21, ఆగస్టు 2021, శనివారం

ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండవలసిన మందు

 ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండవలసిన మందు 

మందు పేరు: కుటజారిష్ట 


కంపని : పతంజలి 


ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. మనం ఎంత జాగ్రత్తగా వున్నా కూడా మనం తినే ఆహారం కలుషితం అవ్వటానికి ఆస్కారం వున్నది. బయటి తిండి తినకుంటే చాల మంచిది కానీ మనం టిఫిన్లు తినకుండా ఉంటామా చెప్పండి. వుండంకదా . ఏమాత్రం నీరు కలుషితమైనా వెంటనే మనకు వచ్చే అనారోగ్య సమశ్య విరోచనాలు, కడుపులో నొప్పి. విరోచనాలు నీళ్ల విరోచనాలే కావచ్చు లేక అజీర్తి విరోచనాలే కావచ్చు. కడుపులోనొప్పి మాత్రం తప్పకుండ ఉంటుంది. దీనినే మనం మెలిపెట్టినట్లు వున్నది అని అంటాము. ఆ బాధ అనుభవిస్తే కానీ తెలియదు. ప్రతి ఇంట్లో ఈ వర్షాకాలంలో అందరు కానీ కొంతమంది కానీ తప్పకుండ ఈ సమస్యతో బాధపడే వారే. 


మనం డాక్టరు దగ్గరికి వెళితే డాక్టారు ఫీజు 100 నుండి 200 తరువాత అయన వ్రాసే మందులు 400-500 వెరసి మనకు 5 నుండి 6 వందల వరకు ఖర్చు వస్తుంది. అవునా కాదా? మరి అతి తక్కువ ఖర్చుతో డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మనం ఇంట్లోనే చికిత్స చేసుకుంటే ఎట్లావుంటుంది. 


ఒక వేపు విరోచనాలు, పైన వాన డాక్టరు వద్దకు వెళ్లాలంటే స్కూటర్ మీద తడుసుకుంటూ వెళ్ళాలి. డాక్టరు అప్పోయింట్మెంట్ ఏ గంట కుర్చుంటేనో దొరుకుతుంది. ఈ మధ్యలో రెండు మూడు సార్లు వెళ్లాల్సి వస్తుంది, ఆ కష్టం యెట్లా ఉంటుందో మనకు తెలియంది కాదు. కాబాట్టి నేను చెప్పే ఈ మందు ఈ రోజే కొనుక్కొని తెచ్చుకుంటే ఇంట్లో ఎవ్వరికీ విరోచనాలు అయినా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వాడి ఒక గంట రెండు గంటలలో ఉపశమనం పొందవచ్చు. ఏమంటారు. 


ఈ కుటజారిష్ట గూర్చి తెలుసుకుందాము. ఇది పూర్తిగా ఆయుర్వేదానికి సంబందించిన మందు వనమూలికలతో తయారుచేసింది. నూటికి తొంబైతొమ్మిది పళ్ళు సురక్షితమైనది. చిన్న పిల్లల దగ్గరనుండి వృద్ధుల వరకు ఇంట్లోని అందరు వాడదగిన మంచి మందు. మనం మాత్తర్లు కొనుక్కొంటే అవి కొన్ని వాడి మరల మిగిలినవి ఉపయోగించకుండా పారేసుకుంటాము. మళ్ళి డాక్టరు దగ్గరికి వెళతాము. వెరసి మళ్ళి 5 వందల ఖర్చు తప్పదు. 


ఈ మందు ద్రవరూపంలో 450 మిల్లి లీటర్ల పరిమాణంలో దొరుకుతుంది ధర కేవలము Rs 140/+  ఇంకొక విషయం మీరు ఒక్కసారి ఈ మందు కొని తెచ్చుకుంటే 10 సంవత్సరాలలోపు దీనిని వాడ వచ్చు. అంటే మీ అమ్మాయి డిగ్రీ చదువుతుంటే కొన్న సీసా మీ అమ్మాయి పెండ్లి అయ్యి మనమరాలు/ మనమడు పుట్టిన దాకా ఈ మందు క్షేమంగా మీ ఇంట్లో వుంచుకోవచ్చు. ఒకటి రెండు డోసులు తీసుకుంటే మీ విరోచనాలు వెంటనే కడతాయి చక్కటి స్వస్థత చేకూర్చుతుంది. కాక పొతే ఈ మందు చేదుగా ఉంటుంది. మందు ఒకటి రెండు చెంచాలు ఒక చిన్న గ్లాసులో పోసుకొని తగినంత నీటిని కలిపి సేవించండి. 


అందరు తక్కువ ఖర్చుతో మన స్వదేశీ వైద్య విధానంలో, స్వదేశీ కంపెనీ ప్రొడక్టులతో ఆరోగ్యాన్ని చేకూర్చుకోవాలనే నా ఉద్యమాన్ని మీరు బలపరుస్తారనుకుంటా.  



కంపెనీ వారు ఇచ్చిన సమాచారం 

Kutajarishta brings relief to you from chronic indigestion problems, upset stomach, diarrhoea, fever, etc. Contaminated food and drinks constantly harm and weaken your digestive system. It is a time-tested formulation that soothes your stomach, heals the damages from contaminations and boosts your digestion. It has been clinically proven to have no side effects.

మందు వాడిన వారు వారి అనుభవాలను కింద కామెంటులో తెలుపగలరు. 

కామెంట్‌లు లేవు: