4, ఆగస్టు 2023, శుక్రవారం

నిరుపయోగం

 శ్లోకం ☝️

वृथा वृष्टिः समुद्रेषु  वृथा तृप्तेषु भोजनम् ।     


वृथा दानं धनाढ्येषु  वृथा दीपो दिवापि च ॥


శ్లోకం:


 వృథా వృష్టిః సముద్రేషు , వృథా త్రుప్తేషు భోజనం ।


వృథా దానం ధనాఢ్యేషు, వృథా దీపో దివాపి చ ॥


Meaning:


Rain on the seas, food given to the hunger satisfied, charity given to the rich and lamp lighted in the day are all waste.


తాత్పర్యం:


సముద్రమునందు పడిన వర్షము వృద్థా అంటే నిరుపయోగం, తృప్తిగా తినిన వానికి భోజనము పెట్టడం వృథా, ధనం పుష్కలంగా ఉన్న వారియందు దానము చేయుట వృథా, మరియూ పగటి పూట దీపం వెలిగించుటయు వృథా!!


అంటే ఇటువంటి దానములు చేయరాదు అని సుభాషితార్థం. 


సముద్రమందు కురిసిన వర్షం పూర్తిగా వృథా యగును. అదే భూమి మీద పడితే పంట పొలాల సాగుకి పనికి వస్తుంది, జలాశయాలు నిండడం ద్వారా ప్రజల దాహార్తిని తీరుస్తుంది.  భూగర్భ జలాలు వృద్ధి చెందడం ద్వారా సేద్యాలకి పనికి వస్తుంది. “బోరు” బావులు నిండడం వలన నగరాలలో నీటి ఎద్దడి తీరుతుంది.


కడుపునిండిన వానికి, సంత్రుప్తిగా భోజనం చేసిన వానికి మరల భోజనం పెట్టడం పూర్తిగా వ్యర్థం అవుతుంది. అదే ఆకలిగొన్న వానికి పెడితే అమృతంలా అస్వాదిస్తాడు. వాని ఆకలి తీరుతుంది. నిరుపేదలు, రెండు పూటలా భోజనం చేయలేని వారు చాలా మంది ఉన్నారు. అటువంటి వారికి పెడితే వాళ్ళు సంతోషిస్తారు.


పుష్కలంగా ధనం ఉన్నవానికి దానం చేయడం అపాత్ర దానం అవుతుంది. కానీ ప్రపంచ దేశాలలో జరుగుతున్నది ఇదే. ప్రభుత్వాల చట్టాలన్నీ వారికి ఋణాలు ఇవ్వడానికే అన్నట్టు ఉంటాయి. అదే అవసరమైన వానికి దానం చేస్తే ఉపయోగిస్తుంది, సద్వినియోగమవుతుంది.


సముద్రమందు కురిసిన వర్షం, కడుపు నిండిన వానికి భోజనం, పుష్కలంగా డబ్బు ఉన్నవానికి దానమూ వ్యర్థం. పట్ట పగలు దీపం వెలిగించినా కూడా వ్యర్థం. బాగా వెలుతురు ఉన్న సమయములో దీపకాంతి వ్యర్థం, ఏ మాత్రమూ కనిపించదు దాని వైపు చూస్తే తప్ప.


అనగా అపాత్ర దానము వలదని భావము.


సమయోచిత కార్యం చేయుటయే సరియైన కర్తవ్యమని నిర్దేశించే సుభాషిత శ్లోకం

కామెంట్‌లు లేవు: