26, జనవరి 2025, ఆదివారం

మహా కుంభమేళా

 *మహా కుంభమేళా ...*

        *సాధువులు..!*


ఆ సాధువుల దగ్గర క్యాలెండర్ లు లేవు, వాచీలు, సెల్ ఫోన్లు లేవు, మరే ఇతర సమాచార సాధనాలూ లేవు.

ఐనా ఏదో మంత్రమేసినట్లు లెక్కపెట్టలేనంతమంది నాగసాధువులు, అఘోరాలు సరైన సమయానికి ప్రత్యక్షం అవడం ఎలా.. అనేది ఊహకందడం లేదు.


కళ్ళ ముందు సాక్షత్కారమైన ఈ మహాద్భుతం ఇప్పటివరకూ  వీడియోల్లో మాత్రమే చూసేవాళ్ళం. అది భ్రమ కాదు నిజం అని ధృవీకరించుకోడానాకి కళ్ళు నులిమి సంభ్రమాశ్చర్యాలతో తేరి పార చూడవలసి వస్తుంది.


*నాగసాధువులు అష్టసిద్ధులు కలిగిఉంటారా?!?*


అమోఘమైన, అధ్భుతమైన దివ్యశక్తులు, యోగశక్తులు కలవారా నాగసాధువులు!!


*అఘోరేభ్యోథఘోరేభ్యోఘోరఘోరథరేభ్యః!*

*సర్వేభ్యోస్సర్వశర్వేభ్యోనమస్తేఅస్తురుద్రరూపేభ్యః!!*


ప్రయాగరాజ్ కుంభమేళాలో, షాహీస్నానం గావించిన సమస్త సాధుమండలికి, సమస్త అఖాఢాల సాధువులకు, అఘోరాసాధువులకు, నాగసాధువులకు, భక్తిహృదయపూర్వక పాదాభివందనాలు!!


హరహరమహాదేవ!!

జయజయగంగే!! హరహరగంగే!!


కుంభమేళాలో  నాగసాధువులు.. కుంభమేళా జరిగే ప్రదేశంలో ఒకేసారి లక్షలాది నాగసాధువులు ఎలా ప్రత్యక్షమవుతారు???


*నాగసాధువులు ఎలాంటి శక్తులు కలిగి ఉంటారో ఒక్కసారి చూద్దాం!!*


హరిద్వార్ లోనూ, త్రివేణి సంగమం లోనూ, ఉజ్జయిని లోను, నాసిక్ లోను జరిగే కుంభమేళాలలో లక్షలాది మంది నాగసాధువులు రావటం మనం టీవీలలో, పేపర్ లలో చూశాం.! 


నాగ సాధువులు దిగంబరంగా వుంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయ గుహలలో, కొండల్లో, నదీ తీరాల్లో వుంటారు. 


మామూలు రోజుల్లో వారు ఎవరికీ కనిపించరు. హిమాలయాల నుంచి కుంభమేళా జరిగే ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో వుంటాయి. 


ఇక్కడ మనకు మనమే ఒక ప్రశ్న వేసుకుందాం... 


కొన్ని లక్షల మంది దిగంబరులు ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే, వాళ్ళు ప్రయాణం చేసిన మార్గం అంతా ట్రాఫిక్ జామ్ అవ్వాలి కదా.!

ఇప్పటి దాకా ఎక్కడైనా అలాంటి సంఘటన రికార్డ్ అయ్యిందా?


ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు, పట్టణాలు, నగరాలు వుంటాయి. 

ఎక్కడైనా, ఏ ఫోటోగ్రాఫర్ కు అయినా ఇన్ని లక్షల మంది దిగంబరులు కన్పించారా?


ఎక్కడైనా ఇంతమంది ప్రత్యేక విమానాల్లో, ఇతర రవాణా సాధనాల్లో ప్రయాణం చేసిన దాఖలాలు కన్పించాయా?

..లేదే...?! 


సరిగ్గా అందరూ ఒకేసారి, కుంభమేళా జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్ష మవుతారు? 


కుంభ మేళా ముగిశాక , తిరుగు ప్రయాణంలో షుమారు కిలోమీటర్ దూరం వరకే కన్పించి.. హఠాత్తుగా ఎలా మాయమైపోతారు? 


ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ ఎందుకు కన్పించదు?


వీటన్నింటికీ సమాధానం ఒకటే!! 

వారు అణిమాదిఅష్టసిద్ధులు_కలిగి_ఉంటారు!!


ఇప్పటికీ హిమాలయ ప్రాంతాలలో మహా మహిమాన్విత సిద్ఘపురుషులు, యోగపురుషులు సూక్ష్మరూపాలలో సంచరిస్తూ

ఉంటారు. 

వారు మహాత్ములకే దర్శనమిస్తారు! 

వారికి తెలియని విద్యలు లేవు!!


వారు దూదిపింజలవలె తేలిక కాగలరు!!

వారు పర్వతమంత బరువూ కాగలరు!!

అనేక తాంత్రికవిద్యలలో సిద్ధహస్తులు!!


1)అగ్నిస్థంభన, 

2)వాయుస్థంభన, 

3)జలస్థంభన

విద్యలతో పాటు, 

4)కాయస్థంభన, 

5)వాక్ స్థంభన

6)పరకాయప్రవేశ విద్యలు, 

7)ఈశిత్వ, 

8)వశిత్వ, 

9)వశీకరణ విద్యలు, 

10)దూరదర్శన, 

11)దూరశ్రవణాది

అనేకవిద్యలు వారికి కరతలామలకం!! 

    

ఎంతో

అవసరమేర్పడితే తప్ప వారు తమవిద్యలను

బహిర్గతపరచరు! 

చాలా రహస్యంగా గోప్యంగా ఏమి తెలియనట్లుగ ఉంటారు!!


అందులో.. సూక్ష్మశరీరయానం ఒకభాగం!! 

నాగసాధువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనం ఇదే!! 


ఎన్నో ఏళ్ళుగా మన కళ్ళ ముందు ఇంత సజీవ సాక్ష్యం కన్పిస్తుంటే దాన్ని మనం నమ్మం!!


మంత్రరహస్య గ్రంథాలున్నాయి!!

అనేక శాస్త్రాలున్నాయి!! వేదాలు, ఉపనిషత్తులు, 

పురాణ ఇతిహాసాలున్నాయి!!


..ఒక్కసారి మనసు పెట్టి మన శాస్త్రాలను, పురాణ గ్రంథాలను  చదవండి..!! 

వాటిని అధ్యయనం చేయండి!!


🙏 *సర్వేజనా సుఖినోభవంతు..*

కామెంట్‌లు లేవు: