13, జులై 2021, మంగళవారం

ఉల్టే_హనుమాన్

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹


🙏 *#ఉల్టే_హనుమాన్*🙏


🙏 *హనుమంతుని విగ్రహం తలక్రిందులుగా ఉన్న ఆలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా?*🙏


*ఉజ్జయిని* ఆలయంలో హనుమంతుడి విగ్రహం ఉల్టాగా… అంటే తలక్రిందులుగా ఉంటుంది. ఈ ఆలయం చారిత్రక నగరమైన ఉజ్జయినికి 15 కిలోమీటర్ల దూరంలో *సాన్వర్‌* సమీపాన ఉన్నది. ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడ తలక్రిందులుగా ఉండటమే ఈ ఆలయం విశిష్టత. విగ్రహం తలక్రిందులుగా ఉన్నది కాబట్టే ఆ ఆలయానికి ఉల్టే ఆంజనేయ స్వామి ఆలయం అనే పేరు స్థిరపడిపోయింది.


ఈ ఆలయంలో విగ్రహం ఆంజనేయస్వామి ముఖ భాగాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. అదీ తలక్రిందులుగా. ఈ ఆలయం ఎంతో పురాతనమైన దని, రామాయణ కాలం నాటిదని సాన్వర్‌ గ్రామ వాసులు అంటున్నారు. రామలక్ష్మణులను అహిరావణుడు బంధించి పాతాళ లోకానికి తీసుకుపోయినప్పుడు ఆంజనేయస్వామి పాతాళ లోకం వరకు వెళ్లి వారి ప్రాణాలను కాపాడాడు. హనుమం తుడు పాతాళలోకానికి వెళ్లిన స్థలం ఇదేనని ఇక్కడి ప్రజల నమ్మకం. హనుమంతుడు తలక్రిందులుగా పాతాళలోకాని కి వెళ్లినదానికి నిదర్శనంగా ఆలయంలో వాయుపుత్రుని విగ్రహం తలక్రిందులుగా స్థిరపడిపోయిందని చెబుతారు స్థానికులు.


ఈ ఆలయంలోని వీర హనుమాన్‌ విగ్రహం చాలా శక్తివంతమైనదని భావిస్తున్నారు. ఆలయం సమీపాన పలు వురు మహర్షుల మందిరాలు ఉన్నాయి. దాదాపు 1200 సంవత్సరాల క్రితం నుంచి ఈ మందిరాలు ఉంటున్నట్టు చరిత్ర చెబుతున్నారు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


*మధ్యప్రదేశ్ రాష్ట్రంలో* ఉజ్జయినీ నగరానికి 30కి.మీ ల దూరంలో వున్న సాన్వర్‌  అనే ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన ఒక హనుమాన్ ఆలయం వుంది.

ఐహీరావణ సంగ్రామం జరుగుతున్న సమయంలో రావణాసురుడి మేనమామలు, సోదరులు యుద్ధంలో విజయం లభించటం కోసం తమ తాంత్రిక శక్తులతో వానరసైన్యంలోని వానరులుగా రూపం ధరించి వానర సైన్యంలో కలసిపోయి ఆ తర్వాత ఒక రాత్రి సమయంలో రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకెళ్ళారు. తెల్లవారిన తర్వాత ఈ విషయం వానరసైన్యానికి తెలిసింది.

తమ నాయకులైన రామ లక్ష్మణులు అదృశ్యం కావడంతో వానరసేన భయాందోళనకు గురైంది.

ఈ విషయం తెలుసుకున్న హనుమాన్ తలను నేలకుంచి,కాళ్ళను గాలిలోకి లేపి ఆపై నేలను చీల్చుకుని పాతాళంలోకి చేరుకుని అక్కడ ఐహీరావణ సోదరులతో యుద్ధం చేసి వాళ్ళను సంహరించి ఆ తర్వాత రామ లక్ష్మణులను తీసుకుని భూమిమీదకొచ్చాడు. ఆనాడు హనుమంతుడు తల క్రిందులుగా నిలబడి ఈ సాన్వర్‌ ప్రదేశం గుండానే పాతాళలోకానికి వెళ్ళాడని భక్తులు భావిస్తున్నారు.

#ఉల్టే హనుమాన్:

ఆ కారణంగానే ఈ క్షేత్రంలోని హనుమ విగ్రహం తలక్రిందులుగా వుండేలా ఏర్పాటుచేయబడినది. ఈ సాన్వర్‌ క్షేత్రంలో తలక్రిందులుగా వున్న హనుమాన్ ను "ఉల్టే హనుమాన్" అని పిలుస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా కూడా తలక్రిందులుగా వుండే హనుమాన్ విగ్రహం మనకు కనపడదు.

#అతి ముఖ్యమైన విశేషం;

ఈ క్షేత్రం యొక్క అతి ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఎవరైనా వ్యక్తి 3 లేదా 5 మంగళ వారాలు ఈ స్వామివారిని దర్శించి స్వామికి ఎర్రని గుడ్డని సమర్పించినట్లయితే ఆ వ్యక్తి కోరే కోర్కె ఎలాంటిదైనా సరే తప్పక తీరుతుంది. ప్రతి మంగళవారం సిందూరాన్ని ఆంజనేయస్వామి విగ్రహానికి పూస్తారు. ఆంజనేయస్వామిపై ప్రగాఢ విశ్వాసం వలన ఈ ఉల్టా ఆలయానికి భక్తులు విశేషంగా ఆకర్షితులవుతుంటారు.

#అన్ని సమస్యలు తీరుపోతాయి;

కొంతమంది అభిప్రాయం ప్రకారం ఈ హనుమ యొక్క ఆలయాన్ని ఒకసారి కంటితో చూసినా సరే అన్ని సమస్యలు తీరుపోతాయని తెలుస్తుంది.

ఈ ఆలయంలో ప్రాచీన కాలానికి చెందిన రెండు పారిజాత వృక్షాలు కూడా వున్నాయి. ఈ ఆలయంలో హనుమ విగ్రహంతో పాటు రామ, లక్ష్మణ, సీతా, శివపార్వతుల విగ్రహాలు కూడా వున్నాయి.


#సాన్వర్‌;

ఉజ్జయిని ఆలయంలో హనుమంతుడి విగ్రహం ఉల్టాగా... అంటే తలక్రిందులుగా ఉంటుంది. ఈ ఆలయం చారిత్రక నగరమైన ఉజ్జయినికి 15 కిలోమీటర్ల దూరంలో సాన్వర్‌ సమీపాన ఉన్నది.

ఈ ఆలయంలో విగ్రహం ఆంజనేయస్వామి ముఖ భాగాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. అదీ తలక్రిందులుగా. ఈ ఆలయం ఎంతో పురాతనమైనదని, రామాయణ కాలం నాటిదని సాన్వర్‌ గ్రామ వాసులు అంటున్నారు.


#వాయుపుత్రుని విగ్రహం;

రామలక్ష్మణులను అహిరావణుడు బంధించి పాతాళ లోకానికి తీసుకుపోయినప్పుడు ఆంజనేయస్వామి పాతాళ లోకం వరకు వెళ్లి వారి ప్రాణాలను కాపాడాడు. హనుమంతుడు పాతాళలోకానికి వెళ్లిన స్థలం ఇదేనని ఇక్కడి ప్రజల నమ్మకం. హనుమంతుడు తలక్రిందులుగా పాతాళలోకాని కి వెళ్లినదానికి నిదర్శనంగా ఆలయంలో వాయుపుత్రుని విగ్రహం తలక్రిందులుగా స్థిరపడిపోయిందని చెబుతారు స్థానికులు.

ఆలయంలోని వీర హనుమాన్‌ విగ్రహం చాలా శక్తివంతమైనదని భావిస్తున్నారు. ఆలయం సమీపాన పలువురు మహర్షుల మందిరాలు ఉన్నాయి. దాదాపు 1200 సంవత్సరాల క్రితం నుంచి ఈ మందిరాలు ఉంటున్నట్టు చరిత్ర చెబుతున్నది.


మర్రి, రావి, వేప, పారిజాతం, తులసి చెట్లు

ఆంజనేయస్వామి ఆలయ ప్రాంతంలో మర్రి, రావి, వేప, పారిజాతం, తులసి చెట్లు ఉన్నాయి. ఇక్కడ రెండు పురాతన పారిజాత వృక్షాలు ఉన్నాయి. పురాతన గాథల ప్రకారం ఈ చెట్టులో వీరహనుమాన్‌ కొలువై ఉన్నాడట. ఈ పారిజాత చెట్టుపై లెక్కలేనన్ని చిలుకలు కూర్చుని ఉంటాయి.


రామచిలుక రూపంలో అవతారం

ఒకానొక బ్రాహ్మణుడు రామచిలుక రూపంలో అవతారం దాల్చాడని పురాణ గాథ చెబుతున్నది. వీర హనుమాన్‌ చిలుక రూపంలోకి మారి, తులసీదాసు రాముడిని కలిసేందుకు వాహకంగా మారాడని పురాణ కథనం.


#ఎలా చేరాలి;

రోడ్డు మార్గంలో ఉజ్జయినికి 15 కిలోమీటర్ల దూరంలో, ఇండోర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉన్నది. ఈ ప్రాంతానికి బస్సు లేదా టాక్సీ ద్వారా చేరుకోవచ్చు.


    🍁🍁 *సేకరణ*🍁🍁  

          *నరసింహారావు*   

            *న్యాయపతి* 


🌹🍃🍂🍁🍁🍂🍃🌹

కామెంట్‌లు లేవు: