ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
30, జులై 2023, ఆదివారం
భార్యలు - భిన్న స్వభావాలు
*ॐ భార్యలు - భిన్న స్వభావాలు*
*కౌసల్యామాత సీతాదేవితో*
*అసత్యశీలా వికృతా*
*దుర్గ్రాహ్యహృదయాస్సదా I*
*యువత్యః పాపసంకల్పాః*
*క్షణమాత్రాద్విరాగిణః ৷৷*
*అయోధ్య 38/22*
దుష్టాలోచనలుగల యువతులు సర్వదా కపట వచనములను పలుకుతూ ఉంటారు.
కోపతాపాది వికారములకు లోనగుతూ ఉంటారు.
వారి మనస్సులలోగల భావాలు దుర్గ్రాహ్యాలు.
వారు చిన్నచిన్న సంఘటనలకే పతులపై అలుకవహించి, వారికి దూరమవుతూ ఉంటారు.
Evil-minded young ladies are infidels.
They are of perverted nature.
They are inscrutable.
In an instant they lose their love (for their husbands).
*న కులం న కృతం విద్యాం*
*న దత్తం నాపి సంగ్రహమ్ I*
*స్త్రీణాం గృహ్ణాతి హృదయమ్*
*అనిత్యహృదయా హి తాః ৷৷*
*38/23*
అట్టి స్త్రీలకు
- భర్తయొక్క అభిజాత్యము (గొప్ప వంశమున జన్మించడం) గానీ,
- అతడు చేసిన ఉపకారాలుగానీ,
- అతనియొక్క విద్యావైభవములుగానీ,
- అతడు తెచ్చిపెట్టిన వస్త్రాభరణాదులుగానీ,
- ప్రేమతో అతడు తనను చేపట్టిన రీతిగానీ జ్ఞాపకమునకే ఉండవు.
ఎందుకంటే వారి స్వభావములు చంచలములు. వారికి పతికంటే సంపదలే ముఖ్యము.
అంతేకాదు "స్థూణానిఖనన" న్యాయమున వారు పాతవిషయమలను త్రవ్వుతూ భర్తతో ఎల్లప్పుడును గిల్లికజ్జాలాడుతూ ఉంటారు.
Neither family traditions
nor benefits received,
nor education
nor affection
nor gifts
nor even accumulated wealth attract women's hearts.
Their minds are unstable indeed.
*సాధ్వీనాం హి స్థితానాం*
*తు శీలే సత్యే శ్రుతే శమే I*
*స్త్రీణాం పవిత్రం పరమం*
*పతిరేకో విశిష్యతే ৷৷*
*38/24*
సాధ్వీమణులరీతి దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
వారు తమ వంశమర్యాదలకు తగినట్లుగా ప్రవర్తిస్తారు.
గురువుల (పెద్దల) ఉపదేశాలను అనుసరించి నడుచుకొంటారు.
శాంత స్వభావం కలిగియుంటారు.
వారికి పతియే దైవము. వారి జీవితాలు పరమ పవిత్రాలు.
But for those virtuous women whose minds are fixed in
- chastity,
- truth,
- scriptures and
- stability,
the husband occupies a distinguished place and is considered supremely holy.
*స్థూణానిఖననన్యాయము*
గుంజని పాతేటప్పుడు చాలాసార్లు నేలని తవ్వుతూ, గుంజని(స్తంభాన్ని) అటూఇటూ కదులుస్తూంటారు.
పోట్లాడే స్వభావంగలవారు తాము మాట్లాడుచున్న విషయానికి సంబంధంలేకుండా పాతవిషయాలను పదేపదే త్రవ్వుతూ ఎదుటివారిని నొప్పిస్తూంటారు.
ఎంతకీ వారు తమ మొండివాదాన్ని వీడరు. ఇది దుష్టుల లక్షణం.
దీనినే "స్థూణానిఖనన న్యాయం" అంటారు.
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
మనస్సు మాత్రం ఈశ్వరునిపైనే ఉంటుంది
QUOTE OF THE DAY
🌷Practising the Presence of God🌷
July 30
No matter which way you turn a compass, its needle points to the north. So it is with the true yogi. Immersed he may be in many activities, but his mind is always on the Lord. His heart constantly sings: “My God, my God, most lovable of all!”
🌷– Sri Sri Paramahansa Yogananda “Sayings of Paramahansa Yogananda”
నేటి సూక్తి
🌷దైవసాన్నిధ్య అభ్యాసము🌷
July 30
దిక్సూచిని ఎటుపైపు తిప్పినా, దాని ముల్లు ఉత్తరంపైపే చూపుతుంది. నిజమైన యోగి కూడ అంతే. అతడు అనేకమైన కార్యక్రమాలలో నిమగ్నుడై ఉన్నా, అతడి మనస్సు మాత్రం ఈశ్వరునిపైనే ఉంటుంది. అతని హృదయం నిరంతరం గానం చేస్తూ ఉంటుంది: ”నా దైవమా, నా దైవమా, ప్రియాతి ప్రియతమా!”
🌷– శ్రీ శ్రీ పరమహంస యోగానంద, “Sayings of Paramahansa Yogananda”
అష్టదిక్పాలకులు
అష్టదిక్పాలకులు....వారి రాజ్యాలు..
1. తూర్పు- ఇంద్రుడు- పాలించే పట్టణం: అమరావతి..
2. ఆగ్నేయం - అగ్నిహోత్రుడు - తేజోవతి..
3. దక్షిణం - యమ ధర్మరాజు- సంయమని.
4. నైరుతి - నిరుతి - కృష్ణాంగన..
5. పడమర -వరుణుడు - శ్రద్ధావతి...
6.వాయువ్యము - వాయువు - గంధవతి.
7.ఉత్తరము - కుబేరుడు - అలకాపురి..
8. ఈశాన్యము - శివుడు - కైలాసము...
పిడకల వేట*
*పిడకల వేట*
బౌద్ధ గ్రంథాలలో మనకి ఉపనిషత్తులు లాగే వాళ్ళకి పీఠకాలు అని ప్రత్యేకంగా ధర్మసూత్రాలు ఉంటాయి. ఒక ప్రవచన కర్త రామాయణం చెప్తున్న సమయంలో మధ్యలో ఒక బౌద్ధ సన్యాసి పీఠకాలు ఏ కాండలో ఉన్నాయో కాస్త చూసి చెప్తారా? అని అడిగాడట. అప్పటి నుండి రామాయణంలో పీఠకాల వేట అనే నానుడి మొదలై, కాలక్రమేణా పీఠకాలు కాస్తా పిడకలు అని పలకడం అలవాటు అయిపోయింది.
అద్భుతమైన మందు
ప్రతి రోగము నకు మందు వున్నట్లే తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పుకు లేదా పాపానికి అద్భుతమైన మందు భగవాన్ స్మరణ యే.
సమస్త దుఃఖాలను పోగొట్టేది నారాయణ స్మరణయే .విష్ణు సహస్రనామం లో సంకీర్త నారాయన సబ్ధమాత్రం విముక్త
దుఃఖ సుఖినో భవంతు.
కలియుగము లో అనేక కోట్ల కోట్ల జన్మపాపములను పోగొట్టేది వొక్క నామస్మరణం మాత్రమే.
అందుకే కలియుగాన్ స్మరనే న ముక్తి అన్నారు.
అతి సులభ సాధ్యం. పైసా ఖర్చు లేనిది. ఏటువంటి పూజలతో పనిలేని అతి సులభంగా మోక్ష సాధన నామస్మరణం.
అందరూ ఆచరణలో వుంచి తరించాల్సింది గా ప్రార్థన..
ఓం నమఃశివాయ.
క్రైస్తవ మత ప్రచారం
https://youtu.be/l8YiFdT6Vxc
మండపేట మండలం, అర్తమూరు గ్రామంలో కి ఇంతక ముందు కాకినాడ నుండి వచ్చి క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న ఆడ గొర్రెలను ladi canistable,SI గార్ల చేత బుద్ధి చెప్పి వెనక్కి పంపిన సిగ్గు లేకుండా మరలా వచ్చారు, వారిని గ్రామం నుండి వెనక్కి పంపిన *శివశక్తి అర్తమూరు గ్రామ శాఖ సభ్యులు*
To know more
https://www.facebook.com/BharathaShivashakthi/
YouTube/shivashakthi
Twitter@shivashakthiorg
www.Shivashakthi.org
Call:8886600412
WhatsApp:9381625183
తెలుగు వారిని
నిత్యాన్వేషణ:
మహాభారతం, మహాజనపథాలు, మౌర్యుల కాలంలో తెలుగు వారిని ఎక్కువగా అస్మాక లేదా ఆంధ్ర రాజ్యాలుగా, తమిళ వారిని ద్రావిడులుగా పేర్కొనగా, దక్షిణ భారత భాషలన్నిటికి కేవలం తమిళ భౌగోళిక పదమైన ద్రావిడను వాడుటకు గల కారణం ఏమిటి? అది సరైనదేనా?
క్రీస్తు పూర్వం ఆరు శతాబ్దాల ప్రాంతాలలో 16 జనపదాల గురించి చరిత్రలో వ్రాయబడింది. పదహారు జనపదాలలో దక్షిణంలో 'అశ్మక' ఒకే ఒక్క జనపదం. ఇక్ష్వాకు రాజైన 'బ్రహ్మదత్తుడు' శత్రువుల చేతిలో పరాజితుడై తనఅనుచరులతో గోదావరి తీరాన 'అశ్మక' రాజ్యం స్థాపించాడని పురాణాలలో,భౌద్ధ సాహిత్యంలో తెలిపారు. అనగా అప్పటికి చరిత్ర ప్రకారం మొట్టమొదటి ఆంధ్రపాలకులైన శాతవాహనులు లేరు. వారు క్రీస్తు పూర్వం 2శతాబ్దిలో ఉనికిలోనికి వచ్చారు. ఇక ఇక్ష్వాకులకు తెలుగువారికి ఉన్న ప్రాచీనసంబంధం తెలుసుకోవాలంటే తెలుగులో తరచుగా ప్రాచీనతను వ్యక్తం చేసే.ఈ వాక్యాలు చాలు. ఏదేని వస్తువు లేదా ఇల్లు చాలా.పాతదని చెప్పడానికి తెలుగువారు 'అది ఇక్ష్వాకుల కాలం నాటి ఇల్లు'.అని అంటుంటారు. అనగా తెలుగుభూమిని పరిపాలించిన అతిప్రాచీన రాజవంశం బహుశా 'ఇక్ష్వాకులే. అయితే ఈ ఇక్ష్వాకులు పరిపాలకులు ఈ తూర్పు తీర ప్రాంతంలో అనాదిగా నివసించిన సామాన్య ప్రజలు కారు.
కానీ పురాణాలలో ఇక్ష్వాకులను 'శ్రీ పర్వతీయ ఆంధ్రులనే అన్నారు.అలాగే ఈ ఇక్ష్వాకుల (ఆంధ్ర ఇక్ష్వాకుల) మూలపురుషుడు రాముని వంశానికి చెందిన 'బ్రహ్మదత్తుడు'గా చెప్పబడింది.కాబట్టి ఎలా చూసినా ఆంధ్రులకు ఇక్ష్వాకులకు సంబంధం ఉన్నట్లే తోస్తుంది. పైగా ఇక్ష్వాకులు ఆంధ్రులవలె మేనరికం వివాహాలుచేసుకున్నట్లు చరిత్రలో వ్రాయబడింది.తరువాత కాలంలో వీరు మరో ఆంధ్ర రాజులైన శాతవాహనులకు సామంతులైనారు.శాతవాహన పతనానంతరం తిరిగి నాగార్జునకొండ (శ్రీ పర్వతం)కేంద్రంగా స్వతంత్రముగా పరిపాలించారు. ఇక్ష్వాకులు వైవస్వత మనువు కుమారులు.మనువు తండ్రి సూర్యుడు,తల్లి విశ్వకర్మ కుమార్తె. ఇక్ష్వాకు సంధి విచ్ఛేదం చేస్తే ఇన (సూర్య) + యక్షవ అయే అవకాశం ఉంది .యక్ష' ఆంధ్ర సంబంధించినది.ఈ విషయం తరువాత వివరంగా చర్చించుదాం.
తమిళ' పదంలో ' మల్' లేదా మల్ల (మల్లాహ్) ఉన్నదని అనిపిస్తుంది.ఈ 'మల్లాహ్'జాతిని ఉత్తరాదిలో 'నిషాద' మల్లాహ్' మాఝీ' అని పిలుస్తారు. వీరి ప్రాచీన వృత్తి చేపలు పట్టడం,పడవలో మనుష్యులను,వస్తువులను తీసుకువెళ్ళడం.రామాయణంలో శ్రీరాముని పడవలో గంగ దాటించిన గుహుడుమహాభారతం లో సత్యవతి నిషాదులే. నిషాదులు బ్రాహ్మణులకు శూద్ర స్త్రీల సంతానంగా చెప్పబడ్డారు. ప్రాచీన గ్రంధాలలో 'ద్రావిడ' పదమే వాడబడింది.తమిళ' పదం కనిపించదు.ద్రావిడులు ఆర్యధర్మం అనుసరించక ఆర్యావర్తమునకు దూరం చేయబడినట్లు మనుస్మృతిలో చెప్పబడింది. బహశ తెన్ + మల్ = కలిసి తమిల లేదా తమిళ'అయిండవచ్చు. తెన్' అనగా 'దక్షిణం' మల్ల' అనగా నిషాదులు.దక్షిణంలో నివసించే నిషాదులు.ద్రావిడ' శూద్రులతో పాటు మరొక జాతి అయిన 'వైశ్యులను' కూడా కలిపి 'ద్రావిడం' అయ్యే అవకాశం ఉంది.వీరు తొలుత ప్రధానంగా దక్షిణాన నివాసమేర్పరుచుకున్న వారు కావచ్చు.తమిళులు విష్ణు ను 'పెరుమాల్' అంటారు.ఇదికాూడా 'మల్ల'కి సంబంధించిన పదము కావచ్చు.పెరియ + మల్ల= పెరుమాళ్,అనగా గొప్ప నావికుడు.విష్ణుమూర్తి ఎల్లప్పుడూ సముద్రంపై శేషశయ్య (నావ) పైనే నివాసం కదా.అతడు గొప్ప నావికుడు.
నీచునకు ధీరునకు గల వ్యత్యాసము
సుభాషితం
---------------------
ఉ: గ్రాసము లేక స్రుక్కిన, జరాకృశమైన ,విశీర్ణమైన, సా
యాసమునైన ,నష్ట రుచియైనను, ప్రాణ భయార్తయైన " సం
త్రాస మదేభ కుంభ పిశిత గ్రహలాలస శీల సాగ్రహా
గ్రేసర భాసమాన మగు కేసరి" జీర్ణ తృణంబు మేయునే?
భర్తృహరి సుభాషితములు- ఏనుఁగు లక్ష్మణ కవి ;
అల్పునకు అధికునకు, నీచునకు అభిమాన వంతునకు ,పిరికివానికి వీరునకు గల తేడా యెట్టిదో యీపద్యమున కవి చిత్రించినాడు. దానికి ఒకసింహాన్ని ఉదాహరణగా నెన్నుకొనినాడు. సింహము యొక్క స్వభావమెట్టిది?
గ్రాసములేక స్రుక్కిన- తిండిలేక బాధపడుతున్నా,( ఆకలి బాధేకదా) జరాకృశమైన- ముసలితనంతో చిక్కిపోయినా, విశీర్ణమైన- శరీర అవయవములు పట్టు దప్పినా, సాయాసమునైన- ఆయాసపడుతున్నా, నష్టరుచియైనను-కాంతితగ్గినా, ప్రాణభయార్తయైనా-ప్రాణభయంతో అరచు చున్నా,
సంత్రాస- తనను జూచి భయపడే, మదేభ- మదించిన యేనుగుయొక్క; కుంభ-కుభస్థలమునందలి; పిశిత-మాంసమును; గ్రహ-స్వీకరించే; శీల-స్వభావముతో ;సాగ్రహాగ్రేసర- కోపమున ముందుండే కేసరి;-సిహము; జీర్ణతృణంబున్-ఎండుగడ్డిని; మేయునే తినునా? యని యర్ధము;
భావము: సింహము యొక్కస్వభావమేమి? యేనుగు కుంభస్థలమును చీల్చి యామాంసమును తినుట! అదిమాని అది ఆకలితోనున్నను ముసలితనమున చిక్కినను ఆయాస పడు చున్నను ఫ్రాణభయమే దాపురించినను
యెండు గడ్డిని మాత్రము తినదు. అని భావము.
సింహము ఇట్టిపని చేయదన భావమేమి,? తక్కిన యల్ప జంతువులు చేయుట కవకాశమున్నదనియేగదా!
ఇదియొక దృష్టాంతము. నీచునకు ధీరునకు గల వ్యత్యాసమునకు. దీనిని బోధించుటకై కవి యొక యర్దాంతరమును
యిక్కడ ప్రదర్శించినాడు. అది "కేసరి జీర్ణతృణంబు మేయునే" యనునది. అట్లే అభిమానవంతుడు అల్పపు పనులకు
పాల్పడడని భావము.
ఈపద్య రచనలో చక్కని రచనా శిల్పాన్ని కవి ప్రదర్శించాడు. యెలాగంటే,దాని దీన దశను సూచించటానికి ,"గ్రాసములేక ఇత్యాదిగా ప్రాణభయార్తయైన వరకూ వ్యస్త పదములను ప్రయోగించిన కవి, దానిపరాక్రమాన్ని సూచించటానికి "సంత్రాస ఇత్యాదిగా కేసరి' వరకూ పెద్ద సమాసాన్ని ప్రయోగించాడు.
ఇది గొప్ప రచనా శిల్పం!
ఈవిధంగా యీపద్యం " సింహంలా అభిమానవంతులై బ్రతకండి! నీచమైన బ్రతుకు బ్రతకవలదని
ప్రజలకు సందేశమందించుట.
స్వస్తి!
జీవితం
శ్లోకం:☝️
*దీర్ఘా వై జాగ్రతో రాత్రిః*
*దీర్ఘం శ్రాన్తస్య యోజనమ్ |*
*దీర్ఘో బాలానాం సంసారః*
*సద్ధర్మం అవిజానతామ్ ||*
భావం: రాత్రంతా మెలకువగా ఉన్న వ్యక్తికి ఆ రాత్రి ఎంతకి గడవదు అనిపిస్తుంది. నడిచి నడిచి అలిసిపోయిన వాడికి ఒక్క యోజనం దూరం కూడా ఎక్కువ అయినట్టు ఉంటుంది. ధర్మం తెలియని వారికి వారి జీవితం చాలా దీర్ఘం అనిపిస్తుంది.
పంచాంగం 30.07.2023 Sunday,
ఈ రోజు పంచాంగం 30.07.2023 Sunday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు అధిక శ్రావణ మాస శుక్ల పక్ష: ద్వాదశి తిధి భాను వాసర: మూల నక్షత్రం ఇంద్ర తదుపరి వైధృతి యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం ఇది ఈరోజు పంచాంగం.
ద్వాదశి పగలు 10:30 వరకు.
మూల రాత్రి 09:27 వరకు.
సూర్యోదయం : 05:58
సూర్యాస్తమయం : 06:46
వర్జ్యం : రాత్రి 07:59 నుండి 09:27 వరకు.
దుర్ముహూర్తం: సాయంత్రం 05:04 నుండి 05:55 వరకు.
రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.
యమగండం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.
శుభోదయ:, నమస్కార:
భారత్ ను రక్షించే ఉద్యమం*
*భారత్ ను రక్షించే ఉద్యమం*
ఆ శ్రీకృష్ణ పరమాత్మ రాయభారంలో కేవలం అయిదు ఊళ్లు అడిగాడు. కానీ ఇప్పుడు భారత దేశ రక్షణ కొరకు కేవలం అయిదు చట్టాలను చేయాలని కోరుతున్నాము.
*ఉమ్మడి విద్యా విధానం* (యూనిఫాం ఎడ్యుకేషన్)
*ఉమ్మడి పౌర స్మృతి* (కామన్ సివిల్ కోడ్)
*మభ్యపెట్టే బలవంతపు మత మార్పిడి నియంత్రణ* ( కన్వర్షణ్ కంట్రోల్)
*అక్రమ చొరబాట్ల నియంత్రణ* ( ఇన్ ఫిల్టరేషన్ కంట్రోల్)
*జనాభా నియంత్రణ* ( పాపులేషన్ కంట్రోల్)
ఈ అయిదు చట్టాలు రాకపోతే భారత దేశంలో సనాతన ధర్మం పూర్తిగా అంతరించిపోతుంది. ఇప్పటికే భారత్ లోని తొమ్మిది రాష్ట్రాలలో మన ధర్మం కొడగట్టింది.
ఇది భారత్ ను, ప్రకృతి వనరులను రక్షించే ఉద్యమం.,
మన ఆడపిల్లలను కాపాడే ఉద్యమం
మీరూ ఒక భారతీయుడిగా ఈ సందేశాన్ని కనీసం ఒకరికైనా పంపవలసిందిగా మా ప్రార్దన. ఈ దేశం కోసం ఆమాత్రం కూడా చేయడానికి మీరు ఇష్టపడకపోతే ఈ సందేశాన్ని తిరిగి నాకు పంపించేయండి
*భారత్ మాతా కీ జై ✊💪🇮🇳*
ధర్మద్రవ్యానికే
ఈశ్వరముద్ర గల ధర్మద్రవ్యానికే విశ్వమంతటా చెలామణి
రెండుదేశాలకు నడుమ నొక పర్వతమున్నది. ఆవలి దేశపు ద్రవ్యం ఈవలా, ఈవలిదేశపుది ఆవలా చెల్లదు. ఈవలి దేశమందొక గృహస్థు విస్తారంగా ధనార్జనచేసి నాణములు నోట్లు దాచుకొన్నాడనుకొండి. కొంతకాలానికచట ఆరాజరికము, సంక్షోభము ప్రబలడంవల్ల అతని ద్రవ్యానికి భద్రత లేకపోయింది. అంతట ఆ గృహస్తు తన ధనంతో కొండ కావాలి దేశంలో తలదాచుకోవాలనుకొన్నాడు.
మోయతరంగానిధనరాశి నావలికి చేరవేయడం కష్టంగనుక చిల్లరమల్లర నోట్లను, నాణలను వదులుకోక తప్పిందికాదు. పెద్దపెద్ద నోట్లను, బంగారాన్ని మూటకట్టుకుని అతికష్టంతో కొండయెక్కి పారిపోజూస్తున్నాడు. త్రోవలో మహోదారు డొకడాతని కెదురై, ''ఎందుకయ్యా నీకంతకష్టం. ఇవిగో ఆవలి దేశంలో చెల్లే ఈ పెద్దనోట్లు పుచ్చుకుని ఈ మల్లేమూటా నాకిచ్చివేయమన్నా'' డనుకోండి. అపుడాగృహస్థు కెంతటిసంతోషంగలుగుతుందో ఆలోచించండి. మోయరాని తనబరువు వదలిపోయి, తేలికగా తనజేబులో ఇమిడే నోట్లకట్ట లభించిందికదా అని పరమానందం చెందుతాడు.
అలాగే మనం బ్రతికినన్నాళ్ళు సంపాదించి, దాచుకున్న ధనసంచయాన్నంతటినీ ఈ ఇహమందే విడిచిపెట్టి ఎన్నడో ఒకనాడు పరలోకయాత్ర చేయవలసివస్తుంది. అపుడు చిల్లిగవ్వ కూడా మన వెంటరాదు. ఈ సొమ్ముకు ఆ పరలోకమందు చెల్లుబడి లేదు. అయితే ఒక సదుపాయంలేకపోలేదు. ఇ ద్రవ్యమంతటినీ మార్చి పరమందు చెల్లుబడి అయ్యే ద్రవ్యాన్ని మనం సంపాదించవచ్చు. పరలోకపు బ్యాంకులో చెల్లుబడి అయ్యే ఆ నోట్లపై నాణములపై ధర్మముద్రవుంటుంది. ఆ ధర్మముద్రగల సొమ్మును మనం సంపాదించుకొంటే అది అచటి ధర్మబ్యాంకులో చెలామణి అవుతుంది. సకలలోక వ్యాప్తమైన ఆ ధర్మముద్రధరించిన నోట్లకు, నాణములకు భంగం కలుగదు.
కాబట్టి ఐహికమైన ధనసంచయంవల్ల మనకు వీసమైనా ప్రయోజనంలేదు. మనం ఇహలోకమందు చేసిన పుణ్యపాపకర్మలు, సంకల్పాలు ఇవియే మన మనస్సును పట్టుకొని, పుణ్యపాపాలనే పేరుతో పరలోకానికి మనలను వెటనంటుకొని వస్తవి. పరలోకమందు పుణ్యమనే విత్తానికి చెలామణి. ఆ పుణ్యవిత్తం హెచ్చించి ఆ పరమందు నువ్వు సుఖాన్ని అనుభవించగలుగుతావు. ఇహమందు మనోవాక్కాయములచే మనమాచరించిన పాపాన్ని - అచట అన్యాయార్జితంగా, చెల్లని ద్రవ్యంగా, ఎంచి, దానిని సంపాదించుకొన్నందుకు దండనం విధిస్తారు.
నీకు ప్రియమైన వస్తువేది? అని మనం ఎవరి నడిగినా వారిలో ఒకొకరు పెండ్లమనీ, బిడ్డలనీ, ఇల్లనీ, పొలమనీ ఇలా ఒకజాబితా వల్లిస్తారు.
ప్రీతికి ఆస్పదములయిన ఈ వస్తువులన్నీ నిజానికి మన దఃఖానికి ఆలంబనములని తేలుతున్నది. ఎందు వల్లనంటే, వీనిలో ఒక్కటీ మనవెంట వచ్చేదిలేదు. కనుక ఇవి అన్నీ దుఃఖహేతువులే అవుతవి. మనం బ్రతికివుండగానే వీనిని పోగోట్టుకుంటే, అయ్యో! పోయినవే నన్ను విడిచి-అనే దుఃఖం, మరణకాలమందు వీటినన్నిటిని వదలిపోతున్నా ననే దుఃఖం తప్పదు. కాబట్టి ఐహిక వస్తువులందు మనకుండే అనురక్తి, సంగమూ ఇవే దుఃఖానికి బీజములు, ప్రియవస్తు జాతమునుండి ఈ బలవంతపు టెడబాటు లేకపోతే దుఃఖానికి కారణంవుండదు. ఎడబాటు ఏట్లునూ తప్పదు. మరి ఆ ఏడబాటు దుఃఖరహితం ఎలా అవుతుంది? అనేది ప్రశ్న. నిస్సంగం వైరాగ్యం అనేవే దీనికిమందు.
ప్రియవస్తువులకు, మనకు, ఒడంబడికవంటి దొకటి కుదిరితే సుఖంగా శాంతంగా వాటి నెడబాసి పోవచ్చు. ఆ ఎడబాటునే నిస్సంగమనీ, విరాగమనీ అంటారు. బలవద్వియోగంవల్ల కన్నీరు జారి తీరుతుంది. మామిడిచెట్టు నుండి పచ్చికాయను కోసిచూడు. ఆ కోసినచోటు ద్రవం పుట్టుతుంది. ఆ ద్రవమే దుఃఖబాష్పాలు, మరి ఆరబండిన పండో తనంతతాను నిశ్చితంగా చెట్టునుండి విడివడినేలపై రాలుతుంది. అంతేకాదు. పచ్చికాయ చేదుగా, పుల్లగావుంటుంది. పండ్లు తియ్యగా వుంటవి. అపక్వమైన మనస్సుగూడా అపక్వఫలం వంటిదే గనుక సంసారవృక్షాన్ని అంటిపెట్టుకుని వుంటుంది. బలవద్వియోగం కలిగితే దుఃఖంపాలవుతుంది. పరిపక్వమనస్కులైన జ్ఞానులు ఎల్లకోరికలను విడనాడి సంసారమును ఇట్టే త్యజింపగలుగుతారు. అపక్వచిత్తులు చేదును పులుపును అనుభవింపగ తీరదు. మరి పరిపక్వహృదయలో - శాంతిపేరిటి అంతర మాధుర్యాన్ని చూరలాడుతారు.
కాబట్టి తలపులు, పలుకులు, చేతలు అనేవానిశక్తిని విశ్వమంతటా చలామణి అయ్యే ద్రవ్యంగా మార్చకోవచ్చు. అది మనచేతిలోని పని. ప్రతిదేశంలోను ఆయా దేశపాలకుల శిరస్సునో, ఇతరలాంఛనమునో నాణములపై ముద్రిస్తారు. ఆ ముద్రగల నాణము లాదేశములో మాత్రమే చెల్లుతవి. మరి ధర్మమనేద్రవ్యం అట్టిదికాదు. సకలలోకపాలకుడైన పరమేశ్వరుని ముద్రనుధరించే ఆ ద్రవ్యం ఎల్లలోకములందు చెల్లుతుంది. మనచే సంచితమైన ధర్మాన్నంతటినీ ఒకటే పెద్దనోటుగా మార్చకోవచ్చు. అది మనశరీరాన్ని అంటిపెట్టుకునేది కాదు. గనుక సులభంగా మన ఆత్మవెంట కొనిపోవచ్చు. అది అప్పుచేసి సంపాదించిన పాపపు నోటయితే అరెస్టువారంటు మన వెంటనే తయారవుతుంది. పుణ్యకర్మార్జితమైన నోటయితేనే నిలువసొమ్ముగా చెలామణి అవుతుంది. శరీరం సంపద, మనస్సు అనే మూడిటిలో రెండవది మనవెంటరాదు. దానిని మన బిడ్డలకోసం వదలివేయక తీరదు. మనశ్శరీరాలశక్తీ, ఆ రెండింటి చేతలూ - మరణానంతరం మనలను వెన్నంటివస్తవి. ఆ పరదేశానికి పర్వతమెక్కి వెళ్ళేటపుడు విషయవాంఛాశక్తీ, పాపభారం మనలను క్రుంగదీస్తుంది. కనుక పరలోక ప్రయాణం సుఖంగా జరగాలంటే మన మనోవాక్కాయకర్మలు అందు కనుగుణంగా వుండాలి. ఈ పనికి ప్రత్యేకకౌశల మక్కరలేదు. దొంగనోట్లు ముద్రించడానికి తెలివితేటలు కావాలి కాని, మంచిసొమ్ముకు అట్టి నేర్పుతో పనియుండదు. నిర్మలము, సరళము అయిన చిత్తంతో పరమేశ్వరి నామజపం చేస్తూ విషయాసక్తిని విడనాడి, ఆ పరమేశ్వరీ పాదకమలముల నంటిపెట్టుకుని వుంటేచాలు. ''పరమేశ్వరా! నీ అనుగ్రహానికి అర్హమైన పుణ్యం చేసినవాణ్ణిగాను, నాపాపాలను మన్నించి, నన్ననుగ్రహించి రక్షించుకో''. అంటూ పశ్చాత్తాపంతో, నిరహంకారంతో స్వామిని భజింతుముగాక!
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
--- “జగద్గురు బోధలు” నుండి
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్
ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్
శ్లోకం:32/150
బంధనస్త్వసురేంద్రాణాం
యుధిశత్రువినాశనః I
సాంఖ్యప్రసాదో దుర్వాసా
స్సర్వసాధునిషేవితః ॥ 32 ॥
* బంధనః అసురేంద్రాణాం = రాక్షస శ్రేష్ఠులయొక్క బంధనరూపం అయి ఉన్నవాడు,
* యుధి శత్రువినాశనః = యుద్ధమునందు శత్రువులను నశింపచేయువాడు,
* సాంఖ్యప్రసాదః = ఆత్మానాత్మ వివేకమును అనుగ్రహించువాడు,
* దుర్వాసా = మేలిమి వస్త్రము కాకపోయినా ధరించువాడు,
* సర్వసాధునిషేవితః = సమస్తములైన ఉత్తములచే సేవింపబడేవాడు.
కొనసాగింపు ...
https://youtu.be/L4DZ8-2KFH0
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం