8, జూన్ 2021, మంగళవారం

ఒడిబియ్యం

 ఒడిబియ్యం అంటే ఏమిటి


                       🌺 🌺 🌺 🌺 🌺


🍁 ప్రతి మనిషిలో వెన్నెముక లోపల 72 వేల నాడులు వుంటాయి.


ఈనాడులను వెన్నెముకలు రక్షిస్తాయి.

ఈనాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం వుంటుంది. 


ఇలాంటివి మనిషి శరీరంలో 7 #చక్రాలు వుంటాయి. అందులో #మణిపూర_చక్రం నాభి దగ్గర వుంటుంది.


#ఈ_మణిపూర_చక్రంలో_మధ్యబాగంలో_ఒడ్డియాన_పీఠం_వుంటుంది.


మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడ అందుకే #ఒడ్డియాణం వాడుకలో #వడ్యాణం అంటారు.


🌟 ఏడు చక్రాలలో శక్తి(గౌరీదేవి) ఏడు రూపాలలో నిక్షిప్తమవుతుందనేది సిద్దాంతం.


#ఒడిబియ్యం_అంటే_అమ్మాయి_ఒడ్యాణపీఠంలో_వున్న_శక్తికి_బియ్యం_సమర్పించడం_అన్నట్టు. 


#ఒడ్డియాణ_పీఠంలో_వుండే_శక్తి_రూపంపేరు_మహాలక్ష్మి. 


#ఒడిబియ్యం_అంటే_ఆడపిల్లను_మహాలక్ష్మి_రూపంలో_పూజించటం_అన్నమాట.


అలాగే పక్కనున్న భర్తను #మహావిష్ణువులా భావించి సత్కారం చేయాలి.


అమ్మలు చిన్నపిల్లలను ఒడిలో పెట్టుకుని కాపాడుకుంటారు.


#ఒడి_అంటెనే_రక్షణ.


🍁 ఒడిబియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది.


వాళ్ళకు తెలియకుండానే #మహాలక్ష్మిగా మారిపోతారు.


మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించటం. 


#బిడ్డను_అల్లుడిని_రక్షించమని_తల్లిదండ్రులు_చేసే_మహాలక్ష్మి_వ్రతమే_ఒడిబియ్యం.


ఒడిబియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా పోస్తారు.


ఇవన్నీ తమబిడ్డను అష్ట ఐశ్వర్యాలతో ఉంచాలని తల్లివారు చేసే సంకల్ప పూజ మాత్రమే.


🍁 సంతోషంతో ఆ మహాలక్ష్మి(ఆడపడుచు)


🍁తన తల్లిగారి ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని 5 పిడికిల్ల బియ్యం అమ్మవాళ్లకు ఇచ్చి,


🍁దేవుని ప్రార్ధించి, మహాధ్వారానికి నూనె రాసి, పసుపు కుంకుమ బొట్లు పెట్టి అత్తారింటికి వెళుతుంది.


🍁#అక్కడ_ఆడాళ్లను_పేరంటానికి_పిలిచి_అమ్మగారిచ్చిన_సారెను_ఐశ్వర్యాన్ని_ఊరంతా_పంచుతుంది.


🍁 ఇది అత్తవారు కూడ చేయవచ్చు.....


🍁 అందుకే #ఒడిబియ్యం యొక్క

#విలువ,

#గౌరవం,

#సారాంశం,

తెలుసుకోవాలి అత్యంత #నిష్ఠతో చేయాలి... 


                    🌺 🌺 🌺 🌺 🌺


🙏🙏ఓం నమో శ్రీ లక్ష్మీ  నారాయణాయ🙏🙏

ఆలనగా... పాలనగా..-- కథ.

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

'రైతు బంధు' అనే వ్యవసాయ పత్రిక వారి కథల పోటీలో ప్రోత్సాహక బహుమతిని పొందిన కథ.


 *‘ఆలనగా... పాలనగా...’* 


రచన: నండూరి సుందరీ నాగమణి


“చాలా బాగున్నాయండీ మీ మొక్కలు,  మీ తోట... ఎంతో శ్రమపడి పెంచారు...” మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు శ్రీహరి.


“థాంక్స్ బాబూ... నాకూ, మా ఆవిడకూ తోట అంటే ప్రాణం... తప్పనిసరియై ఇల్లు  అద్దెకు ఇస్తున్నాము కానీ మా ప్రాణాలన్నీ ఈ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి...” దిగులుగా అన్నాడు జగన్నాథం.


“మాలీ ప్రతీ రోజూ వస్తాడు... తోట సంరక్షణ అంతా అతనే చూసుకుంటాడు... కానీ మీరు కూడా ఓ కంట కనిపెట్టి చూసుకోండి బాబూ... అమ్మాయికి కూడా చెప్పండి...” దిగులుగా అంది మాణిక్యాంబ.


“అయ్యో పిన్ని గారూ, మీరింతగా చెప్పవలసిన అవసరం లేదండీ, మా ప్రాణంలాగే చూసుకుంటాము... మీరు నిశ్చింతగా వెళ్ళి రండి...” చెప్పాడు శ్రీహరి.


ఆ రెండంతస్తుల భవనం చుట్టూ పెద్ద ఖాళీ స్థలం, అందులో రకరకాల పూల మొక్కలు, ఫల వృక్షాలు పెంచుతున్నారు జగన్నాథం దంపతులు. ప్రతీరోజూ ఉదయమే తోటలో తిరగటం, ప్రతీ చెట్టునూ, పువ్వునూ పలకరించటం ఆ దంపతులకు అలవాటు. 


పూజకు అవసరమైన పువ్వుల దగ్గరనుంచి, దేవుడికి కొట్టే  కొబ్బరికాయ దాకా అన్నీ  ఆ తోటే వారికి ఇస్తుంది... అలాగే, పులుసులో వేసుకునే కొత్తిమీర నుంచి వీధిలోని పిల్లలకు పంచే జామ పళ్ళవరకూ కూడా ఆ తోటే ప్రసాదిస్తుంది... 


ఉదయం ఆరు గంటలకల్లా మాలి వచ్చి తోటలోని మొక్కలకు నీరు పెట్టి, కలుపు తీసి, ఎండిపోయి రాలిన ఆకులు, కొమ్మలు ఏరి, శుభ్రంగా ఉంచుతాడు. ప్రతీరోజూ నవవధువులా కళకళలాడుతూనే ఉంటుంది జగన్నాథం గారి ఇంటి తోట...


జగన్నాథానికి ఆయన కూతురు ఒక్కతే సంతానం. చదువు పూర్తికాగానే, పెళ్లి చేసుకుని భర్తతో  అమెరికా వెళ్లిపోయింది. అంత దూరం అమ్మాయిని పంపటానికి ఇష్టం లేకున్నా, మారే కాలంతో పాటుగా మనమూ మారాలన్నట్టు, గుండె రాయి చేసుకుని అమ్మాయిని పంపించి తాము మాత్రం ఇండియా లోనే ఉండిపోయారు జగన్నాథం, మాణిక్యాంబ. 


అయితే ఇప్పుడు తప్పనిసరిగా వారు అమెరికాకి వెళ్లవలసిన సమయం వచ్చింది. అమ్మాయికి తొలిచూలు... ‘సహాయానికి ఎవరూ లేరని, తప్పక మీరిద్దరూ రావాలని’ అల్లుడు గారి పిలుపు... మాణిక్యాంబను పంపిస్తానని, తాను మాత్రం ఇల్లు వదిలి రాలేనని చెప్పాడు జగన్నాథం. 


కానీ ఆయన కూతురు నవ్య అతన్ని అంతా సులువుగా వదిలిపెట్టలేదు... ఇద్దరూ రావలసిందేనని మంకు పట్టుబట్టటమే కాకుండా టికెట్ కూడా కొని పంపించారు. ఇక తప్పనిసరి పరిస్థితులలో ‘ఊ’ అనాల్సి వచ్చింది జగన్నాథానికి.


తాము ఉంటున్న క్రింది వాటాకి ‘టులెట్’ బోర్డ్ తగిలించారు. ఇల్లు చూసుకోవటానికి వచ్చిన ప్రతీవారికీ, తమ తోట కూడా చూపించి, దాని సంరక్షణ భారం అంతా తాము తిరిగి వచ్చేవరకూ చూసుకోవాలని చెబుతూ వస్తున్నారు. చాలా మందికి ఈ తోట వ్యవహారం నచ్చలేదు. అవును మరి అందరూ బిజీ వ్యక్తులే...


ఈ రోజు శ్రీహరి ఇల్లు చూసుకోవటానికి వచ్చి, ఇల్లు చాలా నచ్చటంతో రెండు మాసాల అద్దె కూడా అడ్వాన్స్ గా చెల్లించాడు. తన భార్య సుధకు కూడా ఇల్లు నచ్చి తీరుతుందని నమ్మకంగా చెప్పి, ఆదివారం వచ్చి పాలు పొంగించుకుంటామని చెప్పాడు. 


తమకున్న కొద్ది సామానూ, మేడమీద కొత్తగా వేసిన గదులలోకి మార్పించుకున్నారు జగన్నాథం దంపతులు.  

***

“సుధా... మనకోసం మంచి ఇల్లు చూశాను... ఈ ఆదివారం వెళ్ళి పాలు పొంగించుకుందాం...” అంటూ వివరాలన్నీ చెప్పాడు శ్రీహరి.


“అయ్యో, ఆ కాలనీయా, సిటీకి చాలా దూరం కదండీ... పైగా పిల్లలకు స్కూల్ కి చాలా దూరం అవుతుంది కూడాను...” అయిష్టంగా నసిగింది సుధ.


“అద్దె చాలా తక్కువ సుధా... పిల్లలకు స్కూల్ బస్ అక్కడివరకూ వస్తుంది... సమస్య ఏమీ లేదు... ఆ తోట ఉంది చూశావూ, నాకెంత నచ్చిందో చెప్పలేను... ఇంటివాళ్ళు స్టేట్స్ కి వెళుతున్నారు. ఆరు నెలలవరకూ రారు... పైన పోర్షన్ లో వాళ్ళు ఉంటారు... క్రింద అంతా మనదే...  స్వచ్ఛమైన గాలి... రంగురంగుల పూలు... రకరకాల పళ్ళు... పిల్లలకు ఆడుకోవటానికి కావలసినంత స్థలం... చూసావంటే నువ్వే ఎంతో ఇష్టపడిపోతావు... నిజం...” చెప్పాడు శ్రీహరి.


“ఏమో... ఒక ఇరుగూ పొరుగూ లేకుండా ఎలా? ఇక్కడ ఈ ఫ్లాట్స్ లో మనకి అలవాటు అయిపోయింది. ఇప్పుడలాంటి అడవిలోకి వెళ్ళాలి అంటే... దిగులు... ఇప్పుడైనా మనింటివాళ్లు ఖాళీ చేయమన్నారు కాబట్టి మారవలసి వస్తోంది... సరే... తప్పదు కదా... ఆదివారం వెళ్ళి ఇల్లు చూద్దాము... నాకు నచ్చితేనే మరి పాలు పొంగించేది... సరేనా?” అన్నది సుధ.


“సరే...” అని నవ్వాడు శ్రీహరి, తాను అడ్వాన్స్ చెల్లించిన విషయం ఆమెకు చెప్పలేదు. తప్పకుండా ఇల్లు ఆమెకు నచ్చి తీరుతుంది అనుకున్నాడు నమ్మకంగా...

***

ఆదివారం పిల్లలను, భార్యను తీసుకుని, ఆ ఇంటికి వచ్చాడు శ్రీహరి.

గేటు తీసి లోపలికి అడుగు పెడుతూనే పులకరించిపోయింది సుధ. 


గేట్ కి ఇరువైపులా సైనికుల్లా నిలబడి ఉన్నాయి పున్నాగ చెట్లు... వాటి నుంచి రాలిన తెల్లని పూలు గేట్ నుంచి ఇంటి వరకూ వేసిన కాలి బాట మీద తెల్లని తివాచీ పరిచాయి. ఇంటి చుట్టూ ప్రహరీ గోడ... ఎనిమిది కొబ్బరి చెట్లు... ఇంటికి ఇరువైపులా ముందు భాగంలో అన్నీ పూల చెట్లు... మల్లె గుబుర్లు, పది రంగుల్లో మందారాలు... మరో ప్రక్కన రంగు రంగుల గులాబీలు, మూడు వన్నెల్లో డిసెంబర్ పూలు, రెండు వర్ణాల్లో కనకాంబరాలు... ఇంకా మేడ మీదకు పాకించిన సన్నజాజి, విరజాజి, మాలతి తీగలు... అన్నీ నిండుగా పూచి ఉన్నాయి. 


గేట్ మీద ఆర్చ్ పై పాకించిన రాధా మనోహరాలు తేలికపాటి సౌరభాలను అందిస్తూ మైమరపిస్తున్నాయి. గేట్ కి కుడివైపున ఉన్న స్థలంలో ఒక గున్నమామిడి చెట్టు, చెట్టు చుట్టూ తిన్నెతో నిండా పూతతో ఎంతో ముద్దుగా ఉంది. మామిడి చెట్టుకు కొంత దూరంలో రెండు సపోటా చెట్లు, రెండు జామ చెట్లు ఉన్నాయి. 


ఇంటి వెనకాల కూరగాయల మొక్కలు, ఆకు కూరలు, కొత్తిమీర మడి, కరివేపాకు చెట్టు,  తులసి కోట, తులసి చెట్లు, బొప్పాయి, అరటి చెట్లు ఉన్నాయి. అక్కడే పందిళ్ళు వేసిన  చిక్కుడు, బీర, సొర పాదులు ఉన్నాయి. అన్నీ పూత, పిందె మీద ఉన్నాయేమో ఆ దృశ్యం కన్నుల పండువగా ఉంది. 


పెరట్లోనే ఒక ప్రక్కన పెద్ద గోరింట చెట్టు కూడా ఉంది...సుధ మనసులో వెంటనే ఆషాఢ మాసం మెదిలింది. రుబ్బిన గోరింటాకు చేతులకు పెట్టుకుని, ఆ వాసన ఆఘ్రాణిస్తూ ఉంటే ఎంత బావుంటుంది? 


పిల్లల సంబరం అంబరాన్ని దాటింది. రశ్మి, రాకేష్  ఇద్దరూ తోటలో పరుగులు తీస్తూ ఆడుకోసాగారు.

ప్రశాంతమైన ఆ ఇంటి వాతావరణానికి, మాణిక్యాంబ గారి ఆదరపూర్వకమైన మాటలకు సుధ మనసు ఎంతగానో పొంగిపోయింది. 


ఆ సాయంత్రమే కొద్దిపాటి సామానుతో వచ్చి పాలు పొంగించేసుకున్నారు శ్రీహరి, సుధ తమ పిల్లలతో సహా... ఆ  పై ఆదివారమే మొత్తం సామానంతా తెచ్చేసుకున్నారు వారు.

***

జగన్నాథం దంపతులు స్టేట్స్ కి వెళ్ళిపోయారు. శ్రీహరి, సుధ, పిల్లలు కొత్త ఇంటికి త్వరగానే అలవాటు పడిపోయారు. 


ఉదయమే పూజకు బోలెడు పూలు... సాయంత్రం ఇంటికి రాగానే సహజంగా పండిన పళ్ల ముక్కల ఫలహారాలు... వంటల్లోకి ఇంట్లోనే పండిన కూరగాయలు, ఆకుకూరలు... సాయంత్రం తులసి మాత దగ్గర దీపం పెట్టుకోవటం... ఇవన్నీ సుధకు ఎంతగానో నచ్చాయి.


తోటమాలి మల్లయ్య అక్కడికి దగ్గరలోనే ఉంటాడు. ఉదయమే తోటకు వచ్చి నీరు పెట్టి, ఎండిన ఆకులు, పూవులు తీసి, తాను తయారు చేసే కంపోస్ట్ బిన్ లో వేస్తాడు. సుధకు కూడా చెప్పాడు, కూరగాయల చెత్త కానీ, ఇంట్లో మిగిలిపోయిన అన్నం, కూరలు కానీ బయట పారవేయవద్దనీ, తనకు ఇస్తే ఎరువుగా తయారు చేస్తాననీ... 


ఇంటి వెనుక భాగంలో ఏర్పాటు చేసిన బిన్స్  చూపి అందులో పొరలు పొరలుగా  ఎలా వేయాలో, అది ఇరవై ఒక్క రోజుల నుంచి ముప్పై రోజుల్లో ఎలా సేంద్రియ ఎరువుగా తయారవుతుందో, అది వేయటం వలన మొక్కలు ఎంత బాగా పెరుగుతాయో  వివరంగా చూపించాడు. 


సుధ కూడా ఇంట్లోని తడిచెత్తను బిన్లలో వేయటం మొదలుపెట్టింది.


పిల్లలకు స్కూల్లో చెప్పే సైన్సు పాఠాలు అన్నీ ఇంట్లో  మొక్కలను చూపించి సోదాహరణంగా చెప్పేవాడు శ్రీహరి. 


కంటికి ఇంపైన పచ్చని ఆకుల వర్ణం, ఇంట్లోనే పండిన తీయని పండ్లు, చక్కని పూవులు, వాటి ఉపయోగాలు, పైగా మొక్కలు పగటి  పూట కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకొని, ఆక్సిజన్ ను విడుదల చేసి, పర్యావరణానికి మేలు చేయటం, ఆకులు, పువ్వులు వాటి నిర్మాణాలు, కిరణజన్య సంయోగ క్రియ, పరపరాగ సంపర్కం  ఇవన్నీ పిల్లలకు ఎంతో విశదంగా, ప్రయోగాత్మకంగా వివరించేవాడు శ్రీహరి.


సుధకు కూడా బజారుకు వెళ్ళి మరీ కాయగూరలు తెచ్చే శ్రమ తగ్గిపోయింది. పెరటిలోని ఆకుకూరలు, కూరగాయలు వంటకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అటు ఖర్చు కూడా బాగా తగ్గింది.


ఆదివారం వస్తే చాలు తోటలోని జామచెట్టు కింద కూచుని భోజనాలు చేసి, పిల్లలు ఊయలలు ఎక్కి ఊగేవారు... వాళ్ళ స్నేహితులు కూడా వచ్చి ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు.

***

నాలుగు రోజులుగా మల్లయ్య రావటం లేదు. తోట అంతా భీకరంగా తయారైంది. రాలిన పూవులు, ఆకులు పోగు పడుతున్నాయి. చెట్లకు నీరు పెట్టేవారు లేకపోయారు. 


సుధ తోటకు నీరు పెట్టాలని ప్రయత్నించింది కానీ, ఆమెకు ఇంటి పనులు కూడా ఉండటం వలన శ్రమ ఎక్కువ అయింది. అది చూసిన శ్రీహరి తాను ఒక రెండు రోజుల పాటు ఉదయమే లేచి నీరు పెట్టి, చెత్త ఎత్తి  బిన్లలో వేసాడు. 


ఇదంతా చూసిన సుధకు కొద్దిగా విరక్తి వచ్చింది. ఎందుకింత చాకిరీ చేయాలి తాము? ఇంట్లో అద్దెకి వచ్చారు కానీ ఈ ఇల్లు కానీ, ఈ తోట కానీ తమ స్వంతం కాదు. దీనికోసం ఇంత శ్రమ పడటం వృధా ప్రయాసగా తోచిందామెకు. 


వేరే ఇల్లు చూసుకుని వెళ్లిపోదామని భర్తతో అన్నది సుధ. ఒక చిన్నపిల్లను చూసినట్టు ఆమె వైపు చూసి నవ్వాడు శ్రీహరి. అన్నీ సరి అవుతాయన్నట్టు చూసాడు.


ఆ సాయంత్రం మల్లయ్య ఇల్లు వెదుక్కుంటూ వెళ్ళాడు శ్రీహరి.

చిన్న తాటాకుల ఇల్లు. బయట మట్టితో అలికిన అరుగులు ఉన్నాయి. అరుగుమీద పక్కపై పడుకుని ఉన్నాడు మల్లయ్య. అతని భార్య కాబోలు అతన్ని లేపి కషాయం ఏదో తాగిస్తోంది.


శ్రీహరిని చూడగానే మల్లయ్య అరుగు దిగబోయాడు.


“అయ్యో, తాతా పడుకో... ఏమైంది? ఒళ్ళు బాగాలేదా?” చనువుగా అతని నుదుటిపై చేయి వేసి చూశాడు శ్రీహరి.


“నాల్రోజుల మట్టీ జరమయ్యా. మూసిన కన్ను తెరవటం లేదు. ఆస్పత్రికి తీసుకుపోయాను. మందులు వేస్తున్నాను... ఇంకా తగ్గలేదు...” దిగులుగా చెప్పింది మల్లయ్య భార్య.


“అయ్యో... అవునా!” అంటూ మల్లయ్య చేయి పట్టుకుని “తగ్గిపోతుందిలే తాతా... బాధ పడకు...” అన్నాడు శ్రీహరి.


“తోట ఎలా ఉందో... నేను వెళ్ళాలి – అంటూ ఒకటే కలవరింతలు బాబూ... మాకు పిల్లలు లేరు... ఆ మొక్కలు, చెట్లే ఈయన పిల్లలు... మొక్కలకి తడి పెట్టని రోజున ఈయనకి నిద్ర రాదు... నన్ను వెళ్ళి పెట్టమని ఒకటే పోరు. ఈయన్ని వదిలి రాలేక నేను రాలేదు...” చెప్పింది మల్లయ్య భార్య.


“ఫరవాలేదు తాతా... నీకు బాగా తగ్గినాకే రా. మేము చూసుకుంటాములే తోటను...” అనునయంగా చెప్పాడు శ్రీహరి.


“అయ్యో, ఎరువులు వేసేది మీకు తెల్వదు బాబూ...”


“అవును... నువ్వు చెప్పు నేను నేర్చుకుంటాను... నువ్వు వచ్చేదాకా మన తోటకు నేనే మాలీని...”

 

మల్లయ్య, ప్రతీ మొక్కకూ బిన్స్  లో ఉన్న ఎరువును ఎలా వేయాలో వివరంగా చెప్పాడు. అలాగే మొక్కలకు తవ్వవలసిన పాదులు, నీరు ఏ మేరకు ఎలా పెట్టాలో అన్నీ విపులంగా చెప్పాడు. 


“చాలా చక్కగా చెప్పావ్ తాతా... అలాగే చేస్తాను. కానీ... కూరగాయల మొక్కలు, కొన్ని పూల మొక్కలు కొద్దిగా వాడినట్టు ఉన్నాయి. ఏదో చీడ పట్టినట్టు తోస్తోంది మరి…” అన్నాడు దిగులుగా...


దానికి ఇంట్లోనే చేసుకునే సేంద్రియ పురుగు మందును ఎలా తయారు చేసుకోవాలో, మొక్కల మీద ఎలా పిచికారీ చేయాలో చెప్పాడు మల్లయ్య. 


మర్నాడు వంట్లో పరిస్థితి కాస్త  మెరుగైతే తానే వచ్చి చేస్తానని చెప్పాడు. కానీ పూర్తిగా తగ్గే వరకూ రావద్దని గట్టిగా చెప్పి, మల్లయ్య భార్య చేతిలో వెయ్యి రూపాయలు ఉంచాడు శ్రీహరి  ఖర్చులకు ఉంచమంటూ....

***

మర్నాడు ఉదయమే ఆఫీసుకు వెళ్లకుండా పాత టీ షర్టు, పైజామా వేసుకొని, ఆ క్రిమి సంహారక మందును తయారు చేసుకుని, స్ప్రేయర్ లో నింపి మొక్క మొక్కకూ పిచికారీ కొడుతూ ఉంటే నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయింది సుధ. 


ఆ తరువాత తానూ నడుం బిగించి భర్తకు సహాయం చేయటానికి ముందుకు వచ్చింది.  ఆ సాయంత్రం మొట్టమొదటి సారి తమ తోట మీద, ఆ మొక్కల మీద ప్రేమ కలిగింది సుధకు.


ఆ తరువాత మల్లయ్యకు ఆరోగ్యం సమకూరి పనిలోకి వచ్చినా, అది తమ పని కాదన్నట్టుగా కాక, భార్యాభర్తలు ఇద్దరూ అతనికి ఎంతో సహాయం చేస్తూ ఉండేవారు.

***

ఆరోజు శ్రీహరి, సుధల వివాహ వార్షికోత్సవం. ఆ సాయంత్రం శ్రీహరి తన దగ్గర స్నేహితులనందరినీ కుటుంబాలతో సహా తమ ఇంటికి భోజనాలకు పిలిచాడు. తోటలోని చెట్లను విద్యుద్దీపాలతో అలంకరింపజేశాడు. 


ఇంట్లో పండిన కూరలతోనే వండిన రుచికరమైన ఆహార పదార్థాలతో విందు జరిపాడు. తోటను చూసిన అతని కొలీగ్స్, స్నేహితులు ఎంతో సంతోషాన్ని పొందారు. తోటమీద శ్రద్ధ తీసుకుంటున్న శ్రీహరినీ, సుధనూ ఎంతో అభినందించారు. 


అప్పుడు శ్రీహరి చెప్పాడు...


“ఈ ఘనత నాది కాదు... ఇదిగో... ఈ మల్లయ్య తాతది. అతని భార్య గంగమ్మదీ… మీరు నమ్ముతారా? ఈ మల్లయ్య తోటలో పనిచేయటం ఒక శ్రమ అని అనుకోడు... అది అతనికొక ఆట... సంతోషకరమైన చర్య... ప్రతీ చెట్టుతో ఊసులాడుతాడు... ప్రతీ మొక్కనూ ప్రేమగా స్పృశిస్తాడు. మొక్కలను పెంచటం బిడ్డను పెంచటంతో సమానమని ఆయన భావన... 


అవును... మొక్కలను ప్రేమించాలి... అప్పుడే అవి కళకళలాడుతూ నవ్వుతాయి... పూలనవ్వులనూ, పండ్ల సిరులనూ ప్రేమగా అందిస్తాయి... 


ఈ యజ్ఞం ఒక పరమావధిగా చేస్తున్న మల్లయ్య తాత ఎంతో అభినందనీయుడు... అతనికి సహకరించే గంగమ్మవ్వ కూడా...


ఈయన జీతం కోసం పనిచేయడు... తన ఆనందం కోసం పనిచేస్తాడు... ప్రేమించటం ఎలాగో నేర్పించిన ఈ తాతకు ఈరోజు... చంద్రునికో నూలుపోగులా చిరుకానుక...” అంటూ మల్లయ్యకూ, గంగమ్మకూ కొత్తబట్టలు చేతిలో పెట్టి, వారికి నమస్కరించారు శ్రీహరి, సుధ.


మల్లయ్యకు ఎలా స్పందించాలో తెలియక కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు... తమను ఇంత ఆదరంతో చూస్తున్న శ్రీహరి అంటే అవ్యాజమైన వాత్సల్యం కలిగింది మల్లయ్యకు, అతని భార్య గంగమ్మకు...


“విందు తరువాత డెజర్ట్  ఇదిగో ఈ పళ్ళు... ఎంత తీయగా ఉన్నాయో చూడండి” అని చిన్న చిన్న బౌల్స్ లో వేసిన తీయని సపోటా, జామ, మామిడి పళ్ళ ముక్కలు అందరికీ అందించాడు శ్రీహరి. 


అవి తిన్న వారందరూ ఆ రుచికీ, తాజాదనానికి ఎంతగానో ఆనందించారు.  తాను స్వయంగా ఆకు దూసిన మల్లె గుబురులలోంచి విరగబూసిన ఘుమ ఘుమలాడే మల్లెపూల మాలలు అక్కడికి వచ్చిన స్నేహితురాళ్ళకు అందించింది సుధ.


అందరి మనసులూ ఆనంద పరిమళమయమే అయ్యాయి.  అందరూ తమ తమ ఇళ్ళల్లో, కుండీల్లోనైనా కానీ తప్పక మొక్కలు పెంచాలన్న గట్టి నిర్ణయం తీసుకుని, దాన్ని వెల్లడించారు కూడా... 


ఎవరి పుట్టినరోజులకైనా, ఫంక్షన్లకైనా  వెళ్లినప్పుడు పూలగుత్తుల బదులుగా మొక్కలు బహుమతులుగా ఇవ్వాలని, ఎవరింట్లో పుట్టినరోజైనా వాళ్ళు ఆరోజు ఒక మొక్క నాటి తీరాలని కూడా తీర్మానం చేసేసుకున్నారు.


అమెరికా నుంచి ఒక పాపకు తాత, అమ్మమ్మలై తిరిగి వచ్చిన జగన్నాథం దంపతులు ఇంటికి రాగానే సరికొత్త శోభను సంతరించుకున్నట్టున్న తమ తోటను చూసి మురిసిపోయారు.


తాము వేసిన మొక్కలే కాక, ఇంకా చాలా రకాలు నాటబడి ఉండటం, అవన్నీ కూడా  కంటికి ఇంపైన రంగుల్లో పూసి ఎంతో ఆహ్లాదాన్ని కలిగించటం వాళ్ళను ఆశ్చర్యానందాలలో ముంచి వేసింది.


ఎప్పటినుంచో అనుకుంటున్నట్టుగా, మల్లయ్యకూ, గంగమ్మకూ ఉండటానికని రెండు గదులు పెరట్లోనే వేయించాడు జగన్నాథం. 


మల్లయ్యకు ఇక తోటే ప్రాణమైపోయింది. శ్రీహరికి జగన్నాథం దంపతులు పిన్నీ బాబాయిలై పోయారు...


శ్రీహరి ఎప్పుడైనా సుధతో అంటూ ఉంటాడు “ఏమోయ్, ఇల్లు మారదామా?” అని...


“ఊహూ, వెళితే మీరు వెళ్ళండి... తోటను విడిచి మేము రాము...” అంటుంది సుధ నవ్వుతూ....


*నండూరి సుందరీ నాగమణి*

రావణుడికి మంచి మాటలురావణుడికి మంచి మాటలు

 *రావణుడికి మంచి మాటలు చెప్పిన వాళ్ళు..*


*ఇహ సంతో న వా సంతి*

*సతో వా నాను వర్తసే*

(సుందర సర్గ 21 శ్లోకం 9)


*నీకు మంచి చెప్పేవాళ్ళు ఇక్కడ లేరా లేక నువ్వు వాళ్ళ మాట వినడంలేదా అన్నది సీతా దేవి ప్రశ్న.*


 ఆమాట కొస్తే సీత స్వయంగా అప్పుడు చెప్పిన మంచి మాటలు అంతకు ముందు రెండు సార్లు రావణుడి తో చెపుతుంది. పంచవటి దగ్గర మొదట, లంకకు రాగానే రెండో సారి, సుందరకాండ లో ఆఖరిసారి. 


రావణుడికి మంచి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాడు వాళ్ళ మాట వినలేదు. 


*రావణుడికి మంచి మాటలు చెప్పిన వాళ్ళ లో మొదటివాడు మారీచుడు.*


ఖరుడి చావు గురించి చెప్పి రాముడిని నువ్వు ఎదిరించలేవు, కానీ ఆయన భార్యను ఎత్తుకొస్తే రాముడు దిగులుతో చనిపోతాడు అని  సలహా ఇచ్చినవాడు, రావణుని మంత్రి అకంపనుడు. వీడు యుధ్దం లో ఆంజనేయుడి చేతిలో చస్తాడు.  వీడు కూడా రాముడి పరాక్రమం గురించి సరిగానే చెప్తాడు. కానీ సీతాపహరణం చెయ్యమని వెధవ సలహా ఇస్తాడు.  అప్పుడు రావణుడు మారీచుడి దగ్గరకు వస్తాడు.  


మొదటిసారి మారీచుడు (అరణ్య కాండ 31 వ సర్గ) చెప్పిన మాట విని రావణుడు సీతాపహరణం ఆలోచన వీడి లంకకు వెనక్కి వెళతాడు. మారీచుడు  రాముడి గుణ గణాలు పరాక్రమము వర్ణించినట్లు గా రామాయణం లో ఋషులూ దేవతలూ కూడా వర్ణించరు. రామాయణం లో *"రామో విగ్రహవాన్ ధర్మః"*  అన్నది వీడే. ఆ మాట అనాలంటే  రాముడి నడవడిక గురించి పూర్తి అవగాహన ఉండాలి. అంతగా రాముడిని వీడు పరిశీలించాడు. 


*సులభా పురుషా రాజన్*

*సతతం ప్రియవాదినః* 

*అప్రియస్యతు పధ్యస్య* 

*వక్తా శ్రోతా చ దుర్లభః*.


ఇచ్చకాలు మాట్లాడేవాళ్ళు చాలామంది దొరుకుతారు. నీకు మంచి జరిగేది, అందునా నీకు నచ్చనిది చెప్పేవాళ్లు ఎక్కడో కానీ ఉండరు అని ఈ శ్లోక భావం. మారీచుడు ఈ మాట అంటాడు. ఇదే శ్లోకం విభీషణుడు కూడా  చెబుతాడు. ఈశ్లోకం భారతం  విదురనీతి లో కూడా వస్తుంది.  


*సీత కాళరాత్రి స్వరూపిణి (మృత్యు స్వరూపిణి), కాబట్టి, సీతాపహరణం చేస్తే లంక నాశన మౌతుంది, అందులోని రాక్షసులు మొత్తం చస్తారని మారీచుడు నిర్మొహాటంగా చెప్తాడు.*


సూర్పణఖ ప్రోద్భలంతో రావణుడు రెండవసారి వచ్చి చంపుతానని బెదిరిస్తే సరే నీ చేతుల్లో చావడం కంటే రాముడి చేతులో చావడం మేలు అని మాయలేడి రూపం తీసుకోడానికి  అంగీకరిస్తాడు. 


ఇక మంచి మాటలు చెప్పిన రెండవ వాడు *ఆంజనేయుడు.*  రాముడు కానీ సుగ్రీవుడు కానీ రావణుడికి సందేశం పంపరు. ఊరికే సీత ఎక్కడుంది ఎలావుందీ చూసి రమ్మంటారు. సందేశం చెప్పడం లంక తగల పెట్టడం ఈయన సొంత  ఆలోచన. సభలో రావణుడికి చెప్పిన  సందేశం మంతా హనుమ తాను సొంతం గా చెప్పినది.  రావణుడిని శరీర బలం లో జయించిన వాలి వధ గుర్తు చేసి చెబుతాడు.  బ్రహ్మ వరం లో వాళ్ళు లేరు కనుక రావణుడికి నర వానరుల చేతిలో మరణం ఉందని చెబుతాడు.  రామ లక్ష్మణుల  పరాక్రమం గురించి చెప్తాడు. రాజ ధర్మాలు చెప్తాడు.   ఆఖరగా రాముడు పరమాత్మ అని కూడా చెప్తాడు.


*సర్వాన్ లోకాన్ సుసంహృత్య*

*సభూతాన్ సచరాచారాన్*

*పునరేవ తధా స్రష్టుమ్*

*శక్తో రామో మహా యశః*. 


అంటే రాముడు సృష్టి స్థితి లయకారకుడు అని చెప్తాడు. 


రావణుడు వినడు. 


ఇక మంచి మాటలు చెప్పిన మూడవ వాడు *విభీషణుడు.*  ఈన కూడా  


*"సులభా పురుషా రాజన్"*


అనే శ్లోకం చెప్తాడు. రావణుడు విభీషనుడు చెప్పిన మంచి మాటలు వినకపోగా తిట్టడం మొదలు పెడతాడు. తరవాత విభీషణుడు అన్న ను వదిలి పెట్టి రాముని దగ్గరికి వెళ్లి  రాముడిని శరణు కోరతాడు.  


యుద్ధం మొదలు అవడానికి కాస్త ముందు రావణుడికి మంచి మాటలు చెప్పిన వాళ్ళు అతని తల్లి కైకసి, తాత (తల్లి యొక్క చిన్నాన్న) మాల్యవంతడు. వీళ్ళు సగౌరవంగా సీతను రాముడికి అప్పగించు అని గట్టిగానే చెప్తారు.  చెప్పినా రావణుడు వినడు. పైగా  ముత్యం లాగా ఈ కింది శ్లోకం అంటాడు.


*యుద్ధ కాండ 36 వ సర్గ శ్లోకం ..10.*


*ద్విధా భజ్యేయమ ప్యేవం*

*న నమేయం తు కస్యచిత్*

*ఏష మే సహజో దోషః*

*స్వభావో దురతిక్రమః*


"నన్ను రెండు ముక్కలు చేసినా నేను ఇంకెవ్వరి మాటా వినను. ఇది నాకు పుట్టుకతో వచ్చిన స్వభావము. నేనేం చేసేది" అని దానర్థం. చాలా మంచి మాట. దూర్యోధనుడి  "సూది మొన" గుర్తు వస్తుంది కదా. అందరూ ఒకటే తాను లో ముక్కలు. 


కుంభకర్ణుడిని నిద్రమధ్యలో లేపితే మరణిస్తాడు అని శాపం ఉంటుంది. అది తెలిసీ రావణుడు కుంభకర్ణుడిని నిద్ర లేపుతాడు.  అప్పటికే యుద్ధం మొదలు అయ్యి చాలా మంది మరణించి ఉంటారు. వీడు కూడా చెప్పి చూస్తాడు. సరే సీతయ్య .. ఎవ్వరి మాటా వినను అని ముందే చెప్పాడు కదా. కుంభకర్ణుని మీద కూడా గుడ్లురిమి సలహాలు ఇవ్వకు చెప్పింది చెయ్యి అంటాడు. కుంభకర్ణుడు కూడా యుద్ధం చేసి చచ్చి పోతాడు. కుంభకర్ణుని  మరణం తరవాత రావణుడు విభీషణుడి మాటలు గుర్తు తెచ్చుకుని చాలా బాధపడతాడు. ఈ పశ్చాత్తాపం కాసేపే ఉంటుంది. మళ్ళీ ఇంద్రజిత్తును నమ్మి యుద్ధానికి సిద్ధ మౌతాడు.


ఇవి రావణుడికి మంచి మాటలు చెప్పిన వాళ్ళ వివరాలు. 


*పవని నాగ ప్రదీప్*

వైశాఖ పురాణం - 29

 _*వైశాఖ పురాణం - 29 వ అధ్యాయము*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



*శునీ మోక్షప్రాప్తి*



☘☘☘☘☘☘☘☘☘



నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమనిట్లు వివరింపసాగెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుతో నిట్లు పలికెను.


మహారాజా ! అన్ని తిధులలో వైశాఖమాసమున శ్లుక్లపక్షమున వచ్చు ద్వాదశీ తిధి సర్వపాపములను పోగొట్టును. ఇట్టి ద్వాదశినాడు శ్రీహరిని సేవింపనిచో దానములు , తపములు , ఉపవాసములు , వ్రతములు , యాగములు చేయుట , చెరువు మున్నగువానిని త్రవ్వించుట అన్నియును వ్యర్థములే. ఈనాడు ప్రాతఃకాల స్నానము చేసినచో గ్రహణకాలమున గంగాతీరమున వేయిగోవుల నిచ్చిన పుణ్యము వచ్చును. ఈనాడు చేసిన అన్నదానము విశిష్ట ఫలము కలుగును. ఈనాడు యముని పితృదేవతలను , గురువులను , దేవతలను , విష్ణువును అర్చించి జలకలశమును దధ్యన్నమును ఇచ్చిన వచ్చు ఫలము మాటలకందనిది. అనగా చెప్పలేనంత పుణ్యమును కలిగించునని భావము. ఈనాడు సాలగ్రామ దానము , శ్రీహరిని పాలతో అభిషేకించుట పంచామృతముతో అభిషేకించుట , పానకము నిచ్చుట , దోసపండ్ల రసమును , చెరకుగడను , మామిడిపండును , ద్రాక్షాఫలములను దానము చేయుట ప్రశస్తము. సర్వోత్తమ ఫలదాయకము. ఇట్టి ద్వాదశీ మహిమను వెల్లడించు కథను వినుము.


పూర్వము కాశ్మీరదేశమున దేవవ్రతుడను బ్రాహ్మణుడు కలడు. వానికి మాలిని అను అందమైన కుమార్తె కలదు. అతడామెను సత్యశీలుడను వానికిచ్చి వివాహము చేసెను. సత్యశీలుడు తన భార్యయగు మాలినిని తన దేశమునకు గొనిపోయెను. అతడు మంచివాడే అయినను ఆమెయనిన పడదు. ఆమెకును అతడన్న పడదు. ఈ విధముగ వారి దాంపత్యము పరస్పరానుకూలత లేకుండెను. మాలిని భర్తను వశీకరణ చేసికొను ఉపాయములను చెప్పుడని భర్తృపరిత్యక్తలగు స్త్రీలను అడిగెను. వారును మేము మా భర్తలకు చేసినదానిని చెప్పినట్లు చేయుము. మాకు కలిగినట్లే నీకును ఫలితము కలుగునని మందు - మాకులను వశీకరణకై ఇచ్చుయోగిని వివరములను చెప్పిరి. మాలినియు వారు చెప్పినట్లు ఆ యోగిని యొద్దకు పోయి ధనము నిచ్చి తన భర్త తనకు వశమగునట్లు చేయుమని అడిగెను. యోగినికి ధనమును తన చేతి యుంగరమునిచ్చెను. యోగినియు ఆమేకొక మంత్రము నుపదేశించెను. అన్ని ప్రాణులును స్వాధీనమయ్యెడి చూర్ణము నిచ్చుచున్నాను. దీనిని నీ భర్తచే తినిపింపుము. ఈ యంత్రమును నీవు ధరింపుము. ఇందువలన నీ భర్త చెప్పినట్లు వినును అని చూర్ణమును యంత్రమునిచ్చెను. మాలినియు సంతోషముతో ఇంటికి వచ్చెను. యోగిని చెప్పిన మంత్రమును అనుష్ఠించెను. చూర్ణమును భర్తచే తినిపించెను. యంత్రమును తానుకట్టుకొనెను. ఆమె భర్తకు ఆ చూర్ణమును తినుటచే వ్యాధికలిగెను. మరికొన్ని దినములకు యేమియును అనలేనివాడు చేయలేనివాడును అయ్యెను. దురాచారురాలూగు ఆమె భర్తమరణించినచో తాను అలంకారములను విడువవలసి వచ్చునని బాధపడెను. మరల యోగి వద్దకు పోయెను. ఆమె ఇచ్చినదానిని భర్తచే తినిపించెను. వాని ఆరోగ్యము బాగుపడెను. కాని ఆమె స్వేచ్చగా సంచరించుచు విటులతో కాలక్షేపము చేయుటచే నామెకు వ్యాధులు కలిగి పలు బాధలు పడి తుదకు మరణించెను. యమలోకమును చేరి పెక్కు చిత్రవిచిత్రములగు హింసలననుభవించెను. పలుమార్లు కుక్కగా జన్మించెను. కుక్క రూపముననున్నను ఆమెకు వ్యాధులు తప్పలేదు. సౌవీరదేశమున పద్మబంధువను బ్రాహ్మణుని ఇంట పనిచేయు దాసి గృహమందు కుక్కగానుండెను. ఇట్లు ముప్పది సంవత్సరములు గడచినవి.


ఒకప్పుడు వైశాఖమాసమున ద్వాదశినాడు పద్మబంధువు కుమారుడు నదీస్నానము చేసి తిరిగి వచ్చి తులసి అరుగు వద్దకు వచ్చి పాదములను కడుగుకొనెను. సూర్యోదయమునకు ముందే వచ్చిన దాసితో బాటు వచ్చిన కుక్క తులసి అరుగు క్రింద పండుకొనియున్నది. బ్రాహ్మణుడు పాదములు కడుగుకొన్న నీరు అరుగుపైనుండి జారి క్రిండపడుకొన్న కుక్కపై పడెను. ఆ పవిత్ర జలస్పర్శ చేత కుక్కకు పూర్వజన్మ స్మృతికల్గెను. తాను చేసిన పాపములకు మిగుల పశ్చాత్తపము కలిగెను. తాను చేసిన దోషములను అన్నిటిని చెప్పి విప్రోత్తమా ! దీనురాలైన నాపై దయయుంచి వైశాఖ శుద్ద ద్వాదశినాడు చేసిన పుణ్యకార్యములను , పుణ్యఫలమును నాకు ధారపోసి రక్షింపుమని బహువిధములుగ వేడుకొనెను. కుక్క మాటలాడుటయేమని ఆశ్చర్యపడిన ఆ బ్రాహ్మణుడు అది చేసిన పాపములను విని , తాను ద్వాదశినాడు చేసిన ప్రాతఃకాల నదీస్నానము పూజ , కథశ్రవణము , జపము , తపము , హోమము , ఉపవాసము మున్నగు పుణ్యకార్యముల పుణ్యఫలము నిచ్చుటకు అంగీకరింపలేదు. కుక్క రూపమున నున్న మాలిని మరల పెక్కు విధములుగ దీనురాలై ప్రార్థించెను. బ్రాహ్మణుడంగీకరింపలేదు.


అప్పుడాకుక్క మిక్కిలి దీనముగా దయాశాలీ ! పద్మబంధూ ! నన్ను దయజూడుము గృహస్థు తను పోషింపదగినవారిని రక్షించుట ధర్మము. నీచులు , కాకులు , కుక్కలు ఆ ఇంటిలోని బలులను ఉచ్చిష్టములను తినుట చేత వానికి పోష్యములై రక్షింపదగియున్నవి. కావున నేను నీకు పోష్యరాలను. రక్షింపదగిన దానను. జగత్కర్తయగు యజమానియగు విష్ణువునకు మనము పోష్యులమై రక్షింపదగినవారమైనట్లుగ నేనును నీచే రక్షింపబడదగినదాననని బహువిధములుగ ప్రార్థించెను. పద్మబంధువు దాని మాటలను విని వెలుపలికి వచ్చి యేమని పుత్రుని యడిగెను. పుత్రుడు చెప్పిన వృత్తాంతమును కుక్కమాటలను విని అశ్చర్యపడెను. పుత్రుని జూచి నాయనా ! నీవిట్లు పలుకరాదు. సజ్జనులు ఇట్లు మాటలాడరు. పాపాత్ములు తమ సౌఖ్యముల కొరకై పాపములను చేసి అవమానితులగుచున్నారు. సజ్జనులు పరోపకారము కొరకై పాటుపడుదురు. చంద్రుడు , సూర్యుడు , వాయువు , భూమి , అగ్ని , నీరు , చందనము , వృక్షములు , సజ్జనులు పరోపకారమునకై మాత్రమే యున్నారు. వారు చేయు పనులన్నియును పరోపకారములే. వారి కోరకై యేమియు ఉండదు. గమనించితివా ? రాక్షస సంహారమునకై దధీచిదేవతలకు దయతో తన వెన్నముకను దానము చేసెను. పావురమును రక్షించుటకై శిబిచక్రవర్తి ఆకలి గల డేగకు తన మాంసము నిచ్చెను. జీమూత వాహనుడను రాజు సర్పరక్షణకై తనను గౠడునకు అర్పించుకొనెను. కావున భూసురుడు భూమిపైనున్న దేవత బ్రాహ్మణుడు దయావంతుడై యుండవలయును. మనస్సు పరిశుద్దముగ నున్నప్పుడు దైవము వర్షించును. మనశ్శుద్దిలేనిచో దైవము వర్షింపదు. చంద్రుడు ఉత్తమాది భేదము లేకుండ వెన్నెలనంతటను ప్రసరింపజేయుచున్నాడు కదా ! కావున నేను దీనురాలై అడుగుచున్న ఈ కుక్కను నా పుణ్యకార్యముల ఫలములనిచ్చి యుద్దరింతును అని పలికెను.


ఇట్లు పలికి ద్వాదశినాడు తాను చేసిన పుణ్యకార్యాల ఫలమును కుక్కకు ధారపోసి నీవు పాపములు లేని దానవై శ్రీహరి లోకమును పొమ్మని పలికెను. అతడిట్ళు పలుకుచుండగా నా కుక్క రూపమును విడిచి దివ్యభరణ భూషితురాలైన సుందరిగా నిలిచెను. బ్రాహ్మణునకు నమస్కరించి కృతజ్ఞతను దెలిపి తన కాంతితో దిక్కులను ప్రకాశింపజేయుచు దివ్యవిమానను నెక్కి పోయెను. స్వర్గమున పెక్కు భోగములననుభవించి భూలోకమున నరనారాయణ స్వరూపుడగు దైవమునుండి పుట్టి యూర్వశిగా ప్రసిద్దినందెను. యోగులు మాత్రమే పొందునట్టి , అగ్నివలె ప్రకాశించునట్టి సర్వోత్తమమగునట్టి , యెట్టివారికైన మోహమును కలిగించునట్టి పరమార్థ స్వరూపమగు సౌందర్యమునందెను. త్రిలోకసుందరిగా ప్రసిద్ది చెందెను. పద్మబంధువు ఆ ద్వాదశీ తిధిని పుణ్యములను వృద్ది చెందించు విష్ణుప్రీతికరమైన పుణ్యతిథిగా లోకములలో ప్రసిద్దినొందించెను. ఆ ద్వాదశీ తిథి కొన్ని కోట్ల సూర్యచంద్ర గ్రహణముల కంటె సమస్త యజ్ఞయాగాదులకంటె అధికమైన పుణ్యరూపము కలదై త్రిలోక ప్రసిద్దమయ్యెను.


అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి వైశాఖశుద్ద ద్వాదశీ మహిమను వివరించెనని నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు చెప్పెను.

అనుమానాన్ని నివృత్తి చేయగోరుతున్నాను.

 మీరందరూ రుద్రాభిషేకం వినే వుంటారు. యిది ఈశ్వరుని నామ విశేషాలను నమకంతోనూ చమకంతోనూ వర్ణించేది. ప్రతి వర్ణన నమకంలో నమఃతోను చమకంలో చకారముతోనూ అంతమయ్యే పదాలు. 


ఈ రుద్రాభిషేకం 5వ అనువాకం 4వ శ్లోకం లో

నమః కపర్దినేచ, వ్యుప్తకేశాయచ అని రావడం గమనించగలరు.  


కపర్ది అంటే జటాజూటం కలవాడని, దాని ప్రక్కనే వ్యుప్తకేశాయచ అంటే బోడి గుండు అంటే శిరస్సుపై వెంట్రుకలు లేకుండా ముండిత శిరస్కులు అని పద ప్రయోగం.  


ఈశ్వరుడిని లింగాకారంలోనే పూజింపబడడం పరిపాటి. అలాంటిది వారి పూర్తి శరీర సౌందర్యాన్ని ఎవ్వరూ చూసినట్టుగాని వినినట్టుగాని దాఖలాలు లేవు కదా. అలాంటి పరిస్థితులలో  జటాజూటంతో లేకుండా శరీరాకృతిని ఊహించడం కష్టమే. 


ఎక్కడైనా అలాంటి ఆకృతిని చూచారా, అటువంటి విగ్రహము నేను చూడలేదు.


కాని వ్యుప్తకేశాయచ అన్న వర్ణనను ఆపాదించడంలో ఆంతర్యమేమిటి. ఈ నా అనుమానాన్ని నివృత్తి చేయగోరుతున్నాను.

వీలైతే సహాయం చెయ్యండి.

 ***₹కలికాలం****     ఈమధ్య పేపర్లో ఒక ఫోటో చూసా చేయి చాచి అడుక్కుంటున్న బ్రాహ్మణుడు అని..


అవును బ్రాహ్మణుడు ఇప్పుడు అడుక్కోవటం ఏంటి ఎప్పటి నుండో అడుక్కుంటున్నారు,


అగ్రకులం అని చెప్పి ప్రభుత్వ రాయితీలు ఇవ్వనప్పుడు

( అయ్యా అగ్రకులలో కూడా బీదలు వుంటారు అని),


వంశపారపర్యం గా అర్చకత్వం చేస్తున్న గుళ్లనుండి వెల్లగొట్టినప్పుడు, నాలుగు మంత్రాలు చదివి రెండు అక్షింతలు వేసి డబ్బు సంపాదిస్తారు అని చులకనగా మాట్లాడినప్పుడు,

( అయ్యే మాకు ఈ పని తప్ప వేరేది రాదే అని)


అయ్యో అర్చకత్వం అంటే నాలుగు మంత్రాలు వల్లే వేయటం కాదు దానికి నిష్ఠ, ఉపవాసాలు, జాగరాలు అన్ని చేసి విగ్రహం గా మీరు చూస్తుంది విగ్రహం కాదు నా స్వామి అని నమ్మి ఇది ఉద్యోగం కాదు సమాజ సేవ , గ్రామ, దేశ శాంతి కి మేము చేసే క్రియ అని,

( పూజ అంటే అంత చులకన ఐపోయింది అని)


పళ్ళెంలో డబ్బులు వెయ్యకండి మేము పూజరికి నెలకి 3 వేలు జీతం ఇస్తున్నాం అని బోర్డ్లు పెట్టినప్పుడు,

( 3 వేలు చాలామంది ఒక రోజు రెస్టారెంట్ భోజనం ఖర్చు కదా దానితో ఎలా కుటుంభం నడపాలి అని).


వేదం చదువుకున్న, అర్చత్వం చేస్తున్న మాకు పెళ్లికి పిల్లని ఇవ్వటం లెదు అని,

( కాళ్ళకి దండం పెట్టటం కాదు, యజ్ఞ యాగాదులు చెయ్యటనికి ధర్మ పత్ని కావాలి అని )


బిసినెస్ లో కోట్లు లాభాలు రావాలి దీవించండి అని అడిగి కనీసం ఆ బీద బ్రహ్మణుడి పళ్లెం లో ఒక 10 రూపాయలు వెయ్యనప్పుడు,

( నువ్వు ఎవరికి ఎం ఇవ్వంది దేవుడు నీకు ఏదైనా ఇక ఇస్తాడు అని)


నువ్వు ఇంట్లో మాత్రం మంచి బియ్యం వాడుకుంటూ, ని గ్రహాపీడలు ని దరిద్రం అన్ని పోవాలి అని నీకోసం రెండు, మూడు గంటలు పూజ  చేసే బ్రహ్మణుడుకి మాత్రం ముక్కిపోయిన బియ్యం ఇచ్చినప్పుడు,

( ఇంటి వరకు పట్టుకెళ్లటం మోత బరువు అని )


నీకు పెళ్లి అయితే బ్రాహ్మణుడు కావాలి,

నీకు బిడ్డ పుడితే బ్రాహ్మణుడు కావాలి, ( జాతక దోషాలకి)

నీకు గృహప్రవేశానికి బ్రాహ్మణుడు కావాలి,

చివరికి నువ్వు సస్తే పిండం పెట్టటానికి కూడా బ్రాహ్మణుడు కావాలి, కానీ నువ్వు సినిమాల్లో జోకులు వేసుకోడానికి , దారి తప్పిన ఎవడో ఒకడిని చూపించి వారి వర్గం మొత్తాన్ని అవహేళన చెయ్యటనికి మాత్రం ఉపయోగిస్తావ్..


చివరిగా ఒకమాట

ఎవరి ఊరిలో వేదం చదువుకుని అర్చకత్వం చేస్తున్న నిరుపేద బ్రాహ్మణులకు ఆ ఊరి వాళ్ళు అందరూ తలుచుకుంటే సహాయం చేయటం పెద్ద విషయం కాదు, కొంత మంది అడుక్కుంటున్న కానీ చాలామంది ఆత్మాభిమానం వల్ల ఆకలితో పస్తులు వుంటున్నారు...వీలైతే సహాయం చెయ్యండి.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*శ్రీ స్వామివారి నిర్ణయం..*


*(యాభై రెండవ రోజు)*


శ్రీ స్వామివారు ఒక దృఢ నిర్ణయానికి వచ్చి..శ్రీధరరావు దంపతులను రమ్మనమని కబురుపంపించారు.. అదేరోజు సాయంత్రం శ్రీధరరావు ప్రభావతి గార్లు శ్రీ స్వామివారి వద్దకు వచ్చారు..ఆశ్రమ వరండాలో తీరుబడిగా కూర్చున్నాక..


శ్రీ స్వామివారు నవ్వుతూ.."అమ్మా..మొన్నామధ్య నేను ఆ నేలమాళిగ లో తపస్సు చేసుకోవడం చూశారుగదా?..సాధకులు ఎలా తపస్సు చేస్తారో అవగతం అయిందికదా?..నా తపస్సు కూడా చివరి దశకు వచ్చేసింది..ఇప్పుడు మీరు చేయవలసిన కార్యం ఒకటుంది..అది..అది..నా సజీవ సమాధికి మీరు ఆయత్తం కావడం..నా తపోదీక్ష పూర్తి అయింది..ఆ దత్తాత్రేయుడి అనుజ్ఞా లభించింది..నాకు ఎల్లవేళలా రక్షణ కల్పించిన ఆ పార్వతీమాత ఆదేశమూ వచ్చింది..ఇక మిగిలివున్నది మాత్రం..నా సజీవ సమాధి..అందుకు మీరు సహకరించాలి..ఇది నా కోరిక!.." అన్నారు..


శ్రీ స్వామివారి మాటలు వింటున్న శ్రీధరరావు ప్రభావతి గార్లు మాన్ప్రడి పోయారు..వాళ్ళిద్దరికీ శ్రీ స్వామివారు యేమి చెపుతున్నారో అర్ధం కావడానికి కొద్దిసేపు పట్టింది..


"నాయనా!..ఇదేమి కోరిక?..మేము మా చేతులతో ఆ పని చేయగలమా?..అయినా ఇప్పుడు..ఈ చిన్న వయసులో మీకు ప్రాణత్యాగం చేయాలనే తలంపు ఎందుకు కలిగింది?.." అన్నారు ప్రభావతి గారు..


ఆ వెంటనే శ్రీధరరావు గారు.."తపస్సు పూర్తిచేసుకుని..మరికొన్నాళ్లు ఆధ్యాత్మిక చింతనలో కాలం గడుపవచ్చు..ఎందరికో మార్గదర్శనం చేయవచ్చు..మాబోటి వారికి ఒక అవధూతను సేవించుకునే భాగ్యం కలగడమే ఒక గొప్ప వరం..అటువంటిది మా చేతులతో మేమే ఆ అవధూతను సజీవంగా సమాధి చేయటం అయ్యే పనేనా?.." అన్నారు..


శ్రీ స్వామివారు ప్రశాంతంగా చూస్తూ.."నాకు భగవంతుడు ఇచ్చిన సమయం పూర్తి కావొచ్చింది..ఇక నేను ఎక్కువకాలం జాగు చేయకూడదు..సరే..దైవ నిర్ణయం ఎలా వుంటే..అలా జరుగుతుంది..మీరు మాత్రం సిద్ధంగా వుండండి.." అన్నారు..


ఆ దంపతులు ఆ క్షణంలో ఇక ఆ సంభాషణ పొడిగించదల్చుకోలేదు..ఇద్దరూ లేచి.."వెళ్లివస్తాము నాయనా!.." అని చెప్పి..తిరిగి బండిలో తమ ఇంటికి వచ్చేసారు..దారిలో ప్రభావతి గారు.."ఇదేమిటి శ్రీవారూ..ఇలాటి కోరిక వెలిబుచ్చాడీయన?..మనమెలా సహకరిస్తాము?.." అన్నారు.."ప్రభావతీ..ఇక్కడ ఏర్పాట్లలో ఏదైనా లోపం జరిగిందేమో..లేదా తపస్సు సరిగా సాగటం లేదేమో..ఒకసారి వారి గురువు గారి వద్దకు వెళ్లి వచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాము..గురువు మాట వినకుండా వుండరు కదా?..ఇటువంటి సాధకులు, అవధూతలు నేటి కాలానికి చాలా అవసరం..అర్ధాంతరంగా శరీరం విడిచి పెడితే..సమాజానికి తీరని నష్టం..మనవంతు ప్రయత్నం మనం చేద్దాము.." అన్నారు..ఈ విషయమై రాత్రి పొద్దుపోయేదాకా చర్చించుకుంటూనే వున్నారు..


వాళ్ళిద్దరికీ ఆ సమయం లో తెలీదు తమకు లెక్కలేనన్ని సమస్యలు చుట్టుముట్టబోతున్నాయని..వాటిలో తాము ఉక్కిరిబిక్కిరి కోబోతున్నామనీనూ..


ఒకవారం గడిచిపోయింది..ఈలోపల ప్రభావతి గారి చెల్లెలు కాపురంలో కలతలు వచ్చి..మతి చెడి తన చిన్న కూతురు (సంవత్సరం వయసున్న పాప ) తో సహా మొగలిచెర్లకు వచ్చేసింది..ఆ చిన్నపిల్ల ఆలనా పాలనా..అలాగే ఆ చెల్లెలు బాగోగులు చూసుకోవడం ప్రభావతి గారికి సరిపోతోంది..చెల్లెలు యొక్క పరిస్థితి బాగవుతుందేమో నని ఒకసారి శ్రీ స్వామివారి వద్దకు తీసుకెళ్లారు ప్రభావతి శ్రీధరరావు గార్లు.."ఈ అమాయకపు తల్లికి త్వరలోనే ముక్తి వుందమ్మా.." అన్నారు స్వామివారు..ఆ "ముక్తి " అన్నమాటకు..త్వరలో కష్టాలు తీరి, కాపురం చక్కబడుతుందని ఈ దంపతులు ఊహించి సంతోషపడ్డారు..తీరా కొద్దిరోజుల్లోనే ఆ సోదరి మరణించి జీవన్ముక్తి పొందింది..


"అమ్మా..ఆ అమ్మాయి సమస్యకు ఈ విధంగా ముక్తి కలగడం ఒక్కటే పరిష్కారం..దైవం అలానే నిర్ణయిస్తాడు..మరో సమస్య కూడా త్వరలోనే తీరిపోతుంది..మీకున్న ఒక్కక్క బంధమూ ముడి విప్పినట్లు విడిపోతాయి..కొంత బాధ తప్పదు!.." అన్నారు శ్రీ స్వామివారు నిర్వికారంగా చూస్తూ..


అర్ధమయీ.. అర్ధం కానట్లు గా అనిపించి..శ్రీ స్వామివారి వద్ద సెలవు తీసుకొని ఇంటికి వచ్చేసారు శ్రీధరరావు ప్రభావతి గార్లు..


జీవసమాధి గురించిన వివరణ.. అద్భుత సందేశం..రేపటి నుంచి..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

అరుణ ప్రశ్న... తెలుపుచున్నది

 క దీప్తిః  కిం పారాయణం...ఋగ్వేదలోని అరుణ ప్రశ్న... తెలుపుచున్నది. ఏది వెలుగు రూపంలో వున్నది. ఏది  పరముగా అణువు ఆయతనమైనది, అనగా వ్యాప్తి చెందినది. పరము అనగా కంటికి కనిపించని శక్తి తత్వమని, కాని దాని లక్షణము భూమిని ఆశ్రయించిన తరువాతనే దాని లక్షణము తెలియుచువ్నది. అణువులు ఆయతనమైనది కంటికి కనిపించని అనంతమైన కణ సముదాయముగా దేహములోనికి ప్రవేశించి దీప్తిః ప్రకాశించుచున్నది. క జీవుడు అని లలితా సహస్రం తెలుపుచున్నది. లలితా సహస్రం అంతయు మంత్ర శాస్త్రము. ప్రతీ అక్షరం విశిష్టమైన శబ్ద శక్తి కలిగి దాని వ్యాప్తమే ప్రకృతియని దానినే మనం సృష్టికి కారణ రూపమైన అమ్మయని అంటున్నారు. అమ్మ వలననే క జీవ లక్షణము తెలియుట.అమ్మ దేహమునకు సంబంధించిన పదార్థముల ద్వారా కలిగియున్న లక్షణము లన్నియు మనకు పదార్ధ రూపములో సంక్రమించుచున్నవి. అదే క దీప్తిః? ప్రకాశించుచున్నవి. కిం  పారాయణం? ప్రతీ అక్షరమును దాని వుత్పత్తి సత్యమును తెలుసుకొనే ప్రయత్నమే ఙ్ఞానము. అనంతమైన శక్తి లక్షణమనే ఙ్ఞానమును తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వూందాం.

*60+ is No Age Bar

 *60+ is No Age Bar*

💞


🌷 Why should companies recruit people over 60 for senior and in responsible positions ?


Because they are more productive than those below 60 !


🌷 A massive study in America has found that the most productive age in a man's life is 60-70,


🌷 From 70-80 is the 2nd most productive age.


🌷 The 3rd most productive age is 50-60.


🌷 The average age of a Nobel Prize winner is 62.

 

🌷 The average age of a CEO in a Fortune 500 company is 63.


🌷 The average age of the pastors of the 100 biggest churches in America is 71.


🌷 The average age of Pope is 76


This tells us somehow


🌷 God has designed that the best years of your life are 60-80 !*


🌷 IT IS WHEN YOU DO YOUR BEST WORK.


🌷 A study published in NEJM found that at 60, you reach your peak of potential and continue up to 80 !*


🌷 So, if you are between 60-70, or 70-80, you have the best and second best years of your life with you !


🎯 Source:

 New England Journal of Medicine: 70.389 (2018)


⏯All senior citizens need not worry about age at all. Be Happy_ & Cheer