5, ఆగస్టు 2024, సోమవారం

నిత్యపద్య నైవేద్యం-

నిత్యపద్య నైవేద్యం-1570 వ రోజు

సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-205. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి

ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు


 సుభాషితం:

వనేపి దోషా: ప్రభవన్తి రాగిణాం

గృహేపి పంచేంద్రియ నిగ్రహస్తప:l

అకుత్సితే కర్మణి య: ప్రవర్తతే 

నివృత్త రాగస్య గృహం తపోవనమ్ll


తేటగీతి:

విషయ వాంఛలు గలవారు విడిచి యిల్లు 

అడవి కేగినా కామాదు లంతమౌనె?

ఇంద్రియ విజేతయై యింట నెల్లపుడును 

తపము జేసి కాగల్గును తాపసిగను.


భావం: విషయ వాసనలు కలవారికి అడవికి వెళ్ళినా కామ క్రోధాది దోషాలు సంభవిస్తాయి. పంచేంద్రియాలను నిగ్రహించినవారు ఇంటిలో ఉన్నా తపస్సు చేయగలరు. అనగా వారు తాపసులే. వారికి ఇల్లే తపోవనం.

కామెంట్‌లు లేవు: