7, నవంబర్ 2026, శనివారం

Brahmin Marriage Matrimonial Platform

  ఇక్కడ కామెంట్ల రూపంలో మీరు మీ ప్రొఫైల్ ను పెట్టండి అట్లా అందరివి కలిపి ఒక pdf ఫైల్ గా తయారుచేసి అది పెట్టిన వాళ్లకు మాత్రమే  కనపడేటట్లు ఏర్పాటు చేయదలచుకున్నాను


# Brahmin Marriage Matrimonial Platform


Bride/Groom Details


⚛️⚛️⚛️⚛️⚛️⚛️


- Branch (Shakha):

- Full Name (including surname):

- Gotra:

- Date of Birth:

- Time of Birth:

- Place of Birth:

- Birth Star (Nakshatra) and Pada:

- Moon Sign (Janma Rashi):

- Height:

- Complexion:

- Educational Qualifications:

- Occupation/Business:

- Since when employed (Year of Joining):

- Annual Income:


### Family Members' Details


- Father's Name:

- Father's Occupation:

- Mother's Name:

- Mother's Occupation:

- Brothers:

- Married/Unmarried:

- Sisters:

- Married/Unmarried:

- Preference for Shakha: Yes / No

- Expected Qualifications/Requirements for the Bride:

- Full Residential Address:

- Email ID:

- WhatsApp Numbers (2):


### Details of the Person Submitting the Form


- Name:

- Phone Number:

సూర్యుడు జ్ఞాన జ్యోతి

  🙏🌹సూర్యుడు జ్ఞాన జ్యోతి 🌹🙏


కఠిన చీకటుల తొలగించి వెలుగులు నింపేటి సద్గుణ బావా 

మా అజ్ఞాన చీకటుల తొలగించ అభాగ్యుల రక్షింప రావా


పరోపకారం చేసేటి ఏకైక లక్ష్యంగా సాగేటి సద్గుణ బావా

మా లోక పరోపకారము చేసే బుద్ధి కలిగేలా చేయరావా


ప్రకృతి సంపదల మాకు ఇవ్వ పరిపుష్టి నింపేటి సద్గుణ బావా 

ఆ ప్రకృతిని కాపాడుకునే వైపు మమ్ము మరలించుటకు రావా


ప్రాతః కాలము ప్రత్యక్ష దర్శనమున నాకై కనిపించే సద్గుణ బావా 

కృతజ్ఞతలుగా అర్ఘ్యం అర్పించి శక్తి పొందేలా చేయ రావా


ఓం శ్రీ చీకట్లను పారద్రలి వెలుగుల నింపినట్లే మా అజ్ఞానాన్ని పారద్రోలి మాలో జ్ఞాన జ్యోతిని వెలిగించు దేవాది దేవా 

శ్రీ ఖగాయ తేజో పూష్ణా నమో నమః నమో నమః 


🙏🌹బాలచందర్ రాజుఉమా 

       06/11/26 +2169+

చెట్టు విలువ

  🌷🦚🌷🦚🌷🦚

 *🌹HAPPY MORNING🌹*

     *🌷🌹 జై శ్రీరాం🌹🌷*


*చెట్టు విలువ ఎండా కాలంలో*

*గురువు విలువ కష్టంలో*

*దైవం విలువ ఆపదలో* 

*స్నేహితుడి విలువ బాధలో*

*బాంధవ్యల విలువ అవి దూరం చేసుకున్నప్పుడు*

*ఖచ్చితంగా తెలుస్తుంది*

*అందుకే ఉన్నప్పుడే దేన్నైనా కాపాడు కోవాలి* 



*శ్రీరామా నేను నీ వాడనురా* 


   *శ్రీ రామా అంతా నీవే కలవు*


    *🌷 ఆత్మీయ మిత్రులందరికీ శుభ శుభోదయం🌷*

🌷🌹🦚🌹🌷🦚🌹🌷🦚

అతడిని తలచుకుంటే

  అతడిని తలచుకుంటే మనసు ప్రశాంతమవుతుంది!


ఎన్ని ఆలోచనలు వచ్చినా, అతడి దివ్యనామాన్ని ఒక్కసారి చెప్పి చూడండి…


నారాయణా! అని నోటితో ఉచ్చరించినప్పుడు, మనసు తనంతట తానే ప్రశాంతతను పొందుతుంది.


అతడి తలపే నిజమైన ధ్యానం, అతడి కృపే మన జీవితానికి ఆధారం!


శ్రీమన్ నారాయణుడి తిరువడిగళే శరణం.

🔵🟢🟡🔴🙏🔴🟡🟢🔵


*గరుడ గమన తవ,*  

*చరణకమల మిహ,*  

*మనసి లసతు మమ నిత్యం |*  

*మమ తాపమపాకురు దేవ,*  

*మమ పాపమపాకురు దేవ ||*


_ఓ దేవా, గరుడ వాహనుడా! నీ పాదపద్మములు నా మనస్సులో నిత్యము ప్రకాశించుగాక. నా బాధను పోగొట్టుము, నా పాపమును పోగొట్టుము._


*జలజ నయన విధి, నముచి హరణ ముఖ,*  

*విభూత వినుత పద పద్మ |*  

*మమ తాపమపాకురు దేవ,*  

*మ పాపమపాకురు దేవ ||*


_పద్మముల వంటి కన్నులు గలవాడా, నముచి అనే రాక్షసుని సంహరించినవాడా, దేవతలచే స్తుతించబడిన పాదములు గలవాడా! నా బాధను, పాపమును పోగొట్టుము._


*భుజగ శయన భవ, మదన జనక మమ,*  

*జన మరణ భయ హారి |*  

*మమ తాపమపాకురు దేవ,*  

*మమ పాపమపాకురు దేవ ||*


_ఆదిశేషునిపై శయనించువాడా, మన్మథునికి తండ్రివైనవాడా, జనన మరణ భయమును పోగొట్టువాడా! నా బాధను, పాపమును పోగొట్టుము._


*శంఖ చక్ర ధర, దుష్ట దైత్య హర,*  

*సర్వ లోక శరణ |*  

*మమ తాపమపాకురు దేవ,*  

*మమ పాపమపాకురు దేవ ||*


_శంఖ చక్రములు ధరించినవాడా, దుష్ట రాక్షసులను సంహరించువాడా, సర్వలోకములకు ఆశ్రయమైనవాడా! నా బాధను, పాపమును పోగొట్టుము._


*అగణిత గుణ గణ, అశరణ శరణద,*  

*విదళిత సురరిపు జాల |*  

*మ తాపమపాకురు దేవ,*  

*మమ పాపమపాకురు దేవ ||*


_అనంతమైన గుణములు గలవాడా, దిక్కు లేనివారికి దిక్కైనవాడా, దేవతల శత్రువులను నాశనము చేసినవాడా! నా బాధను, పాపమును పోగొట్టుము._


*భక్త వర్య మిహ, పూరి కరుణయా,*  

*పాహి భారతి తీర్థం |*  

*మమ తాపమపాకురు దేవ,*  

*మమ పాపమపాకురు దేవ ||*


_ఓ ఉత్తమ భక్తులకు ప్రియుడా! సంపూర్ణ కరుణతో భారతి తీర్థ స్వామిని కాపాడుము. నా బాధను, పాపమును పోగొట్టుము._


