22, మే 2022, ఆదివారం

దేవతారధన

 దేవతారధన సందేహలకు సమాధానాలు.....*


1. ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం వీటిలో ప్రస్తుత కాలానికి ఏది అనుసరణీయం...

ద్వైతం అనేది వ్యావహారికం, అద్వైతం అనేది పారమార్ధికం భగవంతుడు వేరు, నేను వేరు అనే భావన ఉంటేగాని మనం భగవంతుడిని పూజించలేము. జ్ఞానం వచ్చేంతవరకు ద్వైతం ఉపయోగపడుతుంది. జ్ఞానం వచ్చిన తరువాత అద్వైతం ఉంటుంది. కలగంటున్న వరకు అది కల అని తెలియదు. బాహ్యస్మృతి లోకి వచ్చాక మాత్రమే అది కల అని తెలుస్తుంది. ద్వైతంలో ఉన్నా, విశిష్టాద్వైతంలో ఉన్నా చివరికి అద్వైతంలోకి రావలసిందే. ఎందుకంటే జగత్తు అంతా మిధ్య, బ్రహ్మం ఒక్కడే అంటే అందరూ అర్థం చేసుకోలేరు. ఈ ఉపాసనలు, ఆరాధనలు అద్వైతం కోసమే. కనుక ద్వైతంలోనే ఉంటూ చివరికి అద్వైతంలోకి చేరుకోవలసినదే.

2. ఏకేశ్వరోపాసన, బహు దేవతారధనలలో ఏది మంచిది...

ఏకేశ్వరోపాసన చేసినా, అనేకమంది దేవతలను పూజించినా ఏ వ్యత్యాసము లేదు. ఎందుకంటే.. భగవంతుడు ఒక్కడే కాని రూపాలు, నామాలు అనేకం ఉన్నాయి. ఆ రూపాల వెనుక ఉండే చైతన్యం మాత్రం ఒక్కటే. మనం ఈశ్వరుడిని ఆరాధించినా, విష్ణువుని ఆరాధించినా ఫలంలో ఎటువంటి తేడా ఉండదు. ఈశ్వరుడు ఎటువంటి ఫలాన్ని ఇస్తాడో, విష్ణువు అదే ఫలాన్ని ఇస్తాడు. ఇతర దేవతలు అదేవిధమైన ఫలాన్ని ప్రసాదిస్తారు.

౩. హిందు మతంలో ఇందరు దేవుళ్ళు, ఇన్ని సంప్రదాయాలు ఎందుకు ఉన్నాయి...

మనం వినాయకచవితికి గణపతిని, నవరాత్రికి అమ్మవారిని, శివరాత్రికి శివుడిని ఇలా ఏ పర్వదినానికి తగ్గట్లు ఆ దేవుడు, దేవత రూపాన్ని పూజిస్తాం. అలాగని మనం నలుగురు దేవతలని ఆరాధించినట్లు కాదు. ఓకే దేవుడిని నాలుగుసార్లు పూజించి నట్లు. మరి ఎందుకని అన్ని రూపాలు అంటే, సాధకులను అనుగ్రహించడం కోసం భగవంతుడు ఎవరి స్థాయిలో వారికి, వారికి రుచించిన రూపంలో వస్తాడని. అందుకనే ఇన్ని రూపాలు అని ఆదిశంకరులు చెబుతారు.

4. మన సనతన ధర్మాన్ని పరిరక్షించాలి అంటే ఏమి చేయాలి...

ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని ఆచరించడమే. అందుకోసం చిన్నప్పటి నుండి పిల్లలకు మంచి సంస్కారాన్ని అందించే రామాయణ, మహాభారత, భాగవతాల కథలు తెలియజేయాలి. అందువలన ఆ కథల వలన వారిలో మంచి సంస్కారం ఏర్పడుతుంది. బాల్యం నుండి స్వధర్మాన్ని అలవరచాలి. పిల్లలు కూడా శ్రద్దగా నేర్చుకోవాలి. వారు విననప్పుడు పెద్దలు దండన మార్గాన్ని అనుసరించి అయినా స్వధర్మాన్ని అలవారచాలి.

5. మాధవసేవ చేస్తే పుణ్యం వస్తుంది, మరి మానవసేవ వలన ప్రయోజనం ఏమిటి...

ఉపకార గుణం అనేది మనిషిలో ప్రాథమికంగా ఉండవలసిన లక్షణం. అది లేకపోతే మనిషి తాను మనిషి అనుపించుకోవడానికి కూడా యోగ్యుడు కాదు. కష్టాలలో ఉన్నవారికి ఎన్నో రకాల సేవాకార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు మనస్సులో పరిశుద్దమైన భావన ఉండాలి. ప్రఖ్యాతి కోసం చేయకూడదు. నాకేదో ఫలం లభించాలి, నేను చేసింది ప్రపంచం మొత్తం తెలియాలి అని ఆలోచించకూడదు. అప్పుడు భగవంతుడు మనల్ని ఇష్టపడతాడు. అయన అనుగ్రహ ఫలాలను ప్రసాదిస్తాడు...

*|| ఓం నమః శివాయ ||*

Spiritual Seekers 🙏
https://www.facebook.com/groups/280040632911780

Spiritual Seekers 🙏
https://youtube.com/channel/UCeSnPJ2eiDGsYewU7R8tIOA 

రితవే నమః

 🔔రితవే నమః🔔

         🚩🚩


దశరధ మహారాజు ఒకసారి తన  మంత్రి సుమంత్రుని

పిలిచి,  రాముని  వెంటనే తన సమక్షానికి పిలిపించమని ఆదేశించాడు.

సుమంత్రుడు రాముడి భవనానికి వెళ్ళి 

" చక్రవర్తి మిమ్మల్ని వెంటనే చూడాలి అనుకుంటున్నారు రమ్మని పిలిచారు"అని

చెప్పాడు.  సమీపమునే వున్న సీతాదేవి, 

" స్వామీ ..ఏదో ముఖ్యమైన  విషయమే

అయివుంటుంది. అందుకే మీ తండ్రిగారు పిలుస్తున్నారు.

వెంటనే వెళ్ళండి" అని అన్నది. రాముడు

సుమంతునితో  బయలుదేరి

దశరధుని భవనానికి వెళ్ళాడు.

రాముడు రావడం చూసిన దశరధునికి

చాలా ఆనందం కలిగింది. 

" రా..రామా..రా రామా ..అని సంతోషంగా

ఆహ్వానించాడు. రాముడు  తండ్రి దశరధుని పాదాలకు ప్రణామం చేసి ఆయన ఆదేశం వినడాని

ఎదురు చూస్తూ వినయంగా నిలబడ్డాడు.  గంభీరమైన రాముని

అందాన్ని నేత్రాలతోనే  ఆస్వాదిస్తున్న దశరధుడు  ఏమీ మాటాడలేదు. 

కొంతసేపైన పిదప రాముడు " తండ్రీ..

ఏమి పనిమీద యీ దాసుని పిలిపించారు?"

అని అడిగాడు.


" ఏమీ లేదు రామా.. ఊరికినే పిలిచాను.

వెళ్ళి రా.."  అని అన్నాడు దశరధుడు. 

" సరే ..అని  రాముడు దశరధుని వద్ద శెలవు తీసుకొని అంతఃపురం 

వెలుపలికి వచ్చాడు. 

దశరధుడు తిరిగి సుమంతుని పిలిచి రాముని

పిలుచుకురమ్మని చెప్పాడు. మరల

సుమంతుడు రాముని పిలుచుకుని వచ్చాడు. 

రాముడు తండ్రికి నమస్కరించి, "  పిలిచిన కారణం ఏమిటి...అని  వినయంగా అడిగాడు.  " ఏమి లేదు రామా ..వెళ్ళి రా..

అన్నాడు  దశరధుడు. 

తండ్రిని వదిలి తిరిగి వెళ్ళిపోయాడు రాముడు. మూడోసారి

తిరిగి రాముని తీసుకుని రమ్మని సుమంతునికి చెప్పాడు దశరధుడు.

రాముడు రాగానే "ఏమీ లేదు రామా..

వెళ్ళి రా"..అన్నాడు దశరధుడు.


ఇలా ఈవిధంగా

ఏ కారణం లేకుండా దశరధుడు రాముని

పిలిపించడం, కొన్ని క్షణాల తర్వాత వెళ్ళమనడం వెనక గల కారణాన్ని  వాల్మీకి మహర్షి రామాయణంలోని

అయోధ్యాకాండ 3వ సర్గంలో 39...వ

శ్లోకంలో  చాలా రసవత్తరంగా తెలిపారు.


సకలగుణాభిరాముడైన రాముడంటే దశరధునికి చాలా ప్రేమ.రాముని గుణగణములతో పాటు ఆతని అందచందాలు, గంభీరమైన నడక  దశరధునికి అత్యంత తన్మయత్వం కలిగించేది. రాముని నడవడిక,

అందచందాలు చూసే వారందరి

మనసులకి అత్యంత ఆనందం కలిగించే

ఆకర్షణ కలిగినవి.  కరువు కాటకాలతో  మాడిపోయేవారికి నిండు వర్షమేఘాలు  యేవిధమైన

సంతోషాన్ని, తృప్తిని కలిగిస్తాయో  అదేవిధంగా

రాముని అందం, సుగుణాలు  చూసేవారి మనసులను రంజింపచేసి పరవశింపజేస్తాయి.

అటువంటి రఘురాముని నడక అందం అంటే దశరధుని కి చాలా ప్రీతి.  అందుకే రాముని పదే పదే తన సమక్షానికి ఏ కారణమూ లేకుండా రప్పించి , ఆయన వచ్చి వెళుతున్నప్పుడల్లా శ్రీరాముని నడక అందాలను , గాంభీర్యాన్ని చూసి ఆనందించి తన్మయుడయ్యేవాడు దశరధుడు.


ఈ విధంగా తన గుణగణాలతో, వినయంతో ప్రజలందరి  మనసులను రజింపచేసి  వారి ప్రేమాభిమానాలు

చూరగొంటున్నందు వలన శ్రీరాముడు 

' రితుః'

అని పిలువబడుతున్నాడు. 

ఈ నామము సహస్రనామములలో

417 వ నామము.


నిత్యము

 ' రితవే నమః' అని జపించే భక్తుల హృదయాలలో రాముడు

నివసించి వారికి సంతోషము కలుగజేస్తాడు.


🚩🚩🕉️🙏

తెలుసుకోవలసినవి

 *🕉️ప్రతి యొక్క హిందువు తప్పకుండ తెలుసుకోవలసినవి🕉️*


1. లింగాలు : 3

        పుం, స్త్రీ, నపుంసక.


2. వాచకాలు : 3.

      మహద్వా, మహతీ, అమహత్తు.


3. పురుషలు : 3.

    ప్రథమ, మధ్యమ, ఉత్తమ.


4. దిక్కులు : 4.

      తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం.


 5. మూలలు : 4.

         ఆగ్నేయం, నైఋతి, వాయువ్యం, ఈశాన్యం.


6. వేదాలు : 4.

  ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం.


7. ఉపవేదాలు : 4.

   ధనుర్వేదం, ఆయుర్వేదం, గంధర్వ వేదం, శిల్ప


8. పురుషార్ధాలు : 4.

   ధర్మ, అర్థ, కామ, మోక్షాలు.


9. చతురాశ్రమాలు : 4.

     బ్రహ్మ చర్యం, గార్హస్య, వానప్రస్థం, సన్యాసం.


10. పంచభూతాలు : 5.

     గాలి, నీరు, భూమి,      ఆకాశం, అగ్ని.


 11. పంచేంద్రియాలు : 5.

        కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం.


 12. భాషా భాగాలు : 5.

         నామవాచకం, సర్వనామం, విశేషణం,         

         క్రియ, అవ్యయం.


13. ప్రధాన కళలు : 5.

    కవిత్వం, చిత్రలేఖనం, నాట్యం, సంగీతం, శిల్పం.


14. పంచకావ్యాలు : 5.

     ఆముక్తమాల్యద, వసుచరిత్ర, మనుచరిత్ర, పారిజాతాపహరణం, శృంగార నైషధం.


15. పంచగంగలు : 5.

      గంగ, కృష్ణ, గోదావరి, కావేరి, తుంగభద్ర.


16. దేవతావృక్షాలు : 5.

    మందారం, పారిజాతం, కల్పవృక్షం,సంతానం, హరిచందనం.


17. పంచోపచారాలు : 5.

      స్నానం, పూజ, నైవేద్యం, ప్రదక్షిణం, నమస్కారం.


18. పంచాగ్నులు : 5.

        బడబాగ్ని, జఠరాగ్ని, కష్టాగ్ని, వజ్రాగ్ని,  సూర్యాగ్ని.


19. పంచామృతాలు : 5.

        ఆవుపాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె.


20. పంచలోహాలు : 5.

       బంగారం, వెండి, రాగి, సీసం, తగరం.


21. పంచారామాలు : 5.

        అమరావతి, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రా(ద)క్షారామం.


22. ధర్మరాజు అడిగిన ఊళ్ళు :

 1. అవిస్థల/కుశస్థల                           (కన్యాకుబ్జ/Kannauj)

 2. వారణావతం(ఇక్కడే లక్కఇల్లు                   కట్టించాడు దుర్యోధనుడు. మీరట్ నుండి 19కి.మీ. అనీ, కాదూ, ఋషీకేష్ దగ్గర శివపురి అనీ చరిత్రకారుల                  ప్రస్తావన)

 3. వృకస్థల(గుర్గావ్ దగ్గర, హర్యానా)

 4. మాకండి(గంగా నది ఒడ్డున ఓ పల్లెటూరు

(మరొక ఊరు కౌరవులకు ఏదనిపిస్తే ఆ ఊరు) 

23. వేదాంగాలు(స్మ్రతులు) : 6.

 శిక్ష , వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం.


24. షడ్రుచులు : 6.

     తీపి, పులుపు, చేదు, వగరు, కారం, ఉప్పు.


25. అరిషడ్వర్గాలు(షడ్గుణాలు) : 6.

 *కామం* (అంటే కోరిక అని మాత్రమే అర్థం. అంటే మన మనసులో కావాలి అని కలిగే ప్రతిదీ కూడ కోరికే), 


*క్రోధం* (అనగా కోపం లేదా ఆగ్రహం. మన మనసుకు నచ్చని లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించినా లేదా వ్యతిరేకించినా వారిపై మనకు కలిగే వ్యతిరేకానుభూతి లేదా ఉద్రేకాన్ని కోపంగా నిర్వచించవచ్చు), 


*లోభం* (అంటే తాను సంపాదించుకున్నది, పొందింది తనకే సొంతమని భావించడం. అందులో నుంచి పూచిక పుల్ల కూడా ఇతరులకు చెందకూడదని దాన, ధర్మాలు చేయకపోవడం), 


*మోహం*(లేని దానిని అనుభవించాలన్న కోరిక), 


*మదం*(అంటే కొవ్వు, పొగరు. మదం 8 రకాలు అంటే అష్టమదములు

అవి - 

1. అన్నమదం, 

2. అర్థమదం, 

3. స్త్రీ మదం

4. విద్యామదం, 

5. కులమదం, 

6. రూపమదం,

7. ఉద్యోగమదం, 

8. యౌవన మదం 


*మాత్సర్యం*(తనకున్న సంపదలు ఇతరులకు ఉండకూడదని, తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని, ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదనే ఈర్ష్య కలిగి ఉండటం)


26. ఋతువులు : 6.

   వసంత, గ్రీష్మ, వర్ష, శరద్ఋతువు, హేమంత, శిశిర.


27. షట్చక్రాలు : 6.

        మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, 

        అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రాలు.


28. షట్చక్రవర్తులు : 6.

     హరిశ్చంద్రుడు, నలుడు, సగరుడు, పురుకుత్సుడు, పురూరవుడు,  

కార్తవీర్యార్జునుడు.


29. సప్త ఋషులు : 7.

  కశ్యపుడు, గౌతముడు,         అత్రి, విశ్వామిత్రుడు, 

భరద్వాజ, జమదగ్ని,  వశిష్ఠుడు.


30.  సప్తగిరులు : 7.

       శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి,       

       వృషభాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి.


31. కులపర్వతాలు : 7.

      మహేంద్ర, మలయ, సహ్య, శుక్తిమంతం, గంధమాధనం, 

వింధ్య, పారియాత్ర.


32. సప్త సముద్రాలు : 7.

       ఇక్షు, జల, క్షీర, లవణ, దధి, సూర, సర్పి.


33. సప్త వ్యసనాలు : 7.

      జూదం, మద్యం, దొంగతనం, వేట, 

 వ్యభిచారం, దుబార ఖర్చు, కఠినంగా మాట్లాడటం.


34. సప్త నదులు : 7.

     గంగ, యమునా, సరస్వతి, గోదావరి,            

  సింధు, నర్మద, కావేరి.


35. ఊర్ధ్వలోకాలు : 7.

      భూ, భువర్ణో, సువర్ణో, తపో, జనో, మహా, సత్య.


36. అధోః లోకాలు : 7.

      అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ.


37. జన్మలు : 8.

     దేవ, మనుష్య, రాక్షస, పిశాచి, పశు, పక్షి, జలజీవ, కీటక.


38. కర్మలు : 8.

     స్నానం, సంధ్య, జపం, హోమం, స్వాధ్యాయం, దేవపూజ, ఆతిథ్యం, 

 వైశ్వదేవం.


39. అష్టదిగ్గజాలు :

      ఐరావతం, పుండరీకం, కుముదం, సార్వభౌమం, అంజనం, సుప్రతీకం, 

 వామనం, పుష్పదంతం.

ధర్మమార్గము అంటే*

 *ధర్మమార్గము అంటే* 



ఒకప్పుడు, అత్యంత సద్గుణవంతుడైన పెద్దమనిషి తన కుటుంబంతో సహా తీర్థయాత్రకు బయలుదేరాడు.



అనేక మైళ్ల దూరం ప్రయాణించిన తరువాత, కుటుంబం మొత్తం దాహంతో పరితపించారు.  అవి తీవ్రమైన వేసవి నెలలు కావడంతో నీరు ఎక్కడా కనిపించలేదు.  వారు వెంట తెచ్చుకున్న నీరు కూడా అయిపోయింది.   పిల్లలు  దాహంతో అలమటిస్తున్నారు,  అతని వద్ద ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం  లేకపోయింది.  చివరి ప్రత్యామ్నాయంగా  దైవాన్ని ప్రార్థించే సమయం వచ్చింది, "ఓ ప్రభూ!  దయచేసి  ఈ పరిస్థితిని పరిష్కరించే భారం మీదే ",  అని వేడుకున్నాడు.



వెంటనే, అతను కొంత దూరంలో ధ్యానంలో కూర్చోనిఉన్న ఒక ఋషి ని చూశాడు.  ఆ వ్యక్తి ఋషి వద్దకు వెళ్లి తన సమస్యను వివరించాడు.  ఆ ఋషి, ‘ఇక్కడ నుండి ఒక మైలు దూరంలో, ఉత్తరాన ఒక చిన్న నది ప్రవహిస్తుంది, మీరు అక్కడకు వెళ్లి మీ దాహం తీర్చుకోవచ్చు’, అని అతనికి తెలియజేశాడు.



ఇది విని ఆ వ్యక్తి చాలా సంతోషించి, ఋషికి కృతజ్ఞతలు తెలిపాడు. నడవలేని పరిస్థితిలోఉన్న తన భార్య , పిల్లలను అక్కడే ఉండమని చెప్పి, అతనే  స్వయంగా నది వైపు నీరు తీసుకురావడానికి వెళ్లాడు.



అతను నీటితో తిరిగి వస్తుండగా, దారిలో విపరీతమైన దాహంతో ఉన్న ఐదుగురు వ్యక్తులు కనిపించారు, అతను చాలా ధర్మశీలుడైనందున, వారిని ఆ స్థితిలో చూడలేకపోయాడు,  దాహంతో ఉన్న వారికి తన నీటిని ఇచ్చి, తిరిగి నదికి వెళ్లాడు.  అతను తిరిగి వస్తున్నప్పుడు,  మళ్లీ నీటి కోసం ఉక్కిరిబిక్కిరి అవుతున్న కొంతమంది వ్యక్తులను కలుసుకున్నాడు. మరోసారి, అతను తన నీటిని మొత్తం వారికి ఇచ్చాడు.



అతను మూడవసారి నీరు తీసుకుని  కుటుంబాన్ని చేరే సమయానికి, వారందరూ తీవ్రమైన దాహార్తికి గురై,  అపస్మారక స్థితిలో నేలపై పడి ఉన్నారు.  వారి ముఖాలపై నీరు చల్లి మేల్కొల్పడానికి చాలా ప్రయత్నించాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. అతను తీవ్రంగా ఏడ్చాడు, నిరాశతో ఋషి వద్దకు పరుగెత్తాడు.  అతని పాదాలపై పడి దుఃఖిస్తూ, “మహర్షీ చెప్పండి, నా కుటుంబం ఈ స్థితిలో ఉండటానికి నేను ఏపాపం చేసాను? నేను ఆపదలోఉన్నవారికి  సహాయం చేసి, ధర్మబద్ధమైన పని చేసాను.  దయచేసి నా కుటుంబానికి సహాయం చేయండి స్వామి,” అని వేడుకున్నాడు.



దానికి ఋషి, "ఓ సజ్జనుడా! నీవు నది నుండి నీళ్లు తెచ్చుకుంటూ, దాహంతో ఉన్న బాటసారుల కోసం నీ పాత్రను ఖాళీ చేసుకున్నావు. దీనివల్ల నువ్వు ఏమి ప్రయోజనం పొందావు చెప్పు?" అని అడిగాడు.



ఆ వ్యక్తి ఇలా జవాబిచ్చాడు, "దాని నుండి నేను పొందే దాని గురించి నేను ఎన్నడూ ఆలోచించలేదు; ఎలాంటి స్వార్థపూరితమైన ఆలోచన లేకుండా నేను ధర్మాన్ని పాటించానని భావించాను."



ఋషి ఇలా అన్నాడు, " మీ బాధ్యతలను నెరవేర్చలేనప్పుడు, అలాంటి నీతి, ధర్మాల వలన ఉపయోగం ఏమిటి? నీ స్వంత పిల్లలను, కుటుంబాన్ని కాపాడుకోలేని పుణ్యం వల్ల ఏమిటి లాభం? మీరు మీ ధర్మాన్ని నేను చూపిన మార్గంలో కూడా నెరవేర్చి ఉండవచ్చు కదా!."



ఆ వ్యక్తి ఆసక్తిగా, "ఎలా మహానుభావా?" అని అడిగాడు.



దానికి ఋషి, "నీ కోసం నేను నీళ్లు ఇవ్వడానికి బదులుగా, నదికి వెళ్లే మార్గాన్ని నీకు చూపించాను. మీరు కూడా, ఆ దారిన వెళ్లే వారందరికీ మార్గం చూపించి, వారిని నదికి నడిపించాల్సింది. ఆ విధంగా, మీ స్వంత కుటుంబంతో సహా అందరి దాహం తీరిఉండేది.  ఇతరుల కోసం ఎవరూ తమ స్వంత పాత్రను ఖాళీ చేయాల్సిన అవసరం లేదు."   అని   ఋషి ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు తన దీవెనలు ఇచ్చి, అదృశ్యమయ్యాడు.



ఆ వ్యక్తి  తన గుణపాఠాన్ని నేర్చుకున్నాడు. స్వంత  బాధ్యతలను విస్మరించి, మంచి పనుల్లో పాల్గొనడం అంత ధర్మం కాదని ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకున్నాడు.



 మీరు ముందుగా మీ విధులను నిర్వర్తించాలి, తద్వారా ఇతరులకు ధర్మ మార్గాన్ని ప్రేరేపించాలి  మార్గదర్శనం చేయాలి 



ఎవరికైనా మంచి చేయడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, భగవంతుని మార్గాన్ని, సత్య మార్గాన్ని చూపించటమే.


🙏

బ్రాహ్మీముహూర్తం

 బ్రాహ్మీముహూర్తంలో లేస్తే ఏంటట

 అనేవారికి సమాధానం 🙏

****"****************


ఉదయాన్నే నిద్రలేవాలని మన పెద్దవాళ్లు తెగ పోరేవారు. అలా చెప్పీ చెప్పీ చాలా తరాలు వెళ్లిపోయాయి. తరం మారుతున్న కొద్దీ జీవవనశైలి మారిపోతోంది. నిద్రలేచే సమయాలూ, పనిచేసే వేళలూ మారిపోతున్నాయి. కొన్నాళ్ల తరువాత పని చేయడానికీ, నిద్రపోవడానికీ రాత్రీపగలుతో సంబంధమే లేకపోవచ్చు. కానీ ఇప్పటికీ బ్రాహ్మీముహూర్తం` అన్న మాట అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటుంది. ఇంతకీ ఆ బ్రాహ్మీముహూర్తం అంటే ఖచ్చితంగా ఏ సమయంలో వస్తుంది. ఆ సమయంలో నిద్రలేవడం వల్ల ప్రయోజనం ఏంటి!


సూర్యోదయానికి 96 నిమిషాల ముందున్న కాలాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు. అయితే రుతువుని బట్టి సూర్యోదయ వేళలు మారిపోతూ ఉంటాయి కాబట్టి, 4:00 -4:30 a.mని బ్రాహ్మీముహూర్తంగా అనుకోవచ్చు. బ్రాహ్మీ అంటేనే సరస్వతి అని అర్థం. మన పెద్దలు చాలా ఆలోచించే ఆ పేరు పెట్టారేమో అనిపిస్తుంది. ఈ సమయంలో నిద్రలేవడం వల్ల ఉపయోగం ఏంటి అని అడిగే ప్రశ్నకు చాలానే జవాబులు వినిపిస్తాయి.


ఆ సమయంలో ప్రకృతి మొత్తం ప్రశాంతంగా, నిద్రలోని ఆఖరి జామును గడుపుతూ ఉంటుంది. సూర్యుని వేడి భూమిని కాస్త తాకుతూ ఉంటుంది, కానీ వెలుతురు ఇంకా మనల్ని చేరుకోదు. అంటే రాత్రివేళ చల్లదనాన్నీ, పగటివేళ చురుకుదనాన్నీ ఏకైక కాలంలో కలిగిఉండే సమయం ఇదన్నమాట!


 అందుకే ఈ సమయంలో మనుషులు సత్వగుణం ప్రధానంగా ఉంటారట. లేలేత కిరణాలు శరీరాన్ని తాకడం చాలా మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు కాబట్టి, ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సూర్యనమస్కారాలు చేయడమో, వ్యాహ్యాళికి వెళ్లడమో చేస్తే ఆరోగ్యానికి మంచిది.


మనలో జీవగడియారం అనేది ఒకటి ఉంటుంది. అది మనం ఏర్పరుచుకున్న అలవాట్లను బట్టీ, ప్రకృతిని బట్టీ నడుచుకుంటూ ఉంటుంది. నిద్రపోవడం, లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం… ఇవన్నీ సమయానికి అనుకూలంగా చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. సాక్షాత్తూ ఆయుర్వేదమే `తన ఆరోగ్యాన్నీ, ఆయుష్షునూ కాపాడుకోవాలని అనుకునేవాడు బ్రాహ్మీముహూర్తంలో లేవాలి` అని చెబుతోంది.


 పైగా ఆయుర్వేదం ప్రకారం ఈ సమయం `వాత` ప్రధానంగా ఉంటుంది. శరీరంలో కదలికలనీ, ఆలోచనలనీ, రక్తప్రసరణనీ ప్రభావితం చేసేది ఈ `వాత` లక్షణం. ఈ లక్షణం మన శరీరంలో ప్రముఖంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి పనినైనా చురుగ్గా చేయగలం; ప్రశాంతంగా ఉండగలం; మంచి ఆలోచనలు చేయగలం; చదివినదానిని ఆకళించు చేసుకుని దీర్ఘకాలం జ్ఞప్తికి ఉంచుకోగలం.


ధ్యానం చేయాలనుకునేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలమని యోగశాస్త్రం చెబుతోంది. మన శరీరంలో ఇడ, పింగళ, సుషుమ్న నాడులు ఉంటాయిని యోగుల నమ్మకం. బ్రాహ్మీముహూర్తంలో సుషుమ్న నాడి చాలా ఉత్తేజితంగా ఉండి… ధ్యానం చాలా సులువుగానూ, ప్రభావవంతంగానూ సాగే అవకాశం ఉంటుందట.


ఉదయాన్నే మన శరీరంలోనూ, చుట్టూ ఉన్న ప్రకృతిలోనూ ఉండే ప్రశాంతత వల్ల యోగా, ధ్యానం, చదువు… చాలా తేలికగా ప్రభావవంతంగా సాగుతాయి. రోజువారీ చేయాల్సిన విధులకు (ఉద్యోగం, కాలేజ్‌, వంటావార్పూ…) ముందు కాస్త సమయం చేజిక్కుతుంది. అలా కాకుండా ఆలస్యంగా లేచి ఒక్కసారిగా మన పనులలో చేరేందుకు పరిగెత్తడం వల్ల… మన మనసు, శరీరం విపరీతమైన ఒత్తిడికి లోనవుతాయి.


గుండెజబ్బులు ఉన్నవారికి తెల్లవారుజామునే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందనీ, పైగా అలా వచ్చే గుండెపోటు చాలా తీవ్రంగా ఉంటుందనీ వైద్య గణాంకాలన్నీ సూచిస్తున్నాయి. గుండెల్లో రక్తనాళాలను గడ్డకట్టించే `థ్రోంబస్‌` అనే సమస్య ఉదయం వేళల్లోనే ఎక్కువగా ఉంటుందట. ఇలా ఎందుకు జరుగుతుందనే దానికి ఖచ్చితమైన కారణాలు ఏవీ చెప్పలేకపోతున్నారు వైద్యులు. 


పైగా ఇదే సమయంలో మనం హడావుడిగా లేచి విధుల్లోకి చేరాలనే టెన్షన్‌లో మనలోని రక్తపోటు మరింత ఎక్కువై అది గుండెపోటుకి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే బ్రాహ్మీముహూర్తంలోనే నిద్రలేచి, వీలైతే కాసేపు ధ్యానం చేసుకుని… స్థిమితంగా రోజువారీ పనులకి సిద్ధపడితే మన రక్తపోటు కూడా సాధారణంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ని చదివిని తరువాత బ్రాహ్మీముహూర్తంలో లేవడాన్ని ఛాదస్తం అని జీ ఎలా అనుకోగలం చెప్పండి! 🙏


సర్వ్ జనాః సుఖినోభవంతు..

ఓం శ్రీ మాత్రే నమః

ఓం నమః శివాయ

ఓం నమో నారాయణాయ


తాళపత్ర నిధి.....

Proverb

 Every Proverb Has An Equal And An Opposite Proverb!


All good things come to those who wait.

But 

Time and tide wait for no man. 


The pen is mightier than the sword. 

But

Actions speak louder than words. 


Wise men think alike 

But 

Fools seldom differ. 


The best things in life are free. 

But 

There's no such thing as a free lunch.


Slow and steady wins the race. 

But

Time waits for no man. 


Look before you leap. 

But

Strike while the iron is hot. 


Do it well or not at all. 

But 

Half a loaf is better than none. 


Birds of a feather flock together. 

But 

Opposites attract. 


Don't cross your bridges before you come to them. 

But

Forewarned is forearmed. 


Doubt is the beginning of wisdom 

But 

Faith will move mountains. 


Great starts make great finishes. 

But 

It ain't over until it's over.


Practice makes perfect. 

But 

All work and no play makes Jack a dull boy. 


Silence is golden. 

But

The squeaky wheel gets the oil.


You're never too old to learn.

But

You can't teach an old dog new tricks.


What's good for the goose is good for the gander.

But

One man's meat is another man's poison. 


Absence makes the heart grow fonder. 

But 

Out of sight, out of mind.


Too many cooks spoil the broth.

But

Many hands make light work.


Hold fast to the words of your ancestors.

But

Wise men make proverbs and fools repeat them...


Wonderful compilation of *equal yet opposite* proverbs!!

పుణ్యస్య ఫల మిచ్ఛంతి*

 శ్లోకం:☝️

*పుణ్యస్య ఫల మిచ్ఛంతి*

    *పుణ్యం నేచ్ఛంతి మానవా l*

*న పాపఫల మిచ్ఛంతి*

    *పాపం కుర్వంతి యత్నత ll*


భావం: మనుషులెంత స్వార్థపరులో చూడండి. పుణ్యం చేయడానికి ఎంత మాత్రం ప్రయత్నించరు. కాని పుణ్యం వలన వచ్చే ఫలితం మాత్రం తమకి దక్కాలని తెగ ఆరాటపడి పోతూ ఉంటారు. నిత్యం అనేక పాపాలు చేస్తూనే ఉంటారు కానీ, ఆ పాప ఫలితం మాత్రం తమకు రాకూడదని కోరుకుంటూ ఉంటారు ! ఎంత విపరీతమో చూడండి.