ్రచిత్తంతో మనసుని ఆ పరిసరాల్లో లయం చేస్తే తప్ప అటువంటి ధారణ అసాధ్యం.    


కేవలం పురాణేతిహాసాల ప్రవచనాలతో చాగంటి గారు తన కర్తవ్యం పూర్తయ్యిందనుకోలేదు. పిల్లలని, యువతని సరైన మార్గంలోకి మళ్ళిస్తేనే వారు మంచి పౌరులుగా తయారవుతారని ఒక బాధ్యత గల పౌరుడిగా మనసారా నమ్మి వారికి తన ప్రసంగాల ద్వార అనేక పాఠశాలలు, కళాశాలల్లో దిశానిర్దేశం చేసారు, ఇప్పటికీ చేస్తున్నారు.  


'మన చాగంటిగారు ' అనుకునేంతగా ఆయన తన ప్రవచనాలు వినేవారి మనసుల్లో కొలువయ్యారంటే అందుకు ఆయన కృషి మాత్రమే కాకుండా, చాగంటిగారిని సదా  వెన్నంటి ఉంటూ తన తోడ్పాటుని అందిస్తున్న ఆయన అర్ధాంగి శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరిగారి పాత్ర కూడా ఉంది. 


ప్రవచనాల ద్వారా దిశా నిర్దేశం చేస్తున్న ఆ శారదాపుత్రునికి మనం ఏమివ్వగలం? తాను చెప్పే ప్రవచనాలు తనని తాను ఉద్ధరించుకోవడానికేనని చాగంటి గారు వినయంగా చెప్పుకుంటారు. తాను చేస్తున్న సత్కార్యాన్ని నిష్కామంగా ఆ పరమేశ్వరుడికే ధారపోసే ఆ ప్రవచనయోగిని ఏమని పొగడగలం? ఆయన చూపుతున్న బాటలో నడవడం తప్ప.


భగవంతుడు తనకి ప్రసాదించిన వాక్కుని, అసాధారణమైన ధారణాశక్తిని ఉపయోగించి సమాజంలో మార్పు తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తున్న శ్రీ చాగంటి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.


-శ్రీమతి వాత్సల్య గుడిమళ్ళ, సింగపూర్

న్యాయమైన విషయమే.

 .                        🕉️

                     _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*యస్మిన్ యథా వర్తతే యో మనుష్యః*

*తస్మిన్ తథా వర్తితవ్యం స ధర్మః*

*మాయాచారో మాయయా బాధితవ్యః*

*సాధ్వాచారః సాధునా ప్రత్యుపేయః*


~మహాభారతం శాంతి పర్వం (109-29)


*ఎవరు ఎవరితో ఏ విధంగా ప్రవర్తిస్తాడో , అతను ఆ వ్యక్తితో అదే విధంగా ప్రవర్తించడమే ధర్మం. మాయావితో మాయాగాను, సాధుశీలుడైన వానితో సాధువుగను ప్రవర్తించడం... న్యాయమైన విషయమే.

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 103*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 103*


భార్యబిడ్డలను పాటలీపుత్రంలో రహస్యస్థావరంలో దాచివచ్చి మంజు పట్టణంలో తలదాచుకున్న రాక్షసుడు తరచుగా తన కుటుంబ సభ్యులను తలుచుకొని బాధపడుతున్నాడని తెలుసుకున్న మలయకేతువు అతని విచారాన్ని పోగొట్టడానికి బాగురాయణుడు సలహా మేరకు అమూల్యమైన రత్నహారాన్ని రాక్షసునికి బహుమతిగా పంపించాడు. ఆ హారం చేరే సమయానికే కొన్ని ఆభరణాలు రాక్షసుని వద్దకు విక్రయానికి వచ్చాయి. వ్యాపారులు ధనం అవసరం వచ్చి తక్కువ వెలకు ఆ ఆభరణాలను రాక్షసునికి విక్రయించి ధనం తీసుకుని నిష్క్రమించారు. 


ఇంతలో మలయకేతువు వద్ద నుంచి దూతరావడంతో రాక్షసుడు తాను కొన్న అభరణాలన్ని పెట్టెలో దాచి పెట్టి, మలయకేతువు పంపిన రత్నహారాన్ని స్వీకరించి దానిని ధరించి వెళ్లి మలయకేతువుకి ఆనందం కలిగించాడు. 


ఇది జరిగిన కొన్నాళ్ళకు శకటదాసు, సిద్దార్థకుడు వచ్చి రాక్షసుని కలుసుకున్నారు. తన మిత్రుడైన శకటదాసుని రక్షించినందుకు కృతజ్ఞతగా తన మెడలోని రత్నహారాన్ని తీసి సిద్దార్థకునికి బహుకరించాడు రాక్షసుడు. 


సిద్ధార్థకుడు ఆ హారాన్ని తిరిగి యిచ్చివేస్తూ "అయ్యా... ! ఈ హారాన్ని మీ వద్దనే వుంచండి. నాకు అవసరమైనప్పుడు తిరిగి తీసుకుంటాను" అని చెప్పాడు. 


అంతలో అప్రయత్నంగా అతని దుస్తుల్లో నుంచి రాక్షసుని నామాక్షరాలున్న ఉంగరం జారిపడింది. రాక్షసుడు ఆ ఉంగరాన్ని తనదిగా గుర్తించి వివరాలు అడిగాడు. 


"ఒకసారి నేను చందనదాసు ఇంటి ముందు భిక్షకోసం వెళ్లగా వీధి గుమ్మం బయట పడి వున్న ఉంగరం కనిపిస్తే తీసి దాచాను. మీదైతే మీరే స్వీకరించండి" అని చెప్పాడు సిద్ధార్థకుడు. 


తన అంగుళీయకాన్ని చూసుకోగానే రాక్షసునికి భార్య గుర్తుకొచ్చి కంటనీరు గిర్రున తిరిగింది. తాను దేశం విడిచి వస్తూ తన భార్యకి ఇచ్చి వచ్చిన ఆ అంగుళీయకాన్ని ఆమె పొరబాటున చేజార్చుకుని ఉంటుందని అతను భావించాడు. 


"నాయనా .... ఈనాడు సుదినం. నాకు మిత్ర దర్శనంతోపాటు ఈ అంగుళీయకం ద్వారా నా భార్యబిడ్డల్ని దర్శించినంత ఆనందాన్ని కలిగించావు. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను" అంటూ రాక్షసుడు, మలయకేతువు అప్పుడప్పుడూ తనకి కానుకగా పంపిన మరో రెండు ఆభరణాలను సిద్దార్థకునికి ఇచ్చాడు. 


సిద్దార్థకుడు వాటిని కూడా రాక్షసుడు వద్దనే దాచమని చెప్పి "అమాత్యా ! మీకు సహాయం చేసి నేనా చాణక్యుడికి విరోధినయ్యాను. ఈ పరిస్థితుల్లో నాకు బ్రతికేందుకు వేరేదారి కూడా లేదు. కనుక తమరివద్దనే నాకూ ఏదైనా పని చూపించి పుణ్యం కట్టుకోండి" అని ప్రార్థించాడు. 


రాక్షసుడు సంతోషించి సిద్ధార్థకుడిని తన అంతరింగిక సేవకుడిగా నియమించుకున్నాడు. తన తరపున మలయకేతుకి ఏదైనా సందేశమో, వార్తో పంపాల్సివస్తే దానిని సిద్ధార్థకుడి ద్వారా నిర్వర్తించేవాడు రాక్షసుడు. ఆ విధంగా కొద్దిరోజుల్లోనే మలయకేతువుకి కూడా రాక్షసుని దూతగా సిద్ధార్థకుడు గుర్తింపు పొందాడు. 


ఇది జరిగిన కొంత కాలానికి....


"రాక్షసామాత్యుని అనుకూలురు అన్న ముద్రవేసి, రాజద్రోహనేరాన్ని మోపి, భద్రభట, డింగరారత, బలగుప్త సేనానులను రాజ్యాన్నించి బహిష్కరించాడు చాణక్యుడు. దేశబహిష్కారానికి గురైన ఆ సేనానులు చాణక్యుని మీద పగతీర్చుకోవాలన్న కాంక్షతో అష్టకష్టాలు పడి మంజుపట్టణానికి చేరుకుని రాక్షసుని ఆశ్రయాన్ని, మలయకేతు వద్ద పదవులని పొందారు. 


ఇది జరిగిన మరికొన్ని రోజులకు ప్రతీకారేచ్చతో రగిలిపోతూ జీవసిద్ధి వచ్చి వాళ్లలో చేరాడు. 


ఇలా ఒక్కొక్కరే వచ్చి తన బలాన్ని పెంచుతున్నందుకు ఆనందపడిపోయిన రాక్షసుడు చాణక్యుని దెబ్బతీయడానికి తగిన సమయం కోసం ఎదురు చూడసాగాడు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:-  శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻


👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

ఈ రోజు పదము

 203వ రోజు: (జయ వారము) 27-06-2023

మన మాతృ భాష సేవలో


ఈ రోజు పదము:

దంపతులు : ఆలుమగలు, ఏకాంగులు, భార్యాభర్తలు.


 ఈ రోజు పద్యము:


ఒక్కడు మాంసమిచ్చె మఱియొక్కడు చర్మము గోసి యిచ్చె వే/

ఱొక్కరు డస్ధి నిచ్చె నిక నొక్కడు ప్రణములిచ్చె వీరిలో/

నొక్కనిపట్టునన్ బ్రతుక నోపక యిచ్చిరో కీర్తి కిచ్చిరో/

చక్కగ జూడు మంత్రి కుల సంభవ! రాయనమంత్రి భాస్కరా!!


ఒకరు శరీరంలో నుండి మాంసాన్ని కోసి ఇచ్చారు (శిబి చకరవర్తి), ఒకరు చర్మం కోసి ఇచ్చారు (కర్ణుడు) మరొకరు  వెన్నెముక ఇచ్చారు.(దధీచి) ఇంకొకరు ప్రాణమే ఇచ్చారు (బలి చక్రవర్తి) వీళ్ళంతా బతక లేక ఈ పనులు చేయలేదు. కీర్తి కోసం చేయలేదు. వీళ్ళంతా త్యాగధనులు. మహా దాతలు!!

గోమాత‌కు ఎలాంటి ఆహారాన్ని పెడితే

 *ఆహారాల్లో గోమాత‌కు ఎలాంటి ఆహారాన్ని పెడితే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?*


1. గోమాత‌ల‌కు నాన‌బెట్టిన శ‌న‌గ‌ల‌ను తినిపిస్తే ఆధ్యాత్మిక చింత‌న ల‌భిస్తుంద‌ట‌. స‌న్మార్గంలో న‌డ‌వ‌వచ్చ‌ట‌. దైవ చింత‌న పెరుగుతుంద‌ట‌.


2. మీకు ఎవ‌రైనా శ‌త్రువులు ఉంటే గోమాత‌ల‌కు దోస‌కాయ‌ల‌ను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శ‌త్రు నివార‌ణ జ‌రుగుతుంది.


3. గోమాత‌ల‌కు బెండ‌కాయ‌ల‌ను తినిపిస్తే మ‌నోస్థైర్యం పెరుగుతుంది. ఏ ప‌ని చేయ‌డానికైనా కావ‌ల్సినంత ధైర్యం వ‌స్తుంది.


4. బాగా అప్పులు ఉన్న వారు నాన‌బెట్టిన కందుల‌ను గోమాత‌కు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు.


5. కుటుంబంలో క‌ల‌హాలు ఉన్న వారు, అస్త‌మానం కుటుంబంలో స‌భ్యుల‌తో గొడ‌వలు ప‌డుతూ ఉండేవారు గోమాత‌ల‌కు నాన‌బెట్టిన ప‌చ్చి శ‌న‌గ‌ల‌ను తినిపిస్తే ఫ‌లితం ఉంటుంది.


6. పిల్ల‌లు విద్యారంగంలో ఎద‌గాలంటే వారి త‌ల్లిదండ్రులు గోమాత‌ల‌కు నానబెట్టిన పొట్టు పెస‌ర ప‌ప్పును తినిపించాల్సి ఉంటుంది.


7. గోమాత‌కు నాన‌బెట్టిన ఛాయ పెస‌ర‌ప‌ప్పు పెడితే ఇంద్రియ నిగ్ర‌హం క‌లుగుతుంది.


8. ఉద్యోగం రాకుండా ఉన్న‌వారు, దాని కోసం విశ్వ ప్ర‌య‌త్నం చేస్తున్న‌వారు గోమాత‌కు గోధుమ‌పిండి, బెల్లం క‌లిపి పెట్టాలి.

చామకూర చమత్కారం



చామకూర  చమత్కారం 

    

                             శ్లేష-  చమత్కారాల  మధ్య  చాలాతేడా ఉంది. శ్లేషంటే  కేవలం రెండు అర్ధాలు  పొదగటం. శబ్దానికి ఉన్న నానార్ధముల నాధారంగా  దీనిని యేర్పాటు  చేయవచ్చు.*రాఘవపాండవీయము, హరిశ్చంద్ర నలోపాఖ్యానమూ  ఇలాంటి

శ్లేషకావ్యాలు. వీనికి ద్వర్ధికావ్యాయాలుగా  లోకంలో ప్రసిధ్ధి. 


               చమత్కారం  అలాకాదు. భావనాకాశంలో  మెరిసే మెఱపులాంటిది. లోకోత్తరమైన ఉల్లాస భరితమైన  అర్ధవిశేషాన్ని,లేదా

భావనను ఆవిష్కరించటం  చమత్కారం. చతురులైన వారిమాటలలో యిది మాటిమాటికి  తొంగిచూస్తూ ఉంటుంది. అలాంటి కవిత్వం చెప్పటంలో  మొనగాడు చామకూర  వేంకట కవి. 


                    అతడు వ్రాసిన విజయ విలాసం ,సారంగ ధరచరిత్రములు  చమత్కారమునకు  నెలవగు కృతులు. . మన మిప్పుడు  సారంగధర చరిత్రములోని  రెండు పద్యములను పరిశీలించి యతనిచమత్కార

కవితా తత్వము  నవలోకింతముగాక!


               చిత్రాంగి  సారంగధరుని వలచిన రాచకన్నె. ఆమెసోయగమునకు మురిసి  వృధ్ధుడగు  రాజేంద్రుడామెను పెండ్లాడెను.కానీ,

సారంగధరుని కొరకు చిత్రాంగి వేచియుండెను. అనుకొనకుండ నొకనాడు  పావురమునకై   సారంగ ధరుడామె యంతఃపురమునకు

వచ్చెను. మంచిసమయము దొరికెనని చిత్రాంగి  యతనిని వలపించుటకు ప్రయత్నించు చున్నది. 


             ఉ: నిక్కుగఁ జూడు చిత్రమిది , నెమ్మది వేడుక నోలలాడు ,న

                  మ్మక్కల  గుట్టు బట్టబయలై  గనుపింపగ  శౌరి  "కొమ్మపై

                  నెక్కి రమించు చున్కి, అవులే ! మగువా! యిది  చిత్రమౌట దా

                   నిక్కము; కృష్ణలీలగద  నీవిపుడెన్నిన  మార్గమంతయున్ ;


                                    సారంగధర చరిత్రము-- చామకూర  వేంకటకవి! 


                     చిత్రాంగి  వలపుల కళ్ళెమును  బిగించుటకు  ప్రయత్నించుచుండ ,నైతిక  జీవన పరాయణుడగు  సారంగధరుడు  ఆమాటలకు  అన్యార్ధమును  గలిపించి  యాగండమునుండి తప్పించు కొనుటకు యత్నించుచుండుటవిషయము. 


               1  చిత్రము  2  అమ్మక్కలగుట్టు బట్టబయలగుట 3 కొమ్మపై నెక్కి రమించుట -  యను మూడింటిలోనే   యీపద్యములోని

విషయమంతయు దాగియున్నది.


               చిత్రాంగి పడకటింటిలో  నొక కుడ్య చిత్రమును జూపుచు ,సారంగధరా! ఈ చిత్రమును చూడుము గోపికల  మానచోరుడైనకృష్ణడు  చేయుకొంటెపనులు . ఆకొమ్మపై నెక్కిరమించుట చిత్రముగానున్నదిగదా? యనుచున్నది. ఇటనామెభావము

కృష్ణుడు గోపికలతో జరపు  మిధున కార్యమును జూపుట. "జయదేవుని '  శ్లిష్యతికామపి చుంబతి కామపి  రమయతి కామపి రామామ్"  అన్నది గుర్తుకు తెచ్చుకోవాలి. అదిగో  కుడ్యచిత్రంలో ఉన్నవిషయమంతా అది. సహజంగా అలాంటిదృశ్యాలు  యువకులకు కామోద్రేకాన్ని కల్గిస్తాయికదా! అందుకు యెత్తు వేసింది. కానీ  ఆమె యెత్తు పారలేదు.

            

                                   ఔనులే! నీవుచెప్పినది నిజమే! యిది చిత్రమే! (చిత్తరువే ) యేమున్నది? యివన్నియు కృష్ణలీలలని

సారంగ ధరుని సమాధానము. (ఇది ఫొటోయేకదా  యదార్ధదృశ్యము కాదుగదా!) ఇంతకు అవి  భగవత్కృత్యములు. అనితప్పించుకొనెను.


                       చిత్రము  అనునొక్కమాటతో  కృష్ణుడు గోపికలతో నొనరించిన కాముక కృత్యములను  మరుగున పడవేయుట యిందలి చమత్కారము. ఆహా! చామకూర యెంతటి ప్రతిభాశాలి!! 


కేవలము తెలుగు పదములగారడీతో

 నతడొనర్చిన యీశ్లేషఘటనా చమత్కారమునకు అంజలి ఘటింపక తప్పదుగదా!. 


                                                            స్వస్తి!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🙏🌷🌷🌷🌷🙏

శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

 ॐ   శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 

                            

శివ సహస్ర నామాలు - ఉపోద్ఘాతం (2) 


భీష్ముడు ఇంకా ఇలా అన్నాడు


    ఈ శ్రీకృష్ణుడు జగత్తు అంతా వ్యాపించియున్నాడంటే, దానికి కారణం, ఈయనకి రుద్రునిపై ఉండే భక్తియే! 

    పూర్వం ఈ మాధవుడు పూర్తిగా వేయి సంవత్సరాలు తపస్సుచేసి, 

   "చరాచర జీవులన్నిటికీ గురువై, వరాలు ఇచ్చే" శివుణ్ణి మెప్పించి, 

    ఆయన అనుగ్రహం పొందాడు అని పలికి, 

    శివ సహస్ర నామాలని బోధించమని శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించాడు. 


శ్రీకృష్ణుని సమాధానం

    

    భీష్మ పితామహుడు చెప్పినదానికి కృష్ణుడు ఈ క్రింది విధంగా సందర్భం వివరించి, 

    శివ సహస్ర నామాలని బోధించాడు. 


    జాంబవతి తనకు పుత్త్రుడు కావాలని కోరగా, 

    కృష్ణుడు ఉపమన్యుని సలహామేరకు, శివుని గూర్చి, ఆరుమాసాలు తపస్సు చేశానన్నాడు. 

    అప్పుడు, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ తనకు ఎనిమిదెనిమిది వరాలు అనుగ్రహించారని తెలిపాడు. 

    ఈ విషయాలు చెబుతూ, శ్రీకృష్ణుడు తపస్సు చేసి, శివపార్వతుల నుండీ వరాలు పొందిన తరువాత, 

    ఉపమన్యు మహర్షి దగ్గరకు తిరిగివచ్చి నివేదించగా, 

   ఉపమన్యు, గతంలో తండిమహర్షి, "శివుని పదివేల నామాలనుంచీ", 

   "వేయి ఎనిమిది నామాలు" కూర్చి తనకు చెప్పినట్లు తెలిపి, 

    ఆ సహస్రనామాలని, తనకు ఉపదేశించినట్లు, శ్రీకృష్ణుడు ధర్మరాజాదులతో అన్నాడు. 

   వాటినే తాను ఆ సందర్భంలో వారికి చెప్పడంతో, "శివ సహస్రనామ స్తోత్రమ్" మనకి లభించింది. 


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం