26, జూన్ 2024, బుధవారం

Panchang

 


*శ్రీ హసనాంబాదేవి ఆలయం*

 🕉 *మన గుడి : నెం 360*


⚜ *కర్నాటక  : హసన్*


⚜ *శ్రీ హసనాంబాదేవి ఆలయం*



💠 మిగిలిన రోజుల్లో ఎంతో నిశ్శబ్దంగా ఉండే ఈ గుడి తలుపులు ఏడాదిలో పది నుంచి పన్నెండు రోజులు మాత్రమే తెరచుకుంటాయి. ఆ కొద్ది సమయంలోనే అమ్మవారి చల్లని చిరునవ్వు తమపైన పడాలనే ఉద్దేశంతో భక్తులు ఎక్కడెక్కడినుంచో ఇక్కడకు వస్తారు.


💠 ఈ ఆలయం తన భక్తులకు దర్శనం ఇవ్వడానికి సంవత్సరానికి ఒకసారి, కేవలం ఒక వారం మాత్రమే తెరవబడుతుంది. 

సుదూర ప్రాంతాల నుంచి లక్షలాది మంది యాత్రికులు ఇక్కడికి వస్తుంటారు.

ఖచ్చితంగా చెప్పాలంటే, హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి తర్వాత మొదటి గురువారం ఆలయం తెరవబడుతుంది మరియు దీపావళి పండుగతో పాటు బలి పాడ్యమి రోజు వరకు దాదాపు ఒక వారం పాటు తెరిచి ఉంచబడుతుంది, మరియు ఈ సమయంలో అమ్మవారి దర్శనం కోసం, నమ్మశక్యం కాని పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తారు

ఈ ఆలయానికి ఇంత విశిష్టత మరియు ప్రాముఖ్యత ఏమిటి? 


💠 అదొక్కటే కాదు మరికొన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయం కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఉంది. 3  రాళ్ల రూపంలో కొలువైన హసనాంబాదేవి అంటే... చిరునవ్వులు చిందిస్తూ, తమ కష్టాలను పోగొట్టే దేవతగా భక్తులు భావిస్తారు.


💠 అమ్మ ఇక్కడ ఉండటం వల్లే జిల్లాకు కూడా హసన్ అనే పేరు వచ్చిందని అంటారు. 

హసన్ జిల్లాలోని దేవాలయాలు హొయసల సంప్రదాయానికి చెందిన ఆలయ నిర్మాణ శైలికి కొన్ని ఉదాహరణలు.


💠 ఈ ఆలయం తెరిచిన పది

లేదా పన్నెండు రోజులు అయ్యాక గర్భగుడిలో పూలూ, నేతితో పెట్టిన దీపం, నైవేద్యాన్ని అమ్మకు సమర్పించి ఆ తరువాత తలుపులు మూస్తారు.

ఏడాది తరువాత మళ్లీ తలుపులు తెరిచేనాటికి కూడా ఆ దీపం కొండెక్కకుండా అలాగే ఉంటుందట. 

అదే విధంగా పూలు కూడా మొదటిరోజు ఉంచినట్లుగానే తాజాగా కనిపించడం, నైవేద్యం కూడా ఏ మాత్రం పాడవ్వకుండా ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత అని చెబుతారు.


💠 ఈ గుడిని 12 వ శతాబ్దంలో కట్టారని చరిత్ర చెబుతున్నా ఎవరు నిర్మించారనే దాఖలాలు మాత్రం లేవు.


🔆 *స్థలపురాణం* 🔆


💠 అంధకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మకోసం తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమవ్వడంతో తనకు మరణం లేకుండా ఉండేలా వరం ఇమ్మంటాడు. ఆ వరం వల్ల ప్రపంచాన్ని అల్లకల్లోలం చేయడం మొదలు పెడతాడు.


💠 ఇది తెలిసిన శివుడు యోగీశ్వరి అనే శక్తిని సృష్టిస్తాడు. ఆ శక్తి బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి,

చాముండి అనే సప్తమాతృకలతో కలిసి ఆ రాక్షసుడిని సంహరిస్తుంది.

ఆ తరువాత సప్తమాత్రికలు కాశీ వెళ్లే ప్రయత్నంలో ఈ హసన్ కి చేరుకుంటారు. 

ఈ ప్రాంతం నచ్చడంతో మాహేశ్వరి, వైష్ణవి, కౌమారి ఈ ఆలయం ఉన్న ప్రాంతంలోని ఓ కొండలో మమేకం అయితే మరో ముగ్గురు దేవతలు దేవగిరి హోండ అనే ప్రాంతంలో ఉండిపోతారు.


💠 బ్రాహ్మి మాత్రం కెంచెమ్మన హాస్కోట్ పొలిమేరల్లో ఉందని అంటారు. 

అలా అప్పటినుంచీ ఈ ఆలయంలో అమ్మవారు మూడు రాళ్ల రూపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తోందట.

అమ్మవారు ఇక్కడ నవ్వుతూ ఉండటం వల్లే ఆమెను హసనాంబాదేవిగా పిలుస్తారట.


💠 అయితే... అమ్మ ఇక్కడ

వెలసిన కొన్నాళ్లకు ఓ భక్తుడికి కలలో కనిపించి తనని ఏడాదికోసారి కొన్ని రోజులు మాత్రమే పూజించాలని చెప్పడంతో అప్పటి నుంచీ అదే ఓ ఆచారంలా వస్తోందని ఆలయ నిర్వాహకులు చెబుతారు.


💠 ఈ ఆలయానికి సంబంధించి మరో కథ ప్రాచుర్యంలో ఉంది.

ఓ అమ్మవారి భక్తురాలిని ఆమె అత్త చిత్రహింసలు పెట్టేదట. 

అలా ఓ రోజు ఆ కోడలు గుడికి వచ్చినప్పుడూ అలాగే బాధపెట్టడంతో అమ్మకు కోపంవచ్చి ఆ అత్తను రాయిలా మార్చేసిందనీ ఇప్పటికీ ఆ రాయి ఆలయం లోనే ఉందనీ అంటారు.


💠 ఏడాదికోసారి మిల్లీమీటరు చొప్పున జరిగే అమ్మ ఆ రాయిని చేరుకున్నప్పుడు కలియుగం అంతమవుతుందనేది స్థానికుల నమ్మకం. అదేవిధంగా మరోసారి నలుగురు దొంగలు ఈ ఆలయంలోని అమ్మవారి నగలు దొంగి లించేందుకు వచ్చి రాళ్లుగా మారిపోయారట.

ఈ రాళ్లను కూడా స్థానికంగా ఉండే కల్లప్ప అంటారు. వాటిని.ఇప్పటికి గుడిలో చూడొచ్చని అంటారు. 


💠 అమ్మ చెప్పినట్లుగానే ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మొదటి గురువారం నాడు ఈ ఆలయాన్ని తెరచి బలిపాడ్యమి మర్నాడు సంప్రదాయం ప్రకారం అమ్మవారికి నైవేద్యం, పూలు, దీపం సమర్పించి మూసేస్తారు.

ఆలయం తెరచిన రెండో రోజు నుంచీ అమ్మను దర్శించుకునేందుకు వేలాది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తారు.

ఆలయం తెరిచిన సమయంలో ఇక్కడ జరిగే నిత్యపూజల్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు


💠 ఈ ఆలయం హసన్ జిల్లాలో ఉంది.

రైల్లో వచ్చేవారు అర్సికెరె స్టేషన్లో దిగి... 

అక్కడి నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆలయానికి బస్సులో చేరుకోవచ్చు..

జూన్ 27, 2024*🌷 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*

       🌹 *గురువారం*🌷

  🌷 *జూన్ 27, 2024*🌷

    *దృగ్గణిత పంచాంగం*               

*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*జ్యేష్ఠమాసం - కృష్ణ పక్షం*

*తిథి : షష్ఠి* సా 06.39 వరకు ఉపరి *సప్తమి*

వారం :*గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం : శతభిషం* ప 11.36 వరకు ఉపరి *పూర్వాభాద్ర*

*యోగం : ఆయుష్మాన్* రా 12.28 వరకు ఉపరి *సౌభాగ్య*

*కరణం : గరజి* ఉ 07.47 *వణజి* సా 06.39 *భద్ర* పూర్తిరాత్రి

*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 07.00 - 09.00  సా 04.00 - 06.00*

అమృత కాలం : *శేషం ఉ 06.21 రా 02.39 - 04.09 తె* 

అభిజిత్ కాలం :*ప 11.44 - 12.37* 

*వర్జ్యం : సా 05.38 - 07.08*

*దుర్ముహుర్తం : ఉ 10.00 - 10.52 మ 03.14 - 04.07* 

*రాహు కాలం : మ 01.49 - 03.27*

గుళిక కాలం :*ఉ 08.54 - 10.32*

యమ గండం :*ఉ 05.37 - 07.16* 

సూర్యరాశి :*మిధునం* 

చంద్రరాశి :*కుంభం*

సూర్యోదయం :*ఉ 05.37* 

సూర్యాస్తమయం :*సా 06.44*

*ప్రయాణశూల :‌ దక్షిణ దిక్కుకు ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.37 - 08.15*

సంగవ కాలం :*08.15 - 10.52*

మధ్యాహ్న కాలం :*10.52 - 01.29*

అపరాహ్న కాలం :*మ 01.29 - 04.07*

*ఆబ్ధికం తిధి  : జ్యేష్ఠ బహుళ షష్ఠి*

సాయంకాలం :*సా 04.07 - 06.44*

ప్రదోష కాలం :*సా 06.44 - 08.55*

నిశీధి కాలం :*రా 11.49 - 12.33*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.10 - 04.54*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*సదా సత్ప్వరూపం చిదానందకందం*

*జగత్వంభవ స్థాన సంహారహేతుం*

*స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం*

*నమామీశ్వరం సద్గురుం సాయినాథమ్*


      *ఓం శ్రీ సమర్థ సద్గురు*      

     *సాయినాథాయ నమః*


 🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు!!*

          🌷 *సేకరణ*🌷

      🌹🌷🌹🌹🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🌷🌷🌹🌷

 🌹🍃🌿🌹🌹🌿🍃🌹

సూర్య కిరణాలు తాకే దేవాలయాలు:*

 *సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు:* 

1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం. 

2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం. 

3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం. 

4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం. 

5. మొగిలీశ్వర్.

6. కోదండరామ దేవాలయం,  కడప జిల్లా.


*నిరంతరం జలము ప్రవహించే  దేవాలయాలు:* 

1. మహానంది

2. జంబుకేశ్వర్ 

3. బుగ్గరామలింగేశ్వర్

4. కర్ణాటక కమండల గణపతి.

5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.

6. బెంగళూర్ మల్లేశ్వర్ 

7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం

8. సిద్ధగంగా


*నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు.* 

1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి. 

2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్,  

3. మంజునాథ్.

*శ్వాస తీసుకునే* కాళహస్తీశ్వర్

*సముద్రమే వెనక్కివెళ్లే* 

1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్, 

2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.

*స్త్రీవలె నెలసరి* అయ్యే 

1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,  

2. కేరళ దుర్గామాత.

*రంగులు మారే ఆలయం.* 

1. ఉత్తరాయణం,  దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.

2. పౌర్ణమికి తెల్లగా,  అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.

పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.


*నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు* 

 1. కాణిపాకం,  

2. యాగంటి బసవన్న,  

3. కాశీ తిలభండేశ్వర్,  

4. బెంగుళూరు బసవేశ్వర్

5. బిక్కవోలు లక్ష్మీగణపతి


*స్వయంభువుగా* 

సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.

*ఆరునెలలకు ఒకసారి తెరిచే* 

1. బదరీనాథ్,  

2. కేదారనాథ్ (ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)

3. గుహ్యకాళీమందిరం. 


*సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు* 

హాసంబా దేవాలయం,  హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.


*12 ఏళ్లకు ఒకసారి*

పిడుగుపడే తిరిగి అతుక్కునే బిజిలి మహాదేవ్,  హిమాచల్ ప్రదేశ్.


*స్వయంగా ప్రసాదం* 

1. తినే కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.

2. బృందావనం రాధాకృష్ణ శయనమందిరం


*ఒంటి స్తంభంతో*

యుగాంతానికి గుర్తుగా  ఉండే పూణే కేధారేశ్వర్,  ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.


*రూపాలు మారే*

ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.


*నీటితో దీపం వెలిగించే* ఘడియ ఘాట్ మాతాజీ మందిర్,  మధ్యప్రదేశ్. అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది,  ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.

*మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు* 

1. హేమాచల నరసింహ స్వామి.

2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి


*మనిషి వలె గుటకలు*  

వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.


*అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.* 


*ఛాయా విశేషం* 

1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.

2. హంపి విరూపాక్షేశ్వర్,  గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.

3. బృహదీశ్వరాలయం


*నీటిలో తేలే* విష్ణువు (వేల టన్నుల బరువుంటుంది ),  నేపాల్


*ఇంకా...* 

తిరుమల వెంకటేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి, రామేశ్వర్,  కంచి, 

చిలుకూరి బాలాజీ,  పండరినాథ్, భద్రాచలం,  అన్నవరం etc


*పూరీ* 

పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి,  దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే  పూరి ప్రసాదం.


ఇవి  తెలిసిన కొన్ని మహిమాన్విత దేవాలయాలు మాత్రమే. 

🙏🕉

భర్తృహరి

 పదివేలసార్లు గంగలో మునగడం కన్నా ఒక్కసారి...

............................................


భర్తృహరి శ్లోకం.


*భూ ప్రదక్షిణ షట్కేన*

*కాశీయాత్రా యుతేనచ*

*సేతుస్నాన శతర్యశ్చ*

*తత్ఫలం మాతృ వందనే.*


అర్థమ్.


ఆరుసార్లు భూప్రదక్షణ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో 

పదివేలసార్లు గంగాస్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో 

వందల సార్లు రామసేతువు వద్ద సముద్రస్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో 

అంతటి పుణ్యం ఒక్కసారి తల్లి పాదాలకు నమస్కరిస్తే వస్తుంది.


తల్లికి ఒక్కసారి కూడా వందనం చేయని దరిద్రులు ఇంకా ఈ భూమిమీద వున్నారు సుమా !


భర్త్రహరి శ్లోకం.


మాతరం పితరంచైవయః సదా పూజయేన్నరః

 దేవతే ఇవ యః వశ్యే త్తతః సౌఖ్యతరంసు కిం ?


అర్థమ్.


కొడుకన్నవాడు నిత్యం తల్లిదండ్రుల సేవలో ఉండాలి.తల్లిదండ్రులను నిత్యం సేవించేవాడికి సకల శుభాలు ఒనగూరుతాయి, అతను వృద్ధిలోకి వస్తాడు.


ఈ లోకంలో తల్లిదండ్రులను పూజించడం కన్నా గొప్పది ఏదిలేదు.

చిల్లగింజల సంపూర్ణ వివరణ -

 చిల్లగింజల గురించి సంపూర్ణ వివరణ  - 


      ఈ చిల్లగింజలను సాధారణ భాషలో ఇండుప గింజ , నిర్మలి అని కూడా పిలుస్తారు . మురికిగా ఉన్న నీటిని తేటగా చేయుటకు ఈ గింజను వాడతారు. వర్షాకాలములో నదీ ప్రవాహములలో , వాగులలో వచ్చు నీరు బురద , కల్మషముతో కూడి ఉండును. ఆ నీటిని నిర్మలముగా చేయుటకు నీరు పట్టి ఉన్న బిందెలలో ఈ చిల్లగింజని అరగదీసి వచ్చిన గంధమును నీటిలో కలుపుతారు. ఇది నీటిలోని బురద , కల్మషములను శుద్ది చేయుటయే కాక నీటిలో గల అనేకరకాల విషపదార్ధాలను కూడా నిర్మూలించును అని ఆధునిక పరిశోధనలు రుజువుచేసినవి . 


               ఈ చిల్లగింజలు నీటిలో కలిగిన రసాయనిక విషపదార్ధాలనే కాకుండా పరమాణు జన్యుమైన విషపదార్ధాలను కూడా నిర్మూలించును. ఇది కేవలం నీటిని శుభ్రపరచడం మాత్రమే కాకుండా అనేకరకాలైన వ్యాధులను కూడా నయం చేయును . ముఖ్యంగా మూత్రాశయ సంబంధ వ్యాధులను తగ్గించి మూత్రమును జారీ అయ్యేట్టు చేయును . మూత్రాశయం నందలి రాళ్లను కరిగించును. మధుమేహమును తగ్గించును . మధుమేహరోగులు చిల్లగింజలు , చండ్ర చెక్క , వేగిసచెక్క ఈ మూడింటితో తయారుచేసిన కషాయం నిత్యం వాడుట వలన మధుమేహము తగ్గును. కామెర్ల నందు కూడా పనిచేయును . వాపులు తగ్గును. తరచుగా వచ్చు జలుబు తగ్గును. శరీరం బరువు తగ్గి సన్నబడేలా చేయును . నేత్రములకు మంచిది . 


              చిన్నపిల్లల్లో మరియు పెద్దవారిలో తరచుగా కనిపించే నులిపురుగుల సమస్యను నిర్మూలించును. చర్మవ్యాధులు నందు పనిచేయును . చర్మవ్యాధుల యందు నిమ్మగింజలతో కలిపి వాడుచున్న మంచి ఫలితం కనిపించును. తెలంగాణ ప్రాంతములో తాంబూలం నందు వక్కతో పాటు చిల్లగింజల ముక్కలు కూడా వాడుట సాంప్రదాయముగా ఉన్నది. ప్రతిరోజు చిల్లగింజను వాడుట వలన మూత్రాశయములో రాళ్లు ఏర్పడకుండా మూత్రం సాఫీగా జారి అయ్యేలా చేస్తుంది . 


  

        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

బంకించంద్ర ఛటర్జీ* పుట్టినరోజు

 *జూన్ 26 - పుట్టినరోజు* 


 *వందేమాతరం రచయిత : బంకించంద్ర ఛటర్జీ* 


భారత స్వాతంత్ర్య పోరాటంలో ఉత్తరం నుండి దక్షిణం మరియు తూర్పు నుండి పడమర వరకు ప్రజలను కదిలించిన వందేమాతరం అనే గొప్ప మంత్రాన్ని రచించిన బంకిమ్ చంద్ర ఛటర్జీ జూన్ 26, 1838న పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా కంటల్‌పరా గ్రామంలో జన్మించారు. హుగ్లీలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తర్వాత, కోల్‌కతా విశ్వవిద్యాలయంలోని ప్రెసిడెన్సీ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. విద్యార్థి దశ నుంచే చదువుతో పాటు సాహిత్యంపై ఆసక్తి ఉండేది.


చదువు పూర్తయ్యాక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పరీక్ష రాసి అందులో ఉత్తీర్ణత సాధించి డిప్యూటీ కలెక్టర్ అయ్యాడు. ఈ సేవలో చేరిన మొదటి భారతీయుడు. ఉద్యోగంలో ఉండగానే రచనలు రాయడం మొదలుపెట్టాడు. ఇంతకు ముందు ఇంగ్లీషులో రాసేవాడు. అతని ఆంగ్ల నవల 'రాజ్‌మోహన్స్ వైఫ్' కూడా బాగా ప్రాచుర్యం పొందింది; తరువాత అతను తన మాతృభాష బెంగాలీలో రాయడం ప్రారంభించాడు.


అతని మొదటి బెంగాలీ నవల 'దుర్గేష్ నందిని' 1864లో ప్రచురించబడింది. ఇది ఎంతగా పాపులర్ అయిందంటే బెంగాల్ ప్రజలు తమ పిల్లలకు దాని పాత్రల పేర్లను పెట్టడం ప్రారంభించారు. దీని తర్వాత 1866లో ‘కపాల్‌ కుండలా’, 1869లో ‘మృణాళిని’ అనే నవలలు వెలువడ్డాయి. 1872లో అతను 'బంగా దర్శన్' అనే పేపర్‌ను కూడా నడిపేడు ; కానీ 1882లో వెలువడిన ‘ఆనంద్ మఠ్’ అనే నవల ఆయనకు చిరస్థాయిగా నిలిచిపోయింది.


ఆనంద్ మఠంలో, దేశాన్ని మాతృభూమిగా భావించి, దానిని ఆరాధించే యువకుల కథ, దాని కోసం తమ శరీరాన్ని, మనస్సును మరియు సంపదను అంకితం చేసి, తమను తాము 'సంతాన్' అని పిలిచేవారు. ఈ నవలలో వందేమాతరం గీతాన్ని కూడా చేర్చారు. ఇలా పాడుతూనే ఆ యువకులు మాతృభూమి కోసం ప్రాణత్యాగం చేసేవారు. ఈ నవల మార్కెట్‌లోకి వచ్చాక జనాల్లో ఆదరణ బాగా పెరిగింది. ఇది అవసరమైతే దేశం కోసం చనిపోతున్న భావనతో ప్రజల మనస్సులలో నింపింది. అందరి పెదవులపై వందేమాతరం వినిపించింది.


1906లో బ్రిటిష్ వారు బెంగాల్‌ను హిందూ, ముస్లింల ప్రాతిపదికన రెండు భాగాలుగా విభజించేందుకు కుట్ర పన్నారు. దీని వలన ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. ఆగష్టు 7, 1906 న, కోల్‌కతాలోని టౌన్ హాల్‌లో భారీ సమావేశం జరిగింది, ఈ పాట మొదటిసారి పాడబడింది. ఒక నెల తర్వాత, సెప్టెంబర్ 7న, వారణాసిలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో కూడా పాడారు. దీంతో దాని ప్రతిధ్వనులు దేశమంతటా వ్యాపించాయి. ఆ తర్వాత స్వాతంత్య్రం కోసం జరిగే ప్రతి సభలోనూ, సెమినార్‌లోనూ, ఉద్యమంలోనూ వందేమాతరం లేవనెత్తడం మొదలైంది.


ఇది చూసిన బ్రిటిష్ ప్రభుత్వం ఆందోళన చెందింది. బ్రిటిష్ ప్రభుత్వం వందేమాతరం పాడడాన్ని నిషేధించారు. దానిని పాడిన వారు బహిరంగంగా కొరడాలతో కొట్టబడ్డారు; కానీ ఆంక్షలు భావోద్వేగాల ప్రవాహాన్ని ఎప్పుడైనా ఆపగలవా? ఇప్పుడు దాని ప్రతిధ్వనులు భారతదేశ సరిహద్దును దాటి విదేశాలకు చేరుకున్నాయి. విప్లవకారులకు ఈ నవల భగవద్గీత గా మారింది మరియు వందేమాతరం ఒక గొప్ప మంత్రంగా మారింది. ఉరి శిక్ష కైనా సిద్ద పడి ఈ పాట పాడేవారు. ఈ విధంగా, ఈ పాట భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి సాటిలేని కృషి చేసింది.


బంకిం యొక్క దాదాపు అన్ని నవలలలో, దేశం మరియు మతం యొక్క రక్షణకు ప్రాధాన్యత ఇవ్వబడింది. వివిధ విషయాలపై వ్యాసాలు, వ్యంగ్య రచనలు కూడా చేశారు. ఇది బెంగాలీ సాహిత్య శైలిలో సమూల మార్పును తీసుకొచ్చింది. అతను ఏప్రిల్ 8, 1894 న మరణించాడు. స్వాతంత్య్రానంతరం వందేమాతరాన్ని జాతీయగీతంతో సమానంగా పరిగణించి జాతీయగీతానికి గౌరవం ఇచ్చారు.

దూషించును

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝   *గతశ్రీః గణకాన్ ద్వేష్టి గతాయుశ్చ చికిత్సకాన్*

       *గతశ్రీశ్చ గతాయుశ్చ బ్రాహ్మణాన్ ద్వేష్టి భారత!*


తా𝕝𝕝 ధనముచేతికందనపుడు జ్యోతిష్కుని దూషించును.  ఆయువు మూడినవాడు వైద్యునిదూషింతురు. సంపద నశించినవాడు, ఆయువు మూడినవాడు బ్రహ్మను ద్వేషించును.

జూన్ 26, 2024*🪷 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*

     🌷 *బుధవారం*🌷

 🪷 *జూన్ 26, 2024*🪷

   *దృగ్గణిత పంచాంగం*                

*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*జ్యేష్ఠమాసం - కృష్ణ పక్షం*

*తిథి : పంచమి* రా 08.55 వరకు ఉపరి *షష్ఠి*

వారం :*బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం : ధనిష్ఠ* మ 01.05 వరకు ఉపరి *శతభిషం*

*యోగం : విష్కుంబ* ఉ 06.14 *ప్రీతి* రా 03.21 తె వరకు

*కరణం : కౌలువ* ఉ 10.03 *తైతుల* రా 08.55 ఉపరి *గరజి*

*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 07.00 - 11.00  సా 04.00 - 05.00*

అమృత కాలం :*(27)తె 04.51-06.21* 

అభిజిత్ కాలం :*ఈరోజు లేదు* 

*వర్జ్యం : రా 07.50 - 09.20*

*దుర్ముహుర్తం : ప 11.44 - 12.37*

*రాహు కాలం : మ 12.10 - 01.49*

గుళిక కాలం :*ఉ 10.32 - 12.10*

యమ గండం :*ఉ 07.15 - 08.54*

సూర్యరాశి : *మిధునం*

చంద్రరాశి : *కుంభం*

సూర్యరాశి :*ఉ 05.37*

సూర్యాస్తమయం :*సా 06.44*

*ప్రయాణశూల :‌ ఉత్తరం దిక్కుకు ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.37 - 08.14*

సంగవ కాలం :*08.14 - 10.52*

మధ్యాహ్న కాలం :*10.52 - 01.29*

అపరాహ్న కాలం :*మ 01.29 - 04.06*

*ఆబ్ధికం తిధి: జ్యేష్ఠ బహుళ పంచమి*

సాయంకాలం :*సా 04.06 - 06.44*

ప్రదోష కాలం :*సా 06.44 - 08.54*

నిశీధి కాలం :*రా 11.49 - 12.32*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.10 - 04.54*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*మనమున నిరతము తలచెదఁ వినతముగా నిను కొలుతును వీణాపాణీ*

*అనవరతము నీ స్మరణము వనజభవుని పలుకు కలికి వాణి భగవతీ*


🌷 *ఓం సరస్వత్యై  నమః* 🌷

 🌷🪷🌹🛕🌹🌷🪷🌷🪷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*   

         🌷 *సేకరణ*🌷

      🌹🌷🪷🪷🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🌷🌷🌹🌷

 🌹🍃🌿🪷🪷🌿🍃🌹

సీతాఫలం - రామాఫలం

 *(1948 మార్చ్ నెల చందమామలో ప్రచురించిన కథ)*


🌿"సీతాఫలం  - రామాఫలం"🌿

🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴

 

        అబ్బాయిలు, అమ్మా యిలూ! మీలో అందరికీ సీతాఫలం, రామాఫలం అంటే తెలుసా? యెప్పుడన్నా తిన్నారూ? అందరూ తిని ఉండరనుకుంటాను. నిజమేనా ? పై ఆకారంలో భేదం ఉన్నా లోపల గింజలు, రుచీ , సమానంగానే ఉంటాయి. పేర్లను బట్టి చూస్తే వీటి పుట్టుక లో ఏదో గమ్మత్తు ఉండితీరాలని మీలో తెలివైన వాళ్లబుద్ధికి తడుతుంది. నిజమే, ఆ గమ్మత్తేమిటో కాస్త జాగ్రత్తగా చదవండి తెలుస్తుంది.


శ్రీ రామచంద్రమూర్తి రావణా బ్రహ్మను చంపి, సీతాదేవిని తీసుకుని అయోధ్యకు వచ్చి, పట్టాభిషేకం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందేగా. ఆయన పట్టాభిషేకమౌతుంటే సామంతరాజులూ, బంధువులూ స్నేహితులూ, భక్తులు మొదలయిన వారంతా తలా ఒక కానుక తీసుకువచ్చారు. అందులో వానరరాజు సుగ్రీవుడూ, రాక్షసరాజు విభీషణుడూ, దేవతల రాజు ఇంద్రుడూ కూడా బహుమతులు....అంటే శుభసమయంలో చదివించటానికి, ప్రపంచములో గొప్పవైన వజ్రాలు, మణులు, రత్నాలు ఆదిగాగల అపురూపపు వస్తువులు తీసుకువచ్చారు. ఇక సామంత రాజులు, రాజాధిరాజులూ ఏదో ఒక గొప్ప వస్తువు తీసుకువచ్చారు. ఇంకా భక్తులూ, జ్ఞానులు అందరూ కానుకలు తెచ్చారు.


అందరిలోకీ పరమ భక్తుడెన ఆంజనేయస్వామి పట్టాభిషేకం మూడు రోజులుందనగా మొదలు పెట్టాడు ఆలోచన, ఏమి కానుక సమర్పించుదామా అని. శ్రీ రామచంద్రమూర్తికి పరమ ప్రియమైనదీ, యెవ్వరూ తేనిదీ తీసుకురావాలని ఆయన వూహ. ఏ వస్తువును గురించి ఆలోచించినా యెవరో ఒకరు తేనే తెచ్చారు. ఆంజనేయస్వామికి ఏమీ పాలుపోలేదు. ఆలోచిస్తూ కూర్చున్నాడు. రేపు ప్రొద్దున పట్టాభిషేకం - అట్టే సమయం లేదు. తెల్లారేలోపుగా ఆ కానుకేదో నిర్నయించి తీసుకు రావాలి. చప్పున యేదో జ్ఞాపకం వచ్చి లేచాడు హనుమాన్. తక్షణం రివ్వుమంటూ బ్రహ్మదేవుని దగ్గరకు పోయి వాలాడు. హనుమంతుడు తొందరగా వేళగాని వేళ హనుమంతుడు రావడం చూచి అదరిపడ్డాడు బ్రహ్మ.  ఏంకొంప మునిగిందో దేముడా అని భయపడి, కుర్చీ వేసి కూర్చోమన్నాడు.


ఉహూ, కూర్చోలేదు హనుమంతుడు. “చాలా తొందర పనిమీద వచ్చాను. రేపు శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవం. ఆయనకు కానుకగా సమర్పించటానికి సీతాదేవికి, శ్రీరామచంద్రమూర్తికి పరమ ప్రియమైనది సృష్టించి యిస్తేగాని వీలు లేదు. అంతవరకూ నిన్ను వదిలేది లేదు" అన్నాడు.


అసాధ్యుడనీ, పట్టినపట్టు విడిచేరకంగాదని, బ్రహ్మకి తెలుసు. అయినా అర్ధరాత్రివేళ యీ కోతి పీడ యేమిటి అనుకున్నాడో ఏమో, బాగా ఆలోచించి అంతకుముoదు సృష్టిలో లేనివి, అతి మధురంగా ఉండేవీ, రెండు పళ్లు సృష్టించి వాటికి సీతాఫలము, రామాఫలము అని పేరు పెట్టి వీటినియివ్వరా నాయనా, మీ రామచంద్రుడు చాలా ఆనందిస్తాడు' అని యిచ్చాడు.


తక్షణం భూలోకానికి వచ్చాడు హనుమాన్.

పట్టాభిషేక సమయమయింది. హనుమాన్ ఎక్కడున్నాడా అని అయోధ్యంతా వెతికిస్తున్నాడు శ్రీ రామచంద్రుడు. యేమైనా కోపమొచ్చి అలిగాడేమో అనుకున్నాడు తనలో, హనుమంతుడంటే పరమ ప్రేమ ఆయనకు. పట్టాభిషేకం జరుగుతున్న సంతోషమే లేదాయన ముఖంలో.


ఇంతలో హనుమంతుడు వచ్చాడంటె వచ్చాడన్నారు అందరు. హనుమంతుడు సరాసరి శ్రీరామచంద్రుడి పాదాలవద్ద వాలి రెండు చేతులతో రెండు ఫలాలూ సీతా రాముల పాదాలవద్ద ఉంచి సీతాఫలము, రామాఫలము అని నమస్కారం చేశాడు.


శ్రీరామచంద్రుడు హనుమంతుడ్ని కౌగలించుకుని మూడు రోజులనుండి కనపడటం లేదు, ఎక్కడున్నా వోయి హనుమాన్?” అని అడిగాడు. హను మంతుడు జరిగిన కధంతా చెప్పాడు.


శ్రీరామునితో కూడా సభంతా ఆశ్చర్య పోయారు, హనుమంతుని భక్తి, శక్తికి. తరువాత ఆ ఫలాలు రెండూ విడదీసి పెద్దలందరికీ పంచి పెట్టారు ప్రసాదంలాగా, అవి తిని వాటి మధురానికి అంతా ఆశ్చర్యపోయి, హనుమంతుడ్ని పొగడుతూ , గింజల్ని జాగ్రత్తగా పాతి పెట్టి మొక్కలు మొలిపించి కాయలు కాయించి అందరికీ సీతారామ ప్రసాదంలాగా పంచి పెట్టారు. శ్రీ రామ చంద్రుడు సీతాదేవీ ఎక్కువగా సంతోషించారు, హనుమంతుని భక్తికి, ప్రతిభకీ ఆ నాటి నుంచీ ఈనాటి వరకూ మనం తింటున్నాం యీ ఫలాలను. హనుమంతుడ్ని ఒక్కసారైనా తలుచుకోము అవి తింటున్నప్పుడు. ఇక నుంచి అవి తింటున్నప్పుడు అవి "సృష్టింపించి భూలోకానికి తెచ్చి అందించిన హనుమంతుడ్ని తలుచుకుంటుండండి సుమా.

పోతన పాత్ర చిత్రణ



పోతన పాత్ర చిత్రణ 


                    ఉ:  కాటుక కంటినీరు  చనుగట్ల పయింబడ  నేలయేడ్చెదో?


                          కైటభ దైత్య మర్దనుని  గాదిలి కోడల!  యోమదంబ! యో


                         హాటకగర్భురాణి!  నిను  నాకటికైఁ గొనిపోయి   యల్ల   క


                         ర్ణాట  కిరాట  కీచకులకమ్మ ;త్రిశుధ్ధిగ  నమ్ము; భారతీ!


                                        --    చాటువు ;


                 ఉ:  కోపము తోడ నీవు  దధి భాండము  భిన్నము  సేయుచున్నచో


                        గోపిక  త్రాటఁగట్టిన  వికుంచిత  సాంజన భాష్ప  తోయ   ధా


                        రా పరిపూర్ణ  వక్త్రముఁ  గరంబులఁ బ్రాముచు  వెచ్చనూర్చుచుం


                      బాపఁడవై  నటించుట  గృపాపర ! నామదిఁ   జోద్యమయ్యెడిన్ ;


                                        భాగ-ప్రథ-స్కం: 181 పద్యం: కుంతి కృష్ణుని స్తుతించుట;


                                          ఆంధ్ర సాహిత్య క్షేత్రాన్నలంకరించిన  కవితల్లజులలో  పాత్ర చిత్రణ విషయమున  కవులందరు నొకయెత్తు. బమ్మెరపోతన యొకయెత్తు. అతడుచిత్రించిన పాత్రలన్నియు  శబ్దచిత్రములే! కానీ,అందుకొన్ని నిశ్చలనములు, మరికొన్ని చలనములు.

ఆపాత్రలు పోతనగారితో మాటగలిపిమాటాడినవే! మనకుగూడ నట్టి మనః పరిణామము గల్గినచో నవిమనతోగూడ మాటాడగలవు.

"పాత్రకు తగిన యాకారము. ఆకారమునకు దగిన ఆహార్యము. ఆహార్యమునకుదగిన వేషము.దానికితగనమాటలు .మాటలకు దగిన చక్కనిపదములకూర్పు. పోతన చిత్రణలోని విశేషములు.


                                        పైరెండుపద్యములలో  మొదటిది పోతన సరస్వతి నోదార్చుట. ధనముపై నాశతో భాగవత గ్రంధమును  నరాంకిత మొనరించునేమోనని యనుమానమంది చదువులతల్లి  దీనవదనయై  కన్నులనీరుగార దేవతార్చనా పీఠమున నున్నపోతనకన్నుల

కగుపించినదట! పోతనయామెరూపమును గాంచి నివ్వెరపోయెను,."  అమ్మా! సరస్వతీమాతా! కాటుక తో దిగజారు కన్నీరు వక్షోజములపై బడగా  నేలనమ్మా  విలపింతువు? ఓహో!  ధనాశతో నిన్నముకొందుననియా నీవిచారము. అటులెన్నటికి జరుగదు. త్రికరణ శధ్ధిగా జెప్పునామాటను నమ్ము. మనుట"-. ఇది నిశ్చలన చిత్రమే! ,ఆజగదంబ కన్నులనీరుగార్చుట. కన్నులకున్న కాటుక కరగి కన్నీట గలసి చనుగట్లపై బడుట. ఆహా! ఏమాచిత్రణము! మనోముకురమున గాంచగల్గినవాని జీవితము ధన్యము.


                                   ఇఁక  రెండవ చిత్రము  చలనము. బాలకృష్ణుని కొంటేపనులను  దలచుకొని  కుంతి కృష్ణుని ప్రస్తుతించుచు నాడిన మాటలు. ఆమాటలవెనుక నార్తియున్నది. అభిమానమున్నది. భక్తియున్నది. ఆప్యాయతను రంగరించి చిత్రించిన యీచిత్రము అపూర్వము.


                                    "కృష్ణా! యేమి చెప్పనయ్యా నాటి ముచ్చటలు. బాల్యమున నీవొకనాడొకగోపిక యింటికేగి. దధి భాండమును కోపముతో  పగులగొడితివి. ఆగోపికయు కోపమున  నిన్ను త్రాటితోగట్టివేయుచో, మొగమొక వంకకు వంచి,కన్నుల కాటుక కన్నీరుగార

దానినంతయు  నిరుచేతులతో  మొగమంతయు పులుముకొనుచు  వేడినిట్టూర్పులను  విడచుచు బాలునివలె నటించుట     నేడుదలచికొనిన  నాకు చోద్యమనిపించునయ్యా! కొంటె కృష్ణయ్యా! యెంత దొంగ నటన! భక్తిపాశములచే గట్టుబడు నీవు సామాన్యమగు త్రాట బంధింపఁబడుట  నటన గాకమరేమి? "- యనిమేనత్తమాటలు.


                                  త్రాటగట్టబడుట , సాంజన భాష్పతోయ సిక్తమైన  మోమును  చేతులతో  పులిమికొనుట. అప్పటి కృష్ణయ్య ఆ యాకారము. ఇవియన్నియు పోతన పాత్రచిత్రణము లోని మెళకువలు.చివరకు అంతవాడ వింతవాడ వైతివే యని యాశ్చర్యమును ప్రకటించుట. యతని రచన లోని చమత్కారము. 


                                                                  ఇదండీ పోతన గారి పాత్ర చిత్రణలోని  గొప్పతనం!


                                                                                                   స్వస్తి!🙏🙏🙏

తిథి అధిష్టాన దేవతలెవరు

 *తిథి అంటే ఏమిటి?*

         *అధిష్టాన దేవతలెవరు?*

               

*తిథి అంటే…  వేద సమయగణితము ప్రకారము చంద్రమాసములో ఒక రోజును తిథి అంటారు.* 


*ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి, సూర్యుడు నుండి చంద్రుని కదలికలు తిధులవుతాయి, ఉదాహరణకు సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే అమావాస్య , అదే సూర్యచంద్రులు ఒకరికొకరు సమానదూరములో వుంటే పౌర్ణమి అవుతుంది.* 

*శాస్త్రీయముగా సూర్యుడు, చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు.* 


*తిథులు సూర్యోదయమున ప్రారంభము కావు సూర్యాస్తమయానికి ముగియవు. రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉంది.* 


*ఒక్కొక్క తిథి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది.*


*(1) చాంద్రమాసంలో మొదటి తిథి పాడ్యమి. పాడ్యానికి అధిదేవత అగ్ని.*

*(2) విధియ > బ్రహ్మ*

*(3) తదియ > గౌరి*

*(4) చవితి > వినాయకుడు*

*(5) పంచమి > నాగరాజు*


*(6) షష్టి > షణ్ముఖుడు*

*(7) సప్తమి > సూర్యుడు*

*(8) అష్టమి > రుద్రుడు*

*(9) నవమి > దుర్గ*

*(10) దశమి > ఆదిశేషుడు*


*(11) ఏకాదశి > యమధర్మరాజు*

*(12) ద్వాదశి > విష్ణు*

*(13) త్రయోదసి > కాముడు లేదా శివుడు*

*(14) చతుర్థశి >  కాళికామాత*

*(15) పౌర్ణమి > చంద్రుడు*

*(16) అమావాస్య > లక్ష్మి*


*ఏదైనా కార్యం తలపెట్టినపుడు ఆ తిథికి సంబంధించిన అధిష్టానదేవుడిని పూజించాలి. పూజకు వీలుకాకపోతే మనసులో స్మరించాలి.*

బంధువు లేదు

 ☝️శ్లోకం 


నాస్తి విద్యాసమో బంధుః

 నాస్తి విద్యాసమో సహృత్ ।

నాస్తి విద్యా సమం విత్తం 

నాస్తి విద్యాసమం సుఖం ॥



భావం: విద్యతో సరితూగ గల బంధువు లేదు. విద్యతో సమానమైన స్నేహితుడు లేదు. విద్యతో సమానమైన ధనమూ లేదు. విద్యతో సరితూగ గల సుఖము లేదు.

పంచాంగం 26.06.2024

 ఈ రోజు పంచాంగం 26.06.2024  Wednesday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతు జ్యేష్ఠ మాస కృష్ణ పక్ష పంచమి తిధి సౌమ్య వాసర: ధనిష్ఠ నక్షత్రం నిష్కంభ తదుపరి ప్రీతి యోగ: కౌలవ తదుపరి తైతుల కరణం. ఇది ఈరోజు పంచాంగం.


పంచమి రాత్రి 08:55 వరకు.

ధనిష్ఠ మధ్యాహ్నం 01:04 వరకు.


సూర్యోదయం : 05:48

సూర్యాస్తమయం : 06:50


వర్జ్యం : రాత్రి 07:50 నుండి 09:20 వరకు.


దుర్ముహూర్తం : పగలు 11:53 నుండి 12:45 వరకు.


అమృతఘడియలు : ఈ రోజు లేదు .


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


యమగండం: పగలు 07:30 నుండి 09:00 వరకు.



శుభోదయ:, నమస్కార:

శాసన సభ్యులు - సుపరిపాలన 10*

 *శాసన సభ్యులు - సుపరిపాలన 10*


సభ్యులకు నమస్కారములు.


కొన్ని రాజకీయ  పార్టీలు,  నాయకులు తమకంటూ ప్రచార మాధ్యమాలను (దిన పత్రికలు, దృశ్య, వినికిడి మాధ్యమాలు Tv లను)  నెలకొల్పుకోవడం ఈ మధ్యన సర్వ సాధారణమైనది. తమ తమ  ప్రచార మాధ్యమాల ద్వారా తమ రాజకీయ విధానాలను, సిద్ధాంతాలను, కార్యాచరణను ప్రజా సంక్షేమానికై  ప్రచారం చేసుకుంటే మంచిదే మరియు ప్రజలు హర్షిస్తారు గూడా. కాని, కొన్ని రాజకీయ పార్టీల మరియు  నేతల ప్రచార మాధ్యమాలు వింత మరియు విపరీత ధోరణులు అవలంబించడం ప్రజలు గమనిస్తున్నారు.  కొన్ని ప్రచార మాధ్యమాలు తమకు మద్దతు ఇవ్వని మరియు తమను అనుసరించని పార్టీలపై, నాయకులపై సత్యదూరమైన ఆరోపణలు, అభూత కల్పనలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పు త్రోవ పట్టిస్తున్నాయి. ఎన్నికల కురుక్షేత్రమప్పుడు ఈ మాధ్యమాల జోరు మరీ విపరీతంగా ఉంటుంది. కొన్ని పత్రికల రాజకీయ వార్తలు, వ్రాతలు... చదివే వారికి రోతలుగా భావించే హీన స్థాయిలో ఉంటాయి. రాష్ట్రాలలో, దేశంలో ఉన్న కొందరు పత్రికా మరియు  దృశ్య   మాధ్యమాల బడా అధినేతలు కూడా రాజకీయ నేతలకు, పార్టీలకు వంత పాడడం గూడా ప్రజలు గమనిస్తున్నారు. 


ఇంతటితో సమస్యలు ఆగవు. పాలక మరియు ప్రతిపక్ష పార్టీల పంచన చేరకుండా వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలన్న కుతూహలము, నిజాయితీ కలిగిన వార్తా విలేఖరులపై మరియు  పోటీ పార్టీల పత్రికా విలేఖరులపై దాడులను గూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు.  రాజకీయ పార్టీల మరియు  నాయకుల ఇటువంటి  అనుచిత కృత్యాల వలన సమాజంలో అలజడి, రక్షక భట శాఖ ప్రవేశము జరుగుతూ ఉంటాయి. ఇటువంటి దుశ్చర్యల వలన జర్నలిస్టు సంఘాల నాయకుల ఆందోళనలు, ప్రభుత్వానికి విజ్ఞప్తులు, బహిరంగ సభలు,  ప్రదర్శనలు సమాజానికి కొత్తేమీ కాదు. 


*అవుతే* అందరు శాసన సభ్యులు ప్రచార మాధ్యమాలను నెలకొల్పుకుంటున్నారు అను భావన/విషయము *సత్యదూరము*. ప్రజలు కోరునది, శాసన సభ్యులకు విజ్ఞప్తి చేయునదేమనగా *ఇటువంటి సందర్భాలలో మాన్యులైన శాసన సభ్యులు ఉచితానుచితాలు పాటిస్తూ ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేయాలని.*


*పార్టీలు ఏవైనా, వారి అధినేతలు ఎవరైనా నీతి నిబద్ధత గల శాసన సభ్యులు మేల్కొనాలి, నిజాలను గ్రహించి సమాజపు అభివృద్ధి, భవిష్యత్ గురించి ఆలోచన చేయాలి. పత్రికా స్వేచ్ఛను హరించే చర్యలను, విలేఖరులపై దాడులను నిరసించాలి, ఆపాలి. ప్రజా స్వామ్మ్యాన్ని కాపాడాలి*. ప్రజలు మూఢులు, మూర్ఖులు కారు. న్యాయ నిర్ణేతలు వారే.  ఏ పార్టీకి బహిరంగంగా మద్దతు ప్రకటించినా, వంత పాడినా స్థానిక నాయకుల సచ్చరిత్ర, స్వభావము, యోగ్యత, నడత, శీలము, మార్గ దర్శకత్వము, నీతి మరియు నిజాయితి గల అభ్యర్థులకే వారి ఓటు. *కావున నాయకులందరూ  సచ్చీలురుగా ఉండాలి*.


ధన్యవాదములు.

(సశేషము)