ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
21, అక్టోబర్ 2020, బుధవారం
విభూది మహిమ*
*విభూది మహిమ*
దుర్వాస మహర్షి నిత్యం
పరమశివుని మనసులో
ధ్యానించి, విభూది ధరించి
నిత్యానుష్టానాలను ఆరంభించేవాడు.
ఒకనాడు ఉదయాన విభూది
ధరించి పితృలోకానికి బయల్దేరాడు దుర్వాస
మహర్షి. మార్గంమధ్యంలో హఠాత్తుగా
ఒక బావి కనిపించింది.
గతంలో ఎన్నడూ
ఆ మార్గంలో ఏ బావి కనపడేదికాదు. ఆ బావిలోయేమి వున్నదో అని ఉత్కంఠ తతో తొంగి చుశాడు మహర్షి.
ఆ బావిలో పాపాత్ములు
చాలామంది బంధించబడివున్నారు. ఈ లోకాన పాపాలు చేసినవారు అందరూ ఆ నరక కూపంలో త్రోసివేయబడి వున్నారు. విషయం గ్రహించి తన పయనం సాగించాడు
దుర్వాస మహర్షి . ఇంతలో ఒక గొప్ప ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. దుర్వాస మహర్షి
తొంగిచూచి వెళ్ళిన వెంటనే ఆ నరక కూపం స్వర్గధామంగా
మారింది. ఆ కూపంలో ఆత్మలకు బాధలు కలిగించిన
విష జంతువులు , సర్పాలు సుగంధ సుమ మాలలుగా మారి
పోయాయి. సలసలమరిగే
నీరు సుగంధ పన్నీరుగా మారింది.
తుఫానులాగ వీచిన ప్రచండ గాలులు
పిల్లతెమ్మరలుగా మారాయి. ఆ దుర్గంధ భూయిష్ట కూపం సుగంధంగా మారింది. ఇన్ని రోజులు యమయాతన పడిన ఆత్మలు అన్నీ మోక్షాన్ని పొందాయి.
ఈ విపరీత పరిణామం చూసి ఆ నరకకూపంలో ఆత్మలను హింసిస్తున్న కింకరులు భయపడి యమధర్మరాజు వద్దకు వెళ్ళి
మొరపెట్టుకున్నారు. నరక కూపం స్వర్గంగా ఎలా మారినదో తెలియని యముడు , వేగంగా వచ్చి
ఆ కూపాన్ని చూశాడు.
స్వర్గం నుండి ఇంద్రుడు కూడా వచ్చి చూసి , ఎలాగ జరిగినదీ తెలియక , విస్మయం చెందాడు.
ఆశ్చర్యం తో తలమునకలై
దేవేంద్రుడు ,యముడు
కంగారుగా కారణం తెలుసుకుందుకి ఈశ్వరుని
వద్దకు వెళ్ళారు.
నరక కూపం స్వర్గంగా ఎలా మారినదని ఈశ్వరుని అడిగారు.
త్రికాలజ్ఞుడైన ఈశ్వరునికా
నరకం స్వర్గంగా మారిన కారణం తెలియకుండా
వుంటుందా?
పరమ శివభక్తుడైన దుర్వాసమహర్షి శాస్త్రానుసారం విభూది ధరించి
సదా తనని పూజించేవాడు . ఆయన
అనుకోకుండా ఆ పితృ కూపాన్ని తొంగి చూసినందువలన , ఆయన నుదుటి నుండి ఒక విభూది
కణం ఆ నరకకూపంలో పడినది.
ఆ విభూది మహిమ వలన నరక కూపం స్వర్గంగా మారినది. " అని వారికి తెలిపాడు పరమశివుడు.
దుర్వాస మహర్షి నిత్యం ,ఉంగరపు వ్రేలు ,మధ్యవ్రేలు
చూపుడు వ్రేలు ఈ మూడు వ్రేళ్ళను కలిపి 'ఓం'కార మంత్రాన్ని జపిస్తూ
(అకార, ఉకార, మకార) నుదుటన
విభూదిని ధరించడం నియమంగా కలవాడు.
ఈ విధంగా నిష్టగా ధరించే విభూది మహిమాన్వితమైనదని
మనకి యీ కధ తెలియచేస్తోంది.
గుడి అంటే కాస్మిక్ ఎనర్జీ*
విజయవాడ
ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండచరియలు..
పలువురు భక్తులకు గాయాలు..
సిధిలాల క్రింద పోలిసులు ఉన్నారానే అనుమానం..
మరికాసేపట్లో దుర్గమ్మకు సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించే సమయంలో ఈఘటన సంభవించింది
అప్రమత్తమైన దేవస్థానం సిబ్బంది,పోలీసులు సహాయక చర్యలు ప్రాప్రారంభించ
*🛕గుడి అంటే కాస్మిక్ ఎనర్జీ*
విశ్వంలో మనకు కనిపించని శక్తి దాన్ని *కాస్మిక్ ఎనర్జీ* అంటారు కాస్మిక్ ఎనర్జీ అంటే *పాజిటివ్ ఎనర్జీ* మనలో వున్న చెడు ఆలోచనలను దూరం చేసి మంచి ఆలోచనలకు తోడ్పడుతుంది మనసు ప్రశాంతంగా వుంటుంది.
*ఈ శక్తి భూమి క్రింద, పైన కూడా
వుంటుంది*
*విషయంలోకి వెళితే:-*
గుడి కట్టే ముందు గర్భగుడి కింద సరిగ్గా విగ్రహం పెట్టే చోట *సప్తధాతువులు* వేస్తారు
పాదరసములు, బంగారము, తగరములు, వెండి, రాగి, వీటిని సప్తదాతువులు అంటారు
అలాగే *నవరత్నాలు, పంచలోహాలు* వేస్తారు
ఇవన్నీ భూమిలో వుండే కాస్మిక్ ఎనర్జీ కి రిసీవర్ గా పనిచేస్తాయి
*ఒక సోలార్ పవర్* ని ఎలా ఉత్పత్తి చేస్తుందో అదే విధంగా భూమిలో వుండే కాస్మిక్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తాయి ఇవి సరిగ్గా *విగ్రహం* పెట్టే పీఠంకింద వుంటాయి తరువాత పీఠం పెట్టే ముందు పీఠం కింద *యంత్రం* పెడతారు కింద సప్తధాతువులలో వున్న పవర్ అంతా ఈ *యంత్రంలోకి వస్తాయి*
అంతేకాక అక్కడ పలికే మంత్రాలు కూడా యంత్రం లోకి వెళతాయి
ఇది *విగ్రహం* కింద జరిగే ప్రక్రియ
*గుడిపైన పూర్ణకలశం* పెట్టడం జరుగుతుంది దాన్నే గుడి *శిఖరం* అంటారు
భూమి కింద వున్న శక్తిని యంత్రం ఎలా గ్రహించిందో
భూమి పైన వున్న కాస్మిక్ ఎనర్జీకి *శిఖరం రిసీవర్ గా* పనిచేచేస్తుంది
అందుకే సరిగ్గా విగ్రహం *పాదాల కింద యంత్రం తలపైన శిఖరం* వుండేటట్లు పెట్టడం జరుగుతుంది
*గౌరీపట్నం లేదా కృష్ణ శిల* ఈ రెండు రకాల రాళ్లతో తయారు చేసిన విగ్రహం పెట్టడం జరుగుతుంది
ఈరెండు రాళ్లతో తయారు చేసిన విగ్రహమే ఎందుకు పెడతారు అంటే కాస్మిక్ ఎనర్జీని లాగుకునే శక్తి ఈ రెండు రాల్లకే వుంటుంది
ఈ రాళ్లు నల్లగా నీలం రంగులో ఉంటాయి
విగ్రహం కింద నుంచి యంత్రం పై నుంచి శిఖరం ఈ రెండు *కాస్మిక్ ఎనర్జీని విగ్రహం పైకి పంపిస్తాయి*
విగ్రహం మొత్తం *తరంగాల శక్తితో* నిండి ఉంటుంది
అందుకే *విగ్రహానికి* ఎదురుగా *గంట* పెట్టడం జరుగుతుంది *భక్తులు* గంట కొట్టగానే ఆ ధ్వని ఆలయం లోపల అన్ని చోట్లకు చేరుతుంది
*గంట శబ్ధం* వినగానే విగ్రహం పైనున్న *శక్తి* నేరుగా గంటకు తగిలి ఆ ధ్వని చేరిన అన్ని చోట్లకు కాస్మిక్ ఎనర్జీ చేరుతుంది
అలా గుడి మొత్తం *పాజిటివ్ ఎనర్జీతో* నిండి ఉంటుంది
ఆ ఎనర్జీ భక్తులపై పడుతుంది ఆ క్షణం భక్తులకు మనసు ప్రశాంతంగా వుంటుంది ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే విగ్రహం దగ్గర పెట్టే తీర్థంలో కాస్మిక్ ఎనర్జీ తో కలసి వుంటుంది ఆ ఎనర్జీ మన లోపలకు
వెళితే మంచిదని తీర్థం తప్పని సరిగా తీసుకోవాలి అంటారు.
అందుకే మనసు బాగలేనప్పుడు గుడికి వెళ్ళండి అని మన *పెద్దలు* చెప్తుంటారు.🙏🙏🙏🙏🙏🙏
ఆత్మజ్ఞానం పరం జ్ఞానమ్*
*సంస్కృత సూక్తి*
*ఆత్మజ్ఞానం పరం జ్ఞానమ్*
ఆత్మజ్ఞానమే ఉత్తమమైన జ్ఞానం. * జై శ్రీమన్నారాయణ - జై శ్రీహనుమాన్*
మన మనస్సులో కలిగే ఆలోచనలే మన స్వభావాన్ని నిర్మిస్తాయి. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు ఈ విధంగా చెపుతాడు.
*ఎల్ల వేళలా నన్నే స్మరిస్తూ నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, నీ మనోబుద్ధులు నాకు సమర్పించు, అప్పుడు నిస్సంశయంగా నన్ను పొందుతావు*
పవిత్రములైన వాటి గురించి యోచిస్తే, మనం పవిత్రులం అవుతాము. మన హృదయం సదా ప్రేమతో నిండి ఉంటే ద్వేషానికి అక్కడ తావులేదు. అప్పుడు మనలోని శాంతిని ఎవరూ భగ్నపరచలేరు. మనం అజాగ్రత్తగా వ్యవహరిస్తే మన స్వభావమే మారిపోగలదు.
ఎవరి గురించైనా చెడు తలపు కలిగే ముందు ఆ చెడు మనలో ప్రవేశిస్తుంది. సాధువర్తనను కలిగి ఉంటే సాధుశీలురుగా అవుతాము. దాని గురించి యోచిస్తే, ఆ సాధుత్వం మనలో స్ఫూర్తిని కలిగిస్తుంది. మనకు సరియైన త్రోవను చూపుతుంది. మన జీవితాన్నే మార్చివేస్తుంది.
*శుభంభూయాత్*
neurological test:
Now for a little neurological test:
Only use your eyes!
1- Find the C in the table below!
OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOCOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
2- If you have already found the C,
Then find the 6 in the table below.
999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999969999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999
3- Now find the N in the table below.
Attention, it's a little more difficult!
MMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMNMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMM
If you pass these three tests without problem:
- you can cancel your annual visit to the neurologist.
- your brain is in perfect shape!
- you are far from having any relationship with Alzheimer's.
So, share this with your over-60 friends, it can reassure them.
*for senior citizens*
భారత దేశం అంటే అర్థం
💐💐💐భారత దేశం అంటే అర్థం ఏమిటి హిందువులు అంటే ఎవరు ?💐💐💐
"ఒక చిన్న వ్యాసం"
వీటిలో మనం తెలుసుకోవాల్సిన మొదటిది "జంబూ ద్వీపము".
ఇప్పటికీ పూజ సంకల్పము లో ఈ పేరు ఉపయోగిస్తారు (అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే ★జంబూద్వీపే ★భరతవర్షే, ★భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, కృష్ణా-గోదావర్యోర్మధ్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత ఋతువు)...
జంబూ అంటే "నేరేడు" పండు, ఈ దేశంలో ఎక్కువగా నేరేడు పండ్లు ఉంటాయి కనుక దీనికి ఈ పేరు వచ్చింది. (జంబు ద్వీపం వివరణ పోస్ట్ చివరలో ఉంది)
ఆ తరువాత పేరు "★భారతదేశం" లేదా "★భరత వర్షం", ఈ పేరు నాటి రాజు పేరు మీదగా వచ్చినది, ఈ రాజు పేరు "భరతుడు". ఇతను విశ్వామిత్ర, మేనకల కుమార్తె అయిన శకుంతల యొక్క కుమారుడు.
తరువాతి పేరు హిందూ దేశం, ఇది సింధునది పేరు మీదగా వచ్చినది, పూర్వపు పర్షియనులు, గ్రీకులు సింధునదికి ఆవల ఉన్న దేశం కనుక ఈ పేరుతో పిలిచారు.
తరువాత హిందూదేశం యొక్క రూపాంతరం ఐన ఇండియా అనే పేరు, బ్రిటీషు వారి వలన ప్రముఖ ప్రాముఖ్యతను పొందినది, ప్రస్తుతము భారత దేశానికి రెండు ప్రభుత్వ గుర్తింపు పొందిన పేర్లు కలవు, అవి ఇండియా, భారత దేశం.
ఇంకా హిందూస్తాన్ అనునది కూడా హిందూ దేశం యొక్క రూపాంతరమే!
ఇండియా:-
కొంత మంది INDIA అంటే independent nation declared in August అని అనుకుంటారు.. అది తప్పు. ఎలా???
ఇండియా అనే పదం ఇండస్ (సింధు నది) నుండి వచ్చింది... మన దేశానికి బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా అనే కంపెనీ పేరు తో వచ్చారు కాబట్టి ఇండియా అనే పేరు ముందు నుండే ఉంది. ప్రత్యేకంగా ఆగస్ట్ లో స్వాతంత్రము వచ్చినందు వల్ల ఇండియా అనే పేరు రాలేదు...
ఈ ఆంగ్ల పదము, గ్రీకు పదమైన 'లాటిన్' ద్వారా ఇండియా.
'బైజాంటియన్లో' సింధూనది కి ఆవల గల రాజ్యం.
2500 సం!! క్రితం (హెరొడోటస్ పాలిటోనిక్) "ఇండియన్ లాండ్"
అవెస్తన్ నుండి "హిందుస్" (సింధూ నదిని సూచిస్తుంది)
దరాయిస్ 1 నుండి, సంస్కృతం నుండి సింధు (సింధూ నదిని సూచిస్తుంది).
★భారతదేశము - హిందూస్థాన్ -హిందువులు:-
భా అనే శబ్దానికి అర్ధం నిరంతరం జ్ఞానం తో వెలిగే వాడు అని అర్ధం
సంస్కృత పదమైన "భారత్", "భారత" అనే పదం నుండి ఉద్భవించింది.
హైందవ గ్రంథాలలోనే హిందూ అనే శబ్దం లేదంటున్నారు. ఇది నిజం కాదు...
'హిందూ' అనే సంస్కృతం లో కూడా ఉంది...
అతి ప్రాచీనమైన ఈ నామానికి మూలాధారం ఋగ్వేదమంత్రాలే అని కొందరు పరిశోధకులు నిరూపించారు... వేదంలో అనేక చోట్ల కనబడే " సప్తసింధు" శబ్ధంనుండి హిందూశబ్ధం పుట్టింది.
ప్రాకృతజనులు, పారశీకులు 'స'ను 'హ' గా అనడంలో "సప్తసింధు" అనేది "హప్త హిందు" అయి దాని సంక్షిప్త రూపం "హిందూ" అయిందని వివరించారు...
'స' కారం 'హ' కారంగా మారటానికెన్నో పదాలు ఉదాహరణలున్నాయి. సప్త అనేది హప్తగా,కేసరి అనేది ప్రాచీన హిందీలో 'కేహరి' గా, సరస్వతి అనేది పర్షియాలో 'హరహ్వతి' గా, అసుర అనేది 'అహుర' గా అవుతుంది.
పర్షియన్ల ప్రాచీన అవెస్తా గ్రంథంలో "సప్తసింధువును" "హప్తహిందువు" గానే చెప్పారు.పర్షియన్లు వైదికార్యుల్ని "హిందువులు" అనే పిలిచేవారు.
హప్త హిందూ శబ్దానికి మూలమైన సప్తసింధువులు "ఇమం మే గంగే యమునే సరస్వతీ శుతుద్రీ స్తోమం సచతా పరుష్ణ్యా ఆశిక్న్యా మరుద్వృధే వితస్తయార్జీకీయే ఋణోహ్య సషోమయా " అనే ఋగ్వేదమంత్రంలో చెప్పబడ్డాయి...
గంగ, యమున, శుతుద్రీ, మరుద్వృధ, ఆర్జీకీయ, సుషోమ అనే ఏడునదులు సప్తసింధువులు.ఈ సప్త సింధూ శబ్ధం"అష్టౌవ్యఖ్యత్ కుకుభ: పృథివ్యా స్త్రీ ధన్వయోజనా సప్తసింధూన " (1-35-8) వంటి అనేక ఋగ్మంత్రాలలో కనబడుతుంది.
ఆ సప్త సింధు వాసులు సింధువులై క్రమంగా హిందువులైయ్యారు. బహుళప్రచారంలో ఉన్న భాషలన్నిటా పైరీతి హిందూశబ్ధమే గ్రహింపబడుట వలన అదే స్థిరమైంది. అలా హిందూశబ్ధం "సప్తసింధు "ద్వారానే స్థిరపడినా, లేక స్వతంత్ర శబ్ధంగానే ఏర్పడినా అది అతి ప్రాచీనము,అతి పవిత్రమైన శబ్ధము. దానికెన్నో వివరణలు ఉన్నాయి...
విష్ణు పురాణం (2.3.1)
"వర్షం" (దేశం) సముద్రానికి ఉత్తరాన ఉన్న, హిమములతో కూడిన పర్వతాలకు దక్షిణాన గల, దీనిని భారతం అని, ఇక్కడ భారత సంతతి నివసిస్తుంది."
వామన పురాణం (13: 1-15)
భరత వర్షం, జంబు ద్వీపం, ప్రస్తావన కనపడుతుంది
【కాస్త నిదానంగా చదివి, అర్ధం చేసుకోగలరు】
మనుస్మృతి మరియు కొన్ని బౌద్ధధర్మ గ్రంథాలు, 'ఆర్యదేశ్' అనే పదము ఉపయోగంలో కానవస్తుంది. భారతదేశాన్ని 'ఆర్యవర్త', 'ఆర్యవర్తం' అని పిలువబడింది. తమిళ కవి తన కవితలో భారతదేశాన్ని ఆర్యనాడు అని సంబోధించాడు. 'ఆర్య' అనగా 'ఉన్నతుడు', 'దేశ' లేదా 'నాడు' అనగా ప్రాంతము.
4000 సం!! క్రితం నాటి వృద్ధస్మృతిలో "హింసయా దూయతే యశ్చ - సదాచారతత్పర; వేదగో ప్రతిమాసేవీ - స హిందూ ముఖ వర్ణభాక్ " అనిచెప్పబడింది. దీనినిబట్టి హింసనుగూర్చి
దు:ఖించేవాడు, సదాచార తత్పరుడు, వేదములు - గోవులు - దేవతాప్రతిమలనారాధించేవాడు "హిందువు" అని తెలుస్తుంది.
అలానే "హింసయా దూయతే చిత్తం - తేన హిందురితి స్మృత:" అని చెప్పడం వలన శారీరక,మానసిక, వాచిక త్రివిధ హింసల విషయమునను మనస్సు పరితాపం పొందువాడు హిందువు.
ఈ హిందూ నిర్వచనాన్ని స్పష్టపరుస్తూనే ఆదికవి వాల్మీకి నుండి ఆదికావ్యం రామాయణం వెలువడింది. ఆ రామాయణమే "రామో విగ్రహవాన్ ధర్మ: "అనిపించుకున్న ధర్మస్వరూపుడైన రామునిచరిత్ర తెలియజేసింది.
బోయవాడు క్రౌంచపక్షిని బాధించుటచే బాధపడ్డ వాల్మీకి హృదయం నిజమైన ★హిందూ - హృదయం. అందుండి అప్రయత్నంగా వెలువడిన "మానిషాద"* అనే శ్లోకమే హిందూ హృదయానికి అద్దం పట్టే రామాయణ మూలకారణం.
2400 వ సం!!* క్రితం నాటిదే అయిన ★బార్హస్పత్య శాస్త్రంలో "హిమాలయం సమారభ్య - యావదిందుసరోవరం; తద్దేవ నిర్మితం దేశం - హిందుస్థానం ప్రచక్షతే " ఇక్కడ హిమాలయం నుండి హిందూమహాసముద్రం వరకు వ్యాపించింది. హిందూ భూమిగా చెప్పబడింది.ఈ హిందూ భూమి యందు నివసించువారు హిందువులని కూడా దీని ద్వారా గ్రహించవచ్చు.
ఈ దేశం పరమాత్ముని సృష్టికి నాభివంటిది. అందువలన దీనికి "అజ నాభ" అనికూడా పేరు వచ్చింది.
★వృద్ధస్మృతిలో చెప్పినట్లే "మేరుతంత్రం"లో కూడా "హీనం చ దూషయత్యేవ హిందు రిత్యు చ్యతే ప్రియే" అని హీనతను దూషించేవాడే హిందువని పార్వతీదేవికి పరమశివుడు వివరిస్తాడు.
కార్తవీర్యార్జునుడు సిద్ధిపొందిన మంత్రాలే ఈ "మేరుతంత్ర "గ్రంథం.
11 వ శతాబ్దం నాటి ★పారిజాతాపహరణ నాటకంలో "హినస్తి తపసా పాపాన్ దైహికాన్ దుష్ట మానసాన్ ; హేతిభి: శతృవర్గశ్చ స హిందు రభిదీయతే " అని ఎవరు తన దేహ మనస్సంబంధమైన పాపాలను తపస్సుద్వారా నాశనం చేసుకొంటారో,శతృవులను ఖడ్గంతో అంతంచేస్తారో వారు హిందువులు అని చెప్పబడింది.
హిందూ శబ్ద విశిష్టతను చాటే నిర్వచనాలలో 14వ శతాబ్ది నాటి ★మాధవ - దిగ్విజయంలో "ఓంకార మూల మంత్రాఢ్య - పునర్జన్మ దృఢాశయ" "గోభక్తో భారతగరు, హిందుర్హింసక దూషక:" అని చెప్పబడినది. ఓం కారాన్ని మూలమంత్రంగా భావించేవాడు, పునర్జన్మయందు విశ్వాసం కలవాడు,గో భక్తుడు, భారతమే గురుస్తానమైన వాడు, హింసను దూషించేవాడు *"హిందువు" అని చెప్పబడింది.
హిందూ శబ్దం అనేక నిఘంటువులలో వివరింపబడినది.
★శబ్దకల్పదృమంలో " హీనం దూషయతి ఇతి హిందు:" జాతివిశేష: అని చెప్పుటవలన చెడును దూషించేవాడు హిందువని, హిందూ అనేది ఒక జాతి అని తెలుస్తుంది. అదే మన హిందూజాతి."
పృషోదరాదిత్వాత్సాధు:" అని రూపసాధన కూడా వివరింపబడింది.
" హిందు: - హిందూ - హిందవ:" అని శంభుశబ్దమువలే ఉకారాంతంగా గ్రహించాలి అని ★మేదినీకోశం చెబుతుంది.
"హిందుర్హిందుశ్చ సంసిద్ధౌ దుష్టానాం చ విధర్షణే " అని హిందువు దుష్టులను, చెడును,అంతం చేయడానికే ఏర్పడినాడని ★అద్భుతరూపకోశం చెబుతోంది.
హిందువనగా విష్ణువని, యోగి అనికూడా అర్థం. " హిందుర్హి నారాయణాది దేవతారక్త:" శ్రీ మన్నారాయణాది దేవతలయందు భక్తి కలవాడు హిందువని ★హేమంతకవికోశం చెబుతున్నది.
" హిందుర్దుష్టనృహాప్రోక్తా నార్యనీతి విదూషక: ; సద్ధర్మపాలకో విద్వాన్ - శ్రౌతధర్మపరాయణ: " అనగా దుష్టులను అంతమొందించు వాడు, దుష్టనీతిని నిరసించువాడు, ధర్మమును పాలించువాడు, విజ్ఞుడు, వేద ధర్మములను ఆచరించేవాడే హిందువని ★రామకోశం చెబుతుంది.
బ్రహ్మాండపురాణంలో సూతుడు ప్రపంచములోని భూభాగములు, జలభాగముల గురించి ఇలా చెప్పాడు---
★సప్త - ద్వీపాలు: జంబు ద్వీపం లో దేశాలు (వర్షాలు):
★స్వాయంభువమనువు కొడుకు ప్రియవ్రతుడు. ఈయనకు మొదటి భార్యవలన ఉత్తమ, తామస, రైవతులు జన్మించారు.రెండవ భార్య బర్హిష్మతి. ఈమెవలన అగ్నీధ్ర, ఇధ్మజహ్వ, యజ్ఞబాహు, మహావీర, హిరణ్యరేతస, గృహపుష్ఠ, సవన, మేధాతిధి, వీతిహోత్ర, కలి, ఊర్జస్వతీ, అనేవారు జన్మించారు.
★వీరిలో మహావీర, సవన, కలి అనేవారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు.స్వాయంభువ మనువు తన మనుమలలో ఏడుగురిని ఏడు ద్వీపములకు చక్రవర్తులను చేసెను. వారు తమ తమ సంతానానికి ఆయా ద్వీపాలను పంపకం చేయడం వలన అనేక రాజ్యాలు ఏర్పడినాయి. అలా ముందుగా వివిధ ద్వీపాలకు చక్రవర్తులైన మనువు మనుమలు.
★జంబూద్వీపం - అగ్నీంద్రుడు
ప్లక్షద్వీపం - మేధాతిథి
శాల్మలీద్వీపం - వపుష్మంతుడు
కుశద్వీపం - జ్యోతిష్మంతుడు
క్రౌంచద్వీపం - ద్యుతిమంతుడు
శాకద్వీపం - హవ్యుడు
పుష్కరద్వీపం - సేవనుడు.
జంబూద్వీపమ్:
జంబూద్వీపము 9 వర్షాలు లేదా భాగాలుగ విభజించబడినది. అవి
ఇలావృత (హిమాలయాలు మరియు టిబెట్ ప్రాంతము)
భధ్రవర్ష (హిమాలయాల తూర్పు ప్రాంతము) - తూర్పు
హరి (అరేబియా) - దక్షిణము
కేతుమాలం (ఇరాన్, టర్కీ ) పశ్చిమం
రమ్యక (రష్యా, సైబీరియా) ఉత్తరము
హిరణ్మయ (మంచూరియా) ఉత్తరము
కురు (మంగోలియా) ఉత్తరము
కింపురుష / కిన్నర (హిమాలయాల దక్షిణ ప్రాంతాలు) దక్షిణము
★భరత - వర్ష (★భారత -ఉపఖండము)
ఈ ద్వీపము చుట్టు లవణాంబుధి (ఉప్పు సముద్రం) యున్నది.
ఈ ద్వీపంలో 6 పర్వతాలు:
హిమాలయము, మేరు పర్వతము, నీలాచలము, హిమాచలము, శ్వేతాచలము, మాల్యవంతము, గంధమాదనము, వింధ్యపర్వతము.
తన తండ్రి ఆస్తిలో జంబూద్వీపానికి అగ్నీధ్రుడు అధికారి అయినాడు.ఈయనకు 9 మంది పిల్లలు కలిగి ఉన్నారు.
మొదటివాని పేరు అజ, ★అజనాభి, నాభి అని కంపిస్తుంది. మిగిలినవారి పేర్లను బట్టి కింపురుష, హరి, ఇలావృత, రమ్యక, హిరణ్మయి, కురు, భద్రాశ్వ, కేతుమాల వర్షాలు వచ్చినవి.అజ శబ్దమునుంచి ఆసియా వచ్చినది.
నేటికి కూడా మనదేశములో ఒక భాగాన్ని జమ్ము అనిపిలుస్తున్నాము.హిమాలయాలలో ప్రవహించే నదులకు టిబెట్ దేశస్థులిచ్చిన పేరు చివర సంపో లేక త్సంసో అనే శబ్దం కంపిస్తుంది. ఇది జంబూ శబ్దమే...
నేను హిందువుని...
నా ధర్మం యొక్క గొప్పదనం నాకు తెలుసు...
నాకు ఇతర మతాల వారిని, విమర్శించాల్సిన అవసరం లేదు నా ధర్మం జోలికి రానంతవరకు.
నా ధర్మాన్ని విమర్శించేవారు అజ్ఞానులనే నా అభిప్రాయం...
నరాలు తెగి రక్తం చిందుతున్నా...
నా' గుండెచప్పుడు ఆగేవరకు గర్వంగా చెప్పగలను నేను హిందువునని...
ఏ దేవుణ్ణి పూజించాలి*?
*🚩🕉️హిందూ ఆధ్యాత్మిక వేదిక🕉️🚩*
=======================
*ఏ ఏ సమయాల్లో ఏ దేవుణ్ణి పూజించాలి*?
సూర్య భగవానుని 4.30 నుంచి ఆరులోగా పూజించాలి. ఈ సమయంలో పూజ శ్రీ రామునికి, శ్రీ వెంకటేశ్వరునికి కూడా ప్రీతీ. ఆరు నుంచి ఏడున్నర వరకు మహాశివుడ్ని, దుర్గను పూజించిన మంచి ఫలము కలుగును. మధ్యాహ్నము పన్నెండు గంటలప్పుడు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించిన హనుమ కృపకు మరింత పాత్రులగుదురు. రాహువునకు సాయంత్రము మూడు గంటలకు పూజించిన మంచి ఫలితము కలుగుతుంది. సాయంత్రం ఆరు గంటల సమయాన అనగా సూర్యాస్తమయమున శివపూజకు దివ్యమైన వేల.రాత్రి ఆరు నుంచి తొమ్మిది వరకు లక్ష్మీదేవిని పూజించిన ఆమె కరుణ కటాక్షములు ఎక్కువగా ఉంటాయి. తెల్లవారు జామున మూడు గంటలకు శ్రీమహా విష్ణువును పూజిస్తే వైకుంటవాసుడి దయ అపారంగా ప్రసరిస్తుంది.
*( ఇది నిబంధన మాత్రం కాదు. సమయానుకూలంగా కూడా మీ ఇష్ట దైవమును పూజించవచ్చు )*
వీణాశారదా అవతారము
దసరానవరాత్రులు - వీణాశారదా అవతారము
శృంగేరి సంస్థానానికి చెందిన దేవాలయాలలో ఈరోజు అమ్మవారు వీణాశారదా రూపంలో అలంకరించుకుని ఉంటుంది. ప్రతి ఒక్కరం కూడా జ్ఞ్యానం అనే భిక్షను పెట్టమని వేడుకుంటూ ప్రార్ధనచేసి ఆ తల్లి కృపకు పాత్రులం కావడానికి ప్రతి ఒక్కరం ప్రయత్నం చెయ్యాల్సిందే. ఎందుకంటే జ్ఞ్యానం ప్రతి ఒక్కరికీ కావాల్సిందే కదా.
నిజానికి ఈ తల్లిని అనేక నామాలతో ఆరాధన చేసినప్పటికీ మూడు నామాలు మటుకు బహుప్రాచుర్యంలో ఉన్నాయి. 1) సరస్వతి....అనగా ప్రసరణము జ్ఞ్యానము. ఒక దగ్గర నిలిచిపోకుండా ఒక దీపంనుండి వెలుగు ఎంత అయితే ప్రసరణను పొందుతుందో అలాగే జ్ఞ్యానము కూడా అలా ప్రసరింపచేసేది కాబట్టి సరస్వతి. 2) భారతి....విభక్తేతి భారతి....అనగా పోషించేది భారతి....అనగా ఏ వృత్తిలో ఎవరు రాణించాలన్నా ఆ తల్లియొక్క అనుగ్రహం ఉండాల్సిందే. 3) శారద....తెల్లని పద్మంలో కూర్చుని ఉంది కాబట్టి శారద. శారద అనగా సత్వగుణమునకు చిహ్నం. తెల్లని పద్మం అనగా కూడా ఒక రకంగా ఆలోచిస్తే మన శరీరంలో షట్చక్రాలు ఉంటాయి. సహస్రార చక్రం అనగా మాడు (తలపైన) స్థానంలో ఒక చక్రం ఉంటుంది. తెల్లని కాంతులు ఈనుతూ ఉంటుంది. ఎవరైతే నిరంతరం ఆ తల్లిని ధ్యానం చేస్తూ ఉంటారో వారికి శిరస్సుపై ఈ కమలం కనిపిస్తుంది.
నిజానికి శబ్దము అనేది రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి స్వరం మరియు రెండవది అక్షరం. ఈ స్వరానికి గుర్తుగా ఈ తల్లి తన ఒక చేతిలో వీణ పట్టుకుని ఉంటుంది. మరి అక్షర జ్ఞ్యానానికి గుర్తుగా పుస్తకాన్ని ఒక చేతిలో పట్టుకుని ఉంటుంది. అందుకనే లలితకళలలో రాణించాలన్నా ఈ తల్లియొక్క అనుగ్రహం ఉండాల్సిందే. మనకి తెలిసిన విషయాలను నలుగురికీ తెలియచెయ్యాలన్నా (వాక్కురూపంలో కాని వ్రాతరూపంలో కాని) ఈ తల్లియొక్క అనుగ్రహం ఉండాల్సిందే. లేని పక్షంలో ఏ పదం తరువాత ఏ పదం వాడినా ఆ వాక్యం పరిపూర్ణతను సంతరించుకోదు.
అందుకే ఈ శారదా ఆరాధనను పెద్దలైనావారు ఎందరో చేసి మనలను కూడా ఆ దారిలో నడవమని మనకు మార్గాన్ని శూచించారు. వ్యాసభగవానుడేమో గోదావరి తీరంలో ఆ తల్లి కోసం తపస్సు చేసి ఆ తల్లి అనుగ్రహం పొందిన తరువాత ఇంకా ఏం కావాలని ఆ తల్లి ప్రశ్నించగా నన్ను ఎలా అనుగ్రహించావో ఇక్కడికి వచ్చి నిన్ను వేడుకున్న వారిని అనుగ్రహించు అంటూ ఇసుకతో ఆ తల్లి విగ్రహాన్ని మనకు అనుగ్రహించారు.
మరి అదే కోవకు చెందిన మహానుభావులు సాక్షాత్తు శంకరుల అవతారంగా చెప్పుకునే శంకరభగవత్పాదులవారు కూడా తాము పెట్టిన మొదటి పీఠానికి శారదాపీఠం అని పేరు పెడుతూనే ఆ తల్లిని కొయ్యతో (చెక్కతో) ఉంచి మనకు జ్ఞ్యానాన్ని అనుగ్రహించమని మనలను అనుగ్రహించి మనకు అందించారు.
ఈ రోజు ఆ తల్లిని ఆరాధన చేసి మనందరం ఆ తల్లి అనుగ్రాహం పొందెదముగాక.
"జయ జయ శంకర హర హర శంకర"
'అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే'
సర్వేజనా సుఖినోభవంతు
శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి
WhatsApp Number: +91 8886240088
తృప్తి
తృప్తి
ఒక పెద్ద మనిషి ఓ బ్యాంకులోంచి డబ్బులు తీసుకుని డబ్బుల పెట్టెను భుజాన వేసుకుని ద్విచక్రవాహనంలో వెళ్తున్నాడు.
ఆ పెట్టెలో వంద రూపాయల కట్టలు దాదాపు వంద ఉన్నాయి. అయితే మార్గమధ్యంలో గతుకుల రోడ్డుపై వెళ్తుండడంతో పెట్టె మూత కొద్దిగా తెరచుకుంది. అందులోంచి
ఓ వంద రూపాయల కట్ట కింద పడిపోయింది.
అది చూసుకోకుండానే అతను వేగంగా వెళ్ళిపోతున్నాడు.
కిందపడిన నోట్ల కట్టలోంచి ఒక్క నోటు మాత్రం బయటికొచ్చి గాల్లో ఎగిరెళ్ళి కాస్తంత దూరంగా పడిపోయింది.
ఆ నోటు పడిన పక్కగా ఒకతను నడుచుకుంటూ వచ్చాడు. అతను ఆ ఒక్క నోటూ తీసుకుని దగ్గర్లో ఉన్న ఇరానీ కేఫ్‌కి వెళ్ళాడు.
ప్లేటు దోసె, ప్లేటు ఇడ్లీ తిని, ఒక కాఫీ తాగాడు.
ఆ తర్వాత అక్కడికి దగ్గర్లో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళాడు. అక్కడి హుండీలో ఓ పదిరూపాయల నోటు వేసి, దేవుడికి కృతజ్ఞతగా దణ్ణం పెట్టుకున్నాడు.
సంతోషంతో ఇంటికి చేరాడు.
పడిపోయిన నోట్ల కట్టలో 99 అక్కడే ఉన్నాయి. ఆ దార్లో కాస్సేపటికి ఒకడు వచ్చాడు.అతను ఆ నోట్ల కట్ట తీసుకున్నాడు. వెంటనే లెక్కపెట్టాడు.వంద రూపాయల నోట్లు 99 ఉన్నాయి.
మళ్ళీ మళ్ళీ లెక్కించాడు.ఎన్నిసార్లు లెక్కించినా 99 ఉన్నాయి.
బ్యాంకులో 99 నోట్లున్న కట్ట ఇవ్వరు. కనుక మిగిలిన నోటు ఆ పక్కనే ఎక్కడో పడి ఉండవచ్చని అనుకుని వెతకడం మొదలుపెట్టాడు.చాలాసేపు వెతికాడు. కానీ ఫలితం లేకపోయింది. అయినా వెతుకులాట మానలేదు.
ఈ కథను చెప్పి గురువు ఫకాలున నవ్వాడు.
ఒక్కనోటు దొరికిన వ్యక్తి దర్జాగా హోటల్ కు వెళ్ళి ఇడ్లీ తిన్నాడు. కాఫీ తాగాడు. కానీ 99 నోట్లు దొరికిన వ్యక్తి వాటిని ఖర్చు పెట్టుకోక మరో నోటు కోసం వెతకడం మొదలు పెట్డాడు. మనలో చాలా మంది ఈ తరహానే.
లభించిన దానినో ఉన్నదానినో అనుభవించరు. దాంతో తృప్తిపడరు.లేని దానికోసం బుర్రలు పాడుచేసుకుంటారు. ఉన్నదాని పట్ల శ్రద్ధ ఉండదు. దేహం ఓ వైపు లాగుతుంటే మనసు మరోవైపు పోతుంటుంది.
నీతి: ఈ రెండింటి మధ్య సమన్వయం లేకుంటే ఎంతున్నా అసంతృప్తి తప్పదు....
POOR BRAHMINS
" శ్రీ వెంకటేశ్వర స్తోత్రం".
" శ్రీ వెంకటేశ్వర స్తోత్రం". సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ మరియు ఆయన మానసపుత్రుడు "నారదుల" వారి యొక్క ముఖము నుండి ఆవిర్భవించిన నటువంటి మహామహిమాన్వితమైన "స్తోత్ర రాజము. " ఇది. బ్రహ్మాండపురాణం వెంకటగిరి మహత్యము లో చెప్పబడినది. అని తెలుసుకున్నాము. సహజంగా మన దేశంలో కుటుంబాలలో ఇంటి ఇలవేల్పు, దేవతలు సైతం తమ "కుల దైవం,". "ఇష్టదైవము" గా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పూజలు, ప్రార్థనలు, చేస్తారు. మనము కూడా ఈ నాటికి కలియుగ దైవం అయిన "శ్రీ వెంకటేశ్వర స్వామి" (శ్రీనివాసుని) పూజించుట పరిపాటి. శ్రీనివాసుని దర్శించని హిందూ కుటుంబము భారతదేశములో బహుశా కల్లా! (అరుదు). ఈ శ్రీ వేంకటేశ్వరుని స్తోత్రము అయితే కంఠస్థము గా అందరికీ వచ్చే ఉండును. కానీ అర్థము ఎవరికీ తెలియదు. ( పండితులకు తప్ప) . తెలుగులో పుస్తకాలు అర్థము తాత్పర్యము ఉన్నది లభించుట లేదు. అలా కేశవనామాలు 24 ఉంటాయి కదా! ప్రతి పూజలో, వ్రతం నోము లలో, సంధ్యావందన కాలమునందు, మరియు దేవాలయం ల యందు కేశవ నామాలు, చదవటం మనకు తెలుసు, ప్రతి ఒక్కరూ చెపుతారు. అర్థం అనే విషయానికొస్తే "తెలియదు" స్పష్టంగా చెప్పగలరు. దమ్ తెలిసి చదివినా! పలికిన! ఆ ఆనందము, ఆ భక్తి శ్రద్ధలతో, రొమాన్ చితులై, పులకించి పోతూ జరుపుకుంటారు. మరి శ్రీ వేంకటేశ్వర స్తోత్రం లో కేశవనామాలు వస్తాయి, ఒక్కొక్క నామానికి ఒక పుస్తకము వ్రాయుటకు టైము చాలదు. తగు పరిజ్ఞానము కూడా కావలసి ఉండును. కనీసము "Basic Knowledge" ఉండుట చాలా అవసరము ఉన్నది. ఎందుకంటే నేటి తరం పిల్లలు పరిశీలించే తత్వము, తెలుసుకునే జిజ్ఞాస, కుతూహలము, మెండు, ఈ కంప్యూటర్ యుగంలో మనకే జ్ఞానము లేకపోతే. పిల్లలకు ఏమి చెప్పగలం? పెద్దలు ఏమి చేసినా? చూచి, తెలుసుకుని, అడిగి, అర్థము చేసుకొని ఆచరించుట పరిపాటి అయినది (పిల్లలను కొట్టి నేర్పే కాలము కాదు). అందుకే "ఆధ్యాత్మిక దృష్టి "కోణం లో తాత్పర్యము ను సేకరించి ఇచ్చుట తెలపడమైనది. తప్పులు ఉన్న తెలుగు టైపు సరిగా రాని, సరి అయిన మొబైల్ విజ్ఞానము లేని నాది, ఓనమాలు సరిగా రాని నాది, గా భావించి క్షమించగలరు. నీకు అర్థమైన పదాలు , అన్ని విషయాలు శ్రీ హరి కృపా, మరియు జగద్గురువులు శ్రీ 1008, సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారి ఆదేశానుసారము వారి ప్రేరణ పొంది రాసి నట్లు భావించవలెను. నేను నిమిత్తమాత్రుడు ను, దయచేసి ఈ "శీ వెంకటేశ్వర స్తోత్రం " PART 1 , 2,3,4,ల కింద విభజించి రాయబడినది. "మజుందార్, 87925-86125, బెంగళూర్"
" శ్రీ వెంకటేశ్వర సోత్రం". (బ్రహ్మాండ పురాణాంతర్గతము). సేకరణ & సమర్పణమ:- "మజుందార్ ",87925-86125, "బెంగుళూర్.". నేడు "ఆధ్యాత్మిక దృష్టి కోణంలో " తాత్పర్య సహితము గా మీ కొరకు ప్రత్యేకముగా! అధిక మాసంలో" . శ్లోకం:1) వేంకటేశో వాసుదేవః ప్రద్యుమ్నె మిత విక్రమః ! సంఘర్షణో నిరుద్ధ శ్చ శేషాద్రి పతి రే వచ!! 1)"వెంకటేశా":- పాపమును కాల్చి వేయును. మాధవుడ ను యొక యోగ్య బ్రాహ్మణుడు ప్రారబ్ధ వశము చేత తల్లితండ్రులను, భార్యను, తుదకు కు బ్రాహ్మణ్యం విడిచి చండాలుడై ,. చండాల స్త్రీ లోలుడై, తాను చేసిన సకల పాపములను తిరుపతి కొండ స్పృశించు మాత్రముననే పోగొట్టుకొనెను. అనగా తన స్పర్శ మాత్రము చేత మాధవుని పాపములు కాళీ భస్మమై పోవుట చేత ఈ పర్వతమునకు "వెంకట అను పేరు కలిగినది అని చెప్పబడెను. ఇటువంటి పర్వతమునకు వాడు అనగా పతి అయిన కారణముచేత శ్రీనివాస దేవునకు "వెంకటేశుడు" పేరు. 2)"వాసుదేవా":- జ్ఞాన స్వరూపిణి సకల లోకములను సృష్టించు వాడు, ఆ లోకములందు క్రీడించు వాడు. లోక సృష్టికర్తయగు శ్రీనివాసులకు సృష్టి లేదని నచో, నతనికి శరీరము లేదని చెప్పినట్లు అయినది. శరీరము లేనివాడు ఇతరులను ఎలా సృష్టించగలడు? ఒకవేళ అతనికి సృష్టి ఉన్నచో, సృష్టికర్తయగు శ్రీనివాసునకు మేమందరము అతని ఆదీనులై నట్లు అతడు తనను సృష్టించిన వానికి పరాధీనుడై ఉండవలెను. మన దీనులైన మనలను నుండి సృష్టి ఏర్పడనట్లు, అతని నుండి యు సృష్టి ఏర్పడుట అసాధ్యమను శంకను(అనుమానము ను) పరిహ రించుట కు గాను యని చెప్పబడెను. పరమాత్మకు దేహము కలదు. అది పాకృతము కాదు. జ్ఞానానం దా ది గుణాత్మకమైన ది. పా కృత దేహమునకు జన్మ ము లేదు. కనుక శ్రీనివాసునకు సృష్టి, పరాధీనత లేకుండుట చేత, దేహము ఉండుట చేత అతని వలన మన సృష్టి ఏర్పడుట లో ఏ బాధ కము(వి ప్రతిపత్తి) లేదు. ప్రతి యొక్క వ్యక్తి యు ప్రయోజనము లేకుండా ఏ పని చేయడు. శ్రీనివాసుడు ప్రపంచమును సృష్టించి నాడు అనగా అతనికి ఓ ప్రయోజనం ఉండి తీరుతుంది. అట్ల కూర్చో అతడు మన వల్లనే ప్రయోజనము కొరకు పనులను చేయుటవలన, ఫలముల నిచ్చు వాని యాదీనుడ అని చెప్పవలసి వచ్చును. అటువంటి శ్రీనివాసుని చేత సృష్టి ఏర్పడు టెట్లు? యను అనుమానము పరిహ చుటకు గాను "దేవ" అని చెప్పబడినది. ఆనందోదెకము చేత నర్తనాది లీలలు చేయుచుండిన తాగుబోతు వలనే పరమాత్ముడు తనతో నుండు పూర్ణానంద ము చే అన్ని పనులను చేయును. కనుక అతడు చేయు సృష్టి వలన అతనికి ఎప్పుడు ఫలము లేదు. అది అంతయు అతని లీల. ఇట్లు paramaatmudu చేయు ప్రపంచ సృష్టి అతనికి పరాధీనత లేకుండుటచే లోకపు సృష్టి చేయుటకు ఏ బాధ లేదు. ఈ అభిప్రాయమును వాసు, దేవ, యను 3 అవాంతర పదములు తెలుపుచున్నవి. సౌక రాయణ స్మృతి లో. ,2) శ్లోకం:- వానాతోస................"వాసుదేవ అను పదమునకు నాలుగు అర్ధములు కలవు. 2 వ అర్థము:-వాసు అనగా అన్ని లోకములందు నుండువాడు. " దేవ" అనగా క్రీడించు వాడు. సకల జీవులందు ను, సకల జడము లందును, లోన శీను వాసుడు సన్నిహితుడై ఉండి అందరిచే అన్ని కార్యములను చేయించుకున్నాడు. కనుక మన ప్రయత్నము లేక ఇతరుల సహాయము చేసి సుఖము కలిగినను ఆ సుఖము అన్ని వేళల ఎందుండి అన్ని కార్యములను చేయించు శ్రీనివాసుని చేతనే వచ్చినదని తెలిసి అతని యందు భక్తిని చేయవలెను. దుఃఖము కలిగినచో నది మన పాప రాశిని పరిహరింప జేసి, మమ్ములను నుద్ద ధరించుటకు గాను కరుణాపయోనిధీ యగు శ్రీనివాసుడి ంచిన్నదని తెలిసి అతని యందు భక్తిని చేయవలెను. ఆ దుఃఖము ఇతరుల నుండి వచ్చినదని వానిని ద్వేషించకు కూడదు. ఇక్కడ కూడా "దేవ" అను పదము యొక్క ప్రయోజనము వెనుక చెప్పినట్లు తెలియవలెను. . 3 వ అర్థము:- "వాసు అనగా అన్ని వస్తువులకు కప్పు కోను (ఆచ్ఛాదన ము) వస్త్రము వంటివాడు. "దేవ" అనగా క్రీడించు వాడు. మన శరీరము పైనున్న కప్పు వస్త్రము మమ్ములను చలిగాలుల నుండి కాపాడు ఉన్నట్లుగా శ్రీనివాసుడు మనకు బయట నుండి మనలను కాపాడుతున్నాడు. ఇక్కడ కూడా వెనుకటి వలనే అన్ని అంశముల తెలియవలెను. 4వ అర్థము:- "వ" అనగా బల పూర్ణుడు అని అర్థము. "అను" అనగా సర్వ చేష్ట కుడని యర్థము. "దే" అనగా అన్నియును ఇచ్చువాడు అని అర్థము. "వ" అనగా అన్ని చోట్ల యందుండు వాడు అని అర్థము. అందరి చేత, అన్ని విధముల పనులను శ్రీనివాసుడు చేయించును. దానికి కావలసిన బలము అతనియందు పూర్ణముగా గలదు. అన్ని చోట్ల యందుకు ఉండుటచే, అందరి చేత అన్ని కార్యములను చేయించుట అతనికి మాత్రమే సాధ్యము. ఇతరులకు సాధ్యము కాదు. ఇతరులచే సమస్త కార్యములను నిరపేక్ష కుడై చేయించి వాటికి తగిన ఫలములను ఇచ్చువాడు డగుచున్నాడు అను అర్థము క్రమముగా అను,వ,వ,దేవ యను యీ నాల్గుపాదములచే "వాసుదేవా "అను పదము తెలుపుచున్నది. అటులనే వసుదేవుని కుమారుడై అవతరించి నందులకు వాసుదేవుడు డను నామాంతరం కలిగినది. 3) "ప్రద్యుమ్న":- మూల రూపి యగు నారాయణుడు సృష్టి యొక్క ప్రారంభము నందు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధుమను అను నాలుగు రూపములను స్వీకరించెను. అప్పుడతని పత్ని లక్ష్మీదేవి యు, మాయ, కృతి, జయ ,శాంతి అను 4 రూపములను స్వీకరించెను. మాయావతి అయినా వాసుదేవుడు సర్వులకు ముక్తిని, కృతి పతి యగు ప్రద్యుమ్నుడు సృష్టిని జయ పతి యగు సంఘర్షణనుడు సంహారము ను, శాంతి పతి అగు అనిరుద్ధుడు పాలన మును చేయుచున్నాడు. శ్రీనివాసుడు వాసు దేవుడని చెప్పబడి ఉండుట చేత అతని యందు మోక్షదాయక త్వ శక్తి కలదని చెప్పినట్లు లగును. ఇప్పుడు శ్రీనివాసుడే కృతిపతి అయినా ప్రద్యుమ్నుడు అని చెప్పొచ్చు, సృష్టికర్త తత్వము అతని ఎందు కలదని యీ పదము తెలుపుచున్నది. "ప్ర" అనగా సర్వోత్తమమైన, "దుమ్మ' అనగా బంగారము వలెనుండు అనంత కళ్యాణ గుణముల చేత పూర్ణుడగుటచేత అతనికి "ప్రద్యుమ్ను" మను నామము కలదు. 4) అమిత" అతిశయించిన "విక్రమః' పరాక్రమము గలవాడు. ఇచ్చా మాత్రము చేత జీవ జడ ఆత్మ కమైన సకల ప్రపంచమును లోగోని న యనంత బ్రహ్మాండములను సృష్టించి పాలించి సంహరించు శ్రీ హరి పరాక్రమము నకు మేరగలదా? కనుక శ్రీనివాసుడు అమిత విక్రముడు దగుచున్నాడు. 5) "సంకర్షణః :-- చక్కగా నాశనము చేయువాడు. మనం ఎవ్వరే గాని యే వస్తువునైనా నాశనము చేసినచో అది కొన్ని ముక్కలుగా ఖండింప బడి కింద పడవచ్చును. పరమాణు వలె సూక్ష్మముగా నాశనము చేయు శక్తి మనకు లేదు. సంకర్షణ రూపమైన శ్రీ హరి యు బ్రహ్మాండమును ఇచ్చ మాత్రము చేత పొడి చేసి ప్రకృతి రూపమైన అతి సూక్ష్మ అణువుల స్థితికి తీసుకొని రాగలడు. కనుక ఉత్తమ సంహారము చేయు శక్తి అతనికి మాత్రం వుండుట వలన లోక సంహారక మూర్తి అయిన శ్రీ హరి మూర్తికి సంకర్షణుడు అను నామము కలదు. ఇటువంటి సంకర్షణుడు శ్రీనివాసుడే అగుటవలన లోక సంహార కర కత్వ శక్తి యు అతనికి కలదు. 6)"అనిరుద్ధః చే :- ఎవరి చేతను నిరోధింప బడని వాడు. 1) శ్రీ హరి కల్పించిన కార్యమును నిరోధించు శక్తి ప్రపంచము నందు ఎవరికీ వెనుక కాలమందు లేదు. ఇప్పుడు లేదు. ముందు కాలమందే పడుట లేదు. కనుక యుద్ధమునందు శ్రీనివాసుని తలకు దెబ్బ తగిలే ను. ఉన్న గు కథలు ద్వైత మోహనా ర్థ కముగా వ్రాయబడినవి గాని వాణి ఎందు తత్వ వంశము లేవు. ఇంద్రజిత్తు ని నాగపాశము చే బంధింపబడి నట్లు నటించిన శ్రీ రాముడు, ఖరాసుర సంహర కాలమున రావణుని మూల బలమును చెండాడు కాలమున అసంఖ్యాకములగు రూపములను స్వీకరించెను. దీనివలన తన్ను ఆవ రోధించు శక్తి యెవరికి లేదు . అవరోధం దించినట్లు నటించినచో అది నటన మాత్రమే అని స్పష్టం చేసి ఉన్నాడు. 2) సర్వ శ్రేష్ట కు దైన వాయు దేవుడు అతని భక్తుడు. అతని చేత "రుద్ధ" వశము చేసుకున్నవాడు. శ్రీ హరి , పైన చెప్పినట్లు ఎవరికీ గాని వసుడు కాడు. వాలి భక్తుడై నప్పటికీ , హనుమంత దేవుని అనుగ్రహమునకు పాత్రుడు కాక ఉండి నందున, శ్రీరామ దేవుడు అతనిని ని గ్రహించెను. సుగ్రీవుడు వాలి కంటే అల్ప భక్తుడు అయినప్పటికీ హనుమంతుని అనుగ్రహమునకు పాత్రుడు అగుటచే అతనిని శ్రీరాముడు అనుగ్రహించెను. ఇడ్లీ శ్రీనివాసునకు అనుగ్రహమునకు పాత్రుడైన శ్రీ వ్యాస తీర్థుల వారు , గురు సార్వభౌములు మొదలగు వారికి వసూలు డై యుండుట వలన అతనికి " అనిరుద్ధ" అను పేరు కలిగినది. లోక పాలకుడైన అనిరుద్ధుడు అను పేరు కలిగినది. లోక పాలకుడైన అనిరుద్ధుడు ఇతడే ఐ ఉండుటవలన లోక పాలక తత్వ శక్తి ఇతనికి కలదు. 7) "శేషాద్రి పతిః ఏవచ: శేష దేవుని వలన చుట్టబడిన ఆనంద పర్వతమునకు ఎజమానుడా అయినవాడు, ఈ శేషాద్రి పటుత్వము శ్రీనివాసు ని ఎల్లప్పుడూ కలదు. వైకుంఠము నందు నారాయణుడు యోగనిద్ర యందున్న ప్పుడు శేషా దేవుని ద్వారము దగ్గర ఉండు నట్టు చేసెను. అప్పుడు వాయుదేవుడు పరమాత్ముని చూడవచ్చును. అప్పుడు శేషా దేవుడు అతనిని నిరోధించి ఆత్మస్తుతి గావించెను. అప్పుడు శ్రీహరి అచటికి వచ్చి"శేషుడు" తన దేహము చేత ఈ ఆనంద పర్వతాన్ని గట్టిగా చుట్టి ఉండే వాసుదేవ్ పర్వతమును కదిలించిన చో అతడు శ్రేష్టుడు. అట్లు కానిచో శేషుడు శ్రేష్ఠుడు డగు ని తీర్మానం చేసినట్లు తెలిపెనట, దాని ప్రకారము శేషుడు తన దేహము చేత పర్వతమును గట్టిగా చుట్టి విషము గ్రక్కె ఉండగా వాయుదేవుడు తన కాలి స్పర్శ మాత్రము చేత నా పర్వతమును శేషు ని తో సహా 51000 యోజనాలు ఎగురుతూ పడునట్లు చేసెను. శేషా దేవునకు మదము తగ్గింది. వాయు దేవుని స్తుతించెను. ఇటు శేషా దేవుని గర్వ పరిహారము లకు కారణం నందున ను, ఎల్లప్పుడు శేషు దేవుని దేహము చేత చుట్టబడిన ఈ పర్వతమును నాటినుండి "శేషాద్రి" యాను పేరు వచ్చినది. ఇటువంటి శేషాద్రికి యజమానుడు శ్రీనివాసుడు. ఈ "శేషాద్రి" పుట్టుట కు ముందు, నాశనము తరువాత శేషాద్రి ఏ లేఖ యుండుటచేత శ్రీనివాసుడా సందర్భమున శేషాద్రి పతి కాడని చెప్పినట్లు కాదా? యను అనుమానము "ఏవ" యను పదము ఉత్తర మించు చున్నది. ఈ శేషాచలము పుట్టుటకు పూర్వము , నాశన పొందిన తరువాత కూడా అనంత బ్రహ్మాండములు వానిలో నితిన్ శేషాద్రి ఉండి యే యున్నవి. వాటికి శ్రీనివాసుడే అధిపతి అగుట వలన అతని యందు గల శేషాద్రి పతిత్వము సర్వకాలము నందు ఉన్నది యని చెప్పబడెను. (ఇంకా ఉంది)
" శ్రీ వెంకటేశ్వర సోత్రం"
" శ్రీ వెంకటేశ్వర సోత్రం". (తరువాయి భాగం: 4). "మజుందార్ ,బెంగళూరు" సేకరణ & సమర్పణ "హరిసర్వోత్తమ" "వాయు జీవో త్తమ". , శ్లోకం :8 :- " భూత వాసః. గిరి వాసః శ్రీనివాసః శ్రీ యః. పతిః ! అచ్యుతానంత. గోవిందో విష్ణు వెంకట నాయకః !! 45)" భూత వాసః" :- సమస్త జీవ జడ వస్తువులకు వాస స్థలముగా కలవాడు. తన ఉదరమునందే సకల జీవ జడ వస్తువుల ఉంచుకొని ఇంటి కాపాడుచుండుట చేత శ్రీనివాసునకు "భూత వాసు" డని పేరు. 46) "గిరి వాసః" :- విద్యలకు నిలయమైనవాడు. సమస్త విద్యలకు ఇంటి యందు వలనే ఆశ్రమదాతు డైన శ్రీనివాసునకు " గిరి వాసుడు" అని పేరు . 47) "శ్రీనివాసః" :--" శ్రీ " లక్ష్మీ దేవితో కూడి వసించువాడు. శ్రీనివాసుడు లేని స్థలమునందు లక్ష్మీదేవి యుండదు అట్లే లక్ష్మీదేవి లేని స్థలము నందు శీను వారిరువురు అన్నిచోట్ల యుందురు. కనుక లక్ష్మీ దేవి నారాయణి తో కలహించి కొలహపూర్ పోయే కథలు ఏర్పడిన కథలని తెలియవలెను. ఇట్లు శ్రీదేవి ఉద్యోగము లేని శ్రీనివాసునకు "శ్రీనివాసుడు" అని పేరు. ,48)" శ్రీ యపతిః" :- లక్ష్మీదేవికి పాలకుడు. లక్ష్మికి నారాయణుడు నకు సంసారము లేనందున వీరిద్దరికీ సామ్యము కలదు. అయనను వారిద్దరిలో లక్ష్మీదేవి హరిని రక్షించుట లేదు. హరి యే లక్ష్మిని రక్షించును. కనుక లక్ష్మి ని రక్షించు శ్రీనివాసునకు" శ్రీ యః పతి అని పేరు. దీనివలన దుర్గాదేవి లోక రక్షకురాలను శా క్త మతము నిర స్తా మగును. 49)" అచ్యుతానంద గోవిందః":- దేహం నాశాది దోషములు లేనివాడు. అన్ని చోట్ల యందు అన్ని కాలముల యందు నుండి సర్వ గుణ పరిపూర్ణుడైన వాడు, జ్ఞానము చేత లభ్యమగు వాడు. జ్ఞానానందా త్మ కమైన , దేహము కలిగిన శ్రీనివాసునకు దేహ నాశనము మొదలగు దేహ నిమిత్తము మొదలైన దోషములు ఇతర దోషములు లేవు. అతడు లేని చోటు లేనే లేదు. కాలము లేదు. అతనిలో లేని గుణములు లేవు. అన్ని గుణములచే పూర్ణుడు అయినవాడు. అతని గుణములను తెలిసి అతని యందు చేయు భక్తి చేతనే అతడు లభ్యుడు కాగలడు. వేరు మార్గము లేదు. కనుక అతనికి అచ్యుత, అనంత, గోవిందా,అను మూడు పేర్లు కలవు. 50)"విష్ణుః" :-- బలము జ్ఞానము లే స్వరూపుడగు వాడు,. శ్రీనివాసుడు బలము, జ్ఞానము, ఆనందము, మొదలుగాగల గుణములచే దేహముగా కలవాడు, కనకనే నా అతనికి "విష్ణుః" అని పేరు. 51)" వెంకట నాయకః" :-- పాపములను కాల్చినట్టు సకల జ్ఞానము లకు యజమానుడు, జ్ఞానులు జ్ఞానాగ్ని చేత తమ పాప రాశులను ఆశ్రయించిన వారి పాప రాశులను basmam అగునట్లు చేయుదురు. వారలకు అంత శక్తి శ్రీనివాసుని జ్ఞాన బలము చేతనే ఏర్పడినది. ఇటువంటి మహా శక్తి గల పై చెప్పిన జ్ఞాన శక్తి శ్రీనివాసుడు వెంకట నాయకుడు పేర పలుకుతున్నాడు. "శ్లోకం 8":-- సర్వ దేవైక శరణం. సర్వ దైవైక దైవతమ్! . , సమస్త దేవ కవచం సర్వదేవ శిఖామణిః !! 53)"సర్వ దైవిక శరణం":-- సర్వదేవతలకు ఒక్కడే రక్షకుడై ఉన్నాడు. దేవతలందరికీ ఆపద కలిగినప్పుడు శ్రీనివాసుడు యొక్క రక్షకుడైనాడు. దేవతలందరికీ ఆపద కలిగినప్పుడు శ్రీనివాసుడు యొక్క రక్షకుడైన నాడు. కనుక అతని మొర వచ్చి తమ కష్టములను పోగొట్టుకొనిరి. అందుచేత శ్రీనివాసునికి "సర్వ దైవిక శరణు" డని పేరు. . 53)"సర్వ దైవిక దైవతం":-- దేవతలందరికీ ముఖ్యమైన దేవుడు గా ఉన్నాడు. దేవతలందరూ తమ కుల దైవం దైవం శ్రీనివాసుని ముఖ్యముగా పూజించు చున్నారు. అందు వలన శ్రీనివాసునకు "సర్వ దైవిక దైవత " అని పేరు. ,54)"సమస్త దేవ కవచం":-- దేవతలందరికీ కవచము వల్లనే ఉన్నవాడు. వజ్ర కవచము శత్రువుల శాస్త్రము నుండి రక్షించును. అదే విధముగా దేవతలకు శత్రువుల నుండి సంభవించు సకల ఆపదల నుండి కాపాడే శ్రీనివాసునకు" సమస్త దేవ కవచుడు " అని పేరు. 55)"సర్వదేవ శిఖామణిః":-- దేవతలందరికీ శిరోరత్నం ప్రాయుడు అయినవాడు. దేవతలందరూ శ్రీనివాసు నల్ల ఎడల నమస్కరించు రు. కనుక శ్రీనివాసుని పాదములు దేవతలందరి తల మీద శోధించు చుండెను. అందులోకి శ్రీనివాసునకు "సర్వ దేవ శిఖామణి" అని పేరు. శ్లోకం: 10 :-"ఇతీదం కీర్తి తం య స్య విష్ణు తేజ సః! త్రి కాలేయః పటే నిత్యం పావంత న్య న విద్యతే!! పైన చెప్పిన విశేషణము ల వలన శ్రీనివాసుని తేజమున సాటిలేదని సిద్ధమైనది. అటువంటి శ్రీనివాసుని "వెంకటేశో వాసుదేవః అని ప్రారంభము చేసి, ఎనిమిదవ శ్లోకములతో కూడిన స్తోత్రము ప్రతి దినము ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము నందు పారాయణ చేయువారికి వెనక చేసిన సర్వపాపములు నశించును. మరియు వాడు పాపము లో నచ్చకుండా శ్రీనివాసుడు కాపాడగలడు. పాపములు చేసినచో వాటిని పరిహరించును. శ్లోకం: 10 :-- రాజద్వారే పఠేథేరే సంగ్రామే రిపు సంకటే! , భూత సర్ప పిశాచాది భయం నాస్తి కథాచన!! ప్రభువుల నుండి తనకు కావలసిన పనులకై వారి ఇంటి వాకిలి కాడ కాచుకుని ఉన్న కాలమునందు, అనేక విధములగు తొందరలు, భయములు ఏర్పడు అవకాశము కలదు. అతి భయంకరమైన యుద్ధము నందు పాల్గొన్నప్పుడు శత్రువులనుండి ఒకసారి సంభవించే కష్ట సమయములందు అనేక విధములైన కష్టములు కలుగును. భూత సర్ప పిశాచి నుండి బయట పడే అవకాశం కలదు. ఇట్టి భయము లన్నియు, ప్రతి దినము ఈ స్తోత్రం ను త్రీ కాలములందు పట్టించు వారల కేనాడు సంభవిం పవు. అట్లే ఏర్పడినచో, ఈ స్తోత్ర పఠనము తో పరిహార మగును. . శ్లోకం 11:- అపుత్రో లభతే పుత్రన్ నిర్ధానో ధనవాన్ భవేత్! . యోగారో ముచ్యతే. రోగ్ ఆ చెవత్త బంధ నాత్ !! ,ఈ స్తోత్రంమును పట్టించు వాడు. అపు త్రుడు అయినచో పుత్ర వంతు డగును. పేద అయినచో భాగ్యవంతుడు అగును. రోగి అయిన వాడు ఆరోగ్యవంతుడు. బంధింపబడిన వాడు వాటి నుండి విముక్తుడు అగును. శ్లోకం:- య దిష్ట తమం. .............. శ్లోకం:- "విష్ణు లైవ్ సోపానం...................... శ్రీ వెంకటేశ స్తోత్రం ను పట్టించు వానికి తనకే వస్తువులు ఎంత ఇష్టమో వాటినన్నింటినీ పడయగలడు. దీనికి సంశయము వలదు. ఐశ్వర్యము రాజ మన్ననలు సుఖములు అన్ని రకములైన శుభములు సర్వైశ్వర్య కలుగును. విష్ణు లోక ప్రాప్తి ముక్తికి ఈ స్తోత్ర పఠనము ముఖ్యమైనది. అన్ని దుఃఖములను ఇది ఒక్కటే పరియహింప గలదు. , శ్లోకం: mayavi పరమానందం .............."ప్రతి ఒక్క జీవికి సంసార వస్తాయని వాని స్వరూపానంద మూయబడి యుండును. నిత్య వస్తా ఎందు వైకుంఠములో ముక్త స్థానమును యుండు నపుడు వాని వాని స్వరూపానంద పూర్ణముగా వ్యక్తం అగును. అందులకే వైకుంట లోకములో సర్వోత్తమ మనిపించును. శ్రీహరి యొక్క ఉండినను అతని ఆనందమునకు హాసన్ ఆసాది దోషములు లేవు. అతని ఇచ్చుటకు వచ్చినట్లు అక్కడ కూడా కొన్ని దినముల వరకు నివసించును. ఇప్పుడు కొన్ని దినముల వరకు వైకుంఠమును వదలి భూలోకము నందలి స్వామి పుష్కరిణీ తీరం మందు నివసింప నిచ్చ కలిగినది . అతని అభిప్రాయము నెఱింగిన శ్రీ మహాలక్ష్మి దేవి పరమాత్ముడు వైకుంఠము నందు లేనప్పుడు తాను కూడా వైకుంఠమును వదలి వెడలవలే నని, శ్రీహరి పోగు భూలోకమునకు పోవలెనని తీర్మానించుకుని శ్రీహరి కంటే ముందుగా ప్రేమ కలహమును పెంచి ప్రయాణం ఆయేను. ఇట్లు శ్రీనివాసుడు వైకుంఠమును వీడియో వెంకటాచలము నందు గల స్వామిపుష్కరిణీ సరోవర తీరం నందు, తన వక్ష స్థలము నందు గల మరియు అదృశ్యం అయిన రమాదేవి తో కూడి ఆమె చే సేవింప బడి ఆనంద పూర్ణుడై ఉన్నాడు. శ్లోకం:"కళ్యాణ్ అద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే ! శ్రీ మద్ది వెంకట నాదాయ శ్రీనివాసాయ మంగళం!!(ఇతి బ్రహ్మాండ పురాణే వెంకటేశ స్తోత్రం సంపూర్ణం). , ఓ శీ నివాస! నీ దేహము అప్రాకృత మగుట వలన పరమ మంగళకరమైనది. ఇట్టి దేహము ఎవరికీ లేదు. కనుక పరమాచార్య మైనది. నీవు భక్తులపై రక్షించు పదార్థముల అన్నిటినీ ఉత్తమ రీతిగా నిచ్చు చున్నావు. నీ నివాసము చే శ్రీ వెంకటేచలం సకల సౌభాగ్య సహితమైన విరాజిల్లుచున్నది. అట్టి నీకు నా నమస్కారములు!! ,(ఇతి శ్రీ వెంకటేశ సోత్రం వాదము సంపూర్ణం) గమనిక:- భగవంతునికి హారతి సమర్పించినపుడు పై శ్లోకమును పట్టించుట పరిపాటి అయినది. మరి అర్థం ఈ రోజు నీకు తెలిసినది కదా!
శ్రీసరస్వతీధ్యానం
శ్రీసరస్వతీధ్యానం
వాణీం పూర్ణనిశాకరోజ్జ్వలముఖీం కర్పూరకుందప్రభాం
చంద్రార్కాంకితమస్తకాం నిజకరైః సంబిభ్రతీమాదరాత్ .
వీణామక్షగుణాం సుధాఢ్యకలశం విద్యాం చ తుంగస్తనీం
దివ్యైరాభరణైర్విభూషితతనుం హంసాధిరూఢాం భజే .. 1..
ఆసీనా కమలే కరైర్జపవటీం పద్మద్వయం పుస్తకం
బిభ్రాణా తరుణేందుబద్ధమకుటా ముక్తేందుకుందప్రభా .
భాలోన్మీలితలోచనా కుచభరాక్రాంతా భవద్భూతయే .
భూయాద్వాగధిదేవతా మునిగణైరాసేవ్యమానాఽనిశం .. 2..
యా కుందేందుతుషారహారధవలా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా .
యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా .. 3..
దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణినిభైరక్షమాలాం దధానా
హస్తేనైకేన పద్మం సితమపి చ శుకం పుస్తకం చాపరేణ .
భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానాఽసమానా .
సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా .. 4..
సురాసురాసేవితపాదపంకజా కరే విరాజత్కమనీయపుస్తకా
విరించిపత్నీ కమలాసనస్థితా సరస్వతీ నృత్యతు వాచి మే సదా .. 5..
సరస్వతీ సరసిజకేసరప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా .
ఘనస్తనీ కమలవిలోలలోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ .. 6..
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి .
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా .. 7..
శ్రీమచ్చందనచర్చితోజ్జ్వలవపుః శుక్లాంబరా మల్లికా-
మాలాలాలితకుంతలా ప్రవిలసన్ముక్తావలీశోభనా ..
సర్వజ్ఞాననిధానపుస్తకధరా రుద్రాక్షమాలాంకితా .
వాగ్దేవీ వదనాంబుజే వసతు మే త్రైలోక్యమాతా శుభా .. 8..
.. శ్రీరస్తు ..
ఇతి శ్రీసరస్వతీధ్యానం ..
రాఘవనారాయణ
ఒక 50 ఏళ్ళ క్రితం మాట. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారనే గొప్ప బాలా త్రిపురసుందరి ఉపసాకులు గుంటూర్ జిల్లా చందోలులో నివసించేవారు. వారినే చందోలు శాస్త్రి గారని కూడా అనేవారు. తరుచూ వీరు గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు చెప్తూ ఉంటారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు వారి గురించి ఒక ప్రవచనంలో చెప్పిన మాట. 'శాస్త్రి గారు ఒక కాలంలో తీవ్రమైన పేదరికం అనుభవించారు. తినడానికి తిండి లేని పరిస్థితి. అటువంటి పరిస్థిలో కూడా వారు అమ్మవారి ఉపాసనను విడిచిపెట్టలేదు. రోజుకు 27 సార్లు లలితా సహస్రనామం పారాయణ చేసి, అమ్మవారికి నివేదన చేయడానికి ఏమీ లేకపోతే, చెంచాతో మంచినీళ్ళు నివేదన చేసేవారు. ఎంతటి తీవ్రమైన వ్యతిరేక పరిస్థితులు ఎదురుకొన్నా, అమ్మవారి యందు నిశ్చలమైన, అచంచలమైన భక్తిని వీడలేదు. ఇది చూసి అమ్మ పొంగిపోయింది. ఒకానొకనాడు బాలా అమ్మవారు శాస్త్రిగారికి ప్రత్యక్షమై "శాస్త్రి! ఇంకా చాలు. ఎన్నాళ్ళు అనువభిస్తావు. ఇక అయిపోయిందిలే" అన్నది. అక్కడితో వారి పేదరికం అంతరించింది. అటు తర్వాత వారు మరణించేవరకు వారి ఇంట అనేకమందికి అన్నదానం చేశారు. బాలా త్రిపురసుందరి దేవి పై వారికి ఎంత భక్తి అంటే, ఆయన పనిలో ఉన్నప్పుడు, వారి ఇంటికి ఎవరైనా వచ్చి, శాస్త్రీగారిని పిలిస్తే, బాలా అమ్మవారు చిన్న పిల్లా రూపంలో ఇంట్లోంచి బయటకు వచ్చి, 'మా నాన్న గారు పనిలో ఉన్నారండి. కాసేపు ఆగండి' అని చెప్పేది. ఆఖరికి వారి మరణం తర్వాత దేహం చితిలో కాలుతున్న సమయంలో, ఆ చితి మంటలపై #అమ్మవారు కనిపించింది. ఇది ఫోటో తీసి పత్రికలలో కూడా వచ్చింది.
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనే మాటకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. అమ్మవారిని ప్రేమతో, నిశ్చల భక్తితో, అచంచల విశ్వాసంతో పూజిస్తే, పొందలేనిదంటూ ఏం ఉంటుంది?
ఓం శ్రీ మాత్రే నమః
Veda samskruti
శ్రీ సరస్వతీ కవచం
శ్రీ సరస్వతీ కవచం
ఓం హ్రీం సరస్వత్యై స్వాహా శిరో మే పాతు సర్వతః |
శ్రీం వాగ్దేవతాయై స్వాహా భాలం మే సర్వదాఽవతు ||
ఓం సరస్వత్యై స్వాహేతి శ్రోత్రం పాతు నిరన్తరమ్ |
ఓం శ్రీం హ్రీం భారత్యై స్వాహా నేత్రయుగ్మం సదాఽవతు ||
ఓం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా నాసాం మే సర్వతోఽవతు |
హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహా శ్రోత్రం సదాఽవతు ||
ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై స్వాహేతి దన్తపఙ్క్తీః సదాఽవతు |
ఐమిత్యేకాక్షరో మన్త్రో మమ కణ్ఠం సదాఽవతు ||
ఓం శ్రీం హ్రీం పాతు మే గ్రీవాం స్కన్ధం మే శ్రీం సదాఽవతు |
శ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహా వక్షః సదాఽవతు ||
ఓం హ్రీం విద్యాస్వరూపాయై స్వాహా మే పాతు నాభికామ్ |
ఓం హ్రీం హ్రీం వాణ్యై స్వాహేతి మమ పృష్ఠం సదాఽవతు ||
ఓం సర్వవర్ణాత్మికాయై పాదయుగ్మం సదాఽవతు |
ఓం రాగాధిష్ఠాతృదేవ్యై సర్వాంగం మే సదాఽవతు ||
ఓం సర్వకణ్ఠవాసిన్యై స్వాహా ప్రచ్యాం సదాఽవతు |
ఓం హ్రీం జిహ్వాగ్రవాసిన్యై స్వాహాఽగ్నిదిశి రక్షతు ||
ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై బుధజనన్యై స్వాహా |
సతతం మన్త్రరాజోఽయం దక్షిణే మాం సదాఽవతు ||
ఓం హ్రీం శ్రీం త్ర్యక్షరో మన్త్రో నైరృత్యాం మే సదాఽవతు |
కవిజిహ్వాగ్రవాసిన్యై స్వాహా మాం వారుణేఽవతు ||
ఓం సదంబికాయై స్వాహా వాయవ్యే మాం సదాఽవతు
ఓం గద్యపద్యవాసిన్యై స్వాహా మాముత్తరేఽవతు ||
ఓం సర్వశాస్త్రవాసిన్యై స్వాహైశాన్యాం సదాఽవతు |
ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహా చోర్ధ్వం సదాఽవతు ||
ఐం హ్రీం పుస్తకవాసిన్యై స్వాహాఽధో మాం సదావతు |
ఓం గ్రన్థబీజరూపాయై స్వాహా మాం సర్వతోఽవతు ||
(బ్రహ్మవైవర్త మహాపురాణాంతరగతం
VN Sastry
: శ్రీ సరస్వతీ మూలమంత్రము
“శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా”
ఇది వైదికమైన సరస్వతీ అష్టాక్షర మూల మంత్రము. ఇది చాలా శ్రేష్ఠమైనది. కల్పవృక్షము వంటిది. మొదట మూలమంత్రమును పఠించి సరస్వతీ కవచమును జపించవలెను.
ప్రజాస్వామ్య విలువలను స్థాపించిన రాజకీయ పార్టీ
దేశ రాజకీయాల్లో సత్యం మరియు ప్రజాస్వామ్య విలువలను స్థాపించిన రాజకీయ పార్టీ 'భారతీయ జనసంఘ్' పునాది రోజున అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
1951 అక్టోబర్ 21న ఢిల్లీలో శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేశాడు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావనలపై ఏర్పాటు చేసిన ఈ పార్టీకి ఎన్నికల చిహ్నంగా దీపం గుర్తు లభించింది.
భగవద్గీత పైన అందరికి ఉండవల్సిన అవగాహన
*భగవద్గీత పైన అందరికి ఉండవల్సిన అవగాహన కోసం...హిందూ ధర్మం పాటించే ప్రతీ ఒక్కరికీ షేర్ చేయండి*
*1.* భగవద్గీతను లిఖించినదెవరు?
=విఘ్నేశ్వరుడు.
*2.* భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము?
= భీష్మ పర్వము.
*3.* గీతాజయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును?
=మార్గశిర మాసము.
*4.* గీతాజయంతి ఏ ఋతువులో వచ్చును?
=హేమంత ఋతువు.
*5.* ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వసంత ఋతువు.
*6.* భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను?
=శ్రీకృష్ణుడు అర్జునునికి.
*7.* భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను?
=కురుక్షేత్ర సంగ్రామము.
*8.* భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమయ్యెను?
=కౌరవ పాండవులకు.
*9.* పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధిగా వుండెను?
=అర్జునుడు.
*10.* వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను?
=సామవేదము.
*11.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి?
=పాంచజన్యము.
*12.* భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు?
=పద్దెనిమిది (18)
*13.* “నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోథుడెవరు?
= వినోబా భావే.
*14.* “సంశయములు నన్నావరించినపడు, సంకటములు సంప్రాప్తమైనపుడు, నిరాశా నిస్పృహలు జనించినపుడు నేను భగవద్గీత తెరచి చూచెదను. అందు ఏదో ఒక శ్లోకము నన్నూరడించును.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?
= మహాత్మా గాంధీ.
*15.* భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు?
= సంజయుడు.
*16.* సేనానాయకులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=కుమారస్వామి.
*17.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి?
=దేవదత్తము.
*18.* భగవద్గీత యందు వ్యాసునిచే ఎన్ని ఛందస్సులు వాడబడినవి?
= ఐదు. (అనుష్టుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, ఉపజాతి, విపరీతపూర్వ.)
*19.* భగవద్గీతను సాక్షాత్తుగా (లైవ్) వినినవారెవరు?
=నలుగురు. అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు.
*20.* ఆయుధమును ధరించిన వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= శ్రీరామచంద్రుడు.
*21.* భగవద్గీత యందు శ్రీకృష్ణునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?
=అచ్యుత, అనంత, జనార్ధన.
*22.* భగవద్గీత యందు అర్జునునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?
=ధనుంజయ, పార్ధ, కిరీటి.
*23.* శ్రీకృష్ణపరమాత్మ తన అవతార సమయంలో రెండు గానములు చేసెను. ఒకటి మురళీగానం. మరి రెండవది ఏమిటి?
=గీతా గానం.
*24.* “ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్” అనే పేరుతో భగవద్గీతను ఆంగ్లభాషలో పద్యరూపమున వ్రాసిన ఆంగ్లకవి ఎవరు?
=ఎడ్విన్ ఆర్నాల్డ్.
*25.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదిన శంఖం పేరేమిటి?
=పౌండ్రము.
*26.* ఏకాదశ రుద్రులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=శంకరుడు.
*27.* “నా తల్లి చాలా కాలం క్రిందటే మరణించెను. కానీ అప్పటినుండి భగవద్గీత యను తల్లి ఆ స్ధానమును ఆక్రమించి, నా పక్కనే వుండి నన్ను కాపాడుచున్నది.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?
=మహాత్మాగాంధీ.
*28.* భగవద్గీత ఏ వేదములోనిది?
=పంచమ వేదం-మహాభారతం.
*29.* భగవద్గీత యందు ఎన్నవ అధ్యాయంలో భగవంతుని విశ్వరూప సందర్శన ప్రత్యక్షముగా వర్ణింపబడినది?
=11వ అధ్యాయము
*30.* ద్వాదశాదిత్యులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=విష్ణువు
*31.* భగవద్గీత మొదటి అధ్యాయం పేరేమిటి?
=అర్జున విషాద యోగము.
*32.* భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పబడిన మహారథుడు అనగా ఎంతమంది యోధులతో ఒక్కడే యుధ్ధము చేయగలడు?
=పదివేలమంది.
*33.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేమిటి?
=అనంతవిజయము.
*34.* భగవద్గీత మొదటి శ్లోకం ఏ పదం (శబ్దము)తో ప్రారంభమవుతుంది?
= “ధర్మ” - శబ్దముతో గీత ప్రారంభమయినది.
*35.* ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతీ విషయమును గీత సంవాదముతో సహా ఎప్పటికపుడు ప్రత్యక్షంగా (లైవ్) వివరించినదెవరు?
=సంజయుడు.
*36.* భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటిరోజున పాండవుల తరపున వ్యూహ రచన చేసినది ఎవరు?
=దృష్టద్యుమ్నుడు.
*37.* ఆయుధములలో తాను ఏ ఆయుధమని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వజ్రాయుధము.
*38.* మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల యుద్ధవ్యూహము పేరేమిటి?
=వజ్ర వ్యూహం.
*39.* గీతా సంవాదము జరిగిన మహాభారత సంగ్రామ మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు?
=భీష్ముడు.
*40.* సర్పములలో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వాసుకి.
*41.* అనేక తలలు గల నాగులలో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= అనంతుడు.
*42.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో నకులుడు ఊదిన శంఖం పేరేమిటి?
=సుఘోషము.
*43.* అర్జునుని ధనస్సు పేరేమిటి?
=గాండీవము.
*44.* జీవునకు ఈ శరీరమునందు ఎన్ని అవస్థలు కలుగునని శ్రీకృష్ణుడు చెప్పెను?
=నాలుగు. (బాల్యము, యౌవనము, వార్థక్యము, దేహాంతర ప్రాప్తి)
*45.* నదులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= గంగానది.
*46.* ఆత్మ యెట్టిది?
=నాశరహితమైనది.
*47.* కొంత ఆచరించి మధ్యలో వదిలివేసిననూ నిష్ఫలము కాని కర్మను ఏమందురు?
=నిష్కామ కర్మ.
*48.* మనుజునకు దేనియందు అధికారము కలదు?
=కర్మలు చేయుటయందు మాత్రమే. (ఫలమునాశించుట యందులేదు.)
*49.* అర్జునుడు ఎవరి లక్షణములు-భాష, నివాసము, నడవడిక తెలుపమని శ్రీకృష్ణుని అడిగెను?
=స్థితప్రజ్ఞుడు (జీవన్ముక్తుని లక్షణములు.)
*50.* వృక్షములలో తాను ఏ వృక్షమని శ్రీ కృష్ణుడు చెప్పెను?
= రావిచెట్టు.
*51.* పంచభూతములచే నాశనము పొందనిది ఏది?
=ఆత్మ.
*52.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో సహదేవుడు ఊదిన శంఖం పేరేమిటి?
=మణిపుష్పకము.
*53.* ప్రపంచమున పూర్ణానందమెచట లభించును?
=ఆత్మయందు.
*54.* మహాభారత సంగ్రామంలో అర్జునుని రధము యొక్క జెండాపై గల వానరుడెవరు?
=హనుమంతుడు.
*55.* పక్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= గరుత్మంతుడు.
*56.* ఏ జంతువు వలె యోగి అయినవాడు తన ఇంద్రియములను వెనుకకు మరల్చును?
=తాబేలు.
*57.* కర్మచేయుట మేలా, చేయకుండుట మేలా?
=చేయుటయే మేలు.
*58.* బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించునపుడు వారితో సహా మఱి వేనిని సృష్టించిరి?
=యజ్ఞములు (సత్కార్యములు, దైవకార్యములు)
*59.* వివేకవంతుడు కర్మలను ఎందుకు చేయవలెను?
=లోక క్షేమం కొరకు.
*60.* ఆవులలో తాను ఏ ఆవునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= కామధేనువు.
*61.* స్వధర్మ, పరధర్మములలో ఏది శ్రేష్ఠమైనది?
=స్వధర్మము.
*62.* పొగచేత అగ్నియు, మురికిచేత అద్దము, మావిచేత గర్భమందలి శిశువు కప్పబడి వున్నట్లు ఆత్మజ్ఞానము దేనిచే కప్పబడియుండును?
=కామము చేత.
*63.* దేని ప్రేరణచే జీవుడు తాను వద్దనుకొన్ననూ పాపమును చేయుచున్నాడు?
= కామము యొక్క ప్రేరణచే.
*64.* భగవంతుడెపుడు అవతరించును?
=ధర్మము క్షీణించి, అధర్మము వృద్ధిపొందునపుడు.
*65.* అసురులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ప్రహ్లాదుడు.
*66.* గంధర్వులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= చిత్రరథుడు.
*67.* హృదయ శుద్ధి తద్వారా మోక్షము దేనివలన కలుగగలదు?
=జ్ఞానతపస్సు.
*68.* జ్ఞానప్రాప్తి వలన కలుగు ఫలితమేమిటి?
=పరమశాంతి.
*69.* ఆత్మధ్యానమును అభ్యసించుచున్న యోగి యొక్క మనస్సు దేనితో పోల్చవచ్చు?
=గాలిలేనిచోట గల దీపంతో.
*70.* ఏ సాధనములచేత మనస్సు నిగ్రహింపబడగలదు?
=అభ్యాసము, వైరాగ్యము.
*71.* భయంకరమైన మాయను దాటుట ఎట్లు?
=భగవంతుని శరణుపొందుట వలన.
*72.* భగవంతుని సేవించువారిని ఎన్నిరకములుగా శ్రీకృష్ణుడు వర్గీకరించెను?
=నాలుగు రకాలు (ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని.)
*73.* భగవత్స్వరూపమును ఎవరు తెలిసికొనలేరు?
=అజ్ఞానులు.
*74.* విద్యలలోకెల్లా శ్రేష్ఠమైనది, అతిరహస్యమైనది ఏది?
=బ్రహ్మవిద్య.
*75.* మహర్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= భృగు మహర్షి.
*76.* బ్రహ్మవిద్యకు అర్హత యేమి?
=హృదయ శుద్ధి, అసూయాది దుర్గుణరాహిత్యము.
*77.* ఆకాశమునందు వాయువు వలె, సమస్త ప్రాణికోటి ఎక్కడ స్థితిగలిగి యున్నది?
=పరమాత్మయందు.
*78.* గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడెట్లు కాగలడు?
=పరమాత్మయందు అనన్యభక్తిచే.
*79.* ఎప్పటికీ దుర్గతి పొందనది ఎవరు?
=భగవంతుని భక్తుడు.
*80.* సమస్త ప్రాణికోటి యొక్క హృదయాంతరాళములందు నివసించు ప్రత్యగాత్మ ఎవరు?
=సాక్షాత్తు పరమాత్మయే.
*81.* ఇంద్రియములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=మనస్సు.
*82.* పర్వతములలో తాను ఏ పర్వతమని శ్రీకృష్ణుడు చెప్పెను?
=మేరువు.
*83.* పురోహితులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=బృహస్పతి.
*84.* వాక్కులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=ఓం కారము.
*85.* యజ్ఞములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు నుడివెను?
=జప యజ్ఞము.
*86.* ఏనుగులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ఐరావతము.
*87.* గుర్రములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ఉచ్ఛైశ్శ్రవసము.
*88.* శ్రీకృష్ణ భగవానునిచే ఆహారము ఎన్ని రకమలుగా పేర్కొనబడెను?
= మూడు (సాత్విక, రాజస, తామసాహారము)
*89.* దేవఋషులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= నారదుడు.
*90.* సిద్ధులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=కపిల మునీంద్రుడు.
*91.* భగవద్గీత చివరి అధ్యాయము పేరేమిటి?
= మోక్షసన్యాస యోగము.
*92.* లెక్కపెట్టువారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= కాలము.
*93.* జలచరాలలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= మొసలి.
*94.* ఆత్మను దేహమునందు ఉంచుటకు కారణమైన మూడు గుణములేవి?
= సత్త్వ, రజ, తమో గుణములు.
*95.* వేగముగా సంచరిస్తూ పవిత్రమొనర్చు వారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వాయువు.
*96.* భక్తియోగమైన పన్నెండవ అధ్యాయంలో భక్తుని లక్షణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?
= 35.
*97.* విద్యలోల తాను ఏ విద్యనని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ఆధ్యాత్మ విద్య.
*98.* రాగద్వేష రహితముగా, తత్త్వ నిశ్చయము కొరకు వాదించువారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వాదము.
*99.* అక్షరములలో తాను ఏ అక్షరమని శ్రీకృష్ణుడు చెప్పెను?
= "అ"-కారము.
*100.* భగవంతుని విశ్వరూప సందర్శనమును ఎవరు మాత్రమే చూసెను?
= అర్జునుడు. (వ్యాసుడు, వ్యాసుని వరం వలన సంజయుడు, రథ ధ్వజంపై అదృశ్యరూపంలో వున్న హనుమంతుడు కూడా)
*101.* మాసములలో తాను ఏ మాసమునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= మార్గశిరము.
*102.* క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగమైన 13వ అధ్యాయములో జ్ఞానగుణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?
= 20 (ఇరువది).
*103.* శ్రీకృష్ణ భగవానునిచే దైవగుణములు ఎన్ని పేర్కొనబడెను?
= 26 (ఇరువదియాఱు).
*104.* శ్రీకృష్ణ భగవానునిచే అసుర గుణములు ఎన్ని పేర్కొనబడెను?
= 6 (ఆఱు).
*105.* తపస్సులెన్ని రకములు?
= మూడు (శారీరక, వాచిక, మానసిక)
*106.* పరబ్రహ్మమునకు ఎన్నిపేర్లు కలవు?
= మూడు (ఓమ్, తత్, సత్).
*107.* మోక్షమును పొందుటకు కర్మలను వదలవలెనా?
= లేదు. కర్మలు చేయునపుడు భగవంతుని యందు మనస్సు లగ్నమై వుండవలెను.
*108.* సంజయుడు ఎవరి అనుగ్రహముచే ఈ గీతాసంవాదమును నేరుగా (లైవ్) వినగలిగెను?
వేదవ్యాసుడు.
16-13,14,15,16-గీతా మకరందము
16-13,14,15,16-గీతా మకరందము
దైవాసురసంపద్విభాగయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
ఇదమద్య మయా లబ్ధం
ఇమం ప్రాప్స్యే మనోరథమ్ |
ఇదమస్తీదమపి వేు
భవిష్యతి పునర్ధనమ్ ||
అసౌ మయా హతశ్శత్రుః
హనిష్యే చాపరానపి |
ఈశ్వరోఽహమహం భోగీ
సిద్ధోఽహం బలవాన్సుఖీ ||
ఆఢ్యోఽభిజనవానస్మి
కోఽన్యోఽస్తి సదృశో మయా |
యక్ష్యే దాస్యామి వెూదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః ||
అనేకచిత్తవిభ్రాన్తా మోహజాలసమావృతాః |
ప్రసక్తాః కామభోగేషు
పతన్తి నరకేఽశుచౌ ||
తాత్పర్యము:- (అసురసంపదగల వారు ఈ క్రింది విధముగా తలంచుచుందురు) - "ఈ కోరికను ఇపుడు నేను పొందితిని, ఈ కోరికను ఇకమీదట పొందగలను; ఈ ధనము ఇపుడు నాకు కలదు, ఇంకను ఎంతయోధనము నేను సంపాదింప గలను. ఈ శత్రువును నేనిపుడు చంపితిని, తక్కిన శత్రువులనుగూడ చంపగలను; నేను ప్రభువును; సమస్తభోగములను అనుభవించువాడను; తలంచినకార్యమును నెరవేర్ప శక్తిగలవాడను; బలవంతుడను; సుఖవంతుడను; ధనవంతుడను; గొప్పవంశమున జన్మించినవాడను; నాతో సమానమైనవాడు మఱియొక డెవడుకలడు? నేను యజ్ఞముల జేసెదను; దానముల నిచ్చెదను; ఆనందము ననుభవించెదను" - అని యీ ప్రకారముగ అజ్ఞానముచే మోహము (భ్రమ) నొందినవారును, అనేకవిధములైన చిత్తచాంచల్యములతో గూడినవారును, మోహము (దారాపుత్ర క్షేత్రాదులందు అభిమానము) అను వలచే బాగుగ గప్పబడినవారును, కామముల ననుభవించుట యందు మిగుల యాసక్తిగలవారును అయి, వారు (అసుర ప్రకృతి గలవారు) అపవిత్రమైన నరకమునందు పడుచున్నారు.
వ్యాఖ్య: - అసురసంపద నాశ్రయించువారి స్వభావము, చిత్తవృత్తి యెట్లుండునో ఈ శ్లోకములందు శ్రీకృష్ణపరమాత్మ చాల విశదముగ వర్ణించిరి. అసురగుణయుతులు ఈ దృశ్యప్రపంచమును శాశ్వతమని నమ్మి, ఆ క్షణికపదార్థములందే పేరాశగల వారై, ఆ యా వస్తుసంపాదనమునే గొప్పగ దలంచుచు గర్వముతో పలుకు వాక్యము లిచట చక్కగ నుదుహరింపబడినవి. ఈ వాక్యములందు ఆ యసురస్వభావుల యొక్క అహంభావము, దర్పము, గర్వము ప్రస్ఫుటితమగుచున్నవి.
కోరికలను అనుభవించిన కొలది అవి ఇంకను పెరుగునేకాని తరగవు. కనుకనే వారు ఒక్కొక్క కోరికను అనుభవించుచు ఇంకను ఎన్నిటినో అనుభవించవలెనను కుతూహలము గలిగియుందురని చెప్పబడినది. మఱియు "నేను గొప్పవాడను. నాతో సమానమైన వాడెవడు?" అని విఱ్ఱవీగుచు గర్వాహంకారయుతులై వారు పెక్కు చిత్తవికారములు కలిగి అశాంతికిలోనై, తుదకు ఫెూరనరకములనే పొందగలరని యిచట పేర్కొనబడుట వలన ఆ దుర్గుణములన్నిటిని వివేకవంతుడు తప్పక త్యజించవలెనని స్పష్టమగుచున్నది. ఈ శ్లోకములందు వారు గావించు దోషములు, ఆ దోషములయొక్క దుష్ఫలితము - రెండును చెప్పబడినవి. నరకప్రాప్తియే ఆ దుష్ఫలితము. అజ్ఞానులీ ప్రపంచమున ఏమో సుఖమనుభవించుచున్నట్లు పైకి గోచరించినను లోన అనేక మనోవ్యథలను, చిత్తచాంచల్యములను, అనుభవించుచు తుదకు అపవిత్రమగు నరకమునే పొందుదురు. వారనుభవించు విషయసుఖములు రాజససుఖములేకాని సాత్త్వికసుఖములు కావు. రాజససుఖములు కడకు దుఃఖములుగనే పర్యవసించును.
"యజ్ఞముల జేయుదును, దానముల నిచ్చెదను" అని వారు పలుకుట డంబమునకే గాని, వాస్తవముగగాదు. ఒకవేళ వారా యజ్ఞాదులను చేసినను, పరులమెప్పును సంపాదించుటకేగాని, సదుద్దేశ్యముతో గాదు. వారు కావించు ఆ యజ్ఞాదులు పేరునకు మాత్రమే యని 17వ శ్లోకమున భగవానుడు చెప్పుబోవుదురు. (నామయజ్ఞైస్తే).
ఇచట "సక్తాః” అని చెప్పక “ప్రసక్తాః” అని చెప్పుటవలన వారు విషయభోగములందు లెస్సగ ఆసక్తులైయుందురని తెలియుచున్నది. మఱియు "పతన్తి” అని పేర్కొనుటవలన వారు పతనమునే పొందుదురుగాని అభివృద్ధిని గాదని భావము. ఈ శ్లోకములనుబట్టి ప్రపంచములో మనుజులు ఎంత బలము, ఎంత ధనము, ఎంత కీర్తి, ఎంత ఐశ్వర్యము గలిగియున్నప్పటికిని చిత్తశుద్ధిలేనిచో, అహంకారము, గర్వము తొలగనిచో తుదకు పతనమునే పొందగలరని విదితమగుచున్నది.
ప్రశ్న:- అసురసంపదగల వారింకను ఎట్లు ప్రవర్తించుదురో తెలియజేయుడు?
ఉత్తరము:- వారు “ఈ కోరిక ఇపుడు నెరవేరినది. ఆ కోరిక త్వరలో నెరవేరగలదు; ఈ ధనమిపుడున్నది, ఆ ధనము త్వరలో సమకూడగలదు; నేను ఈ శత్రువును చంపితిని, మిగిలిన శత్రువులను గూడ చంపెదను. నేను ప్రభువును; నేను భోగిని; నేను కార్యసిద్ధిగలవాడను; నేను బలవంతుడను; నేను సుఖవంతుడను; నేను ధనవంతుడను; నేను గొప్పకులమందు జన్మించిన వాడను; నాతో సమానుడెవడు? నేను యాగములను చేయుదును, దానములను చేయుదును, ఆనందము ననుభవించెదను!" అని గర్వముతో అజ్ఞానమువలన పలుకుచుందురు. అనేక చిత్తవికారములుగల్గి భ్రాంతి జెందియుందురు. మఱియు మోహము (అజ్ఞానము, అభిమానము) అను వలచే జుట్టబడియుందురు.
ప్రశ్న:- ఇట్టి లక్షణములు గలవారికి ఏగతి లభించును?
ఉత్తరము: - వారు అపవిత్రమగు నరకమందు పడుదురు.
ఊహలకు
📓📓📓📓📓📓📓📓📓
_*పిల్లల ఊహలకు రెక్కలు తొడగండి.*_
👸🤴👸🤴👸🤴👸🤴👸
_*కథలతో సృజనాత్మక ఆలోచనా సామర్థ్యం సాధ్యం*_
*మురళీకృష్ణ*
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
*అనగనగా ఓ పేద పండితుడు. ఆయన పాండిత్యానికి మెచ్చి రాజు ఏం కావాలో కోరుకోమన్నాడు. ‘రాజా! నాకు మీ కష్టార్జితం ఏదైనా ఉంటే ఇవ్వండి’ అని అడిగాడు ఆ పండితుడు! మారువేషంలో రాత్రంతా కట్టెలు కొట్టి, రెండు అణాలు సంపాదించి.. సమర్పించాడా మహారాజు! వాటిని తీసుకుని ఇంటికి వెళ్లిన పండితుడిపై ఆయన భార్య కేకలేసింది. ‘రాజు వరమిస్తే.. ఆయన కష్టార్జితం అడుగుతావా? ఈ ముష్టి రెండణాలు ఎవరిక్కావాలి?’ అంటూ వాటిని మంటల్లో విసిరేసింది.*
*ఒక్కసారిగా అగ్ని జ్వాల ఎగిసిపడింది. చూస్తుండగానే వారి ఇల్లు బంగారం అయింది. ఎంత తీసినా అగ్నిహోత్రం నుంచి వస్తూనే ఉన్న బంగారు నాణేలు చూసి ఆ ఇల్లాలు నివ్వెరబోయింది. ‘చూశావా! ఇదీ కష్టార్జితం గొప్పతనం!’ అన్నాడా పండితుడు. కష్టార్జితం వేయిరెట్ల ఫలితాన్ని ఇస్తుందని అమ్మమ్మ చెప్పిన కథ ఇది.*
*కథ అంటే నీతి..కథ ఒక రీతి.. కథ అంటే నిజాయితీ! పిల్లలను చేరదీసి కథలు చెప్పండి..ఆ కథలే పిల్లలను వేలు పట్టి నడిపిస్తాయి. ‘నీతి చంద్రిక’లై దారి చూపుతాయి. రోబోటిక్ యుగంలో ఉన్నా.. అంతరిక్షంలో కాలనీలు కట్టినా.. చందమామ కథలు చెప్పాల్సిందే!* *‘బాలమిత్ర’ వంటి పుస్తకాలు కావాల్సిందే!* *ఎందుకంటే ఆ కాల్పనిక శక్తే మానవ జాతిని ఇంతవరకూ నడిపించింది. పసి మనసుల్లో..*
*ఎందుకు, ఏమిటి, ఎలా?*
*అన్న ప్రశ్నలను ఉదయింపజేసి..*
*పరిష్కారాలను ప్రసరింపజేసింది. అందుకే ‘కథలు చెప్పకు’ అని పిల్లలను ఎప్పుడూ చిన్నబుచ్చకండి. వాళ్ల కథలు వినండి. సమయం లేదని సాకులు చెప్పకుండా..ఎంచక్క పిల్లలకు కథలు చెప్పండి! సందర్బా నుసారంగా వారికి ఓ చక్కని కథల పుస్తకాన్ని బహూకరించండి! వారి కళ్లలోని వెలుగులో ఎన్ని కలలో..ఎన్ని కథలో..!!*
*కథలు మేలుకొలుపులు! వినేకొద్దీ ఇంకా వినాలనిపిస్తాయి. చదివే కొద్దీ ఇంకా చదవాలనిపిస్తాయి. చెప్పేకొద్దీ ఇంకా చెప్పాల నిపిస్తాయి. అసలు ఒక్క కథతో ఎలా సంతృప్తి చెందగలం? అమ్మమ్మ కథ చెబుతుంటే చందమామకు కునుకు రావాలిగానీ పిల్లలు నిద్రపోతేకదా! అమ్మమ్మా.. ఇంకా చెప్పు..తాతయ్యా..ఇంకోటి చెప్పు.. అని అడుగుతూనే ఉంటారు పిల్లలు! ఒక రాత్రా..రెండు రాత్రులా..? జీవితాంతం చెప్పినా తరగని కథలు! పిల్లలకు దారి చూపే వెలుగు రేఖలు!*
_*కథ ఎందుకు చెప్పాలి*_
*‘జ్ఞానం కంటే ఊహాశక్తి చాలా గొప్పది’ అన్నాడు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్! ఈ మాట అక్షరాలా నిజం! పిల్లల్లో ఆ ఊహాశక్తిని పెంపొందించడానికి కథ చెప్పడం ఓ చక్కని మార్గం! అనగనగా..అనగానే పిల్లలు ఊహా ప్రపంచంలోకి వెళ్లిపోతారు. కథలోని పాత్రల్లో తమను తాము ఊహించుకుంటారు. దృశ్యాన్ని చూస్తే అనుభూతి లభిస్తుంది. కానీ ఆలోచించే అవసరం ఎక్కువ ఉండదు. కానీ కథ చెప్పడం, చదవడం, వినడం వల్ల పిల్లల కాల్పనిక జగత్తు విస్తృతమవుతుంది. సృజనాత్మక సామర్థ్యం పెరుగుతుంది. కథతోబాటు ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అలా ఎందుకు? ఇలా ఎందుకు? అని అడుగుతారు. దీంతో వారి ఆలోచనా పరిధి పెరుగుతుంది. ప్రశ్నించే తత్త్వంతోబాటు సమస్యలను పరిష్కరించే సామర్థ్యం అలవడుతుంది. అన్నిటికీ మించి వివిధ పదాలను పరిచయం చేస్తూ భాషా సంపత్తిని పెంచడానికి కథలు దోహదం చేస్తాయి.*
*కథ చెప్పడం ఓ కళ! పిల్లల మనస్సులకు హత్తుకునే విధంగా కథ చెప్పాలి.కథ చదివి వదిలేసేది కాదు. అది మనల్ని సంస్కరిస్తుంది. కౌసల్య చెప్పిన కథలు రామయ్యను ఽధర్మ నిరతుడ్ని చేశాయి. ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అని లోకం కీర్తించేలా చేశాయి. కథలతో ఆర్యాంబ నేర్పిన సంస్కారం శంకరులను జగద్గురువును చేసింది. తల్లి భువనేశ్వరీదేవి చెప్పిన గాధలు వివేకానందుడిని సనాతన సారథిని చేశాయి. అమ్మ చెప్పిన కథలు రవీంద్రుడిని కవీంద్రుడిని చేశాయి. రొట్టెలు తినిపిస్తూ.. తారలను చూపిస్తూ.తల్లి చెప్పిన కథలు అబ్దుల్ కలామ్‌ను మేధావిగా తీర్చిదిద్దాయి.*
www.bestsocialteacher.com
_*ప్రశ్నించి.. ఆలోచింపజేసే కథలు*_
*తెనాలి రామకృష్ణ కథలు, విష్ణుశర్మ ‘పంచతంత్రం’, చిన్నయసూరి ‘నీతి చంద్రిక’, కాశీమజిలీ కథలు, పేదరాసి పెద్దమ్మ కథలు, విక్రమార్క భేతాళ కథలు, అక్బర్ బీర్బల్ కథలు, పరమానందయ్య శిష్యుల కథలు మొదలైనవి..*
*మీ పిల్లలు తెలివైనవాళ్లుగా ఎదగాలనుకుంటే వాళ్లకు మంచి కాల్పనిక కథలను చదివి వినిపించండి.*
_*ఐన్‌స్టీన్, భౌతిక శాస్త్రవేత్త*_
*మీరెప్పుడూ చదవని పుస్తకాన్ని మీ పిల్లలకు ఇవ్వకండి. ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించండి*.
_*జార్జ్ బెర్నార్డ్ షా, ప్రఖ్యాత ఐరిష్ రచయిత*_
*ఇక ఈ తరం చిన్నారులు మాతృభాషలో చదవడం లేదు.*
*తెలుగు కథ, పద్యం తెలియకుండానే చదువులు పూర్తయిపోతున్నాయి.* *పిల్లల్లో సృజనను పెంపొందించే శక్తి ఉన్న కథలను ముందుతరాలకు అందించాలనేదే నా/ మన తపన, ఆశయం.*
*వీలయినంత మంచి కథలను పిల్లలకు అందించే ప్రయత్నం చేయండి.*
📓📓📓📓📓📓📓📓📓
*సేకరణ:కెయస్వీ కృష్ణా రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, గంటి, కొత్తపేట మండలం, తూర్పుగోదావరి, 9492146689.*
www.bestsocialteacher.com
*Admin, best social teacher whatsapp groups.*
📓📓📓📓📓📓📓📓📓
_*If like this msg forward it without editing. It is the only respect we can give to the writer and collector. Hope you will.*_
📓📓📓📓📓📓📓📓📓
భగవద్గీతను
మీరు ఏ ఊర్లో ఉన్నా, మీ ఇంట్లోనే ఉంటూ, మీకు నచ్చిన సమయములో, మీ మొబైల్ ఫోన్ ద్వారా భగవద్గీతను ఉచితముగా నేర్చుకునేందుకు వీలుగా భగవద్గీత 18 అధ్యాయములు, 700 శ్లోకములను అర్ధాలతో సహా రికార్డ్ చేసి వెబ్ సైట్ లో పెట్టాము. మీరు చేయవలసిందల్లా http://learnbhagavadgitaonline.org అనే వెబ్ సైట్ ఓపెన్ చేసి, మీ భగవద్గీత పుస్తకమును తెరచి, 1వ అధ్యాయము 1వ శ్లోకము నుండి మొదలు పెట్టి, రోజుకి పది శ్లోకములను అర్థాలతో సహా నేర్చుకోండి. 70 రోజులలో మీరు భగవద్గీత 700 శ్లోకములను చదవగలుగుతారు. భగవద్గీతను చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. ఎంతోమంది భగవద్గీతను నేర్చుకోవాలి అనుకున్నా నేర్పించేవారులేక నేర్చుకో లేకపోతున్నారు. దయచేసి ఈ మెసేజ్ ను వాళ్ళందరికీ అందేటట్టు వీలైనంత మందికి ఫార్వర్డ్ చేయండి సుదర్శన్ ఫైర్ సేఫ్టీ
అమ్మాయిలకు ₹24 వేలు స్కాలర్‌షిప్..*
*అమ్మాయిలకు ₹24 వేలు స్కాలర్‌షిప్..*
*దరఖాస్తుకు ఈనెల 31 ఆఖరు తేది..!*
ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిలను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించడానికి *విప్రో* సంస్థ.. సంతూర్ ఉపకారవేతనాలను అందిస్తోంది.
పేదరికం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులకు వెళ్లలేని అమ్మాయిలను ఆర్థికంగా ఆదుకొని.. ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించడానికి విప్రో సంస్థ.. సంతూర్ ఉపకారవేతనాలను అందిస్తోంది. తాజాగా ఈ స్కాలర్‌షిప్ ప్రకటన వెలువడింది. ఇంటర్ పూర్తిచేసిన అమ్మాయిలు దరఖాస్తు చేసుకోవచ్చు.
సంతూర్ ఉమెన్స్ స్కాలర్‌షిప్
2016-17 నుంచి:
ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యం ఉన్న బాలికలను చదువులో ప్రోత్సహించడానికి విప్రో కన్సూమర్ కేర్, విప్రో కేర్స్ కలిసి 2016-2017 విద్యా సంవత్సరం నుంచి వీటిని అందిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మూడు రాష్ట్రాల నుంచి ఏడాదికి 900 మందికి ఈ ప్రోత్సాహకాలు అందజేస్తున్నారు. గత నాలుగేళ్లలో 3600 మంది విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్ తోడ్పాటుతో ఉన్నత చదువులు కొనసాగిస్తున్నారు.
*విప్రో స్కాలర్‌షిప్:*
ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థినులకు మూడేళ్లు లేదా కోర్సు పూర్తయినంత వరకు ప్రతినెలా రూ. రెండువేల చొప్పున స్కాలర్‌షిప్ ఇస్తారు. డబ్బు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమవుతుంది. ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, ఇతర సదుపాయాల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు.
*Must read:*
డిగ్రీ, బీటెక్, ఇతర యూజీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు.. దరఖాస్తులు ప్రారంభం..!
*అర్హతలు:
1) పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కాలేజీల్లోనే చదివుండాలి.
2) ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పేద బాలికలే ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు.
3) 2019-20 విద్యాసంవత్సరంలో ఇంటర్ లేదా సమాన స్థాయి కోర్సులు పూర్తిచేసినవారై ఉండాలి.
4) 2020-21లో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ మొదటి సంవత్సరం కోర్సుల్లో చేరి ఉండాలి.
5) కనీసం మూడేళ్లు, ఆపై వ్యవధితో ఉన్న డిగ్రీ కోర్సుల్లో చేరినవారే ఈ స్కాలర్‌షిప్పు పొందడానికి అర్హులు.
6) హ్యుమానిటీస్, లిబరల్ ఆర్ట్స్, సైన్స్ కోర్సుల్లో చేరినవారికి, వెనుకబడిన జిల్లాలకు చెందినవారికి ఎంపికలో కొంత ప్రాధాన్యం ఉంటుంది.
7) అకడమిక్ మెరిట్ ప్రాతిపదికన అర్హులను ఎంపిక చేస్తారు.
*సంతూర్ స్కాలర్‌షిప్ ముఖ్య సమాచారం:*
*దరఖాస్తు విధానం:* అప్లికేషన్ ఫామ్‌ను సంస్థ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింటవుట్ తీసుకోవాలి. అందులో పూర్తి వివరాలను నింపి పోస్టు ద్వారా పంపాలి. దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
*దరఖాస్తుకు చివరి తేది:* అక్టోబరు 31, 2020
*దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:* విప్రో కేర్స్- సంతూర్ స్కాలర్‌షిప్, దొడ్డకన్నెల్లి, సర్జాపూర్ రోడ్డు, బెంగళూరు - 560035, కర్ణాటక.
*వెబ్‌సైట్:* http://www.santoorscholarships.com/
*ఆసక్తిగల అభ్యర్థులు* https://www.santoorscholarships.com/ పై క్లిక్ చేయండి.
ఈ పోస్ట్ మీకు ఉపయోగపడకపోవచ్చు. కానీ మీరు పనిచేస్తున్న గ్రామాల్లోని విద్యార్థినులకు ఉపయోగపడుతుంది. వీలైతే వారికి..!
బహుజన హితాయ బహుజన సుఖాయ - బుద్ధ
Maximum Help to Maximum People - Buddha
తదుపరి కల (లక్ష్యం)
ఒక మనిషికి 18,000 కోట్ల రూపాయల ఆస్తులుంటే.. తన తదుపరి కల (లక్ష్యం) ఏముంటుంది? ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిలా ఓ మారుమూల గ్రామానికి వెళ్లి అక్కడ పేద పిల్లలతో కలిసి జీవిస్తూ వారికి పాఠాలు నేర్పించాలనే లక్ష్యమైతే ఎవరికీ ఉండకపోవచ్చు. పిల్లలకు రెండు పూటలా కడుపు నిండా భోజనం పెడుతూ, వారితో కలిసి క్రికెట్ ఆడుతూ, టీ తాగుతూ కాలక్షేపం చేస్తున్న ఈ వ్యక్తి పేరు టెంకాసి శ్రీధర్ వెంబు (53). అమెరికాలోని ప్రపంచ ప్రసిద్ద సిలికాన్ వ్యాలీలో ఓ పెద్ద కంపెనీకి యజమాని ఆయన. అయినా, అవన్నీ వదిలేసి తాను పుట్టి పెరిగిన మట్టి వాసనలు వెతుక్కుంటూ స్వదేశం వచ్చేశారు. తమిళనాడులోని మారుమూల గ్రామం మాథాలంపరైలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
తాను పుట్టిన గడ్డపై ఉన్న మమకారమే శ్రీధర్‌ను ఇక్కడికి రప్పించింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ఆయన ఎంతో విలువనిస్తారు. కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించినా.. సాదాసీదా షర్టు, తెల్లని లుంగీ ధరించి గ్రామానికి చెందిన పిల్లలలో ఆయన కలిసిపోయిన తీరు చూస్తే.. ఆయన ఎంతటి నిరాడంబరుడో ఇట్టే అర్థమవుతుంది.
తమిళనాడుకు చెందిన అతి సాధారణ కుటుంబంలో జన్మించిన శ్రీధర్ వెంబు.. ఐఐటీ, మద్రాస్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. అనంతరం అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడ సిలికాన్ వ్యాలీలో Zoho Corporation పేరుతో సాఫ్ట్‌వేర్ కంపెనీని ప్రారంభించారు. దానికి సీఈవోగా వ్యవహరిస్తున్న ఆయన.. ఇప్పుడు అవన్నీ వదిలేసి స్వగ్రామానికి వచ్చేశారు. మాథాలంపరై గ్రామ వీధుల్లో పిల్లలతో కలిసి సైకిల్‌పై తిరుగుతున్నారు.
పేద పిల్లలను ఉన్నత చదువులు చదివించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడేలా చేయాలనేది శ్రీధర్ లక్ష్యం. లాక్‌డౌన్‌లో ప్రయోగాత్మకంగా ఆయన ముగ్గురు చిన్నారులను చేరదీసి పాఠాలు చెప్పడం ప్రారంభించారు. ప్రస్తుతం ఆ సంఖ్య 25 మంది విద్యార్థులు, నలుగురు టీచర్లకు చేరింది. ఆ విద్యార్థులందరికీ ఉచితంగా ఆహారం అందిస్తూ తరగతులు చెప్పిస్తున్నారు.
ఇప్పుడు అది ఇక ఎంతమాత్రం ప్రయోగం కాదని శ్రీధర్ వెంబు చెబుతున్నారు. త్వరలో ఆయన సరికొత్త ఎడ్యుకేషన్ స్టార్టప్‌ను ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. శ్రీధర్ అంచనా ప్రకారం.. రాబోయే కొన్నేళ్లలో తన స్టార్టప్ ద్వారా రూరల్ ఇండియాలో 8,000 టెక్నాలజీ ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నారు. అంతేకాదు, ఇకపై గ్రామాలు పట్టణాలకే ప్రపంచ స్థాయి సేవలు అందించే విధంగా ఎదుగుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించమే కాకుండా అత్యాధునిక వసతులో హాస్పిటళ్లు నిర్మించడం, సాగునీటిని అందించడం, మార్కెట్లు, నైపుణ్య కేంద్రాల ఏర్పాటు స్థాపించాలని శ్రీధర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆవిధంగా ఆయన తాను పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని భావిస్తున్నారు.
ప్రేమ లక్ష్మీనారాయణ్ అనే వైద్యురాలు ట్విటర్ ద్వారా ఈ వివరాలన్నీ తెలిపారు. శ్రీధర్ వెంబు ఉదారతను పొగుడుతూ ఆమె వరుస ట్వీట్లు చేశారు. ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారిందతి. శ్రీధర్ గొప్పదనాన్ని కీర్తిస్తూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొంత మంది తాము చేస్తున్న చిన్న చిన్న మంచి పనుల గురించి వివరించారు.
‘దేశంలో ఎన్ని వార్తా ఛానెళ్లు దీని గురించి వార్తలు వేస్తున్నాయో, ఎంత మంది రిపోర్టర్లు దీని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు.. కానీ, ఇలాంటి వాళ్లు ఉండబట్టే దేశం ఇంకా సరైన దారిలో ఉంది’ అని డాక్టర్ ప్రేమ లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు.
మహాభారతము ' ...56 .
మహాభారతము ' ...56 .
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /
దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//
సభా పర్వం.
పాండవులు తాము మాయాద్యూతంలో పోగొట్టుకున్న సంపదనంతా తిరిగిపొంది ఇంద్రప్రస్థం చేరుకోగానే, అక్కడ హస్తినలో దుష్ట చతుష్టయం నిరాశకు గురయ్యారు. తాము పన్నిన పన్నాగం వృధా అయిపోయిందని చింతించారు.
తిరిగి పాండవుల సంపదని కాజేయాలని మరో పధకానికి రూపకల్పన చేశారు. మళ్ళీ ధృతరాష్ట్రుని బుట్టలోవేసుకుని ఆపధకానికి అంగీకారంపొందే ఉద్దేశ్యంతో యింకొకసారి, ధృతరాష్ట్రుని చేరారు దుష్టచతుష్టయం.
ఈసారి, దుర్యోధనుడే తండ్రిని వప్పించడానికి పూర్తి బాధ్యత తీసుకున్నాడు. ' తండ్రీ !వారు చేసిన శపధాలు విన్నారు కదా ! శపధాలు చేసి వెళ్ళినప్పటినుండీ మాకు యిక్కడ నిద్రాహారాలు లేవు. సరదాగా ఆడిన ద్యూతక్రీడ మా ప్రాణాలకే ముప్పు తీసుకు వచ్చేటట్లున్నది.. అర్జునుడు పైకి యేమీ మాట్లాడకపోయినా అతని క్రోధదృక్కులు మమ్ములను కాల్చివేస్తాయేమో అనిపించింది. మేము భీమార్జునులను యెదిరించి పోరాడాలంటే, జయాపజయాలు దైవాధీనాలు. వారు కసితో రగులుతున్నారు గనుక, యుద్ధమంటూ జరిగితే వారే విజయం సాధిస్తారు. '
' మేము యేశత్రుభయం లేకుండా రాజ్యం ఏలుకోవాలంటే, ఆ పాండవులను, మరియొకసారి ద్యూతానికి పిలువవలసిందే. ఈసారి, ఒకేపందెంతో విజయం వరించేటట్లు ద్యూతం ఆడుతాము. ఆ ఒక్కపందెంలో ఓడినవారు పన్నెండు సంవత్సరములు అరణ్యవాసము, ఒక సంవత్సరం అజ్ఞాతవాసము చెయ్యాలి. అజ్ఞాతవాసంలో వారి వునికి గెలిచినవారు కనిబెడితే, ఓడినవారు తిరిగి పన్నెండు యేళ్లు అరణ్యవాసము , అజ్ఞాతవాసము చెయ్యవలసివుంటుంది. ఈ నియమాలతో మళ్ళి ద్యూతం ఆడే అనుజ్ఞ యివ్వండి తండ్రీ ! ' అని ప్రాధేయపడ్డాడు.
ధృతరాష్ట్రుడు ఒకింత సంతోషించిాిి, వెంటనే, ' ఎందుకో నామనసు అంగీకరించడం లేదు. వారిని మట్టుపెట్టవలెనని చిన్ననాటినుండీ నీవు ప్రయత్నిస్తున్నావు. నీ వలన అగుటలేదు. ప్రతిసారీ నలుగురిలో నేను చిన్నబుచ్చుకోవలసిన పరిస్థితి యేర్పడుతున్నది. ' అన్నాడు.
' మీరు కలుగ జేసుకోకుండా వుండివుంటే, ఈపాటికి పాండవ రాజ్యలక్ష్మిని, పాండవ పట్టమహిషిని పాదాక్రాంతులం చేసుకునేవారమే కదా జనకా ! అందుకని యింకొక్క అవకాశం మాకివ్వండి. పాండవులను ద్యూతానికి ఆహ్వానించండి. ఈసారి మా గురి తప్పదు. పందెం కూడా ఒకసారే వేస్తాము కాబట్టి అనవసర రాద్ధాంతము, సభలో విమర్శలు వుండవు. ' అనిచెప్పి తండ్రిని ఒప్పించాడు.
కానీ గాంధారి అంతావిని, వారికి అనుమతి యివ్వవద్దని చెప్పింది ధృతరాష్ట్రునితో. పాండవులను అడవికి పంపే యోచన విరమించుకోమన్నది. అదేజరిగితే, మన కౌరవ వంశనాశనానికి నీవే ముహూర్తం పెట్టినట్లు అవుతుంది. ' అన్నది. దానికి ధృతరాష్ట్రుడు ' దేవీ ! నీకొక సత్యము చెప్పవలెను . నాకు దుర్యోధనుని నియంత్రించే శక్తిలేదు. నేను వలదు అనిచెప్పినా, నన్ను బలవంతంగా ఒప్పించి తనపంతము నెరవేర్చుకుంటాడు. కానున్నది కాకమానదు. పుత్రక్షయం, వంశక్షయం అనుభవించవలసిన వ్రాత, మన నుదిటిపై వుంటే అలాగే జరుగుతుంది. ' అని నిస్సహాయంగా అన్నాడు.
వెంటనే, పాండవులకు వర్తమానం వెళ్ళింది. తాము ఇంద్రప్రస్థం చేరీ చేరకుండానే, మలివిడత యీఆహ్వానం రావడం వారిని వ్యాకులపరచింది. తమ కర్మఫలాలు, యీ విధంగా వెంటాడుతున్నవని, పెదతండ్రిగారి ఆజ్ఞ ధిక్కరించే అధికారం తనకులేదని, మళ్ళీ హస్తినాపురానికి ద్యూతక్రీడకు పయనమయ్యాడు, తమ్ములతో, భార్యతో సహా. శకుని మోసపూరిత ఆటను గ్రహించికూడా, కేవలం పెదతండ్రిని సంతృప్తి పరచడానికి మళ్ళీ వచ్చాడు ధర్మరాజు. ఎంత విచిత్రము !. స్వంతకుమారుడు తనమాట వినడని, కుమారుని దుష్ట ఆలోచనలకు ధృతరాష్ట్రుడు తలవొగ్గితే, పెదతండ్రి ఆజ్ఞ దాటరానిదిగా, ధర్మజుడు భావించాడు.
ద్యూతక్రీడాభవనం లోకి సదస్యులు అందరూ వచ్చారు. శకుని ఆట నియమాలను చెప్పగానే, వచ్చినవారంతా నిశ్చేష్టులయ్యారు. భయంతో చలించిపోయారు. పాండవులకు రానున్న ప్రమాదం పసిగట్టారు.
భీష్మ, ద్రోణ, కృప, విదురులు ఆట ప్రారంభించకముందే చెప్పారు, యీ ఆట ఆడవద్దని వారించారు. అయినా సరే, తనకు అన్నీ తెలిసే వున్నా, ధృతరాష్ట్రుని మాట కాదనలేక, యీ విషవలయం లోనికి అడుగుపెట్టానని చెప్పాడు. పెదతండ్రి వంచనను పసిగట్టిన, ధర్మరాజు ధర్మానికి కట్టుబడి వున్నాడు. క్రీడకు సరేనన్నాడు.
క్రీడకు సిద్ధంగా వున్న శకుని, ' ధర్మజా ! నీవు సిద్ధమే కదా ! ఆట ఒక్కసారి పాచికలు వేయడంతో ముగుస్తుంది. నీ సంఖ్య యెంతో చెప్పు ' అన్నాడు. ధర్మరాజు నిస్సహాయంగా, ఆటకు సిద్ధమయి,శకుని పాచికలు వేసివేయగానే, బిగ్గరగా, ' విజయం మాదే ' అనేటప్పటికి హతాశుడయ్యాడు.
ధర్మజుడు రెండవసారి కూడా మాయాజూదంలో మోసపోయాడు. మొదటిసారి ఓడినప్పుడు అమాయకత్వం కావచ్చు. . రెండవసారి ఓడడమంటే, విధిలిఖితమే.
పాండవులు ద్రౌపదితో సహా, మృగచర్మాలు ధరించి వనవాసానికి బయలుదేరారు. వారిని చూసి, దుశ్శాసనుడు, దుర్యోధనుడు విపరీత, అశ్లీల వ్యాఖ్యానాలు చేశారు. వారికి భీమసేనుడు తానుచేసిన శపధాలు గుర్తుచేసి, ఆరోజుకు యెదురుచూస్తుండమని చెప్పాడు.
' అనుచితమైన సలహాలు ఇచ్చిన ఆ సూతపుత్రుడు కర్ణుని యమపురికి పంపుతాను. వాని అనుచరులలో ఒక్కరినికూడా వదలను. ' అన్నాడు అర్జునుడు.
నకులుడు అయితే, ' ఓరీ మాయాద్యూత విశారదా ! శకునీ ! నీ పాచికలు పని చెయ్యని రణరంగంలో, నిన్ను చీల్చి చెండాడుతాను. ' అన్నాడు.
విదురుడు , కుంతిని కుమారుల వనవాస సమయంలో, తమ ఇంట వుండమని ఆహ్వానించి, తన విజ్ఞతను చాటుకున్నాడు. ఆమె వనవాసానికి వెళ్లకుండా ఆపాడు.
పెద్దలందరినుండీ వనవాసానికి అనుజ్ఞపొంది ధర్మజుడు, అతని సోదరులూ, ప్రయాణం కొనసాగే ముందు కుంతిని కలిసి నమస్కరించారు. ద్రౌపదినిచూసి, దుఃఖం ఆపుకోలేక, కంట తడి పెట్టుకుని, నీ ధర్మనిష్ఠ, సదాచారమే, నీకు రక్షగా ఉంటాయి అని చెప్పింది. అందరిలోకి చిన్నవాడైన సహదేవుని జాగ్రత్తగా చూసుకొమ్మని చెప్పింది.
యుధిష్టురుడు ముందు నడుస్తూ వుంటే, మిగిలిన సోదరులూ, ద్రౌపదీ, వారి పురోహితులు ధౌమ్యులవారితో వెంట నడుస్తున్నారు.
ధృతరాష్ట్రుడు ద్యూత క్రీడకు అనుమతి అయితే యిచ్చాడుగానీ, జరిగిన విపరీత పరిణామాలకు, తట్టుకోలేక, గాంధారి వద్ద తన వ్యధను చెప్పుకున్నాడు. ఇంకా దుఃఖం ఆగక, మనశ్శాంతి కరువై, విదురుల వారిని పిలిపించాడు.
పాండవుల పయనం సాగుతున్నది.
స్వ స్తి.
వ్యాసానుగ్రహంతో మరికొంత సోమవారం నాడు....తెలుసుకుందాం.
తీర్థాల రవి శర్మ
9989692844
శ్యామలా దండకం*
*శ్యామలా దండకం*
మాణిక్య వీణా ముఫలాలయంతీం
మదాలసాం మంజుల వాగ్విలాసామ్
మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం
మాతంగకన్యాం మనసా స్మరామి
చతుర్భుజే చంద్రకళావతంసే
కుచోన్నతే కుంకుమ రాగశోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే
నమస్తే జగదేకమాతః
మాతా మరకత శ్యామా
మాతంగీ మధు శాలినీ
కుర్యాత్కటాక్షం కళ్యాణీ
కదంబ వనవాసినీ
జయ మాతంగ తనయే
జయ నీలోత్పల ద్యుతే
జయ సంగీత రసికే
జయ లీలా శుకప్రియే
జయ జనని
సుధాసముద్రాంత రుద్యన్మణీద్వీప
సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమాకల్ప
కాదంబ కాంతారవాసప్రియే కృత్తివాసప్రియే
సాదరారబ్ధ సంగీత సంభావనా
సంభ్రమాలోల నీపస్రగాబద్ధ
చూలీసనాథత్రికే సానుమత్పుత్రికే
శేఖరీ భూత శీతాంశురేఖా
మయూఖావలీ బద్ధసుస్నిగ్ధ నీలాలకశ్రేణి
శృంగారితే లోకసంభావితే
కామలీలా ధనుస్సన్నిభభ్రూ
లతాపుష్ప సందేహ కృచారు
గోరోచనా పంకకేళీ లలామాభిరామే
సురామే రమే
సర్వ యంత్రాత్మికే
సర్వ తంత్రాత్మికే
సర్వ మంత్రాత్మికే
సర్వ ముద్రాత్మికే
సర్వ శక్త్యాత్మికే
సర్వ చక్రాత్మికే
సర్వ వర్ణాత్మికే సర్వ రూపే,
జగన్మాతృకే హే జగన్మాతృకే
పాహి మాం పాహి మాం పాహి పాహి
- కాళీదాస కృతం
గానం - ఘంటసాల మాష్టారు
గీర్వాణవాణి
గీర్వాణవాణి
భావానువాదం
గౌ!!శ్రీ కొంపెల్లరామకృష్ణమూర్తి గారు🙏🙏
*66.యథా మాతరమాశ్రిత్య సర్వే జీవంతి జంతవః*
*ఏకం గార్హస్థ్యమాశ్రిత్య వర్తంత ఇతరాశ్రమాః.*
కన్నతల్లిని ఆశ్రయించుకొని ఏ విధంగా జంతువులన్నీ(జీవులు) జీవిస్తున్నాయో అదే విధంగా గృహస్థాశ్రమం ఒక్కదాన్ని ఆశ్రయించుకొని ఇతర ఆశ్రమాలన్నీ నిలుస్తున్నాయి.
*****మూసీ నది చరిత్ర తెలుసుకుందాం*****
*ప్రస్తుతం భాగ్యనగరంలో మనం "మూసీ నది"గా పిలుచుకుంటున్న ఈ నది అసలు పేరు "ముచుకుందా నది". ముచుకుందుడు రాజర్షి. ఈ వృత్తాంతం విష్ణు పురాణంలో ఉంది.
ముచుకుందుడనే రాజర్షి ఇంద్రుని కోరిక మేరకు వేయి సంవత్సరాల పాటూ అసురులతో యుద్ధం చేసి అసురులను ఓడించాడు. దానికి సంతసించిన దేవేంద్రుడు ముచుకుందుణ్ణి ఏదైనా వరం కోరుకోమన్నాడు.
అప్పుడు ముచుకుందుడు, "మహేంద్రా, ఏళ్ళ తరబడి నిద్ర లేకుండా రాక్షసులతో పోరాడడం వల్ల నాకు నిద్ర కరువైంది, ఎలాంటి ఆటంకం లేకుండా కొంతకాలం పాటూ నిద్రపోయేలా స్థలాన్ని చూపించు, అలాగే నాకు నిద్రాభంగం చేసిన వారు ఎవరైనా సరే తక్షణమే భస్మమైపోయే లాగా వరమివ్వ"మని కోరతాడు. "తథాస్తు" అంటాడు ఇంద్రుడు. తెలంగాణలోనున్న "అనంతగిరి"లో ఒక గుహను చూపించి అందులో నిద్రపొమ్మంటాడు. అక్కడ నిద్రలోకి వెళతాడు ముచుకుందుడు.
అలా కాలం జరుగుతూ ఉండగా ద్వాపరయుగంలో శ్రీకృష్ణుణ్ణి అంతమొందించడానికి వెంటపడతాడు కాలయవనుడనే రాక్షసుడు. అతనికి మూడు కోట్ల మందితో కూడిన బలమైన సైన్యముంది. కాలయవనునికి యాదవుల చేతిలో ఓడిపోడనే వరం కూడా ఉండడం వల్ల, బలరామ కృష్ణుల పైకి యుద్ధానికి వచ్చినపుడు కృష్ణుడు అతని నుండీ తప్పించుకుంటూ, ఈ ముచుకుందుడు నిద్రిస్తున్న గుహలోకి వచ్చి దాక్కుంటాడు. కృష్ణుడే మాయా రూపంలో నిద్రిస్తున్నాడని భ్రమపడిన కాలయవనుడు ముచుకుందుణ్ణి నిద్ర లేపుతాడు. ఇంద్రుని వరం వల్ల ముచుకుందునికి నిద్రాభంగం చేసిన కాలయవనుడు భస్మమైపోతాడు. ఆ విధంగా యాదవుల చేతిలో సంహరించబడని బలవంతుడైన కాలయవనుణ్ణి ముచుకుందుని ద్వారా మట్టుబెడతాడు కృష్ణుడు.
ఆ తరువాత కృష్ణుణ్ణి దర్శించిన ముచుకుందుడు తన వద్దనున్న కమండలు నీటితో కృష్ణుణ్ణి అర్చించి, నదిగా మారి, ఎల్లప్పుడూ స్వామి పాదాల వద్దనే ఉండేట్టుగా వరం కోరుకుంటాడు. అదే ముచుకుందా నది. నేటి మూసీ నది.
విష్ణుపురాణం ప్రకారం విష్ణుమూర్తి శేషపాన్పు యొక్క తలభాగం తిరుమలగా, మధ్యభాగం అహోబిలంగా, తోకభాగం అనంతగిరిగా చెప్పబడింది. ఈ అనంతగిరిలోనే మార్కండేయుడు 14వేల సంవత్సరాలు తపస్సు చేసి, మహావిష్ణువు ఇక్కడే కొలువై ఉండేట్టుగా వరాన్ని పొందుతాడు. అలా అనంత పద్మనాభుడనే పేరుతో సాలగ్రామ శిలగా వెలసిన విష్ణువును కాశీ నుండి గంగా జలాన్ని తెచ్చి మార్కండేయుడు అర్చించినట్టు స్థలపురాణం చెబుతోంది.
కాబట్టి ఇక్కడ వేంచేసిన విష్ణువు యొక్క పాదసేవలో తరించాలనే వరాన్ని పొందిన ముచుకుందుడు నదిగా మారాడు. అలా వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అనే విష్ణు క్షేత్రంలో పుట్టి రాష్ట్రమంతా పారుతోంది ముచుకుందా నది. కాలాంతరంలో ఆరవ నిజాం ఈ నది పేరును మూసీగా మార్చినట్లు చెబుతారు. ముచుకుంద అనే పేరును స్మరించడం వల్ల కూడా పుణ్యం వస్తుంది. ఇంతటి పవిత్ర చరిత్ర కలిగిన ముచుకుందా నది ఇప్పుడు సరైన అర్థం లేని మూసీ పేరుతోనూ, ఒక మురికి కూపంగానూ మారడానికి కారణం పాలకులు మరియు ప్రజలు కూడా.
ఈ నది యొక్క పేరును మళ్ళీ ముచుకుందా నదిగా మార్చాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ నది యొక్క శుభ్రతనూ పూర్వస్థితికి తీసుకు రావాల్సిన అవసరం కూడా ఉంది.