21, ఆగస్టు 2021, శనివారం

సర్వ భూతములయందు

 సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ।

ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ।। 29 ।।


సర్వ-భూత-స్థం — సర్వ భూతముల యందు స్థితుడై ఉండి; ఆత్మానం — పరమాత్మ; సర్వ — సమస్త; భూతాని — ప్రాణులు; చ — మరియు; ఆత్మని — భగవంతుని యందు; ఈక్షతే — దర్శించును; యోగ-యుక్త-ఆత్మా — అంతఃకరణ లో భగవంతుని తోనే ఏకమై; సర్వత్ర — అన్ని చోట్లా; సమ-దర్శనః — సమత్వ దృష్టి.


Translation

BG 6.29: నిజమైన యోగులు, అంతర్బుద్ధిని భగవంతుని యందే ఏకం చేసి, సర్వ భూతములను భగవంతుని యందు మరియు భగవంతుడిని సర్వ భూతములయందు దర్శిస్తారు.

భగవత్ సంబంధముగా

 ఏక దేశస్థితస్యాగ్నేర్జ్యోత్స్నా విస్తారిణీ యథా

పరస్య బ్రహ్మణః శక్తిస్తథేదమఖిలం జగత్

 (నారద పంచరాత్రం)


"ఎలాగైతే సూర్యుడు ఒకే చోట ఉండి, తన వెలుగుని అన్ని దిక్కులా ప్రసరిస్తాడో, అదే విధంగా, భగవంతుడు తన ఎన్నో శక్తుల చేత అన్నిటియందు నిండి నిబిడీకృతమై వాటిని నిలిపి నిర్వహిస్తుంటాడు.

" పరిపూర్ణత సాధించిన యోగులు, అంతర్గతంగా విచ్చుకున్న విజ్ఞాన ప్రకాశంలో, ప్రతిదాన్నీ భగవత్ సంబంధముగా చూస్తారు.

శ్రీమద్భాగవతము

 *21.08.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి  శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2237(౨౨౩౭)*


*10.1-1343- నుండి 10.1-1345-*


*సీ. మహిమతో నుండగ మథురాపురము గాని*

  *పొలుపార వైకుంఠపురము గాదు*

*గర్వంబుతో నుండఁ గంసుని సభ గాని*

  *సంసార రహితుల సభయుఁ గాదు*

*ప్రకటించి వినఁగ నా బాహునాదము గాని*

  *నారదు వీణాస్వనంబు గాదు*

*చదురు లాడఁగ మల్లజన నిగ్రహము గాని*

  *రమతోడి ప్రణయ విగ్రహము గాదు*

*తే. వెలసి తిరుగంగ వేదాంతవీధి గాదు*

*మొఱఁగిపో ముని మనముల మూల గాదు*

*సాఁగి నడువంగ భక్తుల జాడ గాదు*

*శౌరి! నా మ్రోల నీ వెందు జనియె దింక."*  🌺



*_భావము: చాణూరుడు శ్రీకృష్ణునితో ఎకసక్కెంగా ఇంకా ఇలా అంటున్నాడు: "నీవు శ్రీహరివి, అది ఇదీ అంటావేమో! విను. నీ మహిమలు పని చేయటానికి ఇది మధుర, వైకుంఠము కాదు; ఇది కంసుని సభ, సంన్యాసుల సత్సంగము  కాదు; ఇది నా జబ్బల మీద చరచిన చప్పుడు, నారదుని  వీణానాదము కాదు; నీ చతురోక్తులతో రంజింపచెయ్యటానికి ఇది లక్ష్మీదేవితో ప్రణయ కలహముకాదు, మల్లయోధులతో సంగ్రామము; శూరసేనుని వంశములో జన్మించిన వాడా! ఇంకా చెప్పాలంటే తిరగటానికి ఇవి వేదాంతవీధులు కావు, బోధలు చేయటానికి మునుల చిత్తములు కావు, విజృంభించి నడవటానికి ఇవి భక్త సమూహాలు కావు, ఇక నీకే దిక్కు లేదు, ఎక్కడికి పోతావు?"_* 🙏



*_Meaning: Chanura was making mockery of Sri Krishna: "You might claim You are Sri Hari and all big things about Yourself. Listen from me- This is Madhura and Kamsa's court, not Vaikuntham and meeting of ascetics. These slaps on my shoulder are as war cries, not music on Veena of Narada. These are not pleasantries to exchange with Goddess LakshmiDevi, but fight with expert wrestlers. Hey Sri Krishna, born in the clan of  Surasena! Know further that these are not paths of Vedanta, not minds of sages to listen to Your teachings, not an assembly of Your Bhaktas to excel. Where can You go now? You can not escape from my grip."_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక  (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు  (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

మద్యము గురించి వివరణ -

 ఆయుర్వేదం నందు మద్యము గురించి వివరణ -


 * చరకాచార్యులవారు - బాహ్లీకులు , పల్లవులు , చీనీయులు , శూలికులు , యవనులు , శకులు అను ఆరుదేశములు యందు నివసించేవారు మాంసం , గోధుమలు , మద్యములు , శస్త్రచికిత్స అనునవి ఎల్లప్పుడూ ఉపయోగించుటకు తగినవారని వ్రాసిరి .


 * కొన్నిరకాల వ్యాధుల వలన కలుగు దుఃఖం , బాధల నుండి కలిగిన శోకము తొలగి విశ్రమింపచేయుటకు మద్యమును యుక్తిగా ఉపయోగించుటను వెల్లడించిరి. వారికి కూడా కొన్ని నిబంధనలు వెల్లడించి వైద్యునికి ఆదేశాన్ని ఇచ్చిరి.


 * మద్యమును నిత్యముగా ఇచ్చేప్పుడు మనుజుని అన్నపానములు , వయస్సు , వ్యాధి , శరీరబలం , కాలము , ఆరు రుతువులు ,వాత,పిత్త,కఫ దోషములు , మానసిక స్థితి గమనించిగాని నిత్యం ఇవ్వరాదు అని కొన్ని ప్రత్యేక నియమాలు వైద్యునికి గ్రంథరూపంలో వెల్లడించిరి .


 * వాత, పిత్త, కఫాలు మూడింటిని ఒకేసారి వృద్ధిని చెందించి శరీరం నందు వ్యాపించుటకు విషముకు ఎలాంటి శక్తి ఉంటుందో మద్యమునకు కూడా అవే గుణములు కలిగియున్నది. కాకుంటే మద్యము కంటే విషమునకు ఎక్కువ బలం ఉండటం వలన ప్రభావం త్వరగా ప్రభావం చూపును. మద్యం కొంచం శరీరాన్ని నాశనం చెందించుటకు కొంచం సమయం తీసుకొనును .


 * మద్యము శరీరం నందలి రోగనిరోధక శక్తిని నాశనం చేసి శరీరాన్ని రోగాలపాలు చేయును మద్యము ఆమ్లరసం గుణములు కలిగి ఉంటుంది.


 * మద్యము నందు మోహము , భయం , శోకము , క్రోధము , మృత్యువు ఆశ్రయించి ఉన్నవి. మద్యదోషం వలన పిచ్చి , మదము , మూర్చ , అపస్మారము కలుగును.


 * అధిక మద్యపానం వలన వాత , పిత్త , కఫాలు వృద్దిచెంది హృదయము నందు బాధ , అరుచి , అధికంగా దప్పిక , జ్వరం , చలిజ్వరం , శిరస్సు నందు , పార్శ్వముల యందు , ఎముకల యందు , సంధుల యందు మెరుపుల వలే అప్పుడప్పుడు కలుగు బాధలు , అధికంగా , బలంగా ఆవలింతలు , శరీరం అదురుట , శరీరం నందు వణుకుట , శ్రమ , వక్షస్థలం నందు పట్టినట్లు ఉండటం , దగ్గు , ఎక్కిళ్లు , ఆయాసం , నిద్రలేకపోడం , చెవి , కళ్లు , ముఖవ్యాధులు కలుగుట , వాంతులు , విరేచనములు , వాంతి వచ్చేలా ఉండటం వంటి సమస్యలు కలుగును.


 * ఆయుర్వేదం నందు మద్యము అతిగా తీసుకోవడం వలన కలిగే సమస్యను మదాత్యరోగం అని పిలుస్తారు . మద్యము తీసుకోవడం వలన వికారములు కలిగినపుడు వెంటనే మద్యమును మానవలెను అని సూచించడం జరిగింది.


 * మద్యము వదులుటకు పాలను వాడమని ఆయుర్వేద శాస్త్రవేత్తలు సూచించారు. ఒక్కసారిగా మద్యపాన వ్యసనాన్ని విడవరాదు. చిన్నగా మద్యపాన మోతాదును తగ్గించుకుంటూ రావలెను. ఒక్కసారిగా మద్యాన్ని ఆపడం వలన బలహీన మనస్తతత్వం ఉన్నవారు పిచ్చివారుగా మారే ప్రమాదం ఉన్నది . కావున క్రమంగా మోతాదు తగ్గించుకుంటూ రావలెను .


 * మద్యము వలన శరీరబలం కోల్పోయినవారికి మద్యము యొక్క మోతాదు తగ్గించుకుంటూ పాల యొక్క మోతాదు పెంచుకుంటూ పోవడం వలన క్రమమముగా శరీరబలం పెరిగి మద్యపాన దుష్ప్రభావం నుంచి మనుష్యుడు బయట పడును.


 * మద్యమును ఆపి మరలా తిరిగి మద్యపాన సేవన ప్రారంభించిన మరియు అధికంగా సేవించుట చేసినచో శరీర ధ్వంసం , మలక్షయం మొదలయిన సమస్యలు సంభవించి చికిత్సకు లొంగని విధముగా తయారగును.


 * సమస్త విధములైన మద్యములను విడిచిన మానవుడు జితేంద్రియుడుగా , శారీర , మానసికంగా ధైర్యము కలవాడుగా , వ్యాధుల నుంచి దూరంగా ఉండువానిగా అగును.


          నేను రాసిన గ్రంథాలలో మరిన్ని అనుభవ యోగాలు ఇవ్వడం జరిగింది. 


      గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

శ్రావణ పూర్ణిమ - హయగ్రీవ జయంతి🙏

 🙏రేపు శ్రావణ పూర్ణిమ - హయగ్రీవ జయంతి🙏

 

*జ్ఞానానందమయం దేవం నిర్మలస్పటికాకృతిం |*

*ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ||*      

  

*వ్యాఖ్యా ముద్రాం కరసరసిజైః పుస్తకం శంఖచక్రే*

*బిభ్రద్భిన్నస్పటికరుచిరే పుండరీకే నిషణ్ణః |*

*అమ్లానశ్రీరమృతవిశదైరంశుభిః ప్లావయన్ మాం*

*ఆవిర్భూయాదనఘ మహిమా మానసే వాగధీశః ||*

 

*ఓం లక్ష్మీహయవదన పరబ్రహ్మణే నమః*

 

శ్రావణ పూర్ణిమ అంటే రక్ష కట్టుకోవడం ఒకటే అనే స్థితిలోకి వచ్చాం ఈనాడు , కానీ ఈ రోజు ప్రాధాన్యత మరచిపోయాం. రక్ష కట్టుకోవడం అనేది దేశ రక్షణ కోసం అని , సోదరీలు సోదరులకు రక్ష కట్టినట్లయితే వారు రక్షణ కలిపిస్తారని కొన్ని ఈ మధ్యకాలంలోని పురుషోత్తముడు అలెగ్జాండర్ కథ చెబుతారు. శ్రావణ పూర్ణిమ అంటే అంతవరకే చెబుతారు.

 

కానీ అంతవరకే ఈ శ్రావణ పూర్ణిమ ప్రాధాన్యత కాదు. అది లక్ష్మీమయమైన మాసంలో వచ్చినది కనుక సంపదలు ఇచ్చే శక్తి ఉంది. దానితో పాటు సర్వ విద్యా స్వరూపుడైన భగవంతుని విద్యాప్రదమైన అవతారం హయగ్రీవ అనే అవతారం జరిగింది ఈ శ్రావణ పూర్ణిమ రోజే. అందుకే ఈ రోజుకి అంత ప్రాధాన్యం. మనిషికి ప్రధానమైనది జ్ఞానం , జ్ఞానానికి ఆధారం శాస్త్రాలు , శాస్త్రాలకు మూలం వేదం. ఆవేదాన్ని లోకానికి అందించిన అవతారం హయగ్రీవ అవతారం. విద్య చదువుకున్న వారికందరికి కంకణం కడుతారు , వారు రక్షకులు అవుతారు అని. జ్ఞానికి రక్షగా ఉంటారని. ఆ జ్ఞానం చెప్పే భగవంతునికి చెందిన వాటంతటికి రక్ష. ఆ కంకణ ధారణ అనేదే రక్షబంధనం అయ్యింది. వేదం చదువుకునే వారందరూ శ్రావణ పూర్ణిమ నాడు ఆరంభంచేసి నాలుగు నెలలు వేదాధ్యయనం చేస్తారు. ఆతరువాత వేద అంగములైన శిక్షా , వ్యాకరణం , నిరుక్తం , కల్పకం , చందస్సు మరియూ జ్యోతిష్యం అనే షడంగములను అధ్యయనం చేస్తారు. విద్యారక్షకుడైన భగవంతుడిని ఉపాసన చేసుకొని మొదలు పెడుతారు. వేదాన్ని కొత్తగా నేర్చే వారే కాక, వేదాన్ని నేర్చినవారు తిరిగి ఇదే రోజునుండి మరచిపోకుండా నవీకరణం చేసుకుంటూ అధ్యయణం మొదలు పెడుతారు. హయగ్రీవుడిగా అవతరించి లోకాన్ని ఉద్దరించిన రోజు.

 

భగవంతునికి లోకంపై ఉండే కరుణ చేత నామ రూపాలు లేని ఈ జీవరాశికి ఒక నామ రూపాన్ని ఇవ్వడానికి చతుర్ముఖ బ్రహ్మకు ఆయనకు వేదాన్ని ఉపదేశం చేసాడు. అయితే వేదం అనేది జ్ఞానం , అది అప్పుడప్పుడు అహంకారాన్ని తెచ్చి పెడుతుంది , అహంకారం ఏర్పడి ఉన్న జ్ఞానాన్ని పోయేట్టు చేస్తుంది. బ్రహ్మగారికి అట్లా ఇంత చేస్తున్న అనే అహంకారం ఏర్పడి వేదాన్ని కోల్పోయాడు ఎన్నో సార్లు. భగవంతుడు తిరిగి ఒక్కో రూపాన్ని ధరించి ఇస్తూ ఉండేవాడు. మశ్చావతారం , హంసావతారం ఇలా ఆయన వేదాన్ని ఇవ్వడానికి వచ్చిన అవతారాలే. చాలా సార్లు ఇచ్చినా కోల్పోయాడు , చివర హయగ్రీవ అవతారంలో ఇచ్చాక బ్రహ్మ వేదాన్ని కోల్పోలేదు. అది శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ రూపంలో. అంతకు ముందు పాడ్యమి నాడు చేసాడేమో అంతగా ఫలితం లేదు , అందుకే పౌర్ణమినాడు ఉపదేశం చేసి చూసాడు. అప్పుడు బ్రహ్మ వేదాన్ని కోల్పోలెదు. మన శాస్త్రాలు అంటే ఎంతో కాలంగా ఆచరించి పొందిన అనుభవాల సారాలు. అందుకే *"ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః"* చాలా కాలంగా చేసిన ఆచారములే ధర్మములు, అవి మనల్ని రక్షించేవి కనుక వాటిని చెప్పేవి శాస్త్రాలు అయ్యాయి. శాస్త్రాలను బట్టి ఆచారాలు రాలేదు. బ్రహ్మ కాంచీపురంలోని వరదరాజ స్వామి సన్నిదానంలో చేసిన హోమం నుండి శ్రావణ పూర్ణిమనాడు భగంతుడు గుఱ్ఱపుమెడ కలిగిన ఆకృతిలో వచ్చి గుఱ్ఱం యొక్క సకిలింత ద్వని మాదిరిగా వేదాన్ని వేదరాశిని ఉపదేశం చేసాడు. అందుకే హయగ్రీవ స్వామి శతనామావళితో ఆరాధన చేయాలి. హయగ్రీవ అనే రాక్షసుడిని సంహరించడానికి భగవంతుడు గుఱ్ఱపు ఆకారంలో అవతరించాడు అంటూ ప్రమాణికం కాని కథలను చెబుతారు. కానీ అట్లాటి ప్రస్తావన వేదవ్యాసుడు అందించిన ఏపురాణాలలో లేదు. శ్రీమద్భాగవతంలో శ్రీసుఖమహర్షి పరిక్షిత్తు మహారాజుకి చేసే ఉపదేశంలో హయగ్రీవ అవతారం కూడా భగవంతుడు వేదోద్దరణ కోసం ఎత్తిన అవతారం అనేది తెలుస్తుంది. వేద వ్యాసుడు చిట్ట చివరగా పురాణాల సారముగా అందించినదే శ్రీమద్భాగవతం. ఆ తరువాత ఆయన ఎట్లాంటి పురాణాలను అందించలేదు.🙏

గోడేమిటి ఎద్దుగా మారడమేమిటి !

 గోడేమిటి ఎద్దుగా మారడమేమిటి !

.........................................................


ఇడగూరు రుద్రకవి తెలుగుకన్నడలలో మేలైన కవిత్వం చెప్పగల దిట్ట. ఇతను 1822 - 1887 కాలంనాటివాడు. పుట్టిందేమో ఇడగూరు.కర్ణాటకలోని ఇప్పటి చిక్కబళ్ళాపురం జిల్లాలోని గౌరిబిదనూరు తాలూకాలో వుందీ ఇడగూరు. దీనికే హిడింబాపురమని కూడా పేరు. ఈ గ్రామం శివగురువులకు నిలయం.


ఈప్రాంతంలోనున్న గోడలాపురం (🚩) గ్రామంలో వివాహితుడైన శివదీక్షాగురువు ఒకరుండేవారు. ఆయన గుర్రానికి బదులుగా ఎద్దునెక్కి సంచరించేవాడు. ఒకరోజు రాత్రి ఆ ఎద్దుకట్లు తెంచుకొని ఎటో వెళ్లిపోయింది. ఉదయాన్నే అల్లరిపిల్లలు కొందరు నీ ఎద్దుతప్పించుకోని పారిపోయింది కదా ! నీవేలా పోతావంటూ బాగా గేలిచేసారు. అందుకా శివాచార్యుడు చిన్నగానవ్వి పక్కనే పడిపొయివున్న గోడమీద కూర్చుని పదపద అంటూ చర్నకోలను ఝళిపించాడు.ఆ గోడ అమాంతంగా గాల్లోలేచిపోయింది. 

అప్పటినుండి ఇతనికి ఎత్తినయ్య అనేపేరు కలిగింది. కన్నడభాషలో ఎత్తినంటే ఎద్దని అర్థం.


కొంతకాలానికి ఈ గురువు హిడింబాపురంచేరుకొన్నాడు. హిడింబాసురుని సంహరించడం వలననే ఇడగూరుకు హిడింబాపురమనే పేరు కలిగిందని ఇక్కడి శాసనమొకటి తెలియచేస్తోంది.


ఆ గ్రామంలో పుష్పాచార్యుడనే సదాచార సంపన్నుడొకడు వుండేవాడు. ఎత్తినయ్య తన కూతురుని అతడికిచ్చి వివాహం చేశాడు. పుష్పాచార్యుని కొడుకే రుద్రకవి.


 కోలారుజిల్లాలో నాటి ప్రజల వ్యవహారభాషైన తెలుగులో లేపాక్షిరామాయణం, శశిరేఖాపరిణయం, లవకుశ వంటి యక్షగానాలు ప్రచారంలోవుండేవి.రుద్రకవి బాల్యం నుండే కన్నడసంస్కృతాలలో కవిత్వం చెప్పగల సామర్థ్యం కలవాడు. తెలుగులో మాట్లాడగలడు కాని కవిత్వం చెప్పలేడు. సుందరమైన మధురమైన తెలుగును నేర్చుకోవాలని సంకల్పించినాడు.


గౌరిబిదనూరులో కవికలభ కంఠీరవ బిరుందాంకితుడైన భట్టుమూర్తి వుండేవాడు. భట్టుమూర్తి తెలుగుసాహిత్యంలో మేటి. అతనివద్ద శిష్యరికం చేసి తెలుగువ్యాకరణంతో సహ తెలుగులో కవిత్వం చెప్పగల నేర్పును సంపాందించాడు.


ప్రజల అభిరుచిమేరకు మిత్రులైన సాహుకారు మురుడప్ప, హొన్నేగౌడల ప్రోత్సాహంతో తెలుగులో మార్కేండేయచరిత్రమనే యక్షగానాన్ని వ్రాసి ప్రదర్శించాడు. మురుడప్ప కోరికమేరకు దానిని కన్నడభాషలోనికి అనువదించాడు..


ఇతని కీర్తిని విని, మైసూరు మహరాజు కృష్ణరాజవడయారు వారు తన సంస్థానంలో యక్షగానాలను ప్రదర్శించాల్సిందిగా ఆహ్వానించాడు. రాజభవనంలో యక్షగాననాటకాల ప్రదర్శనకు మైసూరుమహరాజు, అధికారులు, అంత:పుర స్త్రీలు, పురప్రముఖులు విచ్చేశారు.మొదట రాజుగారి తొలి పలుకులనంతరం రుద్రకవి రాజుగారి కీర్తిని వర్ణిస్తూ, సాహిత్య తన్మయానికి లోనైనాడు. ఆ పరధ్యానంలో రాజుగారిని కీర్తించటానికి బదులుగా తననాదరించిన హొన్నేగౌడను ప్రశంసించడం మొదలుపెట్టాడు. అంతవరకు ముగ్ధులైవింటున్న మహరాజుకు ఇది సహించలేదు. సభికులు బిత్తరపోయారు. రాజుగారు లేచి చరచర వెళ్ళిపోయారు. ఇంకేముంది నాటకం రసాభసమైంది. అతని నాటకసామాగ్రిని బయటపడేశారు. నాటకపాత్రదారులకు మెడబట్టి తోసినంత పనైంది.


తనకు తెలియకుండా తాను మైసూరు రాజాశ్రయంలో ఇతరులను ప్రశంసించినందుకు రుద్రకవి ఎంతో బాధపడ్డాడు. కాని ఏం ప్రయోజనం వీధినపడ్డాడు. ఏం చేయాలో తోచక రోజు చాముండికొండ పైనున్న చాముండిని దర్శించుకొని అమెపై అసువుగా కవిత్వం చెప్పుకొనేవాడు. ఒకరోజు ఉదయం పర్వత పాదంలోనున్న నందిశిల్పం వద్ద బసవవర్ణన చేస్తూ


కరుణిమ కర్తుక ప్రణుత కల్మషదూరగ కద్రువాత్మజా

...............

...............

..... కకార సుతాం బసవేశ పాహిమాం.


అంటూ శ్రావ్యంగా ఆలాపించసాగాడు. అదే సమయంలో రాజు అమ్మవారిని దర్శించుకొని వెనుదిరిగి వస్తున్న సమయంలో ఈ మధురగానాన్ని విని సిబ్బంది ద్వారా ఆ గానం చేస్తున్నది రుద్రకవేనని తెలుసుకొని, పశ్చాత్తాపం చెంది, రుద్రకవి యక్షగానాలను తన రంగమండపంలో ఏర్పాటుచేయించుకొని చూచి విని ఆనందపడి రుద్రకవిని ఘనంగా సన్మానించుకొన్నాడు.


1876 - 78 ప్రాంతంలో కోలారుజిల్లాలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడి ప్రజలు రైతులు తీవ్రమైన బాధలకు లోనైనారు. ఈ సమయంలోనే పన్నులను వసూలు చేయటానికి అదాలత్ రుద్రప్పనే అధికారి వచ్చాడు. రుద్రకవి కవిత్వంతో అతనికి స్వాగతం పలికాడు. ఇదంతాపట్టని అదాలత్ రుద్రప్ప బలవంతంగానైనా సరే శిస్తువసూలుకు సిద్ధమైనాడు. అపుడు


.... నాల్గు తాలూకు లాప్కారి కంట్రాక్టుకీవే ఇజార్దారుడవై........


అంటూ వచన తెలుగుదండకంలో రుద్రప్పను ఏకిపారేశాడు. రుద్రకవి తెలుగులో వేంకటేశ్వర మహత్య్మం, విరూపాక్షమహత్య్మం, మురుడేశ్వరశతకం, రుద్రకవిశతకం, తిట్లదండకం మొదలైనవి కన్నడనాట వ్రాసి తెలుగు కన్నడీగుల హృదయంలో స్థానం సంపాదించుకొన్నాడు.

(🚩) గోడలల్లి,గోడలాపురాలను అపభ్రంశరూపంలో గోళ్ళపల్లి గోళ్ళాపురాలుగా మారిపోయాయి. ఆంగ్లభాషా పుణ్యాన అవి గోల్లపల్లి, గొల్లపురాలుగా మారాయి.


( సేకరణ)

........................................................................................................................ జి.బి.విశ్వనాథ. 9441245857. అనంతపురం.

ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండవలసిన మందు

 ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండవలసిన మందు 

మందు పేరు: కుటజారిష్ట 

కంపని : పతంజలి 

ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. మనం ఎంత జాగ్రత్తగా వున్నా కూడా మనం తినే ఆహారం కలుషితం అవ్వటానికి ఆస్కారం వున్నది. బయటి తిండి తినకుంటే చాల మంచిది కానీ మనం టిఫిన్లు తినకుండా ఉంటామా చెప్పండి. వుండంకదా . ఏమాత్రం నీరు కలుషితమైనా వెంటనే మనకు వచ్చే అనారోగ్య సమశ్య విరోచనాలు, కడుపులో నొప్పి. విరోచనాలు నీళ్ల విరోచనాలే కావచ్చు లేక అజీర్తి విరోచనాలే కావచ్చు. కడుపులోనొప్పి మాత్రం తప్పకుండ ఉంటుంది. దీనినే మనం మెలిపెట్టినట్లు వున్నది అని అంటాము. ఆ బాధ అనుభవిస్తే కానీ తెలియదు. ప్రతి ఇంట్లో ఈ వర్షాకాలంలో అందరు కానీ కొంతమంది కానీ తప్పకుండ ఈ సమస్యతో బాధపడే వారే. 

మనం డాక్టరు దగ్గరికి వెళితే డాక్టారు ఫీజు 100 నుండి 200 తరువాత అయన వ్రాసే మందులు 400-500 వెరసి మనకు 5 నుండి 6 వందల వరకు ఖర్చు వస్తుంది. అవునా కాదా? మరి అతి తక్కువ ఖర్చుతో డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మనం ఇంట్లోనే చికిత్స చేసుకుంటే ఎట్లావుంటుంది. 

ఒక వేపు విరోచనాలు, పైన వాన డాక్టరు వద్దకు వెళ్లాలంటే స్కూటర్ మీద తడుసుకుంటూ వెళ్ళాలి. డాక్టరు అప్పోయింట్మెంట్ ఏ గంట కుర్చుంటేనో దొరుకుతుంది.  ఈ మధ్యలో రెండు మూడు సార్లు వెళ్లాల్సి వస్తుంది, ఆ కష్టం యెట్లా ఉంటుందో మనకు తెలియంది కాదు.  కాబాట్టి నేను చెప్పే ఈ మందు ఈ రోజే కొనుక్కొని తెచ్చుకుంటే ఇంట్లో ఎవ్వరికీ విరోచనాలు అయినా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వాడి ఒక గంట రెండు గంటలలో ఉపశమనం పొందవచ్చు. ఏమంటారు. 

ఈ కుటజారిష్ట గూర్చి తెలుసుకుందాము. ఇది పూర్తిగా ఆయుర్వేదానికి సంబందించిన మందు వనమూలికలతో తయారుచేసింది. నూటికి తొంబైతొమ్మిది పళ్ళు సురక్షితమైనది. చిన్న పిల్లల దగ్గరనుండి వృద్ధుల వరకు ఇంట్లోని అందరు వాడదగిన మంచి మందు. మనం మాత్తర్లు కొనుక్కొంటే అవి కొన్ని వాడి మరల మిగిలినవి ఉపయోగించకుండా పారేసుకుంటాము.  మళ్ళి డాక్టరు దగ్గరికి వెళతాము. వెరసి మళ్ళి 5 వందల ఖర్చు తప్పదు. 

ఈ మందు ద్రవరూపంలో 450 మిల్లి లీటర్ల పరిమాణంలో దొరుకుతుంది ధర కేవలము Rs 70 అంటే 100 రూపాయల కన్నా తక్కువ. ఇంకొక విషయం మీరు ఒక్కసారి ఈ మందు కొని తెచ్చుకుంటే 10 సంవత్సరాలలోపు దీనిని వాడ వచ్చు. అంటే మీ అమ్మాయి డిగ్రీ చదువుతుంటే కొన్న సీసా  మీ అమ్మాయి పెండ్లి అయ్యి మనమరాలు/ మనమడు  పుట్టిన దాకా ఈ మందు క్షేమంగా మీ ఇంట్లో వుంచుకోవచ్చు. ఒకటి రెండు డోసులు తీసుకుంటే మీ విరోచనాలు వెంటనే కడతాయి చక్కటి స్వస్థత చేకూర్చుతుంది. కాక పొతే ఈ మందు చేదుగా ఉంటుంది. మందు ఒకటి రెండు చెంచాలు ఒక చిన్న గ్లాసులో పోసుకొని తగినంత నీటిని కలిపి సేవించండి. 

అందరు తక్కువ ఖర్చుతో మన స్వదేశీ విద్య విధానంలో, స్వదేశీ కంపెనీ ప్రొడక్టులతో ఆరోగ్యాన్ని చేకూర్చుకోవాలనే నా ఉద్యమాన్ని మీరు బలపరుస్తారనుకుంటా.  



కంపెనీ వారు ఇచ్చిన సమాచారం 

Kutajarishta brings relief to you from chronic indigestion problems, upset stomach, diarrhoea, fever, etc. Contaminated food and drinks constantly harm and weaken your digestive system. It is a time-tested formulation that soothes your stomach, heals the damages from contaminations and boosts your digestion. It has been clinically proven to have no side effects.

మందు వాడిన వారు వారి అనుభవాలను కింద కామెంటులో తెలుపగలరు. 

పదాలు* వ్రాయండి. చివర *త* రావాలి.

 " *త*" అక్షరంతో అంతమయ్యే *పదాలు* వ్రాయండి. చివర *త* రావాలి.

1. నాయకుడు - 

2. మహిళ 

3. అభిమానం - 

4. కూతురు

5. సోదరుడు - 

6. ఆధారం - 

7. ముందు

8. దుఃఖం - 

9. నడవడి - 

10. అనంతరం - 

11. గురుగు 

12. పరిమాణం 

13. జోడు -  

14. కితకిత

15. కొంచెం

16. గొప్పతనం -  

17. అణకువ

18. తక్కువ

19. వేకువ

20. భ్రష్ట్రురాలు 

21. చికాకు 

22. అల్లుడు - 

23. ఆడపడుచు -  

24. Married woman

25. సుస్తీ - 

గోత్రం అంటే ఏమిటి?*

 *గోత్రం అంటే ఏమిటి?* 

సైన్సు ప్రకారము 

మన పూర్వీకులు

గోత్ర విధానాన్ని ఎలా 

ఏర్పాటు చేశారో గమనించండి.


మీరు పూజలో కూర్చున్న 

ప్రతిసారీ, పూజారి మీ గోత్రం గురించి ఎందుకు అడుగుతారో మీకు తెలుసా? 

మీకు తెలీదు కాబట్టి అది చాదస్తం అనుకుంటున్నారు??


గోత్రం వెనుక ఉన్న శాస్త్రం మరేమిటో కాదు- 

*జీన్-మ్యాపింగ్* అని ఈమధ్య కాలంలో బాగా ప్రాచుర్యం 

పొందిన అధునాతన శాస్త్రమే!


గోత్రం వ్యవస్థ అంటే ఏమిటి ?


మనకు ఈ వ్యవస్థ ఎందుకు ఉంది? 


వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనము ఎందుకు భావిస్తాము? 


కొడుకులకు ఈ గోత్రం ఎందుకు వారసత్వంగా వస్తుంది మరి కుమార్తెలు ఎందుకు రాదు?


వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎలా / ఎందుకు మారాలి? 

తర్కం ఏమిటి?


ఇది మనము అనుసరించే అద్భుతమైన జన్యు శాస్త్రం.  

మన గోత్ర వ్యవస్థ వెనుక 

జన్యుశాస్త్ర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం!


గోత్రమ్ అనే పదం రెండు సంస్కృత పదాల నుండి ఏర్పడింది.  

మొదటి పదం 'గౌ'- అంటే ఆవు, రెండవ పదం 'త్రాహి' అంటే కొట్టం


గోత్రం అంటే 'గోశాల' అని అర్ధం.


జీవశాస్త్రపరంగా, మానవ శరీరంలో 23 జతల క్రోమోజోములు ఉన్నాయి, 

వీటిల్లో సెక్స్ క్రోమోజోములు

 (తండ్రి నుండి ఒకటి మరియు తల్లి నుండి ఒకటి) అని పిలువబడే ఒక జత ఉంది. 

ఇది వ్యక్తి(ఫలిత కణం) యొక్క లింగాన్ని ( gender) నిర్ణయిస్తుంది.


గర్భధారణ సమయంలో ఫలిత కణం XX క్రోమోజోములు అయితే అమ్మాయి అవుతుంది, అదే XY అయితే అబ్బాయి అవుతాడు.


XY లో - X తల్లి నుండి 

మరియు Y తండ్రి నుండి తీసుకుంటుంది.


ఈ Y ప్రత్యేకమైనది మరియు 

అది X లో కలవదు. 

కాబట్టి XY లో, Y X ని అణచివేస్తుంది , అందుకే కొడుకు Y క్రోమోజోమ్‌లను పొందుతాడు. 

ఇది మగ వంశం మధ్య మాత్రమే వెళుతుంది. (తండ్రి నుండి కొడుకు మరియు మనవడు ముని మనవడు ... అలా..).


మహిళలు ఎప్పటికీ Y ను పొందరు. అందువల్ల వంశవృక్షాన్ని గుర్తించడంలో జన్యుశాస్త్రంలో Y కీలక పాత్ర పోషిస్తుంది. స్త్రీలు ఎప్పటికీ Y ను పొందరు కాబట్టి స్త్రీ గోత్రం తన భర్తకు చెందినది అవుతుంది. అలా తన కూతురి గోత్రం వివాహం తరువాత మార్పు చెందుతుంది. 


ఒకే గోత్రీకుల మధ్య వివాహాలు జన్యుపరమైన రుగ్మతలను కలిగించే ప్రమాదాన్ని పెంచుతాయి...

గోత్రం ప్రకారం సంక్రమించిన Y క్రోమోజోమ్‌లు ఒకటిగా ఉండకూడదు 

ఎందుకంటే అది లోపభూయిష్టమైన ఫలిత కణాలను సక్రియం చేస్తుంది.....


ఇదే కొనసాగితే, ఇది పురుషుల సృష్టికి కీలకమైన Y క్రోమోజోమ్ పరిమాణం మరియు బలాన్ని తగ్గిస్తుంది..... కొన్ని సందర్భాలలో నశింపజేస్తాయి.


ఈ ప్రపంచంలో Y క్రోమోజోమ్ లేనట్లయితే, మగజాతే అంతరించిపోయేలా చేస్తుంది.


కాబట్టి గోత్రవ్యవస్థ జన్యుపరమైన 

లోపాలను నివారించడానికి మరియు Y క్రోమోజోమ్‌ను రక్షించడానికి ప్రయత్నించే ఒక పద్ధతే స్వగోత్రం. అందుకనే స్వగోత్రీకుల మధ్య వివాహం నిషేధించారు...


మన మహాఋషులచే సృష్టించబడ్డ అద్భుతమైన బయో సైన్స్ గోత్రం. ఇది

మన భారతీయ వారసత్వ సంపద అని నిస్సందేహంగా చెప్పవచ్చు..


మన ఋషులు వేలాది సంవత్సరాల క్రితమే _ "GENE MAPPING" _ క్రమబద్ధీకరించారు.


అందుకనే ఈసారి ఎవరైనా గోత్రమని అంటే చాదస్తం అని కొట్టి పడేయకండి ...... ప్రవర తో సహా చెప్పండి.

ముకుందమాల స్తోత్రమ్ v శ్లోకం : 25

 ॐ मुकुन्दमाला स्तोत्रम्   

           ముకుందమాల స్తోత్రమ్ 

       Mukunda Mala Stotram    


                                    శ్లోకం : 25     

                           SLOKAM : 25

                                                

आम्नायाभ्यसनान्यरण्यरुदितं 

                             वेदव्रतान्यन्वहं 

मेदश्छेदफलानि पूर्तविधयः 

                           सर्वं हुतं भस्मनि ।    

तीर्थानामवगाहनानि च गजस्नानं 

                                 विना यत्पद - 

द्वन्द्वाम्भोरुहसंस्मृतिं विजयते 

                           देवः स नारायणः ॥ २५॥



ఆమ్నాయాభ్యసనాన్యరణ్యరుదితం 

                     వేదవ్రతాన్యన్వహం

మేదశ్చేదఫలాని పూర్తవిధయ: 

                   సర్వే హుతం భస్మని

తీర్థానామవగాహనాని చ 

            గజస్నానం వినా యత్పద-

ద్వంద్వాంభోరుహసంస్మృతిం

    విజయతే దేవః స నారాయణ: ॥ 25  



    భగవంతుడైన శ్రీమన్నారాయణుని పాదపద్మాలపై స్మరణ లేకపోతే ఎన్ని వేదాలు చదివినా ప్రయోజనం లేదు. 

    ఆ వేదాల్లో చెప్పబడిన కర్మలు ఎన్ని చేసినా ఫలం లభించదు.   

    పుణ్యకర్మలు చేసినా ఫలిత ముండదు, పుణ్యతీర్థాలలో స్నానం చేయడం బూడిదలో పోసిన హోమానికి సమమవు తుంది.    

     ఏనుగు స్నానానంతరం తన దేహం మీద మట్టిని పోసుకున్నట్లు,  

     దైవచింతనలేని పుణ్యకర్మలన్నీ వ్యర్థమే అవుతాయి.   


    All glories to Lord Nārāyaṇa without remembrance of His lotus feet, 

  - recitation of scripture is merely crying in the wilderness,      

  - regular observance of severe vows enjoined in the Vedas is no more than a way to lose weight, 

  - execution of prescribed pious duties is like pouring oblations onto ashes, and   

  - bathing at various holy sites is no better than an elephant’s bath.  



https://youtu.be/ZTs6tcgm0lE  


                                        కొనసాగింపు  


                    =x=x=x=    


    — రామాయణంశర్మ    

             భద్రాచలం

జంధ్యాల పౌర్ణమి.


ఎల్లుండి ( ఆదివారం 22-08-2021)

జంధ్యాల పౌర్ణమి.  శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది.  ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోపవీతం) దరించవలెను.  

.

ప్రార్థన:

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||

.

గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురు దేవో మహేశ్వరః |

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై: శ్రీ గురవే నమః ||

.

అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాం గతో 2పివా |

యస్మరేత్ పుండరీకాక్షం న బాహ్యాభ్యంతరశ్సుచి: ||

పుండరీకాక్ష!  పుండరీకాక్ష!  పుండరీకాక్ష!

(అంటూ తల పైకి నీళ్ళు చల్లుకొనవలెను)

.

ఆచమన విధానం: 


ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,


1. ఓం కేశవాయ స్వాహా,

2. ఓం నారాయణాయ స్వాహా, 

3. ఓం మాధవాయ స్వాహా, 

అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను.  తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.

4. ఓం గోవిందాయనమః, 

5. ఓం విష్ణవే నమః, 

6. ఓం మధుసూదనాయనమః, 

7. ఓం త్రివిక్రమాయనమః, 

8. ఓం వామనాయనమః, 

9. ఓం శ్రీధరాయనమః, 

10. ఓం హృషీకేశాయనమః, 

11. ఓం పద్మనాభాయనమః, 

12. ఓం దామోదరాయనమః, 

13. ఓం సంకర్షణాయనమః,

14. ఓం వాసుదేవాయనమః, 

15. ఓం ప్రద్యుమ్నాయనమః, 

16. ఓం అనిరుద్ధాయనమః, 

17. ఓం పురుషోత్తమాయనమః, 

18. ఓం అధోక్షజాయనమః,

19. ఓం నారసింహాయనమః,

20. ఓం అత్యుతాయనమః, 

21. ఓం జనార్దనాయనమః, 

22. ఓం ఉపేంద్రాయనమః, 

23. ఓం హరయేనమః,

24. ఓం శ్రీకృష్ణాయనమః.


అని నమస్కరించవలెను.  అటు పిమ్మట:

.

భూతోచ్చాటన:

(చేతిలో ఉద్ధరిణి తో నీరు పోసుకుని యీ క్రింది మంత్రమును చదివిన పిమ్మట భూమిపై నీళ్ళు జల్లవలెను.)

ఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః |  దేవీ గాయత్రీచ్చందః ప్రాణాయామే వినియోగః

.

(ప్రాణాయామం కృత్వా కుంభకే ఇమం గాయత్రీ మంత్రముచ్ఛరేత్)

.

గృహస్తులు ఐదు వ్రేళ్లతో నాసికాగ్రమును పట్టుకొని మంత్రము చెప్పవలెను. బ్రహ్మచారులు బొటన వ్రేలి తో కుడి ముక్కును, అనామిక ఉంగరం వ్రేళ్లతో ఎడమ ముక్కును పట్టుకొని ఈ క్రింది మంత్రమును చెప్ప వలెను.

ఓం భూః, ఓం భువః, ఓగ్ మ్ సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ మ్ సత్యం, ఓం తత్స వితుర్వరేణ్యం బర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ |  ఓం ఆపో జ్యోతి రసో2మృతం, బ్రహ్మ భూర్భువస్సువరోమ్||

.

తదుపరి సంకల్పం:

మమ ఉపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, ఆద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే, గంగా కావేరీయోర్మధ్యే, స్వగృహే (లేదా శోభన గృహే), సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల, పురుషార్ధ సిద్ధ్యర్ధం, ఆయుష్యాభివృద్ధ్యర్ధం, మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన యోగ్యతా ఫల సిద్ధ్యర్ధం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే 

.

(బ్రహ్మచారులు “ధర్మపత్నీ సమేతస్య" అని చెప్పనక్కర లేదు)

.

యజ్ఞోపవీతములు ఐదింటిని ఐదు ముడుల వద్దను, మరి రెండు సమానదూర స్థలముల వద్దను, కుంకుమను తడి చేసి అలంకరించి అధిష్టాన దేవత అయిన గాయత్రిని ధ్యానించి, యజ్ఞోపవీత ధారణా మంత్రము స్మరించి ఈ క్రింది విధముగా ధరించవలెను.

.

యజ్ఞోప వీతే త్తస్య మంత్రస్య పరమేష్టీ పరబ్రహ్మర్షి: పరమాత్మా, 

దేవతా, దేవీ గాయత్రీచ్చందః యజ్ఞోపవీత ధారణే వినియోగః ||

.

"ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం

ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్

ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం 

యజ్ఞోపవీతం బలమస్తు తేజః "

అని చెప్పి అని ధరించవలెను.

.

(మంత్ర పఠన సమయమున కుడి బాహువును పైకెత్తి శరీరము తగలకుండా జందెమును పట్టి యుంచి మంత్రాంతము నందు కుడిబాహువు మీదుగా ఎడమ బాహువు నందు ధరించవలెను.)

.

ద్వితీయోపవీత ధారణం:

తిరిగి ఆచమనం చేసి 

ఆచమన విధానం: 


ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,


1. ఓం కేశవాయ స్వాహా,

2. ఓం నారాయణాయ స్వాహా, 

3. ఓం మాధవాయ స్వాహా, 

అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను.  తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.

4. ఓం గోవిందాయనమః, 

5. ఓం విష్ణవే నమః, 

6. ఓం మధుసూదనాయనమః, 

7. ఓం త్రివిక్రమాయనమః, 

8. ఓం వామనాయనమః, 

9. ఓం శ్రీధరాయనమః, 

10. ఓం హృషీకేశాయనమః, 

11. ఓం పద్మనాభాయనమః, 

12. ఓం దామోదరాయనమః, 

13. ఓం సంకర్షణాయనమః,

14. ఓం వాసుదేవాయనమః, 

15. ఓం ప్రద్యుమ్నాయనమః, 

16. ఓం అనిరుద్ధాయనమః, 

17. ఓం పురుషోత్తమాయనమః, 

18. ఓం అధోక్షజాయనమః,

19. ఓం నారసింహాయనమః,

20. ఓం అత్యుతాయనమః, 

21. ఓం జనార్దనాయనమః, 

22. ఓం ఉపేంద్రాయనమః, 

23. ఓం హరయేనమః,

24. ఓం శ్రీకృష్ణాయనమః.


అని నమస్కరించవలెను.

“మమ నిత్యకర్మానుష్టాన యోగ్యతా సిద్ధ్యర్ధం ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని రెండవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.

.

తృతీయ యజ్ఞోపవీత ధారణం:

తిరిగి ఆచమనం చేసి 

ఆచమన విధానం: 


ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,


1. ఓం కేశవాయ స్వాహా,

2. ఓం నారాయణాయ స్వాహా, 

3. ఓం మాధవాయ స్వాహా, 

అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను.  తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.

4. ఓం గోవిందాయనమః, 

5. ఓం విష్ణవే నమః, 

6. ఓం మధుసూదనాయనమః, 

7. ఓం త్రివిక్రమాయనమః, 

8. ఓం వామనాయనమః, 

9. ఓం శ్రీధరాయనమః, 

10. ఓం హృషీకేశాయనమః, 

11. ఓం పద్మనాభాయనమః, 

12. ఓం దామోదరాయనమః, 

13. ఓం సంకర్షణాయనమః,

14. ఓం వాసుదేవాయనమః, 

15. ఓం ప్రద్యుమ్నాయనమః, 

16. ఓం అనిరుద్ధాయనమః, 

17. ఓం పురుషోత్తమాయనమః, 

18. ఓం అధోక్షజాయనమః,

19. ఓం నారసింహాయనమః,

20. ఓం అత్యుతాయనమః, 

21. ఓం జనార్దనాయనమః, 

22. ఓం ఉపేంద్రాయనమః, 

23. ఓం హరయేనమః,

24. ఓం శ్రీకృష్ణాయనమః.


అని నమస్కరించవలెను.

“ఉత్తరీయార్ధం తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని మూడవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.

.

చతుర్ధ పంచమ యజ్నోపవీతములు ధరించుట:  

తిరిగి ఆచమనం చేసి

ఆచమన విధానం: 


ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,


1. ఓం కేశవాయ స్వాహా,

2. ఓం నారాయణాయ స్వాహా, 

3. ఓం మాధవాయ స్వాహా, 

అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను.  తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.

4. ఓం గోవిందాయనమః, 

5. ఓం విష్ణవే నమః, 

6. ఓం మధుసూదనాయనమః, 

7. ఓం త్రివిక్రమాయనమః, 

8. ఓం వామనాయనమః, 

9. ఓం శ్రీధరాయనమః, 

10. ఓం హృషీకేశాయనమః, 

11. ఓం పద్మనాభాయనమః, 

12. ఓం దామోదరాయనమః, 

13. ఓం సంకర్షణాయనమః,

14. ఓం వాసుదేవాయనమః, 

15. ఓం ప్రద్యుమ్నాయనమః, 

16. ఓం అనిరుద్ధాయనమః, 

17. ఓం పురుషోత్తమాయనమః, 

18. ఓం అధోక్షజాయనమః,

19. ఓం నారసింహాయనమః,

20. ఓం అత్యుతాయనమః, 

21. ఓం జనార్దనాయనమః, 

22. ఓం ఉపేంద్రాయనమః, 

23. ఓం హరయేనమః,

24. ఓం శ్రీకృష్ణాయనమః.


అని నమస్కరించవలెను.

 పై మంత్రమును పఠిస్తూ "ఆపన్నివారణార్థం చతుర్థ, పంచమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే" అని నాలుగు, ఐదు ముడులను ఒక దాని తరువాత మరి యొకటి దరించవలెను.  మొత్తము ఐదు ముడులు వచ్చునట్లు సరిచేసుకొనవలెను.

.

తరువాత పాత, కొత్త జంధ్యములను కలిపి, కుడి చేతి బొటన వ్రేలు, చూపుడు వ్రేలు మధ్యలో పట్టుకొని పైన కండువా కప్పి, “దశ గాయత్రి” (పదిమారులు గాయత్రి మంత్రము) జపించి, “యధాశక్తి దశ గాయత్రీ మంత్రం గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీటిని వదలవలెను.  (బ్రహ్మచారులు ఒక్క ముడినే ధరించవలయును)

గాయత్రీ మంత్రము:

“ఓం భూర్భువస్సువః తత్ సవితుర్ వరేణ్యం

భర్గో దేవస్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్ "

.

తరువాత ఈ క్రింది విజర్జన మంత్రము చదువుతూ పాత జందెమును తీసి వేయవలెను.

.

జీర్ణోపవీత విసర్జనం:

తిరిగి ఆచమనం చేసి 

ఆచమన విధానం: 


ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,


1. ఓం కేశవాయ స్వాహా,

2. ఓం నారాయణాయ స్వాహా, 

3. ఓం మాధవాయ స్వాహా, 

అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను.  తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.

4. ఓం గోవిందాయనమః, 

5. ఓం విష్ణవే నమః, 

6. ఓం మధుసూదనాయనమః, 

7. ఓం త్రివిక్రమాయనమః, 

8. ఓం వామనాయనమః, 

9. ఓం శ్రీధరాయనమః, 

10. ఓం హృషీకేశాయనమః, 

11. ఓం పద్మనాభాయనమః, 

12. ఓం దామోదరాయనమః, 

13. ఓం సంకర్షణాయనమః,

14. ఓం వాసుదేవాయనమః, 

15. ఓం ప్రద్యుమ్నాయనమః, 

16. ఓం అనిరుద్ధాయనమః, 

17. ఓం పురుషోత్తమాయనమః, 

18. ఓం అధోక్షజాయనమః,

19. ఓం నారసింహాయనమః,

20. ఓం అత్యుతాయనమః, 

21. ఓం జనార్దనాయనమః, 

22. ఓం ఉపేంద్రాయనమః, 

23. ఓం హరయేనమః,

24. ఓం శ్రీకృష్ణాయనమః.


అని నమస్కరించవలెను.

.

శ్లో:   ఉపవీతం ఛిన్నతంతుం కశ్మల దూషితం

విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయురస్తుమే ||

.

శ్లో:   పవిత్రదంతా మతి జీర్ణవంతం 

వేదాంత వేద్యం పరబ్రహ్మ రూపం 

ఆయుష్య మగ్ర్యం ప్రతిమంచ శుభ్రం

జీర్నోపవీతం విసృజంతు తేజః || 

.

శ్లో:   ఏతా వద్దిన పర్యంతం 

బ్రహ్మత్వం ధారితం మయా 

జీర్ణత్వాత్తే పరిత్యాగో 

గచ్ఛ సూత్ర యథా సుఖం ||

.

విసర్జన సమయములో తీసివేస్తున్న పాత జందెమును పాదములకు తాకకుండా చూసుకోవలెను.

తిరిగి ఆచమనం చేసి 

ఆచమన విధానం: 


ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,


1. ఓం కేశవాయ స్వాహా,

2. ఓం నారాయణాయ స్వాహా, 

3. ఓం మాధవాయ స్వాహా, 

అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను.  తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.

4. ఓం గోవిందాయనమః, 

5. ఓం విష్ణవే నమః, 

6. ఓం మధుసూదనాయనమః, 

7. ఓం త్రివిక్రమాయనమః, 

8. ఓం వామనాయనమః, 

9. ఓం శ్రీధరాయనమః, 

10. ఓం హృషీకేశాయనమః, 

11. ఓం పద్మనాభాయనమః, 

12. ఓం దామోదరాయనమః, 

13. ఓం సంకర్షణాయనమః,

14. ఓం వాసుదేవాయనమః, 

15. ఓం ప్రద్యుమ్నాయనమః, 

16. ఓం అనిరుద్ధాయనమః, 

17. ఓం పురుషోత్తమాయనమః, 

18. ఓం అధోక్షజాయనమః,

19. ఓం నారసింహాయనమః,

20. ఓం అత్యుతాయనమః, 

21. ఓం జనార్దనాయనమః, 

22. ఓం ఉపేంద్రాయనమః, 

23. ఓం హరయేనమః,

24. ఓం శ్రీకృష్ణాయనమః.


అని నమస్కరించవలెను.

కొత్త యజ్ఞోపవీతముతో కనీసం పది సార్లు గాయత్రి మంత్రము జపించి

గాయత్రీ మంత్రము:

“ఓం భూర్భువస్సువః తత్ సవితుర్ వరేణ్యం

భర్గో దేవస్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్ "


యధాశక్తి "గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీరు విడువ వలెను.  ఆ తరువాత గాయత్రీ దేవికి నైవేద్యము సమర్పించి, ఆ ప్రసాదమునకు నమస్కరించి స్వీకరించవలెను.  

.

తీసివేసిన పాత జందెమును ఏదైనా పచ్చని మొక్కపై వేయవలెను.  

.

నూతన యజ్ఞోపవీత ధారణ సమయములు:

జాతాశౌచ శుద్ధి యందు, మృతాశౌచ శుద్ధియందు, గ్రహణానంతరము, ప్రతి నాలుగు మాసముల అనంతరము నూతన యజ్ఞోపవీతమును ధరించి, పూర్వ యజ్ఞోపవీతమును త్యజించవలెను.. శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోపవీతం) దరించవలెను.  

.

ప్రార్థన:

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||

.

గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురు దేవో మహేశ్వరః |

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై: శ్రీ గురవే నమః ||

.

అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాం గతో 2పివా |

యస్మరేత్ పుండరీకాక్షం న బాహ్యాభ్యంతరశ్సుచి: ||

పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్ష!

(అంటూ తల పైకి నీళ్ళు చల్లుకొనవలెను)

.

ఆచమన విధానం: 


ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,


1. ఓం కేశవాయ స్వాహా,

2. ఓం నారాయణాయ స్వాహా, 

3. ఓం మాధవాయ స్వాహా, 

అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను. తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.

4. ఓం గోవిందాయనమః, 

5. ఓం విష్ణవే నమః, 

6. ఓం మధుసూదనాయనమః, 

7. ఓం త్రివిక్రమాయనమః, 

8. ఓం వామనాయనమః, 

9. ఓం శ్రీధరాయనమః, 

10. ఓం హృషీకేశాయనమః, 

11. ఓం పద్మనాభాయనమః, 

12. ఓం దామోదరాయనమః, 

13. ఓం సంకర్షణాయనమః,

14. ఓం వాసుదేవాయనమః, 

15. ఓం ప్రద్యుమ్నాయనమః, 

16. ఓం అనిరుద్ధాయనమః, 

17. ఓం పురుషోత్తమాయనమః, 

18. ఓం అధోక్షజాయనమః,

19. ఓం నారసింహాయనమః,

20. ఓం అత్యుతాయనమః, 

21. ఓం జనార్దనాయనమః, 

22. ఓం ఉపేంద్రాయనమః, 

23. ఓం హరయేనమః,

24. ఓం శ్రీకృష్ణాయనమః.


అని నమస్కరించవలెను. అటు పిమ్మట:

.

భూతోచ్చాటన:

(చేతిలో ఉద్ధరిణి తో నీరు పోసుకుని యీ క్రింది మంత్రమును చదివిన పిమ్మట భూమిపై నీళ్ళు జల్లవలెను.)

ఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః | దేవీ గాయత్రీచ్చందః ప్రాణాయామే వినియోగః

.

(ప్రాణాయామం కృత్వా కుంభకే ఇమం గాయత్రీ మంత్రముచ్ఛరేత్)

.

గృహస్తులు ఐదు వ్రేళ్లతో నాసికాగ్రమును పట్టుకొని మంత్రము చెప్పవలెను. బ్రహ్మచారులు బొటన వ్రేలి తో కుడి ముక్కును, అనామిక ఉంగరం వ్రేళ్లతో ఎడమ ముక్కును పట్టుకొని ఈ క్రింది మంత్రమును చెప్ప వలెను.

ఓం భూః, ఓం భువః, ఓగ్ మ్ సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ మ్ సత్యం, ఓం తత్స వితుర్వరేణ్యం బర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ | ఓం ఆపో జ్యోతి రసో2మృతం, బ్రహ్మ భూర్భువస్సువరోమ్||

.

తదుపరి సంకల్పం:

మమ ఉపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, ఆద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే, గంగా కావేరీయోర్మధ్యే, స్వగృహే (లేదా శోభన గృహే), సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల, పురుషార్ధ సిద్ధ్యర్ధం, ఆయుష్యాభివృద్ధ్యర్ధం, మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన యోగ్యతా ఫల సిద్ధ్యర్ధం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే 

.

(బ్రహ్మచారులు “ధర్మపత్నీ సమేతస్య" అని చెప్పనక్కర లేదు)

.

యజ్ఞోపవీతములు ఐదింటిని ఐదు ముడుల వద్దను, మరి రెండు సమానదూర స్థలముల వద్దను, కుంకుమను తడి చేసి అలంకరించి అధిష్టాన దేవత అయిన గాయత్రిని ధ్యానించి, యజ్ఞోపవీత ధారణా మంత్రము స్మరించి ఈ క్రింది విధముగా ధరించవలెను.

.

యజ్ఞోప వీతే త్తస్య మంత్రస్య పరమేష్టీ పరబ్రహ్మర్షి: పరమాత్మా, 

దేవతా, దేవీ గాయత్రీచ్చందః యజ్ఞోపవీత ధారణే వినియోగః ||

.

"ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం

ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్

ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం 

యజ్ఞోపవీతం బలమస్తు తేజః "

అని చెప్పి అని ధరించవలెను.

.

(మంత్ర పఠన సమయమున కుడి బాహువును పైకెత్తి శరీరము తగలకుండా జందెమును పట్టి యుంచి మంత్రాంతము నందు కుడిబాహువు మీదుగా ఎడమ బాహువు నందు ధరించవలెను.)

.

ద్వితీయోపవీత ధారణం:

తిరిగి ఆచమనం చేసి 

ఆచమన విధానం: 


ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,


1. ఓం కేశవాయ స్వాహా,

2. ఓం నారాయణాయ స్వాహా, 

3. ఓం మాధవాయ స్వాహా, 

అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను. తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.

4. ఓం గోవిందాయనమః, 

5. ఓం విష్ణవే నమః, 

6. ఓం మధుసూదనాయనమః, 

7. ఓం త్రివిక్రమాయనమః, 

8. ఓం వామనాయనమః, 

9. ఓం శ్రీధరాయనమః, 

10. ఓం హృషీకేశాయనమః, 

11. ఓం పద్మనాభాయనమః, 

12. ఓం దామోదరాయనమః, 

13. ఓం సంకర్షణాయనమః,

14. ఓం వాసుదేవాయనమః, 

15. ఓం ప్రద్యుమ్నాయనమః, 

16. ఓం అనిరుద్ధాయనమః, 

17. ఓం పురుషోత్తమాయనమః, 

18. ఓం అధోక్షజాయనమః,

19. ఓం నారసింహాయనమః,

20. ఓం అత్యుతాయనమః, 

21. ఓం జనార్దనాయనమః, 

22. ఓం ఉపేంద్రాయనమః, 

23. ఓం హరయేనమః,

24. ఓం శ్రీకృష్ణాయనమః.


అని నమస్కరించవలెను.

“మమ నిత్యకర్మానుష్టాన యోగ్యతా సిద్ధ్యర్ధం ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని రెండవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.

.

తృతీయ యజ్ఞోపవీత ధారణం:

తిరిగి ఆచమనం చేసి 

ఆచమన విధానం: 


ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,


1. ఓం కేశవాయ స్వాహా,

2. ఓం నారాయణాయ స్వాహా, 

3. ఓం మాధవాయ స్వాహా, 

అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను. తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.

4. ఓం గోవిందాయనమః, 

5. ఓం విష్ణవే నమః, 

6. ఓం మధుసూదనాయనమః, 

7. ఓం త్రివిక్రమాయనమః, 

8. ఓం వామనాయనమః, 

9. ఓం శ్రీధరాయనమః, 

10. ఓం హృషీకేశాయనమః, 

11. ఓం పద్మనాభాయనమః, 

12. ఓం దామోదరాయనమః, 

13. ఓం సంకర్షణాయనమః,

14. ఓం వాసుదేవాయనమః, 

15. ఓం ప్రద్యుమ్నాయనమః, 

16. ఓం అనిరుద్ధాయనమః, 

17. ఓం పురుషోత్తమాయనమః, 

18. ఓం అధోక్షజాయనమః,

19. ఓం నారసింహాయనమః,

20. ఓం అత్యుతాయనమః, 

21. ఓం జనార్దనాయనమః, 

22. ఓం ఉపేంద్రాయనమః, 

23. ఓం హరయేనమః,

24. ఓం శ్రీకృష్ణాయనమః.


అని నమస్కరించవలెను.

“ఉత్తరీయార్ధం తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని మూడవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.

.

చతుర్ధ పంచమ యజ్నోపవీతములు ధరించుట:  

తిరిగి ఆచమనం చేసి

ఆచమన విధానం: 


ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,


1. ఓం కేశవాయ స్వాహా,

2. ఓం నారాయణాయ స్వాహా, 

3. ఓం మాధవాయ స్వాహా, 

అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను. తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.

4. ఓం గోవిందాయనమః, 

5. ఓం విష్ణవే నమః, 

6. ఓం మధుసూదనాయనమః, 

7. ఓం త్రివిక్రమాయనమః, 

8. ఓం వామనాయనమః, 

9. ఓం శ్రీధరాయనమః, 

10. ఓం హృషీకేశాయనమః, 

11. ఓం పద్మనాభాయనమః, 

12. ఓం దామోదరాయనమః, 

13. ఓం సంకర్షణాయనమః,

14. ఓం వాసుదేవాయనమః, 

15. ఓం ప్రద్యుమ్నాయనమః, 

16. ఓం అనిరుద్ధాయనమః, 

17. ఓం పురుషోత్తమాయనమః, 

18. ఓం అధోక్షజాయనమః,

19. ఓం నారసింహాయనమః,

20. ఓం అత్యుతాయనమః, 

21. ఓం జనార్దనాయనమః, 

22. ఓం ఉపేంద్రాయనమః, 

23. ఓం హరయేనమః,

24. ఓం శ్రీకృష్ణాయనమః.


అని నమస్కరించవలెను.

 పై మంత్రమును పఠిస్తూ "ఆపన్నివారణార్థం చతుర్థ, పంచమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే" అని నాలుగు, ఐదు ముడులను ఒక దాని తరువాత మరి యొకటి దరించవలెను. మొత్తము ఐదు ముడులు వచ్చునట్లు సరిచేసుకొనవలెను.

.

తరువాత పాత, కొత్త జంధ్యములను కలిపి, కుడి చేతి బొటన వ్రేలు, చూపుడు వ్రేలు మధ్యలో పట్టుకొని పైన కండువా కప్పి, “దశ గాయత్రి” (పదిమారులు గాయత్రి మంత్రము) జపించి, “యధాశక్తి దశ గాయత్రీ మంత్రం గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీటిని వదలవలెను. (బ్రహ్మచారులు ఒక్క ముడినే ధరించవలయును)

గాయత్రీ మంత్రము:

“ఓం భూర్భువస్సువః తత్ సవితుర్ వరేణ్యం

భర్గో దేవస్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్ "

.

తరువాత ఈ క్రింది విజర్జన మంత్రము చదువుతూ పాత జందెమును తీసి వేయవలెను.

.

జీర్ణోపవీత విసర్జనం:

తిరిగి ఆచమనం చేసి 

ఆచమన విధానం: 


ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,


1. ఓం కేశవాయ స్వాహా,

2. ఓం నారాయణాయ స్వాహా, 

3. ఓం మాధవాయ స్వాహా, 

అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను. తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.

4. ఓం గోవిందాయనమః, 

5. ఓం విష్ణవే నమః, 

6. ఓం మధుసూదనాయనమః, 

7. ఓం త్రివిక్రమాయనమః, 

8. ఓం వామనాయనమః, 

9. ఓం శ్రీధరాయనమః, 

10. ఓం హృషీకేశాయనమః, 

11. ఓం పద్మనాభాయనమః, 

12. ఓం దామోదరాయనమః, 

13. ఓం సంకర్షణాయనమః,

14. ఓం వాసుదేవాయనమః, 

15. ఓం ప్రద్యుమ్నాయనమః, 

16. ఓం అనిరుద్ధాయనమః, 

17. ఓం పురుషోత్తమాయనమః, 

18. ఓం అధోక్షజాయనమః,

19. ఓం నారసింహాయనమః,

20. ఓం అత్యుతాయనమః, 

21. ఓం జనార్దనాయనమః, 

22. ఓం ఉపేంద్రాయనమః, 

23. ఓం హరయేనమః,

24. ఓం శ్రీకృష్ణాయనమః.


అని నమస్కరించవలెను.

.

శ్లో: ఉపవీతం ఛిన్నతంతుం కశ్మల దూషితం

విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయురస్తుమే ||

.

శ్లో: పవిత్రదంతా మతి జీర్ణవంతం 

వేదాంత వేద్యం పరబ్రహ్మ రూపం 

ఆయుష్య మగ్ర్యం ప్రతిమంచ శుభ్రం

జీర్నోపవీతం విసృజంతు తేజః || 

.

శ్లో: ఏతా వద్దిన పర్యంతం 

బ్రహ్మత్వం ధారితం మయా 

జీర్ణత్వాత్తే పరిత్యాగో 

గచ్ఛ సూత్ర యథా సుఖం ||

.

విసర్జన సమయములో తీసివేస్తున్న పాత జందెమును పాదములకు తాకకుండా చూసుకోవలెను.

తిరిగి ఆచమనం చేసి 

ఆచమన విధానం: 


ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,


1. ఓం కేశవాయ స్వాహా,

2. ఓం నారాయణాయ స్వాహా, 

3. ఓం మాధవాయ స్వాహా, 

అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను. తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.

4. ఓం గోవిందాయనమః, 

5. ఓం విష్ణవే నమః, 

6. ఓం మధుసూదనాయనమః, 

7. ఓం త్రివిక్రమాయనమః, 

8. ఓం వామనాయనమః, 

9. ఓం శ్రీధరాయనమః, 

10. ఓం హృషీకేశాయనమః, 

11. ఓం పద్మనాభాయనమః, 

12. ఓం దామోదరాయనమః, 

13. ఓం సంకర్షణాయనమః,

14. ఓం వాసుదేవాయనమః, 

15. ఓం ప్రద్యుమ్నాయనమః, 

16. ఓం అనిరుద్ధాయనమః, 

17. ఓం పురుషోత్తమాయనమః, 

18. ఓం అధోక్షజాయనమః,

19. ఓం నారసింహాయనమః,

20. ఓం అత్యుతాయనమః, 

21. ఓం జనార్దనాయనమః, 

22. ఓం ఉపేంద్రాయనమః, 

23. ఓం హరయేనమః,

24. ఓం శ్రీకృష్ణాయనమః.


అని నమస్కరించవలెను.

కొత్త యజ్ఞోపవీతముతో కనీసం పది సార్లు గాయత్రి మంత్రము జపించి

గాయత్రీ మంత్రము:

“ఓం భూర్భువస్సువః తత్ సవితుర్ వరేణ్యం

భర్గో దేవస్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్ "


యధాశక్తి "గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీరు విడువ వలెను. ఆ తరువాత గాయత్రీ దేవికి నైవేద్యము సమర్పించి, ఆ ప్రసాదమునకు నమస్కరించి స్వీకరించవలెను.  

.

తీసివేసిన పాత జందెమును ఏదైనా పచ్చని మొక్కపై వేయవలెను.  

.

నూతన యజ్ఞోపవీత ధారణ సమయములు:

జాతాశౌచ శుద్ధి యందు, మృతాశౌచ శుద్ధియందు, గ్రహణానంతరము, ప్రతి నాలుగు మాసముల అనంతరము నూతన యజ్ఞోపవీతమును ధరించి, పూర్వ యజ్ఞోపవీతమును త్యజించవలెను.

పితృదేవతలు ముగ్గుదాటుకుని రాలేరట

 పితృదేవతలు ముగ్గుదాటుకుని రాలేరట


ఏ ఇంటిముందు ఉదయాన్నే కళ్లాపిచల్లి ముగ్గుపెట్టి వుంటుందో ఆ ఇంటికి రావడానికే లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. ఈ కారణంగానే ఉదయాన్నే వాకిలి శుభ్రంగా ఊడ్చి ఆవుపేడతో కళ్లాపిచల్లి బియ్యపు పిండితో ముగ్గు పెడుతుంటారు. 

 

ఇక పండుగ రోజుల్లో ఈ ముగ్గు మరింత అందంగా ఉండేలా శ్రద్ధ తీసుకుంటూ వుంటారు. పూర్వకాలం నుంచి కూడా ఇది మన ఆచారవ్యవహారాల్లో ఒక భాగమైపోయింది. 

 

అయితే ఇంట్లో పితృ కార్యాలు నిర్వహించవలసి వచ్చినప్పుడు, ఇంటిముందు ముగ్గు పెట్టాలా వద్దా అనే సందేహం చాలా మందిలో కలుగుతుంటుంది. శాస్త్రం మాత్రం పితృ కార్యం నిర్వహించే రోజున ఉదయాన్నే వాకిట్లో ముగ్గు పెట్టకూడదని చెబుతోంది. ముగ్గులేని వాకిట్లోకి రాకుండా లక్ష్మీదేవి ఎలా వెనుదిరిగి పోతుందో, ముగ్గువేసిన వాకిట్లోకి రాకుండా పితృదేవతలు కూడా అలానే వెనుదిరిగిపోతారని అంటోంది


పితృదేవతలు ముగ్గుదాటుకుని రాలేరట. అందువల్లనే పితృకార్యం నిర్వహించే రోజున ముగ్గు పెట్టకూడదని పండితులు అంటున్నారు. వాకిట్లో ముగ్గులేని ఇళ్లలోకి ప్రవేశించడానికి దుష్టశక్తులు సిద్ధంగా ఉంటాయని అంటారు.

 

అందువలన పితృకార్యం నిర్వహణ పూర్తి అయిన తరువాత, వెంటనే వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గుపెట్టాలని చెబుతుంటారు. దీనిని బట్టి ముగ్గు అనేది ఇంటికి అందాన్ని తీసుకురావడమే కాదు, ఇంటికి రక్షణని కూడా ఇస్తుందని గ్రహించాలి.


****సేకరణ

భక్తపోతన గారి శ్రీమద్భాగవతము

 *20.08.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2236(౨౨౩౬)*


*10.1-1342-*


*క. ప్రల్లద మేటికి గోపక!*

*బల్లిదుఁడను; లోకమందుఁ బ్రఖ్యాతుఁడ; నా*

*చల్లడము క్రింద దూఱని*

*మల్లురు లే రెందు ధరణిమండలమందున్.* 🌺



*_భావము: “ఇక వేరే మాటలెందుకు? ఈ లోకములో ప్రఖ్యాతి గాంచిన మహా బలశాలిని, ఓడిపోయి నా లంగోటీ క్రింది నుండి దూరని వీరుడు లేనే లేదు ఈ భూమండలంలో."_* 

*_(ఓడిపోయిన మల్లుడు, గెలిచిన వాడి కాళ్ళ మధ్య నుండి దూరాలి ఇది ఒక ఆనవాయితీ- అంటే అందరినీ గెలిచిన మేటి వీరుణ్ణి అని గొప్పలు చెప్పుకుంటున్నాడు)._* 🙏

 


*_Meaning: Chanura was boasting about his power and unblemished wrestling record: “Why so many words? I am known as the most renowned powerful wrestler. I had vanquished every other wrestler and all of them surrendered before me.”_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

పగలని భారతదేశం

 పగలని భారతదేశం హిమాలయాల నుండి హిందూ మహాసముద్రం వరకు మరియు ఇరాన్ నుండి ఇండోనేషియా వరకు విస్తరించింది. 1857 లో భారతదేశ విస్తీర్ణం 83 లక్షల చదరపు కిలోమీటర్లు, ఇది ప్రస్తుతం 33 లక్షల చదరపు కిలోమీటర్లు. 1857 నుండి 1947 వరకు, భారతదేశం అనేక సార్లు బాహ్య శక్తులచే చీలిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ 1876 లో భారతదేశం, 1904 లో నేపాల్, 1906 లో భూటాన్, 1907 లో టిబెట్, 1935 లో శ్రీలంక, 1937 లో మయన్మార్ మరియు 1947 లో పాకిస్తాన్ విడిపోయాయి.

 శ్రీలంక

 1935 లో బ్రిటిష్ వారు శ్రీలంకను భారతదేశం నుండి వేరు చేశారు. శ్రీలంక యొక్క పాత పేరు సింహల్‌దీప్. సింహల్‌దీప్ పేరు తరువాత సిలోన్ గా మార్చబడింది. అశోక చక్రవర్తి కాలంలో శ్రీలంక పేరు తామ్రపర్ణి. అశోక చక్రవర్తి కుమారుడు మహేంద్ర మరియు కుమార్తె సంఘమిత్ర బౌద్ధమత ప్రచారం కోసం శ్రీలంక వెళ్లారు. శ్రీలంక ఐక్య భారతదేశంలో ఒక భాగం.

 ఆఫ్ఘనిస్తాన్

 ఆఫ్ఘనిస్తాన్ యొక్క పురాతన పేరు ఉపగణస్థాన్ మరియు కాందహార్ గాంధార. ఆఫ్ఘనిస్తాన్ ఒక శైవ దేశం. మహాభారతంలో వర్ణించబడిన గాంధార ఆఫ్ఘనిస్తాన్‌లో ఉంది, ఇక్కడ కౌరవుల తల్లి గాంధారి మరియు తల్లి మామ శకుని ఉన్నారు. కాందహార్ అంటే గాంధార వర్ణన షాజహాన్ పాలన వరకు కనుగొనబడింది. ఇది భారతదేశంలో ఒక భాగం. 1876 ​​లో రష్యా మరియు బ్రిటన్ మధ్య గండమాక్ ఒప్పందం కుదిరింది. ఒప్పందం తరువాత, ఆఫ్ఘనిస్తాన్ ప్రత్యేక దేశంగా ఆమోదించబడింది.

 మయన్మార్ (బర్మా)

 మయన్మార్ (బర్మా) యొక్క పురాతన పేరు బ్రహ్మదేశం. 1937 లో, మయన్మార్ అంటే బర్మాకు ప్రత్యేక దేశ గుర్తింపు బ్రిటిష్ వారు ఇచ్చారు. ప్రాచీన కాలంలో, హిందూ రాజు ఆనందవ్రతుడు ఇక్కడ పరిపాలించాడు.

 నేపాల్

 నేపాల్‌ను పురాతన కాలంలో దేవధర్ అని పిలిచేవారు. లార్డ్ బుద్ధుడు లుంబినిలో జన్మించాడు మరియు తల్లి సీత నేడు నేపాల్‌లో ఉన్న జనక్‌పూర్‌లో జన్మించింది. 1904 లో బ్రిటిష్ వారు నేపాల్‌ను ప్రత్యేక దేశంగా చేశారు. నేపాల్‌ను హిందూ దేశం నేపాల్ అని పిలుస్తారు. 1904 లో బ్రిటిష్ వారు నేపాల్‌ను ప్రత్యేక దేశంగా చేశారు. నేపాల్‌ను హిందూ రాష్ట్ర నేపాల్ అని పిలుస్తారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు, నేపాల్ రాజును నేపాల్ నరేష్ అని పిలిచేవారు. నేపాల్‌లో 81 శాతం హిందువులు మరియు 9% బౌద్ధులు ఉన్నారు. చక్రవర్తి అశోకుడు మరియు సముద్రగుప్తుల కాలంలో నేపాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండేది. 1951 లో, నేపాల్ మహారాజా త్రిభువన్ సింగ్ అప్పటి భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను నేపాల్‌ను భారతదేశంలో విలీనం చేయమని విజ్ఞప్తి చేశారు, కానీ జవహర్‌లాల్ నెహ్రూ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు.

 థాయిలాండ్

 థాయ్‌లాండ్‌ను 1939 వరకు శ్యామ్ అని పిలిచేవారు. ప్రధాన నగరాలు అయోధ్య, శ్రీ విజయ్ మొదలైనవి. సియాంలో బౌద్ధ దేవాలయాల నిర్మాణం మూడవ శతాబ్దంలో ప్రారంభమైంది. నేటికీ ఈ దేశంలో అనేక శివాలయాలు ఉన్నాయి. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో కూడా వందలాది హిందూ దేవాలయాలు ఉన్నాయి.

 కంబోడియా

 కంబోడియా సంస్కృత పేరు కాంబోజ్ నుండి వచ్చింది, ఇది విచ్ఛిన్నం కాని భారతదేశంలో భాగం. భారత సంతతికి చెందిన కౌండిన్య రాజవంశం మొదటి శతాబ్దం నుండే ఇక్కడ పాలించింది. ఇక్కడి ప్రజలు శివుడు, విష్ణువు మరియు బుద్ధుడిని పూజించేవారు. జాతీయ భాష సంస్కృతం. నేటికీ కంబోడియాలో, చెట్, విశాఖ, ఆసాధ వంటి భారతీయ నెలల పేర్లు ఉపయోగించబడుతున్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అంకోర్వత్ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడింది, దీనిని హిందూ రాజు సూర్యదేవ్ వర్మన్ నిర్మించారు. ఆలయ గోడలలో రామాయణం మరియు మహాభారతానికి సంబంధించిన చిత్రాలు ఉన్నాయి. అంకోర్వాత్ యొక్క పురాతన పేరు యశోధర్‌పూర్.

 వియత్నాం

 వియత్నాం యొక్క పురాతన పేరు చంపాదేశ్ మరియు దాని ప్రధాన నగరాలు ఇంద్రపూర్, అమరావతి మరియు విజయ్. అనేక శివ, లక్ష్మి, పార్వతి మరియు సరస్వతి ఆలయాలు ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ శివలింగాన్ని కూడా పూజించారు. ప్రజలు నిజానికి శైవులు అయిన వారిని చమ్ అని పిలిచేవారు.

 మలేషియా

 మలేషియా యొక్క పురాతన పేరు మలయ్ దేశ్, ఇది సంస్కృత పదం, అంటే పర్వతాల భూమి. మలేషియా రామాయణం మరియు రఘువంశంలో కూడా వర్ణించబడింది. మలయాలో శైవమతం ఆచరించబడింది. దుర్గాదేవి మరియు వినాయకుడిని పూజించారు. ఇక్కడ ప్రధాన లిపి బ్రాహ్మీ మరియు సంస్కృతం ప్రధాన భాష.

 ఇండోనేషియా

 ఇండోనేషియా యొక్క పురాతన పేరు దీపంతర్ భారత్, ఇది పురాణాలలో కూడా ప్రస్తావించబడింది. దీపంతర్ భారత్ అంటే భారతదేశం అంతటా ఉన్న మహాసముద్రం. ఇది హిందూ రాజుల రాజ్యం. అతిపెద్ద శివాలయం జావా ద్వీపంలో ఉంది. దేవాలయాలు ప్రధానంగా రాముడు మరియు శ్రీకృష్ణునితో చెక్కబడ్డాయి. భువనకోశం 525 సంస్కృత శ్లోకాలను కలిగి ఉన్న పురాతన పుస్తకం.

 ఇండోనేషియాలోని ప్రముఖ సంస్థల పేర్లు లేదా నినాదాలు ఇప్పటికీ సంస్కృతంలో ఉన్నాయి:


 ఇండోనేషియా పోలీస్ అకాడమీ - ధర్మ బీజాక్షన క్షత్రియ


 ఇండోనేషియా జాతీయ సాయుధ దళాలు - త్రి ధర్మ ఏక్ కర్మ


 ఇండోనేషియా ఎయిర్‌లైన్స్ - గరున్ ఎయిర్‌లైన్స్


 ఇండోనేషియా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ - చరక్ భువన్


 ఇండోనేషియా ఆర్థిక మంత్రిత్వ శాఖ - నగర్ ధన్ రక్ష


 ఇండోనేషియా సుప్రీం కోర్టు - ధర్మ యుక్తి


 టిబెట్

 టిబెట్ యొక్క పురాతన పేరు త్రివిష్టమ్, ఇది రెండు భాగాలుగా విభజించబడింది. 1907 లో చైనీయులు మరియు బ్రిటిష్ వారి మధ్య ఒప్పందం తర్వాత ఒక భాగం చైనాకు మరియు మరొక భాగం లామాకు ఇవ్వబడింది. 1954 లో, భారత ప్రజలకు జవహర్‌లాల్ నెహ్రూ చైనా ప్రజలకు మద్దతుగా టిబెట్‌ను చైనాలో భాగంగా అంగీకరించారు.

 భూటాన్

 భూటాన్ 1906 లో బ్రిటిష్ వారిచే భారతదేశం నుండి వేరు చేయబడింది మరియు ప్రత్యేక దేశంగా గుర్తించబడింది. భూటాన్ అనేది సంస్కృత పదం భు ఉత్తన్ నుండి వచ్చింది, అంటే ఎత్తైన భూమి.

 పాకిస్తాన్

 ఆగష్టు 14, 1947 న బ్రిటిష్ వారిచే భారతదేశ విభజన జరిగింది మరియు పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ మరియు పశ్చిమ పాకిస్తాన్‌గా ఉనికిలోకి వచ్చింది. మొహమ్మద్ అలీ జిన్నా 1940 నుండి మత ప్రాతిపదికన ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేస్తున్నాడు, అది తరువాత పాకిస్తాన్‌గా మారింది. 1971 లో భారతదేశ సహకారంతో పాకిస్తాన్ మళ్లీ విభజించబడింది మరియు బంగ్లాదేశ్ ఉనికిలోకి వచ్చింది. పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ భారతదేశంలోని భాగాలు.