24, అక్టోబర్ 2024, గురువారం

జాగ్రత్తగా చదవండి*

 జాగ్రత్తగా చదవండి*


*దయచేసి చదవడం మిస్ అవ్వకండి*

👇👇👇👇👇👇👇

 వృద్ధులు ఎక్కువగా మాట్లాడితే ఎగతాళి చేస్తారు, కానీ వైద్యులు దానిని ఒక వరంలా చూస్తారు : రిటైర్ అయినవారు (సీనియర్ సిటిజన్లు) ఎక్కువగా మాట్లాడాలని వైద్యులు అంటున్నారు ఎందుకంటే ప్రస్తుతం జ్ఞాపకశక్తి కోల్పోకుండా నిరోధించడానికి మార్గం లేదు. ఎక్కువ మాట్లాడటం ఒక్కటే మార్గం. సీనియర్ సిటిజన్లు ఎక్కువగా మాట్లాడటం వల్ల కనీసం మూడు ప్రయోజనాలు ఉన్నాయి.

  *మొదటిది:* మాట్లాడటం మెదడును సక్రియం చేస్తుంది, ఎందుకంటే భాష మరియు ఆలోచనలు ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి, ముఖ్యంగా త్వరగా మాట్లాడేటప్పుడు, ఇది సహజంగా ఆలోచనను వేగవంతం చేస్తుంది మరియు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. నాన్-వెర్బల్ సీనియర్ సిటిజన్లు జ్ఞాపకశక్తి కోల్పోయే అవకాశం ఉంది.

  *రెండు :* ఎక్కువగా మాట్లాడటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, మానసిక అనారోగ్యాన్ని నివారిస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. తరచుగా ఏమీ మాట్లాడకుండా ప్రతిదీ హృదయంలో ఉంచుకోవడం, ఊపిరాడకుండా మరియు అసౌకర్యంగా అనిపిస్తుంది, కాబట్టి, పెద్దలు ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇవ్వడం మంచిది.

  *_మూడు:_* ప్రసంగం ముఖంలోని చురుకైన కండరాలకు వ్యాయామం చేస్తుంది, గొంతుకు వ్యాయామం చేస్తుంది, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది మరియు కళ్ళు మరియు చెవులను దెబ్బతీసే వెర్టిగో మరియు చెవుడు వంటి దాగి ఉన్న ప్రమాదాలను తగ్గిస్తుంది. 

  *_క్లుప్తంగా చెప్పాలంటే,_* రిటైరైన వ్యక్తిగా, అంటే సీనియర్ సిటిజన్‌గా, అల్జీమర్స్‌ను నివారించడానికి ఏకైక మార్గం మీకు వీలైనంత ఎక్కువ మంది వ్యక్తులతో మాట్లాడటం మరియు చురుకుగా సంభాషించడం. దీనికి మరే ఇతర నివారణ లేదు.

       *(10 మంది సీనియర్ సిటిజన్లకు పంపడం మీకు మంచిది)*

దత్త క్షేత్రములు..!!దత్తావతారాలు🥀

 🥀దత్త క్షేత్రములు..!!దత్తావతారాలు🥀


1. *శ్రీపాద శ్రీ వల్లభ స్వామి - పిఠాపురం*


దత్తుని ప్రథమ దత్తావతారం శ్రీపాద శ్రీ వల్లభుడు జన్మించిన ప్రదేశం. ఆంద్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నది..                 


 *2. కురువపురం* 


ప్రథమ దత్తావతారులైన శ్రీపాదవల్లభులు తపసు చేసిన స్థలం... ఇది హైదరాబాదు, కర్నూలు రూటులో దేవరకద్ర స్టేషను నుండి బస్ లో వెళ్ళవచ్చు.


 *3. గోకర్ణము* 


ప్రథమ దత్తావతారులైన శ్రీపాదవల్లభులు తపసు చేసిన స్థలం ... ఇది కర్నాటక రాష్ట్రము హుబ్లి నుండి బస్ లో వెళ్ళవచ్చు.


 *దత్తావతారం..నృశింహ సరస్వతి.* 


 *4. కరంజా* 


రెండవ దత్త అవతారం, నృశింహ సరస్వతి (శ్రీ గురుడు) జన్మస్థలం...

ఇది మహరాష్ట్ర అమరావతి జిల్లాలో ఉన్నది


 *5. నర్సో బావాడిన* 


శ్రీ గురుడు 12 సం॥తపసుచేసిన స్థలం,... ఇది కొల్హా పూర్ మీరజ్ రూటులో ఉన్నది


 *6. గాణగా పూర్* 


శ్రీ గురుడు 23 సం నివసించినస్థలం, ఇది కర్నాటక గుల్బర్గ వద్ద కలదు. ఇచ్చట శ్రీగురుని నిజపాదుకలు కలవు,

చూడవలసి స్థలం, బీమా-అమరజా సంగమ స్నానం పరమ పవిత్రం


 *7. ఔదుంబర్‌* 


శ్రీ గురుడు చాతుర్మాసం చేసిన స్థలం. ఇది కూడ మహరాష్ట్రలో ఉన్నది.                                   


 *8. మీరజ్.* 


ఇచట శ్రీ గురుడు తపసు చేసిన స్థలం. కొల్హాపూరు రూటులో జైసింగ్ పూరు వద్ద నుండి వెళ్ళవచ్చు.


 *9. శ్రీశైలం* 


శ్రీ గురుడు అంతర్దానమైన ప్రదేశం.

ఈ స్థల దర్శనం చాలా దుర్లభం అంటారు. దత్తాత్రేయ స్వామి అనుగ్రము ఉంటే చేరుకోగలరు

ఇది ఆంద్రప్రదేశ్ కర్నూలు జిల్లా లో ఉంది.

 

 *దత్తావతారం.. మాణిక్య ప్రభువులు.* 


 *మాణిక్య నగర్* 


మూడవ దత్తావతారం,

శ్రీమాణిక్య ప్రభువుల వారి సమాధి, ప్రభువుల వారి సంస్ధానం, కర్నాటక గుల్బర్గా - హైదరాబాదు రూటులో హుమ్నాబాదుకు దగ్గరలో ఉన్నది.

తప్పక చూడవలసిన క్షేత్రము.


 *దత్తావతారం - అక్కల కోటస్వామి.* 


 *10. అక్కల్ కోట* 


నాలుగవ దత్తావతారం,

స్వామిసమర్థ (అక్కల్ కోటస్వామి ) సమాదధి మందిరం ఇది చెన్నై - ముంబాయి రూటులో అక్కల్ కోట స్టేషనులో దిగి బస్ లేదా ఆటో పై వెళ్ళవచ్చు.

తప్పక చూడవలసిన దత్త క్షేత్రము.

 

 


 *11 సాకోరి* 


ఏక ముఖ దత్తుని ఆలయం కలదు. 

ఇది షిరిడికి దగ్గరలో ఉన్నది ఆటోలో వెళ్ళి రావచ్చు


 *12. నాశిక్..* 


ఇచట ఏకముఖ దత్త విగ్రహం ఉంది. ఇది కూడా షిరిడి నుండి వెళ్ళవచ్చు.


ప్రముఖ దత్త క్షేత్రములు.


 *13గిరి నార్* 


ఇచ్చట దత్తపాదుకలు కలవు.

ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది.

ఇది చాలా మహిమగల 10,000 మెట్లు కలిగిన కొండపై ఉన్నది,

ఈ కొండపై దత్తపాదుకలు దర్శిస్తే దత్త అనుగ్రహం తప్పక లభిస్తుందని భక్తుల నమ్మకం


 *14 షేగాం* 


ఇచ్చట మరో దత్త రూపుడు గజానన మహరాజ్ సమాధి మందిరం కలదు

ఇది నాగపూర్ పట్టణంనకు దగ్గరలో కలదు

ఇది కూడ చూడదగ్గ క్షేత్రం.


 *15ఖేడ్గావ్* 


సమర్దనారాయణమహరాజ్ వారి సమాధి కలదు.

ఇది పూనా వద్ద కలదు.


 *16 ఖాoడ్వా.* 


శ్రీ దున వాలా దాదా వారి సమాధిమందిరం ఉంది.

ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో కలదు.


 *17మాణ్ గావ్.* 


శ్రీ వాసుదేవానంద సరస్వతిస్వామి వారి జన్మస్థలం, గురు చరిత్రను అందించిన మహనీయుడు. మహారాష్ట్రలో ఉంది

ఇది చూడదగ్గ క్షేత్రం.


 *18 గరుడేశ్వర్.* 


శ్రీ వాసుదేవానంద సరస్వతిస్వామి వారి సమాధి మందిరం కలదు

గుజరాత్ రాష్ట్రంలో బరోడా జిల్లాలో ఉంది

ఇది తప్పక చూడవలసిన క్షేత్రం


 *19. మౌంటు అబూ* 


ఇచట దత్త శిఖరము కలదు.

రాజస్తాన్ రాష్ట్రములో కలదు...


🙏దిగంబరా దిగంబరా సద్గురు దత్తా దిగంబరా🙏

ఇతరుల ఆస్తిని ఆశించ రాదు

 *ఇతరుల ఆస్తిని ఆశించ రాదు* 

ప్రపంచంలో మనిషి "ఆకర్షితుడయ్యే" రెండు విషయాలు ఉన్నాయి. అవి "స్త్రీ" మరియు "బంగారు".  ఈ రెండింటిపై మోహానికి లోనైన వ్యక్తి తప్పులు చేయడం ప్రారంభిస్తాడు.  ఈ రెండింటిపై కోరిక లేనివాడు "మహాత్మ"అని పిలువబడతాడు. రావణుడు సీతను తప్పుగా చూశాడు.. నశించాడు.అంటే ప్రపంచంలో ఏ స్త్రీని తప్పుగా చూడకూడదు.   

మన భారతీయ సంస్కృతిలో కూడా “ప్రపంచంలోని స్త్రీలందరినీ తల్లులతో సమానంగా చూడాలి” అని చెప్పబడింది!ఎంత దుర్మార్గుడైనా తన తల్లిపట్ల దురుద్దేశాన్ని కలిగి ఉండడు.  స్త్రీలందరినీ తల్లులుగా చూసుకుంటే మనసులో ఎలాంటి తుచ్ఛమైన ఆలోచన కలుగదు.  దేవీమాహాత్మ్యంలో, దేవతలు పరదేవుడిని స్తుతించినప్పుడు, *"స్త్రీలందరూ నీ స్వరూపమే"* అన్నారు.దీన్ని అనుసరించే మార్గాలను మన పూర్వీకులు నేర్పించారు.అందుకు విరుద్ధంగా చేస్తే ఘోర తప్పిదం అవుతుంది. అలాగే ఇతరుల ఆస్తులను కూడా మనం ఆశించకూడదు. 

వీధి అంతా రాళ్లు, మురికి నీరు, మట్టితో నిండిపోయిఉంటే ఎవరి మనసైనా దానిమీదకు మళ్లు తుందా? దానిని పొందుదామనే భావన వస్తుందా? ఇతరుల ఆస్తి పట్ల కూడా మనమూ అదే వైఖరిని కలిగి ఉండాలి.ఈ అలవాటు లేని వారికి, ఇతరుల ఆస్తిని దోచుకోవాలని ఆలోచించే వారికి దుర్యోధనుడి కథ ఒక హెచ్చరిక! దుర్యోధనుడు తన ముత్తాత పిల్లలకు ఆస్తిని ఇవ్వకుండా అన్నింటినీ తానే అనుభవించాలని అత్యాశతో;  అతను దాని ప్రలితాన్ని అనుభవించాడు.ధనవంతుడు కావడం ఆనందం కాదు.అది ఏ సందర్భంలోనైనా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ తత్వాన్ని విస్మరిస్తే అధర్మం, అన్యాయం పెరుగుతాయి.  దీనికి విరుద్ధంగా, "బంగారం" పై మోహాన్ని తొలగిస్తే, మనకు సంతృప్తికరమైన, సంతోషకరమైన జీవితం ఉంటుంది. జీవితాన్ని, సంపదను ఇచ్చేవాడు ఆ పరమేశ్వరుడే...ఎవరికి ఎపుడు ఏదీ ఇవ్వాలో ఆయన నిర్ణయిస్తా డు అనే విషయం ప్రతివారూ గుర్తుపెట్టుకోవాలి.

-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

పోతనను కాపాడిన ఆది వరాహం

 పోతనను కాపాడిన ఆది వరాహం


పోతన తను వ్రాసిన భాగవతాన్ని శ్రీరామచంద్రుడికి అంకితం ఇచ్చాడు. కాని అప్పుడు పరిపాలిస్తున్న రాజు తనకు అంకితం ఇవ్వమని ఎన్నో విధాలుగా ఒత్తిడి చేసాడు. కాని పోతన అందుకు ఒప్పుకోలేదు. ఆ రాజు పోతనను ఎలాగైనా నిగ్రహించి ఐనా భాగవతాన్ని సొంతం చేసుకోవాలని అనుకొన్నాడు. ఒక రోజు ఆ రాజు వేట నెపముతో పోతన నివసిస్తున్న ఇంటి సమీప అడవి ప్రాంతానికి వచ్చాడు. అడవిలో మకాం వెసి తన సైనికులను పోతన ఇంటి వద్దకు వెళ్ళి భాగవతాన్ని తీసుకు రమ్మన్నాడు. ఆ సైనికులు పోతన ఇంటి వద్దకు వెళ్ళేసరికి ఆ ఇంటి ముందు ఒక భారీ తెల్లని అడవి పంది, చాలా ఎత్తుగా కనిపించింది. ఆ పందిని చూసి సైనికులు భయపడి రాజు వద్దకు వెళ్ళారు. రాజు వారిని కోప్పడి తన సైన్యాధిపతులను పంపాడు. వారు కూడా ఆ పందిని చూసి భయపడి వచ్చేసారు. ఇక లాభం లేదనుకొని రాజే బయలుదేరాడు. ఆ రాజు కూడా ఆ పందిని చూసి ఒక బాణం వేసాడు. కాని ఆ పంది గుర్రు అనేటప్పటికి రాజు కూడా వెళ్ళిపోయాడు. కాని రాజు ఆలోచించాడు. అంత పెద్ద పందిని,అది కూడా తెల్లని భారీపంది భూమిపై ఎక్కడా ఉండదు కదా , బహుశా అదీ ఏ మాయో అనుకొన్నాడు. పోతనను రక్షించేందుకు వచ్చిందేమో అనుకొన్నాడు. పశ్చాత్తాపంతో మళ్ళీ పోతన ఇంటి వద్దకు వెళ్ళేసరికి ఆ పంది లేదు. ఇంటి లోనికి వెళ్ళి పోతనను పలకరించాడు. పోతన గారు రాజును ఆహ్వానించగా, రాజు జరిగిన విషయం చెప్పాడు. అది విని పోతన కన్నీళ్ళు పెట్టుకొని బయటకు వచ్చి చూస్తే పంది యొక్క కాలిముద్రలను చూసి ఆ పాదదూళిని తన తలపై వేసుకొన్నాడు. తర్వాత ఒక అత్యద్భుత విషయాన్ని చెప్పాడు. ఆ పందిని రాజు బయట చూసిన సమయంలో పోతన గారు “యజ్ఞ (ఆది) వరాహ మూర్తి” అవతారఘట్టాన్ని తెలుగులోనికి అనువదిస్తున్నాడు. ఆ వరాహమూర్తే పోతనను కాపాడాడు.

🪷🙏🪷

గురువారం*🌷 🌹 *24, అక్టోబర్, 2024*🌹

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🌷 *గురువారం*🌷

🌹 *24, అక్టోబర్, 2024*🌹

      *దృగ్గణిత పంచాంగం*                  


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - శరత్ఋతౌః*

*ఆశ్వీయుజ మాసం - కృష్ణపక్షం*


*తిథి : అష్టమి* రా 01.58 వరకు ఉపరి *నవమి*

*వారం : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం : పునర్వసు* ఉ 06.15 ఉపరి *పుష్యమి* పూర్తిరోజు.


*యోగం  : సాధ్య* (25) తె 05.23 వరకు 

*కరణం : బాలువ* మ 01.32 *కౌలువ* రా 01.58 ఉపరి *తైతుల*


*సాధారణ శుభ సమయాలు*

*ఉ 11.00 - 12.00 సా 04.30 - 05.30*

అమృత కాలం  :*రా 12.53 - 02.35*

అభిజిత్ కాలం  : *ప 11.28 - 12.15*


*వర్జ్యం : మ 02.44 - 04.25*

*దుర్ముహూర్తం : ఉ 09.55 - 10.42 మ 02.34 - 03.21*

*రాహు కాలం : మ 01.19 - 02.46*

గుళికకాళం : *ఉ 08.57 - 10.24*

యమగండం : *ఉ 06.02 - 07.30*

సూర్యరాశి : *తుల* 

చంద్రరాశి : *కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 06.02* 

సూర్యాస్తమయం :*సా 05.41*

*ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  *ఉ 06.02 - 08.22*

సంగవ కాలం   :      *08.22 - 10.42*

మధ్యాహ్న కాలం  :*10.42 - 01.01*

అపరాహ్న కాలం :*మ 01.01 - 03.21*

*ఆబ్ధికం తిధి    : ఆశ్వీజ బహుళ అష్టమి*

సాయంకాలం  :  *సా 03.21 - 05.41*

ప్రదోష కాలం   :  *సా 05.41 - 08.09*

రాత్రి కాలం : *రా 08.09 - 11.27*

నిశీధి కాలం      :*రా 11.27 - 12.16*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.23 - 05.13*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


⚜️🚩 *ఓం శ్రీ దత్తాయ నమః*🌹🙏


*చైతన్యః శాశ్వతఃశాంతో వ్యోమాతీతో నిరంజనః* |

*బిందునాద కలాతీతః తస్మై శ్రీగురవే నమః*


     *ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

 🌹🌷🌹🌷🌹🌷🌷🌹

ధన త్రయోదశి

 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🎻🙏 *ధన త్రయోదశి...!!# 🌹🍀


🌿 వెలుగు దివ్వెల పండుగైన దీపావళి పర్వదినానికి రెండురోజుల ముందు జరుపుకొనే ఉత్సవ విశేషం- ధన త్రయోదశి. ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా, యమ త్రయోదశిగా మనం జరుపుకొంటాం. 🌿


🌳 దీపావళి వేడుకల్లో భాగమే ఈ పండుగ. ఉత్తర భారతదేశంలో దీపావళి సంబరాలు ఐదురోజుల పాటు న్విహిస్తారు. ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ పేరిట ఈ వేడుకల్ని, అత్యంత సంరంభంగా జరుపుతారు.🌳


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌿దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలుకుతున్న సమయంలో ఆ పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. అలాగే, శ్రీహరి బలిచక్రవర్తికి వరాన్ని అనుగ్రహించిన రోజు కూడా ఇదేనని చెబుతారు. తాను భూలోకాన్ని సందర్శించేటప్పుడు సర్వం లక్ష్మీశోభితంగా ఉండాలని దామోదరుణ్ని బలిచక్రవర్తి ప్రార్థించాడు. 


🌸 అంతే కాదు సంపదలను ప్రసాదించే కల్పవృక్షం, కామధేనువు, దేవవైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు. ఆ రోజు ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి. 


🌿 ఎంత చదువు చదివినా.,, ఎన్ని తెలివితేటలు ఉన్నా., శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే జీవితం శూన్యం. అందుకే.. సర్వ సంపద ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈ రోజున శ్రీమహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి, ఆమె ఆశీసులు అందుకుంటారు. 


🌸 శ్రీమహాలక్ష్మి .., ధనానికి ప్రతిరూపం. అందుకే., ఆమె జన్మదినమైన ఈ ఆశ్వయుజ కృష్ణ త్రయోదశిని..‘ధన త్రయోదశి’ అన్నారు.


🌿 ధనానికి అధిదేవత ‘: శ్రీమహాలక్ష్మి.

ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన ‘కుబేరుడు’.


అందుకే., ఈ ధనత్రయోదశి నాడు శ్రీమహాలక్ష్మితో పాటు కుబేరుని కూడా ఆరాధిస్తారు. సాధారణంగా., ఈ లక్ష్మీ పూజను., సాయం సమయంలో ప్రదోష వేళలో వృషభ లగ్నంలో చేస్తారు.


🌸 సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు 90 నిముషాలు ఈ ప్రదోషకాలం ఉంటుంది. ఆశ్వయుజ మాసంలో వృషభలగ్నం రాత్రి సుమారు 7 గంటల నుంచి 9 గంటల వరకూ ఉంటుంది. 


🌿 కనుక ఈ సమయంలో శ్రీమహాలక్ష్మి పూజను చేసుకుంటే చాలా మంచిది. కొన్ని ప్రాంతాలలో శ్రీమహాలక్ష్మి, కుబేరులతో పాటు ధన్వంతరిని కూడా పూజిస్తారు..


ఆశ్వయుజ బహుళ త్రయోదశీ - దీనికే ధనత్రయోదశీ, అని పేరు....!! యమత్రయోదశిగా కూడా వ్యవహరించే ఈ శుభదినానికి ముడివడిన మరో కథ ప్రాచుర్యంలో ఉంది.


   🌹🙏ధనత్రయోదశీ కధ🙏🌹


🌸పూర్వం హిమ అనే పేరుగల రాజు ఉండేవాడు. అతనికి ఒకడే కుమారుడు. ఆ కొడుకుని చిన్నప్పటి నుంచి అలారుముద్దుగా పెంచారు. క్షత్రియుడు కనుక కత్తిసాము మొదలైన క్షత్రియ విద్యలన్నీ నేర్పించారు. కానీ ఈ రాకుమారుడు జాతకరీత్యా అతనకి వివాహం జరిగిన నాలుగో రొజుకు మరణిస్తాడని పురోహితులు చెప్తారు.


🌿అయినా, ఓ రాకుమారి అతడిని ఇష్టపడి పెళ్ళి చేసుకుంటుంది. తన పసుపు కుంకాలను తానే కాపాడుకుంటానని శపధం చేస్తుంది. నాలుగవ రోజు రాకుమారుడి గది ముందు ఆభరణాలు రాసులుగా పోస్తుంది. దేదీప్యమానంగా దీపాలను వెలిగిస్తుంది. రంగురంగుల రంగవల్లులు దిద్దుతుంది. తన ఆరాధ్య దేవతయైన లక్ష్మీదేవిని కీర్తిస్తూ శ్రావ్యంగా పాటలు పాడుతుంది. 


🌸రాకుమారుడి ప్రాణాలు తీసుకువెళ్ళడానికి యమధర్మ రాజు పాము రూపం ధరించి వస్తాడు. బంగారు ఆభరణాల మీద దీపపు కాంతి పడి, ఆ గదంతా వెలుగు విరజిమ్ముతున్నాయి. ఆ నెరుపు తళుకులకు ఈ పాము చూపు మందగిస్తుంది. ఆదుగు ముందుకు వేయలేకపోతాడు. ఈ యువరాణి సంగీతానికి పరవశించి వచ్చిన పని మర్చిపోయి, ఆమె సంగీతం వింటూ ఉంటాడు.  ఇంతలోనే తెల్లారిపోతుంది. యమ ఘడియలు దాటిపోవడంతో, ఖాళీ చేతులతో వెళ్ళిపోతాడు.


🌿అందువల్ల ఈ రోజు యముడికి ప్రీతికరంగా యమదీపం వెలిగిస్తారు. ఉత్తరాదిలో ఈ రోజు సాయంత్రం ఆరుబయట, అన్నాన్ని రాశిగా పోసి యమదీపం వెలిగిస్తారు.


🌸ఆశ్వయుజ బహుళ త్రయోదశి (అంటే నరక చతుర్దశికి ముందు వచ్చే తిధి). దీన్నే "ధన త్రయోదశి" అంటారు.


🌿ఈనాటి రాత్రి అపమృత్యువు నివారణకై నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి, పూజించి, ఇంటి ముందు ఉంచాలి. దీనికి "యమ దీపం" అని పేరు. యముని అనుగ్రహం పొందడం కోసం ఈ దీపాన్ని వెలిగించాలి.


    🌷ధనత్రయోదశి పూజ🌷


🌸ధనత్రయోదశినాడు లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ట చేసి త్రయోదశి, చతుర్ధశి, అమావాస్యలలో మహాలక్ష్మీ పూజను అఖండ శ్రీసూక్త పారాయణంతో అమావాస్యనాడు లక్ష్మీపూజనముతో మూడు రోజుల వ్రతం ముగుస్తుంది. 


🌿ఈ వ్రతము పద్మ, స్కాంద, బ్రహ్మాండ పురాణ ప్రోక్తం. ఈ వ్రతమును ఆశ్వయుజ కృష్ణ అష్టమి నాటి నుంచి ప్రారంభించే ఆచారం కూడా ఉంది. పురాణ సముచ్ఛయానుసారం భాద్రపద కృష్ణ అష్టమి నుండి ఆశ్వయుజ కృష్ణ అష్టమి వరకు లక్ష్మీఆరాధన చేయాలి. 


🌸అలాగే కన్యాసంక్రమణానికి ముందే ఈ వ్రతాన్ని ముగించాలని పౌరాణికుల అభిప్రాయం.


🌿త్రేతాయుగంలో మదనబిల్వుడు అను మహారాజు లక్ష్మీ అనుగ్రహం కోసం లక్ష్మీదేవిని ప్రతిష్టించి, మూడు రోజులు ఆరాధించాడని ప్రసిద్ధి. ఈ పూజను బిల్వమూలములో చేయాలనే విశేష నియమాన్నివిధించారు.



🙏🌹బిల్వ పత్రై: యదేత్‌ దేవీం

తదాజాతి ప్రసూన కై

నానా బిష్టక నైవేద్యై:

ధూప దీపై: మనో కరైతి🌹🙏



🌸 అని లక్ష్మీ అమ్మవారిని బిల్వపత్రములతో, జాజిపూలతో, బహు విధములైన పిండి వంటలతో ధూప, దీప, సుగంధ ద్రవ్యములతో ఆరాధించవలెనని నియమం.


🌿 ధనత్రయోదశి అనగా ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ప్రకృతి, మహాతత్త్వము, అహంకారము అను పదమూడు లీలావిభూతికి ధనముగా అభివర్ణిస్తారు. ప్రత్యేకించి ఈనాడు ప్రకృతి వనురులతో లక్ష్మీనారాయణులను ఆరాధించి మూడు దినములు జాగారముతో లక్ష్మీస్తవం చేస్తూ శ్రీసూక్తం, లీలాసూక్తం పారాయణాలతో లక్ష్మీదేవిని ఆరాధించాలి. 


🌸 ధనత్రయోదశి నాడు బంగారం కొని దాచుకోవడం పరిపాటి కాని దీనికి ఎటువంటి శాస్త్రప్రమాణం లేదు. ధనత్రయోదశినాడు పండితులకు, బ్రాహ్మణులకు వస్త్రదానం, సువర్ణదానం, ఆభరణదానం చేయడం వలన విశేష ఫలితం లభిస్తుంది.


🌿 ”సర్వ దైవత్యం వైవాస:” అనగా దేవతలు వస్త్రమునందు అధివసించి ఉందురని అర్థం. అలాగే సువర్ణము లక్ష్మీదేవి ప్రతిరూపం, ఆభరణములు నారాయణుని ప్రతిరూపం కావున వస్త్రము, సువర్ణము, సువర్ణాభరణములు విరివిగా దానం చేసి లక్ష్మీనారాయణుల అనుగ్రహం పొందాలి.


🌸 కాగా ఈ మధ్యకాలంలో ధనత్రయోదశి రోజున బంగారం కొనాలనే ప్రచారం మొదలైంది. కానీ అటువంటి నియమం ఏమీ లేదు. ప్రపంచీకరణ నేపధ్యంలో దేశంలోకి బహుళజాతి సంస్థలు వ్యాపారం కోసం వచ్చాయి, 


🌿 లాభలు ఆర్జించడమే ధ్యేయంగా ఉన్న సంస్థలు వ్యాపారం చేసుకోవడం కోసం అక్షయతృతీయ, ధనత్రయోదశి రోజున బంగారం కొనాలనే ప్రచారాన్ని మొదలుపెట్టాయి. అసలు ఇటువంటి ఆచారం మన బామ్మలకు, అమ్మమ్మలకే తెలియదట. 


🌸 వాళ్ళకే ఇది వింతగా ఉందంటే అసలు విషయం ఏంటో అర్దం చేసుకోవచ్చు.

భారతదేశంలో పండుగ రోజంటూ ఏదైనా ఉందంటే అది దానం చేసిన రోజే. సంపదలు దాచుకోవడం కాకుండా, ఉన్న సంపదను పుణ్యంగా మార్చుకుని, వచ్చే జన్మలకు ఉపయోగించుకోవడం భారతీయుల విధానం. 


🌿ధనత్రయోదశి రోజున చేసే దానం, పూజ, జపం అధికఫలాన్ని ఇస్తాయి. మునుపు బంగారాన్ని ఎప్పుడు ప్రత్యేకించి ధనత్రయోదశి నాడు కొనగోలు చేయలేదు. వచ్చిన అతిధులకు బంగారం ( బెల్లం బంగారం స్వరూపం ) దానం చేసిన సంస్కృతి మనది...స్వస్తీ....🚩🌞🙏🌹🎻


🙏సర్వం శ్రీపరమేశ్వరార్పణమస్తు.🙏


*వాసు ముక్తినూతలపాటి* 🙏 


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

శ్రీ కాళహస్తీశ్వర శతకము

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔


  🙏  *శ్రీ కాళహస్తీశ్వర శతకము* 🙏


  *అకలంకస్థితినిల్పి నాద మనుఘంటారావమున్ బిందు దీ*

  *పకళాశ్రేణి వివేక సాధనము లొప్పంబూని యానంద దా*

  *రక దుర్గాటవిలో మనోమృగము గర్వస్ఫూర్తి వారించు వా*

  *రికిఁగా వీడుభవోగ్ర బంధలతికల్ శ్రీకాళహస్తీశ్వరా!!*


            *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 64*


*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! మనస్సును నాదము అను ఘంటారావముతో జతచేర్చి సదా శ్రీచక్రసంచారిణియగు లలితాపరాభట్టారికయందు నిలిపి మనస్సను మృగమును ఆమె సాన్నిధ్యములో త్రిప్పువాడికి గర్వాది దుర్వాసనలు నశించి భవబంధ విమోచనము కలుగును ప్రభో*....


✍️🌷🌺🌹🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - శరదృతువు - ఆశ్వయుజ మాసం - కృష్ణ పక్షం  -  అష్టమి - పునర్వసు / పుష్యమి -‌‌ గురు వాసరే* (24.10.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

పంచాంగం 24.10.2024 Thursday,

 ఈ రోజు పంచాంగం 24.10.2024 Thursday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస కృష్ణ పక్ష అష్టమి తిథి బృహస్పతి వాసర: పునర్వసు నక్షత్రం సాధ్య యోగః: బాలవ తదుపరి కౌలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


 అష్టమి రాత్రి 02:00 వరకు.

 పునర్వసు ఉదయం 06:15 వరకు.


సూర్యోదయం : 06:15

సూర్యాస్తమయం : 05:45


వర్జ్యం : మధ్యాహ్నం 02:44 నుండి 04:25 వరకు.


దుర్ముహూర్తం : పగలు 10:05 నుండి 10:51 వరకు తిరిగి మధ్యాహ్నం 02:41 నుండి 03:27 వరకు.


అమృతఘడియలు : రాత్రి 12:54 నుండి 02:35 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.


యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.

.


శుభోదయ:, నమస్కార:

ఈ శరీరం ఈయబడింది

 ఆత్మీయమిత్రులారా ! 


* తనను తాను తెలుసుకోవడానికి మాత్రమే మానవునికి ఈ శరీరం ఈయబడింది .

                                    - స్వామి వివేకానంద 

* దేవుణ్ణి అన్వేషించేవాడు అందరికంటే వివేకవంతుడు దేవుణ్ణి కనుక్కున్నవాడు అందరికంటే సాఫల్యవంతుడు - పరమహంస యోగానంద.


* నిజం అనేది ప్రాపంచికమైనది " సత్యం " అనగా భగవంతుడు మాత్రమే మరోమాట లేదు .

                                           - సద్గురువులు 


* మానవజన్మ అసలు గమ్యం అసలు లక్ష్యం పరిపూర్ణుడుగావడమే మరొకటి లేదు గాక లేదు .

                                         - బ్రహ్మర్షి పత్రీజీ 


          * అక్రోధ, వైరాగ్య, జితేంద్రియత్వం 

             దయ, క్షమ , సర్వజనప్రియత్వం 

             నిర్లోభ, దాన, భయ , శోకవర్జితం 

             జ్ఞానస్య చిహ్నం దశ లక్షణాని .


* అక్రోధ - క్రోధం లేకుండుట . వైరాగ్య - వైరాగ్య భావాలు కలిగి ఉండుట . జితేంద్రియత్వం - ఇంద్రియనిగ్రహం కలిగి ఉండుట . దయ - దయాభావం ఎల్లవేళలా కలిగియుండుట . క్షమ - క్షమించేగుణం కలిగి ఉండుట . సర్వజనప్రియత్వం - సర్వ జీవులపట్ల , సర్వజనులపట్ల అహింసభావం కలిగి ప్రియంగా సంచరించుట . నిర్లోభ - లోభితనం లేకుండా ఉండుట . దాన - తన దగ్గర ఏమి ఉంటే అది ఇతరులకు ఇవ్వగలిగే స్వభావం కలిగియుండుట . భయ - భయం అనేది ఇసుమంతైనా లేకుండా ధీరుడిగా ఉండుట . శోకవర్జితం - ఏడుపు అనగా దుఃఖం అనేది లేకుండా ప్రాపంచికంలో కూరుకుపోకుండా ఉండగలగడం .


* ఈ పది లక్షణాలు కలిగియున్నవాడే ఒకానొక జ్ఞానిగా పిలువబడతాడు మిగిలినవారంతా అజ్ఞానులుగా పరిగణింపబడతారు అని సద్గురువులు చెబుతుంటారు .  


* ఆథ్యాత్మికంలో తొందర పనిచేయదు . ఇప్పుడే నేను అలా అయిపోతాను అంటే అవ్వొచ్చు కానీ .... దానికి ఎన్నోజన్మలు ఎత్తి ఎన్నో అనుభవాలు పొంది ఎన్నో గుణపాఠాలు నేర్చుకుని ఇక నేర్చుకొనుటకు నేర్పుటకు ఏమీలేదు అను స్థితికి మానవుడు చేరుకోవాలి. ఎప్పటికైనా అందరూ ఆ స్థితికి చేరుకోవాల్సిందేనాయనా అన్నారు కొందరు ..🙏



🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