15, మే 2021, శనివారం

సభ్యులకు గమనిక

 


సభ్యులకు గమనిక

మన సభ్యులు కొంతమంది వారి గుర్తింపుని గోప్యంగా ఉంచి కామెంట్లు చేస్తున్నారు. అటువంటి కామెంటలు అంగీకరించ బడవు. కాబట్టి. ప్రతి సభ్యుడు ఏదైనా కామెంటు చేసేముందు ముందుగా ఫాలోవర్ అయి తదుపరి వారి కామెంటును వారి పేరు, నివాసముతొ పాటు పోస్టు చేయగలరు. తద్వారా ఇక్కడ ఎవరు ఎక్కడి నుండి కామెంటు చేస్తున్నారో సభ్యులందరికి తెలియగలదు. గమనించ గలరు. 

వైశాఖ పురాణం - 4 వ అధ్యాయము*_

 _*వైశాఖ పురాణం - 4 వ అధ్యాయము*_




🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




*వైశాఖధర్మ  ప్రశంస*




☘☘☘☘☘☘☘☘☘




నారద మహర్షిని అంబరీష మహారాజు *"మహర్షీ ! వైశాఖమాసమున చేయవలసిన చేయదగని ధర్మములను దయయుంచి వివరింపుమని కోరెను. అప్పుడు నారద మహర్షి యిట్లనెను.* అంబరీషమహారాజా ! నీకు గల ధర్మాసక్తికి మిక్కిలి సంతోషము కలుగుచున్నది. వినుము , నూనెతో తలనంటుకొని చేయు అభ్యంగస్నానము , పగటినిద్ర , కంచుపాత్రలో భుజించుట , (కంచుపాత్ర కాక మరియొక పాత్రలో భుజింపవలెనని నారదుని యుద్దేశ్యము కాదు. వ్రతమునాచరించువారు పాత్రలో , కంచములో భుజింపరాదు. అరటీఅకు , విస్తరాకు , తామరాకు మున్నగు ఆకులయందు భుజింపవలెనని నారదుని అభిప్రాయము. ధనవంతులు - బంగారు , వెండిపాత్రలలోను , సామాన్యులు కంచుపాత్రలలోను ప్రాతకాలమున వెనుకటి దినములలో భుజించెడివారు.) మంచముపై పరుండుట , గృహస్నానము , నిషిద్దములైన ఆహారములను ఉల్లి మొదలైన వానిని భుజింపకుండుట అను ఎనిమిదిటిని వైశాఖమాసవ్రతము చేయువారు మానవలెను. రెండుమార్లు భుజింపరాదు. పగలు మాని రాత్రి యందు భుజింపరాదు అనగా పగటియందు భుజించి రాత్రి భోజనమును మానవలెను.


వైశాఖమాసవ్రతమును పాటించు వాడు తామరాకున భుజించిన పాప విముక్తుడై వైకుంఠమును చేరును. వైశాఖమాసవ్రతము పాటించువారు, యెండలోనడచి అలసిన వారి పాదములను కడిగి ఆ జలమును భక్తి శ్రద్దలతో తలపై జల్లుకొనవలెను. ఇది ఉత్తమమైన వ్రతము. మార్గాయాసమునందిన ఉత్తమ బ్రాహ్మణుని ఆదరించి ఉత్తమమాసమున గూర్చుండబెట్టి వానినే శ్రీ మహావిష్ణువుగ భావించి వాని పాదములను నీటిచే కడిగి యా పవిత్రజలమును తలపై జల్లుకొనిన వాని పాపములన్నియు పటాపంచలై నశించును. ఆ జలమును తలపై జల్లుకొనిన గంగ మున్నగు సర్వతీర్థముల యందు స్నానము చేసిన పుణ్యఫలము సిద్ధించును.


విష్ణుప్రీతికరమైన వైశాఖమున నదీ తటాకాది స్నానము చేయక , తామరాకు మున్నగు ఆకులయందు ఆహారమును భుజింపక , విష్ణు పూజనము లేక కాలము గడిపిన ప్రాణి గాడిదకడుపున బుట్టి తరువాత జన్మయందు కంచరగాడిదగా జన్మించును. ఆరోగ్యవంతుడై యుండి దృఢశరీరము కలిగి స్వస్థుడైయున్నను వైశాఖమున గృహస్నానము చేసినచో నీచ జన్మనందును వైశాఖమున బహిస్నానము నదీ  తటాకాదులలో చేయనివాడు వందలమార్లు శునక జన్మమునొందును. స్నానాదులు లేక వైశాఖమాసమున గడిపినవాడు పిశాచమై యుండును. వైశాఖమాసవ్రత మాచరించినప్పుడే వానికి పిశాచత్వము పోవును. వైశాఖమున లోభియై జలమును , అన్నమును దానము చేయనివాడు పాపదుఃఖముల నెట్లు పోగొట్టుకొనును ? పోగొట్టుకొనలేడని భావము.


శ్రీమహావిష్ణువును ధ్యానించుచు నదీస్నానము నాచరించినవారు గత మూడు జన్మలలో చేసిన పాపములను గూడ పోగొట్టుకొనును. ప్రాతఃకాలమున సూర్యోదయ సమయమున సముద్రస్నానము నాచరించినచో నేడు జన్మలలో చేసిన పాపములును పోవును. జాహ్నవి , వృద్దగంగ , కాళింది , సరస్వతి , కావేరి , నర్మద , కృష్ణవేణి యని గంగానది యేడు విధములుగ ప్రవహించి సప్తగంగలుగా ప్రసిద్దినందినది. అట్టి సప్తగంగలలో ప్రాతఃకాలస్నానమున వైశాఖమున చేసిన కోటి జన్మలలో చేసిన పాపములను గూడ పోగొట్టుకొనుచున్నారు. దేవతలచే నిర్మితములైన సముద్రాదులందు స్నానమును వైశాఖమాస ప్రాతఃకాలమున చేసినవారి సర్వపాపములు నశించి పుణ్యప్రాప్తి కలుగును. గోపాదమంత ప్రమాణము కల బహిర్జలమున(లోతు లేకున్నను ఆరుబయట తక్కువ జలమున్న సెలయేళ్లు) గంగాది సర్వతీర్థములు వసించును. ఈ విషయమును గమనించి భక్తి శ్రద్దలతో వాని యందు స్నానమాడవలెను.


రసద్రవ్యములలో క్షీరముత్తమము. క్షీరము కంటె పెరుగు ఉత్తమము. పెరుగుకంటె నెయ్యి ఉత్తమము. నెలలలో కార్తికమాసముత్తమము. కార్తికముకంటె మాఘమాసముత్తమము. మాఘముకంటె వైశాఖముత్తమము. ఇట్టి వైశాఖమున చేసిన పుణ్యకరమైన వ్రతము దానము మున్నగునవి వటవృక్షము వలె మరింతగా పెరుగును.


కావున నిట్టి పవిత్రమాసమున ధనవంతుడైనను , దరిద్రుడైనను , యధాశక్తి వ్రతము నాచరించుచు బ్రాహ్మణునకు యధాశక్తిగ దానమీయవలెను కంద మూలములు , పండ్లు , వ్రేళ్లు , కూరలు , ఉప్పు , బెల్లము , రేగుపండ్లు , ఆకు , నీరు , మజ్జిగ మొదలగువానిని నిచ్చినను కలుగు పుణ్యమనంతము. బ్రహ్మమున్నగు దేవతలంతటి వారికిని యీ మాసమున వ్రతదానాదులు లేనిచో నెట్టి ఫలితము లేదు. దానము చేయనివాడు దరిద్రుడగును. దరిద్రుడగుటచే పాపముల నాచరించును. అందుచే నరకము నందును. కావున యధాశక్తిగ దానము చేయుట యెట్టి వారికైనను ఆవశ్యకము. కావున తెలివియున్నవారు సుఖమును కోరుచు దానము చేయవలయును. ఇంటిలో నెన్నియలంకారములున్నను పైకప్పులేనిచో ఆ యిల్లు నిరర్ధకమైనట్లు జీవి యెన్ని మాస వ్రతముల నాచరించినను వైశాఖవ్రతము నాచరింపనిచో వాని జీవితమంతము వ్యర్థము. అన్ని మాసముల వ్రతముల కంటె వైశాఖమాస వ్రతము ఉత్తమమను భావము. స్త్రీ సౌందర్యవతియైనను , గుణవంతురాలైనను , భర్త కలిగియున్నదైనను , భర్తను ప్రేమించుచు , భర్తృప్రేమను కలిగియున్నను , వైశాఖవ్రతము నాచరింపనిచో ఎన్ని లాభములున్నను వ్యర్థురాలని యెరుగుము. అనగా సర్వశుభలాభములనంది యువతులును వైశాఖవ్రతమును చేయనిచో వారికి నున్నవన్నియు నిష్పలములు వ్యర్థములునని భావము. గుణములెన్ని యున్నను దయాగుణము లేకున్నచో వ్యర్థములైనట్లుగా సద్ర్వతము లెన్నిటిని చేసినను వైశాఖమాస వ్రతమును చేయనిచో యన్నియు వ్యర్థములగును సుమా ! శాక సూపాదులు (కూర పప్పు) యెంత యుత్తమములైనను , యెంత బాగుగవండినను ఉప్పులేనిచో వ్యర్థములైనట్లుగా వైశాఖవ్రతమును చేయనిచో నెన్ని వ్రతములును చేసినను అవియన్నియు వ్యర్థములే యగును సుమా. స్త్రీ యెన్ని నగలను ధరించినను వస్త్రము లేనిచో శోభించదో అట్లే యెన్ని సద్ వ్రతముల నాచరించినను వైశాఖవ్రతము నాచరింపనిచో అవి శోభింపవు. కావున ప్రతి ప్రాణియు నీ విషయమును గమనించి వైశాఖమాస వ్రతమును తప్పక ఆచరింపవలెను. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమాసమున శ్రీమహావిష్ణువు దయను వైశాఖ వ్రతమునాచరించి పొందవలెను. ఇట్ళు చేయనిచో నరకము తప్పదు. వైశాఖ స్నానాదికముచే సర్వపాపక్షయమై వైకుంఠప్రాప్తి కలుగును. తీర్థయాత్రలు తపము యజ్ఞములు దానము హోమము మున్నగు వానిని యితర మాసములలో చేసినచో వచ్చు ఫలములకంటె వైశాఖమున వ్రతమును పాటించిన పైన చెప్పిన వానిని చేసిన వచ్చు ఫలమత్యధికము. వైశాఖవ్రతము మిగిలిన అన్ని మాసములలో చేసినవానికంటె వీనిని ఫలముల చేయును. మదమత్తుడైన మహారాజైనను , కాముకుడైనను , ఇంద్రియలోలుడైనను వైశాఖమాస వ్రతము నాచరించినచో వైశాఖస్నానమాత్రముననే సర్వదోషముల నశింపజేసి కొని పుణ్యవంతుడై వైకుంఠమును చేరును. వైశాఖమాసమునకు శ్రీమహావిష్ణువే దైవము.


వైశాఖమాస వ్రతారంభమున స్నానము చేయుచు శ్రీమహావిష్ణువు నిట్లు ప్రార్థింపవలయును.



*మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరవౌ |*

*ప్రాతః స్నానంకరిష్యామి నిర్విఘ్నం కురుమాధవ ||*


పిమ్మట స్నానము చేయుచు క్రింది శ్లోకములను మంత్రములను చదివి అర్ఘ్యము నీయవలయును.



*వైశాఖే మేషగేభానౌ ప్రాతః స్నాన పరాయణః |*

*అర్ఘ్యంతేహం ప్రదాస్యామి గృహాణ మధుసూదన ||*

*గంగాయాః సరితస్సర్వాః తీర్థాని చహ్రదాశ్చయే |*

*ప్ర గృహ్ణీతమయాదత్తమర్ఘ్యం సమ్యక్ ప్రసీదథ ||*

*ఋషభః పాపినాంశాస్తాత్వం యమ సమదర్శనః |*

*గృహాణార్ఘ్యం మయాదత్తం యధోక్త ఫలదోభవ ||*


అని ప్రార్థించి అర్ఘ్యములనిచ్చి స్నానమును ముగించుకొనవలెను. పిమ్మట మడి , పొడి బట్టలను కట్టుకొని వైశాఖమాసమున పుష్పించిన పుష్పములతో శ్రీ మహావిష్ణువును పూజింపవలయును. వైశాఖమాస మహిమను వివరించు శ్రీ మహావిష్ణు కథను వినవలెను , చదవవలెను. ఇట్లు చేసినచో లోగడ జన్మలలో చేసిన పాపములన్నియు నశించును. ముక్తి లభించును. ఇట్లు చేసినవారు భూలోక వాసులైనను స్వర్గలోకవాసులైనను , పాతాళలోకవాసులైనను యెచటను వారికి కష్టము కలుగదు. వారికి గర్భవాసము స్తన్యపానము కలుగవు. అనగా పునర్జన్మయుండదు. ముక్తి సిద్దించును.


వైశాఖమున కంచు పాత్రలో భుజించువారు , శ్రీమహావిష్ణువు సత్కధలను విననివారును , స్నానము , దానము చేయనివారును , నరకమునకే పోదురు. బ్రహ్మహత్య మున్నగు పాపములకు ప్రాయశ్చిత్తము కలదు కాని వైశాఖస్నానము వ్రతము చేయని వానికి పాపమును ప్రాయశ్చిత్తము లేదు.


తను స్వతంత్రుడై యుండి తన శరీరము తన యధీనములోనే యుండి , నీరు తనకు అందుబాటులో నుండి స్నానమాడవీలున్నను , స్నానమాడక నాలుక తన యధీనములో నుండి *'హరి'* యను రెండక్షరములను పలుకకయున్న నీచ మానవుడు జీవించియున్న శవము వంటివాడు. అనగా ప్రాణము మాత్రముండి వినుట చూచుటమున్నగు లక్షణములు లేని *'శవము'* వలె నతడు వ్యర్థుడు. వైశాఖమున శ్రీహరిని యెట్లైనను సేవింపనివాడు పందిజన్మనెత్తును. 


పవిత్రమైన వైశాఖమాసమున వైశాఖవ్రతమును పాటించుచు ప్రాతఃకాలమున బహిస్నానము చేసి తులసీదళములతో శ్రీమహావిష్ణువు నర్చించి విష్ణు కధాశ్రవణము దానము చేసినవారు మరు జన్మలలో మహారాజులై జన్మింతురు. పిమ్మట తమ వారందరితో గలసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యము నందుదురు. శ్రీ మహావిష్ణువును నిశ్చలమైన మనస్సుతో సగుణముగనో నిర్గుణముగనో భావించి పూజింపవలయును సుమా.




_*వైశాఖ పురాణం నాలుగవ అధ్యాయం సంపూర్ణం*_

Awesome question

 *Awesome question. Awesome answer ..* 😳


*Question* - How many people are worried about BSNL?

 Answer - Everyone.

*Question* - How many people use BSNL's SIM?

 Answer: None.


 Question - How many people worry about government school?

 Answer - All.

*Question* - How many people have children in government school?

 Answer: None.


Question - How many people want a polythene free environment?

 Answer - All.

*Question* - Who does not use polythene?

 Answer - All do.


 Q: Who wants a *corruption-free India?*

 Answer - All.

 Question - How many people did not *pay* bribe for their selfishness?

 Answer - Everybody has given a bribe in some form or the other.


*Question* - How many people worry about falling rupee?

 Answer - All do.

 Question - How many people buy only indigenous goods?

 Answer: None.


 Q: Who is unhappy with the deteriorating traffic conditions?

 Answer - All.

 Question - Who follows 100% traffic rules?

 Answer: None.


 Question - Who wants change?

 Answer - All.

 Question - How many people want to change themselves?

 Answer: None.


 *Question - Who is unhappy with Modi?*

 *Answer - All.*

 *Question - Who wants Congress Government?*

 *Answer - None.*


🤣🤣🤣🤣🤣🤣🤣🤣

గోవింద * నామం ఎలా వచ్చింది

 శ్రీనివాసుడికి * గోవింద * నామం ఎలా వచ్చింది.........!!


గోవు...!..ఇందా.. ! [గోవు + ఇందా = గోవిందా] !


*కలౌ వేంకట నాయక:" అన్నట్లు , కలి యుగానికి ఆరాధ్య దైవం వేంకటేశ్వర స్వామి . నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల ప్రమాణంగల »కలి యుగానికి» ఆదిదైవం «శ్రీ వేంకటేశ్వర స్వామి». 


ఈ యుగాది నందే, తానుండవలసిన చోటు "సప్తగిరి "అని ఎంచుకొని , తిరుపతి ప్రాంతానికి వచ్చాడట ! అప్పుడు అక్కడ చిర కాలంగా ఆశ్రమం ఏర్పరచుకొని , తపస్సు చేసుకుంటూ ఉన్న అగస్త్య మహర్షిని చూచి , "ముని పుంగవా! నేను వేంకట నాయకుణ్ణి . 


ఈ కలియుగానికి అధిపతిని. అందరికీ ఆరాధ్య దైవాన్ని. ఈ "సప్తగిరి "మీద నివసిద్దామని వచ్చాను .రోజూ క్షీర సేవనం చెయ్యడానికి నాకు ఒక గోవునిస్తావా?" అని అడిగాడు . ఋషి ఆ మాటలు విని పులకించి పోయాడు . "ఓహో ! ఏమి నా భాగ్యం ? సాక్షాత్తూ వేకటేశ్వర స్వామియే వచ్చి ,నన్ను గోవునిమ్మని అడగ వచ్చాడా ?" అని ఆనందిస్తూ . 


అప్పుడాశ్రమంలో ఉన్న గోవులు మేతకై అడవిలోకి వెళ్ళడం చేత , అగస్త్యుడు చేతులు మోడ్చి , "స్వామీ !అలాగే ! నీకు గోవును తప్పకుండా ఇస్తాను. నీవు నివసించే స్థలం " ఫలానా "అని ఎంచుకున్నావే కానీ, నీపు ఇంకా రాలేదు కదా! మా అమ్మతో కూడా [శ్రీ మహాలక్ష్మితో] కలసి వచ్చిన నాడే, నీకిస్తాను" అని , అన్నాడు . అందుకు ఆనందించిన స్వామి అలాగే కానిమ్మని , అంతర్హితుడయ్యాడు . మరి కొన్నాళ్ళకి , లోక మాత అయిన లక్ష్మీదేవితో కూడి , ఇక యుగాంత పర్యంతం ,స్థిర నివాసం ఏర్పరచుకోటానికి వచ్చినప్పుడు , మళ్ళీ అగస్త్యాశ్రమానికి వచ్చాడు . అప్పుడు అగస్త్యఋషి అక్కడ లేడు .

 శిష్యుడెవరో ఉంటే వెంకన్నస్వామి ఈమాటే అతనితో చెప్పాడు. 

అతను "అలాగే ! స్వామీ !మా గురువుగారెక్కడికో వెళ్ళారు, రాగానే , చెబుతానన్నాడు. స్వామి వెనుదిరిగాడో లేడో ! అగస్త్య మహర్షి తన ఆశ్రమానికి వచ్చాడు. వెంటనే శిష్యుడు గోవు విషయం చెప్పి "అడుగో !స్వామి !" అని అటుగా చూపించాడు ". అలాగా ! దేవ దేవుడు నా ఆశ్రమానికి వచ్చిన సమయానికి నేను లేకపోవడం ఎంత దురదృష్టం ! " అని ఏంతో మదిలో నొచ్చుకుంటూ , పాకలో ఉన్న గోవు నొకదానిని కట్టు విప్పి , గబగబా వేంకటేశ్వరుని వెంటబడి ,"గోవు+ఇందా !" "గోవు+ఇందా !" అని కేకలు వేసుకుంటూ, వెనకాలే వెళ్ళాడు . 'ఇందా 'అంటే "ఇదిగో ! తీసుకో ! " అని అర్ధం కాబట్టి , మునీంద్రుడు ఎలుగెత్తి , " గోవిందా ! గోవిందా !" అని అరుస్తూ , వెంటబడి వెళుతూనే ఉన్నాడు . శిఖరాగ్రానికి చేరే సరికి , నూటెనిమిది సార్లు ముని , "గోవిందా ! గోవిందా ! " అని కేకలు వేశాడు . అప్పుడు స్వామి వెనుదిరిగి , "మునీంద్రా ! గో...విదిగో ! తీసుకో ! అనే అర్ధంతోనే అయినా, నన్ను నీవు "గోవిందా ! గోవిందా! "అని నూటెనిమిది సార్లు నన్నుద్దేశించి అన్నావు కాబట్టి, గోవిందుడనేది, నా నామాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

"నాకీ "గోవింద" నామం ఎంతో ప్రీతి పాత్రమయ్యింది కూడా ! నీలాగే ఈ కొండనెక్కే నా భక్తులు, నన్నుద్దేశించి , "గోవిందా ! గోవిందా! "అని నూటెనిమిది సార్లు పలికితే, వాళ్ళకి మోక్షమిస్తాను " అని వాగ్దానం చేసి, అగస్త్యుడిచ్చిన గోవును ఆప్యాయంగాస్వీకరించాడు.

కనుకనే, ఏడుకొండల స్వామిని దర్శించే భక్తులు "ఏడు కొండల వాడా ! వెంకట రమణా ! గోవిందా ! గోవిందా ! అడుగు దండాల వాడా ! గోవిందా ! గోవిందా ! ఆపద మ్రొక్కుల వాడా ! గోవిందా !గోవిందా ! అని నోరారా పిల్చుకుంటూ , స్వామి సేవ చేసుకుంటూ ఉంటారు భక్తులు. గోవింద నామ స్మరణం చేస్తేనే ఆ స్వామికి ప్రీతి కదా ! సహస్ర నామాలున్న ఆ వేంకటేశ్వర స్వామిని ఇలా "గోవిందా !గోవిందా !" అనే గోవింద నామార్చనతో పిలుస్తూ నేటికీ భక్తులు తరిస్తున్నారు కదా !!!

ఇదండీ గోవింద నామ ఆవిర్భావ రహస్యం.

కొత్త యుద్ధం

 *🦌🦌కొత్త  యుద్ధం👇*


 *సింహం ఆహారం లేకుండా 14 రోజులు మాత్రమే బ్రతకగలదు*


*అది ఒక జింకల వనం. అందులో జింక జాతులు ఆనందంగా నిర్భయంగా జీవిస్తున్నాయి .*


*ఒకసారి ఆ వనం నుంచి ఒక జింక దారితప్పి వేరే అడవిలోకి వెళ్ళింది. అక్కడ దానికి ఎన్నో కొత్త కొత్త జంతువులు, తోడేళ్ళను, పులులను, సింహాలను, నక్కలను తొలిసారి అక్కడే చూసింది.*


*అక్కడ ఒక కొమ్ముల జింక ఎదురై " ఓ జింక సోదరా ఈ అడవిలో నిన్నెప్పుడూ చూడలేదే " అంది.*


*"అవును మాది జింకలవనం " అంది.*


*" ఈ అడవి మీ జింకల వనం లాంటిది కాదు. ఇక్కడ మనల్ని చంపి తినే క్రూర మృగాలు ఉన్నాయి. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో మీకసలు తెలియదు. కాబట్టి ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపో " అంటూ ఆ జింక గెంతుతూ వెళ్ళి పోయింది.*


*" పిరికి జింక నేనూ జింకనే అదెలా తప్పించుకుందో నేనూ అలాగే తప్పిచుకోగలను " అనుకుంటూ జింకల వనం జింక ముందుకు వెళ్ళింది.*


*అక్కడ చెట్టు కింద నిద్రపోతున్న సింహం కనిపించింది. జింక చిన్నగా దాని దగ్గరికి వెళ్ళి తన ముందరి గిట్టతో సింహం తోక తొక్కింది .*


 *సింహానికి మెలకువ వచ్చింది. బద్దకంగా లేస్తూ జింకను చూసి గర్జించింది. ఆ గర్జన విని జింకకు గుండె ఆగినంత పనయింది .*


*వెనుదిరిగి వచ్చిన దారినే పరుగు పెట్టింది. అడవిని దాటి జింకల వనం వైపు పరుగు తీస్తూనే  వుంది. జింకల వనం సమీపానికి రాగానే సింహానికి చిక్కింది. సింహం దాన్ని చంపి చీల్చి ఆరగించింది .*


 *తరువాత సింహం లేచి మెల్లగా జింకల వనంలోకి వెళ్ళింది. దానికి అది క్రొత్త ప్రదేశం . అక్కడ దానికి గుంపులు గుంపులుగా జింకలు కనిపించాయి. సింహం ఆనందానికి అంతు లేదు. దొరికిన జింకను దొరికినట్టు చంపి తినేస్తుంది .*


*కొత్తగా ముంచుకొచ్చిన ఈ మృత్యువును చూసి జింకలన్నీ భయపడి పోయాయి.* *చెల్లాచెదురు అయ్యాయి. పొదల్లో దాక్కున్నాయి. బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నాయి .*


*పొ‌రపాటున ఏ జింకయినా బయటికొస్తే చాలు సింహం దాన్ని పడగొట్టేస్తుంది .*


*అయితే ఆ జింకల్లో తెలివయిన కుర్ర జింక ఒకటుంది. దాని పేరు జ్ఞాన నేత్ర. జింకల పెద్దలు జ్ఞాన నేత్ర దగ్గరికి వచ్చి "దీనికి పరిష్కార మార్గం ఏమిటి " అని అడిగాయి.*


*" జింక పెద్దలారా నేనూ అదే ఆలోచిస్తున్నాను. ఈ క్రూర జంతువును ' సింహం ' అని అంటారు. దీని పంజా నుంచి తప్పించుకొనే చాకచక్యం మనకు లేదు.*

*ఎటు ఆలోచించినా. . ఎంత యోచించినా ఒకే ఒక్క దారి కనిపిస్తుంది.*


*ఈ సింహం ఆహారం లేకుండా*

*14 రోజులు మాత్రమే బ్రతక గలదు. కానీ మనం 21రోజులు బ్రతకగలం.*


*కాబట్టి మన జింకలన్నీ తమ పొదల్లోకి దూరి 14రోజులు బయటకు రాకుంటేచాలు దాని పీడ మనకు విరగడౌతుంది. మనలో ఎవరైనా నిర్లక్ష్యంతో బయటకు వచ్చి దానికి చిక్కారా దాని జీవిత కాలం మరో 14 రోజులు పెంచినట్లే.*


*ఈ రోజు అమావాస్య ఇప్పుడే పొదల్లోకి దూరిపోదాం. పున్నమి నాటికి బయటకు వద్దాం. తమ పొదల నుండి బయటకు రాకుండా చూసే బాధ్యత ఆ జింకల పెద్దలదే" అంది.*


*జింకలన్నీ జ్ఞాన నేత్రం మాటలు విన్నాయి. ఆకలితో అలమటించాయి.*


*పున్నమి వచ్చింది. జింకలన్నీ ఒక్కొక్కటే భయం భయంగా బయటకు వచ్చాయి. వనం మధ్య చెట్టు కింద చచ్చి పడి ఉన్న సింహాన్ని చూశాయి. ఆనందంతో అరిచాయి, గెంతాయి. జింకల కేరింతలతో వనం అంతా పులకరించింది.*

పంచతంత్రం నుండి సేకరణ💐

ఇది ప్రస్తుత పరిస్థితులకు కరెక్టుగా సరిపోయింది కదా.. 

అందుకే..🌹


*ఇంట్లోనే ఉండండి* 

*కరోనా రక్కసి పనిపట్టండి*👍


మనం జింకలకన్నా తెలివైనవాళ్ళమేగా !!?🤔🙏🙏🙏

*కరోనా ఎందుకొస్తోంది

 *Please read fully and know how to get immunity  - If like Please share among your near & dear relatives & friends . BUT READ FULLY ALREADY UNDER LOCKDOWN* : - 


+++


*కరోనా ఎందుకొస్తోంది? ఎవరికొస్తోంది?*



ప్రతిరోజూ ఎంతోమంది తెలిసినవాళ్లు పోతున్నారు. ప్రతిరోజూ ఎన్నో చావు వార్తలు వింటున్నాం. ఎక్కడ చూసినా భయం రాజ్యమేలుతోంది. రేపేం జరుగుతుందో ఎవరికీ తెలియడంలేదు. ఇదంతా చూస్తూ, "అసలు కరోనా ఎందుకొస్తోంది?" అన్న ప్రశ్న ఎవరినడిగినా ఒకటే చెబుతారు.


'వైరస్' వల్ల వస్తున్నది'


చాలామంచి జవాబు.


'మరి వైరస్ అందర్నీ  కాటేయడం లేదేంటి?'


'ఇంట్లో జాగ్రత్తగా ఉంటే రాదు'


 ఇది కూడా చాలామంచి జవాబే. 


'మరి ఇంట్లో ఉన్నవాళ్లకు కూడా చాలామందికి వస్తోంది కదా? ఇదేంటి?'


'గాలిలో వస్తోంది'


అదే గాలిని అందరూ పీలుస్తున్నారు కదా? మరి అందరికీ రావడం లేదెందుకు?


'రోగనిరోధకశక్తి లేనివాడికి వస్తోంది'


'రోగనిరోధకశక్తి ఎందుకు తగ్గుతోంది?


'తెలియదు'


ఇప్పుడు ఇంకో కోణం చూద్దాం. 


'మా మామయ్య కూరగాయలకని మార్కెట్టుకి వెళ్ళొచ్చాడు. అక్కడ సోకింది'


*మరి అక్కడే ఉంటూ, రోజంతా కూరగాయలు అమ్ముతున్నవాడికి ఎందుకని రావడం లేదు*?


నో ఆన్సర్


'మా బాబాయి పాలప్యాకెట్ కని బయటకెళ్ళి వైరస్ కొనితెచ్చుకున్నాడు'


*'మరి రోజంతా అదే షాపులో పాలప్యాకెట్లు అమ్ముతున్నవాడికి ఎందుకని రాలేదు?*'


మళ్ళీ నో ఆన్సర్


'మా నాన్న వద్దంటున్నా వినకుండా బయటకెళ్ళి మామిడిపండ్లు కొన్నాడు. అక్కడ సోకి ఉంటుంది'


*రోజంతా ఎండలో రోడ్డుపక్కన కూచుని పండ్లు అమ్ముతున్న ఆమెకు ఎందుకని కరోనా సోకలేదు?*


మళ్ళీ నో ఆన్సర్


చివరకు ఇలా జవాబు వస్తుంది.


*కాయకష్టం చేసేవాళ్లకు రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకని వాళ్లకు రాదు'*


ఏతావాతా తేలిందేమిటి? ఎవడికైతే రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటున్నదో వాడికి కరోనాయే కాదు.  ఏ వైరసూ సోకదు. ఏ బాక్టీరియా సోకదు. ఏమీ కాదు. డా || హన్నేమాన్ ఈ మాటను రెండు వందల ఏళ్ళక్రితం చెప్పాడు. ఆయుర్వేద సృష్టికర్తలైన ఋషులు వేల ఏళ్ళనాడే ఈ మాటను చెప్పారు. అంతేగాక ఏమేం చేస్తే, ఎలా బ్రతికితే, రోగనిరోధకశక్తి బాగుంటుందో కూడా చెప్పారు. ఏం చేస్తుంటే అది క్షీణిస్తుందో కూడా చెప్పారు. వినేవారేరీ? వింటే, జనం పోగుచేసుకుంటున్న చెడుకర్మను ఎవడనుభవిస్తాడు? అందుకే మంచి చెప్పినా ఎవడూ వినడు. వినలేడు. విన్నట్టు విని వదిలేస్తాడు గాని ఆచరించలేడు. కనుక వాడి ఖర్మ వాడిని వెంటాడుతుంది. గొంతు పట్టుకుంటుంది. తీసుకుపోతుంది. అదంతే !


ఇప్పుడు విషయంలోకొద్దాం.


*నేనింతవరకూ ఓవెన్ ను కొనలేదు. ఎందుకో తెలుసా? దానివల్లనే అమెరికాలో పెద్దప్రేగు కాన్సర్ వస్తున్నదని గ్రహించాను గనుక. నేనమెరికాలో ఉన్నపుడు ఒక విషయం గ్రహించాను. అమెరికాలో పొట్ట కేన్సర్లు చాలా ఎక్కువ. ఎందుకని?*


వినండి మరి.


*స్టోర్స్  లో ఉన్న మాంసం ఎన్నో రోజులనుంచీ డీప్ ఫ్రిజ్ లో ఉంటుంది. మైనస్ డిగ్రీలలో ఉంటుంది.  దాన్ని తెచ్చి, ఓవెన్లో పడేసి ఒకేసారి 160 ఫారెన్ హీట్ దాకా వేడిచేసెసి తింటారు. ఒకేసారి అంత టెంపరేచర్ తేడా వస్తే ఆ మాంసంలో ఏమౌతుంది? పైగా, మంటపైన, కుండలో వండితే జరిగే ప్రక్రియ వేరు. అక్కడ ఆక్సిజన్ పుష్కలంగా ఉంటుంది.  ఓవెన్ లో ఏ ఆక్సిజన్ ఉంటుంది? ఒక ఉదాహరణ చెప్తాను, వినడానికి అసహ్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం*. 


*చనిపోయిన శవాన్ని మార్చురీలోని కోల్డ్ స్టోరేజిలో ఉంచడానికి, మాంసాన్ని, కూరగాయలను ఫ్రిజ్ లో ఉంచడానికి తేడా ఏంటి? అలాంటి శవాలను తెచ్చి, కనీసం వాటిని కట్టెలమీదకూడా ఉడికించకుండా, ఆక్సిజన్ లేని, అదసలు అవసరంలేని, మైక్రో వేవ్స్ క్రింద ఓవెన్లో ఉడికిస్తే ఏమౌతుంది? వాటిల్లో ఏయే మార్పులొస్తాయి? తినేవాడికి   కాన్సర్లు రాక ఏమౌతుంది? చెప్పండి.*


ఈరోజుల్లో, ఏ పూటకాపూట, ఏరోజు కూరగాయలను ఆరోజున వేడివేడిగా వండుకుని, ఏపూట అన్నం ఆపూట వేడిగా వండుకుని ఎవరు తింటున్నారు? చెప్పనా? *రోజుకూలీలు తింటున్నారు. కాయకష్టం చేసుకునేవాళ్ళు తింటున్నారు. వాళ్ళు ఏరోజుకు ఆరోజున కూరగాయలు తెచ్చుకుంటారు. మంటమీద వండుకుని తింటారు. ఓవెన్ వాడరు. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు. సుఖానికిపోయే సంపన్నులు, ఫ్రిజ్ లో వారాల తరబడి ఆహారాన్ని మురగబెట్టుకుని తినేవాళ్లు, ఓవెన్లు వాడేవాళ్లు రోగాల పాలౌతున్నారు. ఇన్ని సౌకర్యాలున్నప్పటికీ వంట చెయ్యదానికి బద్ధకిస్తూ, పొద్దున్నే ఒకేసారి అన్నీ వండిపారేసి, వాటినే రాత్రికి పెట్టుకుని తినేవాళ్లు రోగాలపాలౌతున్నారు.*


జొమాటోలో ఆర్డర్ చేసి తెప్పించుకుని లొట్టలేసుకుంటూ మింగే తిండిలో ఏముంటుందో మీకు తెలుసా? అదెప్పటి ఆహారమో మీకు తెలుసా? ఈ రోజున మిగిలిపోయిన ఫుడ్ ని ఏ హోటలువాడూ పారెయ్యడు. రేపు, ఎల్లుండి, ఎంతవరకూ దానిని ఉంచగలిగితే అంతవరకూ ఫ్రిజ్ లో ఉంచి, *ఓవెన్లో ఇన్స్టంట్ గా వేడిచేసి మీకు పంపిస్తాడు. ఆ కుళ్లిపోయిన వేడివేడి ఆహారాన్ని లొట్టలేసుకుంటూ మీరు మింగుతారు.* దానికితోడు, వాడు ఫ్రీగా ఆఫర్లో పంపించే కూల్ డ్రింక్ ఉండనే ఉంటుంది. *అది యాసిడ్*. ఇక మీకు రోగాలు రాక ఏమౌతాయి మరి?


*యాసిడ్ తో కడగాల్సింది టాయిలెట్ ని. పొట్టని కాదు. ఆఫ్కోర్స్, ఈ రోజుల్లో టాయిలెట్ కమోడ్ కీ మన పొట్టకీ పెద్ద తేడా ఉండటం లేదనుకోండి. ఇంకా చెప్పాలంటే కమోడే శుభ్రంగా ఉంటోంది. ఎప్పటికప్పుడు క్లిన్ చేస్తాం కాబట్టి.  మన పొట్టే దానికంటే అసలైన దరిద్రం* !


ప్రతిరోజూ చెమటపట్టేలాగా వ్యాయామం ఎవరు చేస్తున్నారు? ఏసీ జిమ్ముల్లో అమ్మాయిలూ అబ్బాయిలూ ఒకరినొకరు చూసుకుంటూ కులుక్కుంటూ ఎగరడం కాదు. చక్కటి ఎండలో, ఆరుబైట గాలిలో ఎవరు వ్యాయామాలు చేస్తున్నారు? ఆ చేసే వ్యాయామాలు మాత్రం ఏమిటి? కండలు పెంచే జిమ్ము వ్యాయామాలు. అవి రోగనిరోదకశక్తిని పెంచగలవా? లేవు. ఏడాదిపాటు పెంచిన కండలు, ఒక్క జ్వరంతో కరిగి వేలాడటం మొదలుపెడతాయి. మరెందుకవి? మనదైన యోగాభ్యాసాన్ని శుద్ధంగా చేస్తున్నవారెందరు?


*అసలు కనీస వ్యాయామమంటూ ఏదో ఒకదాన్ని ఏడుస్తున్నవారెందరు? ఎవరూ లేరు. పొద్దున్న పదింటికి నిద్ర లేవడం, ఆ సోఫాలోనో, బెడ్ మీదనో రోగిష్టిలాగా పడుకుని, టీవీనో, మొబైల్ నో చూస్తూ, ఫోన్లో సొల్లు వాగుతూ  ఉండటం, టైమైతే జొమాటో ఆర్డర్ పెట్టడం, తిని మళ్ళీ మొబైల్లోకి చూస్తూ పడుకోవడం. లేకపోతే ఆ ఫ్రిజ్ లో కుక్కిన పదిరోజులనాటి చెత్తను మింగడం.  ఇది మన దినచర్య. ఇక రోగాలు రాక మరేమొస్తాయి*?


ఏదో రోగం వచ్చినపుడు కూడా ప్రకృతిసిద్ధమైన మందులు వాడకుండా, సింథటిక్ ముందులు వాడటం. అక్కడకూడా డబ్బులు పారేసి పెద్ద ఆస్పత్రిలో చేరి దేహాన్ని వారికి అప్పజెప్పడం. అదృష్టం బాగుంటే ప్రాణంతో తిరిగి రావడం, లేదా శవంగా బయటకు రావడం. దహనం కూడా ఎలక్ట్రిక్ క్రిమటేరియంలో. ఇదీ మన బ్రతుకు.


వినడానికి అసహ్యంగా ఉంటుందని ముందే చెప్పాను. ఎప్పుడైనా చూశారా మీరు? మామూలుగా దహనం చేసిన  శవం బూడిద ఎలా ఉంటుందో? తెల్లగా ఉంటుంది. ఎలక్ట్రిక్ క్రిమటేరియంలో వచ్చే బూడిదను ఎప్పుడైనా చూశారా? నల్లగా ఉంటుంది. ఆక్సిజన్ లేకుండా పెనంమీద అట్టు మాడినట్లు శవం అందులో మాడిపోతుంది. అది అసహజ ప్రక్రియ . బ్రతికున్నపుడూ అసహజంగా బ్రతకడం, చావులో కూడా అసహజమే. ఇది మానవజాతి  చేతులారా చేసుకుంటున్న ఖర్మ కాకపోతే మరేంటి? 


*సినిమాలు చూసి, ఫుడ్ కంపెనీల యాడ్స్ మాయలో పడి, మోడరన్ లైఫ్ ఉచ్చులో ఇరుక్కుని మనుషులు సర్వనాశనం అవుతున్నారు. అవండి. మిమ్మల్ని ఎవడూ కాపాడలేడు.*


*అసలు మన దేశంలో ఫ్రిజ్ ఎందుకు? అవసరమా? మనకు ఓవెన్లెందుకు? అవసరమా? మనకు జొమాటోలెందుకు? అవసరమా? అమెరికావాడి తిండి మనకెందుకు? అవసరమా? రోజంతా కదలకుండా పందుల్లాగా పడుకుని టీవీలు, మొబైళ్ళు చూడటం మనకెందుకు? అవసరమా? అర్ధరాత్రిళ్ళు, తెల్లవారుఝామున నానాచెత్త తిండి తినడం అవసరమా? ఏదీ అవసరం లేదు. ఇదేదీ సహజం కాదు. మరి ఇన్ని అసహజములైన పనులు, ప్రకృతికి వ్యతిరేకమైన పనులు ప్రతిరోజూ చేస్తూ, మన రోగనిరోధకశక్తి గట్టిగా ఉండాలంటే ఎలా ఉంటుంది*?


పోనీ మనసన్నా శుద్ధంగా ఉంటున్నదా మనకు?


*ఓర్వలేనితనం, కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, కోపాలు, అహంకారాలు, గర్వాలు, ధనమదం, కులగర్వం, ఆశ, నాటకాలు, వేషాలు, పొగరు, లెక్కలేనితనం, అన్నీ నాకే తెలుసన్న మదం ఇలా చెప్పుకుంటూ పోతే  ఎన్నో ఎన్నెన్నో మన మనస్సులో ఉన్న దయ్యాలు.*


ఒళ్ళూ కుళ్లిపోతూ, మనసూ కుళ్లిపోతూ, పైకిమాత్రం 'అంతా భలేబాగుంది' అనుకుంటూ  మొహానికి మాత్రం క్రీములు పూసుకుంటూ, ఒళ్ళు అందరికీ చూపించుకుంటూ బ్రతుకుతున్న  ఇలాంటి స్థితిలో కరోనా ఎందుకు? గట్టిగా ఒక చిన్న గాలివీస్తే చాలు మనం నేలకూలిపోవడానికి.


ఏవిధంగా మనం ఆరోగ్యవంతులం అసలు?


మనల్ని చంపడానికి కరోనాయే అవసరం లేదు. చిన్న సూది గుచ్చుకుంటే కూడా, కుప్పకూలిపోయి, ప్రాణాలు పోయే రోజులు ముందున్నాయి. కూచున్నవాడు కూచున్నట్టు, నుంచున్నవాడు నుంచున్నట్టు, నడుస్తున్నవాడు నడుస్తూనే చనిపోయే రోజులు ముందున్నాయి. *బ్రహ్మంగారు వ్రాసినది అబద్ధం కాదు ! కాకపోతే బ్రహ్మంగారి గుడి కట్టించి పూజించేవాడు కూడా ఆయన చెప్పినట్టు బ్రతకడం లేదు*. ఆయన ఏదైతే వద్దన్నాడో అదే చేస్తున్నాడు. మళ్ళీ ఆయన భక్తుడినని చెప్పుకుంటున్నాడు. అదీ అసలైన వింత !


బుద్ధి కర్మానుసారిణి. ఎవడాపగలడు? ఎవడెన్ని చెప్పినా, ఎంత మంచిని చెవిలో వినిపించినా, ఎవడూ వినడు. ఆచరించడు. పోగాలం వచ్చినపుడు ఇలా ఉండక ఇంకెలా ఉంటుంది?


*కానివ్వండి.*



*OM SRI SAIRAM*

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 

*అష్టైశ్వర్యాలు..అష్టసిద్ధులు..*


*(ఇరవై ఎనిమదవ రోజు)*


శ్రీ స్వామివారు ఏదైనా సమస్యలుంటే చెప్పమని అడగటం..శ్రీధరరావు గారు సున్నితంగా తిరస్కరించడం జరిగిన తరువాత..ప్రభావతి గారు మాత్రం..తమకున్న సమస్యలను శ్రీ స్వామివారి దృష్టికి తెచ్చి..పరిష్కారం పొందాలని తహ తహ లాడారు.. శ్రీధరరావు గారు హుందాగా వారించారు..


కానీ..ఆ ప్రక్కరోజు సాయంత్రం శ్రీ స్వామివారు మళ్లీ అదే మాట అడిగారు..ఆ సమయంలో శ్రీధరరావు గారి తల్లిగారు, శ్రీధరరావు దంపతులు మాత్రమే వున్నప్పుడు.."అమ్మా!..మీరిద్దరూ నా తపస్సుకు ఎంతో సహకరిస్తున్నారు..మీ మనసులో ఏదేని కోరిక వుంటే చెప్పండి.." అని..ప్రత్యేకంగా ప్రభావతి గారి నుద్దేశించి.."ఏమి కావాలో చెప్పు తల్లీ!.." అన్నారు..శ్రీధరరావు గారు కొద్దిగా అసహనంతో.."ప్రభావతీ పిచ్చి పిచ్చి కోరికలు కోరకు!..అనవసరంగా మాట్లాడకు!.." అన్నారు..


శ్రీ స్వామివారు.."అమ్మను కోప్పడకండి శ్రీధరరావు గారూ..నేను బిడ్డలాంటి వాడిని..నాతో చెప్పుకోనియ్యండి.." అన్నారు..


"నాయనా!..మేము గృహస్థులము..ఎన్నో సమస్యలుంటాయి..అన్ని అవసరాలూ ధనం తో ముడిపడినవే!..బాధ్యతలు నెరవేర్చాలన్నా ఆర్ధిక పరమైన ఇబ్బందులు తప్పవు..ఆ చిక్కులు తొలగించమని దైవాన్ని కోరడం తప్పా?.." అన్నారు ప్రభావతి గారు..శ్రీధరరావు గారు వారిస్తున్నా ఆవిడ అడగదల్చుకున్నది అడిగేశారు..


శ్రీ స్వామివారు చిరునవ్వుతో.."అమ్మా!..నీ సందేహనివృత్తి చేస్తాను!..శ్రద్ధగా వినండి!.." అంటూనే అలౌకిక దృష్టిలోకి వెళ్ళిపోయి..


"గృహస్థులకు నిత్యమూ ధనంతో అవసరమే!..వారి వారి బాధ్యతలననుసరించి డబ్బుతో అవసరాలుంటాయి..అయితే అవసరం వేరు..ప్రలోభం వేరు..అత్యాశలు వేరు!..అయితే..అమ్మా..నీ యింటి ఆవరణలో నీవు పెంచిన పారిజాతాలు, మందారాలు..ఇతర పూలమొక్కలు..ఇంటికి ఆనుకొని ఉన్న అశ్వద్దవృక్షం..ఆ వృక్షం కొమ్మ కొమ్మకూ ఆవాసం ఏర్పరచుకొని కీలకిలారావాలతో సందడి చేస్తున్న ఎన్నో రకాల పక్షులూ..నిర్మలమైన గాలి..వెలుతురు..కమ్మని పాడి..నిత్యమూ ఇంటికొచ్చే అతిధులూ..ఇవన్నీ భగవంతుడు నీకిచ్చిన ఐశ్వర్యాలు కదా తల్లీ..పూలు, పక్షులూ..అతిధులూ..ఇవన్నీ ఐశ్వర్యాలని ఎలా భావిస్తామని ఆలోచిస్తున్నావా?..అసలు అష్టైశ్వర్యాలు అంటే ఏమిటో చెప్పు తల్లీ!..అర్ధం చెప్పు!.." అన్నారు..


"ధనం..ధాన్యం..పాడి..పంట..వగైరాలు..నాయనా!.." అన్నారు ప్రభావతి గారు..


"ఆ 'వగైరా' అంటే ఏమిటమ్మా?..దాని అర్ధమేమిటో ఆలోచించావా ఎప్పుడైనా?.." అన్నారు శ్రీ స్వామివారు..


ఆమాటకు అర్ధమేమని చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయారు ప్రభావతి గారు..


"నేను చెపుతాను శ్రద్ధగా విను తల్లీ!..అష్టైశ్వర్యాలు అనగానే..ధనము, పెద్ద మేడలు.. నగలు..హోదా..పదవి..ఇలా ఎవరికి వారు వారికి తోచిన అర్ధం చెప్పుకుంటారు..కానీ నిజమైన ఐశ్వర్యం ఏమిటో తెలుసా..భగవంతుడి కరుణ!..ఈ సర్వసృష్టినీ క్షణమాత్రంలో సృష్టించి..క్షణంలో రక్షించి..మరుక్షణంలో లయింపచేసే ఆ దైవం యొక్క కరుణ కిరణం ఒక్కటి వుంటే..ఆ జీవికి ఇక అందని ఐశ్వర్యం లేదు!.."


"రాక్షసులు త్రిలోకవిజయం, అతి భోగలాలస కోసం తీవ్ర తపస్సు చేస్తారు..తపస్సు వలన దైవం కరుణ జూపి..వాళ్ళు కోరిన కోర్కెలు..లేదా వరాలు ఇస్తాడు దైవం..కానీ వాళ్ళు అధర్మప్రవర్తన తో అన్నీ పోగొట్టుకుంటారు..చివరికి వాళ్ళ ప్రాణాలతో సహా!..మనుషులూ అంతే.. దేవుణ్ణి పూజించడం అంటే..కోరిక తీర్చటం కోసమే..డబ్బు, నగలు..పదవి..హోదా..కార్లు..బంగళాలు.. ఇలా వెంపర్లాడటం కోసం పూజిస్తారు..నూటికో.. కోటికో..ఒక్కరు నిష్కామంగా దైవాన్ని పూజిస్తారు..వారికే ముక్తి దొరుకుతుంది..వారికి అష్టైశ్వర్యాలు అరచేతిలో ఉంటాయి..కానీ వారు వాటిని తృణప్రాయంగా త్యాగం చేసి..ముక్తినే కోరుకుంటారు..వాళ్ళు ముక్తసంగులు..అవధూతలు..యోగులు..వారిని బాధిస్తే ఎలాంటివారికైనా చావుదెబ్బ దైవం చేతిలో తప్పదు.."


"ఇక మీ విషయం లోకి వస్తానమ్మా..నువ్వు చెప్పినట్లు గృహస్థులకు ఆర్ధిక బాధలు సహజం..ముందుగా నీ వద్ద ఉన్న ఐశ్వర్యాలు నీకు తెలుసా?.." అంటూ ఒక్కక్షణం ఆగారు..


అష్టైశ్వర్యాలు..అష్టసిద్ధులు..తరువాయి భాగం రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).