6, డిసెంబర్ 2024, శుక్రవారం

వ్యాపారాల్లో దేవతల పేర్లు వాడటం నిషేధించాలి.

 

 వ్యాపారాల్లో దేవతల పేర్లు వాడటం నిషేధించాలి. 

నిత్యం మనం అనేకచోట్ల దేవి దేవతల పేర్లతో వ్యాపారసంస్థలు ఉండటం చూస్తున్నాము. వ్యాపారవేత్తలకు భక్తి ఉంటే అది వారి దేముడి గది మటుకు ఉంచుకొని బయటకు రాకుండా చూసుకుంటే మన దేముళ్ళ పవిత్రత, పరిశుద్ధత, విలువలను కాపాడినవాళ్లు అవుతారు.  కానీ వారి మనస్సులో కల్మషం ఉన్నా  లేకపోయినా కానీ దేముళ్ళను వారి వారి వ్యాపారాల వరకు తీసుకొని వస్తే అది మన ధర్మానికి అవాంతరంగా మారే ప్రమాదం వున్నది. అది ఎట్లానో చూద్దాం. 

కొంతమంది సారా వ్యాపారాలు చేసే వారు వారి షాపులమీద " ధనలక్ష్మి వైన్స్" శంకర బ్రాందీ షాపు, వెంకటేశ్వర డ్రింక్స్, ఇలా అనేక దేముళ్ళ పేరులమీద ఈ రోజుల్లో వ్యాపారాల షాపుల మీద అమ్మవార్ల బొమ్మలతో సహా పేర్లు ఉండటం మనం అక్కడక్కడ చూస్తున్నాము. అటువంటివి చూసినప్పుడు ఏదో తెలియని మనసులో బాధకలుగుతుంది. ఈ విధంగా మనలో చాలామంది బాధపడి వున్నవార్లు వుంటారు. 

అదే విధంగా అనేక షాపులు కిరాణా షాపులు, ఫాన్సీషాపులు, ఇతర షాపులు, హోటళ్లవాళ్లు కూడా అనేక దేముళ్ళ పేర్లు, ఉపయోగించి వ్యాపారాలు చేస్తున్నారు. 

ఇక లారీ సంస్థలు కూడా భగవంతుని పేర్లతో వ్యాపారాలు చేస్తున్నారు. వీరాంజనేయ లారీ సర్వీస్, వెంకటేశ్వర ట్రాన్స్పోర్టు , కనకదుర్గ లారీ సర్వీసు. ఇలా అనేక పేర్లతో లారీలమీద వ్రాస్తున్నారు. అంతే కాక కార్లు, మినీ బస్సులు అద్దెకు ఇచ్చే వార్లు కూడా దేముళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు. 

పూజా సామానులు. 

అష్టలక్ష్మి దూప్ స్టిక్లు, అంబికా దర్బారుబత్తి ఉదుబత్తులు , ఇలా అనేక వస్తువులమీద దేవి దేవతల పేర్లు  కాకుండా దేవుళ్ళ బొమ్మలు  ముద్రిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి ఆలా వున్న అట్ట డబ్బాలను మనం చెత్తలో పారేయగలమా మీరే చెప్పండి. ఈ పోస్టుద్వారా అందరికి నేను తెలియచేసేది ఏమిటంటే సాధ్యమైనంతవరకు మన హిందూ దేవుళ్ళ పేర్లను, చిత్రాలను మీ మీ వ్యాపారాలకు ఉపోయోగించకండి. దాని బదులు మీకు నచ్చిన  వస్తువో  జంతువునో మీ వ్యాపారానికి వాడుకోండి. అది ఎట్లానో మీకు ఒక ఉదాహరణ తో చెపుతాను. మనలో చాలామందికి గతంలో హెచ్ యమ్ వి అనే గ్రామఫోను రికార్డులు ఉండేవి వాటి మీద ఒక కుక్క బొమ్మ ఉండేది. అదే విధంగా మనం అనేక జంతువులను, వస్తువులను వ్యాపారానికి పేర్లుగా చిహ్నాలుగా వాడుకోవచ్చు. 

మీకు ఈ పోస్ట్లు నచ్చితే అందరికి పంపి మన హిందూ ధర్మాన్ని కాపాడటం లో మీ వంతు  కృషి  చేయగలరు.

తిరుమల దర్శనంపై ఆర్టీసీ ప్రకటన:

తిరుమల దర్శనంపై ఆర్టీసీ ప్రకటన:

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో తిరుమలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం APSRTC బస్సుల్లో రోజుకు 1000 దైవ దర్శనం టిక్కెట్లు జారీ చేయబడ్డాయి.

  ఏబీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో తిరుమలకు వెళ్లే ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ సువర్ణావకాశం కల్పించారు.

  ఏబీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో తిరుపతికి వెళ్లే ప్రయాణికులు రూ.300 అదనంగా చెల్లించి బస్సులోనే ఎక్స్‌ప్రెస్ దర్శనం టికెట్ పొందవచ్చు.


  ఈ శీఘ్ర దర్శనం ప్రతిరోజూ ఉదయం 11.00 మరియు సాయంత్రం 4.00 గంటలకు నిర్వహించబడుతుంది.

  తిరుమల బస్టాండ్‌కు చేరుకున్నప్పుడు ఆర్టీసీ సూపర్‌వైజర్లు ప్రయాణికులకు శీఘ్ర దర్శనానికి సహకరిస్తారు.

  కావున తిరుపతికి వెళ్లే ప్రయాణికులు ముందుగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్స్‌ప్రెస్ దర్శనం టిక్కెట్లు పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.   APSRTC తిరుపతికి రోజూ 650 బస్సులను నడుపుతోంది.   ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యం ఉంది.   బెంగళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కోసం వచ్చే ప్రయాణికులకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.


 *చివరి అభ్యర్థన:*

  మీకు ఇది అవసరం లేకపోవచ్చు, కానీ మరెవరికైనా ఇది అవసరం, కాబట్టి దయచేసి షేర్ చేయండి.🙏🏻🙏🏻💐☺️☺️

S.ఫణికుమార్- నందిగామ

అష్ట భైరవ హోమం*

 *కాశికాపురాధినాథ కాలభైరవం భజే* 


 *అష్ట భైరవ హోమం* 

డిసెంబర్ 09 మరియు 23వ తేది అష్టమి సందర్భంగా...


కాలుడు అంటే యముడు. యముని పేరు వింటేనే లోకమంతా భయపడుతుంది. అలాంటి యముడిని సైతం భయపెట్టే మహిమ గల స్వామిగా శ్రీ కాలభైరవుడికి పేరు. సంసార బాధలతో సతమతమయ్యేవారు, అనారోగ్యాల బారిన పడ్డవారు, క్షుద్రశక్తుల విజృంభణతో నలిగిపోతున్న వారు శ్రీ కాలభైరవస్వామిని వేడుకుంటే సకల బాధలను హరింపజేసి భక్తులను రక్షిస్తాడని నమ్మకం.


అష్టమి నాడు ఎనిమిది భైరవ రూపాలను ప్రసన్నం చేసుకోవడం వల్ల మీ సమయ నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరచడానికి, రుణ భారం నుండి ఉపశమనం పొందడానికి, బహువిధి సామర్థ్యాలను మెరుగుపరచడానికి మరియు శ్రేయస్సు సాధించడానికి దేవతల అరుదైన ఆశీర్వాదాలు పుష్కలంగా లభిస్తాయి. 


 *హోమం మీ జీవితంలోని వివిధ అంశాలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది...* 


🔥 చెడు కర్మలను, పాపాలను తొలగిస్తుంది. 

🔥 శాపాలు, బద్ధకం మరియు ఉత్పాదకతను తొలగిస్తుంది.

🔥 అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు.

🔥 మీ శత్రువులను మరియు మీ చుట్టూ ఉన్న అన్ని ప్రతికూలతను నాశనం చేస్తుంది.

🔥 మంచి సమయం మీకు అనుకూలంగా ఉంటుంది, మీరు విజయం సాధించడంలో సహాయపడుతుంది.


పవిత్రమైన వారణాసిలోని ఒక యాగశాలలో తైలాభిషేకంతో పాటు పవిత్రమైన సిద్ధ స్వర్ణ ఆకర్షణ భైరవ హోమాన్ని వేద పండితులచే డిసెంబర్ 09వ తేది సోమవారం నాడు నిర్వహించబడును, మరియు ప్రధాన కాలభైరవ మందిరంలో నీలకంఠ పుష్పసమర్పణ సేవ జరుగును.


 *భక్తులు పరోక్ష సేవల్లో భాగంగా కాల భైరవ హోమంలో పాల్గొనండి.* 


పరోక్ష సేవలు జరిపించుకొనదలచిన వారు క్రింది లింక్ పై క్లిక్ చేసి రుసుము చెల్లించండి లేదా పైన పంపినటువంటి QR కోడ్ స్కాన్ చేసి 1,116/- రూపాయలు చెలించి సేవలు బుక్ చేసుకొనవచు. 


https://pay.upilink.in/pay/9700722711@ybl?am=1116


ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకోండి.


పరోక్ష సేవకై ఫోన్ పే, గూగుల్ పే, పే.టి.ఎమ్ ద్వారా చెల్లించినటువంటి రుసుము స్క్రీన్ షాట్ తీసి, సేవ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, గోత్రం, పూర్తి చిరునామా మరియు మీ సంకల్పం వివరంగా రాసి డైలీ విష్ వాట్సాప్ నెంబర్ 9700722711కు పంపవలసిందిగా కోరుచున్నాము.


హోమం నిర్వహించదల్చిన వారు ఈ కింది లింక్ ద్వారా వివరాలను నమోదు చేసుకోండి...


https://form.jotform.com/243391154407454


📌 *గమనిక :*  _శ్రీ కాలభైరవ హోమం_

1) డిసెంబర్ 09వ తేది సోమవారం శుక్లపక్ష అష్టమి నాడు

మరియు

2) డిసెంబర్ 23వ తేది సోమవారం కృష్ణపక్ష అష్టమి నాడు... నిర్వహించనున్నారు భక్తులు తమకు ఏ తేదీలో నిర్వహించుకోదల్చుకున్నారు నిర్ణయించుకొని వివరాలను నమోదు చేయండి.


*సనాతన సంస్కృతి సేవా సమితి*

వారణాసి ఉత్తర ప్రదేశ్

అజీర్ణవ్యాధి నివారణ

 అజీర్ణవ్యాధి నివారణా యోగాలు  -


 *  వస, సైన్ధవ లవణములను నీటిలో కలిపి తాగి తరువాత ధనియాలు , శొంటి కషాయం తాగుచున్న అజీర్ణవ్యాధి నివారణ అగును.


 *  ఇంగువ, శొంటి, పిప్పళ్లు, మిరియాలు , సైన్ధవ లవణం వీటిని నీటితో నూరి పొట్ట మీద పట్టు వేయుచున్న అజీర్ణవ్యాధి నివారణ అగును.


 *  సైన్ధవ లవణం, కరక్కాయ పైపెచ్చుల చూర్ణం , పిప్పళ్లు, చిత్రమూలం వీటి పొడిని ఆహారం తీసుకున్న అర్ధగంట తరువాత ఉదయం , సాయంత్రం వేడినీటితో తీసుకొనుచున్న అజీర్ణవ్యాది నశించును.


 *  శొంటి, పిప్పళ్లు, మిరియాలు , వాము , సైన్ధవ లవణం , నల్లజీలకర్ర, జీలకర్ర, పొంగించిన ఇంగువ సమాన భాగాలుగా తీసుకుని చూర్ణం చేసి భోజనంలో మొదటి ముద్ద తో ఒక స్పూన్ చూర్ణం , కొంచం నెయ్యి వేసుకొని కలుపుకొని తినవలెను . 40 రొజుల పాటు ఉదయం , సాయంత్రం తీసుకున్నచో అజీర్ణరోగం మాయం అగును. ఇక్కడ పొంగించిన ఇంగువ అనగా ఇంగువని ఒక గుంట గంటె లో వేసి వేడిచేస్తే పొంగును.


 *  ద్రాక్షాను చక్కర , తేనెతో కలిపి గాని ఎండించిన కరక్కాయ చూర్ణంను చక్కెర , తేనెతో గాని కలిపి తీసుకొనుచున్న కడుపులో ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వలన వచ్చు పుల్లటి తేపులు , అజీర్ణదోషాలు నివారణ అగును.


 *  చిత్రమూలం, చవ్యము, శొంఠి , పిప్పళ్లు, వాము వీటితో తయారుచేయబడిన గంజిని తాగుచున్న అజీర్తిని , శరీరంలోని వాతాన్ని నివారిస్తుంది. పొట్టని శుద్ది చేస్తుంది.


        అజీర్ణరోగమునకు ఔషదాలు తీసుకొనే ముందు ఉదరమును శుద్ది చేయు ఔషదాలను ముందుగా సేవించి ఉదరమును శుద్ది చేసుకుని అటు పిమ్మట అజీర్ణాన్ని పోగొట్టే  ఔషధాలను మొదలుపెట్టవలెను.


   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

శుక్రవారం*🌹 🪷 *06, డిసెంబర్, 2024.*🪷 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

         🌹 *శుక్రవారం*🌹

🪷 *06, డిసెంబర్, 2024.*🪷

       *దృగ్గణిత పంచాంగం*                  


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - శుక్లపక్షం*


*తిథి : పంచమి* మ 12.07 వరకు ఉపరి *షష్ఠి*

*వారం   : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం : శ్రవణం* సా 05.18 వరకు ఉపరి *ధనిష్ట*


*యోగం  : ధృవ* ఉ 10.43 వరకు ఉపరి *వ్యాఘాత*

*కరణం : బాలువ* మ 12.07 *కౌలువ* రా 11.39 ఉపరి *తైతుల* 


*సాధారణ శుభ సమయాలు*

 *ఉ 06.00 - 08.30 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *ఉ 06.58 - 08.33*

అభిజిత్ కాలం  : *ప 11.36 - 12.21*


*వర్జ్యం : రా 09.13 - 10.48*

*దుర్ముహూర్తం : ఉ 08.37 - 09.22 మ 12.21 - 01.06*

*రాహు కాలం : ఉ 10.35 - 11.59*

గుళికకాళం : *ఉ 07.47 - 09.11*

యమగండం : *మ 02.46 - 04.10*

సూర్యరాశి : *వృశ్చికం*

చంద్రరాశి : *మకరం*

సూర్యోదయం :*ఉ 06.23* 

సూర్యాస్తమయం :*సా 05.34*

*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు* 

ప్రాతః కాలం    :  *ఉ 06.23 - 08.37*

సంగవ కాలం    :    *08.37 - 10.51*

మధ్యాహ్న కాలం  :*10.51 - 01.06*

అపరాహ్న కాలం : *మ 01.06 - 03.20*


*ఆబ్ధికం తిధి   : మార్గశిర శుద్ధ షష్ఠి*

సాయంకాలం  :  *సా 03.20 - 05.34*

ప్రదోష కాలం   :  *సా 05.34 - 08.08*

రాత్రి కాలం : *రా 08.08 - 11.33*

నిశీధి కాలం       :*రా 11.33 - 12.25*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.41 - 05.32*

________________________________

        🌷 *ప్రతినిత్యం*🌷              

          *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


      🪷 *శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం*🪷


*న శస్త్రానల తోయౌఘా ద్బయం తస్య ప్రజాయతే /*

*దుర్వృత్తానాం చ పాపానం బహు హానికరం పరమ్ //*

                 

🪷 *ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః*🪷


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


        🌷 *సేకరణ*🌷

      🌹🌷🌹🌹🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🪷🪷🌹🌷

 🌹🍃🌿🪷🪷🌿🍃🌹

పాదాభివందనం

 ** *పాదాభివందనం ఎందుకు చేయాలి....!!*


🌹🙏పాదాభివందనం వలన…

          ప్రయోజనం ఏమిటి🌹🙏


🌸🌿🌸🌿🌸 


🌿శుభ కార్యాలలో పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలని, చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు.


🌸కేవలం శుభకార్యాల లోనే కాక, పెద్దవారు కనిపించనప్పుడు కూడా చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు. 


🌷అసలు పెద్దవారి పాదాలను ఎందుకు తాకాలి!🌷


🌿భారతీయ సంప్రదాయంలో, పెద్దవారి పాదాలను తాకడం అనేది గౌరవసూచికంగా ఉన్న పురాతన పద్దతి. 


🌸అయితే కొందరు, 

అడుగులను అపరిశుభ్రంగా  భావిస్తారు.


🌿పాదాలను తాకడం వెనుక ఎన్నో అద్భుత ప్రయోజనాలు, అర్ధవంతమైన సూచనలు, ఉన్నాయి.


🌸పెద్దవారి పాదాలను తాకాలంటే, మన అహంకారం వదిలి తల వంచాలి. 

అది పెద్దవారి వయసు, జ్ఞానం, విజయాలు, అనుభవాలను గౌరవించడంతో సమానం.


🌿సాధారణంగా పెద్దవారి పాదాలు తాకినప్పుడు, వారి ఆలోచనలు, స్పందనలు, వాటి నుండి వచ్చే పదాలు, చాలా శక్తివంతంగా ఉండటం వల్ల చిన్నవారికి ఎన్నో ఆయురారోగ్య ఐశ్వర్య విద్యా లాభాలు చేకూరుతాయి!


🌸పెద్దవారి పాదాలను తాకడానికి 

మన నడుము వంచి,  

మన కుడి చేతిని పెద్దవారి ఎడమ కాలిమీద పెట్టాలి.  


🌿అలాగే మన ఎడమ చేతిని పెద్దవారి కుడి కాలిమీద ఉంచాలి. 

అప్పుడు పెద్దవారి చేతులు, మన మీదఉంటాయి. 


🌸ఇలా చేయడం వల్ల ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఆకారాన్ని సంతరించుకుంటుంది. 

ఆ సమయంలో పెద్దవారి శక్తి, జ్ఞానం మనకు బదిలీ అవుతాయి.


🌿ఫలితంగా మంచి మనసుతో వారిచ్చే  దీవెనలు ఫలిస్తాయి.


🌸పెద్దవారు ఈ భూమి మీద నడిచి ఎంతో జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదించడం వల్ల, వారి పాద ధూళిలో కూడా, ఎంతో జ్ఞానం దాగి ఉంటుంది. 


🌿"మేము కూడా మీ మార్గంలో  నడిచి అనుభవాన్ని, జ్ఞానాన్ని, సంపాదించడానికి ఆశీర్వదించండి", 

అని చెప్పే సంప్రదాయానికి ప్రతీకగా, 

చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు.


🌸మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు,

ఆ ఇంటిలో ఉన్న పెద్దవారికి

పాదాభివందనం చేసి, పెద్దవారి ఆశీర్వాదాలు పొందండి.


🌿అలాగే  ఎవరైనా పెద్దవారు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా,

వారికి పాదాభివందనం  చేసి,

పెద్దవారి ఆశీర్వాదాలు పొందండి.


🌹🙌 సాధారణంగా పెద్దవారి ఆశీర్వచనాలు ఈవిధంగా ఉంటాయి! 🙌🌹


🌸పెళ్లయిన జంటని :

అన్యోన్య దాంపత్య ప్రాప్తిరస్తు.


🌿పెళ్లి అయిన ఆడవారిని :

దీర్ఘసుమంగళీభవ


🌸చిన్న పిల్లల్ని :

🙌చిరంజీవ - చిరంజీవ


🌿చదువుకుంటున్నవారిని :

🙌బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలి, తల్లిదండ్రులకు పేరు తేవాలి.


🌸పెద్ద చదువులు చదువుకునేవాళ్ళని :

🙌ఉన్నతవిద్యా ప్రాప్తిరస్తు.


🌿పెళ్లికావసలసిన వాళ్ళని :

🙌శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు.


🌸ఉద్యోగం చేస్తున్నవాళ్ళని :

🙌ఉన్నత ఉద్యోగ ప్రాప్తిరస్తు.


🌿ఏమని ఆశీర్వదించాలో తెలియనప్పుడు 

ఒక్క మాటలో ఆశీర్వదించాలంటే 


🌸🙌"మనోవాంఛా ఫలసిద్దిరస్తు"🙌


🌿(నీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలి)

ఈవిధంగా పెద్దలు ఆశీర్వదిస్తూ ఉంటారు!


🌸(పెద్దలకు, తల్లి దండ్రులకు, పూజ్యులకు, గురువులకు, పాదాభివందనం చేసి, ఆశీర్వచనాలు పొందేలా, మనం మన పిల్లలకు చిన్నప్పటినుంచీ నేర్పాలి.)

మన సంస్కృతిని మర్చిపోకూడదు.. *ఇలాంటి మరిన్ని దైవీక విషయాలు  తెలుసుకోవాలంటే ఆథ్యాత్మిక కుటుంబం గ్రూప్ లో జాయిన్ అవండి.* link 👇https://chat.whatsapp.com/H0zyZWXVQLr6ol6cJ25uR0    ;