28, జూన్ 2022, మంగళవారం

 తెలుగుల ముద్దుబిడ్డడు*

సీ॥
చతురజ్ఞు డద్భుత సమయోచితోక్తుడు
          సామదానము లందు సవ్యసాచి
పాలకోత్తములందు ప్రథమగణ్యు డతడు
         పరిణీతచిత్తుండు పండితుండు
పదునారుభాషల పదును తేలినవాడు
          వేయిపడగలూన్చె విశ్వమందు
నపర చాణక్యుడై యశమందె ధరణిలో
          రాజనీతికి తానె ప్రాణమౌచు
గీ॥ తెలుగు బిడ్డడు సాహితీదీప్తితముడు
తెలుగుసంస్కృతీపుంభావతేజ మతడు
పీవి నరసింహరాయుండు భీష్ముడయ్యె
తనదు తలపుల నమలుకై దక్షుడవగ
*~శ్రీశర్మద* 

అక్షర స్వర హనుమ ప్రార్థన

 🍁🍃 *అక్షర స్వర హనుమ ప్రార్థన*🍁🍃


🌹 *శ్రీరామ జయరామ*🌹  

  🙏 *జయజయరామ*🙏


అక్షర స్వరములతో ఆంజనేయప్రార్థన వలన తలచిన కార్యముల సిధ్ది జరుగుతుంది. 🙏


*అం*-జనాగర్భసంభూతం అగ్నిమిత్రస్య పుత్రకం

నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే.


*'ఆ'* దిత్యసదృశం బాలం అరుణోదయ సంభవం

నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే

 

*ఇం* గితజ్ఞస్య రామస్య దూతకార్య పరాయణం

నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే


*ఈ* శ్వరస్యాంశసంభూతం ఈషణారహితం హరిం

నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే.


*ఉ* దధిక్రమణం వీరం ఉదారచరితం విభుం 

నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే


*ఊ* రువేగోత్థితా వృక్షా ముహూర్తం కపిమన్వయుః 

నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే


*ఋ* క్శాఖాధ్యాయినం శాంతం మృగ్యమాణపదార్చితం 

నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే


*ౠ* కారాద్యక్షరోత్పత్తి జ్ఞానపూరిత మానసం

నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే


*ఌ* ఇత్యాది వర్ణానాం ఉచ్చారణ విధాయకం 

నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే

 

*ఏ* థమానశరీరం తం రాజమాన ముఖాకృతిం 

నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే

 

*ఐ* క్ష్వాకుకులవీరస్య రామస్య ప్రియపాత్రకం 

నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే


*ఓ* షధాద్రి సమానీత దివ్యౌషధిసమన్వితం

నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే.


*ఔ* త్సుక్యమాత్రకాలేన శత్రుక్షయకరం విభుం

నమామి రామదూతం తం సర్వకార్యార్థసిద్ధయే


శ్రీరామ జయరామ జయజయరామ 

శ్రీరామ జయరామ జయజయరామ

శ్రీరామ జయరామ జయజయరామ


            🌷 *సేకరణ*🌷

      🌹🌷🌞🌞🌷🌹

                *న్యాయపతి*

            *నరసింహా రావు*


🙏🌹🙏🌹🙏🌹🙏🌹

చతుఃషష్టి ఉపచారాలు

 *చతుఃషష్టి ఉపచారాలు*


ఒకసారి శ్రీశంకరాచార్యులవారికి లలిత అమ్మవారు 64 కళలతో, 64 యోగినీ దేవతలు చతుఃషష్టి ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో, దర్శనమిచ్చినపుడు ఆ ఆనందపారవశ్యములో ఆశువుగా రచించిన స్తోత్రంలో అమ్మవారికే అధికారం ఉన్న చతుఃషష్టి ఉపచారాలను ఈ విధంగా వివరించేరు. అవి.

1. అర్ఘ్యం,పాద్యం,ఆచమనీయం – అమ్మవారి కాళ్ళు, చేతులు జలముతో కడిగి, త్రాగుటకు జలము సమర్పించడం

2. ఆభరణ అవరోపణం – ముందురోజు వేసియున్న ఆభరాణాలు తీయడం

3. సుగంధ తైలాభ్యంజనం – వంటికి నూనె పట్టించడం

4. మజ్జనశాలా ప్రవేశము – స్నానాల గదికి తీసుకొని వెళ్ళడం

5. మణిపీఠోపవేశనం – మణులతో అలంకరించిన పీఠముపై కూర్చోపెట్టడం

6. దివ్యస్నానీయ ఉద్వర్తనం – నలుగు పెట్టుట

7. ఉష్ణోదక స్నానము – వేడి నీటితో స్నానము చేయించుట

8. కనక కలశచ్యుత సకల తీర్థాభిషేచనం – బంగారుకలశలలో పవిత్రనదులనుండి తీసుకువచ్చిన సకల పవిత్ర తీర్థములతో అభిషేకము

9. ధౌతవస్త్ర పరిమార్జనం – పొడిగుడ్డతో శుభ్రంగా తుడవడం

10. అరుణ దుకూల పరిధానం – ఎర్రని వస్త్రము ధరింపజేయడం

11. అరుణకుచోత్తరీయం – ఎర్రని ఉత్తరీయమును (జాకెట్టు) ధరింపజేయడం

12. ఆలేపన మంటప ప్రవేశనం – అత్తరు మొదలైన అలేపనలు పూసే గృహానికి అమ్మవారిని తీసుకొని వెళ్ళడం అక్కడ మళ్ళీ మణిపీఠముపై కూర్చోపెట్టడం

13. చందన అగరు కుంకుమ సంకు మృగమద కర్పూర కస్తూరీ గోరోజనాది దివ్య గంధ సర్వాంగీణ ఆలేపనం – వివిధ దివ్య గంధములను అమ్మవారికి అలదింపజేయడం

14. కేశాభరస్య కలాదుల అగరు ధూపం – కేశములు విస్తారపరచి సుగంధధూపం వేయడం

15. జడవేసి, మల్లికా మాలతీ చంపక అశోక శతపత్ర పూగ క్రముక మంజరీ పున్నాగ కల్హార ముఖ్య సర్వ ఋతు కుసుమమాల సంప్రయం - వివిధఋతువులలో పూచిన సుగంధ పుష్పములతో అల్లిన మాలతో అమ్మవారిని అలంకరించడం

16. భూషణమండప ప్రవేశము – అలంకార గది ప్రవేశము

17. మణిపీఠోపవేశనము - అక్కడమళ్ళీ మణిపీఠం పై కూర్చోపెట్టడము

18. నవమణిమకుట ధారణ – తొమ్మిది రకాల మణులతో కూర్చిన కిరీటం పెట్టడం

19. దానిపైన చంద్ర శకలం పెట్టడం

20. సీమంతంలో సిధూరాన్ని దిద్దడం

21. తిలక ధారణము – నుదుటిపై తిలకంతో బొట్టు పెట్టడం

22. కాలాంజనం దిద్దడం – అమ్మవారి కళ్ళకు కాటుక పెట్టడం

23. పాళీయగళం – అమ్మవారికి చెంప స్వరాలు (మావటీలు) అలంకారం చేయడం

24. మణికుండళయుగళం - మణికుండలములు రెండు చెవులకు అలంకరించడం

25. నాసాభరణం – ముక్కుకి నాసాభరణం అలంకరించడం

26. అధరయావక లేపనం – పెదవులకు పూసే లత్తుక పూయడం

27. ఆర్య భూషణం - ప్రధాన భూషణం అలంకరించడము

28. మాంగల్య సూత్రము – మాంగల్య సూత్రమును అలంకరించుట

29. హేమచింతాకం – బంగారుతో కూడిన చింతామణులమాల వేయడం

30. పతకం – బంగారు పతకం

31. మహాపతకం – పెద్దదిగా ఉన్న బంగారు పతకం

32. ముక్తావళి – మూడు వరుసల ముత్యాలహారం

33. ఏకావళి – 27 ముత్యాలతో కూడిన ఒక వరుస ముత్యాలహారం

34. చన్నభీరము – యజ్ఞోపవితం లాగ భుజములమీదనుండి వేసే ఒక ఆభరణము

35. కేయూర యుగళ భూషణ చతుష్టయము – నాలుగు చేతులకు నాలుగు కేయీరములు ( దండ కడియాలు)

36. వలయావళి – నాలుగు చేతులకు కంకణములు

37. ఊర్మికావళి – నాలుగు చేతులకు ఉంగరములు

38. కాంచీధామము – వడ్డాణము అని పెలువబడే నడుము చుట్టూ అలంకరించే ఆభరణము

39. కటిసూత్రము – వడ్డాణానికి చుట్టూ మువ్వలతో ఉండే సూత్రము

40. సౌభాగ్యాభరణం – అశోకచెట్టు ఆకులాగ ఉండే ఒక ఆభరణం (కుత్తిగంటు)

41. పాదకటకం – కాలి అందెలు

42. రత్ననూపురములు – దానిచుట్టూ మువ్వల రత్ననూపురములు

43. పాదంగుళీయములు - మట్టెలు

44. పాశం – పైన ఉన్న కుడి చేతిలో తాడు

45. అంకుశం – పైన ఉన్న ఎడమ చేతిలో అంకుశం

46. పుండ్రేక్షు చాపము – క్రింద ఉన్నకుడి చేతిలో చెరుకువిల్లు

47. పుష్పబాణములు – కింద ఉన్న ఎడమ చేతిలో పుష్పములతో చేసిన బాణములు

48. శ్రీ మణి మాణిక్య పాదుక – ఎర్రని మణులతో ప్రకాశించే పాదుకలు

49. స్వ సామన వేషభి ఆవరణ దేవతాభి సహ మహాచక్రాథిరోహణము – సర్వాలంకాణలతో ఉన్న ఆవరణదేవతలతో కూడిన మహాసింహాసనముపై అమ్మవారిని అధిష్టింపజేయడం

50. కామేశ్వరాంగ పర్యాంక ఉపవేశము – అమ్మవారిని కామేశ్వరుని పర్యంకముపై కూర్చొండబెట్టుట

51. అమృతచషకము – అమ్మవారికి త్రాగుటకు పాత్రతో మధువును అందించుట

52. ఆచమనీయము – జలమునందించుట

53. కర్పూరవీటిక – కర్పూర తాంబూలము నందించుట ( కర్పూరతాంబూలం అంటే ఎలాఉంటుందో, అందులో ఏ ఏ సుగధద్రవ్యాలు ఉంటాయో ఈ క్రింద వివరించడమనది)

54. ఆనందోల్లాస విలాస హాసము – అమ్మవారు తాంబూలం సేవిస్తూ ఆమె సంతసము, అనుగ్రహము తో కూడిన చేసే మందహాసము

55. మంగళార్తికం – దీపముల గుత్తి ని అమ్మవారి చుట్టూ తిప్పడం

56. ఛత్రము – అమ్మవారికి గొడుగు పట్టుట

57. చామరము – అమ్మవారికి చామరము వీచుట

58. దర్పణమ్ – అమ్మవారికి దర్పణం చూపించుట

59. తాళావృతం – అమ్మవారికి విసనకర్రతో విసురుట

60. చందనం – గంధం పమర్పించుట

61. పుష్పం – పుష్పాలను సమర్పించుట

62. ధూపము – సువాసనభరితమైన ధూపమును వేయుట

63. దీపము – దీప దర్శనము చేయించుట

64. నైవేద్య,తాంబూల,నీరాజన నమస్కారములు – నవరసభరితమైన నైవేద్యమును సమర్పించుట, తరువాత తాంబూల నీరాజనాది సత్కారములతో నమస్కరించుట

ఏకాంతము..


🙏సర్వోజనా సుఖినోభావంత్🙏

సమయానుకూలంగా వెళ్లితీరాలి

 *సమయానుకూలంగా వెళ్లితీరాలి..  లేకపోతే మనుగడే ప్రశ్నార్థకంగా మారవచ్చు.!?*

1998 లో, 1,70,000 మంది ఉద్యోగులు కోడాక్‌లో పనిచేశారు మరియు వారు ప్రపంచంలోని 85% ఫోటో పేపర్‌ను అమ్మారు. ఐనప్పటికీ కొన్ని సంవత్సరాలలో, డిజిటల్ ఫోటోగ్రఫీ వాటిని మార్కెట్ నుండి తరిమివేసింది..

కోడాక్ దివాళా తీసింది, మరియు ఉద్యోగులందరూ రోడ్డుపై పడ్డారు.


 HMT (watch)

 బజాజ్ (స్కూటర్)

 డయనోరా (టీవీ)

 మర్ఫీ (రేడియో)

 నోకియా (మొబైల్)

 రాజ్‌డూత్ (బైక్)

 అంబాసిడర్ (కార్)

Etc., Etc..

చెప్తుపోతుంటే, List చాలదు..


 మిత్రులారా,

 వీటన్నిటి నాణ్యతలో కొరత లేదు, అయినప్పటికీ అవి మార్కెట్‌కు దూరంగా ఉన్నాయి !!

*కారణం ???*

ఓకేఒక్కటి UPDATE.

they DIDN'T UPGRADE

 *కాలక్రమేణా అవి మారలేదు. !!*


 రాబోయే పదేళ్లలో ప్రపంచం పూర్తిగా మారిపోతుందని, నేడు నడుస్తున్న 70 నుంచి 90% పరిశ్రమలు మూతపడతాయని మీకు తెలుసా..?

గత రెండేళ్లుగా జరుగుతున్న పరిణామాలను ఒకసారి నిశితంగా పరిశీలించి చూడండి. అవి మీకు

*నాల్గవ పారిశ్రామిక విప్లవానికి స్వాగతం…* పలుకుతుంటాయి.


 🔥ఉబెర్ కేవలం ఒక సాఫ్ట్‌వేర్ మాత్రమే.  సొంతంగా ఒక్క కారు కూడా లేనప్పటికీ, అది ప్రపంచంలోనే అతిపెద్ద టాక్సీ సంస్థ.


 🔥సొంతంగా హోటల్ లేనప్పటికీ, ఎయిర్‌బిఎన్బి ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ సంస్థ.


*Zomato, swiggy, Paytm, ola cabs, oyo rooms వంటి అనేక ఉదాహరణలు మన కళ్ళ ముందే ఉన్నాయి.*


🔥యుఎస్‌లో యువ న్యాయవాదుల కోసం ఇప్పుడు ఎటువంటి పని లేదు. ఎందుకంటే ఐబిఎం వాట్సన్ సాఫ్ట్‌వేర్ క్షణంలో మంచి న్యాయ సలహాలను ఇస్తుంది.  రాబోయే పదేళ్లలో, 90% యుఎస్ న్యాయవాదులు నిరుద్యోగులు అవుతారు.. 


🔥వాట్సన్ అనే సాఫ్ట్‌వేర్ క్యాన్సర్ నిర్ధారణను మానవులకన్నా 4 రెట్లు కచ్చితంగా అంచనా వేస్తుంది. దీని వల్ల మెడికల్ రంగంలో ఎన్నో మార్పులు రావచ్చు. ఎన్నో లక్షలాది మంది నిరుద్యోగులు కావచ్చు.


*2030 నాటికి కంప్యూటర్లు మనుషులకన్నా చాలా తెలివైనవిగా ఉంటాయి.*


రాబోయే పదేళ్లలో, 60% కార్లు (ప్రపంచంలో) రోడ్ల పై ఎలక్ట్రిక్ కార్లు లేదా హైబ్రిడ్ కార్లు. Driverless కార్లదే రాజ్యం..


🔥 ఎలక్ట్రిక్ వినియోగం పెరగడంతో, పెట్రోల్ వినియోగం 60% తగ్గుతుంది. అన్ని అరబ్ దేశాలు దివాళావైపు పరుగులుతీస్తాయి.


*మీరు ఉబెర్ వంటి సాఫ్ట్‌వేర్ నుండి కారును పొందుతారు, మరియు కొద్ది క్షణాల్లో డ్రైవర్‌లేని కారు మీ తలుపు వద్ద నిలబడుతుంది. మీరు దానిని ఎవరితోనైనా పంచుకుంటే, ఆ రైడ్ మీ బైక్ కంటే చౌకగా ఉంటుంది.*


 🔥కార్లు డ్రైవర్ లేని కారణంగా 90% ప్రమాదాలు ఆగిపోతాయి.. ఇది కార్ ఇన్సూరెన్స్ అనే వ్యాపారాన్ని మూసివేస్తుంది.


🔥 డ్రైవర్ వంటి ఉపాధి భూమిపై క్రమేపీ తగ్గిపోతుంది. నగరాలు మరియు రోడ్ల నుండి 90% కార్లు అదృశ్యమైనప్పుడు, ట్రాఫిక్ మరియు పార్కింగ్ వంటి సమస్యలు అదృశ్యమవుతాయి ...


20 సంవత్సరాల క్రితం పిసిఓ లేని చోటు లేదు.  మొబైల్ ఫోన్ శకం మొదలవగానే పిసిఓ లు, కాయిన్ బాక్స్ లు మూసివేయడం ప్రారంభమైంది.. అప్పుడు ఆ పిసిఓ లలో ఫోన్ రీఛార్జ్ అమ్మడం ప్రారంభించారు. 


🔥 ఇప్పుడు రీఛార్జ్ కూడా ఆన్‌లైన్‌లో ప్రారంభమైంది. 


*మీరు ఎప్పుడైనా గమనించారా ..?*


ఈ రోజుల్లో, మార్కెట్లో ప్రతి మూడవ దుకాణం మొబైల్ ఫోన్లదే..

 అమ్మకం, సేవ, రీఛార్జ్, ఉపకరణాలు, మరమ్మత్తు, నిర్వహణ.. జరుగుతోంది


ఇప్పుడు అంతా పేటీఎమ్‌ జమానా..

ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే.. etc

ఇప్పుడు ప్రజలు తమ ఫోన్‌ల నుంచి రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవడం ప్రారంభించారు.. ఇప్పుడు డబ్బు లావాదేవీలు కూడా మారుతున్నాయి .. కరెన్సీ నోట్‌.. ప్లాస్టిక్ మనీగా (డెబిట్) కార్డుగా మార్పుచెందింది.. ఇప్పుడు అది డిజిటల్‌గా మారింది.  


🔥 ప్రపంచం చాలా వేగంగా మారుతోంది .. కళ్ళు, చెవులు మాత్రమే కాదు, మీ మెదడు/మనస్సు కూడా తెరిచి ఉంచండి. లేకపోతే మీరు తప్పక వెనుకబడిపోతారు..


 *కాలక్రమేణా మార్పు సహజం*

 అందువల్ల ...

 ఒక వ్యక్తి తన వ్యాపారాన్ని మరియు అతని స్వభావాన్ని కాలక్రమేణా మారుస్తూ ఉండాలి.

 

*"టైమ్ టు టైమ్ అప్‌డేట్ & అప్‌గ్రేడ్"*


 సమయంతో కదిలితే విజయం సాధించడమ్, లేకపోతే కనుమరుగైపోవడం.   Healy  change Medical industry☀️🌈

దేవతా వృక్షాలు

 *🌿రావి, వేప, మారేడు, జమ్మి, ఉసిరి, మేడి, మఱ్ఱి*


*దేవతా వృక్షాల్లో రావి(అశ్వత్థం)ఒకటి*.  అశ్వత్థం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం.  రావి చెట్టును పిప్పల వృక్షమని  అశ్వత్థవృక్షం అని, బోధివృక్షం అని కూడా అంటారు.


రావి చెట్టులో త్రిమూర్తులు ఉన్నారని చెప్పే శ్లోకం ఇది.


*శ్లోకం* 

మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణ

అగ్రత: శివ రూపాయ, వృక్ష రాజాయతే నమః!


ఈ వృక్షం మూలం వద్ద బ్రహ్మ,  మధ్యలో విష్ణువు,  అగ్రంలో శివుడు ఉన్నారని దీని అర్థం. 


రావి చెట్టును అశ్వత్థ నారాయణుడుగా భావించి పూజిస్తారు. 


రావిచెట్టును విష్ణు స్వరూపంగా భావించి

స్త్రీలు సంతానం కోసం ప్రదక్షిణలు పూజలు చేస్తారు. 


బుద్ధునికి ఈ చెట్టు క్రిందే జ్ఞానోదయం అయిందని చెబుతారు. అందువల్ల బౌద్ధులు దీనిని *బోధి వృక్షమని*

అంటారు.

.....................................

*వేప చెట్టు*


*వేపచెట్టు లక్ష్మీ దేవి స్వరూపమని చెబుతారు*. అందువల్ల నే విష్ణు రూపమైన రావి చెట్టుకు, లక్ష్మీ రూపమైన వేప చెట్టును ఒకే చోట పాతి వాటికి వివాహం చేస్తారు. 


చాలా చోట్ల రావి చెట్లు, వేప చెట్లు కలిపి ఉంటాయి. 


వేపాకు, వేపపూత, వేప చెట్టు మీదుగా ప్రసరించే గాలి ప్రతిది మనిషి ఆరోగ్యంగా వుండడానికి ఉపయోగ పడతాయి.


వేప సర్వరోగ నివారిణి.  వేపలో ఉన్నన్ని ఔషధ గుణాలు వేరే చెట్టులో లేవంటే అతిశయోక్తి కాదేమో. 

.........................................

*మారేడు వృక్షం*


*మారేడు ఆకులను సంస్కృతంలో బిల్వ పత్రాలంటారు*. మారేడు శివునికి ప్రీతికరం.  మూడు పత్రాల బిల్వ దళం శివుని మూడు కనులకు ప్రతీక అని భావిస్తారు. 


మారేడు దళాన్ని సోమవారము, మంగళ వారము, ఆరుద్రానక్షత్రము, సంధ్యాసమయము, రాత్రి వేళలందు, శివరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగల సమయాన కోయకూడదు అని అంటారు.


మారేడుదళము గాలిని, నీటిని దోషరహితము చేస్తుంది.


బిల్వ పత్రాలను కోసేటప్పుడు కూడా ఒక శ్లోకం చదివి నమస్కరించి కోయాలంటారు.


*ఆ శ్లోకం*

అమృతోద్భవ శీవృక్ష మహాదేవ ప్రియ: సదా

గృహ్ణామి తవ పత్రాణి శివపూజార్థమాదరాత్‌!


*మారేడు అమృతం నుంచి ఉద్భవించిందని, శ్రీ వృక్ష మని పేరు*. 


జైనులకు కూడా మారేడు పవిత్ర వృక్షం.  వారి గురువుల్లో ఒకరైన *23వ తీర్థంకరుడు భగవాన్‌ పరస్‌నాథ్‌జీ మారేడు వృక్షం కిందే నిర్వాణం (జ్ఞానోదయం పొందారని) భావిస్తారు*. 


మారేడులో ఔషధ గుణాలు అధికం.  కడుపులో మంటకు కారణమయ్యే ఎసిడిటీ వంటి సమస్యలకు, కొన్ని ఉదర సంబంధ వ్యాధులకు మారేడు చూర్ణం, మారేడు ఆకుల కషాయం పనికొస్తుంది.

.....................................

*జమ్మి వృక్షం*


*జమ్మి చెట్టు దేవతా వృక్షాల్లో ఒకటి*.   సంస్కృతంలో దీనిని శమీ వృక్షంగా పేర్కొంటారు. జమ్మి చెట్టును తాకడం  పుణ్యప్రదమని చెబుతారు. జమ్మి చెట్టు గొప్పతనాన్ని వివరించే ఒక శ్లోకం ఇది.


అజ్ఞాతవాసంలో పాండవులు తమ 

ఆయుధాలను ఈ వృక్షం పైనే  ఉంచారు. 


*శమి శమయతే పాపం, శమి శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియ దర్శిని!*


అగ్ని దేవుడు ఒక పర్యాయం భృగు మమర్షి కోపం నుంచి తప్పించుకోవడానికి ఈ చెట్టులోదాగి ఉన్నాడని కథ. 

....................................

*ఉసిరి చెట్టు*


*ఉసిరిని శ్రీమహా విష్ణువు రూపంగా భావిస్తారు*.  కార్తీక మాసంలో ఈ చెట్టు ను శ్రీమహా విష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తుంటారు.  ఉసిరి కాయల మీద వత్తులు పెట్టి వెలిగిస్తారు.  ఈ చెట్టు క్రింద భోజనాలు చేస్తారు. 


ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదం లో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం.

.............................................

*మేడి చెట్టు*


*మేడి చెట్టు క్రింద దత్తాత్రేయుల వారు (త్రిమూర్త్యాత్మకుడు) కూర్చుని ఉంటారు*.   ఇది కూడా దేవతా వృక్షమే. 


(మేడి పండును అంజూర ఫలం, అత్తిపండు, ఫిగ్‌, సీమ మేడిపండు అని కూడా పిలుస్తారు).

......................................

*మఱ్ఱి చెట్టు*


మఱ్ఱి చెట్టును సంస్కృతంలో వటవృక్షం అని అంటారు.  దీనినే *న్యగ్రోధ వృక్షము* అని కూడా పిలుస్తారు. న్యగ్రోధ వృక్షమంటే కిందకు పెరిగే చెట్టు (మర్రి చెట్టు ఊడలు కిందికి పెరుగుతాయి) అని అర్థం. 


*మఱ్ఱి చెట్టును కూడా త్రిమూర్త్యాత్మక స్వరూపంగా భావిస్తారు*.  ఈ చెట్టు సంతాన సాఫల్యతకు చిహ్నంగా భావిస్తారు.


సర్వ లోకాలకూ గురువుగా భావించే జ్ఞాన స్వరూపుడైన మేధా దక్షిణామూర్తి మర్రి వృక్ష ఛాయలోనే ఉంటాడు. 


ప్రళయ కాలమందు యావత్ జగత్తు జలమయము అయినపుడు శ్రీమహావిష్ణువు బాలుని రూపంలో వటపత్రముపై మార్కండేయ మహామునికి దర్శనము ఇచ్చాడని భాగవతం చెబుతోంది.

🚩