*21.08.2021*
*వందేమాతరం*
*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏
*రోజుకో పద్యం: 2237(౨౨౩౭)*
*10.1-1343- నుండి 10.1-1345-*
*సీ. మహిమతో నుండగ మథురాపురము గాని*
*పొలుపార వైకుంఠపురము గాదు*
*గర్వంబుతో నుండఁ గంసుని సభ గాని*
*సంసార రహితుల సభయుఁ గాదు*
*ప్రకటించి వినఁగ నా బాహునాదము గాని*
*నారదు వీణాస్వనంబు గాదు*
*చదురు లాడఁగ మల్లజన నిగ్రహము గాని*
*రమతోడి ప్రణయ విగ్రహము గాదు*
*తే. వెలసి తిరుగంగ వేదాంతవీధి గాదు*
*మొఱఁగిపో ముని మనముల మూల గాదు*
*సాఁగి నడువంగ భక్తుల జాడ గాదు*
*శౌరి! నా మ్రోల నీ వెందు జనియె దింక."* 🌺
*_భావము: చాణూరుడు శ్రీకృష్ణునితో ఎకసక్కెంగా ఇంకా ఇలా అంటున్నాడు: "నీవు శ్రీహరివి, అది ఇదీ అంటావేమో! విను. నీ మహిమలు పని చేయటానికి ఇది మధుర, వైకుంఠము కాదు; ఇది కంసుని సభ, సంన్యాసుల సత్సంగము కాదు; ఇది నా జబ్బల మీద చరచిన చప్పుడు, నారదుని వీణానాదము కాదు; నీ చతురోక్తులతో రంజింపచెయ్యటానికి ఇది లక్ష్మీదేవితో ప్రణయ కలహముకాదు, మల్లయోధులతో సంగ్రామము; శూరసేనుని వంశములో జన్మించిన వాడా! ఇంకా చెప్పాలంటే తిరగటానికి ఇవి వేదాంతవీధులు కావు, బోధలు చేయటానికి మునుల చిత్తములు కావు, విజృంభించి నడవటానికి ఇవి భక్త సమూహాలు కావు, ఇక నీకే దిక్కు లేదు, ఎక్కడికి పోతావు?"_* 🙏
*_Meaning: Chanura was making mockery of Sri Krishna: "You might claim You are Sri Hari and all big things about Yourself. Listen from me- This is Madhura and Kamsa's court, not Vaikuntham and meeting of ascetics. These slaps on my shoulder are as war cries, not music on Veena of Narada. These are not pleasantries to exchange with Goddess LakshmiDevi, but fight with expert wrestlers. Hey Sri Krishna, born in the clan of Surasena! Know further that these are not paths of Vedanta, not minds of sages to listen to Your teachings, not an assembly of Your Bhaktas to excel. Where can You go now? You can not escape from my grip."_* 🙏
*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*
*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*
*Kiran (9866661454)*
*Pavan Kumar (9347214215).*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి