ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్
శివ సహస్ర నామాలు - ఉపోద్ఘాతం (2)
భీష్ముడు ఇంకా ఇలా అన్నాడు
ఈ శ్రీకృష్ణుడు జగత్తు అంతా వ్యాపించియున్నాడంటే, దానికి కారణం, ఈయనకి రుద్రునిపై ఉండే భక్తియే!
పూర్వం ఈ మాధవుడు పూర్తిగా వేయి సంవత్సరాలు తపస్సుచేసి,
"చరాచర జీవులన్నిటికీ గురువై, వరాలు ఇచ్చే" శివుణ్ణి మెప్పించి,
ఆయన అనుగ్రహం పొందాడు అని పలికి,
శివ సహస్ర నామాలని బోధించమని శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించాడు.
శ్రీకృష్ణుని సమాధానం
భీష్మ పితామహుడు చెప్పినదానికి కృష్ణుడు ఈ క్రింది విధంగా సందర్భం వివరించి,
శివ సహస్ర నామాలని బోధించాడు.
జాంబవతి తనకు పుత్త్రుడు కావాలని కోరగా,
కృష్ణుడు ఉపమన్యుని సలహామేరకు, శివుని గూర్చి, ఆరుమాసాలు తపస్సు చేశానన్నాడు.
అప్పుడు, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ తనకు ఎనిమిదెనిమిది వరాలు అనుగ్రహించారని తెలిపాడు.
ఈ విషయాలు చెబుతూ, శ్రీకృష్ణుడు తపస్సు చేసి, శివపార్వతుల నుండీ వరాలు పొందిన తరువాత,
ఉపమన్యు మహర్షి దగ్గరకు తిరిగివచ్చి నివేదించగా,
ఉపమన్యు, గతంలో తండిమహర్షి, "శివుని పదివేల నామాలనుంచీ",
"వేయి ఎనిమిది నామాలు" కూర్చి తనకు చెప్పినట్లు తెలిపి,
ఆ సహస్రనామాలని, తనకు ఉపదేశించినట్లు, శ్రీకృష్ణుడు ధర్మరాజాదులతో అన్నాడు.
వాటినే తాను ఆ సందర్భంలో వారికి చెప్పడంతో, "శివ సహస్రనామ స్తోత్రమ్" మనకి లభించింది.
కొనసాగింపు ...
https://youtu.be/L4DZ8-2KFH0
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి