26, మార్చి 2022, శనివారం

అన్నదాన మహిమ*

 *అన్నదాన మహిమ*

  

పూర్వం ఓ బ్రాహ్మణుడుండేవాడు. వేళగాని వేళ తనయింటికి ఎవరు వచ్చినా వాళ్లను తను ఎరగకపోయినాసరే, ఆదరించి భోజనం పెట్టేవాడు. ఒక వేళ ఇంటికెవరూ రాకపోతే, వీధి వెంట పోయే వాళ్ళని పిలిచి అన్నం పెట్టేవాడు. ఇలాగ చాలాకాలం జరిగేక, ఒకనాడాయనకు అన్నదానంవల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. ఎవళ్ళను అడిగినా చెప్పలేకపోయారు.


ఒకాయన ఏమన్నాడంటే, " అన్నదాన మహిమ చాలా గొప్పది. దానిని వర్ణించాలంటే, కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. మీకు తెలుసుకోవాలని ఉంటే, స్వయంగా ఆ అన్నపూర్ణాదేవినే , అడిగి తెలుసుకోండి” అని సలహా ఇచ్చాడు.


అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య ఐన పార్వతీదేవి అన్నమాట.


ఆవిడకు కూడా అన్నదానమంటే ఎంతో ఆసక్తి. అందుకనే కాశీలో ఎవరికీ అన్నం లేకుండా పోదు. మన బ్రాహ్మడు కాశీ వెళ్లి గంగ ఒడ్డున కూచుని పార్వతీ దేవిని గురించి గాఢంగా తపస్సు చేయసాగాడు.


దేవి అతని తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమై 'నీకేం కావాలి?' అని అడిగింది. బ్రాహ్మడు సాష్టాంగనమస్కారం చేసి, " అన్నపూర్ణాదేవీ, నాకేమీ కోరిక లేదు. కాని, అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని నేను మిమ్మల్ని గురించి తపస్సు చేశాను. ఈసంగతి మీరే చెప్పాలి గాని ఇతరులవల్ల కాదు " అని తన మనసులో వుద్దేశం వెల్లడించాడు.


అప్పుడు దేవి అతనితో “నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పటం కాదు , అది నీవు తెలుసుకునే ఉపాయం మాత్రం చెబు తాను, విను:


హిమవత్పర్వతం దగ్గర హేమవతమని ఒక పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకి పిల్లలు లేరు. నువ్వాయనదగ్గరకు వెళ్లి ఆయనకి కొడుకు పుట్టాలని దీవించు. ఆ రాజు సంతోషిoచి, ' బాబూ మీకేం కావాలని అడుగుతాడు. అప్పుడు నీవు, 'నాకు పెద్ద కోరిక ఏమీ లేదు. నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాణ్ని నేను చూడాలి. ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణీ కూడా ఉండకూడదు ' అని ' చెప్పు. 'ఇంతేగదా ?' అని రాజు అందుకు ఒప్పుకుంటాడు. ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాణ్ని 'అన్నదానంవల్ల కలిగే పుణ్యమేమిటిరా అబ్బాయి ?' అని అడిగి తెలుసుకో” అని చెప్పింది.


బ్రాహ్మణుడు 'సరే' అని చెప్పి హేమవతానికి బయలుదేరి వెళ్లేడు. దారిలో ఒక అడవి అడ్డమైంది. అందులో ప్రవేశించి వెడుతూ అతడు దారి తప్పి పోయాడు. దారితెలియక తచ్చాడుతోంటే, ఆ అడవిలో ఉండే బోయవాడొకడు ఆయన అవస్థ కనిపెట్టి "ఏం బాబూ, దారి తప్పిపోయినట్టున్నారు, ఏ ఊరు వెళ్లాలి?” అని ఆత్రముతో అడిగాడు.


హేమవత పర్వతం దగ్గరికి పోవాలి' అన్నాడు బ్రాహ్మడు.


"బాబూ, దారితప్పి ఆమడ దూరం వచ్చేశావు. సాయంత్ర మయిపోయింది. పులులు, సింహాలూ ఉన్న అడవి ఇది. రాత్రి ప్రయాణం చెయ్యకూడదు. పొద్దున్నే దారి చూపిస్తాను. ఈ రాత్రి ఆగిపొండి” అన్నాడు బోయవాడు.


బ్రాహ్మడు రాత్రికి అక్కడ ఉండిపోవటానికి ఒప్పుకోగానే బోయవాడు ఆయనను తన చేనువద్దకు తీసుకెళ్లేడు.


చేను దగ్గరకు వెళ్ళటంతోనే బోయవాడు యింటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు. అనపకాయలూ, కంది కాయలూ, పెసర కాయలూ కావలసినన్ని ఉన్నాయిగాని వాటిని ఉడకేసుకోమని ఇవ్వటానికి వాడి వద్ద కొత్తకుoడ లేకపోయింది. తమ కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు. ఎలాగ మరి? అని ఆలోచించాడు.


బ్రాహ్మడు, 'నాయనా, నాకేమీ వద్దోయ్. నువ్వు చేసిన ఆదరణవల్ల నా శ్రమా, ఆకలీ కూడా తీరిపోయాయి. ఆలోచించక పడుకో' అన్నాడు. కాని బోయవాడికి ఆ బ్రాహ్మణి పస్తు పెట్టడమంటే మనస్సు ఒప్పింది కాదు. అంచేత ఇంత చారపప్పూ పుట్ట తేనే తెచ్చి ఇచ్చి, వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు.


బ్రాహణుడు అవి తీసుకొని, అంగోస్త్రం పరుచుకుని, కింద పడుకోబోతూంటే, బోయవాడు, 'అయ్యో, కిందపడుకోబోకండి. పులులు వస్తాయి ' అని చెప్పి, ఆయనని చేలో ఎత్తుగా ఉన్న మంచె మీద పడుకో బెట్టి, తాను కింద ఉండి, విల్లూ, అమ్ములూ పుచ్చుకుని మృగాలేవీ రాకుండా రాత్రంతా బ్రాహ్మడికి కాపలా కాశాడు.


బోయవాడలా నిద్రపోకుండా రాత్రంతా కాపలా కాశాడు కాని, తెల్లవారు ఝామున నిద్ర ఆగక ఒక్క కునుకు తీశాడు. అంతలో ఎక్కడనుంచో ఓపులి వచ్చి, పాపం ఆ బోయవాడి మీద పడి చంపేసింది.


బ్రాహ్మణుడు నిద్ర లేచి, జరిగినదంతా తెలుసుకుని, తనమూలాన ఆ బోయవాడు పులివాత బడ్డాడని ఎంతో విచారించాడు. బోయవాని భార్య బాహ్మణునితో “స్వామీ, నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగలరు? మీరు విచారించకండి. మీకు హేమవతానికి దారి చూపిస్తాను , నడవండి" అని, ఆయనను తీసికెళ్లి దారి చూపెట్టి, వెనక్కి తిరిగివచ్చి, భర్తతోపాటు సహగమనం చేసింది.


ఆ బ్రాహ్మణుడు బోయదంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హేమవతాన్ని చేరుకున్నాడు. అక్కడ రాజును చూచి పార్వతీదేవి చెప్పినట్లుగా దీవించాడు. ' పుట్టినప్పుడు మీ పిల్లవాణ్ణి ఏకాంతంగా చూడడ






కుటుంబ అనుబంధాలు

 🤷‍♀️🤷🏻‍♂️


నేను గత ముప్ఫై ఏళ్లుగా కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలు లో వస్తున్న మార్పులను చాలా దగ్గరగా చూస్తూ వచ్చాను..

          పెద్దగా ఆస్తులు.. చెప్పుకోదగ్గ ఆదాయ వనరులు.. సమాజంలో హోదా.. సౌకర్యాలు సౌఖ్యాలు పెద్దగా లేని రోజుల్లోనే మనుషుల మధ్య ఆప్యాయత అనుబంధాలు చిక్కగా వుండేవి..

               ఒకరికి ఒకరు చేదోడుగా.. నిజాయితీగా అరమరికలు లేని సంబంధాలు కొనసాగించారు..

          వున్నంతలో తృప్తిగా వున్నారు.. కష్టానికి సుఖానికి ఒకరికొకరు కలుసుకోవడం.. అందరం దగ్గర వాళ్ళం అనే అనుభూతి పుష్కలంగా వుండేది..

               కుటుంబంలో ఎవరి పిల్లలు అయినా ఏదైనా సాధిస్తే అది కుటుంబం మొత్తం ఉమ్మడిగా సంతోషం వ్యక్తం చేసేవారు..

               మా మనవడు లేదా మనవరాలు..అని తాతలు.. మా మేనకోడలు లేదా మేనల్లుడు అని అమ్మమ్మ ఇంటివారు నానమ్మ ఇంటి వారు అందరూ గర్వంగా చెప్పుకునే వారు..

             కానీ ఎప్పుడైతే 1983-84 నుంచి కార్పొరేట్ కాలేజ్ సంస్కృతి పెరగడం మొదలైందో.. ఎప్పుడైతే ఒక్కొక్కరు పిల్లలను చదివించడానికి priority ఇవ్వడం మొదలైందో.. ఎప్పుడైతే పిల్లలు కూడా ఒకరికి మించి ఒకరు అవకాశాలు అందిపుచ్చుకుంటూ. .కెరీర్ సృష్టించుకోవడం మొదలైందో..

             మొదట్లో వారే కుటుంబాలలో మిగిలిన వారికి మార్గనిర్దేశనం చేసే వారు.. మిగిలిన వారికి అరమరికలు లేకుండా అండదండలు అందించే వారు.. తాము ఎదగడంతో పాటు తమ వారు కూడా ఎదగడం కోసం సహాయ పడ్డారు..

             కానీ ఎప్పుడైతే సర్వీస్ సెక్టార్ ప్రాముఖ్యత పెరగడం మొదలైందో.. ఎప్పుడైతే వేగంగా కెరీర్ దొరకడం మొదలైందో.. వేగంగా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారడం మొదలైందో..

              అంతకు ముందు కన్నా జీవితంలో సౌఖ్యాలు.. విలాసాలు.. పెరిగాయో ఎందుకో మనుషుల వ్యక్తిత్వం మరింత పరిణతి చెందాల్సిన దగ్గర రివర్స్ లో కుంచించుకు పోవడం మొదలైంది పక్కాగా సంబంధాలు పలుచపడటం మొదలైంది..

              ఏ ఇద్దరు కలిసినా తమ పిల్లలు సాధించిన విజయాలు.. కొన్న ఆస్తులు.. చేయించుకున్న నగలు.. వారు పొందుతున్న సాలరీ ప్యాకేజ్.. వారు పొందుతున్న కంఫర్ట్ గురించి తప్ప..

               వెనుకటి రోజుల్లో లాగా ఆప్యాయంగా నోరారా పలకరించు కోవడమే తగ్గిపోయింది..

                నా చిన్న నాటి రోజుల్లో ఇంట్లో కీడు జరిగినా.. శుభకార్యం జరిగినా కనీసం 10 మంది చుట్టాలు వారం పది రోజుల ముందు నుంచే వచ్చి వుండేవారు..

              తరువాత కూడా ఇంకో వారం రోజులు వుండేవారు..

            రాత్రి పూట ఆరుబయట మంచాలు వేసుకుని పొద్దుబోయిందాక చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పడుకునే వారు..

               ఇప్పుడు ఎంత దగ్గర వారి కార్యక్రమం అయినా.. చేసే వారు కూడా ఆప్పో సొప్పో చేసి పక్క వాడి కన్నా ఘనంగా చేయాలి అని చూపించే శ్రద్ధ మన వాళ్ళను దగ్గరగా నిలుపుకుందాము అని మర్చిపోతున్నారు..

                అటెండ్ అయ్యే వారు కూడా తమ అతిశయం చూపించుకోవడానికి.. తమ స్థితిలో వచ్చిన మార్పు చూపించుకోవడనికి ఇస్తున్న ప్రయారిటీ..

             పారదర్శక సంబంధాలు కి ఇవ్వడం లేదు.. చాలా మొక్కుబడిగా ఆహ్వానాలు హజరులు మిగిలిపోతున్నాయి..

           అందరికి పిల్లలు దూరంగా వుంటున్నా.. ఇరుగు పొరుగు నే వుంటున్న రక్త సంబంధీకులు తో కూడా ఆత్మీయ అనుబంధాలు వుంచుకోవడం లేదు..

            నిష్కారణంగా చిన్న చిన్న కారణాలు తోనే విపరీతమైన అహం అతిశయం తో వ్యవహరిస్తూ.. అందరికి అందరూ గిరిగీసుకుని బతకడానికి అలవాటు పడుతున్నారు..

          వయసు పెరిగే కొద్దీ ఓర్పు సహనం పెరగాల్సిన దగ్గర అసూయ ద్వేషాలు పెంచుకుంటున్నారు..

         నూటికి 90% కుటుంబాలలో పిల్లలు దూరంగానే వుంటున్నారు.. వీళ్లకు పెద్ధతనం.. ఒంటరి తనం.. అనారోగ్య సమస్యలు.. మనిషి తోడు అవసరం..

            అయినా కొద్దిపాటి కూడా సర్దుబాటు ధోరణితో వుండడం లేదు.. విపరీతమైన తామసం.. పక్క వాడి నీడ కూడా సహించడం లేదు..

       చాలా కుటుంబాలలో ఇప్పటికే మనుషులు పలచబడ్డారు..

            వలసలు పుణ్యాన.. గత 60-70 సంవత్సరాలుగా అనుసరిస్తూ వచ్చిన ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల ఇప్పటికే కుటుంబాల సైజ్ తగ్గిపోయింది.. 

        దానికి తోడు కేవలం కూడూ గుడ్డా కూడా పెట్టని ఈ అడ్డు గోడలు పర్యవసానం..

                బాధాకరమైన విషయం ఏంటంటే ఒక వేళ కజిన్స్ మన రూట్స్ కాపాడుకుందాం అనుకున్నా.. రిలేషన్స్ లో ఎమోషన్ వుంచుకుందాము అనుకున్నా మెజారిటీ కుటుంబాలలో పెద్ద వాళ్ళు దూరిపోయి అగాధం పెంచుతున్నారు..

           చిన్నప్పటి మా రోజులే బంగారపు రోజులు అనిపిస్తున్నాయి..

              నేడు పిల్లలకు అసలు కుటుంబ సంబంధాలు పరిచయం చేయడం ఇన్వాల్వ్ చేయడం ఎప్పుడైతే తగ్గిపోయిందో..

      రేపటి రోజున మన తరువాత మన పిల్లలకు మన అనే వారే లేని..  మిగలని పరిస్థితి సృష్టిస్తున్నాము..

        నీ ఇంటికి వస్తే ఏమి పెడతావు? నా ఇంటికి వస్తె ఏమి తెస్తావు అన్న భావన నుంచి కొద్దిపాటి అయినా మార్పు చెందాలి..

           అందరూ కొద్దిగా ఆలోచించండి.. మన కుటుంబాల్ని మనమే ఎడం చేసుకుంటూ.. మనలో మనమే దూరం పెంచుకుంటూ ఇంకా సమాజం నుంచి మనం ఏమి ఆశిస్తాము..

               ఎవ్వరికీ వారు గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి.. మన చిన్ననాడు మనం ఏమేమి పొందాము నేడు మన పిల్లలకు ఏమేమి దూరం చేస్తున్నాము? 

           ఇప్పటికే చాలా మంది పెద్దవారు వెళ్ళిపోయారు.. మనకి ఎంత టైం వుంటుందో తెలియదు..

           మనం సక్రమంగా ఆరోగ్యంగా వున్నప్పుడే కనీసం మన వాళ్ళ దగ్గర అయినా పనికిమాలిన అహం అతిశయం వదిలి వెద్ధాము..

           మన తరువాత కూడా మన పిల్లలకి మన కుటుంబ అనుబంధాలు వారసత్వంగా ఇద్దాము..

           🙏🙏🙏

జగద్గురు

 The True Meaning of Jagadguru by Maha Periyava.

Kriya Sakti

జగద్గురువు


1933లో పరమాచార్య స్వామివారు వారణాసిలో ఉన్నప్పటి సంఘటన. కాశి మహారాజు రాజభవనంలో మహాస్వామివారిని స్వాగతించారు. అక్కడ ఎందరో విద్వాంసులు పండితులు ఉన్నారు. అక్కడున్న కొద్దిమంది పండితులకి స్వామివారిపై కొంచం అసూయ. పరమాచార్య స్వామికి జగద్గురు బిరుదు ఎలా సంభావ్యం అన్నది వారి కడుపుమంట.


అక్కడున్న వారిలో ఒక పండితుడు, “ఈ జగద్గురువు ఎవరు?” అని అడిగాడు.


స్వామివారు మర్యాదతో, “నేనే” అని సమాధానమిచ్చారు.


ఆ పండితుడు వ్యంగంగా “తమరు జగద్గురువు” అన్నాడు.


అందుకు స్వామివారు “जगतां गुरुः न – నేను జగద్గురువు అని అంటే దాని అర్థం నేను ఈ జగత్తుకు గురువు అని కాదు అర్థం.


जगति पद्यमनाः सर्वे मम गुरवः - విశ్వాంలోని అన్ని ప్రాణులు నాకు గురువులు అని అర్థం” అని చెప్పారు.


ఇలా చెప్పగానే అక్కడున్న పండితులందరూ ఆశ్చర్యంతో వెనక్కు తగ్గారు. కాని మహాస్వామివారు అంతటితో ఆపలేదు.


ఈ వాదం జరుగుతున్న మందిరంలో పిచుకలు పెట్టిన కొన్ని గూళ్ళు ఉన్నాయి. స్వామివారు ఒక గూటివైపు చెయ్యి చూపిస్తూ, ఆ పండితులను అడిగారు, “किं इदं? - ఏమిటిది?”


అందుకు ఆ పండితులు, “नीडः - గూడు” అని చెప్పారు.


మహాస్వామివారు “केन निर्मितं? – ఎవరు కట్టారు?” అని అడిగారు.


వారు “चटकैः – పిచుకలు” అని చెప్పారు.


స్వామి వారితో, “ఈ గూడు కట్టినది కాళ్ళు చేతులు లేని ఆ చిన్ని పక్షులు. మనకు కాళ్ళు, చేతులు ఉన్నాయి. కాని కాని మనం వాటిలా గూడు కట్టలేము. ఆ పిచుకలకు ‘క్రియా శక్తి’ ఉంది. నాకు ఆ శక్తి లేదు”


కాబట్టి ఆ పిచుకలు నాకు ‘గురువు’ అని చెప్పారు!!!


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం 


Note: Now a days unnecessary Controversies are created by Half Knowledged and Egoistic, Arrogant People for their Selfish Motives.

Let us understand Truth .

రస'భరితమైన వ్యంగ్యం

 ఒక 'రస'భరితమైన వ్యంగ్యం❗


నేను ప్రశాంతంగా కూర్చుని నా ఇంటర్నెట్‌ని వాడుకుంటున్నాను...

అప్పుడు కొన్ని దోమలు 🦟🦟ఒచ్చి, నా రక్తాన్ని పీల్చడం ప్రారంభించాయి, సహజ ప్రతిచర్యలో భాగంగా నా చేయి పైకెత్తి రెండు అందుకున్నాను.


మరో ఒకట్రెండు దోమలు 🦟🦟 కుప్పలు కుప్పలుగా పడ్డాయి...అప్పుడే తట్టుకోలేక పోయాడు.. (Intolerant) అని శబ్దం చేయడం మొదలుపెట్టాయి.


అడిగాను.., "ఇందులో అసహనం ఏముంది..?"


రక్తాన్ని పీల్చుకోవడం వాటి స్వేచ్చ.. (Freedom) అని చెప్పడం మొదలుపెట్టాయి.


ఆజాదీ అనే పదం వినగానే వాటికి 🦟🦟 అనుకూలంగా పలువురు మేధావులు (Intellectuals) దిగి వాదులాడడం (Debates) మొదలెట్టారు.. ఆ తర్వాత నినాదాలు (Slogans) మొదలయ్యాయి..


"ఎన్ని దోమలను చంపుతారు.. (Tum kitne ____ Maaroge)

ప్రతి ఇంటి నుండి దోమలు వస్తాయి." (Har ghar se ___ Niklega)


మేధావులు తీవ్ర వాదనలతో వార్తాపత్రికలలో (Hindu మొదలు Washington Post దాకా) పెద్ద పెద్ద కథనాలు రాయడం ప్రారంభించారు.


శరీరంపై దోమలు ఉన్నా.. రక్తాన్ని పీల్చుకుంటున్నాయని ఎక్కడ రుజువైంది.. అని అవి 🦟🦟🦟 అన్నాయి.


అంతేకాక 🦟🦟🦟లు రక్తం పీల్చినప్పటికీ, అది తప్పు కావచ్చు, కానీ అది రాజద్రోహం (Sedition) వర్గంలోకి రాదు.


ఈ "దోమలు" 🦟🦟🦟 చాలా ప్రగతిశీలంగా (Progressive) గా ఉన్నందున.. ఎవరి శరీరంపైనైనా వాలేయచ్చునేది, వారి 'ఆందోళన'గా (Protest) మారింది.


నేను.. - "నేను నా రక్తాన్ని పీల్చుకోనివ్వను." అనే చెప్పా


అందుకే అవి 🦟🦟🦟 అరవడం మొదలుపెట్టాయి..

ఇది "అతి విపరీతమైన (Extremist) ప్రేమ"... నువ్వొక మతోన్మాది (Fanatic), డిబేట్ (Cowardice) నుండి పారిపోతున్నావు.


నేను చెప్పాను..., "మీ ఉదారవాదం (Liberalism) నా రక్తాన్ని పీల్చడానికి మిమ్మల్ని అనుమతించదు."


దీనిపై వాటి 🦟🦟🦟 వాదన ఏమిటంటే, "అది తప్పు అయినప్పటికీ, కొద్దిగా రక్తం పీల్చడం మిమ్మల్ని చంపదు, కానీ మీరు అమాయక దోమల ప్రాణాలను లాగేసుకున్నారు.

"ఫెయిర్ ట్రయల్" (Fair Trial - Principles of Natural Justice - Audi Alterem Partem - Hearing from other side) కి కూడా అవకాశం ఇవ్వలేదు."


అదే సమయంలో, కొందరు రాజకీయ నాయకులు కూడా వచ్చి, ఆ దోమలకు 🦟🦟🦟 తమ తోటలోని 'పెద్దమ్మ' కొడుకులు లెక్క అని చెప్పడం ప్రారంభించారు.


పరిస్థితి చూసి కలత చెంది, నేను అలా అన్నాను, "కానీ ఇలా.. దోమలు రక్తాన్ని పీల్చడం వల్ల మలేరియా వస్తుంది. మరియు ముందుగానే లేదా తరువాత అతను అనారోగ్యంతో మరియు బలహీనంగా ఔతాడు మరియు మరణిస్తాడు ...


దీనిపై దోమలు 🦟🦟🦟 మాట్లాడుతూ.. "మీ మాటల్లో లాజిక్ లేదు. కాబట్టి భవిష్యత్తు కల్పనల (Futuristic) ఆధారంగా మీ ఫాసిస్ట్ (Fascist) నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు.


“దోమ 🦟 కుట్టడం వల్ల మలేరియా వస్తుందనేది శాస్త్రీయ సత్యం... గతంలో కూడా ఇలాగే ఎదుర్కోవాల్సి వచ్చింది.." కానీ మీవాళ్లకు 🦟🦟 సైంటిఫిక్ (Scientific) పదం అర్థం కాలేదు..


దానికి అవి 🦟🦟 స్పందిస్తూ.. "దోమల 🦟🦟సమాజంపై నాకున్న ద్వేషాన్ని సాకుగా చూపి, చరిత్ర సృష్టిస్తున్నా.. వర్తమానంలో జీవించకుండా."


చాలా కోలాహలం తరువాత, వాటి సామరస్య వాతావరణాన్ని (Peaceful Atmosphere) పాడుచేసినందుకు నా స్వంత తల🧠 ని కూడా నిందించాడు.


నాకు వ్యతిరేకంగా నా చెవిలోకి ప్రవేశించడంతో, దోమలన్నీ విజృభించడం ప్రారంభించాయి ... "మేము స్వాతంత్ర్యం తీసుకుంటాము..." (Hum leke rahenge Azadi)


వాదోపవాదాలు - వాదోపవాదాలకు దిగడం వల్ల నేను పడిన బాధ... రక్తం పీల్చుకున్నప్పుడు కంటే ఎక్కువ అని.


ఆఖరికి సంస్కృతం లో ఓ మాట గుర్తుకు ఒచ్చింది.. 

"దండం దశ గుణం భవేత్❗"


ఇంకేముంది


వెంటనే నేను నల్ల హిట్ స్ప్రే ని తీసుకుని, 

ఇంటి లోపల నుండి బయటి వరకు, 

పై నుండి క్రిందికి, 

తోట నుండి కాలువ వరకు,

వాటి ప్రతి అధునాతన మరియు రహస్య ప్రదేశాల్లో

స్ప్రే చేసేసాను...


ఒక్కసారిగా 🦟🦟🦟🦟 మెత్తబడి పోయి... 

తర్వాత అన్నీ 🦟🦟🦟🦟 శాంతించాయి..😄😄


అప్పటి నుంచి..

చర్చ లేదు...

వివాదం లేదు...

స్వేచ్ఛ లేదు...

వ్యర్థం లేదు...

విప్లవం లేదు...

ఆందోళన లేదు...


🙏 ఇప్పుడు అంతా బాగానే ఉంది.. ఇదే లోకం తీరు 🙏


ఈ పోస్ట్ అస్సలు కల్పితం కాదు.. 

ఇది 💯% ప్రస్తుత పరిస్థితులకు సంబంధించినదే

సుబ్రహ్మణ్యస్వామి

 ఈ గుడిలో ప్రార్థన చేస్తే చదువులో రాణిస్తారు!




పార్వతీపరమేశ్వరుల రెండో తనయుడు సుబ్రహ్మణ్యస్వామి. 

ఆయనే దేవతలకు సేనాధిపతి. మురుగన్‌ పేరుతో సుబ్రమణ్యస్వామిని పిలుస్తారు. సూరపద్ముడినే రాక్షసుని ఈయన సంహరించాడు. సూరపద్ముడితో యుద్ధం కోసం కుమారస్వామి పలు రణ శిబిరాలను ఏర్పాటుచేశాడు. ఈ శిబిరాల్లో ముఖ్యమైనవి ఆరు. ఈ ఆరు క్షేత్రాలు తమిళనాడులోనే ఉన్నాయి. అవి పళని, తిరుచెందూర్‌, స్వామిమలై, తిరుపరన్‌కుండ్రం.


తిరుత్తణి, పళముదిరి కొలయ్‌. సూరపద్ముడి సంహారం అనంతరం స్వామి తిరుత్తణిలోని కొండపై విశ్రాంతి తీసుకుని, శ్రీవల్లిని ఇక్కడే వివాహం చేసుకున్నారు. అందుకే అన్ని మురుగన్‌ ఆలయాల్లో జరిపే స్కంద షష్టిని ఇక్కడ నిర్వహించరు. దీనికి బదులుగా యుద్ధ ఉత్సవం జరుగుతుంది. 


ఆ రోజున వేయి కిలోల పుష్పాలతో అభిషేకం నిర్వహిస్తారు. 

ఇక్కడ స్వామివారి వాహనంగా మయూరం స్థానంలో ఏనుగు ఉంటుంది. 


దీనికి సంబంధించి ఒక పురాణగాథ ప్రచారంలో వుంది.


 సుబ్రహ్మణ్యస్వామికి దేవేంద్రుడు తన కుమార్తె దేవయానిని ఇచ్చి వివాహం జరిపించి ఐరావతాన్ని కానుకగా ఇచ్చాడు.


ఈ ఆలయంలో స్వామికి ఉపయోగించే చందనం ఎంతో విశిష్టమైంది. చందనాన్ని దేవేంద్రుడే స్వయంగా కానుకగా ఇచ్చినట్టు పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఈ గంధాన్ని నుదుటిపై ధరించకుండా నీటిలో కలిపి సేవిస్తే అన్ని రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. అయితే ముఖ్యమైన పండుగ సమయాల్లోనే ఈ చందనాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు. ఆలయంలో భైరవుడు నాలుగు శునకాలతో కలిసి ఉంటాడు. ఇవి నాలుగు వేదాల పరిరక్షణకే అని తెలుస్తోంది. భైరవుడి పీఠం ముందు మూడు శునకాలు, వెనుక భాగంలో మరో శునకం ఉంటాయి.


 ఇక్కడ ప్రార్థన చేస్తే చదువులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారనేది నమ్మకం.


అరుణగిరినాథర్‌ అనే మహాభక్తుడు స్వామివారిని కొలుస్తూ ఇక్కడే తనువు చాలించాడు. కర్ణాటక సంగీతత్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులు ఈ ఆలయానికి వచ్చినప్పుడు మెట్లు ఎక్కుతుండగా ఒక వృద్ధుడు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని ఇచ్చారు. ఆ ప్రసాదం తినగానే ముత్తుస్వామి నోరు పవిత్రమై ఆశుధారగా గానం చేశాడు. అమృతప్రాయమైన ఆ ప్రసాదాన్ని సాక్షాత్తు కార్తికేయుడే వృద్ధుని రూపంలో వచ్చి ముత్తుస్వామికి అందజేశాడట.

సంగీతము

 శ్లోకం:☝️

*కావ్యాలాపాశ్చ యే కేచిత్*

    *గీతాని సకలాని చ |*

*శబ్దమూర్తి ధరైస్యైతే*

    *విష్ణోరంశా మహాత్మనః ||*

    - విష్ణుపురాణం


భావం: ఏ కొంచెం రాగాలాపన చేసినా, కృతిలోని భాగమును లేక గీతమును పూర్తిగా ఆలపించినా వారు విష్ణు అంశయైన సంగీతమును ధారణ చేయువారు, నాదోపాసకులు కనుక వారు మహాత్ములు. సంగీతము భగవదంశమని  విష్ణుపురాణం చెబుతోంది.🙏

అష్ట దిక్కుల గాలులు

 అష్ట దిక్కుల గాలులు  -  లాభ నష్టాలు . 


  గాలులు లొని రకాలు  - 


     బౌగోళిక పరిస్థితులను బట్టి సూర్య చంద్రుల గమనాలని బట్టి భూమి స్వరూపాన్ని ఎనమిది దిక్కులుగా విభజించారు. అన్ని దిక్కుల నుంచి వీచే గాలులు అన్ని ఒకే రకంగా ఉండవు  . ఆయా దిక్కుల స్వభావాన్ని బట్టి గాలి స్వభావం మారుతుంది . అయితే అన్నివేళలా అన్ని దిక్కుల నుండి గాలులు వీచవు. ఒక్కో రుతువులో ఒక్కో దిక్కునుండి ఒక్కో రకమైన గాలులు వీస్తాయి. వాటివల్ల మానవులు మానవులకు కొంత ఆరోగ్యము , కొంత అనారోగ్యము కలుగుతాయి. ఏ గాలులు అనారోగ్యమో , ఏ గాలులు ఆరోగ్యమో తెలుసుకోవడం ప్రతి మనిషికి అవసరం. 


  దక్షిణ దిక్కు గాలులు  - 


    ఏప్రిల్ , మే నెలలలో వచ్చే వసంత మాసంలో దక్షిణ దిక్కు నుంచి గాలులు నెమ్మదిగా వీస్తాయి . ఇవి మలయ పర్వతం మీదగా వీచడం వలన ఆ పర్వతం మీద ఉన్న ఔషధాల సువాసనలు కూడా ఈ గాలులతో కలిసి వస్తాయి. ఈ మలయ పవనాలు తమ చల్లని స్పర్శతో మానవాళిని వేసవితాపం నుంచి కాపాడతాయి. ఈ గాలులని ఆస్వాదించ గలిగితే శరీరంలోని త్రిదోషాలు హరించి చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది. ఈ గాలిలో తీపి , చేదు , వగరు రుచులు ఉంటాయి. ఈ కాలంలో అదే స్వభావం కలిగిన ఈశాన్య గాలులు కూడా వీస్తాయి 


  నైరుతి గాలులు  - 


      జూన్ , జూలై నెలలలో వచ్చే గ్రీష్మ రుతువు లొ నైరుతి దిక్కు నుండి గాలులు వీస్తాయి . ఈ గాలుల్లో కారం రుచి ఉంటుంది. ఇవి వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. ఈ గాలులు వాళ్ళ ఉదర రోగాలు , పైత్య రోగాలు , మేహా రోగాలు పుడతాయి. రక్త పిత్త రోగాలు కూడా పుడతాయి. ఈ నైరుతి గాలులు సకల రోగాలుకు నిలయాలు. 


  పడమర గాలులు  - 


     ఆగస్ట్ , సెప్టెంబర్ నెలలలో ఉండే వర్ష ఋతువులో పడమర గాలులు వీస్తాయి . ఈ గాలులు వెగటుగా ఉండి వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. అయినా గ్రీష్మ ఋతువులో నైరుతి గాలుల వలన ఏర్పడిన రక్తపిత్త వ్యాధి హరించి పొతుంది. ఎంతో కాలం నుంచి ఉన్న వివిధ వ్రణాలు మాడిపోతాయి. 


  వాయువ్య దిక్కుల గాలులు  - 


   

     అక్టోబర్, నవంబర్ నెలలలో ఉండే శరత్కాలంలో వాయువ్య దిక్కు నుంచి గాలులు వీస్తాయి . ఈ గాలులలో కారం , చేదు గుణాలు ఉంటాయి. తేమ ఉండదు. అందుకే ప్రసన్నంగా ఉంటాయి. అందుకే ప్రసన్నంగా ఉంటాయి. అయితే వాత వ్యాదులు కలిగించడం . వాతవ్యాదులు ఉన్నవారికి ఎక్కువ అవ్వడం ఈ గాలుల స్వభావం . కఫ రోగాలు , పైత్య రోగాలు తగ్గించి వంటిలోని చెడు నీరు తొలగించే గుణం ఈ గాలులలో ఉంది. 


  తూర్పు , ఉత్తర దిక్కుల గాలులు  - 


     డిసెంబర్ , జనవరి నెలలలో ఉండే హేమంత ఋతువులో తూర్పు దిక్కున ఉండి ఉత్తర దిక్కుకు ఈ గాలులు వీస్తాయి . తూర్పు గాలులు చలువ చేస్తాయి. కాని వీటివల్ల వాత రోగాలు , కఫ రోగాలు పైత్య రోగాలు పెరుగుతాయి. వంటి నిండా నీరు పట్టే ఉబ్బు వ్యాధి ని కలిగిస్తాయి. ఉత్తరపు గాలులు కూడా చల్లగా ఉంటాయి. ఇవి కఫాన్ని , కొవ్వుని పెంచుతాయి. 


   ఆగ్నేయ గాలులు   - 


  

       ఫిబ్రవరి , మార్చి నెలలలో ఉండే శిశిర ఋతువులో ఆగ్నేయ దిక్కు నుండి గాలులు వీస్తాయి . ఇవి కూడా అమిత చల్లగా ఉంటాయి. వాతవ్యాదులని పుట్టిస్తాయి. ఉబ్బు రోగాలు , వ్రణాలు ఉన్నవారిని మరింత పీడిస్తాయి.


          మరెంతో విలువైన మరియు అతి సులభ  యోగాలకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 

    


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034