---


*తమిళ పద్యాల తెలుగు అనువాదం*


*గరుడము వాహనముగా వచ్చి*  

*లోకమంతటినీ కాపాడి నిలిచినవాడా*  

*లక్ష్మీదేవి సంతోషించే నాథుడా*  

*మా మనస్సులో నివసించే పరంధామా*


*మా కోరికలను తీర్చే దేవా*  

*ప్రజలందరినీ కాపాడటానికి రావా రావా*


*అర్జునుని ఆందోళనను చూసిన క్షణమే*  

*అతనికి గీతను బోధించిన కృష్ణా*  

*యోగ జీవితానికి నీవే రాజువు*


*పద్మముల వంటి కన్నులు, పగడపు పెదవులు గల*  

*పిల్లనగ్రోవి పట్టిన మనసు దోచే కృష్ణా*  

*భక్తుల కష్టాలను తీర్చే బాలకృష్ణా*


*అభయ హస్తమిచ్చి*  

*చింతను పోగొట్టి*  

*మరణ భయమును తొలగించే పుణ్యమూర్తీ*  

*మోక్షమును ఇచ్చే పరబ్రహ్మా*


*స్తంభములో నుండి కూడా,*  

*ఒక గడ్డిపోచలో కూడా వ్యాపించి*  

*జగత్తును ఏలే దేవా*  

*నీవు పంచభూతములకు అధిపతివి*


*శంఖమును ఊది, చక్రమును తిప్పి*  

*దుష్టత్వమును నాశనము చేయువాడా*  

*మరల జన్మ లేని వరమును ఇవ్వుము*


*మనస్సులోని అహంకారము తొలగి,*  

*గర్వము నశించుటకు రాసలీలలు ఆడి*  

*గోపికల మనసును దోచుకున్నావు*


*బాధ కరిగిపోవునట్లు,*  

*మోహము మాయమగునట్లు,*  

*కోపమును నశింపజేయు శ్యామా*  

*మంచి గుణములను ప్రసాదించు తీరని కృష్ణ"*


🔴🟡🟢🔵🙏🔵🟢🟡🔴

చరించువాడు

  *చరన్నై మధు విందతి చరన్ స్వాదుముదుంబరం*


🔵🟢🟡🔴🙏🔴🟡🟢🔵


చరించువాడు మధువును పొందుతున్నాడు - తీయని ఫలాలను

అనుభవిస్తున్నాడు(యజుర్వేదం)


'చవేతి చరైతి' అని వేదమాత బోధిస్తోంది.

-

హరిశ్చంద్రుని పుత్రుడైన రోహితునకు ఇన్ద్రుడు గోచరించి “చరైవేతి” అనే పదంతో పూర్తయ్యే ఐదు మంత్రాలను బోధించాడు.


'చరించు' - అని దీని భావం. 'ఆచరించు' అని కూడా అర్థాన్ని స్వీకరించాలి.'చరించుట' - అంటే ‘నడచుట' అని అర్థం.


'నిద్రించకు-నడువు' అని బోధ.


వ్యక్తి నిరంతరం ఆచరించాలి. ఆచరణ-అంటే కర్మానుష్ఠానం. ఈ జీవితం కర్మాచరణకు లభించింది. సత్కర్మను ఆచరించి, బ్రతుకును సార్థకం చేసుకోవాలి.

ఆచరించడమే మన పని.


ఆచరిస్తూ సాగాలి జీవితం.


సోమరితనం, అకర్మణ్యత-మనిషికి కూడదు. 'విశ్రాంతి' మన జీవిత విధానం కాకూడదు. శ్రమించడానికి తగిన బలాన్ని పుంజుకునేందుకు, సేదతీరడానికి మాత్రమే 'విశ్రాంతి'. అంతేకానీ 'విశ్రాంతి' కోసమే జీవితం కాదు. శరీరాన్ని విశ్రమింపజేయాలనుకున్నా మనస్సు విశ్రమించదు. ఏ శ్రమా లేనివారి జీవితంలో మనసు వికృత భావాలను పెంపొందించుకుని, మానసిక రుగ్మతలకు లోనవుతుంది.

అందుకే భౌతిక, శారీరక శ్రమ అవసరం. శ్రమించడానికే ఈ దేహం ఏర్పడింది.


సూర్యస్య పశ్య స్థేమానం

యోన తన్హయతే అనిశం ||


'సూర్యుని నిత్య కర్మణ్యతని చూడమని ఆదేశించాడు ఇన్ద్రుడు. విశ్రమించకుండా నిరంతరం (ఆ)చరిస్తున్న సూర్యచక్రుల నుండి మనం నిత్యకర్మణ్యతని గ్రహించాలి.

'నిద్రపోవద్దు' - అజాగ్రత్త, అలసత్వం పనికిరాదు.


స్వస్తిపంథామను చరేమ సూర్యాచన్ద్ర మసావివ (ఋగ్వేదం) - సూర్యచంద్రుల వలె శుభమార్గాన్ని అనుసరిద్దాం అని బోధిస్తోంది వేదం.


విధ్యుక్తమైన విహిత ధర్మాన్ని అనుసరించి నిరంతరం ఉత్తమ కార్యాలను ఆచరిస్తూనే ఉండాలి. ‘సోమరి కన్నా దొంగ మేలు' అని స్వామి వివేకానంద ఘోషించారు. దీని

అర్థం దొంగతనాన్ని ప్రోత్సహించడం కాదు, దానికంటే సోమరితనం మహాపాపం అని చెప్పడం ఆ మహాత్ముని ఉద్దేశం.


ఒక పడవ నదిలో ప్రయాణించడానికే తయారు చేయబడింది. అంతేగానీ, ఒడ్డున కూర్చోబెట్టడానికి కాదు. అలాగే ఈ శరీరం కర్మకై ప్రభవించింది. అంతేగానీ పనికిమాలిన వాక్యాలు వల్లిస్తూ సోమరిగా బ్రతకడానికి కాదు.


ఒక యంత్రాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే క్రమంగా పాడవుతుంది. అలాగే ఈ

శరీరంలో మనస్సును, దేహాన్ని కూడా వాటిపని వాటిని చేయనివ్వాలి.


అలాగని నిరంతరం భుక్తి కోసం వృత్తిని 'మాత్రమే' చేయమని కాదు. ఉద్యోగ వ్యాపారాదులే కాక, ఆధ్యాత్మిక సాధన, నిరంతరం చైతన్యవంతమైన జీవితం,

సానుకూలమైన(Positive) దృక్పథంతో కూడిన చక్కని ఆలోచనలు శక్తిమంతమైన జీవిత విధానాలు.


సంఘంలో ఒక ఉత్పాదక (Productive) క్రియను ప్రతి వ్యక్తీ ఆచరించాలి. తన ఉనికిని సార్థకపరచుకోవాలి. లాభాపేక్షతో చేసినవి మాత్రమే పనులు-అని చెప్పలేం. మన లాభమే కాక పదిమందికీ పనికి వచ్చే కర్మలే సార్థకాలు. వాటిని ఆచరిస్తూ

సాగడమే అసలైన జీవితం.



అంతేకానీ విశ్రాంతిని లక్ష్యంగా చేసుకొని జీవిత ప్రయాణాన్ని సాగించడం తగని పని.


“తగినంత సంపాదించాం, ఇంక విశ్రాంతి తీసుకుందాం” అనే దృక్పథం మంచిది కాదు. “ఇంతవరకు సంపాదన కోసం శ్రమించాం. ఇప్పుడు సంపాదన కంటే విలువైన ధర్మాదుల కోసం శ్రమిద్దాం" అనుకొని జీవితాన్ని నిత్య చైతన్యంగా మలచుకోవాలి.


ఆచరించే వారికే ఆనందం(మధువు), ధర్మం, జ్ఞానం లభిస్తాయి. 'ఆచార ప్రభవో ధర్మః' అనే మాటకి ఇదే అర్థం. సిద్ధి, ఫలం కర్మశీలునకే ప్రాప్తిస్తాయి.



🔴🔵🟡🟢🙏🟢🟡🔵🔴


*నాహం కర్త*🙏*హరి కర్తా*


*కర్తను నేను కాదు,చేసేది చేయించేది అంతా శ్రీహరి*


🔴🟣🔵🟢🙏🟢🔵🟣🔴



*సమస్త దేవతల శుభాశీస్సులతో...*

*శుభమస్తు! నిత్య శుభమస్తు! సమస్త సన్మంగళాని భవన్తు! శ్రీరస్తు! విజయోస్తు! దిగ్విజయోస్తు! అవిఘ్నమస్తు! ఆయురారోగ్య అష్టైశ్వర్య వృద్ధిరస్తు! పితృదేవతానుగ్రహ ప్రాప్తిరస్తు! ఇష్టదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు!  సకల మనోభీష్ట సిద్ధిరస్తు!*


*సర్వేజనాః సుఖినోభవంతు!*


*సర్వ సజ్జనా స్వజనో భవంతు!*

*సర్వ స్వజ్జనా సుకృతో భవంతు!*

*సర్వ సుకృతజనః సుఖినోభవంతు!!*


*ఓం సర్వేషాం స్వస్తిర్భవతు!*

*అందరికీ శుభమే జరుగుగాక!*


*సర్వేషాం శాన్తిర్భవతు!*

*అందరూ సుఖసంతోషాలతో ఉండుగాక!*


*సర్వేషాం పూర్ణంభవతు!*

*అందరి జీవితాలూ సమృద్ధిగా ఉండుగాక!*


*సర్వేషాం మంగళం భవతు!*

*అందరి జీవితాలూ మంగళకరంగా ఉండుగాక!*

🙏🌹☘️🌹☘️🌹🙏


*వేదఆశీర్వచనము 👇*                                 

కష్టం" విలువ

  *🔔 _శుభోదయం_ 🔔*


      *_కాలే కడుపుకు "కష్టం" విలువ, ఒంటరితనంలో "బంధాల" విలువ, అవకాశం చేజారినప్పుడే "సమయం" విలువ_*

      *_చేతిలో చిల్లిగవ్వ లేనప్పుడే "మనిషి" విలువ తెలుస్తాయి._*


🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞

పెద్దవాళ్లు* వెళ్లిపోతే

 *మన పెద్దవాళ్లు* వెళ్లిపోతే… ఒక మనిషి మాత్రమే కాదు, ఒక జీవన విధానం, ఒక పాత ప్రపంచం వెళ్లిపోతుంది…*💔


ఒక్కసారి ఆలోచించండి…


ఇంకో 10–15 ఏళ్ల తర్వాత మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉంటుందో…


1. మన తాతయ్యలు…

2. మన బామ్మలు…

3. మన అమ్మా నాన్నలు…

4. మన బాబాయిలు, పిన్నిలు…


ఒక్కొక్కరుగా మనల్ని విడిచి వెళ్లి పోతున్నారు, వెళ్లి పోతారు, మనం కూడా. పోయిన ఏడాది ఉన్న కొందరు పెద్దవారు, తెలిసిన వారు, పరిచయస్థులు ఆత్మీయులు, 

కొందరు ఇరుగు పొరుగు, మన వీధిలోని లేదా ప్రక్క వీధిలోని వారే, ఇప్పుడు లేరు, లేరుగా 


అప్పుడు మనం కేవలం కొంతమంది మనుషులను కోల్పోము.


1. ఒక జీవన విధానాన్ని కోల్పోతాం.

2. ఒక సంస్కృతిని కోల్పోతాం.

3. ఒక తరం జ్ఞాపకాలను కోల్పోతాం.


🌅 వాళ్ల ఉదయాలు వేరు…


1. సూర్యుడు ఉదయించకముందే నిద్రలేచేవారు.


2. ఇంటి ముందు ముగ్గు వేసేవారు.

3. మొక్కలకు నీళ్లు పోసేవారు.

4. తోటలో పూలు కోసేవారు.

4. ఆ పూలను దేవుడి దగ్గర పెట్టేవారు.


5. ఏ పని చేయాలన్నా దేవుడి పేరు చెప్పుకుని రోజు మొదలుపెట్టేవారు.


మనకు ఇవన్నీ ఇప్పుడు చిన్న విషయాల్లా అనిపించవచ్చు…


కానీ అదే వాళ్ల జీవితం.


🙏 దేవుడిని నమ్మేవారు.


1. దేవాలయానికి వెళ్లేవారు.

2. ఏకాదశి ఎప్పుడు?

4. అమావాస్య ఎప్పుడు?

5. పౌర్ణమి ఎప్పుడు?అన్నది తెలుసుకోవడానికివారికి మొబైల్‌లో రిమైండర్ అవసరం లేదు. వారి మనసులోనే ఒక పంచాంగం ఉండేది.


🤝 వాళ్ల పలకరింపులు కూడా నిజమైనవే…


1. దారిలో ఎవరో కనిపిస్తే ఆగి, “ఎలా ఉన్నావు? అంతా బాగుందా?” అని అడిగేవారు.


2. అది మర్యాద కోసం కాదు.మనస్ఫూర్తిగా అడిగేవారు.

3. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారని తెలిస్తే వారి ఇంటికి వెళ్లి పరామర్శించేవారు.

4. ఎవరి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే తమ ఇంటి వేడుకలా భావించేవారు.

5. ఎవరికైనా కష్టం వస్తే

“నీకేం కావాలి?” అని అడిగేవారు.


1. ఈ రోజుల్లో మనకు వందల మంది Facebook friends ఉండొచ్చు…కానీ ఇలాంటి మనుషులు ఎంతమంది ఉన్నారు?

3. 📖 వార్తాపత్రికను ఉదయం చదివేవారు.

4. మళ్లీ మధ్యాహ్నం తీసుకుని చదివేవారు.

5. సాయంత్రం కూడా ఒకసారి తిరగేసేవారు.


అది కేవలం వార్తల కోసం కాదు…


ప్రపంచంతో తమకున్న అనుబంధం కోసం.


📒 ఫోన్ నంబర్లు?


1. చిన్న డైరీలో రాసుకునేవారు. ఆ డైరీ ఎక్కడుందో కూడా వాళ్లకు తెలుసు.


2. మనకు వందల కాంటాక్ట్స్ ఉన్నా మన పక్కింటి మనిషి నంబర్ తెలియకపోవచ్చు.


3. వాళ్లకు మాత్రం

        ఊరిలోని చాలా  మంది నంబర్లు గుర్తుండేవి.


🏡 వాళ్ల జీవితంలో ఆడంబరం లేదు…


1. పాత చెప్పులు.

సాధారణ బట్టలు.

మందపాటి కళ్లద్దాలు.


అయినా…


ఎవరినీ మెప్పించాలనే అవసరం వాళ్లకు ఉండేది కాదు.


ఉన్నదానితో సంతోషంగా ఉండేవారు.


సంతృప్తి అంటే ఏమిటో వాళ్లను చూస్తే అర్థమయ్యేది.


🌱 వేసవి వచ్చిందంటే…


1. ఇంట్లో ఊరగాయలు.

2. వడియాలు.

3. అప్పడాలు.

4. . ఇంట్లోనే మసాలాలు.

5. . నాటు టమాటాలు. దేశీ వంకాయలు. తాజా ఆకుకూరలు. ఆహారంలో కేవలం రుచి కాదు…


ఒక తరం జ్ఞాపకం ఉండేది.


❤️ పండుగ అంటే కొత్త బట్టలు మాత్రమే కాదు…


అందరూ ఒకచోట చేరడం.


1. ఇంట్లో నవ్వులు.

2. పిల్లల అల్లరి.

3. అతిథుల రాక.

4. పక్కింటివారికి పిలుపు.

5. అందరూ కలిసి భోజనం చేయడం.

6. అదే పండుగ.

8. అదే ఆనందం.

9. అదే జీవితం.


కానీ…


ఆ ప్రపంచం నెమ్మదిగా మన కళ్ల ముందే కనుమరుగవుతోంది. 💔


ఒక్కొక్కరుగా…


వాళ్లు వెళ్లిపోతున్నారు.


వాళ్లు వెళ్లిపోయినప్పుడు

కేవలం ఒక కుర్చీ ఖాళీ కాదు…


1. ఒక ఇల్లు ఖాళీ అవుతుంది.

2. వాళ్ల గది ఖాళీ అవుతుంది.

3. వాళ్ల గొంతు వినిపించదు.

4. వాళ్ల పిలుపు వినిపించదు.

5. వాళ్ల చేతి వంట రుచి ఉండదు.

6. వాళ్లు చెప్పే పాత కథలు ఉండవు.

7. అప్పుడు మనకు అర్థమవుతుంది…

8. వాళ్లు మన జీవితంలో ఎంత పెద్ద భాగమో.

9. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత వారి ఫొటో ముందు నిలబడి ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా…వారితో మాట్లాడలేం.


అందుకే…

1. ఇప్పుడే మాట్లాడండి.

2. ఇప్పుడే కలవండి.

3. ఇప్పుడే వాళ్ల పక్కన కూర్చోండి.

4. వాళ్ల చిన్ననాటి కథలు అడగండి.

5. మీ చిన్నప్పుడు ఎలా ఉండేది? అని అడగండి.

6. వాళ్లు చెప్పే అదే కథను పదోసారి చెప్పినా వినండి.

ఎందుకంటే…

7. వాళ్లకు అది పాత కథ కావచ్చు. కానీ రేపు అది మనకు దొరకని జ్ఞాపకం కావచ్చు.

8. వారితో కలిసి భోజనం చేయండి.

9. వారి చేతిని పట్టుకోండి.

10. కాసేపు వారి పక్కన మౌనంగా కూర్చున్నా సరే…

11. మీ సమయాన్ని ఇవ్వండి.

12. ఎందుకంటే మనం వారికి ఇచ్చే ఖరీదైన బహుమతుల కంటే…


13. మన సమయమే వారికి ఎక్కువ విలువైనది.


ఒకరోజు…

14. వాళ్లు కూర్చునే కుర్చీ ఖాళీగా ఉంటుంది.

15. ఆ గదిలోకి వెళ్లినప్పుడు వారి వాసన గుర్తుకు రావచ్చు.

16. వారి గొంతు వినిపించినట్టుగా అనిపించవచ్చు.

17. అప్పుడు మనసులో ఒక్క మాట రావచ్చు…

18. “ఇంకొంచెం సమయం వాళ్లతో గడిపి ఉంటే బాగుండేది…” 


ఆ బాధ రాకముందే…


19. వారితో సమయం గడపండి.


ఎందుకంటే…


20. మన పెద్దలు కేవలం మన కుటుంబ సభ్యులు కాదు.


1. వాళ్లు మన వేర్లు.

2. వాళ్లు మన చరిత్ర.

3. వాళ్లు మన సంస్కృతి.

4. వాళ్లే మన గతానికి, మన వర్తమానానికి మధ్య ఉన్న వంతెన.

5. వేర్లను మర్చిపోయిన చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా…

6. ఎప్పటికో ఒకరోజు ఒంటరిగా మారుతుంది.


అందుకే…


వారిని ప్రేమించండి.

. వారిని గౌరవించండి.

వారిని పలకరించండి.

. వారిని దగ్గరగా ఉంచుకోండి.

వారికి మీ సమయాన్ని ఇవ్వండి.


రేపు సమయం ఉండకపోవచ్చు.


కానీ ఈరోజు… ఇంకా మన చేతుల్లోనే ఉంది. 


మన పెద్దలను వారు మనతో ఉన్నప్పుడే ప్రేమిద్దాం. ఐరుగు పొరుగు వారిని కూడా ప్రేమిద్దాం, కల్సు కొందాం, మాటలాడు కొందాం, అరమారికలు, ఎటువంటి భేద భావాలు లేకుండా. 


LET US ACT AS BRIDGES, CONNECTING PEOPLE, NOT AS WALLS, DEVIDING PEOPLE.


PEOPLE MAY FORGET WHAT YOU GAVE, PEOPLE MAY FORGET WHAT YOU TOLD OR SPOKE BUT PEOPLE WILL NEVER FORGET BUT ALWAYS REMEMBER, HOW YOU MADE THEM FEEL AND HOW YOU TREATED THEM . 👌😊.


వాళ్లు వెళ్లిపోయిన తర్వాత వారి విలువ తెలుసుకోవడం కంటే… వాళ్లు మనతో ఉన్నప్పుడే వారి విలువను తెలుసుకోవడం మంచిది.


*వాళ్లు మన మూలాలు*.

*వాళ్లు మన జ్ఞాపకాలు.*

*వాళ్లు మన ఇల్లు*.

వాళ్లు… *మన వాళ్లు*


ఈ వ్యాసం వ్రాసి పంపిన వారికి వేలాది వందనాలు. 🙏🙏🙏

👍🌹🌹🌹