*దేవాలయాలు - పూజలు*
సభ్యులకు నమస్కారములు.
ఈ విశాల విశ్వం పరిశీలించినప్పుడు మన భారత దేశం పుణ్య భూమిలో భవ్యమైన, దివ్యమైన దేవాలయాలు దేశమంతటా విస్తరించి ఉండడం మన (జనుల) అదృష్టం. సర్వ వ్యాపి ఐన భగవంతుడు లేనిదెక్కడ. వాస్తవానికి భగవంతుని ఆరాధించక పోయినా, ఆయనకు ఆలయాలు నిర్మించక పోయినా *ఆయనకు వచ్చే లోటేమిలేదు*. కాని, భగవత్ ఆరాధన అనేది ప్రాణులు తరించడానికి అనే విషయం త్యాగయ్య, అన్నమయ్య, పురందర దాసు, రామదాసు, తులసీదాసు లాంటి మహానుభావులు తమ తమ కీర్తనలలో తెలిపారు. *భగవతారాధన అనేది భగవంతుని పై మనం చూపే కృతజ్ఞత*. ఇంట్లో నిత్య పూజలతో పాటు దేవాలయాలలో మరియు శక్తిగల దివ్య క్షేత్రాలలో భగవత్ ఆరాధన మన (భక్తుల) భౌతిక, ఆధ్యాత్మిక జీవనానికి ఎంతో అవసరము. *అవుతే, ఈ అవకాశం దొరికిన వారు మరియు సద్వినియోగం చేసుకున్న వారు ధన్య జీవులు*.
దేవాలయమనగానే ఒక పవిత్ర కట్టడం, పురా శిల్పాలతో నిండిన గోపురాలు, దూర దూరానికి గూడా వినిపించే *మృదు మధుర ఘంటా నాదాలతో , శోభాయమానంగా నింగిని తాకేలా సగర్వంగా మరియు మంగళ ప్రదంగా నిల్చే ధ్వజ స్తంభాలు కనుల ముందు కదలాడుతాయి. ప్రస్తుత రణ గొణుల మధ్య పట్టణాలు, నగరాలలో దేవాలయాల ఘంటా నాదములు సుదూరము వినిపించక పోవచ్చును గాని పల్లెటూరులలోని ప్రశాంత వాతావరణంలో దేవాలయ ఉదయపు సుప్రభాతాలు, చిరుగంటల నాదములు గూడా శ్రవణానందకరముగ వినవచ్చును*. ఆధ్వనుల తరంగాలు ఆకాశంలో ప్రయాణిస్తూవుంటే మన శరీరంలో మనసులో ప్రశాంతత స్వచ్ఛత అణువణువునా ప్రసరిస్తుంది.
దేవాలయలలో స్వామిని అర్చిస్తూ అర్చక స్వాములు పలికే వేద మంత్రాల శబ్ద తరంగాలు కర్ణపుటాలను తాకి భక్తుల భక్తి భావం ఉప్పొంగేలా హృదయానికి చేరుస్తాయి. *భగవంతుడు-ఆయనశక్తి మనకు అండగా వున్నాడనే మనోధైర్యం* అసంకల్పితంగానే మనమంతా కైమోడ్చి మ్రొక్కుతాము. స్వామి రూపాన్ని మది నిండా నింపుకుని, పునః దర్శనం వాంచిస్తూ
*కర్తవ్య నిష్టులమై* వెనుదిరుగుతాము.
*మాన్యులకు విజ్ఞప్తి*
*దేవాలయము - పూజలు* అను విషయము పై ధారావాహిక రచనా నిర్మాణము బహు సున్నితమే గాకుండా క్రమానుసారమైన, ప్రామాణిక, సుస్థాపిత విశేష్యముగల అంశము గనుక ఈ గ్రూప్ లోని మాన్యులు...ఈ రచనలలో అన్యమైన, అసంగత, అసంబద్ధ, అప్రస్తుత, అనంగీకార ప్రస్తావనలు ఉంటే తెలుపగలరు, సరిదిద్దగలరు. ప్రమాణములు జతపర్చిన చదువరులకు మరింత జ్ఞానదాయకంగా ఉంటుంది.
*మరియొక మాట*
మనందరి అభిప్రాయము మరియు దీక్ష....ఒకటే... *నిద్రాణమైన జాతిని మేల్కొలిపి, చైతన్యాన్ని రంగరించి పోసి, జాగృతం చేయవల్సిన అవసరం మరియు ప్రజలను హిందు సంస్కృతి, సంప్రదాయాల పట్ల అధిక చింతన కల్గించు అవసరము కూడా దిన దినము పెరుగుతూనే ఉన్నది. పెద్దలందరూ ఈ దిశగా ప్రజలకు మార్గదర్శనం చేయగలరని సవినయ విజ్ఞప్తి*.ఆంగ్లంలో ఒక వాడుక ఉన్నది *Charity begins from home* అని. కావున మన జాగృతి కార్యక్రమాలు మన ఇల్లు, మన వీధి మరియు మన సంస్థ నుండి ప్రారంభిద్దాము.
🙏🙏🙏🏻
ధన్యవాదములు
*(సశేషం)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి