8, అక్టోబర్ 2021, శుక్రవారం

Air India and Indian Airlines 👇

 An interesting article about Air India and Indian Airlines 👇

Loot of PSU airlines


1. My aunt was an air hostess with Indian Airlines. In 1992 she bought a flat in Feroz Shah Road, Delhi, for around Rs 3 crore. How did she save that much money? She said, "In the past 20 years with IA, I never had to pay for food, transport or rent."


2. Air hostesses would take home all sorts of stuff - cookies, juice, cutlery, food, chocolates. If you flew in the 1990s, you would remember they rarely brought an extra coffee or candy. They just carted home everything at the end of the flight. Passengers be damned.


3. She said, in Air India, every employee (even a Class IV sweeper) was entitled to one free ticket for entire family to an international destination. Often they were bumped up to First Class at the airport. Indian Airlines employees enjoyed similar perks.


4. Air hostesses and stewards of Indian Airlines vied to get on the Gulf and South East Asian routes as this allowed them to bring electronics which they sold in Delhi's Palika Bazar and Gafar Market. Pilots also became couriers.


5. I bought my first Sony Handycam in 2005 from Gafar Market. Through a photographer friend, I approached the shopkeeper who asked me which model number I wanted. This model was given to an IA pilot who brought it a few days later. Total cost Rs 17,000. Original Made in Japan.


6. Imagine this loot happening for the past 70 years. Every few years, the govt bailed out Air India and Indian Airlines with tens of thousands of crore rupees. They were kept alive on a drip feed because it allowed the political leadership and bureaucracy to siphon resources.


7. Air India was the first airline in Asia to acquire a jetliner - the Boeing 707. It was a prestigious and profitable airline under the Tatas. The Maharajah was synonymous with luxury and upmarket. The govt ran the airline into the ground.


8. In 2014 or so I saw an older air hostess reprimanding her junior in front of passengers. She could have offered stiff competition to an ogre. Even a 2 star hotel would not have hired her as a room cleaner. She didn't look like she had passed an exam. Definitely sifarshi.


9. India's average living standards and per capita income place it 10 or 20 times below the West. Despite this, we maintained two white elephant airlines that sucked in incalculable cash. There are still many sectors remaining where such loot is going on.


10. It took Narendra Modi 7 years to privatise Air India. This is because the political leadership and bureaucrats benefitted from free flights and job placements for their sons and daughters in the airline. Plus, loot of fuel. Catering contracts to companies floated by INC.


11. Because PSU loot has support from nearly all political parties except BJP, it is nothing less than a miracle that this has happened. I'm surprised the Supreme Court hasn't jumped into the ring and cancelled the sale.


Courtesy: Rakesh Thiyyan

భగవంతుడు భక్త సులభుడు*

 *భగవంతుడు భక్త సులభుడు*

                  ➖➖➖✍️


*శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో జరిగిన ఓ అద్భుత సంఘటన....*


*వారు పూజ చేసే టప్పుడు ‘ఆవాహయామి’ అనగానే ఆ దేవత వచ్చి ఎదురుగా బుద్ధిగా కూర్చునేదిట. అది వారి అనుభవం.*


*ఒకసారి ఒకామె వచ్చి తనకు సీతా మంత్రం అనుగ్రహించమని కోరిందట. ఆశ్చర్యంతో, ఆనందంతో వారు చాలా కాలం సీతా మంత్రోపాసన చేసి , తరువాత ఆవిడని రమ్మని మంత్రోపదేశం చెసారట! ఆవిడ వెళ్ళిపోతూ ఈ మంత్రం చేస్తే చాలా కష్టాలు వస్తాయని వింటున్నాను, నిజమేనా అని అడిగిందట.* 


*వారు “అలాటప్పుడు ఆ మంత్రం కావాలని ఎందుకు అడిగావు?సందేహాలుండకూడదు.” అంటే, ఆమె “అదేమీ లేదం”టూ వెళ్ళిపోయిందట.*


*కొంత కాలానికి ఆవిడ తిరిగి వచ్చి తనకి ఆ మంత్రం వద్దనీ, ఇక చేయలేననీ, చాలా కష్టాల బారిన పడుతున్నాననీ వాపోయిందిట.* 


*ఆమె ప్రారబ్దానికి బాధపడుతూ, ఆమె ప్రారభ్దానికి జాలిపడి, ‘సందేహాస్పదమైన మనసుతో, పరిపూర్ణ విశ్వాసం లేకుండా చేస్తే ఇలాగే ఉంటుందేమో’ అనుకుంటూ దయతో శ్రీ శాస్త్రి గారు దానికి కావలసిన జపాలు ముందు ఆయన చేసుకుని ‘ఆవు కుడి చెవిలో మంత్రం చెప్పి వదిలెయ్యి. ఇకనించీ మళ్ళీ దాని గురించి ఆలోచించవద్దు’ అని చెప్పేరట. ఆవిడ అలాగే చేసి వెళ్ళిపోయిందట.*


*ఆ రాత్రి కలలో సీతమ్మ వారు గురువుగారికి కనిపించి, అర్హత లేని వారికి నా మంత్రం ఎందుకు ఇచ్చావు? ఇకనించీ నువ్వు పిలిస్తే రాను అన్నారుట.*

*గభాలున లేచి వారు కన్నీరు మున్నీరు గా విలాపించారుట*


*కాలం గడుస్తోంది . కొన్నాళ్ళకి వారింట్లో శ్రీరామనవమిని రామపట్టాభిషేకం ప్రతిసారిలాగే నిర్వహిస్తున్నారు. తండోపతండాలుగా శిష్యులు వచ్చి ఉన్నారుట.*

*గురువుగారు శ్రీరామచంద్రుని ఆవాహన చేసి, తరువాత సీతమ్మను ఆవాహన చేయబోయి ఆగిపోయారట. తల్లి రానని చెప్పిందిగా. ఏ మొహంతో పిలవగలను? అని పాత జ్ఞాపకాలతో అశ్రుధారలు ప్రవహిస్తూంటే అలాగే చాలా సేపు ఏడుస్తూ ఉండిపోయారట.*


*చివరకి అతి కష్టం మీద ‘సీతాం ఆవాహయామి’ అని అనగలిగేరట. వెంటనే వచ్చి తల్లి అక్కడ కూర్చున్నదట. ఆయన సంతోషానికి హద్దులు లేవు. గద్గద స్వరం తో 'రానన్నావు కదా తల్లీ. ఈ దాసుని మీద అంత దయా?' అని ఆనంద బాష్పాలు రాలుస్తున్నారట.*


*‘ఏం చెయ్యనురా! శ్రీ రాములవారిని పిలిచావు ముందు. వారొచ్చి మాట్లాడకుండా కూర్చున్నారు నీ యెదుట. నేను రాకేం చెయ్యను ?’ అన్నదట.*


*బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు ఒక రోజు చెప్పినది. *

వెంకటి చెప్పిన కధలు-4

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹


వెంకటి చెప్పిన కధలు-4


పొత్తుల రావులమ్మ.......


ఆదివారాలు మాకో పిచ్చి రొటీన్ ఉండేది. ఆలస్యంగా లేచి... అల్పాహారాన్ని చాలా స్వల్పంగా తిని, మంచి సినిమానో, టీవీలో పిల్లల పాటల ప్రోగ్రామ్ లో చూసి... ఒంటిగంట కల్లా ఇంట్లోంచి బయటపడి... భీమిలీ బీచ్ రోడ్లో లాంగ్ డ్రైవ్ కెళ్ళడం. 


గీతం కాలేజ్ ఎదురుగా ఉండే రాజుగారి పాకలో కుండబిర్యానీలు పేక్ చేయించుకుని... ఏ ఋుషికొండ బీచ్ లోనో కూర్చుని, ఎండలో కళ్ళు మిరిమిట్లు గొలిపేలా, ఎగిసే సంద్రపుఅలల ఆటుపోట్లవెండి జలతార్లను నిశ్శబ్దంగా చూస్తూ , జీవితంలో అరుదుగా దొరికే ఆ రుచుల్ని ఆస్వాదిస్తూ గడపడం.. ! జనసమర్ధం పెరిగే వేళకల్లా మూటాముల్లే చుట్టపెట్టి... ఇంటికి బయలుదేరడం! 


         ఆ ఆదివారం వాతావరణమంతా మేఘాచ్ఛాదితమై .. సన్నగా జల్లులు పడుతుండడంతో ఇంట్లోనే భోంచేసి... బీచ్ రోడ్ లో క్వాలిటీ బండిలో ఐస్ క్రీం కొనుక్కుని, మొక్కజొన్న పొత్తుల కోసం ఎంత వెదికినా ఒక్కళ్ళూ కనపడలేదు. 


ఊడాపార్కు దాటేసి.. కామత్ గెస్ట్ హౌస్ దగ్గరకొచ్చేసరికి... ఆపద్బాంధవిలా కనిపించింది ఆమె.... బస్ షెల్టర్ లో బొగ్గులు రాజేసుకుంటూ... పక్కన వలచిన పెద్ద లేత అనకాపల్లి జొన్న కండెలతో! 


       కారు పక్కకి పోనిచ్చి అడిగాము "ఎంతని?". మాకేసి కాస్త గీరగా చూసి.." బోణీ యవ్వాల!"... అంది. మా అమ్మాయికి ఛివ్వున కోపం వచ్చింది. " మేం డబ్బులుకే కొంటాం కదా. మాది బోణీయేగా!"... అంటూ రెట్టిస్తుంటే... మాకేసి నిర్లక్ష్యంగా చూసి... ఆ పక్కనే కాస్త దూరంలో కూచుని స్టీలు కారేజీ గిన్నెల్లోంచి అన్నం తింటున్న ఓ నిక్కరూ, చొక్కా వేసుకుని... బాగా బీదగా ఉన్న ఒకడ్ని పిలిచి... " ఒలే! అపార్మెంట్ లో పాపగారికి పోన్ చెయి. గిన్నెలు ఆ పాలి తోమేసి తే... లగెత్తు.." అంటూ ఓ సున్నితమైన కర్కశపదంతో ముగించే సరికల్లా... " అల్గల్గేనే యప్పా.." అనుకుంటూ వాడు గిన్నెలు పట్టుకుని పోయాడు. 


       ఈ డ్రామాకు మా వారు అసహనంతో రగులుకుపోయి... మేమెంత వారించినా వినకుండా కారు స్టార్టు చేస్తుంటే వచ్చింది ఓ పన్నెండేళ్ళ పిల్ల... పదిరూపాయలిచ్చి... కాల్చిన రెండుపొత్తులు తీసుకుని పోయింది. 


ఆ పిల్లకేసి అపురూపంగా చూస్తూ, పదిరూపాయలు ముద్దుపెట్టుకుని పొత్తులకు తాటించి....మొలలో చిక్కంలోకి తోసింది. కరుణించిన మేరిమాతలా.. మా అమ్మాయిని చూసి రమ్మని సైగ చేసింది. 


స్టార్ట్ అయిన కార్లోంచే తలుపు తీసుకుని దూకేసింది మా సివంగి. పది వేడి వేడి పొత్తులు వైనంగా కాల్చి, ఆకుల్లో పెట్టి.... కవర్లో పెట్టి ఇచ్చింది." వందిచ్చాగా! చిల్లరేదే? " అంటే.." మనకయితే ఒకటీ పదిటమ్మా.." అంటూ బేరమాడ్డం రాని మా జడ్డి చెప్పింది. 


           ఆ పొత్తుల బేరం, ఆ దేశవాళీ పొత్తుల రుచీ.... మా పిల్లను ఆ అమ్మికి ఎంతలా కట్టేసిందంటే.... కాలేజీ నుంచి స్కూటీ అటుతిప్పుకుని.... బీచ్ రోడ్లో లక్షా పదిమంచి అమ్ముతున్నా... ఆ అమ్మి దగ్గరే కొనుక్కునేంత! ఆవిడ కూడా మా అమ్మాయితో బోణీ చేయించుకునేంత! మా అమ్మాయికి తను " పొత్తుల రావులమ్మ!"


రావులమ్మ చాలా విలక్షణంగా ఉండేది. మహా ఎత్తరి మనిషి. పచ్చటి ఛాయ. ఇసుకలో అలల జాడల్లా... మొహంలో కాలం, పరిశ్రమ వదిలి వెళ్ళిన సన్నని గీతలు. వీళ్ళ వయసులూ చెప్పలేము ముఖకవళికలు బట్టీ.....వాళ్ళవి కాయకష్టం వంచిన శరీరాలు! 


అయితే ఈ రావులమ్మ భారీగా ఉండేది. కాళ్ళకు బరూవైన ఇత్తడి, వెండి జోడు కడియాలు, సంద్రపుగాలికి నల్లబడిపోయిన వెండి,జిలేబీ పట్టీలు, ఇంత మందాన పసుపు పూసిన పాదాలకు... పుచ్చిపోయిన గోర్లు! చెవులకు పెద్ద లోలాకుబుట్టలు, మాటీలు, మెడలో నలిగిపోయిన నానుతాడు, నల్ల, ఎర్ర పూసలదండలు. మొహానికి దూమెరుగ్గా రాసిన పసుపు... నుదుట రూపాయి కాసంత బొట్టు... దానిమీద గంధం బొట్టు, విబూధి! ముదూరురంగు నేతచీరలు పైకంటా కట్టి... పైట స్థానభ్రంశాలను చులాగ్గా విస్మరించి..... మధ్యాహ్నం నాలుగింటి నుండి ఎనిమిదింటి లోగా మూడు సంచుల పొత్తులు.. అసిస్టెంట్ సాయంతో అమ్మేసే రాములమ్మ స్టోనిప్పి నోరారా అరిచిందా.... స్టూడెంట్ గొల్లిగాళ్ళు( ఆమె భాషలో) డబ్బులిచ్చి పారిపోవలసిందే! మా అమ్మాయిని ఏదో కామెంట్ చేసాడని... ఒక కుర్రాడి చేతిలో పొత్తుతోపాటూ... కుంపట్లోంచి మండుతున్న నిప్పుకణికె తీసి చేతిలో పెట్టిందట! అంత వయెలెంట్ రావులమ్మ


                      ----------


         " ఇంత గద్దు సింతపండేసి జిడ్డు ఒగ్గీయాలి...మిలమిల మిలమల మెరిసిపోవాలంటే ఎల్గవుతాది పంతులూ! పీతాంబారి యెయ్యండి కుసింత...".... ఈ స్టోను ఎక్కడో విన్నట్టుందని వెనక్కి తిరిగి చూద్దును కదా... రావులమ్మ. 


ఓ బుట్టలో దేవుడి సామాన్లన్నీ తోమడానికి నూతిదగ్గరకు వెళ్తోంది. 


నలభై శనివారాలు శనీశ్వరుడికి తైలాభిషేకాలు చెయ్యమని గురువుగారు చెప్పడంతో తెల్లవారి ఐదింటికి వచ్చాము నేనూ, ఆయనా! 


మమ్మల్ని చూస్తూనే.." పంతులుగోరూ! మా యమ్మగార్లే! బాగా చేయించండి...!" అంటూ రికమెండేషన్ చేసి మరీ పనుల్లోకి దూకింది. 


అలా ఎన్నో శనివారాల ప్రత్యూషవేళల.... ఆ పురాతన శివాలయపు ప్రాంగణమంతా తుడిచి కల్లాపు చల్లి... రెండు వేళ్ళ మధ్యనుండి రెండుగీతలుగా ముగ్గుపోస్తూ... అత్యంత నేర్పరిలా పెద్దపెద్ద ముగ్గులతో అలంకరించి, మారేడుదళాలు, నందివర్ధనాలు కోసి అర్చకునికి అందించే.... గ్రామదేవతలా కళకళలాడే రావులమ్మను చూడడం... ఎందుకో మనసుకు చాలా నచ్చేది నాకు! 


                      -----------


         " పాపగారు ఈరోజు మా పేటకొచ్చారమ్మా... ఈయేళ మా ఓనరమ్మగారితో! ".... " నాటుగుడ్లు కావాలన్నారంట పాప. అందుకే. సానా సేపే కూచున్నారు. నేను పనికొచ్చీసినాను! వెంకటి చెప్తుంటే..నా గుండె ఆగిపోయింది. 


ఈ పిల్ల అలా ముక్కూమొహం తెలీని వాళ్ళతో వెళ్ళడమేంటని కోపం వచ్చింది. ఇంతలో మా అమ్మాయి..పుస్తకాల సంచీ, ఎగ్ హోల్డరూ... ఒడుపుగా బేలన్స్ చేస్తూ ఇంట్లోకొచ్చింది.


" అమ్మా! రాములమ్మ నన్ను నాటుకోడి గుడ్డు రోజూ రా గా మింగమంది. పదిరూపాయలుకి ఒకటీ. కానీ నాకు ఫైవ్ కే ఇచ్చింది. వెంకటీ ఇవి ఫ్రిజ్ లో పెట్టవే.." అంటూ అందించింది. 


నేను వెంకటి కేసి చూపించి.. " ఇది ఓనరమ్మ అంటోంది.." అని కూపీలాగబోయా! వెంటనే వెంకటి " అయ్యో అమ్మా! రావులమ్మగోరే మా ఓనరమ్మ. ఐదు మేడలాళ్ళవి. ఒకింట్లో ఆళ్ళంతా ఉంటారు. నాలుగు మేడలు అద్దెలకే! అమ్మో లచ్చాదికారి. కోటీస్పరురాలు..! " ... ఉలిక్కిపడ్డా నేను. నాకున్న చిన్న గూడుకే నాకు ఎంత భేషజమో. రావులమ్మ అంతుంచుకుని.... ఇంకా శ్రమిస్తుంది. ఎక్కడో అహం మిటమిటలాడింది నాకు. 


        వెంకటి చెప్పడం.... రావులమ్మ, మొగుడూ విజనారం చిట్టివలస నుండి ముగ్గురు పిల్లలతో పెదవాల్టేరు వలసొచ్చి చిన్న పాకొటేలు నడిపేవారంట. మెల్లగా రావులమ్మ మొగుడు సన్నాసప్పడు బిల్డింగ్ పనులకెళ్ళి కూలీ నుంచి కొన్నాళ్ళకు మేస్త్రీ అయ్యాడంట. 


ఒకరోజు బళ్ళారి కుర్రాడొకడ్ని తెచ్చి... ఒటేలు పాకలో రాత్రిపూట పడుకుంటాడని తెచ్చిపెట్టాడట. ఈడిపేరు "అచ్చుమెచ్చు"! స్లాబులెయ్యడంలో మంచి నేర్పరంట. అచ్చుమెచ్చు కాస్తా అచ్చిబాబులా మారి, మనబాస 

నేర్చుకుని... సన్నాసప్పడి కుటాంబంతోనే ఉండిపోయాడంట. ఆళ్ళ పిల్లలు ఈడిబుజాల మీదే పెరిగి పెద్దయ్యారంట. 


ఒకరోజు ఐదో అంతస్ధు కిటికీ స్లాబేస్తూ సన్నాసప్పడు కిందపడి.. తలపగిలి చచ్చిపోయాడంట.వేరే దిక్కులేని ఓనరమ్మని, కుటుంబాన్నీ అచ్చిబాబే పోషించేవాడంట. రావులమ్మ ఆడికి పెళ్ళిచేద్దామంటే ఒప్పుకోకుండా... " వచ్చే పెళ్ళం నిన్నూ, పిల్లల్నీ చూడనిస్తుందా. నువ్వే నన్ను మనువాడేయి" అన్నాట్ట. 


ఇద్దరూ పెళ్ళి చేసుకుని... పైసాపైసా కూడపెట్టి... ఇళ్ళూ వాకిళ్ళూ కట్టుకున్నారంట. అచ్చిబాబుకు రావలమ్మంటే చచ్చేంత ప్రేమా, భయమూనంట. నెలకోసారి పెళ్ళం డబ్బులిస్తేనే తాగుతాడంట...అంతే! 


" మరి వీళ్ళకు పిల్లల్లేరా?".. అడిగా! కనక బాగా గొంతు తగ్గించి...." ఒక కూతురమ్మ! నాగరత్నం! అచ్చిబాబు ఆళ్ళమ్మ పేరు. పదారేళ్ళ వొయిసులో... ఇంట్లో అద్దెకున్న గుంటెధవలు పాడుచేసారంట. మేడమీద గదిలోకెళ్ళి కాల్చుకుని సచ్చిపోయిందంట ! మా పక్కింటోళ్ళు చెప్పారు. తెల్లగా, పొడావుగా, ఈరోయిన్ లా ఉండేదంట పిల్ల! "....పక్కగదిలోండి ఓ చెవి ఇటు పడేసిన మా పిల్ల ఒక్క ఉదుటున వచ్చింది.


 " అందుకేనేమో అమ్మా! తనకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. ఒక బీరువానిండా వాళ్ళింట్లో రంగూన్ బొమ్మలున్నాయి. రావులమ్మ నాన్న తన చిన్నప్పుడు రంగమెళ్ళి తెచ్చేవాడట"! .... అది రంగమెళ్ళి ... అంటుంటే అప్రయత్నంగా నవ్వొచ్చింది. 

ఇన్ని విషాదాల మధ్య స్థితప్రజ్ఞురాలిలా తన పని తను చేసుపోయే రావులమ్మ కర్మయోగిలా కనిపించేది నాకు. 


        కాలచక్రంలో మార్పులు మనుషులకూ తప్పవు. వారంరోజులు టైపార్టీ జ్వరం( టైఫాయిడ్) తో సడన్గా రావులమ్మ చనిపోయింది. అచ్చిబాబుని పట్టుకోలేకపోయారుట. కిరసనాయిల్ పోసుకుని చచ్చిపోతానని గోలగోలట. "ఎంత ప్రేమించే భర్త!".... అనుకోకుండా ఉండలేకపోయా! మా అమ్మాయి వెళ్తానంది. నేను వీల్లేదన్నా! పుణ్యస్త్రీగా పోయిందని... అచ్చిబాబూ, రావులమ్మ కొడుకూ, అల్లుళ్ళు భారీగా ఖర్చుపెట్టి ఆమెను పూలరధంలా సాగనంపేరట!! 


       మా అమ్మాయి మళ్ళీ మొక్కజొన్నపొత్తు ముట్టుకోలేదు. "దీనికేమయినా పిచ్చా! " అనుకున్నా.... ! కొన్ని బంధాలకు బంధుత్వాలతో పనుండదేమో. మా ఆదివారం లాంగ్ డ్రయివ్ లు పలచనయిపోయాయి. 


                          --------------


          మా అమ్మాయి పెళ్ళయి, గూడు వదిలి రెక్కలొచ్చి ఎగిరేరోజు వచ్చేసింది. ఒకరోజు పొద్దున్నే గుమ్మంలో ఓ తెల్లగా, పొట్టిగా నిక్కరూ, తెల్లచొక్కా వేసుకుని ...గుమ్మటంలా ఉన్న ఓ నడివయస్కుడు ఏదో అట్టపెట్టితో నిలబడి ఉన్నాడు. ఆర్కాట్ యాసలో " నాను రావులమ్మ పెనిమిటిని! అచ్చిబాబంతారు! రావులమ్మ ఈ పెట్టి మీపాప కోసం పెట్టినాది! నాను మరిసిపోయా! యాదికొచ్చి తెచ్చినా!" .... అంటూ నిర్వికారంగా చూస్తూ..నా చేతిలో పెట్టి పెట్టేసి వెళ్ళిపోయాడు. 


     పెట్టి విప్పి చూద్దును కదా.... రెండు వరసల్లో... ఎంతో నాణ్యమైన చైనాతో చేసిన పింగాణీబొమ్మలు. తేలికగా, తెల్లని బొమ్మలకు అందమైన రంగులేసుకున్న అమ్మాయి బొమ్మలు! 


వాటికి మధ్యలో కూరిన ఎండిపోయిన మొక్కజొన్న ఆకుల చెత్త! ఆ ఆకులు చేతిలోకి తీసుకున్నా! ఎవరీ రావులమ్మ. ఎందుకింత ప్రేమ ఈ పిల్లమీద! కళ్ళంబడి ఒక కన్నీటిబొట్టు జారి ఆకుల్లో పడి ఇంకిపోయింది! 


*శశికళ ఓలేటి* ( కధ నా స్వంతం, కల్పితం, షేర్ మనా!!) 

18-3-2020

పిల్లలు చెడిపోవడానికి

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఉపాధ్యాయులు, ఫోన్లు, మీడియా 10% కారకులు, కానీ 90% కారకులు తల్లిదండ్రులే..!*🙏

పిల్లల్ని గారాబం మరీ *శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది..* 

పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం, మూఢనమ్మకాలు, స్వార్థం, అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తుంది, 

వారిని నాశనం చేస్తున్నారు.

ఇప్పుటి తరం 70% పిల్లలు..

👉తల్లిదండ్రుల కారు, 

బండి తుడవమంటే తుడవరు..

👉మంచి నీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు..

👉లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు..

👉కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు...

👉రాత్రి 10 గంటల లోపు పడుకుని, ఉదయం ఆరు లేదా ఏడు గంటల లోపు నిద్ర లేవ మంటే లేవరు...

👉గట్టిగా మాట్లాడితే ఎదురుతిరగబడి సమాధానం చెబుతారు..

👉తిడితే వస్తువులను విసిరి కొడతారు..

ఎప్పుడు అయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్ లు, నూడుల్స్ ప్యాకెట్లు, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు..

👉ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు..

👉ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి..

👉అతిథులు వస్తే కనీసం గ్లాసుడు మంచి నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన లేని అమ్మాయిలు కూడా ఉన్నారు..

👉20 సంవత్సరాలు దాటిన చాలామంది ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు..

👉బట్టలు పద్ధతిగా ఉండాలి అంటే ఎక్కడలేని కోపం వీరికి.. 👉కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింతపోకడలు..

 వారిస్తే వెర్రి పనులు..

👉మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు,

కానీ కారణం మనమే..

ఎందుకంటే *మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి..*

చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి, రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం..

గారాబంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు..

*వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది*.. 

*కష్టం గురించి తెలిసేలా పెంచండి* 

కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం *విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు..*

ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే.. కొందరు యువత 15 ఏళ్లకే సిగరేట్స్, మందు, బెట్టింగ్, దొంగతనాలు, డ్రగ్స్, రేప్ లు, హత్యలు చేస్తున్నారు..

మరికొంతమంది సోమరిపోతులు లా తయారు అవుతున్నారు..

*అభినయాలు కనపడడం లేదు, అణకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు..*

ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..

భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసు లోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు..

మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం..

కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం...

👉కాలేజీ పిల్లలు అయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫెన్, లంచ్ చిన్న బాక్సు రైస్..

చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు...

గర్భవతులు అయిన తరువాత వారి బాధలు వర్ణనా తీతం

టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, *100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారు* అంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి..

అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు..

3వ తరగతి పిల్లాడికి సోదబుడ్డి లాంటి కళ్ళద్దాలు..

5వ తరగతి వారికి అల్సర్, బీపీ లు..

10 వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి..

వీటన్నికి కారణం మనం మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే..

అందుకే *తల్లిదండ్రులు మారాలి..*

*రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నాం...?*

ఒక్కసారి ఆలోచన చేయండి...

*సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి...?*

కేవలం గుడికి వెళ్లి

పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము, అది మాత్రమే కాదు సాంప్రదాయం అంటే.. అలా అనుకోవడం కొంత పొరపాటు..

పిల్లలకు..👇

👉 *బాధ్యత* 

👉 *మర్యాద*

👉 *గౌరవం* 

👉 *కష్టం* 

👉 *నష్టం* 

👉 *ఓర్పు*

👉 *సహనం*

👉 *దాతృత్వం*

👉 *ప్రేమ*

👉 *అనురాగం*

👉 *సహాయం*

👉 *సహకారం*

👉 *నాయకత్వం*

👉 *మానసిక ద్రృఢత్వం* 

👉 *కుటుంబ బంధాలు*

👉 *అనుబంధాలు*    

👉 *దైవ భక్తి*

👉 *దేశ భక్తి*


*ఈ భావనలు సంప్రదాయాలు అంటే..*

కొంచెం *కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి..* మంది కోసం బ్రతకకద్దు మన ఆరోగ్యం, ఆనందం కోసం న్యాయం గా బ్రతుకుదాం.

ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, *ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం..*

త్రిపురాంతకం

 బాల త్రిపుర సుందరి దేవి.. త్రిపురాంతకం 

     త్రిపురాంతకం బాల త్రిపుర సుందరి దేవి. ఆ పరమశివుడికి బాల త్రిపుర సుందరి సహాయం చేసింది. ఇందు కోసం ఓ యాగ కుండం నుంచి ఆ బాలత్రిపుర సుందరి స్వయంభువుగా ఉద్భవించింది. ఆ ఘటన జరిగిన ప్రాంతం నేడు ఓ పుణ్యక్షేత్రంగా మారి విరాజిల్లుతోంది. పూర్వం ఇక్కడ ఎక్కువ జంతుబలులు ఉండేవి. అందుకు నిదర్శనంగా ఇక్కడ దాదాపు అర్థ అడుగు లోతు, 2 అడుగుల వ్యాసం గల రాతి పాత్ర ఉంది. జంతు బలుల ఎంత రక్తం ఇందులో వేసినా ఇక్కడ ఇది నిండేది కాదని చెబుతారు.


తారకాసుని కుమారులైన తారాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటాడు. ఇందు కోసం బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి అమిత బలవంతులుగా మారుతారు. అంతేకాకుండా వారు బంగారం, వెండి, ఇనుముతో మూడు నగరాలు నిర్మించుకొని ఆకాశయానం చేస్తూ ఉంటారు. అవి మూడు ఒకే వరుసలో వచ్చినప్పుడు ఒకే సారి మూడు బానులను ప్రయోగించి వాటిని ధ్వంసం చేస్తేనే వారికి చావు ఉంటుంది.


ఇలాంటి విచిత్ర వర గర్వంతో వారు లోక కంఠకులుగా మారిపోతారు. దేవతలను, బుుషులను నానా బాధలు పెడుతుంటారు. దీంతో దేవతలు, మునులు ఈశ్వరుడిని ప్రార్థించి తమను రక్షించాల్సిందిగా వేడుకొంటారు. బ్రహ్మ వరం పొందిన ఆ రాక్షసులను సంహరించాలంటే తనకు అపూర్వ రథమూ, అపూర్వ బాణాలు కావాలని చెబుతారు


దీంతో విశ్వకర్మ జగత్తత్వంతో రథాన్ని, వేద తత్త్వంతో గుర్రాలను, నాగతత్త్వంతో పాగ్గాలను, మేరు శిఖర తత్త్వంతో ధనుస్సుని, వాసుకి తత్త్వంతో వింటినారిని, సోమ, విష్ణు, వాయు తత్త్వాలతో మూడు బానాలను తయారుచేస్తాడు. ఇక ఆ రథానికి బ్రహ్మ స్వయంగా రథసారథి అవుతాడు. దీంతో పరమశివుడు తారాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుల పై యుద్ధానికి వెలుతాడు.


అయితే భీకర యుద్ధంలో ఎంత ప్రయత్నించినా ఆ ముగ్గురు రాక్షసులను పరమేశ్వరుడికి చేతకాదు. విల్లు నుంచి సంధించిన బాణాలు ఆకాశంలో ఎగురుతున్న నగరాలను ఛేదించలేకపోతాయి. అంతే కాకుండా ఆ రాక్షసుల తప:ప్రభావంతో ఆ రథం భూమిలోకి కుంగి పోతుంది. దీంతో పరమశివుడు ఆదిపరాశక్తిని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ పరాశక్తి తన ప్రతిరూపమైన బాల త్రిపుర సుందరిని అక్కడికి వెళ్లి పరమశివుడికి యుద్ధంలో సహాయం చేయాల్సిందిగా ఆదేశిస్తుంది.


దీంతో బాలత్రిపుర సుందరి ఒక యాగ కుండం నుంచి బయటికి వచ్చి శివుడు ధరించిన విల్లులోకి ప్రవేశిస్తుంది. దీంతో శివుడు ఆకాశంలో ఎగురుతున్న మూడు నగరాలను ఛేదించి ఆ రాక్షసులను సంహరిస్తాడు. అటు పై బాల త్రిపుర సుందరి ధనస్సు నుంచి బయటికి వస్తుంది. తనకు యుద్ధంలో సహాయం చేసినందుకు ఏదైనా వరం కోరుకోవాల్సిందిగా పరమశివుడు బాల త్రిపుర సుందరికి చెబుతారు.


దీంతో ఈ సృష్టి ఉన్నంత వరకూ మీరు ఇక్కడ త్రిపురాంతకుడిగా ఉండిపోవాలని కోరురుకొంటుంది. ఈ క్షేత్రం త్రిపురాంతకంగా ప్రసిద్ధి చెందాలని కూడా కోరుకొంటుంది. ఇందుకు పరమేశ్వరుడు సంతోషంగా అంగీకరిస్తాడు. అంతే కాకుండా యుద్ధంలో తనకు సహాయంచేసిన బాల త్రిపురసుందరిని సేవిస్తే అన్నింటా విజయం కలుగుతుందని చెబుతాడు. అందుకే ఏదైనా ఒక కార్యం ప్రారంభించే ముందు ఇక్కడకు చాలా మంది వచ్చి అమ్మవారిని సేవిస్తూ ఉంటారు.


శ్రీశైలం నాలుగు ద్వారాల్లో త్రిపురాంతకం తూర్పుద్వారం. ఇక్కడ ఆలయం చిన్న కొండ పై ఉంటుంది. నాలుగు వైపులా నాలుగు గోపురాలు ఉంటాయి. గర్భగుడిలో స్వామివారు లింగ రూపంలో ఉంటారు. ఇక్కడ శివలింగం పై భాగంలో ఒక అంగులం లోతు గుంట ఉంటుంది. ఆ గుంటలో నీరు ఎల్లవేలలా ఉండటం విశేషం. ఇక ఆలయం ప్రాంగణంలో ఒక చీకటి గుహ ఉంది. ఇక్కడి నుంచి శ్రీశైలానికి సొరంగ మార్గం ఉండేదని చెబుతారు.


ఈ ఆలయానికి దగ్గరగా ఉన్న చెరువులో బాల త్రిపుర సుందరి ఆలయం ఉంది. ఈ ఆలయం శ్రీ చక్ర ఆకారంలో ఉంటుంది. ఇక బాల త్రిపుర సుందరి ఆవిర్భవించిన యాగకుండాన్ని ప్రస్తుతం నడబావి అంటారు. అమ్మవారిని దర్శించాలంటే 9 మొట్లు దిగి వెళ్లాలి. స్కాంద పురాణంలో శ్రీ శైలఖండంలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది.


పూర్వం ఇక్కడ ఎక్కువ జంతుబలులు ఉండేవి. అందుకు నిదర్శనంగా ఇక్కడ దాదాపు అర్థఅడుగు లోతు, 2 అడుగుల వ్యాసం గల రాతి పాత్ర ఉంది. జంతు బలుల ఎంత రక్తం ఇందులో వేసినా ఇక్కడ ఇది నిండేది కాదని చెబుతారు. ఇది ఇక్కడ విశేషం. అమ్మవారి ఆలయం బయట, చెరువు కట్టమీద కదంబ వృక్షాలు కనిపిస్తాయి. వారణాసి తర్వాత కదంబ వ`క్షాలు కనిపించే పుణ్యక్షేత్రం ఇది మాత్రమే. అందువల్లే అమ్మవారిని కదంబ వనవాసిని అని పిలుస్తారు.


ప్రకాశం జిల్లాలోని మార్కాపురానికి 40 కిలోమీటర్ల దూరంలో గుంటూరు కర్నూలు జాతీయ రహదారి పై త్రిపురాంతకం ఉంటుంది. శ్రీ శైలం నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. బస్సు సౌకర్యం ఉందిది. ఇక్కడ ఉండటానికి వసతి అంతగా బాగుండదు.

హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం-పాటిద్దాం.


శ్రీ మాత్రే నమః

రెట్టమత శాస్త్రము

 రెట్టమత శాస్త్రము - పంటలు వేయుటకు శుభ సమయాలు, తిధులు , నక్షత్రాలు తెలుపు శాస్త్రం .


 * హస్తా నక్షత్రం, మృగశిర నక్షత్రం, మాఘ నక్షత్రం, ధనిష్టా నక్షత్రం, రేవతి నక్షత్రం, ఉత్తర ఫాల్గుణ నక్షత్రం, ఉత్తరాషాడ నక్షత్రం, ఉత్తరాబాద్ర నక్షత్రం, నందు భూమి యందు విత్తనములు చల్లినచొ చక్కగా ఫలించును.


 * పుష్యమి నక్షత్రం, పునర్వసు నక్షత్రం, రోహిణి నక్షత్రం, యందు భూమి యందు చల్లిన వడ్లు , చామలు సమృద్ధిగా పండును. మూలా నక్షత్రం నందు చల్లిన అన్ని ధాన్యములు చక్కగా ఫలించును.


 * అశ్వని నక్షత్రం, పుబ్బా నక్షత్రం, పుర్వాషాడ నక్షత్రం, ఆర్దా నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రం, నాడు ప్రత్తి విత్తనములు నాటిన పక్షమున అవి మొలచి చక్కగా పెరిగి ప్రత్తి బాగుగా పండును. శతబిష నక్షత్రం, విశాఖ నక్షత్రం, నాడు నాటబడిన భుమిలో పెరుగు దుంప దినుసులు, చెరకు తోటలు లెస్సగా ఫలించును. శ్రవణా నక్షత్రం నాడు మొలక వేసిన చెన్నంగి అను వడ్లు చక్కగా పండును. ఉత్తర ఫాల్గుని నక్షత్రం నాడు తమలపాకు తీగలు నాటిన యెడల హద్దు లేకుండా పెరుగును. 


 * కృత్తికా నక్షత్రం నాడు , హస్తా నక్షత్రం నాడు, చల్లిన శెనగలు భూమి యందు జనులు తృప్తి పొందునట్టు హెచ్చుగా పండును. భరణి నక్షత్రం నాడు గొధుమలు నాటిన యెడల అవి ఫలించును. అనగా ఆయా నక్షత్రం నాడు ఆయా గింజలు నాటవలెను.


 * పుబ్బా నక్షత్రం నాడు శెనగ గింజలు చల్లిన పక్షమున ఆ పంట పండక చెడిపోవును. ఆర్దా నక్షత్రం నాడు చల్లిన యెడల ఏదేని జబ్బు తగిలి చేను పెరగక ఉండును. చిత్తా నక్షత్రం నాడు శెనగ విత్తనములు నాటినచో ఆ పైరుని అతివేగముగా మిడుతలు తినివేయును.


 * భూమి యందు మృగశిరా నక్షత్రం నాడు చల్లిన గొధుమ పంటను మృగములు తృప్తిగా తినిపోవును. అదే జైష్టా నక్షత్రం నాడు చల్లిన పంటలు పండవు . ఒకవేళ పండినా ఆ పంట దొంగలపాలు అగును.


 * ఆశ్లేషా నక్షత్రం నాడు ప్రత్తి విత్తనాలు చల్లినచొ స్వల్పముగా ఫలించును. కాని ఫలిన్చవలసినంతగా ఫలించవు. కావున నక్షత్రం మంచిదో కాదో ఆలోచించకుండా విత్తనములు వేసినచో అవి పండినట్లే పండి చెడిపోవును.


 * శతబిష నక్షత్రమున , విశాఖ నక్షత్రమున అవిసె గింజలు, మునగ విత్తనములు నాటిన యెడల ఆ సస్యములు వృద్ది నొందక మిక్కిలి ఆశ్చర్యముగా పురుగుపట్టి పాడుచేయును.


 * పాపగ్రహములు ఉన్న లగ్నముల యందు ఆ పాపగ్రహములను చూచుచున్న లగ్నముల యందు విత్తనములు నాటుట మంచిది కాదు.


 * శుక్రుడు లగ్నము నందు ఉండిన ఆ లగ్నమునకు సూటిగా 7 వ ఇంట ఉండిన ను భూమి యందు నెల్ల ధాన్యములను నాటవచ్చును .


 * చంద్రుడు కేంద్ర స్థానం నందు ఉండిన పాపగ్రహములు మంచివిగా కాకున్నను వేసిన సస్యములు అన్నియు ఫలించును.


 * సూర్యుడు ఆర్ద నక్షత్రం నందు ప్రవేశించి నప్పుడు మొదలుకొని భూమి యందు చల్లిన విత్తనములు అన్నియూ , ఆ సమయం చాలా మంచి సమయం అగుటచే వృద్ది నొంది చక్కగా ఫలించును.


 * శ్రవణా నక్షత్రం నందు చల్లిన రాజనములు అను ఒక దినుసు ధాన్యము స్వల్పముగా ఫలించును. ఆరుద్రా నక్షత్రము నందు , పుష్యమి నక్షత్రము నందు, భరణి నక్షత్రము నందు, పునర్వసు నక్షత్రము నందు, రోహిణి నక్షత్రము నందు, మాఘ నక్షత్రము నందు, నాటిన విత్తనములు వృద్ది నొంది చక్కగా ఫలించును.


 * స్వాతి నక్షత్రము నందు, పుర్వాషాడ నక్షత్రము నందు, పుర్వాబాద్ర నక్షత్రము నందు, ప్రత్తి గింజలు నాటు వేసిన పక్షమున హెచ్చుగా ప్రత్తినిచ్చును. జైష్టా నక్షత్రమున మినుములు చల్లిన యెడల పంట హెచ్చుగా పండును.


 * హస్తా నక్షత్రము నందు,పెసర విత్తనములు, ఆరుద్రా నక్షత్రము నందు నువ్వు విత్తనములు , మూలా నక్షత్రము నందు కంది విత్తనములు నాటిన పక్షమున అనురాధా నక్షత్రము న పత్తి విత్తనములు నాటిన చక్కగా పండును.


 * అశ్వని నక్షత్రము నందు శెనగ విత్తనములు , పుర్వాషాడ నక్షత్రము నందు అలసంద విత్తనములు నాటిన పక్షమున చక్కగా ఫలించును.


 * ఉత్తరా నక్షత్రం నందు, అనురాధా నక్షత్రం నందు, మూలా నక్షత్రం నందు, రోహిణి నక్షత్రం నందు, రేవతి నక్షత్రం నందు విత్తనాలు నాటు వేయుట చాలా మంచిది. 


 * ఉత్తరా నక్షత్రం, రోహిణి నక్షత్రం, అనురాధా నక్షత్రం, రేవతి నక్షత్రం, యందు జొన్న విత్తనాలు నాటుట చాలా మంచిది.


 * భుమి మీద విత్తనములు నాటుటకు అశ్వని నక్షత్రం, ధనిష్టా నక్షత్రం, శతబిష నక్షత్రం, శ్రవణా నక్షత్రం, పునర్వసు నక్షత్రం మధ్యమములు.


 * మకర రాశి యందు , సింహరాశి యందు , వృషభ రాశి, మీనరాశి, కర్కాటక రాశి, విత్తనములు చల్లుటకు చాలా మంచిది. అది చల్లునట్టి లగ్నమున గురుడు ఉండిన బుదుడు, శుక్రుడు ఉండుట చాలా మంచిది.


 * చాయాదేవి కొడుకైన శని మేషము నందు ఉన్నప్పుడు గురుడు వృషభ రాశి యందు ఉన్నప్పుడు ధనస్సు నందు సూర్యుడు ప్రవేశించి మొదలుకుని మాఘ మాసం వరకు స్వాతి నక్షత్రం నందు, ములా నక్షత్రం నందు, అనురాధా నక్షత్రం నందు, మకర రాశి యందు , మీనరాశి యందు , కర్కాటక రాశి యందు చల్లిన పక్షమున జొన్న పంట హెచ్చుగా పండును.


 * పైన వివరించిన నక్షత్రములను ఆ రాశులకు కాక మిగిలిన నక్షత్రముల యందును, రాశుల యందును, జొన్న విత్తనములు నాటవేసిన పక్షమున మూడు వంతుల పంట ఎర్రబడి చెడిపోవును. ఒక్క వంతు మాత్రమే ఫలించును.


 * ముందుగా గంధము , అక్షంతలు, ధూపము, నైవేద్యము అనునవి దున్నిన పొలము మీదను, దున్నేడు యంత్రముకు కుడా సమర్పించవలెను. అలాగే విత్తనములు చల్లు యంత్రముకు కుడా సమర్పించవలెను. అటుపైన సంతోషముతో జొన్నలు మొదలయిన విత్తనములు నాటిన పక్షమున తక్కువ కాకుండా ఫలించును. విత్తనములు చల్లునప్పుడు వేగముగా పగ్గములు అయినను, మోకులు అయినను తెగిపోయినట్లు అయినను , ఎద్దులు మూలిగినను , ఎద్దులు పడిపోయినను ఆ పండిన పంట రాచకార్యముల చేత పాడైపోవును. ముందుగా ఎద్దు పడిపోయిన ఆ దొషం చేత ఆ పంట దొంగలపాలు అయినను పడును. అంతేకాకుండా పండించే డి కాపునకు, వాని తమ్మునుకు గట్టిగా కీడు తగలవచ్చు.


 * విత్తనములు చల్లుటకు పోవునప్పుడు పైడికంటి అను పక్షి, ఎడమవైపు కూసి , నిలిచినను , కుడివైపు గాడిద కాని , ముంగీస కాని , కాకి కాని పోయినను, కుక్క ఎడమ దిక్కుకు పోయినను సంతోషించి ముత్తైదువులు నేసలు చల్లినను, సంతోషంతో బ్రాహ్మణులు వేదములు పటించు చున్నను , విత్తనములు చల్లుచున్నప్పుడు ఎద్దు ఎడమవైపు చాలు చేసిననూ ఆ పైరు చక్కగా ఫలించును.


 * శుక్రుడు , బుదుడు ఉన్న లగ్నం నందు, చంద్రుడు ఉన్నటువంటి యానవంశముల యన్ధైనను ఈ భూమి మీద కలిగిన ధాన్యములు ఏవి చల్లినను తప్పక ఫలించును.


 * దేవతల గురువగు బృహస్పతి లగ్నము నందు ఉండగా విత్తనములు చల్లుట యును , నాల్గోవ ఇంట ఉండగా పైరు కాలం తప్పకుండా కొయుట యును , సప్తమ స్థానం నందు ఉండగా వేగముగా ఆ పైరులు జాగ్రత్తగా పెట్టుకొనుట చాలా మంచిది. కాబట్టి గురుబలం విచారించి మరియు విత్తనములు చల్లవలెను.


 * కొరిక కలిగి పంటలను కోయుటకు పోవుచున్నప్పుడు కాకి కుడి ప్రక్కకు వచ్చి కర్రకర్ర అని కూసినను, దాని కుడి అవయవముల తో ఏదేని చేష్ట చేసినను పంట విస్తారముగా లబించును.


 * పండిన చేను కోయుటకు పోవునప్పుడు ఆలోచించగా విధవ కాని , చెవుల పిల్లికాని, నిప్పు కాని , కసువు కాని ఎదురుగా వచ్చిన పక్షమున పండించుకొన్న పంట దక్కదు.


      గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

జ్యోతిషం_ధర్మశాస్త్రం

 #జ్యోతిషం_ధర్మశాస్త్రం 


#రేపటినుండే_దేవీనవరాత్రులు (6 అక్టోబర్, బుధవారం)


              చాలామంది నవరాత్రులను పంచాంగం లో ఆశ్వయుజమాసం ప్రారంభమైనరోజున, పాడ్యమి ఉదయకాలమునకు 1లేక 2 ఘడియలు ఉన్నా , ఆరోజు నుండే ప్రారంభిస్తున్నారు. ఆశ్చర్యమేమిటంటే ఈ పద్ధతి 16 వ శతాబ్దానంతర ధర్మశాస్త్ర గ్రంధాలలో మాత్రమే ఉన్నది. ద్వైతనిర్ణయీ అనే ధర్మశాస్త్రగ్రంధ రచయిత అయిన శంకరభట్టు తన గ్రంధంద్వారా ఈ తప్పుడు పద్ధతి ప్రారంభించాడు. ఈయన అనుయాయులైన విష్ణుభట్టు (పురుషార్థ చింతామణి), కమలాకరభట్టు ( నిర్ణయ సింధు) మొదలైనవారు ఈ పాటనే పాడారు. 16 వ శతాబ్దం ముందు రాయబడిన ధర్మశాస్త్రగ్రంధాలలో వేనిలోనూ ఇలా లేదు. 12 వ శతాబ్దపు ధర్మశాస్త్రకారులైన #హేమాద్రి , 13 వ శతాబ్దపు #మాధవాచార్యులు ( కాలమాధవం) మొదలైనవారు నవరాత్రులను #నక్తవ్రతం గా పేర్కొన్నారు. 

నక్తవ్రతమంటే - పగలు ఉపవాసముండి రాత్రి పూజానంతరం భోజనము చేయడం. 


         నక్తవ్రతానికి నియమం ఏమిటంటే, తిథి ప్రదోష సమయానికి ఉండాలి. ఏ రోజు ఎక్కువ ఉంటే ఆరోజే ఉపవాసముండాలి. అందువలన, నవరాత్రులను పాడ్యమి ఘడియలు ప్రదోషానికి ఉన్నరోజునే ప్రారంభించాలి. అసలు ఏ ఉపవాసానికైనా ( ఏకభుక్తం, నక్తం,ఉపవాసం, అయాచితం) అమావాస్యతో కలిసిన తిథికే పవిత్రత గానీ, విదియ తో కలిసినది అపవిత్రము అని సాధారణ ధర్మశాస్త్రనియమం. 

#ఏకాదశీ_తథాషష్ఠీ_అమావాస్యా_చతుర్థికా। 

#ఉపోష్యాః_పరసంయుక్తాః_పరాః_పూర్వేణసంయుతాః ॥ 

అందువలన అమావాస్య తో కూడిన పాడ్యమినాడే ఉపవాసముండాలి. అందువలననే #కాలమాధవం లో మాధవాచార్యులు ( విద్యారణ్యులు) -

#ఏతేషు_సర్వేషువచనేషు_ప్రతిపదః_పూర్వవిద్ధాయాః_పూజ్యత్వం_ప్రతీయతే అని స్పష్టంగా చెప్పారు. 


#పురుషార్థచింతామణి కారుడైన విష్ణుభట్టు నవరాత్రులకు ఉపవాసమనేది గౌణమే కానీ ప్రధానం కాదనీ, విద్యారణ్యుల వచనాలు మనం పట్టించుకోనక్కరలేదనీ రాసాడు. ఆ విధంగా తన తప్పుడు నిర్ణయాలను సమర్థించుకునే ప్రయత్నం చేసాడు. హైందవసామ్రాజ్య స్థాపకులూ , శృంగేరీ జగద్గురువులూ నైన విద్యారణ్యులను పట్టించుకోనక్కరలేదట ! ఈ రాతలు కలిపురుషప్రేరేపణలు కాక మరేమిటి? 


📌#అసలు_నవరాత్రులప్పుడు_ఏమి_చేయాలి? 


దీనికి సమాధానం #దేవీభాగవతం లో నారదమహర్షి శ్రీరామచంద్రమూర్తి కి ఇలా తెలియజేసాడు -

#నవరాత్రోపవాసంచ_భగవత్యాఃప్రపూజనమ్। 

#సర్వసిద్ధికరం_రామ_జపహోమవిధానతః॥ 

                               3వస్కంధం , 30అ-19శ్లో

   అందువలన ఉపవాసం ముఖ్యమని తెలుస్తోంది. 


📌#అయితే , #భాద్రపద_అమావాస్య నాడు #సంకల్పం ఎలా #నవరాత్రులకు ఎలా చెబుతాం ? 


జ్యోతిషశాస్త్రానుసారం పాడ్యమి సాయంత్రం వస్తుంటే, ఉదయం అమావాస్య ఘడియలలో పాడ్యమి సంకల్పం ఎలా చెబుతామన్న ప్రశ్నకు సమాధానం - ధర్మశాస్త్రం చెప్పమన్నది కాబట్టి. 


    మీకు అర్థమయ్యేలా చెబుతాను - 

ఎవరైనా ఉగాదినాడు మరణించారనుకోండి, మృతుని పుత్రుడు అతనికి ప్రత్యాబ్దికం ఎప్పుడు పెట్టాలి? పాడ్యమికి అపరాహ్నవ్యాప్తి ఎప్పుడుంటే అప్పుడు పెట్టాలి. అంతేకదా ! 


ఒక సంవత్సరంలో ఫాల్గున అమావాస్య బుధవారం మధ్యాహ్నము 1-15 వరకూ ఉన్నది. మరునాడు గురువారం నాడు పాడ్యమి సాయంత్రం 4-30 వరకూ ఉన్నది. అపుడు ఆ మృతుని పుత్రుడు బుధవారంనాడే ప్రత్యాబ్దికం పెట్టాలి. మరి #సంకల్పం? నూతన సంవత్సర పాడ్యమి కే చేయాలి కదా! ఈ ధర్మశాస్త్ర నియమాన్నే ఆపాదించుకుని #నవరాత్రులకు కూడా #సంకల్పం చెప్పాలి. ఈ విషయాన్నే విద్యారణ్య గురువులు తమ #కాలమాధవం లో 


" వచనబలాత్ ప్రాతరేవ సంకల్పః కార్యః । తదానీం జ్యోతిశ్శాస్త్రప్రసిద్ధ ప్రతిపదభావేऽపి స్మృతిభిరాపాదితాయాః ప్రతిపత సత్త్వాత్ । "


         అందువలన నేను నా పంచాంగంలో భాద్రపద అమావాస్య నాడే నవరాత్రారంభం రాయడం జరిగింది. నేను వ్యక్తిగతంగా గత దశాబ్దకాలంనుండీ ఇలాగే చేస్తూ వస్తున్నాను. స్మార్తులే గాక, శాక్తేయులంతా రేపటి నుండే నవరాత్రులు ప్రారంభించాలని #శ్రీవిద్యార్ణవతంత్రం , #రుద్రయామళతంత్రం , #పరమానందతంత్రం , #నిత్యాతంత్రం అనే గ్రంథాలు తెలియజేస్తున్నాయి. 


సర్వం శ్రీ జగదంబార్పణమస్తు 🙏

సంస్కృత మహాభాగవతం

 *8.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పండ్రెండవ అధ్యాయము*


*సత్సంగముయొక్క మహాత్మ్యము - కర్మవిధి - కర్మత్యాగవిధి*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీభగవానువాచ*


*12.17 (పదిహేడవ శ్లోకము)*


*స ఏష జీవో వివరప్రసూతిః ప్రాణేన ఘోషేణ గుహాం ప్రవిష్టః|*


*మనోమయం సూక్ష్మముపేత్య రూపం మాత్రా స్వరో వర్ణ ఇతి స్థవిష్ఠః॥12679॥*


*శ్రీభగవానుడు నుడివెను* ఉద్ధవా! విశ్వమంతటను పరమాత్మయే నిండియున్నాడు. *జీవయతీతి జీవః* అనగా పరమాత్మయే అన్నింటికిని చేతన శక్తిని, జీవనశక్తిని ప్రదానము చేయువాడు. కనుక జీవరూపములో నుండెడివాడు పరమాత్మయే. ఆ పరమేశ్వరుడు (జీవుడు) మొదట అనాహత నాదస్వరూప *పరా* వాణీరూపములో ప్రాణముతో గూడ మూలాధార చక్రమున ప్రవేశించును. పిమ్మట మనస్సునుండి మనోమయ రూపమును గ్రహించి, మణిపూరచక్రమునందు *పశ్యంతీ* అను పేరుతో వాక్కుయొక్క సూక్ష్మరూపమును ధరించును. ఇట్లు కంఠస్థానమునందుగల విశుద్ధచక్రము నందు చేరి *మధ్యమ* అను పేరుగల రూపమును దాల్చును. అనంతరము ముఖమున జేరి అకారాది మాత్రలు, స్వరములు, వర్ణములు - మొదలగు రూపములలో *వైఖరీ* అను పేరుతో వాక్కుయొక్క స్థూలరూపమును ధరించును. ఇట్లు శబ్దబ్రహ్మరూపమున పరమాత్మ అభివ్యక్తుడగునని భావింపవలెను.


*12.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*యథానలః ఖేఽనిలబంధురూష్మా బలేన దారుణ్యధిమథ్యమానః|*


*అణుః ప్రజాతో హవిషా సమిధ్యతే తథైవ మే వ్యక్తిరియం హి వాణీ॥12680॥*


ఆకాశమున అగ్ని విద్యుద్రూపమున స్థిరమైయుండును. ఆ అగ్నియే అరణియందు మథించినప్పుడు వాయువుతోడై అగ్నికణముగా వెలువడును. ఈ అగ్నియందు హవిర్ద్రవ్యము చేరినప్పుడు ప్రజ్వలితమగును. ఇట్లు వాక్కుగూడ సూక్ష్మరూపమున ప్రారంభమై, స్థూలరూపమున ప్రకటితమగును. ఇదేవిధముగా శబ్దబ్రహ్మయొక్క రూపమున నేనే అభివ్యక్తుడనగుచున్నాను.


*12.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*ఏవం గదిః కర్మగతిర్విసర్ ఘ్రాణో రసో దృక్స్పర్శః శ్రుతిశ్చ|*


*సంకల్పవిజ్ఞానమథాభిమానః సూత్రం రజఃసత్త్వతమోవికారః॥12681॥*


ఇదే విధముగా ఇతరక్రియలందును నా రూపమే అభివ్యక్తమగుచున్నట్లు భావింపుము. మాట్లాడుట, కర్మలను ఆచరించుట, నడచుట, మలమూత్రములను విసర్జించుట, ఆఘ్రాణించుట, రుచి చూచుట, దర్శించుట, స్పృశించుట, వినుట, మనస్సుద్వారా సంకల్ప వికల్పములను జరుపుట, బుద్ధిద్వారా అవగాహనచేసికొనుట, అభిమానించుట మొదలగు అన్ని క్రియలును, మహత్ తత్త్వము, సత్త్వరజస్తమో గుణముల వికారములు, అంతేగాక దృశ్యప్రపంచము - సమస్త కర్తా, కరణ, కర్మలు అన్నియును నా అభివ్యక్తములే అని ఎరుంగుము. ఈ రూపములన్నింటిలో పరమాత్మనైన నేనే ప్రకాశించుచున్నాను.


*12.20 (ఇరువదియవ శ్లోకము)*


*అయం హి జీవస్త్రివృదబ్జయోనిరవ్యక్త ఏకో వయసా స ఆద్యః|*


*విశ్లిష్టశక్తిర్బహుధేవ భాతి బీజాని యోనిం ప్రతిపద్య యద్వత్॥12682॥*


*12.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*యస్మిన్నిదం ప్రోతమశేషమోతం పటో యథా తంతువితానసంస్థః|*


*య ఏష సంసారతరుః పురాణః కర్మాత్మకః పుష్పఫలే ప్రసూతే॥12683॥*


సత్త్వరజస్తమోగుణాత్మకమైన ఈ బ్రహ్మాండము అను కమలముయొక్క ఉత్పత్తికి కారణమైనవాడు ఆ పరమేత్మయే. అవ్యక్తమైన ఆ ఒకే పరబ్రహ్మము పెక్కురూపములలో వ్యక్తమగుచున్నాడు. ఆ ప్రభువు పురాణపురుషుడు, అన్నింటికిని ఆద్యుడు. అతడే తనకు తానుగా పెక్కుశక్తులలో విభాజితుడై దేవమనుష్యాది రూపములలో భాసిల్లుచు, సర్వత్ర ఆయా రూపములలో విరాజిల్లుచున్నాడు. భూమిలో నాటబడిన విత్తనము అనేక రూపములలో అభివ్యక్తమైనట్లు, ఈ విశ్వము పరమాత్మనుండి ఉజ్జీవనీశక్తిని పొంది, అనేకరూపములలో ప్రకటితమగును. కనుక ఈ విశ్వము అంతయును పరమాత్మయొక్క స్వరూపమే. వస్త్రమునందు దారములు ఓతప్రోతములయినట్లు పరమాత్మయే ఈ విశ్వమునందు పడుగుపేకలవలె ఓతప్రోతమై యున్నాడు. అనగా ఆ పరమాత్మయే వ్యాప్తమైయున్నాడు. ఈ సంసారవృక్షము మిక్కిలి పురాతనమైనది. కర్మలపరంపరయు అనాదికాలమునుండి అవిచ్ఛిన్నముగా కొనసాగుచున్నది. కనుక వాటినుండియే సుఖదుఃఖములనెడు పుష్పఫలములు ఉత్పన్నమగుచున్నవి.


*12.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*ద్వే అస్య బీజే శతమూలస్త్రినాలః పంచస్కంధః పంచరసప్రసూతిః|*


*దశైకశాఖో ద్విసుపర్ణనీడస్త్రివల్కలో ద్విఫలోఽర్కం ప్రవిష్టః॥12684॥*


ఈ సంసారవృక్షమునకు 'పాపపుణ్యములు' అను రెండును విత్తనములు. వందలకొలది విషయవాసనలు దీనికి వ్రేళ్ళు. సత్త్వరజస్తమోగుణములు అను మూడును దీని కాండములు. పంచమహాభూతములనెడి ఐదును దీని పెద్దకొమ్మలు. వాటినుండి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనెడి (పంచతన్మాత్రలు) ఐదురసములు వెలువడును. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియములు, మనస్సు అనెడి పదకొండును దీని శాఖలు. జీవుడు, ఈశ్వరుడు అను పక్షియుగళముతో గూడిన హృదయమనెడి పద్మమే దీని గూడు. వాత, పిత్త, శ్లేష్మములు అనుమూడు దీని బెరడులు. ఇది భోగమోక్షములు అనెడి ఫలములను ఇచ్చును. జీవుని రూపములో నున్న ఈ పక్షి ప్రవృత్తికర్మయందు ఆసక్తమైనచో భోగము అను ఫలమును, నివృత్తికర్మయందు ఆసక్తమైనచో ముక్తి యను ఫలమును అనుభవించును. విశాలమైన ఈ సంసారవృక్షము సూర్యమండలము వరకు వ్యాపించి యున్నది. ఈ సూర్యమండలమును ఛేదించుకొని పోయెడి ముక్తపురుషులు తిరిగి సంసారచక్రమునందు చిక్కుకొనరు.


*12.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*అదంతి చైకం ఫలమస్య గృధ్రా గ్రామేచరా ఏకమరణ్యవాసాః|*


*హంసా య ఏకం బహురూపమిజ్యైర్మాయామయం వేద స వేద వేదమ్॥12685॥*

 

విషయాభిలాషగల అజ్ఞానులు దుఃఖరూప ఫలములను అనుభవించెదరు. విషయాసక్తులు కాని జ్ఞానులు మోక్షరూపఫలమును పొందుదురు. పరమహంసలైన మహాత్ములు సకలరూపములలోను అద్వితీయ బ్రహ్మనే దర్శింతురు. వేదములలోని ఈ సారాంశమును ఎరిగినవారే యథార్థముగా వేదవిదులు.


*12.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*ఏవం గురూపాసనయైకభక్త్యా విద్యాకుఠారేణ శితేన ధీరః|*


*వివృశ్చ్య జీవాశయమప్రమత్తః సంపద్య చాత్మానమథ త్యజాస్త్రమ్॥12686॥*


ఉద్ధవా! నీవు ఈ విధముగా ధీరుడవై, అనన్యభక్తి పూర్వకముగా గురువును ఉపాసించినచో జ్ఞానసంపన్నుడవు అగుదువు. పిమ్మట సావధానముగా జ్ఞానరూపకుఠారము (పరశువు) చేత జీవభావమును ఛేదింపుము (త్యజింపుము). ఆత్మస్వరూపుడనైన నన్ను పొందిన పిమ్మట ఆ జ్ఞానరూప సాధననుగూడ త్యజింపుము.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే ద్వాదశోఽధ్యాయః (12)*


ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *సత్సంగముయొక్క మహాత్మ్యము - కర్మవిధి - కర్మత్యాగవిధి* అను పండ్రెండవ అధ్యాయము (12)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*442వ నామ మంత్రము* 8.10.2021


*ఓం కుమార గణనాథాంబాయై నమః*


కుమారస్వామికి, గణేశ్వరునికి తల్లి అయిన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కుమార గణనాథాంబా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం కుమార గణనాథాంబాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబికను ఆరాధించు భక్తులను ఆ తల్లి వారిని తన పుత్రులైన కుమారస్వామి, గణేశ్వరులతో సమానముగా తన పుత్రులుగా భావించి వారికి కావలసిన భౌతికపరమైన ఆముష్మికపరమైన శాంతిసౌఖ్యములను ప్రసాదించును.


కుమారస్వామి, గణనాథుడు అనువారు అమ్మవారి పుత్రులు. 


*కుమారస్వామి జననము*


సురాపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు అనే రాక్షసులు లోకకంటకులై దేవతలనూ, మానవులను బాధిస్తున్నారు. శివపార్వతుల ఔరస కుమారుడే వీరిని చంపగలడని బ్రహ్మ తెలిపాడు. తన పూలబాణాలతో శివుని తపస్సు భంగముచేసి ప్రణయములోనికి దింపాలని ప్రయత్నించిన మన్మధుడు శివుని కోపాగ్నికి భస్మమయ్యాడు. శివునినుండి వెలువడిన దివ్యతేజస్సు ఆరుభాగాలుగా విభజింపబడింది. వాటిని వాయువు, అగ్ని దేవుళ్ళు గంగానదిలో ఉంచారు. అవి ప్రవాహంలో వెళ్ళి ఒక వనంలో శరంలో (రెల్లుగడ్డిలో) చిక్కుకొని ఆరు చక్కని బాలురుగా మారాయి. వాటికి కార్తీక నక్షత్ర దేవతలు జోలపాడారు. విషయం తెలిసిన పార్వతి 'స్కందా' అని పిలుస్తూ వారిని అక్కున చేర్చుకోగా వారు ఆరు ముఖాలూ, పండ్రెండు చేతులూ గల ఒకే బాలునిగా అవతరించారు. అందుకే ఆయనకు అన్ని పేర్లు వచ్చాయి.


*షణ్ముఖుడు* - ఆరు ముఖాలు గలవాడు


*స్కందుడు*- పార్వతి పిలచిన పదాన్ని బట్టి


*కార్తికేయుడు* - కృత్తికా నక్షత్ర సమయంలో అవతరించాడు


*వేలాయుధుడు* - శూలము ఆయుధంగా గలవాడు


*శరవణభవుడు* - శరవణము అంటే ఱెల్లుగడ్డిలో అవతరించినవాడు


*గాంగేయుడు* - గంగలోనుండి వచ్చినవాడు


*సేనాపతి* - దేవతల సేనానాయకుడు


*స్వామినాథుడు* - శివునకు ప్రణవ మంత్రము అర్ధాన్ని చెప్పినవాడు


*సుబ్రహ్మణ్యుడు* - బ్రహ్మజ్ఙానము తెలిపినవాడు


*మురుగన్* - అందమైన వాడు (తమిళం)


*గణపతి జననము*


ఒకసారి పార్వతి శంకరునకు స్వాగతము పలుకుటకై సన్నాహమందున్నది. తనలో తాను ఉల్లసిస్తూ, స్నానాలంకారముల ప్రయత్నములో తనకై ఉంచిన నలుగుపిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది. దానికి ప్రాణప్రతిష్ట చేయవలెననిపించినది. అంతకు పూర్వమే ఆమె తన తండ్రియగు పర్వత రాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది, ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేసినది. ఆ దివ్యసుందర బాలుని వాకిటిలో ఉంచి, స్నానమునకై వెళ్ళినది.


శివుడు తిరిగి వచ్చాడు, వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతరమందిరము లోనికి పోనివ్వక నిలువరించాడు. తన మందిరమున తనకే అటకాయింపా! శివుడు రౌద్రముతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోనికేగినాడు.


జరిగిన దానిని విని పార్వతి విలపించింది. శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికించి ఆ శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోకపూజనీయతను కలిగించాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దులపట్టియైనాడు. విగతజీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకుని వాహనమై శాశ్వతస్థానమును పొందాడు. గణపతిని ముందు పూజించాలి.


జగన్మాత ఆ విధంగా కుమారస్వామి, గణనాదులకు తల్లి యగుటచే, *కుమారగణనాథాంబా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం కుమారగణనాథాంబాయై నమః* అని యనవలెను

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*441వ నామ మంత్రము* 8.10.2021


*ఓం కౌళమార్గ తత్పర సేవితాయై నమః*


శ్రీవిద్యోపాసనలో గల సమయ, కౌళ, మిశ్రమములు అను మూడుమతములలో కౌళమార్గతత్పరులచే సేవింపబడు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కౌళమార్గ తత్పర సేవితా* యను పదియక్షరముల (దశాక్షరీ) నామ మంత్రమును *ఓం కౌళమార్గ తత్పర సేవితాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబికను ఉపాసించు సాధకులకు, ఆ తల్లి కరుణచే విశేషమైన ఆ పరమేశ్వరీ తత్త్వము తెలిసి, తన్మూలంగా తమ సాధనపటుత్వమును పొంది తరింతురు.


శ్రీమాతను ఆరాధించుటలో వివిధ మార్గములు గలవు. అవి సమయాచారము, కౌళమార్గము, మిశ్రమమార్గము. వంశపారంపర్యముగా దేవీ ఆరాధన చేయుటనే కులాచారము అనియు, అదియే కౌళాచారమనియు అందురు. ఈ కౌళాచారులు వంశానుక్రమంగా అమ్మవారిని సేవించుచూ, ఆ కౌళమార్గములో చెప్పిన ప్రకారము జంతుబలులు, వివిధరీతుల నైవేద్యములు, మద్యము అమ్మవారికి సమర్పింతురు. ఈ ఆచారమునే కౌళాచారము అందురు. కౌళాచారులు అమ్మవారి స్వరూపమును ఉగ్రస్వరూపంగా తలచుదురు. నూకాలమ్మ, మరిడమ్మ, అసిరమ్మ మొదలైన వివిధనామములలో గల కొండదేవతలు, గ్రామదేవతలు వీరు అందరూ కౌళాచార మార్గమునందు సేవింపబడుచూ, భక్తులను తరింపజేయుదురు. కంచికామాక్షి ఉగ్రస్వరూపంలో ఉండి భయంకర రూపంలో ఉండేదట. ఆదిశంకరులవారు ఆ తల్లిని శాంతమూర్తిగా పరివర్తింపజేసి తరించారు.   


శ్రీవిద్యోపాసనమందు సమయమతము, కౌళమతము, మిశ్రమమతమని మూడు మతములు గలవు. శుకసంహిత, వశిష్ఠ సంహిత మొదలగు ఐదు సంహితలయందు చెప్పబడిన మతము సమయమతము. ఇది పూర్తివైదీకము. చంద్రతంత్రము, కులతంత్రము మొదలగు ఎనిమిది తంత్రములందు కౌళాచారము చెప్పబడినది. మిశ్రమమతము నందు తాంత్రికము, వైదికము రెండునూ ఉండును. కౌళమార్గము కేవలం తాంత్రికమార్గము మాత్రమే. ఉదాహరణకు- అమ్మవారి పండుగ జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో అందరూ చేరి కోడి, మేక, దున్నపోతు మొదలైన జంతువులను బలి ఇచ్చి, ఆ మాంసము, మద్యము సమర్పిస్తారు. ఈ కార్యక్రమం కేవలం తాంత్రికం తప్ప వైదిక మంత్రయుతంగా ఉండదు. బ్రాహ్మణుడు ఈ తంత్రమందు పాల్గొనుట జరుగదు. కొండకోనల్లో జరిగా కౌళాచార ఆరాధనలో బలులతోబాటు, మద్యమును సమర్పిస్తూ, డప్పులు, అగ్నిగుండములు మొదలైన విశేషమైన తాంత్రిక పద్ధతులలో అమ్మవారిని సేవిస్తారు. ఇటువంటి మార్గమునే కౌళమార్గమనియు, కౌళమార్గములో ఆరాధింపబడుతుంది గనుక అమ్మవారు *కౌళమార్గతత్పర సేవితా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం కౌళమార్గ తత్పర సేవితాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐-

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🙏🙏🙏*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*439వ నామ మంత్రము* 7.10.2021


*ఓం కులేశ్వర్యై నమః*


సజాతీయమైన మాతృకా సమూహమునకు *కుళ* యని పేరు. అట్టి సమూహానికి అధీశ్వరి అయిన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కులేశ్వరీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం కులేశ్వర్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు భక్తులను బ్రహ్మజ్ఞానసముపార్జనాసక్తులుగా పరివర్తింపజేసి, ఆ మార్గములో సాధన కొనసాగునట్లు వారిని అనుగ్రహించును.


మూలాధారచక్రము, స్వాధిష్టానచక్రము, మణిపూరచక్రము, అనాహతచక్రము, విశుద్ధిచక్రము, ఆజ్ఞాచక్రము - ఈ మార్గానికి సుషుమ్నా మార్గం అందురు. ఈ మార్గంలోనే కురుకుళ్ళాదేవి సంచరిస్తూ ఉంటుంది. ఈ సుషుమ్నా మార్గముపై ఆధిపత్యం వహిస్తూ ఉంటుంది. ఆ దేవతయే కులేశ్వరి. అట్టి కులేశ్వరి స్వరూపిణియైన పరమేశ్వరి *కులేశ్వరీ* యని అనబడుచున్నది. డెబ్బదిరెండువేల నాడీ మండలమును కూడా కులము అని అంటారు.అట్టి కులమునకు అధీశ్వరియైన పరమేశ్వరి *కులేశ్వరీ* యని అనబడుచున్నది. ఇంతకు ముందు నామ మంత్రములో అమ్మవారిని కురుకుళ్ళా యని స్తుతించాము. అట్టి కురుకుళ్ళాయే *కులేశ్వరీ* యని కూడా అనబడుచున్నది. సజాతీయులైనటువంటి మాతృ, మాన, మేయముల సమూహమే కులము. అటువంటి కులమునకు ఈశ్వరి జగన్మాత గనుక,ఆ తల్లి *కులేశ్వరీ* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం కులేశ్వర్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🙏🙏🙏🙏🙏🙏నమో నమః గురువు గారు🙏🙏🙏మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు గురువుగారు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి సంఖ్య 7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

సంస్కృత మహాభాగవతం

 *7.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పండ్రెండవ అధ్యాయము*


*సత్సంగముయొక్క మహాత్మ్యము - కర్మవిధి - కర్మత్యాగవిధి*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*12.9 (తొమ్మిదవ శ్లోకము)*


*యం న యోగేన సాంఖ్యేన దానవ్రతతపోఽధ్వరైః|*


*వ్యాఖ్యాస్వాధ్యాయసన్న్యాసైః ప్రాప్నుయాద్యత్నవానపి॥12671॥*


ఉద్ధవా! కొందరు మహాత్ములు యోగము, సాంఖ్యము, దానము, వ్రతము, తపస్సు, యజ్ఞములు, శాస్త్రాధ్యయనము, అధ్యాపనము, సన్న్యాసము మొదలగు వాటిద్వారా గట్టిగా పూనిక వహించియు, నా కృపకు పాత్రులు కాలేకపోయిరి. కానీ, సత్సంగము ద్వారా వారు నన్ను పొందగలిగిరి.


*12.10 (పదియవ శ్లోకము)*


*రామేణ సార్ధం మథురాం ప్రణీత శ్వాఫల్కినా మయ్యనురక్తచిత్తాః|*


*విగాఢభావేన న మే వియోగతీవ్రాధయోఽన్యం దదృశుః సుఖాయ॥12672॥*


ఉద్ధవా! గోపికలకు నా యందుగల ప్రేమానురాగములు అపూర్వములు. అక్రూరుడు నన్ను, మా అన్నను వ్రజభూమినుండి మథురకు తీసికొని వచ్చునప్పుడు వారు నా ఎడబాటువలన వ్యాకుల చిత్తలైరి. ఎవ్వరివలనను నా నుండివలె వారికి ఆప్యాయత లభింపదు. గావున, వారు అప్పుడు ఎంతగానో విలవిలలాడిరి.


*12.11 (పదకొండవ శ్లోకము)*


*తాస్తాః క్షపాః ప్రేష్ఠతమేన నీత మయైవ వృందావనగోచరేణ|*


*క్షణార్ధవత్తాః పునరంగ తాసాం హీనా మయా కల్పసమా బభూవుః॥12673॥*


మహాత్మా! ఉద్ధవా! నేను గోపికలకు అత్యంత ప్రీతిపాత్రుడను. అందువలన నేను బృందావనము నందున్నప్పుడు నాతో పాటు రాసలీలలను జరుపుచు, వారు హాయిగా పెక్కు రాత్రులను అరక్షణముగా గడపిరి. కాని, నేను బృందావనము వీడివచ్చిన పిమ్మట నా యెడబాటువలన వారికి ప్రతిరాత్రియు ఒక కల్పప్రాయమై దుర్భరమయ్యెను.


*12.12 (పండ్రెండవ శ్లోకము)*


*తా నావిదన్ మయ్యనుషంగబద్ధధియః స్వమాత్మానమదస్తథేదమ్|*


*యథా సమాధౌ మునయోఽబ్ధితోయే నద్యః ప్రవిష్టా ఇవ నామరూపే॥12674॥*


ఉద్ధవా! నదులు పరుగెత్తుకొనిపోయి సముద్రములో చేరినమీదట తమ నామ, రూపములను కోల్పోయినట్లుగా, మునీశ్వరులు సమాధినిష్ఠలో మునిగినప్పుడు వారికి దేహాధ్యాస నశించినట్లుగా, నేను తప్ప వేరొకటి తెలియకుండా, నా ప్రేమయే సర్వస్వముగా భావించి, లయించిన చిత్తముగల గోపికలకు తమ స్వంతశరీరమే అతనికి చెందినదా! లేక శరీరము వారికి చెందినదా! ఇది - అది అను భేదము ఇంచుకంతయును స్పృహ తెలియనివారై, నాలో తాదాత్మ్యమును చెందెదరు.


*ఒక ముఖ్యగమనిక* - లోకంలో సహజంగా మంగళాచరణము నందు భగవంతుని స్మరించుట పరిపాటి. కాని, ఈ అధ్యాయంలో భగవంతుడు స్వయంగా మంగళాచరణమునందు భక్తులను స్మరించి తన ఉపదేశమునకు ఉపక్రమించుట గొప్ప విశేషము. నిర్హేతుక కృపామయుడు, అవ్యాజమైన ప్రేమమూర్తియగు పరమాత్మకు తన భక్తుల పట్ల గల భక్తిప్రేమభావము ఎంతగొప్పదో, ఇచట స్పష్టముగా నిరూపింపబడినది.


*12.13 (పదమూడవ శ్లోకము)*


*మత్కామా రమణం జారమస్వరూపవిదోఽబలాః|*


*బ్రహ్మ మాం పరమం ప్రాపుః సంగాచ్ఛతసహస్రశః॥12675॥*


అమాయికలైన గోపభామినులు నా సహజస్వరూపమును ఎరుగకున్నను నాయందు గల ప్రేమాను రాగములచేత జారభావముతో ప్రియునిగా నన్ను పొందగోరిరి. ఐనను, నా సాంగత్య ప్రభావమున వేలకొలది గోపికలు పరబ్రహ్మస్వరూపుడనైన నన్ను చేరుకొనిరి.


*12.14 (పదునాలుగవ శ్లోకము)*


*తస్మాత్త్వముద్ధవోత్సృజ్య చోదనాం ప్రతిచోదనామ్|*


*ప్రవృత్తం చ నివృత్తం చ శ్రోతవ్యం శ్రుతమేవ చ॥12676॥*


*12.15 (పదిహేనవ శ్లోకము)*


*మామేకమేవ శరణమాత్మానం సర్వదేహినామ్|*


*యాహి సర్వాత్మభావేన మయా స్యా హ్యకుతోభయః॥12677॥*


కావున ఉద్ధవా! విధినిషేధములను, ప్రవృత్తి, నివృత్తి మార్గములను, ఐహికము మరియు ఆముష్మికమునకు చెందిన విషయములను అన్నింటిని పరిత్యజించి, సర్వాత్మభావముతో నన్నే శరణుపొందుము. ఏలయన, నేను సకల ప్రాణులకును ఆత్మస్వరూపుడను. నన్ను ఆశ్రయించిన వారికి ఎట్టీభయమూ ఉండదు అని శ్రీకృష్ణభగవానుడు ఉద్ధవునితో నుడివెను.


*ఉద్ధవ ఉవాచ*


*12.16 (పదహారవ శ్లోకము)*


*సంశయః శృణ్వతో వాచం తవ యోగేశ్వరేశ్వర|*


*న నివర్తత ఆత్మస్థో యేన భ్రామ్యతి మే మనః॥12678॥*


*ఉద్ధవుడు వచించెను* యోగేశ్వరేశ్వరా! నీవొసంగిన ఉపదేశమును పూర్తిగా వింటిని. కానీ! నాలోగల సంశయము తీరనేలేదు, 'నేను స్వధర్మపాలనము చేయవలెనా? లేక అన్నింటిని పరిత్యజించి, నిన్నే శరణుపొందవలెనా?' అను విషయము ఇంకను నా మనస్సును తికమక పెట్టుచునే యున్నది. కావున నాకు కృపతో విశదపఱుచుము.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పండ్రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

నవావరణ పద్యార్చన*

 *శ్రీ ప్లవ - శరన్నవరాత్రులు - నవావరణ పద్యార్చన*

           రచన: శ్రీశర్మద - స్వర్ణపురి (పొన్నూరు)


ఆశ్వయుజ శుక్ల విదియ: ది.08-10-2021


శార్దూలము: -

శ్రీదేవీ! శరదిందుపూర్ణవదనా! హ్రీంకారబీజాత్మికా!

భూదేవీపరివేష్టితంబగుచు సమ్మోహమ్మునే పర్వితో...

యో దాత్రీ! నవరాత్రపూజ లొహొహో యోహోయనన్ సాగగన్

నీదౌ యుత్సవశోభలీను ప్రభలన్ నీలాభ్రమే నిండెనో!

✍️శ్రీశర్మద

, ప్రతి భారతీయుడి ఛాతీ గర్వంతో విస్తరించాలి ,,,

 ఇప్పుడు ఢిల్లీలో !!


 ఇండియా RAW

 ఇజ్రాయెల్ MOSSAD

 అమెరికా CIA

 రష్యా KGB

 ఇంగ్లాండ్ MI6


 ప్రపంచంలోని మొదటి ఐదు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమావేశం కోసం కూర్చోవడం ఇదే మొదటిసారి. ఇది కొత్త భారతదేశ శక్తి 🇮🇳

  *మొదటి విజయం*,,,,,, మోడీజీ బ్రిటన్‌లో 53 దేశాల సమావేశంలో జనరల్ ప్రెసిడెంట్ అయ్యాడు, రెండు వందల సంవత్సరములు గా ఉన్న భారతీయ బానిసత్వాన్ని తొలగించి భారతదేశాన్ని ప్రపంచ నాయకురాలిగా నిలబెట్టాడు దీని కారణంగా , ప్రతి భారతీయుడి ఛాతీ గర్వంతో విస్తరించాలి ,,,


  *రెండవ విజయం*,,,,, ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల మండలిలో భారతదేశం పెద్ద విజయం సాధించింది ,,, అత్యధిక ఓట్లు సాధించిన సభ్యుడు ,, 97 ఓట్లు అవసరం, 188 ఓట్లు వచ్చాయి ,,,, ఇప్పటికీ భారతదేశ ప్రజలు అడుగుతారు మోడీ ఎందుకు విదేశాలకు వెళ్తాడు ,,,,


  *మూడో విజయం*,,,, ప్రపంచంలోని 25 అత్యంత శక్తివంతమైన దేశాల జాబితా విడుదల చేయబడింది ,,, భారతదేశం నాల్గవ స్థానంలో ఉంది, అమెరికా, రష్యా మరియు చైనా మనకంటే ముందున్నాయి ,,, ఇది మోడీ శకం ,,,


  *నాల్గవ విజయం*,,,, GST నెలవారీ పన్ను వసూలు 1 లక్ష కోట్లు దాటింది ,,,,, ఇది టీ విక్రేత యొక్క ఆర్థికశాస్త్రం ,,,


  *ఐదవ విజయం*,,,, కొత్త సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటులో అమెరికా మరియు జపాన్ లను వెనక్కి నెట్టి భారతదేశం రెండవ స్థానానికి చేరుకుంది ,,,,


  *ఆరవ విజయం*,,,,,,,,,,,,,,,,,, సౌర శక్తి ఉత్పత్తి 2017-18

  చైనా మరియు అమెరికా కూడా ఆశ్చర్యపోయాయి


  *ఏడవ విజయం*,,,,

  భారతదేశం యొక్క GDP ఆకాశాన్ని తాకుతున్నట్లు చూస్తోంది ,,,

  భారతదేశ GDP 8.2%, చైనా 6.7%మరియు అమెరికా 4.2%. ఇప్పుడు కూడా మోడీ ఎందుకు విదేశాలకు వెళ్తున్నారో భారతీయులు చెబుతారు ,,,


  *ఎనిమిదవ విజయం*,,,, భూమి, సముద్రం మరియు ఆకాశం అనే మూడు ప్రాంతాల నుండి సూపర్‌సోనిక్ క్షిపణులను ప్రయోగించిన ప్రపంచంలో మొదటి దేశం భారతదేశం


  *తొమ్మిదవ విజయం*,,,, 70 ఏళ్లలో పాకిస్తాన్ పేదరికాన్ని చూడలేదు, కానీ మోడీ వచ్చిన వెంటనే పాకిస్తాన్ పేద దేశం గా మారింది ,,, వాస్తవానికి పాకిస్తాన్ సంపాదించే సాధనం భారతీయ నకిలీ నోట్ల వ్యాపారం ,,,, ఇప్పుడు మన భారత ప్రధాని దానిని అడ్డుకున్నారు ఇది మోడీ జీ సాధించిన విజయం. . 


  ఇంకా చదవండి 

*పదో విజయం*,,,,,, ఒక విషయం అర్థం కాలేదు ,,,

  2014 లో, కాంగ్రెస్ రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోనీ దేశం పేలవంగా ఉందని, మేము రాఫెల్‌ను..చిన్న జెట్ కూడా పొందలేమని చెప్పారు ,,,, కానీ మోడీ గారు. ..గత ప్రభుత్వంలో ఉన్న లక్షల కోట్ల ఇరాన్ రుణాన్ని తీర్చేశారు... 

   ఫ్రాన్స్ నుండి రాఫెల్ డీల్ కూడా పూర్తయింది, 

ఈనాడు ప్రపంచంలో తిరుగు లేని క్షిపని రష్యా నుండి S-400 కూడా తీసుకోబడింది!

  అంతెందుకు, . .....సమయంలో దేశ డబ్బు ఎక్కడికి పోయింది?


  *పదకొండవ విజయం*,,,, సైన్యానికి బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో రక్షణ కవచం వచ్చింది ,,,

  జమ్మూ కాశ్మీర్‌లో సైన్యం కొరకు 2500 బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో


  *బాహ్య విజయం*,,,,, ఈ 4 సంవత్సరాలలో భారతదేశ అభివృద్ధిలో ఏమి జరిగిందో ఇప్పుడు మీకు చెప్తాను ,,,

  ఆర్థిక వ్యవస్థలో ఫ్రాన్స్‌ను వెనక్కి నెట్టి 6 వ స్థానంలో నిలిచింది ,,,


  *పదమూడవ విజయం*,,,,, ఆటో మార్కెట్‌లో జర్మనీని అధిగమించి 4 వ స్థానంలో నిలిచింది.


 *పద్నాలుగో విజయం* ,,,,,,, విద్యుత్ ఉత్పత్తిలో రష్యాను అధిగమించి 3 వ స్థానంలో నిలిచింది ,,,


  *పదిహేనవ విజయం* ,,,,, వస్త్ర ఉత్పత్తిలో ఇటలీని అధిగమించి నంబర్ 2 గా నిలిచింది ,,,


  *పదహారవ విజయం*,,,,, మొబైల్ ఉత్పత్తిలో వియత్నాంను అధిగమించి నంబర్ 2 గా నిలిచింది ,,,


  *పదిహేడవ విజయం*,,,,, ఉక్కు ఉత్పత్తిలో జపాన్‌ను అధిగమించి నంబర్ 2 గా నిలిచింది ,,,


  *పద్దెనిమిదవ విజయం*,,,,, చక్కెర ఉత్పత్తిలో బ్రెజిల్‌ను అధిగమించి నంబర్ 1 గా నిలిచింది ,,,


  దీనిని మోదీ శకం అంటారు

  మోదీ ప్రభుత్వంలో తీవ్రవాదులు కాశ్మీర్ లోయ నుండి తుడిచిపెట్టుకుపోతున్నారు.

  లష్కరే తోయిబా ఉగ్రవాది నవీద్ జాట్ హతమయ్యాడు

  హిజ్బుల్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

  8 నెలల్లో, 230 మంది ఉగ్రవాదులు..72 హురాన్ సమీపంలో నరకానికి పంపించారు ,,,


  .......పాలనలో తీవ్రవాదులు భయాందోళనలను వ్యాప్తి చేసేవారు

  మోడీ రాజ్ హయాంలో, సైన్యం మరియు ఉగ్రవాదులకు మధ్య పోరాటం భీభత్సంగా ఉంది.

  ఇది మోడీ రాజ్ ఫార్ములా ,,,,


  మోదీపై అవినీతి వ్యూహాలు విజయవంతం కాకపోవడం, అప్పుడు ఒక అభిమన్యుని చంపడం, 2024 లో మోడీని ఓడించడానికి అవినీతి యజమానులు అందరూ కలిసి చక్రవ్యూహాన్ని ఏర్పాటు చేస్తున్నారు, కానీ ఆ అవినీతిపరులు అలా చేయడం వల్ల మోదీ వ్యతిరేకులు మొత్తం నరేంద్ర మోడీ కీర్తి చూసి ఆశ్చర్యపోయారు. చక్రవ్యూహాన్ని విచ్ఛిన్నం చేయడానికి ద్వాపర విద్య అభిమన్యుడు తల్లి గర్భంలో తీసుకున్నారని తెలియదు. అది కూడా పద్మవ్యూహం ప్రవేశించడానికి మరియు నిష్క్రమించడానికి మాత్రమే కాదు, ఈ మోడి అభిమన్యుడు చక్రవ్యూహాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించాడు. తల్లి గర్భం నుండి బయటకు రావడం, ఈ తల్లి భారతి నుండి విద్య తీసుకోబడింది అజేయమైనది, ఓడించలేనిది ,,,,


  


ఇది చదివిన ప్రతి భారతీయుడు

మన మన దేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా రెపరెపలాడుతున్న విషయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయండి. .. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Navaratri

 *Real Fasting of Navaratri at the intellectual level means purification of the soul in the following ways*


*Prathama* - 🌚

 I will leave all my Anger


*Dwitiya* - 🧡

 I will stop Judging People.


*Tritiya* - 🤍

 I will leave all my Grudges.


*Chaturthi* - ❤️

 I will forgive myself & everyone


*Panchami* - 💙

  I will Accept myself & every one AS they are


*Shashti* - 💛

 I will love myself & everyone unconditionally


*Saptami* - 💚

 I will leave all my feelings of Jealousy & Guilt


*Ashtami (durgaashtami)* - 🦚

 I will leave all my Fears


*Navami (mahanavami)* - 💜

 I will offer Gratitude for all the things I have and all which I will get.


*Dashami (vijayadashami)* -

 There is abundance in the universe for all and I will always tap the same and create what I want through unconditional love, Sadhana, nishkama seva and faith. 


_*Wishing You and Your Family a blessed Navaratri.*_

*శ్రీ చక్రం

 *ॐ* *శ్రీ చక్రం*


         *9 ఆవరణలు - 2 వ ఆవరణ*

*9 PERIPHERIES -- 2nd PERIPHERY*


          *సర్వాశా పరిపూరచక్రము* 

*SARVASAPARIPURAKA CHAKRAM*

        *(fulfiller of all desires)*


                *షోడశదళ పద్మము* 

*( గులాబీరంగుగల పదహాఱు దళముల పద్మము)* 

      This Periphery has 16 petals representing 16 Yogini Devathas.The worship of Yogini Devathas is done anticlockwise Starting from the bottom(first petal).

    The Yoginis are

1. *KAAMAAKARSHINI*

2. *BUDHYAAKARSHINI*

3. *AHANKAARAAKARSHINI*

4. *SABDAAKARSHINI*

5. *SPARSAAKARSHINI*

6. *RUUPAAKARSHINI*

7. *RASAAKARSHINI*

8. *GANDHAAKARSHINI*

9. *CHITHTHAAKARSHINI*

10. *DHAIRYAAKARSHINI*

11. *SMRUTHYAAKARSHINI*

12. *NAAMAAKARSHIN* 

13. *BEEJAAKARSHINI*

14. *AATHMAAKARSHINI*

15. *AMRUTHAAKARSHINI*

16. *SAREERAAKARSHINI.*

     These Yogini Devathas represent 

1. *EARTH*

2. *WATER*

3. *FIRE*

4. *AIR*

5. *SKY* , (Elements needed for the formation of gross world)

      In the human body,they are

6. *EARS*

7. *SKIN*

8. *EYES*

9. *TONGUE*

10. *NOSE*

11. *MOUTH (Word, Vaikhari i.e., Audible)*

12. *HANDS*

13. *LEGS*

14. *PAAYU*

15. *UPASTHA*

16. *MIND MODIFICATIONS*.

      Thus the organs of Devi are also the organs in the human.

       There is a correlation of *BRAHMAANDAA* and *PINDAANDA*.

       These 16 Thathwaas are needed for the creation of the world. At the end of the creative cycle the manifested world remains for some time and gets dissolved into Her. 


https://youtu.be/Vv3ln0tW1DI


                   =x=x=x= 


     -- *Raamaayanam Sarma*

           *BHADRACHALAM*