5, ఆగస్టు 2024, సోమవారం

R k Food products

 ✳️R k Food products ✳️

*** శుభ * అశుభ కార్యాలకు అన్ని రకాల అకేషన్స్ కు క్యాటరింగ్ చేయబడును**

*** అన్ని రకాల ఆహార ఉత్పత్తులు కూడా తయారు చేసి ఇవ్వబడును**

*** ఆహార పొడులు***

** మునగ ఆకుపోడి

** అవిసెల పొడి

** కర్వేపాకు పొడి

** కందిపొడి

** నువ్వుల కారం

**పల్లికారం

** వెల్లుల్లి కారం

** కూరపొడి

** సాంబారు పోడి

** చెట్నీపొడి

** ధనియాల పొడి

** మెంతుల పొడి

** జీలకరపొడి

** అల్లం వెల్లుల్లి పేస్ట్

*** అన్ని రకాల పచ్చళ్ళు తయారు చేసి ఇవ్వబడును**

** మామిడికాయ

** చింతకాయ

** నిమ్మకాయ 

** గోంగూర

** టమాట

** అల్లం పచ్చడి

** కాకరకాయ

*** 965296 9494

కర్మన్ ఘాట్... HYD***

శ్రావణమాసం

 *పండుగలమాసం శ్రావణమాసం*


తెలుగు మాసాలలోని అతి పవిత్రమైన మాసాలలో శ్రావణమాసం ఒకటి ఈ మాసంలో ఉన్నన్ని పండుగలు వ్రతాలు ఇతర యే మాసంలోను ఉండవు.అందుకే శ్రావణమాసాన్ని శుభ శ్రావణమాసం అంటారు.


*శ్రావణమాసంలో పండుగలు*


*శ్రావణ శుద్ధ విదియ: అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి జయంతి* 


*శ్రావణ శుద్ధ చతుర్థి: నాగుల చవితి* 


*శ్రావణ శుద్ధ పంచమి: గరుడ పంచమి,కల్కి జయంతి* 


*శ్రావణ శుద్ధ ఏకాదశి: పుత్రదా ఏకాదశి* 


*శ్రావణ శుద్ధ ద్వాదశి: రెండవ శుక్రవారం: వరలక్ష్మీ వ్రతం* 


*శ్రావణ శుద్ధ ద్వాదశి:  దామోదర ద్వాదశి.* 


*శ్రావణ శుద్ధ చతుర్దశి: వరాహజయంతి* 


*శ్రావణ పూర్ణిమ: రాఖీ పూర్ణిమ,హయగ్రీవ జయంతి* 


*శ్రావణ బహుళ విదియ: శ్రీ రాఘవేంద్రస్వామి జయంతి* 


*శ్రావణ బహుళ చవితి: సంకటహర చతుర్ధి* 


*శ్రావణ బహుళ అష్ఠమి: కృష్ణాష్టమి* 


*శ్రావణ బహుళ ఏకాదశి: కామిక ఏకాదశి* 


*శ్రావణ అమావాస్య: పొలాల అమావాస్య* 


*⚜️🌹వరలక్ష్మీ వ్రతం🌹⚜️*

*******************************


శ్రావణ మాసం లో మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను. ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.


*  *గరుడ పంచమి*

******************************


శ్రావణ శుద్ద పంచమిని గరుడపంచమి అంటారు. ఈరోజుననిర్మలమైన మనస్సు, తెలివైన పిల్లలకోసం చేసే పూజ గరుడపంచమి పూజ. ఈరోజున మహిళలు స్నానాంతరం ముగ్గులు పెట్టిన పీఠపై అరటి ఆకును పరచి, బియ్యంపోసి, వారి శక్తి మేర బంగారు,వెండి గరుడపక్షి ప్రతిమను ప్రతిష్టించి, పూజచేసి, పాయస నైవేద్యం పెడ్తారు. ఇలా మనపూజలందుకొనే గరుడిని వంటి మాతృప్రేమకల కుమారుడు కావాలని తెలిపే గరుడ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగచేస్తుంది.అంతేకాదు నాగదోషాలు,దుఃస్వప్నాలు వల్లకలిగే కీడును తొలిగిస్తుంది.


*🌹\|/ దామోదర వ్రతం \|/🌹* 

*******************************


శ్రావణ శుక్ల ద్వాదశిని దామోదర ద్వాదశి అంటారు.ఈ రోజున శ్రీమహావిష్ణువును వివిధ రకాల పూల మాలికలతో అలంకరించాలి. అత్యంత భక్తిశ్రద్ధలతో పూజాభిషేకాలు నిర్వహించి, స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి. మహా విశిష్టమైన ఈ రోజున శ్రీమహా విష్ణువుకి ప్రతీకగా చెప్పబడే సాలాగ్రామాన్ని దానంగా ఇవ్వడం మంచిది. దామోదర ద్వాదశి రోజున ఈ విధంగా చేయడం వలన మోక్షాన్ని పొందడానికి అవసరమైన అర్హత లభిస్తుందని చెప్పబడుతోంది.


* శ్రావణ శనివారములు 

*******************************


ఈ శ్రావణమాసంలోని శనివారాలలో ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని లేదా మహావిష్ణువు అవతారాలు పూజించడం సంప్రదాయంగా వస్తున్నది. ప్రతి శనివారం రోజున అఖండ దీపంవెలిగించి, ఉపవాసముఉండి ఆ స్వామికి తమ భక్తిని తెలియజేసి అష్టైశ్వర్యాలు పొందవచ్చు.


*🌹మంగళగౌరీ వ్రతం🌹*

********************************


శ్రావణ మాసమునందు ఆచరించ వలసిన వ్రతములలో  రెండవది ఈ మంగళగౌరీ వ్రతం. ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవికి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి.


*🐍శుక్లచవితి-నాగచతుర్థి🐍*

*************************************


దీపావళి తర్వాత జరుపుకొనే నాగులచవితి లాగ, మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలందు ఈరోజుని నాగులచవితి పండుగలా నాగాపుజలను చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి, నాగ దేవతను పూజిస్తారు. దుర్వాయుగ్మ వ్రతం చేయడానికి కుడా విశేషమైన రోజు ఈ శుక్ల చవితి.


*🌹శుక్ల ఏకాదశి-పుత్రదా ఏకాదశి🌹*

*************************************


శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు. ఆరోజున గొడుగు దానమిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు. పుత్ర సంతానాన్ని కోరుకొనేవారు ఈనాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచిది.


*🌝 శ్రావణ పూర్ణిమ–రాఖీపూర్ణిమ 🌝* 

************************************


అన్న/తమ్ముని శ్రేయస్సుని కోరుతూ అక్కాచెల్లెళ్ళు సోదరుని చేతికి రాఖీ కట్టే పండుగే ఈ రాఖీ పూర్ణిమ. సోదరునికి రాఖీ కట్టి, నుదుట బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరిని ఆశీర్వదించి కానుకలివ్వడం ఆనవాయితీ. ఈ రోజునే బ్రాహ్మణ, క్షత్రియ & వైశ్యులు తమ పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం. అందుచేత ఈ రోజుని జంధ్యాల పూర్ణిమ అనికూడా అంటారు.


🦄పూర్ణిమ–హయగ్రీవ జయంతి🦄

*************************************


ఈరోజునే శ్రీమహావిష్ణువు వేదాలను రక్షించేందుకు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. హయగ్రీవుడు జన్మించిన ఈ రోజుని హయగ్రీవ జయంతిగా జరుపుకొని, హయగ్రీవుడిని పూజించి శనగలు, ఉలవలతో గుగ్గిళ్ళు చేసి నైవేద్యం సమర్పించడం సర్వ శ్రేష్టం.


*కృష్ణవిదియ-శ్రీ రాఘవేంద్రస్వామి జయంతి* 

*************************************


మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్రస్వామి జయంతిని పురస్కరించుకొని విశేష పూజలను చేస్తారు. అంతే కాదు. క్రీ.శ.1671 వ సంవత్సరంలో విరోధికృత్ నామ సంవత్సర, శ్రావణ బహుళ విదియనాడు శ్రీ రాఘవేంద్రస్వామి వారు సజీవంగా సమాధిలో ప్రవేశించారని ప్రాచీన గ్రంధాలలో పేర్కొనబడినది.


* కృష్ణపక్ష అష్టమి–శ్రీకృష్ణాష్టమి * 

*************************************


శ్రీమహావిష్ణువు యోక్క ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన శుదినమే ఈ శ్రీకృష్ణాష్టమి. దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్నలను సమర్పించడం అనంతరం ఉట్టిని కొట్టడం అనేది ఆచారంగా వస్తోంది.


*🌹కృష్ణపక్ష ఏకాదశి–కామిక ఏకాదశి🌹* 

*************************************


 ఇక బహుళ పక్షంలో వచ్చే ఏకాదశే కామిక ఏకాదశి. ఈరోజున నవనీతమును(వెన్న) దానం చేయాలని పెద్దలు అంటారు.దీనివలన మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. తద్వారా ఈతి బాధలు పోయి, కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్ర వచనం.


*🌚 అమావాస్య–పోలాల అమావాస్య 🌚* 

*************************************


పోలాల అమావాస్యను మహిళలు శ్రావణ మాసములో కృష్ణపక్ష అమావాస్య రోజున జరుపుకుంటారు. సంతానాన్ని కోరుకునే ఇల్లాళ్లు దీనిని చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. కాలక్రమేణా పోలాల అమావాస్య అన్న పేరు కాస్తా, పోలేరు అమావాస్య గా మారి,  పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.

క్రొత్తపలుకు-15

 క్రొత్తపలుకు-15 

స్వార్థబుద్ధితోడ బరగు మైత్రి యొకటి 

యవసరార్థ మొకటి యార్తి నొకటి 

మోసభరిత మొకటి పూతచిత్తము గూడి 

హితము గోరు నొకటి స్తుతుల నొకటి 


క్రొత్తపలుకు-16 

ఎంచి చూడ మైత్రు లెన్నెన్నొ విధములు 

త్రుంచుకొనగ వలయు నెంచి కొన్ని 

స్వార్థమింత లేక బంగారు భవితకై 

మార్గములను జూపు మైత్రి మైత్రి 

*~శ్రీశర్మద*

పులిహోర

 పులిహోర

--------------

సీ||

  ఆంధ్రుల కభిమాన మైనదేదియనిన

     పులిహోర వరుసలో ముందు నిలుచు!

పండుగలేకాని పబ్బమ్ములే కాని

       పులిహోర లేనిచో వెలితి గలుగు!

చింతపులుసు గల్పి చేసిన పులిహోర

      జిహ్వకు రుచిగూర్చి శిరము నూపు!

పసుపు నిమ్మపులుసు పదిలముగా గల్ప

     కంటికింపును గూర్చు కలికి వలెను!

వేరుశనగ గుళ్లు వేసిన పులిహోర

        వడిగ తినగబోని వాడు గలడె?

చల్దియన్నము నైన చక్కగా కలుపుచో

      విసుగు చూపబోరు పిల్లలెపుడు!

ఇంగువ చూర్ణమ్ము నిసుమంత వేయుచు

    నల్లపు ముక్కల నమర గల్పి

ఊరమిరపకాయ,లుప్పును తగినంత,

    జీడిపప్పుల నందు చేర్చి కలిపి

శనగపప్పు మరియు చక్కగా కరివేప

    తాళింపు వేసిన తస్సదియ్య,

నారాయణునికిని నైవేద్య మిడుటకు

    పులిహోరకును సాటి కలదె భువిని?


తే.గీ||

ఆంధ్ర దేశాన నియ్యది అద్భుతమ్ము!

వాయ పైనను వాయను వదలకుండ

ఆరగించగ నుందురు నాంధ్రు లెపుడు!

వేయ దగినది పులిహోర  పెద్ద పీట!


-----------కోడూరి శేషఫణి శర్మ

నిత్యపద్య నైవేద్యం-

నిత్యపద్య నైవేద్యం-1570 వ రోజు

సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-205. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి

ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు


 సుభాషితం:

వనేపి దోషా: ప్రభవన్తి రాగిణాం

గృహేపి పంచేంద్రియ నిగ్రహస్తప:l

అకుత్సితే కర్మణి య: ప్రవర్తతే 

నివృత్త రాగస్య గృహం తపోవనమ్ll


తేటగీతి:

విషయ వాంఛలు గలవారు విడిచి యిల్లు 

అడవి కేగినా కామాదు లంతమౌనె?

ఇంద్రియ విజేతయై యింట నెల్లపుడును 

తపము జేసి కాగల్గును తాపసిగను.


భావం: విషయ వాసనలు కలవారికి అడవికి వెళ్ళినా కామ క్రోధాది దోషాలు సంభవిస్తాయి. పంచేంద్రియాలను నిగ్రహించినవారు ఇంటిలో ఉన్నా తపస్సు చేయగలరు. అనగా వారు తాపసులే. వారికి ఇల్లే తపోవనం.

గౌరీశంకర లను స్తుతిస్తూ

 గౌరీశంకర లను స్తుతిస్తూ సీస పద్యం


సీ. శ్రీపార్వతీవరా ! శ్రితజన మందార !

                శ్రీకర ! సుందరా ! శ్రీగిరీశ !

     రాజరాజేశ్వరీ ! రజతాద్రి వాసిని

                పాలించు సతతంబు భవుని రాణి!

     వేద మంత్రాకార ! విశ్వ సంరక్ష కా !

                శివకామసుందరీ చిత్తచోర !

     అగ్నిలింగాకార ! అరుణాచలేశ్వరా !

                ఆర్త జనోద్ధార ! యహి విభూష !

తే. రమ్ము  మముగావ పరమేశ ! రమ్యదేహ ! 

      నిన్ను  నమ్మితి నిరతమ్ము నీలకంఠ !

      పార్వతీ నాథ ! శంకరా !పరమపురుష!

      శశిధరా ! యీశ ! గౌరీశ ! శరణు శరణు !


జయలక్ష్మి

*శ్రీ గణనాథోద్భవము

 *శ్రీ గణనాథోద్భవము!* మూలం: శ్రీ శివ మహాపురాణం!

16తే.గీ.

ఎంతచెప్పిన భయమిసు మంత లేక

నిర్భయంబుగ యెదురొడ్డి నిలిచి యతడు

శివగణంబుల ననియందు జెనక నెంచె

సేవకులు జేరి భవునకు జెప్పి నంత!!


భావము: శివభటులు చెప్పిన మాటలకు కొంచెమైనను భయపడని బాలుడు వారిని యుద్ధమున శిక్షించాలని భావించగా వారు శివునకా సంగతిని తెలియజేసిరి.

శ్రావణమాస మహాత్మ్యము -01*_

 _*శ్రావణమాస మహాత్మ్యము -01*_

        _*ప్రథమోధ్యాయము*_

 బ్రహ్మశ్రీ లక్ష్మీనృసింహ శాస్త్రి గారు

(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)


_*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం!*_

_*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్!!*_


*శ్రీరస్తు.*


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే!!


వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః  పౌత్రమకల్మషం♪!!

పరాశరాత్మజం వందే శుకతాతంతపోనిధిం♪!! 

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే!!

నమో వై బ్రహ్మ నిధయే వశిష్ఠాయ నమోనమః!

అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే! 

సదైకరూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే!!


నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం! దేవీంసరస్వతీం చైవ తతో జయ ముదీరయేత్•!!


*శౌనక ఉవాచ:* 


శ్లో॥ 

*సూతసూత మహాభాగ వ్యాసశిష్య మహామతే।*

*త్వదీయవదనాంభోజా దుపాఖ్యానానిశృణ్వతాం|*

*తృప్తిర్నజాయతే భూయశ్రావణేచ్ఛా ప్రవర్ధతే!*


తా॥

మహానుభావుడవును విశేషమైన జ్ఞానము గలవాడవును వ్యాసమునీశ్వరునకు శిష్యుడవును అగు ఓ సూతమునీశ్వరా! నీ ముఖపద్మము వలన  అనేక యితిహాసములను వింటిమి. అయినను తృప్తి తీరలేదు, తిరిగి _*శ్రావణమాస మాహాత్మ్యము*_ వినవలయునని కోరిక గలిగియున్నది. అని శౌనకుడు పలికెను.


*శ్లో:* 

*కార్తికస్యచమాహాత్మ్యం తులాసంస్థే దివాకరే!*

*మాఘమాసస్య మాహాత్మ్యం మకర స్థితే దివాకరే॥*

వైశాఖమాసమాహాత్మ్యం తథా మేషగతే రవౌl 

తత్ర తత్ర చ యే ధర్మాః కథితాస్సర్వశస్త్వయా! 


 ఓ మునీశ్వరుడా! సూర్యుడు తులారాశి యందు ప్రవేశించినప్పుడు కార్తికమాస మాహాత్మ్యమును, సూర్యుడు మకరరాశి యందు ప్రవేశించినప్పుడు మాఘమాస మాహాత్మ్యమును, సూర్యుఁడు మేషరాశి యందు ప్రవేశించినప్పుడు వైశాఖమాస మాహాత్మ్యమును చెప్పి, ఆయా మాసములయందు జేయతగిన ధర్మములను సవిస్తరముగా జెప్పియుంటిరి.


 ఓ మునీశ్వరుడా! ఏ మాసము యొక్క మహిమను వినిన యెడల మఱియొక ధర్మమును వినవలయునని కోరిక కలుగదో... ఆటువంటిదియు, ఈ చెప్పబడిన మాసములకంటె ఉత్తమమైన మాసము ఉన్నయెడల చెప్పవలయును. ఎవరైనను ధర్మమును వినవలయునని కోరిక గలిగియున్న యెడల తెలిసినవారు దానిని చెప్ప వలయును గాని దాచగూడదు.


 *సూతుడు చెప్పుచున్నాడు...*


 ఓ శౌనకాది మునులారా! మీరందరు వినుఁడు. మీకు అందరికీ నాయందు ఉన్న గౌరవము వలన సంతసించితిని, ఇంత శ్రద్ధ గలిగియున్న మీ యెదుట సర్వమును జెప్పెదను గాని రహస్యముగా ఉంచువాడను కాను.


 డాంబికము లేకయుండుట, ఈశ్వరుడు ఉండుననుట, ద్వేషము లేక పోవుట, భక్తికలిగి యుండుట, పెద్దలను సేవించుట, నమ్రతగా ఉండుట, సమస్త విద్యలు నేర్చియుండుట, మంచి స్వభావము గలిగియుండుట, ధైర్యము కలిగియుండుట, శుచిగా ఉండుట, తపస్సు చేసికొనుట, అసూయత లేకపోవుట, అను గుణములు పండ్రెండును ధర్మములను వినవలయును అనుకునే వారికి ముఖ్యముగా ఉండవలయును. కాఁబట్టి అట్టి సమస్త గుణములు మీయందు ఉన్నందువలన సంతోషించి, యధార్ధముగా అంతయు మీకు చెప్పదలచిన వాడనైతిని.


 ఓ మునులారా! మిక్కిలి జ్ఞానసంపన్నుడైన సనత్కుమారుడు ధర్మములను తెలుసుకొన నిశ్చయించినవాడై యీ ప్రకారముగా అడిగెను.


 సనత్కుమారుడు అడుగుచున్నాడు.... 


 దేవతులకు దేవుడవును మునీశ్వరులచే ధ్యానము చేయతగిన పాదపద్మములు కలవాడవునగు... ఓ సాంబమూర్తీ! అనేకమైన వ్రతములు ధర్మములు సవిస్తరముగా నీవలన వినియుంటిని.


 అయినను, ఇప్పుడు నా మనస్సునందు మఱియొక కోరిక గలదు.  ఆది యెట్లనగా పండ్రెండు మాసములలోను శ్రేష్ఠమైనదియు, మీకు ప్రియమైనదియు, సమస్త కర్మలకు ఫలమునిచ్చునట్టి మాసమును గురించి వినవలయునని కోరిక జనియించియున్నది. 


 ఓ స్వామీ! ఇతర మాసములయందు జేయునట్టి కర్మ ఏ మాసమందు జేసిన విశేషఫలమును ఒసగునో అట్టి మాసమును, ఆ  మాసమునందుండెడి సమస్త ధర్మములను జెప్పి, లోకులను తరింపజేయు అనుగ్రహము కలవాడవు అగుమని సనత్కుమార మునీశ్వరుడు ఈశ్వరునితో బలికెను.


*ఈశ్వర ఉవాచ:*


 బ్రహ్మ మానసపుత్రుడవు అగు ఓ సనత్కుమారా! నీ యొక్క శుశ్రూష చేతను, భక్తి చేతను సంతోషించితిని. నే జెప్పెడు ధర్మము రహస్యముగా ఉంచతగినది. అయినను జెప్పెద వినుము.


 పండ్రెండు మాసములలోను శ్రావణమాసము నాకు చాలా ప్రియమైనది, దాని మహిమ, వినతగినది గాన, శ్రావణమాసమని పెద్దలచే నుడువఁబడి యున్నది.


 శ్రవణ నక్షత్రముతో గూడిన పూర్ణిమ గలదు కాబట్టి శ్రావణమాసమని చెప్పబడుచున్నది. ఏ మాసము యొక్క మహిమ వినబడినంత మాత్రముననే ఫలము నిచ్చుచున్నదో, అందువలననే ఆ మాసము శ్రావణమాసమని చెప్పబడుచున్నది. 


 ఆకాశమువలె నిర్మలమైనది కాబట్టి శ్రావణమాసమునకు, *నభా,* అని పేరువచ్చినది, ఆ మాసము నందుండు ధర్మములను లెక్కపెట్టుటకు ఈ భూమి యందు ఎవడును సమర్ధుడు కాడు.


 ఈ శ్రావణమాస మహిమను సర్వమును చూచుటకు బ్రహ్మ దేవుడు నాలుగు ముఖములు గలవాడయ్యెను, దేవేంద్రుడును వేయి నేత్రములు గలవాడయ్యెను.


 ఈ శ్రావణమాస ఫలమును చెప్పుటకు ఆదిశేషుడు రెండువేల నాలుకలు గలవాడయ్యెను. మఱియు ఇదియదియని విశేషముగా జెప్పనేల. ఈ మాసము యొక్క ఫలమును జెప్పుటకు ఈ ప్రపంచములో ఎవరును సమర్ధులు లేరు.ఓ మునీశ్వరుఁడా! ఈ శ్రావణమాస మహిమలో పదునారవ వంతు మహిమనైనను ఇతర మాసములు పొందలేవు. కాబట్టి, యీ మాసమంతయు వ్రతస్వరూపము గాను, ధర్మ స్వరూపముగాను ఉన్నదని మునీశ్వరులు జెప్పిరి.


 ఈ శ్రావణమాసము నందు ఒక దినమైనను వ్రతము లేని దినము లేదు. ఈ మాసమునందు తిధులన్నియు వ్రత దినములైనవి.


 ఈ శ్రావణమాస మహిమను గురించి చెప్పినదంతయు యధార్థమే గాని స్తోత్రము కాదు.  ఆర్తులు, జ్ఞానేచ్ఛగల భక్తులు, ప్రయోజనమును అపేక్షించు వారు, మోక్షాపేక్ష గలవారు, ఈ నాలుగు విధములైనవారును తమ తమ కోరికలను పొందుటకు ఈ శ్రావణమాస ధర్మములను ఆచరింపవలయును.


*సనత్కుమారువాచ:*


 ఓ సాంబమూర్తీ! ఈ శ్రావణమాసమునందు ఒక వారమైనను ఒక తిథియైనను, వ్రతము లేనిది కాదు. తిథులన్నియు తరుచుగా వ్రతములు కలవియే యని చెప్పితిమి. దానినే విస్తరించి నాకు జెప్పవలయును. ఏ తిథియందు ఏమి వ్రతము కలదు, ఏ వారమునందు ఏమి వ్రతము కలదు, ఆయా వ్రతములను ఎటువంటి వాఁడు చేయవలయును,  చేసినందువలన ఏమి ఫలము కలుగును, చేయువిధానం ఎటువంటిది, ఈ శ్రావణమాస వ్రతములను పూర్వమందు ఆచరించినవారెవరు, ఉద్యాపనము చేయుట ఎట్లు, ఏ దేవతను పూజింపవలయును ఆ పూజకు సామాగ్రి ఏమిటి!?


  ఓ సాంబమూర్తీ! నీవు ప్రధానుడవై యుండగా నీ ఎడమ భాగమందు శక్తియు, కుడి తొడయందు గణపతియు, నేత్రంబులయందు సూర్యుడును, భక్తాగ్రగణ్యుడగు విష్ణువు హృదయమందును నివసించి యుండుటవలన సృష్టి-స్థితి-లయములను జేయుటవలనను నీవు బ్రహ్మస్వరూపుఁడవైతివి.  నిన్ను పూజించినయెడల పంచాయతనపూజ జరుగును ఇతర దేవతలను పూజించిన యెడల ఆ విధముగా సంభవించదు.


 ఓ శివుడా! నీవు సమస్త దేవతలకును జీవస్వరూపముగా ఉండుటవలన నీవు శ్రేష్ఠుడవనుటకు నెవరికి సందేహము లేదు.


 విరక్తిని చెంది శ్మశానమునందు, పర్వతములయందు ఉన్న నీ యొక్క నివాసము ప్రతివారికిని వైరాగ్యమును అవలంబించి మోక్షాపేక్షులుగా ఉండవలయునని బోధించుచున్నది.  మఱియు పురుషసూక్తములో (ఉతామృతత్వస్స్యేశానః) అను మంత్రముచే ప్రతిసాదింపబడు దేవుడవు నీవేయని మునీశ్వరులు చెప్పుచున్నారు. 


 ప్రపంచమును సంహరింపజేయునట్టి హాలాహాలము అను విషమును నశింపజేయు ప్రలయకాలాగ్నిని మూడవ నేత్రముగా నుదుటను ధరించిన సుమర్ధుడవు నీవే కదా! సంసారమనెడు చీకటి నూతిలో పడద్రోయుటకు సమర్ధుడగు మన్మధుని సంహరించినవాడవు గదా! నీవు యిటువంటి వాడవు... అని నీ మహిమను జెప్పుటకు నేనెంతటివాఁడను.


 గ్రుడ్డిగవ్వతో సమానుడనైన నేను కోటి జన్మములెత్తినను నిన్ను స్తుతించుటకు సమర్ధుడను కాను. కాబట్టి, నాయందు దయ ఉంచి నేను వేసిన ప్రశ్నలకు అన్నిటికిని తగిన సమాధానములను జెప్పి నన్ను కృతార్థుడను జేయుము. 

        

*||ఇతి శ్రీస్కాందపురాణే ఈశ్వర సనత్కుమార సంవాదే శ్రావణమాస మాహాత్మ్యే ప్రధమోధ్యాయ స్సమాప్తః|*

శ్రావణ మాసం ప్రారంభం

 🙏🌼🙏🌼🙏

శ్రావణ మాసం ప్రారంభం

ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం , సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు పండితులు. అంత గొప్ప పవిత్రమాసం ప్రారంభమైంది.


అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు , విశిష్ట పండుగలు రానున్నాయి.

సనాతన ధర్మంలో (హిందూ) చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది ఎంతో పవిత్రత కలిగినటువంటింది శ్రావణమాసం. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది.


వర్ష రుతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు , శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన దేవేరి(భార్య) మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటారు. వివిధ రకాల పూజలు , వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం , అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి.


*శివారాధనకు ఎంతో విశిష్టత*


శ్రావణమాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవదారాధనలో శివ , కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవకార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుందని ప్రతీతి. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు , బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్ర వచనం.


సోమవారాల్లో శివుడి ప్రీత్యార్థాం ఈ వ్రతాన్ని (ఉపవాసదీక్షను) చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగినవారు పూర్తిగా , అలా సాధ్యంకానీ పక్షంలో రాత్రి పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి.


వీటికి తోడు శ్రావణ శుక్ల పక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ ఒక్కోరోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేద శాస్త్రలు చెబుతున్నాయి. ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందంటున్నారు పండితులు.


*మంగళ గౌరీ వ్రతం*


శ్రావణ మాసంలో అన్ని మంగళవారల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ , మంగళగౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. ఈ వ్రతాన్ని గురించి నారధుడు సావిత్రికి , శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లి అయిన వారు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి.


*వరలక్ష్మీ వ్రతం*


శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీ దేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తర్వాత తొమ్మిది ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం ఈ శ్లోకాని పటించాలి.


*శ్లోకం : బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం*


*పుత్ర పౌత్రాభివృద్ధించ దేహిమే రమే*

అని పటిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి. అలాగే మంత్రాలను పటిస్తూనే ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చి ఆశ్వీరాదాలు తీసుకోవాలి. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం , మంగళ్య బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి..


*శ్రవణ మాసంలోని విశిష్టతలు*

శుక్ల ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలున్నాయి. శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణునువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది.


*శుక్ల పక్ష పౌర్ణమి:*

శ్రావణపౌర్ణమి , రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర , సోదరీ సంబంధానికి సూచికగా రక్షబంధనం జరుపుకుంటున్నాం. అంతే కాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవిత్రధారణ , వేదభ్యాసాన్ని ప్రారంభం చేస్తారు.


కృష్ణపాడ్యమి , హయగ్రీవ జయంతి , కృష్ణపక్ష విదియ , రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్య రోజులు వచ్చేవి శ్రావణమాసంలోనే. కృష్ణాష్టమి , పొలాల అమావాస్య , గోవులను పూజించడం వంటివి సైతం ఈ నెలలో రావడం ప్రత్యేకత. ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సిన విధులు , పూజలు , వ్రతాలు , నియమాలు , తూచ తప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి.

🙏🌼🙏🌼🙏

*శ్రీ కాళహస్తీశ్వర శతకము - 1*

 

 *𝕝𝕝 శార్దూలము𝕝𝕝* 

   *శ్రీవిద్యుత్కలితాజవంజవ మహాజీమూతపాపాంబుధా*

    *రావేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్‌*

    *దేవా! మీ కరుణాశరత్సమయ మింతేఁ జాలు జిద్భావనా*

    *సేవం దామరతంపరై మనియెదన్‌ శ్రీకాళహస్తీశ్వరా* !


               *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 1*


*తాత్పర్యము: మంగళకరమైన "శ్రీ" కారముతో ప్రారంభమై, - దేవా, శ్రీకాళహస్తీశ్వరా, మహాపాపసంఘములను మేఘసముచ్ఛయము వివిధ మాయలను మెరుపులతో నా మదిని జీకాకుపరచినది...ఆ వర్షాకాలము గతించి నీ కరుణ అను శరత్కాలారంభముతో నా మదియందు సద్భావనాంకురములు మొలకలెత్తు విధముగా నీ సేవ చేసెదను....*


✍️🌹💐🌷🙏

*05-08-2024 / సోమవారం / రాశి ఫలితాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️


*05-08-2024 / సోమవారం / రాశి ఫలితాలు*

•••••┉━•••••┉━•••••┉━•••••

మేషం


దూర ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయం కలుగుతాయి. చిన్ననాటి మిత్రులకు ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో భాగస్థులతో వివాదాలు నుండి కొంత వరకు బయటపడగలుగుతారు.

---------------------------------------

వృషభం


బంధుమిత్రుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది.  ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులను అధిగమిస్తారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. ఉద్యోగం అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు పొందుతారు.

---------------------------------------

మిధునం


ఒక వ్యవహరంలో సమాజంలో పేరు కలిగిన వారి సహాయంతో  కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆకస్మిక లాభాలు పొందుతారు.  విలువైన, వస్త్ర, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన  ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. 

---------------------------------------

కర్కాటకం


ఆర్థికపరిస్థితి కొంత అనుకూలంగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన అవరోధాలు అధిగమించి స్వల్ప లాభాలను అందుకుంటారు. ఉద్యోగులకు అధికారుల  ఆదరణతో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన పనులు  పనులు నిదానంగా సాగుతాయి. గృహమున సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

---------------------------------------

సింహం


వ్యాపార విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో  శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన  పనులు  సకాలంలో పూర్తిచేస్తారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

---------------------------------------

కన్య


వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్ధిక సమస్యలు నుంచి బయట పడతారు. సన్నిహితులతో  ఏర్పడిన వివాదాలు  సమసిపోతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. అన్ని రంగాల వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. 

---------------------------------------

తుల


కుటుంబ  సభ్యులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. సంఘంలో  పెద్దలతో పరిచయాలు విస్తృతం అవుతాయి. నూతన  వ్యాపారాలకు  ప్రారంభానికి శ్రీకారం చుడతారు. వృత్తి ఉద్యోగాలలో  నూతన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------

వృశ్చికం


ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు  అందుతాయి. ఆర్ధిక లావాదేవీలు అనుకూలంగా  సాగుతాయి. చేపట్టిన పనులలో  అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో  కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. సోదరుల నుండి  ఊహించని  ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి  సాధిస్తారు. 

---------------------------------------

ధనస్సు


చుట్టుపక్కల వారితో   వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో  అప్రమత్తంగా   వ్యవహరించాలి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. దూరప్రయాణాలు కలసివస్తాయి. వ్యాపార పెట్టుబడులు ఈ విషయంలో పునరాలోచన  మంచిది. ఉద్యోగులకు  అదనపు పని భారం నుండి ఉపశమనం కలుగుతుంది.

---------------------------------------

మకరం


కుటుంబ పెద్దల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు.   ఉద్యోగులకు పని ఒత్తిడి  పెరిగినా సమయానికి పూర్తిచేస్తారు. ధనాదాయం బాగుంటుంది. విద్యార్థులు నూతన విద్యలపై ఆసక్తి పెరుగుతుంది.

---------------------------------------

కుంభం


చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి  వివాదాలు పరిష్కారమౌతాయి. సంఘంలో నూతన వ్యక్తులతో  పరిచయాలు  కలుగుతాయి. వ్యాపారాలు ప్రారంభానికి ఆప్తుల  నుండి పెట్టుబడులు  అందుతుంది. గృహనిర్మాణ పనులు  వేగవంతం చేస్తారు. నూతన  వాహన యోగం ఉన్నది.

---------------------------------------

మీనం


మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలు విశేషంగా  రాణిస్తాయి. నిరుద్యోగులకు  పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా  పూర్తవుతాయి. ఉద్యోగమున  పురోగతి కలుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

•••••┉━•••••┉━•••••┉━•••••

🍁 *శుభం భూయాత్* 🍀

మతాన్ని రక్షించకపోతే

 *మతాన్ని రక్షించకపోతే సంస్కృతి నాశనం అవుతుంది*


వేదాలలో ఇలా చెప్పాయి.. *ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా* సమస్త ప్రపంచం యొక్క చలనం జీవితమంతా ధర్మం ద్వారానే సాగుతోంది. మనం ధర్మాన్ని రక్షిస్తూ ఆచరిస్తే, ధర్మం కూడా మనలను రక్షిస్తుంది. మనకు ఆనందాన్ని ఇస్తుంది. మనం మతాన్ని నిర్లక్ష్యం చేసి నాశనం చేస్తే, అది మనల్ని కూడా నాశనం చేస్తుంది.  తద్ద్వారా దుఃఖాన్ని,  బాధను కలిగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమయొక్క మతపరమైన జీవితాన్ని మాత్రమే గడపాలి.అదే మతంలో కడదాకా జీవించాలి. అప్పుడే జీవి పుట్టకకు ముందే విశ్వసృష్టికర్త  ప్రతిఒక్కరికీ విధిలిఖితమైన నిర్దేశించిన మతమార్గానికి పరిపూర్ణంగా న్యాయం చేసినవారమవుతాము.

*-శృంగేరీ జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామివారు.*

కలసివచ్చెనంచు

 ఆ.వె.

కలసివచ్చెనంచు కారుణ్యమదిలేక

కర్కశత్వమెగయ కఠినులౌచు 

పైనుయాపిలందు బాంబుల నిమిడించి 

చూలి యైన కరిని చూచి బెట్టె 

ఆ.వె.

అశనమందె ననుచు నా హస్తి తినబోవ 

నోట బాంబు ప్రేలె నొరిగె హస్తి 

తత్క్షణమ్ము చనియె తల్లి యేనుగచట 

తల్లితోడ పిల్ల దారిబట్టె 

తే.గీ. 

కర్మవెంటనంటి ఫలము కాచి యుండు 

తుంటరీల గ్రామమిపుడు తూలిపోయె 

కొండచరియలు జారగా కోపగించి 

సాంబు పాపమ్ము వంశమ్ము నంపినట్లు 

*~శ్రీశర్మద*

మహనీయుని మాట🍁

 


       ***************

🍁మహనీయుని మాట🍁

       ***************


"జేబులో చేతులు పెట్టుకుని దర్జాగా నిచ్చెన ఎక్కాలంటే కుదరదు.

ఏ శ్రమ చేయకుండా విజయం సాధించాలి అనుకుంటే సాధ్యపడదు."


        *************

🍃నేటి మంచి మాట🍃

        *************


"బియ్యపు గింజ 

పాలల్లో కలిస్తే పాయసం,

ఎసరులో కలిస్తే అన్నం,

పసుపుతో కలిస్తే అక్షతలుగా మారుతుంది.అలాగే

నలుగురిలో మన ప్రవర్తనను బట్టి మన గుణం నిర్ణయించబడుతుంది."


🌹🌹🌹🌾🌾🌾🌾🌹🌹🌹

🌾🌾🌾🌹🌹🌹🌹🌾🌾🌾

ఆగష్టు,05, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      🕉️ *సోమవారం*🕉️

 🌹 *ఆగష్టు,05, 2024*🌹

     *దృగ్గణిత పంచాంగం*                  


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - వర్ష ఋతౌః* 

*శ్రావణమాసం - శుక్లపక్షం*


*తిథి : పాడ్యమి* సా 06.03 ఉపరి *విదియ*

వారం :*సోమవారం*(ఇందువాసరే)

*నక్షత్రం : ఆశ్లేష* మ 03.21 వరకు ఉపరి *మఖ*


*యోగం : వ్యతీపాత* ఉ 10.38 వరకు ఉపరి *వరీయాన్*

*కరణం : బవ* సా 06.03 *బాలువ* పూర్తిగా రాత్రంతా


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 09.00 - 10.30 సా 04.00 - 06.00*

అమృత కాలం :*మ 01.38 - 03.21*

అభిజిత్ కాలం :*ప 11.48 - 12.39*


*వర్జ్యం : రా 04.33 - 06.18 తె*

*దుర్ముహుర్తం : మ 12.39 - 01.30 & 03.13 - 04.04*

*రాహు కాలం : ఉ 07.25 - 09.01*

గుళిక కాలం :*మ 01.49 - 03.25*

యమ గండం :*ఉ 10.37 - 12.13*

సూర్యరాశి :*కర్కాటకం*

చంద్రరాశి : *కర్కాటకం/సింహం*

సూర్యోదయం :*ఉ 05.49*

సూర్యాస్తమయం :*సా 06.37*

*ప్రయాణశూల :‌ తూర్పు దిక్కుకు* 

*ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.49 - 08.23*

సంగవ కాలం :*08.23 - 10.56*

మధ్యాహ్న కాలం :*10.56 - 01.30*

అపరాహ్న కాలం :*మ 01.30 - 04.04*

*ఆబ్ధికం తిధి:శ్రావణ శుద్ధ పాడ్యమి*

సాయంకాలం :*సా 04.04 - 06.37*

ప్రదోష కాలం :*సా 06.37 - 08.52*

నిశీధి కాలం :*రా 11.51 - 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.20 - 05.05*

______________________________

          🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🕉️శ్రీశైలేశ చరణ శరణాష్టకమ్🕉️*


శ్రీ భ్రామరీశ ! మదనాంతక ! కృత్తివాస !

సర్పాస్థిరుండకలితామలహారధారిన్ !

భూతేశ ! ఖండపరశో ! భవబంధనాశ !

శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి II


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>

          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦||¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


      𝕝𝕝పద్యం𝕝𝕝 


    *శ్రీవిద్యుత్కలితాజవంజవ మహాజీమూతపాపాంబుధా*

    *రావేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్‌*

    *దేవా! మీకరుణాశరత్సమయ మింతేఁ జాలు జిద్భావనా*

    *సేవం దామరతంపరై మనియెదన్‌ శ్రీకాళహస్తీశ్వరా* !


               శ్రీ కాళహస్తీశ్వర శతకము - 1


తాత్పర్యము: మంగళకరమైన "శ్రీ" కారముతో ప్రారంభమై, - దేవా, శ్రీకాళహస్తీశ్వరా, మహాపాపసంఘములను మేఘసముచ్ఛయము వివిధ మాయలను మెరుపులతో నా మదిని జీకాకుపరచినది...ఆ వర్షాకాలము గతించి నీ కరుణ అను శరత్కాలారంభముతో నా మదియందు సద్భావనాంకురములు మొలకలెత్తు విధముగా నీ సేవ చేసెదను....

నాకే ఎందుకు ఇట్లా అవుతుంది.

 నాకే ఎందుకు ఇట్లా అవుతుంది. 




ప్రతి మనిషి అనుకునే సాధారణమైన మాట "నాకే ఎందుకు ఇట్లా అవుతుంది" వాళ్ళందరూ చూడు యెంత సంతోషంగా, ఆనందంగా వున్నారో, అదేమిటోగాని నాకు మాత్రం జీవితంలో సంతోషమే కరువు అయ్యింది. ఎందులో వేలు పెట్టినా కానీ చుక్కెదురే పాడు జీవితం రోజు ఏడుపే నాకు మిగులుతుంది. ఇట్లా మనలో చాలామంది బాధపడుతుంటారు, బాధపడుతున్నారు అంటే అందులో ఆశ్చర్యం ఏమాత్రం లేదు. నిజమే ఎందుకు మనుషులలో ఇలాంటి భావనలు కలుగుతున్నాయి అంటే ప్రతి మనిషి కూడా ఒక అభిప్రాయంతో ఉంటాడు అదేమిటంటే తాను సుఖంగా లేడు ఎదుటివాడు సుఖంగా ఉన్నాడు అని అనుకుంటాడు. ఈ మానసిక స్థితి అటు పురుషులలోని ఇటు స్త్రీలలోను ఉంటుంది. 




మా అయన అస్సలు నా మాట వినడు అదే ఆ విమల వాళ్ళాయన ఎప్పుడు ఆమె కొంగు పట్టుకొని తీరుగుతాడు అంటుంది ఒక కమల . ఆమె దృష్టిలో తన భర్త తనకు స్వాధీనుడు కాడు కానీ విమల భర్త ఆమెకు స్వాదీనుడిగా ఉంటాడు అంటే తనకన్నా విమల అదృష్టవంతురాలు అని తన భావన. నీకు తెలుసా విమలా వాళ్ళాయన రోజు తాగి ఇంటికి వస్తాడట అని ప్రక్కింటి సరళ చెపితే ఆ అట్లనా అని ఆశ్చర్యపోయింది కమల అదికూడా రాత్రి పది పదకొండు గంటలకు. ఒక్కొక్కసారి తాగి రోడ్డుమీద పడితే తెలిసిన వాళ్ళు పట్టుకొచ్చి ఇంట్లో దింపుతారట ఆ అని మరల ఆశ్చర్యపోవటం తన వంతయింది నీకు తెలియదా అక్క అని పక్కింటి సరళ చెప్పేదాకా కమలకు విమల గూర్చి ఆమె తన భర్త విషయంలో పడే ఆవేదన గురించి తెలియదు, తనకు పగటిపూట ఎప్పుడో ఒకసారి తన భార్యను అనునయిస్తున్న అతనిని చూసి అనవసరంగా ఎక్కువగా వూహించుకున్నట్లు అర్ధం అయ్యింది. అక్కా బావ ఐతే ఎంచక్కా సాయంత్రం ఐదున్నరకల్లా ఇంట్లో ఉంటాడు నిన్ను పిల్లలను సినిమాలకు షికార్లకు తీసుకొని వెళతాడు. ఏ రోజయినా బావ ఆరింటికి ఇంటికి వచ్చాడా అక్కా అని అంటే అప్పుడు కానీ కమల ట్యూబులైటు వెలగలేదు యేమాటకు ఆ మాటే చెప్పుకోవాలి నిజానికి నా భర్త ఒక్క రోజు కూడా ఇంటికి ఆలస్యంగా రాడు నేనే ఎప్పుడు ఆయనను ఆడిపోసుకుంటాను అని మనసులో అనుకోని మంచి భర్తను తనకు ఇచ్చినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు చెప్పింది. ఒక్కసారి చూసి ఏ అభిప్రాయం ఎవరిమీద ఏర్పరచుకోకూడదని ఆమెకు అర్ధం అయ్యింది.




ఇదే విషయం పురుషులలో కూడా ఉంటుంది. మా ఆవిడ గయ్యాళి ఎప్పుడు నా మాటే చెల్లాలని అంటుంది నేను పడలేక పోతున్నారా అని ఒక రామారావు తన స్నేహితుడు కృష్ణమరావు తో అన్నాడు. దానికి కృష్ణమరావు మిత్రమా నీకు నాగభూషణం భార్య సంగతి తెలుసా అని అన్నాడు ఆ ఆమెకేమి అందంగా ఉంటుంది వాడు అదృష్ట వంతుడు అని అన్నాడు. . నీకు అదే తెలుసు ఆమె భర్త ఆఫీసుకు వెళ్ళగానే హ్యాండు బ్యాగు వేసుకొని షాపింగుకి బయలుదేరుతుంది. ఆమె చేసే షాపింగుకు నాగభూషణం సంపాదన అంతా ఉష్కాకి అవుతుంది నిజం చెప్పాలంటే నాగభూషణంకు ఒక కప్పు కాఫీ తాగటానికి కూడా జేబులో డబ్బులు వుండవు తెలుసా అని అన్నాడు అప్పుడు రామారావుకి తన భార్య పొదుపుతనం జ్ఞ్యాపకానికి వచ్చింది ఏది కొనాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి అది తప్పకుండా అవసరం ఐతేనే కానీ కొనదు. తననుకూడా దుబారా ఖర్చు చేయనీయదు. ఈ రోజు తాను తన సంపాదనతో ఒక సొంత ఇల్లు కొన్నాడంటే దానికి కారణం తన భార్య అని అనుకోని మనసులోనే భార్యను మెచ్చుకున్నాడు. నిజమే తానూ చాలా సార్లు విన్నాడు నాగభూషణం నోటి నుంచి నాకు ఈ నెల ఇంటి కిరాయి కట్టటానికి ఇబ్బందిగా వుంది కొంచం డబ్బులు సర్దు అని అడగటం. ఆలా తానుకూడా చాలా సార్లు నాగభూషణానికి ఇచ్చాడు. కొన్ని ఇచ్చాడు కొన్ని ఇవ్వలేదు. తనుకూడా అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు తెలిసిందిబాహ్య మెరుపులను చూసి బంగారం అని అనుకోకూడదని.




ఇలా వ్రాసుకుంటూ వెళితే నవలలకు నవలలు వ్రాస్తూ వెళ్ళవచ్చు. ఎందుకంటె మన సమాజంలో ప్రతి మనిషికి ఉండే సామాన్యమైన మనస్తత్వం ఒక్కటే అదే ఇతరులను పోల్చుకొని జీవించటం. ఇలా పోల్చుకునే విధానాన్ని వదిలి చుడండి తప్పకుండా మీరు సంతోషంగా ఉండగలరు. 




ఈ ప్రపంచంలో ఎవరి ఆర్ధిక పరిస్థితి వాళ్ళది ఎవరి మనస్తత్వం వాళ్ళది. ఏ ఒక్కరు కూడా వాళ్ళు అన్నదమ్ములే కావచ్చు లేక అక్కాచెల్లెళ్లు కావచ్చు ఇంకొకరి స్థితిగతులకు సమానంగా వుండరు నలుగురు పిల్లలు ఉంటే వకడు అందంగా ఉండవచ్చు ఒకడు అనాకారిగా ఉండవచ్చు ఒకడు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండవచ్చు మరొకడు ఏ పేరు లేకుండా తిండికి కూడా లేకుండా ఉండవచ్చు. అందుకేనేమో మనకు ఒక నానుడి వున్నది అదేమంటే " నేను వాళ్ళను కన్నాను కానీ వాళ్ళ రాతను కన్నానా" అని తల్లులు అంటూవుంటారు. ఇది ముమ్మాటికీ నిజం. 




ప్రతి మనిషి ఒకటి మాత్రం గుర్తుఉంచుకోవాలి అదేమిటంటే నాకు ఈ జన్మ భగవంతుడి ఇచ్చిన వరం. దీనిని నేను సద్వినియోగం చేసుకోవాలి అని సదా తలూస్తూవుండాలి అప్పుడే మదిలో చక్కటి భావాలు రేకెత్తుతాయి, జీవితం మంచి మార్గంలో పయనిస్తుంది. ఈర్ష్య, ద్వేషం, మొండితనం, అలసత్వం, సోమరితనం, ఇతరులమీద క్రుళ్ళుకోవటం, ఎదుటివాని ఎదుగలను చూసి అసూయపడటం మానుకోవాలి. ఈ ప్రపంచంలో భగవంతుడు ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. ఒక్కమాటలో చెప్పాలంటే దేనికి నీవు అర్హుడవో అదే నీకు లభిస్తుంది. ఈ విషయం తెలియక్ ప్రతివారు వారి అంతస్తుకు మించిన ఆలోచనలు చేసి అప్పులపాలు అయి చివరకు చతికిల పడతారు. సమాయణంలో ఇతరులముందు అబద్దపు డాంబికాలు (false prestage) పోయి అప్పులలో అనేక అవసరము వున్నా లేకపోయినా అనేక గృహయోపకారణాలను కొని నెలసరి వాయిదాలు సరిగా కట్టలేక చివరకు అప్పుల బాధలు పడలేక ప్రాణాలు తీసుకున్నవారు ఎందరినో మనం చూస్తూవున్నాము.  




నిజానికి మనిషి తనకు తానుగా తన స్థితి ఏమిటి సమాజంలో తన స్తానం ఏమిటి అని యోచించి తగిన విధంగా కట్టు, బొట్టు కలిగి మెసలుకోవాలి. నీవు పాత చొక్కావేసుకున్నావని సమాజం నిన్ను గౌరవించదని నీవు అనుకుంటే నీవు అప్పు చేసి డాంబికానికి పొతే చివరకు అప్పు తీర్చటానికి ఎవ్వరు నీకు సాయం చేయరు. కాబట్టి ప్రతి మనిషి తన ఆదాయం, ఖర్చు మీద సరైన జ్ఞ్యానం కలిగి తన ఆదాయానికి తగినట్లుగా తన ఖర్చులను నిర్ణయించుకోవాలి. ఈ రోజుల్లో ప్రతి మహిళా చక్కగా పురుషులతో సమానంగా విద్య బుద్దులు కలిగి వుంటున్నది కాబట్టి తన గృహ నెలసరి ఖర్చుల విషయంలో భార్య భర్తలు కలిసి వారికి ఏవి అవసరమో, ఏవి అవసరము లేవో చక్కగా విశ్లేషణ చేసి ఒక ప్రణాళిక బద్దంగా ఆదాయ వ్యయాలను నిర్ణయించుకొని ప్రతినెల మిగులు బడ్జెట్ వచ్చేవిధంగా ఏర్పాటు చేసుకొని మిగిలిన ద్రవ్యంతో శాశ్విత ఉపకరణాలు అంటే, మిక్సీ, గ్రైండర్, ఫ్రిడ్జి మొదలైనవి కొనుక్కుంటే సంసారం మూడు పూవులు ఆరు కాయలుగా ఉంటుంది. అదే భార్య ఒకటి భర్త ఒకటి అనుకుంటే జీవితం నరక సాదృశ్యం అవుతుంది. 




ఇక్కడితో ఈ కధనాన్ని ఆపితే అది సామాజిక పరమైన కధనంగా అనుకోవచ్చు కానీ ఇంకా కొంచం ముందుకు తీసుకొని వెళితే అప్పుడు దానిని ఆధ్యాత్మిక పరమైనదిగా అనుకోవచ్చు. అన్ని శాస్త్రాలు ఎక్కడ ఆగిపోతాయో అక్కడనుండి ఆధ్యాత్మికత మొదలౌతుంది. అది మన మహర్షులు మనకు బోధించిన అనన్య సామాన్యమైన జ్ఞ్యాన సంపద 




ఫై కథనాన్ని చదివితే మనకు తెలిసేది ఏమిటంటే పోటీ తత్త్వం వలన మనకు అనేక అనర్ధాలు కలుగుతాయి అని. కానీ భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే పోటీ తత్త్వం ఏమి చెడ్డ గుణం కాదు నిజానికి నిజమైన పోటీ తత్త్వం ప్రతి సాధకుడు కాలిగి ఉండాలి. అదేమిటి ఇది సమాజానికి ఎలా హితవు కీడు అని కదా మనం తెలుసుకున్నాము అని అనుకోవచ్చు. ఆ పోటీ తత్త్వం సాటి మానవులను చూసి ఉండకూడదు మరి ఎవరిని చూసి ఉండాలంటే అది భగవంతుని చూసి భగవంతునితో పోటీ తత్త్వం కలిగి నిత్యం భగవంతుని ఆరాధిస్తూ అయన గుణాలను పొంది చివరకు కైవల్యం చెందాలి అది ఎట్లానో ఇంకొక కాండికలో తెలుసుకుందాం. 




ఓం తత్సత్ 




ఓం శాంతి శాంతి శాంతిః 




ఇట్లు 




మీ భార్గవ శర్మ .




ఇంకా వుంది

too much

 నేటి మంచి మాట 5/8/24

1 Dont trust too much

... Don't.love  too much

   Don't hope  too much

Because that too much  can hurt you so much.

2  విజయం నుండి వినయం నేర్చుకోవాలి.

పరాజయం నుండి గుణపాఠం నేర్చుకోవాలి.

3 మన లోపాలను మనమే తెలుసుకోవడం అన్నింటికన్నా పెద్ద చదువు సంస్కారం.

4 కంటికి కనిపించని శత్రువుని ఎదుర్కోవచ్చు గాని,స్నేహం ముసుగులో వున్న శత్రువుని ఎదుర్కోవడం చాలా కష్టం.

5 ఓటమి నీ తల.రాత కాదు

గెలుపు అవతలి వాడి సొత్తు కాదు.నిన్నటి నీ మరచి , నేటిని తలచి శ్రమించు. నీ ఆశయం సాదించు.

లోకాధ్యక్షః

 👆శ్లోకం 

లోకాధ్యక్షః సురాధ్యక్షో                     

ధర్మాధ్యక్షః కృతాకృతః | చతురాత్మా చతుర్వ్యూహ: చతుర్దంష్ట్రశ్చతుర్భుజః ||              


ప్రతిపదార్ధ:


లోకాధ్యక్ష: - లోకములను పరికించువాడు. 

సురాధ్యక్ష: - దేవతలకు కూడా తానే అధ్యక్షుడైనవాడు.

 ధర్మాధ్యక్ష: - ధర్మాధర్మములను వీక్షించువాడు. 

కృతాకృత: - కార్య, కారణ రూపములతో భాసించువాడు. చతురాత్మా - విభూతి చతుష్టయము తన స్వరూపముగా గలవాడు.

 చతుర్వ్యూహ: - నాలుగు విధముల వ్యూహము నొంది సృష్టి కార్యములను చేయువాడు. 

చతుర్దుంష్ట్ర: - నాలుగు కోరపండ్లు గలిగినవాడు. 

చతుర్భుజ: - నాలుగు భుజములు కలిగినవాడు.

పంచాంగం 05.08.2024 Monday.

 ఈ రోజు పంచాంగం 05.08.2024 Monday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం వర్ష  ఋతు శ్రావణ మాస శుక్ల పక్ష ప్రతిపత్తి తిధి ఇందు వాసర: ఆశ్రేషా నక్షత్రం వ్యతీపాత యోగ: బవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


పాడ్యమి సాయంత్రం 06:06 వరకు.

ఆశ్రేష మధ్యాహ్నం 03:23 వరకు.


సూర్యోదయం : 06:00

సూర్యాస్తమయం : 06:44


వర్జ్యం : ఈ రోజు లేదు.


దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:47 నుండి 01:38 వరకు తిరిగి మధ్యాహ్నం 03:20 నుండి 04:11 వరకు.


అమృతఘడియలు : మధ్యాహ్నం 01:39 నుండి 03:23 వరకు.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.


యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.



శుభోదయ:, నమస్కార:

దేవాలయాలు - పూజలు*

 *దేవాలయాలు - పూజలు*


సభ్యులకు నమస్కారములు.


ఈ విశాల విశ్వం పరిశీలించినప్పుడు మన భారత దేశం పుణ్య భూమిలో భవ్యమైన, దివ్యమైన దేవాలయాలు దేశమంతటా విస్తరించి ఉండడం మన (జనుల) అదృష్టం. సర్వ వ్యాపి ఐన భగవంతుడు లేనిదెక్కడ. వాస్తవానికి భగవంతుని ఆరాధించక పోయినా, ఆయనకు ఆలయాలు నిర్మించక పోయినా *ఆయనకు వచ్చే లోటేమిలేదు*. కాని, భగవత్ ఆరాధన అనేది ప్రాణులు తరించడానికి అనే విషయం త్యాగయ్య, అన్నమయ్య, పురందర దాసు, రామదాసు, తులసీదాసు లాంటి మహానుభావులు తమ తమ కీర్తనలలో తెలిపారు. *భగవతారాధన అనేది భగవంతుని పై మనం చూపే కృతజ్ఞత*. ఇంట్లో నిత్య పూజలతో పాటు దేవాలయాలలో మరియు శక్తిగల దివ్య క్షేత్రాలలో భగవత్ ఆరాధన మన (భక్తుల) భౌతిక, ఆధ్యాత్మిక జీవనానికి ఎంతో అవసరము. *అవుతే, ఈ అవకాశం దొరికిన వారు మరియు సద్వినియోగం చేసుకున్న వారు ధన్య జీవులు*. 


దేవాలయమనగానే ఒక పవిత్ర కట్టడం, పురా శిల్పాలతో నిండిన గోపురాలు, దూర దూరానికి గూడా వినిపించే *మృదు మధుర ఘంటా నాదాలతో , శోభాయమానంగా నింగిని తాకేలా సగర్వంగా మరియు మంగళ ప్రదంగా నిల్చే ధ్వజ స్తంభాలు కనుల ముందు కదలాడుతాయి. ప్రస్తుత రణ గొణుల మధ్య పట్టణాలు, నగరాలలో దేవాలయాల ఘంటా నాదములు సుదూరము వినిపించక పోవచ్చును గాని పల్లెటూరులలోని ప్రశాంత వాతావరణంలో దేవాలయ ఉదయపు సుప్రభాతాలు, చిరుగంటల నాదములు గూడా శ్రవణానందకరముగ వినవచ్చును*. ఆధ్వనుల తరంగాలు ఆకాశంలో ప్రయాణిస్తూవుంటే మన శరీరంలో మనసులో ప్రశాంతత స్వచ్ఛత అణువణువునా ప్రసరిస్తుంది.


దేవాలయలలో స్వామిని అర్చిస్తూ అర్చక స్వాములు పలికే వేద మంత్రాల శబ్ద తరంగాలు కర్ణపుటాలను తాకి భక్తుల భక్తి భావం ఉప్పొంగేలా హృదయానికి చేరుస్తాయి. *భగవంతుడు-ఆయనశక్తి మనకు అండగా వున్నాడనే మనోధైర్యం* అసంకల్పితంగానే మనమంతా కైమోడ్చి మ్రొక్కుతాము. స్వామి రూపాన్ని మది నిండా నింపుకుని, పునః దర్శనం వాంచిస్తూ 

*కర్తవ్య నిష్టులమై* వెనుదిరుగుతాము. 


*మాన్యులకు విజ్ఞప్తి*

*దేవాలయము - పూజలు* అను విషయము పై ధారావాహిక రచనా నిర్మాణము బహు సున్నితమే గాకుండా క్రమానుసారమైన, ప్రామాణిక, సుస్థాపిత విశేష్యముగల అంశము గనుక ఈ గ్రూప్ లోని మాన్యులు...ఈ రచనలలో అన్యమైన, అసంగత, అసంబద్ధ, అప్రస్తుత, అనంగీకార ప్రస్తావనలు ఉంటే తెలుపగలరు, సరిదిద్దగలరు. ప్రమాణములు జతపర్చిన చదువరులకు మరింత జ్ఞానదాయకంగా ఉంటుంది.


*మరియొక మాట*

మనందరి అభిప్రాయము మరియు దీక్ష....ఒకటే... *నిద్రాణమైన జాతిని మేల్కొలిపి, చైతన్యాన్ని రంగరించి పోసి, జాగృతం చేయవల్సిన అవసరం మరియు ప్రజలను హిందు సంస్కృతి, సంప్రదాయాల పట్ల అధిక చింతన కల్గించు అవసరము కూడా దిన దినము పెరుగుతూనే ఉన్నది. పెద్దలందరూ ఈ దిశగా ప్రజలకు మార్గదర్శనం చేయగలరని సవినయ విజ్ఞప్తి*.ఆంగ్లంలో ఒక వాడుక ఉన్నది *Charity begins from home* అని. కావున మన జాగృతి కార్యక్రమాలు మన ఇల్లు, మన వీధి మరియు మన సంస్థ నుండి ప్రారంభిద్దాము.

🙏🙏🙏🏻


ధన్యవాదములు

*(సశేషం)*

నువ్వే కారణం

 భక్తురాలు :--

స్వామీజీ రాత్రి నాకో కల వచ్చింది స్వామీ నేను చనిపోయి పై లోకాలకు వెళ్లినట్లు అక్కడ తాతలు ముత్తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు అందరు కనుపించారు స్వామీ 


స్వామీజీ :---ఇంకేం చాలా అదృష్టవంతురాలివి 🧖‍♂️


భక్తురాలు :---

ఏం అదృష్టం స్వామీ వాళ్లంతా చాలీ చాలని తుండు గుడ్డలు, చిల్లులు పడ్డ చీరలు కట్టుకుని చలికి వణుకుతూ ఒక పెద్ద భోజన శాలలో బంగారు కంచాల్లో భోజనానికి కూచున్నారు 

కానీ తినటం మానేసి పురుగులు ఏరుకుంటున్నారు స్వామీ నేను ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు చేశాను స్వామీ. వాళ్ళకి ఆ దురవస్థ ఎందుకు పట్టింది స్వామీ 🤦🏻‍♀️


స్వామీజీ :---

అవునమ్మా. దీనికి కేవలం నువ్వే కారణం.🤷‍♂️


భ :--నేనా స్వామీ 🙆🏻‍♀️


స్వామిజీ :---

అవును నువ్వే 

వ్రతాలకు,పూజలకు పెట్టిన చిన్న తుండు ముక్కలు పురుగులు పట్టిన రేషన్ బియ్యం, స్వయంపాకం ఇచ్చిన మీ ఇంట్లో మిగిలిపోయి పాడై పోయిన సరుకులు,

వస్త్ర దానం ఇచ్చిన ముతక పంచె, చీర పంతులుకే కదా అని ఎంతో ఉదారంగా ఇచ్చావు కదా ఇప్పుడు ఆలోకంలో వాళ్లకు అవే సంప్రాప్తం అయ్యాయి. నువ్వు ఏమిస్తావో తిరిగి అదే దక్కుతుంది ఇక నైనా నీ సంపద కక్కుర్తి తో కాక సక్రమంగా ఉపయోగించు. ఇక వెళ్ళిరా జై మాతా 🙋‍♂️

సాధించాలి అనే పట్టుదల

 ఒక మహారాజు వేటకు వెళ్లి తిరిగి రాజ్యం చేరడం ఆలస్యం అవడంతో దారిలో ఒక చీరలు నేసే వారి ఇంట్లో ఆ రాత్రికి సేద తీరుతాడు .


వచ్చింది రాజు అని తెలియక వాళ్ళు అతిథి మర్యాదలు చేసారు.

అలసిపోయిన రాజు ఉదయం లేవడం కాస్త ఆలస్యం అవడంతో ఆ ఇంటి వాళ్ళు వారి పనుల్లో వారు ఉన్నారు .


రాజు లేవగానే చీర నేసే అతన్ని చూసాడు .

అతడి చేతికి ఒక తాడు కట్టి ఉండడం గమనించాడు రాజు వెంటనే ఎందుకు ఈ తాడు అని అడగగా ఆ వ్యక్తి రాజు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం పని చేస్తూనే ఇవ్వడం మొదలు పెట్టాడు 


ఉయ్యాలలో బాబు నిదుర పోతున్నాడు బాబు కదిలినప్పుడల్లా ఈ తాడు లాగితే బాబు నిదుర పోతాడు అని చెప్పాడు .


అతనికి దగ్గరలో ఒక కట్టె కనిపించింది రాజుకి.

అదేందుకు అని అడిగాడు రాజు 

బయట నా భార్య ధాన్యాలను ఎండబెట్టి వెళ్ళింది పక్షులేవైనా వస్తే ఈ కట్టె కు కట్టిన నల్లగుడ్డ ఊపితే అవి వెళ్లిపోతాయి అని బదులిచ్చాడు ఆ వ్యక్తి .


ఆ వ్యక్తి నడుముకి గంటలు కట్టుకుని ఉండడం గమనించాడు రాజు అదెందుకు అని అడిగాడు.అందుకు ఆ వ్యక్తి

ఇంట్లో ఎలుకలు బెడద ఎక్కువగా ఉంది. అవి వచ్చినప్పుడు ఈ గంటలు మోగిస్తే వెళ్లిపోతాయి అన్నాడు 


ఆ ఇంటి కిటికీలో ఓ నలుగురు వ్యక్తులు కనిపించారు రాజుకి.

వాళ్ళు ఎవరు అని అడిగారు ??


పని చేస్తున్నది నా చేతులే కదండి నా నోరు ఏ పని చేయట్లేదు అందుకు నాకు వచ్చిన కొన్ని పాటలు వాళ్లకు నేర్పిస్తాను వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పాడు .

రాజు మళ్ళీ సందేహంగా ఆలా వాళ్ళు బయట ఉండి నేర్చుకోటం ఎందుకు ఇంటి లోపలకు రావొచ్చుగా అని అడిగారు అందుకు ఆ వ్యక్తి 


నేర్చుకుంటున్నది నోటితోనే... కాళ్ళు ఊరకనే ఉంటాయి కదండి! పాట నేర్చుకుంటూ వాళ్ళు కుండలు తయారు చేయడానికి మట్టిని తొక్కుతుంటారు అని బదులిచ్చాడు .


రాజుకి చాల ఆశ్చర్యం వేసింది ఒక మనిషి ఒకే సమయంలో ఇన్ని పనులు చేయగలడా అని !!


అందుకు ఆ చీరలు నేసే వ్యక్తి ఇలా అన్నాడు.ఇంతే కాదండి నా భార్య కాస్త చదువుకున్నది తాను బయట పనులకు వెళ్లి వస్తుంది వెళ్లే ముందు పలకలో ఓ పది పదాలు రాసిపెట్టి వెళ్తుంది. అన్ని అయ్యాక అవి నేర్చుకుంటుంటాను అని బదులిచ్చాడు .


రాజుకి నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది ఒక మనిషి ఇష్టపడి చేస్తే ఏ పని కష్టం కాదు అని .


సోమరిగా తిరిగేస్తున్న వ్యక్తులకు ఇటువంటి వారి పరిచయం చాలు ఏదైనా సాధించాలి అనే పట్టుదల రావటానికి.


ఇష్టంగా చేస్తే కొండను సైతం పిండిని చేసేస్తామేమో కదండీ???

కష్టే ఫలి...