🔔రితవే నమః🔔
🚩🚩
దశరధ మహారాజు ఒకసారి తన మంత్రి సుమంత్రుని
పిలిచి, రాముని వెంటనే తన సమక్షానికి పిలిపించమని ఆదేశించాడు.
సుమంత్రుడు రాముడి భవనానికి వెళ్ళి
" చక్రవర్తి మిమ్మల్ని వెంటనే చూడాలి అనుకుంటున్నారు రమ్మని పిలిచారు"అని
చెప్పాడు. సమీపమునే వున్న సీతాదేవి,
" స్వామీ ..ఏదో ముఖ్యమైన విషయమే
అయివుంటుంది. అందుకే మీ తండ్రిగారు పిలుస్తున్నారు.
వెంటనే వెళ్ళండి" అని అన్నది. రాముడు
సుమంతునితో బయలుదేరి
దశరధుని భవనానికి వెళ్ళాడు.
రాముడు రావడం చూసిన దశరధునికి
చాలా ఆనందం కలిగింది.
" రా..రామా..రా రామా ..అని సంతోషంగా
ఆహ్వానించాడు. రాముడు తండ్రి దశరధుని పాదాలకు ప్రణామం చేసి ఆయన ఆదేశం వినడాని
ఎదురు చూస్తూ వినయంగా నిలబడ్డాడు. గంభీరమైన రాముని
అందాన్ని నేత్రాలతోనే ఆస్వాదిస్తున్న దశరధుడు ఏమీ మాటాడలేదు.
కొంతసేపైన పిదప రాముడు " తండ్రీ..
ఏమి పనిమీద యీ దాసుని పిలిపించారు?"
అని అడిగాడు.
" ఏమీ లేదు రామా.. ఊరికినే పిలిచాను.
వెళ్ళి రా.." అని అన్నాడు దశరధుడు.
" సరే ..అని రాముడు దశరధుని వద్ద శెలవు తీసుకొని అంతఃపురం
వెలుపలికి వచ్చాడు.
దశరధుడు తిరిగి సుమంతుని పిలిచి రాముని
పిలుచుకురమ్మని చెప్పాడు. మరల
సుమంతుడు రాముని పిలుచుకుని వచ్చాడు.
రాముడు తండ్రికి నమస్కరించి, " పిలిచిన కారణం ఏమిటి...అని వినయంగా అడిగాడు. " ఏమి లేదు రామా ..వెళ్ళి రా..
అన్నాడు దశరధుడు.
తండ్రిని వదిలి తిరిగి వెళ్ళిపోయాడు రాముడు. మూడోసారి
తిరిగి రాముని తీసుకుని రమ్మని సుమంతునికి చెప్పాడు దశరధుడు.
రాముడు రాగానే "ఏమీ లేదు రామా..
వెళ్ళి రా"..అన్నాడు దశరధుడు.
ఇలా ఈవిధంగా
ఏ కారణం లేకుండా దశరధుడు రాముని
పిలిపించడం, కొన్ని క్షణాల తర్వాత వెళ్ళమనడం వెనక గల కారణాన్ని వాల్మీకి మహర్షి రామాయణంలోని
అయోధ్యాకాండ 3వ సర్గంలో 39...వ
శ్లోకంలో చాలా రసవత్తరంగా తెలిపారు.
సకలగుణాభిరాముడైన రాముడంటే దశరధునికి చాలా ప్రేమ.రాముని గుణగణములతో పాటు ఆతని అందచందాలు, గంభీరమైన నడక దశరధునికి అత్యంత తన్మయత్వం కలిగించేది. రాముని నడవడిక,
అందచందాలు చూసే వారందరి
మనసులకి అత్యంత ఆనందం కలిగించే
ఆకర్షణ కలిగినవి. కరువు కాటకాలతో మాడిపోయేవారికి నిండు వర్షమేఘాలు యేవిధమైన
సంతోషాన్ని, తృప్తిని కలిగిస్తాయో అదేవిధంగా
రాముని అందం, సుగుణాలు చూసేవారి మనసులను రంజింపచేసి పరవశింపజేస్తాయి.
అటువంటి రఘురాముని నడక అందం అంటే దశరధుని కి చాలా ప్రీతి. అందుకే రాముని పదే పదే తన సమక్షానికి ఏ కారణమూ లేకుండా రప్పించి , ఆయన వచ్చి వెళుతున్నప్పుడల్లా శ్రీరాముని నడక అందాలను , గాంభీర్యాన్ని చూసి ఆనందించి తన్మయుడయ్యేవాడు దశరధుడు.
ఈ విధంగా తన గుణగణాలతో, వినయంతో ప్రజలందరి మనసులను రజింపచేసి వారి ప్రేమాభిమానాలు
చూరగొంటున్నందు వలన శ్రీరాముడు
' రితుః'
అని పిలువబడుతున్నాడు.
ఈ నామము సహస్రనామములలో
417 వ నామము.
నిత్యము
' రితవే నమః' అని జపించే భక్తుల హృదయాలలో రాముడు
నివసించి వారికి సంతోషము కలుగజేస్తాడు.
🚩🚩🕉️🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి