17, మే 2021, సోమవారం

పది నిమిషాలు

 👩 పది నిమిషాలు భార్య ముందు కూర్చుంటే

జీవితం  యొక్క భాద్యత గురించి తేలుస్తుంది ..🙁


🍺పది నిమిషాలు తాగుబోతు ముందు కూర్చుంటే

జీవితం చాలా సింపుల్ అనిపిస్తుంది.....🙂


👩‍🚀పది నిమిషాలు సాధువులు, సన్యాసుల ముందు కూర్చుంటే

ఉన్నదంతా దానం చేయాలని అనిపిస్తుంది 😇


🦹‍♀️పది నిమిషాలు రాజకీయ  నాయకుడి ముందు కూర్చుంటే 

మనం చదివింది అంతా వృధా అనిపిస్తుంది...😔


 💷పది నిమిషాలు జీవిత బీమా చేసే ఏజెంటు ముందు కూర్చుంటే 

చస్తేనే మంచిదిమో అనిపిస్తుంది....😔


👨‍💼పది నిమిషాలు వ్యాపారుల ముందు కూర్చుంటే 

మన సంపాదన చాలా తక్కువ, దేనికీ సరిపోదు అనిపిస్తుంది....🙁



👨‍🔬పది నిమిషాలు శాస్త్రవేత్తల ముందు కూర్చుంటే 

మనం ఎంత అజ్ఞానులమో అనిపిస్తుంది...🧐


👨‍🏫పది నిమిషాలు ఉపాధ్యాయుల ముందు కూర్చుంటే 

మనం మళ్లీ విద్యార్థులం కావాలని అనిపిస్తుంది.📚


👨‍🌾పది నిమిషాలు రైతులు, కార్మికుల ముందు కూర్చుంటే 

వారు పడే కష్టం మనం పడడం లేదనిపిస్తుంది.😢


👮పది నిమిషాలు సైనికుల ముందు కూర్చుంటే 

వారి ముందు, మన త్యాగం, సేవలు ఏమీ కావనిపిస్తుంది.😒

      

👨 కానీ ఓ పది నిమిషాలు ఓ స్నేహితుని ముందు కూర్చుంటే 

జీవితం స్వర్గంలా ఉంటుంది.😄

👌👍👌👍👌👍👌👍👌

Important medical Information*

 *Important Information*


1️⃣ *Blood Pressure*

👉 120 / 80 --  Normal

👉 130 / 85 --  Normal  (Control)

👉 140 / 90 --  High

👉 150 / 95 --  Very High


2️⃣ *Oxygen Level)*

Check Through Oximeter

👉 94 - Normal

👉 95  To 100 - Good Oxygen Level

👉 94 To 90- Low Oxygen Level

👉 Below 90- Very Low Oxygen Level...

(To Be Hospitalised For Oxygen Support)


3️⃣ *PULSE* PR 

👉 72  Per Minute  (Standard)

👉 60 -- 80 P.M. (Normal)

👉 90 ते 120  Pulse - Increased (High)


4️⃣ *TEMPERATURE*          

👉 92 - 98.6  F - (Normal)

👉 99.0 F - Normal Fever

👉 100 .F ते 102 F  High Fever


5️⃣ *HRCT Means CT SCAN Through Checking Of Corona Infection....*

👉 HRCT Score: 0 - 8  (Mild Infection). 

👉 HRCT Score: 9 - 18  (Moderate Infection). 

👉 HRCT Score: 19 - 25  (Severe Infection)


Good Info to share.👍

అరుణాచల ఆలయంలో

 *అరుణాచల ఆలయంలో జరిగిన యదార్థ సంఘటన.*


ఒకసారి అరుణాచల ఆలయ ప్రాంగణం లో ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా వారి దృష్టి అరుణాచలుని సన్నిధి లోని హుండీపై పడింది.


ఆ పిల్ల లిద్దరు హుండీ లోని పైసల్ని ఎవరూ లేనపుడు సన్నని రేకుతో లాగి తీయటం ప్రారంభించారు.


అందులో ఒకడు "ఒరేయ్ ఎవరన్నా చూస్తున్నారేమో - చూడరా అన్నాడు ఇంకొకడితో.

రెండవవాడు చుట్టూ చూసి.... అరుణాచలుడు ఇంతేసి గుడ్లు ఏసుకొని చూస్తున్నాడురా అన్నాడు.


ఇద్దరు అరుణాచలునికి ఎదురుగా నిలబడి 'మా దొంగ తనం బయట పడకుండా చూచే బాధ్యత నీదే, అందుకు పటిక బెల్లంలో మూడవ వంతు నీకిస్తాము, ముగ్గురం సమానంగా తీసుకుందాం, ఇది మన ఓడంబడిక ( అగ్రిమెంట్ )' అన్నారు.


ఇలా ప్రతీ రోజూ పటిక బెల్లం అరుణాచలునికి పెడుతున్నారు, ఆశ్చర్యం గా శివుని ముందు పెడుతున్న పటిక బెల్లం  మాయమవుతోంది.


ఒకరోజు ఆలయ పూజారి ఇద్దరు దొంగల్ని పట్టుకొని ఆలయ అధికారికి అప్పగించాడు... వీళ్లిద్దరూ ఎనిమిదేళ్ల  పసి కాయలు, వీళ్ళను ఎలా శిక్షించాలి అని.


'అరేయ్ పిల్లలూ...! మీరు ఇద్దరూ అంతరాలయంలో 108 ప్రదక్షిణలు చేయండి. ఇదే మీకు శిక్ష...!' అన్నాడు అధికారి.


పిల్లలు ఇద్దరూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు. ఆలయ పూజారి, అధికారి దూరంగా కూర్చుని పిల్లల ప్రదక్షిణాలు చూస్తున్నారు వినోదంగా. 


ఇంతలో పూజారి , అధికారి ఒక్కసారిగా తృళ్లి పడ్డారు. పరిశీలించి పిల్లల్ని మరొకసారి  చూసారు. ఆ ఇద్దరి పిల్లలతో పాటు, ఎవరో మూడవ పిల్లవాడు కూడా ప్రదక్షిణ చేయడం కనిపించింది. మూడవ పిల్లవాడు మెరిసిపోతున్నాడు... మళ్ళీ మాయమవుతున్నాడు మాటిమాటికీ. ఇది గమనించి అధికారి మెల్లగా పిల్లల్ని సమీపించి మూడవ పిల్లవాడిని  గట్టిగా వాటేసుకున్నాడు.


అద్భుతం!!

మూడవ పిల్లవాడు కాంతిరేఖగా మారి, గర్బాలయంలోకి వెళ్లి మాయమైపోయాడు.


అరుణాచళేశ్వరుడు దొంగ పటిక బెల్లం మూడవ వంతు తిన్నాడు కదా...! అందుకని పరమేశ్వరుడు వారితో ప్రదక్షిణ చేస్తున్నాడన్నమాట.


ఆ అధికారి పిల్లల్ని బుజ్జగిస్తూ "అసలేం జరిగింది...?" అని అడిగాడు. పిల్లలు అరుణాచళేశ్వరుని వాటా గురించి చెప్పారు. 


అది విని పూజారీ...అధికారీ కూడా ఆశ్చర్యం, ఆనందంలో మునిగిపోయారు.


సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు కూడా వారితో వాటా పంచు కున్నందుకు శిక్ష అనుభవించాడన్నా మాట. 


ఆలయం లో సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు ఉన్నాడు అంటానికి ఇంతకన్నా సాక్ష్యం ఎం కావాలి...?!


నిష్కల్మష  ప్రేమకు, నిర్మల  భక్తికీ అరుణాచలేశ్వరుడు ఎప్పుడూ బందీయే...! అరుణాచలుడు  కాంతి రూపంలో ఉంటాడనీ, అది అగ్ని లింగం అని శాస్త్రవచనం. ఆ పరిసర ప్రాంతాలలో  మరియు కొడపైన అరుణాచలుడు కాంతి రూపం లో, కాంతి స్తంభం ( bheem of light ) రూపంలో భక్తులని అనుగ్రహించిన సంఘటనలు ఎన్నో కలవు.


అరుణాచలశివ...  అరుణాచలశివ... అరుణాచలశివ... అరుణాచలా...!

🙏🙏🙏

నీతి కథ🍁

 🍁ఒక చిన్న నీతి కథ🍁


ఊరి బయట పొలం దగ్గర ఇద్దరబ్బాయిలు👦👶 పరుగులు పెట్టి అడుకుంటున్నారు.

ఒకడు పదేళ్ల వాడు.

ఇంకొకడు ఆరేళ్ల వాడు.

చిన్నోడు ముట్టుకునేందుకు వస్తున్నాడు.

పెద్దోడు వాడికందకుండా వెనక్కి చూస్తూ వేగంగా పరుగెడుతున్నాడు.

ముందు పెద్ద బావి 🏟 ఉంది.


పెద్దోడు చూసుకోలేదు.


అందులో పడిపోయాడు.


వాడికి ఈత రాదు.


బావి చాలా లోతు.


చుట్టుపక్కల ఎవరూ లేదు.


అరిచినా 😮😩 సాయానికి వచ్చేందుకు నరప్రాణి లేదు.


చిన్నోడికి ఒక తాడు కట్టిన బొక్కెన కనిపించింది. తాడును పట్టుకుని బొక్కెనను బావిలోకి విసిరాడు.

"అన్నా... దీన్ని పట్టుకో" అన్నాడు.

నీట మునిగి తేలుతూ🏊🏻 కేకలేస్తున్న పెద్దవాడు తాడును పట్టుకున్నాడు.


చిన్నోడు తన శక్తినంతా💪😰 కూడగట్టుకుని తాడును పైకి లాగడం మొదలు పెట్టాడు.

"అన్నా ... భయపడకు..!☝

జాగ్రత్తగా పట్టుకో..!

పడిపోకుండా చూసుకో" అని అరిచాడు.😧

తాడు 📯 చివరను ఒక చెట్టుకి🌴 కట్టాడు. నెమ్మదిగా లాగుతూనే ఉన్నాడు.


➡ఒక అరగంట పెనుగులాడిన తరువాత పెద్దోడు సురక్షితంగా బయటకి వచ్చాడు.

ఆ తరువాత పెద్దోడు చిన్నోడు ఊళ్లోకి పరుగెత్తారు. ఊళ్లో వాళ్లకి జరిగింది చెప్పారు. చిన్నోడు పెద్దోడిని ఎలా కాపాడాడో చెప్పారు.

ఊళ్లో ఎవరూ నమ్మలేదు.


ఆరేళ్ల వాడేమిటి...🤔


పదేళ్ల వాడిని లాగడమేమిటి?🙄


అందునా బావి నుంచి లాగడమేమిటి?😯


అసాధ్యం..!☹️


వాడు చేయలేడు అని అన్నారు.

ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు.


➡సంగతి ఆ నోటా ఈ నోటా పాకింది.

ఆ ఊరు పెద్దమనిషికి విషయం తెలిసింది.

"మీరు నమ్ముతారా అని అడిగారు

"నమ్ముతాను" అన్నాడు.

"ఎలా?"

"చిన్నోడు లాగి పెద్దోడిని బావి నుంచి బయటకి తీసి రక్షించాడు."

"అదెలా సాధ్యం...

అంత చిన్నోడు ఎలా చేయగలడు?"


➡"తనకి అంత బలం లేదన్న సంగతి, వాడు పెద్దోడిని బావినుంచి లాగలేడన్న సంగతి చిన్నోడికి తెలియదు.


"ఒరేయ్..! నీకంత బలం లేదురా,


నువ్వు చేయలేవురా,


అది నీవల్ల సాధ్యం కాదురా.


అని చెప్పేవారెవరూ కూడా...

ఆ పరిసరాల్లో లేరు, కాబట్టి వాడు చేయగలిగాడు."


👉 "నీవల్ల కాదని చెప్పే వాళ్లుంటే వాడు ప్రయత్నించేవాడే కాదు. ఏడుస్తూ ఊళ్లోకి పరిగెత్తుకు వచ్చేవాడు. మనం బావి దగ్గరికి వెళ్లే సరికి పెద్దోడు శవమై తేలి ఉండేవాడు. "


ప్రశ్నవేసిన వాడు మాట్లాడలేకపోయాడు.😶


👉"నీవల్ల కాదు అని చెప్పేవాడు లేకుంటే మనిషి ఎంత పనైనా చేస్తాడు. అది బావైనా, బతుకైనా అంతే..." అన్నాడు పెద్దమనిషి.


Note : 


మీరు ఇతరులకు ధైర్యం ఇవ్వకున్నా పర్లేదులే గానీ...

దయచేసి మీ భయాన్ని మాత్రo ఇతరులపై రుద్దకoడి.🙏


ఇప్పుడు కరోనా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. 


కరోనాని జయించి వచ్చిన వారి గురించి తెలిసేలా చేయండి బ్రతుకుతామన్న ఆశ కలుగుతుంది, అంతే కానీ బెడ్స్ లేవు వాక్సిన్ లేదు స్మశానాలు ఖాళీ లేవు అని ప్రజల్లో భయాన్ని రేకెత్తించి చంపేయకండి 🙏


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

జలదాన మహత్మ్యము - గృహగోధికా కథ

 _*వైశాఖ పురాణం - 6 వ అధ్యాయము*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




_*జలదాన మహత్మ్యము - గృహగోధికా కథ*_




☘☘☘☘☘☘☘☘☘




నారదుని మాటలను వినిన అంబరీష మహారాజు నారదునకు నమస్కరించి మహర్షీ ! వైశాఖమాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను. వైశాఖమాస విశిష్టతను మరింతగా వివరింపగోరుచున్నానని ప్రార్తించెను. అప్పుడు నారదమహర్షి యిట్లనెను. మహారాజా !  వినుము మాసవ్రతములన్నిటిలో నుత్తమమగు వైశాఖమాసమున మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీటినీయనివారు పశు పక్ష్యాది జన్మముల నందుదురు. ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన సంవాదమును వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును. ఈ కథ వైశాఖమాస దాన మహిమకు తార్కాణమైన ఉదాహరణ.


పూర్వము ఇక్ష్వాకురాజ వంశమున హేమాంగుడను రాజు కలడు. అతడు గోదానముల ననేకములగావించెను. భూమియందు రేణువులను లెక్కించుట , నీటిబొట్టులను గణించుట , ఆకాశామునందలి నక్షత్రములిన్నియని లెక్కించుట యెంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము. అనేక యజ్ఞములను చేసెను. గోదానము , భూదానము , తిలదానము మున్నగు దానములను గూడ లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరచెను. అతడు చేయని దానమే లేదని ప్రసిద్దినందెను. అందరకు సులభముగ దొరుకునది జలము. అది దైవదత్తము సులభము. అట్టి జలమును దానమిచ్చుటయేమని తలచి జల దానమును మాత్రము చేయలేదు. బ్రహ్మపుత్రుడగు వశిష్ఠుడు ఆ మహారాజునగు గురువు పురోహితుడు. అతడును జలదానము చేయుమని పెక్కుమార్లు ఆ రాజునకు చెప్పెను. నీరు అమూల్యమైనది అట్టిదానిని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వచ్చును. ఎవరికిని సులభము కాని దానిని దానమిచ్చిన పుణ్యము కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చెను. అట్లే యెవరును గౌరవింపని వారిని ఆదరించుటయే యుక్తమని తలచి అంగవైకల్యము కల బ్రాహ్మణులను , దరిద్రులను , ఆచారహీనులను ఆదరించి గౌరవించెను. ఆచారవంతులను , పండితులను , సద్బ్రాహ్మణులను ఆదరింప లేదు గౌరవింపలేదు. అందరును ప్రసిద్దులను , ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాధులు , విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు , దరిద్రులకు ఆదరణ చేయు వారెవ్వరు ? నేను అట్టివారినే గౌరవింతునని అట్టివారిని మాత్రమే గౌరవించెను ఆదరించెను. ఈ విధముగ అపాత్రులకు మాత్రమే దానముల నిచ్చెను.


ఇట్టి దోషముచే నా రాజు యొకప్పుడును జలదానము చేయకపోవుట వలన చాతక పక్షిగా ముమ్మారు జన్మించెను. ఒక జన్మలో గ్రద్దగను , కుక్కగ నేడుమార్లు జన్మించెను. అటు పిమ్మట మిధిలాదేశమును పాలించు శ్రుతకీర్తి మహారజు గృహమున గోడపైనుండు బల్లిగా జన్మించెను. అచట వ్రాలు కీటకములను భక్షించుచు బల్లియై హేమాంగద మహారాజు జీవనము గడుపుచుండెను. ఈ విధముగ ఎనుబదియేడు సంవత్సరముల కాలముండెను.


మిధిలాదేశ రాజగృహమునకు శ్రుతదేవమహాముని ప్రయాణముచే అలసిపోయి మధ్యాహ్నకాలమున వచ్చెను. మహారాజు అగు శ్రుతకీర్తి ఆ మునిని జూచి సంభ్రమముతో ఆ మునికి యెదురు వెళ్ళి సగౌరవముగ ఇంటిలోనికి దీసికోవచ్చెను. వానిని మధుపర్కము మున్నగువానితో పూజించి వాని పాదములను కడిగి యా నీటిని తన తలపై జల్లుకొనెను. అట్లు జల్లుకొనుటలో తలపై జల్లుకొన్న నీటి తుంపురులు కొన్ని యెగిరి గోడమీదనున్న బల్లిపై దైవికముగా పడినవి. ఆ పవిత్ర జలస్పర్శ కలుగగనే ఆ బల్లికి పూర్వజన్మస్మృతి కలిగి తన దోషమును తెలిసికొని పశ్చాత్తాపము కలిగెను. నన్ను రక్షింపుము నన్ను రక్షింపుమని మానవునివలె ఆ మునిని ప్రార్థించెను. అప్పుడా ముని బల్లి మాటలకు విస్మయపడి ఓ బల్లీ ! నీవెందులకిట్లు దుఃఖించుచున్నావు. నీవు యేపని చేసి యిట్టి దశనందితివి ? ఇట్లేల అరచుచున్నావు ? నీవు దేవజాతివాడవా , రాజువా , బ్రాహ్మణుడవా ? నీవెవరవు ? నీకీదశయేల వచ్చెనో చెప్పుము. నేను నీకు సాయపడుదునని ప్రశ్నించెను.


శ్రుతదేవుని మాటలను విన్న బల్లిరూపమున నున్న హేమాంగదమహారాజు మహాత్మా ! నేను ఇక్ష్వాకు కులమున జన్మించిన హేమాంగదుడను ప్రభువును. వేదశాస్త్ర విశారదుడను. భూమియందలి రేణువులెన్ని యుందునో , నీటియందు జలబిందువు లెన్నియుండునో , ఆకాశమున నెన్ని నక్షత్రములుండునో అన్ని గోవులను అసంఖ్యాకముగ దానమిచ్చితిని. అన్ని యజ్ఞములను చేసితిని. చెరువులు మున్నగువానిని త్రవ్వించితిని. సర్వవిధములగు దానములను చేసితిని. చెరువులు మున్నగువానిని త్రవ్వించితిని. సర్వవిధములగు దానములను చేసితిని. ధర్మముగా రాజ్యమును పాలించితిని. నేనెన్ని సత్కర్మల నాచరించినను , ముమ్మారు చాతక పక్షిగను , గ్రద్దగను , యేడుమార్లు కుక్కగను , ప్రస్తుతము బల్లిగను జన్మించితిని. ఈ మహారాజు నీ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై జల్లుకొనుచుండగా కొన్ని నీటితుంపురలు నా పైబడి నాకు పూర్వజన్మ స్మరణము కలిగినది. నా పాపభారము తగ్గినట్లనిపించుచున్నది. కాని నేనింకను ఇరువది యేడుమార్లు బల్లిగా జన్మించవలసి యున్నట్లుగ నాకు తోచుచున్నది. నాకీవిధమైన బల్లిగా జన్మపరంపరయెట్లు తొలగునాయని భయము కలుగుచున్నది. నేను చేసిన పాపమేమియో నాకీ జన్మయేల కల్గెనో యెరుగజాలను. దయయుంచి నాకీ జన్మలు కలుగుటకు కారణము అయిన పాపమును ఆపాపము పోవు విధానమును చెప్పగోరుచున్నానని ప్రార్థించెను.


శ్రుతదేవమహాముని హేమాంగదుని మాటలను తన దివ్యదృష్టితో పరిశీలించి యిట్లనెను. రాజా ! నీవు శ్రీమహావిష్ణువునకు ప్రియమైన వైశాఖమాసమున జలమునెవనికిని దానమీయలేదు. జలము సర్వజన సులభము. దానిని దానమిచ్చుట యేమి అని తలచితివి. ప్రయాణమున అలసినవారికిని జలదానమైనను చేయలేదు. వైశాఖమాస వ్రతమును గూడ పాటింపలేదు. హోమము చేయదలచినవారు మంత్రపూతమగు అగ్నియందే హోమము చేయవలయును. అట్లుగాక బూడిద మున్నగువాని యందు హోమము చేసిన ఫలమెట్లు కలుగును ? అట్లే నీవును యోగ్యులగువారికి దానమీయక అయోగ్యులగువారికి దానముల నిచ్చితివి. అపాత్రులకెన్ని దానము లిచ్చినను ప్రయోజనము లేదు కదా ! వైశాఖమాస వ్రతమును చేయలేదు. జలదానమును చేయలేదు. యెంతయేపుగ పెరిగినను , సుగంధాదిగుణములున్నను ముండ్లుకల వృక్షము నెవరాదరింతురు ? అట్టి వృక్షము వలన ప్రయోజనమేమి ? వృక్షములలో రావిచెట్టు ప్రశస్తమైనది. అందువలన అది పూజార్హమైనది. తులసియు మిక్కిలి పవిత్రమైనదే. ఇట్టి రావిచెట్టును , తులసిని వదలి వాకుడు చెట్టునెవరైన పూజింతురా ? అట్టి పూజలవలన ఫలితముండునా ? అనాధలు , అంగవైకల్యము కలవారు దయజూపదగినవారు. వారిపై దయను చూపుట ధర్మము. కాని వారు మాన్యులు పూజ్యులు కారు. అట్టివారిని పూజించుట ఫల దాయకము కాదు. వారిపై దయ , జాలి చూపవచ్చును. కాని గౌరవింపరాదు. తపము , జ్ఞ్ఞానము , వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలవారు శ్రీమహావిష్ణు స్వరూపులు. అట్టివారినే పూజింపవలయును. వీరిలో జ్ఞానవంతులు శ్రీమహావిష్ణువునకు మిక్కిలి ఇష్టమైనవారు. అట్టివారిని పూజించినచో తనను పూజించినట్లుగ భావించి శ్రీహరి వరములనిచ్చును. కావున జ్ఞానులైనవారు సర్వాధికులు , సర్వోన్నతులు అట్టివారిని గౌరవింపక పోవుట వారిని అనగా శ్రీమహావిష్ణువును అవమానించుటయే యగును. ఈ విధముగ చేయుట ఇహలోకమున పరలోకమున దుఃఖమును కలిగించును. మానవుడు పురుషార్థములను సాధింపవలెనన్నచో జ్ఞానుల సేవ , వారిని గౌరవించుట ముఖ్య కారణము. జ్ఞానులు కానివారు , అంధులు - ప్రజ్ఞాజ్ఞాన నేత్రములు లేనివారు. అట్టి అంధుల నెంతమందిని పూజించినను ఫల్ముండునా ? గ్రుడ్డివానికేమి కనిపించును ? అతడేమి చెప్పగలడు ? కావున జ్ఞానహీనులైన వారి నెంతమందిని యెంత పూజించినను , వారిని సేవించినను అవి నిష్ఫలములు , నిష్ప్రయోజనములు. అంతేకాక కష్టములను , దుఃఖములను కలిగించును. పురుషార్థములగు ధర్మార్థ కామ మోక్షములెట్లు సిద్దించును ?


తీర్థములు కేవలం జలములు కావు. దేవతలు శిలారూపులు కారు. చిరకాలము తీర్థస్నానము , సేవ చేసినచో శిలారూపముననున్న దైవమును చిరకాలము పూజించినచో వారియనుగ్రహము కలుగును. కాని జ్ఞానులగు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు. ఇష్టఫలప్రాప్తిని కలిగింతురు. కావున జ్ఞానులగు వారిని సేవించినచో వారి ఉపదేశములను పాటించినచో విషాదముండదు. ఇష్టప్రాప్తిచే సంతోషము కలుగును. అమృతమును సేవించినచో జన్మ , మృత్యువు , ముసలితనము మున్నగువానిని వలని బాధయుండదు. అమృతత్వసిద్ది కలుగును. హేమాంగద మహారాజా ! నీవు వైశాఖమాస వ్రతము నాచరింపలేదు. జలదానము చేయలేదు. జ్ఞానులగువారిని సేవింపలేదు. కావున నీకిట్టి దుర్గతి కలిగినది. నీకు ఈ వైశాఖమాస వ్రతము నాచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును. దీని వలన దుర్దశ శాంతించుటకై భవిష్యద్వర్తమాన కాలములలోని నీ పాపములను వాని ఫలములను పోగొట్టుకొని విజయము నందగలవు. అని పలికి శ్రుతదేవ మహాముని నీటిని స్పృశించి బల్లి రూపముననున్న హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖమాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసెను.


ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్యరూపమును పొందెను. శ్రుతకీర్తి మహారాజునకు , శ్రుతదేవమహామునికి నమస్కరించెను. వారి యనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానము నెక్కి పుణ్యలోకములకు పోయెను. దేవతలందరును హేమాంగదుని అదృష్టమును మెచ్చిరి. హేమాంగదుడును పుణ్యలోకమున పదివేల సంవత్సరములుండెను. దివ్యలోక భోగములను అనుభవించెను. అటు పిమ్మట ఇక్ష్వాకు కులమున కాకుత్స్థ మహారాజుగ జన్మించెను. ఏడు ద్వీపముల భూమిని సజ్జనులు , జ్ఞానులు మెచ్చునట్లు పరిపాలించెను. శ్రీమహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడై యుండెను. కులగురువగు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను. వైశాఖమాస వ్రతమును సంపూర్ణముగ ఆచరించెను. అందు చేయవలసిన దానధర్మముల నన్నిటిని శ్రద్దాసక్తులతో భక్తి పూర్వకముగ చేసెను. సర్వపాపములను పోగొట్టుకొనెను. దివ్యజ్ఞానము నందెను. శ్రీమహావిష్ణువు సాయుజ్యము నందెను. కావున వైశాఖమాస వ్రతము సర్వపాపహరము. అనంత పుణ్యప్రదము. ప్రతి మానవుడును వైశాఖమాసవ్రతమును , వ్రతాంగములగు దాన ధర్మాదులను పాటించి శ్రీహరియనుగ్రహము నందవలెను. అని నారదుడు అంబరీషునకు వైశాఖమాసవ్రత విశిష్టతను వివరించుచు గృహగోధికావృత్తాంతమును వివరించెను.

భక్తుడు-బిచ్చగాడు*


🌷 *భక్తుడు-బిచ్చగాడు*🌷

               🌷🌷🌷

👉ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూచుని ఓ గుడ్డి వాడు అడుక్కుంటూ ఉండేవాడు.

చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు.

రోజూ ఓ భక్తుడు గుడిని సందర్శించి, తిరిగి వెళ్ళే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు.

ఆ భక్తుడి నడక చప్పుడు, అతడు నాణేన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుకే.

ఈ భక్తుడికి, ఆ భిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది......


బిచ్చగాడు బాగా ముసలివాడై పోయాడు.

చివరి క్షణాలు సమీపించాయని అతడికి అనిపించింది.

తను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించాడు.

తను దేహం చాలించిన తర్వాత, తను నివాసమున్న స్థలం లోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు.

భక్తుడు సరేనన్నాడు.

ఆ ఘడియ రానే వచ్చింది.

బిచ్చగాడు తుది శ్వాస విడిచాడు. .....

భక్తుడు అతడడిగిన స్థలంలోనే గొయ్యి తవ్వసాగాడు.

ఆశ్చర్యం ......! దాని నుండి నిధి బయటపడింది.

వెండి, బంగారు నాణేలు దానిలో ఉన్నాయి.

అవన్నీ అతడి సొంతమయ్యాయి.....


మృతి చెందిన బిచ్చగాడు స్వర్గానికి చేరుకున్నాడు.

అక్కడ అతడికి ఈ సంగతి తెలిసింది. జరిగిన దానికి సంతోషపడ్డాడు.

కానీ, ఒక సందేహం అతడిని పీడించింది.


నిధి మీదే కూచున్నాను కానీ జీవితమంతా అడుక్కుంటూ బిచ్చగాడి గానే ఉండిపోయాను.


దారిన పోయే దానయ్య కోటీశ్వరుడు అయ్యాడు. ఏమిటయ్యా ఇది!

అని దేవుణ్ణి ప్రశ్నించాడు. ......

అతడికి దేవుడు సమాధానం చెబుతూ.....నీ జీవితమంతా భగవంతుని సన్నిధిలోనే కూచుని, భగవన్నామాన్నే ఉచ్చరిస్తూ గడిపావు.

అందుకే నీకు స్వర్గప్రాప్తి కలిగింది.

అతడు రోజూ భగవత్సేవ చేస్తూ, నీకు యదా శక్తిగా తనకు చేతనైనంత దానం చేశాడు.

నీ కోరికను తీర్చేందుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు.

అందుకే అతనికి సిరిసంపదలు లభించాయి అన్నాడు దేవుడు.

వ్యక్తి తనలో నిక్షిప్తమైన అనంత చైతన్య శక్తిని గుర్తించలేక దానిని విస్మరించి, గుడ్డి వాడిలా బయటే ఏదో ఉందని పరిభ్రమించడం ఆగాలి.

తప్పక అంతర్ముఖుడు కావాలి!

హైదరాబాద్

 హైదరాబాద్‌లోని ప్రాంతాలు- వాటి వెనుక చరిత్ర.....

వివిధ మాధ్యమాల ద్వారా, మితృల ద్వారా,..... తెలుసుకున్న కొంత సమాచారం....


చాలామందికి తెలియని ఈ విషయాలను అందరితో పంచుకోవాలనుకుని పోస్ట్ చేస్తున్నాను....


ఆరో నిజాం కాలంలో అల్‌ బర్ట్ అబిద్ అనే యూదుడు ప్యాలెస్ టాకీస్ దగ్గర ఓ షాప్ పెట్టుకున్నాడు. దానికి అబిద్ అండ్ కంపెనీ అనే పేరు పెట్టాడు. కాలక్రమంలో ఆ ప్రాంతం కాస్తా 👉" అబిడ్స్ "గా మారిపోయింది.


గోల్కొండ నవాబుల కాలంలో సైనికుల భోజనం కోసం ఏర్పాటు చేసిన లంగర్ఖానాకాలక్రమేణా

👉 "లంగర్‌ హౌజ్‌" మారింది. గోల్కొండ నుంచి సైనికులు ఇక్కడికి వచ్చి భోజనాలు చేసి వెళ్లేవారు.


చిచ్‌లం అనే బంజారా తెగ ఉండే ఏరియా కాలక్రమంలో👉" చెంచల్‌ గూడ"గా మారింది. ఇక్కడే భాగమతి కూడా నివాసం ఉండేదని చరిత్రకారులు చెప్తుంటారు.


 ఒకప్పుడు సాహుకారి కార్వా అని పిలిచే ప్రాంతాన్ని నేడు

👉" కార్వాన్" అని పిలుస్తున్నారు.కోహినూర్ వజ్రాన్ని సానపట్టింది ఇక్కడే అని చెప్పుకుంటారు. వజ్రాలు, ముత్యాల వ్యాపారస్థుల సమూహంగా చరిత్రలో ఒక వెలుగు వెలిగిన ప్రాంతం కార్వాన్.


 ట్యాంక్ బండ్ నిర్మాణానికి కావడిలో రాళ్లు మోసిన కూలీలు అక్కడే గుడిసెలు వేసుకుని నివసించేవారు. అప్పట్లో ఆ ప్రాంతాన్ని కావడీల గూడెం అని పిలిచేవారు.. క్రమంగా ఆ ఏరియా👉" కవాడిగూడ"గా మారింది.


 దోమలగూడ అసలు పేరు దో మల్ గూడ! పూర్వం ఇద్దరు మల్ల యోధులు అక్కడ ఉండేవారు. వారిపేరుమీదనే ఆ ఏరియాను దో మల్ గూడ అని పిలిచేవారు. కాలక్రమంలో అది

👉" దోమలగూడ"గా మారింది.


ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైరున్నీసా బేగంకు ఇచ్చిన జాగీరు కాలక్రమేణా👉" ఖైరతాబాద్" గా మారింది.


హైదరాబాద్ వ్యాపారులపై దయతో నిజాం సతీమణి హందాబేగం ఓ ప్రాంతాన్ని రాసిచ్చేసింది. అది కాలక్రమంలో 👉"బేగం బజారు"గా నిలిచిపోయింది.


ఐదో నిజాం అఫ్జల్ ఉద్ధౌలా ధాన్యం గింజల వ్యాపారులకు బహుమతిగా ఇచ్చిన భూమి కాలక్రమేణా

👉" అఫ్జల్ గంజ్ "గా మారింది.


ఏడవ నిజామ్ పెద్ద కుమారుడు హిమాయత్ అలీ ఖాన్ పేరుతో 

👉"హిమాయత్ నగర్" గా స్థిరపడింది.


మొదటి తాలుఖ్ దార్( జిల్లా కలెక్టర్) హైదర్ అలీ పేరుతో

👉" హైదర్ గూడ" ఏర్పడింది.


గోల్కొండ రాజు అబ్దుల్లా కుతుబ్ షా వద్ద పనిచేసే మాలిక్ యాకూబ్ ఇంటి పరిసరాలు ఆయన పేరుతో👉 "మలక్ పేట "గా మారింది.


తార్నాక అసలు పేరు తార్ నాకా! తార్ అంటే ముళ్లకంచె.. నాకా అంటే పోలీస్ ఔట్ పోస్టు. నిజాం ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారికి ఉస్మానియా యూనివర్శిటీ దగ్గరలో తోట ఉండేది. దాని చుట్టూ ముళ్లకంచె, ముందొక పోలీస్ ఔట్ పోస్టు ఉండేది. అందుకే ఆ ఏరియాను తార్ నాకా అని పిలిచేవారు. కాలక్రమంలో అది

👉 "తార్నాక"గా మారింది.


శాలిబండ అసలు పేరు షా-అలీ-బండ. అప్పట్లో షా అలీ అనే ఒక సూఫీ యోగి పెద్ద బండ పై నివసించేవాడు. ఆయన పేరు మీదనే ఆ ఏరియాను షా అలీ బండ అని పిలిచేవారు..కాలక్రమంలో అది👉"శాలిబండ"గా మారింది.


నిజాం అశ్వికదళంలో అస్బీనియన్స్ అనే నీగ్రోజాతి ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా తార్నాక దాటిన తర్వాత డేరాలు వేసుకుని ఉండేవాళ్లు. అస్బీనియన్స్ ఉండేవాళ్లు కాబట్టి ఆ ఏరియాను 👉"హబ్సిగూడ" పిలుస్తున్నారు.


ధర్మదాత ఖాన్ బహద్దూర్ అల్లావుద్దీన్ 1900 సంవత్సరంలో నిర్మించిన మూడంతస్తుల భవనంవల్ల ఈ ప్రాంతానికి

👉" మదీనా "అనే పేరు వచ్చింది.


చిక్కడపల్లి అసలు పేరు చిక్కడ్-పల్లి. చిక్కడ్ అంటే మారాఠీలో బురద. ట్యాంక్ బండ్పరీవాహక ప్రాంతం కావడంతో ఆ ఏరియాలో అప్పట్లో మోకాల్లోతు బురద ఉండేది! బురద ఉన్న ప్రదేశం కాబట్టి చిక్కడ్పల్లి అని పిలిచేవారు. కాలక్రమంలో 👉"చిక్కడపల్లి"గా మారిపోయింది.


అడిక్‌మెట్ అసలు పేరు అధికమెట్టు. ఎత్తైన ప్రాంతం కాబట్టి అధిక మెట్టు అని పిలిచేవారు. కాలక్రమంలో👉" అడిక్ మెట్ "గా మారిపోయింది.


నిజాం కాలంలో నౌబత్ పహాడ్‌పై నగారాలు మోగించి ప్రజలకు ఫర్మానా చదివి వినిపించేవారు. నౌబత్ అంటే డోలు. పహాడ్ అంటే గుట్ట. నగారాలు మోగించి ఫర్మానాలు చదివి వినిపించే గుట్ట కాబట్టి దానికి 👉"నౌబత్

పహాడ్ "అని పేరొచ్చింది.


గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా ఖుతుబ్షా మార్నింగ్ వాక్ చేయడానికి టాంక్ బండ్ పరీవాహక ప్రాంతంలో  పెద్ద ఉద్యానవనాన్ని నిర్మించారు. బాగ్ ఉండటం వల్ల ఆ ఏరియాను👉" బాగ్‌లింగంపల్లి" అంటున్నారు.


సికిందర్ ఝా హయాంలో పనిచేసిన మీర్ ఆలం అనే మంత్రి స్మారకార్ధం తవ్వించిందే మీరాలం చెరువు. అక్కడే కూరగాయలతోట కూడా ఉండేది. దాన్ని మీరాలంమండి అనేవారు. ఇప్పటికీ 

👉"మీరాలంమండి" మార్కెట్ ఫేమస్!


నిజాం సైన్యంలో అరేబియన్‌ పటాలం ప్రత్యేకంగా ఉండేది. వాళ్లంతా చాంద్రాయణగుట్ట దాటిన తర్వాత బ్యారెక్స్ వేసుకుని ఉండేవారు. ఆ ఏరియానే ఇప్పడు👉 "బార్కాస్"అని పిలుస్తున్నారు.


 తాడబండ్ అసలు పేరు తాడ్- బన్! తాటి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల అలా పిలిచేవారు. కాలక్రమంలో 👉"తాడ్‌ బండ్‌"గా మారిపోయింది.


ఇర్రంమంజిల్ ప్యాలెస్ ఉన్నందుకు ఆ ప్రాంతం 👉"ఎర్రమంజిల్‌" గా స్థిరపడింది.ఆరో నిజాం కాలంలో ఆ ప్యాలెస్‌ని రాయల్ బాంక్వెట్ హాల్‌ గా వాడేవారు.


కచ్ అనే తెగ నివసించే ఏరియా కాబట్టి 👉"కాచిగూడ "అనే పేరొచ్చింది


మహ్మద్ ఖులీకుతుబ్ షా భాగమతిలకు మగసంతానం లేకపోవడంతో కూతురు హయత్ భక్షీ బేగంను గారాబంగా పెంచారు. ఆమెను ముద్దుగా లాడ్లీ అని పిలిచేవారు. చార్మినార్ పక్కన

👉 "లాడ్‌ బజార్ "లాడ్లీ అనే పేరుమీదనే స్థిరపడింది.


హుస్సేన్ సాగర్ కు తూర్పున కొంత భూమిని ముషీ-రుల్-ముల్క్ అనే నవాబ్ కు రెండో నిజామ్ కానుకగా ఇచ్చాడు. 1785లో ఆ ప్రాంతంలో ఒక ప్యాలెస్, గార్డెన్ నిర్మించాడు. ముషీ-రుల్-ముల్క్ పేరు మీద ఆ ప్రాంతం 👉"ముషీరాబాద్" గా స్థిరపడిపోయింది.


ఔరంగజేబు గోల్కొండ కోటను ముట్టడించే టైంలో సైన్యంతో ఒకచోట బస చేశాడు. ఆ ప్రాంతాన్ని ఫతే మైదాన్ అని పిలిచేవారు. ఫతే అంటే విజయం, మైదాన్ అంటే గ్రౌండ్! ఇప్పుడక్కడ👉" ఎల్బీ స్టేడియం" నిర్మించారు.


పబ్లిక్ గార్డెన్స్ ఒకప్పుడుబాగ్-ఏ-ఆమ్ అని పిలిచేవారు: బాగ్ అంటే తోట, ఆమ్ అంటే ప్రజలు! ప్రజల కోసం నిర్మించింది కాబట్టి బాగ్-ఏ-ఆమ్ అన్నారు. ఇంగ్లీష్‌లో పోష్‌గా

 👉"పబ్లిక్ గార్డెన్స్ "అని పిలుస్తున్నారు.


మూసీ నుంచి డ్యామ్ లోకి ప్రవహించే నీరు పై నుంచి చూస్తే చాదర్ లా కనిపించేదట. అందుకే ఆ ఏరియాకు 👉"చాదర్ ఘాట్" అని పేరొచ్చింది.


1887-92 వరకు హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసిన నవాబ్ ఆస్మాన్ ఝా బహద్దూర్  పేరు మీద 👉"ఆస్మాన్ గఢ్" ఏర్పడింది.


నవాబ్ నిజాం ఆలీ ఖాన్ తల్లి ఉమ్దా బేగం పేరు మీద 👉"ఉమ్దా బజార్" ఏర్పడింది. హుస్సేని ఆలంకు ఒక మైలు దూరంలో ఈ ఏరియా ఉంటుంది. ఆసఫ్ జాహీల కాలంలో ఉమ్దా బజార్ షాపింగ్ సెంటర్గా ప్రసిద్ధిగాంచింది.


గౌలీ అంటే గొర్రెల కాపరి! వాళ్లంతా ఎక్కువగా ఉండేవాళ్లు కాబట్టి ఆ ప్రాంతం 👉"గౌలిగూడ"గా స్థిరపడిపోయింది.


రెండో నిజాం నవాబ్ అలీ ఖాన్ తన భార్య తహ్నియత్ ఉన్నిసా బేగం కోసం "మౌలాలీ "సమీపంలో ఒక ప్యాలెస్, ఉద్యానవనాన్ని నిర్మించాడు. లల్లా అనే ఆర్కిటెక్ట్ ప్యాలెస్ నిర్మాణానికి ప్లాన్ గీసినందుకు ఆ ఏరియాను లల్లాగూడ అని పిలిచారు. తర్వాత కాలంలో 👉"లాలాగూడ"గా మారింది. 


1933కంటే ముందు బ్రిటిష్ ఏలుబడిలో ఉన్నందుకు బడేచౌడీ ప్రాంతాన్ని రెసిడెన్సీ బజార్ అని వ్యవహరించేవారు. ఏడో నిజాం ఆధికారంలోకి వచ్చాక, ఆ ఏరియాని 👉"సుల్తాన్ బజార్ "అని మార్చేశారు.


రెండో అసఫ్ జాహీ తన కూతురు బషీర్- ఉల్- నిసా బేగంకు కట్నం కింద 1796లో కొంత జాగీర్ రాసిచ్చాడు. 👉"బేగంపేట" ఏరియా ఆమె పేరుమీదనే స్థిరపడింది. 


1853లో నవాబ్ నసీరుద్దౌలా హయాంలో పండిట్ సోనాజీ అనే రెవెన్యూ ఉద్యోగి ఉండేవాడు. ఆయన ఇల్లు ఆ రాజప్రాసాదాన్ని తలపించేది! లాండ్ మార్కుగా ఉంటుందని ఆ ప్రాంతాన్ని మొదట్లో సోనాజీగూడ అని పిలిచేవారు. తర్వాత 👉"సోమాజీగూడ" అయింది.


రికాబ్ గంజ్ ని మొదట్లో గంజ్ రికాబ్ అని పిలిచేవారు. తర్వాతి క్రమంలో 👉"రికాబ్ గంజ్‌"గా మారింది. రికాబ్ అనేది ఒక కంపెనీ పేరు. గంజ్ అంటే హోల్ సేల్ షాపింగ్ కాంప్లెక్స్! మొఘలుల కాలంలో ఆ ఏరియాలో మిలటరీ ఆఫీసర్లు ఉండేవారు.


రెండో నిజాం అలీ ఖాన్ హయాంలో ప్రధాని పనిచేసిన నవాబ్ అరస్తు ఝా బహదూర్ భార్య సరూర్ అఫ్జా బాయికి చార్మినార్‌కు 4 మైళ్ల దూరంలో రాజు కొంత స్థలాన్ని రాసిచ్చాడు. ప్రస్తుతం 👉"సరూర్ నగర్ "అని పిలిచే ఆ ఏరియా సరూర్ అఫ్జాబాయి పేరుమీదనే స్థిరపడింది.


నిజాం కాలంలో మినిస్టర్ల క్వార్టర్లన్నీ 👉"డబిర్ పురా"లో ఉండేవి! డబీర్ అంటే పండితుడు అని అర్ధం. ఇంటెలెక్చువల్స్ అంతా ఉండే ఏరియా కాబట్టి దానికా పేరొచ్చింది.


అంబర్ అంటే ఉర్దూలో మేఘాలు అని అర్ధం. పేట అంటే కాలనీ. మూసీ పరీవాహక ప్రాంతంలో ఆ ఏరియా ఎప్పుడూ మేఘావృతమై ఉండేది. దాంతో అది 👉"అంబర్‌ పేట"గా స్థిరపడిపోయింది.


చెన్నకేశవ స్వామి ఆలయం ఉన్న ఆ ప్రాంతాన్ని ఒకప్పుడు చెన్నరాయుడి గుట్టగా పిలిచేవారు. కాలక్రమంలో అది 👉"చాంద్రాయణగుట్ట"గా మారిపోయింది.


చిలకలు ఎక్కువగా ఉండేవి కాబట్టి 👉"చిలకలగూడ"కు ఆ పేరొచ్చింది. సాయంత్రం కాగానే పక్కనే ఉన్న సీతాఫల్ మండి మార్కెట్ మీద గుంపులుగుంపులుగా వచ్చి వాలి పళ్లు తిని వెళ్లేవి!


మంగళ్ హాట్ అసలు పేరు మంగళ్‌ హత్! మంగళ్ అంటే మంగళవారం. హత్ అంటే సంత. ప్రతి మంగళవారం అక్కడ సంత జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని మంగళ్ హత్ అనే పిలిచేవారు. కాలక్రమంలో 👉"మంగళ్‌హాట్‌"గా మారిపోయింది.


నిజాం నవాబు దగ్గర పనిచేసిన రజా అలీ ఖాన్అనే దివాన్‌కు నెఖ్‌ నామ్‌ ఖాన్  అనే బిరుదు ఉండేది. నవాబు ఆయనకు కొంత భూమిని దానంగా ఇచ్చాడు. ఆ ప్రాంతాన్ని మొదట్లో నెఖ్- నామ్- పల్లిగా పిలిచేవారు. ఇప్పుడది 

👉"నాంపల్లి"గా మారిపోయింది.


1591లో గోల్కొండ రాజ్యానికి ప్రధానిగా చేసిన సయ్యద్ మీర్ మోమిన్ పేరుమీద సైదాబాద్ ఏర్పడిందని ప్రచారంలో ఉంది. మొదట్లో సయ్యదాబాద్ అనేవారు. తర్వాత 👉"సైదాబాద్ "అని పిలుస్తున్నారు.


టప్పా అంటే ఉర్దూలో ఉత్తరం అని అర్ధం. చబుత్ర అంటే గ్రామం. నిజాం కాలంలో ఆ ఏరియాలో పోస్టాఫీసులుండేవి. అక్కడి నుంచే సిటీ అంతా బట్వాడా జరిగేది. అందుకే ఆ ఏరియాని

👉" టప్పాచబుత్ర" అని పిలుస్తున్నారు.


లాలాగూడ స్టేషన్ దాటిన తర్వాత ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ దగ్గర తుకారాం అనే గేట్ కీపర్ పనిచేసేవాడు. ఈస్ట్ మారేడుపల్లి, అడ్డగుట్ట నుంచి వచ్చేవాళ్లంతా గేట్ కీపర్ తుకారాం పేరునే లాండ్ మార్కుగా వాడుకునేవారు. అలా ఆ ప్రాంతం 👉"తుకారాంగేట్" గా మారిపోయింది.


హైదరాబాద్ కు చార్మినార్ గుండెకాయ అయితే, పాతబస్తీకి యాఖుత్పురా గుండెకాయ. యాఖుత్ అంటే నీలంరంగు రత్నం అని అర్ధం. నిజాం రాజుకి పచ్చలంటే వల్లమాలిన అభిమానం. అందుకే ఆ ఏరియాకు 

👉"యాఖుత్ పురా" అని నవాబే నామకరణం చేశాడు.

**సేకరణ ** *కరుణసాగర్* .

Adbhtam


 

Pravachan


 

తోటకాష్టకం

 *తోటకాష్టకం* 


🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺


విదితాఖిల శాస్త్ర సుధా జలధే


మహితోపనిషత్-కథితార్థ నిధే |


హృదయే కలయే విమలం చరణం


భవ శంకర దేశిక మే శరణమ్ || 1 ||



కరుణా వరుణాలయ పాలయ మాం


భవసాగర దుఃఖ విదూన హృదమ్ |


రచయాఖిల దర్శన తత్త్వవిదం


భవ శంకర దేశిక మే శరణమ్ || 2 ||



భవతా జనతా సుహితా భవితా


నిజబోధ విచారణ చారుమతే |


కలయేశ్వర జీవ వివేక విదం


భవ శంకర దేశిక మే శరణమ్ || 3 ||



భవ ఎవ భవానితి మె నితరాం


సమజాయత చేతసి కౌతుకితా |


మమ వారయ మోహ మహాజలధిం


భవ శంకర దేశిక మే శరణమ్ || 4 ||



సుకృతే‌உధికృతే బహుధా భవతో


భవితా సమదర్శన లాలసతా |


అతి దీనమిమం పరిపాలయ మాం


భవ శంకర దేశిక మే శరణమ్ || 5 ||



జగతీమవితుం కలితాకృతయో


విచరంతి మహామాహ సచ్ఛలతః |


అహిమాంశురివాత్ర విభాసి గురో


భవ శంకర దేశిక మే శరణమ్ || 6 ||



గురుపుంగవ పుంగవకేతన తే


సమతామయతాం న హి కో‌உపి సుధీః |


శరణాగత వత్సల తత్త్వనిధే


భవ శంకర దేశిక మే శరణమ్ || 7 ||



విదితా న మయా విశదైక కలా


న చ కించన కాంచనమస్తి గురో |


దృతమేవ విధేహి కృపాం సహజాం


భవ శంకర దేశిక మే శరణమ్ || 8 ||


🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺

తెలుగు వాడు

 చారెరుగనివాడును, గో

దారిన తా నొక్కమారు తడవని వాడున్,

కూరిమిన ఆవకాయను

ఆరారగ తిననివాడు, తెలుగు వాడు  కాడోయ్!.

దేవిదేవతలు 55 పుస్తకాలు(PDF)

 *దేవిదేవతలు  సంబంధ 55  పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

అయ్యప్ప స్వామి చరిత్ర www.freegurukul.org/g/DeviDevatalu-1


హనుమంతుడు ఆదర్శంగా వ్యక్తిత్వ నిర్మాణం www.freegurukul.org/g/DeviDevatalu-2


కావ్య గణపతి అష్టోత్తరం www.freegurukul.org/g/DeviDevatalu-3


హనుమచ్చరిత్ర www.freegurukul.org/g/DeviDevatalu-4


గణపతి www.freegurukul.org/g/DeviDevatalu-5


గ్రామ దేవతలు www.freegurukul.org/g/DeviDevatalu-6


లలితాంబికా లీలావినోదములు www.freegurukul.org/g/DeviDevatalu-7


వేంకటాచల మహత్యము- నిత్య పారాయణ గ్రంధము www.freegurukul.org/g/DeviDevatalu-8


గ్రామ దేవతలు www.freegurukul.org/g/DeviDevatalu-9


వేంకటేశ్వర మహత్యం www.freegurukul.org/g/DeviDevatalu-10


బోయకొండ గంగాభవాని చరిత్ర www.freegurukul.org/g/DeviDevatalu-11


శివతాండవం www.freegurukul.org/g/DeviDevatalu-12


భస్మోద్దూళిత విగ్రహాయ www.freegurukul.org/g/DeviDevatalu-13


శ్రీకృష్ణావతార తత్త్వము-1 నుంచి 14 www.freegurukul.org/g/DeviDevatalu-14


కృష్ణ లీలామృతము-2 www.freegurukul.org/g/DeviDevatalu-15


కృష్ణ పరమాత్మ జాతకము www.freegurukul.org/g/DeviDevatalu-16


నారాయణీయము www.freegurukul.org/g/DeviDevatalu-17


శ్రీ కృష్ణ గార్హస్త్యము www.freegurukul.org/g/DeviDevatalu-18


గోమాత-జగన్మాత www.freegurukul.org/g/DeviDevatalu-19


కన్యకా పరమేశ్వరి పురాణము www.freegurukul.org/g/DeviDevatalu-20


గణేశుని రహశ్యము www.freegurukul.org/g/DeviDevatalu-21


భజే వాయుపుత్రం-భజే బ్రహ్మతేజం www.freegurukul.org/g/DeviDevatalu-22


అవతార తత్వ వివేచన www.freegurukul.org/g/DeviDevatalu-23


శివాంజనేయము www.freegurukul.org/g/DeviDevatalu-24


గుణరత్న కోశ ప్రభంధము www.freegurukul.org/g/DeviDevatalu-25


దేవి కథాసుధ www.freegurukul.org/g/DeviDevatalu-26


శ్రీవేంకటేశ్వర లీలలు-భక్తుల అనుభవాలు www.freegurukul.org/g/DeviDevatalu-27


బాలానంద జై వీర హనుమాన్ www.freegurukul.org/g/DeviDevatalu-28


బాలల హనుమంతుడు www.freegurukul.org/g/DeviDevatalu-29


పార్వతీ కల్యాణం www.freegurukul.org/g/DeviDevatalu-30


హనుమద్భాగవతము-పూర్వార్ధము www.freegurukul.org/g/DeviDevatalu-31


వేదమాత గాయత్రి www.freegurukul.org/g/DeviDevatalu-32


కనకదుర్గా వైభవము www.freegurukul.org/g/DeviDevatalu-33


భజే శ్రీనివాసం-27 నక్షత్రాల శ్రీనివాస దివ్యవైభవం www.freegurukul.org/g/DeviDevatalu-34


అంకమ్మ కథలు www.freegurukul.org/g/DeviDevatalu-35


సుందర మారుతి www.freegurukul.org/g/DeviDevatalu-36


హనుమచ్చరిత్ర www.freegurukul.org/g/DeviDevatalu-37


వేంకటేశ్వర వైభవము-శ్రీ వేంకటేశ్వర మహత్యము www.freegurukul.org/g/DeviDevatalu-38


హనుమచ్చరిత్ర www.freegurukul.org/g/DeviDevatalu-39


శివ లీలా తరంగిణి www.freegurukul.org/g/DeviDevatalu-40


వెంకటపతి ఆటవెలదులు www.freegurukul.org/g/DeviDevatalu-41


సర్వరూప శ్రీనివాసం www.freegurukul.org/g/DeviDevatalu-42


బాలానంద బొమ్మల వేంకటేశ్వర లీలలు www.freegurukul.org/g/DeviDevatalu-43


విశ్వమాత సీత www.freegurukul.org/g/DeviDevatalu-44


శ్రీ గోదాదేవి జీవిత చరిత్రము www.freegurukul.org/g/DeviDevatalu-45


కృష్ణ చరిత్రము www.freegurukul.org/g/DeviDevatalu-46


సతీ దేవి www.freegurukul.org/g/DeviDevatalu-47


పార్వతీ పరమేశ్వర కళ్యాణ వైభవం www.freegurukul.org/g/DeviDevatalu-48


యుగపురుషుడు శ్రీకృష్ణుడు www.freegurukul.org/g/DeviDevatalu-49


శ్రీనివాసుని దివ్యకథ www.freegurukul.org/g/DeviDevatalu-50


హనుమాన్ అవతార లీలా రహస్యము www.freegurukul.org/g/DeviDevatalu-51


తెలుగు సాహిత్యంలో హనుమంతుని కథ - పాత్ర చిత్రణ www.freegurukul.org/g/DeviDevatalu-52


శ్రీ రామ కర్ణామృతము www.freegurukul.org/g/DeviDevatalu-53


రామ కృష్ణ లీలాతరంగిణి www.freegurukul.org/g/DeviDevatalu-54


వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్ర www.freegurukul.org/g/DeviDevatalu-55


*To get this type of messages daily, join in WhatsApp group by below link*

  www.freegurukul.org/join

రాహు

 రాహు మాగ్నెట్ అనంతమైన అయస్కాంత శక్తి కలదని దానివలననే గ్రహణం ఏర్పడు చున్నదని అది ఛాయ రూపంలో గాని భూమి యెుక్క నీడ ఛాయయని గమనంలో సూర్యచంద్రులను చైతన్యపరచుటకే యని తెలియును. కృష్ణ బిలమని అది రాహు శక్తి యని సూర్య చంద్రులుతో సహా అన్నింటిని కనిపించకుండా చేయు తత్వం కలదని ఆధునిక విజ్ఞానం. రాహువు యెుక్క శక్తిని భూమథనంలో అనగా క్షీర సాగరమథనంలో మధనం రూప శక్తికి కారణమైన అయస్కాంత శక్తి అధిక పీడనం మథనం వలన రాహు శక్తి హాలాహలం ద్వారా వుత్పత్తియైనదని దానిని సూత్రం చేసిఅనగా సూక్మంగా రూపంగా (జీవ ప్రవేశ, లయం రూపంలోఆత్మ యెుక్క పరిమాణ రూపం) గళాన్ని పరమేశ్వరుడు వక క్రమ పద్ధతిలో తిరుగుటకు కంఠంలో బంధించుటయని భాగవతం స్పష్టంగా తెలుపుచున్నది. కాలగమనమునకు వక ప్రకరణం కలదు కష్టము స్కంధంలో చివర సమస్త గ్రహముల గమనం వాటి మధ్యగల దూరమును తెలుపుట జరిగినది.  పరమేశ్వరుని రూపమైన విష్ణువు కంఠం భాగం రాహువు యని మిగిలిన శరీర భాగము కేతువు శక్తి చలన శక్తి రూపంలో నఖ శిఖ పర్యంతం మిగిలిన గ్రహములు నక్షత్ర శక్తి కూడా కేతు మూలక శక్తితో కలిసి జీవ చైతన్య మునకు కారణమని తెలపినది. జీవ సమస్తం సృష్ఠ్యాదినుండి సవివరంగా వేదం తెలిసియున్నది. అది అందరికీ అర్థ మగుటకు అష్టాదశ పూరాణరూపం దానివి భాగవత శ్లోక రూపంలో సులువుగా తెలియుటకై ఎందరో ప్రయత్నించి తెలిపారు. అది అంతయు దివ్య దృష్టితో అనగా తెలుసుకోవాలి అంటే సూక్మంగా ప్రకృతిని గ్రహించుటయే.అందుకు పురుషులు వారి కంఠానికి పౌడరు బదులు విభూతిని స్త్రీలు గంధమును యీ విపత్కర పరిస్థితులలో ధారణ చేయుట అవసరం.ప్రస్తుత కాలగమనంలో రాహు శక్తి అథిక మెుత్తంలో వెలువడుచున్నది. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల .. ఉపదేశం

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*శ్రీ స్వామివారి ప్రవర్తన..మాటలు..ఉపదేశం.*


*(ముప్పై వ రోజు)*


శ్రీ స్వామివారు తెల్లవారుఝామునే గదిలోంచి బైటకువచ్చి..ఇంటి ఆవరణలో తిరుగుతూ వుండేవారు..ఒక్కొక్కసారి శ్లోకాలు..దైవ సంకీర్తనలు పాడుతూ వుండేవారు..శ్రావ్యమైన కంఠస్వరం తో అద్భుతంగా గానం చేసేవారు..ప్రభావతి గారికి శ్రీధరరావు గారికి కూడా ఉదయాన్నే లేచే అలవాటు..ప్రభావతి గారు పశువుల ఆలనా పాలనా చూసుకోవడం..గేదెల వద్ద పాలు పితకడం..వగైరాలన్నీ చేసుకుంటూ వుండేవారు..ఆ సమయంలో ఆవిడ సహజంగా ఏదో ఒక స్తోత్రాన్ని మననం చేసుకుంటూ వుండేవారు..కానీ శ్రీ స్వామివారు వారింట్లో అడుగుపెట్టిన తరువాత ..శ్రీ స్వామివారు దాదాపు ప్రతిరోజూ తెల్లవారుఝామున నాలుగు గంటల ప్రాంతంలో తన గానమాధుర్యాన్ని చవిచూపడం అలవాటుగా మారింది..వినేవారికి అదో గొప్ప అనుభూతి..


ఐశ్వర్యం గురించి రాత్రి పొద్దుపోయేదాకా శ్రీధరరావు దంపతులకు వివరించి..రాత్రి తన గదికి వెళ్లిపోయిన శ్రీ స్వామివారు..మళ్లీ తెల్లవారుఝామున నాలుగు గంటలకే వచ్చేసారు..శ్రీ స్వామివారి ఉపదేశాన్ని బాగా అర్థం చేసుకున్న శ్రీధరరావు దంపతులు కూడా ఆ సమయానికి లేచి..కాలకృత్యాలు తీర్చుకుని..ఇంటి ముందుకు వచ్చారు..ఎదురుగా చిరునవ్వుతో శ్రీ స్వామివారు నిల్చుని వున్నారు..


"శ్రీధరరావు గారూ..కొన్ని విషయాలు చెప్పాలని అనిపించింది..సమయం కూడా చక్కగా ఉంది..మీరిద్దరూ తప్పక వినవలసినవి.. మళ్లీ మళ్లీ నాకు కుదరక పోవొచ్చు..లేదా..మీకు ఆ సమయమూ లేక పోవొచ్చు..ఏం తల్లీ!..వింటారా?.." అన్నారు..ఇద్దరూ తలాడించారు..


"శిష్యుడి మానసిక స్థితి..ఆధ్యాత్మిక ఉన్నతి గమనించి..ఆ శిష్యునికి సరైన సమయంలో సరైన మంత్రోపదేశం చేసి..ఆ మంత్రాన్ని శిష్యుని ద్వారా కోటి జపం పూర్తి చేయించి..కోటి జపం చేసేలా దీవిస్తూ..మార్గం నిర్దేశించేవాడే సద్గురువు!..ఉపదేశించిన మంత్రానికి..ఉపదేశం తీసుకున్న వ్యక్తిీ..ఆ మంత్రం పరిపూర్తి చేసినప్పుడే..మంత్రోపదేశం చేసిన గురువుకు కూడా అపాత్రదానం చేసాననే భావన లేకుండా పరిపూర్ణ తృప్తితో సద్గతి పొందుతాడు!.."


"దైవాన్ని నమ్మిన వాళ్ళు చెడిపోవడం ఏ యుగంలోనూ లేదు!..దైవ నామొచ్చారణతో జన్మ జన్మల పాపాలూ ప్రక్షాళన అయి తీరుతాయి..కోరరాని కోర్కెలు తీర్చేవాడు దేవుడు కానేకాదు!..భక్తులకు ఏది శ్రేయస్కరమో..ఏ క్షణంలో తన రక్షణ అవసరమో..అది ప్రసాదించేవాడు ఒక్క భగవంతుడు మాత్రమే!..నీవు చేయవలసిందల్లా..విడవకుండా..అచంచల విశ్వాసంతో..ఆయన పాదాలను మనసా, వాచా, కర్మణా నమ్మి శరణాగతి పొందడమే!.."


"దైవ జపం విశ్వాసం తో చేస్తే..సంపదలు మాత్రమే కాదు..అష్టసిద్ధులూ వశం అవుతాయి..కానీ వాటిని ఇతరులకు హాని కొరకు ఉపయోగిస్తే..రాక్షసులుగా మారతారు..అవి అందించిన భగవంతుని చేతిలోనే చావుదెబ్బ తింటారు..అలాకాక.. ధర్మమార్గాన వాటిని సమాజహితం కొరకు వినియోగిస్తే..వారు మహాత్ములు అవుతారు..అదొక యోగం..వారినే యోగులు అంటాం.." 


ఇంతవరకూ చెప్పిన శ్రీ స్వామివారు..హఠాత్తుగా పక పక మని నవ్వసాగారు..వింటున్న దంపతులిద్దరూ ఆశ్చర్యపోయారు..ఆ తెల్లవారుఝామున శ్రీ స్వామివారి స్వచ్ఛమైన నవ్వు..అదీ తెరలు తెరలుగా నవ్వడం..వారికి అర్ధం కాలేదు..


ఇంతలో శ్రీ స్వామివారే తమ నవ్వును ఆపుకొని..ప్రభావతి గారి వైపు చూసి.."అమ్మా..నిన్న రాత్రి నీకు అష్టైశ్వర్యాల గురించి బోధ చేసాను కదా!..నీవు ధన వ్యామోహం లో పడకూడదని అంతదూరం చెప్పాల్సి వచ్చింది..ఆ ఒక్క సందేహాన్ని తీర్చడం కోసం నేను ఎంతో సమయాన్ని వెచ్చించి..మీ సందేహాలను నివృత్తి చేయాల్సి వచ్చింది..మీరు ఈ జ్ఞానం నా ద్వారా పొందాలని ఆ భగవంతుడి నిర్ణయం..గృహస్తుల సందేహాలకు ఎంత సమయం ఇలా కేటాయించాలనో..అని నాకు నవ్వు తెప్పించింది..శ్రీధరరావు గారూ మీకు కూడా బోధ పడిందా?.." అన్నారు శ్రీ స్వామివారు..


"నాలోనూ చాలా సందేహాలు నివృత్తి అయ్యాయి స్వామీ.." అన్నారు శ్రీధరరావు గారు..శ్రీ స్వామివారి బోధలో..శ్రీధరరావు గారికి బాగా ఆకట్టుకున్న విషయం..సమాజహితం తో కూడుకున్న ధర్మాచరణ!..అది గృహస్తులకు అత్యవసరం..


"చివరగా ఒక్కమాట!..ఫలానా పూజ చేస్తే..దేవుడు నెత్తిన మొట్టాడు..అంటూవుంటారు కొందరు..అది తప్పు!..నిజమైన భక్తుడిని దైవం నెత్తిన మొట్టడు.. అనవసర కోరికలు..మోసం..పరనిందా.. పరులకు హాని..ఇత్యాదులను దేవుడు క్షమించడు!..అదీ అసలు రహస్యం..అది తెలుసుకొని మసలుకోండి!.." అని చెప్పి..


"అమ్మా..త్వరగా ఒక గ్లాసు పాలు ఇవ్వమ్మా!..బాగా ఆకలిగా ఉంది.." అని అడిగారు స్వామివారు..ఆసరికే కొద్దిగా వెలుతురు వస్తోంది..ప్రభావతి గారు గబ గబా గేదె దగ్గరకు వెళ్లి, పాలు పితికి.. వెచ్చచెసి ఇచ్చారు..శ్రీ స్వామివారు ఆ పాలు త్రాగి..మళ్లీ తన గదిలోకి వెళ్లి ధ్యానం లో కూర్చున్నారు..


అవధూత లక్షణం..శ్రీ దత్తాత్రేయ అవతారం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

వాస్తవంగా జరిగిందేమిటీ

 *గాజా గజగజ* ...❗

*లెబనాన్ లబలబ* ...❗❗

*అరబ్బుల పెడబొబ్బ*.❗❗❗

అవునూ...,

 *మీరు వింటున్నది నిజమే* ...

ప్రపంచపటంలో *ఇంచుమందం* కూడా లేని *ఇజ్రాయెల్ దెబ్బకు కళ్ళు బైర్లు కమ్ముకుంటున్నాయి అరబ్బు అబ్బలకు* ...

ఇంతకీ వాస్తవంగా జరిగిందేమిటీ ...❓

జరుగుతున్నదేమిటీ ...❓


*సంక్షిప్తంగానే* ...❗


🔊🔊🔊🔊🔊🔊🔊🔊


 ఏసుక్రీస్తును శిలువేశారన్న కారణంగా వందల సంవత్సరాలు క్రైస్తవుల అత్యాచారాలనుండి తట్టుకొని నిలబడ్డ యూదులకు 12వ శతాబ్దం తర్వాత క్రైస్తవ ప్రాబల్యం తగ్గి ఇస్లాం ప్రాబల్యం పెరగడంతో కొంతలోకొంతైనా ప్రమాదం నుండి బయటపడ్డామని సంతోషించారు యూదులు ... 

కానీ...,

 పాపం... వాళ్ళ పరిస్థితి పెనంమీదనుండి పొయ్యిలో పడ్డట్లైంది ...

కనీస మానవ హక్కులు అటుంచి

మతం మారుమంటూ నరకయాతనలు పెట్టడం. అధిక Taxes విధించడం, మతం ఆధారంగానే శిక్షలు ఖరారు చేయడం, ... లాంటివెన్నో...

 ప్రస్తుతం మనదేశంలో జరుగుతున్నట్లే విచ్చలవిడిగా Love Jihad లకు పాల్పడడం ...

వీటిని తట్టుకోలేక లక్షలాదిమంది France, Poland, Germany, America, England,...  లకు పారిపోవాల్సివచ్చింది ...

కానీ...,

 రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పనట్లు ఎక్కడికెళ్లినా చెప్పలేనంత మతవివక్షను ఎదుర్కోవలసి వచ్చింది ...

ఒక్క భారతదేశం, అమెరికాల్లోనే ఏ వివక్షాలేకుండా ఉండగలిగామని ..., భారతదేశంలో పొందగలిగినంత గౌరవం మరెక్కడా పొందలేదనీ ఇప్పటికీ గుర్తుచేస్తుండడం ఈమధ్య పత్రికల్లో కూడా చూసాము కూడా ... 

అందుకే...,

 ( *ఇప్పటికీ ఇజ్రాయిలీలు మనదేశాన్ని అమితంగా అభిమానిస్తున్నా ..., Minority ఓట్లకు భయపడి మన ప్రభుత్వాలే వారితో అంటీముట్టనట్లు వ్యవహారించడం మన దురదృష్టం*).


Germany లోనైతే Hitler ఏకంగా Gas Chambers లో బంధించి విషవాయువు వదలడం ద్వారా, ఇంకా అనేక  రకరకాలుగా హింసించి సుమారు 60 లక్షల మందిని పొట్టనబెట్టుకున్నాడు ...  యూదుడైన Great Scientist *Albert Einstein* కూడా వీళ్ళ ఆగడాలు భరించలేక America పారిపోవాల్సివచ్చిందంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉండేదో ఊహించుకోవచ్చు ...


ఇన్ని అత్యాచారాలు అరాచకాలు అవమానాలు భరిస్తూ కూడా యూదులు వారి ఆత్మవిశ్వాసాన్నిగానీ ...,  దేశభక్తినిగానీ కోల్పోలేదు..., మతంపై వారికిగల విశ్వాసం చెక్కుచెదరలేదు ...


ఏ ఇద్దరు ఇజ్రాయిలీలు ఎక్కడ కలుసుకున్నా ...!  *"NEXT TIME ,Let's MEET In Our HOLY LAND"* అంటూ దృఢ సంకల్పంతో వీడ్కోలు తీసుకునేవారు...


☘️☘️🌹🌹🌹☘️☘️

 *స్వతంత్ర ఇజ్రాయెల్ ఏర్పాటు*  🥙🥙🥙🌹🌹🌹


రెండవ ప్రపంచయుద్దానంతరం ఐక్యరాజ్య సమితి ప్రోద్బలంతో ఇంగ్లాండ్ అమెరికాల అవసరార్థం స్వతంత్ర ISRAEL ఏర్పాటుకు అంగీకారంతో 1948, అనగా మనకంటే ఒక సంవత్సరం ఆలస్యంగా ISRAEL ఆవిర్భావం జరిగింది ...

కానీ..., 

అనుకున్నంత భూభాగం గానీ,... అనుకున్న వనరులేవీ లభించకున్నా ..., ఎలాగోలా మాతృభూమికి చేరుకోగలిగామనే ఆత్మతృప్తితో అంగీకరించాల్సివచ్చింది ...

ఈ కొండలు గుట్టలూ నీటివసతిలేని భూమి ఉంటేనేమి లేకుంటేనేమి అంటూ అనేకమంది వెటకారంగా మాట్లాడారు కూడా ...

జాతి పునర్నిర్మాణం కోసం యూదులంతా మాతృభూమికి తరలిరావల్సిందిగా అధ్యక్షుడు ఇచ్చిన పిలుపుకు స్పందించిన వేలాదిమంది ఇజ్రాయెల్ కు తరలిరావడం జరిగింది ...

 గొప్పగొప్ప శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు నిరంతర ప్రణాళికలతో ఎందుకూ పనికిరాదనుకున్న భూమిని అతితక్కువ కాలంలోనే దేశమంతా నీటిపారుదల సౌకర్యాలు ఏర్పర్చుకొని సస్యశ్యామలం చేసుకున్నారు ...

ఈరోజు వ్యవసాయంలో ప్రపంచమంతా వాడుతున్న అనేక అధునాతన యంత్రపరికరాల్లో దాదాపు అన్నీ ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు రూపొందించినవేనని చాలామందికి తెలియదు కూడా, ... 

వినూత్నమైన వ్యవసాయ పద్దతులు, 

Drip Irrigation, మొ౹౹ అన్నీ వారి సృష్టే ...

Computer రంగంలోనూ,.... ( *Microsoft Windows, SISCO, Motorola, Voicemail Technology, IBM R&D Center, Biotechnology, Router Technology,...)* ఇలా చెప్పలేనన్ని Innovations ISRAEL శాస్త్రవేత్తల కృషే ...

 వ్యాపారరంగంలోనూ వారికి వారే సాటి. NASDAK లో చైనా తర్వాత అత్యధిక పెట్టుబడులు వీరివే ...

ఇక రక్షణ రంగం గురించి చెప్పనక్కరే లేదు ...

*అమెరికాకు కూడా యుద్ధ శిక్షణ ఇవ్వగలిగే స్థాయిలో ఉంది ఇజ్రాయెల్ అంటే అర్ధం చేసుకోవచ్చు* ... 👍👍👍

 *దేశ జనాభాలో 16 yrs దాటిన యువకులకు 3yrs పాటు యువతులకు 2yrs పాటు Army Training తీసుకోవాల్సిందే* ...

 ఇక్కడి మహిళా యుద్ధ వీరనారీమణులను *SABRE ( చురకత్తులు)* అని పిలుస్తారు ...

ఈ ఏర్పటంతా ఒక్క సంవత్సరంలోనే జరుగలేదు కనీసం 15/20 yrs పట్టిందనుకోండి ...


శ్రద్ధగా వారి జాతినిర్మాణంలో వారు నిమగ్నమై ఉంటుంటే ...,


స్వాతంత్ర్యం లభించిన సంవత్సరం లోపే పక్కనున్న ISLAMIC దేశాలు ( *ఈజిప్టు, సిరియా, జోర్డాన్, పాలస్తీనా, లెబనాన్ సౌదీఅరేబియా, ఇరాక్*),... వారిపై దాడులకు తెగబడ్డాయి ...


 🔥🔥🔥🔥🔥🔥🔥 

*యుద్దరంగంలో బెబ్బులీలు యెహూదీలు ( ISRAELS)* 

🔥🔥🔥🔥🔥🔥🔥

 

 పాపం...! వాళ్ళకాళ్ళమీద వాళ్ళు నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్న ఇజ్రాయిలీలకు యుద్ధం ఒక పిడుగులాంటి వార్తే ...!

*ఒక్కటికాదు రెండు కాదు ఏకంగా 6 శక్తివంతమైన దేశాలు ఒకేసారి యుద్దానికి కాలుదువ్వాయి* ...

కానీ...,

ఎవరూ అదరలేదు బెదరలేదు ...

*"ఎన్నో త్యాగాలతో సాధించుకున్న మనదేశం మళ్ళీ ప్రమాదంలో పడింది. దురాక్రమణకారులను తరిమికొట్టి దేశాన్ని రక్షించుకునేందుకు యుద్దరంగంలోకి దూకండి"* అన్న

అధ్యక్షుడు *DAVID GURIEN* ఒకేఒక్క పిలుపుతో మొదట్లో *కేవలం 50 వేలు మాత్రమే ఉన్న సైన్యం Just 48 గంటల్లోనే  రెండులక్షల యాబై వేలకు చేరింది* ...

డాక్టర్లు, టీచర్లు, లాయర్లు, ఇంజనీర్లు, విద్యార్థులు,... స్త్రీలు పురుషులు అనకుండా పెద్దపెట్టున సైన్యంలో చేరి *సుశిక్షితులైన సైనికులకంటే కూడా వీరోచితంగా పోరాడి పక్కనున్న పాలస్తీనానే  ఉల్టా ఆక్రమించారు* ...

(అదీ ఒకప్పటి యూదుల దేశమే సుమా)...

  *ఇప్పటికీ ఈ భూభాగంకోసమే పీక్కోలేక లాక్కోలేక సస్తున్నారు పాలస్తీనా తీవ్రవాదులు (ఆ తీవ్రవాదులకొరకే కంటికి ధారగా కష్టపడి ఏడుస్తున్నారు ఇక్కడి కమ్యూనిస్టులు కూడా )*  😭😭😭😭😭😭😭😭😭

 

ఇంతటితో ఇస్లామిక్ దేశాలు యుద్దాలు ఆపాయనుకున్నారా ...⁉️

No No ...

 1948 నుండి 1983 వరకు మొత్తం 6సార్లు తెగబడ్డాయి ...


1956 లో SUEZ CANAL విషయంలో దాడిచేసిన ఈజిప్టును మట్టికరిపించింది ఇజ్రాయెల్ ...


1967 లో నైతే మళ్ళీ సిరియా, జోర్డాన్, లెబనాన్, సౌదీ, పాలస్తీనాలతో కల్సి దాడి చేసిన *ఈజిప్టు Airforce లోని 300 యుద్దవిమానాలకు గానూ 280 విమానాలను మొట్టమొదటి రోజునే ఒక్క దెబ్బతోనే కుప్పకూల్చి లేవలేకుండా చావుదెబ్బ తీసి మిగిలిన దేశాలతో ఒక ఆటాడుకుంది ... కేవలం ఆరంటే ఆరురోజుల్లోనే అందరినీ మట్టుబెట్టిన ISRAEL ధైర్యం, యుద్దవ్యూహాలు పరాక్రమం, ... ఎంత చెప్పినా తక్కువే* ...

🙊🙊🙊🙊🙊🙊🙊

1973 లో Lebanon ను కొట్టిన దెబ్బకు ఇప్పటికీ లెబనాన్ తోపాటూ అరబ్ దేశాలన్నీ లబోదిబోమంటున్నాయి ...

ISRAEL పేరువింటేనే... 😭😭😭 

*మొత్తం అరబ్ దేశాలన్నీ   గజగజ వణికిపోతున్నాయి* ...

ఆరుసార్లు అందరూ కల్సివెళ్ళినా..., విడివిడిగా వెళ్ళినా..., *Result is Same* 👍👍👍 

*పదేపదే పండ్లూడగొట్టుకునేటోడికి చావుకళ రాకుంటే పెళ్ళికళ వస్తుందా చెప్పండీ* ...⁉️⁉️⁉️

*ఒకరి వాతలు ఇంకొకరు చూసుకుంటూ ఏడ్చుకుంటూ కూచోవడంతప్ప ఎదిరించే సాహసం లేకుండా పోయింది అరబ్బులకు* ...

 

కానీ...,

*కుక్కతోక సక్కగైతదా ఎక్కడైనా ...❓❓❓*

 ఏమిచేసినా..., ఎన్ని తన్నులుతిన్నా...,

Direct యుద్ధంలో గెల్వలేమని ఆలస్యంగానైనా తెల్సుకున్న అరబ్ దేశాలన్నీ ..., ఉగ్రవాదాన్ని పెంచిపోషించి వెనుకనుండి మద్దతిస్తూ  ISRAEL ను సర్వనాశనం చేయాలనే కుట్రతో... *యాసర్ అరాఫత్* ను హీరో చేసి వెనకనుండి ఆయుధాలు మందుగుండుతో *ఆసరా ఇద్దామనుకున్నారు* ...

ప్చ్... 😱😱😱  No Use... 

దెబ్బకు పదిదెబ్బల Formula తో ISRAEL ప్రతిధాడితో 

ఉక్కిరిబిక్కిరైపోయాడు అరాఫత్ ... 

రెండుసార్లు అరాఫత్ అధ్యక్షభవనాన్ని ముట్టడించి కదిలితే కాల్చేస్తామంటే కిక్కురుమనకుండా బిక్కుబిక్కుమంటూ  కూచునేసరికి....,

Arafat ను

విడిచిపెట్టాల్సిందిగా U.N.O తో సహా ప్రపంచ దేశాలన్నీ బతిలాడుకునేసరికి...

ఒక్క ISRAEL పౌరుడు చస్తే ...కనీసం 10 మందిని లేపేస్తాం బిడ్డా అని Ultimatum ఇచ్చి వెనుదిరిగారు ...

ఇప్పటికీ ఆ *1: 10* నే తూచా తప్పకుండా Follow అవుతున్నారు ISRAELS ...


 

*YASIR ARAFAT* సరిగ్గా పొడువలేకపోతున్నాడు మేము పొడుస్తాం చూడండంటూ అతన్ని పక్కకుతోసి మా తడాఖా చూపిస్తామంటూ ముందుకొచ్చిందే నేటి ఉగ్రవాదసంస్థ *హమాస్ ( HAMAS)* ...


తోకాడించినప్పుడల్లా *హమాస్* కు కూడా  *సూపర్ తమాషా* చూపిస్తూనే ఉంది ఇజ్రాయెల్... ఇంతకుముందు *1:10* ఇప్పుడు కాస్తా *1:20* అయిందనుకోండి... అంటే, ఒక్క ఇజ్రాయెల్ వాడిని చంపితే ..., 20 మంది  *హమాస్* తీవ్రవాదులు తెల్లారేసరికి *ఖల్లాస్ అన్నమాట* ...

👊👊👊👊👊👊👊👊


*ఉగ్రవాదులకు ఉగ్రసింగం ఇజ్రాయెల్*

🔥🔥🦁🦁🦁🔥🔥

ఇజ్రాయెల్ కున్న ఇంకో గొప్ప వజ్రాయుధమేమంటే ...⁉️  

వాళ్ళ Intelligence Wing *"MOSSAD"*

ఇజ్రాయెల్ పౌరులమీద దాడిచేసిన వాళ్ళనింతవరకు ఒక్కన్నీ వదల్లేదు ...

*1972 Olympics లో 16మంది ఇజ్రాయెల్ ఆటగాళ్ళను మ్యూనిచ్ Ground* లో పాలస్తీనా తీవ్రవాదులు చంపినందుకు ప్రతీకారంగా 2 వేలమంది పాలస్తీనా మద్దతుదారుల్ని మట్టుబెట్టడంతోనే ఆగకుండా చంపినవాళ్ళను దేశదేశాలు పారిపోయి దాక్కున్నా వదలకుండా ... ఆయా దేశాలకెళ్ళి ఒక్కన్నికూడా కూడా వదలకుండా 1988 వరకూ... వేటాడి వెంటాడి చంపేసింది...

అదీ *MOSSAD Power* అంటే ...👍👍👍👏👏👏


*OPERATION THUNDER BOLT* ...

👊👊🔥🔥🔥👊👊

ఇక చివరి ఒళ్ళు గగుర్పొడిచే 1967, June 27 విమాన Hijacking, ప్రతీకారంగా...

 ఇజ్రాయెల్ జరిపిన *OPERATION THUNDER BOLT* సంఘటన మొత్తం ప్రపంచాన్నే దిమ్మెరపోయేట్లు చేసింది ...

ఇజ్రాయెల్ అంటేనే...❗

*వామ్మో*....🙉🙉🙉

*వాళ్ళతెరువు పోవద్దమ్మో* ...🙉🙉🙉

*పాతాళంలో దాక్కున్నా పట్టుకొచ్చి చంపేస్తారనే భయం పట్టుకుంది* ...

😩😩😩😩😩😩😩

*ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకూ చాలామంది నమ్మలేదంటే నమ్మండీ* ...  😇😇😇

అవునా...❗

అట్లనా ....❗❗

జరిగింది నిజమేనా ...❗❗❗

అని నోరెళ్ళబెట్టింది లోకమంతా ... 🥱🥱🥱

అచ్చంగా Detective నవల్లోలానే జరిగిందనుకోండి ...❗❗❗


నమ్మకం లేకుంటే Google Search చేయండి ...

ప్రస్తుతానికి మాత్రం చదవండి ...

👇👇👇👇👇👇👇👇

అది 1967 జూన్ 27...❗❗❗

 *ఇజ్రాయెల్ విమానాన్ని HIJACK చేసిన పాలస్తీనా తీవ్రవాదులు మొదట్లో లిబియా విమానాశ్రయంలో దాచిపెట్టారు* ... చుట్టూ అన్నిదేశాల సహకారంతోనే చేసినప్పటికీ విళ్ళకు ధైర్యం చాల్లేదు... ఇజ్రాయెల్ ఎట్లైనా వచ్చి విడిపించుకొని పోతుందనే భయంతో మళ్ళీ *4000km. దూరంలోని Remote ఆఫ్రికన్ ISLAMIC దేశమైన ఉగాండాకు Shift చేసారు* ... 

ఉగాండా సైన్యాధ్యక్షుడు *ఈతీ అమీన్* రాక్షసుడిలా నియంత, ఛండశాసనుడు... *శత్రువులను చంపి నరమాంసం కూడా తినేవారంటారు*... 👹👹👹🤮🤮🤮

 ఇజ్రాయెల్ అంటే ఎంతో కోపం వాడికి. అటువంటి వాడు తీవ్రవాదులకు పూర్తిమద్దతు ప్రకటించి తన సైన్యాన్ని కూడా Hijackers కు మద్దతుగా నిలిపి, మారిషస్ లో ప్రపంచదేశాల సమావేశాలకని బయల్దేరి వెళ్ళాడు ...


విమానంలోని 54 మంది ఇజ్రాయెల్ ప్రయాణికులను మాత్రమే బంధించి మిగతా దేశాల ప్రయాణికుల్ని విడుదల చేసి, రెండు కిలోమీటర్ల దూరంలోని హోటల్ కి తరలించారు తీవ్రవాదులు ...


విమాన ప్రయాణికులను విడుదల చేయాలంటే ..., 

జైలులో ఉన్న మా *పాలస్తీనా తీవ్రవాదులందరినీ విడుదల చేయాల్సిందేనని, 5 Million Dollars డబ్బు ముట్టచెప్పాల్సిందేనని* ... 

*July 3rd వరకే గడువు* ... 

ఒక్క రోజు ఆలస్యమైనా ప్రయాణికులందర్నీ ముక్కలుముక్కలుగా నరికేస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో ఉలిక్కిపడ్డ ISRAEL Cabinet అత్యవసరంగా సమావేశమై Intelligence Wing MOSSAD తో చర్చించి వాళ్ళ  Secret Plan ను ఏమాత్రం బయటపెట్టకుండా ...,

 *"మీ డిమాండ్లకు సానుకూలంగా ఉన్నాము. మాకు కొంత గడువివ్వండి అంటూ అధికారిక ప్రకటన చేసారు"* ...

 ఎట్టిపరిస్థితుల్లోనూ తలొగ్గదనుకున్న ఇజ్రాయెల్ ఇంత తొందరగా దిగివచ్చినందుకు తీవ్రవాదులు ఎగిరి గంతేశారు ...


🤫🤫🤫 *OPERATION THUNDER BOLT* Started ...🤫🤫🤫


✳️ అది July,3rd అర్ధరాత్రి...!

✳️ చుట్టూ శత్రుదేశాలు.. 

✳️ ఎవరూ కనీసం విమానాల్లో ఇంధనం నింపుకోవడానికి కూడా అనుమతివ్వరు... 

✳️ సుదూరంలో 4వేల కి.మీ దూరము....

 వెళ్ళడానికి ఏదోవిధంగా ఇంధనం సరిపోతుందనుకున్నా తిరిగిరావడం కష్టం ...

 ✳️ పైగా ఏ శత్రుదేశానికి తెల్సినా ప్రమాధమే ...

అన్నీ ఆలోచించి మొత్తం 5 యుద్ధ విమానాల్లో  మూడింటిలో Black Cat Commandos, ఒక దాంట్లో Communication System తో పాటూ Medical Equipment, ఒకటి ఖాళీగా,... (ప్రయాణికులను విడిపించుకొని తేవడానికి )


 *అర్ధరాత్రి ఒంటిగంటకు ఎర్రసముద్ర మార్గంగుండా ... శత్రు RADARS కు అందకుండా కేవలం 100 మీటర్ల ఎత్తులోనే ఎగురుతూ వెళ్ళి UGANDA విమానాశ్రయానికి వెళ్ళగానే వాళ్ళ అధ్యక్షుడే మారిషస్ నుండి తిరిగి వచ్చాడేమోనని భ్రమించారు*... 

పైగా నిద్రమబ్బు సమయం కదా ...❗

ఇంకో కలిసొచ్చిన విషయమేమిటంటే...❗

ఆ Airport Contractor కూడా ఒక ఇజ్రాయిలీయే కాబట్టి మొత్తం Airport Sketch వీరిదగ్గరున్నట్లే ...

 ముందు జాగ్రత్తగానే (తిరుగు ప్రయాణానికవసరమైన ఇంధనం కూడా Just UGANDA చేరుకుంటామనగానే నింపుకున్నారు) ...


ఇక ఇజ్రాయెల్ బంధీలను దాచిపెట్టిన Hotel Address కూడా విడుదలైన ఇతర దేశాల బంధీల Statements ద్వారా తెల్సుకున్నారు...


 విచిత్రమేమంటే ...❗

 *వీళ్ళు నిజంగానే Uganda అధ్యక్షుడు వాడుతున్న Colour & Desinged Plane లోనే వెళ్ళారు ... పైగా వాడిలాగా నల్లగా కుంభాసురిడిలాగా ఉన్నవాడికే వాడి వేషం వేసి)* ముందు నిలిపారు... ఇక వాళ్ళకు అనుమానమే లేకుండా పోయింది... ఒకే ఒక్క Security Gaurd వీళ్ళపై Doubt పడి Fire చేద్దామనుకునేలోపే వీళ్ళ Silenced Guns దెబ్బకు Silent గా కుప్పకూలిపోయాడు ...

 15 నిమిషాల్లోనే మొత్తం సైనికులందరినీ మట్టుబెట్టి 2 కి.మీ దూరంలో ప్రయాణికులను బంధించిన హోటల్లో కెళ్ళి *"హిబ్రూ భాషలో మేము ఇజ్రాయెల్ సైనికులం.మిమ్మల్ని తీసుకెళ్ళడానికొచ్చాము.దయచేసి అందరూ బయపడకుండా పడుకోండి. మీకేమీకాదు"*  అని అరిచేసరికి ప్రయాణికులంతా పడుకోవడంతో  వాళ్ళకు ఏ ప్రమాదమూ జరుగకుండా 15 నిమిషాల్లోనే తీవ్రవాదులందరినీ వారికి మద్దతుగా ఉన్న ఉగాండా సైనికులందరినీ మట్టుబెట్టి ...,

ప్రయాణికులందర్నీ తీసుకొని Airport కు చేరుకొని ... అంతటితోనే ఆగకుండా ఉగాండా Airport చుట్టుపక్కల గల Defence Force నంతటినీ ధ్వంసం చేసి,

అందరూ Safe గా Flight లోకి చేరుకున్నాకే నేను Flight ఎక్కుతానని అందర్నీ క్షేమంగా ఎక్కించిన OPERATION THUNDER Team Leader *యనాతన్ నేతాన్యాహు* మాత్రం Bullet దెబ్బలు తగిలి అక్కడే నేలకూలడం ఎంతో విషాదకరం ...

అతని ప్రేరణతో దేశసేవకై ప్రాణాలర్పించడానికి ముందుకొచ్చినవాడే...!,

 నేడు *ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా ఉన్న అతని తమ్ముడు బెంజమిన్ నేతాన్యాహు*

...👏👏👏👊👊👊

*Operation Successfully Completed* ... 👏👏👏

 *World Mesmerized*.. 😇😇😇

*Even,... Russia, America Shocked*... 🤭🤭🤭


అందరికంటే పెద్ద బక్రా అయింది మాత్రం *ఉగాండా అధ్యక్షుడు ఈతూ అమీనే* ... 🐑🐑🐑

*OPERATION THUNDER BOLT* అంతా అయిపోయిన రెండు రోజులకు గానీ వాడికి విషయం తెల్వనేలేదు ...

 చెప్పేంత సాహసం వాళ్ళ Assistants చేస్తేగదా ...!

అయితే, Hospital లో ఉన్నవిషయం తెలియక  వదిలివెళ్ళిన ఇజ్రాయిలీ మహిళను అత్యంత కౄరాతి కౄరంగా హింసించి చంపేసారు ఆ రాక్షసులు ... 😢😢😢

*అత్తమీది కోపం దుత్తమీద తీసినట్లు*

నాలుగు వేల కి.మీ దూరంనుండి దేశంగాని దేశం వచ్చి చిందరవందర చేసి భీభత్సం సృష్టించిన ఇజ్రాయెల్ సైనికులపై పోరాడే దమ్ములేదుగానీ...,

అనారోగ్యంతో బాధపడుతున్న అమాయక మహిళపై తమ ప్రతాపం చూపించారు దగుల్భాజీ వెదవలు ....


కొసమెరుపేమంటే ...⁉️⁉️⁉️

*HIJACK కుట్రకు మూలకారకుడైన Terrorist Ldr ముప్పైరోజుల్లోనే విషప్రయోగంతో సావడం* ...

 That is ....❗,

 *నిప్పులు కురిపించే ISRAEL ౼ దేశభక్తితో కణకణం నిండిన ఇజ్రాయెల్* ...  🔥🔥🔥 ... 👊👊👊👏👏👏

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ని ఆదర్శంగా తీసుకుంటేగానీ ...,

 *మనదేశం ఎదుర్కొంటున్న 90% పైగా సమస్యలకు పరిష్కారం లేదనే గట్టినమ్మకం కలవాళ్ళలో నేనొకడిని* ...

అవేమంటే ...❗

🏹🏹🏹 *వ్యక్తిగత అభివృద్ధితో పాటుగా మనమంతా దేశాభివృద్ధికై బాగా కష్టపడాలి*...

🏹🏹🏹 *దేశరక్షణకై మనమంతా సైనికులుగా తయారుకావాలి* ...

🏹🏹🏹  *Latest Technology తో నిరంతరం Update అవుతుండాలి*...

🏹🏹🏹  *దేశానికి ధర్మానికి ద్రోహం చేసేవాడినెంతవాడినైనా ఉపేక్షించవద్దు* ...

🏹🏹🏹 *మంచివారిని అనాథలను ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుందాము* ...

🏹🏹🏹 *దేశరక్షణకై, అభివృద్ధికై కులమతాలను వదిలి సంఘటిత శక్తిని చూపిద్దాము* ...

🏹🏹🏹 అన్నిటికన్నా ముఖ్యమైనది ..., *జ్ఞానం శక్తి, పట్టుదల ఉన్నోడికి ప్రపంచం తలవంచి తీరుతుంది* ...


ఈ లక్షణాలన్నీ మనకు శ్రీరాముడు, ఆంజనేయుడు, శ్రీకృష్ణుడు,... లాంటి భారతీయ మహాపురుషుల చరిత్రలు సరిగ్గా చదివితే అందులోనే అన్ని రకాల ఆదర్శాలుంటాయి ...

కానీ...,

మనం మర్చిపోయాం కాబట్టి ప్రస్తుతం దాదాపు అటువంటి పౌరుషప్రతాపాలతోనే పనిచేస్తున ISRAEL ప్రేరణతోనే మనం కూడా *మయన్మార్, బాలాకోట్ లపై అవలీలగా Surgical Strikes చేయగల్గాము* ... 


అందుకే...,

ఇంతకుముందు ప్రభుత్వాల మాదిరిగా Vote Bank రాజకీయాలు చేయకుండా...,


*అత్యంత మేధావులు, Highly Technical Skills, Commercial & Economic Skills, సాహసము, ధైర్యం, నిజాయితీ దేశభక్తి, కల్గిన ఇజ్రాయెల్ తో సత్సంబంధాలు నెలకొల్పుకొనే ప్రయత్నం చేస్తున్న మన ప్రధాని MODI గారు ఎంతైనా వందనీయులే* ...

 *Brilliant Student Always Wants to Work With Brilliant Student Only & Wants to Learn From Brilliants Only* ...

త్వరలోనే భారత్ కూడా ఇజ్రాయెల్ లాగా సర్వశక్తిమంతం కావడానికి ఇవి పునదిరాళ్ళుగా భావించాలి ...


*జైజై మాత ౼ భారత్ మాతా*

🚩🚩🚩🚩🚩🚩🚩🚩

.... *నర్రా* ✍️✍️✍️

అస్త్రం లేని ... యుద్ధం

 మీకు ..

 అస్త్రం  లేని ...

యుద్ధం  తెలుసా ...?


మహాభారత యుద్ధంలో  ద్రోణాచార్యుడు మరణించి నప్పుడు అశ్వత్థామకు చాలా కోపం వచ్చింది..


తన తండ్రిని హత్య చేసిన సైన్యం పై అతను "నారాయణాస్త్రం" అనే భయంకరమైన ఆయుధాన్ని, పాండవ సైన్యంపై వదిలాడు ..


ఆ అస్త్రం పై, ఎవరూ ప్రతీకారం తీర్చుకోలేరు, ఇది ప్రజలను కాల్చివేస్తుంది, మరియు చేతిలో ఆయుధాలు ఉన్నవారిని లేదా పోరాడటానికి ప్రయత్నిస్తున్న వారిని కూడా వెంటనే నాశనం చేస్తుంది ..


*శ్రీకృష్ణుడు తన సైన్యాన్ని, వారి వారి ఆయుధాలను విడిచిపెట్టి, ముడుచుకున్న చేతులతో, నిశ్శబ్దంగా ఉండాలని ఆదేశించాడు, మరియు యుద్ధం యొక్క ఆలోచనను కూడా మనస్సులోకి రానీయకండి, అది మిమ్మల్ని కూడా నాశనం చేస్తుంది అని చెప్పారు .


*కొంత సమయం ముగిసి తర్వాత నారాయణ అస్త్రం క్రమంగా శాంతించింది, ఈ విధంగా పాండవ సైన్యం రక్షించబడింది, పోరాటంలో దాడి ఎదురు ఎదురుదాడియో సమాధానం కాదు, కొన్ని యుద్ధాలు నిశ్శబ్దంగా ఉండడం ద్వారా కూడా గెలుస్తారు ..


కరోనా మహమ్మారి ఉదృతంగా ఉన్న ఈ సమయంలో, ప్రకృతి కోపం  నుండి తప్పించుకోవటానికి, రక్షణ పొందడానికి, అందరూ కొంతకాలం (అవసరం లేనప్పుడు) బయటకు వెళ్లడం మానేయడం, ఆనందంగా, నిశ్శబ్దంగా తమ ఇళ్లలోనే ఉండటం మరియు ఈ సమయంలో మంచి విషయాలు గుర్తుకుతెచ్చుకోవడం, చెడు విషయాలను మరిచిపోవడం ఎంతో మేలు చేస్తుంది, అవసరం కూడా ఉంది ..