*20.08.2021*
*వందేమాతరం*
*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏
*రోజుకో పద్యం: 2236(౨౨౩౬)*
*10.1-1342-*
*క. ప్రల్లద మేటికి గోపక!*
*బల్లిదుఁడను; లోకమందుఁ బ్రఖ్యాతుఁడ; నా*
*చల్లడము క్రింద దూఱని*
*మల్లురు లే రెందు ధరణిమండలమందున్.* 🌺
*_భావము: “ఇక వేరే మాటలెందుకు? ఈ లోకములో ప్రఖ్యాతి గాంచిన మహా బలశాలిని, ఓడిపోయి నా లంగోటీ క్రింది నుండి దూరని వీరుడు లేనే లేదు ఈ భూమండలంలో."_*
*_(ఓడిపోయిన మల్లుడు, గెలిచిన వాడి కాళ్ళ మధ్య నుండి దూరాలి ఇది ఒక ఆనవాయితీ- అంటే అందరినీ గెలిచిన మేటి వీరుణ్ణి అని గొప్పలు చెప్పుకుంటున్నాడు)._* 🙏
*_Meaning: Chanura was boasting about his power and unblemished wrestling record: “Why so many words? I am known as the most renowned powerful wrestler. I had vanquished every other wrestler and all of them surrendered before me.”_* 🙏
*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*
*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*
*Kiran (9866661454)*
*Pavan Kumar (9347214215).*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి