క దీప్తిః కిం పారాయణం...ఋగ్వేదలోని అరుణ ప్రశ్న... తెలుపుచున్నది. ఏది వెలుగు రూపంలో వున్నది. ఏది పరముగా అణువు ఆయతనమైనది, అనగా వ్యాప్తి చెందినది. పరము అనగా కంటికి కనిపించని శక్తి తత్వమని, కాని దాని లక్షణము భూమిని ఆశ్రయించిన తరువాతనే దాని లక్షణము తెలియుచువ్నది. అణువులు ఆయతనమైనది కంటికి కనిపించని అనంతమైన కణ సముదాయముగా దేహములోనికి ప్రవేశించి దీప్తిః ప్రకాశించుచున్నది. క జీవుడు అని లలితా సహస్రం తెలుపుచున్నది. లలితా సహస్రం అంతయు మంత్ర శాస్త్రము. ప్రతీ అక్షరం విశిష్టమైన శబ్ద శక్తి కలిగి దాని వ్యాప్తమే ప్రకృతియని దానినే మనం సృష్టికి కారణ రూపమైన అమ్మయని అంటున్నారు. అమ్మ వలననే క జీవ లక్షణము తెలియుట.అమ్మ దేహమునకు సంబంధించిన పదార్థముల ద్వారా కలిగియున్న లక్షణము లన్నియు మనకు పదార్ధ రూపములో సంక్రమించుచున్నవి. అదే క దీప్తిః? ప్రకాశించుచున్నవి. కిం పారాయణం? ప్రతీ అక్షరమును దాని వుత్పత్తి సత్యమును తెలుసుకొనే ప్రయత్నమే ఙ్ఞానము. అనంతమైన శక్తి లక్షణమనే ఙ్ఞానమును తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వూందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి