13, జులై 2021, మంగళవారం

వైదిక విజ్ఞానం అనే Link

 👇Link opened👇                         👉https://vignanam.org/mobile/

 

 ఈ వైదిక విజ్ఞానం అనే  Link     

అన్ని భాషలలో  ఇంతవరకు మీరు చూసి ఉండరు 


ఏ Book తో పని లేకుండా సమస్త దేవతల, దేవుళ్ళ  స్తోత్రాలు, అస్త్రోత్రాలు , శతనామాలు, సుప్రభాతాలు, చాలీసాలు, హారతులు  భగవద్గీత పతంజలి యోగ సూత్రాలు 

ఒకటేమిటి మీరు ఉహించలేనివి


భారతమాత కు సంభందించిన       

అన్ని వందేమాతరం జనగణమన సరేజహాసే అచ్చా మాతెలుగు తల్లికి  దేశభక్తి ,జాతీయ గీతములు


 అన్ని హారతులు అన్నమయ్య, రామదాసు త్యాగరాజు  కీర్తనలు

 

ఇవి ఒక ఉదాహారణ మాత్రమే ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో.... 

ఇది మీకు జీవితాంతం మీతో ఉంచుకోతగిన Link .దీని కోసం ఎంతో శ్రమ పెట్టి ఇది తయారు చేసిన వారికి పాదాభివందనము. 

ఇంత అత్యంత విలువైన దానిని ప్రతిఒక్కరు

ఉపయోగించుకుంటారని ప్రతిగ్రూప్   కి పంపుతారని  కోరుకొoటూ....🙏😊

భారతీయ ఆరోగ్య చిట్కాలు.*

 *కొన్ని ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు.*


1. _*అజీర్ణే భోజనమ్ విషమ్.*_

మధ్యాహ్న భోజనం జీర్ణం కాకపోతే, రాత్రి భోజనం చేయడం, విషం తీసుకోవడంతో సమానం అని ఈ సూత్రానికి అర్థం. ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణం కావడానికి ఒక సంకేతం. కాబట్టి ఆకలి లేకుండా మళ్ళీ ఆహారం తీసుకోకూడదు.


2. *అర్ధరోగహరి నిద్రా*

సరైన నిద్ర, మీ వ్యాధులలో సగం నయం చేస్తుంది. మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో, తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యవంతుడు రోజుకి కనీసం ఆరు గంటలు నిద్రపోవాలి. తిన్న ఆహారం జీర్ణం కావడానికి, శారీరక శ్రమ వల్ల కాళ్ళు, చేతులు, గుండె, మెదడు మొదలైన ముఖ్య అంగాలు అలసట తీరి సక్రమంగా పనిచేయడానికి నిద్ర ఉపకరిస్తుంది. అటువంటి వారికి రోగాలు దరిచేరవు. కనుక మంచి నిద్ర సగం రోగాలను హరించి వేస్తుంది అని ఈ సూక్తికి అర్థం.


3. _*ముద్గధాలి గధవ్యాలి*_

అన్ని రకాల పప్పుధాన్యాలలో, పచ్చ *పెసలు* (Greengrams) ఉత్తమమైనవి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇతర పప్పుధాన్యాలు అన్నీ,

 ఒకటి లేదా మరొకటి దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి.


5. *అతి సర్వత్రా వర్జయేత్*

అధికంగా తినేది ఏదైనా, అది మంచి రుచిని కలిగి ఉన్నా, ఆరోగ్యానికి మంచిది కాదు. మితంగా (తక్కువ) తినండి.


6. *నాస్తిమూలం అనౌషాధం*

శరీరానికి ఎటువంటి ఔషధ ప్రయోజనం లేని కూరగాయలు అంటూ లేవు.


7. *నా వైద్యా ప్రభుయుయుషా*

ఏ డాక్టర్ కూడా మన దీర్ఘాయువుకు ప్రభువు కాదు. వైద్యులకు కొన్ని పరిమితులు ఉన్నాయి.


8. *చింతా వ్యాధి ప్రకాషయ*

చింత అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది.


9. *వ్యాయమాశ్చ సనైహి సనైహి*

ఏదైనా వ్యాయామం నెమ్మదిగా చేయండి. వేగవంతమైన వ్యాయామం మంచిది కాదు. నడక కూడా ఇందులోకి వస్తుంది.


10. *అజవత్ చార్వనం కుర్యాత్*

మీరు తినే ఆహారాన్ని మేక లాగా నమలండి. ఎప్పుడూ ఆత్రుత తో ఆహారాన్ని మింగకూడదు. జీర్ణక్రియలో లాలాజలమే మొదట సహాయపడుతుంది.


11. *స్నానమ్ నామా మనఃప్రసాధనకరం దుస్వప్న విధ్వసకం*

స్నానం డిప్రెషన్ ను తొలగిస్తుంది. ఇది చెడ్డ కలలనును దూరం చేస్తుంది.


12. *న స్నానం ఆచరేత్ భుక్త్వా.*

ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేయకండి. జీర్ణక్రియ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది.


13. *నాస్తి మేఘసమం తోయం.*

స్వచ్ఛతలో వర్షపునీటికి, ఏ నీరు సాటి రాదు. పల్లెటూళ్ళలో ఇప్పటికీ వర్షపు నీటిని పట్టి వడకట్టి త్రాగుతారు. కాని నేరుగా పడిన వర్షపు నీటినే పట్టాలి. ఇంటి చూరుల మీదనుంచి కారిన నీరుకాదు.


14. *అజీర్నే భేజాజం వారీ*

మంచినీరు ఎక్కువగా తీసుకోవడం ద్వారా అజీర్ణాన్ని పరిష్కరించవచ్చు.


15. *సర్వత్ర నూతనం శాస్త్రం సేవకన్న పురాతనం.*

తాజా విషయాలను ఎల్లప్పుడూ ఇష్టపడండి. ఓల్డ్ రైస్ మరియు ఓల్డ్ సర్వెంట్‌ను కొత్తగా మార్చాల్సిన అవసరం ఉంది. (ఇక్కడ సేవకుడి విషయంలో అసలు అర్థం ఏమిటంటే: అతని విధులను మార్చండికానీ, తొలగించవద్దు.)


16. *నిత్యామ్ సర్వ రసభ్యాసహా.*

ఉప్పు, తీపి, చేదు, పులుపు, (Astringent మరియు pungent) అన్ని రుచులు కలిగి ఉన్న పూర్తి ఆహారాన్ని తీసుకోండి.


17. *జఠరామ్ పూరైధార్ధమ్ అన్నాహి*

మీ కడుపు అరవంతు ఘనపదార్థాలతో, పావువంతు నీటితో నింపండి మరియు మిగిలినది ఖాళీగా ఉంచండి.


18. *భుక్త్వోపా విసస్థాంద్ర*

ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఎప్పుడూ పనిలేకుండా కూర్చోవద్దు. కనీసం 100 అడుగులు అయినా నడవండి.


19. *క్షుత్ సాధూతం జనయతి*

ఆకలి, ఆహార రుచిని పెంచుతుంది. (ఇంకా చెప్పాలంటే, ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే తినండి.)


20. *చింతా జరానామ్ మనుష్యానమ్*

చింతించడం 😭అనేది వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. కనుక అనవసరపు చింతలతో ఆరోగ్యాన్ని పాడుచేసుకోకండి.


21. *సతం విహయ భోక్తవ్యం*

ఆహారం తీసుకొనే సమయం వచ్చినప్పుడు, ఎంతటి పనినైనా కూడా పక్కన పెట్టండి. నిదానంగా భోజనం చేయండి. వేగంగా తినడం, పని ఉందని అసలు భోజనమే మానివేయడం చాలా అనర్థదాయకం.


22. *సర్వ ధర్మేశు మధ్యమామ్.*

ఎల్లప్పుడూ మధ్యే మార్గాన్ని ఎంచుకోండి. దేనిలోనైనా విపరీతంగా వెళ్లడం మానుకోండి. ఈ ఆరోగ్య సూత్రాలు పాటించిన వారికి చిరాయువు, నిత్య ఆరోగ్యం  తప్పక లభిస్తాయి.✅

Lack of IMMUNITY

Lack of IMMUNITY 4 reasons


Stress:

Stress affects every person at some point in our lives. The hallmarks of stress are headaches, pounding chest pains, uneasiness and an overall tense feeling. In the presence of stress, the immune system has to work harder to defend the body against threats to health. Stress can suppress the immune system to such a point that it is severely compromised.


Not enough exercise:

Our immune system cannot function well if our lifestyle is sedentary. Regular exercise can help the function of neutrophils. These cells can help kill disease causing germs that can negatively affect health.


Lack of sleep:

While sleeping, the cells in the blood fight infections and keep them at bay. So lack of sleep and fatigue can leave you vulnerable to infection.


Improper nutrition:

It is important to eat a well-balanced assortment of foods including fruits, vegetables and whole grain sources. These foods support the immune system by providing crucial vitamins, minerals, phytochemicals and antioxidants. Fatty junk foods should be avoided. Fats, especially polyunsaturated fats, tend to suppress the immune system. Sugar can inhibit phagocytosis, the process by which white blood cells work to destroy viruses and bacteria.








పలకరింపు

 పలకరింపు మనిషి మంచి తనానికి ఆనవాలు........ 


 *_మనుషులకు మాత్రమే వున్న వరమిది. మానవీయ సంబంధాల వారధి. మనసు వ్యాకులతల పారద్రోలు మంత్రమిది._* 


 *పలకరింపులు లేని సమాజం సమూహం ఒట్టి నిర్జీవంగా గోచరిస్తాయి. ఒక్క పలకరింపుతో* *నూతనోత్తేజమేదో తొంగి చూస్తూంటుంది. పలకరింపు అనేది మనిషితనానికి, కలిసి బతికే మనిషితనానికి నిదర్శనంగా నిలుస్తుంది.* 


 *నేటి అత్యంతాధునిక అనేక సౌకర్యాల,* *విలాసాలననుభవిస్తున్న కాలంలో మనం పోగొట్టుకుంటున్న గొప్ప మానవాంశం పలకరింపు. ఇది చాలా చిన్న విషయంగానే అనిపించవచ్చు. ఒక్క చిన్న మాటే పలకరింపై వెలగవచ్చు. కానీ ఎన్ని డబ్బులు పోసినా దొరకని అమూల్య సంపద పలకరింపు.* 


 *ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. ఒక బాధని తొలగించవచ్చు. ఒక ఆలోచనను* *రేకెత్తించవచ్చు. ఒక ఆశను చిగురింపచేయొచ్చు. మనసు గాయాలను, గాట్లను మాన్పించవచ్చు !* 


 *పలకరింపుకు అంత శక్తి వుంది. పలకరించడమనే సమస్య నేడు ఇండ్లల్లో వృద్ధులు విపరీతంగా ఎదుర్కొంటున్నారు.*


 *తమ జీవితమంతా కుటుంబం కోసం, పిల్లల కోసం వెచ్చించి, వృద్ధాప్యంలో ఏమీ చేయలేని స్థితిలో ఇంట్లో వున్న పెద్దల్ని పనికిరాని వస్తువుల్ని చూసినట్లు చూస్తున్నారు. వారి శ్రమఫలమే వర్తమానపు మన కళ అని మరిచి పోతున్నారు. అట్లాంటి పెద్దలను* *ఆప్యాయంగా పలకరించాలి._* 


 *ఒక మాట మాట్లాడాలి. ఒక్కసారి పలకరింపుతో* *వాళ్ళను కదిపి చూడండి.* *బండెడు అనుభవాలను మీ ముందుంచుతారు. ఆ అనుభవాలు ఇప్పటికీ మనకుదివిటీల్లా పని చేస్తాయి.*


 *పలకరింపులు పెద్దలకు* *ఆరోగ్యాన్నిచ్చే మందులా పని చేస్తుంది. పెద్దలనే కాదు ఎవరినైనా పలకరిస్తూ వుండాలి. దాంతో స్నేహం, బంధం, ప్రేమ, అనుబంధం పెరుగుతూ వుంటుంది. ఇవి కేవలం మనుషులు సాధించేవి.* 


 *ప్రముఖ కథా రచయిత్రి ఇల్లిందల సరస్వతీ దేవిగారు* *"తీయని పలకరింపు"* *అని ఒక కథను రాశారు. అందులో ఒక రిటైర్డు పెద్దాయన, పలకరింపులు లేక పడుతున్న బాధను చక్కగా చిత్రించారు. ''నేను డబ్బులు బాగా సంపాదిస్తూ ఉద్యోగం చేస్తున్నపుడు నన్ను చాలా మంది పలకరించేవాళ్ళు. ఉద్యోగ విరమణ చేసి, ఆదాయం తగ్గిపోయిన క్షణం నుంచి పనికిరాని వాడిలా పలకరింపుకు నోచుకోలేక వృద్ధాశ్రమం చేరాను'' అని ఆ పాత్రలో వివరిస్తుంది* 


 *_డబ్బులు మాత్రమే ముఖ్యంగా మారిన నేటి తరాలకు మనుషుల మధ్య సంబంధాలు అప్రధానమై పోయి ఈ పరిస్థితులు దాపురించాయి. ఇది లాభాల ఆర్జన కోసం సరుకుల మీద వ్యామోహాన్ని పెంచిన సాంస్కృతిక దాడి ఫలితం. దీన్ని మార్చకపోతే మనమూ ఒకప్పటికి బాధితులుగా మిగులుతాం._* 


 *లాక్‌డౌన్‌ మూలానా ఇంట్లోనే అందురున్నప్పటికీ వారి మధ్య దూరాలేవీ తగ్గలేదు. మరింత పెరుగుతూనే వున్నాయి.* *ఎవరి చేతుల్లో వాళ్ళు సెల్‌ఫోన్‌లతో యియర్‌ ఫోన్లతో తమలో తామే, తమకు తామే గడిపేస్తున్నారు. కుటుంబ సంబంధాల్లో విపరీత దూరాలు పెరుగుతున్నాయి._* 


 *మనసుల్లో దాగిన భావాలు, అభిప్రాయాలు పలకరించి అడిగితేనే తెలుస్తాయి.* *తెలిసినపుడే వాటిని సరిచేయడమో, చర్చించి* *మనం సరికావడమో చేయవచ్చు. కొన్ని అపోహలూ తొలిగిపోవచ్చు.* *కుటుంబంలోనే కాదు ఇంటి పక్కన వాళ్ళను, దూరానవున్న మిత్రులను ఖాళీ సమయం దొరకగానే ఒక సారి పలకరిచండి* 


 *_కరోనా బాధితులను, దాని వల్ల భయపడుతున్న వాళ్ళను పలకరించాలి. పది మందితో గల సంబంధమే జీవితం._* 


 *నాకు తెలిసిన ఒక పెద్దాయన అన్ని హంగులు ఉండి కూడా, తాను, తన భార్యాబిడ్డలు, సన్నిహితులతో ఏసి లాంటి సకల సౌకర్యాలు అనుభవిస్తూ వృద్ధురాలు తన తల్లిని మాత్రం ఔట్ హౌస్ కొట్టుగదిలో ఉంచాడు. తనని* *పలకరించితేనే భార్య* *అనుగ్రహానికి దూరమైపోతానేమో అని భావించి, దూరంగానే ఉంచిన ప్రబుద్ధుడు* 


 *"'నాకేమీ పెట్టాల్సిన అవసరం లేదు. నేనేమీ అడగటమూ లేదు. రోజు ఏం* *చేస్తున్నావమ్మా, ఏం తిన్నావు, బాగున్నావా'' అని నన్ను అడిగితే చాలని ఎనభై యేండ్ల తల్లి నాతో చెబుతూ దు:ఖించింది. అంటే పలకరింపుల విలువేమిటో అర్థం చేసుకోవచ్చు. చివరికి ఆమె పోయిన తరువాత అతను కార్చిన* *మొసలికన్నీరుకి ఏ అవార్డు ఇవ్వొచ్చో అర్థం కాలేదు !* 


 *అందుకే.. పలకరించండి. పలుకులేమీ బంగారం కాదు. పలకరింపు మనిషి మంచి తనానికి ఆనవాలు !*.............

ముళ్ళపూడి జోకులు

 😎🤣😀😃😆😂🤣

ముళ్ళపూడి వెంకట రమణ గారి జోకులు😂


@ " మీ పిక్చర్ కామెడియా? ట్రాజెడీయా?'

"డబ్బొస్తే కామెడి, రాకపోతే ట్రాజెడీ".


🎈🎈🎈🎈🎈🎈


@"నేడే చూడండి" అని ప్రతి సినిమా ప్రకటనలో వేస్తారు కదా! అంత కొంప మునిగిపోయే అర్జంటేమిటి?"

"రేపుండదని హెచ్చరిక".


🎈🎈🎈🎈🎈🎈


@కమల: ఈ మగవాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో?

విమల: ఆడవాళ్ళు మాట్టాడుకునేవే మాట్లాడుతారనుకుంటా."

కమల: చి చి అసయ్యం.


🎈🎈🎈🎈🎈🎈


@"రేపు ఎలక్షనుకు నిలబడే అభ్యర్దులిద్దరి గురించి నీ అభిప్రాయం ఏమిటోయ్?"

" ఇద్దర్లో ఎవడో ఒకడే గెలుస్తాడని ఆనందంగా ఉన్నది."


🎈🎈🎈🎈🎈🎈🎈


@"నాతో నేనే మాట్లాడుకోడం మహా అలవాటైపోయింది డాక్టర్ గారూ. కాస్త మందేమైనా ఇస్తే-"

"దాంతో ఇబ్బందేముంటుంది? మందెందుకు?"

" అబ్బే వెధవ సోదండీ . విసుగొస్తుంది వాగాలేకా-వినాలేకా".


🎈🎈🎈🎈🎈🎈🎈


"ఏమండీ, ఈ కవర్ మీద పది పైసలు స్టాంపులు ఎక్కువ అంటించారు.'

" అయ్యో చూడు నాయనా. అది రాజమండ్రిదాకానే వెళ్ళాలి. బిళ్ళలెక్కువున్నాయని విశాఖపట్నం లో మా వియ్యపురాలింటికి తోలీకుండా చూడు."


🎈🎈🎈🎈🎈🎈🎈


@"ఇక లాభం లేదు, ఓ గంటకన్న ప్రాణం నిలబడదు. చెప్పదలుచుకున్నదేమన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి" అని   పెదవి విరిచాడు.

"ఆ ఉంది...ఇంకో డాక్టర్ను పిలిపించండి చప్పున" న్నాడు రోగి నీరసంగా.


🎈🎈🎈🎈🎈🎈🎈🎈


@"డాక్టర్ గారూ.భోజనానికి సరైన వేళాపాళా ఏదంటారూ ?"

"లేనివాడికి దొరికినప్పుడు...ఉన్నవాడికి అరిగినప్పుడు"


🎈🎈🎈🎈🎈🎈🎈


@ ఒక రోగి ఆ"పరేషన్" బల్ల ఎక్కుతూ 

"మరే ప్రమాదం లేదుగా డాక్టర్ గారూ?"


"చాల్చాల్లెవయ్యా, నవ్విపోతారు, నువ్విచ్చే డబ్బుకి ప్రమాదకరమైన ఆపరేషన్ ఎవడు చేస్తాడు. భలేవాడివిలే 😎


🎈🎈🎈🎈🎈🎈🎈

🙏🙏 శుభోదయం🙏🙏🙏

పాతాళ లోకమే అమెరికా

 ➖➖➖➖➖➖➖➖

       నాటి పాతాళ లోకమే నేటి అమెరికా!

➖➖➖➖➖➖➖➖


పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ గారు మొదలైన అనేక మంది పండితుల అభిప్రాయం. భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారత దేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరిం చారు.


👉 సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న కపిల మహర్షిని చూసి, ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా, ఆయన వారిని భస్మం చేస్తారు.


👉 ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరున కపిలారణ్యంగా ప్రసిద్ధికెక్కిందని, అదే ఈనాటి కాలిఫోర్నియా (శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖ రేంద్ర సరస్వతీ మహాస్వామి వారు 1935 లో ఒక ఉప న్యాసంలో చెప్పారు.)


👉 కాలిఫోర్నియకు దగ్గరలో ఉన్న ఆష్‌ల్యాండ్ (Ashland)  (సగర పుత్రులు బూడిద కుప్పలు గా  మారిన ప్రదేశం) మరియు 


👉 హార్స్‌ల్యాండ్ (Horse land) (యాగాశ్వం కట్టిన ప్రదేశం) అనే ప్రదేశాలకు సరిగ్గా వ్యతిరేక దిశలో గంగా నది ఉద్భవించిన గంగోత్రి హిమానీ నదం (Gangotri Glacier) ఉంది, ఈ రెండు ప్రదేశాలు కూడా సరళ రేఖలో 30 డిగ్రీల అక్షాంశం (Latitude) మీద ఉన్నాయి. 


👉 వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తోలి, ఆయన నివాసం కోసం ఇచ్చిన ప్రదేశం కూడా కాలిఫోర్నియనే దీని పురాతన నామం మహాబలి భూమి, ఇప్పుడది మలిపు (Malipu) అనే పేరుగా రూపాంతరం చెందింది.


👉 ఈ మలిపునగరంకు దగ్గరలోనే శాంటా మోనికా పర్వతం ఉంది. దీనికి లాస్ ఏంజిల్స్ చాలా దగ్గరి ప్రదేశం.


👉 బలిచక్రవర్తిని శ్రీ మహా విష్ణువు పాతాళానికి అధిపతి గా నియమించాడు. తన రాజ్యంలో సుఖసంపదలు ఉండాలని బలి వరం కోరుకున్నాడు. అందుకే ఈనాడు అమెరికా అంత సంపదతో తులతూగు తోంది. 


👉 పాతాళ లోకం భారతదేశ పాదాల క్రింద ఉంది, అక్కడికి వెళ్ళాలంటే 70,000 యోజనా లు లోతుగా భూమిలోకి వెళ్ళాలి. భారతదేశం నుంచి భూమిలోకి నిలువు (Vertical) గా స్వరంగం త్రవ్వితే మనం మళ్ళీ అమెరికా ఖండానికే చేరుకుంటాము.


👉 రాముడి ఆజ్ఞ మీద హనుమంతులవారి పుత్రుడైన మకరధ్వజుని పాతాళానికి అధిపతిని చేస్తాడు. ఇప్పటికీ మకరధ్వజుల వారిని మధ్య అమెరికా, దక్షిణ అమెరికాల్లో పూజింతారు. మధ్య అమెరికా, హోండురస్‌ (Honduras)లో ఉన్న La Ciudad Blanca [la sjuˈðad ˈblɑnkɑ] నగరాన్ని Lost City of the Monkey God‘ గా వ్యవహరిస్తారు. అక్కడి స్థానికులు కోతి ఆకారం కలిగిన భారీ మూర్తులను ఆరాధించేవారు. దాని ముందు స్థానిక జాతులు బలులు కూడా అర్పించేవారు (Theodore Morde అనే అమెరికెన్ సాహసికుడు 1939 లో వెళ్ళడించారు.)


👉 “సురాసురాణం అన్యోన్యం దివా రాత్రా విపర్యాయ" అనగా సూర్య సిద్ధాంతం ప్రకారం సురాసురుల కు ఒకరికి రాత్రయితే మరొకరికి పగలు.


👉 భూమినుండి 50000 యోజనాల  దూరంలో పాతాళం ఉన్నది. ఇప్పటికీ అమెరికాలో సంకల్పం చెప్పు కున్నప్పుడు కపిలారణ్యే అని చదువుకుంటాం. మన భూగోళ అడ్డకొలత (diameter) ఇప్పుడు మనం లెక్క వేస్తె సరిగ్గా లెక్క సరిపోతుంది.


👉 అమెరికాలో వెలుగు చూసిన ఎన్నో పురాతన శివాలయాలు, నారసింహ చిత్తరువులు, Oregon లో ఒక పెద్ద సరస్సులో ప్రపంచంలో అతి పెద్ద శ్రీయంత్రం బయలు పడడం ఇవన్నీ కూడా మన వాంగ్మయంలో చెబుతున్న చరిత్రకు ఆధారాలు చూపుతున్నవే.


👉  మూల అమెరికాయులు (రెడ్ ఇండియన్లు) విగ్రహారాధన చేస్తారు. ఇప్పటికీ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అని వారు పూజించిన విగ్రహాలు చూపుతారు. మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మునిమనవడు అయిన జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తే దాన్ని ఆపడానికి ఆస్తీక మహర్షి వస్తాడు. అతడి అభ్యర్ధన మేరకు ఆ యాగం ఆపబడు తుంది. అక్కడ మిగిలిన నాగులను వారి వంశస్థులను తీసుకుని ఆస్తీక మహర్షి పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇది ఎంత సత్యమో నేడు మెక్షికన్లను అజ్తెక్స్ (ఆస్తీకులు) అని పిలవడాన్ని బట్టి తెలుస్తుంది. Azteks నేటికి కూడా మనలాగే విగ్రహారాధన చేస్తారు. మన ధర్మంలో ఒకప్పుడు విలసిల్లిన వామాచార ఛాయలు ఎన్నో కనబడతాయి. వారు కూడా కొన్ని పూజలు చేస్తారు. ఒక్టావియా పాజ్ అనే నోబెల్ గ్రహీత, ఒకప్పటి భారత దేశంలో మెక్సికన్ రాయబారి తన పుస్తకం The light of India లో విపులంగా చర్చించాడు. aztec మరియు మాయ సంస్కృతులు వాటికి హిందూ సంస్కృతికి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో చెబుతాడు. వారు మరింత వామాచార పద్ధతులలో జంతుబలులు కూడా చేసేవారు. వారి పుస్తకాలలో మన ఆస్తీక మహర్షి వృత్తాంతం ఉన్నది.


👉 వారి మాయన్ క్యాలెండర్ కూడా 3114BC నుండి మొదలు అవుతుంది. ఇంచు మించు మనం మహాభారత యుద్ధానంతరం సమయం సరిగ్గా సరి పోతుంది. వారి సృష్టి సిద్ధాంతం కూడా మన సిద్ధాంతంతో పూర్తిగా ఏకీభవిస్తుంది. వారి వేదాన్ని పూపుల్ వుహ్ అంటారు. వారి పండగలు కూడా మన దశరా, దీపావళి, ఉగాది, చక్రపూజ మన సంస్కృతిలాగే అనిపిస్తాయి. వారుకూడా అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటారు. వారికి కూడా చాతుర్వర్ణ వ్యవస్థ వున్నది. వీటి అన్నింటి ఆధారంగా మరిన్ని పరిశోధన జరిగి మన వాంగ్మయ సత్యాలను ప్రపంచానికి తెలియ చెయ్య వలసిన అవసరం ఉన్నది.


ఒకసారి నడిచే దేవుడు కంచి పరమాచార్య వారు మూల అమెరికాయుల మంత్రాలకు మన మంత్రాల కు ఉన్న సంబంధం వివరిస్తారు. ఒకప్పుడు ఈ లోకాలన్నింటిలో ఒకే ధర్మం విలసిల్లేది.


అక్కడివారి వద్ద తాళం కనబడుతోంది. కేవలం హిందూ ధర్మంలో ఆ తాళం, దాని చిక్కుముడి విప్పే తాళంచెవి కూడా ఉన్నాయి అని పరమాచార్యులు అన్నారు.


ఎంత సత్యమో కదా !!!

♦️♦️♦️♦️♦️♦️♦️


సేకరించిన పోస్ట్ 😍🙏  

  చదివినవారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

జ్ఞానం అంటే *

 🕉🙏*జ్ఞానం అంటే *


చాల మందికి గుర్తు వచ్చే అంశం ‘బుధ్ధుడికి రావి చెట్టు కింద జ్ఞానోదయం’ అయింది అని 



💕అయితే జ్ఞానం అంటే ఏమిటి? అసలు ఆ బుధ్ధుడికి రావి చెట్టు కింద వచ్చిన జ్ఞానం ఏంటి? మనం గ్రహించని ఆ జ్ఞానం ఏది? 


💕జ్ఞానం అనగానే చాలా మంది వారి తెలివితేటలు అని అనుకుంటారు. 

❤️భగవద్గీతలోనూ, ఉపనిషత్తులలోనూ పలుమార్లు 

ఈ జ్ఞానం అనే పదం వచ్చింది. కనుక మనం అక్కడ జ్ఞానం అంటే ఏమి చెప్పారో చూద్దాం.

💕 వేదాలలో, ఉపనిషత్తులలో, భగవద్గీతలో  చెప్పబడిన జ్ఞానం అయితే బ్రహ్మ జ్ఞానం. జ్ఞానం అంటే తెలుసుకోవడం. 

జ్ఞానాన్ని దేని ద్వార తెలుసుకోవాలి అంటే ఒకటి గురువు బోధించడం వలన లేక వేద వేదాంగాలను క్షుణ్ణంగా గ్రహించి తెలుసుకోవడం వలన పొందేదే బ్రహ్మ జ్ఞానం. 


💕అంతే కాని మనం ఇప్పుడు చదివిన BB.Tech,MBA,MCA,

MBBS PG చదువులు చదివి తెలుసుకున్నది కాదు. ఇది అంతయు విద్యే కావచ్చు కాని బ్రహ్మ విద్య కాదు.     

సరే బ్రహ్మ విద్యను తెలుసుకోవడం అంటే జ్ఞానం అన్నారు. ఆ జ్ఞానం అంటే ఏమిటి ? నిజమైన జ్ఞానం అంటే ఆత్మానాత్మ వివేకం. 

వివేకం అంటే తెలివితేటలు. క్షుణ్ణంగా తెలుసుకోవడం. అంటే ఇక్కడ ఏది ఆత్మ? ఏది అనాత్మ? అనాత్మ అయినది దేని నుండి పుడుతుంది? వీటితో పాటు మరీ ముఖ్యంగా “నేను” ఎవరు? “దేవుడు” ఎవరు? ఈ శరీరము, మనస్సు,బుద్ధి, ఈ కనిపించే ప్రకృతి ఎట్లా వచ్చింది, ఎవరు సృష్టించారు, నేను ఎందుకు పుట్టాను. 

ఇలా ఈ విధంగా క్షుణ్ణంగా తెలుసుకోవడాన్నే జ్ఞానం అంటారు.

జ్ఞానం అంటే భగవంతుని గురించి ❤️సంపూర్ణంగా పరిపూర్ణంగా అయన స్వస్వరుపాన్నీ, నీవు అంటే ఎవరు అన్న విషయాలను కూలంకషంగా గ్రహించడమే జ్ఞానం. దీనికి అన్యమైనది ఏదైనా అజ్ఞానమే. భగవంతుని స్వస్వరూపం అంటే ఏముంది దేవుడు అంటే అయన ఎదో ఒక రూపంలో వుంటాడు, దేవునికి రూపం అనడమే అజ్ఞానం.


❤️దేవుడైన పరమాత్ముడు నిరాకారుడు, నిర్గుణుడు, సత్యుడు, శాస్వితుడు, అమరుడు, పుట్టుకలు లేనివాడు, నిత్యుడు, పురాతనుడు అయిన ఎల్లప్పుడూ నూతనుడు, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన ఈ సమస్తం వ్యాపించి ఉంటాడు. మరియు ఈ ప్రకృతి అంతయు కూడ ఆయనే అయి ఉన్నాడు.అది ఆ దేవదేవుడైన పరమాత్మ యొక్క స్వస్వరూపం.మరి నీవు ఎవరు ? అనగానే నేను అంటే ఈ శరీరం అనే భావన మనకు వస్తుంది. కాని ఈ శరీరం ఇప్పటికి కాకపోయిన ఎదో ఒక రోజు నశిస్తుంది కదా! అప్పుడు నీ పరిస్థితి ఏంటి. దానిని తెలుసుకోవడమే జ్ఞానం. 

❤️నీవు అంటే ఈ మాంసపు ముద్దలతో ఉన్న ఈ శరీరము కాదు. మరి ఎవరు పోనీ నేను అంటే ఈ మనస్సా, బుద్ధా లేక ప్రాణమా! ఇవి ఏవియు నీవు కాదు వీటికి అన్నిటికి అతీతంగా వుంటూ వీటికి అన్నిటికి శక్తినిచ్చే ఒక సాక్షిభూతమైన ఆత్మ స్వరూపుడివి మాత్రమే. నీవు అన్నది తెలుసుకోవడమే జ్ఞానం. 

💕ఈ విధంగా ఆత్మానాత్మ వివేకాన్ని సంపూర్ణంగా గ్రహించి దానిని నిత్య జీవితంలో అమలుపరచుకొని ఆ పరమాత్మునిని స్మరిస్తూ ఇలా  అజ్ఞానాన్ని రూపుమాపుకొని, మన స్వరూపాన్ని మనం గ్రహించినప్పుడు…సర్వభయాలనుండి, బంధాలనుండి, సంచితకర్మల నుండి విముక్తి పొందడమే ముక్తి. అదే మోక్షం. 

ఇలా స్వస్వరుపాన్ని తెలుసుకోవటమే జ్ఞానం . ఆ జ్ఞానంవల్ల జ్ఞానాగ్ని పుడుతుంది. ఆ జ్ఞానాగ్నిలో సర్వకర్మలు దహించుకు పోతాయి. 

శ్రీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విషయాలు ఇవి:-


❤️ 1) ఆత్మజ్ఞానమందు మనస్సు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు దృష్టి  కలిగియుండుట జ్ఞానమార్గములనియు ఇవికాక ఇతరములైనవి అజ్ఞానము లనియు చెప్పబడును. 

❤️2) జ్ఞానసంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞానియై నన్ను (నిరాకర రూపమైన పరమాత్మను) శరణమునొందుచున్నాడు.

❤️3) అర్జునా! ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలే ప్రకాశించి పరమార్ధతత్వము జూపును. 

❤️4) ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో యెవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవో, అట్టి వానిని పండితులని విద్వాంసులని పల్కుదురు.

❤️5) అనురాగము, భయము, క్రోధము వదిలి నాయందు (పరమాత్మ యందు) మనస్సు లగ్నము చేసి, ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యము పొందిరి. 


❤️6)పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామము (కోరికల) చేత జ్ఞానము కప్పబడి యున్నది.


🕉🙏

❤️~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి

ఏరువాక పున్నమి*

 ఈరోజు  *ఏరువాక పున్నమి* సంధర్భంగా......


*“ ఏరువాక సాగారో రన్నో చిన్ననా...*

*నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా...”*


ఈ పాట తెలియని తెలుగు వారుండరు అంటే అతిశయోక్తి కాదు, కానీ ఈ పాటలో *“ఏరువాక”* అనే పదానికి అర్ధం చాల మందికి తెలియకపోవచ్చు...


*“ఏరు” అంటే... ఎద్దులను కట్టి దుక్కి దున్నుటకు సిద్దపరచిన నాగలి.*


 *“ఏరువాక”* ... అంటే దుక్కి దున్నుట ప్రారంభం.  అంటే వ్యవసాయ ప్రారంభం. పొలంలో పంట పండి చేతికి వస్తేనే కదా మన కష్టాలు తీరేది. ఎందుకంటే మనది వ్యవసాయ ప్రధానదేశం. అందుకే మన దేశంలో వ్యవసాయాన్ని ఓ పవిత్ర కార్యంలా, తపస్సులా చేస్తారు.. ఇక్కడి రైతాంగం. దేశాన్ని సస్యశ్యామలం చేసి, మానవాళి ఆకలి తీర్చే చల్లని తల్లి, భూమాత. అట్టి తల్లి గుండెలపై నాగలి గ్రుచ్చి, దుక్కి దున్నడం రైతన్నకి బాధాకరమైన విషయమే అయినా, బ్రతకాలంటే దుక్కి దున్నక తప్పదు కదా! అందుకని, వ్యవసాయ ప్రారంభానికి ముందు, భూపూజ చేసి, ఆ తల్లి ఆశీస్సులందుకునేందుకు చేసే పండగే ఈ *“ఏరువాక పున్నమి”* పండుగ....


తొలిసారిగా భూక్షేత్రం లో నాగలిని  కదల్చడానికి ముందు భూ పూజ చేయాలనీ ఋగ్వేదం  వివరిస్తుంది. ఆ భూపూజ కూడా,  *“జ్యేష్ట పౌర్ణమి”*  నాడు జరపాలని శాస్త్ర నిర్ణయం. అందుకే  జ్యేష్ట పౌర్ణమిని *“ఏరువాక పున్నమి”* పర్వదినంగా రైతాంగం జరుపుకుంటారు. నిజానికీ పండుగ రైతన్నల పండుగే అయినా, అందరి ఆకలి తీర్చే పండుగ కనుక *“ఏరువాక పున్నమి”* అందరికీ పండుగే. ప్రాచీన సాహిత్యంలో *“ఏరువాక పున్నమి”* ని *“వప్పమంగల దివసం”* గా రైతాంగం జరుపుకునే వారిని, పాళీ, ప్రాకృత భాషలలోని జాతక కధల ద్వారా వెల్లడవుతుంది.


*పండుగ సందడి :*

ఈ రోజు, ఎద్దులకు శుభ్రంగా స్నానం చేయించి, వాటి కొమ్ములకు వివిధ రంగులు పూసి మెడకు , కాళ్ళకు గంటలు కట్టి అలంకరిస్తారు. తరువాత , పొలం పనులకు ఉపయోగించే *“కాడి”* నాగలిని కడిగి  రంగులతో, రంగురంగుల పువ్వులతో అలంకరించి  ఎడ్లకు నాగలికి , భూమాతకు  పూజ చేసి, ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి ఎడ్లలకు పొంగలిని  ఆహారంగా పెడతారు. ఆ తర్వాత *“కాడి”* నాగలిని భుజాన పెట్టుకుని మంగళ వాద్యాలతో ఊరేగింపుగా ఎద్దులను తీసుకుని పొలాలకు వెళ్లి భూమాత  కు నమస్కరించి, భూమిని దున్నడం ప్రారంభిస్తారు.  *“ఏరువాక పున్నమి”* నాడు  ఇలా చేయడం వల్ల ఆ సంవత్సర మంతా పంటలు సమృద్దిగా పండుతాయని కర్షకుల నమ్మకం. మరి కొన్ని ప్రాంతాలలో, ఊరు బయట, గోగునారతో చేసిన *“తోరం“* కడతారు. రైతులందరూ అక్కడికి చేరి *“చెర్నాకోల“* తో ఆ  *“తోరాన్ని“* కొట్టి ఎవరికి దొరికిన నారను వారు తీసుకు వెళ్లి ఆ నారను నాగళ్లకు, ఎద్దుల మెడలోను కడతారు. ఇలా చేయడం వల్ల వ్యవసాయం, పశు సంపద వృద్ది చెందుతుందని రైతుల విశ్వాసం.


*సర్వే జనా సుఖినో భవంతు* 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఉల్టే_హనుమాన్

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹


🙏 *#ఉల్టే_హనుమాన్*🙏


🙏 *హనుమంతుని విగ్రహం తలక్రిందులుగా ఉన్న ఆలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా?*🙏


*ఉజ్జయిని* ఆలయంలో హనుమంతుడి విగ్రహం ఉల్టాగా… అంటే తలక్రిందులుగా ఉంటుంది. ఈ ఆలయం చారిత్రక నగరమైన ఉజ్జయినికి 15 కిలోమీటర్ల దూరంలో *సాన్వర్‌* సమీపాన ఉన్నది. ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడ తలక్రిందులుగా ఉండటమే ఈ ఆలయం విశిష్టత. విగ్రహం తలక్రిందులుగా ఉన్నది కాబట్టే ఆ ఆలయానికి ఉల్టే ఆంజనేయ స్వామి ఆలయం అనే పేరు స్థిరపడిపోయింది.


ఈ ఆలయంలో విగ్రహం ఆంజనేయస్వామి ముఖ భాగాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. అదీ తలక్రిందులుగా. ఈ ఆలయం ఎంతో పురాతనమైన దని, రామాయణ కాలం నాటిదని సాన్వర్‌ గ్రామ వాసులు అంటున్నారు. రామలక్ష్మణులను అహిరావణుడు బంధించి పాతాళ లోకానికి తీసుకుపోయినప్పుడు ఆంజనేయస్వామి పాతాళ లోకం వరకు వెళ్లి వారి ప్రాణాలను కాపాడాడు. హనుమం తుడు పాతాళలోకానికి వెళ్లిన స్థలం ఇదేనని ఇక్కడి ప్రజల నమ్మకం. హనుమంతుడు తలక్రిందులుగా పాతాళలోకాని కి వెళ్లినదానికి నిదర్శనంగా ఆలయంలో వాయుపుత్రుని విగ్రహం తలక్రిందులుగా స్థిరపడిపోయిందని చెబుతారు స్థానికులు.


ఈ ఆలయంలోని వీర హనుమాన్‌ విగ్రహం చాలా శక్తివంతమైనదని భావిస్తున్నారు. ఆలయం సమీపాన పలు వురు మహర్షుల మందిరాలు ఉన్నాయి. దాదాపు 1200 సంవత్సరాల క్రితం నుంచి ఈ మందిరాలు ఉంటున్నట్టు చరిత్ర చెబుతున్నారు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


*మధ్యప్రదేశ్ రాష్ట్రంలో* ఉజ్జయినీ నగరానికి 30కి.మీ ల దూరంలో వున్న సాన్వర్‌  అనే ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన ఒక హనుమాన్ ఆలయం వుంది.

ఐహీరావణ సంగ్రామం జరుగుతున్న సమయంలో రావణాసురుడి మేనమామలు, సోదరులు యుద్ధంలో విజయం లభించటం కోసం తమ తాంత్రిక శక్తులతో వానరసైన్యంలోని వానరులుగా రూపం ధరించి వానర సైన్యంలో కలసిపోయి ఆ తర్వాత ఒక రాత్రి సమయంలో రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకెళ్ళారు. తెల్లవారిన తర్వాత ఈ విషయం వానరసైన్యానికి తెలిసింది.

తమ నాయకులైన రామ లక్ష్మణులు అదృశ్యం కావడంతో వానరసేన భయాందోళనకు గురైంది.

ఈ విషయం తెలుసుకున్న హనుమాన్ తలను నేలకుంచి,కాళ్ళను గాలిలోకి లేపి ఆపై నేలను చీల్చుకుని పాతాళంలోకి చేరుకుని అక్కడ ఐహీరావణ సోదరులతో యుద్ధం చేసి వాళ్ళను సంహరించి ఆ తర్వాత రామ లక్ష్మణులను తీసుకుని భూమిమీదకొచ్చాడు. ఆనాడు హనుమంతుడు తల క్రిందులుగా నిలబడి ఈ సాన్వర్‌ ప్రదేశం గుండానే పాతాళలోకానికి వెళ్ళాడని భక్తులు భావిస్తున్నారు.

#ఉల్టే హనుమాన్:

ఆ కారణంగానే ఈ క్షేత్రంలోని హనుమ విగ్రహం తలక్రిందులుగా వుండేలా ఏర్పాటుచేయబడినది. ఈ సాన్వర్‌ క్షేత్రంలో తలక్రిందులుగా వున్న హనుమాన్ ను "ఉల్టే హనుమాన్" అని పిలుస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా కూడా తలక్రిందులుగా వుండే హనుమాన్ విగ్రహం మనకు కనపడదు.

#అతి ముఖ్యమైన విశేషం;

ఈ క్షేత్రం యొక్క అతి ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఎవరైనా వ్యక్తి 3 లేదా 5 మంగళ వారాలు ఈ స్వామివారిని దర్శించి స్వామికి ఎర్రని గుడ్డని సమర్పించినట్లయితే ఆ వ్యక్తి కోరే కోర్కె ఎలాంటిదైనా సరే తప్పక తీరుతుంది. ప్రతి మంగళవారం సిందూరాన్ని ఆంజనేయస్వామి విగ్రహానికి పూస్తారు. ఆంజనేయస్వామిపై ప్రగాఢ విశ్వాసం వలన ఈ ఉల్టా ఆలయానికి భక్తులు విశేషంగా ఆకర్షితులవుతుంటారు.

#అన్ని సమస్యలు తీరుపోతాయి;

కొంతమంది అభిప్రాయం ప్రకారం ఈ హనుమ యొక్క ఆలయాన్ని ఒకసారి కంటితో చూసినా సరే అన్ని సమస్యలు తీరుపోతాయని తెలుస్తుంది.

ఈ ఆలయంలో ప్రాచీన కాలానికి చెందిన రెండు పారిజాత వృక్షాలు కూడా వున్నాయి. ఈ ఆలయంలో హనుమ విగ్రహంతో పాటు రామ, లక్ష్మణ, సీతా, శివపార్వతుల విగ్రహాలు కూడా వున్నాయి.


#సాన్వర్‌;

ఉజ్జయిని ఆలయంలో హనుమంతుడి విగ్రహం ఉల్టాగా... అంటే తలక్రిందులుగా ఉంటుంది. ఈ ఆలయం చారిత్రక నగరమైన ఉజ్జయినికి 15 కిలోమీటర్ల దూరంలో సాన్వర్‌ సమీపాన ఉన్నది.

ఈ ఆలయంలో విగ్రహం ఆంజనేయస్వామి ముఖ భాగాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. అదీ తలక్రిందులుగా. ఈ ఆలయం ఎంతో పురాతనమైనదని, రామాయణ కాలం నాటిదని సాన్వర్‌ గ్రామ వాసులు అంటున్నారు.


#వాయుపుత్రుని విగ్రహం;

రామలక్ష్మణులను అహిరావణుడు బంధించి పాతాళ లోకానికి తీసుకుపోయినప్పుడు ఆంజనేయస్వామి పాతాళ లోకం వరకు వెళ్లి వారి ప్రాణాలను కాపాడాడు. హనుమంతుడు పాతాళలోకానికి వెళ్లిన స్థలం ఇదేనని ఇక్కడి ప్రజల నమ్మకం. హనుమంతుడు తలక్రిందులుగా పాతాళలోకాని కి వెళ్లినదానికి నిదర్శనంగా ఆలయంలో వాయుపుత్రుని విగ్రహం తలక్రిందులుగా స్థిరపడిపోయిందని చెబుతారు స్థానికులు.

ఆలయంలోని వీర హనుమాన్‌ విగ్రహం చాలా శక్తివంతమైనదని భావిస్తున్నారు. ఆలయం సమీపాన పలువురు మహర్షుల మందిరాలు ఉన్నాయి. దాదాపు 1200 సంవత్సరాల క్రితం నుంచి ఈ మందిరాలు ఉంటున్నట్టు చరిత్ర చెబుతున్నది.


మర్రి, రావి, వేప, పారిజాతం, తులసి చెట్లు

ఆంజనేయస్వామి ఆలయ ప్రాంతంలో మర్రి, రావి, వేప, పారిజాతం, తులసి చెట్లు ఉన్నాయి. ఇక్కడ రెండు పురాతన పారిజాత వృక్షాలు ఉన్నాయి. పురాతన గాథల ప్రకారం ఈ చెట్టులో వీరహనుమాన్‌ కొలువై ఉన్నాడట. ఈ పారిజాత చెట్టుపై లెక్కలేనన్ని చిలుకలు కూర్చుని ఉంటాయి.


రామచిలుక రూపంలో అవతారం

ఒకానొక బ్రాహ్మణుడు రామచిలుక రూపంలో అవతారం దాల్చాడని పురాణ గాథ చెబుతున్నది. వీర హనుమాన్‌ చిలుక రూపంలోకి మారి, తులసీదాసు రాముడిని కలిసేందుకు వాహకంగా మారాడని పురాణ కథనం.


#ఎలా చేరాలి;

రోడ్డు మార్గంలో ఉజ్జయినికి 15 కిలోమీటర్ల దూరంలో, ఇండోర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉన్నది. ఈ ప్రాంతానికి బస్సు లేదా టాక్సీ ద్వారా చేరుకోవచ్చు.


    🍁🍁 *సేకరణ*🍁🍁  

          *నరసింహారావు*   

            *న్యాయపతి* 


🌹🍃🍂🍁🍁🍂🍃🌹

రోజుకు రూ .1 / - మాత్రమే చెల్లించండి

 రోజుకు రూ .1 / - మాత్రమే చెల్లించండి (రూపే ఒకటి మాత్రమే) *

 మునుపెన్నడూ లేని విధంగా, * మోడీ ప్రభుత్వం భారత సైన్యం, యుద్ధ ప్రమాదాలు మరియు ఆయుధాల కొనుగోలు కోసం ప్రత్యేకంగా ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. *

 ఆర్మీ వెల్ఫేర్ ఖాతాకు ప్రజలు నేరుగా నిధులను విరాళంగా ఇవ్వగలిగే ప్రభుత్వ బ్యాంకు ఖాతాను తెరిచింది, ఇది భారత సైన్యానికి ఆయుధాలు కొనుగోలు చేయడానికి మరియు యుద్ధ ప్రమాదాలకు సౌకర్యాలు కల్పించడానికి ఉపయోగపడుతుంది.

 యుద్ధ ప్రాణనష్టం మరియు సైన్యం కోసం ఆయుధాలను కొనుగోలు చేయడానికి ప్రత్యేకంగా నిధులు సేకరించడానికి  బ్యాంకు ఖాతా తెరవాలని ప్రజలు సూచించారు, * 

మోడీ ప్రభుత్వం ఈ సూచనను అంగీకరించి, న్యూ డిల్లీలోని సిండికేట్ బ్యాంక్‌లో ఒక ఖాతాను తెరిచింది. * 

దీని యొక్క అత్యంత ఆకర్షణీయమైన లక్షణం   ఏమిటంటే, ప్రజలు అతి తక్కువ మొత్తాన్ని ఒక రూపాయిలను దానం చేయవచ్చు.  * మోడీ ప్రభుత్వం మాస్టర్ స్ట్రోక్ *

 ఒక దేశ జనాభా 130 కోట్లు, ఇందులో 100 కోట్ల మంది (70%) ఒక్కొక్కరు ఒక్క రూపాయి జమ చేస్తే, * 

మంత్రిత్వ శాఖకు రోజుకు 100 కోట్లు,  నెలకు 3000 కోట్లు మరియు సంవత్సరానికి 36000 కోట్లు లభిస్తుంది. *

 * పాకిస్తాన్ మొత్తం రక్షణ వ్యయం కంటే ఎక్కువ 36,000 కోట్లు.

 మేము అనేక అనవసరమైన ఖర్చుల కోసం వందల మరియు వేల రూపాయలు ఖర్చు చేస్తాము, కాని మనం ఒక రూపాయిని సైన్యం కోసం ఖర్చు చేయగలిగితే, * 

అది ఖచ్చితంగా భారతదేశాన్ని సూపర్ పవర్‌గా మార్చగలదు. *

 సైన్య ప్రయోజనాలు మరియు యుద్ధ ప్రాణనష్టం కోసం ఈ డబ్బు నేరుగా రక్షణ మంత్రిత్వ శాఖకు చేరుకుంటుంది. యుద్ధ క్షేత్రాలలో ప్రాణాలు కోల్పోయిన మన  జవాన్లకు సహాయం చేయడానికి ఇది చాలా ప్రత్యేకమైన ఆలోచన.  కలిసి రండి, * 

మన డిఫెన్స్ ఫోర్సెస్, పారా మిలిటరీ ఫోర్స్ మరియు సిఆర్పిఎఫ్ లకు సంఘీభావం చూపండి. *

 భారతదేశాన్ని సూపర్ పవర్ చేయడానికి మిషన్‌లో చేరండి!

 బ్యాంక్ వివరములు:


 * CANARA BANK *

 A / C పేరు: Armed Forces Battl Casualties Welfare Fund.

 A / C NO: 90552010165915

 IFSC కోడ్: CNRB0019055

 సౌత్ ఎక్స్‌టెన్షన్ బ్రాంచ్, న్యూ డిల్లీ.


 * దయచేసి  మిత్రులందరికీ షేర్ చేయండి*

*కర్మ సిద్ధాంతం

 *కర్మ సిద్ధాంతం* ఎలా పనిచేస్తుందో చూడండి.


*కళ్ళు చెట్టు మీద వున్న 🍏పండుని చూశాయి. మనసులో ఆశ పుట్టింది.

 కళ్ళు పండుని 🍏తెంపలేవు కదా.

అందుకే.. కాళ్ళు వెళ్ళాయి చెట్టు దగ్గరికి...🍏పండును.. కొయ్యటానికి..

కాళ్ళు 🍏పండుని కొయ్యలేవు కాబట్టి...* 

👐చేతులు 🍏 పండుని కోశాయి..* 

🙌చేతులు.. 🍏పండును తినలేవు 

కాబట్టి.. 😛నోరు తినేసింది...*

*మరి  ఆ పండు 🍏కడుపులోకి వెళ్ళింది...!!*

*ఇప్పుడు చూడండి ఎవరు చూసారో.. 

వాళ్ళు వెళ్ళలేదు ...

*ఎవరు వెళ్ళారో వాళ్ళు తెంపలేదు ...* 

*ఎవరు తెంపారో వాళ్ళు తినలేదు...

*ఎవరు తిన్నారో.. వాళ్ళు ఉంచుకోలేదు...* 

*ఎందుకంటే అది కడుపులోకి వెళ్ళింది..

*మరి ఇప్పుడు.. ఎప్పుడైతే తోట మాలి చూసాడో..* 

*అప్పుడు దెబ్బలు... వీపు 🙅‍♂మీద పడ్డాయి .... 

*పాపం వీపు తప్పేమీ లేదు...*

*కానీ ఎప్పుడైతే దెబ్బలు వీపు మీద పడ్డాయో...

 *అప్పుడు కళ్ళ నుండి😭 కనీళ్లు వచ్చాయి..* 

*కళ్ళ నుండి, ఎందుకంటే... అందరికంటే ముందు, పండుని చూసింది "కళ్ళు".. కాబట్టి...*


🙏🏻 *కర్మ సిద్ధాంతం అంటే  ఇదే*🙏🏽


 *ఎవ్వరూ దీన్నించి తప్పించు కోలేరు*

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*విభూతి..గంధం..*


"మేము అండమాన్ లో వుంటామండీ..మా బంధువులు ఇక్కడికి దగ్గరలో ఉన్న చుండి గ్రామం లో వుంటారు..ఒకప్పుడు మేమూ ఈ ప్రాంతం వాళ్ళమే.. కానీ కొన్ని సంవత్సరాల క్రిందట అండమాన్ వెళ్లి..అక్కడే వ్యాపారం చేసుకుంటూ స్థిరపడ్డాము.. మావాళ్ళు ఈ క్షేత్రం గురించి..శ్రీ స్వామివారి గురించి గొప్పగా చెపితే..చూసిపోదామని వచ్చాము..మాకు ఈ క్షేత్రం గురించి వివరాలు చెపుతారా?.." అన్నారా దంపతులు..వాళ్ళు మాట్లాడుతున్నది తెలుగులోనే అయినా..కొద్దిగా తేడాగా ఉంది..


శ్రీ స్వామివారు మాలకొండ క్షేత్రం లో తపస్సు చేసుకుంటూ ఉన్నప్పటి నుంచి..మొగలిచెర్ల లోని ఫకీరు మాన్యం లో తాను నిర్మించుకున్న ఆశ్రమం లో కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన దాకా జరిగిన సంఘటనలన్నీ క్లుప్తంగా వివరించాను..శ్రద్ధగా విన్నారు..శ్రీ స్వామివారు సమాధి చెందిన అనంతరం..వేలాదిమంది వచ్చి దర్శించుకొని వెళుతున్నారని..వారికేమైనా సమస్యలు ఉన్నా..ఈ సమాధి దగ్గర మ్రొక్కుకుంటే..అవి తీరిపోతున్నాయనీ ..తమ బంధువుల ద్వారా విన్నామని వాళ్ళు నాతో అన్నారు..


ఆ తరువాత ఆ దంపతులు శ్రీ స్వామివారి మందిరానికి మూడు సార్లు ప్రదక్షిణాలు చేసి..శ్రీ స్వామివారి విగ్రహం వద్ద పూజ చేయించుకుని..శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..ఒక ఐదారు నిమిషాల పాటు ప్రార్ధన చేసుకొన్నారు..శ్రీ స్వామివారి విభూతి..గంధం..రెండూ తీసుకున్నారు..వెళ్ళొస్తామని చెప్పి వెళ్లిపోయారు..


మరో మూడు నాలుగు నెలల తరువాత..మందిరానికి నూరు రూపాయల మనీ ఆర్డర్ వచ్చింది..అందులో..తమ చిరునామాకు..శ్రీ స్వామివారి విభూతి, గంధం..రెండూ పోస్ట్ ద్వారా పంపమని వ్రాసారు..ఆ చిరునామా..అండమాన్ లోని పోర్టుబ్లయర్ కు సంబంధించినది..అప్పుడు మాకు గుర్తుకు వచ్చింది..కొంతకాలం క్రిందట వచ్చి వెళ్ళింది వీళ్ళే కదా అని..అందులో వారి ఫోన్ నెంబర్ ఇవ్వలేదు..వారు కోరిన విధంగా విభూతి..గంధం..పోస్ట్ ద్వారా పంపాము..మరో రెండు నెలల తరువాత..చుండి గ్రామం నుంచి ఒక వ్యక్తి వచ్చి..తాను అండమాన్ వెళుతున్నాననీ..తమ బంధువుల కోసం శ్రీ స్వామివారి విభూతి, గంధం కావాలని అడిగారు..ఇచ్చాము..వచ్చిన ఆ వ్యక్తి ద్వారా తెలిసింది..అప్పుడు వచ్చిన ఆ దంపతుల కోసమే ఈ విభూతి.. గంధం..


మరో ఆరేడు నెలల తరువాత..ఒక శనివారం నాడు ఆ దంపతులు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు.."శ్రీ స్వామివారు చాలా మహిమ కలవాడు..మేము పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సమస్యల్లో ఉన్నామండీ..ఒక రకంగా చెప్పాలంటే ఆర్ధికంగా..మానసికంగా కృంగిపోయి వున్నాము..ఎటూ దిక్కుతోచని పరిస్థితి లో వున్నాము..ఇక్కడినుంచి పోతూ పోతూ..శ్రీ స్వామివారి విభూతి..గంధం..తీసుకెళ్లాము..ప్రతిరోజూ ఇంటినుంచి ఉదయాన్నే స్నానం చేసి..దీపారాధన చేసుకొని..శ్రీ స్వామివారి విభూతిని..గంధాన్ని.. నుదుటిన ధరించడం అలవాటు చేసుకున్నామండీ..కేవలం పదిహేను రోజుల లోపే మాకు చాలా మార్పు కనబడింది..మా దగ్గర అప్పు తీసుకొని..ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు..ఇంటికొచ్చి మరీ చెల్లించి వెళ్లారు..దాదాపు డెబ్భై శాతం వసూలు అయ్యాయి..ఆ డబ్బు చేతికి వచ్చిన మరుక్షణం మేము చెల్లించాల్సిన వాళ్లకు చెల్లించివేశాము..ఇప్పుడు మాకున్న అప్పులన్నీ తీరిపోయాయి..వడ్డీ వ్యాపారం కూడా మానేసాము..ఒకళ్లను పీడించి..ఏడిపించి.. వాళ్ళ ఆర్ధిక బలహీనత మీద చేసే ఆ వ్యాపారం మంచిది కాదని..మాకు తోచింది..వేరే వ్యాపారం చూసుకున్నాము..అంతా ఆ స్వామివారి విభూతి మహిమ..అందుకే మీ దగ్గరనుంచి విభూతి..గంధం..రెండు మూడు సార్లు తెప్పించుకున్నాము..ఈరోజు శ్రీ స్వామివారిని దర్శించుకుని మా మ్రొక్కు చెల్లించుకోవాలని అనుకున్నాము.." అన్నారు..


" రాబోయే శనివారం, ఆదివారం రోజులలోఅన్నదానం చేయాలని అనుకున్నాము..సరుకులన్నీ మేమే తీసుకొస్తాము..సుమారు ఎంతమందికి తయారు చేయాలో మీరు చెపితే..దానికి తగ్గ విధంగా ఏర్పాటు చేసుకుంటాము.." అన్నారు..శనివారం రాత్రికి సుమారుగా వేయి మంది భక్తులు వుంటారనీ.. ఆదివారం మధ్యాహ్నం అయితే..ఎనిమిది వందల మంది భక్తుల కొరకు ఏర్పాట్లు చేయాలనీ.. చెప్పాము..వచ్చే శని, ఆదివారాల్లో రెండుపూటలా తామే చేస్తామని చెప్పారు..


అనుకున్న విధంగానే ఆ దంపతులిద్దరూ అన్నదానం చేశారు..అవకాశం ఇచ్చినందుకు నాకూ మా సిబ్బందికి ధన్యవాదములు తెలిపారు..తిరిగి వెళుతూ..మర్చిపోకుండా శ్రీ స్వామివారి విభూతి..గంధం..రెండూ ఎక్కువ మోతాదులో తీసుకొని వెళ్లిపోయారు..ఇప్పటికీ సంవత్సరం లో కనీసం మూడు నాలుగు సార్లు మనీ ఆర్డర్ ద్వారా నగదు పంపి..విభూతి..గంధం..తెప్పించుకుంటూ వుంటారు..


విభూతి..గంధం..ఈ రెండింటి ద్వారా ఆ దంపతుల భక్తిని శ్రీ స్వామివారు స్థిరపరచారు..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114.. సెల్..94402 66380 & 99089 73699).

శ్రీమత్ భగవత్ గీత - కర్మల వివరణ

 శ్రీమత్ భగవత్ గీత - కర్మల వివరణ 

 భగవత్ గీత 4 వ అధ్యాయం 17 వ శ్లోకం చదివి ఇది వ్రాస్తున్నాను. . 

 ముందుగా ఈ శ్లోకము దాని టీకా తాత్పర్యాలు చుడండి. 

కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః ।

అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః ।। 17 ।।

కర్మణ — చేయవలసిన (విహిత) కర్మలు; హి — నిజముగా; అపి — కూడా; బోద్ధవ్యం — తెలుసుకొనుము; బోద్ధవ్యం — అర్థం చేసుకొనుము; చ — మరియు; వికర్మణః — నిషిద్ధ కర్మలు; అకర్మణః — అకర్మలు; చ — మరియు; బోద్ధవ్యం — అర్థం చేసుకొనుము; గహనా — గంభీరమైనది; కర్మణ — పనుల; గతిః — నిజమైన మార్గము.

కర్మ, వికర్మ, అకర్మ - నీవు ఈ మూడింటి యొక్క స్వభావాన్ని గురించి తప్పకుండా తెలుసుకోవాలి – వీటి గురించి ఉన్న యదార్థం నిగూఢమైనది మరియు అర్థం చేసుకోవటానికి క్లిష్టమైనది.

పని అనేది శ్రీ కృష్ణుడి చే మూడు రకాలుగా వర్గీకరించబడినది – కర్మ, వికర్మ మరియు అకర్మ.

కర్మ: ఇంద్రియ నియంత్రణ మరియు చిత్త శుద్దికి దోహదపడే విధంగా ఉండే శాస్త్ర విహితమయిన మంగళప్రద పనులు.

వికర్మ: శాస్త్రములచే నిషేధింపబడిన ఆశుభకర మయిన పనులు; ఇవి హాని కారకమయినవి మరియు ఆత్మ అధఃపతనానికి దారితీసేవి.

అకర్మ: ఫలాసక్తి లేకుండా కేవలం భగవంతుని ప్రీతి కోసం మాత్రమే చేసే పనులు. వీటికి కర్మ ప్రతిక్రియలు ఉండవు మరియు ఇవి జీవాత్మ ను బంధించవు.

ఇక్కడ కృష్ణ భగవానుడు మనకు కర్మల గూర్చి తెలియచేయుచున్నారు. అవి మూడు రకములని వాటిని 1) కర్మ 2) వికర్మ 3) అకర్మ అని పేర్కొన్నారు.  అందులో అకర్మ క్రిందికి వచ్చే కర్మలను మనం చేయటం శ్రేష్ఠమైనవని అవి జీవాత్మను బంధించవని పేర్కొన్నారు. 

మనందరికీ పాప పుణ్యాల గూర్చి బాల్యంలోనుండే తెలుసు.  మన గృహాలలో మన పెద్దలు నిత్యం పాప కర్మలు చేయవలదు, పుణ్యకర్మలు చేయమని మనకు శిక్షణ ఇచ్చియున్నారు.  మనము కూడా పాప బీతితో పాప కర్మలను చేయ వెనుకాడుతుంటాము. ఇది సర్వజన అనుభవమే  

పాప కర్మలు, పుణ్య కర్మలు అంటే  ఏవి తెలుసుకుందాము.  సాధారణ దృష్టితో చూసిన పాపము కానిది పుణ్యము అని మనమెరుగుదము. అట్టి తరి విడి విడిగా పాపమన నేమి పుణ్యమన నెమో విశ్లేషించ ప్రయత్నించెదము. ప్రతి మనిషికి ఒక మనస్సు ఉండును   ఆ మనస్సు సంతోషకరంగా,  ఆనందకరంగా, దుఃఖ కరంగా, బాధా కరంగా అనేక వికృతులకు లోనగునని మనకెరుకే.  ఇట్లు పరి పరి రీతుల మనస్సు స్థితులను పొందుటకు రెండు కారణాలు 1) ఎవరికి వారు వారు చేయు కర్మల వలన కలిగిన ఫలితాలు, 2) ఇతరులు తనయెడఁ చేసిన కర్మల ఫలితాలు. 

ఈ విషయాలను ఇంకా కూలంకుషంగా విశదీక రించెద. నీవు ఒక అద్దె ఇంట్లో ఉంటున్నావు.  నీకు దైవానుగ్రహం వలన వలసినంత ధనము లభించి ఒక స్వంత గృహాన్ని నిర్మించి అందు నివసించ వెడలినావనుకో అప్పుడు నీ మనస్సు అమితానందభరితంగా  ఉంటుంది. అదే గృహం నీవు కాకుండా మీ తండ్రిగారో లేక మీ దగ్గరి ఇంకొక బంధువో నీకు కలిగించినారనుకో అప్పుడు కూడా నీకు ఆనందం కలుగుతుంది. నీవు నీఅంతట నీవు గృహమును కలిపించుకోవటం నీవు నీ యెడ చేసిన కర్మ అదే నీకు యితరులు నీకు కలిపించటం ఇతరులు నీ యెడ చేసిన కర్మ. నీ యెడల యితరులు ఏ కర్మ చేయటం వలన నీ మనస్సుకు ఆనందము కలిగిందో ఆ కర్మ ఫలితంగా వారికి లభించేది పుణ్యం. 

ఇప్పుడు ఇంకొక పరిస్థితిని పరిశీలిద్దాము. నీవు వీధిలో వెళుతున్నావు ఒక చెట్టు క్రిందినుండి వెడలునపుడు  నీ తలమీద  చెట్టు మీదినుంచి ఒక కాయ పడి నీకు గాయమైనది తత్ద్వారా నీకు బాధ కలిగింది.  అది నీ స్వయంకృత అపరాధం అనుభవించాలసిందే.  అదే నీ తలకు  ఎవరో రాయి విసిరి  గాయ పరచారనుకో అప్పుడు నీకు కలిగిన  బాధ కూడా ఇంతకూ ముందు బాధ లాంటిదే కానీ దాని కారకుడు  ఆ రాయి విసిరినవాడు. రాయి విసరటం తత్ ద్వారా నీకు బాధ కలుగ చేయటం అనే కర్మ చేసిన  దానికి ప్రతిగా అతనికి లభించే కర్మ ఫలమే పాపము. 

అంటే నీకు ఇతరులు ఏది చేస్తే నీ మనస్సు ఆనందపడుతుందో అది నీవు ఇతరులకు చేయటం అనే కర్మకు లభించునది పుణ్య ఫలము.  అదే మాదిరిగా నీకు ఇతరరులకు  ఏది చేస్తే నీకు బాధ కలుగుతుందో అది నీవు ఇతరులకు చేసిన ఆ కర్మకు లభించిన ఫలమే పాపము. 

పాప పుణ్యాలు రెండు మనకు ఇప్పుడు తెలిసినవి మరి ఆ ఫలితం అని అంటున్నం కదా మరి ఫలితం అనుభవంలోకి రావాలి కదా అది ఎప్పుడు. దీని వివరణకు మనము ముందుగా చెప్పుకున్న గృహ ఉదాహరణ లోకి వెళదాము. నీవు సొంతంగా గృహాన్ని నిర్మించుకున్నావు అంటే నీకు ధనము లభించినది ఆలా ధనము లభించటం నీవు గతంలో చేసుకున్న కర్మ యెక్క పుణ్య ఫలము ఆ ఫలము నీకు ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది అన్నమాట.  అదే విధంగా నీ తలకు చెట్టు కాయ పడి గాయము అవటం అన్నది నీవు గతంలో చేసుకున్న పాపా ఫలము ఇప్పుడు అనుభవానికి వచ్చింది అని అర్ధం చేసుకోవాలి. 

మనము బ్యాంకులో అకౌంటు తెరుచుకుంటాము. అంటే మనం సంపాదించిన ధనాన్ని బ్యాంకులో దాచుకుంటాము.  మనకు అక్కరకు వచ్చినప్పుడు బ్యాంకునుండి ధనాన్ని తీసుకొని వాడుకుంటాము.  అదే విధంగా మన పుణ్య ఫలం కూడా మనకు ఉపయోగ పడుతుంది.  మనం ఏదైనా కోరిక నెరవేరటానికి ఒక వ్రతమో, పూజో, జపమో ఆచరిస్తాము కదా అప్పుడు మనం కోరుకునే కోరిక నెరవేరటం  కద్దు. కొంతమంది అంటుంటారు నేను తిరగని క్షేత్రం లేదు మునగని తీర్ధం లేదు ఏ దేముడు కూడా నన్ను కరుణించటంలేదు నా కస్టాలు కష్టాలుగానే వున్నాయి.  ఇది సహజకుడా. నీవు ఏ కోరికతో నోము నోమావో అదే విధాంగా నేను చేసానే మరి నీకు ఫలించి నాకెందుకు ఫలించలేదు అని పలువురు చెప్పటం మనకు  తెలిసిందే. 

ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి భగవంతుడిని మనం ఒక బ్యాంకు మేనేజరుగా ఒక్క సారి ఉహించు కుందాము. నేను ఒక లక్ష రూపాయల చెక్కు బ్యంకులో ద్రవ్య విడుదలకు ఉంచాననుకోండి అది చూసి మేనేజరుగారు నా అకౌంటులో బ్యాలన్సు లక్ష కన్నా ఎక్కువ ఉంటే వెంటనే దానిని ఆమోదించి నాకు లక్ష రూపాయలు విడుదల చేస్తారు.  నాలాగా నీవు కూడా లక్ష రూపాయల చెక్కు బ్యాంకులో వేశావనుకో నీకు అకౌంటులో యాబై వేలే వున్నాయనుకో నీ చెక్కుకు నీవు కోరిన లక్ష రూపాయలు ఇవ్వకుండా నీ చెక్కు నీకు వాపసు చేయటం కద్దు. ఈ ఉపమానాన్ని మనం భగవంతుని విషయంలో అనుసరిద్దాము. నీవు చేసిన పూజ, జపము, నోము అనునవి భగవంతుడైన బ్యాంకు మేనేజరుగారికి అందచేసిన చెక్కు లాంటిది.  నీ అకౌంటులో పుణ్య ఫలము నీవు కోరుకున్న కోరికకు సరిపడా ఉంటే నీ చెక్కు ఆమోదించబడింది అంటే నీ నోము ఫలిస్తుంది తద్వారా నీ కోరిక ఇడేరుతుంది.  కానీ నీ అకౌంటులో పుణ్యఫలం తక్కువగా వున్న నీ చెక్కు రిటర్న్ అవుంతుంది అంటే నీ కోరిక తీరదు. ఇక్కడ మనం తెలుసుకోవలసింది భావవంతుడు ఎవరి కోరికలు తీర్చడు లేక తీర్చ నిరాకరించడు కేవలము నీ పాప పుణ్య ఫలితాలను మాత్రమే నీకు అందచేస్తాడు.  అందుకే భగవంతుడిని ఒక సాక్షి భూతంగా పేర్కొంటారు. 

ఇప్పటి వరకు మనం కృష్ణ భగవానులు తెలిపిన  కర్మ, వికర్మలను విశదీకరించుకున్నాము. మరి అకర్మ అంటే  ఏమిటి అది ఏరకమైన కర్మ. 

సామాన్య దృష్టితో ఆలోచిస్తే కర్మ అంటే సుకర్మ అని చెప్పుకోవచ్చు అంటే మంచి పని.  అదేవిధంగా వికర్మ అంటే దుష్ట కర్మ చెడుపని అని చెప్పుకోవచ్చు మరి ఈ రెండు కానిది ఇంకొకటి ఉండే అవకాశమే లేదు కాదా  అటువంటప్పుడు ఈ అకర్మ ఏమిటి. దీనిని కర్మ లేదనే భావంలో కూడా అర్ధం చేసుకోవచ్చు కదా అనగా కర్మ చేయకుండా వుండటమా అని మనం అనుకోవచ్చు.  కానీ నిజానికి అకర్మ అంటే కర్మ చేయకుండా వుండటము కాదు. ఉదాహరణకు యోగ్యుడు అంటే సమర్ధుడు అనే అర్ధం చెప్పుకున్నాము అదే విధంగా అయోగ్యుడు అంటే అసమర్ధుడు అని కదా మన అర్ధం ఐతే అకర్మ అంటే కర్మ కాదు లేక కర్మలేదు అనే అర్ధాలు చెప్పవచ్చా అంటే ఆలా చెప్పవీలు లేదు. . 

మనిషి ఊపిరి పోసుకున్నప్పడినుండి ఊపిరి ఆగే వరకు కర్మలు చేస్తూనే ఉంటాడు.  అయితే మనం కర్మలు రెండు రకాలుగా చేస్తున్నాము 1) బుద్దితో చేసే కర్మలు అంటే మనం ఉద్దేశపూర్వకంగా చేసే పనులు. 2) బుద్ధికి తెలియకుండా చేసే పనులు. ఇవి శరీర అంతరకర్మలు మరియు జ్ఞాన రహిత కర్మలు అంటే మన బుద్ధికి తెలియని పనులు  అని అనవచ్చనుకుంటా. మనం నిత్యం శ్వాసిస్తూ  ఉంటాము. గాలిలో అనేక సూక్ష్మ జీవులు మన నాసాపుటాల ద్వారా మన శరీరంలోకి వేళ్ళ వచ్చు.  అందులో కొన్ని మన శరీర ఉష్ణోగ్రతకు చనిపోవచ్చు కూడా. ఆ విషయం మనకు తెలియనే తెలియదు.  ఈ కరోనా వైరస్ తీసుకోండి అది మన కంటికి కనిపించదు గాలిలో ఉంటుంది.  అది గాలిలోంచి యెట్లా శరీరంలోకి వస్తుంది ఎవరు  గుర్తించలేరు. అది శరీరాన్ని వినాశనం చేశాకే  తెలుస్తుంది. అదే మనిషికి ముందుగా దాని ఉనికి తెలిసి ఉంటే ఎవ్వరు దాని జోలికి పొరుకదా. అదే విధంగా మనం రోజు నీళ్లు తాగుతుంటాము, ఆహారము తీసుకుంటాము తత్ ద్వారా అనేక సూక్ష్మ జీవులు మన శరీరంలోకి మనకు తెలియకుండా వెడలి నశించ వచ్చు. 

మన శరీర అంతర్గత కర్మలే కాకుండ శరీర బహిర్గత కర్మలు కూడా కొన్ని  మనము బుద్ధికి తెలియకుండా చేస్తాము. గమనించండి మనం వీధిలో నడుచుకుంటూ పోతున్నామనుకోండి మన పాదాల  క్రింద ఎన్నో చీమలు అంతకంటే చిన్న చిన్న క్రిమి కీకాదులు పడి చనిపొవచ్చు వాటి గూర్చిన వివరాలు మనకు కనీసం తెలియను  కూడా తెలియదు. ఇప్పుడు సమస్య ఏమిటంటే ఈ రకంగా చేసే కర్మలు మనం పాప కర్మలుగా భావించ వచ్చా లేదా. నిజానికి ఈ కర్మల ఫలితం పాపమే అయి ఉండాలి . కానీ కాదు ఎందుకంటె ఈ కర్మలు చేసింది నీవే అయినా అవి నీవు ఉద్దేశపూర్వకంగా చేయలేదు కాబట్టి వాటి ఫలితంగా పాపము సోకదు. 

ఇక్కడ మన భారత న్యాయశాస్త్ర సంబంధిత ఉదాహరణ ఇవ్వ ప్రయత్నింతును.  ఒక మనిషిని ఎవరైనా చంపినారనుకోండి దానిని ఆంగ్లములో "మార్దరు' అని ఐపీసీ 300 సెక్షను ప్రకారము నిర్వచించి వున్నారు దానికి శిక్ష  ఐపీసీ 302 సెక్షను ప్రకారము జీవిత కాల జైలు శిక్ష లేక ఉరి శిక్ష అని వుంది. . అదే ఒక వాహనము క్రింద మనిషి పొరపాటున పడి చనిపోతే కేవలము 3 సం. జైలు శిక్ష మాత్రమే విధిస్తారు. ఫై కేసులో మరియు క్రింది కేసులో రెండిటిలో మనిషి ప్రాణం పోయిందికదా మరి శిక్షలలో తేడా ఎందుకు అంటే మొదటి కేసులో ఉద్దేశము అంటే బుద్ది  వుంది రెండవ కేసులో ఉద్దేశ్యము అంటే ఆ మనిషి చనిపోతాడని బుద్ది లేదు.  భగవంతుని దృష్టిలో కూడా ఇదే విధిగా ఉంటుంది. 

ఈశ్వరార్పణగా  చేసే కర్మలు వీటినే భగవానులు అకర్మలు అన్నారు.  మనం ఒక జపం చేస్తాము చివరన " ఏతత్ ఫలం సర్వం ఈశ్వరార్పణమస్తు " అని భగవంతునికి ఆ జప ఫలాన్ని  దార పోస్తాము. అంటే మనం చేసిన జప ఫలం మనం ఉంచుకోకుండా అర్పితం చేసామన్న మాట. అప్పుడు ఆ ఫలము మనకు పుణ్యం కోటాలో కానీ    అది వికర్మ కూడా కాదు కాబట్టి పాపం కోటాలో కూడా రాదు.  ఈ రెండు అకౌంట్లలో జమ కాని కర్మ అనుమాట అందుకే అక్కడ కర్మ ఉన్న దాని ఫలితము లేదు.  ఎప్పుడైతే కర్మ ఫలము ఉండదో అప్పుడు ఆఫలితానిని అనుభవించటం కూడా ఉండదు. 

సామాన్యు మానవ దృష్టితో చుస్తే అందరు పుణ్య కర్మలు చేసి పుణ్యం పొందాలని చూస్తారు.  కానీ కర్మ ఫలాన్ని ఈశ్వరార్పణ చేయాలనుకోరు. మరి ఇటుటుంవంటి కర్మలు ఎందుకు చేయాలి అన్న సందేహం కలుగుతుంది. ఏ జీవుడి పాప పుణ్యాలు సమతుల్యం అవుతాయో వాడు మోక్షాన్ని పొందుతాడు.  అది ఎలా సాధ్యం అంటే చేసే కర్మలను ఈశ్వరప్పణ చేయటం వలెనే సాధ్యం అని మహర్షులు మనకు విశదీకరించారు. 

మోక్షం పొందటానికి సులువైన మార్గము: 

నేనే దేముడిని ప్రతి మనిషి తనకు తానూ దేముడు అనుకోటము ఉత్తమము.  ఇప్పుడు మీకు మీరు దేముడిని అనుకున్నారనుకోండి.  అప్పుడు దేముడు ఎలా ఉంటాడో ఆలా మీరు వుండండి.  దేముడికి త్రిగుణాలు ఉన్నాయా లేవు మీరు కూడా త్రిగుణాలను త్యజించండి. అంటే మీకు మేలు చేసే వారి మీద ప్రేమ మీకు కీడు చేసే వారి మీద కోపము, ప్రతికారము వుండవన్నమాట.  మీకు మేలుచేసిన వారిపై కృతజ్ఞత లేదు, కీడు చేసిన వానిపై కోపము లేదు.  అంటే మీరు ఏ ఫలము పొందారన్న మాట అప్పుడు మీ పాపా పుణ్యాల అకౌంట్ షీట్ ఖాళీగా ఉంటుంది.  దాని పర్యవసానం గా మీరు ఏ ఫలము అనుభవించ పనిలేదు. కర్మ ఫలము ఎప్పుడైతే సూన్యము అవుతుందో అప్పుడు ప్రారబ్ద ఫలము  ఏమి ఉండదు.  ప్రారబ్ధము లేనపుడు జన్మ లేదు.  అంటే మీకు సిద్దించేది కేవలము  మోక్షము 

ఒకసారి నేను నా బుద్దిమాంద్యముతో కృష్ణ భగవానుని గీతలో ముఖ్యమైన శ్లోకము ఏది అని యోచన చేసి యుంటిని.  తరువాత నా అనుభవంలోకి వచ్చిన విషయము.  శ్రీమత్ భగవత్గీతలో మొదటి అధ్యాయం మొదటి శ్లోకము నుండి చివరి అధ్యాయము చివరి శ్లోకము వరకు ప్రతిదీ ముఖ్యమైనదే అని నా మాది తట్టినది.  ఇది సరి కాదని ఎవరైనా అనగలరా. 

మనం తరించాలంటే గీత మొత్తం చదవనవసరము లేదు ఏ ఒక్క శ్లోకాన్నేనా పరిపూర్ణంగా అవగతము చేసుకుంటే చాలని నాకనిపించింది. 

ఓం తత్ సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

సర్వే జన సుఖినో భవంతు 

మీ సుజన విధేయుడు 

సి. భార్గవ శర్మ