** *పాదాభివందనం ఎందుకు చేయాలి....!!*
🌹🙏పాదాభివందనం వలన…
ప్రయోజనం ఏమిటి🌹🙏
🌸🌿🌸🌿🌸
🌿శుభ కార్యాలలో పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలని, చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు.
🌸కేవలం శుభకార్యాల లోనే కాక, పెద్దవారు కనిపించనప్పుడు కూడా చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు.
🌷అసలు పెద్దవారి పాదాలను ఎందుకు తాకాలి!🌷
🌿భారతీయ సంప్రదాయంలో, పెద్దవారి పాదాలను తాకడం అనేది గౌరవసూచికంగా ఉన్న పురాతన పద్దతి.
🌸అయితే కొందరు,
అడుగులను అపరిశుభ్రంగా భావిస్తారు.
🌿పాదాలను తాకడం వెనుక ఎన్నో అద్భుత ప్రయోజనాలు, అర్ధవంతమైన సూచనలు, ఉన్నాయి.
🌸పెద్దవారి పాదాలను తాకాలంటే, మన అహంకారం వదిలి తల వంచాలి.
అది పెద్దవారి వయసు, జ్ఞానం, విజయాలు, అనుభవాలను గౌరవించడంతో సమానం.
🌿సాధారణంగా పెద్దవారి పాదాలు తాకినప్పుడు, వారి ఆలోచనలు, స్పందనలు, వాటి నుండి వచ్చే పదాలు, చాలా శక్తివంతంగా ఉండటం వల్ల చిన్నవారికి ఎన్నో ఆయురారోగ్య ఐశ్వర్య విద్యా లాభాలు చేకూరుతాయి!
🌸పెద్దవారి పాదాలను తాకడానికి
మన నడుము వంచి,
మన కుడి చేతిని పెద్దవారి ఎడమ కాలిమీద పెట్టాలి.
🌿అలాగే మన ఎడమ చేతిని పెద్దవారి కుడి కాలిమీద ఉంచాలి.
అప్పుడు పెద్దవారి చేతులు, మన మీదఉంటాయి.
🌸ఇలా చేయడం వల్ల ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఆకారాన్ని సంతరించుకుంటుంది.
ఆ సమయంలో పెద్దవారి శక్తి, జ్ఞానం మనకు బదిలీ అవుతాయి.
🌿ఫలితంగా మంచి మనసుతో వారిచ్చే దీవెనలు ఫలిస్తాయి.
🌸పెద్దవారు ఈ భూమి మీద నడిచి ఎంతో జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదించడం వల్ల, వారి పాద ధూళిలో కూడా, ఎంతో జ్ఞానం దాగి ఉంటుంది.
🌿"మేము కూడా మీ మార్గంలో నడిచి అనుభవాన్ని, జ్ఞానాన్ని, సంపాదించడానికి ఆశీర్వదించండి",
అని చెప్పే సంప్రదాయానికి ప్రతీకగా,
చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు.
🌸మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు,
ఆ ఇంటిలో ఉన్న పెద్దవారికి
పాదాభివందనం చేసి, పెద్దవారి ఆశీర్వాదాలు పొందండి.
🌿అలాగే ఎవరైనా పెద్దవారు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా,
వారికి పాదాభివందనం చేసి,
పెద్దవారి ఆశీర్వాదాలు పొందండి.
🌹🙌 సాధారణంగా పెద్దవారి ఆశీర్వచనాలు ఈవిధంగా ఉంటాయి! 🙌🌹
🌸పెళ్లయిన జంటని :
అన్యోన్య దాంపత్య ప్రాప్తిరస్తు.
🌿పెళ్లి అయిన ఆడవారిని :
దీర్ఘసుమంగళీభవ
🌸చిన్న పిల్లల్ని :
🙌చిరంజీవ - చిరంజీవ
🌿చదువుకుంటున్నవారిని :
🙌బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలి, తల్లిదండ్రులకు పేరు తేవాలి.
🌸పెద్ద చదువులు చదువుకునేవాళ్ళని :
🙌ఉన్నతవిద్యా ప్రాప్తిరస్తు.
🌿పెళ్లికావసలసిన వాళ్ళని :
🙌శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు.
🌸ఉద్యోగం చేస్తున్నవాళ్ళని :
🙌ఉన్నత ఉద్యోగ ప్రాప్తిరస్తు.
🌿ఏమని ఆశీర్వదించాలో తెలియనప్పుడు
ఒక్క మాటలో ఆశీర్వదించాలంటే
🌸🙌"మనోవాంఛా ఫలసిద్దిరస్తు"🙌
🌿(నీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలి)
ఈవిధంగా పెద్దలు ఆశీర్వదిస్తూ ఉంటారు!
🌸(పెద్దలకు, తల్లి దండ్రులకు, పూజ్యులకు, గురువులకు, పాదాభివందనం చేసి, ఆశీర్వచనాలు పొందేలా, మనం మన పిల్లలకు చిన్నప్పటినుంచీ నేర్పాలి.)
మన సంస్కృతిని మర్చిపోకూడదు.. *ఇలాంటి మరిన్ని దైవీక విషయాలు తెలుసుకోవాలంటే ఆథ్యాత్మిక కుటుంబం గ్రూప్ లో జాయిన్ అవండి.* link 👇https://chat.whatsapp.com/H0zyZWXVQLr6ol6cJ25uR0 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి