7, నవంబర్ 2022, సోమవారం

శివలింగాలలోని రకాలు

 శివలింగాలలోని రకాలు , వాటిని పూజించడం వలన కలుగు ఫలితాలు  - సంపూర్ణ వివరణ .


      దేవతలలో కెల్లా భక్తసులభుడు ఐన వాడు పరమశివుడు . ఈయనకి భోళాశంకరుడు అనే పేరు కూడా కలదు. "ఓం నమ శివాయః " అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఒక మారేడు దళాన్ని సమర్పించి ఒక చెంబుడు నీళ్లతో అభిషేకం చేస్తే చాలు పొంగిపోయి కోరిన వరాలను  ఇచ్చేసేవాడు శివయ్య మాత్రమే . అప్పుడే కొపం , అప్పుడే శాంతం . అదే శివయ్య గొప్పతనం. శివుడు స్వర్గనరకాదులన్నింటినే గాక ఆత్మకు ఆత్మకు మధ్య కర్మబంధాలను కూడా దహించివేయును.  అలాంటి పరమేశ్వరుడి యొక్క పూజ గురించి మీకు వివరిస్తాను. శివుడికి లింగపూజ ప్రధానమైనది. ఎటువంటి లింగాలను పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మీకు సంపూర్ణంగా వివరిస్తాను. 


      ముందుగా మీకు బాణలింగాల గురించి వివరిస్తాను.


 * బాణ లింగాలు  -


          బాణాసురుడు శివుడిని ప్రత్యక్షం చేసుకుని "మీరు సదా లింగ రూపములో ఇక్కడ ఉండవలెను " అని వరము కోరుకున్నాడు. దానికి శివుడు "తధాస్తు " అన్నాడు. అలా ఏర్పడిన లింగాలకే బాణలింగాలు అని పేరు వచ్చింది. ఒక్క బాణలింగ పూజలోనే నానావిధములు అయిన లింగాలను పూజించిన ఫలితాలు వచ్చును. ఇవి నర్మదా మొదలగు నదులలో లభించును. ఈ బాణ లింగాలకు బంగారు , వెండి , రాగి లోహములతో గాని , స్పటికముతో గాని కడకు పాషాణం (నల్ల రాయి ) తో అయినా వేదికను ఏర్పరిచి దానిపైన పూజించవలెను. ఈ బాణలింగాలను మొదట పరీక్షించి సంస్కారం అనగా శుద్ది చేయవలెను . ఈ బాణలింగాలు అనేక విధములుగా ఉండును. ఇందులో మేఘమువలె ఉండి , కపిలవర్ణము గల లింగము శుభప్రదం అయినది. తుమ్మెద వంటి నీల లింగములను పీఠములున్నను లేకపోయినను , శుద్ది లేకున్నను పూజించవచ్చు. సామాన్యంగా బాణలింగాలు తామరవిత్తుల వలే , పండిన నేరేడు పండ్లవలే , కోడిగుడ్డు ఆకారము వలే ఉండును. కొన్ని తెలుపు మరికొన్ని నలుపు , ఇంకొన్ని తేనె రంగుతో ఉండును. ఈ లింగాలు ప్రశస్తమైనవి. 


       వివిధ ద్రవ్యాలతో లింగాలను నిర్మించే విధానం గరుడపురాణంలో కనిపించును. 


    ఆయా లింగాల గురించి వాటి పూజించటం వలన కలిగే ఫలితాల గురించి మీకు వివరిస్తాను.


 * గంధ లింగము  -


     రెండు భాగాలు కస్తూరి , నాలుగు భాగాలు చందనం , మూడు భాగాలు కుంకుమ కలిపి గంధ లింగము తయారుచేయుదురు . దీనిని పూజించిన శివసాయుధ్యం కలుగును.


 *  పుష్ప లింగము  -


     నానా విధములైన సువాసన కలిగిన పువ్వులతో నిర్మించిన పుష్పలింగమును పూజించిన రాజ్యాధిపత్యం కొరకు పూజిస్తారు.


 *  గోమయ లింగము  -


      స్వచ్ఛమైన కపిల (నల్ల ) గోమయమును తెచ్చి లింగము చేసి పూజించిన ఐశ్వర్యము చేకూరును . నేలపైన , మట్టిలోన పడిన పేడ పనికిరాదు .


 *  రజోమయ లింగము  -


       పుప్పొడితో తయారుచేసిన లింగమును పూజించిన దైవత్వం సిద్ధించును . అటుపై శివసాయుజ్యం పొందవచ్చు .


 *  యవ - గోధుమ - శాలిజ లింగము  -


       యవ గోధుమ తండుల  పిండితో చేయబడిన లింగమును పూజించిన సకల సంపదలు కలుగును. పుత్రసంతానం కలుగును.


 *  తిలాపిష్ట లింగము  -


       నువ్వుల పిండితో లింగము చేసి పూజించిన ఇష్టసిద్ది కలుగును.


 *  లవణ లింగము  -


       హరిదళం , త్రికటుకాలు మెత్తగా పొడిచేసి ఉప్పుతో కలిపి లింగమును చేసి పూజించిన వశీకరణం ఏర్పడును .


 *  తుపొత్త లింగము  -


       శత్రు నాశనం చేయును.


 *  భస్మమయ లింగము  -


        సమస్త ఫలితాలను ప్రసాదించును.


 *  గుడోత్త లింగము  -


         ప్రీతిని కలిగించును.


 *  శర్కరామయ లింగము  -


         అన్ని సుఖాలను ఇచ్చును.


 *  వంశాంకుశమయ లింగము  -


        అన్ని సుఖాలను చేకూర్చును .


 *  కేశాస్తి లింగము  -


        సర్వ శత్రువులను నశింపచేయును .


 * పిష్టమయ లింగము  -


      సర్వ విద్యా ప్రదమవును .


 *  దధి దుగ్దద్భవ లింగము  -


      కీర్తిని , లక్ష్మిని ప్రసాదించును.


 *  ధాన్యజ లింగము  -


      ధాన్యప్రదం అగును.


 *  ఫలోత్త లింగము  -


       ఫలప్రదం అగును.


 *  ధాత్రీ ఫలజాత లింగము  -


       ముక్తిని ప్రసాదించును.


 *  నవనీత లింగము  -


       కీర్తి , సౌభాగ్యం ప్రసాదించును.


 *  దూర్వాకాండ లింగము  -


       ఈ లింగమును గరిక కాడలతో తయారుచేస్తారు . దీనిని పూజించుట వలన అపమృత్యువు నశించును.


 *  కర్పూర లింగము  -


       మోక్షమును అనుగ్రహించును.


 *  మౌక్తిక లింగము  -


        సౌభాగ్య ప్రదము .


 *  అయస్కాంత మణిజ లింగము  -


       సకల సిద్ధులను కలిగించును.


 *  సువర్ణ నిర్మిత లింగము  -


        ముక్తిని ప్రసాదించును.


 *  రజత లింగము  -


       ఐశ్వర్యాన్ని వృద్దిచేయును .


 *  ఇత్తడి , కంచు లింగములు  -


       ముక్తిదాయకం .


 *  గాజు , ఇనుము , సీసం లింగములు  -


        శత్రునాశనం చేయును .


 *  అష్ఠలోహ లింగము  -


        కుష్ఠురోగమును నివారించును.


 *  అష్టధాతు లింగము  -


        సర్వసిద్ధి కలిగించును.


 *  స్పటిక లింగము  -


        సర్వకామ ప్రదము . 


         ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. కాని తామ్రము , సీసం , రక్తచందనం , శంఖం , కాంస్యం , ఇనుము ల తయారైన లింగపూజ ఈ కలియుగము నందు నిషేధించబడినది. పాదరసం తో చేయబడిన లింగము అష్టైశ్వర్యాలను అనుగ్రహించును. ఇది అన్నింటి కంటే మహామహిమ కలిగినది . పారద శబ్దములో ప - విష్ణువు , అ - ఈశ్వరి , పార్వతి - కాశిక , ర - శివుడు , ద - బ్రహ్మ  ఇలా అందరూ దానిలో ఉన్నారు . జీవితములో ఒక్కసారైనను పాదరసముతో చేసిన శివలింగాన్ని పూజించిన విజ్ఞానం , అష్టసిద్దులు , ధనధాన్యాలు , సకలైశ్వర్యాలు అన్ని చేకూరును .


           లింగపూజ యందు పార్వతీపరమేశ్వరులు ఇద్దరికి పూజ జరుగును. లింగమూలము నందు బ్రహ్మ , మధ్యలో విష్ణువు , ఊర్ధ్వభాగము నందు ప్రణవాఖ్య పరమేశ్వరుడు ప్రకాశించుచుందురు . వేదిక (పానపట్టం ) పార్వతి , లింగము పరమేశ్వరుడు . కావున శివలింగ పుజ వలన సర్వదేవతా పూజ జరుగుతుందని లింగపురాణం నందు వివరించబడినది . 


 

       మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 


కార్తీక పౌర్ణమి

 *2022 నవంబరు 8 మంగళవారం చంద్రగ్రహణం*


శ్రీ శుభకృత్ నామసంవత్సరం మార్గశిర శుద్ధ పూర్ణిమ నవంబరు 8 మంగళవారం భరణి నక్షత్రం మూడో పాదంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం పడుతుంది.

స్పర్శ కాలం మధ్యాహ్నం - 2 గంటల 38 నిముషాలు

మధ్య కాలం మధ్యాహ్నం - 4 గంటల 28 నిముషాలు

మోక్ష కాలం మధ్యాహ్నం -  6 గంటల 18 నిముషాలు

ఆద్యంత పుణ్యకాలం 3 గంటల 40 నిముషాలు


ఈ గ్రహణం భరణి నక్షత్రం మేషరాశిలో పట్టడం వల్ల అశ్విని, భరణి, కృత్తిక నక్షత్ర జాతకులు... మేష రాశివారు ఈ గ్రహణం చూడరాదు. చంద్రోదయం సాయంత్రం 5 గంటల 27 నిముషాలకు అవుతుంది. 


అందుకే విడుపు సమయంలో 51 నిముషాలు మాత్రమే ఈ గ్రహణం కన్పిస్తుంది. 


*నియమాలు పాటించే గర్భిణి స్త్రీలు కూడా సాయంత్రం 5.27 నుంచి 6.18 వరకు కదలకుండా పడుకుంటే చాలు.*



*కార్తీక పౌర్ణమి తేదీ.*


ఇక దృక్ పంచాంగం ప్రకారం నవంబరు 7వ తారీకు సాయంత్రం నాలుగు గంటల 15 నిమిషాలకు పౌర్ణమి తిధి ప్రవేశిస్తుందని, ఎనిమిదో తేదీ సాయంత్రం నాలుగు గంటల 31 నిమిషాలకు ఇది ముగుస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి కి పూర్ణ చంద్రుడు కనిపించడమే ప్రాధాన్యత కాబట్టి, 8 వ తారీకు రాత్రి పౌర్ణమి ఘడియలు ఉండడం లేదు కాబట్టి, *ఏడవ తారీఖునే ప్రామాణికంగా తీసుకొని కార్తీక పౌర్ణమి నిర్వహించుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.* వచ్చే కార్తీక సోమవారం నాటి సాయంత్రం, కార్తీక పౌర్ణమిగా 365 వత్తుల దీపాలను, ఉసిరిక దీపాలను వెలిగించి భగవంతుని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని చెబుతున్నారు.

వంద పనులు విడిచిపెట్టయినా


శత విహాయ భోక్తవ్యం 

సహస్రం స్నాన మాచరేత్ 

లక్షం విహాయ దాతవ్యం

 కోటిం త్యక్త్యా హరిం భజేత్!!


వంద పనులు విడిచిపెట్టయినా


వేళకు భోజనం చేయాలి.


వేయి పనులు విడిచి స్నానం చేయాలి. లక్ష పనులు విడిచి దానం చేయాలి.


కోటి పనులు విడిచి దైవ ప్రార్ధన చేయాలి.


 వంద పనులైన విడచియు ముందు గాను

తృప్తి తో భోజనమ్మును చేయ తగును 

వేయి పనులైన విడచి యు వెనుక బడక 

మనసుతో చేయవలయును  మజ్జ నమ్ము 

లక్ష పనులైన విడచియు లక్ష్య ముంచి

దాన ధర్మాదు లెప్పుడున్ సల్ప దగును

కోటి పనులైన విడచియు కూర్మి తోడ 

హరిని ప్రార్థించ వలయు తా యాత్మ యందు

గోపాలుని మధుసూదనరావు శర్మ

Srimadhandhra Bhagavatham

 Srimadhandhra Bhagavatham -- 66 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


స్వాయంభువ మన్వంతరంలో మీరిద్దరూ (దేవకీ వసుదేవులు) ఒక ప్రజాపతి, ప్రజాపతి భార్య. నీ పేరు సుతపుడు. ఆమె పేరు పృశ్ని. మీరిద్దరూ ఆకులు అలములు తింటూ పన్నెండు వేల దివ్య సంవత్సరములు నా గురించి తపస్సు చేశారు. నేను ప్రత్యక్షం అయి ‘ఏమి కావాలి?’ అని అడిగాను. మీకు పుత్రుని మీద వ్యామోహం ఉండిపోయింది. ‘నీలాంటి కొడుకు కావాలి’ అన్నారు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేదు. మీరు అంత కష్టపడి తపస్సు చేసినందుకు మీరు ఒకమారు అడిగితే నేను మూడుమార్లు పుట్టాను. ఒకసారి నేను పృశ్నికి పృశ్నిగర్భుడుగా, రెండవమారు అదితి కశ్యపులుగా ఉన్నప్పుడు వామనమూర్తిగా ఇప్పుడు కృష్ణభగవానుడిగా పుట్టాను. ఈ అవతారంలో ఒక గొప్పతనం ఉన్నది. అంతరార్ధం తెలిసినా తెలియకపోయినా నా కథ విని, నన్ను స్మరిస్తూ, నన్ను గురించి చెప్పుకుంటూ మోక్షమును పొందండి’ అన్నాడు.

ఈ మాటలు చెప్పిన తర్వాత ఒక రహస్యం చెప్పాడు. ఈ విషయములు వసుదేవునకు అంతరమునందు ద్యోతకం అయ్యాయి. పరమాత్మ ఈ విషయమును బాహ్యమునందు చెప్పలేదు. ‘ఇదే సమయమునందు యమునానదికి ఆవలి ఒడ్డున ఉన్న నందవ్రజంలో నా శక్తి స్వరూపమయిన యోగమాయ యశోదాదేవి గర్భమునందు ఆడపిల్లగా జన్మించింది. నీవు నన్ను తీసుకువెళ్ళి ఆ యశోదాదేవి పక్కన పడుకోబెట్టి మరల అక్కడనుంచి ఆడపిల్లను తెచ్చి దేవకి ప్రక్కన పడుకోబెట్టు’ అన్నాడు.

వెంటనే వసుదేవుని కాళ్ళు, చేతులకు ఉన్న సంకెళ్ళు ఊడిపోయాయి. ఈ పిల్లవాడిని తీసి గుండెలమీద పెట్టుకున్నాడు. చాలామంది తలమీద పెట్టుకున్నారు అంటారు. పోతనగారి భాగవతంలో అలా లేదు. గుండెల మీద పెట్టుకున్నాడనే ఉన్నది. ద్వారం దగ్గరకు వెళ్ళాడు. ద్వారమునకు ఉన్న ఇనుప గొలుసులు, తాళములు, మేకులు అన్నీ ఊడిపోయాయి. కంసుడితో సహా అందరూ గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. ఒక్కొక్క ద్వారం దాటుతున్నాడు. వెనక పడగలు పట్టి ఆయన మీద నీడపట్టి శేషుడు వస్తున్నాడు. బయటకు వచ్చాడు ఆకాశం అంతా నల్లటి మబ్బుపట్టి ఉన్నది. గాఢాంధకారము. శ్రావణమాసం, వర్షం పడుతోంది. శేషుడు పడగలు పట్టి ఆచ్ఛాదించాడు. విపరీతమయిన వేగంతో ప్రవహిసస్తున్న యమునానది దగ్గరికి వెళ్ళాడు. వసుదేవుడు పరమాత్మను గుండెలమీద పెట్టుకుని యమున వంక చూశాడు.

కృష్ణభగవానుని గుండెలమీద పెట్టుకున్న వసుదేవుని చూడగానే ఆనాడు రామచంద్రమూర్తికి చోటు యిచ్చిన సముద్రములా యమున చోటిచ్చింది. అందులోంచి వసుదేవుడు వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మను పడుకోబెట్టాడు. అక్కడ ఆడపిల్ల పుట్టినా ఎవరికీ తెలియదు. అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఆ పిల్లను ఎత్తుకుని మళ్ళీ తిరిగివచ్చి అంతఃపురంలోకి ప్రవేశించాడు. ద్వారములు మూసుకున్నాయి. ఇనుపసంకెళ్ళు పడిపోయాయి. వసుదేవుడు ఆ ఆడపిల్లను దేవకీదేవి ప్రక్కన పడుకోబెట్టాడు. వసుదేవుడు కృష్ణపరమాత్మను గుండెలమీద ధరించాడు. అనగా వసుదేవుడు లోపల ఉన్న ఆత్మస్వరూపమును తెలుసుకున్నాడు. ఆయన హృదయగ్రంథి విడిపోయింది. అందుకే ఆడపిల్లను వదలమని వసుదేవుడు ఏడవడు దేవకి ఏడుస్తుంది. ఇంకా విష్ణుమాయ దేవకియందు ఉన్నది. తల్లి కాబట్టి ఉండాలి లేకపోతే కంసునికి అనుమానం వస్తుంది.

ఈ ఆడపిల్ల ఏడ్చింది. అక్కడ వున్న వాళ్ళందరూ లేచారు. పిల్ల పుట్టిందని అనుకున్నారు. ముందుగా తాళం కప్పలమీద రాజముద్ర ఉన్నదీ లేనిదీ చూశారు. రాజముద్ర ఉన్నది. లోపలి వాళ్ళు ఎక్కడికీ వెళ్ళలేదు. వసుదేవుడు అలా కూర్చుని ఉన్నాడు. భటులు పిల్ల ఏడుపు విని కంసుని వద్దకు పరుగెత్తుకు వెళ్ళి విషయం చెప్పారు. చెప్పగానే నిద్రపోతున్న వాడు పరుగెత్తుకుంటూ చెరసాలకు వచ్చి తాళములు తీశాడు. ఆడపిల్ల ఏడుస్తుంటే దేవకీ దేవిని విష్ణుమాయ కప్పేసింది. ఆ ఆడపిల్లే తనపిల్లే, తానే రక్షించుకోవాలని అనుకుని అన్నగారికి కనపడకుండా ఆ పిల్లను పమిటలో పెట్టుకున్నది. ‘అన్నయ్యా! ఇది చంపివేయడానికి మేనల్లుడు కాదు మేనకోడలు. నన్ను నమ్ము ఆరుగురిని చంపేశావు. ఏడవది గర్భస్రావము అయింది ఇది ఆడపిల్ల. ఇంటికి ఆడపడుచు నీకు కోడలు. నువ్వు మన్నన చేయాలి. పసిపిల్లయిన దానిని చంపాడన్న అపఖ్యాతిని నువ్వు కట్టుకోవద్దు. ఈ పిల్లనయినా బ్రతకనివ్వు. చంపవద్దు ’ అని ఏడుస్తూ వేడుకున్నది.

కంసుడు మహోగ్రంగా సోదరిని నిందించి పసిపిల్ల రెండు కాళ్ళు పట్టుకు లాగేసి గిరగిర త్రిప్పి బండకు వేసి కొట్టాడు. ఈ పిల్ల బండకు తగలడం మాని ఆకాశంలోకి వెళ్ళిపోయి దివ్యమైన రథమునందు ఆరూఢయై కూర్చుంది. అటునుంచి విమానములలో దేవతలందరూ వచ్చి నిలబడ్డారు. శ్రీమన్నారాయణుడు ఆమెకు వరం ఇచ్చాడు. ‘నిన్ను దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక అనే పదునాలుగు నామములతో పిలుస్తారు. భాగవతాంతర్గతంగా ఎవరైతే ఈ నామములు వింటున్న వాళ్ళందరినీ దేశంలో ఎక్కడెక్కడ వున్నా నీవు రక్ష చేస్తావు’ అన్నాడు. ఆ తల్లి ఆకాశంలో నిలబడింది. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు వచ్చి పాటలు పాడుతూ తల్లికి అగరుధూపములు సమర్పిస్తున్నారు. నైవేద్యములు సమర్పిస్తున్నారు. ఆ తల్లి అవన్నీ తీసుకుని క్రింద ఉన్న కంసుని చూసి ‘ఓరీ దుర్మార్గుడా! పిల్లలందరినీ రాళ్ళకు వేసి కొట్టి చంపావు. నన్నుకూడా కొట్టాలని ప్రయత్నం చేశావు. నాతోపాటు పుట్టి నిన్ను చంపేవారు వేరొక చోట పెరుగుతున్నాడు. నీవు చనిపోవడం ఖాయం’ అని చెప్పి దేవతలు సేవిస్తుండగా తల్లి వెళ్ళిపోయింది.

వెంటనే కంసుడు పరుగెత్తుకుంటూ దేవకీ వసుదేవుల వద్దకు వచ్చి ఇంటికి వెళ్ళి మీరిద్దరూ సంతోషంగా ఉండమని చెప్పి వాళ్ళను పంపించి వేశాడు.

అవతల నందవ్రజంలో ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. కృష్ణపరమాత్మ అక్కడ ఆవిర్భవించి ఉన్నారు. పిల్లవాడేమీ ఏడవలేదు. యశోద పొంగిపోయింది. నంద వ్రజం భగవద్భక్తులతోనూ, గోవులతోను నిండి ఉంటుంది. గోపకాంతలు మహా సంతోష పడిపోతు చూచివద్దామని యశోద గృహమునకు వెళ్ళారు. బయటకు వచ్చి ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు ‘అబ్బ పిల్లవాడు ఎంత బాగున్నాడే!’ అని పరవశించిపోతున్నారు. బయట నందప్రభువు పొంగిపోతున్నాడు. బ్రాహ్మణులను పిలిపించి గోవులను దానం ఇచ్చాడు. గొప్ప గొప్ప మేలిమి వస్త్రములు దానం ఇచ్చాడు. పిల్లవాని జాతకము చూసి ఎలా ఉంటాడో చెప్పవలసింది అని వారిని అడిగాడు. ఆ పిల్లవాని జాతకం చూసి ‘లేక లేక పుట్టిన నీ కుమారుడు గొప్ప లక్ష్మీ సంపన్నుడవుతాడు లక్ష్మీదేవి వీనిదే. ఎటువంటి వీరులనయినా ఓడిస్తాడు. గొప్ప దీర్ఘాయుర్దాయమును పొందుతాడని చెప్పారు. పిదప ఆ బ్రాహ్మణులందరూ ఆశీర్వచనం చేశారు. అక్కడకు వచ్చిన వాళ్ళలో వృద్ధ స్త్రీలను పిలిచి కృష్ణ పరమాత్మకు నీళ్ళు పోయమని అడిగారు. లోకములన్నింటిని ప్రళయం చేసేయ్యాలనుకున్నప్పుడు నీళ్ళలో ముంచేసి తాను మాత్రం ఒక మర్రి ఆకుమీద ఏమీ తెలియనివాడిలా బొటనవ్రేలు నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకునే వటపత్రశాయి ఏమీ తెలియని వాడిలా ఈ వృద్ధ గోపకాంతల తొడల మీద పడుకొని నీళ్ళు పోయించుకొని ఉక్కిరిబిక్కిరి అయిపోయినట్లు పడుకున్నాడు దొంగకృష్ణుడు. ఆఖరుకి ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి ఓ ఉయ్యాలలో పడుకోపెట్టారు.

పూతన సంహారం

కంసుడు అష్టమగర్భమును తాను సంహరించగలనని ఎన్నో ప్రయత్నములు చేశాడు. ఎన్ని ప్రయత్నములు చేసినా అష్టమగర్భం జారిపోయి ఇంకొకచోట పెరుగుతోంది. తన మృత్యువును ఏ ప్రయత్నము చేత అధిగమించలేకపోతున్నాడు. ఈ సత్యమును కంసుడు అంగీకరించి ఉంటే కంసుడి జీవితం వేరొకరకంగా మారి ఉండేది. కంసుడు రాత్రి నిద్రపోయి ఉదయముననే తన మంత్రులను పిలిచి ‘మీరు అందరూ చూసారు. నిన్న నేను ఆ బిడ్డను చంపబోయాను. ఆవిడ వెంటనే స్త్రీగా మారిపోయి పైకి వెళ్ళి నీవు తొందరగా మరణించబోతున్నావు. నిన్ను చంపేవాడు నాతో కలిసి పుట్టి వేరొకచోట పెరుగుతున్నాడు’ అని చెప్పింది. నాకు కొంచెం భయంగా ఉన్నది’ అన్నాడు.

కంసుని చుట్టూ ఉన్నవాళ్ళు ‘రాజా! ఈ మాత్రం డానికే భయపడి పోతావేమిటి? మీ ధాటికి ఆగలేక దేవతలందరూ దాక్కుని ఉన్నారు. మీ శక్తి మామూలుది కాదు. మీరు మాకు ఒక్క ఉత్తరువు ఇచ్చారంటే మేము అంతటా తిరిగి కొత్తగా పుట్టిన పిల్లల దగ్గరనుంచి పళ్ళు వస్తున్న పిల్లల వరకు అందరినీ చంపేస్తాము’ అన్నారు. నీ ప్రధాన శతృవు శ్రీమహావిష్ణువు. గతంలో నీవు కాలనేమిగా ఉండగా నిన్ను సంహరించాడు. నీకు రహస్యం చెపుతాను విను. ఇప్పటికి కూడా పిల్లవాని రూపంలో వచ్చి నిన్ను విష్ణువే చంపుతాడు. విష్ణువు మూలమును తీసివేయాలి. ప్రబలంగా విష్ణువు ఎక్కడ ఉంటాడో దానిని తీసివేయాలి’

ఎవరెవరు సత్యం మాట్లాడుతున్నారో, ఎవరు జపం చేస్తున్నారో, ఎవరు ఈశ్వరుని నమ్ముతున్నారో, ఎవరు ప్రశాంతముగా ఉంటున్నారో, ఎవరు తపస్సు చేస్తున్నారో, ఎవరు అగ్నికార్యం చేస్తున్నారో, ఎవరు వేదం చదువుకుంటున్నారో, ఎక్కడ ఆవులు ఉన్నాయో, ఎక్కడ దూడలు ఉన్నాయో, ఎక్కడెక్కడ హోమములు జరుగుతున్నాయో, వీటినన్నింటిని నాశనం చేసేస్తే విష్ణువనేవాడు లేకుండా పోతాడు. మనకు శత్రువు ఉండడు. వీటినన్నిటిని నాశనం చేస్తాము మాకు అనుజ్ఞ ఇవ్వండి’ అన్నారు. నందవ్రజంలో కృష్ణభగవానుడు పెరుగుతున్నాడు. ‘అజాయమానో బహుధా విజాయతే’ అని వేదం అంటోంది. జన్మించ వలసిన అవసరం లేనివాడు అనేకమయిన జన్మలను పొందుతున్నాడు. అటువంటి వానికి జాతకర్మ చేస్తున్నారు. ఆయన కన్నా ముందు ఉన్నవాడు ఎవడూ లేడు. ఆయన తర్వాత ఉండేవాడు లేదు. ఆయన ఎప్పుడూ తల్లిపాలు త్రాగి ఎరుగడు. అటువంటి వాడు ఈవేళ ఆశ్చర్యంగా యశోదాదేవి ఒడిలో పడుకొని పాలు త్రాగుతున్నాడు. పరబ్రహ్మము అనుగ్రహం ఎంత ఆశ్చర్యం! ఆ యశోద ఎంత పుణ్యం చేసుకున్నదో కదా! ఆనాడు పాలిచ్చి పెంచింది. ఈనాడు కూడా ఆ యశోదను చూడాలనుకుంటే వేంకటాచలంలో వేంకటరమణుని సన్నిధానంలో ఇప్పటికీ పిల్లవాడికి అన్నీ జాగ్రత్తగా అందుతున్నదీ లేనిదీ చూస్తూ వకుళమాతగా కూర్చుంది. ఆయనకు హానీ తెలియదు, వృద్దీ తెలియదు. ఒకనాడు ఉండడం, ఒకనాడు లేకపోవడం, పెరగడం, తరగడం లాంటివి ఉండవు. అలాంటివాడు ఆశ్చర్యంగా రోజురోజుకీ అమ్మ ఒడిలో పెరుగుతున్నాడు. ఎంత తపస్సు చేసినా చూడడానికి వీలుకాని మూర్తి ఇవాళ ఏమీ చేతకాని గోపకాంతల ఇళ్ళల్లో పెరిగి పెద్దవాడయి ఆడుకుంటున్నాడు. నందవ్రజంలో ప్రతి ఇంట్లోకి వెళ్ళి వారు నైవేద్యం పెట్టనవసరం లేకుండా తానే అడిగి తినేవాడు. ప్రత్యక్ష కైంకర్యం ఎంత అదృష్టం. ఎంత చదువుకున్నా బ్రహ్మము ఎలా వుంటుంది అంటే చెప్పడం కుదరదు.

‘యతోవాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహా’

మనస్సు, వాక్కు ఇంకా మేము పరబ్రహ్మము గురించి చెప్పలేమని ఎక్కడ తిరిగిపోయాయో అక్కడ పరబ్రహ్మము ఉన్నది. ఏ చదువు కూడా చెప్పలేని ఆ పరబ్రహ్మము ఇవాళ ఆ గోపకాంతల ఇంట్లో ఒక స్వరూపమై పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఇది పరమాత్మ కారుణ్యము. ఏదయినా ఈశ్వరానుగ్రహంలో నుంచే వస్తుంది.



https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersU...


instagram.com/pravachana_chakravarthy

పిల్లల కోసం... పూర్తిగా ఉచిత వైద్యం. !

 B Lakshmi


7 July 2016 at 10:01


Facebook for Android.


ఎవరికైనా ఉపయోగ పడవచ్చు ప్లీజ్ అందరికి షేర్ చెయ్యండి


ప్రాణాంతక వ్యాదులు వచ్చినా స్తోమత లేని పిల్లల కోసం... పూర్తిగా ఉచిత వైద్యం. !


మద్రాసు (చెన్నై)లో అత్యాదునిక సదుపాయాలతో 600 మంది


పిల్లల డాక్టర్లుగల హాస్పటల్ ఉంది.


అక్కడ అందించేది పూర్తిగా ఉచిత వైద్యం.


మద్రాసు ఎగ్మోర్ రైల్వై స్టేషనులో దిగి ఎవరిని అడిగినా చిల్డ్రన్ హాస్పటల్ అడ్రస్ చెబుతారు. నవజాత శిశువుల మొదలు 12 ఏళ్ళ పిల్లల వరకు ఎటువంటి వైద్యమైనా సరే... అంటే 10 లక్షల రూ.లు ఖర్చు కాగల గుండె సంబంధిత వ్యాదులైనా సరే, ఉచితంగానే చేస్తారు. అందుకు తగిన సాధన సంపత్తి వారికి ఉంది.


దీనిని కంచి కామకోటి చైల్డ్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నారు.


ఆసుపత్రిలోని సదుపాయాలు కార్పొరేట్ తరహాలో ఉంటాయి. కనుక ఈ హాస్పటల్ గురించి అవసరమైనవారికి దయచేసి చెప్పండి.


Hospital name- Kanchi Kamakoti Child Trust 12A, Nageshwara Road, Nungambakkam, Chennai-600 034, Tamil nadu


25:9573799997, 9640640878, 9677003334, +914442001800.


ఎవరికైనా ఉపయోగ పడవచ్చు ప్లీజ్ అందరికి షేర్ చెయ్యండి ...

Siva Maha Puranam

 Sri Siva Maha Puranam -- 12 By Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

ఓంకారేశ్వర క్షేత్రము

కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ

సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే!!

మాంధాతృపురంలో వెలసిన వాడు ఓంకారేశ్వరుడు. ఓంకారేశ్వర క్షేత్రము చాలా చిత్రమయిన క్షేత్రము. అక్కడ రెండు స్వయంభూ శివలింగములు వెలశాయి. అందులో ఒకదానిని ‘ప్రణవాకార పరమేశ్వరుడు’ అంటారు. ఆయన ఓంకార స్వరూపియై ఉంటాడు. రెండవది ‘ఓంకారమమలేశ్వరం’ అంటాము. అమలేశ్వరుడు అనే పేరుతో ఒక శివలింగం ఉంటుంది. ఇలా రెండు లింగములు వెలియడానికి కారణం తెలుసుకోవాలి.

గురుస్వరూపుడు నారదమహర్షి త్రిలోక సంచారి మహానుభావుడు. ఒకసారి వింధ్యపర్వతం దగ్గరకు వచ్చారు. వింధ్యపర్వతమునకు తాను చాలా గొప్పదానను అని, తనంత ఎత్తైన పర్వతం మరొకటి లేదని చాలా అహంకారం ఉన్నది. ఇది ఒక అర్థం లేని ఆభిజాత్యం. అదృష్టం ఏమిటంటే అటువంటి సద్గురువు అయిన నారదునితో వింధ్యపర్వతం మాట్లాడడం. ఎంత అహంకారి అయినా అతనికి ఒక సద్గురువు దొరికాడంటే అతనికి అంతకుమించిన అదృష్టం లేదు. వాని జీవితం మారిపోతుంది. నారదుడిని చూసి విధ్యపర్వతం అహంకారమును బయట పెట్టింది. అసలు వింధ్యుడు చూడగానే నారదునికి నమస్కారం చెయ్యకుండా అహంకారంతో మాట్లాడాడు. నారదుడు ఒక చిరునవ్వు నవ్వి 'నీవు చెప్పినది యథార్థము. నీతో సామానమయిన పర్వతము ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది. మేరుపర్వతం కూడా చాలా గొప్ప పర్వతం. నవగ్రహములు ఆకాశంలో తిరుగుతున్నప్పుడు అవి మేరుపర్వతమునకు ప్రదక్షిణగా తిరుగుతూ ఉంటాయి' అన్నాడు. ఆమాట వినేసరికి వింధ్య పర్వతానికి చాలా బాధ వేసింది. ‘నాకూ ఉన్నాయి శిఖరములు. వాటి చుట్టూ ఎవరూ తిరగడం లేదు. మేరు పర్వతమునకు ఉన్న కీర్తి నాకు లేదు’ అని అనుకుని ‘నారదా! నేను కూడా అటువంటి కీర్తిని పొందాలి. మేరుపర్వతం కంటే గొప్ప ఉన్నతిని పొందాలి అంటే నన్ను ఏమి చేయమంటావు?” అని అడిగాడు.

నారదుడు మహాశివుణ్ణి గూర్చి తపస్సు చేయమని వింధ్యుడికి సలహా చెప్పాడు. వెంటనే వింధ్యుడు మహాశివుణ్ణి గూర్చి శివ పంచాక్షరీ మహామంత్రమును ఉచ్ఛరిస్తూ తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేశాడు. దేవతలు మహాదేవుని వద్దకు వెళ్లి ‘మహాదేవా! వాని తపస్సు సామాన్యంగా లేదు. మీరు వెళ్ళి ప్రత్యక్షం అవండి’ అన్నారు. అంతటా నిండి ఉన్న నిర్గుణ పరబ్రహ్మము సాకారమును పొంది ఎదురుగుండా వచ్చి ప్రత్యక్షమయ్యాడు. చేతితో స్పృశించాడు. వింధ్యుడు బహిర్ముఖుడు అయ్యాడు. ‘నాయనా! నీవు చాలా గొప్ప తపస్సు చేశావు. నీవు ఏమి కోరి ఈ తపస్సు చేశావు? ఏమి కావాలో చెప్పు ఇస్తాను’ అన్నాడు. ‘నన్ను లోకములో గొప్పవాడిగా చెయ్యి’ అని అడిగాడు. “నీవు ఇంక అహంకారముతో ప్రవర్తించకు. ఏ నవగ్రహములు అయితే మేరువు చుట్టూ తిరుగుతున్నాయో అటువంటి నవగ్రహములను కవచంగా కట్టుకున్న నేను స్వయంగా వచ్చి నీ శిఖరమును అధిరోహిస్తాను’ అని చెప్పి శంకరుడు వింధ్యుడిని అనుగ్రహించాడు. అపుడు వింధ్యుడు ‘ప్రభూ! దానిని నీ అనుగ్రహంగా భావిస్తాను అహంకరించను’ అని ఆ వింధ్య పర్వత శ్రేణి మీద పరమాత్మ అన్ని చోట్లా ఒక్క స్వయంభూలింగంగా వస్తే వింధ్య పర్వత శిఖరముల మీద స్వామి రెండు స్వయంభూ లింగములుగా వచ్చాడు. ఒకటి ‘ఓంకార లింగము’, ఒకటి ‘అమలేశ లింగము’ ‘ఓంకారమమలేశ్వరం’ అంటాము. ఆ వెలయడం మాంధాతృపురంలో వెలశాడు. ఓంకారం అంటే ప్రణవము. ప్రణవము మోక్ష దాయకము. వింధ్యగిరి మీదికి వెళ్లి దర్శనం చేసిన వారికి మోక్షం వస్తుంది. పక్కన అమలేశుడు ఉన్నాడు. మనందరి యందు ఆనవ మలము, కార్మిక మలము, మాయక మలమని మూడు రకములయిన మలములు ఉంటాయి. స్నానం చేసినా ఈ మూడూ వదలవు. ఈశ్వరుడు ఈ మూడు మలములకు అతీతుడు. మీకు ఈ మూడు మలములకు అతీతమయిన స్థితిని ఇచ్చి , తానే స్థితిలో ఉన్నాడో ఆ స్థితికి మిమ్మల్ని ఎత్తగలిగినవాడు ఓంకారేశ్వరుడు. కోరిన సమస్త కోరికలనూ తీర్చగలిగిన వాడు. ఆయన నిరంతర ఆనంద స్వరూపుడు. అడిగినది ఏదయినా ఇవ్వగలడు. ఆయన అమరేశ్వరుడిగా, ఓంకారేశ్వరుడిగా ఉన్నాడు. ఇద్దరుగా అక్కడ వెలసి శంకరుడు నిరంతరము జనులకు శుభములను ఇస్తూ ఆ కొండమీద వెలసి ఉన్నాడు. అలా వెలసిన అమలేశ్వరుణ్ణి శంకర భగవత్పాదులు ఒక అద్భుతమయిన శ్లోకముతో ఆరాధన చేస్తారు. మనం అమరేశ్వర లింగమును చూసినప్పుడు ఆ భావనను మనస్సులో తెచ్చుకోవాలి. అమలేశ్వర లింగమును, ఓంకారేశ్వర లింగమును చూసి తత్త్వ విచారణ రీత్యా మీ మనస్సు లోపలి తెచ్చుకోవాలి శంకరులు అంటారు

ఆకాశ శ్చికురాయతే దశదిశాభాగో దుకూలాయతే

శీతాంశుః ప్రసవాయతే స్థిరతరానందః స్వరూపాయతే,

వేదాంతో నిలయాయ తేసువినయో యస్యస్వభావాయతే

తస్మి న్మే హృదయం సుఖేనరమతాంసాంబే పరబ్రహ్మణి!!

‘సాంబే’ అంటే ‘స అంబే’ – అమ్మతో కూడుకున్న అయ్యా ! ఓ శంకరా నీవు పరబ్రహ్మవు. నీవు అమలేశ్వరుడవు. మూడు మలములకు అతీతమై ఉన్న నీవు లింగముగా కనపడుతున్నావు. నీవు నాతో వచ్చినప్పుడు నీవు ఆకాశస్వరూపుడవై ఉన్నావు. నీవు దిగంబరుడవు. పది దిక్కులు కలిసి నీకు వస్త్రము అయ్యాయి. దిక్కులను అంబరముగా కట్టుకున్నవాడవు. చంద్రరేఖను ఆభరణముగా కలిగిన వాడవు. ఎప్పుడూ ఆనందమయ స్వరూపుడవై ఉంటావు. వేదముల చివరి భాగములయిన ఉపనిషత్తులయందు చెప్పబడుతుంటావు. వినయముతో నిన్ను తలుచుకుంటే చాలు మమ్మల్ని ఉద్ధరించడానికి వస్తావు’.

facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage

instagram.com/pravachana_chakravarthy