ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
4, ఆగస్టు 2023, శుక్రవారం
అన్నయ్య ఆరాధన
*అన్నయ్య ఆరాధన..తమ్ముడి అభిషేకం!!*
"మేము 26వ తేదీ రాత్రికి గుడి దగ్గరకు వస్తాము ప్రసాదూ..మాకు రెండు రూములు తీసిపెట్టు.." అని శ్రీ దత్తాత్రేయ స్వామివారికి స్వయానా తోడబుట్టిన తమ్ముడు పద్మయ్య నాయుడు ఫోన్ చేశారు..
"ఎన్ని గంటలకు వస్తారు?.." అని అడిగాను.."రాత్రికి వస్తాము.." అన్నారు..
"పద్మయ్యా..ఒక పని చేయండి..ఆరోజు సాయంత్రం 5 గంటల కల్లా మందిరానికి వచ్చేయండి.. రాత్రికి స్వామివారి బృందావనానికి గంధాభిషేకం వుంటుంది.. అందులో మీరు, మీ కుటుంబ సభ్యులు పాల్గొంటే బాగుంటుంది.."
"అంతకంటే భాగ్యమా.. తప్పకుండా వస్తామయ్యా.." అన్నారు..
ఈ సంభాషణ ఈ సంవత్సరం జరిగిన శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆరాధనకు వారం రోజుల ముందు..
ప్రతి సంవత్సరం శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆరాధన వైశాఖ శుద్ధ సప్తమి నాడు నిర్వహిస్తామని అందరికీ తెలిసిన విషయమే.. ముందురోజు అంటే.. షష్ఠి రోజు సాయంత్రం .. దత్తదీక్ష స్వీకరించిన స్వాములు.. మొగలిచెర్ల గ్రామం లో గల శ్రీ రామాలయం వద్ద కలిశాలు ఎత్తుకొని.. ఊరేగింపు గా.. శ్రీ స్వామివారి నామాన్ని పలుకుతూ.. సంబరంతో ఆడంబరంగా స్వామివారి మందిరానికి చేరుకుంటారు..ఆరోజు రాత్రి 12 గంటల తరువాత.. ఆనవాయితీ ప్రకారం మా దంపతులము అర్చక స్వాముల సహకారంతో శ్రీ స్వామివారి బృందావనానికి.. అలాగే శ్రీ స్వామివారి పాలరాతి విగ్రహానికి గంధాభిషేకము నిర్వహిస్తాము.. ఆపై అర్చక స్వాములు హారతి ఇస్తారు.. ఆ తరువాత దత్తదీక్ష లో వున్న స్వాములు ఒక్కొక్కరు.. స్వామివారి బృందావనానికి ప్రదక్షిణ చేసుకొని.. తాము తెచ్చిన కలశం లోని నీటితో శ్రీ స్వామివారి ఉత్సవ మూర్తి కి అభిషేకము చేసి వెళతారు..
ఈ సంవత్సరం గంధాభిషేకానికి మా దంపతులతో పాటు స్వామివారి సోదరుడు పద్మయ్య నాయుడు కూడా పాల్గొన్నారు..
"ప్రసాదూ.. మా అన్నగారు కపాలమోక్షాన్ని పొందే పదిహేను రోజుల ముందు నన్ను ఇక్కడికి పిలిపించుకున్నారు.. ఆ బావి దగ్గర కూర్చొని.. "నాకు తలంటి పోయరా.." అని అడిగాడు..నా చేతులతో ఆయన తలకు కుంకుడు కాయ రసం తో అంటి.. బావి లోంచి నీళ్లు తోడి.. ఆయనకు స్నానం చేయించాను.. అది తాను కోరి మరీ చేయించుకున్నారు.. ఆరోజే నాకు తాను త్వరలో సిద్ధిపొందుతున్నానని.. అది కూడా కపాలమోక్షం ద్వారా సిద్ది పొందుతానని.. తన దేహాన్ని ఈ నేల మాళిగ లో ఉత్తరాభిముఖంగా కూర్చోబెట్టి.. ఏ విధంగా సమాధి చేయాల్సినదీ వివరంగా చెప్పాడు.. అదే విధంగా ఆయన సిద్ధిపొందిన తరువాత మీ నాన్నగారి సహకారం తో మా అన్నయ్య చెప్పిన విధంగా క్రతువు పూర్తి చేసాను.. మళ్ళీ ఇన్నాళ్లకు నీ ప్రోద్బలంతో ఈరోజు ఆయన సమాధికి గంధం తో అభిషేకం చేసాను.." అంటూ..ఉద్వేగం తో నా చేతులు పట్టుకొని చెప్పారు..
"మీకు ఓపిక ఉన్నంత కాలం ఇలా ప్రతి సంవత్సరం రండి పద్మయ్యా.." అని చెప్పాను.. నన్ను దగ్గరకు తీసుకొని.. "ఈరోజు నాకు సంతోషం గా ఉందయ్యా.. నువ్వు చెప్పినట్టే.. ఆయుష్షు ఉన్నంత కాలం.. ఓపిక చేసుకొని వచ్చి పోతాను.. నా తరువాత నా బిడ్డలకు కూడా ఈ అవకాశం ఇవ్వు.." అని చెప్పి.. మళ్ళీ శ్రీ స్వామివారి బృందావనానికి నమస్కారం చేసుకొని వెళ్లిపోయారు..
శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిర నిర్వహణ భాధ్యతలను మా దంపతులము దాదాపు 19సంవత్సరాలనుండి చేస్తున్నాము.. ఎన్నో అనుభవాలు.. అనుభూతులు పొందాము.. ప్రతి అనుభవమూ ఒక కొత్త అనుభూతి ఇస్తుంది.. అందులో శ్రీ స్వామివారి సోదరుడు పద్మయ్య నాయుడు గారిది కూడా ఒకటి..
సర్వం..
శ్రీ దత్తకృప!!
(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..523 114.. సెల్ : 99089 73699 & 94402 66380.)
*హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ల వైపు నుంచి శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి వచ్చే భక్తులకు సమీప రైల్వే స్టేషన్ : సింగరాయకొండ.. అక్కడి నుండి ఆటో.. లేదా.. బస్సు ద్వారా కందుకూరు బస్టాండ్ కు రావాలి.. కందుకూరు నుండి మొగలిచెర్ల లో గల శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి RTC బస్సు సౌకర్యం వున్నది..*
MogiliCharla Sri Datthathreya Temple
Andhra Pradesh 523114
094402 66380
https://maps.app.goo.gl/sXEo7UwaT5aGHXek7
⚜ శ్రీ ఉమాదేవి ఆలయం
🕉 మన గుడి :
⚜ బీహార్ : దర్భంగా (మిథిలా శక్తి పీఠ్)
⚜ శ్రీ ఉమాదేవి ఆలయం
💠పురాతన నగరం మిథిల అనేక పవిత్ర గ్రంథాలలో ప్రస్తావించబడింది. దీని అత్యంత ప్రసిద్ధ చారిత్రక సూచన రామాయణంలో ఉంది, దీనిని సీత జన్మస్థలంగా సూచిస్తారు. పురాతన కాలంలో, మిథిలా రాజ్యం ఉత్తరాన గంభీరమైన హిమాలయాలకు మరియు దక్షిణాన గంగా నదికి మధ్య ఉండేదని నమ్ముతారు.
💠 ప్రస్తుత బీహార్‌లో సగభాగం మరియు నేపాల్‌లోని మిథిలా ప్రక్కనే ఉన్న ప్రావిన్స్‌లో మిథిలాను విదేహ అనే పేరుతో కూడా పిలుస్తారు.
ప్రస్తుత బీహార్‌లో అనేక పట్టణాలు ఉన్నాయి, వీటిని ఇప్పటికీ మిథిలా పేరుతో పిలుస్తారు. విదేహ రాజ్యానికి రాజధానిగా నమ్ముతారు, మిథిలాకు మైథిలి అని పిలవబడే స్వంత భాష ఉంది. మిథిలా పాలకులను జనక్ అని పిలుస్తారు మరియు వారిలో అత్యంత ప్రసిద్ధుడు సీత తండ్రి సీరధ్వజుడు ,ఇతనినే మనం జనకమహారాజు అని పిలుస్తాం.
💠 హిందువుల గొప్ప పవిత్ర ఇతిహాసం రామాయణంలో ఉన్న ఇతర చరిత్రలకు ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందింది. జనక్‌పురి సీతామాత జన్మస్థలంగా ప్రసిద్ధి చెందినందున, ప్రసిద్ధ జనకమహా రాజు ఈ ప్రాంతాన్ని పాలించేవాడు. జానకి మదిరను ప్రముఖ శక్తి పీఠంగా ప్రజలు నమ్ముతున్నారు.
💠 ఈ ప్రదేశంలో ఉన్న పురాతన శక్తి ఆలయాన్ని సోనా మాయి మందిర్ అని కూడా పిలుస్తారు. మిథిలాచల్‌ను దుర్గాస్థాన్ లేదా దేవి భగవతి ప్రదేశం అని కూడా అంటారు.
ఇక్కడి ఆలయంలో దుర్గాదేవిని అధిక సంఖ్యలో హిందూ భక్తులు "మహాదేవి లేదా ఉమా" గా పూజిస్తారు.
💠 నిజానికి శక్తిపీఠంగా పరిగణించబడే మూడు ఆలయాలు వనదుర్గ ఆలయం- ఉచ్చైత్; జై మంగళ దేవాలయం- సలౌనా; శ్రీ ఉగ్రతారస్థాన్ - మహిషి అనే మూడు ఆలయాలు కావడం వల్ల ఈ శక్తి పీఠం విశిష్టమైనది.
⚜ చరిత్ర ⚜
💠 ప్రజాపతి దక్షుని కుమార్తె అయిన సతి, అతని కోరిక మేరకు శివుడిని వివాహం చేసుకుంది. దక్షుడు ఒక గొప్ప యజ్ఞాన్ని ఏర్పాటు చేశాడు కానీ సతీదేవిని మరియు శివుడిని కూడా ఆహ్వానించలేదు. ఆహ్వానం లేకుండా, సతీ యజ్ఞస్థలానికి చేరుకుంది, అక్కడ దక్షుడు సతీదేవిని పట్టించుకోలేదు.
💠 ఈ అవమానాన్ని సతి తట్టుకోలేకపోయింది. కాబట్టి, సతీదేవి తన తండ్రి దక్షుడు నిర్వహించే హవన అగ్నిలో దూకి తన జీవితాన్ని అంతం చేసుకుంది.
తన భార్య మరణవార్త తెలియగానే శివుడు దుఃఖం, ఆగ్రహానికి గురయ్యాడు. సతీదేవి మృతదేహాన్ని మోసుకెళ్లి తాండవ నృత్యం చేశాడు, అది విశ్వాన్ని నాశనం చేస్తుందని దేవతలు భయపడ్డారు.
💠 శివుడు ఆమె దేహాన్ని మోస్తూ భూలోకం చుట్టూ తిరుగుతున్నప్పుడు, విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి శరీరాన్ని 51 భాగాలుగా విభజించాడు
ఈ భాగాలు వివిధ ప్రాంతాలలో పడిపోయి శక్తిపీఠాలుగా మారాయి. ఈ పుణ్యక్షేత్రాలు మొత్తం భారత ఉపఖండం అంతటా విస్తరించి ఉన్నాయి.
💠 ఆ 51 భాగాలలో, సతీదేవి 'ఎడమ భుజం (వామ స్కంధం)' ఈ ప్రదేశానికి పడిపోయింది. ఈ ఆలయంలో శక్తిని ' ఉమా ' లేదా ' మహాదేవి'గా పూజిస్తారు మరియు భైరవుడు ' మహోదర్'గా పూజింపబడతారు
💠 సింహంపై కూర్చున్న మా భగవతి మూర్తి. అమ్మవారి భుజ భాగం మాత్రమే కనిపిస్తుంది. నల్లరాతి వేదికపై మూర్తి కొలువై ఉన్నారు. దుర్గామాత 9వ రూపమైన 'సిద్ధిదాత్రి' రూపంలో అమ్మవారిని భక్తులు పూజిస్తారు. ఈ ఆలయం గొప్ప కవి మరియు రచయిత కాళీదాస్ కు సంబంధం ఉంది. ఈ ఆలయంలోనే అతను పండితుడిగా మారాడు
💠 మిథిలా శక్తి పీఠ ఆలయ సముదాయం ఏడాది పొడవునా కార్యకలాపాలకు కేంద్రంగా ఉంటుంది, అనేక పండుగలు మరియు వేడుకలు జరుగుతాయి.
ఈ ఆలయంలోకి శ్రీరామ నవమిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. వైశాఖ శుక్ల నవమి నాడు జానకీ నవమి (మే నెలలో) మిథిలా సీతా దేవి జన్మస్థలం కాబట్టి అత్యంత వైభవంగా జరుపుకునే మరొక పండుగ.
కృష్ణ జన్మాష్టమి కూడా ఎంతో భక్తి, విశ్వాసంతో జరుపుకున్నారు.
సరస్వతీ పూజ, నవరాత్రి, దుర్గాపూజ, కాళీపూజ, దీపావళి, కార్తీక పూర్ణిమ, అక్షయ నవమి, శివరాత్రి, హోలీ, నాగ పంచమి, రక్షా బంధన్ మరియు మధు శ్రావణి వంటి ఇతర పండుగలు ఇక్కడ జరుపుకుంటారు.
💠 ప్రధాన ఆలయం 70 అడుగుల ఎత్తుకు చేరుకునే గోపురంతో 4 అంతస్తుల నిర్మాణం.
ఈ ఆలయం పూర్తిగా రాతితో నిర్మించబడింది మరియు హిందూ దేవతలు, జంతువులు మరియు పౌరాణిక దృశ్యాల చెక్కడాలు ఉన్నాయి.
💠 ఈ పండుగలు కాకుండా, ఆలయ సముదాయంలో ఏడాది పొడవునా వివాహాలు, వార్షికోత్సవాలు మరియు ఇతర శుభకార్యాలు వంటివి చేస్తారు.
💠 మోక్షం, సంపద, వ్యాధుల నుండి ఉపశమనం, వాహనాల కొనుగోలు మరియు జ్ఞానాన్ని పొందడం కోసం భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.
💠 శ్రీ మిథిలా శక్తి ఆలయ సమయాలు: ఉదయం 6:00 నుండి రాత్రి 8:00 వరకు
💠 రైలు ద్వారా: సమీపంలోని రైల్వే స్టేషన్ అయిన జనక్‌పూర్‌కి రైలు రోడ్డు కనెక్టివిటీ మంచిది.
రోడ్డు మార్గం: దర్భంగా నుండి ఆలయానికి బస్సు సౌకర్యం ఉంది.
శ్రీ హాలేశ్వరనాథ్ ఆలయం
🕉 మన గుడి :
⚜ బీహార్ : హాలేశ్వర్ స్థాన్
⚜ శ్రీ హాలేశ్వరనాథ్ ఆలయం
💠 హలేశ్వర్ స్థాన్ భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలోని సీతామర్హి జిల్లాలో ఉన్న ఒక హిందూ పుణ్యక్షేత్రం , ఇందులో పురాతన శివాలయం ఉంది.
💠 ఇది సీతామర్హి పట్టణానికి వాయువ్యంగా 3 కి.మీ దూరంలో ఉంది.
💠 17వ శతాబ్దానికి ముందు హలేశ్వర్ స్థాన్ శివునికి చెందిన పవిత్రమైన హిందూ దేవాలయాలలో ఒకటి .
ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు,
ఉత్తర భారతదేశంలో అత్యధికంగా సందర్శించే మతపరమైన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి.
⚜ స్థలపురాణం ⚜
💠 పురాణల ప్రకారం, విదేహ రాజు అయిన జనకమహారాజు పుత్రకామేష్టి యజ్ఞం సందర్భంగా శివుని ఆలయాన్ని కనుగొన్నాడు. ఈ ఆలయానికి హాలేశ్వరనాథ్ ఆలయం అని పేరు పెట్టారు.
💠 "హాలము" అనగా నాగలి..
భూమిని నాగలితో దున్నుతునప్పుడు ఈ ఆలయం కనుగొనబడింది కనుక హాలేశ్వర స్థాన్ అని ఇక్కడి శివుడిని హాలేశ్వరనాథ్ అని పిలుస్తారు.
💠 రామాయణంలోని సీత తండ్రి అయిన మిథిలా రాజు జనకుడు ఈ శివాలయాన్ని నిర్మించాడని కథనం ప్రకారం ఈ ప్రదేశం చాలా పురాతనమైనదిగా నమ్ముతారు.
💠 గర్భగుడి వద్ద ఉన్న రాతి శివలింగం, రాజు శివుడిని ప్రార్థించిన అసలు చిత్రంగా నమ్ముతారు.
💠 మోక్షం సంపద వ్యాధుల నుండి ఉపశమనం వాహనాల కొనుగోలు జ్ఞానంలాంటి కోరికలు నెరవేర్చుకోవడానికి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.
💠 ప్రస్తుత ఆలయంలో సుదూర ప్రాంతాల నుండి చాలా మంది ప్రజలు ఈ పవిత్ర ప్రదేశాన్ని సందర్శిస్తారు కాబట్టి ఆలయ సముదాయం లోపల భక్తులకు వసతి కోసం ఏర్పాట్లు ఉన్నాయి.
💠 రక్సాల్-దర్భంగా రైలు మార్గంలో, సీతామర్హి స్టేషన్ ఉంది. అయితే, ఈ స్టేషన్‌లో చాలా తక్కువ సంఖ్యలో రైళ్లు ఆగుతాయి.
మరింత సౌలభ్యం కోసం, రక్సాల్‌లోని స్టేషన్‌ను ఎంచుకోవచ్చు.
💠 సీతామర్హి రైల్వే స్టేషన్: సుమారు 3 కి.మీ; సీతామర్హి బస్టాండ్: సుమారు 3 కి.మీ.
పుణ్యవతి
. 🕉️
_*సుభాషితమ్*_
ll శ్లోకం ll
*సాదన్యా జననీ లోకే స ధన్యో జనకః పితా |*
*ధన్యస్స పతిర్యస్య గృహే దేవి పతివ్రతాః||*
*పితృవంశ్యా మాతృ వంశ్యాః పతివంశ్యాస్త్రయస్త్రయః|*
*పతివ్రతాయాః పుణ్యేన స్వర్గే సౌఖ్యాని భుంజతే||*
తాత్పర్యం:
ఏ గృహమందు పతివ్రతయగు పుణ్యవతి అయిన శ్రీ యుండునో, ఆమె పాతివ్రత్య మహిమచే వారి తల్లియు, తండ్రియు ధన్యులగుదురు. అంతేగాక , భర్త కూడా పతివ్రతయగు భార్య యొక్క మహిమచే ధన్యుడగును. నారీమణి యొక్క పాతివ్రత్యమహిమ వలన పితృ వంశీయులున్ను, మాతృ వంశీయులున్ను, పతి వంశీయులున్ను, మూడు మూడు తరగతివార్లు స్వర్గమందు సౌఖ్యమును పొందగలరు.
ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 132* (చివరి భాగం)
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. ♦️ *ఆర్య చాణక్య*♦️
*పార్ట్ - 132* (చివరి భాగం)
వానప్రస్థ ఆశ్రమజీవితానికి ముహూర్తం నిశ్చయించుకున్నాడు చాణుక్యుడు.
అర్యుని ప్రియశిష్యుడూ, సహధ్యాయి ఇందుశర్మ దంపతులు కూడా చాణక్య దంపతులను అనుసరించడానికి నిశ్చయించుకున్నారు.
చంద్రగుప్త, రాక్షసామాత్యులు ఎన్ని విధాల ప్రార్థించినా, కనీసం బిందుసారుని పట్టాభిషేకం జరిగేవరకూ ఆగమని వారు అభ్యర్థించినా ఆర్యుడు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. చాణక్యుని ప్రియశిష్యులైన వినయుడు, సిద్ధార్థకుడు, నిపుణకుడు, సమిద్దార్ధకుడు, శార్జరవుడు, గుణశర్మ, సంఘభూతి, నారాయణ శిరోమణి, ఆగమసిద్ధి, శివనాధ వాచస్పతి తదితరులు ఆర్యునికి అర్ఘ్యపాద్యాదులిచ్చి గురుపూజ జరుపుకున్నారు. ఆర్యుడు ఒకసారి నిర్ణయం తీసుకున్నాడు అంటే దానిని మార్చుకోడని వాళ్ళకి తెలుసు.
ఆనాడు చాణక్యడు శివ-విష్ణు స్వరూపమైన 'పరబ్రహ్మము' వలె ప్రకాశిస్తున్నాడు. ఆతని సువిశాల పాలభాగం వేదములకు పుట్టనిల్లైన శారదాదేవి స్థానంవలె తేజరిల్లుతోంది. అతని నేత్రాలు జ్ఞానప్రకాశ ప్రతిరూపులైన సూర్యచంద్రులవలె ప్రజ్వరిల్లుతున్నవి. శివలింగమువలే కనబడుతున్న బోడిగుండు భూగోళము వలెనూ, దానిని అంటిపెట్టుకొని గాలికి ఊగుతున్న 'నల్లటిశిక' భూమండల భారాన్ని శిరస్సుపై భరిస్తున్న వేయి తలల ఆదిశేషుని వలెను కనబడుతున్నాయి. ఆర్యుని ఫాలభాగముపై తీర్చిదిద్దిన భస్మత్రిపుండ్రము త్రిగుణాతీతమైన, త్రికాలాతీతమైన, త్రిమూర్తత్మకమైన అతని విశిష్ట వ్యక్తిత్వమును చాటుతున్నవి.
చంద్రగుప్తుడు, అమాత్య రాక్షసుడు, భద్రభట, బాగురాయణాదులు, ఆర్యుని కుమార్తె అన్నపూర్ణ, అల్లుడు అగ్నిశర్మ, మనుమడు రాధాగుప్తుడు, ఇంకా సామంత ప్రభువులు, పురజనులు, పురోహితులు, ఇలా ఎందరో....
ఆశ్రుపూరిత నయనాలతో, భక్తి శ్రద్ధలతో ఆర్యునికి వీడ్కోలు పలకడానికి బారులు తీరి నిలిచారు. అందరి హృదయాలలో 'ఆర్యుని' సాన్నిహిత్యం, దర్శనం తమకింక లభించదన్న వ్యథ....
అవును మరి...
ఎక్కడో....
దక్షిణాంధ్ర దేశమందలి బ్రాహ్మణ అగ్రహారంలో శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో ....
పరమ పవిత్రుడైన కుటల మహర్షి గోత్రోర్భవుడై జన్మించి...
చతుర్వేద పారంగతుడై తక్షశిలా విశ్వవిద్యాలయ ఆచార్య పదవిని అధిష్టించి, సర్వశాస్త్రనిష్ణాతుడై, ప్రవక్తయై, ధర్మనిరతుడై తేజరిల్లి...
'అర్థశాస్త్రము'ను యావత్తు ప్రపంచం ప్రజల సముజ్వల భవిష్యత్తుకై రచించి....
వరద వెల్లువలవలె దుమికి వచ్చిన యవన విజృంభణమునకు అడ్డుకట్టవేసిన స్థితప్రజ్ఞుడిగా భాసిల్లి....
ధర్మస్థాపనోద్దేశముతో సువిశాల మౌర్యసామ్రాజ్య స్థాపనకు బాటలు వేసి ....
'ధర్మోరక్షతి రక్షితః' అన్న వేదవాక్కుకు సరికొత్త అంతరార్ధాన్ని ప్రబోధించి...
నిస్వార్ధ, నిర్వికార, నిగర్వవర్తనుడై తేజరిల్లున ఆర్యచాణక్యుడు ....
స్థితప్రజ్ఞుడుగా, మహామేధావిగా, బహుముఖ ప్రజ్ఞాపారంగతుడుగా అడుగడుగునా తన విశిష్ట వ్యక్తిత్వాన్ని చాటుకున్న కారణజన్ముడు ఆర్యచాణక్యుడు...
ఈ ప్రపంచ నాటక రంగస్థలముపై తన పాత్ర అవసరము తీరినది గ్రహించిన మరుక్షణమే... స్వధర్మాచరణకై తపోదీక్షకై వనవాసమునకు వెడలనున్నాడు...
అతనికి అస్తిత్వమే తప్ప ఆస్థిలేదు...
అతనికి అభిమానజనహృదయ నివాసమే తప్ప శాశ్వత నివాసం లేదు...
అతనికి దీనజన బాంధవ్యమే తప్ప బంధుజన పరిగణం లేదు...
అతనికి ధర్మ పరిరక్షణాధికారమే తప్ప అధికారం లేదు...
అతనికి ఐహిక ఆముష్మీకముల కొరకే సంసారము తప్ప సంసారంతో వేరు పనిలేదు...
అందుకే...
వ్యామోహరహితుడై...
నిర్వికార నిరంజనుడై...
ఆశ్రమధర్మాలలోని ఆఖరి అంకాలను నిర్వర్తించడానికి...
పరమపవిత్రమైన, మునుపేందరో మహర్షులు వసించిన నైమిశారణ్య తపోభూమికి కదిలినాడు...
ఆర్యుడు సతీసమేతంగా...
చంద్రగుప్త, రాక్షసామాత్యాది ప్రియతములూ, సిద్ధార్థక, శార్జరవ, వినయ, నిపుణకాది ప్రియశిష్యులు కన్నీళ్ళతో భక్త్యంజలులు ఘటిస్తూ వీడ్కోలు పలుకుతుండగా....
ఇందుశర్మ దంపతులు అనుసరిస్తుండగా....
మహాప్రస్థానాన్ని అన్వేషిస్తూ కదిలిన ఆర్యుడు అపర బ్రహ్మవలే మహాతేజస్సుతో భాసించాడు.
ఈ ధరిత్రి ఉన్నంతకాలం....
ధరిత్రిపై మానవజాతి ఉన్నంతకాలం...
మహోన్నతమైన మానవజాతి చరిత్రలో ఆర్యుని జీవిత సారాంశం ప్రత్యేక అధ్యాయనమై భాసిల్లుతుంది.
"అర్థశాస్త్రము" చాణక్యుని కీర్తి ప్రతిష్టలకు కలికితురాయియై విరాజిల్లుతుంది.
"వాత్సాయన కామసూత్రాలు" ధర్మహితకరమైన దాంపత్య జీవితానికి, సత్సంతానసిద్ధికి మార్గదర్శకాలై శోభిల్లుతాయి.
"రాజనీతిసూత్రాణి" బాలలను అత్యుత్తమ భావిపౌరులుగా తీర్చిదిద్దుతుంది.
ఆర్యచాణక్య చరితం అజరామరం...
భారత జాతిలో ఆర్యుడు ఆణిముత్యం ...
,*🌹శుభం 🌹*
*🙏సమాప్తం🙏🏻*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
మనసెరిగిన మాధవుడు.*
*మనసెరిగిన మాధవుడు.*
👏👏👏
*గుడి తలుపులు తెరచుకుంటూ లోపలకు వెళ్లాడు పూజారి. చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. ప్రకృతికి కూడా కారణం తెలిసినట్లుంది. నిశ్శబ్దంగా ఉంది. *
*ఈ రోజే స్వామి సేవాభాగ్యానికి ఆఖరి రోజు అన్న ఆలోచనే అతనికి భరించరానిదిగా ఉంది. భార్యాబిడ్డలకు ఎలా నచ్చచెప్పాలో తెలియడం లేదు. తన బాధ ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు. అతని గోడు వినే వారెవరూ?*
*నిజానికి ఇందులో ఎవరి తప్పిదమూ లేదు. ఎవరికీ అతనంటే వ్యతిరేకత లేదు. కాలానుగుణంగా వచ్చిన వృద్ధాప్యమే అతని పాలిట శాపంగా మారింది.*
*మెల్లిగా పుష్పాలను కృష్ణుని పాదాల దగ్గర ఉంచి కన్నీళ్ళతో తలను పాదాల మీద ఉంచాడు. తనను తాను నిగ్రహించుకుంటూ పూజ చేయసాగాడు. హారతి ఇచ్చే సమయం వచ్చింది. పూజా విధులన్నీ అయిపోయాయి. ఇక ఆలయానికి తాళం వేయాలి. రేపటినుంచి తాను రాలేడు అన్న విషయం గుర్తుకొచ్చి వెక్కివెక్కి ఏడ్చాడు.*
*ఇంతకీ ఆ వృద్ధ పూజారి మనోవ్యధకు కారణమేమిటి? దాదాపు ముప్పయి ఏళ్లుగా ఎంతో భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో శ్రీ కృష్ణునికి సేవలందించాడు. అతని జీవితమే కృష్ణమయం అయ్యింది. ఎవ్వరి నోట విన్నా అతని దివ్యభక్తి గురించే చెపుతారు. *
*అయితే కాలానికి అందరూ తలవంచ వలసిందే కదా!. పూజారికి వృద్ధాప్యంవల్ల గూని వచ్చింది. దానితో స్వామి మెడలో పూలమాలలు వేయాలన్నా, ముఖానికి తిలకం దిద్దాలన్నా గూనితనం వల్ల చేయలేకపొతున్నాడు. అందుకే కమిటీ వారు అతని కుమారునికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆ రోజే అతని సేవలకు చివరిరోజు!. అదీ అతని వ్యధకు కారణం!!.*
*ఓ కృష్ణా! ఇదే నా ఆఖరి పూజ. ఇన్నేళ్ళకాలంలో నా వల్ల తెలిసిగాని, తెలియక గాని, అపరాధం జరిగి ఉంటే నన్ను క్షమించు. నీకు పూలమాలలు వేయలేకున్నాను. నుదుట తిలకం దిద్దలేకున్నాను. నువ్వే సర్దుకుపోయావు. ముసలితనం వల్ల నీ సేవకు దూరం అవుతున్నా. నేను నిస్సహాయుణ్ణి!! నన్ను మన్నించు కృష్ణా! అంటూ కన్నీటితో వీడ్కోలు పలికి ఆలయానికి తాళం వేసి భారమైన మనస్సుతో ఇంటి ముఖం పట్టాడు. తెల్లవార్లూ అతనికి నిద్రపట్టలేదు.చెప్పలేని బాధ అతన్ని స్థిమితంగా ఉండనీయలేదు. *
*తెల్లారింది!. కుమారుడు ఆలయానికి వెళ్లాడు. అప్పుడు జరిగింది అద్భుతం! నిజంగానే అద్భుతమే జరిగింది!!!.*
*కుమారుడు బిగ్గరగా అరుస్తూ, "నాన్నగారూ ! అద్భుతం జరిగింది. అద్భుతం జరిగింది!" అని నోట మాటరాక ఆయాసపడుతున్నాడు.*
*వృద్ధ పూజారి ఆశ్చర్యపోతూ, ఆలయానికి వచ్చి చూస్తే నిలబడి ఉన్న కృష్ణ విగ్రహం కూర్చోని ఉంది. అతని ప్రాణానికి ప్రాణమైన మాధవుడు మందస్మిత వదనంతో కూర్చోని అతనితో సేవలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. *
*తనతో సేవలు చేయించుకోవడానికి వీలుగా స్వామి తన భంగిమను మార్చుకున్నాడని అర్ధమవగానే ఆ వృద్ధుడు తన వయస్సు మర్చిపోయి విగ్రహాన్ని అల్లుకుపోయాడు. తన జన్మ సార్థకమైనదని ఆనందంతో కన్నీరు పెట్టసాగాడు.*
*భక్తి అంటే అదే కదా! తనకు తాను సంపూర్ణంగా స్వామి చరణాలకు సమర్చించుకోగలగడమే కదా! అలాంటి వారి పట్ల మాధవుడు కరుణ చూపడంలో ఆశ్చర్యం ఏముంది!*
*ఇది పూరి జగన్నాథుని క్షేత్రానికి దగ్గరలోని సాక్షి గోపాలుని మందిరంలో జరిగిన వాస్తవ సంఘటన. భగవంతుడు భక్తులపై చూపే కరుణకు ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటన.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
సుభాషితమ్
. 🕉️
_*సుభాషితమ్*_
ll శ్లోకం ll
*సాదన్యా జననీ లోకే స ధన్యో జనకః పితా |*
*ధన్యస్స పతిర్యస్య గృహే దేవి పతివ్రతాః||*
*పితృవంశ్యా మాతృ వంశ్యాః పతివంశ్యాస్త్రయస్త్రయః|*
*పతివ్రతాయాః పుణ్యేన స్వర్గే సౌఖ్యాని భుంజతే||*
తాత్పర్యం:
ఏ గృహమందు పతివ్రతయగు పుణ్యవతి అయిన శ్రీ యుండునో, ఆమె పాతివ్రత్య మహిమచే వారి తల్లియు, తండ్రియు ధన్యులగుదురు. అంతేగాక , భర్త కూడా పతివ్రతయగు భార్య యొక్క మహిమచే ధన్యుడగును. నారీమణి యొక్క పాతివ్రత్యమహిమ వలన పితృ వంశీయులున్ను, మాతృ వంశీయులున్ను, పతి వంశీయులున్ను, మూడు మూడు తరగతివార్లు స్వర్గమందు సౌఖ్యమును పొందగలరు.
శివానందలహరీ
శివానందలహరీ
గళంతీ శంభో ! త్వచ్చరిత సరితః కిల్బిషరజో
దళంతీ ధీకుల్యా సరణిషు పతంతీ విజయతామ్
దిశంతీ సంసారభ్రమణ పరితాపోప శమనం
వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహారీ.
శంకరా ! భవదీయ సౌందర్య చరితమ్ము
దేవనదీ భాతి దివిని సాగి ,
దుస్సహ కిల్బిష ధూళి నణచి బుద్ధి
యన్ పెనుకాల్వగా నవని సాగె
జనన మరణ చక్ర సంసృతి భ్రమణాన
సాగి హృత్ పరితాపశాంతి నిచ్చి
మామక మనసను మడుగులో జేరి తా
నవ్యయానంద భాగ్యమ్ము పంచె
సర్వ జనులకు నధ్యాత్మ సంప దిచ్చి
విభవ మొప్పగ జగమునన్ వెల్గు చున్న
సుందరంబైన శ్రీ శివానంద లహరి
యనుభ వింతురు గాకిల నఖిల జనులు 02 @
గోపాలుని మధుసూదన రావు 🙏
ఈదోషాలు విడిచిపెట్టండి
ఈదోషాలు విడిచిపెట్టండి!!!
*ఆహారం*
అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు.
మనలోని జీవశక్తి ని పెంపొందించేది అన్నం.
అయితే, ఈ అన్నాన్ని ఏ విధంగా, ఎక్కడ , ఎవరు వండి
వడ్డిస్తున్నారన్న
విషయం కూడా చాలా
ముఖ్యమైనది.
అందు వలననే పూర్వకాలంలో మడి, ఆచారాల విషయంలో
ఖచ్చితంగా వుండేవారు.
మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన
దోషాలు నిమిడివున్నాయి.
అర్ధ దోషం ,. నిమిత్త దోషం.
స్ధాన దోషం, గుణ దోషం ,
సంస్కార దోషం. ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని పెద్దలు చెపుతారు.
*అర్ధ దోషం:*
ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు.
భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు . భోజనం చేసి ,
సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు.
ఆ గదిలో నే శిష్యుడు దాచిన డబ్బు మూట వుంది. హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది ,
ఆ మూటలో నుండి
కొంచెం డబ్బు తీసుకుని
తన సంచీలో దాచేశాడు.
తరువాత శిష్యుని వద్ద
సెలవు తీసుకుని, తిరిగి తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు.
మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం
చెందాడా సాధువు.
తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే
తనకా దుర్బుధ్ధి కలిగిందని
రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు
అర్ధం చేసుకున్నాడు.
వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాడు.
శిష్యుడిని ఎలాటి వృత్తి ద్వారా డబ్బు
సంపాదిస్తున్నావని అడిగాడు.
శిష్యుడు తలవంచుకొని,
"నన్ను క్షమించండి, స్వామి! యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు. "అని తలవంచుకొన్నాడు.
ఈ విధంగా సన్మార్గంలో
సంపాదించని డబ్బు తో కొన్న పదార్థాలతో , తయారు చేసిన ఆహారం
భుజించడమే అర్ధ దోషం.
మనం న్యాయం గా సంపాదించిన దాని
తోనే ఆహారం తయారు
చేసుకుని , భుజించడం
ముఖ్యం.
*నిమిత్త దోషం*
మనం తినే ఆహారాన్ని
వండేవారు కూడా మంచి మనసు కలవారైవుఇంటికి
వారు సత్యశీలత కలిగి
దయ, ప్రేమ కల
మంచి స్వభావము కలిగిన వారిగా వుండాలి.
వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు , పక్షులు జంతువులు తాక కూడదు.
ఆహారం మీద దుమ్ము,
శిరోజాలు వంటివి పడ కూడదు.
అపరి శుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది.
దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి
దుష్ట గుణాలు అవతలివారికి కలుగుతాయి.
భీష్మాచార్యుల వారు కురు క్షేత్ర యుధ్ధం లో
బాణాలతో కొట్టబడి యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య
మీద ప్రాణాలతోనే వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు.
వారికి భీష్ముడు మంచి మంచి విషయాలను బోధిస్తూ వచ్చాడు.
అప్పుడు ద్రౌపది కి ఒక ఆలోచన కలిగింది.ఇప్పుడు ఇంత వివేకం గా ఆలోచిస్తున్న భీష్ముడు
ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ,ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు? అని అనుకొన్నది.
ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు
'అమ్మా ! నేను అప్పుడు
దుర్యోధనుని, ప్రాపకంలో
వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను.
నా స్వీయ బుధ్ధిని ఆ
ఆ ఆహారం తుడిచి పెట్టింది. శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం బిందువులుగా
బయటికి పోయి, నేను
ఇప్పుడు పవిత్రుడినైనాను.
నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను.
అన్నాడు భీష్ముడు.
చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చినది తినినందు వలన మనిషిలోని మంచి
గుణములు నశించి
'నిమిత్త దోషం ' ఏర్పడుతోంది.
*స్ధాన దోషం*
ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో,
అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి.
వంట చేసే సమయంలో
అనవసరమైన చర్చలు
వివాదాల వలన చేయబడిన వంట కూడా పాడైపోతుంది.
యుధ్ధరంగానికి , కోర్టులు ,రచ్చబండలు వున్న చోట్లలో వండిన
వంటలు అంత మంచివి కావు.
దుర్యోధనుడు ఒకసారి
యాభై ఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని విందు భోజనానికి పిలిచాడు.
కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును
నిరాకరించి, విదురుని
ఇంటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని
చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు
చేసింది. తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి, ఆనంద సంభ్రమాలతో తొట్రుపాటు పడిఅరటి పండుతొక్క ఒలిచి,
పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది.కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో
భుజించాడు.
ఇది చూసిన విదురుడు
భార్య వైపు కోపంగా చూశాడు.
కృష్ణుడు, " విదురా! నేను ఆప్యాయత తో కూడిన ప్రేమకోసమే ఎదురుచూస్తున్నాను.
నిజమైన శ్రధ్ధాభక్తులతో యిచ్చినది అది
కాయైనా , పండైనా, ఆకైనా, నీరైనా, ఏది ఇచ్చినా సంతోషంగా తీసుకుంటాను.' అని
అన్నాడు.
మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో
వడ్డించాలి.
*గుణ దోషం :
మనం వండే ఆహారం
సాత్విక ఆహారంగా వుండాలి.
సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని
కలిగిస్తుంది. రజోగుణం
కలిగించే ఆహారం మనిషిని లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది. తామస ఆహారం.
స్వస్తి!
శ్రీ చక్రం మానవ దేహం
శ్రీ చక్రం మానవ దేహం
ఈ జగత్తులో అంతర్గతంగా ఉన్న పరాశక్తిని కూడా దర్శించగలిగారు మన మహర్షులు. వివిధ శక్తులు, దేవతలు, ప్రాణులు అన్నీ ఆ పరాశక్తి నుండే ఉద్భవించాయి. అయినా వేటికి అవి ప్రత్యేక పని కొరకు ప్రత్యేక గుణములు కలిగి ఉంటాయి. అంటే ఒక గొలుసులోని వేరు వేరు లింకులన్నమాట. మానవ శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్థానము, పని ఉంటుంది. అలాగే ఈ విశ్వంలో ఒక్కొక్క దేవతకు ఉండవలసిన స్థానములు, చేయవలసిన పనులు, ప్రత్యేకంగా నిర్దేశించి ఉన్నాయి. ఈ దేవతలకు యంత్రం రూపమయితే, మంత్రం నాదమవుతుంది. వేదవాక్కులచే అట్టి దేవతలు ప్రత్యక్షమవుతారని, అనుగ్రహిస్తారని, తెలుసుకొన్న మన మహర్షులు మనకు మంత్ర, యంత్ర శాస్త్రాలను అందించారు. వేదమునకు మూలము నాదము. దాని నుండి బీజాక్షరములు ఉద్భవించి, మంత్రములుగా శక్తిని సంతరించుకున్నాయి.
యంత్రమంటే ఏమిటి ?
యంత్రమనగా ఆరాధించే దేవత యొక్క (శక్తి) స్వరూపమే. ఆ దేవతాశక్తి ఆ యంత్ర రూపంలో నిక్షిప్తమవుతుంది. మన పెద్దలు ఈ శక్తిని గుర్తించి, మూడు రకాలుగా భావించారు. అవి 1) ఇచ్ఛాశక్తి, 2) జ్ఞానశక్తి 3) క్రియాశక్తి. ఏ పని చేయాలన్నా ఆ పని చేయాలనే ‘ఇచ్ఛ’ (కోరిక) కలగాలి. అదే ఇచ్ఛాశక్తి. తరువాత ఆ పని ఎట్లా చేయాలని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి. ఇచ్ఛ, ఆలోచన జ్ఞానం రెండు కలిగిన తరువాత కార్యాచరణ జరుపటమే క్రియాశక్తి. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు. ఈ చరాచర సృష్టి మొత్తం ఈ మూడు శక్తుల కలయికే.
ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. శ్రీచక్రం లోని మూడు బిందువులలో ఉండే దేవతలు వీరే.
నేటి శాస్త్రజ్ఞులు కూడా, ఏ పదార్థమైనా శక్తి రూపాంతరమేనని చెబుతున్నారు. నేడు మనం చూస్తున్న విజ్ఞాన శాస్త్రం ద్వారా కనిపెట్టబడిన వస్తుజాలమంతా ఈ క్రియాశక్తి యొక్క రూపాంతరమే. విజ్ఞానవేత్తలైన మన మహర్షులు ఈ మూడు శక్తులు కలిసిన శక్తినే ‘ప్రకృతి’ అని, ‘పరాశక్తి’ అని, ‘అవ్యక్తం’, ‘శుద్ధమాయ’ అని అంటారు. అంటే యావత్తు ప్రపంచానికి (సృష్టికి) జన్మనిచ్చినది ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల కలయిక అయిన పరాశక్తే అని తెలుస్తున్నది. కాబట్టి ఆ పరాశక్తే ఈ జగత్తుకు మాత (తల్లి) అని శాస్త్రాలు నిర్ణయించాయి. త్రిమూర్తులకు, దేవతలకు వారి వారి విధి నిర్వహణకు కావలసిన శక్తు లన్నింటినీ ఆ జగన్మాత లేదా పరాశక్తి, వారికి అందిస్తోంది.
శ్రీ చక్ర ఆవిర్భావం
ఉండేది బ్రహ్మమొక్కటే. ఈ బ్రహ్మం సత్, చిత్, ఆనంద స్వరూపములు కలది. అది చలనము లేనిది, నిశ్చలమైనదైనప్పటికి, చేతనం అనే బీజం కలిగి ఉండుటం దానిలోని విశేషం.
కేవలం కాంతి (ప్రకాశ) రూపముగానున్న బ్రహ్మమునందు ఏర్పడిన మొదటి కదలికను ‘విమర్శ’ (ఆలోచన) అన్నారు. తాంత్రికులు కాంతిని పరమశివుడుగాను, విమర్శను పరాశక్తిగాను భావించారు. కాంతి (ప్రకాశ) స్వరూపమైన బ్రహ్మములో ఏర్పడిన మొదటి కదలికవల్ల నాదము ఏర్పడినది. ఈ ప్రథమ నాదము సూక్ష్మరూపమైన బిందువుగా ఏర్పడినది. ఈ బిందువునందే కేంద్రీకరించబడిన శివశక్తుల విజృంభణము కలదు. దీనినే ”పరాబిందువు” అందురు. ఇందులో కామేశ్వర, కామేశ్వరీ స్వరూపములు కలవు. ఈ బిందువే మూల ప్రకృతి. దీనికే సర్వానందమయ చక్రమని పేరు. ఈ బిందువే శ్రీచక్రమునకు ఆధారము. ఈ పరాబిందువు నందే సృష్టికి కావలసిన శక్తి అంతా బీజప్రాయంగా ఉన్నది. సృష్టి జరుగుటకు ఈ పరాబిందువు కొంత క్రిందికి దిగివచ్చి శబ్ద బ్రహ్మముగా మారుతుంది. అనగా విత్తనము (గింజ) లో రెండు పప్పులు (బద్దలు) ఉన్ననూ చుట్టూ ఉన్న పొట్టు (పై పొర) వలన గింజ ఒకటిగా కనపడినట్లు ఈ పరాబిందువు నందు శివశక్తులొకటిగా ఉంటాయి.
srichakra1శ్రీ చక్రం – పరాశక్తి వేర్వేరు కాదు
అలా ఒకటిగానున్న పరాబిందువు నుండి మూడు బిందువులేర్పడినవి. 1) శివశక్తులొకటిగా నున్న ‘బిందువు’, 2) అచేతనంగా ఉన్న ‘శివుడు’, 3) ‘చేతనా స్వరూపమైన శక్తి’. ఈ మూడు బిందువులే త్రిగుణాత్మకము. త్రిపుటల సమ్మేళనము, త్రిపురముల మొదటి త్రికోణము. ఇది శివపార్వతుల ఏకరూపమైన అర్థనారీశ్వరతత్వాన్ని సూచిస్తోంది.
మనం పరాశక్తి శుద్ధ స్వరూపాన్ని దర్శించలేం, కనీసం ఊహించలేం. కనుక శక్తి మాత తన మొదటి రూపంగా శ్రీచక్రాన్ని నిర్మించింది. తదుపరి అనేక దేవీరూపాలను స్వీకరించి మనకు ఉపాసనా సౌలభ్యాన్ని కల్పించింది. శ్రీచక్రముతో ఈ సకల చరాచర జగత్తునకు నామరూపములకు, పదార్థము లకు సమన్వయం కలుగుచున్నది. పరాశక్తికి శ్రీ చక్రానికి ఏ మాత్రం భేదం లేదు. శ్రీ దేవియే శ్రీచక్రము. శ్రీమాత, శ్రీ విద్య, శ్రీచక్రములు వేరు వేరు కాదని, ఈ మూడూ ఒకే పరబ్రహ్మ స్వరూపమని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము తెలియచేస్తోంది.
శ్రీ చక్రం నందు లలితాదేవి ఎల్లప్పుడూ నివసించి ఉంటుంది. ఇటువంటి శ్రీవిద్యను, శ్రీచక్రోపాసనను మనువు, చంద్రుడు, కుబేరుడు, అగస్త్యుడు, లోపాముద్ర, అగ్ని, మన్మథుడు, సూర్యుడు, ఇంద్రుడు, శివుడు, స్కంధుడు, దూర్వాసుడు అను పన్నెండుమంది, పన్నెండు శాస్త్ర విధానములుగా ప్రవేశపెట్టినట్లు జ్ఞానార్ణవ తంత్రము తెలుపుచున్నది.
శ్రీ చక్ర నిర్మాణం
బిందువు, త్రికోణము, అష్టకోణచక్రము, అంతర్దశారము – బహిర్దశారమను దశత్రికోణ చక్రము, చతుర్దశారము, అష్ట దళ పద్మము, షోడశ దళ పద్మము, భూపురము అను తొమ్మిది ఆవరణము లతో కూడినది శ్రీచక్రం.
శ్రీచక్రంలో ఉన్న మొత్తము త్రిభుజాల సంఖ్య 43. మొత్తము పద్మముల సంఖ్య 24. మొత్తము వృత్తముల సంఖ్య 7 (బిందువుతో కలిపి). ఈ శ్రీచక్రములోని తొమ్మిది చక్రములను (శివచక్ర, శక్తిచక్రములను) నవయోనులని వ్యవహరిస్తారు. త్రికోణ, అష్ట కోణ, దశ కోణద్వయము, చతుర్దశ కోణములు ఐదూ శక్తి కోణములు. బిందువు, అష్ట దళము, షోడశ దళము, చతురస్రము అను నాలుగూ శివచక్రాలు. ఈ చక్రంలోని బహిర్దశార, అంతర్ద శారములను కలిపితే శ్రీచక్రము అష్టాచక్రా అవుతుంది.
నవద్వారా అంటే తొమ్మిది త్రికోణములు. వాటిలో నాలుగు శివాత్మకం, ఐదు శక్త్యాత్మకం.
శ్రీచక్రంలోని నవావరణములు ఆరోహణ క్రమంలో ఇలా ఉన్నాయి.
1. భూపుర త్రయం – త్రైలోక్య మోహన చక్రం
2. షోడశ దళ పద్మం – సర్వాశా పరిపూర చక్రం
3. అష్ట దళ పద్మం – సర్వ సంక్షోభిణీ చక్రం
4. చతుర్దశారము – సర్వ సౌభాగ్య చక్రం
5. బహిర్దశారము – సర్వార్థ సాధక చక్రం
6. అంతర్దశారము – సర్వ రక్షాకర చక్రం
7. అష్ట కోణము – సర్వ రోగహర చక్రం
8. త్రి కోణము – సర్వ సిద్ధిప్రదా చక్రం
9. బిందువు – సర్వానందమయ చక్రం
ఒక్కొక్క ఆవరణలోని దేవతలను సాక్షాత్కరించు కొనుటకు కొన్ని ప్రత్యేక బీజ మంత్రములు కలవు. శ్రీదేవీ ఖడ్గమాల స్తోత్రమునందు, శ్రీదేవీ బీజాక్షర సంబోధనమ్, న్యాసాంగ దేవతలు, దివ్యౌఘ గురువులు, సిద్ధౌఘ గురువులు, మానవౌఘ గురువులు, తొమ్మిద ఆవరణములలోని వివిధ దేవతలు నమస్కార నవాక్షరి దేవతల పేర్లు, విడివిడిగా, విపులముగా ఇవ్వబడ్డాయి. ఉదాహరణకు మొదటి ఆవరణలో త్రైలోక్యమోహన చక్రం, అచ్చటి దేవతలు అణిమాది సిద్ధులు. ఇవి మనలోని వివిధ రకములైన మానసిక ప్రవృత్తులు.
adi-parashaktiశ్రీ చక్రం – మానవ శరీరం
గమనించవలసిన విషయమేమంటే, ఈ జగత్తులోని సకల తత్వాలు, సకల భువనాలు, పరమశివుడు, పరాశక్తి మానవునియందు కూడా కలవు. మానవ శరీరమును రెండు భాగములుగా చూస్తే – నాభి నుండి పైభాగము ఊర్థ్వలోకమని, క్రింది భాగం అధోలోకమని, ఈ రెండింటిని కలిపే వెన్నెముకను మేరుదండమని అంటారు. శ్రీ చక్రమును కూడా మేరువు అంటాము. మేరుపర్వతము కూడా భూమికి ఇరుసు వంటిది. ఏ రకంగా పరాశక్తి దివ్యస్వరూప కాంతులచేత జగత్తంతా ప్రకాశవంత మవుతుందో, మన మేరుదండములోని కుండలినీ శక్తిచేత శరీరమంతా చైతన్యమవుతుంది.
మనలో ఆత్మ ఉన్నదని అంగీకరించినట్లే మన శరీర నిర్మాణ ప్రాధాన్యం కూడా గుర్తించాలి. నవావరణాత్మకమైన శ్రీచక్రానికి, మానవ శరీరానికి తేడా లేదని శాస్త్రం చెబుతోంది. శ్రీచక్రాన్ని ఆరాధిస్తే అన్ని దేవతామూర్తులను ఆరాధించినట్లేనని తంత్రశాస్త్రం తెలుపుతోంది.
శ్రీ అంటే శుభకరమైనది. దీనిని నవచక్రమని, వియత్‌చక్రమని, నవయోనిచక్రమని అంటారు. చక్రము ఎప్పుడూ పరిభ్రమిస్తుంది. దీనికి ఆద్యంతము లుండవు. కేంద్ర బిందువు నుండి పరిధి వరకు ఎక్కడ కొలిచిననూ సమానంగా ఉంటుంది. చక్రారాధనము ప్రతిమారాధన కన్న శక్తివంతం. మంత్రం వలె యంత్రం కూడా మహిమ గలదే.
దేహో దేవాలయః ప్రోక్తో
జీవో దేవస్సనాతనః
త్యేజేదజ్ఞాన నిర్మాల్యం
సోహంభావేన పూజయేత్ !
శరీరమే దేవాలయము. జీవుడే అక్కడి దేవుడు, అజ్ఞానమనే మాలిన్యాన్ని త్యజించాలి. ఆ దేవుడే నేననే భావమే పూజ. ఆ భావనతోనే అర్పించాలి.
కాబట్టి సాధకుని ధ్యానము, పూజ, భావన బాహ్యము నుండి లోనికి చొచ్చుకొనిపోయి ఆత్మను చేరుకోవాలి. విశ్వంలోని శక్తులన్ని ఈ నవావరణముల ద్వారా ద్యోతకమై మానవుని పంచకోశములందు అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములందు ఇమిడి ఉన్నవి.
నిరంతర సాధన మార్గం
శ్రీచక్రాన్ని మన శరీరంతో పోల్చి పరిశీలిస్తే ఆ జగన్మాత శ్రీ లలితాదేవి దర్శనం ఎంత దుర్లభమో అనిపిస్తుంది. మనలోని కర్మ, జ్ఞానేంద్రియాల వెంటపడి పరిగెత్తే మనస్సు, బుద్ధి, అహంకార, మమకారాలు, కామోద్రేకాలు, శృంగారాది నవరసాలు, జాగ్రద, స్వప్న, సుషుప్తాది అవస్థలు వీటిని నడిపే సత్వరజస్తమోగుణాలు – వీటిన్నిటిని ఆ శ్రీదేవి విభూతులుగా గ్రహించి, వీటన్నింటినీ దాటి బిందుస్థానమునకు చేరుకోగానే అచట అద్వితీయమైన, సచ్చిదానంద రూపమైన, సస్వరూపానుభవము కలుగుతుంది. అదే శ్రీమాత దర్శనం. ఇది ఎన్ని జన్మలకు సాధ్యమో!
త్రైలోక్య మోహన చక్రం నుండి సర్వానందమయ చక్రం వరకు మనం ఎక్కవలసిన మెట్లు, తొలగించుకో వలసిన తెరలు, అనుభవించవలసిన సుఖదుఃఖాలు అన్ని శ్రీచక్రంలో వలె మనలోనూ ఉంటాయి. ఈ ప్రయాణంలో అడ్డంకులు పూర్తిగా తొలగవు. మనమే జాగ్రత్తగా, నెమ్మదిగా వాటిని దాటుకుపోవాలి. వాటిని లేకుండా చేయలేం. అందువల్లనే త్యాగరాజస్వామి కూడా తెరను తొలగించమని ప్రార్థించారు తప్ప, తెరలేకుండా చేయమనలేదు. మనలోని ప్రాపంచిక మైన ముప్పది ఆరు తత్వములు, త్రిపుటలు, నవా వరణములను నిర్లిప్తతతో, నిష్కామంగా, నిస్వార్థంగా అనుభవిస్తూ గమ్యాన్ని చేరుకోవడానికి నిరంతర సాధన చేయాలే తప్ప వేరొక మార్గం లేదు.
Courtesy: Jagruthi Telugu
#SwamiParipoornanandaHinduInfo
శ్రీ వివేకానందస్వామి జీవిత గాథ🚩* *భాగం 1*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
*🚩శ్రీ వివేకానందస్వామి జీవిత గాథ🚩*
*భాగం 1*
ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ
వేదశాస్త్రాలు యిలా చాటుతున్నాయి..
దుర్లభమైన మానవదేహాన్ని దాల్చీ శాశ్వతానంద ప్రదమైన మోక్షాన్ని పొందటానికై సాధన చేయని వ్యక్తి జీవితం నిరర్థకమని. విషయసుఖాల్లోని వ్యామోహం సంసార తాపత్రయం కారణంగా ఆత్మజ్ఞాన సాధనల్లో అభిరుచి ఏర్పడదు. అజ్ఞానాంధకారజీవనం అలవడటంతో పరమాత్మజ్యోతిని దర్శించలేని వారిని తరించటం ఎలా?
సంసారసాగరంనుంచి తాము తరించటమే కాకుండా యితరులను తరింపచేయటానికై తమ జీవిత సర్వస్వాలను అర్పించే భగవదంశసంభూతులైన మహాత్ములు సమస్త ప్రజలకు మార్గ దర్శకులు అలాంటి మహనీయుల్లో అగ్రగణ్యుడు వివేకానందస్వామి.
వివేకానంద పూర్వీకుల వంశ చరిత్ర...
కలకత్తాలోని సిమ్లా అనే పేటలో వివేకానందుడి
వంశస్థులు అనేక శతాబ్దాలుగ సిరిసంపదలతో తులతూగుతూ దాతృత్వానికీ కాక పాండిత్యానికి, శక్తిసామర్థ్యాలకూ ప్రఖ్యాతిగాంచారు. వీరు కాయస్థకత్రియులు, వీరిని దత్తవంశస్థులని పేర్కొంటారు.
సంస్కృత పారసీక భాషల్లో అసమాన పాండిత్యాన్ని గడించి, న్యాయ శాస్త్రపారంగతుడై సాంసారిక జీవితాన్ని విడనాడి ఇరవై ఐదేళ్లు నిండకమునుపే సర్వసంగపరిత్యాగం చేసిన దుర్గాచరణ దత్తు ఈతడి తాత, దుర్గాచరణుడి పుత్రుడు విశ్వనాథుడు.
దుర్గాచరణుడి ధర్మపత్ని కాశీవిశ్వనాథుణ్ణి సందర్శించకోరి తీర్థయాత్రకు బయలుదేరింది.
కాశీక్షేత్రాన్ని చేరుకొని వివిధ దేవాలయాలను దర్శించసాగింది. ఒకరోజు ఆమె విశ్వనాథాలయానికి పోతూ కాలు జారిపడి స్మృతి కోల్పోయింది. వెంటనే ఒక సన్న్యాసి రివ్వున వచ్చి ఆమెను లేవదీశాడు. తనకు సహాయం చేసిన పరివ్రాజకుడు తన భర్త ఐన దుర్గా చరణుడే అని గుర్తించిన ఆమె ఆశ్చర్యానందాలను వర్ణించటం ఎవరితరం? ఇద్దరి హృదయాల్లోను భావతరంగాలు పొంగిపొర్లాయి. "ఆహా! మాయ! మహామాయ!" అంటూ యతిపుంగవుడు అదృశ్యుడయ్యాడు! ఆమే తన యాత్రలకై మరలింది.
విశ్వనాథుడు పెరిగి పెద్దవాడై పారసీక, ఆంగ్లభాషల్లోను, న్యాయ శాస్త్రంలోను ప్రావీణ్యం గడించి వంశపారంపర్య న్యాయవాద వృత్తిని అవలంబించాడు. అనతికాలంలోనే న్యాయశాస్త్రంలో అతడి పేరు నలు దిక్కుల్లోను వ్యాపించింది. విశ్వనాథుడి భోగభాగ్యవైభవాలచేత దత్తవంశం ప్రభువంశంగా పేరుగాంచింది. మరుసటి రోజును గురించి తలచక అడగాని వారి తప్పు అన్నట్లు దానధర్మాలు చేసే మహాదాత విశ్వనాథుడు. అల్పులపట్లా, అనర్హులపట్ల కూడ తాను కనబరుస్తున్న ఆదరణకు కుమారుడైన నరేంద్రుడు ఒకప్పుడు తనను నిలదీయగా, కారుణ్యమూర్తి ఐన ఆతడిలా అన్నాడు.
"నాయనా! మానస జీవిత మహాఘోర యాతనలు నీకేం తెలుసు? తాగటంచేత క్షణకాలమైనా తమ దుస్థితిని మరచిపోవాలనుకొంటారు యీ నిర్భాగ్యులు. ఈ దీనుల పట్ల జాలిపడటమా నా మహాపరాధం!! ఏమి దీనజన వాత్సల్యం! ఇలాటి కారుణ్యపయోనిధి కుమారుడై జన్మించిన వివేకానందుడు దరిద్రనారాయణ సేవకై తన జీవితాన్ని ధారపోయటంలో వింతేముంది?
విశ్వనాథుడి భార్య భువనేశ్వరీదేవి అతడికి తగిన సహధర్మచారిణి. నిత్యం రామాయణ మహాభారతాలను పారాయణచేస్తూ వాటిలోని ప్రశస్త భాగాలను కంఠస్తంచేసి, రామాయణ మహాభారత సారాన్ని నరేంద్రుడికి ఉగ్గుపాలతో పోసింది. నరేంద్రుణ్ణి దేశభక్తాగ్రగణ్యుడైన జాతీయ వీరుణ్ణి గావించింది మాతృబోధామృతమే అని చెప్పక తప్పదు.🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
మణిపూర్
ఉత్తర ఈశాన్య రాష్ట్రం అయిన మణిపూర్ మండుతున్నది!
ఏదో మాట వరసకి మండుతున్నది అనే పదం వాడడం లేదు! నిజంగానె మండుతున్నది!
May 3 న మొదలయిన ఘర్షణలు ఈ రోజుకి తీవ్ర రూపం దాల్చి చివరకి కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇవ్వాల్సిన స్థితిలోకి వెళ్ళిపోయింది మణిపూర్ రాష్ట్రం.
మణిపూర్ లో ఉంటున్న కుకీ, నాగా, మెతీ తెగల ప్రజల మధ్య తీవ్ర ఘర్షణలు జరగడం వల్ల చివరికి కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ.
గత నాలుగు రోజుల నుండి ఇంటర్నెట్, మొబైల్ సేవలని నిలిపివేశారు అధికారులు. కానీ ఘర్షణలు ఆగలేదు సరికదా ఇంకా పెరిగిపోయాయి.
*******************
మణిపూర్ లో జాతుల మధ్య వైరం ఎందుకు వచ్చింది?
1. మణిపూర్ లో ముఖ్యంగా మూడు తెగల ప్రజలు ఉన్నారు. కుకీ తెగ, నాగా తెగ, మెతీ[Meitie] తెగ ప్రజలు ఉంటున్నారు. అఫ్కోర్స్ 4వ తెగ అయిన కుకీ ఫంగల్ కూడా అక్కడ ఉంది.
2. కుకీ, నాగా తెగల ప్రజలు షెడ్యూల్ ట్రైబ్[ST] కింద రక్షణ పొందుతున్నారు. వీళ్ళు అందరూ క్రైస్తవులు.
3. మెజారిటీ తెగ ప్రజలు అయిన మెతీ ప్రజలు హిందువులు. వీళ్ళు మణిపూర్ లో గత 2 వేల సంవత్సరాలకి పై బడి ఉంటున్నారు.
4. ఇక మెతీ తెగ ప్రజలలో మతం మార్చబడ్డ ప్రజలని మెతీ పంగల్ లు అంటారు వీళ్ళు ముస్లిమ్స్.
5. మణిపూర్ రాష్ట్ర భౌగోళిక స్వరూపం ఎలా ఉంటుంది అంటే 22,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గా ఉంది. ఇందులో 10% లోయ ప్రాంతం[Valley] గా ఉండి ఒక మైదానం లాగా చదునుగా ఉంటుంది. మిగతా 90% ప్రాంతం మొత్తం ఎత్తైన పర్వతాలు, కొండలు లోయకి అన్ని దిశలలో వ్యాపించి ఉన్నాయి.
6. ఎత్తైన కొండ ప్రాంతాలలో కుకీ మరియు నాగా జాతి ప్రజలు ఉంటున్నారు. లోయలో ఉండే మైదాన ప్రాంతంలో మెతీ తెగ ప్రజలు ఉంటున్నారు.
7. మనకి స్వాతంత్ర్యం వచ్చాక కుకీ, నాగా ప్రజలని షెడ్యూల్ ట్రైబ్స్ జాబితాలో చేర్చారు. ఈ కుకీ, నాగా ప్రజలు మొత్తం కొండల మీద ఉంటారు.
8. ఈ కొండ ప్రాంతానికి రక్షణ గా ఆర్టికల్ 371c రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 371c అనేది దాదాపుగా కాశ్మీర్ కి సంబంధించిన ఆర్టికల్ 370 లోని నిబంధనలకి దగ్గరగా ఉంటాయి! అంటే ఈ కొండ ప్రాంతాలలో బయటి వాళ్ళు ఎవరూ స్థలాలు కొనడానికి వీలు లేదు.
9. ఈ కొండ ప్రాంతంలో ఉండే అడవుల లో కుకీలు, నాగాలు ఉండవచ్చు కానీ ఆ స్థలాలని అమ్మడానికి లేదు బయటి వాళ్ళు కొనడానికి లేదు.
10. కానీ అదే లోయలో ఉండే మైదాన ప్రాంతంలో ఎవరయినా స్వేచ్ఛగా స్థలాలు కొనవచ్చు, అక్కడ ఎవరయినా నివాసాలు ఏర్పరుచుకోవచ్చు. వ్యాపారాలు చేసుకోవచ్చు.
**********************
సమస్య ఎక్కడ వచ్చింది అంటే ఒకే రాష్ట్రంలో ఉన్న ప్రాంతాలకి వేర్వేరు చట్టాలు, అధికారాలని అమలు చేయడమే!
మణిపూర్ రాష్ట్రంలో కొండ ప్రాంతాల కోసం అంటూ ప్రత్యేకంగా ఒక హిల్ ఏరియా కమిటీ[Hill Area Committee-HAC] ఏర్పాటు చేశారు. ఈ హిల్ ఏరియా కమిటీ అనేది ఏదో ఆషా మాషీ కమిటీ అనుకుంటే పొరపాటే!
HAC లేదా హిల్ ఏరియా కమిటీ కి ఉన్న అధికారాలు ఏమిటే తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు.
***********************
మణిపూర్ రాష్ట్ర బడ్జెట్ శాసన సభ్యుల ఆమోదం పొందితే సరిపోదు! HAC కి బడ్జెట్ లో పొందుపరిచిన అంశాలు ఏమిటో తెలియచేయాలి. HAC సభ్యులు ఆ బడ్జెట్ లో కొండ ప్రాంతంలో ఉంటున్న కుకీ, నాగా ప్రజలకి వ్యతిరేకంగా ఏమీ లేవనీ..వాళ్ళ అభివృద్ధికి నిధుల కేటాయింపులో ఎలాంటి వివక్ష లేదని నిర్ధారించుకున్న తరువాత ఆమోదం తెలిపితే అప్పుడు మణిపూర్ రాష్ట్ర బడ్జెట్ కి సంపూర్ణ ఆమోదం లభిస్తుంది. HAC ఆమోదం లేకపోతే ఆ బడ్జెట్ కి విలువ ఉండదు!
అలాగే మణిపూర్ లాండ్ రెవిన్యూ మరియు లాండ్ రిఫార్మ్[MLR&LR] ల మీద HAC కి అధికారం ఉంది.
***********************
ఇప్పుడు అసలు సమస్యకి కారణం ఏమిటో చెప్తాను!
షెడ్యూలు కులాలు మరియు షెడ్యూల్ జాతులు కొరకు ఏర్పాటు చేసిన చట్టాలు ఎప్పుడయితే మొదలయ్యాయో అప్పటి నుండి మణిపూర్ లో ఉన్న కుకీ, నాగా ప్రజలకి ST హోదా కల్పించారు. అలాగే కొండ ప్రాంతాలలో ఉండే అడవులలో స్వేచ్చగా తమకి ఇష్టం వచ్చినట్లు బ్రతికే హక్కునీ కల్పించారు. ఇంతవరకు బాగానే ఉన్నా కుకీలు, నాగా లు మతం మారి క్రైస్తవం స్వీకరించాక వీళ్ళకి ST హోదాని ఎందుకు రద్దు చేయలేదు?
********************
అదే కొండ దిగువ ప్రాంతంలో ఉండే మీతీ ప్రజలని జెనెరల్ కాటగిరీ లో ఉంచేశారు ఎందుకు? వాళ్ళు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నందుకా? అసలు మణిపూర్ లో మూల వాసులుగా చెప్పబడే మీతీ ప్రజలకి ఎలాంటి ప్రత్యేక హక్కులు ఎందుకు లేకుండా చేశారు?
11. లోయ లోని మైదాన ప్రాంతంలో ఉంటున్న మితీ ప్రజల స్థలాలని ఎవరయినా కొనవచ్చు. బయటి వాళ్ళు అక్కడ ఉద్యోగ, వ్యాపారాలు చేయవచ్చు మరియు శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చు.
12. ప్రస్తుత సమస్యకి కారణం ఏమిటంటే వేల ఏళ్ల నుండి ఉంటున్న మితీ ప్రజలు మొదట్లో మెజారిటీగా ఉంటూ వచ్చినా కాల క్రమేణా మైనారిటీ ల కిందకి వచ్చేస్తున్నారు రాను రాను.
13. బంగ్లాదేశ్, మియాన్మార్ నుండి అక్రమంగా మణిపూర్ లోకి ప్రవేశించి వలస దారులు మీతీ ప్రజల అవకాశాలని కొల్లగొడుతున్నారు.
14. గత పదేళ్ల కి పైగా స్థానిక మితీ ప్రజలు మమ్మల్ని కూడా ST కేటగిరీ లోకి చేర్చి మాకు రక్షణ కల్పించండీ అంటూ ఆందోళనలు చేస్తూ వచ్చారు కానీ అక్కడి ప్రభుత్వాలు మొద్దు నిద్ర పోయాయి. చివరకి విసుగెత్తి రాష్ట్ర హైకోర్టుకి తమ సమస్యలని విన్నవించుకున్నారు. హైకోర్టు మితీ ప్రజల వాదనలని విన్న తరువాత మితీ ప్రజలని ST కేటగిరీలో చేర్చాల్సిందిగా కోరుతూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సినగా ఆదేశాలు ఇచ్చింది మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వానికి.
15. దాంతో ఆగ్రహించిన కుకీ, నాగా ప్రజలు మితీ ప్రజల మీద దౌర్జన్యానికి దిగారు.
16. కుకీ ప్రజలు సహజంగా వాడే కత్తులతో మరియు నాగా ప్రజలు AK-47 లతో విరుచుకు పడ్డారు.
17. అయితే కుకీ, నాగా ప్రజల ఆగ్రహానికి మరో ముఖ్య కారణం ఉంది: దశాబ్దాలుగా కుకీ, నాగా ప్రజలు కొండల మీద అడవులలో గంజాయి సాగు చేస్తూ వస్తున్నారు. గంజాయి పంట చేతికి వచ్చాక గంజాయి ని ప్రాసెస్ చేసి దానిని హెరాయిన్ గా మార్చి అమ్ముకుంటున్నారు.
18. మణిపూర్ అటవీ, రెవెన్యూ, పోలీసు అధికారులు ఇటీవలే దాడులు చేసి గంజాయి పంటని తగులపెట్టారు.
19. మరోవైపు కుకీ, నాగా ప్రజలు గంజాయి ని పండించడం తమ జన్మహక్కుగా భావిస్తూ అధికారుల మీద తిరగబడుతున్నారు తరుచూ! అసలు అడవులు తమవే అని వాదిస్తున్నారు కానీ అడవులలో ఉండడం వరకే వాళ్ళకి హక్కు ఉంది కానీ అటవీ స్థలాల మీద వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు. కానీ దశాబ్దాలుగా కొన్ని స్వార్ధ శక్తులు మరియు దేశ ద్రోహ శక్తులు కలిసి కుకీ, నాగా ప్రజలకి అడవులు మీవే అంటూ మభ్యపెడుతూ వచ్చాయి.
20. మరో వైపు ఆర్టికల్ 371C ఇస్తున్న రక్షణ ని ఆసరా చేసుకొని కుకీలు దేశద్రోహానికి పాల్పడుతున్నారు. నిజానికి కుకీ తెగ ప్రజలు మణిపూర్ తో పాటు పక్కనే ఉన్న బర్మా దేశంలో కూడా ఉన్నారు. బర్మా లోని సైనిక నియంత ప్రభుత్వం కుకీలని అక్రమంగా భారత్ లోకి పంపించడానికి సహకరిస్తూ వచ్చింది ఇన్నాళ్లూ!
21. మణిపూర్ లోని కొండ ప్రాంతాలలో నివసించే కుకీలు గంజాయిని పండించడం దానిని ప్రాసెస్ చేసి హెరాయిన్ గా మార్చి పక్కనే ఉన్న బర్మా దేశంలోకి మరియు బంగ్లాదేశ్ లోని తీసుకెళ్ళి అక్కడ ISI ఏజెంట్లకి అమ్ముతున్నారు. పాకిస్థాన్ ISI కి డబ్బు సమకూరే మార్గాలలో మణిపూర్ లోని కుకీ లు ఉంటున్న అడవులు ఒక మార్గం. కుకీల కి తక్కువ డబ్బు ఇచ్చి హెరాయిన్ ని కొని దానిని అంతర్జాతీయ మార్కెట్ లో ఎక్కువకి అమ్మి దానిని డాలర్ల రూపంలోకి మార్చుకుంటున్నది ISI.
22. పాకిస్థాన్ ISI, బర్మా లోని సైనిక నియంత ప్రభుత్వ అధికారులు, చైనా తో కలిసి మణిపూర్ భౌగోళిక స్వరూపాన్ని మార్చేశారు దశాబ్దాలుగా.
23. బర్మా లో ఉండే కుకీలని మణిపూర్ లోకి రప్పించి వాళ్ళకి దొంగ ఆధార్ కార్డులని ఇస్తూ వచ్చారు మణిపూర్ లో ఉంటున్న కుకీలు! ఈ అక్రమ వలసలని బర్మా లోని సైనిక జుంటా ప్రభుత్వం ప్రోత్సాహిస్తున్నది దశాబ్దాలుగా! దీని వల్ల బర్మా నుండి వచ్చిన కుకీ లకి మణిపూర్ లో ST హోదా వస్తుంది!
24. ఎక్కడో కొండ ప్రాంతాలలోని అడవులలో కంప్యూటర్లు, ప్రింటర్లు, లామినేషన్ మిషన్లు పెట్టుకొని నకిలీ ఆధార్ కార్డులు ప్రింట్ చేస్తున్నారు కుకీలు. వీళ్ళకి ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చాయి? ISI వీళ్ళకి ఇవన్నీ సరఫరా చేసి ట్రైనింగ్ ఇచ్చి మరీ ప్రోత్సహిస్తూ వచ్చింది.
25. ఒక్క బర్మా నుండి వచ్చే కుకీలకే కాదు నకిలీ ఆధార్ కార్డులు ఇచ్చేదీ. బంగ్లాదేశ్ నుండి అక్రమంగా మణిపూర్ లోకి వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తూ వచ్చారు. దాంతో మైదాన ప్రాంతంలో ఉంటున్న హిందూ మితీ ప్రజల మెజారిటీ తగ్గిపోతూ అక్రమ వలస దారుల సంఖ్య పెరిగిపోయి మితీ ప్రజల జీవనోపాధికి గండి పడ్డది.
26. సమస్య మితీ ప్రజలకి ST హోదా ఇవ్వమని కేంద్రానికి సిఫారసు చేయమని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పెద్దది అయ్యింది.
**********************
కుకీలకి, నాగాలకి AK-47 లు కొనేంత స్థోమత ఉందా? హింసకి దిగమని మతాధికారుల నుండి సూచనలు వచ్చాయా?
వారం క్రితం బర్మా కి భారత్ వార్నింగ్ ఇచ్చింది అక్రమంగా కుకీలని బర్మా నుండి మణిపూర్ లోకి పంపించడం మీద కూడా ఒక కారణం!
మణిపూర్ మెతీ హిందూ ప్రజలు మూడు డిమాండ్లు చేస్తున్నారు ఇప్పుడు.
1. తమకి ST హోదా ఇవ్వాలి హైకోర్టు ఆదేశాల మేరకు.
2. తక్షణమే NRC ని అమలు చేసి అక్రమ వలసదారులని గుర్తించి బయటికి పంపించేయాలి.
3. UCC–యూనిఫాం సివిల్ కోడ్ చట్టాన్ని వెంటనే అమలులోకి తీసుకురావాలి.
4. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి డిమాండ్లు చేయట్లేదు అంటే మణిపూర్ లో పరిస్థితి ఎలా ఉందో మనం ఆలోచించుకోవాలి!
************************
భారత దేశం మొత్తం 8 క్లాసికల్ డాన్స్ లలో మణిపురి డాన్స్ కూడా ఉంది. మణిపురి నృత్యం ప్రధానంగా రాధా కృష్ణ ల రాస లీల ల మీద ఆధారపడి ఉంటుంది. ఇది పురాతన నృత్య రీతి. మణిపురి డాన్స్ అనేది చాలా పురాతనమయిన వైష్ణవుల పండుగ[pre-Vaishnavite period] అయిన ‘లాయ్ హారోబ[Lai Haraoba] సందర్భంలో ఉద్భవించిన ప్రాచీన నృత్య రీతి నుండి ఇప్పటి మణిపురి డాన్స్ గా రూపాంతరం చెందింది. మనకేం పట్టింది అని వదిలేస్తే ప్రాచీన సంస్కృతి కి నిలయమయిన మణిపూర్ రాష్ట్రం తన పూర్వ వైభవాన్ని కోల్పోతుంది!
అందరం హాష్ టాగ్ చేస్తూ #Save_Manipuri_Save_Meitei అని వైరల్ చేద్దామా?
జై హింద్! జై భారత్!
పార్ధసారధి పోట్లూరి
నిరుపయోగం
శ్లోకం ☝️
वृथा वृष्टिः समुद्रेषु वृथा तृप्तेषु भोजनम् ।
वृथा दानं धनाढ्येषु वृथा दीपो दिवापि च ॥
శ్లోకం:
వృథా వృష్టిః సముద్రేషు , వృథా త్రుప్తేషు భోజనం ।
వృథా దానం ధనాఢ్యేషు, వృథా దీపో దివాపి చ ॥
Meaning:
Rain on the seas, food given to the hunger satisfied, charity given to the rich and lamp lighted in the day are all waste.
తాత్పర్యం:
సముద్రమునందు పడిన వర్షము వృద్థా అంటే నిరుపయోగం, తృప్తిగా తినిన వానికి భోజనము పెట్టడం వృథా, ధనం పుష్కలంగా ఉన్న వారియందు దానము చేయుట వృథా, మరియూ పగటి పూట దీపం వెలిగించుటయు వృథా!!
అంటే ఇటువంటి దానములు చేయరాదు అని సుభాషితార్థం.
సముద్రమందు కురిసిన వర్షం పూర్తిగా వృథా యగును. అదే భూమి మీద పడితే పంట పొలాల సాగుకి పనికి వస్తుంది, జలాశయాలు నిండడం ద్వారా ప్రజల దాహార్తిని తీరుస్తుంది. భూగర్భ జలాలు వృద్ధి చెందడం ద్వారా సేద్యాలకి పనికి వస్తుంది. “బోరు” బావులు నిండడం వలన నగరాలలో నీటి ఎద్దడి తీరుతుంది.
కడుపునిండిన వానికి, సంత్రుప్తిగా భోజనం చేసిన వానికి మరల భోజనం పెట్టడం పూర్తిగా వ్యర్థం అవుతుంది. అదే ఆకలిగొన్న వానికి పెడితే అమృతంలా అస్వాదిస్తాడు. వాని ఆకలి తీరుతుంది. నిరుపేదలు, రెండు పూటలా భోజనం చేయలేని వారు చాలా మంది ఉన్నారు. అటువంటి వారికి పెడితే వాళ్ళు సంతోషిస్తారు.
పుష్కలంగా ధనం ఉన్నవానికి దానం చేయడం అపాత్ర దానం అవుతుంది. కానీ ప్రపంచ దేశాలలో జరుగుతున్నది ఇదే. ప్రభుత్వాల చట్టాలన్నీ వారికి ఋణాలు ఇవ్వడానికే అన్నట్టు ఉంటాయి. అదే అవసరమైన వానికి దానం చేస్తే ఉపయోగిస్తుంది, సద్వినియోగమవుతుంది.
సముద్రమందు కురిసిన వర్షం, కడుపు నిండిన వానికి భోజనం, పుష్కలంగా డబ్బు ఉన్నవానికి దానమూ వ్యర్థం. పట్ట పగలు దీపం వెలిగించినా కూడా వ్యర్థం. బాగా వెలుతురు ఉన్న సమయములో దీపకాంతి వ్యర్థం, ఏ మాత్రమూ కనిపించదు దాని వైపు చూస్తే తప్ప.
అనగా అపాత్ర దానము వలదని భావము.
సమయోచిత కార్యం చేయుటయే సరియైన కర్తవ్యమని నిర్దేశించే సుభాషిత శ్లోకం
పంచాంగం 04.08.2023 Friday,
ఈ రోజు పంచాంగం 04.08.2023 Friday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు అధిక శ్రావణ మాస కృష్ణ పక్ష: తృతీయా తిధి భృగు వాసర: శతభిషం తదుపరి పూర్వాభాధ్ర నక్షత్రం శోభన యోగ: భద్ర తదుపరి బవ కరణం ఇది ఈరోజు పంచాంగం.
తదియ మధ్యాహ్నం 12:48 వరకు.
శతభిషం ఉదయం 07:08 వరకు తదుపరి పూర్వాభాధ్ర రేపు తెల్లవారుఝామున 04:44 వరకు.
సూర్యోదయం : 05:59
సూర్యాస్తమయం : 06:45
వర్జ్యం : మధ్యాహ్నం 12:54 నుండి 02:20 వరకు.
దుర్ముహూర్తం: పగలు 08:33 నుండి 09:24 వరకు తిరిగి మధ్యాహ్నం 12:47 నుండి 01:38 వరకు.
రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.
యమగండం : 03:00 నుండి 04:30 వరకు.
శుభోదయ:, నమస్కార:
_ద్విపాత్రాభినయమైతే
*_ప్రవచనమే_* *_ద్విపాత్రాభినయమైతే..!_*
_ఒకరేమో పువ్వులపై నడిపిస్తూ.._
_మరొకరేమో నవ్వులతో తడిపేస్తూ.._
_ఒకరేమో విషయాన్ని ముక్కుసూటిగా.._
_మరొకరేమో అటు తిప్పి ఇటు తిప్పి అక్కడికే.._
_ఒకరేమో అలౌకిక_
_ప్రపంచవిహారం.._
_మరొకరేమో లౌకికప్రపంచ సంచారం.._
_ఒకరేమో నేరుగా_
_విశ్వేశ్వరుని సన్నిధికి.._
_మరొకరేమో విశ్వం మొత్తం తిప్పి అలా అదే సన్నిధికి.._
_ఒకరేమో విచ్చుకునే_
_అంతరంగం.._
_మరొకరేమో టింగురంగం.._
_ఒకరేమో పంచె.._
_లాల్చీ..కండువా.._
_మరొకరేమో అదే పంచె.._
_ఆపై కోటు.._
_ఒకరేమో నిరాడంబరం.._
_మరొకరేమో గండపెండేరం.._
ఇద్దరి కతా ఆధ్యాత్మికతే..
ఒకే లక్ష్యం..ఒకటే గమ్యం..
విషయం అదే..
చెప్పే తీరు వేరు..
*_చాగంటి గుడిగంట.._*
*_గరికపాటి ఆ గుడిలో_* *_హోమం మంట.._*
రామాయణమైనా..
భారతమైనా..
భాగవతమైనా..
శివపురాణమైనా..
కార్తీక పురాణమైనా..
చాగంటి చెబితే తన్మయం..
గరికపాటి పలికితే విస్మయం..
ఒకరు వివరిస్తే
ఇదే ప్రపంచమని అనిపిస్తుంది..
మరొకరు సవరిస్తే
ఇదా ప్రపంచమని
అనిపిస్తుంది..
ఇద్దరూ ప్రవచనకర్తలే..
ఒకరేమో పరవశకర్త..
మరొకరేమో తన వశకర్త..!
ఇద్దరూ మహా పండితులే..
పూజ్యులు..మాన్యులు..
మించి ధన్యులు..!
ఇద్దరి ధారణ అసాధారణం..
మాటల మూటలు..
విషయ పరిజ్ఞానం
సాగర పర్యంతం..
ధాటి అనంతం..
మాటాడుతుంటే
గుడిగంటల సవ్వడి వోలె
గంటలు గంటలు..
వినాల్సిందే ఆసాంతం..!
_ఒకరేమో భగవంతునికి_
_నిన్నటి ప్రపంచపు ఉత్తరం.._
_మరొకరేమో నేటి లోకపు_
_ప్రత్యుత్తరం.._
_*ఇద్దరి కీర్తీ లోకోత్తరం..!*_
_ఇద్దరిదీ ప్రియవచనం.._
_ఇద్దరూ ప్రవచనానికి బహువచనం..!.._
పంచాంగం
🌹🌹🌹🌹🌹
నేటి పంచాంగం
🕉️🔯🕉️
🙏🏻సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
🌹🙏నోముకి వ్రతానికి తేడా ఏమిటి....???? ?
భగవంతుని పూజించడానికి అనేకానేక మార్గాలలో నోము , వ్రతము లు అనేవి ముఖ్యము గా స్త్రీలు పాటించేవాటిలో సాధారణమైన భక్తి విధానాలు . భగవంతుడు - దేవుడు అనేది మానవుని నమ్మకము .
దండము పెట్టి దక్షిణ ఇస్తే చేసే పాపాలు పోయి పుణ్యము వస్తుందంటే నవీనకాలము లో శాస్ర ప్రరంగా నమ్మకము కుదరడలేదు . ఏది ఏమైనా మన ప్రాచీన గ్రంధాలు లలో ఉన్న ప్రకారము ....
నోము :
మనస్సుని కేవలము భగవంతుని పైనే లగ్నము చేసి స్వామిని పూజించి ధ్యానము చేసేది - నోము . ఉదా:శ్రావణమంగళవారం నోము , అట్లతద్ది నోము . నోములు నోచుట అనాదిగా ఆచారముగా ఉన్నది.
స్త్రీలకు బాల్యము నుంచి సదాచార సంపత్తులను సంప్రాప్తింప జేయుటకు గాను ఈ నోముల ఆచారం ఏర్పడి ఉండవచ్చును.
ఈ నోములలో చిన్నతనం నుండి స్త్రీలు కోరవలసిన సామాన్య సుఖసంతోషాలు మొదలుకొని వార్ధక్యములో వాంఛించు కైవల్యప్రాప్తి కొరకు కోరికలకు తగినట్లుగా ఆచరించవలసిన నోములు కలవు.
ఈ నోములలో నిగూఢమై యున్న మొదటి ధర్మము వితరణం అనగా ఉన్నంతలో పండో, పత్రమో, వస్తువో, ధనమో, ధాన్యమో, భోజనమో ఇతరులకు ఇవ్వడము.
వ్రతము :
అత్యంత నియం నిష్టలతో మంత్రోచ్చాటనలతో ధూపదీప నైవేద్యాలతో భగవతుని (దేవుని లేదా దేవతను )సేవించేది వ్రతము . వ్రతము ... అనగా దీర్ఘకాలాను పాలనీయమైన సంకల్పము.
సంకల్పము అనగా "ఇది నేను చేయవలెను, విడవరాదు" అనుకొనుట. నియమ-నిబంధనలతో ఉపవాసము తో చేసే పూజ లేక అరాధన .
వ్రతము లో సంకల్పము , దీక్ష , కథాపఠనము తప్పనిసరి . వ్రతము చేయుటవలన సమస్త పాపములు పోయి ...
పుత్ర పౌత్ర సంపదాభివృద్ధి , సర్వ సౌభాగ్యములు కలుగును. ఉదా: వరలక్ష్మీ వ్రతం. సావిత్రీ వ్రతం. గౌరీ వ్రతం. మున్నగునవి ...స్వస్తి..
సేకరణ