26, జనవరి 2025, ఆదివారం

గణతంత్ర దినోత్సవమే

: ధరణిని భారతీయ గణతంత్ర దినోత్సవమే ప్రశస్తమై 

వరలిన తీరు పౌరుల నిబద్ధ హవిద్ధ విశుద్ధ సిద్ధ హృ 

త్కరణ సకారణాత్మక సుధామధురోదిత చర్వణీయ సం 

భరిత విభాస భావ గుణ భాషణ భూషణమే మహాశయా!


: తరళత భారతీయ గణతంత్ర దినోత్సవమే ప్రశస్తమే

కరణినిఁజూచినన్ జనులకై జనతంత్రముకై వికంబు కం 

ధర హిమ శీతపర్వత వితానముపై వెలుగొందునట్టి సుం 

దరతర కేతనంబున సధర్మువు చక్రము దారి జూపగన్

[

: తనువున భారతీయ గణతంత్ర దినోత్సవ సంబరాలు చిం 

దిన నవతారకావళుల తేజములు క్రమ విస్ఫులింగ వీ 

రనివహ శౌర్యకాంతులు కలాపి తటిద్గుణ వేగ వేగులున్ 

జనగణతా విధాయిక విశాల మహత్ప్రభుతా కృతజ్ఞతల్

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..*


*ఖేదం..మోదం..*


"పరమాత్మా..ఈ వయసులో..ఈ మతిస్థిమితం లేని పిల్లతో నాకు ఈ క్షోభ ఎందుకు పెట్టావయ్యా..?" అంటూ బాధపడుతున్న పెద్దావిడ అంతకు రెండురోజుల ముందు మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి..24 ఏళ్ల వయసున్న మనుమరాలితో సహా వచ్చింది..ఆమె దాదాపు అరవై ఏళ్ళ వయసు కలది..మనుమరాలికి గత సంవత్సర కాలంగా మానసికంగా బాగాలేదు..ఉన్నట్టుండి ఏడుస్తూ లేచి కూర్చుంటుంది..హఠాత్తుగా ఉన్మాదిలా పరుగెడుతుంది..స్థిమితం అన్న మాటే లేదు..


ఆ పెద్దావిడ పేరు లక్షమ్మ గారు..ఒంగోలు దగ్గర లోని పల్లెటూరు..ఆవిడతో వచ్చిన అమ్మాయి ఆమె కూతురి బిడ్డ..మనుమరాలు..మూడేండ్ల క్రిందట వివాహం చేసారు.. లక్షణంగా కాపురం చేసుకుంటున్నది..భర్త పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు..మొదటి రెండు సంవత్సరాల కాలం హాయిగానే కాపురం చేసుకుంటున్న ఆ అమ్మాయి ప్రవర్తన లో విపరీతపు మార్పు వచ్చింది..పిచ్చి పట్టినట్లు ప్రవర్తించసాగింది..ఒంగోలు లోని డాక్టర్లకు చూపించారు..మానసిక నిపుణులకూ చూపించారు..ఎన్నో రకాల మందులు వాడారు కానీ..ఫలితం కనబడటం లేదు..ఆ అమ్మాయి భర్త ఏమీ చేయలేక నిస్సహాయంగా చూడసాగాడు..


లక్షమ్మ గారికి మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం గురించిన అవగాహన వున్నది..ఒకసారి శ్రీ స్వామివారి మందిరం వద్దకు అమ్మాయిని తీసుకెళ్లి..అక్కడ నిద్ర చేయిస్తే తగ్గిపోతుందని నమ్మకం తో వున్నది..ముందుగా కూతురితో ఈ మాట చెప్పింది..పెద్దగా సుముఖత చూపలేదు..

ఆ అమ్మాయి భర్త కూడా.."ఇన్ని రకాల వైద్యం తో నయం కానిది..ఆ స్వామి మందిరం వద్ద తగ్గుతుందా..?" అని సందేహంగా అన్నాడు..

లక్షమ్మ గారు పట్టు వదల్లేదు.."మీరెవ్వరూ  తోడు రానక్కరలేదు..ఆ పిల్లదాన్ని తీసుకొని నేను వెళతాను..ఒక వారంపాటు ఆ స్వామి సన్నిధిలో వుంటాము..నామాట వినండి..అమ్మాయికి ఏ దయ్యామో..ఏదో పూనిందని నా అనుమానం..ఆ స్వామి వారి వద్ద ఇటువంటి గాలిచేష్ట లన్నీ పోతాయని చెప్పుకుంటారు.." అని గట్టిగా చెప్పి..పట్టుబట్టి మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి ఆ అమ్మాయితో సహా వచ్చేసారు..


మొదటి రెండు రోజుల్లో ఆ అమ్మాయి లో ఏ మార్పూ కనబడలేదు..పైగా మరింత ఎక్కువగా రచ్చ చేయడం మొదలుపెట్టింది..లక్షమ్మ గారికి ఏమీ పాలుపోలేదు..శ్రీ స్వామివారి సమాధి ముందట సాగిలబడి...వేడుకున్నారు..మూడోరోజు మధ్యాహ్నం నాటికి అమ్మాయి లో మార్పు వచ్చింది..ఎటువంటి విపరీతపు పోకడలు పోకుండా..బుద్దిగా కూర్చున్నది..నాలుగోరోజుకు శ్రీ స్వామివారి మందిరం  శుభ్రం చేయడం..స్వామివారి పటానికి అగరుబత్తీలు వెలిగించడం..తులసికోట వద్ద దీపం పెట్టడం..చేయసాగింది..మరో రెండు రోజుల కల్లా..ఆ అమ్మాయి మామూలుగా మారిపోయింది..లక్షమ్మ గారిక్కూడా ఆశ్చర్యం వేసేటంతగా అమ్మాయిలో మార్పు వచ్చింది..తన కూతురికి..ఆ అమ్మాయి భర్తకూ ఈ వార్త చెప్పి పంపారు..వాళ్ళూ ఆఘమేఘాల మీద మొగలిచెర్ల చేరారు..భర్తనూ..తల్లినీ.. ఆ అమ్మాయి ఆప్యాయంగా పలకరించింది..వాళ్ళు నమ్మలేక పోయారు..


ఆ ప్రక్కరోజు ఆదివారం నాడు లక్షమ్మ గారు.. శ్రీ స్వామివారికి పొంగలి నైవేద్యం పెట్టి..మనుమరాలితో సహా శ్రీ స్వామివారి సమాధి ముందు భక్తిగా నమస్కారం చేసుకున్నారు..అందరూ కలిసి సంతోషంగా వాళ్ళ వూరు చేరారు..


ఈ సంఘటన 2006 వ సంవత్సరం నాటిది..ఇప్పటికీ లక్షమ్మ గారు ఓపిక చేసుకొని..శ్రీ స్వామివారి దర్శనానికి మనుమరాలి సంసారం తో సహా  వస్తూ ఉంటారు..ఆ అమ్మాయి ప్రస్తుతం ఇద్దరు బిడ్డల తల్లి కూడా..శ్రీ దత్తాత్రేయ స్వామివారిని అత్యంత భక్తి తో కొలుస్తూ ఉంటుంది..శ్రీ స్వామివారి మందిరానికి వచ్చిన ప్రతిసారీ తలారా స్నానం చేసి, ముఖ మంటపం లో సాగిలపడి స్వామివారిని ప్రార్ధిస్తూ ఉంటుంది..


"పరమాత్మా! నీ దయవల్లే ఈ పిల్ల హాయిగా సంసారం చేసుకుంటున్నది స్వామీ.." అని మనస్పూర్తిగా చెప్పుకుంటారు లక్షమ్మ గారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..*


*వాయిదా..ఉపసంహరణ..*


2007వ సంవత్సరం డిసెంబర్ నెల లో నాపై నా ఋణదాతలు వేసిన ఒకానొక కేసు నిమిత్తం విశాఖపట్నం లోని కోర్టుకు హాజరు కావాల్సివున్నది...రేపుదయం వాయిదా అనగా విశాఖపట్నం లోని మా లాయర్..ముందురోజు మధ్యాహ్నం ఫోన్ చేసి..నన్ను తప్పకుండా హాజరు కమ్మని చెప్పివున్నారు..ఆ ఫోన్ వచ్చే సమయానికి నేను మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం లో వున్నాను..ఇంకొక వాయిదా..అదికూడా మరో నెలరోజులపాటు ఏమైనా తీసుకునే అవకాశం వున్నదా అని లాయర్ గారిని అడిగాను..ఒక నెల వాయిదా దొరికితే..వాళ్లకు కొంత నగదు జమ చేయొచ్చు అని నా ఆలోచన.. కానీ..ఆయన..కుదరదు అని తేల్చిచెప్పారు..పైగా హాజరు కాకపోతే..జడ్జి గారు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తారేమో అనే సందేహాన్ని కూడా వెలిబుచ్చారు..ఇక చేసేదేమీ లేదు..విశాఖపట్నం వెళ్లి తీరాల్సిందే అని నిర్ణయించుకొని..శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..నమస్కారం చేసుకొని.."స్వామీ! నీదే భారం!.." అని మనసులో గట్టిగా అనుకొని వచ్చేసాను..


ఆరోజు రాత్రే విశాఖపట్నం కు రైలులో బయలుదేరి..మరుసటిరోజు ఉదయానికి చేరుకున్నాను..ఉదయం 10 గంటల కల్లా కోర్టు ఆవరణకు చేరి..మా లాయర్ గారిని కలిశాను.."ఈరోజు వాయిదా అడగాలని అనుకున్నాను కానీ..కుదరదండీ..జడ్జి గారు ఇటువంటి కేసులకు వాయిదాలు ఇవ్వటం లేదు..త్వరగా ముగించేయాలని చూస్తున్నారు.." అన్నారు..సరే..కానివ్వండి..జరిగేది జరుగుతుంది అని మాత్రం అన్నాను..


మరొక్కసారి శ్రీ స్వామివారి కి మనసులోనే నమస్కారం చేసుకొని ఓ ప్రక్కగా కూర్చున్నాను..ఎటువంటి ఆలంబన లేని పరిస్థితి లో ఆ దైవమే మనకు తోడుగా ఉంటాడు..కాకుంటే..మనం సర్వస్య శరణాగతి చెందాలి..ఆరోజు నేనున్న స్థితి లో నేను శ్రీ స్వామివారిని వేడుకోవడం తప్ప మరో మార్గం కనుపించలేదు..


మామూలుగా కోర్టు ఉదయం 10.30 గంటలకు ప్రారంభం అవుతుంది..నా వంతు కోసం ఎదురు చూస్తున్నాను..పదకొండు గంటలు గడిచినా కోర్టు లో కార్యకలాపాలు ప్రారంభం కాలేదు..విచారిస్తే..ఇంకా జడ్జి గారు రాలేదు..అన్నారు..మరి కొద్దిసేపటికే.."12 గంటల తరువాత అత్యవసర కేస్ లు మాత్రం విచారిస్తారు..మిగిలినవన్నీ వాయిదా వేయమన్నారు.." అని జడ్జి గారి దగ్గరుండే గుమాస్తా గారు చెప్పారు..నా తాలూకు కేస్ ను అత్యవసర జాబితా లోనే ఉంచారు కనుక..నేను కోర్టు లోనే ఉండిపోయాను..సరిగ్గా ఒంటిగంటకు జడ్జి గారు వచ్చారు..వరుస క్రమంలో పిలుస్తారు కనుక..నా వంతు వచ్చేసరికి..మధ్యాహ్నం మూడు గంటలు అవుతుందని చెప్పారు..భోజనం చేసి తిరిగి కోర్టు వద్దకు వచ్చాను..


మూడు గంటలకు నా కేస్ విచారిస్తారని ఎదురుచూస్తూ వున్నాను..మూడున్నర అయింది..నాలుగయింది..జడ్జి గారు వేరే కేసుల విచారణ లో వున్నారు కానీ..నన్ను మాత్రం పిలవలేదు..కోర్టు లోనే వేచి చూస్తూ వున్నాను..సాయంత్రం 5.30 గంటలకు కూడా నా కేసు విచారణ కు రాలేదు..జడ్జి గారు బెంచ్ దిగి వెళ్లి పోయారు..ఏమీ అర్ధం కాలేదు..గుమాస్తా వద్దకు వెళ్లి..మధ్యాహ్నం నుంచీ వేచి ఉన్నాననీ.. కేస్ పిలువలేదనీ..కారణం చెప్పమని అడిగాను..నన్ను అక్కడే వుండమని చెప్పి..జడ్జి గారి దగ్గరకు వెళ్లి కనుక్కుని వస్తాను..అన్నారు..ఇంకొక ఐదు నిమిషాల్లో..జడ్జి గారు నన్ను తన చాంబర్ కు రమ్మన్నారని చెప్పారు..వెళ్ళాను..


జడ్జి గారికి నమస్కారం చేసి..నిలబడ్డాను.."ఈరోజు మీ కేస్ తీసుకోలేదు.." అంటూ..ప్రక్కనే ఉన్న కేలండర్ చూసి..మళ్లీ మార్చి నెలకు వాయిదా వేస్తున్నాను..అప్పుడు విచారణ చేస్తాను.." అని చెప్పి..వాయిదా వేసేశారు..నేను నెల వాయిదా దొరికితే చాలు అనుకున్నాను..కానీ..ఏకంగా మూడు నెలలు ఇచ్చారు..నమస్కారం పెట్టి ఇవతలికి వచ్చేసాను..


అక్కడితో శ్రీ స్వామివారి లీల అయిపోలేదు..కోర్టు నుంచి బైటకు రాగానే..అనుకోని సంఘటన ఒకటి జరిగింది..


కోర్టు బైట నాకోసం..నా మీద కేస్ వేసిన కంపెనీ ప్రతినిధులు..వాళ్ళ లాయర్ గారూ..మా లాయర్ గారూ అందరూ వేచి చూస్తున్నారు..


మా లాయర్ గారు.."ప్రసాద్ గారూ మీతో మాట్లాడి కేస్ ఇంతటితో ముగిద్దామని వాళ్ళు అనుకుంటున్నారు..మీరొక మాట చెపితే..."అన్నారు..


ఇప్పటికిప్పుడు డబ్బు కట్టాలంటే...కష్టం కదా..అన్నాను..ఈసారి కంపెనీ ప్రతినిధే నేరుగా మాట్లాడాడు.."మనం స్థిమితంగా కూర్చొని మాట్లాడుకుందాము..మీకూ ఇబ్బంది లేకుండా..మాకూ ఇబ్బంది లేకుండా ఒక పరిష్కారం చూసుకుందామండీ.." అన్నాడు..నేనూ సరే అన్నాను..కొద్దిసేపటిలోనే ఒక అంగీకారానికి వచ్చాము..నేను ఇవ్వగలిగింది స్పష్టంగా చెప్పాను..అదికూడా ఒక నెల లోపు చెల్లిస్తానని చెప్పాను..వాళ్ళూ ఒప్పుకున్నారు..కేసు ఉపసంహరణ కు కావాల్సిన సంతకాలు కూడా పూర్తి అయ్యాయి..అంతా ఒక గంటన్నర లోపలే జరిగింది..


నాకు ప్రతి నిమిషం నా వెనుక శ్రీ స్వామివారు నిలబడే ఉన్నట్లు అనిపిస్తోంది..లేకపోతే కేసులో ఇరుక్కుని..కోర్టుకు లాగబడ్డ నాకు..ఏమాత్రం శ్రమ లేకుండా కేసు తొలగిపోవడం నా తో సాధ్యమయ్యే పనేనా?..కేవలం ఆ దత్తుడి కృపే కారణం..ప్రక్కరోజు ఆ కేసు మూసివేయడం కూడా చక చకా జరిగింది..


వాయిదా దొరికితే చాలు అని అనుకున్న నాకు..అసలు కేసు కు  హాజరే కాకుండా పూర్తి స్థాయి మినహాయింపు దొరుకుతుందని కలలో కూడా ఊహించలేదు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

చంద్రబింబమును శివలింగముగావర్ణన!

 శు  భో ద యం🙏


చంద్రబింబమును శివలింగముగావర్ణన!


"ఉదయ గ్రావము పానవట్ట,మభిషేకోద ప్రవాహంబు వా/

ర్ధి,దరీధ్వాంతము ధూపధూమము,జ్జ్వలద్దీప ప్రభారాజి కౌ/

ముది,తారానివహంబు లర్పిత సుమంబుల్గాఁ,దమోరసౌ/

ఖ్యదమై,శీతగభస్తిబింబ శివలింగంబొప్పెఁబ్రాచీదిశన్;

శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము-ధూర్జటి;

ద్వి-ఈ;133పద్యం,


"పొడుపుకొండయేపానవట్టముగ,అభిషేకోదక ప్రవాహమే సంద్రముగ,కొండకోనలలోవ్యాపించుచున్నచీకటులే ధూపధూమములుగ,సమీపమునజ్వలించుదీపములకాంతియే వెన్నెలగా,నక్షత్ర సముదాయమే పూజాపుష్పరాజిగా,చలివెలుగులు((కిరణములు)గల చంద్రుడను శివలింగము తూరుపుదిక్కుననుదయించెను.అనిదీనిభావం.

          ఇంతకూ ఈపద్యంలో చంద్రోదయం వర్ణింపబడింది.

వర్ణిస్తున్న కవిధూర్జటిపరమశైవుడు.ఉదయించేచంద్రునిఆయన శివునిగానే దర్శిస్తున్నాడు.ఈవర్ణనకు ఏమైనా పోలికలున్నాయాఅంటే ఉన్నాయంటున్నాడు.ఎలాగట?

       తూరుపుకొండ పానవట్టము.(శివలింగం ప్రతిష్ఠించిన వేదిక)అభిషేకోదకప్రవాహమే సముద్రము.(చంద్రుడు సముద్రమునుండివస్తున్నట్లు కాననగుట)

కొండలోయలలో వ్యాపించుచీకటులే ధూపములు.దీపకాంతులే వెన్నెలలు.తారకలేపూజాకుసుమాలు.

        ఈరీతిగా చంద్రుడు శివలింగంగా దర్శనమిస్తున్నాడు. లింగమునందున్నధర్మములన్నియు చంద్రునియందు ఆరోపించుటచే రూపకాలంకారమగుచున్నది.

                   స్వస్తి!🙏🙏🙏🙏🌷🌷🌷🌷🏉🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

బమ్మెఱవారి అచ్చతెనుగుముచ్చట్లు!

 బమ్మెఱవారి అచ్చతెనుగుముచ్చట్లు!


క:కరిఁదిరుచు మకరిసరసికి/

కరిదరికిని మకరిఁదిగుచు కరకరిఁబెరయన్/

కరికిమకరి మకరికిఁగరి/

భరమగుచును నతలఁగుతలభటులదరిపడన్.


ఆం:భాగవతము-గజేంద్రమోక్షము;

        పరమభక్తాగ్రేసరుడగు బమ్మెరపోతన గారి భాగవతంలో

ప్రసిధ్ధమైన ఘట్టం.గజేంద్రమోక్షం.ఆఘట్టంలో కరి-మకరుల పోరును చిత్రిస్తూ ఈకందాన్ని అతిరమ్యంగా విరచించారు.ఇది అచ్చతెనుగు పదాలముల్లె,"భరమగు"అనే ఒక్క సంస్కృతపదంతప్ప,యిందులో తక్కినవన్నీ తెనుగు పదాలే!

          కొందరు సంస్కృతాన్ని,మరికొందరు తెనుగును,ఇష్టపడుతూ ఉంటారు.అందుచేత నేను ఆయిరువర్గాలను తృప్తిపరచుటకు అక్కడక్కడ సంస్కృతపదభూయిష్ఠరచనమును, మరికొన్నిచోట్ల అచ్చతెనుగును వాడి వారియందరి మెప్పునందగలనని,పోతనభాగవతానతారికలోనుడివిన మాటలకు కార్యరూపమే ప్రస్తుతపద్యం.


అర్ధములు:-

కరి-ఏనుఁగు;మకరి-మొసలి;

తిగుచు-గుంజు;

సరసి:చెఱువు;

దరి-ఒడ్జు:;కరకరి-పట్టుదల;

భరము-భారము;

అతలము-అధోలోకము.

కుతలము-భూమి.


భావము:

    కరిన్ మకరి సరసికిన్ తిగుచున్(మొసలి యేనుగును సరస్సులోకి లాగుచున్నది.)

కరి మకరిన్ దరికి తిగుచున్(ఏనుగు మొసలిని ఒడ్జుకు లాగుచున్నది) ఈవిధంగా  పట్చుదలతో అటుఅధోలోకవాసులకు,ఇటుభూలోకవాసులకు భయదాయకముగా పోరాడుచున్నవని భావము.ఈవిధంగా,

       ఆకరిమకరుల గుంజులాటను ర కార యమకంతో మనకు మనోగోచరంచేశాడు.

      చిన్నకందంలో కొండంత భావాన్ని పొదిగిన పోతనమహాకవి కవితా మహత్తు నకిట్టిపద్యములు మచ్చుతునకలు.🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🕉️🕉️🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

నైవేద్యము-విశేషాలు

 నైవేద్యము-విశేషాలు

శ్రీ గురుభ్యో నమః ||


నైవేద్యము-విశేషాలు

నైవేద్యము అన్న మాట వినగానే గుళ్ళూ , పూజలూ గుర్తొస్తాయి. సమంజసమే. గుళ్ళూ , పూజలూ మాత్రమే గుర్తుకు రావలెను.  ఈ నైవేద్యము అన్న మాటను దేవుడికి ఆహారమును నివేదించు సందర్భములో మాత్రమే వాడవలెను. 

వెంటనే ఒక ప్రశ్న:-- దేవుడు మనం ఇచ్చే ఆహారము తింటాడా ? మరి నైవేద్యము అయ్యాక , పదార్థాలన్నీ అలాగే ఉంటాయే ? వాటిని మనమే తింటున్నాము కదా ?

అవును.  వాటిని మనమే తింటున్నాము ...

అవును.  వాటిని దేవుడు తింటాడు.

పైవి రెండూ సరియైనవే. 


నివేదించిన పదార్థములు అలాగే ఉండుటకు కారణము , భగవంతుడు వాటిని ఆస్వాదించిన తరువాత , మనకు " ప్రసాదము " గా ఇస్తాడు కాబట్టి. 

అదెలాగ ? కొంచము అర్థమయ్యేటట్టు చెప్పరూ అంటారా ?  అలాగే. 


మానవులకూ , ఇతర ప్రాణులకూ ఉన్నట్టే , మానవేతర జీవులకూ , భగవంతుడికీ కూడా ఒక శరీరము ఉంటుంది. మనకు ప్రాణము ఉన్నట్టే అందరికీ ప్రాణము ఉంటుంది...దానినే చైతన్యము అనవచ్చు. ఆ చైతన్యమే అంతటా ఉండేది.  మనకున్న ప్రాణము ఒకటి కాదు. అయిదు. వాటినే పంచప్రాణాలు అంటారు. అవే , ప్రాణము , అపానము , వ్యానము , ఉదానము మరియు సమానము. 

భగవంతుడికి శరీరమేమిటి ?

శరీరమంటే మనకున్న , మనము అనుకునే పాంచభౌతికమైన శరీరం కాదు. దేవతల శరీరాలలో పృథ్వీ భూతము , జలభూతములుండవు. ఆకాశము , తేజస్సు , వాయువు రూపములలోనే దేవతలు సంచరిస్తారు. మనకు అయినట్టు వారికి ఆకలి కాదు. వారిక్ కలుగు ఆకలిని మనము మన పరిజ్ఞానముతో నిర్వచించలేము. అసలు వారున్న స్థాయి , మెట్టు వేరు. మనకు అన్వయించు అనేక విషయములు వారికి అన్వయించవు. అన్వయించేవి అదే తీరుగా ఉండవు. కాబట్టి అటువంటి పోలికలను వెదకుట పూర్తిగా అసంబద్ధమైనది.   కానీ మనము నివేదించిన పదార్థాలను చూచినంతనే సంతృప్తి చెందుతారు. వారి ఆకలి దానితో తీరినట్టే.


ముఖ్యముగా హోమములు చేసి ఇచ్చిన ఆహుతులవలన అగ్ని , ఇంద్ర , యమ , వాయు , సూర్య , చంద్ర , బృహస్పతి , మిత్ర  వరుణ , సోమ , సవితృ , రుద్ర, విష్ణువు మొదలుగా అనేక దేవతలు  తృప్తి చెందుతారు. యజ్ఞ భావనతో సమర్పించిన యే నైవేద్యమునయినా ఆయా దేవతలు సంతోషముగా స్వీకరిస్తారు.

 దీనిని వివరిస్తూ , యజుర్వేదములోని మూడో కాండములోని నాలుగో ప్రశ్నలో , " అగ్నిర్భూతానమధిపతిః..  ." మొదలుకొని పదునెనిమిది మంత్రాలను ఆయా దేవతలను తృప్తి పరచుటకొరకు వినియోగించవలెను ...అని చెబుతుంది. ఆ పద్దెనిమిది  మంత్రాలను " " అభ్యాతాన " మంత్రములు అంటారు. ఒకప్పుడు దేవతలూ , రాక్షసులూ కూడా ఒకే విధమయిన హోమములు , యజ్ఞములూ చేసేవారు. కానీ దేవతలకు మాత్రమే యజ్ఞ ఫలము దొరికేది. దానికి కారణము , దేవతలు ఈ పద్దెనిమిది అభ్యాతాన మంత్రములను కనుగొని వాటిని ఉపయోగించుకొని , తమ తమ కర్మలను సమృద్ధి పరచుకొన్నారు. రాక్షసులకు ఆ మంత్రములు తెలీక కర్మ భష్టులైనారు. యే కారణము చేత దేవతలు ఈ అభ్యాతాన మంత్రములను సంపాదించినారో , ఆ కారణము వలన ఆ మంత్రాలు " వైశ్వదేవములు " అని పిలవబడుతున్నాయి. భూతముల ఆకలితీర్చు యే ప్రక్రియ అయిననూ " వైశ్వదేవము " అనిపించుకుంటుంది. ఆ మంత్రములు దేవతలనుండీ ఋషులకూ , వారినుండీ  విప్రులకూ  వచ్చినవి. ఈనాటికీ యే చిన్న హోమమైననూ ఈ అభ్యాతాన మంత్రములు లేకుండా పూర్తి కాదు. [ ఇవే కాక జయాదులు , రాష్ట్రభృత్ మంత్రాలు అని ఉన్నాయి.. అవి ఈ చర్చలో అప్రస్తుతము ] వైశ్వదేవము అంటే  భూతముల ఆకలి తృప్తి పరచుటయే కాబట్టి , హోమమైననూ , పూజ అయిననూ యజ్ఞభావముతో చేసినపుడు , ఆయా దేవతల ఆకలి తీరి సంతుష్టులవుతారు. ఆయా మంత్రములు లేకున్ననూ , భావన ముఖ్యము. 


ఆ క్రమ విధానమే ఈనాటికీ పూజలలో పాటించబడుతున్నది. 


కాబట్టి , దేవతలకు నైవేద్యము సమర్పించుట వలన మన కర్మలు సఫలమై శుభములను పొందుతాము. 

దేవతలు మనకు వర్షాలు కురిపించగలరు. కానీ దుక్కి దున్ని పొలాలను పండించవలసినది మనమే. దేవతల శరీరాలు ఆ పని చేయలేవు.

అలాగే , దేవతలు పంటలు సమృద్ధిగా పండునట్లు చేయగలరు. కానీ ఆపండిన పంటలను శుచిగా వండుట వారికి రాదు. మానవులము మాత్రమే అది చేయగలము. 


మానవులకు వర్షాలు కురిపించు శక్తి లేదు. పొలాలను సాగుచేయ గలమే కానీ మొక్కలు , పంటలు పెరగకపోతే మనము చేయగలిగినదేమీ లేదు.  దేవతలు , మానవులు ఎప్పటికీ మిత్రులేగానీ శత్రువులు కారు. కాబట్టి ఒకరికొకరు సహకరించుకుంటాము.  

దేవతల అనుగ్రహము వల్ల పండిన పంటలను మనము వండుకు తింటూ , అనుభవిస్తూ , వారికి నివేదించకపోవడము మహా పాపము. ఎవడైతే అలా నివేదించకుండా తాను మాత్రమే తింటున్నాడో వాడు పాపమును తింటున్నట్లే. అంతేకాక , వండిదానిని కొంచమైననూ అతిథులకు సమర్పించక తాను మాత్రమే తినరాదు. అది వీలుకానప్పుడు కనీసము మొదటి ముద్దనయిననూ , పశుపక్ష్యాదులను తలచుకొని , బయట పెట్టి మిగిలినదానిని దేవుడికి సమరించినట్టు భావించి , ఆ సమర్పణా భావముతో కళ్లకద్దుకొని తాను తినవలెను. అసలు భోజనము చేయుటయే ఒక యజ్ఞము. దానిని ఆత్మ యజ్ఞము అంటారు. దేహములోని అయిదు ప్రాణములకు ఆహుతులను ఇచ్చి తాను తినవలెను. 


సరే ఈ నైవేద్యమును ఎలాగ సమర్పించవలెను ? 


శుచిగా వండిన సాత్త్వికమైన ఆహారమును నేతితో అభిఘారము చేయవలెను [ నేతిని కొద్దిగా పదార్థముపై కలుపుట ]

ఒక కంచు , ఇత్తడి పత్ర లేదా , అరిటాకు , లేదా విస్తరి [  ఈ మధ్య స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు వాడుట వాడుక అయింది] లోకి వండిన పదార్థమును తీసుకోవలెను. దానిని ఆవాహన చేసి పూజించిన దేవుడి పటముగానీ విగ్రహముగానీ కలశమునకు గానీ ఎదురుగా , నేలపైన పెట్టవలెను. అయితే అలాగే పెట్టరాదు, మొదట నేలపై నీటితో ఒక చతురస్ర మండలమును గీయవలెను. దానిపై నాలుగు అక్షతలు చల్లి దానిపై పాత్రను మూత తీసి ఉంచవలెను. మండలము ఎలా గీయవలెనో బొమ్మలో చూడవచ్చు. 



నైరృతి నుండీ  మొదలు పెట్టి వాయవ్యమునకు , అక్కడనుండీ  ఈశాన్యానికి, అక్కడనుండీ ఆగ్నేయానికీ , తర్వాత  నైరృతికీ సరళరేఖలు గీసి , నైరృతి నుండీ ఈశాన్యానికి అడ్డముగా ఒక సరళరేఖ గీయవలెను. ఇదే మండలము. 


తరువాత ఆ మండలముపై నైవేద్యపు పాత్రను పెట్టి , చేతిలో తులసీ దళమును శుద్ధోదకముతో పాటూ తీసుకొని ఈ మంత్రము పలుక వలెను

ఓం విశ్వామిత్ర ఋషిః | సవితా దేవతా | గాయత్రీ ఛందః | 

తర్వాత గాయత్రీ మంత్రము పలుకుతూ నీటితో ప్రోక్షణ చేసి సవ్యముగా పాత్రచుట్టూ కూడా పరిషేచన చేయవలెను[ నీటిని వదలవలెను]. పరిషేచన చేయునపుడు, 

పగలైతే | సత్యం త్వర్తేన పరిషించామ్ | అనీ , 

 రాత్రైతే |ఋతం త్వా సత్యేన పరిషించామి| 

అనీ పలకవలెను. తర్వాత | అమృతమస్తు | అమృతోపస్తరణమసి స్వాహా | అంటూ రెండు ఉద్ధరిణెల నీరు హరివాణములో వదలాలి.


తర్వాత  పంచప్రాణములకు ఆహుతులను ఇచ్చు సంకల్పముతో,

ప్రాణాయ స్వాహా , 

అపానాయ స్వాహా , 

వ్యానాయ స్వాహా , 

ఉదానాయ స్వాహా , 

సమానాయ స్వాహా  

అని పలుకుతూ పంచ ముద్రలు చూపవలెను. ఇంకా ధేను ముద్ర కూడా చూపుట ఉత్తమము. అన్ని పదార్థాలనూ చూపి, తులసిని అన్నము మీద ఉంచవలెను. 

ఈ ముద్రలు రాని వారు , అయిదు సార్లు కుడి అరచేతితో దేవుడికి నైవేద్యాన్ని చూపవచ్చును. భావము ముఖ్యము. 

ఒక ఉద్దరిణెడు నీరు వదలి , మనము సమర్పించిన నైవేద్యము స్థిమని సూచించుటకు , 

| అమృతోపిధానమసి స్వాహా| అని పలుక వలెను. ఇది నైవేద్యముపూర్తయినదని ఉద్వాసన చెప్పుట కూడా . 

తర్వాత కింది మంత్రాలు పలుకుతూ ఆరు సార్లు ఉద్ధరిణతో నీరు వదలాలి

ఉత్తరాపోశనం సమర్పయామి , 

హస్త ప్రక్షాళనం సమర్పయామి ,

ముఖ ప్రక్షాళనం సమర్పయామి

గండూషం కల్పయామి

పునరాచమనీయం సమర్పయామి


ఇక్కడికి నైవేద్య ప్రకరణము ముగిసినట్టు. ఆ పదార్థాలను తీసివేయవచ్చు. 


నైవేద్యము అంటే పైన చెప్పినవన్నీ చేస్తేనే అయినట్టు కాదు. ఇటువంటి తంతులన్నీ కేవలము మన మనో స్వచ్ఛత , ఏకాగ్రతలు పెరుగుట కొరకు మాత్రమే. ఏకాగ్రతలు బలమయినపుడు ఇటువంటి కర్మాచరణ దానంతట అదే తొలగిపోతుంది. ఒక ఆసక్తి కరమయిన సంఘటన శృంగేరీ శారదా పీఠములో , అప్పటి జగద్గురువులు శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీ తీర్థుల వారి సమయములో జరిగింది.


ఒకసారి వారి దర్శనానికై వచ్చిన  శిష్యులొకరు , పెద్దదైన ఒక మరకత లింగమును తెచ్చి వారి ముందుంచినారు. " ఏమిటి సంగతి ? " అని గురువులు అడిగినారు.


" మహాస్వామీ , ఈ మహా లింగము మాయింటిలో అనేక తరాలనుండీ ఉంది. ఇప్పటి మా పరిస్థితులలో , మాకున్న సమయములో సరియైన క్రమములో దీనిని పూజించుటకు మేము అసమర్థులమై ఉన్నాము. అందుకని దీనిని శ్రీ గురువులకు అప్పజెప్పిపోదామని వచ్చినాము. గురువులు దీనిని  స్వీకరించవలసినదిగా మా ప్రార్థన " అన్నారు. 


" సరియైన క్రమములో పూజ చేయుట అంటే ఏమిటి ? క్లిష్ట పరిస్థితి అంటున్నారు.. మీ యింటిలో అందరూ భోజనాలు చేయుట కూడా మానేసినారా యేమి ?"


" లేదు స్వామీ , అటువంటి పరిస్థితి లేదు "


" అయితే , దీనిని పూజించుటకు మీకు ఇబ్బంది యేమిటి ? భగవంతుడు యేమీ తినడు. మనవలె అతడికి ఎన్నడూ ఆకలి కాదు. మీరు నిత్యమూ భోజనము చేయుటకు వంట చేస్తూనే ఉన్నారు కదా ? భగవంతుని కృపాశీర్వచనమును కృతజ్ఞతతో స్మరించుటకు , భోజనానికి ముందు ఆ పదార్థాలను దేవుడికి నివేదించండి. ఆ నివేదనవల్ల పవిత్రమగు ఆ ఆహారాన్ని మీరు స్వీకరించండి. దేవుడు మీనుండీ ఏమీ కోరడు. విశిష్టమైన కొన్ని ప్రత్యేక విగ్రహాలకు తప్ప , మిగిలిన విగ్రహాలకు , మీరు భుజించే , శాస్త్ర విరుద్ధము కాని పదార్థాలను నివేదిస్తే చాలు. దానికోసమై ప్రత్యేకముగా శ్రమపడనవసరము లేదు. విశేష ఖర్చులూ ఉండవు. మరి అలాంటప్పుడు పూజ చేయుటకు అసమర్థులము అని ఎందుకు భావిస్తున్నారు ? మీరు ఎంత పేదవారైననూ , భోజనమే మాను పరిస్థితి లేదు కదా ? అటువంటి పరిస్థితి ఉంటే అప్పుడు అసమర్థులము అని చెప్పుకోవచ్చును. ఒక ఫలమో , ఒక లోటా పాలో , చివరికి ఒక లోటా నీరైనా సరే , మీకు ఉన్నపుడు , అదే దేవుడికీ చాలు. దానినే భక్తితో అర్పించండి. కాబట్టి ఈ లింగాన్ని మీరే తీసుకొని వెళ్లవలెను. భగవదారాధనకు సమయాభావమని మానకండి. ఆకలైనపుడు సావకాశముగా భోజనము చేసే వ్యవధి లేకపోతే ఆత్రాత్రముగా నాలుగు ముద్దలైనా మింగుతాము కదా , ఉపవాసము ఉండము. మృష్టాన్నము లేకున్ననూ సామాన్య భోజనమైనా చేసి ఆకలి తీర్చుకుంటాము కదా , అట్లే దేవతార్చనను లఘువుగా నైననూ మీరు చేయవలెను. మానరాదు, " అని ఉపదేశించినారు.


 || సర్వే జనాస్సుఖినో భవంతు ||

మంత్రం యొక్క పరమార్ధం*

 *మంత్రం యొక్క పరమార్ధం* 


(శృంగేరి శారదా పీఠం 34వ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి బోధలు)


“మననాత్ త్రాయతే ఇతి మంత్ర:” మననం చేయువానిని రక్షించునది మంత్రము. అయితే అది ఏదో విచిత్ర ధ్వనుల కలగూరగంప అని, దానినే ముద్రిత గ్రంధమునుండి గాని గ్రహింపవచ్చు అని కాని భావించినప్పుడు ఆ మంత్రం సారహీనము, నిష్ఫలము. అట్టి మంత్రములు అమిత ఆధ్యాత్మిక తపశ్శక్తి సంపద కలిగిన శ్రీ జగద్గురువుల వంటి వారిచే ఉపదేశింపబడినప్పుడే శక్తివంతములు, ఫలవంతములు. మంత్రముల యందు, వైదిక కర్మకాండయందు సామాన్యముగా సామాన్య జనముకు విశ్వాసము తగ్గడానికి కారణం ఏమిటి అనగా - అట్టి వాటిని యోగ్యత లేనివారు చేబూని ఆర్భాటము చెయ్యడం వలన, అటువంటి వారి యందు అవి నిష్ఫలములే కాదు, అపాయమును, ఉపద్రవమును కలిగించవచ్చును కూడా. అందరూ మంత్రాలకు చింతకాయలు రాల్తాయా అని వెటకారం చేస్తున్నారు కానీ నిజంగా ఆ మంత్రములను ప్రయోగిస్తున్న వారి యోగ్యత చూడడం లేదు. 


కొందరు మూర్ఖులు వీటి విలువ తెలియక వైదిక క్రియలు, విగ్రహ అభిషేకాలు, యజ్ఞాది క్రతువులు కేవలం నిరుపయోగం అని, ధన వ్యయం, ద్రవ్య వ్యయము, శక్తి వ్యయము అని నిందిస్తూ దాని బదులు కొంతమందికి ఇల్లు కట్టచ్చు, భోజనం పెట్టచ్చు, ఇతరత్రా మానవ ఉపయోగామునకై మళ్ళించవచ్చు అని చెబుతున్నారు.


అటువంటి మూర్ఖులను మనం నేడు ఈ సామాజిక సంఘాలలో కూడా చూడవచ్చును. ఆ క్రతువుల విలువ వాటిద్వారా ఫలం పొందిన వారికి అర్ధం అవుతుంది. గాడిదకేమి తెలుసు గంధపు చెక్కల వాసన అన్నట్టు  వారికి  తెలియని విషయాలను అనవసరంగా వాళ్లకు ఉన్న చత్వారపు కళ్ళజోళ్ళలో చూసి తీర్పు చెయ్యకూడదు. తద్వారా ఆ మంత్రశక్తి ని అవమానించి అనవసరపు పాపాన్ని పోగు చేసుకుంటున్నారు. అన్ని పాపాలు ఒక్క సారే తేలిపోవు. కొన్ని పాపాలు పండాలంటే కొన్ని జన్మలు పడతాయి. అలాగే మనం నేడు అనుభవించే కష్టాలు కొన్ని జన్మల క్రితం చేసిన పాప ఫలమే. ఒక కధ ఉన్నది. 


ధృతరాష్ట్రుడు తాను 100 మంది కుమారులు పోగొట్టుకుని తాను ఎప్పుడు చేసిన పాపమని భగవంతుని అడుగుతాడు. అతడు ఒక యాభై జన్మల క్రితం కిరాతకుడు అని, ఒకసారి ఒక పక్షి 100 పిల్లల్ని దాని తల్లి తండ్రుల యెదుటనే చంపాడని అందుకు ఆ పాపం ఇప్పటికి ఫలించిందని చెబుతాడు. అప్పుడు ధృతరాష్ట్రునికి ఒక అనుమానం వస్తుంది, మరి 50 జన్మలు ఎందుకు ఆగవలసి వచ్చింది అని. దానికి 100 మంది పిల్లలు పుట్టాలంటే సంపాదింకోవలసిన పుణ్యానికి 50 జన్మలు పట్టిందని చెబుతాడు శ్రీకృష్ణుడు. 


ఈరోజు మనం చేసే పాపం ఈ జన్మలోనే ఫలితం చూపించక పోవచ్చును, కానీ వడ్డీ, చక్ర వడ్డీలతో భారీగా మనకు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి నేడు మనకు అర్ధం కానిదానిని అవహేళన చెయ్యవద్దు. మన మహర్షులు, పెద్దలు, తాతలు ఎంతో ఆలోచించి, తర్కించి చేసిన సాంప్రదాయ పద్ధతులను విమర్శించే అర్హత లేని వారు కూడా నోరు పారేసుకుని పాపం మూటకట్టుకుంటూ వున్నారు. ఆ భగవంతుని దయ వలన మనం అటువంటి వెర్రి వాగుడు వాగకుండుగాక !!

దాశరధీ! కరుణాపయోనిధీ

 దాశరధీ! కరుణాపయోనిధీ!


"రంగదరాతిభంగ,ఖగరాజతురంగ,విపత్పరంపరో/

త్తుంగతమఃపతంగ,పరితోషితరంగ,దయాంతరంగ,స /

త్సంగ,ధరాత్మజాహృదయసారసభృంగ,నిశాచరాబ్జమా /

తంగ,శుభాంగ,భద్రగిరిదాశరధీ! కరుణాపయోనిధీ!

రచన:కంచర్లగోపన్న.

      (రామదాసు)


భావం:శతృసంహారీ! గరుడవాహనా! ఆపదోధ్ధారీ!రంగనాధసేవితా! కరుణాన్వితహృదయా! సత్సంగా!సీతాహృత్పద్మభృంగా!రాక్షసకులభీభత్సకరా!శుభాంగా! భద్రగిరినిలయా! దశరధకుమారా! కరుణాసాగరా! నన్నేలుముస్వామీ!


విశేషములు: తెలుగునవెలసిన శతక సముదాయమున దాశరధీ శతకము వెలలేనిది.పరమభక్తాగ్రేసరుడగు రామదాస విరచితమైనయీశతక  మునందలి ప్రతిపద్యమొక అమృతబిందువు.భక్తిరస సింధువు.

                               స్వస్తి!🙏🌷🌷🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷💄🌷🌷🌷🌷🌷💄🌷💄💄💄

దేవతార్చన కొరకు

 దేవతార్చన కొరకు ఉపయోగించదగు పుష్ఫాలు - వాటి ఫలితాలు . 


 *  జాజిపువ్వుతో అర్చించిన భుక్తి , ముఖ్తి ఇచ్చును . చంపకము స్తంభనము , మొగిలి , మొల్ల , తెల్ల కలువ ఉచ్చాటన పద్దతిలో ఆయుధముగా పనిచేయును . 


 *  బంగారు మల్లె లాభము , నల్ల గోరింట పువ్వుల అర్చన బలవర్ధనము , తెల్ల కలిగొట్టు గొప్ప కీర్తిని ఇచ్చును . 


 *  పద్మము శాంతి , పుష్టిని ఇచ్చును . కమలము సుపుత్రులను , దాసాని మరియు రక్తగన్నేరు వశీకరణము ఇచ్చును . 


 *  శాలి ( వరివెన్ను ) సౌభాగ్యమును , కడిమి , పొగడ , మొల్ల , వస , కుందము అను పుష్పములతో అర్చించిన పాపనాశనం చేయును . 


 *  కుసుమ వశీకరణము , మోదుగ ఆకర్షణము , పొన్న , నాగకేసరములు మహాలక్ష్మీప్రదములు . 


 *  ఎర్ర కలువ వశీకరణము , నీలము మరియు నల్ల కలువలు మారణ ప్రయోగము నందు , మందార పుష్పము శత్రువుకు భయము కలిగించుటకు ఉపయోగించదగినది . 


 *  వైశాఖము నందు పొగడ పువ్వులు , జైష్టమున నాగకేసర పుష్పములు , ఆషాడమున గన్నేరు పుష్పములు విరివిగా దొరకును కావున దేవతార్చనకు ఈ మాసములలో వీటిని వాడుట శ్రేష్టం . 


 *  శ్రావణమాసము నందు పద్మముల కన్నా సంపెంగలకు ప్రాముఖ్యం , భాద్రపదమున లొద్దుగ , అశ్వజమున దాసాని , కార్తీకము నందు అగిసే , మార్గశిరమున బిల్వములు , పుష్యమాసము నందు గరికె , మాఘ మాసము నందు కుంద పుష్పములు , ఫాల్గుణమున పూల గురివిందతో పూజించుట సర్వసిద్ధి ప్రదాయకము   చైత్రమాసమున అశోక మొగ్గలతో పూజించుట అత్యంత శ్రేష్టదాయకం . 


 *  తెల్లని సన్నజాజి ,అడవి గోరింట  , దవనం , రేల , పచ్చపూల గోరింట , ఎర్ర గోరింట , కలిగొట్టు , విరజాజి , జిల్లేడు , మాధవి , గొరింటా ఈ 11 రకాల పుష్పములతో జగదాంబకు అర్చన కొరకు సమర్పించవలెను . 


 *  సన్నజాజి పుష్పములతో పూజించిన వాక్శుద్ధి కలుగును . 


 *  చమేలీ పుష్పములతో అర్చించిన రాజవశీకరణము కలుగును . మరియు అధిక మేధాశక్తి లభించును . నాగకేసరములు రాజత్వమును ప్రసాదించును . 


 *  పూల గురువింద భూలాభము , సంపెంగ బంగారము , బండి గురువెంద బుద్ధివృద్ధి , మల్లె ధనాధిక్యతను కలిగించును . 


 *  మొల్ల పువ్వు కీర్తిని , దాసాని పువ్వులతో అర్చించిన శత్రువులు సంశయావస్థలో పడెదరు . 


 *  పద్మము వలన ఆయుర్వృద్ధి కలుగును . కలువ వలన కవిత్వము అబ్బును , కడిమి పుష్పములతో అర్చన ద్వారా వ్యాధి నాశనము , బ్రహ్మదండి వలన బుద్ధిశాలిత్వము సంభంవించును . 


 *  మరువము వలన విజయప్రాప్తి , పచ్చ గోరింట వలన గజలాభము , అపరాజితా పుష్పముల వలన సర్వాంగ సుందరత్వము అబ్బును . 


 *  వావిలి వలన పుత్రలాభము , అశోకము వలన దుఃఖరాహిత్యము , పొగడ వలన వంశ గౌరవము కలుగును . 


 *  గరిక వలన ధన ధాన్య సంపద , బూరుగు పువ్వుల వలన శత్రుక్షయము , తుమ్మి పువ్వుల వలన అన్నప్రాప్తి , పొగడ వలన ధనాధిక్యత లభించును . 


 *  పొన్న వలన రాజ్యలాభము , రేల వలన అధికోన్నతి , పోట్లపువ్వుల వలన దీర్గాయువు , గ్రంథితగరము వలన సర్వమాన్యత ప్రాప్తించును . 


 *  మోదుగపువ్వుల వలన అనేక గోవులు ,మేకలు లభ్యమగును . దిరిసెన పువ్వులతో సుందర యువతి , దేవకాంచనం వలన జయము , శ్రేయము లభ్యమగును . 


 *  గన్నేరు పువ్వుల వలన మంత్రసిద్ధి , మారేడు దళముల వలన పరమపదము ప్రాప్తించును . సాత్వికమైన కోరికలకు తెల్లని పువ్వులు ప్రశస్తమైనవి . 


 *  ఉచ్చాటనము , వశీకరణము , ప్రేమ , శత్రుజయము వంటి వాటికొరకు అర్చనలు చేయువారు పరిమళము గల ఎర్రని పుష్పములు వాడవలెను . 


 *  మోహనము , వశీకరణము నందు పసుపుపచ్చని పుష్పములు శ్రేష్టమైనవి , అభిచారము , చేతబడి , పగ , మరణ ప్రయోగాల యందు రెండు విధములైన నల్లని పువ్వులు వాడవలెను . 


 *  దాసాని పువ్వులను దానం ఇచ్చిన దివ్యవస్త్రదాన  ఫలము కలుగును . మరియు బ్రహ్మ హత్యాది పాపములు క్షణములో నశించును . 


 *  దింటెన పుష్పముల యందు తెల్లదాని కంటే నల్ల దింటెన పుష్పములు దానం ఇచ్చిన రెండింతల పుణ్యము వచ్చును . 


 *  అపరాజితా , కుందముల నడుమ మనోహరమైన స్థానం కలదు . గన్నేరు పుష్పముల యందు సాక్షత్తు సదాశివుడే ఉండును . 


 *  దేవిని మంకెన పుష్పములతో పూజించిన యెడల మేకను బలి ఇచ్చినంత తృప్తి చెందును . దేవికి నిత్యపూజ యందు అర్ఘ్యం ఇయ్యవలెను . 


    

     పైన చెప్పినవన్నీ పరమశివుడు అమ్మవారికి తెలియచేసిన పుష్పసంబంధ మహత్తులు . వీటిని నేను కొన్ని పురాతన తాంత్రిక గ్రంథాల నుంచి సేకరించాను . ఇలాంటి మరెన్నో అద్బుత విషయాలు నా గ్రంథముల యందు విపులంగా ఇవ్వడం జరిగింది.  



  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034


  

    

మహా కుంభమేళా

 *మహా కుంభమేళా ...*

        *సాధువులు..!*


ఆ సాధువుల దగ్గర క్యాలెండర్ లు లేవు, వాచీలు, సెల్ ఫోన్లు లేవు, మరే ఇతర సమాచార సాధనాలూ లేవు.

ఐనా ఏదో మంత్రమేసినట్లు లెక్కపెట్టలేనంతమంది నాగసాధువులు, అఘోరాలు సరైన సమయానికి ప్రత్యక్షం అవడం ఎలా.. అనేది ఊహకందడం లేదు.


కళ్ళ ముందు సాక్షత్కారమైన ఈ మహాద్భుతం ఇప్పటివరకూ  వీడియోల్లో మాత్రమే చూసేవాళ్ళం. అది భ్రమ కాదు నిజం అని ధృవీకరించుకోడానాకి కళ్ళు నులిమి సంభ్రమాశ్చర్యాలతో తేరి పార చూడవలసి వస్తుంది.


*నాగసాధువులు అష్టసిద్ధులు కలిగిఉంటారా?!?*


అమోఘమైన, అధ్భుతమైన దివ్యశక్తులు, యోగశక్తులు కలవారా నాగసాధువులు!!


*అఘోరేభ్యోథఘోరేభ్యోఘోరఘోరథరేభ్యః!*

*సర్వేభ్యోస్సర్వశర్వేభ్యోనమస్తేఅస్తురుద్రరూపేభ్యః!!*


ప్రయాగరాజ్ కుంభమేళాలో, షాహీస్నానం గావించిన సమస్త సాధుమండలికి, సమస్త అఖాఢాల సాధువులకు, అఘోరాసాధువులకు, నాగసాధువులకు, భక్తిహృదయపూర్వక పాదాభివందనాలు!!


హరహరమహాదేవ!!

జయజయగంగే!! హరహరగంగే!!


కుంభమేళాలో  నాగసాధువులు.. కుంభమేళా జరిగే ప్రదేశంలో ఒకేసారి లక్షలాది నాగసాధువులు ఎలా ప్రత్యక్షమవుతారు???


*నాగసాధువులు ఎలాంటి శక్తులు కలిగి ఉంటారో ఒక్కసారి చూద్దాం!!*


హరిద్వార్ లోనూ, త్రివేణి సంగమం లోనూ, ఉజ్జయిని లోను, నాసిక్ లోను జరిగే కుంభమేళాలలో లక్షలాది మంది నాగసాధువులు రావటం మనం టీవీలలో, పేపర్ లలో చూశాం.! 


నాగ సాధువులు దిగంబరంగా వుంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయ గుహలలో, కొండల్లో, నదీ తీరాల్లో వుంటారు. 


మామూలు రోజుల్లో వారు ఎవరికీ కనిపించరు. హిమాలయాల నుంచి కుంభమేళా జరిగే ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో వుంటాయి. 


ఇక్కడ మనకు మనమే ఒక ప్రశ్న వేసుకుందాం... 


కొన్ని లక్షల మంది దిగంబరులు ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే, వాళ్ళు ప్రయాణం చేసిన మార్గం అంతా ట్రాఫిక్ జామ్ అవ్వాలి కదా.!

ఇప్పటి దాకా ఎక్కడైనా అలాంటి సంఘటన రికార్డ్ అయ్యిందా?


ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు, పట్టణాలు, నగరాలు వుంటాయి. 

ఎక్కడైనా, ఏ ఫోటోగ్రాఫర్ కు అయినా ఇన్ని లక్షల మంది దిగంబరులు కన్పించారా?


ఎక్కడైనా ఇంతమంది ప్రత్యేక విమానాల్లో, ఇతర రవాణా సాధనాల్లో ప్రయాణం చేసిన దాఖలాలు కన్పించాయా?

..లేదే...?! 


సరిగ్గా అందరూ ఒకేసారి, కుంభమేళా జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్ష మవుతారు? 


కుంభ మేళా ముగిశాక , తిరుగు ప్రయాణంలో షుమారు కిలోమీటర్ దూరం వరకే కన్పించి.. హఠాత్తుగా ఎలా మాయమైపోతారు? 


ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ ఎందుకు కన్పించదు?


వీటన్నింటికీ సమాధానం ఒకటే!! 

వారు అణిమాదిఅష్టసిద్ధులు_కలిగి_ఉంటారు!!


ఇప్పటికీ హిమాలయ ప్రాంతాలలో మహా మహిమాన్విత సిద్ఘపురుషులు, యోగపురుషులు సూక్ష్మరూపాలలో సంచరిస్తూ

ఉంటారు. 

వారు మహాత్ములకే దర్శనమిస్తారు! 

వారికి తెలియని విద్యలు లేవు!!


వారు దూదిపింజలవలె తేలిక కాగలరు!!

వారు పర్వతమంత బరువూ కాగలరు!!

అనేక తాంత్రికవిద్యలలో సిద్ధహస్తులు!!


1)అగ్నిస్థంభన, 

2)వాయుస్థంభన, 

3)జలస్థంభన

విద్యలతో పాటు, 

4)కాయస్థంభన, 

5)వాక్ స్థంభన

6)పరకాయప్రవేశ విద్యలు, 

7)ఈశిత్వ, 

8)వశిత్వ, 

9)వశీకరణ విద్యలు, 

10)దూరదర్శన, 

11)దూరశ్రవణాది

అనేకవిద్యలు వారికి కరతలామలకం!! 

    

ఎంతో

అవసరమేర్పడితే తప్ప వారు తమవిద్యలను

బహిర్గతపరచరు! 

చాలా రహస్యంగా గోప్యంగా ఏమి తెలియనట్లుగ ఉంటారు!!


అందులో.. సూక్ష్మశరీరయానం ఒకభాగం!! 

నాగసాధువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనం ఇదే!! 


ఎన్నో ఏళ్ళుగా మన కళ్ళ ముందు ఇంత సజీవ సాక్ష్యం కన్పిస్తుంటే దాన్ని మనం నమ్మం!!


మంత్రరహస్య గ్రంథాలున్నాయి!!

అనేక శాస్త్రాలున్నాయి!! వేదాలు, ఉపనిషత్తులు, 

పురాణ ఇతిహాసాలున్నాయి!!


..ఒక్కసారి మనసు పెట్టి మన శాస్త్రాలను, పురాణ గ్రంథాలను  చదవండి..!! 

వాటిని అధ్యయనం చేయండి!!


🙏 *సర్వేజనా సుఖినోభవంతు..*

మొక్కలు పెంచండం

 *🙏మొక్కలు పెంచండం ద్వారా  పితృదేవతలకు పుణ్యఫలం ఉద్దరిస్తుంది🙏..!!*                  


🌿 మనం ఒకసారి పద్మపురాణంలోకి చూస్తే అందులో వేదవ్యాస మహర్షి ఇలా అంటారు. 


🌸ఎవరైతే మొక్కలు నాటి, వాటిని పెంచి పోషిస్తారో అవి వారికి సంతానంతో సమానం. 


🌿వీరు నాటిన మొక్కల మీద వర్షం కురిసినప్పుడు, ఆ ఆకుల మీద నుంచి జాలువారిని ప్రతి నీటి బిందువు ఒక తర్పణంతో సమానం. 


🌸ఆ చెట్టుకు ఎన్ని వేల ఆకులు ఉంటాయో, వాటి మీద ఎన్ని వేల నీటి బిందువులు పడతాయో, ఆ వ్యక్తికి అన్నివేల తర్పణాలు విడిచిన పుణ్యం చేరుతుంది. 


🌿మరణానంతరం అతడు పితృలోకంలో ఉన్నా, స్వర్గంలో ఉన్నా, ఇతరలోకాల్లో ఉన్నా, లేదా మళ్ళీ జన్మించినా, ఈ పుణ్యఫలం అతడిని చేరి అతడిని ఉద్ధరిస్తుంది.


🌸 సనాతనధర్మాన్ని అనుసరించి సుఖదుఃఖలకు కారణం పుణ్యపాపాలు. ఒక వ్యక్తి సుఖంగా ఉండాలంటే, జీవితంలో అభివృద్ధి చెందాలంటే అతడు పూర్వజన్మలో పుణ్యకర్మ చేసుకుని ఉండాలి. 


🌿అప్పుడు అది యోగంగా మారి సుఖాన్నిస్తుంది. లేదా కనీసం ఈ జన్మలోనైనా ప్రయత్నపూర్వకంగా పుణ్యకర్మను ఆచరించాలి. 


🌸కాబట్టి పిల్లల పుట్టినరోజు నాడు వారి చేత మొక్కలు నాటించి, రోజు నీరు పోయిస్తే, ఆ పుణ్యం వారి జీవితంలో అభివృద్ధికి కారణమవుతుంది.


🌿 అదే మనం చేస్తే మనకు తోడ్పడుతుంది. మన పూర్వీకులు పెద్దగా దానాలు చేయలేదు, ధర్మాన్ని అనుష్టించలేదు అనుకుంటే, వారికి ఉత్తమగతులు కలగాలని వారి పేరున ఏపుగా వృక్షాలుగా పేరిగే కొన్ని మొక్కలు నాటి వాటికి రోజు నీరు పెట్టి పోషించాలి. 


🌸అప్పుడా పుణ్యం వారిని చేరి, మీరు ఉన్నా లేకున్నా, ఆ చెట్టు ఆకుల మీది నుంచి జాలువారిన ప్రతి నీటి చుక్క ఒక తర్పణమయ్యి వారికి ఆహరం అందిస్తుంది.  మన వంశం ఆశీర్వదించబడుతుంది...🙏🕉️🙏

జీవితం ఆదర్శప్రాయంగా సాగాలంటే

 


శ్రీభారత్ వీక్షకులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🌹 జీవితం ఆదర్శప్రాయంగా సాగాలంటే ప్రతి వ్యక్తి చిన్నప్పటి నుంచి ఎలాంటి నడవడిక కలిగి ఉండాలనే అంశంపై చాలా సందేశాత్మకంగా ఎన్నో సూచనలు చేస్తున్నారు ప్రముఖ రచయిత్రి శ్రీమతి చెంగల్వల కామేశ్వరి గారు. మన ఛానల్ లో ' కాఫీ విత్ కామేశ్వరి ' శీర్షికన ఈ ఎపిసోడ్ లు ప్రసారమవుతాయి. ముఖ్యంగా యువత ఏవిధంగా నడుచుకుంటే వారి కుటుంబాలకు, దేశానికి ఎలా ఉపయోగపడతారో శ్రీమతి కామేశ్వరి గారు చక్కగా వివరించారు. ప్రతివ్యక్తి నిత్య చైతన్యంతో సాగడానికి దారి చూపే ఈ ఎపిసోడ్ లను శ్రీభారత్ ఛానల్ ప్రత్యేకంగా అందిస్తోంది. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

గణ -తంత్రము

 ఓం శ్రీ మాత్రేనమః

ఓం శ్రీ గురుభ్యో నమః

26-1-25

గణ -తంత్రము


డా.రఘుపతి శాస్త్రుల


గణతంత్రము జనములకై

గుణమణులగు నాయకులను కూరిమి గూర్చన్

వినుతమునగు ప్రభుత గన అ

గణితమునగు లాభమొంద గలుగగ వెలసెన్

(కూరిమి=మేలు-అగణితము=ఊహించనంతటి-లాభము=ప్రయోజనము)


ధీమంతుడు అంబేడ్కరు

క్షేమమ్మును గూర్చుకొరకు కీర్తిని గన నీ

భూమిని భారత జనములు

ధీమంతులు గావెలుగగ తీర్చెను శ్రమతో

(ధీమంతులుగా =విద్వాంసులుగా)


గతమును స్మరియించుచు నా

గతమున మనమొంద గలుగు కామితముల సం

గతుల సమీక్షను జేయుచు

స్తుతమతి మెలగంగ  మనకు శోభలనొసగున్

(ఆగతము=భవిష్యత్తు=సంగతులు=సాంగత్యములు-కామితములు=కోరికలు)


పౌరులదౌ స్వేచ్ఛకు ఒన

గూరినదౌ రక్ష యిద్ది కూర్మి నొసగగా

నేరీతి ని గనుచుంటిమొ

ఓరిమితో గనగ వలయు ఉత్తమ సరణిన్


గణతంత్ర పర్వమియ్యది

గుణగణమణులకు శుభము లకుంఠిత దీక్షన్

గణములుగా జయసంపద

లనయమ్మును గూర్చు గాత ఔదార్యముతో

(గుణగణమణులు=ఉత్తములు)


 మిత్రులందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

పనిచేయుచు నుండగ

 *2100*

*కం*

పనిచేయుచు నుండగ నా

పనియందలి సులువు తెలియు పదపడి యెపుడున్.

పనులకు దూరము నుండగ

పని చిన్నదె యైన గాని బడలుదు సుజనా,

*భావం*:-- ఓ సుజనా! పని చేస్తూ ఉండగా ఆ పని లోని సులువులు ఎప్పటికైనా తెలుస్తాయి. పనులకు దూరంలో ఉంటూఉంటే చిన్న చిన్న పనులకే అలసి పోగలవు.

*సందేశం*:-- ఏదో ఒక పని చేస్తూ ఉండకపోతే పనికిమాలిన వారి గా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

తిల ద్వాదశి ప్రాముఖ్యత

 🙏 *తిల ద్వాదశి ప్రాముఖ్యత* :...!!



 *"తిలద్వాదశి" - ఈరోజునే తిలోత్పత్తి (తిలల ఉత్పత్తి) అయిందని పురాణ వచనం.*  కావున తిలలతో విష్ణువుకు స్నానమొనర్చి, తిలలచే విష్ణువును పూజించి, 


తిలలతో చేసిన పదార్థమును నైవేద్యం సమర్పించి, తిలల నూనెతో దీపదానం చేయాలి. తిలలతో హోమం కూడా చేయాలి.


🌹 *శ్లోకం* 🌹


*తిలస్నాయీ తిలోద్వర్తీ తిలహోమీ తిలోదకే, తిలభుక్ తిలదాతా చ షట్తిలాః పాపనాశనాః'.*


 తెల్లవారుజామున 

శ్రీ సూర్యనారాయణ స్వామి పూజ.

 నేటి స్నాన, దానములు విశేషఫలప్రదములు


 పుణ్య తర్పణ కాలంలో గో స్తుతి పారాయణ, గోమాత సేవ, గోపూజ, గోమాతకు తగిన ఆహారం నివేదన 


తిల ద్వాదశి రోజున ఉపవాసం పాటించడం వల్ల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రశాంతమైన మనస్సుతో భగవంతుడిని పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి. 


తిల ద్వాదశి ఉపవాసం ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుంది.


*పూజా విధానం:*


తిల ద్వాదశి రోజున ఉదయాన్నే పూజ ప్రారంభించి “ఓం నమో భగవతే వాసుదేవాయ నమః” అనే మంత్రంతో పూజ చేయాలి. 


పూజకు ముందు శుచిగా స్నానం చేసి, రాగి పాత్రలో నువ్వులు, పూలు, నీరు కలిపి అర్ఘ్యం సమర్పించాలి. స్వామిని నైవేద్యంగా నువ్వులు లేదా నువ్వులతో చేసిన ప్రసాదం సమర్పించాలి.


*తిల ద్వాదశి దానం*


తిల ద్వాదశి రోజున పేదలకు దానం చేయడం ఎంతో శుభప్రదం. నువ్వులు, బెల్లం, దుప్పటి వంటి వాటిని దానం చేస్తే విశేష పుణ్యం లభిస్తుంది.


 బ్రాహ్మణులకు నువ్వులు దానం చేయడం, పితృ తర్పణం చేయడం, హవనాలు, యాగాలు నిర్వహించడం వల్ల శుభఫలితాలు లభిస్తాయి.


*నేటి నుండి సంప్రాప్తి ద్వాదశి వ్రతము*


పుష్య బహుళ ద్వాదశి నుండి  జ్యేష్ఠ ద్వాదశి వరకు ప్రతి బహుళ

ద్వాదశి నాడూ సంప్రాప్తి ద్వాదశి వ్రతాన్ని చేయాలి. 


ప్రతి మాసంలో క్రమంగా పుండరీకాక్ష , మాధవ విశ్వరూప , పురుషోత్తమ , అచ్యుత , జయ అనే నామాలతో ఉపవాస పూర్వకంగా భగవానుని  పూజించాలి. 


తిరిగి ఆషాఢ కృష్ణ ద్వాదశినాడు వ్రత గ్రహణం చేసి మార్గశిరం దాకా వ్రత నియమాలను పాటించాలి. అవే

నామాలతో అదే క్రమంలో  భగవానుని పూజించాలి.


 ప్రతి నెలా బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణతో గౌరవించాలి. నూనెనూ ఉప్పునూ ఈ వ్రతం చేస్తున్నన్ని నాళ్ళూ వదిలేసుకోవాలి. 


ఇలా ఒక యేడాదిపాటు ఈ  వ్రతాన్నాచరించిన వారికి 'ఇక్కడ - ఇహ' అన్ని కోరికలు తీరిపోయి  సుఖజీవనం కలిగి విష్ణుసాన్నిధ్యం వెళ్ళవలసి వచ్చినపుడు 'విష్ణులోకం' ద్వారాలు తెరుస్తుంది...🌞🙏🌹🎻

భజగోవిందం (మోహముద్గరః)*

 🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య*

                 *విరచిత* 

*భజగోవిందం (మోహముద్గరః)*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*రోజూ ఒక శ్లోకం - నేటితో ముగింపు*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*శ్లోకం - 31*


*గురుచరణాంబుజ నిర్భర భక్తః*

*సంసారాదచిరాద్భవ ముక్తః|*


*సేంద్రియమానస నియమాదేవ*

*ద్రక్ష్యపి నిజ హృదయస్థం దేవం||*


*శ్లోకం అర్ధం : ~*


*గురు చరణారవిందములనే నమ్ముకుని, వెంటనే సంసారమునుండి విముక్తి పొందుము. ఇంద్రియములను, మనస్సును నియమితము చేసుకుంటే మాత్రమే, నీ హృదయంలోనేయున్న పరమాత్మ దర్శనమౌతుంది.*


*వివరణ : ~*


*సద్గురువులను ఆశ్రయించుము, వారి కరుణతో విబుధుడవగుము. ఇంద్రియములపై నిగ్రహమును ఉంచి మనసును గురు చరణములపై ఉంచి, భవ బంధములు త్యాగము చేసి ఆ హరిని గాంచు.*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*నేటితో “భజగోవిందం -రోజూ ఒక శ్లోకం” శీర్షికన భజగోవిందం శ్లోకముల పఠనం  పూర్తి అయింది. నాతోపాటు పఠనం, శ్రవణం చేసిన వారందరికీ ఆత్మానుభూతి, పరమానందం, శాంతి, సుఖము లభించు గాక॥*


*స్వస్తి.॥*


*శ్రీ గురుభ్యోనమః।*

*ఓం నమః శివాయ॥*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*శివానుగ్రహంతో రేపటి నుంచి జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు విరచిత “శివానంద లహరి” అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం.*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

క్షమా ప్రార్థన*

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

         *క్షమా ప్రార్థన*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఆవాహనం న జానామి*

*నైవ జానామి పూజనమ్।*

*విసర్జనం న జానామి*

*క్షమస్వ పరమేశ్వర.॥*


*అన్యథా శరణం నాస్తి*

*త్వమేవ శరణం మమ।*

*తస్మాత్ కారుణ్యభావేన 

*క్షమస్వ పరమేశ్వర.॥*


*శుభమస్తు.*

✴️✴️✴️✴️✴️✴️✴️✴️

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

✴️✴️✴️✴️✴️✴️✴️✴️

భజగోవిందం (మోహముద్గరః)*

 🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య*.     

              *విరచిత*

*భజగోవిందం (మోహముద్గరః)*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*రోజూ ఒక శ్లోకం (లఘు వివరణతో)*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*శ్లోకం (27)*


*గేయం గీతా నామ సహస్రం*

*ధ్యేయం శ్రీపతి రూపమజస్రం|*


*నేయం సజ్జన సంగే చిత్తం*

*దేయం దీనజనాయ చ విత్తం||*


*శ్లోకం అర్ధం : ~*


*భగవత్ గీతను, విష్ణు సహస్రనామములను సంకీర్తన చేయుచుండ వలయును, ఎల్లప్పుడూ శ్రీపతి రూపముపై మనసు నిలిపి ద్యానింప వలెను. ఎల్లప్పుడునూ సజ్జనులతో సహవాసము చేయవలెను. బీదలకు ధనము పంచి పెట్టవలెను.*


*వివరణ : ~*


*సర్వశాస్త్రసారము శ్రీమద్ భగవత్ గీతలో కలదు, అలాగే సర్వమంత్రసారము శ్రీ విష్ణు సహస్రనామములో కలదు. వీనిని పఠించు వారికి సర్వ మంత్రములు, సర్వ శాస్త్రములు పఠించిన ఫలము దొరుకును. వీటిని పఠించి, వాటిలో అర్ధము తెలుసుకొన్నచో విశ్వజ్ఞానమంతయు వారికి అవగతమైనట్లే. కేవలము పఠించుటయే కాదు, ఆ భావము మననము చేసుకొని, త్రికరణ శుద్ధిగా ఆచరించవలెను. మంచివారు, జ్ఞానులు, గురువులతో స్నేహము చేసి, వారి సాంగత్యముతో మనకున్న జ్ఞానము పెంచుకొనవలెను. బీదలు, అనాధల యెడల దయ, కరుణ కలిగి వారికి అన్న, ధన, విద్యా దానములొసగవలెను.*


*ఓం నమో నారాయణాయ।*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*(తిరిగి రేపు మరో శ్లోకంతో కలుద్దాం)*

అందరికీ తెలియకపోదు*.

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


                         𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


*చేసిన దుష్టచేష్ట నది చెప్పక నేర్పున గప్పిపుచ్చి తా* 

*మోసిన యంతటన్ బయలు ముట్టక యుండ దడెట్లు,*

*రాగిపై బూసిన బంగరుం జెదరిపోవ గడంగిన నాడు నాటికిన్* 

*దాసిన రాగి గానబడదా జనులెల్ల రెఱుంగ భాస్కరా!*


*తా𝕝𝕝 రాగిపై పూసిన బంగారు పూత చెదరి పోయినతోడనే లోపలున్న రాగి యందఱకు గనబడునట్లే, దుష్టుడు తాను చేసిన పాపపు పని నేర్పుచేత దాచిపెట్టినప్పటికిని అదిత్వరలో అందరికీ తెలియకపోదు*.


✍️🌷🌸🌹🙏

కోడిక్కున్ను భగవతి ఆలయం

 🕉 మన గుడి : నెం 1001


⚜ కేరళ  : పాలక్కాడ్


⚜ కోడిక్కున్ను భగవతి ఆలయం



💠 నిర్మలమైన బ్యాక్ వాటర్స్ ఉన్న కేరళలో పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి. 

పాలక్కాడ్ జిల్లాలోని పచ్చని కొండల మధ్య ఉన్న దాచిన రత్నం కోడిక్కున్ను భగవతి ఆలయము అలాంటి ఒక ఆధ్యాత్మిక విహారయాత్ర స్థలం 


💠 కోడిక్కున్ను భగవతి ఆలయం లేదా కోడిక్కున్ను అంబలమ్ భారతదేశంలోని కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో పట్టాంబి సమీపంలోని పల్లిప్పురం గ్రామంలో ఉన్న భద్రకాళి దేవతకు అంకితం చేయబడిన పురాతన హిందూ దేవాలయం .


💠 ఈ ఆలయం పేరు దాని ప్రతిష్ఠిత దేవత, భగవతి లేదా కోడిక్కున్నతమ్మ మరియు మలయాళ భాషలో "కొండ" అని అర్ధం వచ్చే "కున్ను" అనే ప్రత్యయం నుండి వచ్చింది . 

కోడిక్కున్ను అంటే "కోడి కొండ పైన ఉన్న దేవాలయం" అని అర్థం. 


💠 పాలక్కాడ్ జిల్లా పల్లిపురం గ్రామంలో కొడిక్కున్ భగవతి ఆలయం లోపాముద్ర దేవి సూచనల మేరకు స్థాపించబడిన ఆలయమని పురాణాలు చెబుతున్నాయి.

ఇక్కడ ప్రధాన నైవేద్యంగా మంచినీటితో అభిషేకం చేస్తారు.


💠 ఆలయ సముదాయంలో 3  దిక్కులలో మూడు పవిత్ర ప్రవేశాలు (నాడ) ఉన్నాయి-ఉత్తరం, తూర్పు మరియు పడమర-ప్రతి ఒక్కటి ఆలయానికి దారితీసే ప్రత్యేక గ్రానైట్ రాతితో చేసిన మెట్లు ఉన్నాయి. 

దాని హాలులో, ఆలయ ప్రధాన దేవతను అమ్మ (అంటే తల్లి) అని పిలుస్తారు; ప్రధాన దేవత యొక్క ఎడమ వైపున గణపతితో పాటు,  శివుడు అదే స్థాయిలో ప్రతిష్టించబడ్డాడు . 


🔅 చరిత్ర 


💠 పురాణాలతో నిండిన కోడిక్కున్ను భగవతి ఆలయం శతాబ్దాల నాటిదని నమ్ముతారు. 

ఒక బ్రాహ్మణ స్త్రీ దివ్య దృష్టితో మార్గనిర్దేశం చేసి, ఈ ప్రాంతం యొక్క నీటి కష్టాలను పరిష్కరించగల తెలివైన బ్రాహ్మణుడి వద్దకు రాజును నడిపించిన కథను స్థానిక కథలు వివరిస్తాయి. కృతజ్ఞతగా, స్త్రీ శక్తి స్వరూపిణి అయిన దుర్గకు అంకితం చేయబడిన ఈ ఆలయాన్ని రాజు స్థాపించినట్లు చెబుతారు.


💠 శతాబ్దాల క్రితం కావేరీ నది అవతల ఒక బ్రాహ్మణ స్త్రీ నివసించేది. 

అప్పట్లో దేశంలో నీటి కొరత తీవ్రంగా ఉండేది. 

ఒకరోజు మామూలు తేవారం తర్వాత, వారు చోళరాజు వద్దకు వెళ్ళి  "మన దేశంలోని నీటి కొరతను తీర్చగలరని పొరుగు దేశానికి చెందిన అగ్నిహోత్రి అనే బ్రాహ్మణుడు ధ్యానంలో నాకు ధ్యాన శక్తిని చూపించాడు" అని చెప్పారు. 

రాజు వెంటనే దూతలను పంపి అగ్నిహోత్రిని తీసుకుని దేశ సమస్యలను వివరించాడు. 


💠 రాజు సందిగ్ధతకు ముగింపు పలకాలని నిశ్చయించుకున్న అగ్నిహోత్రి ప్రార్థనలతో కావేరినా నదికి దిగాడు. 

నదిలో ఎక్కడో నీరు భూగర్భంలోకి వెళ్లడం చూసిన అగ్నిహోత్రి, కావేరిని శాంతింపజేయడానికి నది దగ్గర యాగం చేశాడు. 

అప్పుడు, నీరు తిరిగి రావాలని వేడుకొని, అతను సుడిగుండంలో అదృశ్యమయ్యాడు. 


💠 3 రోజుల తరువాత, అగ్నిహోత్రి నది నుండి కనిపించాడు మరియు అతని చేతిలో మూడు త్రిశూలాలను కలిగి ఉన్నాడు. 

శ్రీ లోపాముద్ర అనుగ్రహం పొందిన అగ్నిహోత్రికి త్రిశూలాలను ఎక్కడ ఉంచాలో ఉపదేశించారు. 

అతను నదిలో నిమజ్జనం చేసిన తరువాత, ఒక బ్రాహ్మణ స్త్రీ అతను తిరిగి వచ్చే వరకు యజ్ఞ అగ్నికి కాపలాగా ఉంది. అప్పటి నుండి కావేరీ నది పవిత్ర నది (దక్షిణ గంగ) గా మారింది. కావేరీ ప్రవాహాన్ని పునరుద్ధరించినందుకు రాజు అగ్నిహోత్రికి బహుమతులు ఇచ్చాడు, కానీ అతను దయతో తిరస్కరించాడు. రాజ్యంలో ఏవైనా సమస్యలుంటే పరిష్కరించడానికి, రాజు కాలం చేసిన తర్వాత కూడా అగ్నిహోత్రి వంశం వస్తుందని ఒప్పందంతో రాజు అతన్ని వెనక్కి పంపాడు. 


💠 పాలక్కాడ్ జిల్లా పల్లిపురం గ్రామంలోని కోడికున్ భగవతి ఆలయం, అగ్నిహోత్రి నది నుండి పొందిన త్రిశూలాల్లో రాగితో చేసిన లోపాముద్ర దేవి సూచనల మేరకు నిర్మించిన ఆలయం అని పురాణాలు చెబుతున్నాయి. 

మహాదేవుడు శ్రీలకంలో తూర్పు ముఖంగానూ, సప్త మాతృకలను పడమర వైపునూ ఉంచారు.


💠 సాయంత్రం భోజన సమయంలో ఆలయంలోని రాగి త్రిశూలాన్ని పూజించాలి. 


🔅 దేవత:


💠 ఆలయ ప్రధాన దేవత దుర్గ. ఆసక్తికరమైన విషయమేమిటంటే, దివ్య పురుష స్వరూపుడైన శివుడు మరియు అడ్డంకులను తొలగించే గణేశుడు సమాన ప్రాముఖ్యతతో ప్రతిష్టించబడి, ప్రత్యేకమైన సామరస్య త్రిమూర్తులను సృష్టించారు.


💠 అనేక దుర్గా దేవాలయాలు ఆమె ఉగ్ర కోణాన్ని చిత్రీకరిస్తున్నట్లుగా కాకుండా, కోడిక్కున్ను భగవతిని ఆమె దయగల రూపంలో (శాంత స్వరూప) పూజిస్తారు.


💠 ఈ ఆలయం కేరళలోని 13 శక్తేయ కవు దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది


🔅 పండుగలు


💠 చిరంకర పూరం (ఆలయ పండుగ) ఆలయ ప్రధాన పండుగ . ఇటువంటి ఉత్సవాలు సాధారణంగా దుర్గా దేవాలయాలు మరియు చిరంకర మహావిష్ణు దేవాలయం (కీజెక్కావు అని కూడా పిలుస్తారు) వద్ద మాత్రమే నిర్వహిస్తారు.


💠 ప్రజలు పండుగ సమయంలో ఆలయంలో ప్రదర్శన కోసం "పూటన్" మరియు "తారా" అని పిలువబడే వివిధ రకాల నృత్యకారులను పంపుతారు.

ఈ ఉత్సవంలో చెండ మేళం, తాయంబక మరియు పంచవాద్యం ఉంటాయి మరియు ఒక జత అలంకరించబడిన కృత్రిమ ఎద్దులను కాలా అని పిలుస్తారు, దీనిని వేదికకెట్టు (బాణాసంచా కార్యక్రమం) తో ముగిస్తారు . 


💠 పాలక్కాడ్ నుండి సుమారు  70 కిలోమీటర్లు


Rachana

©️ Santosh Kumar

12-17-గీతా మకరందము

 12-17-గీతా మకరందము

          భక్తియోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


యో న హృష్యతి న ద్వేష్టి 

న శోచతి న కాంక్షతి 

శుభాశుభ పరిత్యాగీ 

భక్తిమాన్ యస్స మే ప్రియః


వ్యాఖ్య:- "న హృష్యతి' - ఇచట సంతోషింపడనగా ఉప్పొంగిపోడని భావము. హర్షము (సంతోషము) మంచిదే అయినను అది హర్షశోకములను ద్వంద్వములలో చేరినదిగనుకను, మనోధర్మము గనుకను, పూర్ణమనోలయమునకు, నిరంతరాత్మస్థితికి అదియు ఒకానొక అడ్డే గనుకను ఆ ప్రకారముగ చెప్పబడినది.


'శుభాశుభపరిత్యాగీ' - ఇచట పాఠకులకొక సందేహము ఉదయించవచ్చును - లోకములో అశుభమును వదలుటగదా ధర్మము. కాని ఇచట అశుభముతో బాటు శుభమునుగూడ పరిత్యజించువాడు - అని ఏల చెప్పబడెను? గీతావాక్యములను బహుజాగ్రతగ అర్థముచేసికొనవలసియుండును. పూర్వాపరములను సమన్వయించుకొనుచు, ఏ సందర్భమున ఏ భావముతో చెప్పబడెనో గమనించుచు 'అర్థమును గ్రహించవలసియుండును. ఇచట భక్తియెుక్క పరాకాష్టస్థితి చెప్పబడుచున్నది. భక్తియొక్క చరమస్థితి, జ్ఞానస్థితి రెండును ఒకటే. పరిపూర్ణభక్తిగల మనుజుడున్ను జ్ఞానియు ఇరువురును ఒకేదైవస్థితియందు, ఆత్మస్థితియందు నిలుకడగలిగియుందురు. అది మనస్సును, మనోవికారములను దాటిన జీవన్ముక్తస్థితి. అట్టిస్థితిలో శీతోష్ణ, సుఖదు:ఖ, హర్షశోక, శుభాశుభాది ద్వంద్వభావములు ఏవియు ఉండనేరవు. కేవలము దైవభావము, ఆత్మభావము ఒకటియే యుండును. కనుకనే పరిపూర్ణభక్తుడు శుభాశుభపరిత్యాగియని చెప్పబడెను. సాధకులు మొట్టమొదట శుభమును (శుభకార్యములను, శుభసంకల్పములను) గ్రహించి తద్ద్వారా అశుభమును {అశుభకార్యములను, అశుభసంకల్పములను) త్యజించివేయవలెను. తదుపరి నిస్సంకల్పాత్మస్థితియందు, కేవలదైవస్థితియందు ఆ శుభసంకల్పాదులున్ను వానియంతటనవియే తొలగిపోయి ఒకే దైవవస్తువు మాత్రము మిగులును . శుభాశుభపరిత్యాగమను పదముయొక్క భావమిదియే. అంతియేకాని శుభకార్యములను, పుణ్యకార్యములను త్యజించివేయవలెనని కాదు. సాధకులీ విషయమును బహుజాగ్రతగ గమనించవలెను.

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*భీష్మ పర్వము తృతీయాశ్వాసము*


*269 వ రోజు*


*పదవరోజు యుద్ధం*


తొమ్మిదవనాటి భీష్ముని విజృంభణ చూసిన ధర్మనందనుని మన్సు కలత చెందింది. కౌరవ శిబిరంలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. భీష్ముని వేనోళ్ళ పొగిడారు. నీ కుమారుల ఆనందానికి హద్దు లేదు. భీష్ముని ఉదాత్త హృదయంతో ప్రస్థుతి చేసారు. ఆరోజు రాత్రి ధర్మనందనునికి నిద్ర పట్ట లేదు. తన తమ్ములను తీసుకుని కృష్ణుని శిబిరానికి వెళ్ళాడు. " కృష్ణా ! చూసావు కదా కార్చిచ్చు అడవిలోని మృగములను నాశనం చేసినట్లు భీష్ముడు పాండవ సేనలను ధ్వంసం చేసాడు. ఆ మహా వీరుని ముందు మనవాళ్ళెవరూ నిలువ లేక పోయారు. కార్యాచరణ విచక్షణ లోపించి నేను వినాశకరమైన యుద్ధానికి అంగీకరించాను. బంధు మిత్రులను చంపుకుని నేను ఈ రాజ్యాన్ని ఎలా పాలించగలను. కనుక నేను అడవులకు పోయి నిశ్చింతగా ఆకు అలములు తింటూ తపస్సు చేసుకుంటాను. నా తమ్ములతో కూడి ముని వృత్తి స్వీకరిస్తాను వాళ్ళంతా నా కారణంగా ఆడవులలో కష్టాలు అనుభవించారు. వారిని నేను భీష్మునికి బలి ఇవ్వలేను. నా తమ్ముల క్షేమమే నాకు ముఖ్యం కృష్ణా ! మా మీద దయ ఉంచి ధర్మ మార్గాన్ని ఉపదేశించు " అని వేడుకున్నాడు. ఆ మాటలు విన్న కృష్ణుడు " ధర్మనందనా ! నీవు సత్యవాక్పరిపాలకుడవు. నీ తమ్ములు నాలుగు దిక్కులు జయించిన వారు. మీకు ఎలాంటి దుర్గతి కలుగదు. నా సహాయసంపత్తితో మీకు అమాత్యుడనై మీకు రాజ్యసిద్ధి కలుగ చేస్తాను. అర్జునుడు నాకు భక్తుడు, సఖుడు, బంధువు, శిష్యుడు అతని కోసం నేను నా శరీరాన్ని అయినా కోసి ఇస్తాను. ఉపప్లావ్యంలో అర్జునుడు పలికిన పలుకులు నిజం చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. నేను మీకు సాధకంగా శపథం చేసాను. అవన్నీ నిజం చేయవలసిన బాధ్యత నాకు ఉంది. ఒక వేళ అర్జునుడు తెగువ చేసి భీష్ముని వధించకున్న నేను ఆపని చేసి అయినా మీకు విజయం చేకూరుస్తాను " అన్నాడు. అది విన్న ధర్మనందనుడు " కృష్ణా ! నీవు యుద్ధం చేయనని కేవలం సహాయ సహకారాలు అందిస్తానని చెప్పావు. నీ చేత యుద్ధం చేయించి నీ మాట అసత్యం చేయటం భావ్యం కాదు. అకటా దైవం నాకు ఎన్ని ఇక్కట్లు కలుగ చేస్తున్నాడు.


*ధర్మరాజు భీష్ముని పడగొట్టడానికి నిశ్చయించు కొనుట*


భీష్ముడు కౌరవుల పక్షాన యుద్ధం చేసినా నాకు మేలు చేస్తానని మాట ఇచ్చాడు. మా తండ్రి పోయిన నాటి నుండి మమ్మలను ఆదరించి అల్లారు ముద్దుగా పెంచిన భీష్మునికి కీడు చెయ్యడానికి మనసు రావడం లేదు. అయినా తప్పేలా లేదు అయినా రాజ ధర్మం ఎంతటి క్రూరమైందో కదా " అని ఖేదంతో పలికాడు. కృష్ణునికి ధర్మనందనుని ఆంతర్యం అర్ధం అయింది. భీష్ముని వధోపాయం తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. ఆరోజు భీష్ముడు మరలా కలవమని చెప్పడంలో అంతర్యం ఇదే కాబోలు అనుకుని ధర్మనందనా ! నీ ఆలోచన బాగుంది. భీష్ముడు కోపంతో చూస్తే అతడి ముందు ఎవరు నిలువలేరని నీవే చెప్పావు కదా ! నీవు వెళ్ళి అడిగితే చాలు భీష్ముడు తనను వధించే ఉపాయం నీకు తప్పక వివరించగలడు. కనుక మనమందరం భీష్ముని సందర్శించి ఆయనను భక్తితో ప్రార్ధించి అతని వలన ఉపదేశం పొందవలెను " అని పలికాడు. అప్పుడు ధర్మరాజు సౌమ్య వేషధారణతో తన తమ్ములను తీసుకుని భీష్ముని చూడడానికి వెళ్ళాడు. భీష్మునికి సాష్టాంగ నమస్కారం చేసాడు. భీష్ముడు వారిని సాదరంగా ఆదరించి పేరు పేరునా వారి క్షేమం అడిగి " ధర్మనందనా ! ఈ సమయంలో మీరు నన్ను చూడవచ్చిన కార్యమేమి ? సందేహించక అడుగు ఎంతటి దుష్కర కార్యమైనా నెరవేర్చగలను " అని పలికాడు. దీనవదనుడై ధర్మరాజు " పితామహా ! మాకు రాజ్యప్రాప్తి ఎలా కలుగుతుంది. మా సైన్యం క్షీణించకుండా కాపాడే మార్గం సెలవివ్వండి " అని అడిగాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - హేమంత ఋతువు - పుష్య మాసం - కృష్ణ పక్షం  - ద్వాదశి - జే‌ష్ఠ -‌‌ భాను వాసరే* (26.01.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*