8, మే 2021, శనివారం

ఇష్టకామేశ్వరి

 *🙏🌺కారడవిలో కొలువైన ఇష్టకామేశ్వరి🌺🙏*


🌺ఆ ఆలయంలోని అమ్మవారికి బొట్టుపెట్టి... ఏదయినా కోరుకుంటే కచ్చితంగా నెరవేరుతుందనేది భక్తుల నమ్మకం. చతుర్భుజాలతో దర్శనమిస్తూ... భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వెలసి... పూజలు 

అందుకుంటున్న ఆ దేవతే ఇష్టకామేశ్వరి. ఈ ఆలయంలోని అమ్మవారికి బొట్టుపెట్టినప్పుడు విగ్రహం మామూలుగానే ఉన్నా... నుదురు మాత్రం మెత్తగా అనిపిస్తుందని చెబుతారు ఇష్టకామేశ్వరిని దర్శించుకున్న 

భక్తులు. శ్రీశైలానికి ఇరవైకిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవిని చూడాలంటే కాస్త సాహసం చేయాలని అంటారు.

కామేశ్వరి దేవి ఆలయం.... భారతదేశంలో ఒకేఒక్క చోట ఉండటం, అది శ్రీశైలంలోనే కావడం విశేషం. ఇక్కడ కామేశ్వరి కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా

ప్రసిద్ధిగాంచింది. పార్వతీదేవి ప్రతిరూపంగా పిలిచే కామేశ్వరి సన్నిధి కర్నూలు-ప్రకాశం జిల్లాల సరిహద్దులో సముద్రమట్టానికి 2128 అడుగుల ఎత్తులో ఉంటుంది. చాలా చిన్న గుడిలో కొలువై ఉన్న ఈ అమ్మను 

దర్శించుకుని నుదుటన బొట్టు పెట్టి.... పెరుగన్నం, పొంగలిని నివేదిస్తే ఏ కోరి కైనా నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అమ్మవారు స్వయంభువుగా కొలువైన ఈ మహిమాన్వితమైన క్షేత్రం🌺

🌺వెనుక చిన్న కథ ప్రాచుర్యంలో ఉంది. చారిత్రక నేపథ్యం

కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఎందరో యోగులూ సిద్ధులూ తపస్సు చేసేవారట. అలా అమ్మవారిని స్మరించుకునే వారికోసమే పార్వతీ స్వరూప

మైన కామేశ్వరి ఇక్కడ వెలసిందని చరిత్ర చెబుతోంది. అయితే చాలామందికి తెలియకపోవడం వల్ల ఇక్కడకు వచ్చే భక్తుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండేదట. కాలక్రమంలో శ్రీశైలానికి వచ్చే భక్తులూ, 

యాత్రికుల ద్వారా ప్రపంచానికి ఈ ఆలయం గురించి తెలిసిందని అంటారు. అటవీ ప్రాంతం మధ్యలో కనిపించే ఈ చిన్న గుడి క్రీ.శ 8-10 శతాబ్దాల మధ్య కాలానికి చెంది ఉండొచ్చని అంచనా. ఇప్పటికీ చాలా చిన్నగా 

కనిపించే ఈ ఆలయ గోపుర నిర్మాణం కూడా శ్రీశైల మల్లికార్జున

గర్భగుడి విమానాన్ని పోలినట్లుగా ఉండటం విశేషం. దీన్ని బట్టి ఇది చాళుక్యుల కాలం నాటి దేవాలయం కావొచ్చని అంటారు చరిత్రకారులు. శ్రీశైలానికి ఉత్తరవాహినిగా పాతాళ గంగ ఉన్నట్లుగానే ఇష్టకామేశ్వరి 

ఆలయానికి ఎదురుగా ఉత్తరదిశలో ఒక వాగు ఏడాది పొడవునా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడున్న అమ్మవారి విగ్రహాన్ని పోలిన విగ్రహం భారతదేశంలో మరెక్కడా ఇంతవరకూ కనబడలేదన్నది ఆధ్యాత్మికవేత్తల 

అభిప్రాయం. బొట్టు పెడతారు శక్తి క్షేతంగా, సిద్ధ క్షేత్రంగా వర్ధిల్లే ఈ ప్రాంతంలో కామేశ్వరీ దేవి ముకుళిత నేత్రాలతో, ధ్యానముద్రలో, చతుర్భుజాలతో, పద్మాసనంలో కూర్చుని దర్శనమిస్తుంది..... రెండు చేతుల్లో 

కలువపూలూ, ఒక చేతిలో రుద్రాక్ష, మరో చేత్తో శివలింగాన్ని పట్టుకుని ఉంటుంది. భక్తులు ఇరుగా ఉండే ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే కూర్చొని వెళ్లాలి. అలాగే వెళ్లి స్వయంగా అమ్మవారికి బొట్టు పెడతారు. 

ఇలాంటి సంప్రదాయం మరెక్కడా కనిపించదనీ... అమ్మవారి నుదుట కుంకుమ పెడుతున్నప్పుడు ఆ బాగం మెతగా ఉంటుందనీ చెబుతారు.🌺

🌺ఈ ఆలయంలో కొన్ని తరాలుగా చెంచులే పూజారులుగా వ్యవహరించడం విశేషం. ఈ ఆలయ నిర్వహణకు అవసరమైన ధూపదీప నైవేద్యాలన్నీ శ్రీశైల దేవస్థానం నుంచే వస్తాయి. ఈ

ప్రాంతంలో ఉండే గిరిజనులైన చెంచులు ఈ ఆలయాన్ని గుప్తనిధులు తవ్వే దుండగుల నుంచి కాపాడుకుంటుంటారు. ఎలా చేరుకోవచ్చంటే

శ్రీశైలం నుంచి డోర్నాల మార్గంలో 11 కి.మీ. ప్రయాణించి అక్కడి నుంచి ఎడమ వైపు నెక్కంటి, పాలుట్ల అడవి మార్గంలో వెళ్లాలి. ఈ ప్రయాణం కాస్త కష్టంగానే ఉంటుంది. ఇక్కడకు ద్విచక్రవాహనాల్లో లేదా కార్లలో 

వెళ్లలేరు. ఎందుకంటే ఈ ప్రాంతంలో రోడ్డు గతుకులమయంగా ఉండి... వెళ్లడానికి చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. నడిచి వెళ్లడం కూడా కష్టమే కాబట్టి శ్రీశైలం వరకూ వెళ్తే... అక్కడి నుంచి ప్రత్యేకంగా కొన్ని 

జీపులుంటాయి. అయితే.. దర్శనం అయ్యాక సాయంత్రం అయిదులోపు మళ్లీ తిరుగు ప్రయాణం చేయాలని చెబుతారు.🌺

ఏవి

 *🔹ఏడుగురు అప్సరసల పేర్లు ఏవి ❓*

1.రంభ. 

2. ఉర్వశి. 

3.మేనక  

4.తిలోత్తమ. 

5.సుకేశి. 

6. ఘ్రుతాచి 

7. మంజుగోష

*🔹సప్త సంతానములు అంటే ఏమిటి ❓🔹*

1. తటాక నిర్మాణం. 

2. ధన నిక్షేపం. 

3. అగ్రహార ప్రతిష్ట . 

4. దేవాలయ ప్రతిష్ట . 

5. ప్రభంధ రచన. 

6. స్వసంతానం (పుత్రుడు).*

 *🔹తొమ్మిది రకాల ఆత్మలు  ఏవి ❓🔹*

1. జీవాత్మ. 

2. అంతరాత్మ. 

3. పరమాత్మ. 

4. నిర్మలాత్మ. 

5. శుద్దాత్మ. 

6. జ్ఞానత్మ  

7. మహాధాత్మ . 

8. భూతాత్మ . 

9. సకలాత్మ.

*🔹పదిరకాల పాలు ఏవి ❓🔹*

1. చనుబాలు. 

2. ఆవుపాలు . 

3. బర్రెపాలు 

4. గొర్రె పాలు. 

5. మేక పాలు. 

6. గుర్రం పాలు. 

7. గాడిద పాలు. 

8. ఒంటె పాలు 

9. ఏనుగు పాలు. 

10. లేడి పాలు.

*🔹యజ్ఞోపవీతంలొ ఎన్ని పోగులు ఉంటాయి ❓🔹*

*యజ్ఞోపవీతంలొ 9 పోగులు ఉంటాయి. ఆ తొమ్మిది పోగుల్లో 9 మంది దేవతలు నివసిస్తారు. వారు  -*

1. బ్రహ్మ . 

2. అగ్ని. 

3. అనంతుడు. 

4. చంద్రుడు . 

5. పితృ దేవతలు . 

6. ప్రజాపతి 

7. వాయువు 

8. సూర్యుడు  

9. సూర్య దేవతలు

*🔹అష్టాదశ ఆయుర్వేద సంహితలు ఏవి ❓🔹*

1. చరక సంహిత. 

2. శూశ్రుత సంహిత. 

3. పరాశర సంహిత 

4. హరిత సంహిత. 

5. అగ్నివేశ సంహిత. 

6. చ్యవన సంహిత 

7. ఆత్రేయ సంహిత. 

8. భోజ సంహిత. 

9. బృగు సంహిత 

10. బెడ సంహిత. 

11. అగస్త్య సంహిత. 

12. వరాహ సంహిత 

13. అత్రి సంహిత. 

14. నారయణ సంహిత. 

15. చంద్ర సంహిత. 

16. నారసింహ సంహిత. 

17. శివ సంహిత. 

18. సూర్య సంహిత.

*🔹గృహ నిర్మాణం ఏ విధంగా చేపడితే సర్వ సుఖాలు పొందుతారు ❓🔹*

1. ఈశాన్యం లొ పూజలు , పవిత్ర కార్యాలును నిర్వర్తించే విధంగా పూజగది ఉండాలి.  

2. ఆగ్నేయంలొ అగ్నికి సంబందించిన వంటావార్పు చేసుకొనే విధంగా వంటగది ఉండాలి. 

3. నైరుతిలో ఆయుధ సామగ్రి మొదలయిన వాటిని పెట్టుకోవడానికి ఒక గది ఉండాలి.

4. వాయువ్యంలొ స్వతంత్రబిలాష చిహ్నములు,

5. తూర్పు దిక్కున సూర్యునికి ప్రీతికరమైన పనులు. 

6. యమ స్థానం అయిన దక్షిణం వైపు తలపెట్టి నిద్రించుట. 

7. కుభేర స్థానం అయిన ఉత్తరం వైపు చూస్తూ నిద్ర లేచుట. 

8. వరుణ స్థానం అయిన పశ్చిమాన పాడి పశువులు పెంచుటకు తగిన స్థలం ఉండవలెను.

*🔸ఈ విధంగా చేయుటవలన ఆయా దిక్కులలోని ఉన్న దేవతలు సంతృప్తి చెంది ఆ గృహములో నివసించేవారికి సర్వసుఖాలు, సర్వసంపదలు ఇస్తారు.*

*🔹వివిద ఫలాల నైవేద్యం  -  ఫలితాలు 🔹*

*🔸కొబ్బరి కాయ (పూర్ణ ఫలం) - భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి.*

*🔸అరటి పండు - భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటి పండు గుజ్జుగా చేసి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యం గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.*

*🔸నేరెడు పండు. - శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యం గా పెట్టి  ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరొగ్య వంతులు అవుతారు.*

*🔸ద్రాక్ష పండు. - భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది.*

 *🔸మామిడి పండు. -  మామిడి పండుని నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యం గా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యంగా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు.*

*🔸అంజూర  పండు. భగవంతుడికి నైవేద్యం పెట్టిన అన్జురాపండు ను అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు.*

 *🔸సపోట పండు. - సపోట పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంభంద విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి.*

 *🔸యాపిల్ పండు - భగవంతుడికి యపిల్ పండుని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు.*

 *🔸కమలా పండు. -  భగవంతుడికి కమలా పండు నివేదించినట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి.*

*🔸పనసపండు -  పనసపండుని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనము, రోగావిముక్తి కలిగి సుఖంగా ఉంటారు.*

*🔹 సూతకములు అంటే ఏమిటి ❓🔹*

1.జన్మ సూతకము. 

2. మృత సుతకము. 

3. రజః సూతకం 

4. అంటు (రొగ ) సూతకం 

5. శవ దర్శన సూతకం* 

 *🔹దేవాలయాల వద్ద గృహ నిర్మాణం చేయడం దోషమా ❓🔹*

*🔸శివాలయానికి నూరు బారుల దూరం లొపల, విష్ణువాలయముకు వెనక ఇరవై బారుల దూరం లొపల, శక్తి ఆలయముకు సమీపంలొను గృహనిర్మాణం చేయకూడదు . దీనికి వ్యతిరేఖంగా గృహ నిర్మాణం జరిగితే సఖల సంపదలు నశించి కష్టాలపాలు అవుతారు. గుడి దగ్గర ఉన్న ఇళ్ళకు ఏ వైపునైనా , ఏ మాత్రమైనా గుడి నీడ పడిందంటే దరిద్రం, ప్రాణనష్టం వంటి అనేక కష్టనష్టాలు ఎదుర్కోక తప్పదు.*

*🔹తాంబూలం సేవించేప్పుడు తమలపాకు తొడిమ, చివర్లు ఎందుకు తుంచాలి ❓🔹*

*🔸తాంబులం వేసుకునే ముందు తమలపాకుల తొడిమలు, చివరలు తుంచి వేయాలి. ఎందుకంటే తొడిమను తినడం వ్యాదికారకం అవుతుంది. చిగుర్లు పాపానికి ప్రతీకలు అని అంటారు. కనుక తమలపాకు తొడిమలు , చివరలు తుంచిన తర్వాతే తాంబులం వేసుకొవడం ఆరొగ్య ప్రధమం. అలాగే తమలపాకులో ఉండే ఈనెలు బుద్దిని మందగింప చేస్తాయి. అందుకే తమలపాకును నమిలి మొదటగా నోటిలో ఊరిన రసాన్ని ఉమ్మివేయాలి. తొడిమలు, చివరలు తున్చి వేసినా ఇంకా అవి తమలపాకులో శేషించి ఉంటాయి కనుక*

*🔹శ్రీ గోవింద రాజస్వామి వారి సన్నిధిలో కుంచం ఉంటుంది ఎందుకు ❓*

*🔸తిరుపతి శ్రీ గొవింద రాజస్వామి వారి సన్నిదిలో కుంచం ఉండటం నిజమే . దీనికి కారణం ఈ విధంగా చెబుతారు. తిరుమల స్వామి శ్రీ వెంకటేశ్వరస్వామి  కుబేరుని వద్ద అప్పు చేసాడట . దానిని తీర్చుట కొరకు ద్రవ్యాన్ని కుంచంతో కొలిసి ఇచ్చేవారట స్వామివారు. స్వామివారి పక్షాన గొవింద రాజస్వామి ఈ కార్యమును సాగించారని ఒక కధ ప్రచారంలొ ఉంది. ఆ కుంచం తన తలక్రింద ఉంచుకున్నాడు అని ప్రతీతి.*

*🔹నవగ్రహాలకు సంభందించిన సమిధలు ఏవి ❓*

1. సూర్యుడు - జిల్లెడు. 

2. చంద్రుడు - మొదుగ . 

3. అంగారకుడు - చండ్ర. 

4. బుదుడు - ఉత్తరేణి 

5. బృహస్పతి - రావి . 

6. శుక్రుడు - అత్తి 

7. శని - జమ్మి . 

8. రాహువు - దర్భ 

9. కేతువు - గరిక .*

*🔹ఎటువంటి స్థలం లొ గృహ నిర్మాణం చేయరాదు ❓🔹*

1. గోవుల మందలు ఉండే ప్రదేశాలలోనూ 

2. స్మశాన భూమికి సమీపం లొను 

3. మలమూత్రాలు విసర్జించు ప్రదేశాలలోను 

4. ఉప్పు నేలలోను, చవుడు నేలల యందు 

5. ఎల్లప్పుడు నీటి వుటలు గల ప్రదేశాలలోను 

6. రాతి భూముల యందు మిక్కిలి రక్త వర్ణం గల భూమి యందు 

7. చెరువులను పూడ్చి గృహ నిర్మాణం చేయరాదు. అలా చేయడం వలన అనేకములు అయిన పంది జన్మలు ఎత్తి రౌరవాది నరకములు అనుభవించి కష్టాల పాలవుతారు

*🔹పుజాంగాలు  ఎన్ని రకాలు ❓🔹*

*🔸పుజాంగాలు  5 రకాలు: 1.అభిగమనము - దైవాన్ని స్మరిస్తూ దేవాలయానికి వెళ్ళుట. 

2. ఉపాధానము - పూజా సామగ్రిని సంపాదించుట 

3. ఇజ్య - దూప, దీప, నైవేద్యములతో పూజించుట. 

4. స్వాద్యాయము - తనకు తానుగా మంత్రోచ్చారణ తో స్తుతించడం. 

5. యోగము - తదేకమైన నిష్టతో ధ్యానించుట

  *🔹ఏయే గృహాలకి ఎటువంటి శంఖువు ప్రతిష్ట చేయాలి ❓🔹*

*🔸 రాతితో కట్టే గృహానికి ఆ రాతితోనే శంఖువు తయారు చేసి శంఖుస్థాపన చేయవలెను . ఇటుకలతో కట్టిన గృహమునకు ఇటుకలతోనే శంఖువు చేసి ప్రతిష్ట చేయవలెను. గోడలు పెట్టక కర్రలతో, నిట్రాట లతో వేయు పాకలకు కర్రతో శంఖువు తయారు చేసి ప్రతిష్ట చేయవలెను . శంఖువును నవరత్న, సువర్ణ, తామ్ర , రజిత నాణేలతో, నవ ధన్యములతో పూజించి , స్థాపించవలెను. అన్ని రకాల గృహములకు కర్ర శంఖువు ప్రతిష్టించరాదు . కాష్ట శంఖువు భుమిలొ ఎంతకాలం ఉండునో అంతకాలం ఆ గృహం శుబప్రధంగా ఉండును. ఆ తరువాత ఆ గృహములలో నివసించువారికి కష్టాలు కలుగును. కావున కర్రతో చేసిన శంఖువు కంటే రాతితో చేసిన శంఖువు ఉత్తమం అని తెలుస్తుంది.*

*🔹 గృహ నిర్మాణం లొ ఇంటి కిటికీలు, ద్వారాలు ఏ విధంగా అమర్చాలి ❓*

*🔸 గృహంలో కిటికీలు, ద్వారములు సమ సంఖ్యలో ఉండాలి. వేటికవే విడివిడిగా సమ సంఖ్యలొ ఉండాలి. కిటికీలు సరి సంఖ్యలోను , ద్వారాలు సరి సంఖ్యలొను ఉండాలి. అలమారాల గురించి శాస్త్రంలొ ఏమీ చెప్పలేదు. వాటి ఉపయోగాన్ని అనుసరించి సరి సంఖ్యో, బేసి సంఖ్యలొనో పెట్టుకొవాలి. వాటికి స్థల నిర్ణయం కూడా చెప్పలేదు కిటికీలు, ద్వారాలు సరి సంఖ్యలో ఉన్నా చివరన సున్నా లేకుండా ఉండాలి. అనగా 10, 20, 30 ఇలా చివరన సున్నా రాకూడదు. అలాగే మొత్తం గృహం లొ ఉన్న ద్వారాలు, కిటికీలు అన్ని లెక్కపెట్టాలి.*

*🔹వివిధ జన్మలు ఏవి ❓🔹*

1. దేవతలు 

2. మనుష్యులు 

3. మృగములు 

4. పక్షులు 

5. పురుగులు 

6. జల చరములు 

7. వృక్షములు

*🔹శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఏడుకొండల పేర్లు ❓*

 1. వ్రుషబాద్రి  

2. నీలాద్రి 

3. గరుడాద్రి 

4. అంజనాద్రి. 

5. శేషాద్రి. 

6. వెంకటాద్రి 

7. నారాయణాద్రి.*

*🔹ఎవరెవరికి యే విధంగా నమస్కరించాలి ❓🔹*

*🔸1. విష్ణుమూర్తి యెక్క సర్వ అవతారాల విగ్రహాలకు మరియు శివునికి 12 అంగుళాల ఎత్తులొ చేతులు జోడించి శిరస్సు వంచి భక్తి , శ్రద్దలతో వినయంగా నమస్కరించాలి.*

*2. ఇతర దేవుళ్ళకు శిరస్సు పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.*

*3. గురువుకి నోటితో " నమస్కారం " అని చెప్పకుండా రెండు చేతులు జోడించి వినయవిధేయలతో నమస్కరించాలి.*

*4. మహానుభావులకు , యోగులకు రెండు చేతులు వక్షస్థలం పై  జోడించి నమస్కరించాలి.*

*5. తండ్రికి, పరిపాలకుడికి రెండు చేతులు నోటి మీదగా జోడించి నమస్కరించాలి.*

*6. తల్లికి ఉదరం పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.*

*🔹శ్రీ చక్రం నందు గల దేవతలు ఎవరు ❓🔹*

1. వశిని

2. కామేశ్వరి. 

3. మోదిని 

4. విమల 

5. అరుణి 

6. జయిని 

7. సర్వేశ్వరీ 

8. కాళిని

*🔹ధర్మం అంటే ❓🔹*

ధృతి, 

క్షమ, 

దమము, 

అస్తేయము,

శౌచము, 

ఇంద్రియ నిగ్రహము, 

ధీ, 

విద్య, 

సత్యము, 

అక్రోధము. 

*🔸ఈ పది లక్షణములు కలిగినదే "ధర్మము"*

*🔹 సహంపక్తి బోజనాల సమయం లొ అందరూ ఒకేసారి లేవాలి అంటారు ఎందుకు ❓🔹*

*🔸సహంపక్తి బోజనానికి కూర్చున్న వారందరి జీవన ప్రమాణం ఒకే విధంగా ఉండదు. సహంపక్తి బోజనాలలో రకరకాల వారు ఉంటారు. వారిలొ మంచివారు ఉంటారు. అలాగే చెడు అలవాట్లు ఉన్నవారు ఉంటారు. ఎవరి శరీరాల్లోని విద్యుత్ వారి వారి శరీరపు శక్తిని అనుసరించే పనిచేస్తూ ఉంటుంది. కాని సహపంక్తిలొ కూర్చున్నప్పుడు దాదాపు అందరి శరీరాల్లోని విద్యుత్ నియంత్రణ అందరిలో ఒకేలా ఉంటుంది. అటువంటప్పుడు తక్కువ శక్తితో ఉన్న వ్యక్తీ అందరి కంటే ముందుగా లేచినచో మిగిలిన వారి శక్తి అతనికి ఎంతోకొంత వెళ్ళిపోతుంd కనుకనే సహపంక్తి బోజనానిికి కుర్చున్నప్పుడు ఎవరు ముందు తిన్నా, ఎవరు వెనక తిన్నా, అందరూ ఒకేసారి లేవాలన్న నియమం పూర్వకాలం నుండి ఆచరణలో ఉంది.*

*🔹దేవతా లక్షణాలు ఏవి ❓🔹*

1. రెప్పపాటు లేకుండుట  

2. భూమి మీద పాదాలు ఆనించ కుండా ఉండుట 

3. వ్యసనం లేకుండా ఉండుట.

*🔹నవ వ్యాకరణాలు అనగా ఏవి ❓🔹*

1. పాణి నీయం 

2. కలాపం 

3. సుపద్మం 

4. సారస్వతం 

5. ప్రాతిశాఖ్యం (కుమార వ్యాకరణం) 

6. ఐంద్రం 

7. వ్యాఘ్ర బౌతికం 

8. శాఖటా యానం 

9. శాకల్యం*

*🔹 శ్రీ రాముని జన్మనక్షత్రం, మాసం ఎప్పుడు ❓🔹*

*🔸శ్రీ రాముడు చైత్ర మాసం, నవమి తిధిలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. ఆయన జన్మ నక్షత్రం పునర్వసు.*

*🔹 పర్వ దినాలలో వడపప్పుని ఎందుకు పెడతారు ❓🔹* 

*🔹 భగవంతుడికి ప్రతి పండగనాడు వడపప్పుని , చలిమిడిని తప్పకుండా చేసి పెడతారు. అలాగే తల స్నానం చేసి ఆయా దేవుళ్ళకి ఇష్టమైన పిండి వంటలు చేయడం వల్ల వేడి చేసి తిన్న పిండి వంటలు సరిగ్గా అరగవు. తద్వార అనారోగ్యం కలుగుతుంది. ఇటువంటి ఉపద్రవాలు తలెత్తకుండా ఉండటానికి కొన్ని ప్రాంతాలలో వడపప్పు, పానకం, చలిమిడి తప్పకుండా చేస్తారు. పెసరపప్పుతో చేసిన వడపప్పు తినడం వలన తిన్న పిండి వంటలు జీర్ణం అయ్యి వేడి చేయకుండా చలువ చేస్తుంది.*

*🔹 శ్రీ వారి సుప్రభాతాన్ని ఎవరు ఎప్పుడు రచించారు. ❓🔹*

*🔸శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రసిద్ధ సుప్రబాతాన్ని రచించిన వారు శ్రీ ప్రతివాది భయంకర అన్నన్ అనే ఆచార్యులు. వీరు అష్ట దిగ్గజాలుగా ప్రసిద్ధులైన శ్రీ మనవాల మహామునుల శిష్యులలో ప్రముఖులు వీరు క్రీ .శ . 1361 లొ జన్మించి 1454 వరకు అంటే 93 సంవత్సరాలు జీవించి ఉన్నారని పరిశోధకుల అభిప్రాయం. వీరు తమ జీవిత కాలంలో అనేక కృతులు రచించారు. వీరి రచనలలో శ్రీ స్వామివారి సుప్రబాతం అనన్య సామాన్యమైన ప్రచారం పొందింది.*

*🔹పంచ కోశాలు అంటే ఏమిటి ❓🔹*

1. అన్నమయ కోశం. 

2. ప్రాణమయ కోశం 

3. మనోమయ కోశం 

4. విజ్ఞానమయ కోశం 

5. ఆనందమయ కోశం

*🔹శౌచమంటే ఏమిటి ❓🔹*

*🔸శుచి అంటే శుభ్రము , శుద్ధము. ధర్మాది పరీక్షల చేత భాహ్య అంతరములలో పరిశుద్దిని పొందుటయే "శౌచం" అనబడును. శౌచం రెండు విధములు*

1. బాహ్య శౌచం.

2. అంతః శౌచం*

*🔸భాహ్య శౌచం - శరీరం పైన ఉండే మలినాలను పోగొట్టుకోవడానికి చేసే స్నానాదులు, శరీరం పరిశుద్ధం గా ఉండేందుకు పూసే సుగంద ద్రవ్యాలు వంటివి. వీటిని భాహ్య శౌచం అంటారు.*

*🔸అంతః శౌచం - మనస్సులో ఎటువంటి చెడు భావాలు లేకుండా అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద , వాత్సర్యాలు లేకుండా నిర్మలమైన అంతహకరణను కలిగి ఉండటమే అంతః శౌచం అనబడను. అంతః శౌచం మనస్సుకి సంభందించినది. కాబట్టి దీనికి శాస్త్రాలలో అదిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.*

*🔹ఏయే ప్రదేశాల్లో జపం చేస్తే ఎంతెంత ఫలితం ❓🔹*

*🔸ఇంట్లో చేసే జపానికి సత్ఫలితమే ఉంటుంది . కాని ఇంట్లో జపం చేస్తే అంతే ఫలితం ఉంటుంది. అదే జపాన్ని నది పరీవాహక ప్రాంతాల్లో చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది . గోశాలలో చేసే జపం వల్ల వందరెట్ల ఫలితం ఉంటుంది. యాగశాలలో చేసే జపం వలన వందరెట్ల కంటే అధికమైన ఫలితం వస్తుంది. దేవాలయాలలో , పుణ్య ప్రదేశాలలో చేసే జపం వలన పదివేల రెట్లు ఫలితం కలుగుతుంది. శివాలయాలలో, శివ సాన్నిద్యం నందు చేసే జపం వలన అత్యున్నతమైన ఫలితం దక్కుతుంది.*

*🔹రావణుడు ప్రతిష్టించిన 6 శివ లింగాలు ఏవి ❓🔹*

1. వైద్యనాధ లింగం. 

2. వక్రేశ్వర నాద లింగం. 

3. సిద్ధినాద లింగం. 

4. తారకేశ్వర లింగం. 

5. ఘటేశ్వర లింగం. 

6. కపిలేశ్వర లింగం.

*🔹పదనాలుగు లోకాలలో ఎవరెవరు ఉంటారు ❓🔹*

*🔸పదనాలుగు లోకాలలోని మొదటి మూడు లోకాల్లోను అంటే భూలోకం , భువర్లోకం, స్వర్లోకాలను "కృతక లోకాలు" అంటారు. జీవులు తాము చేసుకొన్న కర్మఫలాన్ని బట్టి ఈ మూడు లొకాల్లొను ఉంటారు. నాల్గొవదైన మహర్లోకం కల్పాన్తములో కూడా నశించదు. ఈ లొకంలొ కల్పాంత జీవులు ఉంటారు. అయిదోవది అయిన జనలోకంలొ బ్రహ్మ దేవుని మానస పుత్రులైన సనక సనందన సనత్కుమారాదులు నివసిస్తారు. ఆరొవదైన తపోలోకంలో దోష వర్జితులు , దేహ రహితులు అయిన వైరాజులనే వారు ఉంటదము.* 

6. మాత్స్చార్యము .

7. రాగము. 

8. ద్వేషము. 

9. ఈర్ష్య . 

10. అసూయ

11. దర్పము. 

12. దంబము. 

13. అహంకార దోషము.

*🔹భగవంతుడికి నివేదించే సమయంలొ గుర్తు ఉంచుకోవలసినవి ❓🔹*

*🔸భగవంతుడికి నివేధించేప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయరాదు. తెలిసి చెసినా, తెలియక చేసినా తప్పు తప్పే అంటారు. కనుక నివేధించేప్పుడు ప్రతివారు తప్పక చేయవలసినవి.*

*1. దేవునికి నైవేద్యం గా పెట్టడానికి చేసిన వంటకాలలో నుంచి కొంత విడిగా తీయరాదు. పాత్ర మొత్తాన్ని దేవుని ఎదుట పెట్టాలి.*

 *2. పదార్ధాలు వేడిగా ఉన్నప్పుడు నివేదిన్చరాదు . చల్లారాక పెట్టాలి.*

*3. నివేదనలో మంచినీటిని కుడా తప్పనిసరిగా పెట్టాలి.*

 *4. నివేదించే వంటకాలలో పంచదారకు బదులు బెల్లం వాడాలి.*

*🔹ఊర్ధ్వ పుండ్ర ములు ఎందుకు ధరిస్తారు ❓🔹*

*🔸 ఆర్య మతంలో ముఖ ధారణం (బొట్టు) ఒక ఆర్ష సాంప్రదాయంగా ఏర్పడింది. అది త్రి పుండ్రము, ఊర్ధ్వ పుండ్రము అని రెండు రకాలుగా విభజించబడింది. వైష్ణవులు ఊర్ధ్వ పుండ్రములు  ధరిస్తారు. స్త్రీలు తిలకధారణ చేస్తారు. తిరుమణిని నిలువునా మూడు రేఖలుగా ధరించడంనే ఊర్ధ్వ పుండ్ర దారణ అంటారు. ఈ మూడు రేఖలు అకార, ఉకార, మకార స్వరూపమైన ప్రనవాన్ని సూచిస్తాయి.*

అకారం - సత్వ స్వరుపడైన శ్రీ మహావిష్ణువును, 

ఉకారం - చిత్వ స్వరూపిణి అయిన మహాలక్ష్మిని, 

మకారం  భగవద్భాక్తులైన భాగవతులను తెలియజేస్తాయని చెబుతారు.

*శైవులు భస్మాన్ని మూడు అడ్డరేకులుగా నుదుట ధరిస్తారు.*

*🔸తిరుమణి మట్టికి సంభందించినది . కావున అది మట్టి నుండి కలిగిన ఈ శరీరం చివరికి మట్టిలోనే కలిసిపోతుందని సుచిస్తుంది. ఇందువల్ల వైరాగ్యం కలుగుతుంది. ముక్తి కోరేవానికి వైరాగ్యం చాలా ముఖ్యం. విభూతి దారణ కూడా ఈ శరీరం చివరికి బూడిద అయ్యేది అనే తత్వాన్ని నిర్దేశిస్తుంది. ముఖ దారణ లేకుండా చేసే సత్కర్మలు నిరర్ధకాలు అని ఆగమాలు పేర్కొన్నాయి. ద్వాదశ (12) ఊర్ధ్వ పుండ్రములు ధరించడం కూడా కద్దు. నాడులు, హృదయం మొదలయిన శరీర భాగములను చల్లబరుచుటకు కూడా ఆయా స్థానములలో ఊర్ధ్వ పుండ్ర దారణ అవసరమయిన వైజ్ఞానికంగా విశ్లేషణ చేసి కొంతమంది వివరిస్తున్నారు. ఉర్ధ్వ పుండ్రం లొ ఉపయొగించే వస్తువులకు చల్లదనం కలిగించే లక్షణం ఉంది.*

*🔹నదులలోను, సముద్రాలలోను పవిత్ర స్నానాలు చేసేప్పుడు పాటించవలసిన నియమాలు ఏవి ❓🔹*

*🔸నదీ స్నానం , సముద్ర స్నానం వంటివి చేసే ముందు నదీ స్నానం అయితే నదీమ తల్లిని, సముద్ర స్నానం అయితే సముద్రున్ని, అనంతరం క్షేత్ర దేవతల్ని, మనస్సులొ స్మరించుకొని సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి. రాత్రి పూట నిద్రించే టైములో ఒంటిపై ధరించిన వస్త్రాలతో నదిలో మునగరాదు. ఈ బట్టలను విడిచి శుభ్రమైన వస్త్రములను ధరించాలి. పుణ్య నదులలో పాప పరిహారార్ధం చేసే పవిత్ర స్నానముల సమయంలొ ఖచ్చితమైన నియమాలు పాటించి తీరాలి. స్నాన అనంతరం ఆ బట్టల్ని నదుల్లో పిండ రాదు అలాగే సబ్బులను ఉపయొగించి కూడా బట్టలను ఉతకరాదు. అభ్యంగ స్నానం అంటే కుంకుళ్ళు, షాంపులు మొదలయిన వాటిని ఉపయొగించి తలంటు స్నానం చేయరాదు.  పొరబాటున కూడా నదిలోగాని, నదీ తీరాల్లోగాని మలముత్రాలు విసర్జిన్చరాదు. ఈ నియమానికి వ్యతిరేకంగా  చేస్తే పాపం అంటుతుంది. ఆఖరికి నీళ్లను పుక్కిలించి ఉమ్మి వేసినా కూడా మహా దొషం అవుతుంది. పవిత్ర స్నానములు ఆచరించే సమయంలో అమంగళ కరమైన మాటలు మాట్లడకుడదు. కసురుకోవడం, కోప్పడటం, వంటివి చేయకూడదు. సముద్ర స్నానం కేవలం పర్వదినములలో  మాత్రమే చేయాలి. మాములు సమయాలలో సముద్రాన్ని తాకకూడదు. స్నానం చెసే ముందు సంకల్పం చెప్పుకోవాలి.*

ఆత్రేయ గారి

 🍃🥀 *ఆచార్య ఆత్రేయ గారి జీవితంలోని ఒక సరదా సంఘటన..వారి జయంతి సందర్బంగా..*


*మనసుకవి ఆత్రేయ పాట రాసే విధానం చాలా వింతగా ఉంటుంది..పగలంతా పిచ్చాపాటీతో కాలం గడుపుతారు. డాన్పించ్ సిగరేట్సు..పళ్లెం నిండా ప్రూట్సు..వుండి తీరాలి. అసిస్టెంట్ డైరెక్టరు పాట రాయించుకోడం కోసం,పెన్నూ పేపర్లూ పాడ్‌తో రెడీగా వుంటాడు. ఆ పెన్ను అలాగే వుంటుంది. ప్రూట్సు ఒకటీ అరా అవుతాయి. సిగరెట్లు మొత్తం ఖాళీ అవుతాయి. ఆయన నిద్రలోకి జారుకుంటాడు..*


*అంతే!*

*మళ్లీ సాయంత్రం.*

*ఫ్రెష్ష్‌గా స్నానం*

*ధవళ వస్త్రాలు ధరించడం* *సిగరెట్ వెలిగించడం.*

*‘‘ఎందాకా వచ్చాం?*

*‘‘ఏదీ... మొదలు పెట్టందే!’’*

*‘‘మొదలుపెడితే పాట* *పూర్తయినట్లే కదరా!* 

*ఆ మొదలు దొరకడం లేదు. ఓ మాట అనండి!’’*

*‘‘వేడి కాఫీ చెప్పు!’’*

*ఇలా వుంటుంది ఆయన ధోరణి..*


*పాట పూర్తికాదు.*

*గంటలు.. రోజులు.. వారాలు గడుస్తుంటాయి.*

*‘‘పాట’’ పుట్టదు.*

*హోటలు అద్దె పెరిగిపోతుంది.* *ప్రొడ్యూసరు లబోదిబోమంటాడు.* *సరిగ్గా ఇలా జరిగింది,* *పద్మశ్రీ పి పుల్లయ్యగారి మురళీకృష్ణ చిత్రానికి.*

*ఇద్దరిమధ్య మంచి చనువుంది. తిట్లూ-పొగడ్తలూ సర్వసాధారణం..*


*ఆరోజు అమీతుమీ తేల్చుకోడానికి పుల్లయ్యగారొచ్చారు..*

*‘‘పాట వొచ్చిందా?’’ పుల్లయ్యగారు.*

*‘‘వొచ్చి చచ్చింది!’’ ఆత్రేయ సమాధానం.*

*‘‘నన్ను చంపకు. ఇక రూమ్ వెకేట్‌చేసి బయలుదేరు!’’*

*‘‘ఆ మాటకోసమే ఎదురుచూస్తున్నాను’’*

*‘‘సిగ్గులేదూ నీకు!’’*

*‘‘వుంటే సినిమాలకెందుకు పనిచేస్తాను!’’*


*వీరి మాటల్లో బూతులు సర్వసాధారణం.* *అవి వ్రాయదగ్గవి కాదు.*

*కారు ఆత్రేయగారింటికేసి దూసుకుపోతోంది వేగంగా..*

*అంతకుమించిన వేగంతో వారిమధ్య మాటల యుద్ధం జరుగుతోంది.*

*పుల్లయ్యగారి ముఖంలో కోపం. ఆత్రేయ ముఖంలో చిరునవ్వు..*


*‘‘దిగూ! నువ్వు ఎక్కడవున్నా- నువ్వు సుఖంగా వుండాలనే కోరుకుంటాను!’’* *అన్నాడు పుల్లయ్యగారు.*

*అంతే! ఏదో ఫ్లాష్ వెలిగింది.*

*కారు తిప్పు మన ఆఫీసుకి* *పోనివ్వు..* *అన్నాడు ఆత్రేయ*

*‘‘ఏం ఉద్ధరిద్దామని!’’*

*ఇలా పోనియ్యవయ్యా!...*

*ఆఫీసు చేరుకుంది కారు..*


 🥀 *‘‘ఎక్కడవున్నా- ఏమైనా’’*

*మనమెవరికి వారై వేరైనా...*

*నీ సుఖమే నే కోరుతున్నా*

*నిను వీడి అందుకే వెళుతున్నా- సాకీ...పల్లవి. వచ్చేసింది.*


🥀 *అనుకున్నామని జరగవు అన్ని*

*అనుకోలేదని ఆగవు కొన్ని*

*జరిగేవన్నీ మంచికనీ,*

*అనుకోవడమే మనిషి పనీ*  

చరణం వొచ్చేసింది-

ఇక రెండవ చరణం-


🥀 *పసిపాప వలే ఒడిజేర్చినాను*

*కనుపాప వలే కాపాడినాను*

*గుండెను గుడిగా చేశాను!!2!!*

*నువు వుండలేనని వెళ్ళావు !! నీ సుఖమే !!*


🥀 *వలచుట తెలిసిన నా మనసునకు*

*మరచుట మాత్రము తెలియనిదా*

*మనసిచ్చినదే నిజమైతే*

*మన్నించుటయె ఋజువుకదా*- 

*మూడవ చరణం వచ్చేసింది..*


👉🏾ముక్తాయింపు వుండాలి కదా-

*‘‘నీ కలలే కమ్మగ పండనీ.*

*నా తలపే నీలో వాడనీ*

*కలకాలం చల్లగ ఉండాలనీ..*

*దీవిస్తున్నా.. నా దేవినీ..!!2!!* ॥ *ఎక్కడవున్నా*॥

*పాట అయిపోయింది..*


🤣☺😥 *పుల్లయ్యగారికి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. ఆత్రేయ చేతుల్ని ముద్దుపెట్టుకొని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు..*


🎻 *ఈ పాట మాస్టర్ వేణు చేతుల్లో పడింది*. *ఆయన ట్యూను చేస్తూ ఏడవడం మొదలుపెట్టాడు. ఘంటసాల మాస్టారు విన్నారు. ఆయన ఆ పాటకి ప్రాణం పోశారు. ఘంటసాల గారికి అత్యంత ఇష్టమైన పాట..*


*వేణు మాస్టారికి ప్రాణం ఈ పాట.*

*పుల్లయ్యగారికి ఈ పాట ఆరో ప్రాణం అయింది*

*అక్కినేని నట జీవితంలో పూర్ణాయుష్షు నింపుకున్న పాట ఇది!*

 🤔 *అయితే ఆత్రేయకిది కేవలం ‘పాట విడుపు’ మాత్రమే!* 


👏👏Recd.from 

*:Srivవల్లూరి సూర్యప్రకాష్ ఎన్టీపీసి రామగుండం*


💥💥🙏🙏

రోటి పచ్చళ్ళు

 రోటి పచ్చళ్ళు

                                         -- ముత్తేవి  రవీంద్రనాథ్. 


                       మా గుంటూరు జిల్లా వాళ్లకి రోటి పచ్చళ్ళు - ప్రత్యేకించి గోంగూర పచ్చడి - అంటే ఎంత ఇష్టమో ఎవరికీ ప్రత్యేకంగా  చెప్పాల్సిన పనిలేదనుకుంటాను. ఎందుకంటే అది  జగమెరిగిన సత్యం. ఇంట్లో నాకు ఇష్టమైన   రోటి పచ్చళ్ళు   చేసిన రోజు నేనైతే కూరల జోలికి వెళ్ళే పనే ఉండదు.   బాగా నెయ్యి పోసుకుని అన్నంలో ఆ పచ్చడి రెండు మూడు సార్లు కలుపుకు తినడం,  ఆఖరికి మజ్జిగ అన్నంలోనూ ఆ  రోటి పచ్చడినే లొట్టలు వేసుకుంటూ నంజుకు తినడం నాకు చిన్నప్పట్నుంచీ అలవాటు. మిక్సీలో వేసి మెత్తగా నలిగిన పచ్చళ్ళ కంటే పచ్చడి బండతో కచ్చాపచ్చాగా రోట్లో నూరిన రోటి పచ్చళ్ళే రుచిలో శ్రేష్ఠం. అయితే మన అమ్మమ్మలూ, అమ్మల రోజులతోనే రోటి పచ్చళ్ళకు  కాలం  చెల్లిందనే చెప్పుకోవాలి. ఇంకా రోలూ, పచ్చడి బండ వాడుతూ రోటి పచ్చళ్ళు నూరుతున్న  వాళ్ళు మన మధ్యతరగతి  గృహిణులలో  కూడా ఎందరు మిగిలారంటారు ? మిక్సీలో వేసి  తయారు  చేసిన తాజా పచ్చళ్ళను 'రోటి పచ్చళ్ళు'  అని  పిలుచుకుంటున్నామంతే !  రోటి పచ్చళ్ళకు తిరిగి జవం, జీవం  తెచ్చేందుకు మిత్రులు  వాసిరెడ్డి వేణుగోపాల్ గారు చేస్తున్న  భగీరథ ప్రయత్నం చూశాక నాకు  తెలిసిన  రెండు ముక్కలు రాసి, ఆ ప్రయత్నానికి  దన్నుగా నేనూ ఒక చెయ్యి వేద్దామనిపించి ఇది రాస్తున్నా.  గోంగూరతో మనం ఎన్నో విధాలుగా రోటి పచ్చళ్ళు నూరుకోవచ్చు. గోంగూర తాజా రోటి పచ్చడి రుచే వేరు. అన్నంలో గోంగూర పచ్చడి కలుపుకుని నేతికి బదులుగా కాస్త నువ్వులనూనె వేసుకుని,  ఒక పచ్చి మిరపకాయో, పెద్ద  ఉల్లిపాయో అందులో నంజుకు తింటారు మా  జిల్లా వాళ్ళు. మిరప పళ్ళ గోంగూర,  పులిహార( పుళిహోర) గోంగూర వంటివి ఊరగాయగా పెట్టుకుని అవసరమైనప్పుడు తగినన్ని ఉల్లిపాయ ముక్కలు చేర్చి, తిరుగమోత వేసుకుని నోరూరించే తాజా రోటి పచ్చళ్ళు తయారు చేసుకుంటారు. ఇక బండ గోంగూర లేక ఉప్పు గోంగూర అనే పేరుతో ఒక నిల్వ పచ్చడి కూడా చేసుకుంటాం. పచ్చి గోంగూరను బాండీలో నూనె లేకుండా వేయించి, తగినంత ఉప్పు, పసుపు  మాత్రం చేర్చి,  రోటిలో కచ్చా పచ్చాగా తొక్కి జాడీలలో నిల్వ చేసుకుంటాం. అవసరమైనప్పుడు జాడీ లోంచి కాస్త బండ గోంగూర పచ్చడి తీసి, దానికి తగినన్ని పచ్చి మిరపకాయల్ని నూనెలో వేయించి చేర్చి రోటిలో నూరి, ఉల్లిపాయ ముక్కలతో  తిరుగమోత వేసుకుంటే రుచికరమైన తాజా రోటి పచ్చడి సిద్ధం. గోంగూర రోటి పచ్చడి రుచిలో  రక్తి కట్టాలంటే అందుకు ఒక కిటుకు ఉంది. పచ్చడి  నూరేటప్పుడు తరిగిన ఉల్లిపాయ  ముక్కలు కాకుండా నేరుగా పొట్టు తీసిన పెద్ద ఉల్లిపాయలనే రోట్లో వేసి, పచ్చడి బండతో  కచ్చాపచ్చాగా తొక్కి చూడండి.  ఆ  పచ్చడి రుచి రెట్టింపు అవడం ఖాయం.  కంది పచ్చడి, పెసర పచ్చడి నూరుకునేటప్పుడు కూడా ఈ  చిట్కా పాటిస్తే ఆ  రోటి పచ్చళ్ళు  మరింత నోటికి ఇంపుగా ఉంటాయి. కొందరైతే పొట్టు తీసిన నీరుల్లిపాయల్ని పచ్చడి అన్నంలో నంజుడుగా ఆబగా కొరుక్కు తింటారు. అది మరీ బాగు. ఉద్యోగరీత్యా నేను కొంతకాలం  కృష్ణా జిల్లా నందిగామలో ఉన్నప్పుడు అక్కడి  ఒక మెస్ లో కొంతకాలం పాటు భోజనం చేశాను.  అక్కడ అంతకు పూర్వం నేనెరుగని పుల్ల గోంగూర, నూనె గోంగూర వంటి ఏడెనిమిది రకాల గోంగూర రోటి పచ్చళ్ళు నేను రుచి చూశాను. ఒకరకం గోంగూర పచ్చడిలో గోంగూరను కాడలతో సహా వేస్తారు.  అప్పట్లో ఆ మెస్ నిర్వహించిన సోదరులు  మనం అడిగినంత స్వచ్చమైన నేతిని మళ్ళీ  మళ్ళీ  వడ్డిస్తూ,  చూపించిన  ఆ  పచ్చళ్ళ రుచులు  నేను నా  జీవితంలో ఎన్నటికీ మరువలేను. ఆ  అనుభవంతో ‘ గోంగూర పచ్చళ్ళ విషయంలో మా  గుంటూరు జిల్లాదే గుత్తాధిపత్యం’ అనే  భావన నాలో  తొలగిపోయింది.  గోంగూరతో ఎన్నిరకాలైన రోటి పచ్చళ్ళు చేసుకుంటామో అవన్నీ కొత్తిమీరతో కూడా  చేసుకోవచ్చు.   


                   ఇక మిగిలిన రోటి పచ్చళ్ళలో నాకు బాగా  ఇష్టమైనవి రెండు. అవి : 

1) వాక్కాయ - కొబ్బరి పచ్చడి 3) పండు కాకరకాయ పచ్చడి.  మొదట్నుంచీ రకరకాల రుచులంటే చెవి (నాలుక) కోసుకోవడమే గానీ నాకుగా  ఎలాంటి పాకప్రావీణ్యం లేదు. అందుకే నా  శ్రీమతి రాజ్యలక్ష్మిని సంప్రదించి నాకు బాగా ఇష్టమైన రోటిపచ్చళ్ళ తయారీ విధానాన్ని కొంతవరకు అవగాహన చేసుకున్నాను. నేను అర్థం చేసుకున్న మేరకు వాటిని మీ ముందుంచుతాను. ముందుగా పండు కాకరకాయ పచ్చడి సంగతేమిటో చూద్దాం.   


పండు కాకరకాయ పచ్చడి.

 

                ఇందుకు అవసరమైన పదార్థాలు :

 

                     1)  పండు కాకరకాయలు - ¼  కిలో 

                      2) చింతపండు -       50 గ్రాములు. 

                      3) సాంబారు(సంబారు) కారం- 50 గ్రాములు. 

                      4) ఉప్పు           -    సరిపడా

                      5) బెల్లం            -  100 గ్రాములు. 

                      6) నూనె           -   100 గ్రాములు.


                  తయారుచేసే విధానం :

 

              ముందుగా ఒకటి నుంచి ఐదు వరకు పేర్కొన్న  దినుసులను రోటిలో మెత్తగా నూరాలి. ఆ  మెత్తటి  పేస్టులా నూరిన ముద్దను   వేరుగా  ఉంచుకోవాలి. ఆ  తరువాత  పొయ్యిమీది బాండీలో 100 గ్రాముల నూనెపోసి, కాగిన తరువాత  రెండు ఎండు మిరపకాయలు, కొద్దిగా మినప పప్పు, పచ్చి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ వేసి, వేగిన తరువాత ముందు నూరి పెట్టుకున్న ముద్దను తాలింపులో వేసి, కలియదిప్పి సన్నటి సెగ మీద కాసేపు బాగా మగ్గనివ్వాలి. చల్లారిన తరువాత వడ్డించాలి. ఈ  రోటి పచ్చడి ఎంతో  రుచికరంగా ఉండడమే కాదు; ఆరోగ్యదాయకం  కూడా. 


వాక్కాయలు - కొబ్బరి పచ్చడి 


             కొబ్బరి పచ్చడిది రుచిలో రోటి పచ్చళ్ళు అన్నింట్లోకీ అగ్రస్థానం. కొందరు పచ్చి కొబ్బరిని తురిమి దానిలో పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, వెల్లుల్లి,  జీలకర్ర మొదలైన ద్రవ్యాల  పేస్టును కలిపి, తిరుగమోత వేసుకుని  కొబ్బరి పచ్చడి తయారు చేసుకుంటారు. మరికొందరు నూనెలో వేయించిన  పచ్చి మిరప కాయలకు, పచ్చి కొబ్బరి ముక్కలతో పాటు చింతపండు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి  మొదలైన ద్రవ్యాలు చేర్చి,   మిక్సీలో మెత్తగా నూరి  తిరుగమోత వేస్తారు. తురిమిన కొబ్బరితో చేసినా, మిక్సీలో వేసినా కొబ్బరి పచ్చడి పెద్దగా రుచిగా ఉండదు. అదే నూనెలో వేయించిన  పచ్చి మిర్చికి  పచ్చికొబ్బరి,  తదితర దినుసుల్ని చేర్చి రోటిలో కచ్చాపచ్చాగా పచ్చడిబండతో నూరి తిరుగమోత వేసిన కొబ్బరి పచ్చడి రుచి అమోఘంగా ఉంటుంది. మిక్సీలో మెత్తగా నూరిన పచ్చడి కంటే మన పళ్లకు పనిచెప్పి, మనం  బాగా నమిలి తిన్నప్పుడే కొబ్బరి పచ్చడి  అసలు రుచి మనకు తెలుస్తుంది. కొబ్బరి పచ్చడిలో పుల్లదనం కోసం సాధారణంగా చింతపండు వాడతారు. పచ్చి మామిడి కాయలు దొరికితే చింతపండుకు బదులుగా మామిడి ముక్కలు వేసుకుంటారు. ఇప్పుడు మనం  చెప్పుకోబోయేది పుల్లదనం కోసం వాక్కాయలు వాడి చేసే కొబ్బరి పచ్చడి గురించి. చిట్టడవులలోనూ, కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఊరు  వెలుపల  వాక మొక్కలు ముళ్ళ  పొదలుగా పెరుగుతాయి. కొందరు వాక్కాయలనే కలే కాయలనీ అంటారు. వీటిలో రెండు మూడు రకాలున్నాయి. ఇవి వేసవిలో ఎక్కువగా లభిస్తాయి. పట్టణాలలోని మార్కెట్లలో అప్పుడప్పుడూ లభించే  ఈ  పుల్లటి వాక్కాయలను మనం పప్పులో వేసుకుంటాం. వాక్కాయ పులిహార చేసుకుంటాం. వాక్కాయలతో కొబ్బరి పచ్చడి కూడా  చేసుకోవచ్చు. అదెలాగో  ఇప్పుడు  చూద్దాం. 


కావలసిన పదార్థాలు : 


                 వాక్కాయలు - ¼ కిలో 

                 పెద్దసైజు పచ్చి కొబ్బరికాయ- 1

                 పచ్చి మిర్చి- 50 గ్రాములు. 

                 తగినంత ఉప్పు, పసుపు, వెల్లుల్లి , జీల కర్ర, తిరుగమోత దినుసులు, నాలుగు   టేబుల్  స్పూన్ల  నూనె.


  తయారు చేసే విధానం: 


             ముందుగా పచ్చి కొబ్బరిని ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. వాక్కాయలను శుభ్రంగా కడిగి, గుడ్డతో తుడిచి, చిన్న చాకు  లేదా పిన్నీసుతో వాటిని నిలువునా చీరి, లోపలి చేదు పప్పును తీసివేసి, ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.  వాక్కాయ ముక్కల్నీ, పచ్చి మిర్చినీ రెండు టేబుల్ స్పూన్ల నూనెలో దోరగా వేయించి, దించి ఆ  తరువాత పచ్చి కొబ్బరి ముక్కలు చేర్చి రోటిలో నూరాలి. కొబ్బరి బాగా నలిగాక తగినంత  ఉప్పు, పసుపు, జీలకర్ర, వెల్లుల్లి, వేసుకుంటే అతి కొద్దిగా చింతపండు కూడా  కలిపి తిరిగి రోటిలో నూరాలి. తరువాత బాండీలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె కాగిన తరువాత  తిరుగమోత దినుసులు వేసి, అవి దోరగా వేగాక, దానిలో  నూరిన ఆ  పచ్చడి  ముద్దను వేసి, సన్నటి సెగపై కాసేపు మగ్గనిచ్చి దించేసి, చల్లారిన తరువాత వడ్డించాలి. ఈ  పచ్చడి ఎంతో  రుచిగా ఉంటుంది. వాక్కాయలకు దప్పిక పోగొట్టే గుణం మాత్రమే  కాక,  నోటి అరుచి (anorexia)ని  పోగొట్టి,  ఆకలి పుట్టించే  గుణం కూడా ఉన్నందున వైద్యపరంగా వాక్కాయ- కొబ్బరి పచ్చడి మనకి ఎంతో  మేలు చేస్తుంది.

సయాటికా నొప్పి

 సయాటికా నొప్పి  -  తీసుకోవలసిన జాగ్రత్తలు .


   వైద్య వృత్తిలో ఉన్న ప్రతి డాక్టర్ దగ్గరకు 

సర్వసాధారణంగా వచ్చే కేసులలో ప్రధానం అయినది సయాటికా . ఈ పదం కాలిలో ఉన్న సయాటికా నరం తాలూకు inflamation ని సూచించినా నిజంగా సయాటికా నరం వ్యాధిగ్రస్తం అవ్వడం అనేది ఎంతో అరుదుగా కాని కనిపించదు. 


              ఉదాహరణకు మధుమేహంలో ఈ నరం వ్యాధిగ్రస్తం అవ్వవచ్చు. అలాగే ఇంజక్షన్ ని సరైన స్థలంలో ఇవ్వనప్పుడు కూడా సూది మొన నరానికి తగిలి వాపుకి గురికావొచ్చు. దాదాపు ఇలాగే నడుము ప్రాంతంలో వెన్నముక నుంచి బయటకు వచ్చే సయాటికా నరం మీద వత్తిడి ఏర్పడినపుడు అది కాలిలో వెళ్ళినంత మేర సలుపులు , నొప్పి అనుభవం అవుతాయి. 


          ఈ వత్తిడి అనేది వెన్నపుసల మద్యలో ఉండే డిస్క్ లు తొలగడం వలన ఏర్పడవచ్చు చుట్టుపక్కల కండరాలు , లిగమెంట్లు వాపుకి గురికావడం వలన ఏర్పడవచ్చు . లేదా ఈ నిర్మాణాలు గట్టిపడిపోయి ఫైబ్రస్ గా తయారు అవ్వడం కూడా ఏర్పడవచ్చు . కనుక మనం సాధారణంగా చూసే సయాటికాకు , నరాలు వాపు నకు గురికావడం వలన వచ్చే న్యురరైటిస్ కి సంభంధం లేదు . ఈ రెండు స్థితులు ఒకేసమయంలో ఉండొచ్చు.


         సయాటికా నొప్పి నడుము ప్రాంతంలో ఉండే వెన్నపూసలు క్షయానికి ( డీ జనరేషన్ ) లొను కావడం వలన ఏర్పడే పర్యావసన లక్షణం మాత్రమే సయాటికా నొప్పి లక్షణాలు ఆయుర్వేదంలో        గృ ధసీవాతం అని పిలుస్తారు .


  లక్షణాలు  - 


     నడుమునొప్పి ఉంటుంది. అయితే ఎప్పుడు ఉండాలి అని నియమం లేదు . దీనికంటే కుడికాలిలో నొప్పి ప్రధానంగా ఉంటుంది. పిరుదుల లొపల నుంచి నొప్పి మొదలై నరం వెళ్లే ప్రాంతం అంతా తోడ వెనకపక్కన , పిక్కల లొపల , పాదం వెలుపలి వైపు నొప్పి వ్యాపిస్తుంది.


            ముఖ్యంగా ముందుకు వంగినప్పుడు , దగ్గినప్పుడు , తుమ్మినప్పుడు , నడుములో నొప్పి స్పష్టంగా తెలుస్తుంది. కొంచం దూరం నడిస్తే కాలులో నొప్పి రావడం అనేది దీనిలో ప్రధాన లక్షణం. కాలులో తిమ్మిరి పట్టినట్లు కాని , సూదులతో గుచ్చినట్టుగా కాని అనిపించవచ్చు. ఈ చివరి లక్షణం వ్యాధి తాలూకు తీవ్రత సూచిస్తుంది .


              సయాటికా నొప్పిని నిర్ధారించడానికి ఒక పద్ధతి ఉంది. బల్లమీద వెల్లికిలా పడుకొని కాలుని నిటారుగా పైకి లేపండి ఇలా చేసేప్పుడు ఒక వేళ మీకు నడుము ప్రాంతంలో నొప్పి అనిపిస్తే సయాటికా ఉన్నట్లు లెక్క . మీరు కాలుని ఎంత ఎత్తు వరకు లేపగలరు అన్నదానిని ఆధారం చేసుకోని వ్యాధి తీవ్రతను అంచనా కట్టవచ్చు.సయాటికా వ్యాధిని గుర్తించడానికి          X - ray పరీక్షల కంటే పైన పేర్కొన్న పరీక్ష బాగా ఉపయోగపడుతుంది.


  సలహాలు  -  సూచనలు   - 


    సయాటికానోప్పి ఉన్నప్పుడు నొప్పి తగ్గించే మాత్రలను యధేచ్చగా కొనుక్కొని వాడటం అంత మంచిది కాదు. అల్లోపతి మందులు నొప్పిని అదిమిపట్టి లక్షణాలు దాచేస్తాయి. విశ్రాంతి తీసుకునే అవసరం మీకు కనిపించదు. 


            వెన్నముకలో అరుగుదల యదావిధిగా కొనసాగి చివరికి వెన్నపూసలు బాగుచేయలేని విధంగా దెబ్బతింటాయి. ఇలా కాకుండా నొప్పి తెలుస్తూ ఉండటమే మంచిది. దీనివలన విశ్రాంతి తీసుకోవడం అనేది మీకు తప్పనిసరి అవుతుంది. 


         సయాటికా లో ప్రదానమైన చికిత్స విశ్రాంతి. గట్టిబల్లపైన విశ్రాంతి గా వెల్లికిలా పడుకోవాలి. దిండు వాడకుడదు. మెడ వంపులో తువ్వాలను మెత్తగా అముర్చుకోవచ్చు. పక్కకి తిరిగి పడుకోవాలి అనుకున్నప్పుడు కాళ్ళు ముడుచుకుని రెండు కాళ్ళ మధ్య దిండు ని అమర్చుకోవడం చేయాలి . బల్ల మీద దుప్పటి పరుచుకోవచ్చు.


       

       ఈ వ్యాధి చికిత్సలో నేను రసఔషదాలు మరియు మూలికలు కలిపి ప్రయొగించినప్పుడు అద్బుత ఫలితాలు వచ్చాయి . ఈ వ్యాధి చికిత్స కొరకు నన్ను సంప్రదించగలరు .  స్పాండిలైటిస్ మరియు సయాటికా తో ఇబ్బంది పడుతున్నవారు నన్ను సంప్రదించగలరు. 


            ఆపరేషన్ చేయించుకొనవలసిన అవసరం లేదు. 


  గమనిక - 


        పథ్యం చేయగలను అనుకున్నవారు మాత్రమే సంప్రదించగలరు . కామెంట్స్ రూపంలో కాకుండా డైరెక్టుగా ఫొన్ చేయగలరు .


   గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. కొరియర్ చార్జీలు కూడ ఇందులోనే పైన మీరు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు . పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

పెద్దాడపడుచు

 🌹

*పెద్దాడపడుచు! (పాతకథ)* 

            🌷🌷🌷 

            

కాపురానికి పంపిస్తూ  భారతి వాళ్ళమ్మ భారతికి దత్తాత్రేయుడి కధ చెప్పింది. ఆయన లోకంలో 24 మందిని గురువులుగా స్వీకరించారని.. వారినుండి ఏది చెయ్యాలో.. ఏది చెయ్యకూడదో నేర్చుకున్నారట అని చెప్తూ... అత్తారింట కూడా అందరినీ గురువులు గానే భావించి... హంసక్షీర న్యాయంలో మంచీ కూడా చెడ్డా నేర్చుకోమని పాఠం చెప్పి పంపించింది. . 


ఆయనంటే పరమాత్మ స్వరూపుడు కనుక... తన గురువుల ద్వారా మానవజీవితానికి ఆదర్శమైన మార్గదర్శకత్వాలు ఇచ్చాడు. మరి భారతి మానవమాత్రురాలు! ఎలాంటి గురువులను ఎంచుకుంటుందో ఆ సద్గురువుకే ఎరుక! 


అయితే.... ఆమె తల్లి చెప్పిన పాఠం... భారతి..అత్తవారింటికి వెళ్ళిన మొదటిరోజే ఎదురయింది...... తన పెద్దాడపడుచు రూపంలో! 


           భారతి అత్తగారికి పక్షిణీ రావడంతో... కాపురానికి వచ్చిన కొత్తకోడలికి స్వాగతం చెప్పలేక తమ పక్క మేడలోనే ఉండే ఆమె పెద్దకూతురింటికి పంపారు. 


కాలేజీలో ఆఖరిరోజూ.. పెళ్ళిరోజూ ఒకటే కావడంతో భారతికి పెద్దగా పనిపాటల్లో ప్రావీణ్యం చిక్కలేదు. 


పెద్దాడపడుచు గారింట్లో... ఉషోదయాన..ఇలా స్నానం చేసొచ్చిందో లేదో..." వెళ్ళు! వెళ్ళి ఆ దేవుడు మందిరంలో నిర్మాల్యం తీసి, తడిగుడ్డ పెట్టి తుడిచేసి... ముగ్గుతో శంఖుచక్రాలెయ్యి! సజ్జనిండా పూలుకోసుకురా...! ".... ఒకే వాక్యంలో పది పురమాయింపులు...... పెద్దపులిలాంటి పెద్దాడపడుచు నుండి! 


ఆవిడి మాటలధాటికి చిరుతీవెలా వణికింది భారతి మనసు. భీతహరిణిలా అటూ ఇటూ చూసింది. 


తనకేమీ పట్టనట్టు కొబ్బరి కోరుతున్న ఆడపడుచు కూతురికేసి .. అన్యధా శరణం నాస్తి.. అన్నట్టు చూపులతో అభ్యర్ధించింది. 


. తనకెంతో ఇష్టమైన మేనమామ భారతిని చేసుకోవడంతో.. మనసంతా చేదునింపుకున్న ఆ అమ్మాయి ఏమీ పట్టనట్టు తలతిప్పింది. మారు మార్గం లేని భారతి... ఆ మేడిల్లంతా గాలించి... దేవుడు గది వంటింటి పక్కనే ఉంటుందని గ్రహించి... నాలుక్కరుచుకుని పనికుపక్రమించింది. 


నిర్మాల్యం ... అనే పదాన్ని అనేకవిధాల తనకొచ్చిన సంధులు, సమాసాలు, వ్యుత్పత్యర్ధాలలో పెట్టి, పీకినా .. జ్ఞానోదయం కాకపోవడంతో... అక్కడే ఓ పీటమీద చెంపకు చెయ్యి చేరేసి కూర్చుండిపోయింది. 


ఓ ఐదునిమిషాలకు ఏదో మిషమీద లోపలికొచ్చిన ఆడపడుచు కూతురు వేణి... గీరగా చూస్తూ.." పువ్వులు తియ్యి ముందు"... అని ఓ మాట విసిరి పోయింది. మొట్టమొదటి గురువుకు మదిలో దణ్ణం పెట్టుకుని... సింహాసనంలో...నిన్నటి దేవుడి పువ్వులు తీసింది. 


అదే విధంగా ప్రతి ఐదు నిమిషాలకూ ఆ పిల్ల రానూ.... మరింత విస్సాటంగా మాట్లాడుతూ ఒక్కో టాస్కూ పూర్తి చేయించింది. 

మొత్తానికి దేవుడి సామాన్లతో సహా మిలమిలా తోమింపించి... అవన్నీ సర్ది.. వత్తులూ..ఆవునెయ్యి వేయించి.. దేవుడి గదంతా తడిబట్ట పెట్టించి , నాపసుద్దతో ముగ్గులు పెట్టించి.... మధ్యమధ్యలో విసుగులూ, భారతి అజ్ఞానానికి వినోదం చూస్తూ... పూర్తిచేయించింది. 


" పువ్వులెక్కడ కోయాలి?"... అన్న భారతి ప్రశ్నకి.. " ఏం మీ వూళ్ళో పువ్వులు ఆకాశంలో పూస్తాయా యేంటి? .... అని మహా విరసంగా ప్రశ్న సంధించి ... ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేయించి ... అప్పుడు చూపించింది... పెరటితలుపు తీసి... వెనకున్న పూలతోటను! 


       "అబ్బా! ఎంత బాగుందో మీ తోట .."... అంటూ చెంగుచెంగున గెంతుతూ... మందారాలు, నిత్యమల్లి పొదలనూ సుతారంగా ఊపుతూ... వంగుని కుండీల్లో ఉన్న చేమంతులను వేళ్ళమధ్యకు తీసుకుని ఆడిస్తూ... చిక్కని ముదురురంగుల్లో పూసిన  గులాబీల వాసనలు చూస్తూ... చిన్న ధవనం కొమ్మ తుంపి తలలో దోపుకుని... పరవశంతో తిరుగుతున్న భారతి ఆనందానికి అడ్డకట్ట వేస్తూ......." చాల్లే! ముందు పువ్వులు కొయ్యి. మీ పెద్దాడపడుచసలు మంచిది కాదు! ".... కటువుగా.....సమవయస్కురాలయిన తనతో ముదనాపసానిలా మాట్లాడుతున్న వేణి ఒక పజిల్ లా అనిపించింది భారతికి. 


                ఆ తరవాత భారతిని ఒక్కక్షణం కూచోనివ్వలే పెద్దాడపడుచు. 

ఇడ్లీప్లేట్లలోంచి ఇడ్లీలు తీయించింది. రెండు ప్లేట్లలఇడ్లీలు ముక్కచెక్కలయ్యాకా.. తీరువుగా తీసే సులువు చిక్కింది. 

గిన్నెలు సర్దించింది. " అమ్మయ్యా!" అనుకునేలోగా రెండుకేజీల కేబేజీ బుట్ట ముందు పడేసి తరగమని ఇచ్చింది. 


తల్లికి మొక్కుబడిగా ఉప్మాలోకి అల్లం, పచ్చిమిరపకాయ తరిగిచ్చి పారిపోయే రకం భారతి. ఎదురుగుండా ఘనమారణాయుధంలా ఉన్న రెండున్నర అడుగుల కత్తిపీటను చూసి.... మిన్నువిరిగి మీదపడ్డట్టు చూసింది. 


       పెద్దాడపడుచు కరుణించలేదు. అంత భారీమనిషి చులాగ్గా... కింద పీటేసుకుని కూర్చుని... కాబేజీతరిగే సులువు చూపించి.. లేచిందా.. భారతికి కత్తిపీటతో పోయేప్రాణం.. వచ్చేప్రాణంలా ఉంది. 

కాబేజీతో పాటూ ముందుకు జరిగిపోతూ... మొత్తం చక్రబంధంలో అభిమన్యుడిలా....ఆ పెద్ద డైనింగ్ రూమంతా గిర్రున తిరుగుతూ... నేలంతా మల్లెపూలు చల్లినట్టు కేబేజీ తరుగు పోసి... ఎట్టకేలకు ఆఖరి పావుకేజీ తరిగేటప్పటికి.." ఓస్! కేబేజీ తరగడం ఇంత సులువా! " అనేసుకుంది భారతి. 


         ఇంత చేస్తున్నా ఆవిడ నుంచి  ఓ మందలింపు లేదు! మంచిమాటా లేదు. అసలు మనసులో ఏమనుకుంటోందో తెలీదు. 


సాయంత్రం చిన్నకునుకు తీసి లేవగానే.. వేణీ అల్లం, ఏలకులు వేసి టీ పెట్టడం నేర్పించింది. 


అలా మేడమీద బాల్కనీలో కూర్చున్నారో లేరో... ఇలా పెదదాడపడుచు ప్రత్యక్షమై....ఎప్పుడు కొన్నారో మరి... ఓ కేజీ మల్లెపూలు వెదురుజంగిడిలో వేసి ముందుపెట్టి, ఓ చిన్నబేసిన్తో జంతికలు, దారపుండ పెట్టి... లోపలికి చక్కా పోయారు. 


మన భారతిగారికి బడిపాఠాలే కానీ బతుకుపాఠాలు రావుగా! మళ్ళీ వేణమ్మే దిక్కు!


 " అసలు ఏం పెంపకం పెంచింది మీ అమ్మ. ఒక్కపని చేతకాదు! నాకూ, మా ముగ్గురక్కలకూ మా అమ్మ పుట్టినప్పటినుండి పనులు మప్పడమే! ఏమన్నా అంటే... మీ అత్తారిళ్ళలో నాకు మాట రాకూడదే.." అనేది. "వాళ్ళ సంగతేమో కానీ.. నీకన్నా రెండేళ్ళు పెద్దదాన్నా... ఇప్పటికొచ్చి పెళ్ళియోగం లేదు. మా అమ్మకి ఇంజినీర్లే కావాలి. ఇంజినీర్లకేమో రూపసులు కావాలి. మొన్నటి వరకూ మేనమామ ఆశ ఉండేది. ఇప్పుడు అదీ అడుక్కుతింది! "...... భారతికి ఆమె మాటల్లో అక్కసు కన్నా ఆవేదనే కనిపించింది. నిజమే వయసుకు మించిన ఒడ్డూపొడవుతో... కాస్త తీసికట్టు అందమే వేణిది. 


        ఇంతలో స్నానం చేసొచ్చింది పెద్దాడపడుచు. తెల్లని చాకలిస్త్రీ చిన్నపువ్వుల గ్లాస్కోవాయిల్ చీర, చిన్న పువ్వుల జాకెట్టు వేసుకుని... చక్కగా యుడికలోన్ స్ప్రే చేసుకుని, దూమెరుగ్గా క్యుటీకురా పౌడర్ వేసుకుని... నుదుట ఎర్రని సింధూరబ్బొట్టుతో... ఎంత అందంగా ఉందో ఆవిడ. మెడలో నల్లపూసలతో మెలిపడిన బంగారు గొలుసులూ.... ప్రతి కదలికకూ జిగజిగలాడుతున్న నిమ్మగుత్తి రవ్వల బేసరి! 


కొన్ని నగలు వారికోసమే అన్నట్టు అమరుతాయి కొంతమందికి ... అనుకోకుండా ఉండలేకపోయింది భారతి!! 


మల్లెపూలను... సీరియల్ దీపాల్లో అక్కడో దీపం ఇక్కడో దీపంలా అమర్చి...భారతి కట్టిన పూలమాలను ఎగాదిగా చూసి.. వస్తున్న నవ్వు కళ్ళ చివర్లనే ఆపేసి....దాన్నే పదివరుసలు చేసి సిగచుట్టూ చుట్టుకుంది.  


ఎందుకో పనిమీద పొరుగు రాష్ట్రం వెళ్ళిన కొత్తపెళ్ళికొడుకు తన భర్త తలపులతో....ప్రణయశృంగారపు భావవీచికలేవో... ఆ వేసవిసాయంత్రం వేళ భారతి మనసును కమ్ముకున్నాయి. 


        మొత్తానికి మూడురోజుల పెద్దాడపడుచింట ప్రవాసం తరవాత ....అత్తారింట్లో అడుగుపెట్టిన భారతి పైన నేర్చిన పనులన్నిటితో పాటూ... వందకాయ పచ్చి ఆవకాయ కలిపిన అనుభవం, ఏభై మాగాయకాయ ఆల్చిప్పతో గీసి, తరిగి ముక్కలు జాడీకెత్తిన అనుభవమూ వెంటేసుకొచ్చింది. 


        నోరులేని అత్తగారు కోడళ్ళ గీతాలకూ.. నకరాలకూ బుర్రూపుతూ.. ఆడింది ఆటగా.. పాడింది పాటగా సాగనియ్యకుండా... పెద్ద పోలీసులా అడ్డం పడుతుండేది పెద్దాడపడుచు. 


ఆమె చెల్లెళ్ళకూ, మరదళ్ళకూ , కూతుళ్లకూ సమన్యాయంతోనే పనులూ, పురమాయింపులూ, దెప్పుళ్ళూ వడ్డిస్తూ ఉండేది. 


పచ్చని పచ్చి పసుపుకొమ్ములా.... ఇంట్లో శుభకార్యాలకు..వినాయకుడి మీదికట్టడం మొదలు... రాట వేయడమేంటి... పసుపుదంచడమేంటి....ఆఖరి అంకంఅప్పగింతల వరకూ... పార్వతీదేవిలా ఆవిడే నడుం కట్టేది. 


      ఆవిడ ధాష్టీకానికి కడుపులో మంటున్నా... అందరికీ మంచికీ, చెడుకీ ఆవిడే పెద్దదిక్కు మరి. 


భారతికి.. అడపాదడపా ఆవిడనుండి, వేణినుండి... అక్షింతలు పడుతున్నా... అవేవీ మనసులో పెట్టుకోకుండా రియాద్ లో పనిచేసే తన పెద్దనాన్న కొడుకుతో వేణికి సంబంధం కుదిర్చిపెట్టింది. 


           బంధువుల్లో గయ్యాళి, అహంభావి, గర్విష్టి, నోరూ,అతిశయం ఎక్కువ .... వంటి అప్రతిష్టలు మూటకట్టుకున్నా.. ఆవిడను.. భారతి .... తననో ఉత్తమఇల్లాలిగా నిలబెట్టిన గురువుగానే భావిస్తుంది. 


రెండేళ్ళ తరవాత ఉమ్మడినుండి... ఇల్లుకట్టుకుని వేరే వెళ్ళిపోయిన భారతి... అనతికాలంలోనే సమర్ధతలో, కంజాయింపులో... తనవేపు చుట్టపక్కాల్లో "  తన పెద్దాడపడుచు" స్థాయికి ఎదిగిపోయింది... ఎటొచ్చీ వినయసంపన్నత తోడుగా! 


              ప్రతీ వైభవానికీ ఒక అంత్యదశంటూ ఉంటుంది. కాలపరిమితి చెల్లిపోయే రోజు వచ్చి తీరుతుంది. భారతి పెద్దాడపడుచుకు ఆ దశ కోడలు రూపంలో వచ్చింది. 


నలుగురు అమ్మాయిల తరవాత పుట్టిన గారాలకొడుకు, కంటికి దీపం అనుకున్న రమేష్ కు పెద్దాడపడుచు నాలుగేళ్ళు వెతికి.. వూళ్ళుగాలించి తెచ్చిన ...అమ్మాయి రాఘవి! 


కోడలి ఎంపికలో చాలా మంది చేసే అతిపెద్ద తప్పే ఆవిడా చేసింది. తక్కువింట్లోంచి కోడల్ని తెచ్చుకుంటే అణిగిమణిగి ఉంటుంది. పడుంటుంది... అనుకుంటూ ఆవిడ అడుసులో కాలు వేసింది.


        రాఘవి కూడా అత్తగారిలాగానే ఆలోచించుకుంది. 

చితికిపోయిన ఒకప్పటి సంపన్నకుటుంబీకుల పిల్ల. ఆస్థులు పోయినా భేషజాలు పోలేదు. అహంకారాలూ తగ్గలేదు. డబ్బున్న ఇంట్లో పడితే... తను పుట్టింట్లో చూడని 

వైభవం అత్తింట్లో చూడచ్చనుకుంది. దానికి తగ్గట్టే అత్తగారు చంద్రహారాలు, పలకసర్లు, కాసులపేరు, రవ్వలదుద్దులు, నాలుగుజతల గాజులు పెడితే... చూసుకుని మురిసిపోతూ... తన అందం ముందు ఏ మాత్రం ఆనని , స్థిరమయిన ఉద్యోగం లేని, కాలకి కొద్దిగా అవుటు ఉన్న  రమేష్ ను ఆనందంగా చేసుకుంది రాఘవి... తనకు దక్కబోయే ఐశ్వర్యం గురించి కలలు కంటూ! . 


       పదహారేళ్ళ పండగకే అత్తాకోడళ్ళ ఇరువురి ముసుగులూ తొలిగాయి! ఆశలూ అడియాసలవ్వసాగేయి. తాతలు తాగిన నేతులూ., మీసాల సంపెంగ నూనెలూ మాట్లాడే కోడలూ...., పెట్టినట్టే పెట్టి బంగారాన్ని తన ఇనప్పెట్టెలో దాచుకున్న అత్తా... ఒకరి రంగులొకరు బయటపెట్టుకోసాగారు. 


రమేష్ కు తల్లేమీ కొత్తగా అల్లం అవలేదు. ముందునుండి ప్రతిపైసాకూ తల్లితండ్రుల మీద ఆధారపడే అతను తన ఆర్ధిక  అవసరాలకు తల్లితో తరుచూ గొడవపడుతూ.. అప్పుడప్పుడూ చెయ్యెత్తిన సందర్భాలున్నాయి. 


అతనికి పుట్టుకతోనే నలుగురు అప్పగార్లంటే పరమ ద్వేషం! తనకు ఆస్తి ఏకాండీగా దక్కకుండా.. కట్నకానుకల రూపంలో సగం భోషాణం ఖాళీ చేసారని ఏడుపు. వాళ్ళు కూడా తమ్ముడి వాగుడు భరించలేక పుట్టింటి మొహం చూసేవారు కాదు. ఇప్పుడు రాఘవి సరయిన జోడు రమేష్ కు! 


పెద్దాడపడుచుగారి భర్తగారు ఇంటి యాజమాన్యంమారే సంధికాలంలోనే లోకాన్ని విడిచిపెట్టారు. ఆయన్ని భార్య కొంగుచాటు మనిషి అంటారు... అయితే భారతికి అనిపించేది... భార్య సమర్ధతమీద, భార్య నిర్ణయాల మీద నమ్మకం, గౌరవం ఉన్న మనిషి...ఆయన... అని! 


              మనవల రాకతో పెద్దాడపడుచు స్థాయి మరీ దిగజారింది. 


పాతకాలం సినిమా సెట్టింగ్ లా ఆరోజుల్లోనే ఎంతో అధునాతనంగా ఉండే ఇల్లు... మాలతి, మాధవీలతలు పెనవేసుకున్న అందమైన ఇంటిబయలు క్రమక్రమంగా... కళావిహీనం అయిపోయింది. ...శుచీశుభ్రం లేని రాఘవి పర్యవేక్షణలో! 


కొంతకాలానికి...కొడుకూ- కోడలితో బేంక్ అకౌంట్ల బదిలీ మీద అయిన గొడవలో... వాళ్ళతో నెగ్గలేక... సంతకాలు చేసి మొహానపడేసి... మనశ్శాంతి కోసం కూతుర్లదగ్గరకు వెళ్ళారు పెద్దాడపడుచు! 

 

 "ఆస్థులు కొడుక్కి... బాధ్యతలు మాకా?".... అని అల్లుళ్ళు నిలదీస్తే వెర్రిమొహం వేసి.... ఆఖరి తమ్ముడింటికి చేరారు.... మరదళ్ళందరిలో... భారతే తనను ఆదరిస్తుందని తెలుసామెకు. 


భారతికి.... ఆమెను అలా చూస్తుంటే...... ఏదో మహావృక్షం కూకటివేళ్ళతో కూలిపోతున్నట్టు ఉండేది. 

మిగిలిన వారి వాదన వేరేగా ఉండేది..." అవును మహావృక్షమే! ఆవిడ ఛాయలో... ఆవగింజను కూడా మొలవనివ్వలేదు. మనమంటే ఈమె ఆధిపత్యధోరణికి లొంగాం కానీ... కోడలు బయటది.. ఎందుకు లొంగుతుంది? మంచి శాస్తే చేసింది!"!.... అంటుంటే... " అయ్యో! అత్తమామలు ఏమీ పట్టించుకోకపోయినా.. ఆ ఉమ్మడిలో అందరికీ తీరుతెన్నులు నేర్పించి, పిల్లల పెళ్ళిళ్లు తెమిలించి, పొదుపులు నేర్పించిన మనిషి.. ఈమె! మాట కటువయితేనేం.... మనసు మంచిదే! ఇలా ఆడిపోసుకుంటున్నారు..." అని బాధపడేది భారతి! 


         కొడుకూ కోడలూ వచ్చి బతిమాలి తీసుకుపోయాకా... పెద్దాడపడుచు పూర్తిగా మౌని అయిపోయారు. ఇంటినిండా చేరిన కోడలి పుట్టింటారిది ఇష్టారాజ్యమయినా.. ఆమె మాత్రం ఓ మూలగదికి మకాం మార్చుకుని.. పెడితే తిని.. లేకపోతే మానేసి.. విరాగిలా అయిపోయారు. 


పదిహేనేళ్ళ వయసులో పెళ్ళికూతురుగా వచ్చి... పుల్లా.. పూసా పోగేసికుని అపురూపంగా కట్టుకున్న స్వంత ప్రపంచం... తనముందే తన చెయ్యిజారిపోవడం. ఆమెకు శరాఘాతంలా తగిలింది. 


కొన్ని కోట్లు విలువచేసే ఆ ఇల్లుకూడా కొడుకుపరం చేసి... ఓ పదిలక్షలు కొడుకు కాళ్ళుపట్టుకుని కూతుళ్ళకు ఇప్పించి... పూర్తి అజ్ఞాతాన్ని ఆశ్రయించారు. రాఘవి, రమేష్ బయటప్రపంచంతో ఆమెకు పూర్తిసంబంధాలు తెంపేసారు. 


            శ్రీరామ నవమి దాటిన రెండువారాలకు.. భారతి ఆవకాయ పడేద్దామని ఓ వందకాయ తమ చెట్టుమీంచి దింపించింది. 


కాయలు నీళ్ళల్లో పడేస్తుంటే ఫోన్ మోగింది. " భారతి".... అని నూతిలోండి వస్తున్నట్టు వస్తోంది. అది పెద్దాడపడుచుగారి గొంతుకని గుర్తుపట్టడానికి కొన్ని క్షణాలు పట్టింది. " నన్ను తీసుకుపోవే ఇక్కడనుండి! "..... ఈలోపల ఫోన్ ఎవరో తీసుకున్నారు." పెయింటర్ అప్పారావునమ్మా! పెద్దమ్మగారు పోను అడిగారు! ఇచ్చీసినారు తిరిగి!" అంటూ పెట్టేసాడు. 


       భారతి ఆ కాయలక్కడే పడేసి... భర్తకు ఫోన్ చేసి.. కారు తెప్పించుకుని ఆఘమేఘాల మీద అక్కడికి చేరింది. 

ఇల్లంతా పెయింట్లు వేస్తున్నారు. 


పెద్దాడపడుచు.. మేడమెట్ల పక్కన చిన్న ఇనపమంచం మీద పడుకుని ఉన్నారు. ఉచ్చకంపు కొడుతున్న పక్కబట్టలు. బక్కచిక్కపోయి.... జుట్టంతా జడలుకట్టేసి.. దీనావస్థలో ఉన్నారు. 

డ్రయివర్ ని అక్కడ కూచోపెట్టి... భారతి పైకి వెళ్ళింది. 

రాఘవి అక్కకూతురు పెళ్ళిట పదిరోజుల్లో. పెద్దాడపడుచు గదిలో రాఘవి తల్లీ, అక్కలు కబుర్లాడుకుంటూ మహా సందడిగా ఉన్నారు. 


భారతి రాఘవి, రమేష్ తో పెద్దగొడవే పెట్టుకుంది. రమేష్ తో." నీ కాలొక్కటే అవిటి కాదు.. నీ మనసూ, బతుకూ అవిటే! థూ! దౌర్భాగ్యుడా! "... అంటూ దుమ్మెత్తిపోసింది. 


అంతే పెద్దాడపడుచుకు తన యింటితో శాస్వతంగా బంధం తెగిపోయింది. 

ఆవిడ పోయినా తమకు చెప్పక్కర్లేదని మొహానే తలుపేసింది రాఘవి . 


           భారతి ఇంట్లో డాక్టర్ పర్యవేక్షణలో... ఓ వారంరోజులు సేదతీరింది ఆవిడ. 


ఆవిడకిష్టమైన మైసూర్ శాండల్ సబ్బుతో స్నానం చేయించి.. మెత్తని గ్లాస్కో చీరకట్టి... తెల్లని దుప్పటి పరిచి పడుకోపెట్టేది భారతి. 


         ఆరోజు భారతి మంచి నిద్రలో ఉంది. గుమ్మంలో పెద్దాడపడుచు నిలబడున్నారు. " ఏవిటండి వదినగారూ? ఏమన్నా కావాలా? ... అని అడిగింది . " మల్లెపూలు కావాలే! "! అందావిడ. 


భారతికి పూర్తి మెలుకువ వచ్చింది. లేచి చూస్తే ఆవిడ లేరు. పరిగెట్టుకుని గదిలోకి వెళ్ళింది. ప్రశాంతంగా నిద్రపోతున్నారు. పక్కనే వెళ్ళి కూర్చుని.. ఆప్యాయంగా ఆమె చేతిని తన చేతిలో పెట్టుకుంది. మల్లెలకన్నా మెత్తగా... మంచుకన్నా చల్లగా ఉందామె చెయ్యి! 


            ఫలానా వారింటి పెద్దాడపడుచు గారు పోయారన్న వార్త వినగానే... అపరకర్మలు చేయంచే కోటీశ్వరుడు వామనమూర్తి..., ఆ జిల్లాలో పేరెన్నకగన్న వంటవాడు సత్యనారాయణ... క్షణాల్లో వాలిపోయారు. నలభై ఏళ్ళ క్రితం... పొట్టపట్టుకుని నగరానికి వచ్చిన వారిని ఎందమందికో సిఫారుసు చేసి... జీవితాలు నిలబెట్టిన మహాతల్లి ఆమె. 


" పెద్దమ్మగారో! మాలక్ష్మమ్మగారో! ".... అంటూ తరలి వచ్చిన ఊరిజనం!! 


              కూతుళ్లు పదోరోజుకు కానీ రాలేమన్నారు. 


ఊళ్ళోనే ఉన్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళ సమక్షంలో, ఆమె అశేష అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య... ఆమెకిష్టమైన చంద్రకాంత రంగు పట్టుచీర కప్పి...నుదిటన ఇంత బొట్టుపెట్టి... తనొక గురువులా గౌరవించి, అభిమానించిన  తన పెద్దాడపడుచుని ... మల్లెపూలరధంలా సాగనంపింది భారతి!! 


*శశికళ ఓలేటి* 

  11-04-2020

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 

*మంత్రోపదేశం ..ఆశ్రమ నిర్మాణ కర్త ఆగమనం..*


*(ఇరువై ఒకటవ రోజు)*


ఆశ్రమ నిర్మాణానికి వేరే వారు పూనుకుంటారనీ..మీరేమీ ఆలోచించవద్దనీ శ్రీధరరావు దంపతులకు శ్రీ స్వామివారు తెలియచెప్పి..


"అమ్మా!..నీ దేవీపూజ కోటి పూర్తి అయిందా?.." అని ప్రభావతి గారిని అడిగారు..


"నాయనా..నా పదమూడో ఏట, మా తల్లిగారు ఉపదేశించిన మంత్రాన్ని జపిస్తున్నాను..అలాగే మా నాన్నగారు బోధించిన వైష్ణవమంత్రమూ జపిస్తున్నాను..లెక్క పెట్టుకోలేదు.." అన్నారు ప్రభావతి గారు..


"అయితే..నీకు సమయం వచ్చినప్పుడు వైష్ణవమంత్రం ఉపదేశిస్తాను.. దీక్షతో చేయి  తల్లీ!..శ్రీధరరావు గారూ మీకు ఈశ్వరాంశం మంత్రం ఉపదేశించనా?..లేక వైష్ణవమంత్రమా?.."అన్నారు నవ్వుతూ..


"స్వామీ!..నాకు ఏ మంత్రాలూ వద్దు..నేను ఈ దీక్షలు చేయలేను..అదేదో ఆవిడకు బోధించండి..తపనతో చేస్తూ ఉంటుంది..నేను కర్మ సిద్దాంతాన్ని నమ్ముతాను...మీకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను..మీ తపస్సు, దాని ఫలితాలు..నా దృష్టిలో ఒక ప్రయోగంగా భావిస్తున్నాను..అందుకు నేను దోహదకారిగా వుంటాను..అంతే కాని..ఈ జపాలు వగైరాలు నాకు సరిపడవు!.." అన్నారు శ్రీధరరావు గారు..


శ్రీ స్వామి వారు పక పకా నవ్వారు.."చూసావా అమ్మా!..శ్రీధరరావు గారు మంత్రోపదేశం వద్దన్నారు..పోనీలే అమ్మా..నీకు సమయం వచ్చినప్పుడు ఆ దీక్ష ఇస్తాను..కొనసాగిద్దువు గానీ.." అని..మళ్లీ కూడా ఆ ఇద్దరికీ ఆశ్రమ నిర్మాణం గురించి చింత వద్దని చెప్పి, ఆశీర్వదించి పంపించివేశారు..దంపతులిద్దరూ తేలిక పడ్డ మనసుతో మొగలిచెర్ల చేరారు..


ప్రక్కరోజు ఆదివారం.. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు శ్రీధరరావు గారింటికి వచ్చారు..రాగానే, శ్రీధరరావు గారికి నమస్కారం చేసి.."అయ్యా..నా పేరు బొగ్గవరపు చిన మీరా శెట్టి..ఇతను నా మిత్రుడు!..మాది, వింజమూరు తాలూకా గొట్టిగుండాల గ్రామం.." అన్నాడు..


శ్రీధరరావు గారు వారిని సాదరంగా వరండాలో కూర్చోబెట్టి..వచ్చిన పని ఏమిటో చెప్పమన్నారు..


"నేను..మాలకొండ లో తపస్సు చేసుకుంటున్న స్వామివారికి ఆశ్రమం నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో వున్నాను..ఆ విషయమై మీతో మాట్లాడాలని వచ్చాను.." అన్నారు..శ్రీధరరావు గారికి ఒక్కక్షణం తాను ఏం వింటున్నానో అనే సందేహం కలిగింది..వెంటనే ప్రభావతి గారిని పిలిచారు..ఇద్దరూ కూర్చున్న తరువాత, చిన మీరాశెట్టి గారు మళ్లీ అదేవిషయం..తాను శ్రీ స్వామివారికి ఆశ్రమ నిర్మాణం చేయదలచానని చెప్పారు..


నిన్న శనివారం  సాయంత్రం శ్రీ స్వామివారు తమతో ఆశ్రమ నిర్మాణానికి వేరే వాళ్ళు వస్తారు అని చెప్పారు..ఈరోజు సాయంత్రానికల్లా ఆ వ్యక్తి వచ్చి ఎదురుగా కూర్చున్నాడు..దంపతుల ఆశ్చర్యానికి అంతులేదు..


చిన మీరాశెట్టి గారిని..శ్రీధరరావు గారు శ్రీ స్వామివారు ఎలా పరిచయం అని అడిగారు..


శ్రీ స్వామివారు  ఎర్రబల్లె గ్రామం లో ఉన్నప్పటి నుంచీ తెలుసుననీ.. శ్రీ స్వామివారు వ్యాసాశ్రమం వెళ్లి వచ్చిన తరువాత కూడా ఒకటి రెండు సార్లు తాను, తన భార్యా శ్రీ స్వామివారిని కలిసామని..శ్రీ స్వామివారు మాలకొండ లో తపోసాధన కు వెళ్లిన తరువాత ఆయనతో కలవడం కుదరలేదనీ..మీరాశెట్టి గారు చెప్పారు..


నిన్నరాత్రి తనకు స్వప్నంలో కనిపించి..ఆశ్రమ నిర్మాణం చేయమని ఆదేశించారని..ముందుగా మిమ్మల్ని కలువమని కూడా ఆజ్ఞాపించారని కూడా మీరాశెట్టి గారు చెప్పారు..శ్రీ స్వామివారి ఆదేశం మేరకు మీరాశెట్టి గారు తన స్నేహితుడిని వెంటబెట్టుకొని మొగలిచెర్ల చేరారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లకు ఇదంతా కలలా ఉంది..దైవలీలలు ప్రత్యక్షంగా అనుభవానికి వస్తున్నాయి..తాము నమ్మిన ఆ లక్ష్మీనృసింహుడే..ఇదంతా నడిపిస్తున్నాడనీ..లేకుంటే..ఒకానొక సాధకుడు, తన తపోసాధనకు తమ సహకారం కోరి..తమ జీవితాలకు ఒక అర్ధం కల్పించడం..లీల కాక మరేమిటి?..


మీరాశెట్టి గారిని, వారి స్నేహితుడిని..ఆ రాత్రికి తమ ఇంటిలోనే వుండమని చెప్పి, తెల్లవారగానే మాలకొండకు వెళ్లి శ్రీ స్వామివారిని కలుద్దామని చెప్పారు శ్రీధరరావు గారు..మీరాశెట్టి గారూ అందుకు అంగీకరించారు..


అందరూ సోమవారం నాడు ఉదయాన్నే..మాలకొండకు బయలుదేరి వెళ్లారు..


ఆశ్రమ నిర్మాణానికి సూచనలు..బావి లో జలకళ..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

ఏదిసూనృతం

 **ఏదిసూనృతం,,ఏది అనృతం..మన తక్షణ కర్తవ్యమేమిటి*** 


************************************

Dr.C.  ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)

గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు 

కర్నూలు. ఆంధ్రప్రదేశ్.

*********************************************

**ఫ్లాష్ బ్యాక్ - బ్లాక్ అండ్ వైటులో**** 


1918 సంవత్సరం 


స్పానిష్ ఫ్లూ...(అప్పట్లో ఇన్ఫ్లు యంజా వైరస్-ఇప్పటి కొరోనా వైరస్ అక్క) తో భారత దేశం అతలాకుతలం అవుతోంది 


మహాత్మా గాంధి గారు తన 48 వ ఏట ఆశ్రమంలో కేవలం ద్రవ రూప ఆహారాన్ని తీసుకుంటూ ఆ కొరోనా అక్కతో పోరాడు తున్నాడు.. శబర్మతీ ఆశ్రమంలో ఎందరికో జ్వరం, దగ్గు పోరాడుతున్నారు.. పత్రిక లలో *గాంధీ జీవితం గాంధీది కాదు.,అది భారతీయులది* అని రాసుకున్నాయి.,, 


గంగా నదిలో శవాల గుట్టలుగా తేలుతున్నాయి.. వాటిని కాల్చేకి కట్టెలు లేక గంగలో తోసేస్తున్నారు..దానికి తోడు వర్షాలు రాక కరువు వచ్చింది,, అందరూ పట్టణాలకు ఆకలితో వలస వెళ్తున్నారు..అది వైరస్ ను ఇంకా వ్యాప్తి చేస్తుంది అని సూర్యకంట త్రిపాఠీ తన పుస్తకం లో వ్రాసుకున్నాడు.. 


ఆకాలంలో ఇప్పటిలా వ్యాక్సిన్ లు లేవు వ్యాపారం లేదు.. ఆంటిబయాటిక్సు, వెంటిలేటర్లు లేవు.. అసలు పాశ్చాత్య విధానాన్ని నమ్మే వాళ్ళే లేరు.. అంతా సొంఠి, అల్లం, మిరియాలు, జిలకర, ఆవాలు, తులసి, తాయత్తులు బ్యాచు వైద్యమే.... 


మొదట ప్రపంచ యుద్ధం కంటే ఎక్కువగా మంది భారత దేశంలో ఈ మహమ్మారితోనే చనిపోయారు.. 17 - 18 మిలియన్లమంది చనిపోయారు... ప్రపంచంలో 100 మిలియన్లు చనిపోయారు,.6% జనాభా అంతరించి పోయింది... 


బొంబాయిలో ఒక షిప్ లో వచ్చిన సైనివల్ల సెకెండు వేవు వచ్చిందని వైద్యాధికారులు, లేదు మీ మురికి అలవాట్ల వల్లనే వచ్చిందని బ్రిటిష్ అధికారులు యధావిదిగా తిట్టిపోసుకున్నారు.. అందరినీ గాలికొదలేసి పర్వత ప్రాంతాల కు అధికారులు పారిపోయారు ప్రాణభయంతో.. భారతీయ అక్క చెల్లెల్లు తినడానికి తిండిలేక, తమ భర్తల ప్రాణాలను కాపాడలేక చిక్కి శల్యమై ఎముకల గూడులా మారి ప్రాణాలు వదిలారు... 


బయట తిరగకండి,,ఇళ్ళల్లోనే ఉండండి,,,,,.. ప్రశాంతంగా నిద్రపోండి., ఎక్కువగా చింతించకండి అని టైమ్సు ఆఫ్ ఇండియాలో కధనాలొచ్చాయి,.. 


**మరి మన భారతదేశం ఎలా ఎదుర్కొంది,,ఈ మహమ్మారిని...** 


ప్రజలు అంతా సంఘటితమయ్యారు.., 


ఆంటి ఇన్ఫ్లుయంజా కమిటీలు వేసుకున్నారు... 


పాతిక పరక సేకరించారు... 


చిన్న చిన్న షెల్టరు వైద్యాలయాలు స్ధాపించారు... 


అందరికీ మందులు, కూడు, గుడ్డ పెట్టారు... 


శవాలను తొలగించారు...తగలబెట్టారు..,, 


అందరినీ మోటివేటు చేసి హెల్తు గురించి పెద్దఎత్తున భారతదేశ చరిత్రలో లేని విధంగా అవగాహనా కార్యక్రమాలను నిర్వహించారు.,,వైద్యసిబ్బంది భయపడ్డారు.,వారి కొరత ఎక్కువగా ఉంది.... 


ప్రతి ఒక్క భారతీయుడు తన అక్కచెల్లెల్లను అన్నదమ్ములను కాపాడుకోవాడానికి భుజం భుజం కలిపి పోరాడారు.... మహమ్మారి అంతం చూసారు...ప్రజలను ఆ సెకండు వేవు కొరోనా అక్క ఇన్ఫ్లుయంజా నుంచి కాపాడుకున్నారు... ఇదే నిజమైన భారతీయుల యుద్ధం..మొదటి ప్రపంచ యుద్ధంకంటే పెద్ద వైద్యయుద్దంలో భారతీయులు గెలిచారు...

*************************************

ప్రస్తుతం...ఈస్ట్ మన్ కలర్,.DTS లో 


*********************----******************* 


2020 సంవత్సరం... 


ఇన్ఫ్లుయంజా చెల్లి దేశంలో 2020 లో వచ్చింది,., 


ఆంటిబయాటిక్సు, ఆంటివైరల్సున్నాయి, వెంటిలేటర్లున్నాయి... ఆక్సిజను,స్టీరాయిడ్సు ఉన్నాయి., పాశ్చాత్య వైద్యం అందరికీ ఆమోదమే,,. కాని తులసి మిరియాలు పసుపు శొంఠి బ్యాచులు ఉన్నాయి... అయినా మాస్కు, దూరం దూరం, శానిటైజర్, లాక్డౌన్ లు పక్కా ప్లానింగ్ తో మొదటి వేవును భారతదేశం అంతం చేసింది....

******************************************** 


2021 సంవత్సరం..... 


ఆత్మ విశ్వాసం పెరిగింది... ఈ కొరోనా రెండవ వేవు ఏమి చేయగలదు అని రొమ్ము విరుచుకు తిరిగాము.. మాస్కు శానిటైజర్ దూరం దూరం అనే నినాదాలను పట్టించుకోలేదు... మత విశ్వాసాలే ఎక్కువయ్యాయి.. అందరూ గుంపులు గుంపులుగా మాస్కు లు వదిలేసి చెలరేగారు... పండగలు, పబ్బాలు, పెళ్ళిళ్ళు పేరంటాలు, మేళాలు తాళాలు, గుళ్ళు గోపురాలు, తమ అస్తిత్వం పోతుందని చెలరేగిపోయారు.... 


వ్యాక్సిన్ ఉన్నా సరిగ్గా  ఉపయోగించ లేదు... వైద్యసహాయం చేసేకి సన్నద్దం చేసుకోలేదు.,.

ఎన్నికలు, కౌంటింగులు అయినాక తీరిగ్గా కొరోనా ను నలిపి పారేస్తాం అనుకున్నారు... అడ్డపడ్డారు... దిక్కుతోచక అందరినీ అడుక్కుంటూ బెంబేలెత్తి పోతున్నారు

******************-************************

Dr.C.  ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)

గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు 

కర్నూలు. ఆంధ్రప్రదేశ్.

******************************************

అదను చూసి సెకండు వేవు విరిసిన పంజాకు దిమ్మ తిరిగి మేకపోతు గాంభీర్యం ప్రదర్సిస్తున్నారు,., బాబ్బాబు మాకు వ్యాక్సిన్ ఇవ్వు, ఆక్సిజన్ ఇవ్వు అని దేబురించాల్సిన పరిస్థితులు వచ్చాయి.,. 


మరలా భారతీయులందరూ భుజం భుజం కలిపి అక్కచెల్లెల్లకోసం అన్నదమ్ములకోసం పోరాడాల్సిన చారిత్రాత్మక సమయం వచ్చింది... 


మరలా మనమందరూ **కోవిడ్ ఆర్మీగా** మారాల.. 7th సైన్సు సినిమాలోలా మన జెనిటిక్ కోడును ఆక్టివేటు చేసుకోవాల.. పిరికి తనం వదిలెయ్యాల.. 


*ఇక సోషియల్ మీడియాలో అందరినీ తిట్టేది, అలాచేయండి, ఇలా చేయండి, మాకు బెడ్డు దొరకల, ఆక్సిజన్ దొరకల, మేమిచ్చాం, మేమే తెచ్చాం  అని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల నుండి పార్టీల పరంగా తిట్టిపోసి వీరాభిమానం చాటుకున్నది చాలు..* 


వైద్యసిబ్బంది, కలెక్టరు ల నుంచి బంట్రోతుల వరకు కొరోనాలో పని చేసే వారిని మీ సావు మీరు సావండి అని ఇంట్లో కూర్చుని తిట్టింది చాలు... 


*ఇక నడవండి..కోవిడ్ ఆర్మీ గా మారి సోషియల్ సర్వీసు చేయండి,,,* 


1. 130 కోట్ల మంది ఇంట్లో కూర్చో కుండా "covid army 🪖" గా మారాలి మాస్కు, భౌతికదూరం పాటిస్తూ అందరికీ ఎంతో కొంత సహాయంగా ఉంటే మంచిది 


2. టీచర్లు, విద్యా సంస్థలు పనిచేసేవారు, చదువుకున్న వాళ్ళు దగ్గర శిక్షణ  తీసుకొని ఎంతో కొంత  సహాయం చేయడం. 


3. చదువుకున్న ప్రజలు covid army 🪖 లో వైద్యసిబ్బంది చెయ్యగల పనులు మీరు చేయవచ్చు., 


4. ఊరికే టెన్షన్ పెంచే నెగటివ్ వార్తలు వ్యాప్తి చెంద కుండా చూడాలి 


5. ఇంట్లో నుంచే తెలిసిన వారిని భయపడకుండా ధైర్యం చెప్పి పర్యవేక్షణ  చేయచ్చు.. మందులు, ఆక్సిజను అవసరాన్ని తెలియ చేస్తూ హోమ్ఐసోలేషన్ కు సహాయం చేయవచ్చు.. మరణాల సంఖ్య పెరగ కుండా చేయ వచ్చు.,బెడ్లు అందరికీ అందేలా చేయవచ్చు.. 


6. హెల్తు వర్కర్సు, శానిటేషన్ వర్కర్సు, వారి కుటుంబాలకు ఎంతో కొంత సహాయం చేయండి.. వాళ్ళేం ఆస్తులు పెంచుకోరు.. తినడానికి సహాయం చేసి మే మున్నాం మీకు అని భరోసా కల్పించండి.. 


7. కోవిడ్ మీద అవగాహన, తేవచ్చు.. ప్రజలు  పానిక్  కాకుండా ఉండేందుకు కారులో మైకు పెట్టుకొని చుట్టూ పక్కల వారికి ఙ్ఞానం చెప్పవచ్చు 


8.చెరువులు కాలువలు శుభ్రం చేయ వచ్చు.. 


9. మాస్కు, భౌతిక దూరం పాటిస్తూ తో వీధి చివరున యోగ, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సరసైజులు చేయించచ్చు.. 


10. అందరూ సాఫ్టువేరు ఇంజనీరులు కంప్యూటర్ లో బెడ్ ల వివరాలు సేకరించి, ఎక్కడ ఖాళీలున్నాయో ప్రజలకు సమాచారం చేయవచ్చు,, 


11. కోవిడ్ రికవరీ అయిన యువకులు, ఊరికే ఉండకుండా కోవిడ్ కేర్ సెంటర్లలో వాలంటరీగా సహాయకులుగా ఉండచ్చు... 


12. ఆంబులెన్సులు, ఓమ్నీ వ్యాన్లు ఉన్నవారు దినం మూడుగంటలు ఆసుపత్రి లలో పేషెంటులను వార్డులు మార్చేకి సహాయం చేయచ్చు.,, 


13. మీ ఊర్లలో ఉండే పెద్ద హాలులను కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ లుగా మార్చి సేవలందించచ్చు.., 


14.. ఈ బ్లాక్ మార్కెటింగ్ నాయాళ్ళ తోలు తీయవచ్చు.. 


*ఇలా చేసే ధైర్యం, దమ్ము, మనసు, ఈ కొరోనా యుద్ధంలో పాలుపంచుకొనే సామర్ధ్యం ఈ ఉక్కునరాల ప్రజలకుందా?* 


ఎవరికోసమో ఎదురు చూడకుండా సమాజహితం కోసం నీ సోదరులకోసం పని చేయమన్న *బాబాసాహెబ్* చెప్పినది పాటించే తెగువ ఉందా? 


ఉక్కునరాల యువకులే దేనినైనా సమర్ధవంతంగా చేసి సాధిస్తారు అన్న *వివేకానందుని* మాటలు ఆచరించ గలరా?

**************************************** 


ముగింపు మాట.,, 


చీకటిలో చిక్కుకున్నప్పుడు అందరినీ తిడితే బయటపడం... ఒక చిరు దీపం వెలిగించు కోవాల...

అలాగే మీ రాజకీయాలు, ఓట్లు, నోట్లు, తరువాత చూసుకోవచ్చు,,దానికి సమయం ఉంది... బ్రతికి తే అందరం మరలా 2024 ఎన్నికల లో కొట్టుకుందాం...

బ్రతకడమే ముఖ్యం ... ఎలాగైనా.... ఆ పాశ్చాత్య మీడియా ఇలా అంది.. వారు రిజైన్ చేయాల.. వీరు తోపు,.వాడు వీకు.. అనేటివి పక్కకు పెట్టి భుజంభుజం కలిపి పోరాడాల.... 


Dr.C.  ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)

గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు 

కర్నూలు. ఆంధ్రప్రదేశ్.