7, ఫిబ్రవరి 2024, బుధవారం

Panchang


 

పిత్తాశయం ( గాల్ బ్లాడర్ ) లొని రాళ్ళని కరిగించు

 పిత్తాశయం ( గాల్ బ్లాడర్ ) లొని రాళ్ళని కరిగించు గొప్ప ఔషధం - 


    మంచి గులాబి పువ్వులతో చేసిన గులాబి అత్తరు 5 నుంచి 6 చుక్కల రసం బత్తాయి రసంతో తీసుకున్న మండలం ( 40 రోజుల్లో ) పిత్తాశయంలో రాయి ముక్కలు అయ్యి బయటపడును.


      ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.


 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

మల్లెబోయిన సుబ్బమ్మ

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*మల్లెబోయిన సుబ్బమ్మ..*


"స్వామికి బియ్యం తీసుకొచ్చాను..వండి నలుగురికీ పెట్టండి.." అంటూ ఒక ఇరవై ఐదు కేజీల బియ్యపు మూటను పక్కన పెట్టించింది..వయసులో బాగా పెద్దావిడ..మల్లెబోయిన సుబ్బమ్మ అని ఆవిడ పేరు.. ప్రస్తుతం లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిపాలెం లో ఉంటున్నది..


ఎన్నో ఏళ్ల నుంచీ ఆవిడ శ్రీ స్వామివారి మందిరానికి వస్తున్నది..వచ్చినప్పుడల్లా తన శక్తి మేరకు బియ్యం లేదా ఇతర వెచ్చాలు కానీ తీసుకొచ్చి అన్నదానానికి ఇవ్వడం జరుగుతున్నది..ఒక సాధారణ భక్తురాలిగానే అనుకుంటూ వున్నాము..కానీ మొన్న ఆదివారం నాడు వచ్చినప్పుడు మాత్రం..నా దగ్గరకు వచ్చి.."అయ్యా..స్వామిని రెండు మూడు నెలల కొకసారన్నా చూడకపోతే వుండలేనయ్యా..నా చిన్నతనం నుంచే ఈ స్వామి తెలుసు..అసలు మా పుట్టిల్లు ఎర్రబల్లె గ్రామమే.. స్వామి వారి ఊరే..నా చిన్నప్పుడు అంటే నాలుగైదేళ్ల వయసులో స్వామివారితో కలిసి ఆడుకునేదాన్ని..ఆయనది నాదీ ఇంచుమించు ఒకే వయసు..మేము యాదవులము.. స్వామి వాళ్ళ ఇంటికి దగ్గరలోనే మా ఇల్లు కూడా ఉండేది.." అన్నది..


శ్రీ స్వామివారి బాల్యం గురించి తనకు తెలిసినంతవరకూ చెప్పింది..అలా చెప్పుకుంటూ మధ్యలో.."స్వామివారు మాలకొండ నుంచి ఇక్కడకు వచ్చి ఈ ఆశ్రమం కట్టించుకునే రోజుల్లో..నేనూ మా నాన్నా ఇటు వైపుగా వెళుతున్నాము..మమ్మల్ని చూసి దగ్గరకు రమ్మనమని పిలిచారు..మా నాన్నతో.."బాగున్నావా కొండయ్యా..." అని ఆప్యాయంగా పలకరించి..నా వైపు చూసి, మా నాన్నతో.."అమ్మాయికి పెళ్లి చేసావా?.." అని అడిగారు..మా నాన్న "చేసాను స్వామీ..పెళ్లి చేసి కూడా దాదాపు ఆరేళ్ళు అవుతున్నది..ఇంకా పిల్లలు పుట్టలేదు.." అని చెప్పాడు..శ్రీ స్వామివారు కొద్దిసేపు గంభీరంగా వున్నారు..తరువాత "కొండయ్యా..ఈ అమ్మాయికి పెళ్లి చేసావు..నీ బాధ్యత తీరింది..కానీ ఈ పిల్లకు సంతాన యోగం లేదు..పిల్లలు పుట్టరు.." అని ఖచ్చితంగా చెప్పారయ్యా..ఆ మాటే నిజం అయింది..నాకు సంతానం లేదు..కానీ..మొదటినుంచీ ఆ స్వామిని పూర్తిగా నమ్ముకొని వున్నాను..మాట చెప్పాడంటే అది జరిగితీరేది..ఆశ్రమం కట్టుకున్న తరువాత..నాలుగైదు సార్లు మా ఊరు వెళుతూ స్వామి వారిని కలిశాను..మౌనంగా వున్నప్పుడు చేయెత్తి ఆశీర్వదించేవాడు..స్వామి సమాధి చెందిన తరువాత ప్రతియేటా మూడు నాలుగు సార్లు ఇక్కడకు వచ్చిపోతున్నాను.."


"పాతికేళ్ల కిందట నాకు జబ్బు చేసింది..ఎంతకూ తగ్గలేదు..మొగలిచెర్ల కు తీసుకెళ్లి స్వామి వారి మందిరం వద్ద పడుకోబెట్టండి..తగ్గిపోతుంది అని నేను మా వాళ్లకు చెప్పాను..సరే అని ఇక్కడకు తీసుకొచ్చారు..ఇక్కడకు వచ్చేసరికి నాకు స్పృహ తప్పి పోయింది..నేను చచ్చిపోయానని అనుకున్నారు..ఈ మంటపం లోపలికి కూడా తీసుకురావొద్దని పూజారులు చెప్పారు..మా వాళ్ళు కూడా నేను చచ్చిపోయానని నమ్మారు..అదిగో ఉత్తరంగా ఆ చివర ఖాళీ స్థలంలో పడుకోబెట్టారు.. అయ్యా..నువ్వు నమ్ము నమ్మకపో..ఆ సమయం లో నా శరీరం పై నుంచి..ఈ స్వామి రెండు అంగల్లో అటునుంచి ఇటు..ఇటునుంచి అటు దాటి నట్టు భ్రమ కలిగింది..వెంటనే స్పృహ వచ్చింది..మా వాళ్ళు ఏడుస్తూ వున్నారు..నేను లేచి కూర్చున్నాను..అందరూ ఆశ్చర్యపోయారు..స్వామి దయవల్ల చచ్చిపోయిన దాన్ని బ్రతికాను..ఎప్పుడు కష్టం వచ్చినా ఆ స్వామిని తలుచుకుంటే..వెంటనే గట్టున పడేస్తున్నాడు..సాక్షాత్తూ నా ముందే వుంటాడయ్యా.." అని కళ్ళకు నీళ్లు పెట్టుకుంటూ చెప్పుకొచ్చింది..


ఎన్నో ఏళ్ల నుంచి సుబ్బమ్మ శ్రీ స్వామివారి మందిరానికి వస్తూ పోతూ వుంటే చూస్తూనే వున్నాము కానీ..ఆవిడ శ్రీ స్వామివారి సమకాలీనురాలని మాకు తెలియదు..ఎన్నడూ ఆ మాట ఆమె చెప్పుకోలేదు కూడా..తన చిన్నతనం నుండే శ్రీ స్వామివారిని మనసారా నమ్మిన సుబ్బమ్మ గారు ఇప్పటికీ ఆ నమ్మకం తోనే జీవిస్తున్నారు..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

ఖరీదైన వైద్యం*

 *ఖరీదైన వైద్యం* 


రచన : డి. వి. ఎస్. రావు 


రామాపురంలో జగన్నాధశాస్త్రి అనే వైద్యుడు ఉండేవాడు. ఆయన వైద్యం చేస్తే తగ్గని రోగమంటూ లేదు. కాని ఆయన ఆ వూరిలో వున్న ఇతర వైద్యులందరి కంటె ఎక్కువ డబ్బు తీసుకొనేవాడు. ఎంత ప్రాణం మీదకు వచ్చిన రోగమైనా ఆయన వైద్యం వల్ల తగ్గేది. కొందరు రోగులు డబ్బు తక్కువ పుచ్చుకుంటారని ఇతర వైద్యుల వద్దకు వెళ్ళినా ఆ రోగం తగ్గక ముదిరితే శాస్త్రి గారి వద్దకు రాక తప్పేదికాదు.


జగన్నాధశాస్త్రి ధనవంతుల వద్ద విపరీతంగా డబ్బు గుంజేవాడు. ఆయన బీదవారి వద్ద, సామాన్యుల వద్ద కొంత తక్కువ తీసుకున్నా అది ఇతర వైద్యులు తీసుకునే దానికంటే ఎక్కువగానే ఉండేది. ప్రజలు ఆయన్ని ధనాశాపరు డని, కక్కుర్తి మనిషని తిట్టుకునేవారు. కాని వైద్యానికి మళ్ళీ ఆయన వద్దకే వెళ్ళేవారు.


శాస్త్రిగారికి కృష్ణశాస్త్రి, రామశాస్త్రి అని ఇద్దరు కొడుకులు. వారిద్దరూ తండ్రి వద్దనే వైద్య విద్య నేర్చుకొంటుండేవారు.


శాస్త్రిగారికి తాతలనాటి ఆస్తి అయిదెక రాల పంట పొలం. రెండెకరాల కొబ్బరి తోట. ఒక ఇల్లు వున్నాయి. ఆయన ఒక ఎకరం భూమి కొని దానిలో వైద్యానికి కావలసిన మూలికలకై చెట్లు, మొక్కలు, తీగలు పెంచారు.


శాస్త్రిగారికి పాతికేళ్ళ ప్రాయంలో వివాహమయింది.అప్పటి నుండీ వైద్య వృత్తి చేపట్టి విపరీతంగా డబ్బు సంపాదించాడాయన. కానీ ఆయన సంసారం పొదుపుగానే చేస్తుండేవాడు. గడించిన డబ్బేమయ్యేదో ఎక్కడ దాస్తున్నాడో ఎవరికీ తెలినేది కాదు.


ఒక రోజు శాస్త్రిగారు రోగుల నుండి వసూలైన డబ్బు పుచ్చుకుని తన పడక గదిలోకి వచ్చాడు.


ఇంతలో .. ఎవరో “శాస్త్రిగారున్నారా?” అంటూ రావడంతో అక్కడే వున్న బల్లపై ఆ డబ్బు వుంచి బయటికి వెళ్ళాడాయన. 


శాస్త్రిగారి భార్య మీనాక్షమ్మ ఏదో పని మీద శాస్త్రిగారి పడకగదిలోకి వచ్చింది. బల్లపై వున్న డబ్బు కనిపించగానే, ఆమె ఆతృతతో లెక్కపెట్టి చూసింది. దగ్గర దగ్గర వెయ్యి రూపాయలున్నాయి. ఆమెకు ముందు రోజు బట్టల వ్యాపారి వద్ద చూసిన చీర జ్ఞాపకం వచ్చింది. ఆ చీర కొనుక్కోవాలని పుబలాటపడి ఒక యాభై రూపాయలు తీసుకుంది. అంతగా భర్త అడిగితే చెప్పవచ్చు అనుకుంది.


జగన్నాధశాస్త్రి వచ్చి, డబ్బు దొంతర పెట్టి ఉండడం చూసి, కోపంతో భార్యను పిలిచాడు. ఆమె వచ్చింది.


“నీ బాబు సొమ్మనుకున్నావా ?” అంటూ ఆమె చంపపై కొట్టాడు. ఆమె కళ్ళు నీళ్ళు తిరగగా తీసుకున్న ఆ డబ్బు అక్కడ పెట్టి వెళ్ళిపోయింది.


మరొకసారి శాస్త్రిగారి పెద్దకొడుకు కృష్ణ శాస్త్రి ఒక బీదవానికి ఉచితంగా వైద్యం చేసి, మందులిచ్చి పంపాడు.


అది చూసిన జగన్నాధశాస్త్రి కొడుకు పై మండిపడ్డాడు. అతడు సిగ్గుపడి పోయాడు.


కొంత కాలం గడిచింది. జగన్నాధ శాస్త్రికి వృద్ధాప్యం వల్ల అలసట పెరిగింది. దాని తో ఆయన తన వైద్యాన్ని కుమారులకు అప్పగించి, డబ్బు మాత్రం తనే వసూలు చేయడం మొదలుపెట్టాడు. రోగులను చూడడం, మందులివ్వడం వరకే కొడుకుల పని. ఇలా వుండగా మరికొంత 

కాలానికి శాస్త్రిగారు మంచం పట్టారు.  అయినా ఆయన లెక్క ప్రకారమే కొడుకులు డబ్బు వసూలు చేయవలసి వచ్చేది.


ఒకరోజు శాస్త్రిగారు కొడుకులిద్దరినీ పిలిచి తనకు వయస్సు అయిపోయిం దనీ, తన తదనంతరం ధనాన్ని ఏ విధంగా భాగాలు చేసుకోవాలి, ధన మంతా ఎక్కడ వున్నదీ తెలియజేసే

విల్లు వ్రాసి వుంచాననీ, దానికి ఒక నకలు ధర్మాధికారి వద్ద వుందని, విల్లు తన దిండు క్రింద వుందనీ తెలియచేశాడు. ఆ మరునాడు తెల తెలవారుతుండగా శాస్త్రిగారు మరణించారు.


శాస్త్రిగారి కొడుకులు తండ్రి వ్రాసిన విల్లు ను తీసి దాచి, ఆయన కాయానికి దహన సంస్కారాలు ముగించారు. కార్యక్రమాలు ముగిశాక ధర్మాధికారి విల్లు నకలుతో వారి ఇంటికి వచ్చాడు. 


శాస్త్రిగారు వ్రాసిన విల్లు ఆ రోజు ధర్మాధికారి చదువుతున్నాడని తెలిసి ఊరిలో జనమంతా శాస్త్రిగారి ఇంటి అరుగులపై ప్రోగుపడ్డారు. ఆయన

సంపాదించిన డబ్బు ఎంతుందో, ఏక్కడ దాచాడో, ఏమి చేయదలచుకున్నాడో తెలుసుకోవాలని ప్రజలకు వుబలాటంగా వుంది. ఆ డబ్బంతా అన్యాయంగా తమ వద్ద గుంజిందేనని ప్రజలు ఆయన్ను తిట్టుకోసాగారు.


ధర్మాధికారి విల్లు నకలు తీసి ఇలా చదవడం మొదలు పెట్టాడు:


“నేను వైద్యం వల్ల ఎంతో ధనాన్ని గడించాను. అదంతా నా పడక గది క్రిందనున్న నేలమాళిగలో వుంది. ఆ నేలమాళిగకు ప్రవేశం గదిలో గోడ వారనున్న భోషాణం క్రిందగల నాపరాయి తీయాలి. భోషాణంలో కొన్ని దస్తర్ల కాగితాలున్నాయి. నేను సంపాదించిన ఆ ధనంలో నా సొంతానికి ఒక్క పైసా కూడా వెచ్చించుకోలేదు. ఆది నా సొమ్ము కాదు. అది ప్రజలది. నా వద్ద వైద్యం చేయించు కున్న సామాన్య బీద ప్రజల పేర్ల జాబితా వివరాలతో సహా ఆ భోషాణపు పెట్టెలో వున్నవి. 


ఆ పేర్లు చదివి వారివారి సొమ్మును ఇచ్చి వేయాలి. వైద్యం ఉచితంగా చేస్తే ప్రజలకు దాని మీద గౌరవం, విలువ ఏర్పడదు. అంతేకాక ఆ విధంగా మిగిలిన డబ్బును వారు దాచుకోక వృధా చేస్తారు. అందుకై వారి తరఫున నేను ఆ సొమ్మును దాచాను. ఆ డబ్బు తిరిగి ఇవ్వడం వల్ల వారిప్పుడు సొంత ఇళ్ళు కట్టుకొనడానికి అవకాశం కలుగుతుంది. ఇక మిగిలిన సొమ్ముతో ఉచిత వైద్యాలయాన్ని నిర్మించి నా కొడుకులు వైద్యులుగా ప్రజాసేవ చేయగలరని ఆశిస్తున్నాను. తాతలనాటి ఆస్తి వారి జీవితానికి చాలు. ఊరిలోని ఇతర వైద్యులను వైద్యాల యంలో జీతాల పై ఏర్పాటు చేయవలసిందిగా నా మనవి.


నేను ఉచిత వైద్యాలయాన్ని నిర్మించి ప్రజాసేవ చేయాలని వైద్య వృత్తి చేపట్టినప్పుడు భావించాను. దానికై వూరిలోని ధనవంతులను సహకరించ వలసిందిగా కోరాను కానీ వారు సహకరించలేదు, ప్రజలలో కూడా వైద్యాలయం పై ఒక గౌరవభావం లేదు. అందుకై రోగుల నుండి డబ్బు వసూలు చేస్తూ వచ్చాను. ఇప్పటికై నా వైద్యం అన్నది ప్రజా జీవితంలో ఒక భాగంగా అందరూ గుర్తించి ఉంటారనుకొంటాను.


ఏ వూరిలో దేవాలయం, విద్యాలయం, వైద్యాలయం, గ్రంథాలయం వుంటాయో ఆ వూరి ప్రజలు అభివృద్ధి చెందుతారు. మానసిక పరివర్తనకు దేవాలయం. జ్ఞానార్జనకు విద్యాలయాలు, గ్రంథాల యాలు, శారీరక ఆరోగ్య పరిరక్షణకు వైద్యాలయం ఎంతో అవసరం. నా సహోదరులైన నా గ్రామ ప్రజలు నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. నమస్తే!”


విల్లు చదివిన ధర్మాధికారికి కళ్ళ నీళ్ళు కారాయి. ప్రజలు శాస్త్రిగారిని తప్పుగా భావించినందుకు ఎంతో బాధపడ్డారు. ఆయన గుణగణాలను, హస్త వాసిని పొగుడుతూ అందరూ ఇళ్ళకు వెళ్ళిపోయారు.


జగన్నాధశాస్త్రిగారి పేరుపై ఒక ఉచిత 

వైద్యాలయం ఏర్పడి ప్రజాసేవ చేయడం మొదలుపెట్టింది.


🙏

*శుభం*

పుణ్యం వెల*



                 *పుణ్యం వెల*

                 ➖➖➖✍️


*కాశీ పట్టణంలో ధనవంతుడు అయిన ఒక బ్రాహ్మణుడు వుండేవాడు.*


*అతను ప్రతీ రోజు దాన ధర్మాలు చేసేవాడు. దానికి తోడు మిక్కిలి దైవ భక్తి కలవాడు మరియు యజ్ఞ యాగాదులు కూడ చేసేవాడు.*


 *ఒక యాగంలో అన్నీ దానం చేయటంతో కుటుంబ పోషణకు అతడి వద్ద డబ్బులు లేకుండా పోయాయి.*


 *పక్క ఊరిలో ఒక పెద్ద సేఠ్ నివసిస్తున్నాడని అతడు ఇతరుల పుణ్యంను కొని ధనం ఇస్తాడని బ్రాహ్మణుడి భార్య అతనికి చెప్పి వారి వద్దకు వెళ్లి మీ పుణ్యాలు అమ్మి కొంత డబ్బు తీసుకురండి, తద్వారా వ్యాపారం మళ్లీ ప్రారంభం చేయవచ్చును అని సలహా ఇస్తుంది.*


*బ్రాహ్మణుడు మాత్రం తను చేసిన పుణ్యం అమ్మడానికి ఇష్టపడలేదు, కానీ భార్య ఒత్తిడి మరియు పిల్లల బాధల కారణంగా అతను పుణ్యం అమ్మడానికి సిద్ధపడక తప్పలేదు.*


*దారిలో తినడానికి భార్య ఇచ్చిన నాలుగు రొట్టెలు తీసుకొని ప్రయాణం అవుతాడు.*


*అతను నడుచుకుంటూ అడవిలో నుండి పోయేవేళ ఆకలి కావటంతో ఊరికి చేరేలోపు భోజనం ముగించాలి అనుకుని రొట్టె తీయగానే ఒక కుక్క వచ్చి తన మూడు కుక్కపిల్లలతో ఎదుట నిలబడుతుంది. పిల్లలు చాలా చిన్నవి కావడంతో వాటిని వదిలి ఊరులోకి వెళ్లలేకపోయింది.*

 

*బ్రాహ్మణునికి బాధగా అనిపించి అతను కుక్క పై కుక్కపిల్లల కోసం జాలిపడి, తన దగ్గర ఉన్న రొట్టెల నుండి ఒక రొట్టెను కుక్కకు ఇస్తాడు.*


*కుక్క చాలా రోజులుగా ఆకలితో ఉండటంతో, కుక్క త్వరగా రొట్టె తినేసింది, కానీ ఇంకా ఆకలితో ఉండటంతో బ్రాహ్మణుడి వైపు చూపసాగింది.*


*బ్రాహ్మణుడు జాలిపడి రెండవది, తరువాత మూడవది, చివరి నాల్గవది అలా మొత్తం రొట్టెలు కుక్కకు వేసి తను మాత్రం కేవలం నీరు త్రాగి సేఠ్ వున్న వూరికి చేరుకొంటాడు.*


 *బ్రాహ్మణుడు సేఠ్‌తో తన పుణ్యాన్ని అమ్ముకోవడానికి వచ్చానని చెప్పుతాడు.*

 

*అప్పుడు సేఠ్ ‘నేను చాలా బిజీగా ఉన్నాను, సాయంత్రం రండి, నేను కొంటాను!’ అని అంటాడు.*


*మధ్యాహ్నం సేఠ్ తన ఇంటికి భోజనానికి వెళ్లి ‘తన పుణ్యాన్ని విక్రయించడానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడని భార్యతో చెప్పుతాడు. అతని దగ్గర నేను ఏ పుణ్యం కొనాలి చెప్పు!’ అని సలహా అడుగుతాడు.*


*సేఠ్ భార్య చాలా మంచి పతివ్రత స్త్రీ. ఈరోజు బ్రాహ్మణుడు రొట్టెలన్నీ కుక్కకు ఇచ్చి చాలా పుణ్యం సంపాదించుకున్నాడని కండ్లు మూసుకొని ధ్యానం చేసి తెలుసుకొంటుంది.*


*కుక్కలకు రొట్టెలు వేసి సంపాదించిన పుణ్యాన్ని బ్రాహ్మణుడి నుండి కొనమని తన భర్తకు చెబుతుంది.*


*సాయంత్రం బ్రాహ్మణుడు తన పుణ్యాన్ని విక్రయించడానికి వచ్చినపుడు సేఠ్ ఇలా అంటాడు…*

 *’ఈరోజు నువ్వు చేసిన యజ్ఞం యొక్క పుణ్యాన్ని నేను కొనాలని అనుకొంటున్నాను.*


*బ్రాహ్మణుడు నవ్వి ఇలా అంటాడు… ’నా దగ్గర యజ్ఞానికి సరిపడ ధనం ఉంటే నీకు పుణ్యం అమ్మడానికి వచ్చేవాడినా?’ అని.*


*’ఈరోజు ఆకలితో ఉన్న కుక్కకు ఆహారం పెట్టి ఆ కుక్కను, దాని పిల్లలను నువ్వు రక్షించావు. అదే యజ్ఞం!’ అని సేఠ్ అంటాడు.*


*’నువ్వు సంపాదించిన ఆ పుణ్యాలన్నీ నేను కొనాలని అనుకొంటున్నాను!’ అని అంటాడు.*


 *బ్రాహ్మణుడు పుణ్యం అమ్మడానికి అంగీకరిస్తాడు.*


*దానికి బదులుగా నీకు నాలుగు రొట్టెల బరువుకు సమానంగా వజ్రాలు, ముత్యాలు ఇస్తానని సేఠ్ అనటం దానికి బ్రాహ్మణుడు కూడ అంగీకరించడం జరిగిపోతాయి.*


*నాలుగు రొట్టెలు తయారు చేసి త్రాసులో కాటాకు ఒక ప్రక్కన ఉంచబడతాయి.*

  

*రెండవ దానిలో, సేఠ్ ఒక సంచీ నిండా వజ్రాలు, ముత్యాలు మరియు ఆభరణాలు ఉంచుతాడు.*


*త్రాసు యొక్క కాటా కొంచెం కూడ కదలదు.*


*రెండవ సంచీ ఉంచినాకూడా కాటా కొంచెంకూడ కదలక పోయేసరికి సేఠ్ తన దగ్గర వున్న ఆభరణాలు అన్నీ రెండో దిక్కున వుంచినా కూడ కాటా అసలుకే కదలదు.* 


*అది చూసిన తర్వాత అక్కడ వున్న వారందరు ఆశ్చర్య పోతారు.*

 

*అప్పుడు బ్రాహ్మణుడు సేఠ్‌తో, "నేను నా మనసు మార్చుకున్నాను. ఇప్పుడు నా పుణ్యాన్ని నీకు అమ్మడం ఇష్టం లేదు!” అని రిక్త హస్తాలతో తన ఇంటికి ప్రయాణం అవుతాడు.*


*ఇంట్లోకి అడుగు పెట్టగానే భార్య తనతో గొడవ పడుతుందేమోనని భయపడి, దారిలో కుక్కకి రొట్టెలు ఇచ్చిన చోటు నుంచి కొన్ని గులకరాళ్లు, రాళ్లను ఏరుకుని దానితో ఒక మూటనూ తయారు చేసి ముడి వేస్తాడు.*


*ఇంటికి చేరుకోగానే అతని భార్య పుణ్యాన్ని అమ్మి ఎంత సంపాదించావు అని అడగటం తో ఆ రాళ్ల మూటను భార్యకు ఇచ్చి అప్పు దొరుకుతుందేమోనని గ్రామం లోకి వెళ్ళుతాడు.*


*ఇక్కడ అతని భార్య ఆ మూటను చూసి ఆగలేక, భర్త వెళ్లగానే ఆ మూట తెరిచి చూస్తుంది. ఆ మూట నిండా వజ్రాలు, నగలు ఉండటంతో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోతాయి.*


*బ్రాహ్మణుడు ఇంటికి తిరిగి రాగానే అతని భార్య మీ పుణ్యానికి ఇంత మంచి ధర ఎవరు చెల్లించారని అడుగుతుంది. మీకు ఇన్ని వజ్రాలు మరియు ఆభరణాలు ఎక్కడ నుండి వచ్చాయి? అంటుంది.*


*”వజ్రాలు, నగలా ? ఎక్కడ ఉన్నాయో చూపించు!” అని అంటాడు బ్రాహ్మణుడు.*

 

*భార్య తన ముందు ఉన్న మూటను విప్పగానే అందులోంచి విలువైన ఆభరణాలు బయట పడటంతో బ్రాహ్మణుడు కూడా ఆశ్చర్యపోతాడు.*


*అప్పుడు అతను తన భార్యకు జరిగిన విషయాలు అన్నీ పూస గుచ్చినటుల చెబుతాడు.*

 

*విపత్తు సమయంలో తన పుణ్యంను విక్రయించమని అతనిని బలవంతం చేసినందుకు అతని భార్య చాలా బాధపడుతుంది.*

 

*ఇదీ కథ…!*

*నిజానికి ఇది కథ కాదు. జీవితం! ఈ కలిలో, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి. ఆపదలో ఉన్న వారికి సాయం చెయ్యండి. మీకు ఎంత డబ్బున్నా ఇహలోక ప్రయాణానికే. మీ డబ్బును ఎవరైనా దొంగిలించవచ్చు. కానీ, మీ పుణ్యాన్ని ఎవరూ దొంగిలించలేరు.*


*అందుకే, మీ దగ్గర ఉన్న డబ్బును పుణ్యంగా మార్చుకోండి.* 


*పరలోక ప్రయాణానికి పుణ్యం తోనే టిక్కెట్టు కొనుక్కోండి .*


 *దేవుడు మనల్ని పరీక్షిస్తాడు! మనం ఆ పరీక్షలో ఉత్తీర్ణులైతే, మనల్ని శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు!*


*అందుకే ఎంతటి సంక్షోభం వచ్చినా భగవంతునిపై విశ్వాసం వమ్ముకాకూడదు.*✍️

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం...

*“భగవంతుని విషయాలు గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...944065 2774.

లింక్ పంపుతాము.🙏

తెలుగు వైభవం*

 *ఈనాడు తెలుగు వైభవం*


*ఆహా ఏమి నా తెలుగు వెలుగు వైభవం*


*నా తెలుగు వెలిగిపోతోంది...*

*👉ఉదయం లేచి పలకరించుకునే గుడ్ మార్నింగ్ లో రాత్రి పడుకునే ముందు చెప్పుకొనే గుడ్ నైట్ లో!!*


*నా తెలుగు వెలిగిపోతోంది...*

*🙏అమ్మలోని కమ్మదనం అడుగంటి మమ్మీగా అవతరించడంలో నాన్నారూ కాస్తా డాడీగా మురిగిపోయిన ఆవకాయ జాడీగా మారిపోవడంలో*


*నా తెలుగు వెలిగిపోతోంది...*

*👉పెద్దమ్మ , పిన్నమ్మ , పెద్దత్త ,  చిన్నత్త అందరినీ కలగలిపి ఆంటీగా పిలవడంలో పెద్దనాన్న, చిన్నాన్న, పెద్దమామ ,చిన్న మామ అందరినీ గానుగలో వేసి అంకుల్ గా పిండడంలో!!*


*నా తెలుగు వెలిగిపోతోంది...*

*👉బామ్మ ,తాతయ్యలను కూడా బతకనివ్వక గ్రాండ్ మా , గ్రాండ్ ఫా లు చేయడంలో "ఒరేయ్ తమ్ముడూ" లోని ఆప్యాయత ఆవిరై "ఏ బ్రో" గా వికృతరూపం దాల్చడంలో!!*


*నా తెలుగు వెలిగిపోతోంది...*

*👉అ అమ్మ ,ఆ ఆవు ,ఇ ఇల్లు ఈ ఈశ్వరుడు పోయి ఎ యాపిల్ ,బి బోయ్ అని నేర్పడంలో చేతవెన్నముద్ద , చెంగల్వపూదండ పోయి పుస్సీక్యాట్ , బ్లాక్ షీప్ లతో పిల్లలు పాడుకోవడంలో!!*


*నా తెలుగు వెలిగిపోతోంది...*

*👉చీర, ముడుచుకొని బీరువా అడుక్కిపోయి లెగ్గింగ్ లు అందాలను ఆరబోయడంలో వాలుజడల జడగంటలు మూగబోయి చింపిరి జుత్తుల దెయ్యాల దేవిరింపులో!!*


*నా తెలుగు వెలిగిపోతోంది...*

*👉చల్లని తెల్లని పెరుగన్నం లోఆవకాయ పోయి కొవ్వు పెంచే బర్గర్లు పిజ్జాలు తినడంలో పద్యాలు వినిపించే పంక్తి భోజనంపోయి పళ్ళాలతో పంక్తిలో ఎగబడడంలో!!*


*నా తెలుగు వెలిగిపోతోంది...*

*👉సెలవు చీటి కూడా వ్రాయడం చేతగాని విద్యార్ధికి తెలుగు లో నూటికి నూరు మార్కులు రావడంలో పద్యం పాతచింతకాయ పచ్చడైపోయి రైమ్స్ చిన్నారుల నాలుక మీద నర్తించడంలో!!*


*నా తెలుగు వెలిగిపోతోంది...*

*👉పుట్టినరోజు గుడిలో దీపాలు వెలిగించడం పోయి కేకులపై క్యాండిల్స్ ను నోటితో ఆర్పడంలో "నూరేళ్ళు చల్లగా జీవించు" దీవెన పోయి "హ్యాపీ బర్తడే టు యు"అని చేపట్టిఊపడంలో!!!*


*నా తెలుగు వెలిగిపోతోంది...*

*👉మూడు వందల యేళ్ళ ఆంగ్లేయుల బానిసత్వ పరిపాలనలో...!!*

*దేశభాషలందుతెలుగులెస్స*


*🙏 సర్వేజనా సుఖినోభవంతు 🙏*

🌹🌻🌹 🌻🌹🌻 🌹🌻🌹

పంచాంగం 06.02.2024

 ఈ రోజు పంచాంగం 06.02.2024 Tuesday,

 

స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: ఉత్తరాయణం హేమన్త ఋతు పుష్య మాస కృష్ణ పక్ష: ఏకాదశి తిధి భౌమ వాసర: జ్యేష్ఠ తదుపరి మూల నక్షత్రం వ్యాఘాత తదుపరి హర్షణ యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


ఏకాదశి సాయంత్రం 04:00 వరకు.

జ్యేష్ఠ ఉదయం 07:32 వరకు తదుపరి మూల రా.తె 06:26 వరకు.

సూర్యోదయం : 06:50

సూర్యాస్తమయం : 06:10


వర్జ్యం : ఈ రోజు వర్జ్యం లేదు. రేపు తెల్లవారుఝామున 04:54 నుండి 06:25 వరకు.


దుర్ముహూర్తం : పగలు 09:06 నుండి 09:51 వరకు తిరిగి రాత్రి 11:14 నుండి 12:05 వరకు.


అమృత ఘడియలు : రాత్రి 12:19 నుండి 01:51 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.


యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

*భ భా భి భీ భు భూ....

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*భ భా భి భీ భు భూ....?*

                  ➖➖➖✍️


*ధారానగరంలో ‘భుక్కుండుడు’ అనే ఓగజదొంగ వుండే వాడు. నగరంలో దొంగతనాలు చేసి చేసి వేరే రాజ్యానికి వెళ్లి పోయి మరీ సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి మరీ దొంగతనాలు చేసేవాడు.* 


*కానీ వాడు ధనవంతుల ఇళ్ళలోనే దొంగతనం చేసే వాడు. ఆ సొమ్ములో చాలా భాగం బీదలకు పంచే వాడు. పైగా అంతో ఇంతో సంస్కృత పాండిత్యం వున్నవాడు కూడా. * 


*రాజ సైనికులు ఎంత ప్రయత్నించినా అతనిని పట్టుకొనలేకపోయే వారు. *


*ఒకసారి ఒకరింటికి కన్నం వేస్తూ దొరికి పోయాడు. భటులు వాడిని రాజ సభ లో ప్రవేశ పెట్టినారు., ఎన్నో సంవత్సరాలుగా దొంగతనాలు చేసిన భుక్కుండుడికి మరణ శిక్ష విధించాలి అని మంత్రి, యితర సభ్యులు రాజును కోరారు. తనకు రాజు మరణ శిక్ష వేస్తాడేమో నని వాడికి భయం వేసింది. యుక్తిగా ఈ శ్లోకం చెప్పాడు…*


*"భట్టిర్నష్టః, భారవి శ్చాపి నష్టః*

*భిక్షుర్నష్టః భీమసేనోపి నష్టః*

*భుక్కుండో హం భూపతిః త్వం రాజన్*

*భబ్భావళ్యామ్ అంతకః సం నివిష్టః*

 

అర్థము:-- *రాజా! నన్ను శిక్షించండి. కానీ నాకు ఒక్కటే భయం. మీరు గమనించారో లేదో భట్టి చనిపోయాడు, భారవి కవి కీర్తి శేషుడయ్యాడు, ఆ వెనకే భిక్షుకవి కూడా మరణించాడు, ఇటీవలే భీమకవి కూడా కాల ధర్మం చెందాడు, మరి నేను భుక్కుండుడిని. ఈ యమధర్మ రాజు 'భ' గుణింతాన్నే పట్టుకొని భట్టినీ, భారవిని, భిక్షు కవినీ, భీమ కవినీ తీసుకెళ్ళి పోయాడు. తర్వాత వాడిని నేను భుక్కుండుడిని. నన్ను తీసుకొని పొతే భ భా భి భీ భు తర్వాత భూపతివి నీవు, నీ పేరులో కూడా 'భ' కారం వుంది నా తర్వాత నీ వంతే నేమోనని, యింత మంచి రాజు మరణిస్తే ప్రజలకు గతి ఏమి? అని నేను భయ పడుతున్నాను. (పైన చెప్పిన కవులంతా భోజుడి ఆస్థానం లోని కవులే) అన్నాడు.*


*రాజ దండన పొందబోతూ కూడా ఇలా చమత్కారంగా శ్లోకం చెప్పడం రాజుకు నచ్చింది, నవ్వు వచ్చింది.* 


*నవ్వు ఆపుకుంటూ “సరే! భుక్కుండా ఈ సారికి నిన్ను వదిలేస్తున్నాను. అని వాడికి కావలిసి నంత ధనం యిచ్చి యిక ముందు దొంగతనాలు చేయ కుండా మంచిగా బ్రతుకు!” అని మందలించి వదిలేశాడు.*


*(భబ్భావళి అంటే 'భ' గుణింతం అంతక= యమ ధర్మరాజు, సంవిష్ట: అంటే దృష్టి పెట్టిన వాడు)*   


*భలే బావుంది కదూ!*✍️

*సేకరణ:- వాట్సాప్ పోస్ట్.* 

🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*చతుర్ధ స్కంధం*


*నెలకొని ధర్మపాలన వినిర్మలు భర్గు తిరస్కరించు న*

*క్కలుషుని జిహ్వ గోయదగు గా కటుసేయగ నోపడేని తా*

*పొలియుట యొప్పు, రెంటికి ప్రభుత్వము సాలమికర్ణ రంధ్రముల్*

*బలువుగ మూసికొంచు చన పాడి యటందురు ధర్మవర్తనుల్.*


ఓయీ దక్షా! ఆ పరమేశ్వరుడు పట్టుదలతో ధర్మాన్ని కాపాడటంలో దిట్ట. అందులో రవంత మాలిన్యం కూడా అంటనివాడు. అధర్మాన్ని చీల్చిచెండాడే శీలం కలవాడు. అట్టి మహాత్ముణ్ణి కాదని కాఱుకూతలు కూసే పాపాత్ముని నాలుకను ముక్కలుముక్కలుగా కోసివేయాలి. ఆ పని చేయలేకపోతే తన్నుతాను రూపుమాపుకోవాలి. అదీ చేతకాకపోతే చెవులు రెండూ గట్టిగా మూసుకొని అక్కడనుండి దూరంగా వెళ్ళిపోవాలి. ధర్మాన్ని భద్రంగా పాటించేవాళ్ళు చేసే ఉపదేశం ఇది.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

సహనము కలవాడు

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


𝕝𝕝 *శ్లో* 𝕝𝕝  


 *ద్వావుమౌ పురుషౌ రాజన్* 

 *స్వర్గస్యోపరి తిష్ఠతః* ।

 *ప్రభుశ్చ క్షమాయా యుక్తో* 

 *దరిద్రశ్చ ప్రదానవాన్॥* 


*_-|||| విదురనీతిః ||||-_*


𝕝𝕝 తా 𝕝𝕝 *సమర్థుడై యుండియు సహనము కలవాడు, దరిద్రుడై యుండియు దానములు చేయువాడు ఈ ఇరువులు స్వర్గమునకు పై భాగమున నిలుతురు...*.

*07-02-2024 / బుధవారం / రాశి ఫలితాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

*07-02-2024 / బుధవారం / రాశి ఫలితాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━ 

మేషం


వ్యాపారాలు ఉన్నతికి చేసిన  శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వృత్తి ఉద్యోగములలో సమస్యలను తెలివితేటలతో  అధిగమిస్తారు. కొన్ని వ్యవహారాలలో  ఆత్మీయులు సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. అవసరానికి ధన సహాయం అందుతుంది.

---------------------------------------

వృషభం


 మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారాలు లాభాలబాట పడతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఉద్యోగమున మీ విలువ పెరుగుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చాలా రోజులుగా ఉన్న సమస్యలు తొలగుతాయి. 

---------------------------------------

మిధునం


వృధాప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటాబయట నూతన  సమస్యలు ఉత్పన్నమౌతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. రుణ భారం అధికమౌతుంది. వృత్తి వ్యాపారాలలో నిలకడ లోపిస్తుంది. ఉద్యోగమున  అదనపు భాధ్యతలుంటాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

---------------------------------------

కర్కాటకం


ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో స్థిరత్వం లేని ఆలోచనలు వలన నష్టాలుంటాయి. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

సింహం


సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు వింటారు.  ఉద్యోగమున  ఆశించిన పురోగతి సాధిస్తారు. సమాజంలో  గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆర్ధిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు మిత్రుల నుండి పెట్టుబడులకు ధన సహాయం అందుతుంది.

---------------------------------------

కన్య


ధన వ్యవహారాలు కలసివస్తాయి. మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున  అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి. నూతన  వాహనం కొనుగోలుకు ఆటంకాలు  తొలగుతాయి.

---------------------------------------

తుల


కుటుంబ సభ్యులతో  మాట పట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. చేపట్టిన పనులలో జాప్యం  తప్పదు. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

---------------------------------------

వృశ్చికం


వ్యాపారామున భాగస్థులతో వివాదాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు వలన  సకాలంలో పనులు పూర్తి కావు. వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి. బంధువుల నుండి ఊహించని ఒత్తిడి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి.

---------------------------------------

ధనస్సు


ఉద్యోగమున   వివాదాలు పరిష్కారమౌతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో చాలకాలంగా పూర్తి కానీ పనులు పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలలో  సమస్యలను అధిగమిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ప్రయాణాలలో నూతన  పరిచయాలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది.

---------------------------------------

మకరం


ఉద్యోగమున  స్థానచలన సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామితో  చిన్నపాటి విభేదాలు ఉంటాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తికాక చికాకులు పెరుగుతాయి.

---------------------------------------

కుంభం


ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్ధిక పురోగతి కలుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వృత్తి  ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. విందు  వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------

మీనం


కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తికావు. నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు బంధువర్గం నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. కొన్ని వ్యవహారాలలో  ఆలోచనలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది.

---------------------------------------

🍀 *శుభం భూయాత్* 🍁

సూర్యారాధన

 మాఘ మాసంలో సూర్యారాధన


తేటగీతి పద్యము 


మాఘమునరథసప్తమి, మగువలంత

వేడుకగనుజరుపుచుండు, వీధులందు

రథముముగ్గువేయుదురిక రమ్యముగను

 పాయసమువండియు పరమ భక్తితోడ

రవికి నైవేద్యమును పెట్టు రమణులంత



సాహితీ శ్రీ జయలక్ష్మి

: గౌరీశంకర లను స్తుతిస్తూ సీస పద్యం


సీ. శ్రీపార్వతీవరా ! శ్రితజన మందార !

                శ్రీకర ! సుందరా ! శ్రీగిరీశ !

     రాజరాజేశ్వరీ ! రజతాద్రి వాసిని

                పాలించు సతతంబు భవుని రాణి!

     వేద మంత్రాకార ! విశ్వ సంరక్ష కా !

                శివకామసుందరీ చిత్తచోర !

     అగ్నిలింగాకార ! అరుణాచలేశ్వరా !

                ఆర్త జనోద్ధార ! యహి విభూష !

తే. రమ్ము మముగావ పరమేశ ! రమ్యదేహ ! 

      నిన్ను నమ్మితి నిరతమ్ము నీలకంఠ !

      పార్వతీ నాథ ! శంకరా !పరమపురుష!

      శశిధరా ! యీశ ! గౌరీశ ! శరణు శరణు !


జయలక్ష్మి