ఓం శ్రీ మాత్రేనమః
ఓం శ్రీ గురుభ్యో నమః
26-1-25
గణ -తంత్రము
డా.రఘుపతి శాస్త్రుల
గణతంత్రము జనములకై
గుణమణులగు నాయకులను కూరిమి గూర్చన్
వినుతమునగు ప్రభుత గన అ
గణితమునగు లాభమొంద గలుగగ వెలసెన్
(కూరిమి=మేలు-అగణితము=ఊహించనంతటి-లాభము=ప్రయోజనము)
ధీమంతుడు అంబేడ్కరు
క్షేమమ్మును గూర్చుకొరకు కీర్తిని గన నీ
భూమిని భారత జనములు
ధీమంతులు గావెలుగగ తీర్చెను శ్రమతో
(ధీమంతులుగా =విద్వాంసులుగా)
గతమును స్మరియించుచు నా
గతమున మనమొంద గలుగు కామితముల సం
గతుల సమీక్షను జేయుచు
స్తుతమతి మెలగంగ మనకు శోభలనొసగున్
(ఆగతము=భవిష్యత్తు=సంగతులు=సాంగత్యములు-కామితములు=కోరికలు)
పౌరులదౌ స్వేచ్ఛకు ఒన
గూరినదౌ రక్ష యిద్ది కూర్మి నొసగగా
నేరీతి ని గనుచుంటిమొ
ఓరిమితో గనగ వలయు ఉత్తమ సరణిన్
గణతంత్ర పర్వమియ్యది
గుణగణమణులకు శుభము లకుంఠిత దీక్షన్
గణములుగా జయసంపద
లనయమ్మును గూర్చు గాత ఔదార్యముతో
(గుణగణమణులు=ఉత్తములు)
మిత్రులందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి