24, ఆగస్టు 2021, మంగళవారం

సర్పాలు చికిత్సలు

 ప్రాచీన గ్రంథాలలో సర్పాలు వాటి గురించి ఇచ్చిన సంపూర్ణ వివరణ  - చికిత్సలు .


  సకల చరాచర సృష్టిలో సర్పాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వీటి గురించి మనలో చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీకు వాటిలోని రకాలు గురించి పూర్తిగా వివరిస్తాను.


               సర్పజాతులు ఈ ప్రపంచంలో రెండు  రకాలుగా ఉన్నాయి.       అవి 


 1 .  దివ్యములు ఇవి దేవతా సర్పములు .


 2 .  భౌమములు  ఇవి భూమి నందు ఉండునవి .


   దివ్యసర్పములు లలో భూమి యందు తిరిగే 

సర్పాలు , మండలీ సర్పములు , ఉపజాతి సర్పములు కూడా ఉండును.


  దివ్య సర్పములలో రకాలు  - 


   1 .  అనంతుడు.


    2 .  వాసుకి.


    3 .  తక్షకుడు.


    4 .  కర్కోటకుడు .


    5 .  పద్ముడు .


    6 .  మహాపద్ముడు .


    7 .   శంఖపాలుడు .


    8 .   కులికుడు . 


  దేవతాసర్పములకు ఉండు గుర్తులు  - 


      అనంతుడుకి ఫణాగ్రము నందు తెల్లటి పద్మాకారం గల తెల్లని చుక్కలు ఉండును.  కులికునికి శిరము నందు శంఖము వంటి చిహ్నము ఉండును. వాసుకి వీపు భాగంలో నల్ల కలువ వంటి గుర్తు ఉండును. కర్కోటకునికి మూడు నేత్రములు పోలిన చిహ్నం ఉండును. తక్షకుని కి పడగ యందు స్వస్తిక్ వంటి గుర్తు ఉండును. శంఖుపాలునికి వీపు నందు అర్ధచంద్ర త్రిశూలాకారం గల గుర్తు ఉండును. మహాపద్మునికి చిన్నచిన్న మణుల 

వంటి చుక్కలు ఉండును.పద్మునికి వీపు నందు ఎర్రని వర్ణం గల పంచ బిందువులు ఉండును. 


             పైన చెప్పిన గుర్తులను బట్టి అవి దేవతా సర్పములుగా గ్రహించవలెను.


  దేవసర్పములకు విషము ఎక్కువ ఉండు సమయములు  - 


      ఆది, సోమ , మంగళ, బుధ , గురు, శుక్ర , శని వారాల్లో పగలు సమయంలో దేవతా సర్పములకు విషం ఎక్కువ ఉండును. రాత్రి సమయంలో విషప్రభావం చాలా తక్కువ ఉండును. ఒక్క శనివారం రాత్రి సమయంలో మాత్రం విషప్రభావం ఎక్కువ ఉండును. ఈ సమయంలో మాత్రమే అనంతుడు వంటి దేవతా సర్పాలు కరుచును . 


  దేవతాసర్పముల యొక్క మహిమ  - 


      అనంత, వాసుకి , తక్షక జాతికి సంబంధించిన దేవతా సర్పాలు ఎనిమిది రకాల సర్పాలు కు జరామరణాదులు లేవు . వీటి విషం అత్యంత తీవ్రం అయినది. వీటి విషం నుంచి కాపాడే ఔషదం ఏమి లేదు . 


  భూమి యందు ఉండు సర్పముల భేదములు 

 


   1 - ఉపజాతి సర్పములు .


   2 -  దర్వీకరములు .


   3 -  మండలీ సర్పములు . 


   4 -  రాజీమంతములు .


           అను నాలుగు రకముల సర్పములు కలవు.


  భౌమ సర్పముల యొక్క లక్షణములు - 


    

       పడగలు గరిట వలే ఉండునవి దర్వీకరములు అనియు , శరీరం అంతయు రత్నాలతో కూడిన కంబళి వలే గాని చిత్రవిచిత్రమైన పొడలు కలిగి ఉండునవి మండలీ సర్పములు అని , శరీరం నందు సన్న చుక్కలు , రేఖలు ఊర్ధ్వంగా ఉండి తిర్యక్ అగ్రరేఖలు కలిగి చిత్రాకారంగా ఉండునవి రాజీమంతములు అని చెప్పబడును 


     ఉపజాతి సర్ప లక్షణములను విష లక్షణములను తరువాత వివరిస్తాను.


  మూడు రకాల సర్పాల విష గుణము  - 


      దర్వీకముల యొక్క విషము కొంచం వేడి కలిగి ఉండి కారముగా ఉండును. మండలీ విషము వేడిగా ఉండి పులుపు రుచి కలిగి ఉండును. రాజీమంత విషము చల్లగా ఉండి మధురముగా ఉండును. 


          పైన చెప్పిన రుచులను బట్టి ఆయా సర్పాలు కరిచినప్పుడు వాటి విషం శరీరం లో ప్రవేశించి వాతాదిదోషములను కలుగచేయును  . 


  మూడు రకాల సర్పములు యొక్క వాతదోషముల వివరములు  - 


 

      దర్వీకర జాతి సర్పములు  వాతోద్రేకం , మండలీ సర్పములు పిత్తోద్రేకం , రాజీమంత సర్పములు శ్లేష్మోద్రేకం కలిగి ఉంటాయి. 


  భూమి యందు ఉండు మూడు రకాల సర్పాల సంఖ్య  - 


 1 -  దర్వీకములు అనగా త్రాచుపాములు వీటిలో మొత్తం 14 రకాలు కలవు. 


 2 -  మండలీ సర్పములు అనగా పింజరలు వీటిలో మొత్తం 21 రకాలు కలవు. 


 3  - రాజీమంత సర్పాలు అనగా క్షుద్రజాతి సర్పాలు వీటిలో 36 రకాలు కలవు.


 భూమి ముందు ఉండు సర్పాలలో ప్రముఖమైనవి , ప్రమాదకరమైనవి త్రాచుపాములు ఇవి మొత్తం 14 రకాలు .  అవి 


   *  చింతపువ్వు వన్నె త్రాచు.


   *  నాగజెర్రి .


   *  రేలత్రాచు .


   *  నాగజెర్రి.


   *  సెనగపువ్వు త్రాచు.


   *  నల్లత్రాచు.


   *  అరికెవన్నె త్రాచు.


   *  కందిపొడల త్రాచు.


   *  మొగలిపువ్వు త్రాచు.


   *  తెల్ల త్రాచు.


   *  కోడె త్రాచు.


   *  గిరినాగు .


   *  నీరు త్రాచు .


   *  గోధుమ త్రాచు.


   *  రాచపాము 


          ఈ విధంగా 14 రకాలుగా త్రాచుపాములు ఈ భూమి యందు నివసించుచున్నాయి.


   ఇప్పుడు వీటి లక్షణాలు తెలియచేస్తాను .


 *  చింతపువ్వు వన్నె త్రాచు  - 


          దీని యొక్క శరీరం మంచి ఛాయతో ఉండి దీని యొక్క కోపం సాధారణంగా ఉండును. ఆదివారం నాడు దీని యొక్క విషతీవ్రత తీవ్రంగా ఉంటుంది.


 *  నాగజెర్రి  - 


           ఇది సగం త్రాచు వలే , సగం జెర్రిపోతు వలే ఉండును. చెట్లు , తోటల యందు , చెట్ల పై భాగంలో నివసించుతూ గోధుమవన్నే తెలుపురంగు కలిగి అత్యంత ప్రకాశవంతంగా ఉంటుంది. దీనికి అత్యంత కోపం . సోమవారం నాడు విషాదిక్యత కలిగి ఉండును. నాగజెర్రిని త్రాచుపాముల జాబితాలోనే మన పూర్వికులు చేర్చారు .


 *  రేలత్రాచు  - 


            అడవుల యందు నివసించుట, సన్నంగా, పొడవుగా శరీరం కలిగి ఉంటుంది. సామాన్యమైన కోపం కలిగి ఉంటుంది.సోమవారం నందు దీనియొక్క విష తీవ్రత అధికంగా ఉంటుంది. 


 *  శెనగపువ్వు త్రాచు  - 


             ఇది శెనగ పువ్వు వర్ణం కలిగి ఉంటుంది. సువాసన గల ప్రదేశాలలో ఉంటుంది. సోమవారం నందు దీని యొక్క విషప్రభావం అధికంగా కలిగి ఉంటుంది.


 *  నల్లత్రాచు  - 


             నేరేడు పండు వర్ణం కలిగి ఉండి కొంచం తక్కువ పొడవు కలిగి ఉంటుంది. అత్యంత దుష్టత్వం , అత్యంత కోపం కలిగి ఉంటుంది. దీని విషం స్వచ్చంగా ఉంటుంది. పర్వతాలు, అడవుల యందు నివసిస్తుంది. మంగళవారం తీవ్ర విషాదిక్యత కలిగి ఉంటుంది.


 *  అరికెవన్నె త్రాచు  - 


             ఈ త్రాచు ఎక్కువుగా మనుష్యుల మల విసర్జణ చేసే ప్రదేశాలలో సంచారం చేయును . మలభక్షణం చేయును . అత్యధిక కోపం , స్వచ్చమైన గరళం కలిగి ఉండును. బుధవారం నందు తీవ్ర విషాదిక్యత కలిగి ఉండును. అరిక ధాన్యం వంటి వర్ణం కలిగి ఉంటుంది.


 *  కందిపొడల త్రాచు  - 


            కందికాయ మీద ఉండునట్టి పొడలు వలే దీని శరీరం పైన ఉంటాయి. సామాన్యం అగు కోపం కలిగి ఉంటుంది.బుధవారం నందు దీని విషతీవ్రత అధికంగా ఉండును. 


 *  మొగలిపూత్రాచు - 


             దీనియొక్క శరీరం వెండితో సమానం అయిన ఛాయ ఉంటుంది.పరిమళములు గుభాళించు ప్రదేశాలలో ఉంటుంది. మొగలి పొదలు , పరిమళ ఔషదాలు గల అరణ్యముల 

యందు సంచరిస్తుంది. కోపం తక్కువ, అతిశాంతం , సూక్ష్మమైన మొగలి రేకు ప్రమాణం ,  గురవారం నందు విషోద్రేకం అధికంగా ఉండును. 


 *  తెల్లత్రాచు  - 


              కోపం తక్కువ , సాత్విక గుణం , శాంతస్వభావం , వెన్నెలవంటి శరీర రంగు కలిగి ఉండి తెల్లత్రాచు అని చెప్పబడును .


 *  కోడెత్రాచు  - 


              18 అంగుళముల పొడువు ఉండును. కోళ్ళని భ్రమ చెందించి ఆకర్షించుట కొరకు కోళ్ళవలె అరుచును. ఇండ్ల యందు , కోళ్ల గూళ్ళ యందు నివాసం ఉండును. అత్యధిక కోపం కలిగి ఉండును. రాత్రుల యందు కోళ్ళని భక్షించును. రూపం భయంకరంగా ఉండును. అత్యంత చురుకుగా ఉండును. శుక్రవారం నందు అత్యథిక విషతీవ్రత కలిగి ఉండును.


 *  గిరినాగు  - 


           చంద్రబింబం వంటి వంక కలిగి , మెరుస్తున్న పడగ కలిగి ఉండి పర్వతముల యందు సంచారం చేస్తూ చెట్ల కొమ్మల యందు నివాసం ఉండును. ఇది పక్షులను భక్షించును . పడగ యందు వర్తులాకారం గా కృష్ణపాదములు కలిగి ఉండును. శుక్రవారం నందు విషోద్రేకం కలిగి ఉండును. 


 *  నీరుత్రాచు  - 


          అధికం అగు విషం , అతికోపం కలిగి ఉండి జలం నందు సంచారం , జలజంతు భక్షణ చేయుచూ శుక్రవారం నందు విషోద్రేకం అధికంగా ఉండును.


 *  గోధుమత్రాచు  - 


         సాత్విక స్వభావం కలిగి ఉండి గజము పొడవు ఉంటుంది. శనివారం నందు విషోద్రేకం కలిగి ఉండును.


 *  రాచనాగు అను త్రాచు  - 


          పడగ గుండ్రంగా ఉండి , కృష్ణపాదములు లేని పడగ ఉండి మూడు అడుగుల పొడవు కలిగి ఉండి అధికకోపం కలిగి ఉంటుంది. చాలా భయంకర స్వభావం కలిగి ఉంటుంది. పగదీర్చుకొను పట్టుదల ఉండును. పర్వతాలు అరణ్యముల యందు నివాసము ఉండును.


          ఇప్పుడు మీకు పెంజర పాముల గురించి వివరిస్తాను.


 ఇవి మొత్తం 21 రకాలు  అవి .


 *  కాటుకపోడ పెంజర .


 *  రక్త పెంజర .


 *  ఉడుముపొడ పెంజర.


 *  కలంకారీ పెంజర.


 *  పొట్ల పెంజర.


 *  తివాసిపోడ పెంజర.


 *  ఊదుపొడ పెంజర .


 *  పిచ్చుకపోడ  పెంజర.


 *  అగ్నిపోడ  పెంజర.


 *  పొడ పెంజర.


 *  సున్నపుపొడ పెంజర.


 *  తేనెపొడ పెంజర.


 *  కుళ్ళుపొడ పెంజర.


 *  పాదిరీపొడ పెంజర.


 *  గువ్వపొడ పెంజర.


 *  గరికపోడ పెంజర.


 *  మోదుగపూపొడ పెంజర.


 *  పసుపుపొడ పెంజర.


 *  దొండపండు పొడ పెంజర.


 *  గవ్వపోడ  పెంజర.


 *  రెండు తలల శిఖండి.


           పైన చెప్పిన విధంగా 21 రకాలుగా ఉన్నాయి . 


  మండలీ సర్పముల లక్షణములు  - 


 *  కాటుకపోడ పెంజర లక్షణము  - 


       ఈ పెంజర మిక్కిలి లావుగా , అమితమైన పొడవు , శరీరం అందు పంగనామాలు  కలిగి ఉండును. ఇది జీవజంతువులను కరుచును. దీని కాటు వలన దేహమంతయు వాపు , తెల్లగా పాలిపోవడం , దురద, నిస్సత్తువ కలుగును. మరణం మాత్రం కలుగదు . దీనిని దాసరిపాము అని కూడా పిలుస్తారు . 


 *  రక్త పెంజర  - 


       రక్త పెంజర అనునది చెయ్యి పొడవు కలిగి ఉండి ఎర్రని మచ్చలు , భయంకరమైన విషం కలిగి ఉండును. దీని కాటు వలన మైకం , భ్రాంతి, మూర్చ, నోటివెంట నురుగు పడును. నేత్రములు , పండ్ల చిగుళ్లు , రోమకూపములు , ముక్కు , కంఠం వీటి నుండి విపరీతంగా రక్తస్రావం కలుగును.ఎనిమిది జాములలో మనిషి మరణించుట జరుగును. ఆ సమయం దాటిందో చిత్రంగా బతుకగలడు.


 *  ఉడుముపొడ పెంజర -


        ఈ పెంజర పెద్ద శిరస్సు కలిగి ఉండి గరుకు శరీరం , ఉడుము వంటి ఆకారం కలిగి భయంకరంగా ఉండును. దీని కాటు వలన కలిగిన గాయము నుండి అధికంగా రక్తం స్రవించును . మైకంలో  ఉండి మంత్ర మరియు ఔషధ చికిత్సలకు లొంగక 3 దినములలో తప్పక మనిషికి మరణము కలుగును.


 *  కలంకారీ పెంజర  - 


        కలంకారీ పెంజర అనునది మూరెడు పొడవు కలిగి ఉండి కలంకారీ రంగుల వంటి పొడలు కలిగి ఉండును. దీని కాటు వలన శరీరం మంటలు పుట్టును . శోఫ , కలంకారి పని చేయబడిన చాందిని వంటి మచ్చలు , కంఠం యందు శోఫ , దాహము కలుగును. కాటుపడిన చోట ఆముదం , నూనె మొదలయిన చమురు పదార్థాలను ఉంచిన అవి ఇనికిపోవును . ఇట్టి లక్షణాలు కలిగిన మనిషి ఒక్క రోజులో మరణించును.


 *  పొట్ల పెంజర  - 


        పొట్ల పెంజర అనునది తలయును , తోకయును సన్నంగాను , శరీరం లావుగాను , పొట్లకాయ రంగు కలిగి మూరెడు పొడవు కలదై పొట్లకాయ వలే ఉండును. దీని కాటు తిన్నవారికి గొంతుక యందు గురక కలుగుట , శరీరం వాచుట మొదలగు లక్షణాలు కలుగును. దీని కాటు తినినవాడు 4 వ దినం నందు తప్పక మరణించును.


 *  తివాసిపోడ పెంజర  - 


        ఈ పెంజర అనునది 20 అంగుళాల పొడవు ఉండి తివాసి రంగుల వంటి మచ్చలు కలిగి ఉండును. దీని కాటు పడిన వారి శరీరం అంతా మంటలు , వాపు , మైకం , కనులకు చీకటి కమ్మడం వంటి లక్షణాలు కలిగి నాలుగు జాములలో మరణం సంభంవించును.


 *  ఊదు పొడ పెంజర - 


         ఇది ఒక అడుగు పొడవు ఉండును. ఇది కరవదు . నరులు మొదలయిన వాని శరీరం నందు బుస్సుమని వూదును. అందువలన దేహమందు వాపు , రక్తక్షీణత , పాండు రోగం , నిస్సత్తువ , కీళ్ల యందు చచ్చుదనం వంటి దుర్గుణములు ఏర్పడి చాలా కాలం తరువాత మరణం కలుగును.


 *  పిచ్చుకపోడ పెంజర  - 


          ఈ పెంజర అనునది అడుగు పొడవు ఉండి ముఖం నందు మూడు మచ్చలు ను కలిగి ఉండును. ఇది ఇండ్ల చూరుల యందు ఉండును. ఇది ప్రాకును. మరియు దుముకుతూ వేగంగా పోవును . దీనికాటు పడిన వారికి దేహం నందు పిచ్చుక మచ్చలు వంటివి మచ్చలు కలుగును. కడుపులో తిప్పును. రొమ్మునందు పసరు చేరినట్టు ఉండును. దీనివలన మరణం కలగదు .


 *  అగ్నిపోడ పెంజర  - 


          అగ్నిపోడ పెంజర  అనునది  18 అంగుళాల పొడవు కలిగి ఉండును. ఇది మనుషుల శరీరం నందు కాటువేయుట , ఊదుట , చొల్లు కార్చుట చేయును . ఈ మూడింటిలో ఏ విధంగానైనా అగ్నిపోడ పెంజర విషాన్ని మనుష్యుని  మీదకు విషాన్ని ప్రయోగించిన శరీరం నందు మిక్కిలి మంటలు కలుగును. కొంతకాలం తరువాత చిన్నగా అనారోగ్యం కలుగును. మరణం లేదు .


 *  పొడపెంజర  - 


          ఇది ఒక అడుగు పొడవు ఉండును. ఇది కరవదు. ఊదును. దీని నోటి విషపు గాలి తగిలిన వెంటనే శరీరం నందు ఒక్కసారిగా భగ్గున మంట మొదలగును. గాలిసోకిన స్థలం నందు రెండు మూడు దినముల పిమ్మట నిప్పుతో కాల్చబడినట్టు బొబ్బలు జనించును. నూనె మొదలగు సేవించినట్టైన  శరీరం నందు నల్లని మచ్చలు పుట్టును . కొంతకాలం ఇలా బాధపడిన తరువాత మృత్యువు సంభంవించును.


 *  సున్నపు పొడ పెంజర  - 


           ఇది అడుగు పొడవు మాత్రమే ఉండును. ఇది వరిమళ్ళ లోని ఎండ్రకాయ బొక్కలలో నివసిస్తూ ఎండ్రకాయలను భక్షించును . ఇది కరవదు. ఇది మనుజుల శరీరం నందు ఊదును. దీని విషపు గాలి తగిలిన వెంటనే మంట పుట్టును . శరీరం నందు మచ్చలు , దద్దుర్లు , గ్రంథులు ఏర్పడి , దురద మొదలయి కుష్టురోగి వలే ఉండును.  దీనివల్ల మృతి కలగదు . 


 *  తేనె పొడ పెంజర  - 


          ఇది రెండు మూరల పొడవు కలిగి ఉండి గుర్రపు వన్నె గల మచ్చలు కలిగి ఉండును. ఇది కరిచిన శరీరం నందు వాపు , మచ్చలు జనియించి కొన్నిదినములకు మృతి చెందును 


 *  కుళ్లు పొడ పెంజర  - 


           ఇది ఒక గజం పొడవు ఉండును. దీని శరీరం పైన అనేక వర్ణములు గల పొడలును కలిగి ఉండి చూచుటకు అసహ్యం కలిగి ఉండును. దీని కాటు పడిన వారికి శరీరం బరువు ఎక్కును. ముక్కులు ఎగురుచుండును. శ్వాస బంధించును. కాళ్లు , చేతుల యెక్క గోళ్లు పుచ్చిపోవును . కుష్టువ్యాధి సంభవించినట్టు శరీరం కుళ్ళి దుర్గందం ఏర్పడును . ఇది కరిచిన సంవత్సరం తరువాత మరణించును.


 *  పాదిరీ పొడ పెంజర  - 


           ఇది చేతి పొడవు ఉండును. కలిగొట్టు పువ్వు వన్నె మచ్చలు కలిగి ఉండి మొద్దు స్వభావం కలిగి ఉండును. ఇది కరవదు. మనుజుల శరీరములను నాకును. అందువలన శరీరం నందు పైత్యం , నవ, శరీరం రంగు    మారు ట , నిస్సత్తువ, వాంతులు ఎక్కిళ్లు , అరిచి సంభంవించును. మృతి ఎంత మాత్రం కలగదు . 


 *  గువ్వపోడ పెంజర  - 


           ఇది ముప్పది అంగుళముల పొడవును , పావురపు రంగు శరీరం కలిగి ఉండి పసుపు వన్నె మచ్చలు కలిగి ఉండును. దీని కాటు పడినవారికి శరీరం నందు పాండు వ్యాధి , దురద, శోఫ , పసుపు వర్ణము గల మచ్చలు , దద్దురులు కలుగును. కొంతమందికి మాత్రమే మరణం కలుగును.


 *   గరికపోడ పెంజర  - 


            ఇది గరిక వర్ణపు మచ్చలను కలిగి ఉండి అడుగు పొడవును కలిగి ఉండును. దీని కాటు వలన మనుజులకు శరీరం నందు దురద, వాపు , మాంద్యం, నొప్పి, కన్నులు భ్రమ గప్పుట, దేహంలో నిస్సత్తువ , శరీరం అంతా ఆకు పసుపు వర్ణం గల పొడలు , శరీరం నందు వణుకు వంటి లక్షణాలు కలిగి కుష్టువ్యాది జనింపజేయును . కాళ్ల యొక్క చేతుల యొక్క వ్రేళ్లు వంకరలై ఎండిపోయినట్టు అయ్యి శుష్కించి ఉండును.


 *  మోదుగుపూ పొడ పెంజర  - 


           ఇది రెండు అడుగుల పొడవు , ఎర్రని మచ్చలు కలిగి ఉండును. దీని కాటు తిన్న వారికి శరీరం నందు వాపు , గాయం నందు పోట్లు , శరీరం నందు గ్రంథులు కట్టుట, అప్పటికప్పుడే రక్తం వాంతి అగుట , దగ్గిన రక్తం పడుట వంటి లక్షణాలు కలిగి ఉండును.


 *  పసుపుపొడ పెంజర  - 


           ఇది చేతి పొడవు కలిగి ఉండును. పసుపు వన్నె మచ్చలను కలిగి యుండును. దీని కాటు వలన శరీరం నందు పసుపు రంగు బొబ్బలు , జ్వరం , గాయాల్లో పోట్లు ఏర్పడి మరణం సంభంవించును.


 *  దొండపండు పొడ పెంజర  - 


          ఇది చేతేడు పొడవు ఉండును. చక్కగా పండిన దొండపండు వర్ణం కలిగి ఉండును. దీని కాటువలన శరీరం నందు నరములు ఉబ్బి ఎర్రగా కనిపించును. దేహం శుష్కించును . గాయం నందు పోట్లు కలుగును. మారుతి సంభవింపదు.


 *  గవ్వపోడ పెంజర  - 


          ఇది మూడు మూరల పొడవును , లావుగా భయంకరంగా గవ్వ  వర్ణం కలిగి ఉండును. దీని కాటు వలన శరీరం నందు పాండువు , ముఖం , నేత్రములు పసుపు వర్ణం కలిగి ఉండును. కాటుపడిన ప్రదేశం కుంగి గుంట పడుట జరుగును. మరణం సంభవించదు.


 *  రెండు తలల శిఖండి  -  


         ఈ పెంజర రాగిరంగు కలిగి ఉండును. తెల్లని మచ్చలు , గజము పొడవు కలిగి ఉండును. దీని తోక వైపు మొద్దుగా ఉండటం చేతను తలవైపుకు ప్రాకినట్లే తోకవైపుకు పాకును. అందువలన జనులు దీనికి రెండు తలలు ఉండునని భావించును. దీనిని కర్రతో కొట్టినా చావదు. జెముడు , జిల్లేడు కర్రలతో కొట్టినను , నిప్పులతో కాల్చినను చనిపోవును . ఇది కరవదు . మనుజుల శరీరం నాకును . ఇందువలన దేహం అంతయు నవ, పాండు రోగం , పొడలు , వాపు కలిగి అన్నం తినటం మీద ద్వేషం కలుగును. 

 

   ఇప్పటివరకు  మీకు 21 రకాల పెంజర సర్పాల గురించి తెలియచేశాను . ఇప్పుడు మీకు రాజీమంత సర్పాల గురించి తెలియచేస్తాను .  


     ఈ రాజీమంత సర్పాలలో 4 రకాల సర్పాలు కలవు.       అవి 


  *  క్షుద్రజాతి సర్పాలు . 


   *  కుంభీ వస సర్పాలు .


   *  మహా సర్పాలు .


   *  నిర్విష సర్పాలు .   అని 4 రకాలు కలవు.


  రాజీమంత సర్పాలలో బేధాలు  - 


     పైన చెప్పబడిన నాలుగు జాతుల సర్పాలలో క్షుద్రజాతి సర్పములు 9 జాతులుగాను , కుంభీవస సర్పాలు 8 కులములుగాను , మహాసర్పములు 3 బేధములుగాను , నిర్విష సర్పములు 16 తరగతులుగా పుట్టి ఉన్నవి.


  క్షుద్రసర్పములలో రకాలు  - 


 *  పెద్ద కట్లపాము.


 *  నాగుల కట్లపాము.


 *  నూనె కట్లపాము.


 *  బఱ్ఱె కట్లపాము.


 *  కట్లపాము.


 *  తాటిబొలుగు పాము.


 *  చెట్టెగురు పాము.


 *  గొడ్డలి ముఖపు పాము.


 *  గోడప్రాకుడు పాము.    


         ఈ విధంగా మొత్తం 9 విధాలుగా ఉండును.


 *  పెద్ద కట్లపాము లేదా పెద్ద పరుగుడు పాము 


          ఇది గజము పొడవు ఉండి గోధుమవన్నె త్రాచు పాముని పోలి ఉంటుంది.  దీని కాటు పడిన వానికి మాటిమాటికి విషం ఎక్కి భాధించును. కాని మరణం కలగదు.


 *  నాగుల కట్లపాము  - 


           దీనిని నాగ పరుగుడు అని కూడా అంటారు. ఇది 36 అంగుళముల పొడవు ఉండును. ఇది చూడటానికి నల్ల త్రాచువలె ఉండును. దీని కాటువలన విషం ఎక్కడం దిగడం జరుగును. మంత్రౌషదాల వలన విషం విరుగును. మరణం కలగదు. 


 *  నూనె కట్లపాము  - 


            ఇది 36 అంగుళముల పొడవు కలిగి ఉండి శరీరం అంతయు తెల్లని కట్లు కలిగి ఉండి మెరుస్తూ ఉంటుంది. దీని విషం మిక్కిలి చురుకు అయినది. దీని కాటు వలన బాధ కలుగును. విషం వలన మరణం సంభవించదు.


 *  బర్రెకట్ల పాము  - 


            ఇది 50 అంగుళాల పొడవు ఉండి మొద్దు వలే లావును , శరీరం నందు గరుకు కలిగి ఉండును. ఇది క్రూరమైన విషం కలిగి ఉండును.


 *  కట్లపాము లక్షణము  - 


             ఇది మూడుమూరల పొడవు , శరీరం నందు గణుపుల వంటి కట్లు కలిగి ఉండును. ఇది కాటు వేయడం వలన మాటిమాటికి విషం ఎక్కడం , దిగడం జరుగును. మరణం కలుగనేరదు .


 *  తాడిగిరి లేదా తాటిబొలుగు పాము  - 


              ఇది  చిటికెన వ్రేలు లావును , మూడు జానల పొడవు నూనె రంగును కలిగి ఉండును. ఇది తీగ జాతి చెట్లలో విశేషంగా తాటిచెట్ల యందును సంచరించును. మనుజుల నిది తలమీదనే తప్ప మరి వేరే ప్రదేశంలో కరవదు. అందువలన తక్షణమే విషమెక్కి మనుజుడు గంటలోపునే చచ్చును. దీని విషముకు విరుగుడు లేదు . ఇది పగబట్టిన మనిషిని చంపియే తీరును . ఒకవేళ చంపలేక పోతే నిరసన వ్రతం బూని 6 నెలలలో అతనికోసం వేచి చూసి చివరకు చచ్చును. 


 *  చెట్టగురు పాము  - 


            ఇది చిటికెన వ్రేలు లావు , అడుగున్నర పొడవు ఉండి ఎప్పుడూ చెట్ల మీదనే ఉండును. ఇది ఒక చెట్టు పై నుంచి మరియొక చెట్టు పైకి తటాలున దుమక గలదు. ఇది మనుజులను తలమీద కాని కన్నుల మీద కాని కరుచును. ఇది పగ సాధించుట విషయంలో  తాడిగిరి పామును పోలి ఉండును. ఇది కరిచినచో ఔషదం ఇచ్చు సమయం కూడా ఉండదు. అంతలోపు మనుజుడు మరణించును. జీవజంతువులు ను చంపుటలో దీని విషాన్ని మించినది లేదు . కావున పర్వాతారణ్యాలు , ఉద్యానవనాలు యందు తిరిగే వారు ఈ సర్పాన్ని సదా కనిపెట్టి తిరగగలరు.


 *  గొడ్డలిమొగపు పాముల లక్షణము  - 


             ఇది ఉదారంగును , గొడ్డలి వంటి తల కలిగి ఉండును. రేగటి మట్టి భూములలో , చౌడు భూముల్లో , బురద నేలల్లో నివసించును. వర్షాకాలంలో మాత్రమే బయట తిరుగును. మూరెడు పొడవు కలిగి ఉండును. ఈ పాముచే కరవబడిన మనుజుడు యొక్క అంగాలు కుంచించుకు పోయి పొట్టివాడు అగును.


 *  గోడప్రాకుడు పాము లక్షణము  - 


              ఇది రెండు మూరల పొడవు కలిగి తెల్లని శరీరం కలిగి శరీరం పైన నల్లని అడ్డు చారలు కలిగి ఉండును. వేలెడు లావు కలిగి ఉండును. అతిక్రూరమైన విషము కలిగి ఉండును.ఈ సర్పము ఎంత చదరము అయిన గోడని అయినా ప్రాకి ఎక్కగలదు. కాని దిగుట తెలీదు . గబుక్కున కింద పడును. 

ప్రాచీన గ్రంథాలలో సర్పాలు వాటి వివరణ - 5 


        అంతకు ముందు పోస్టులో రాజీమంత సర్పాలు మొత్తం 21 రకాలు వాటి గురించి సంపూర్ణ వివరణ ఇచ్చాను. ఇప్పుడు కుంభీన జాతి సర్పాలు గురించి వివరిస్తాను. 


   ఈ కుంభీని జాతి సర్పాలు మొత్తం 8 రకాలు .


  *  ఘంటాపుచ్చము .


  *  గరున్నాగము .


  *  త్రిశూలి .


  *  జటాధరము .


  *  కుంభీనసము .


  *  శోణముఖము .


  *  లోహితాక్షము .


  *  ఛత్రపతి.


       ఈ విధంగా 8 రకాలుగా ఉంటాయి.


 *  ఘంటాపుచ్చ సర్ప లక్షణము  - 


         మిక్కిలి పొడవు శరీరం , క్రూరత్వం , మిక్కిలి పరాక్రమం సంచరించునప్పుడు తోక చివర యందు ఘంటానాదం కలిగి ఉంటుంది. ఈ సర్పం సర్వ జంతువులను భక్షించును . ఉగ్రమైన విషం కలిగి ఉండును. సంచారం బయలుదేరడం మొదలు కాగానే దీని తోక యందు ఘంటానాదం వినపడును. ఆ నాదం వినపడిన వెంటనే సమస్త జంతువులు పారిపోవును. ఈ సర్పం ఆఫ్రికా దేశ పర్వతారణ్యములలో సంచరించును.


 *  గరున్నాగ సర్ప లక్షణము  - 


         ఖడ్గము వంటి నాలుక , గబ్బిలపు రెక్కల వంటి రెక్కలు , గుడ్లగూబ వంటి ముఖం, భూమి మీద మరియు ఆకాశ గమనం , 8 మూరల పొడవు కలిగి ఉండును. ఇది పక్షిజాతులను భక్షించును . ఇది ఆఫ్రికా దేశ పర్వతారణ్యాలలో నివశించును.


 *  త్రిశూలీ సర్ప లక్షణము  - 


           పిల్లివంటి ముఖం , తోక యందు గరుడపచ్చ కాంతి వంటి రేఖలతో ప్రకాశించుట , మీసాలు కలిగి ఉండును. 16 మూరలు పొడవు కలిగి ఉండిన దేహము , తోక త్రిశూలం వంటి మూడు చీలికలు కలిగి ఉండును. ఇది ఆఫ్రికా ఖండం నందు ఉండును. 


 *  జటాధరా సర్ప లక్షణము  - 


           మేకవంటి స్వరము , అతి పెద్ద శరీరం , గొఱ్ఱెవలె జడలు , 6 మూరల పొడవు , కంబడి చాయ వంటి లక్షణములు కలది. ఇది సింహళ ద్వీపం నందు ఉండును.


 *  కుంభీనస సర్ప లక్షణము  - 


           మూడు మూరల పొడవు , పంది ముఖం , కడవ వంటి కడుపు , కురచ అయిన తోక , చిన్నగా పాకును .  తుమ్మెద ధ్వని వంటి కూత ఈ లక్షణములు గలది కుంభీనస సర్పం అనబడును. ఇది అన్ని దేశాలలో ఉండును.


 *  శోణముఖ సర్ప లక్షణం  - 


          స్పటిక ఛాయ గల శరీరం , పద్మరాగ మణి వంటి శిరస్సు , అతి భయంకరమైన కామక్రోధములు , భయంకరమైన గర్జన , 12 మూరల పొడవు గల శరీరం కలిగి ఉండునది శోణముఖ సర్పం అనబడును.


 *  లోహితాక్ష సర్ప లక్షణం  - 


         నల్లని వర్ణం, భూమి నుండి చెట్ల పైకి , చెట్ల పై నుంచి భూమి పైకి దుముకుట , బారెడు పొడవు గల శరీరం , అగ్ని కణముల వంటి నేత్రములు , భయంకర ఆకారం కలిగి ఉండును.


 *  ఛత్రపతి సర్ప లక్షణము - 


         5 మూరల పొడవు , అతిస్నిగ్ధమైన కోమలాకారం , సంచరించునప్పుడు శరీరం వికసించును. సంచరించనప్పుడు శరీరం ముడుచుకుని ఉండును. శ్వేత ఛత్రం గల శిరస్సు , సర్వ జంతువుల ధ్వనిని చేయగలిగి ఉండును. క్షణంలో ప్రాణం తీయును.రాత్రుల యందు చెట్ల మీద నివసించును . ఇది కేరళ నందు నివసించును . 


  మహాసర్పముల వివరణ  - 


     మహాసర్పములు మొత్తం 3 రకాలు  అవి 


  *  దాసరి పాము .


  *  కొండ చిలువ .


  *  సముద్రపు చిలువ .


 *  దాసరిపాము లక్షణము  - 


         60 మూరల పొడవు , బారెడు లావుగల శరీరం , శరీరం అంతా త్రిపుండ్రాకారం గల నామములు , కాటుక వంటి ఛాయ , ముఖం నందు ఊర్ద్వత్రిపుండ్రములు కలిగి ఉండునది దాసరిపాము అని చెప్పబడును . దీనికి దొరికిన ఏ జంతువుని అయినా బిర్రుగా చుట్టుకుని చంపి దిగమింగును.


 *  కొండచిలువ లక్షణము  - 


         నూరు మూరల పొడవు , మూడు బారల వలయము , వెడల్పు గల తెల్లని పొడలు , నీలవర్ణం గల శరీరం కలిగి ఉండునది కొండచిలువ అని చెప్పబడును . ఇది ఏ జంతువుని అయినా చటుక్కున మింగి చెట్టుకు చుట్టుకుని నీల్గును . అంతట పొట్టలోని జంతువు జీర్ణం అగును.ఇది కొండల యందు మాత్రమే నివసించును . 


 *  సముద్రపు పాము లక్షణము  - 


          మిక్కిలి పొడవు , స్థూలమగు శరీరం గలది . దీనిచేత కరవబడిన మనిషిని భూమి పైకి తీసుకొచ్చి చికిత్స చేసిన విషము హరించదు. సముద్రము నందు ఉంచే చికిత్స చేయవలెను . 


          *  సర్పజాతి వివరణ సంపూర్ణం *


      ఇప్పుడు మీకు సర్పాలు కాటువేసినప్పుడు చేయవలసిన చికిత్సల గురించి వివరిస్తాను.   

 

     సర్ప విషములకు చేయవలసిన చికిత్సలు -


    

    అంతకు ముందు పోస్టులలో మీకు సర్పాలలో రకాలు మరియు వాటి లక్షణాలు సంపూర్ణంగా వివరించాను. ఇప్పుడు వాటి చికిత్సలు గురించి సంపూర్ణంగా వివరిస్తాను.


 *  1వ చికిత్స -

    

          ఏ సర్పం కోపోద్రేకంతో ఉండునో అట్టి సర్పం నోటి నుండి పొగ వెడలుచుండును. యే మనుజుడు అయినా అట్టి సర్పముచే కరవబడినను ఆ సర్పం వదిలిన పొగచే స్మృశించబడిన ఆహార పదార్థాలను భక్షించిన వెంటనే విషం ఎక్కును.ఆ విషాన్ని చికిత్సల ద్వారా తొలగించవలెను .  వెంటనే ఆ విషార్తునకు ఆవుపాలు , ఆవునెయ్యి , తేనె సమాంతరములుగా కలిపి అందు రెండు గురిగింజల అంత వత్సనాభిని కలిపి త్రాగించి గాయమునకు కూడా వత్సనాభిని కరిచినచొట పైపూతగా రాయవలెను .వెంటనే విషం హరించును . 


 *  2 వ చికిత్స  - 


           సర్పం కాటువేసిన వానికి వెంటనే  ఎడమ ముక్కునందు చెవిలో గులిమి పట్టించి మనిషి మూత్రం ఆ ముక్కులో ఉంచిన విషం ఎక్కదు.


 *  3 వ చికిత్స  - 


           నేలగుమ్ముడు గడ్డను గంథం తీసి కాటువేసిన చోట లేపనం చేసిన విషం హరించును . దీని చూర్ణం మీకు ఆయుర్వేద పచారీ షాపులలో దొరకును. 


 *  4 వ చికిత్స  - 


            పెన్నేరు గడ్డ అనగా అశ్వగంధ , చిర్రివేరు , మహిసాక్షి , కరిదువ్వ ఈ వస్తువులను గోమూత్రం తో నూరి పట్టించిన సర్పవిషం హరించును . విషంని హరించుటలో దీన్ని మించిన గొప్ప ఔషదం లేదు .


 *  5  వ చికిత్స  - 


          ఆగాకర గడ్డ ని గంథం తీసి అనగా సానమీద అరగదీసి ఆ గంధాన్ని తీసి కాటువేసిన స్థలం నందు దానిని పూసిన విషం హరించును . 


 *  6 వ చికిత్స - 


          కాటువేసిన స్థలం నందు జిల్లేడు వేరు అరగదీసి పట్టించినను లేదా ఎర్ర చిత్రమూలం , ఆరుద్ర పురుగు కలిపి నూరి పట్టించినను విషం విరుగును.


 *  7 వ చికిత్స  - 


          కరక్కాయ , తేనె , మిరియాలు , ఆకుపత్రి , ఇంగువ, మణిశిల , వస వీనిని సమానంగా నీరు వేసి నూరి ముక్కులో వేసిన సర్పముచే కరవబడిన వాడు జీవించును.


 *  8 వ చికిత్స  - 


           మణిశిల , ఇంగువ, వస , త్రికటుకములు అనగా శొంటి,పిప్పిళ్లు , మిరియాల సమాన చూర్ణం , కరక్కాయలు, లవంగచెక్క, ఆకుపత్రి అనునవి సమానంగా తీసుకుని నీటితో కలిపి నూరి ముక్కులో వేసినచో ఎంత విషపూరితమైన సర్పం కరిచినను ఆ వ్యక్తి బ్రతుకుతాడు.


 *  9 వ చికిత్స  - 


           దేవకాంచన చెట్టు వేరు గంధంని ముక్కులోపల వేసినచో అసాధ్యం అయిన సర్పవిషం హరించును . 


 *  10 వ చికిత్స  - 


           నేపాళపు గింజల్లోని పప్పులను నిమ్మపండ్ల రసంలో 21 సార్లు భావన చేయవలెను . భావన అనగా నిమ్మపండ్ల రసంలో గింజల్లోని పప్పు నానబెట్టి మళ్ళీ పూర్తిగా ఎండించడం మరలా నానబెట్టి మరలా ఎండించడం ఈ విధముగా 21 సార్లు చేయవలెను . ఆ తరువాత దానికి ఉమ్మి తో నూరి కణికలు చేసి ఎండించి మాత్రలులా చేసుకోవలెను . కావలసినప్పుడు ఉమ్మితో అరగదీసి కాటువేసిన స్థలం నందు లేపనం చేయవలెను . తరువాత కన్నులకు కాటుక వలే ఆ గంధాన్ని పట్టించవలెను  . విషం విరిగిపోవును.


 *  11 వ చికిత్స  - 


              గుంటగలగర వేఱు గాని , తిప్పతీగ వేఱు కాని , త్రిశూలి చెట్టు వేఱు గాని నీటితో నూరి లోపలికి తీసుకుని కాటువేసిన స్థలం నందు పూయడం వలన సర్పవిషం హరించును . 


 *  12 వ చికిత్స  - 


                భావంచి విత్తనాలు గోమూత్రంలో నానబెట్టి గోమూత్రంతోనే నూరి లోపలికి తాగవలెను . 


 *  13 వ చికిత్స - 


             తెల్లగురిగింజ వేరుని నోటిలో ఉంచుకుని రసం మింగుచున్న సర్పవిషం హరించును .


 *  14 వ చికిత్స  - 


             అశ్వగంధ సమూలం మేక మూత్రంతో నూరి దానినే గాయమునకు పట్టించిన సర్వ జంతువుల విషంని హరించును . 


 *  15 వ చికిత్స  - 


             నల్ల ఉమ్మెత్త వేఱు చిన్న ముక్కను తీసుకుని 10 ml కానుగ విత్తనాల నూనె వేసి నూరి మాత్ర వలే చేసి పుక్కిట పట్టుకొని ఆ మాత్రని నిమ్మపండ్ల రసముని కలిపి త్రాగిన సర్పవిషం హరించును . 


 *  16  వ చికిత్స  - 


             అత్తిపత్తి చెట్టు వేఱు అనగా దీనిని పట్టుకున్నచో ఆకులు ముడుచుకొనిపోవును . మరియు నీలివేరు ను మంచి నీటితో నూరి పుచ్చుకొని తెల్ల గురిగింజ లోని పప్పుల గంధమును కాటువేసిన స్థలం నందు పట్టించిన సర్పవిషం హరించును . 


 *  17  వ చికిత్స  - 


              గొమూత్రంలో గాని మనుష్యుని మూత్రంలోగాని పాత నెయ్యిలో గాని పసుపు చూర్ణం కలిపి తాగించిన సర్పవిషము హరించును . 


 *  18 వ చికిత్స  - 


            పాము కరిచిన వెంటనే నరమూత్రం సేవించిన విషం ఎక్కదు.


 *  19 వ చికిత్స  - 


          కటుకరోహిణి , నేలతాడిగడ్డలు నీళ్లతో నూరి పుచ్చుకొనిన సర్పవిషం హరించును . 


 *  20 వ చికిత్స  - 


          కుంకుడువేరు నూరి కుంకుడు గింజ ప్రమాణంలో పుచ్చుకొనిన సర్పవిషం హరించును . 


 *  21 వ చికిత్స  - 


          నాగముష్టి వేరు నూరి రసం తీసి తాగిన అన్ని రకాల సర్పవిషాలు హరించును . 


 *  22 వ చికిత్స  - 


           జిల్లేడు యొక్క లేత మొగ్గలని కోసి ఆ మొగ్గలు తెంచునపుడు స్రవించు పాలను ఒక గ్లాసులో పట్టి ఆ పాలతో ఆ మొగ్గలను నూరి రేగు పండు ప్రమాణం మాత్రలను చేసి ఆ మాత్రలను తమలాపాకులో చుట్టి గంటకి ఒకసారి  మింగించిన సర్పవిషం హరించును . ఇలా 6 మాత్రలు కు తక్కువలేకుండా మింగించవలెను . మింగలేని స్థితిలో ఉన్నచో నీటితో కలిపి తాగించవలెను . 


 *  23 వ చికిత్స  - 


           జిల్లేడు ఆకులకు ఇరువైపులా అంటుకొని ఉండే దూది వంటి తెల్లని నునగును గీచి ఒక గాజుపాత్రలో వేసి జిల్లేడు లేత మొగ్గలను తుంచునప్పుడు తొడిమలు నుండి స్రవించు పాలతో తడిపి చేతితో చక్కగా పిసికి కుంకుడు గింజ అంత మాత్రలు చేసి నీడలో ఎండపెట్టి ఆ మాత్రలకు గాలి తగలకుండా సీసాలో వేసి కార్క్ మూత బిగించి ఈ మాత్రలను గంటకొకటి చొప్పున మూడు గంటలసేపు మింగించిన సర్పవిషం నిస్సందేహంగా నివర్తించును.  


          ఈ మాత్రలు తయారుచేసిన రెండు నెలల వరకే పనిచేయును . కావున రెండు నెలలోకసారి ఈ మాత్రలు తయారుచేసి నిలువ ఉంచుకొనవలెను .


       * సర్ప విష చికిత్సలు సంపూర్ణం *


 గమనిక  - 


          కొంతమంది ప్రాచీన వైద్య పండితులు పాము కరిచిన సాధారణంగా మనుషులకు మృతి సంభవించదు అని తమతమ గ్రంథాలలో వివరించారు . పాము కరిచినవారికి స్మృతి తప్పి ఉచ్వాస నిశ్చ్వాసములు ఆగి , హృదయచలనం ఆగి నాడిగమనం ఆగి ఉన్న సమయంన  మృతుడు అయినట్టు నిర్ణయించుకుని చక్కగా కూర్చొండబెట్టి 500 వందల బిందెల నీటిని నెత్తిన ధారగా పోసిన బొందిలోకి ప్రాణం వచ్చి లేచును. 


                     ఈ విధంగా చేసినను ప్రాణం రానిచో ఒక గచ్చు తొట్టిలో కాని , చెక్క తొట్టిలో కాని నిండుగా నీరు నింపి మూడు దినములు ఉంచిన ఉదకం నుండి బుడగలు వచ్చును. బుడగలు మొదలు అయినచో శరీరంలోకి ప్రాణం ప్రవేశిస్తుంది అని అర్థం. ఈ విధంగా బుడగలు మొదలయిన గడియ తరువాత కాటు తిన్న వాని శరీరం బయటకి తీసి కూర్చుండబెట్టి శిరస్సు పై నుంచి నీటిని ధారగా పోయుచున్న ప్రాణములు నిలబడును. నీటిలో ఉంచినప్పుడు బుడగలు రానిచో మృతుడు అని నిర్ణయించవలెను .  


         సిద్దనాగార్జున తంత్రం నందు తొమ్మిది దినముల వరకు నీటియందు ఉంచవలెను అని ఉన్నది. పాముచే కరవబడిన వాడు చనిపోయినచో వానిని మరలా ఆ సర్పం వలన గాని లేదా మరియొక సర్పం చేత కాని కరిపించినచో కాటు తిన్నవాడు బ్రతుకును కాని సర్పం మరణించును. బహుశా పాముకాటు తిన్నవాడు శరీరంలోని అవయవాలు పనిచేయని ఒక రకమైన అచేతన స్థితికి చేరుకుంటాడు కావోచ్చు ఉదకం సహాయంతో అతన్ని మరలా సాధారణ స్థితికి తీసుకురావొచ్చు అని ఆయుర్వేద పండితుల ఉవాచ కావోచ్చు . 


         నేను చదివిన కొన్ని గ్రంథాలలో పాముకరిచిన వెంటనే ఆ పాముని కాటు తినినవాడు పట్టుకొని కరవాలి అని లేదా మట్టిపెడ్డని నమిలి కాని పాముకాటు పైన కాల్చి కుంకుడు ఆకు నలుగగొట్టి కట్టిన సర్పవిషం హరించును అని ఉన్నది.


 పాములు దగ్గరకు రాకుండా ఉండుటకు రహస్య క్రియలు  - 


 *  1 వ ప్రక్రియ  - 


          పుష్యమి నక్షత్రం నందు సంగ్రహించబడిన తెల్ల జిల్లేడు వేఱు , తెల్ల గలిజేరు వేఱు బియ్యపు కడుగుతో నూరి త్రాగినను , ఆ నక్షత్రం యెక్క సమయం నందు ఆ మూలికలను నూరి బియ్యపు కడుగులో చేర్చి పూసుకుని స్నానం చేయవలెను . ఇలా సంవత్సరంకి ఒకమారు చేయడం వలన  ఆ మనిషి దగ్గరకి సర్పాలు వెళ్లవు . సర్పభయం ఉండదు.


 *  2 వ ప్రక్రియ  - 


            సూర్యుడు మేషరాశి యందు ఉండగా చిరుశెనగలు , వేపాకు కలిపి భక్షించిన ఒక సంవత్సరం వరకు సర్పభయం ఉండదు.


 *  3 వ ప్రక్రియ  - 


             ఆషాడ శుక్ర పంచమి నాడు సంగ్రహించబడిన దిరిసెన చెట్టు వేరుని దూపదీపనైవేద్యములు వొసగి నడుముకి కట్టుకుని బియ్యపు కడుగుతో ఆ వేరుని నూరి తాగిన ఆ సంవత్సరం సర్పభయం ఉండదు. ఇటుల చేసిన వానికి యే కారణం వల్లనైనా పాము కరిచినను పామే చచ్చును.


 *  4 వ ప్రక్రియ  - 


              దూసరి తీగ వేరుని తెచ్చి నివశించే గృహము నందు కనపడునట్టు వ్రేలాడదీసిన సమస్త విషజంతువులు అన్నియు దూరంగా పారిపోవును . 


 *  5 వ ప్రక్రియ  - 


             పుష్యమి నక్షత్రం నందు తిప్పతీగ వేరుని తెచ్చి కణికలుగా ఖండించి దారము నకు మూలికగా గుచ్చి కంఠం నందు ధరించినచో సర్పభయం కలగదు. పాముకాటు వేసిన వాని కంఠం నందు వేసిన విషం దిగును.


 *  6 వ ప్రక్రియ  - 


             పుష్యమి నక్షత్రంతో కూడిన ఆదివారం నందు బియ్యం కడుగుతో తెల్లగలిజేరు వేరు నూరి తాగిన మనుజునిని చూసిన సర్పం వెంటనే పారిపోవును . అట్టి మనిషికి సర్పభీతి ఉండదు.


 *  7 వ ప్రక్రియ  - 


             తెల్ల గంటెన వేరును బియ్యపు కడుగుతో నూరి పుచ్చుకొనిన మనుజుని కి 6 మాసముల వరకు సర్పభయం కలగదు.


 *  8 వ ప్రక్రియ  - 


             దూసరి తీగ వేఱు ఉదకంతో నూరి తాగినవానిని 6 మాసములు వరకు సర్పం కరవదు.దీనిని " గరుడ చూడామణి" అని పిలుస్తారు . 


  *  9 వ ప్రక్రియ  - 


             మనుజులు ప్రతి దినం పడుకొనే సమయం నందు అస్తిక మునిని గూర్చి ధ్యానించి నమస్కారం చేసి పడుకున్నచో ఆ మనుషులకు సర్పభయం లేకపోవుటయే కాక స్వప్నం నందు కూడా సర్పాలు కనపడవు.


 *  10 వ ప్రక్రియ  - 


           గొడుగు వేసుకొని ఆవాలు పిడికిటపట్టుకొని రాత్రియందు గాని , పగటి యందు గాని ఏ మనుజుడు సంచరించునో వాని ఛాయ పడినను , శబ్దము వినినను సర్పములు భయపడి పారిపోవును .


 *  11 వ ప్రక్రియ  - 


           అతిమధురం , విప్పకర్ర  ఈ రెండింటిని చేర్చి మంట వేసినచో ఆ జ్వాలను చూసి నాగుపాములు సైతం దగ్గరకి రావు . 


 *  12 వ ప్రక్రియ  - 


            సింహం దంతంతో గరుడ విగ్రహంని చేయించి రాగి లేక బంగారు తాయత్తు లో పొదిగి శరీరం నందు ధరించిన వానిని చూడగానే సర్పములు పలాయనం చిత్తగించును . 


           పైన చెప్పబడిన రహస్యతంత్రాలలో మీకు ఏది వీలుగా ఉంటుందో అది ప్రయత్నించండి. ముఖ్యముగా అరణ్యములలో సంచరించేవారు , రహస్య ప్రదేశాలలో తిరిగేవారు తప్పనిసరిగా పైన చెప్పిన తంత్రాలు పాటించటం చాలా మంచిది 


          పాముకాటు గుండ్రంగా ఉండినను , నేరేడు పండు వర్ణం కలిగి ఉండినను , నీలపు వర్ణం కలిగి ఉండినను , రక్తహీనం అయ్యి తెల్లగా ఉండినను , రక్తం గూడుకట్టి ఎర్రగా ఉండినను వాడు దేవజాతి అయిన వాడు అయినను బ్రతకడు ఇది నిశ్చయం ...


         నేటితో సర్పాలు గురించి పూర్తి వివరణ వాటి చికిత్సా విధానాలు గురించి పూర్తిగా తెలియచేశాను . అదేవిధంగా సర్పాల నుంచి రక్షించుకొనుటకు కొన్ని ప్రక్రియలు కూడా వివరించాను.  మరలా ఒక మంచి పొస్టుతో మీ ముందుకు వస్తాను . 


  

   గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 50 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

ప్రశ్న పత్రం సంఖ్య: 21

 ప్రశ్న పత్రం సంఖ్య: 21  కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి  అన్ని పదాలు "నం " తోనే అంతమవ్వాలి. 

  1) కవిత్వాన్ని ఇలా కూడా అంటారు  

2) పెద్ద ఇల్లు 

3) అందరము 

 4) కదలిక 

 5) వివరించి చెప్పటం - 

6) కొలిచే పద్దతి = 


7) స్త్రీలు ప్రాణము కన్నా దీనికి ప్రాముఖ్యత ఇస్తారు  - 


8) అడవి లాంటిదే -


9) అమ్మవారికి ఆషాడంలో సమర్పించేది - 


10)  ప్రఖ్యాత చెందిన వారిమీద వారి అనుసరనీయులకు ఉండేది -  


 11) నీవు ఏమి చెప్పిన మేము ____


12) రెక్కలతో గాలిలో ప్రయాణం చేసేది  --


 13) వేదిక మీద మీ గొప్పతనాన్ని పొగిడి మీకు శాలువా కప్పి చేసేది.  --  


14) దీనిని ఎవ్వరు కోరుకోరు --  ? 


15) మీ పిల్లలు -- ? 


16) ముద్దుపళని రాసిన శృంగార కావ్యం.?  


17) ఒక సుగంధ భరిత ఆకుల మొక్క, పూలలో కలిపి దండ కడతారు. 


 18) వాంతి -- 


19) ఇంద్రుడు విహరించే ఉద్యాన వనం  - 


 20) ప్రజలు  - 

నాన్నగారికి మందులు

 "నాన్నగారికి మందులు తీసుకురావాలి..ఓ ఐదు రూపాయలు ఉంటే సర్దుతారా..?" తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అడిగాడు ఆయన ! 


ఈ మాటలు అన్నది సాదా సీదా వ్యక్తి అయితే పెద్దగా ఆశర్యం ఉండేది కాదేమో ! 


ఐదు రూపాయలు చేబదులు అడిగిన వ్యక్తి 

టంగుటూరి ప్రకాశం గారి రెండో కుమారుడు హనుమంతరావు గారు ! 


అప్పు అడిగింది తుర్లపాటి కుటుంబరావు గారిని !


సాక్షాత్తు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కొడుకు నోటినుంచి కన్నీటితో వచ్చిన మాటలు విన్న తరువాత ఎవరికైనా కంట తడి రాక మానదు ! 


ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి చివరి రోజుల్లో ఆర్థిక భారంతో ఆయన పడిన ఇబ్బందులకు ప్రత్యక్ష సాక్షి ఈ ఐదు రూపాయలు ! 


చెన్నై లో క్షణం తీరికలేని పనులు ముగించుకుని నివాసానికి చేరుకున్న టంగుటూరి ప్రకాశం గారికి కొద్దిగా అస్వస్థత గా ఉందని తెలిసి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న తుర్లపాటి కుటుంబరావు గారు వారి నివాసానికి చేరుకున్నారు ! 


లోపలి నుంచి బయటకు వచ్చిన టంగుటూరి కుమారుడు తుర్లపాటి కుటుంబరావు గారి దగ్గరకు వచ్చి గద్గద స్వరంతో " నాన్న గారికి మందులు తీసుకురావాలి..ఓ ఐదు రూపాయలు సర్దుతారా.." అనంటంతో షాక్ తో తుర్లపాటి కుటుంబరావు గారి నోటెంబట క్షణ కాలం మాట రాలేదు ! 


వెంటనే తేరుకుని ఉబికి వస్తున్న కన్నీటిని అతి ప్రయత్భం మీద ఆపుకుంటూ జేబులోనుంచి ఐదు రూపాయిలు తీసి ఆయన చేతిలో పెట్టాడు ! 


ఈ చేదు నిజాల్ని తుర్లపాటి కుటుంబరావు గారు స్వయంగా తన పుస్తకంలో కళ్ళకు కట్టినట్టు వివరించారు !!


దేశం కోసం తన ఆస్తినంతా ధారపోసి చివరి రోజుల్లో కటిక దారిద్రాన్ని అనుభవించిన టంగుటూరి లాంటి మహోన్నత వ్యక్తులను నేటి భారతంలో ఆశించగలమా ? 


ముఖ్యమంత్రి పదవి అంటే తర తరాలకు సరిపడా ఆస్తులను దోచుకుని తమ వారసులకు పంచి పెట్టే ఒక అద్భుత దీపంగా భావించే ప్రస్తుత రోజుల్లో దేశం కోసం సొంత ఆస్తులను అమ్ముకుని రూపాయికి లేని అటువంటి ముఖ్యమంత్రిని చూడగలమా ? 

చూడగలమా ? 


అంటే చూడలేమనే సమాధానం వస్తుంది ! 


ఆ తరం వేరు 

నేటి తరం వేరు !


ఆనాటి రాజకీయాలు వేరు 

ఈనాటి అరాచకీయాలు వేరు ! 


డియర్ రాజకీయ నాయకులూ / పాలకులూ మీ మీ ఓటు బ్యాంకు రాజకీయాలు ఎలా ఉన్నా సంవత్సరంలో ఒకసారైనా ఇటువంటి మహానీయుడి పేరున మంచి కార్యక్రమాలు చేపట్టండి !


దేశం కోసం నిస్వార్థంగా సేవ చేయగలిగారు కాబట్టే టంగుటూరి నేటికీ ప్రజల గుండెల్లో చిరస్మరనీయుడు అయ్యారు !


ఈ రోజు టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా మహానుభావుడికి నివాళులు !  


పరేష్ తుర్లపాటి

పరిశుద్ధమైన కర్మ అంటూ ఏదీ లేదు

 పరిశుద్ధమైన కర్మ అంటూ ఏదీ లేదు. అన్ని కర్మలు మూడుగుణముల హెచ్చుతగ్గులతో కప్పబడి ఉంటాయి. కాబట్టి ప్రతి కర్మలోనూ ఏదో ఒక దోషం ఉండనే ఉంటుంది. అగ్ని పవిత్రమైనది. ప్రకాశాన్ని, వెలుగును ఇస్తుంది. కానీ అగ్నిపక్కనే పొగ కూడా ఉంటుంది. పొగ ఉందని చెప్పి అగ్నిని వదిలిపెట్టలేము కదా. అలాగే ప్రతి కర్మలో వాటి గుణముల భేదములను అనుసరించి ఏదో ఒక దోషం ఉండనే ఉంటుంది. ఏదో దోషం ఉందని చెప్పి ఆయా కర్మలు చేయకుండా ఉండకూడదు. ఆ దోషములను వదిలిపెట్టి కర్మలు చేయాలి కానీ ఏదో దోషం ఉందని మొత్తం కర్మనే వదలడం మంచిది కాదు. నిష్కామంగా, ఫలాపేక్ష లేకుండా చేస్తే, కర్మఫలములను భగవంతుడికి అర్పిస్తే, ఆ కర్మలలో దోషం ఉన్నా, ఆ కర్మల వాసనలు అంటవు. ఇక్కడ కర్మ అంటే విహిత కర్మ అంటే చేయదగిన కర్మ అని అర్థం. చేయకూడని కర్మల గురించి ఇక్కడ చెప్పడం లేదు. చేయదగిన కర్మలలో గుణభేదము వలన దోషములు ఉన్నా, వాటిని పరమాత్మ పరంగా చేస్తే, వాటి వాసనలు మనకు అంటవు అని చెబుతున్నాడు పరమాత్మ.


ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే, మనం దైనందిన జీవితంలో మనకు తెలియకుండా జీవహింస చేస్తుంటాము. కాళ్ల కిందపడి ఎన్నోజీవులు మరణిస్తుంటాయి. అందుకే దానికి ప్రాయశ్చిత్తంగా పంచ మహాయజ్ఞములు చేయమన్నారు. 

1.బ్రహ్మయజ్ఞము (దేవతలను ఆరాధించడం, శాస్త్రములు చదవడం, వినడం), 

2. పితృయజ్ఞము అంటే పితృదేవతలను ఆరాధించడం, క్షణములు, పిండప్రదానములు చేయడం,

3. దేవ యజ్ఞ అంటే సకల దేవతారాధన, హెూమములు చేయడం, పూజలు, వ్రతాలు చేయడం, 

4. భూతయజ్ఞము అంటే సాటి ప్రాణులకు ఆహారం పెట్టడం

5. మనుష్య యజ్ఞము అంటే బ్రాహ్మణులకు, అతిధులకు, పేదవారికి భోజనం పెట్టి తృప్తి పరచడం. 


వీటి వలన మనకు తెలియకుండా చేసిన పాపములు నశించిపోతాయి.


     🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏

దేవరియా బాబా చరిత్ర - 8 వ భాగం*

 🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️

_"శ్రీపాద రాజం శరణం ప్రపద్యే"_

 

*బ్రహ్మర్షి దేవరియా బాబా చరిత్ర - 8 వ భాగం*

_*"కాలాతీతుడు ⌛ దేవరియా బాబా"*_


ఒకసారి కొంతమంది విదేశీయులు "భారతదేశంలోని యోగులపై పరిశోధన చేస్తూ బాబా దగ్గరకు వచ్చారు. ఆ విదేశీయులతో మన భారతీయులు కూడా ఉన్నారు. వారు అనేక అంశాలపై బాబాను ప్రశ్నించి ఎన్నో విశేషాలను గ్రహించారు. వారు బాబాతో *"బాబా ..! మనదేశంలో వేల సంవత్సరాల నుండి శరీరాన్ని ధరించి ఉన్న యోగులు నేడు ఉన్నారా.?"* అని అడుగుతూ, *"ద్వాపర యుగం నాటి యోగులు ఈనాటికీ ఉన్నారని విన్నాము నిజమేనా ?"* అని ప్రశ్నించగా -- బాబా వారితో నవ్వుతూ _*"అవును నాయనా !ఉన్నారు. ఇద్దరు, ముగ్గురు ఉన్నారు. వారిలో ఇద్దరు హిమాలయములలో 🏔️ సమాధి స్థితిని పొంది ఉన్నారు. మరొకరు జనకళ్యాణమునకై వివిధ కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు"*_ అని పలికారు. అప్పుడు వాళ్ళు _"బాబా ! వాళ్ళ దర్శనం మాకు లభించగలదా ?"_ అని ప్రశ్నిస్తే _*"వాళ్లు నీకు దర్శనం ప్రసాదించాలని అనుకుంటే వారిని నీవు చూడగలుగుతావు"*_ అని సమాధానం ఇచ్చారు. అప్పుడు వాళ్లు బాబాతో _"బాబా ! వాళ్లలో ఒకరు జనకళ్యాణార్థమై అనేక కార్యక్రమములను చేస్తున్నారని పలికారు కదా! వారి దర్శనం మాకు లభించగలదా ? వారు ఎవరు ? ఎక్కడ ఉన్నారు ?"_ అని ప్రశ్నించారు. బాబా వారితో *"భగవదేచ్ఛ ఉంటే త్వరగానే మీకు అతనెవరో, ఎక్కడ ఉంటారో తెలుస్తుందని"* ప్రసాదం ఇచ్చి వారిని ఆశీర్వదించి 🤘పంపించారు.


*అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త*

🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️🔱🕉️

హిమాచల్ ప్రదేశ్ జాఖూ (హనుమాన్) ఆలయం

 తీర్ధయాత్ర - హిమాచల్ ప్రదేశ్ 


జాఖూ (హనుమాన్) ఆలయం, జాఖు, సిమ్లా


ఆలయ దర్శనం సమయం: ఉదయం 7:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు


పచ్చని వాతావరణంతో చుట్టుముట్టబడిన జాఖూ ఆలయం దైవత్వం మరియు ఆధ్యాత్మికతను వ్యాప్తి చేస్తుంది. ఈ ఆలయం హనుమంతునికి అంకితం చేయబడింది. ఆశ్చర్యకరంగా మీరు అధిక సంఖ్యలో కోతులను చూస్తారు. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద హనుమంతుడి విగ్రహం ఈ ఆలయంలో ఉంది.


సిమ్లాలో ఉన్న ఈ ఆలయం హనుమంతుడికి అంకితం చేయబడింది ఈ ఆలయం రామాయణ కాలం నాటిదని, ఈ ఆలయంలో హనుమంతుడి పాదముద్రలు కనిపిస్తాయని నమ్ముతారు. ఇక్కడి కోతులు మానవులకు భయపడవు మరియు ఆహారం కోసం పర్యాటకుల చుట్టూ తిరుగుతాయి. అవి తరచుగా పర్యాటకుల దగ్గర వస్తువులను లాగుతూ ఉంటాయి.ఈ ఆలయాన్ని సందర్శించేటప్పుడు మీ చేతుల్లో దేనినీ తీసుకెళ్లకూడదని ఇక్కడ వారు సలహా ఇస్తారు 


రామాయణం ప్రకారం, లక్ష్మణుడిని పునరుజ్జీవింపచేయడానికి సంజీవిని కోసం వెతుకుతున్నప్పుడు హనుమంతుడు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ అగాడని చెపుతారు. 4 నవంబర్ 2010 న జఖూ హనుమాన్ ఆలయంలో హనుమంతుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహం 108 అడుగులు పొడవు ఉంటుంది. ఇది బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో 98 అడుగుల ఎత్తులో ఉన్న క్రీస్తు విమోచకుడి విగ్రహాన్ని అధిగమించింది. నిర్మాణ వ్యయం రూ 1.5 కోట్లు ఖర్చయ్యాయి.


జాఖూ ఆలయంలో అగ్ర ఆకర్షణలు

శిఖారా ఆర్కిటెక్చర్. "శిఖారా ఆర్కిటెక్చర్" అనే ఉత్తర భారత నిర్మాణానికి జాఖూ హనుమాన్ ఆలయం ఉత్తమ ఉదాహరణ. మీరు ఆధ్యాత్మిక వాతావరణంలో ఉన్నప్పుడు, ఆలయంలో ఉపయోగించిన పరిపూర్ణ నిర్మాణాన్ని మీరు కన్నుల పండుగగా దర్శించవచ్చు. జాఖూ ఆలయంలోని హనుమంతుడి విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన హనుమంతుడి విగ్రహాలలో ఒకటి. ఈ ఆలయం చాలా పాతది అయినప్పటికీ, ఈ విగ్రహాన్ని 21 వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించారు. ఈ విగ్రహం 108 అడుగుల పొడవు మరియు సిమ్లా నగరానికి కనిపిస్తుంది.


జాఖూ కొండను సందర్శించండి. నిజమైన అన్వేషకుడు అందమైన జాఖూ కొండను సందర్శించే అవకాశాన్ని ఎప్పటికీ కోల్పోడు. దేవదార్లు వృక్షాలు. ప్రకృతి దృశ్యాలు మరియు పర్వతాలలోకి నడిచేటప్పుడు మీకు అద్భుతమైన ట్రెక్కింగ్ అనుభవం ఉంటుంది. ది రిడ్జ్ మాల్ రోడ్ లో ఉన్న ఆలయానికి కేవలం 1 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అద్భుతమైన శిఖరం మరియు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. 


ఇక్కడ రామనవమి, హనుమాన్ జయంతి పండుగలను ఎంతో భక్తితో నిర్వహిస్తారు 

జాఖూ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం శీతకాలం. డిసెంబరు, జనవరి నెలలో ఉత్తమ రూపాన్ని పొందుతుంది. జఖూ ఆలయం యొక్క అందం పొగమంచు మరియు ఆహ్లాదకరమైన వాతావరణంతో సమ్మేళనంతో పరిపూర్ణ అవతారం పొందుతుంది.


ఎలా చేరుకోవాలి

విమానం ద్వారా 

 సమీప విమానాశ్రయం కాంగ్రా విమానాశ్రయం. విమానాశ్రయానికి చేరుకున్న తరువాత, మీరు జాఖూ ఆలయానికి చేరుకోవడానికి టాక్సీ, బస్సు లేదా ఆటో వంటి స్థానిక రవాణా మార్గాల ద్వారా ఆలయానికి చెరుకొవచ్చు.

రైలు మరియు బస్సులో ప్రయాణం చేసేవారు ముందుగా సిమ్లా చేరుకొని అక్కడనుండి జాఖూ ఆలయానికి చేరుకోవడానికి స్థానిక రవాణా మార్గాల ద్వారా ఆలయానికి చెరుకొవచ్చు.


సర్వేజనా సుఖినోభవంతు 

🙏😊

🌹🍁🍁 *సేకరణ*🍁🍁🌹

              *న్యాయపతి*

            *నరసింహారావు*

వాడికి వీడు, వీడికి వాడు తోడు

 ఒక పిరికివాడు ఓ స్మశానం దాటాల్సి వచ్చింది. ఎవరన్నా వచ్చేవరకు కొంచెంసేపు ఆగి కొంచెం దూరంలో ఎవరో వస్తుంటే అతనితో కలిసి ధైర్యంగా స్మశానం దాటేసాడు.. ఇంతకీ ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడట! కాని కేవలం వాడికి వీడు, వీడికి వాడు తోడు ఉన్నారు అనే ఒకే ఒక్క భరోసా వాళ్ళని స్మశానం దాటేలా చేసింది.


నిజ జీవితంలో కూడా మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే.. నేను ఉన్నాను అనే భరోసా ఒక మాట సాయం...ఏమి కాదు నేను ఉన్నా అనే చిన్న మాట చెప్పి చూడు..మనిషికి ఎంత బలం వస్తుందో...ఆ బలంతో ఆ మనిషి ఏదైనా చేయగలడు.


ఓ సారి ఒకాయన తన కారులో ఓ గ్రామానికెళ్తుంటే, కారు దారిలో ఓ బురదగుంటలో దిగబడిపోయింది. సాయంకోసం చుట్టూచూస్తే ఓరైతు కనపడ్డాడు. పరిస్థితిచూసిన రైతు, "ఉండండి, నా ఎద్దుతో కారును బైటికి లాగుదాం" అని దగ్గరలోని తన పొలంనుంచి తన ముసలి ఎద్దును తోలుకొచ్చాడు. దాన్నిచూస్తూనే ఆ పెద్దమనిషి నిరాశతో ఉసూరుమన్నాడు!


రైతు ఎద్దుని కారు ముందు తాడుతో కట్టి, "ఓరేయ్ రాజూ, అంజీ, నందీ! ఎంటిరా ఆలోచిస్తున్నరూ, తిన్నదంతా ఏమైంది, బండిని లాగండిరా" అని ఉత్సాహంగా* *అదిలించాడు. అంతే! రాజు ఆ కారుని ఒక్క ఊపుతో బైటికి లాగేసింది.


పెద్దాయన ఆశ్చర్యంతో, " సర్, ఉన్నది ఒక ఎద్దేకదా, మీరేంటీ‌, అన్ని ఎడ్లు ఉన్నట్టు అదిలించారు?"


రైతు, "ఈ రాజు బక్కదే కాదండి, గుడ్డిది కూడా!


ఐతే, తనుకాక ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలాన్నంతా పెట్టింది, అంతే! పూర్తి నమ్మకంతో చేస్తే, ఎంత కష్టమైన పనైనా తేలిగ్గా చేయచ్చు!"


రైతు తెలివికీ, సమయస్ఫూర్తికీ ఆ నగరవాసి తలమునకలయ్యాడు!


పూర్వం 10 మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించే వారంటే, అంటే అలాంటి ధైర్యమే కారణం..ఉమ్మడి కుటుంబాలలో 'మేము ఉన్నాం' అనే భరోసా కారణం.


కాని ఈ రోజుల్లో ఒక్క పిల్లో పిల్లోడో చాలురా దేవుడా అనుకోవటానికి కారణం మేము ఉన్నాం చూస్కోటానికి అని భరోసా ఇచ్చే మనుషులు, బంధువులు మన చుట్టూ లేక పోవటం...


కష్టంలో మనిషికి నేనున్నా అనే భరోసా ఇవ్వండి అది కుదరక పోతే కనీసం ఒక మాట సాయం చేయండి..ఎందుకంటే మనిషికి మనిషే భరోసా కాబట్టి.. మనలో ఒకరికి ఒకరు ఐక్యత ముఖ్యం.

ధర్మములో ముఖ్యమైన విషయాలు...

 *హిందూ సనాతన ధర్మములో గల తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు.....*


*1. ముక్కులు కుట్టించుకున్నచో దృష్టి దోషము కలగదని నమ్మకము.*


*2. చెవులు కుట్టించుకున్న హృదయ సంబంద రోగములు రావు.*


*3. ఎడమ హస్తము పరమాత్మ అనియు, కుడి హస్తము జీవాత్మ అనియు ఈ రెండు ఏకము కావలెనను ఉద్దేశముతో రెండు చేతులు కలిపి నమస్కరించుచున్నాము.*


*4. తడి పాదములతో బోజనము చేసిన ఆయుర్వుద్ధి.*


*5. తడి పాదములతో శయనించిన ఆయుక్షీణం.*


*6. స్త్రీలకు బేసి సంఖ్య గల అక్షరములతో, పురుషులకు సరి సంఖ్యా గల అక్షారములతో పేర్లు పెట్టుట మంచిది.*


*7. సూర్య గ్రహణానికి ముందు ''12 '' గంటల కాలము, చంద్ర గ్రహణానికి ''9'' గంటల ముందు కాలము కడుపు ఖాళీగా ఉంచుకోవలెను.*


*8. శిశువు పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడ ఉంటె ఆ స్థానం వారి జన్మ రాశి . బంగారం కుజునికి , వెండి గురువునకు , రాగి రవికి ,ఇత్తడి బుధునకు, ఇనుము శని కి ఇష్టము.*


*9. రుద్రాక్ష ఎంత పెద్దదైతే అంత మంచిది, సాలగ్రామం ఎంత చిన్నదైతే అంత మంచిది.*


*10. బుధవారం నాడు బూడిద గుమ్మడి కాయను, గురువారం నాడు కొబ్బరి కాయను ఇంటి ముందు వ్రేలాడ కట్టుకుంటే నరఘోషలు తొలుగుతాయి.*


*11. యాత్ర సమయములందు మార్గ మధ్యమున పరుండునపుడు పాదరక్షలను తలక్రింద పెట్టుకుని పరున్నచో మృత్యుభయం తొలగి సులభ మార్గమధ్య మేర్పడును.*


*12. ఎవరికైనా వస్త్రములను ఇవ్వదలచినపుడు(వస్త్ర యుగ్మం) రెండు వస్త్రాలను ఇవ్వవలెను.*


*13. తాంబూలం ఇచ్చేటపుడు తమలపాకు మరియు అరటిపండు తొడిమలను ఇచ్చేవారి వైపు, కొసలు తాంబూలం పుచ్చుకునే వారివైపు ఉండాలి.*


*14. ఇరువురు వ్యక్తులు ఎదురెదురుగా కుర్చునప్పుడు దక్షిణ ముఖం అను ఆక్షేపణ రాదు. అలాగే హోమం చేయునపుడు -రుద్రునకు అభిషేకం చేయునపుడు నాలుగు వైపులందు నలుగురు కుర్చుండిన దిశల ఆక్షేపణలు ఉండవు.*


*15. ఇద్దరు కూతుర్లకు ఒకేమారు వివాహం చేయవచ్చును, కాని ఇద్దరు కొడుకులకు ఒకేసారి వివాహం చేయకూడదు. కనీసం ఆరు మాసాలు తేడా ఉండాలి. లేదా సంవత్సర భేదం జరగాలి.*


*16. గృహ ప్రవేశ సమయములందు మంచి గుమ్మడికాయను పగలకొట్టుచుందురు. అది కేవలం పురుషులు మాత్రమే చేయవలెను. ఎట్టి పరిస్థితిలోను స్త్రీలు చేయరాదు.*


*17. వినాయకునికి తులసి దలంతోను- శివునకు మొగలిపువ్వుతోను- దుర్గ ను గరిక తోను పూజించరాదు.*


*18. తులసి దళమును-బిల్వ దళమును ఒకసారి పూజ చేసిన తర్వాత కడిగి మరల మరొకసారి పూజించవచ్చును.*


*19. భోజనం చేసిన తర్వాత ఎడమ వైపు తిరిగి పడుకొని, కుడివైపు తిరిగి లేవవలెను.*


*20. కొబ్బరి- మామిడి-అరటి-పనస ఉదయం పూట తినరాదు.*


*21. వేరుశనగ పప్పు-అరటిపండు తిన్న పిదప నీరు త్రాగ రాదు.*✍️


                      🌷🙏🌷

పెదవి మాత్రమే తగిలే పద్యం

 ✍ *చదివే సమయంలో పెదవి మాత్రమే తగిలే పద్యం*


భూమీ భామాంబు భవా

వామాపా వైభవ భువి భావావాపా

వేమమ్మోముము భూభవ

భీమ భవాభావ భావ విభువామావిభా


*చదివే సమయంలో పెదవులు తగలనిది*

శ్రీశా సతత యశః కవి

తాశా ధాత్రీశ ఖండితాశా నిస్సం

కాశా నిరతారాధిత

కీశేశా హృష్ణ గగనకేశా యీశా


*ఒక అక్షరం పెదవికి తగలనిది తరువాతి అక్షరం తగిలేది*

*అంటే పెదవి తగలనిది, తగిలేది*

దేవా శ్రీమాధవ శివ

దా వేగాభిజ్ఞ మురభిదా మాధామా

జ్యావగ వంద్యా వాసవ

సేవితపద పగవిరామ శివ జపనామా


*కేవలం నాలుక కదిలేది*

సారసనేత్రా శ్రీధర

రారా నన్నేల నిందు రాక్షసనాశా

నారద సన్నుత చరణా

సారతరానందచిత్త సజ్జనరక్షా                                                                                                                                        

*నాలుక కదలని (తగలని) పద్యాలు*

కాయముగేహము వమ్మగు

మాయకు మోహింపబోకు మక్కువగ మహో

పాయం బూహింపుము వే

బాయగ పాపంబు మంకుభావమవేగా

భోగిపభుగ్వాహ మహా

భాగా విభవైకభోగ బావుకభావా

మేఘోపమాంగభూపా

బాగుగమముగావువేగ బాపాభావా


*నాలుక కదిలీ కదలని పద్యం*

ఓ తాపస పరిపాలా

పాతక సంహారా వీర భాసాహేశా

భూతపతిమిత్ర హరి ముర

ఘాతా కాలాంబుదవిధ గాత్రవరాహ్వా  


🙏 *పద్య భాషాభిమానులకు జోహార్లు*.

*తెలుగు కవులకు, పద్య రచయితలకు జోహార్లు* 🙏 

*అందుకే అన్నారు దేశభాషలందు తెలుగు లెస్స అని * ✍

ముకుందమాల స్తోత్రమ్శ్లోకం : 28

 ॐ मुकुन्दमाला स्तोत्रम्   

           ముకుందమాల స్తోత్రమ్ 

       Mukunda Mala Stotram    


                                    శ్లోకం : 28  t   

                           SLOKAM : 28

                                                

नाथे नःपुरुषोत्तमे त्रिजगतामेकाधिपे  

                                       चेतसा 

सेव्ये स्वस्य पदस्य दातरि परे नारायणे 

                                       तिष्ठति ।

यं कञ्चित्पुरुषाधमं 

                 कतिपयग्रामेशमल्पार्थदं 

सेवायै मृगयामहे नरमहो 

                        मूढा वराका वयम् ॥ २८॥


నాథే న: పురుషోత్తమే 

          త్రిజగతామేకాధిపే చేతసా 

సేవ్యే స్వస్య పదస్య దాతారి 

          సురే నారాయణే తిష్ఠతి I    

యం కంచిత్పురుషాధమం 

         కతిపయగ్రామేశమల్పార్థదం 

సేవాయై మృగయామహే నరమహో 

        మూఢా వరాకా వయం ॥ 28


ప్రభూ! మాకు 

  - నాథుడు, 

  - పురుషోత్తముడు, 

  - మూడు లోకముల ఏకైకనాథుడు, 

  - మనసు మాత్రముచేత సేవింపజాలినవాడు, 

  - సేవించిన వారికి తనపదవి ఇచ్చేవాడు, 

  - దేవతామూర్తి అగు నారాయణుడుండగా, 

    మాతో ఏ సంబంధము లేని ఒకానొక మానవాధముని ఏ కొలది గ్రామములకో అధిపతి అగు వానిని, 

    అల్పాల్పములగు ఫలములను ఇచ్చే వానిని, 

    ఒక మానవమాత్రుని సేవించుటక తహతహలాడుచున్నాము. 


అహో! ఏమి మా జాడ్యము!   


    నారాయణుని సేవింపక, 

    నరుని సేవించు వారికీ స్పష్టముగా తెలియుటకై వారికిగల తారతమ్యమును ఇందు స్పష్టముగా వివరించినారు.


నారాయణుడు 

  - సర్వ నర సమూహమునకు ఆశ్రయుడై, 

  - సర్వ నరులలో అంతర్యామి యై ఉండువాడు. 

    అతడు లేనిదే నిలకడలేనివాడు ఈ నరుడు. 

    నారాయణుడు మనకు ప్రభువు.    

    ఆ సంబంధము మనము తొలగించుకొందు మన్నను తొలగునది కాదు. 

   నరునకు నరునితో సంబంధము కల్పితము. 


అతడు (నారాయణుడు)  

                          త్రిజగన్నాథుడు. 

          ఇతడు (నరుడు) కొలది 

                 గ్రామములకు అధినేత. 


వానిని (నారాయణుని) మనసుతో 

                       సేవించిన చాలును. 

  వీనికి (నరునికి) శరీరమును  

    కష్టపెట్టి ఊడిగము చేయవలెను. 


నారాయణుడు తనని కొలిచిన 

    వారికి తన పదమునే ఇచ్చును.    

          ఈ నరుడల్పాల్పములను 

                                  ఈడేర్చును. 


అతడు (నారాయణుడు) 

                         పురుషోత్తముడు, 

          వీడు (నరుడు) 

                         పురుషాధముడు. 


అతడు (నారాయణుడు) దివ్యుడు, 

          ఇతడు (నరుడు) మర్త్యుడు. 


    ఇంత బేధమున్నను ఈ నరులనే కొలుచు మూఢాత్ము లమగు మా సంగతి ఏమను కోవలెనో తెలియదు.


Our master, the Personality of Godhead Nārāyaṇa, 

  - who alone rules the three worlds, 

  - whom one can serve in meditation, and 

  - who happily shares His personal domain, 

    is manifest before us. 


    Yet still we beg for the service of

  - some minor lord of a few villages, 

  - some lowly man who can only meagerly reward us.  


Alas! what foolish wretches we are!


https://youtu.be/ZTs6tcgm0lE  


                                        కొనసాగింపు  


                    =x=x=x=    


    — రామాయణంశర్మ    

             భద్రాచలం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*వివాహం..ఉద్యోగం..*


ఆవిడ పేరు వెంకట రమణమ్మ..శ్రీ స్వామివారు మాలకొండలో తపోసాధన చేసే రోజుల్లో..ఒకటి రెండు సార్లు పార్వతీదేవి మఠం వద్ద శ్రీ స్వామివారిని చూసారు..అప్పుడు శ్రీ స్వామివారు వెంకట రమణమ్మ గారిని పలకరించి..ఆశీర్వదించి పంపారు..శ్రీ స్వామివారు మొగలిచెర్ల కు వచ్చేసి, ఆశ్రమ నిర్మాణం చేయించుకొని..ఇక్కడే సాధన చేసుకొనే రోజుల్లో కూడా రమణమ్మ గారు శ్రీ స్వామివారిని కలిశారు..అలా శ్రీ స్వామివారికోసం ఆశ్రమం వద్దకు వచ్చినప్పుడే మా తల్లిదండ్రులతో పరిచయం ఏర్పడింది..ఆ తరువాత ఒకటి రెండుసార్లు రమణమ్మ గారు ఆశ్రమానికి వచ్చి శ్రీ స్వామివారిని చూసి వెళ్లారు.. శ్రీ స్వామివారిని దర్శించుకునే సమయంలో మా ఇంట్లో గడిపారు..ఈ విషయాలన్నీ ఆవిడే స్వయంగా చెప్పారు..శ్రీ స్వామివారు సిద్ధిపొందిన తరువాత..రమణమ్మ గారు మొగలిచెర్ల కు వచ్చారు..అప్పుడు శ్రీ స్వామివారి తల్లిగారైన వెంకట సుబ్బమ్మ గారు మందిరం వద్ద వున్నారు..సుబ్బమ్మ గారి వద్దే రెండురోజుల పాటు రమణమ్మ గారు వున్నారు..వాళ్ళిద్దరి మధ్యా కొద్దిగా సాన్నిహిత్యం కూడా ఏర్పడింది..తాను శ్రీ స్వామివారికి దగ్గర మనిషిని అని రమణమ్మ గారు భావించేవారు..


ఈసారి రమణమ్మ గారి రాకకు ఒక కారణం ఉన్నది..ఆవిడ కూతురు బిడ్డ (మనుమరాలు) యుక్త వయసుకు వచ్చింది..ఉద్యోగము చేస్తున్నది..సుమారు పాతిక సంవత్సరాల వయసు వచ్చింది.. కానీ..వివాహం చేసుకోనని ఖరాఖండిగా తేల్చి చెప్పింది..ఆ అమ్మాయికి పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు ప్రయత్నం చేసి..విఫలమయ్యారు..ఎవరు చెప్పినా ఆ అమ్మాయి వివాహానికి ఒప్పుకోవడం లేదు..తాను ఇంకా కొన్నాళ్ల పాటు ఒంటరిగా వుంటూ ఉద్యోగం చేయదలచానని..తనను బలవంత పెట్టొద్దనీ గట్టిగా చెప్పింది.. 


మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి అమ్మాయిని తీసుకెళ్లండి..మార్పు వస్తుంది..అని రమణమ్మ గారు తన కూతురికి సలహా ఇచ్చారు.."నువ్వు కూడా మాతో స్వామివారి వద్దకు వచ్చేయి..అందరం కలిసే వెళదాము.." అని ఆ కూతురు చెప్పి..రమణమ్మ గారిని వెంటబెట్టుకొని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చింది..కాకుంటే మనుమరాలికి మాత్రం విషయం చెప్పకుండా..కేవలం దైవదర్శనం కోసం మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరం వద్దకు వెళుతున్నామని చెప్పారు..


రమణమ్మ గారు మందిర ప్రాంగణమంతా తిరిగి చూసారు..తాను మొదట్లో చూసిన మందిరానికి, ఇప్పటికీ చాలా తేడా వున్నదని అన్నారు..చాలా మార్పులు వచ్చాయి అని చెప్పారు..తాను, శ్రీ స్వామివారి తల్లి గారితో గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు..

(శ్రీ స్వామివారి తల్లిగారైన వెంకట సుబ్బమ్మ గారు..శ్రీ స్వామివారు సిద్ధిపొందిన తరువాత మందిరం వద్దకు వచ్చి..ఇక్కడే సుమారు పదిహేను సంవత్సరాల పాటు వున్నారు..ఆనాటి తరం వాళ్లందరికీ వెంకట సుబ్బమ్మ గారు బాగా గుర్తు వున్నారు..ఇప్పటికీ కొందరు మమ్మల్ని ఆవిడ గురించి అడుగుతూ వుంటారు..వెంకట సుబ్బమ్మ గారు సుమారు ఐదు సంవత్సరాల క్రితం, తన 101 వ ఏట మరణించారు..) 


ఆరాత్రికి రమణమ్మ గారు, ఆమెతో వచ్చిన కూతురు, అల్లుడు, మనుమరాలు..అందరూ మందిరం వద్దే నిద్ర చేశారు..తెల్లవారింది..అందరూ తలారా స్నానం చేసి, శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకున్నారు..మనుమరాలి చేత కూడా శ్రీ స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేయించారు..అందరూ ప్రధాన మందిరం వద్ద నుంచి బైటకు వచ్చి..మంటపం లో కూర్చున్నారు..రమణమ్మ గారు మాత్రం మళ్లీ లేచి ..శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి మరొక్కమారు నమస్కారం చేసుకొని ఇవతలకు వచ్చారు..మనమరాలిని తన దగ్గర కూర్చోబెట్టుకుని.."నీకు త్వరగా పెళ్లి కావాలని మొక్కు కోవడానికి మేమందరం నిన్ను వెంటబెట్టుకొని ఇక్కడకు వచ్చాము.." అని అసలు విషయం చెప్పేసారు..అప్పటిదాకా ఉత్సాహంతో ఉన్న ఆ అమ్మాయి, ఈ మాట వినగానే గంభీరంగా మారిపోయింది.."అమ్మమ్మా..పెళ్లి తరువాత కూడా నేను ఉద్యోగం చేయడానికి ఒప్పుకునే పక్షంలో..నేను వివాహం చేసుకుంటాను.." అని చెప్పింది..ఈ మాట వినగానే ఒక్కసారిగా అందరికీ ఆనందం వేసింది..సుమారు సంవత్సరం నుంచీ పెళ్లి ప్రసక్తి తెస్తేనే ససేమిరా అంటున్న అమ్మాయి..ఇప్పుడు వివాహానికి ఒప్పుకున్నది..శ్రీ స్వామివారి సమక్షం లోనే అమ్మాయి నోటి నుంచి సానుకూల వార్త వచ్చింది..ఇంతకంటే ఏమి కావాలి?


మరో మూడు నెలల కల్లా..ఆ అమ్మాయికి వివాహం జరిగిపోయింది..నూతన దంపతులను వెంటబెట్టుకొని రమణమ్మ గారు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..అందరూ మనసారా శ్రీ స్వామివారికి నమస్కారం చేసుకున్నారు..ఇంకొక విషయమేమిటంటే..పెళ్లి తరువాత కూడా ఉద్యోగం చేస్తాను అన్న అమ్మాయి..మరో నెలకల్లా ఉద్యోగం మానేసి..భర్త తో చక్కగా కాపురం చేసుకుంటున్నది..


"స్వామి తలచుకుంటే..అన్నీ చిటికెలో జరిగిపోతాయి..నా మొర వృధాగా పోదు..స్వామివారి పై పూర్తి విశ్వాసం ఉంది.." అంటుంటారు రమణమ్మ గారు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699)

దేవరియా బాబా చరిత్ర 7 వ భాగం"*

 🌷🦚🌷🦚🌷🦚🌷🦚🌷🦚🌷

_"శ్రీపాద రాజం శరణం ప్రపద్యే"_

*"బ్రహ్మర్షి దేవరియా బాబా చరిత్ర 7 వ భాగం"*


_*"కాలాతీతుడు ⏳ దేవరియా 🤘 బాబా"*_


ఒకసారి హోలీ 🌈 ఉత్సవమునకు ముందుగా బాబా బృందావనం చేరతారనే వార్త దావానలంలా వ్యాపించింది. బాబా బృందావనంలో ఉండగా అక్కడికి బృందావనం, మధుర, భరత్పూర్, ఆగ్రా, అలీఘడ్ పట్టణం, ఢిల్లీ, ఘజియాబాద్ మొదలగు ప్రాంతముల నుండి భక్తులు తండోపతండాలుగా బాబాను దర్శించటానికి వచ్చేవారు. బాబా బృందావనములో 40 రోజులు పైగా ఉండేవారు. పూర్వము బాబా బృందావనములో యమునా నది ఒడ్డున ఒక పర్ణ కుటీరము 🎪 ఏర్పాటు చేసుకుని, వచ్చిన వారందరికీ తన దర్శన భాగ్యమును ప్రసాదించే వారు.


వేల సంఖ్యలో భక్తులు 'క్యూ'లలో 🚶🏻‍♀️🚶🏻‍♂️🚶🏻‍♀️నిలుచుండెడి వారు. బృందావనంలో బాబా ఉన్న _*"మంచె"*_ ⛩️ వరకు ఒక దారి ఉండేది. దారి పొడుగునా నిలుచున్న భక్తులను చూచి _"వీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఏదైనా వింత చూడటానికా ?"_ అని తెలియనివారు ప్రశ్నిస్తుంటే _*"ఈ జనం దేవరాహా బాబాను దర్శించటానికై బారులు తీరి ఉన్నారని"*_ తెలుసుకుని వాళ్ళు 🤔ఆశ్చర్యచకితులయ్యేవారు.


బాబా _*"ద్వాపర 🦚 యుగం"*_ నాటి వాడని భక్తుల విశ్వాసం. కొంతమంది ఆయనకు 400 ఏళ్లు అని, మరి కొందరు 800 ఏండ్లని, 1000 సంవత్సరములు అని అంటే... 'నవభారత్ టైమ్స్' అనే పత్రిక బాబాకు 2100 సంవత్సరములు అని చెబితే, ఎన్నో వార్తాపత్రికలు *ఆయన వయస్సు 5000 సంవత్సరముల పైనే ఉంటాయని వ్రాసాయి.*

🌹 _*( కల్పాంతర యోగి )*_🌹🙏


*అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త*

🌷🦚🌷🦚🌷🦚🌷🦚🌷🦚🌷