18, జులై 2023, మంగళవారం

ఎల్లప్పుడూ విజయమొందెదవు.

 *1785*

*కం*

అక్కరలప్పుడు దేవుని

మ్రొక్కెడివారుండు భువిని మోకరిలుచు నా

యక్కర తీరగ దేవుని

చక్కగ పూజించ నెపుడు జయమగు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! అవసరం ఉన్నప్పుడు ఈ లోకంలో దేవుని మోకరిల్లి పూజించేవారుంటారు. అవసరం తీరిన తరువాత దేవుని పూజించి నచో ఎల్లప్పుడూ విజయమొందెదవు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

తిరుమల కొండపై రూమ్

 *తిరుమల కొండపై రూమ్ దొరకడం లేదా..?*

ఇదిగోండి ఇలా చేస్తే రూమ్ గ్యారంటీ!!

తిరుమల శ్రీవారి దర్శనం ఒకెత్తు.. అక్కడ వసతి మరో ఎత్తు.. కేశఖండనం, నామకరణం, పెళ్లి తదితర ఫంక్షన్లకు వెళ్తే.. ఏం చేయాలో తెలియదు, ఎక్కడ తల దాచుకునే వసతి దొరుకుతుందో తెలియదు.. టీటీడీ కేటాయించే సత్రాల్లో గదుల కేటాయింపు మరో అర్థంకాని బ్రహ్మపదార్థం.. రాజకీయంగా పలుకుబడి కలిగిన వారికి, ఆర్థికంగా బలవంతులకు, సెలబ్రిటీలకు, అధికారులు, పోలీసులు, ప్రెస్.. ఇలా ఎందరికో ప్రాధాన్యమిచ్చిన తర్వాత చివరాఖరుకు సామాన్యులకు శ్రీవారి కరుణా కటాక్షాలు లభిస్తాయి. దీంతో వసతి దొరక్క అనేక మంది భక్తులు ఆ ఆవరణలోనే గాలికి పడుకుని ఉండే సీన్లు అనేకం… అక్కడ పలు మఠాలకు చెందిన, కులాలకు చెందిన సత్రాలున్నాయి… అవి ఆదరిస్తాయి, తలదాచుకునే చోటు చూపిస్తాయి… అయితే…? వాటిని కంటాక్ట్ చేయడం ఎలా..? ఇదుగో మఠాలు, సత్రాలు, నంబర్లు…. కాకపోతే కాస్త ముందే సంప్రదించండి… రిజర్వ్ చేసుకొండి… ఆ స్వామి కొలువైన ప్రాంగణంలో మీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా నెరవేర్చుకొండి… ఇవిగో నంబర్లు, పేర్లు….

మనకు తిరుమలలో వసతి దొరికే ప్రాంతాలు, వాటి ఫోన్ నంబర్లు:

Mool Mutt Ph:0877-2277499.

Pushpa Mantapam Ph:0877-2277301.

Sri Vallabhacharya Jee Mutt Ph:0877-2277317.

Uttaradhi Mutt (Tirupati) Ph-0877-2225187.

Shree Tirumala Kashi Mutt Ph-0877-2277316.

Sree Raghavendra Swamy Mutt Ph-0877-2277302.

Sri Vaykhanasa Divya Siddanta

Vivardhini Sabha Ph:0877-2277282.

Sri Kanchi Kamakoti Mutt Ph:0877-2277370.

Sri Pushpagiri Mutt Ph-0877-2277419.

Sri Uuttaradi Mutt Ph-0877-2277397.

Udupi Mutt Ph-0877-2277305.

Sri Rangam Srimad Andavan Ashramam Ph:0877-2277826.

Sri Parakala Swamy Mutt Ph:0877-2270597,2277383.

Sri Tirupati Srimannarayana Ramanuja

Jeeyar Mutt Ph:0877-2277301.

Sri Sringari Saradha Mutt Ph:0877-2277269,2279435.

Sri Ahobita Mutt Ph:0877-2279440.

Sri Tirumala Kashi Mutt phone : 222 77316

Udipi Mutt Ph:0877 222 77305

Sri Sri Sri Tridandi Ramanujajeeyar Mutt Ph:0877 222 77301)

Sri Kanchi Kamakoti Peetam Mutt/ Sarva Mangala Kalyana Mandapam Ph:0877 222 77370)

Sri Vallabhacharya Mutt phone : 222 77317

Mantralaya Raghavendra Swami Mutt/ Brindavanam Ph:0877 222 77302

Arya Vysya Samajam S.V.R.A.V.T.S Ph:0877 222 77436

Srirangam Srimad Andavan Ashram Ph:0877 222 77826

Sri Vaikhanasa Ashram Ph:0877 222 77282

Sri Ahobila Mutt Ph:0877-2279440

Sri Sringeri Shankara Mutt/ Sarada Kalyana Mandapam Ph:0877 222 77269

Motilal Bansilal Dharmasala Ph:0877 222 77445

Hotel Nilarama Choultry Ph:0877 222 77784

Sri Srinivasa Choultry Ph:0877 222 77883

Sri Hathiramji Mutt Ph:0877 222 77240

Karnataka Guest House Ph:0877 222 77238

Dakshina India Arya Vyaya Gubba Muniratnam Charities Ph:0877 222 77245

Sri Sringeri Sankara Nilayam Ph:0877 222 79435

Sri Swamy Hathiramji muttam Ph:0877-2220015

అందరికీ ఎంతో ఉపయోగ పడే సమాచారం..

 Share చెయ్యండి

⚜ శ్రీ మణికర్ణేశ్వర్ దేవాలయం

 🕉 మన గుడి : 






⚜ అస్సాం : గౌహతి


⚜ శ్రీ మణికర్ణేశ్వర్ దేవాలయం


💠 ఉత్తర గౌహతి దాని చారిత్రక నేపథ్యం మరియు దేవాలయాలు, శిల్ప అవశేషాలు, శాసనాలు, రోడ్లు, కట్టలు, వంతెనలు, కోటలు మరియు సత్రాలు (వైష్ణవ మఠాలు) వంటి పురావస్తు అవశేషాలకు ప్రసిద్ధి చెందింది. 

ఇది ఒకప్పుడు అహోం రాజ్యానికి ప్రధాన కార్యాలయం. 

ఉత్తర గౌహతిలో వర్ధిల్లిన నాగరికతలు తమ సంకేతాలను నిక్షిప్తం చేశాయి, తద్వారా గొప్ప వారసత్వాన్ని మిగిల్చాయి.


💠 అనేక పురావస్తు ప్రదేశాలలో మణికర్ణేశ్వర దేవాలయం కూడా ఉంది. 

ఈ ఆలయం మణిఖాల్య కొండ పైభాగంలో ఉంది. 


💠 మహేశ్వర్ నియోగ్ తన 'పబిత్ర అస్సాం' పుస్తకంలో పేర్కొన్నట్లుగా, ఈ ప్రాంతానికి మణికర్ణేశ్వర్ అని పిలువబడే శివలింగం మరియు బ్రహ్మపుత్ర నదిలో కలిసిన మణికర్ణ అని పిలువబడే ఒక చెరువు పేరు పెట్టబడి ఉండవచ్చు. 


💠 ప్రస్తుతం బర్నాడి అని పిలువబడే మంగళ అనే చిన్న నది ఆలయ ప్రాంగణంలోని ఈశాన్య మూలలో ప్రవహిస్తుంది. 

స్థానిక ఇతిహాసాలు ప్రకారం మణికర్ణేశ్వర్ యొక్క ఈ పవిత్ర స్థలానికి అనుబంధంగా, సతీదేవి దహనం తర్వాత శివుడు విశ్రాంతి తీసుకున్నాడు అని మరియు  విష్ణువు తన సుదర్శన చక్రం ద్వారా సతీదేవి శరీరాన్ని ఛేదించాడు.


💠 సతీదేవి మెడ మరియు భుజంలోని కొన్ని భాగాలు సమీపంలోని దీర్ఘేశ్వరి పవిత్ర స్థలంలో పడిపోయాయని నమ్ముతారు. 

మణిశిలా అని పిలువబడే బర్నాడి మరియు బ్రహ్మపుత్ర నదుల సంగమం వద్ద శివుడు మర్రిచెట్టు క్రింద విశ్రాంతి తీసుకున్నాడు.


💠 సంస్కృతంలో మణికర్ణ అంటే చెవి ఉంగరాలు అని అర్థం.

సతీదేవి చెవి రింగులు కొన్ని కాశీలోని మణికర్ణికా ఘాట్‌పై పడ్డాయని నమ్ముతారు.  

అందుకే అక్కడ మణికర్ణికా ఘాట్ అనేది ఉంది.


💠 అస్సాంలోని మధ్యయుగ శైవమతంపై పౌరాణిక ప్రభావాన్ని చూపుతూ, రాజదూర్‌లోని మణికర్ణేశ్వరుని గురించిన పురాణాలు సతీదేవిని స్వయంగా దహనం చేయడం మరియు సతీదేవి శరీర భాగాలను సమీపంలో పడిపోవడంతో ముడిపడి ఉన్నాయి 


💠 ఇక్కడ అమ్మవారు విగ్రహం ఎత్తైన కమల పీఠం మీద ఎడమ కాలు మడిచి, కుడి కాలు క్రిందికి వేలాడుతూ ఉంటుంది.

దేవి సవ్యలలితాసనంలో శివుని ఒడిలో కూర్చున్నట్లు ఉంటుంది.

ధనాన్ని ధర్మమార్గంలోనే సంపాదించాలి.

 వివాహ బంధం విశిష్టతను వివరించే ఒక శ్లోకం మహాభారతంలోని అష్టక-యయాతి సంవాదంలో ఉంది. దీన్ని 'గృహోపనిషత్' అంటారు. ఆ శ్లోకం ఇది:


'ధర్మాగతం ప్రాప్యధనం యజేత దద్యాత్సదైవాతిధీన్ భోజయేచ్ఛ అనాధదానశ్చ పరైరదత్తం సైషాగృహస్థోపనిషత్ పురాణీ!!'


అంటే, 'ధనాన్ని ధర్మమార్గంలోనే సంపాదించాలి. సంపాదించిన ధనంలో కొంత భాగాన్ని దైవకార్యాలకు, దానానికి వెచ్చించాలి. ఇతరుల ధనాన్ని ఎన్నడూ అపహరించరాదు. ఇతరులు దానం చేసిన దాన్ని తీసుకోవచ్చు. ఇంటికి విచ్చేసిన అతిథులను సాదరంగా సత్కరించి, భోజన సమయమైతే తప్పక వారికి భోజనాన్ని ఏర్పాటు చేయాలి.' అతి ప్రాచీనమైన గృహస్థోపనిషత్ ఇదే!


ఒక మనిషి జీవితంలో వివాహ సంస్కారానికి గల ప్రాముఖ్యం అంత గొప్పది! ఈ గొప్పదనమే ఈ వివాహ వ్యవస్థను హైందవ జీవనంలో సుస్థిరం చేసింది, తరతరాలకు మార్గదర్శనం చేస్తోంది.

గురు దక్షిణ*

 *గురు దక్షిణ*


డు,ము,వు,లు ప్రధమా విభక్తి,

నిన్,నున్,లన్,కూర్చి, గురించి..ద్వితీయా విభక్తి.


తెలుగు మాస్టర్ గారి పాఠం సాగిపోతోంది. సూది మొన పడినా వినపడేంత నిశ్శబ్దం క్లాస్ రూమ్ లో. 


తెలుగు మాస్టర్ గారంటే ఆక్లాస్ కే కాదు, స్కూల్ మొత్తం భయం. క్రమశిక్షణకు మారుపేరు మాస్టారు. అల్లరి చేసిన వాడి వీపు వంచి గుల్ల దెబ్బ ఒక్కటి వేసేరంటే చాలు, స్కూలు మొత్తం వినపడేది. ఆ శబ్దానికే పిల్లలకు చచ్చేంత భయం. కర్ర విరగాకూడదు, పాము చావాకూడదు అనేది ఆయన సిధ్ధాంతం. దెబ్బ తగిలేదు కాదు కానీ, ఆ శబ్దానికే బిక్క చచ్చి పోయేవారు కుర్రాళ్లంతా. 


“నేను ఈల వేస్తే గోలకొండ ఎగిరిపడతది..

నేను ఈలవేస్తే గోలకొండ అదిరిపడతది..

దివికి దివికి దిమాడి... గుబుకు గుబుకు గుమాడి... దివికి దివికి దిమాడి ... గుబుకు గుబుకు గుమాడి....”

అంటూ పెద్దగా ఈల వేసుకుంటూ, ప్లే గ్రౌండ్ లో వున్న ఉసిరి చెట్టెక్కి కోసిన ఉసిరికాయలు ఒక ముచ్చికవర్ లో వేసుకుని, క్లాస్ రూమ్ లోకి అప్పుడే ఎంటర్ అయిన శీను గాడు….


పాఠం చెబుతున్న తెలుగు మాస్టర్ గారిని చూసి గతుక్కు మన్నాడు. భయంతో బిక్క చచ్చిపోయేడు. వాడి పై ప్రాణాలు పైనే పోయేయి. తెలుగు మాస్టర్ గారు ఆరోజు సెలవు, స్కూల్ కి రారు అనుకున్న శీను గాడికి పాపం మాస్టర్ గారు లీవ్ క్యాన్సల్ చేసుకుని క్లాస్ కి వచ్చేరన్న విషయం తెలీదు. ఎంచక్కా తెలుగు పీరియడ్ ని ఉసిరి కాయలకోసం కేటాయించుకున్నాడు. 


“ఒరేయ్..ఇలా రారా!” మాస్టారి కళ్ళు చింత నిప్పుల్లా వున్నాయి. 

భయంతో ఉసిరికాయలన్నీ అక్కడే కిందన పడేసాడు. 

పిల్లలంతా ఒకింత భయంతోనూ, ఒకింత 

ఆతృతతోను చూస్తున్నారు , ఏం జరగబోతుందా అని!


అంతలోనే ధామ్...ధామ్  అంటూ గట్టిగా రెండు శబ్దాలు వినపడే సరికి శీను గాడి పని అయిపోయిందివాళ అనుకున్నారంతా. 


“వెధవా..! నీ తల్లి, తండ్రి అంతంత ఖర్చు పెట్టి నిన్ను చదివిస్తుంటే,  నువ్వు చేసే ఘన కార్యం ఇదా? చదువు లేకపోయినా ఫర్లేదు, క్రమశిక్షణ లేకపోతే ఎలా? పెద్దయ్యాక ఏం సాధిద్దామని? అంట్లు  తోముకుని బతుకుదామని అనుకుంటున్నావా?” మాస్టర్ గారి తిట్ల సునామీ కి అడ్డుకట్టలేదు. అంత కోపం అతనిలో మునుపెన్నడూ చూడలేదు ఎవరూ. పిల్లలు క్రమశిక్షణ లేక చెడిపోతున్నారన్న బాధ, ఆయన కళ్ళల్లో రౌద్రమై తాండవిస్తోంది. శీను గాడు అది చూసి తట్టుకోలేకపోయేడు. ఒహటే ఏడుపు. 


ఇంతలో మిగిలిన క్లాస్ టీచర్స్, హెడ్ మాస్టర్ గారు వచ్చి తెలుగు మాస్టర్ గారిని శాంతింప చేయడంతో పరిస్థితి కుదుటపడింది. 


తుఫాన్ తరువాత ప్రశాంతత ఎలా ఉంటుందో ఆ క్లాస్ రూమ్ ని చూస్తే అర్ధం అవుతుంది. కానీ ఈ సంఘటన తరువాత మాస్టర్ గారు అన్యమనస్కంగా వున్నారు. మిగిలిన పాఠం చెప్పే మూడ్ లేక, పిల్లలికి ఏదో వర్క్ ఇచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోయేరు. 


ఈ ఘటన జరిగి చాలా రోజులైనా, శీను గాడికి మాత్రం మాస్టర్ గారిపై కోపం తగ్గలేదు. ఆయన అంటే బాగా అయిష్టం పెంచేసుకున్నాడు. ఆయనికి కనిపించకుండా తిరుగుతూ జాగ్రత్త పడుతుండేవాడు. ఏదో విధంగా టెన్త్ పరీక్షల్లో పాస్ అనిపించుకుని, స్కూల్ చివరి రోజున కూడా మాస్టర్ గారికి కనిపించకుండా, కనీసం పలకరించకుండా వచ్చేశాడు. 


ఆ తరువాత శీను వాళ్ళ నాన్న గారికి వేరే వూరు బదిలీ అవడంతో, ఆ వూళ్ళో కాలేజీలో చేరిపోయేడు.


రోజులు గడిచి పోతున్నాయి. క్యాలెండర్లు మారిపోతున్నాయి. అవి రోజులా....లేక కళ్ళాలు లేని గుర్రాలా అన్నట్టున్నాయి. 

*****************


తెలుగు మాస్టారి చిన్న అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది. తను పనిచేసే రోజుల్లో యేవో లోన్లు అవీ పెట్టి మెల్లగా పెద్దమ్మాయి పెళ్లి చేసేశారు. ఇప్పుడు చిన్నమ్మాయి పెళ్లి కోసం,తను జాగ్రత్త చేసి కొనుక్కున్న కొంత భూమిని అమ్మేద్దామని నిర్ణయించుకున్నారు.


కానీ తను, తనతో పాటు కొంతమంది కలిసి కొన్న ఆ జాగా వున్న ఏరియాలో యేవో కొన్ని వివాదాల కారణంగా భూమిని అమ్మడానికి ప్రభుత్వ పరంగా కొన్ని అడ్డంకులు వున్నాయి. ఆ అడ్డంకులు తొలిగితే కానీ తాను అమ్మే పరిస్థితి కానరాకపోవడంతో, తెలిసిన వ్యక్తుల సలహా మేరకు జిల్లా కలెక్టర్ గారిని కలిస్తే పని జరగొచ్చు అని చెప్పడంతో కలెక్టర్ ని కలవడానికి అప్పోయింట్మెంట్ తీసుకున్నారు మాస్టర్ గారు. 


“అబ్బే... కుదరదండి. రూల్స్ ఒప్పుకోవు. ఇప్పుడున్న కండిషన్స్  ప్రకారం అస్సలు కుదరదండి!” అంటూ పంపేశారు కలెక్టర్ గారు. 


రెండు, మూడు సార్లు అతని చుట్టూ తిరగవలసి వచ్చింది మాస్టారికి.

“మీరు ఎన్ని సార్లు నా దగ్గరికి వచ్చినా ప్రయోజనం లేదు సార్! ఈ విషయంలో నేను ఏమీ చెయ్యలేను. నా పరిధి దాటిపోయింది. మీ వలన అవుతుంది అంటే వెళ్లి మంత్రి గారిని కలవండి. ఏమైనా  చెయ్యగలిగితే ఆయనే చెయ్యగలడు. దయచేసి వెళ్లిపోండి...” అంటూ ఖరాఖండి గ చెప్పేసేడు కలెక్టర్ శ్రీనివాస్.


చేసేది లేక మాష్టారు, మంత్రి గారి అప్పోయింట్మెంట్ కోసం ప్రయత్నిచసాగేరు. ఎట్టకేలకు తనకు వున్న  పరిచయాల ద్వారా మంత్రి గారి అప్పోయింట్మెంట్ సాధించారు. 


“సర్.. ఎవరో రిటైర్డ్ తెలుగు మాస్టర్ గారంట. ఈ జాగా విషయమై అడ్డంకులు తొలగడానికి మీ అనుమతి కావాలంటున్నారు.. కుదరదంటే వినిపించుకోవట్లేదు. అమ్మాయి పెళ్లి అంట.. ఎలాగైనా మిమ్మల్ని కలవాలంటున్నారు. ఇదిగో ఇవి అతని వివరాలు.” అంటూ ఆ ఫైల్ ని మంత్రి గారి టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోయేడు సెక్రటరీ. 


కాసేపు ఫైల్ ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మాస్టర్ గారిని లోపలికి పంపించ వలసిందిగా ఫోన్ చేసి సెక్రటరీ కి చెప్పారు మంత్రిగారు.


“రండి..! కూచోండి. మీ వివరాలన్నీ చూసాను.” అంటూ  మాస్టర్ గారిని సాదరంగా ఆహ్వానించారు మంత్రివర్యులు. 


“ఈ భూమి విషయమై కొన్ని అడ్డంకులు వున్న మాట వాస్తవమయినా, మీ కేసు జెన్యూన్ కాబట్టి తప్పకుండా సహాయం చేస్తాను. మరేమీ ఫర్లేదు...మీరు నిశ్చింతగా ఉండొచ్చు,” అంటూ ఫైల్ మీద సంతకాలు పెట్టి, సెక్రటరీని పిలిచి, త్వరగా క్లియర్ చెయ్యమంటూ ఆదేశాలు జారీ చేసారు మంత్రిగారు. 


మాస్టారు ఉప్పొంగిపోయేరు. “గత మూడు నెలలనించీ తిరుగుతున్నా పని కాలేదు. మీ దయ వలన ఇప్పుడు పూర్తయ్యింది.” అంటూ  కృతఙ్ఞతా పూర్వకంగా నమస్కరించబోయేరు మాస్టర్ గారు. 


“అయ్యో...  మీరు పెద్దవారు. మీరు నమస్కరించరాదు. మీ బోటి వారికి సేవ చెయ్యడమే మా లక్ష్యం!” అంటూ మాస్టర్ గారిని వారించారు మంత్రి గారు.


కృతఙ్ఞతా పూర్వకంగా ఆశీర్వదించి వెనుదిరిగి తలుపు తీసుకుంటూ వెళ్లబోయారు  తెలుగు మాస్టారు. 


“చేతన్, చేన్, తోడన్, తోన్.. చేతనైన చేయూతనందించి తోడుగా నిలవడం....

తృతీయా విభక్తి...!”


“కొఱకున్, కై ... ప్రజల కొరకు, ప్రజల కోసం పోరాడటం.. చతుర్ధీ విభక్తి ...!”


“వలనన్, కంటెన్, పట్టి.....

ప్రజల వలన ఎన్నుకోబడిన నేను, వాళ్ళ కంటే గొప్పవాడినేమీ కాను, పట్టి పీడిస్తున్న సమస్యలను పరిష్కరించటమే.....

పంచమీ విభక్తి ....!”


“కిన్, కున్, యొక్క , లోన్, లోపల.....

వ్యవస్థ లోపల వున్న కలుపు మొక్కల్ని ఏరి పారేసి, సంఘం యొక్క మేలు కోరడమే..... షష్టీ విభక్తి...!”


“అందున్, నన్.......

అందుకు కట్టుబడి వుంటాను, ఆ విధంగా నన్ను నేను మలుచుకుంటాను.

సప్తమీ విభక్తి...!”


“ఇదే మాకు మా గురుదేవులు నేర్పిన  పాఠం! అందుకే మా తెలుగు మాస్టారంటే మాకు అమితమైన భక్తి !!! ఆయన నేర్పిన క్రమశిక్షణే మాకు యెనలేని శక్తి!!!!”


అమాంతం వెనక్కి తిరిగి చూసిన తెలుగు మాస్టారి కళ్ళు నీటి కుండల్లా వున్నాయి. 


“అవును మాస్టారు... నేనే చిన్నప్పటి మీ శీను గాణ్ణి...” అన్నాడు మంత్రి శీనయ్య!!!


నీటి పొరలు కప్పేయడం వలన ఏమో, ఒకరికొకరు మసక, మసకగా కనపడుతున్నారు. తన శిష్యుడి ఉన్నతి చూసి మురిసిపోయేరు మాస్టారు. గట్టిగా కౌగిలించుకున్నారు.


కాలేజీ చదువులు చదువుతున్నప్పుడు ఒక్కొక్కటిగా జీవితం పాఠాలను నేర్పసాగింది మాస్టారు. అప్పుడు తెలిసి వచ్చింది మీరు క్రమశిక్షణపై ఎందుకు అంత శ్రద్ధ వహించేవారో, మమ్మల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎంత కష్టపడేవారో! ఆ నాడు మీరు నేర్పిన పాఠాలను నెమరు వేసుకుంటూ.....

నా బతుకు చిత్రాన్నేమార్చుకున్నాను. ప్రజాసేవ చేస్తూ దేశానికి ఎంతో కొంత ఋణం తీర్చుకోవాలనుకున్నా.....

చూస్తున్నారుగా......ఇపుడిలా”


“మీరేమీ అనుకోక పోతే అమ్మాయి పెళ్లి కి నాకు చేతనైనంత సహాయం చేసి, మీకు గురుదక్షిణగా చెల్లించుకుంటా.......

ఆ భూమిని మాత్రం అమ్ముకోవద్దు. 

మీ జీవిత భద్రత కోసం మీ దగ్గరే అట్టే పెట్టుకోండి ....”

“ఇది నా విన్నపం. కాదనకండి.” అంటూ అభ్యర్ధించాడు మంత్రి శీనయ్య  ఉరఫ్ శీను.


గురుభక్తిని కాదనలేకపోయారు తెలుగు మాష్టారు. తన శిష్యుడు అంత ఎత్తుకి ఎదిగినందుకు సంబర పడిపోయారు.


“సార్ ..! మీ మొబైల్ అందుబాటులో లేనట్టుంది. మేడం గారు ఫోన్ చేసేరు. మీ చిన్నబ్బాయి స్కూల్ లో ఉసిరి చెట్టెక్కి కాయలు కోయబోతూ కింద పడ్డాడంట.”


“మరేమి ఫరవాలేదు ... హి ఈస్ ఆల్రైట్ అని ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేసి చెప్పారంట ...” అంటూ మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు క్షమాపణలు చెప్తూ... వచ్చి చెప్పాడు సెక్రటరీ.


“మరేమీ ఫర్వాలేదు ప్రిన్సిపాల్ గారిని వాడికి ఇంకో నాలుగు తగిలించమను. మరీ బుద్ధి లేకుండా తయారౌతున్నాడు ఈ మధ్య!” అంటూ ... తెలుగు మాస్టర్ గారి ముఖం లోకి చూసారు సదరు  మంత్రి గారు.


ఆ ఇద్దరూ అంతలా పకా, పకా ఎందుకు నవ్వుతున్నారో ఓ పట్టాన అర్ధం కాలేదు సెక్రటరీ కి....

షరా: అలాంటి ఉపాధ్యాయుల్ని, విద్యార్ధుల్ని చూపించమంటే చూపగలను, కానీ అలాంటి మంత్రులను చూపమని అడగొద్దు.

Modi era,

 List of 25 most powerful countries in the world released, India came at number 3, ahead of us are America, Russia, this is Modi era,,,

Second achievement, monthly tax collection of GST crossed 1.4-1.5 lakh crores, this is the economics of a tea seller,,,


Third achievement, leaving behind America and Japan in setting up new solar power plants, India reached second place. 


Fourth achievement, solar 

energy production doubled in 2017-18, China and America are also stunned


Fifth achievement, seeing India's skyrocketing GDP, India's GDP is 8.2%, China's 6.7% and America's 4.2% will still say, why Indian's Modi goes abroad,,,


Sixth achievement: India became the first country in the world to fire supersonic missiles from all three areas, water, land and sky, this is the Modi era,


Seventh achievement, never seen Pakistan poor in 70 years, but as soon as Modi ji came, Pakistan became poor. In fact, the source of Pakistan's earnings was the trade of Indian fake notes, which was abolished by Modi ji. 


Also read the eighth achievement, one thing was not understood, in 2014 Congress Defense Minister A. Of. Antony had said, the country is poor, we can't even buy a small jet, let alone Rafale, but Modiji repaid Iran's debt, got Rafale deal done, is also taking S-400! After all, where did the country's money go during the time of Congress,,, ❓


Ninth achievement, Army got Bulletproof Scorpio shield, Army got 2500 Bulletproof Scorpios in Jammu and Kashmir,,,


 Tenth achievement, now let me tell you, what was the development of India in these 4 years,,, pushing France back to become number 6 in the economy,,,


Eleventh achievement, leaving Germany behind to become number 4 in the auto market.


Twelfth achievement, leaving behind Russia to become number 3 in power generation,,,


Thirteenth achievement, leaving Italy behind in textile production, became number 2. 


Fourteenth achievement, leaving behind Vietnam to become number 2 in mobile production


Fifteenth achievement, leaving Japan behind in steel production, became number 2,,,


🔺 Sixteenth achievement,,, leaving Brazil behind to become number 1 in sugar production *,,,


🔺 Seventeenth achievement,,, awakened nationalism among Hindus who were always sleeping, there is not a single nation of 125 crore Hindus of the whole world! I consider this work the most important

This is called Modi era. 


Terrorists are being eliminated from the valley under Modi government,,, in 8 months, 230 terrorists were sent to hell near 72 Hurons.


 🔺 Terrorists used to spread terror during Congress rule! In Modi rule, there is terror for army terrorists,,, this is the formula of Modi rule


🔺 Come, let us all together take a resolution today, to make this servant victorious in 2024 with such a huge majority that the figure remains recorded in the Guinness Book!


The figure that no one can touch,,,,, In 2024, put all your strength in making Modi ji the Prime Minister of the country for the third time‼️


               Jai Hind Jai Bharat


Please do :-- Take out 2 minutes of time and share this in the interest of the country.

🙏🙏 🌄🌸🌺 Jai Shri Ram

విశిష్ట పోషకాలు

 విశిష్ట పోషకాలు కలిగిన వివిధ ఆహార పదార్దాలు - సంపూర్ణ వివరణ .  


 * విటమిన్ "A " అందజేయు కెరోటిన్ పదార్ధము లభించు ఆహారపదార్దాలు - 


 *  కేరోటిన్  - 


 ఆకుకూరలు  - 240 మై.గ్రా . 

  

 పెనికులెటన్ అనబడే తోటకూర - 14 ,000 మై .గ్రా

 

 చామాకులు -  10 ,000 మై .గ్రా . 


 కొత్తిమీర  -  6900 మై .గ్రా . 


 మునగాకు - 6700 మై .గ్రా . 


 లేత తోటకూర  - 5500 మై .గ్రా . 


 

 *  "C " విటమిన్  - 


      మునగాకు  - 220 మి.గ్రా . 


      నాటు జామపండు - 212 మి.గ్రా . 


      తోటకూర  - 169 మి.గ్రా . 


 *  క్యాల్షియం  - 


       అవిసాకు  -  1100 మి.గ్రా .


       ముండ్లతోటకూర  - 800 మి.గ్రా . 


       క్యాలీఫ్లవర్  - 626 మి.గ్రా . 


       పొన్నగంటి ఆకు  -  570 మి.గ్రా . 


  *  మెగ్నీషియం  - 


        పింకు రేడిష్  - 196 మి.గ్రా . 


        చుక్కకూర  -  123 మి.గ్రా . 


        లేత తోటకూర  - 122 మి.గ్రా . 


 *  పొటాషియం  - 


         అడివి తమ్మ  - 1800 మి.గ్రా . 


         లేత తోటకూర - 340 మి.గ్రా . 


         మునగాకు  -  259 మి.గ్రా . 


         కొత్తిమీర  -  256 మి.గ్రా . 


         పాలకూర  -  206 మి.గ్రా . 


         మూసామ్బా - 490 మి.గ్రా ( నిమ్మజాతి) .


         అరటిపండు  -  348 మి.గ్రా . 


 

 *  ఇనుము  - 


          కాలిఫ్లవర్  -  40 మి.గ్రా . 


          చిర్రికూర  -    38 మి.గ్రా .


          లేత తోటకూర  -  27 మి.గ్రా . 


          ముళ్ళ తోటకూర  -  22 మి.గ్రా . 


          ఎండ్రకాయ మాంసం  - 21 మి.గ్రా . 


 

 *  సూక్ష్మ ఖనిజాలు  - 


          జింకు , మాంగనీస్ , రాగి , maalibdnam , క్రోమియం . 


  *  జింక్  - 


        పుదీనా , ఉల్లిగడ్డ , మెంతికూర , కొత్తిమీర , గెనుసుగడ్డ , పాలకూర లో జింక్ లభించును. 


 *  మాంగనీసు  - 


       పుదీనా , పాలకూర , కొత్తిమీర , చుక్కకూర , లేత తోటకూర , కరివేపాకు లలో మాంగనీసు లభించును. 


 *  రాగి  - 


        పొన్నగంటాకు , పుదీనా , ఉల్లిగడ్డ , కొత్తిమీర , కరివేపాకు లలో ఈ రాగి ధాతువు లభించును. 


 *  maalibdanam  - 


       కొత్తిమీర , పొన్నగంటాకు , ఉల్లిగడ్డ , లేత తోటకూర లలో లభించును. 


 *  క్రోమియం  -  


        పొన్నగంటాకు , కొత్తిమీరలలో లభించును. 


        

          పైన చెప్పిన ఆహారపదార్ధాలలో మన శరీరానికి కావలసిన అత్యవసర ధాతువులు , విటమిన్లు లభ్యం అగును. వీటిని ప్రతినిత్యం ఆహారంలో భాగం చేసుకొవడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి శరీరం రోగాలపాలు కాకుండా ఉంటుంది. కొత్తిమీర , ఉల్లిపాయకాడలతో చేసిన పచ్చడితో 5 రకాల సూక్ష్మ ధాతువులను అందచేయును . కరివేపాకు పొడి అధికశాతం లో సున్నపు ధాతువును , మెగ్నిషియం , జింక్ మరియు మాంగనీసు ధాతువులను శరీరానికి లభించేలా చేస్తుంది . 


           *** సమాప్తం ***


               

        మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


 

జీవితమనుభోక్తవ్యము


*కం*

జీవితమనుభోక్తవ్యము

జీవించగ బోధపడెడి చిన్మయమయ్యున్.

జీవించిన పెద్దలొసగు

జీవితసత్యములుగొనుట శివమగు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! జీవితం జీవిస్తేనే అర్థమయ్యే మానసిక ఉల్లాసము,అది ఖచ్చితంగా అనుభవించవలసినది. మనకంటే ముందు జీవించిన పెద్దలు చెప్పే జీవిత సత్యాలను స్వీకరించుట శుభకరమగును.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*


*కం*

ప్రోత్సాహముతో సద్గతు

లుత్సాహముపెరిగి ప్రజ్ఞ లుపచయమొందున్.

మత్సరగణమీ కడలని

రుత్సాహములొనరి యెంచు రుత్తము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ప్రోత్సాహం చేయడం వలన సద్గతుల యొక్క ఉత్సాహం పెరిగి ప్రజ్ఞలు మరింత వర్ధుల్లును. ఈర్ష్యాళుగణములు ఇటువంటి సందర్భాల్లో నిరుత్సాహ పరచడం ద్వారా ఈ ఉత్సాహాన్ని, ఈ కార్యక్రమాన్ని నాశనం చేయదలచుదురు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

చేరదీయకూడదు

 🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝


*పరోక్షే కార్యహంతారం* 

*ప్రత్యక్షే ప్రియవాదినమ్*

*వర్జయేత్తాదృశం మిత్రం*

*విషకుంభం పయోముఖమ్*


            *ఋషివాక్యం* 


*భావము*:-


*ఎవడైనా ఒక దుష్టుడు ఒకవ్యక్తి చేసే మంచి పనులను చాటుగా విమర్శిస్తూ ఆ వ్యక్తి నాశనాన్ని కోరుకుంటూ మళ్లీ మంచిపనులు చేసే ఆ వ్యక్తి ఎదురు పడినప్పుడు స్నేహితుని వలె నటిస్తూ గౌరవంగా మాట్లాడుతున్నట్లైతే అటువంటి వానిని దూరంగా ఉంచాలేగాని స్నేహితునిలా చేరదీయకూడదు..... సుగంధద్రవ్యములతో ఘుమఘుమలాడుతున్న తీయని పాలు కడువడున్నా అందులో విషమున్నట్లైతే ఎవరైనా ఆ పాలకడవని దూరంగా వదిలేస్తారే గానీ తీయగా ఉన్నా యని తాగరుకదా? అలాగే దుష్టుడైనవాడు మిత్రునిలా ప్రవర్తిస్తున్నా వాడ్ని దూరంగానే ఉంచాలి గాని చేరదీయకూడదు*.....


🧘‍♂️🙏🪷 ✍️🙏


 

Bhagavadgeeta



 

శతమానం భవతి

 *"అమృతం గమయ"* 

                   ➖➖➖✍️

  

*“శతమానం భవతి  శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి!”*


అనేది వేద పురుష ఆశీర్వచనం!


```”మనలను నిండా నూరేళ్లు బ్రతకమని వేదం ఆశీర్వదిస్తోంది. వేద మంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు నమస్కరించి వారిచే ఈ ఆశీర్వచనం పొందుతూ ఉంటాం.”


“అలాగే నిత్యం చేసుకొనే సూర్యోపస్థానంలో ‘పశ్యేమ శరదశ్శతం, జీవేమ శరదశ్శతం, నందామ శరదశ్శతం, మోదామ శరదశ్శతం’ అని చెప్పబడింది.”


“నిండు నూరేళ్లు     ఆ సూర్యుని చూడగలగాలి.  నిండా నూరేళ్ళు జీవించాలి. అది కూడా ఆనందంగా జీవించాలి అని ఆకాంక్షిస్తాం.”


“ఇలా ఆకాంక్షించటంలో ఎంతో విలువ ఉంది. ‘శుభోదయం’ అని చెప్పడం,  ‘శుభ రాత్రి’ అని చెప్పటంలోనూ లౌకికంగా కూడ అట్టి ఆకాంక్షలు ఆధునిక కాలంలోనూ అనుసరిస్తూనే ఉన్నాం.”


“మంచి మనస్సు నుండి వచ్చే శుభాశీస్సుకు, శుభాకాంక్షాలకు కూడ శక్తి ఉంది.”


“దాని వలన మేలూ జరుగుతుంది. ఇది పూర్వకాలపు విషయమే కాదు, నేటి విషయం కూడా అని అర్థం చేసుకొనగలం.”


“బ్రతికి యుండిన శుభములు బడయవచ్చు.”  కాబట్టి బ్రతికి ఉండటం అంటే ఆయుర్దాయం మొదట కోరదగినది.”


“అందుకే ఏ పూజ చేసినా సంకల్పంలో ఆయురారోగ్య భోగభాగ్యాలు కాంక్షిస్తాం. అందులో ముందు కోరేది ఆయుర్దాయాన్నే.”


“కోట్ల సంపద లభించినా ఆయుర్దాయం లేక మరుసటి రోజే మరణించే వానికి ఈ కోట్ల సంపద వలన ప్రయోజనమేమిటి?”


“అందువలనే మొదట కోరదగినది ఆయుర్దాయం.”


నిజమే! ఆయుర్దాయమనేది కోరుకుంటే వచ్చేదా? అనేది ప్రశ్న.


“దీర్ఘాయుష్మాన్ భవ” అని దీవించటం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందా? ఆని సందేహం.”```

          

ఆయుః కర్మ చ విత్తం చ విద్యా నిధన మేవ చ।

పంచైతా న్యపి సృజ్యంతే గర్భస్థస్తైవ దేహినః॥

```అని చెప్పబడింది.


“అంటే ‘ఆయుష్షు, వృత్తి, ధనం, విద్య, చావు అనేవి ఐదూ జీవి గర్భంలో ఉండగానే నిర్ణయింపబడుతూ ఉంటా’యని దాని అర్థం!”


“ఆయుర్దాయం, మరణం అనేవి ముందే నిర్ణయింపబడితే ఇంకా ఈ ఆశీస్సుల వల్ల కాని, మరే జాగ్రత్తల వల్ల కాని ప్రయోజనమేమిటని ప్రశ్న.”


“లలాట లిఖితా రేఖా  పరిమాష్టుం న శక్యతే!”


నుదుట వ్రాసిపెట్టినది ఎవరూ తుడవలేరని, మార్చలేరని, జరిగి తీరుతుందని మరికొందరి మాట.


 “ఏది నిజం” అనేది సామాన్యునకు వచ్చే ప్రశ్న. ఆయుష్షుకు వృద్ధి, క్షీణతలు ఉంటాయా? ఉంటేనే దాని విషయంలో జాగ్రత్తలు తీసుకొనటం అవసరం తప్ప అదేమీ లేనప్పుడా యత్నమే వ్యర్థం కదా!”


“ఆయుర్వేదం అనే వైద్య విధానం పేరులోనే ఆయువు ఉన్నది. ఆయుర్వేదమనేది ఊసుపోక చెప్పిన సామాన్యపు మాట కాదు. వేదాలలో మొదటిదైన ఋగ్వేదానికి సంబంధించిన ఉపవేదమే ఆయుర్వేదం. అంటే ఆయువును గూర్చి తెలిసికొనదగిన విజ్ఞానం అది. అందువల్ల ఆయువునకు సంబంధించి వృద్ధి క్షయాలు కూడ పరిగణింపదగినవే అని తెలుస్తుంది.”


“లలాట లిఖితమైన ఆయుర్దాయాన్ని ఎవ్వరూ మార్చలేరనేది యదార్థమైనా మార్కండేయుడు, శంకరాచార్యుల వారు మొదలైన వారు దైవానుగ్రహం వలన ఆయుర్దాయాన్ని పెంచుకొనటం చూస్తాం. అంతే కాదు హనుమంతుడు, విభీషణుడు మొదలగు వారు చిరంజీవులుగా వరమందటమూ చూస్తాం. ఇంకా విశేషం…  ద్వాపర యుగంలో చనిపోయిన సాందీపుని గురువు యొక్క పుత్రుని శ్రీకృష్ణుడు బ్రతికించినట్లు, త్రేతాయుగంలో చనిపోయిన వానర వీరుడు గంధమాదనుని హనుమంతుడు బ్రతికించి తెచ్చినట్లు కూడ ఇతిహాసాల ద్వారా తెలిసికొన్నాం.”


“కాబట్టి దైవానుగ్రహం వలన కాని, అమోఘవచనులైన ఋష్యాదుల ఆశీర్వచనాల వల్ల కాని, ఆయుర్దాయం పెంచుకొనటం సాధ్యమే అని తెలుస్తుంది.”


“కాబట్టే మన పూర్వజులు ...‘ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం’ అని సంకల్పంలో చెప్పుకొనటంలో అనౌచిత్యం లేదని, “శతమానం భవతి” అంటూ మహనీయుల ఆశీస్సులు పొందటం శ్రేయస్కరమే అని తెలుస్తోంది.”


“అందుకే అట్టి ఆశీర్వచనాల కోసం పెద్దల యెడ వినయ విధేయతలతో ఉండాలి.”✍️```

        *శతమానమ్ భవతి!*✋

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷

సూర్యోదయ శోభలు

 శు భో ద యం🙏🙏


సూర్యోదయ శోభలు !!


"హరిదంభోరుహలోచనల్, గగన రంగాభోగ రంగత్తమో/

భరనేపథ్యము నొయ్యనొయ్య సడలింపన్, రాత్రి శైలూషికిన్/

వరుసన్ మౌక్తికపట్టమున్, నిటలమున్,వక్త్రంబునుందోచెనా/

హరిణాంకాకృతి వొల్చె,రేకయి, సగంబై ,బింబమై,తూర్పునన్;

వసుచరిత్రము-4ఆ:17 ప: రామరాజ భూషణుడు.


         రాయల అష్టదిగ్గజ కవులలోమేటి,శ్లేషకవిత్వంలో ఘనాపాటి.రామరాజభూషణకవి విరచిత వసుచరిత్రము లోనిదీ పద్యరత్నం.

విషయం సూర్యోదయం.

         ఆకాశంలో తూరుపురేఖలను సవరిస్తూ ఉదయిస్తున్న సూర్యబింబం క్షణక్షణం తనరూపం మార్చుకుంటూ చంద్రవంకవలె దర్శనమిస్తూ,రంగస్ధలంలో తెఱదించుతూఉండగా కనువిందుచేసే నట్టువకత్తె ఆకారంగా గోచరిస్తున్నాడట.

         వెనకటి రోజులలో కూచిపూడి భాగవతులు భామాకలాపం ప్రదర్శించేవారు.వాళ్ళు నాట్యగత్తెను బహుచిత్రంగా రంగస్థలమీద ప్రవేశపెట్టేవారు.పైనుండి క్రిందకు తెఱదింపేవారు.అది కూడామధ్యలో ఆగి ఆగి పాత్రను ప్రేక్షకులకు చూపేవారు.ఆక్రమంలో ముందుగా శిరస్సుకేశపాశమునందలంకరణములు, తదుపరి,ఫాలభాగము, ఆవెనుక,కనులు నాశిక, పెదవులు, మెడ ,ఇత్యాదిగా క్రమశః అవయవప్రదర్శన చేస్తూ చివరకు మొత్తం పాత్రను చూపేవారు.

         సూర్యోదయంకూడా ఆవతుగా ఉన్నదట.

"రాత్రియను నట్టువకత్తె,గగనమను రంగస్థలమున నాట్యమాడువేళ,దిగంగనలు(దిక్కులనేవనితలు)చీకటితెఱను క్రిందికి దించు చుండగా క్రమశః ముత్యాలపట్టెడ(శిరోభూషణము) ఫాలభాగము,మొగము,ను కనబడినట్లు,చీకటిని చేధించుచు ,తొలుత రేఖామాత్రమయి, ఆవెనుకసగభాగమయి, ఆపై పరిపూర్ణబింబమయి సూర్యభగవానుడు.కనువిందు చేసెను.

రూపకానుప్రాణిత, ఉత్ప్రేక్షాలంకారము.

కఠినపదములకు అర్ధవివరణ:


హరిత్-దిక్కు,

అంభోరుహలోచన-వనిత;

రంగము-ప్రదర్శనావేదిక;

శైలూషి-నాట్యకారిణి;

మౌక్తికపట్టము-ముత్యాలశిరోభూషణము;

వక్త్రము-వదనము(నోరు)

హరిణాంకాకృతి-చంద్రునిబోలినయాకారము;


                               స్వస్తి !🙏🌷🌷🌷🌷

కేరళలో జరిగింది....

 ఇది కధ కాదు, 

49 ఏళ్ళ క్రితం #కేరళలో జరిగింది....

*******************************


*అది 1971 డిసెంబర్ ప్రాంతం కేరళలోని #తలస్సేరి..!*


*మత ఘర్షణలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కాలం..!*


*సమీప ప్రాంతాల్లోని ప్రజలు వీధుల్లోకి రాలేక ఇళ్ళకు తాళాలు వేసుకుని సుదూర బంధువుల ఇళ్ళకు వెళ్ళిపోయి నిర్మానుష్యంగా కనిపిస్తున్న జనావాసాలు..*


*ఇది ఇలా ఉండగా #విజయన్_కొరాన్ అనే పేరుగల ఓ 26 ఏళ్ళ వయస్సున్న కరడుగట్టిన కమ్యూనిస్టు గూండా రెండు జీపుల్లో ఫుల్లుగా తాగి మదం పట్టిన ఏనుగుల్లా ఉన్న కామ్రేడ్లను ఎక్కించుకుని ఆ ప్రాంతం అంతా తిరుగుతూ మైకులతో ప్రజలను మరింతగా రెచ్చగొడుతున్నాడు.*


*ఈ క్రమంలో తలస్సేరిలో ఈ గ్యాంగ్ చేతిలో జనవరి 4, 1972 రోజు #కుంజిరామన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.*


*అంతకు రెండు రోజుల ముందే తలస్సేరి ప్రాంతానికి 25 ఏళ్ళ వయస్సున్న ఒక యంగ్ IPS ఆఫీసర్ ASP గా ఛార్జ్ తీసుకున్నారు.*


*హత్య విషయం తెలియగానే ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని హంతకుల వేటలో పడ్డారు..*


*ఓ ఫార్మ్‌హౌస్‌లో విజయన్‌కొరాన్ ముఠా మందు కొడుతున్నట్లు సమాచారం వచ్చింది*


*వెంటనే యంగ్ IPS తన పోలీసు బ్రృందంతో దాడిచేశాడు..*

*ముఠా నాయకుడైన విజయన్‌కొరాన్ ఒక పోలీసు కానిస్టేబుల్ చేతికి చిక్కాడు, కానీ అతన్ని బెదిరించడంతో వదిలివేశాడు..*


*ఇదంతా గమనిస్తున్న యంగ్ IPS ఆఫీసర్ స్వయంగా తానే రంగంలోకి దిగాడు..*


*అతని వెంట పరిగెత్తుతూ దగ్గరకు పోగానే పట్టుకోకుండా కాలితో బలంగా తన్నాడు..*


*ఆ దెబ్బకు విజయన్‌కొరాన్ వేగంగా బోర్లా పడిపోయి ముఖం గీసుకుపోయింది..*

*ముఖం చేతులు రక్తసిక్తమైనాయి.. అతని లుంగీ పూర్తిగా ఊడిపోయింది..*


*అతనిని జీపులో ఎక్కించుకుని తలస్సేరి ప్రజలందరూ చూస్తుండగా పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చాడు..*


*ఈ క్రమంలో యంగ్ IPS ఆఫీసర్ ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు..*

*అంతా చేతల్లోనే చూపిస్తున్నారు..*


*పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చిన తరువాత అతనిని సెల్‌లో వేశారు.. ఒక కానిస్టేబుల్ సెల్‌లోకి వెళ్ళి, సంకెళ్ళు విప్పి "నువ్వు రేపటి సూర్యోదయాన్ని చూస్తావని నాకైతే నమ్మకం లేదు.." అన్నాడు.*


*ఇంతలోనే యంగ్  IPS ఆఫీసర్ సెల్‌లోకి ఎంటరైనాడు..*

*మాటల్లేవు..*

*ఒక చేత్తో ఆ గూండా మెడ పట్టుకుని గోడకు ఆనించి పైకి లేపాడు..*

*అతని కాళ్ళు నేలకు 1 అడుగు పైకి లేచి మొత్తం శరీరం గాల్లో వేలాడింది..*

*ఇలా ఒక నిమిషం కాగానే అతని కళ్ళు తేలడం ప్రారంభించాయి.. క్రిందకు దించాడు.. ఆ గూండాకు ముత్తాత కనిపిస్తున్నాడు.*

*ఇంతలో కానిస్టేబుల్‌కు సైగ చేయగా ఓ గ్లాసు నీళ్ళు ఆ గూండాకు అందించాడు..*


*ఎడారిలో నీళ్ళు లేక వడదెబ్బ తగిలిన వ్యక్తి ఎలా తాగుతాడో అలా ఆ నీళ్లు గ్లాసు అందుకుని బొట బొటా తాగేశాడు.. మరో గ్లాసు నీళ్ళు కావాలని అడిగాడు..*

*ఆఫీసర్ అనుమతితో కానిస్టేబుల్ మరో గ్లాసు నీళ్ళు తెచ్చిచ్చాడు..*

*నీళ్ళు తాగి చెమటలతో పూర్తిగా తడిసిపోయిన శరీరంతో రొప్పుతూ, యంగ్ ఆఫీసర్ కాళ్ళ వైపు కమ్యూనిస్టు గూండా దీనంగా చూస్తున్నాడు..*


*"Vijayan Koran.. Look at me.." అని మొదటిసారిగా యంగ్ IPS నోటి నుండి మాటలు వినపడ్డాయి..*


*ఆ రౌడీ తన చూపులను మెల్లిగా పైకి తీసుకువచ్చాడు..*

*ఆఫీసర్ నడుం వద్దకు చూపులు రాగానే, రివాల్వర్ బయటకు తీస్తున్న ద్రృశ్యం కనిపించింది..*


*అంతే బిగ్గరగా ఏడుస్తూ, వేడుకోవడం ప్రారంభించాడు..           ఆ రౌడీకి మలయాళం తప్ప మరేమీ రాదు..*


*ఆఫీసర్‌కు ఈ మళయాళం ఇంకా వంటబట్టలేదు..*

*ఆయన ఏడుపులు వేడుకోవడాలు ఏమీ పట్టించుకోకుండా రివాల్వార్ తీసుకువచ్చి నుదుటిపై పెట్టాడు..*

*ఇంతలో ఆ రౌడీ #మూత్ర విసర్జన చేయడంతో కొద్దిగా విరామం ఇచ్చాడు..*

*అయినా ఆ రౌడీ పెద్దగా ఏడవడం, వేడుకోవడం ఆపలేదు..*

*ఆ పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా ఆఫీసర్ వైపు దీనంగా చూశారు.. "మీరు ట్రాన్స్‌ఫర్ అయిపోయిన తరువాత ఈ కమ్యూనిస్టు గూండాలు మా కుటుంబాలను చంపేస్తారు.." అన్న ఆ పోలీసుల దీనపు చూపుల్లోని అర్థాన్ని గ్రహించిన ఆఫీసర్‌ రివాల్వార్ కిందకు దించి రెండవ మాట మాట్లాడారు..*


*"ఈ తలస్సేరి ప్రాంతంలో ఎక్కడా గొడవలూ, హింస, ఘర్షణలూ కనపడకూడదు వినపడకూడదు.. అలా జరిగితే ఈ పిస్టోల్‌లో ఉన్న గుండు నేరుగా నీ తలలోని మెదడులోకి వెళుతుంది. Is that Clear..??" అన్నాడు..*’


*ఏడుస్తూనే "ఎస్ సార్.." అని చెప్పాడు.*

*ఆఫీసర్ బయటకు వెళ్ళిపోతూ అతని కాళ్ళకు కారిపోయి ఉన్న మలం మరియు కింద నేలపై తడిచిన మూత్రాన్ని క్లీన్ చేసి వెళ్ళాలని ఆదేశించాడు..*


*వాడు అలాగే ఏడుస్తూ సెల్ అంతా క్లీన్ చేసి, నీళ్ళతో తన మొల భాగం క్లీన్ చేసుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు..*


*ఆ తరువాత తలస్సేరిలో మరో ఆరు మాసాలు ఎటువంటి గొడవలూ లేవు..*


*ఆ ఆఫీసర్ అంతగా సీరియస్ కావడానికి కారణం ఆ ముఠా చేతిలో అప్పటికే ఏప్రిల్ 28, 1969 న #వడైక్కల్_రామక్రృష్ణన్ అనే కుట్టుపని చేసుకుని బ్రతికే వ్యక్తి దారుణ హత్యకు గురైనట్లు తెలుసుకుని ఉన్నాడు..*


*అక్కడ అంతా ప్రశాంతం అయిపోవడంతో, ఆ యంగ్ IPS ఆఫీసర్‌ను ముఖ్యమంత్రి #అచ్యుతమీనన్ మెచ్చుకుని, మరొక డిస్టర్బ్‌డ్ ఏరియాకు ట్రాన్స్‌ఫర్ చేశారు, అక్కడ కూడా పరిస్థితులు చక్కబెట్టమని..*


*ఆ యంగ్ IPS ఆఫీసర్ ఎవరో కాదు మన Indian James Bond #అజిత్‌దోవల్..*


*1945లో #ఉత్తరాఖండ్‌లో పుట్టిన దోవల్ 1968 లో అంటే కేవలం 23 ఏళ్ళకే #IPS కు సెలెక్ట్ అయ్యారు.. ఆయన కేరళ క్యాడర్‌కు ఎంపిక అవడంతో మొదటి పోస్టింగ్ #కొట్టాయం ASP గా బాధ్యతలు తీసుకున్నారు..*

*ఆ సంఘటన జరిగిన మరో రెండేళ్ళకు ఆయన సెంట్రల్ సర్వీసులకు ఢిల్లీకి వచ్చేశారు..*


*పోతే ఆ 26 ఏళ్ళ #కమ్యూనిస్టు_గూండా విజయన్‌ కొరాన్ ఎవరో తెలుసా....??*


*ఆ సంఘటన తరువాత అవమానంతో పోలుసు రికార్డులో ఉన్న పేరు మార్చుకుని, #పినరాయివిజయన్ అని కొత్త పేరు పెట్టుకుని, 2016 లో ముఖ్యమంత్రి అయిన నేటి కేరళ ముఖ్యమంత్రి.*


*కమ్యూనిస్టు కల్చర్‌లో ఎవరైనా నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారంటే వాళ్ళ చరిత్ర ఎలా ఉంటుందో చూశారు కదా.....!!*✍️

సముద్రస్నానం - సహాయం

 సముద్రస్నానం - సహాయం


దేవాలయాలను తీర్థాలను దర్శించి సేవించాలని చాలామందికి కోరికగా ఉంటుంది. ఈనాటికి చాలామంది పుణ్యనది స్నానం కొరకు మహామాఖం, కుంభమేళా వంటి ఉత్సవాలకు వేల సంఖ్యలో వస్తుంటారు. తిర్తస్నానం వల్ల మన పాపములు తొలగి మనస్సుకు శాంతి చేకూరుతుంది.


“కేవలం సముద్ర దర్శనమే మహా పుణ్యం“. సాధారణ రోజులలో సముద్ర స్నానం చెయ్యరాదు. అది కేవలం అమావాస్య, పౌర్ణమి, గ్రహణాల వంటి రోజులలో మాత్రమే చెయ్యాలి. కాని రామేశ్వరం, తిరుప్పులని, వేదారణ్యం, ధనుష్కోటి వంటి క్షేత్రములలో సంవత్సరంలో ఎప్పుడైనా సముద్రస్నానం చేసి పుణ్యం ఆర్జించవచ్చు.


ఒకసారి కంచి పరమాచార్య స్వామివారు తమిళనాడు మొత్తంగా విజయయాత్ర చేస్తున్నారు. ఆడి (ఆషాడం) అమావాస్య దగ్గర పడుతుండడంతో వేదారణ్యంలో సముద్ర స్నానం చెయ్యాలని ప్రణాళిక వేశారు. కారణం లేకుండా శ్రీరాముడు ఒక్కమాట కూడా మాట్లాడడు అని ప్రతీతి. అలాగే సన్యాసులు కూడా. అక్కరలేని విషయాలు మాట్లాడడం, నిష్పలమైన పనులు చెయ్యడం అన్నది వారి వద్ద ఉండదు.


మహాస్వామివారు వేదారణ్యం చేరేదారిలో కొన్ని ఊళ్ళల్లో మకాం చేస్తూ యాత్ర సాగిస్తున్నారు. అలా ఒక ఊరిలో, ఆకలిగొన్న వ్యక్తీ ఒకరు స్వామీ దర్శనానికి వచ్చాడు. స్వామివారు మఠం మేనేజరును పిలిచి “అతనికి మంచి ఆహారం పెట్టి, ఒక పంచ ఉత్తరీయం ఇమ్మ”ని ఆదేశించారు. మేనేజరు స్వామివారి ఆదేశాన్ని పాటించి “అతనికి మీరు మీరు చెప్పినవన్ని ఇచ్చాము. పంపెయ్యమంటారా?” అని అడిగారు.


స్వామివారు వెంటనే, “అతణ్ణి మఠ ప్రముఖునిగా చూసుకుంటూ, రాజభోగాలను కల్పించ”మని ఆదేశించారు. మేనేజరుకు ఏమీ అర్థం కాకపోయినా స్వామివారి ఆదేశాన్ని పాటిస్తూ అతణ్ణి యాత్రలో తమతోపాటు ఉండమన్నారు.


“అతనికి భోజనం ఇచ్చారా? బాగా చూసుకున్తున్నారా?” అని మహాస్వామివారు మేనేజరుతో ప్రతిరోజూ అడిగి తెలుసుకునేవారు. రోజులు గడుస్తున్నాయి. హఠాత్తుగా ఒకరోజు అతను మఠానికి తాగి వచ్చాడు. భగవంతుణ్ణి దూషించాడు. మఠ ఉద్యోగులను తిట్టాడు. ఆఖరికి కూడుగుడ్డ ఇచ్చిన పరమాచార్య స్వామిని కూడా తూలనాడాడు. మేనేజరుకు కోపం వచ్చి అతని ప్రవర్తనను మహాస్వామికి విన్నవించారు. “అతణ్ణి పంపెద్దాం పెరియవ” అని స్వామిని అర్థించారు.


స్వామివారు ఏమీ కోప్పడక గట్టిగా నవ్వారు. “స్వామీ! అతణ్ణి పంపెయానా?” అని మేనేజరు మరలా అడిగారు. కాని స్వామివారు అందుకు ఒప్పుకోలేదు.


ఆరోజు ఆడి ఆమావాస్య. స్వామివారు వేదారణ్యంలో సముద్రస్నానం చేయడానికి వస్తున్నారని తెలిసి వేలమంది భక్తులు వచ్చారు. ఆడి అమావాస్య రోజు సముద్ర స్నానం పుణ్యప్రదం. అందునా ‘నడమాడుం దైవం’ పరమాచార్య స్వామితో కలిసి చెయ్యడం అత్యంత పుణ్యప్రదం. దాంతో తీరం అంతా లక్షలాదిమంది భక్తులతో నిండిపోయింది. భక్తితో ఎంతోమంది వృద్ధు మహిళలు కూడా తీరం వెంబడి నిలుచున్నారు.


పరమాచార్య స్వామివారు సముద్రం దగ్గరకు వచ్చారు. అందరూ స్వామివారికి నమస్కరించగా స్వామివారు సముద్రంలోకి నడిచారు. స్వామివారిని అనుసరిస్తూ అక్కడున్న వృద్ధ మహిళలతో పాటు అందరూ లోపలి నడిచారు.


అంతే ఒక్కసారిగా వచ్చిన ప్రచండమైన అలల తాకిడికి ఆ వృద్ధ మహిళలు కొంతమంది సముద్రలోకి కొట్టుకునిపోయారు. అందరూ ఏం చెయ్యాలో పాలుపోక చేష్టలుడిగి నిలుచున్నారు. అంతటి భయంకరమైన అలలను కూడా లెక్క చెయ్యకుండా ఒక వ్యక్తీ వెంటనే సముద్రంలోకి దూకి ఆ ఆడవారిని ఒడ్డుకు లాగి రక్షించాడు. ఆ వ్యక్తీ మరెవరో కాదు. మఠంలో అందరిని ఇబ్బందులు పెడుతున్న ఆ తాగుబోతు.


ఈ సంఘటనను చూడగానే మహాస్వామివారు మేనేజరు వంక తిరిగి ఒక చిన్న నవ్వు నవ్వారు. మేనేజరు పరుగున వచ్చి స్వామివారి పాదాలపై పడ్డాడు.


సన్యాసులు భవిష్యత్తును దర్శించగల దిర్ఘదర్శులు. వారు చేసే ప్రతి క్రియలో కొన్ని వేల కారణాలు/నిజాలు ఉంటాయి. మనం వాటిని లోతుగా పరిశీలిస్తేనే వారి పూర్ణ అనుగ్రహాన్ని పొందగలము.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

పంచాంగం 18.07.2023 Tuesday,

 పంచాంగం 18.07.2023 Tuesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు అధిక శ్రావణ మాస శుక్ల పక్ష: ప్రతిపత్తి తిధి భౌమ వాసర: పుష్యమి నక్షత్రం హర్షణ యోగ: కింస్తుఘ్నం తదుపరి బవ కరణం ఇది ఈరోజు పంచాంగం. 


పాడ్యమి రాత్రి 02:10 వరకు.

పుష్యమి ఈ రోజు పూర్తిగా ఉంది.

సూర్యోదయం : 05:54

సూర్యాస్తమయం : 06:50

వర్జ్యం : మధ్యాహ్నం 02:06 నుండి 03:53 వరకు.

దుర్ముహూర్తం: పగలు 08:29 నుండి 09:21 వరకు తిరిగి రాత్రి 11:16 నుండి 12:00 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.


యమగండం : పగలు 09:00 నుండి 10:30 వరకు.  



శుభోదయ:, నమస్కార: