🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*ధార్మికగీత - 56*
*****
*శ్లో:- విద్యా దదాతి వినయం ౹*
*వినయా ద్యాతి పాత్రతాం ౹*
*పాత్రత్వా ద్ధన మాప్నోతి ౹*
*ధనా ద్ధర్మం తత స్సుఖమ్ ౹౹*
*****
*భా:- "విద్య" సర్వాభరణము. "విద్య" సర్వధన ప్రధానము."విద్య" మూడవ నేత్రము. "విద్య" నృపాలపూజితము అని వింటుంటాము.అట్టి విద్య వలన వినయము, విధేయత అలవడతాయి. వినయము లేని విద్య విద్యయే కాదు. అవిద్యయే. వినయము వల్ల పాత్రత-అర్హత లభిస్తుంది. ఆ అర్హతతో ఉపాధి, తద్వారా ధనప్రాప్తి కలుగుతుంది. ఆ ధనంతో సంసారంలో ఉత్తమ గృహస్థుగా వివిధ దానాలు చేస్తూ, తక్కిన బ్రహ్మచర్య, వృద్ధ,వానప్రస్థాశ్రమా నుయాయులను విధ్యుక్తకర్మగా సేవిస్తూ, ధర్మాచరణ, ధర్మరక్షణకై పూనుకుంటాడు. ఆ ధర్మమే అతనికి సిరిసంపదలు, భోగభాగ్యాలను ప్రసాదించి ఇహ, పరలోక సుఖాలను అనుభవింపజేస్తుంది. జ్ఞాన ప్రదాయినియై ముక్తికి మార్గం సుగమం చేస్తుంది. దీనికంతటికీ మూలము "విద్య"యే యని సారాంశము. కొద్ది జీవితాన్ని విద్యకు అంకితమిస్తే, అది జీవితాంతం మనకు తోడూనీడగా ఉండి, అమేయసుఖాలు అందించి తరింపజేస్తుంది*.
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి