5, మే 2024, ఆదివారం

తద్దినం ఎందుకు

 సైన్స్ : తద్దినం ఎందుకు ? మహాభారతంలో ఒక కధ ఉంది... కకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి రేవతి అనే అందమైన కూతు రు ఉండేది. అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయ్యింది. అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంట పెట్టుకుని బ్రహ్మ లోకానికి వెళ్తాడు. అయితే ఆ సమయానికి బ్రహ్మ లోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండడం వల్ల కొద్దిసేపు వేచి ఉన్నాడు.


ఆ సంగీత కార్యక్రమం ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్లి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో గాని పక్క రాజ్యంలో గానీ ఉంటే చెప్పమని ప్రార్ధిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిది అయ్యింది అన్నాడు. అదేంటి అని అడిగాడు రాజు. నీకు తెలియదా భూమిపై సమయానికి, బ్రహ్మ లోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని. నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమి పై 27 చతుర్యుగాలు గడిచి పోయాయి. ఇప్పుడు అక్కడ నీవారు గానీ, నీ రాజ్యం గానీ లేదు అన్నాడు.


దిగ్భ్రాంతి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకుని ఇప్పుడు తాను ఏం చేయాలో సెలవియ్యమన్నాడు. అప్పుడు బ్రహ్మ.. ఇప్పుడు భూమిపై 28 వ చతుర్యుగము నడుస్తుంది. అక్కడ మహా విష్ణు అవతారం అయిన శ్రీ కృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి. కాబట్టి అతనికిచ్చి నీ కూతుర్ని వివాహం చెయ్యి అన్నాడు బ్రహ్మ...


ఇప్పుడు ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్రం గురించి మాట్లాడదాం... ఆ చిత్రం పేరు "Interstellar" ఈ చిత్రం 2014 లో వచ్చింది. ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ చిత్రం లో కథానాయకుడు గతంలో నాసాలో పైలట్ గా చేసి ప్రస్తుతం తన ఊరిలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అతనికి ఒక కూతురు, కొడుకు ఉంటారు.

కూతురంటే అతనికి ప్రాణం. 


ఒకరోజు అతని కూతురు తన గదిలో ఉన్న పుస్తకాల అర నుండి తరచూ పుస్తకాలు వాటంతట అవే పడడం గమనించి ఆ గదిలో దెయ్యం ఉందని తండ్రితో చెబుతుంది. అప్పుడు ఆమె తండ్రి అదేమీ కాదని వివరించి గతంలో నాసాలో పనిచేసిన తన ప్రొఫెసర్ని కలిసి దీని గురించి వివరిస్తాడు.

తన కూతురు గదిలో దూళి చారలు ఏర్పడ్డాయని, తన జేబులోంచి పడిన నాణాన్ని ఆ దూళి చారలు ఆకర్షించాయని, వాటిని పరిశీలించి చూసి దానిని డీకోడ్ చేశానని, ఎక్కడో ఇతర లోకాల్లో ఉన్న జీవులు భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతాడు ఆ హీరో. అయితే భూమిపైకి వస్తున్న ఆ పాజిటివ్ తరంగాలపై పరిశోధన చేయగా అవి శని గ్రహానికి(Saturn) దగ్గరలో ఉన్న ఒక పాలపుంతలోని (Galaxy) ఒక గ్రహం నుండి వస్తున్నాయని చెబుతాడు ఆ ప్రొఫెసర్.


అయితే అది భూమి ఉన్న పాలపుంత కాకపోవడం వల్ల ఆ పాలపుంతలోకి వెళ్ళడానికి ‘వార్మ్ హోల్’ (Warm hole) ద్వారా చేరుకోవచ్చని కొంతమంది బృందాన్ని తయారు చేసి ఒక వ్యోమ నౌక మీద వారి అందరినీ పంపిస్తాడు ఆ ప్రొఫెసర్ హీరోతో పాటుగా. వార్మ్ హోల్ అంటే ఒక గాలక్సీ నుండి ఇంకో గాలక్సీకి వెళ్ళడానికి దగ్గరి దారి. అయితే వారి లక్ష్యం ఏంటంటే ఆ పాలపుంతలో మానవ జీవనానికి అనువుగా ఉండే గ్రహాన్ని కనిపెట్టి భూమిపై మనుషుల్ని అక్కడికి తరలించాలని.. వగైరా వగైరా(etc etc..).. అప్పటికి ఆ హీరో కూతురు వయ్యస్సు 10 సంవత్సరాలు (ఇక్కడ ఈ విషయం గుర్తుంచుకోవాలి). ఆ తరువాత కధ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆ హీరో ఆ పాలపుంతలో ఉన్న కృష్ణ బిలంలోనికి (Black hole) ప్రవేశిస్తాడు. అయితే అది 4D లోకం. మనం ఉన్నది 3D ప్రపంచం. నాలుగవ డైమెన్షన్ కాలం.


అంటే నాలుగవ డైమెన్షన్ ప్రపంచంలో మనం కాలంలో కూడా ప్రయాణించవచ్చన్న మాట.

అంటే ఇప్పుడు ఆ హీరో కాలంలో ప్రయాణించ గలడన్న మాట. అయితే ఆ హీరో కాలంలో ప్రయాణించి తన కూతురు గదిలోకి వెళ్తాడు. అప్పుడు గదిలో ఉన్న తన కూతురికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ పుస్తకాల అరలో నుంచి పుస్తకాలను కింద పడేస్తాడు.


ఇప్పుడు అర్ధం అయ్యిందా... అంటే వేరే లోకం నుండి భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నది భవిష్యత్తులో ఉన్న హీరోనే.

ఇక ఆ తరువాత కొంత కధ నడిచాక ఆ హీరో భూమిపైకి తిరిగి వస్తాడు. అయితే అప్పటికే తన కూతురు ముసలిది అయిపోతుంది. కాని హీరో వయసు మాత్రం మారదు. ఎందుకంటే హీరో వెళ్లిన గ్రహంలో ఒక గంట భూమిపై ఏడు సంవత్సరాలతో సమానం.


పైన మహా భారతంలోని కథను చదివి మనం దాన్ని ఒక కధగానే తీసుకుంటాం. కాని ఆ కధలో నేటి సైన్స్ కన్నా ఎంతో ముందే "సమయ విస్ఫారణం"(Time dilation), "కృష్ణ బిలం (Black hole), "వెచ్చని రంధ్రం” (Warm hole) వంటి ఆధునిక సైన్స్ చెబుతున్న వాటిని ఎప్పుడో మన హిందూ సనాతన ధర్మము యందు చెప్పడం జరిగింది.


అందుకే స్వామీ వివేకానంద అన్నారు.. "సైన్స్ అభివృద్ధి అయ్యేకొద్దీ సనాతన ధర్మం మరింత బలపడుతూ ఉంటుంది" అని.


ఇతర లోకాలకు, మనకు ఉన్న ఈ కాల వ్యత్యాసాన్నే "సమయ విస్ఫారణం” (Time dilation) అని నేటి సైన్స్ చెబుతుంది. మనం మహాభారతంలో చదువుకున్నాం. పాండవులు చివరి రోజులలో స్వర్గాన్ని చేరుకోవడానికి హిమాలయాలు మీదుగా ప్రయాణం చేయడం. కాని, స్వర్గం ఉండేది భూమిపై కాదు. మరి స్వర్గాన్ని చేరుకోవడానికి భూమిపై ఉన్న హిమాలయాలకు వెళ్లడం ఏంటి అని అనుమానం వస్తుంది. నాక్కుడా వచ్చింది.


పైన చెప్పిన వార్మ్ హోల్ సిద్ధాంతం ఇక్కడ మనం అర్ధం చేసుకోవాలి. హిమాలయాల్లో స్వర్గానికి చేరుకునే వార్మ్ హోల్స్ ఉన్నాయన్న మాట. అలాగే ఆది శంకరాచార్యుల వారు బద్రీనాథ్ వద్ద అంతర్ధానం అయిపోయారని ఆయన చరిత్ర చెబుతుంది. అంటే అక్కడ వార్మ్ హోల్ ద్వారా ఆయన పరంధామం చేరుకున్నారని అర్ధం అవుతుంది.


మన హిందూ సనాతన ధర్మము ప్రకారం, మరియు గరుడ పురాణం బట్టి చూసినా చనిపోయిన వారికి 11 -15 రోజుల వరకూ ప్రతీరోజూ పిండ ప్రధానం చేస్తారు. ఆ తరువాత సంవత్సరం వరకూ నెలకొక్కసారి చేస్తుంటారు. ఆ తరువాత సంవత్సరానికి ఒకసారి చేస్తుంటారు.


ఎందుకో తెలుసా, చనిపోయిన 11 – 15 రోజుల వరకూ జీవుడు భూమిపైనే ఉంటాడు. అందుకే ప్రతీరోజు పిండ ప్రధానం చేస్తాం. ఆ తరువాత జీవుడు స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరు కోవడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది గరుడ పురాణం ప్రకారం. ఆ సమయంలో భూమిపై నెలరోజుల కాలం ఆ లోకంలోని వారికి ఒకరోజుతో సమానం. అందుకే నెలకొకసారి చేస్తే వారికి రోజు కొకసారి పెట్టినట్టు. ఇక సంవత్సరం తరువాత స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరుకుంటారు. అప్పుడు సంవత్సరానికి ఒకసారే పెడతాం.


ఎందుకంటే అక్కడ ఒక రోజు, భూమిపై ఒక సంవత్సరంతో సమానం. ఇలానే ఎన్నో లోకాలు, ఎన్నో డైమెన్షన్లు ఉన్నాయి. ఈ లోకాల మధ్య ఉన్న కాల వ్యత్యాసమే "సమయ విస్ఫారణం"(Time Dilation) అంటాం.


ఇట్లానే.. బ్రహ్మ దేవుఁడు శ్రీకృష్ణుని స్నేహితులను అపహరించినపుడు కూడా ఒక క్షణం పాటు అది ఒక సంవత్సరం అయ్యింది. అప్పుడు కృష్ణుడే అన్ని రూపాలుగా మారి అందరి పిల్లలుగా, జంతువులుగా మారి బ్రహ్మకు గుణపాఠం చెప్తాడు.


ఇలా మన పురాణాలలో ఎన్ని విషయాలు ఉన్నాయో కూడా తెలియని ఈ ప్రస్తుత సమాజం, మన సంస్కృతిని కాదని ఏ తల తోక లేని పర మాయలో పడుతున్నారు. మన తరువాత ఎప్పుడో వచ్చిన మాయలు ఇలాంటి విజ్ఞానంలో మన హిందూ సనాతన ధర్మమునకు దరిదాపుల్లో కూడా రాలేవు.


కుదిరితే ఈ వ్యాసం అందరికి పంపండి. కనీసం చదువుకున్న వాళ్లకు అర్థం అవుతుంది.


|| ఓం నమః శివాయ ||,

(సేకరణ)

ప్రపంచ నవ్వుల దినోత్సవం*...

 నేడు *ప్రపంచ నవ్వుల దినోత్సవం*...

*మే* నెల మొదటి *ఆదివారం* (05.05.24) ప్రపంచ నవ్వుల దినోత్సవం  గా జరుపుకుంటారు.


*నవ్వు* అనేది  అఖిలాండ సకల చరాచర జీవకోటి లో *మనిషి* మాత్రమే చేయగల క్రియ.


మనిషి కి మాత్రమే లభ్యమైన చక్కటి వరం *నవ్వు* ను, ఒక రోజు లో ఏన్ని సార్లు మనం వ్యక్త పరుస్తున్నాం.


*చిరు మందహాసం, బోసి నవ్వు,మధ్య తరహా ధరహాసం, వికట్టాట హాసం, గేలి హాసం,* *విజయ హాసం* ....అన్ని నవ్వులే.


నవ్వు లో ....ఎన్నో తేడాలు... మరెన్నో భావాలు... ఇంకెన్నో భావనలు...


*నవ్వు,నవ్వు కు వ్యత్యాసం వుంటుంది.*


*మనసార నవ్వండి,కడుపారా నవ్వండి,తనివితీర నవ్వండి*


నవ్వటానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదండి.


చక్కటి భేషయిన చిరు నవ్వు తో ఎదుటివార్ని పలకరించండి.


నేను నవ్వుతా....నలుగుర్ని నవ్విస్థా....నవ్వుల పాలు అవ్వను.


*మూర్తి,ఫిజిక్స్ లెక్చరర్, కాలమిస్ట్.*

వృద్ధాప్యం

 -- శ్రీ గొల్లపూడి మారుతీరావు.


*వృద్ధాప్యం ఒక మజిలీ!*


*ప్రతీ వ్యక్తీ కోరుకున్నా, కోరుకోక పోయినా తప్పని సరిగా చేరుకునే మజిలీ.*


*వయస్సులోని కోరికలన్నింటికీ సెలవిచ్చి, అలసి పోయిన అనుభవాలనీ, .ఆరిపోయిన అనుభూతులనూ నెమరు వేసుకునే చలివేంద్రం.*



*వృద్ధాప్యం ఒక అవకాశం!* 


*వెనక్కి తిరిగి చూసుకుని,  చేసిన తప్పిదాలకు నవ్వుకుని, దాటిన అడ్డంకులను పరామర్శించి,  ఇక దాటనక్కరలేని స్థితికి వచ్చినందుకు ప్రశాంతంగా నిట్టూర్చే ఆటవిడుపు.*


*ముసిలితనం కొడుకుకంటె ఒక అడుగు వెనక నడిపిస్తుంది.*


*మనవరాలి భుజాన్ని ఆసరా చేసుకుంటుంది.*


*జీవితమంతా కొరుకుడు పడని నిజాలతో ఆనందంగా రాజీపడేటట్టు చేస్తుంది.*


*పిల్లలు “నీకేం తెలీదు నాన్నా!” అంటే కోపం రాదు.*


*ఒక జీవిత కాలాన్ని 'తెలీని తనానికి తాకట్టు' పెట్టిన కొడుకుని చూసి నవ్వు కుంటుంది.*


*తనకి తెలీదని పక్కకి తప్పించే తరాన్ని చూసి గర్వ పడుతుంది.*


*అవలీలగా అర్థం చేసుకుంటుంది. “వాడికి తోచినట్టే చెయ్యనివ్వండి” అనే భార్య హితవుకి గంభీరంగా తలవొంచుతుంది.*


*ఏ విమర్శా అవమానం అనిపించదు. ఏ నిందకీ కోపం రాదు.*

*వృద్ధాప్యాన్ని అందరూ గౌరవిస్తారు.*


*నీ జీవితకాలంలోని సాధనల్ని పక్కనపెట్టి, కేవలం వయస్సు కారణంగానే పెద్దరికాన్ని అంగీకరిస్తారు.*



*వృద్ధాప్యం- అదొక అంతస్థు!* 


*అతని హితవుని నలుగురూ వింటారు, నీ ఆలోచనని గౌరవిస్తారు.*


*దాన్ని పాటించరని అర్థమవుతున్నా కోపం రాదు.*


*వయస్సు అర్థం చేసుకునే సంయమనాన్ని నేర్పుతుంది.*


*”మా రోజుల్లో...” అని చెప్పుకోవడంలో చిన్న 'సాకు'ని వృద్ధాప్యం మప్పుతుంది.*


*”ఈ కాలం కుర్రాళ్లు...” అన్న వెక్కిరింతకి అర్హతని సంపాదించి పెడుతుంది.*


*తన గురించి తన పెద్దలూ అలనాడు.. అలాగే అనుకొని ఉంటారని అప్పుడు జ్ఞాపకం వస్తుంది.*


*వేసిన ప్రతీ అడుగూ తెలిసి వేసే నమ్మకాన్నిస్తుంది.*


*చేసే ప్రతీ పనీ యిబ్బంది లేని, శ్రమ అనిపించని మార్గం వేపే ప్రయాణం చేయిస్తుంది.*


*తన 'రేపు' క్రమక్రమంగా కురుచనయి పోతోందని అర్థమవుతూంటుంది.*


*దక్కిన చిన్న తప్పుల్ని వృద్ధాప్యం భద్రంగా అలంకరించుకుంటుంది.*


*”మనకి చేతకాదు” అని చెప్పడం పెద్ద అర్హతగా కనిపిస్తుంది.*


*అసాధ్యానికి 'అనవసరం' అంటూ గడుసుదనం చిన్న ముసుగువేస్తుంది.* 


*దానికి ఊతం - వృద్ధాప్యం!*



*జీవితంలో చాలా ప్రశ్నలకు సమాధానాలు అర్థమవుతూంటాయి.*


*ఇప్పుడా సమాధానాలకూ వేళ మించిపోయిందని అర్థమవుతుంది.*


*ఈ సమాజంలో అవినీతి అనే కుళ్లు ఎప్పుడు తొలగుతుంది?*


*ప్రతీక్షణం దోపిడీకి గురవుతున్న ఈ పర్యావరణం ఒక్కసారి ఎదురు తిరిగితే ఏమవుతుంది?*


*ఏమయినా తనకేం బాధలేదు.             ఆ సమయంలో తను ఉండడు.*


*ఈ జీవితంనుంచి శలవు తీసుకోవడమే తనకి ఉపశమనం.*


*దేవుడు ఎక్కడ ఉంటాడు?*

*ఎలా వుంటాడు?*


*మృత్యువు తరువాత ఏమవుతుంది?*


*సమాధానాలు అర్థమయే క్షణాలు దగ్గరవుతున్నాయి.*


*చుట్టూవున్న జీవితాన్ని క్రమంగా ఖాళీ చేసుకుంటుంది వృద్ధాప్యం.*


*చిన్నకేక తుళ్లిపడేటట్టు చేస్తుంది. చిన్న నిశ్శబ్దం ప్రశాంతంగా ఉంటుంది.*


*ఎప్పటిలాగే తెల్లారి,*

*వృద్ధులతో కలిసి నడిచి,*

*రెండుముద్దల అన్నం తిని,*

*అరగంట సేదతీరి,*

*వేడి టీ తాగి,*

*సాయంకాలం పార్కు బెంచీ దగ్గర 'ఈ దేశం తగలడి పోతోంద'ని తిట్టుకుని, శాంతపడి,*

*కీళ్ల నొప్పులకు మాత్రలు మింగి, రాని నిద్రనీ,*

*నిన్నటి జ్ఞాపకాలనీ నెమరు వేసుకోవడం - వృద్ధాప్యం వ్యసనం*


*ఇప్పుడు విచారం దగ్గరకు రాదు.*


*వెళ్లిపోయిన హితులూ, సన్నిహితులూ దిగులుగా జ్ఞాపకం వస్తారు.*


*ముగింపు భయపెట్టదు.*

*ఎందుకంటే భయపడినా రాకతప్పదు కనుక.*


*అన్నిటినుంచీ, అందరినుంచీ తనని కుదించుకుని - మెల్లగా అంతర్ముఖుడు కావడం వృద్ధాప్యం.*


*ఇప్పుడు అన్ని దురదృష్టాలకూ కారణాలు అర్దమౌతాయి.*


*చేసిన తప్పిదాలు,*

*మాటతప్పిన కప్పదాట్లూ,*

*మనసు నొప్పించిన చిన్న చిన్న జ్ఞాపకాల ముళ్లూ - అవన్నీ ఓ జీవితకాలం ఆలస్యంగా కళ్లముందు కదుల్తాయి.*


*ఈ అనుభవాల్ని హెచ్చరికలు చెయ్యబోతే పిల్లలు వినరు.*


*వినినట్టు నటిస్తారు. నటిస్తున్నారని తనకీ తెలుసు. విన్న తృప్తిని తానూ నటిస్తాడు.*


*వారికీ వృద్ధాప్యం ఒకనాడు పాఠాలు చెప్తుందని తెలుసు.*


*కాని వృద్ధాప్యం  ఒక వరమని ఇప్పుడు చెప్పి ఒప్పించలేడు.*


*వారు ఒప్పుకునే వేళకి తను ఉండడు.* 


*జీవితం ఎంత విచిత్రం! నవ్వుకుంటాడు.*


*ఆ నవ్వు ఖరీదు ఒక జీవితం.*


*'చమకం'*

*ఏ ఋషి,*

*ఏ మహానుభావుడు ఎప్పుడు సృష్టించారో,*


*ఎంత ముందుచూపు,*

*ఎంత వినయసంపద,*

*జీవుని నిస్సహాయత,*

*నిర్వేదం - అందులో ఎంత నిక్షిప్తమయి వుందో,*


*ఆనాటి కోరిక సంపూర్ణమయిన స్వరూపంతో కళ్లముందు దర్శనమిచ్చేనాటికి -  తాను జీవితమంతా కోరుకున్న 'వృద్ధాప్యం' తనని ఆవరించుకుని ఉంటుంది.*


*ఈ దేశపు వేదసంపద, సాంస్కృతిక వైభవం,*

*జాతి దర్శనం అపూర్వం, అనన్యసామాన్యం.*


*చమకంలో…*

*'వృద్ధం చమే'*

*అనే ఒక్క కోరికా*

*ఈ జాతినీ,*

*మతాన్నీ,*

*ఆలోచనా స్రోతస్సునీ అత్యద్భుతంగా ఆవిష్కరించే అభిజ్ఞ.. వరం.*


*భగవంతుడిని కోరడంలోనే భగవంతుడు ప్రసాదించిన తన ఆలోచనా పరిణతిని అలంకరించే భగవద్దత్తమైన ఆశీర్వాదం.*


*అదీ వృద్ధాప్యం.!*🧘

గోధుమగడ్డి రసం

 గోధుమగడ్డి రసం ఉపయోగాలు - సంపూర్ణ వివరణ.


       గోదుమగడ్డి రసం అనునది వైద్యంలో చాలా ప్రముఖపాత్ర కలిగి ఉంది. చాలా మందికి దీనియొక్క ఉపయోగాలు తెలియక నిర్లక్ష్యం చేస్తున్నారు . గత కొంతకాలంగా దీనిపైన కొంతపరిశోధన చేసి దీని ఉపయోగాలు తెలుసుకున్నాను. ఈ గోధుమగడ్డి రసం కేన్సర్ చికిత్సలో కూడా చాలా అద్బుతఫలితాలు ఇచ్చింది. ఇది జలుబు , దగ్గు లాంటి చిన్నచిన్న వ్యాధులనే కాక బ్లడ్ కేన్సర్ , కేన్సర్ వంటివాటిలో కూడా చక్కని ఫలితాలు ఇస్తుంది.


             డాక్టర్ థామస్ అనే పరిశోధకుడు కూడా ఈ గడ్డిపైనా చాలా అద్భుతపరిశోధనలు చేశాడు . ఈ గడ్డిలో జీవమున్న ఖనిజాలు , విటమిన్లు , ఇతర పోషకాలు అనేకం ఉన్నాయి అని కనుగొనినాడు. ఒక ఆరోగ్యవంతుడి రక్తములో ఉండే అన్ని రకాల పదార్ధాలు ఈ గోధుమగడ్డి రసములో ఉండును. ఈ గోధుమగడ్డి రసానికి "ఆకుపచ్చ రక్తం " అనికూడా పేరు కలదు. కేన్సర్ తో బాధపడువారు ఒక గ్లాసు నిండా గోదుమగడ్డి రసాన్ని రోజుకి నాలుగుసార్లు తీసుకొనవలెను . ఇలా రోజుకి నాలుగు గ్లాసుల చొప్పున గోదుమగడ్డి రసాన్ని తీసికొనవలెను .


              ఈ గోధుమగడ్డికి జీవమున్న ఆహారం అని పేరు కలదు. దీనిలో ఉండే "క్లోరోఫిల్" రక్తాన్ని శుద్దిచేస్తుంది. పేగుల్లోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది . గోదుమగడ్డి రసంలో ఉండు క్లోరోఫిల్ పార్టికల్స్ హిమోగ్లోబిన్ ని పోలి ఉంటాయి. అందువల్ల రక్తహీనతకు ఐరన్ లా పనిచేయును . ఈ క్లోరోఫిల్ గుండె పనితీరును మెరుగుపరుచును. శరీరవ్యవస్థను , పేగులను , మూత్రకోశం , ఊపిరితిత్తులను బాగుగా ప్రభావితం చేయును . దీనిలో విటమిన్ A , B , ఈ మరియు K పెద్దమొత్తంలో ఉంటాయి. గోధుమ కంటే 600 శాతం అధికంగా విటమిన్ B ను గోధుమగడ్డి కలిగి ఉంటుంది. గోధుమగడ్ది లో కేన్సర్ నివారణకు ఉపయోగపడు B17 పెద్దమొత్తంలో ఉన్నది. గోధుమల కంటే గోధుమగడ్డిలో 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 


                శరీరంలో 30 రకాల ఎంజైములను చురుకుగా ఉంచడానికి అవసరం అయిన మెగ్నీషియం ఖనిజాలు గోధుమగడ్డి రసములో తేలికగా లభ్యం అగును. ఇప్పుడు మీకు గోధుమగడ్డి రసం వాడటం వలన నయం అయ్యే కొన్నిరకాల వ్యాధుల గురించి తెలియచేస్తాను . అవి 


     చర్మవ్యాధులు , మానసిక , శారీరక వ్యాధులు , మూత్రకోశ సంబంధ వ్యాధులు , మూత్రపిండాలలో రాళ్లు , మలబద్దకం , కడుపువ్యాధులు , మధుమేహం , గుండెవ్యాధి , కీళ్లు , కండరాల వ్యాధులు , ఆస్తమా , వంధత్వము , కన్ను , చెవి సంబంధ వ్యాధులు , కంపవాతం , దీర్ఘకాలిక జలుబు , అగ్నిమొలలు , వయస్సుకు ముందే జుట్టు నెరవడం , స్త్రీ గర్భసంబంధ వ్యాధులు , నిద్రలేమి , రక్తహీనత , కేన్సర్ వంటి వ్యాధులు 


             పైన చెప్పిన సమస్యలతో బాధపడువారు రోజుకు నాలుగు గ్లాసుల చొప్పున తక్కువలోతక్కువ 21 రోజులపాటు తీసుకొనవలెను .


    

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

ఇతిహాసాలు

 *📖 మన ఇతిహాసాలు 📓*


*కురుక్షేత్ర మహా సంగ్రామం - 5️⃣*



*యుద్ధ వ్యూహాలు*



యుద్ధ సమయంలో ఇరు పక్షాలూ తమ తమ సేనలను వివిధ వ్యూహాలలో సమాయత్తం చేసుకొన్నాయి. ఆ రోజు యుద్ధంలో సాధించ దలచిన లక్ష్యానికి అనుగుణంగాను, ఎదుటి పక్షం బలాబలాలను ఎదుర్కోవడానికి వీలుగాను ఈ వ్యూహాలు పన్నినట్లు అనిపిస్తుంది. ఈ వ్యూహాల పేర్లు ఆ వ్యూహాల స్వరూపానికి అనుగుణంగా జంతువులు లేదా వస్తువుల పేర్లతో ఉన్నట్లున్నాయి.


వ్యూహ రచన గురించి "డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జున రావు" ఇలా రాశాడు*


విశిష్టమైన సైన్య రచనా పద్ధతిని వ్యూహం అని వ్యూహ శాస్త్రనిపుణులు వివరిస్తారు. తమ సైన్యం తక్కువగాను, ఎదటి సైన్యం ఎక్కువగాను ఉన్నప్పుడు వ్యూహం బాగా ఉపయుక్తమవుతుంది. ఒకవేళ అధికంగా సైన్యం ఉన్నా ఒక కట్టుదిట్టమైన విధానంతో దీన్ని విస్తరింపచేస్తూ తక్కువ ప్రాణనష్టం జరిగేలా, విజయం తమకు దక్కేలా తగినట్లుగా వ్యూహాన్ని నిర్మించుకోవాలి. మహాభారత యుద్ధ సమయంలో క్రౌంచ వ్యూహం, గరుడ వ్యూహం, మకర వ్యూహం, కూర్మవ్యూహం, శకట వ్యూహం, సూచి, శ్యేన, వజ్ర, అచల, సర్వతోభద్ర, మండలార్థ, శృంగాటక ఇలా అనేకానేక రకాల పేర్లతో వ్యూహాలు రూపొందించారు. పశువులు, పక్షుల పేర్లతో రూపొందించే వ్యూహాలు నిజానికి ఆయా పశువులు, పక్షులు తమ శత్రువులతో ఎలా పోరాడితే గెలుస్తున్నాయో అటువంటి స్వభావాన్ని అంతటినీ వ్యూహ రచయిత సంపూర్ణంగా అవగతం చేసుకుంటాడు. అచలం అంటే పర్వతం, అచల వ్యూహమన్నప్పుడు ఒకచోట ఒక క్రమపద్ధతిలో కొండలాగా కదలకుండా సైన్యం ఉండి శత్రువును ఎదుర్కొంటుంది, మకర వ్యూహంలో మకరం అంటే మొసలి, మొసలి నోరుభాగం అతి భయంకరంగా ఉంటుంది. దీన్ని తలపిస్తూ మకర వ్యూహన్ని రూపుదిద్దుతారు. కూర్మం వీపు భాగం ఎంతో గట్టి కవచంలాగా ఉంటుంది. కూర్మవ్యూహం పన్నేటప్పుడు సైన్యంలో ప్రధానమైన వారికి ఎవరికీ దెబ్బతగలకుండా మిగిలిన సైనిక భాగాలన్ని రక్షక కవచంలాగా ఉంటాయి. శ్యేనం అంటే డేగ, డేగ కళ్ళు ఎంతో చురుకుగా ఉంటాయి. ఆ కళ్ళతోటే తనకు కావలసిన పదార్థాన్ని ఎంతో దూరం నుండి చూసి చాకచక్యంగా తన ఆహారాన్ని తన్నుకుపోతుంది. అలాగే శత్రుసైన్యాన్ని చిత్తు చేయటానికి ఈ వ్యూహాన్ని వాడతారు. క్రౌంచ పక్షి ముక్కు చాలా ధృడంగా ఉంటుంది. ఈ వ్యూహంలో ముక్కు భాగంలో ఉండే వారిని జయించటమంటే శత్రువు ఎంతో కష్టానికి గురికావలసి వస్తుంది. వ్యూహాలు పన్నటానికి తగిన సమయం, వాటికి సంబంధించిన విషయాలను శుక్రనీతిలో గమనించవచ్చు. నదులు, అడవులు, దుర్గాలు, తదితర ప్రాంతాలలో తమ సేనకు ఏదైనా ముప్పు వాటిల్లబోతుంది అని సేనాపతి భావించినప్పుడు సందర్భానికి తగిన వ్యూహరచన చెయ్యడం జరుగుతుండేది. సైన్యం ప్రయాణిస్తున్నపుడు అగ్రభాగంలో ఉన్న సైనిక బలానికి ప్రమాదం ఎదురవుతుందన్నప్పుడు మొసలినోరు భాగాన్ని పోలినట్లుగా మకర వ్యూహాన్ని పన్ని శత్రువును చిత్తు చేసేవారు. అవతల శత్రువు కూడా బలంగానే ఉంటే డేగను పోలిన శ్యేన వ్యూహాన్ని పన్నేవారు. శ్యేన వ్యూహం పన్నటానికి ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే సూదిలాగా ముందుకు దూసుకుపోయి శత్రువును నాశనం చెయ్యటానికి సూచీ వ్యూహాన్ని పన్నేవారు. అగ్రభాగాన కాక, వెనుక భాగంలో శత్రువు వల్ల ప్రమాదం కలుగుతుందనుకుంటే శకటం (బండ) లాగా వ్యూహారచన చేసేవారు. ముందూ వెనుకా కాక పక్క భాగాల నుండి ప్రమాదం ముంచుకొస్తుందనుకుంటే వజ్ర వ్యూహాన్ని అలా కూడా కాక నాలుగువైపుల నుండి శత్రువులు దాడి చేయబోతున్నారనుకున్నప్పుడు చక్రవ్యూహమూ భద్రం, వ్యాళం అనే పేర్లున్న వ్యూహాలను కానీ పన్నేవారు. ఈ వ్యూహాలలో కొన్ని శత్రువులను దెబ్బతీయడానికి ఉపయుక్తమయ్యేవిగా ఉండగా, మరికొన్ని తమను తాము కాపాడుకోవటానికి పనికొచ్చేవిగా ఉంటాయి. వ్యూహాలకు అందులో వుండే సైనికులకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ ముందుకు నడవటానికికానీ శత్రువును నిర్భయంగా ఎదుర్కోమని చెప్పటానికి కానీ, వెనక్కి తిరిగి రమ్మనమని చెప్పటానికి కానీ సంబంధిత నాయకులు యుద్ధ సమయంలో ఉపయోగంచే వాద్య పరికరాలను ఉపయోగించటం, రథానికున్న ధ్వజాలు, జెండాలతో సూచనలు చేయడం లాంటివి చేస్తుండేవారు. ఇలా వ్యూహారచనా విన్యాసాలు సమరకళలో ఆనాడు ఎంతో ప్రాధాన్యం వహిస్తుండేవి


*మిగతా భాగం రేపటి* *📖 మన ఇతిహాసాలు లో‌‌‌‌....📓*

Panchaag


 

Akka mahadevi cave srisailam


 

నర్మదాష్టకం

 వశిష్ఠ శిష్ట పిప్పలాద కర్దమాది శర్మదే త్వదీయ పాప పంకజం నమామి దేవి నర్మదే


6.


సనత్కుమార నాచికేత కశ్యపాత్రి షట్పదై ర్ద్రృతం స్వకీయ మానసేషు నారదాది షట్పదైః రవీందు రంతిదేవ దేవరాజ కర్మ శర్మ.. త్వదీయ పాప పంకజం నమామి దేవి నర్మదే


7.


లక్షలక్షలక్షపాపలక్షసారసాయుధం తతస్తు జీవజంతు తంతు భుక్తిముక్తి దాయకం విరించి విష్ణు శంకర స్వకీయ ధామ నర్మదే త్వదీయ పాప పంకజం నమామి దేవి నర్మదే


జ్ఞాన సంహిత


8.


అహోధృతం స్వనం శృతం మహేశకేశ జాతటే కిరాత సూత బాడ భేషు పండితే శఠే నటే దురంతపాప తాపహారి సర్వజంతు శర్మదే త్వదీయ పాప పంకజం నమామి దేవి నర్మదే


ఇదంతు నర్మదాష్టకం త్రికాలమేవ ఏ సదా పఠంతి తే నిరంతరం న యాంతి దుర్గతిం కదా సులభ్య దేహ దుర్లభం మహేశధామ గౌరవం పునర్భవ నరా నవై విలోకయంతి రౌరవం


(ఇతి శ్రీమచ్ఛంకారాచార్య విరచితం నర్మదాష్టకం సంపూర్ణం)

జప ఇత్యభి ధీయతే ॥

 శ్లో ॥ జకారో జన్మ విచ్ఛేదః పకారో పాపనాశకః । జన్మ పాప వినాశిత్వాత్ జప ఇత్యభి ధీయతే ॥


“జ” అనగా జన్మ విచ్ఛేదనము చేయునది 'ప' అనగా పాపమును నశింప చేయునది అని అర్థము. రెంటిని నశింప చేయుట చేతనే జపమని పేరు గల్గినది. నిశ్చల మనస్సుతో దైవము మీద మనస్సు కేంద్రీకరించి తత్ మంత్ర దేవతా మూర్తి యొక్క గుణ రూపములను మనస్సు నందుంచుకొని జపించవలెను. మంత్రము యొక్క భావమును పునశ్చరణ చేయుచు ఆ భావమును వివిధ పర్యాయములు దేవతా రూపము నందు ఐక్యము చేయుటయే జపము. మనో వాక్కాయ కర్మణములతో కాపాడమని దైవమును రక్షణకై శరణాగతి వేడుటవలననే పరిపూర్ణ ఫలము నివ్వగలదు. జపము అంటే మాలను వ్రేళ్లతో త్రిప్పుచు మనస్సు ఎక్కడో ఉంచి జపము చేయుట కాదు. పరిశుద్ధ భావముతో చేయవలసినది జపము. “యద్భావం తద్భవతి" అంటే మనస్సు నందు ఏ భావమును ఉంచుకోనే దమో, ఫలములు కూడా వాటి ననుసరించియే యుండునన్న ఆర్యోక్తి గుర్తుంచుకొని సద్భావన. సత్చేంతనలతో, ఏకాగ్ర బుద్ధితో జపము నాచరించ వలయును.

Anduke naayana






















 

Go geeta


 

ఆయుర్దాయం కలుగుతుంది.

 కార్తీక శుద్ధ ద్వాదశి తిథినాడు దృవోపాఖ్యానం చదవడం లేదా వినడం ఎంతో అదృష్టం....


ధ్రువోపాఖ్యానం:


భాగవతంలో ధృవోపాఖ్యానం అనే ఒక ఉపాఖ్యానం ఉంది. మీరు క్రతువు చేసేటప్పుడు ఒక పుణ్యదినం నాడు ఒక వ్రతం చేయాలి అంటే మనస్సు అక్కడ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని కోట్లజన్మల తరువాత ఎప్పుడో ఎవడో ఒక్క మనుష్యుడు మాత్రమే ఈశ్వరుని అనుగ్రహం పొందిన వాడు మాత్రమే ద్వాదశినాడు ధృవోపాఖ్యానమును వింటున్నాడు. ద్వాదశినాడు ధృవోపాఖ్యానం వింటే ఎన్నో మంచి ఫలితములు వస్తాయి. ఎన్నో గ్రహములు ఉపశాంతి పొందుతాయి. ఎంతో మేలు జరుగుతుంది. మనిషి జీవితంలో ధృవుని వృత్తాంతమును వినాలి. భాగవతాంర్గతముగా వినడం అనేటటు వంటిది మరింత గొప్పవిషయం. ద్వాదశినాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ దినక్షయమునందు కానీ, అసురసంధ్యవేళ కానీ ధృవచరిత్ర వింటే చాలా మంచిది. సుందరకాండ తెలియని వారు ఎలా ఉండరో అలా ధృవోపాఖ్యానం, ప్రహ్లాదోపాఖ్యానం తెలియని వారు ఉండరు.

ధృవచరిత్ర ఒక ఆశ్చర్యకరమయిన సందర్భము. మైథునసృష్టి జరగడం కోసమని బ్రహ్మగారు తన శరీరంలోంచి శతరూపనే స్త్రీ స్వరూపమును, స్వాయంభువ మనువనే పురుషస్వరూపమును సృష్టి చేశారు. వారిద్దరిని సృష్టి చేయమని బ్రహ్మగారు ఆదేశించారు. వారికి ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడనే ఇద్దరు కుమారులు కలిగారు.

ఉత్తానపాదుడికి మొదటి భార్య సునీతి, రెండవ భార్య సురుచి. ఆ ఇద్దరు భార్యలతో చాలా సంతోషముగా ఉత్తానపాదుడు జీవితమును గడుపుతున్నాడు. ఉత్తాన పాదుడు అంటే పైకి కాళ్ళు ఉన్నవాడు. సునీతి ఎప్పుడూ నీతి చెపుతూ ఉంటుంది. సునీతికి ఒక కుమారుడు, సురుచికి ఒక కుమారుడు కలిగారు. సునీతి కుమారుడు ధృవుడు. సురుచి కుమారుడు ఉత్తముడు. సాధారణంగా ఎవరికయినా జ్ఞానం పట్ల వైరాగ్యం పట్ల మమకారం ఎప్పుడు ఎప్పుడు కలుగుతుంది? అసలు భోగం అనుభవిస్తే వైరాగ్యం అనే మాట వస్తుంది. భోగమే అనుభవించని వాడికి వైరాగ్యం అనే మాటకు అర్థం లేదు. రాజు యిన ఉత్తానపాదుడికి సురుచియందున్న ప్రేమ సునీతియందు లేదు. సునీతియందు లోపల గౌరవం ఉన్నా సురుచికి లొంగిపోయిన వాడవడం చేత సునీతిని గౌరవించలేడు. ఒకనాడు ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. ఒకనాడు అంతఃపురంలో ఉత్తానపాదుడు కూర్చుని ఉన్నాడు. పక్కన సురుచి నిలబడి ఉన్నది. సురుచి కొడుకయిన ఉత్తముడు తండ్రి తొడమీద కూర్చున్నాడు. సునీతి కొడుకయిన ధృవుడు పరుగుపరుగున వచ్చాడు. అతనికి కూడా తండ్రి తొడమీద కూర్చోవాలని కోరిక కలిగింది. తండ్రి ధృవుని తన తొడమీద ఎక్కించుకోలేదు. తండ్రికి కొడుకు మీద ప్రేమలేక కాదు. సురుచి ప్రక్కన ఉండడం వలన ధృవుని తన తొడమీదకి ఎక్కించుకోలేదు. ఒకసారి సురుచి వంక చూశాడు. ఆవిడ ఒక గమ్మత్తయిన మాట అంది. ‘నీవు నిజంగా తండ్రి తొడమీద కూర్చునే అదృష్టం పొందిన వాడవయితే నా కడుపున పుట్టి ఉండేవాడివి. నీకు ఆ భాగ్యం దక్కదు’ కేవలం ఆభిజాత్యముతో ఈమాట అన్నది. సురుచి మళ్ళీ ‘నా కడుపున పుట్టడం అంటే మాటలు కాదు. నా కడుపున పుట్టాలి అంటే ఎంతో అదృష్టవంతుడవయి ఉండాలి. నా కడుపున పుట్టలేక పోయిన వాడు తండ్రి తొడమీద కూర్చోవాలంటే ఏమి చేయాలో తెలుసా? ఇంద్రియములకు లొంగని వాడయిన అధోక్షజుడయిన శ్రీమహావిష్ణువు పాదారవిందములను సంసేవనం చేయాలి. అపుడు ఆయన అనుగ్రహిస్తాడు’ అన్నది. నిజమునకు శ్రీమన్నారాయణుని అనుగ్రహం ఉన్నది కాబట్టి ధృవుడు సునీతియందు పుట్టాడు. ధ్రువుడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు. అమ్మ వాడిని ఎందుకురా ఏడుస్తున్నావు’ అని అడిగింది. జరిగిన విషయం అంతఃపురకాంతలద్వారా తెలుసుకున్నది సునీతి. ఆవిడ కొడుకును చూసి ‘నాయనా! మీ నాన్న తొడ ఎక్కనివ్వలేదని ఏడుస్తున్నావు కదా! నువ్వు గత జన్మలలో చేసుకున్న పాపమే ఇవాళ నిన్ను ఏడిచేటట్లు చేసింది. నీ పినతల్లి కాని, నేను కాని, నీ తండ్రి కాని నీ బాధకు కారణం కాదు. నువ్వు చేసుకున్న పాపకర్మయే నీ దుఃఖమునకు కారణం. నిజంగా నీ తండ్రి తొడ ఎక్కి కూర్చోవాలన్న కోరిక నీకు ఉంటే నీ తండ్రి మనస్సును అలా మార్చగల ఈశ్వర పాదములు పట్టుకోవాలి. నీవు అరణ్యములకు వెళ్ళి శ్రీమన్నారాయణుని గూర్చి ధ్యానం చెయ్యి. ఆయన అనుగ్రహం కలిగిందంటే నీ తండ్రి అంకసీమ చేరగలుగుతావు’ అని చెప్పింది.

పిల్లవాడయిన ధృవుడు ‘అమ్మా! అయితే ఇప్పుడు నేను బయలుదేరతాను. శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేస్తాను. ఆ స్వామి అనుగ్రహమును పొందుతాను’ అన్నాడు. లోకకళ్యాణము చేసే నారదమహర్షి వచ్చి ‘నాయనా! నీవు ఎక్కడికి వెడుతున్నావు?’ అని అడిగాడు. ధృవుడు ‘నేను అడవికి వెళుతున్నాను. నారాయణుని గూర్చి తపస్సు చేస్తాను’ అన్నాడు. నారదుడు నవ్వి ‘నీకు నారాయణుని గురించి తపస్సు దేనికి? అని అడిగి ‘ఈ బుద్ధి నీకు నిలబడుగాక!’అని పరమ పావనమయిన తన చేతిని ధృవుని శిరస్సునందు ఉంచాడు. పిమ్మట నారదుడు ధృవుని ‘నారాయణుడు కనపడితే ఏమిచేస్తావు? అని అడిగాడు. ధృవుడు ‘అన్నిటికన్నా చాలా పెద్ద పదవి కోరతాను’ అన్నాడు. నారదుడు ఏ పెద్ద పదవిని కోరతావు’ అని అడిగాడు. ‘ఏమో నన్ను అడగకండి. నాకు ఏ పెద్ద పదవి ఇవ్వాలో ఆయనకు తెలుసు. ముందు నేను ఆయనను చూడాలి ఆయనతో మాట్లాడాలి. ఆయన ఇవ్వగలడని అమ్మ చెప్పింది ఆయన గురించి తపస్సు చేస్తాను ఆయన వస్తారు. పెద్ద పదవి కావాలని అడుగుతాను. దానిని పొంది తిరిగి వస్తాను’ అన్నాడు.

నారదుడు నవ్వి ‘నీవు పొందేదేమిటో నీకు తెలియదా! పెద్ద పదవిని పొందుతావా! అందుకు నేనొకటి చెప్తాను విను. నారాయణుడి కోసం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంద్రియములను జయించే ప్రయత్నంలో వెళ్ళి కూర్చుని తపస్సు చేసిన వాళ్లకి, రాత్రింబవళ్ళు బొటనవ్రేలు మీద నిలబడి తపస్సు చేసిన వాళ్లకి, అంతంత కష్టములు పడినవారికి, శ్రీమన్నారాయణ దర్శనం అవలేదు. నీవు నీకు నేనొక పెద్ద సూత్రం చెపుతాను. దానిని నీవు మనసులో పెట్టుకో. అలా చేస్తే నీకు మనస్సునందు కలిగినటువంటి ఖేదము పోతుంది. నీ కన్నా చాలా గౌరవింపదగినటువంటి పెద్దలు కనపడినట్లయితే నువ్వు వాళ్ళని గౌరవించి నమస్కరించి ఆదరించు సంతోషించు. నీకన్నా ఎక్కువ ఈశ్వర విభూతి ఉన్నవాళ్ళు కనబడితే వాళ్ళని చూసి ఎప్పుడూ అసూయపడకు. సంతోషంతో వారిని చూసి నమస్కరించు. నీతో సమానమయిన విభూతి ఉన్నవారితో మిత్రత్వం చెయ్యి. తక్కువ విభూతి వున్న వాళ్ళు కనిపిస్తే వాళ్ళు కూడా పైకిరావాలని ఈశ్వరుని కోరుకుని కారుణ్యంతో ప్రవర్తించు. ఈ మూడూ గుర్తు పెట్టుకుంటే నువ్వు చక్కగా వృద్ధిలోనికి వస్తావు. ఇక ఇంటికి వెళ్ళు’ అన్నాడు.

ధృవుడు అన్నాడు ‘మీరు చెప్పిన మాటలు వినడానికి చాలా సొంపుగా ఉన్నాయి. నేను పుట్టుక చేత క్షత్రియుడిని కదా! నాకు కొంచెం పౌరుషం ఎక్కువ. మా పిన్ని నన్ను అంతమాట అన్నది. నా మనస్సు ఎంతో గాయపడింది. శ్రీమన్నారాయణ సందర్శనమనే రసాయనమే మా పిన్ని మాటలనే ఈ లోపల కలిగినటువంటి వ్రణమును మాన్పగలదు. శ్రీహరి కనపడతాడా లేదా అనే బెంగలేదు. నేను వెళ్ళి తపస్సు చేస్తాను” అన్నాడు. గురువు పట్టుదలను గుర్తించి ‘నాయనా! నీవు యమునానది ఒడ్డున నిరంతరము శ్రీమన్నారాయణుని పాదస్పర్శ కలిగిన మధువనము అనే ఒక గొప్ప వనం ఉన్నది. నువ్వు అ వనమునకు వెళ్ళి అక్కడ యమునానదిలో స్నానం చేసి శుచియై ఆచమనం చేసి కూర్చో. నీ మనస్సును నిగ్రహించు. భగవంతుడు నాకెందుకు కనపడడని పట్టు పట్టు. పువ్వు లేదా నాలుగు ఆకులు, ప్రధానముగా తులసి తెచ్చుకో. స్వామివారి మూర్తిని నీటిలో కానీ, పవిత్ర ప్రదేశములో కానీ పెట్టి వీటితో పూజ చేయడం ప్రారంభించు. ఏది దొరికితే అది నివేదన చెయ్యి. మితంగా ఆహారం తీసుకో. ఎవ్వరితోనూ మాట్లాడకు. ఈశ్వరుని యందే మనస్సు పెట్టు. నీకు నారాయణుడు కనపడతాడు. నీకు నేను ద్వాదశాక్షరీ మంత్రోపదేశం చేస్తున్నాను. దీనిని ఏడురోజులు నిష్టతో చేసేసరికి నీకు దేవతలు కనపడతారు’ అని చెప్పాడు.

నారదుని మాటలు విన్న ధృవుడు తప్పకుండా అలాగే చేస్తానని చెప్పి గబగబా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయాడు.

నారదుని మాటలు విన్న ధృవుడు తప్పకుండా చేస్తానని చెప్పి గబగబా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయాడు. భగవంతుని ఆరాధన చేసేవాడు. అయిదవ నెల వచ్చేసరికి ఈ పిల్లవాడి నిష్ఠకి కుడికాలు బొటన వేలు తీసి భూమిమీద పెట్టేసరికి భూమండలం అంతా అటు ఒరిగిపోయింది. వాని తపశ్శక్తికి భూమండలం అటూ ఇటూ ఒరగడం ప్రారంభమయింది. ఇలా అపారమయిన తపస్సు చేస్తున్నాడు. దేవతలు అందరూ భూమండలమే కంపించి పోతున్నదని బెంగ పెట్టుకుని గబగబా వైకుంఠమునకు వెళ్ళి ప్రార్థన చేశారు. దేవతలకు ఇపుడు ఒక సంకట పరిస్థితి వచ్చింది. అదే ఒక యౌవనములో ఉన్నవాడు తపస్సు చేస్తుంటే ఒక అప్సరసను తపస్సు భంగం చేయమని పంపిస్తారు.

ఐదేండ్ల పిల్లవాడయిన ధృవుడి దగ్గరికి ఎవరిని పంపిస్తారు? వీనిని ఎలా నిగ్రహించాలో వాళ్లకి అర్థం కాలేదు. దేవతలు స్వామి దగ్గరకు వెళ్ళి స్వామీ! మీరు ఒక్కసారి బయలుదేరి వెళ్ళండి’ అన్నారు. పరమాత్మ ఒక్క నవ్వు నవ్వి ‘ఎవడురా నా గురించి ఇలా తపించినవాడు. వాడిని చూడడానికి పొంగిపోతూ వెడుతున్నాను’ అని లక్ష్మీ సహితుడై, గరుడవాహనారూఢుడై భూమండలమునకు వచ్చాడు. ధృవుడు కళ్ళు విప్పి చూశాడు. ఎవ్వరికీ దర్శనం ఇవ్వని స్వామి, మాంస నేత్రములకు గోచరము కాని స్వామి, ధృవుడికి దర్శనం ఇచ్చాడు. ఈ పిల్లవానికి నారాయణ అని పిలవడం కానీ, స్తోత్రం చేయడం కానీ రాదు. వాని కోరిక ఏమిటో వానికే తెలియదు. స్వామిని పైనుంచి క్రిందికి క్రిందనుంచి పైకి చూస్తూ అలాగే ఉండిపోయాడు. స్వామి ‘వీడు ఇలానే కూర్చుంటాడు. వీనికి స్తోత్రం చేయడం నేనే నేర్పుతానని సమస్తవేదములు ఉపనిషత్తులు వీనికి భాసించుగాక అని నాలుగు అడుగులు ముందుకు వచ్చి తన చేతితో శంఖమును తీసి ధృవుని శిరస్సు మీద ఉంచాడు. ధృవుడు ఎంతో భాగ్యమును పొందాడు అందుకే ద్వాదశినాడు ధృవచరిత్ర వింటే అజ్ఞానం దగ్ధం అయిపోతుంది.

ఆ శంఖం తలకి తగిలింది. అంతే! ధృవుడు పొంగిపోయి స్తోత్రం మొదలుపెట్టాడు. స్వామీ నీవు కనపడ్డావు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను. జన్మజన్మాంతరములకు నాకు కావలసింది ఎప్పుడూ మనస్సంతా ఈశ్వరుని మీద రమిస్తూ ఆఖరుకి దేహం పడిపోతున్నప్పుడు కూడా ఈ శరీరం పడిపోతున్నదని మృత్యుభయమును పొందకుండా ఆఖరిశ్వాసలో కూడా నిన్నే తలుచుకుంటూ పొంగిపోయే లక్షణం ఉన్నటువంటి మహాభాగవతులు నిన్నే పొందుతున్నారు. వారు నీలో ఐక్యం అయిపోతున్నారు. అటువంటివారితో నాకు సాంగత్యం ఇప్పించు తండ్రీ’ అని అడిగాడు. స్వామి ‘నీవు చాలా గొప్ప స్తోత్రం చేశావు. పెద్ద పదవి కావాలని బయలుదేరావు. కానీ ఆ పెద్దపదవి ఎవరికీ ఇవ్వరు. ఇంత చిన్నవాడివి ఆ పదవి ఏమిటో తెలియకుండా ఇంత తపస్సు చేశావు. అందుకే ఆ పదవిని నీకు ఇచ్చేస్తున్నాను. ఆ పదవి ధర్మము, అగ్ని, కశ్యపుడు, సప్తర్షులు, కాలము, నక్షత్ర మండలము, ఋతువులు, సూర్య, చంద్రాదిగ్రహములు ఈ బ్రహ్మాండములు ఏది కదలకపోతే దానిని ఆధారంగా చేసుకుని రంగులరాట్నం తిరిగినట్లు తిరుగుతాయో అటువంటి ధృవమండలం క్రింద నిన్ను మార్చేస్తున్నాను. నీవు ధృవమండలమై వినువీధిన వెలుగుతుంటే నిన్ను ఆధారం చేసుకుని సమస్త జ్యోతిశ్చక్రము తిరుగుతూ ఉంటుంది. ఆ పదవిని నీకు అనుగ్రహిస్తున్నాను. ఇప్పుడే కాదు ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళు. నీకు భవిష్యత్తు కూడా చెపుతున్నాను. నీ తమ్ముడు, పిన్ని మరణిస్తారు. నీకు రాజ్యాభిషేకం జరుగుతుంది. తదనంతర కాలమందు నీకు వైరాగ్యం పూర్ణముగా సిద్ధించి తపస్సు చేస్తావు. నిన్ను అటువంటి ధృవమండలమునకు తీసుకువెళ్ళి తరువాత నాలో ఐక్యం చేసుకుంటాను. ఇదే నీకు చిట్టచివరి జన్మ’ అని చెప్పి స్వామి అంతర్ధానమయిపోయారు.

ధృవుడు అయ్యో! ఇంత తపస్సు చేస్తే ఇదా నాకు ఫలితం’ అనుకోని ఏడుపు ముఖంపెట్టుకుని చిన్నబుచ్చుకున్న ముఖంతో ఇంటికి బయలుదేరాడు. దీనిని చూసి నారదుడు సంతోషించాడు. ఆయన ఉత్తానపాదుడి దగ్గరకు వెళ్ళాడు. ఉత్తానపాదుడు ఎదురువచ్చి స్వాగతం పలికి అర్ఘ్యం ఇచ్చి లోపలి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు. ఉత్తానపాదుడు కొంచెం బాధగా ఉన్నాడు. నారదుడు ఉత్తనపాదుని ‘అంత బాధగా ఉన్నావేమిటని అడిగాడు. దానికి ఉత్తానపాదుడు ‘ఏమి చెప్పుకోను. నాకు ఇద్దరు భార్యలు. పాపం ధృవుడు కూడా నా కొడుకే. వాడు నా తొడ మీద కూర్చుంటానన్నాడు. సురుచిని చూసిన భయంచేత వానిని నా తొడమీద కూర్చోపెట్టుకోలేదు. సురుచి వారిని నారాయణుని గూర్చి తపస్సు చేయమన్నది వాడు తపస్సు చేయడానికని అడవులకు వెళ్ళిపోయాడు. నా మనస్సుకి గాయము అయింది’ అన్నాడు. నారదుడు ‘నీ కుమారుని గురించి నీవు బాధపడుతున్నావు. కానీ ఇవాళ నీ కొడుకు ఏ స్థితిని పొందాడో తెలుసా! ఏ మహాపురుషుని కేవలం క్రీగంటి చూపుల చేత సమస్త బ్రహ్మాండములు రక్షింపబడుతున్నాయో, దేవతలు అందరూ రక్షింపబడుతున్నారో, సృష్టి, స్థితి, లయములు జరుగుతున్నాయో, ఎవరు హేలగా ఈ బ్రహ్మాండములను సృష్టి చేసి కాపాడుతున్నాడో అటువంటి వాని అనుగ్రహము పొంది నీ కొడుకు వరములను పొందాడు’ అని చెప్పాడు. ఈ మాటలు విని ఉత్తానపాదుడు పొంగిపోయాడు.

ఈలోగా ధృవుడు రాజ్యంలోకి వస్తున్నాడని కబురు వెళ్ళింది. తండ్రి పొంగిపోయాడు. పెద్ద ఉత్సవం చేశాడు. సునీతిని తీసుకువచ్చాడు. ఉత్సాహంతో ఎదురు వెళ్ళాడు. తన కొడుకు వరములు పొంది వచ్చాడని కాదు ఉత్తానపాదుడి సంతోషం. తనకొడుకు అడవులకి వెళ్ళి తిరిగి ఏ ఆపద లేకుండా తిరిగి వచ్చాడని సంతోషం. కొడుకును చూడగానే గట్టిగా కౌగలించుకున్నాడు. ఆ కౌగిటిలోంచి జారిపోయి తండ్రి పాదముల మీద పడి శిరస్సుతాటించి తండ్రికి నమస్కరించాడు ధృవుడు. తండ్రి ‘చిరాయుర్దాయం కలుగుతుంది – ఆయుష్మాన్ భవ’ అని ఆశీర్వచనం చేసి బాలుడిని ఎత్తుకుని కౌగిలించుకున్నాడు.

ఇదీ మర్యాద. అంతేకానీ అమ్మ దగ్గరకు వెళ్ళి ‘అమ్మా! ఈయనను ఇన్నాళ్ళనుండి ఎలా భరిస్తున్నావమ్మా’ అని వెర్రిజోకులు తండ్రి మీద వేసేటటువంటి దుష్ట సంస్కారం అసలు ఈ జాతికి తెలియదు. ఎవడో దౌర్భాగ్యుడయిన రచయిత రాసి మనదేశాన్ని నాశనం చేశాడు.

రాజ్యంలోని ప్రజలు అందరూ పిల్లవానికి పట్టాభిషేకం చేయమని అడిగారు. ఉత్తముడు కూడా అంగీకరించాడు. అక్కడికి సునీతి, సురుచి ఇద్దరూ వచ్చారు. ధృవుడు ఇద్దరికీ శిరస్సు వంచి నమస్కరించాడు. ఇద్దరూ ఆశీర్వచనం చేశారు. ధృవుడికి పట్టాభిషేకం జరిగింది.

సురుచి కుమారుడయిన ఉత్తముడు ఉత్తరదిక్కున వున్న హిమాలయ పర్వతముల మీదికి వెళ్ళాడు. అక్కడే ఉత్తముడు ప్రాణములు కోల్పోయాడు. కొడుకు మరణించాడన్న వార్త విని సురుచి అరణ్యములో ప్రయాణిస్తూ కార్చిచ్చు పుట్టి అందులో కాలిపోయి మరణించింది. భాగవతులతో జాగ్రత్తగా ప్రవర్తించక పోతే ఎంత ప్రమాదం వస్తుందో ధృవోపాఖ్యానం మనకి చెప్పింది.

తదనంతర కాలమందు ధృవునికి వివాహం జరిగింది. ‘శిశుమారుడు’ అనే ప్రజాపతికి ఒక కుమార్తె, పేరు భ్రమి. ఆమెను ధృవుడు వివాహం చేసుకున్నాడు. ఆమెయందు ధృవునికి ఇద్దరు కుమారులు జన్మించారు. ఒకడిపేరు వత్సర, రెండవ వాని పేరు కల్ప. తరువాత వాయుదేవుని కుమార్తె అయిన ‘ఇళ’ ను పెళ్ళి చేసుకున్నాడు. ఆమెయందు ఉత్కళ అనే కుమారుడు జన్మించాడు. వేరొక కుమార్తె కూడా జన్మించింది. నిజమునకు ఇవన్నీ ఆయన పొందబోయే పదవి అర్హతలు. ఆయన కదలకుండా ధృవపథమై ఉంటాడు. మిగిలినవన్నీకదులుతుంటాయి. సృష్టి ఉండాలంటే వాయువు ఉండాలి. అందుకని వాయువు కూతురుని వివాహం చేసుకున్నాడు. భ్రమి అంటే కదులుటని అర్థం. జ్యోతిశ్చక్రమునందు సూర్యమాన చాంద్రమానములచేత తిథులు నక్షత్రంలు బ్రహ్మాండమునందు కాలమునందు కదులుతూ ఉంటాయి. కదులుతున్న కాలమునకు కదలని తాను ఆధారభూతుడై ఉంటాడు. కాలమునకు హద్దు ‘వత్సర’ – అంటే మనం ఒక సంవత్సరమును కాలమునకు ముందు ప్రమాణంగా చెప్తాము. అందుకని వత్సరం ఒక హద్దు. యుగాంతము అయిపోయిన తర్వాత హద్దు కల్పము.

ఉత్తముడిని ఒక యక్షుడు సంహరించాడని తెలుసుకుని ఆగ్రహించి యుద్ధానికి బయలుదేరాడు. రథం ఎక్కి హిమాలయ ప్రాంతమునకు వెళ్ళి కుబేరుని సైన్యమయిన యక్షులతో విశేషమయిన యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో కొన్ని వేలమంది యక్షులను చంపేశాడు. తదుపరి నరనారాయణాస్త్రమును ప్రయోగించడానికి మంత్రమును అనుష్ఠానం చేస్తున్నాడు. ఆ సమయంలో తాతగారయిన స్వాయంభువ మనువు కనపడి ఒకమాట చెప్పాడు. ‘నీవు పొందబోయే పదవి ఏమిటి? నువ్వు చేసిన పని ఏమిటి? నీవు ఇటువంటి పని చేయకూడదు. అందుకని ఇప్పటివరకు నువ్వు చేసిన సంహారము చాలు. ఇప్పటికయినా నా మాట విని నువ్వు నీ ధనుస్సు పక్కన పెట్టి రాజధానికి వెళ్ళిపో’ అన్నాడు. ధ్రువుడు తాతగారు చెప్పిన మాట విన్నాడు.

ధృవుడు తిరిగి అంతఃపురమునకు వెళ్ళిపోతుంటే కుబేరునికి ఈ వార్త తెలిసింది. తాతగారు చెబితే ఇంత కోపమును కుబుసం వదిలినట్లు వదిలేసి ధ్రువుడు ఇంటికి వెళ్ళిపోతున్నాడని తెలుసుకున్నాడు. పెద్దల మాటలు విన్న పిల్లలు ఎటువంటి వరములు పొందుతారో చెపుతుంది ధృవోపాఖ్యానం.

కుబేరుడు వచ్చి ‘నీకు ఎంతో కోపం వచ్చిందట, కొన్ని వేలమంది యక్షులను సంహరించావట. అంతకోపంతో ఉన్నా మావాళ్ళు నీమీద కలియబడుతుండగా తాతగారు వచ్చి ఇంకా యుద్ధం చేయకు అనేసరికి ఆయన మాటవిని యుద్ధం మానివేశావు. నీలాంటి వానిని చూడడము నాకు మిక్కిలి సంతోషమును కలిగించింది. నీకు కావలసిన వరం కోరుకో ప్రసాదిస్తాను’ అన్నాడు. ధృవుడు ‘ నా బుద్ధిలో చిన్న వైక్లబ్యం వచ్చింది. నేను ఎంతో పాపపు పని చేశాను. అందుకని నీవు నాకు వరం ఇస్తే ఏ వరం ఇస్తావో తెలుసా! నా బుద్ధి రాత్రనక పగలనక ఏ కాలమునందు కూడా భగవంతుని పాదారవిందముల నుండి విస్మరణము లేని నామము చెపుతూ తరించి పోయేటటువంటి భక్తి నాకు నిర్హేతుకముగా నీవరము చేత కటాక్షింపబడుగాక’ అని అడిగాడు. ఇదీ వ్యక్తి కోరుకోవలసింది. కుబేరుడు సంతోషముతో వరమును ధృవునకు అనుగ్రహించాడు. దానితో ధృవుడు అపారమయిన భక్తి సంపన్నుడు అయిపోయాడు. రాజ్యమును పరిపాలించాడు. కుమారుడికి పట్టాభిషేకము చేశాడు. బదరికాశ్రమమునకు చేరి కూర్చుని తపస్సు చేశాడు. ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. ఒక చిత్రవిచిత్రమయిన విమానం ఒకటి వచ్చి ఆ పర్వత శిఖరం మీద దిగింది. వారు నీలమేఘము వంటి శరీరము కలిగి శంఖ చక్ర గద పద్మములను పట్టుకుని తాను అయిదవ ఏట చూసిన శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో అటువంటి స్వరూపములతో ఇద్దరు పురుషులు అందులోంచి నడిచి వచ్చారు. ధృవుడు వాళ్ళను చూసి ఆశ్చర్యపోతూ లేచి వాళ్లకి నమస్కరించి మీరు ఎవరు? ఎందుకు వచ్చారు?’ అని అడిగాడు. వాళ్ళు ‘మరచిపోయావా! ఐదేండ్ల వయసులో నీవు తపస్సు చేయగా స్వామి వరం ఇచ్చారు. నీ శరీరం పడిపోయే రోజు వచ్చింది. నిన్ను మేము ధ్రువ మండలమునకు తీసుకువెళ్ళాలి. స్వామి నీకోసం విమానం పంపారు. మేము విష్ణుపార్షదులము వచ్చి విమానం ఎక్కమ’ని అన్నారు.

ధృవుడు జ్ఞానియై తనే శరీరమును వదిలిపెట్టాడు. మృత్యువు శిరస్సు మీద పాదము పెట్టి విమానంలోకి ఎక్కాడు. అది లోకములను దాటి వెళ్ళిపోతోంది. ఆశ్చర్యంగా ఆ లోకములన్నింటి వంక చూస్తున్నాడు. విమానంలో కూర్చుని అనుకున్నాడు ‘ఓహోహో ఏమి లోకములు! ఇంతమంది ఇన్ని బాధలు పడి పుణ్యములు పొంది, పుణ్యములు అయిపోయిన తరువాత క్రింద పడిపోయి ఇంత అల్లర్లు పడిపోతున్నారు. అయిదు నెలలు తపస్సు చేస్తే నా స్వామి నాకు ఇటువంటి స్థితి ఇచ్చారు. పెద్దపదవి అంటే ఏమో అనుకున్నాను. సప్తర్షులు, కశ్యపుడు, ధర్మము, అగ్నిహోత్రము, జ్యోతిశ్చక్రము తిరుగుతున్న మండలమునకు నేను ధృవస్తంభమునై వెలుగొందబోతున్నాను. ఇంతమంది నా చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణం జరుగుతూ ఉంటుంది. నేను నిరంతరం విష్ణులోకదర్శనం చేస్తూ ఉంటాను. ఎంత అదృష్టవంతుడిని’ అనుకుని ఈ అదృష్టమునకు కారణము ఎవరని ఆలోచించాడు. ‘మనసులో దీనికి కారణం మా అమ్మ. ఆనాడు మా అమ్మ నన్ను నారాయణుని గూర్చి తపస్సుకు వెళ్ళమని చెప్పింది. ఆమె మాట నన్ను ఈ స్థితికి తీసుకువెళ్ళింది. కానీ ఆ పిచ్చితల్లి ఎక్కడ ఉన్నదో’ అనుకున్నాడు. అనుకునే సరికి ఈ విషయమును పార్షదులు గ్రహించారు. ‘నిన్నీ స్థితికి తీసుకువచ్చింది కాబట్టే శ్రీ మహావిష్ణువు నీకన్నా ముందు ఆవిడ విమానం నడుపమని చెప్పారు. కిటికీలోంచి బయటకు చూడు’ అన్నారు. ధృవుడు బయటకు చూశాడు. ముందు విమానంలో దివ్యమైన తేజోవిరాజితయై సునీతి వెళ్ళిపోతున్నది. ఆవిడ శ్రీమన్నారాయణుడి లోకి వెళ్ళిపోయింది. ధృవుడు ధృవ మండలమునకు చేరుకొని తదనంతరము స్వామివారి లోనికి లీనమై పోయి పరబ్రహ్మము సాయుజ్య మోక్షమును పొందాడు.

ఇంతటి అద్భుతమయిన ఈ ధృవోపాఖ్యానం ఎవరైతే పరమ భక్తితో వింటారో వారందరికీ కూడా ఉత్తరక్షణం అప్పుడే అక్కడే ఆ క్షణంలోనే పాపనాశనము జరిగి శ్రీమన్నారాయణుని అనుగ్రహం కటాక్షింపబడుతుంది. ఒకవేళ అల్పాయుర్దాయంతో మృత్యువు తరుముకు వస్తుంటే మృత్యువు ఆగి ఆయుర్దాయం కలుగుతుంది. గ్రహముల వలన ఉద్రిక్త ఫలితము రాబోతుంటే అటువంటి ఫలితములు ఆగిపోయి శుభమును పొందుతారు, కీర్తిని ఇస్తుంది.


facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

నర్మదా మాత

 నర్మదా మాత 

    (పుష్కరముల సందర్భమున )


''అమరకంటకము" న నావిర్భవించియున్  

           బ్రవహించె నర్మద పశ్చిమముకు 

"నౌషంగబాదు"లో నతి విశాలంబయ్యు 

           కన్నుల పండువై కానుపించె

"మాహేశ్వరము" వద్ద మహితమ్ముగా నుండి 

           పుణ్య మజ్జనముకు స్ఫూర్తి నిచ్చె 

రమ్య"ఓంకారేశ్వర" గిరిసానువులలో 

           పరమేశు పావన పదము లంటె 

దివ్య "భృగుకచ్ఛపము" చెంత తీర్థమయ్యు 

కలసె "నర్మదామాత" తా కడలి యందు,

భరతభూమిని ప్రవహించి భక్త జనుల 

కాత్మ యైనట్టి "నర్మద" కంజలింతు.


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

సంకల్పము

 *శుభోదయం*

*********

 సంధ్యా వందన మరియు 

ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.05.05.2024

ఆది వారం (భాను వాసరే

************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ  క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ చైత్ర మాసే కృష్ణ పక్షే ద్వాదశ్యాం

(సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భాను వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర  ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి  నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ 

చైత్ర మాసే  కృష్ణ పక్షే  ద్వాదశ్యాం. 

భాను వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.37

సూ.అ.6.16

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

వసంత ఋతువు

చైత్ర మాసం 

కృష్ణ పక్షం ద్వాదశి మ. 3.35 వరకు. 

ఆది వారం. 

నక్షత్రం ఉత్తరాభాద్ర

సా. 6.14 వరకు. 

అమృతం మ.1.46 ల ల 3.15 వరకు. 

దుర్ముహూర్తం సా. 4.35 ల 5.26 వరకు. 

వర్జ్యం  ఉ.6.19 వరకు

వర్జ్యం తె. 5.27 ల మరునాడు ఉ. 6.57 వరకు. 

యోగం వైధృతి ఉ.5.55 వరకు.  

యోగం విష్కంభం తె. 2.49 వరకు. (ఏష్యం) 

కరణం తైతుల మ.3.35 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం సా. 4.30 ల 6.00 వరకు. 

గుళిక కాలం.సా3.00 ల 4.30 వరకు. 

యమగండ కాలం మ.12.00 ల 1.30 వరకు.      

*****************    

పుణ్యతిధి క్రోధి నామ సంవత్సర చైత్ర బహుళ  

ద్వాదశి మరియు త్రయోదశి. 

****************

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు  జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు  మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

🙏🙏🙏

పంచాంగం 05.05.2024 Sunday

 ఈ రోజు పంచాంగం 05.05.2024  Sunday 


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు చైత్ర మాస కృష్ణ  పక్ష: ద్వాదశి తిధి భాను వాసర: ఉత్తరాభాద్ర నక్షత్రం వైధృతి తదుపరి నిష్కంభ యోగ: కౌలవ తదుపరి తైతుల తదుపరి గరజి కరణం. ఇది ఈరోజు పంచాంగం.


ద్వాదశి  సాయంత్రం 05:41 వరకు.

ఉత్తరాభాద్ర రాత్రి 07:56 వరకు. 

సూర్యోదయం : 05:52

సూర్యాస్తమయం : 06:34


వర్జ్యం : ఉదయం 06:49 నుండి 08:16 వరకు.


దుర్ముహూర్తం : సాయంత్రం04:52 నుండి 05:43 వరకు.


అమృతఘడియలు : మధ్యాహ్నం 03:33 నుండి 05:01 వరకు.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.



శుభోదయ:, నమస్కార:

చదువు విలువ

 *శుభోదయం*🌹🌹Goodmorning 


"కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు. స్వయంగా అనుభవించి, అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తాయి."

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

"చదువు విలువ తెలియని వాని చేతిలో పుస్తకాన్ని, మనసులేని వాని చేతిలో జీవితాన్ని పెట్టకూడదు. ఇద్దరూ వాటితో ఆడుకుంటారు కానీ గౌరవించరు."

Covie shield vaccine


 Covie shield vaccine తీసుకొన్నవారికున్న అనుమానలు /అపోహాలుపై క్లారిటీ ఇస్తున్న వీడియో క్లిప్ 👍

RULES FOR SENIOR CITIZENS.

 *25 RULES FOR SENIOR CITIZENS. READ IT AND SAVE IT IN YOUR DESK TOP FOR FUTURE READING. SHARE WITH YOUR SENIOR FRIENDS /RELATIVES.* -

-Dr.Vooturi Ramkishan🙏🙏


🌸01-* Don't live with your children and get involved in their lives.

🌼02-* Do not interfere with the education of grandchildren.

🌸03-* Love, or at least, tolerate your son-in-law and daughter-in-law, it was your son or daughter’s choice.

🌼04-* Never take sides or give your opinion on their marriage.

🌸05-* Don't make yourself an elderly complainer.

🌼06-* Don't be an elderly person feeling sorry for yourself.

🌸07-* Don't get attached *TO YOUR TIME,* it has passed.

🌼08-* Have plans for the future.

🌸09-* Don't talk about illnesses. Rest assured, nobody wants to know.

🌼10-* No matter how much you earn, save a portion every month.

🌸11-* Don't procrastinate. There is not much time left.

🌼12-* Have a health plan or save money for medical expenses.

🌸13-* Save money for the funeral or have a plan for that purpose.

🌼14-* Don't leave "problems" for your children.

🌸15-* Don't stay connected to the news or politics, *after all, you won't solve anything anyway*.

🌼16-* Only watch TV to have fun, not to be stressed.

🌸17-* If you like, have a pet to keep you occupied.

🌼18-* When you get up: walk, cook, sew, garden, but don't stand still and wait for death.

🌸19-* ​​Be a clean and non-smelling old man/woman.

🌼20-* Have joy for being old, many have already fallen along the way.

🌸21-* Have a house where everyone wants to go and not stay away. That just depends on you.

🌼22-* Use age as a bridge to the future and never a ladder to the past.

For the bridge of the future you will always have company.

🌸23-* Remember: it's better to leave good memories than regrets.

🌼24-* Have fun. Smile and make others smile. A smile makes anyone's day better.


Finally, forward this message 

to all your senior friends and relatives .🍃

పంచాంగం

 ॐశుభోదయం, పంచాంగం ॐ 

 *ఓం శ్రీ గురుభ్యోనమః* 

        *_మే 5, 2024_* 

*శ్రీ క్రోధి నామ సంవత్సరం*

*ఉత్తరాయణం*

*వసంత ఋతువు*

*చైత్ర మాసం*

*కృష్ణ పక్షం*

తిథి: *ద్వాదశి* సా3.36

వారం: *భానువాసరే*

(ఆదివారం)

నక్షత్రం: *ఉత్తరాభాద్ర* సా6.15

యోగం: *వైధృతి* ఉ5.54

*విష్కంభం* రా2.52

కరణం: *తైతుల* మ3.36

*గరజి* రా2.26

వర్జ్యం: మర్నాడు *తె5.28నుండి*

దుర్ముహూర్తము: *సా4.34-5.25*

అమృతకాలం: *ఉ10.48-12.18*

రాహుకాలం: *సా4.30-6.00*

యమగండం: *మ12.00-1.30*

సూర్యరాశి: *మేషం*

చంద్రరాశి: *మీనం*

సూర్యోదయం: *5.36*

సూర్యాస్తమయం: *6.16*

*లోకాః సమస్తాః *సుఖినోభవంతు*

_మే 5, 2024_

 ॐశుభోదయం, పంచాంగం ॐ 

 *ఓం శ్రీ గురుభ్యోనమః* 

        *_మే 5, 2024_* 

*శ్రీ క్రోధి నామ సంవత్సరం*

*ఉత్తరాయణం*

*వసంత ఋతువు*

*చైత్ర మాసం*

*కృష్ణ పక్షం*

తిథి: *ద్వాదశి* సా3.36

వారం: *భానువాసరే*

(ఆదివారం)

నక్షత్రం: *ఉత్తరాభాద్ర* సా6.15

యోగం: *వైధృతి* ఉ5.54

*విష్కంభం* రా2.52

కరణం: *తైతుల* మ3.36

*గరజి* రా2.26

వర్జ్యం: మర్నాడు *తె5.28నుండి*

దుర్ముహూర్తము: *సా4.34-5.25*

అమృతకాలం: *ఉ10.48-12.18*

రాహుకాలం: *సా4.30-6.00*

యమగండం: *మ12.00-1.30*

సూర్యరాశి: *మేషం*

చంద్రరాశి: *మీనం*

సూర్యోదయం: *5.36*

సూర్యాస్తమయం: *6.16*

*లోకాః సమస్తాః *సుఖినోభవంతు*

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*05-05-2024 / ఆదివారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


ధన  సంబంధిత వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.  స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలలో కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలు మిశ్రమంగా సాగుతాయి.

---------------------------------------

వృషభం


ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట చెందుతారు. సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు కలుగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన  వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి కలుగుతాయి.

---------------------------------------

మిధునం


ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. స్ధిరాస్తి  క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

---------------------------------------

కర్కాటకం


వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది. బంధు మిత్రుల నుండి వివాదాలకు చెందిన సమాచారం అందుతుంది. గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు.

---------------------------------------

సింహం


స్నేహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు అనుకూలత వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది.  కుటుంబసభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

కన్య


సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. అవసరానికి ధనం అందుతుంది.  దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు.  వృత్తి ఉద్యోగాలలో స్వల్ప స్థానచలనాలు చోటు చేసుకుంటాయి.  దూర  ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

తుల


నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుతాయి.  వృత్తి వ్యాపార కీలక  నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులతో  ఉన్న  వివాదాలను పరిష్కరించుకుంటారు. దూర  ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.  ఆరోగ్య విషయాలలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి.

---------------------------------------

వృశ్చికం


గృహమున సంతాన  వివాహ శుభకార్య ప్రస్తావన వస్తుంది.   సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ధన సంబంధ వ్యవహారాలు కలిసివస్తాయి. ప్రయాణాలలో వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా  ఉండాలి. వృత్తి ఉద్యోగాలు సానుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

ధనస్సు


సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు రెట్టించిన  ఉత్సాహంగా సాగుతాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. దూర ప్రాంత బంధు మిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమౌతాయి. అన్నివైపుల నుండి అదాయం అందుతుంది.

---------------------------------------

మకరం


పాత రుణాలను కొంతవరకు తీర్చగలుగుతారు.  దూరప్రాంత బంధు మిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తాయి. ధన పరంగా ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.  వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు చెయ్యడం మంచిది.  సంతాన ఆరోగ్య  విషయంలో అశ్రద్ధ మంచిది కాదు.

---------------------------------------

కుంభం


చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో  అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులు జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు.   నూతన గృహ  వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగ వ్యాపారములు మందకొడిగా సాగుతాయి.

---------------------------------------

మీనం


ఆప్తులతో  వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గతంలో జరిగిన  కొన్ని సంఘటనలు గుర్తుచేసుకుని  బాధపడతారు. ఇంటా బయట   అనుకూలత పెరుగుతుంది. గృహమున శుభకార్యాలకు ధనవ్యయం  చేస్తారు. వ్యాపారాలలో ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

ధనమున్నదని

 💎🌅 *_-|¦¦| శుభోదయమ్ |¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


  శ్లో𝕝𝕝 *ప్రజ్ఞయా మానసం దుఃఖం, హన్యాచ్ఛారీరమౌషధైః*।

      *ఏతద్ విజ్ఞానసామర్థ్యం న, బాలైః సమతామియాత్*॥


తా𝕝𝕝 *ప్రజ్ఞతో మానస దుఃఖాన్ని, ఔషధాలతో శారీర దుఃఖాన్ని దూరం చేసికోవాలి.....ఇది విజ్ఞాన సామర్థ్యం.... బాలురవలే అవివేకంతో వ్యవహరించకూడదు.


  👇 //------- ( *మోహముద్గరం* )------// 👇


శ్లో𝕝𝕝 

*మా కురు ధన జన యవ్వన గర్వం*

*హరతి నిమేషాత్కాలః సర్వం*

*మాయామయమిదమఖిలం హిత్వా*

*బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా* ॥11॥


భావం: ధనమున్నదని, అనుచరగణం ఉన్నదని, యౌవనం ఉన్నదని గర్వించకు. ఈ మొత్తం ఒక్క నిముషంలో హరించిపోతుంది. ఈ ప్రపంచమంతా భ్రమతో కూడుకున్నది, మాయాజాలమని తెలుసుకొని ఆ పరమాత్మ స్థానాన్ని గ్రహించి అక్కడకు చేరుకో. ఆత్మానుభూతిని చెందు.

బ్యాంకుల్లో హోదాలు -

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

బ్యాంకుల్లో హోదాలు - 😋

  ఒక యదార్ధ సంఘటన ఆధారంగా అల్లిన అల్లిక... బ్యాంకు పేర్లు , అధికార్ల పేర్లు గోప్యంగా ఉంచబడ్డాయి....

   ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ కు  ఎన్నికల అధికారులకు , విస్తృతమైన అధికారాలు ఉంటాయి...

బ్యాంక్ ఉద్యోగులకు ఎన్నికల విధులు చాలా రోజులు అప్పగించలేదు....మొదటిసారి అప్పగించినప్పుడు, అందరిలో కొంత అయోమయం ambiguity కలిగింది..అటువంటి సమయాల్లో ఒక జిల్లా కేంద్రంలో....

    ఎన్నికల విధుల కోసం , బ్యాంకుల్లో పనిచేసే సిబ్బంది అందరి పేర్లూ పంపించమని ఎన్నికల కమిషన్ ఆదేశించింది.

ఒక బ్యాంకులో పనిచేసే ఉద్యోగులు అందరి పేర్లూ పంపించారు....పేరు , గ్రేడ్ మాత్రం వ్రాసి పంపించారు...అందులో ఒక scale -IV అధికారి పేరు కూడా ఉంది...

  ఆయన ఎన్నికల అధికారి దగ్గరికి వెళ్లి రిపోర్ట్ చేశారు... ఆ ఎన్నికల అధికారి ఒక డిప్యూటీ కలెక్టర్.... వయస్సులో పెద్దవాడు...కోపిష్టి తిక్క స్వభావి....అహంభావి...బ్యాంక్ అధికారిని చూడగానే , గ్రేడ్ చదివి ..

   'నువ్వు Class -IV గదా..ఫో...వెళ్లి ఎన్నికల సామగ్రి , బ్యాలెట్ బాక్సులు అన్నీ ఒక లారీలో వేసి లారీ ఎక్కు ..ఎన్నికల సిబ్బందికి అప్పచెప్పే వరకు అక్కడ ఉన్న అధికార్లు చెప్పిన పని చెయ్...ఆంటూ హుకుం జారీ చేశాడు...

  కంగారుపడ్డ బ్యాంక్ అధికారి 

 'సార్ ! నేను Class -IV కాదు...Scale -IV ...డ్యూటీ మార్చండి సార్ ! అన్నాడు

   ఎన్నికల అధికారి కోపంతో 

'ఏమిటయ్యా నువ్వు చెప్పేది ...పెద్ద Scale -I అధికారి లాగా మాట్లాడుతున్నావు...మాకు తెలియదా IV అంటే ఏమిటో....ఎక్కువగా విసిగించక చెప్పిన పని చెయ్...ఫో...వెళ్లి లారీ ఎక్కు ...అని విసుక్కున్నాడు

    బ్యాంక్ అధికారి వినయంగా

 'సార్ ! ప్రభుత్వంలో Class -I అధికారి అంటే పెద్ద హోదా...దాని తర్వాత Class -II ఇలా ఉంటాయి...బ్యాంకుల్లో ఆరోహణా క్రమంలో Scale -I అంటే దిగువ స్థాయి....Scale -II అంటే మధ్యమ ...ఇలా ఉంటాయి ఆంటూ ఉండగానే , సహనం కోల్పోయిన ఎన్నికల అధికారి...

   ' ఏమిటయ్యా ఎక్కువగా మాట్లాడుతున్నావు...మా పనుల ఒత్తిడితో మేము ఛస్తుంటే , ఇప్పుడు మీ బ్యాంకుల్లో ఉన్న హోదాల గురించి ఆలోచించాలా !?

 IV అంటే ఏమిటో తెలుసు...

ఎక్కువ విసిగిస్తే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ' అని హెచ్చరించాడు...


బ్యాంకు అధికారికి ఏమీ పాలుపోలేదు... ఆ ఊళ్ళో వారి సంబంధిత ఉన్నతాధికారుల కార్యాలయం లేదు....ఇప్పటిలా ఎవరినైనా సంప్రదిద్దామంటే , మొబైల్ ఫోన్లు లేవు...ఎన్నికల అధికారి కాళ్లా వేళ్లా పడి ఉత్తర్వులు సవరించమంటే , ఒక లారీ బదులు మరో లారీలో ఎక్కు...అంతవరకే అనుమతి...సవరణ కావాలంటే కలెక్టర్ గారే ( జిల్లా ఎన్నికల అధికారి ) చేయాలి...ఒకసారి నువ్వు మాకు రిపోర్ట్ చేశావు అంటే మా అనుమతి లేకుండా ఎక్కడికీ వెళ్లకూడదు....ఫో..వెళ్లి పని చూసుకో ఆంటూ కసిరాడు...


బ్యాంక్ అధికారికి ఏమీ తోచలేదు...కొంత ఆలోచిస్తే ఆ ఊళ్ళో మరో బ్యాంక్ ఉన్నతాధికారి కార్యాలయం ఉంది ( లీడ్ బ్యాంక్ ) ప్రభుత్వ అధికారులతో తరచూ మీటింగుల వల్ల , ఆయనకు కొంత కలెక్టర్ తో మాట్లాడే అవకాశం ఉంది...ఆయనకు తన సమస్య చెప్పుకుందామని , ఎన్నికల అధికారి వద్ద ఓ రెండు గంటల పర్మిషన్ తీసుకుని వెళ్ళాడు...


ఆ ఉన్నతాధికారి , ఈయన సమస్య విని ఓ రెండు నిముషాలు నవ్వాడు....తర్వాత సాలోచనగా ' ఔనూ ! మా వాళ్ళు లిస్టులో మా పేర్లు పంపించలేదు గానీ , Scale -IV అంటేనే, నిన్ని మూటలు మొయ్యమన్నారు....మరి మా AGM పేరు ఉంటే Scale -V అని చీపురుతో ఊడవటం, నేను Scale -VI అంటే, అందరికీ మంచి నీళ్ళ గ్లాసులు అందించడం వంటి పనులు మాకు అప్పగించేవారంటావా! అని అడిగాడు..


ఏమో సార్ ! మీ పేర్లు వ్రాయలేదు గదా...మా వాళ్ళు నా పేరు వ్రాసి , అనవసరంగా ఇరకాటంలో పెట్టారు..మనం వెళ్లి కలెక్టర్ గారిని కలిసి , విషయం వివరిద్దాం సార్ ! అని అందరూ కలిసి కలెక్టర్ గారి వద్దకు వెళ్ళారు..

   కలెక్టర్ గారు మంచివారు.

...కానీ , ఆయన బాగా బిజీగా ఉండటంతో, ఆయన PA ను కలిసి విషయం వివరించారు...

PA గారు అంతా విని  'ఈ లెక్కన ఈ సమస్య, ఈ Scale -IV అధికారికే కాకుండా ఇతర బ్యాంకుల సిబ్బందికి కూడా ఉండి ఉంటుంది ...ప్రభుత్వంలో 

Class -I అంటే మొదటి శ్రేణి అధికారి అనే భావం ఉండటంతో, మా వాళ్ళు ఇలా డ్యూటీలు వేసినట్టున్నారు...అని కలెక్టర్ గారితో మాట్లాడి , మొత్తం బ్యాంక్ సిబ్బంది అందరికీ విధులు రద్దు చేయించి , hold లో పెట్టారు...తర్వాత రిజర్వ్ పూల్ లో ఉంచి , అవసరమైన చోట పరిమిత స్థాయిలో బ్యాంక్ సిబ్బంది సేవలు తగువిధంగా వాడారు...మొదటిసారి బ్యాంకు సిబ్బందికి ఎన్నికల విధులు అప్పగించడంతో , తమకు హోదాల విషయమై స్పష్టత లేకపోవడంతో ఇలా జరిగింది అని చెప్పారు...


ఇది యదార్ధ సంఘటనకు కొంత మేళవింపు జరిపి , పోస్ట్ చేసిన ఉత్పత్తి....

            😋😃😃 (Collected)


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

*శ్రీశైల మల్లన్న

 *శ్రీశైల మల్లన్నను పాల్కురికి సోమన్న* *అచ్చులు,హల్లులతో ఎలా స్తుతించాడో చూడండి.*  


'అ'ఖిల లోకాధార 

'ఆ'నంద పూర

'ఇ'న చంద్ర శిఖి నేత్ర  

'ఈ'డితామల గాత్ర

'ఉ'రు లింగ నిజరూప

'ఊ'ర్జితా జలచాప

'ఌ'లిత తాండవకాండ 

'ౡ'నికృతా జాండ

'ఏ'కైక వర్యేశ 

'ఐ'క్య సౌఖ్యా వేశ

'ఓం' కార దివ్యాంగ   

'ఔ'న్నత్య గుణ సంగ

'అం'బికా హృదయేశ

'అః'స్తోక కలనాశ

'క'నద హీనాభరణ 

'ఖ'ల జలంధర హరణ

'గ'ల నాయక విధేయ 

'ఘ'న భక్తి విజేయ

'జ'శ్చూల కాలధర

'చ'రిత త్రిశూల ధర

'ఛ'ర్మ యాధ్వస్త 

'ఞ'న గుణ ధళ ధీర

'ట' త్రయాది విదూర 

'ఠ' ప్రభావాకార

'డ'మరుకాది విహార 

'ఢ' వ్రాత పరిహార

'ణ' ప్రవాగార 

'త'త్త్వ జోనేత

'థ'వి దూర జవ పక్ష 

'ద'వన పాలన దీక్ష

'ధ'రణీ థవోల్లీడ 

'నంది కేశారూఢ

'ప'ర్వతీశ్వర లింగ 

'బ'హుళ భూత విలాస

'భ'క్త్వ హృద్వ నహన 

'మం'త్రస్తుతోధార 

'య'క్ష రుద్రాకార

'ర'తిరాజ బిన హంస

'ల'లిత గంగోత్తంస 

'ళ'మా విదవ్రంశ 

'వ'రద శైల విహార 

'శ'ర సంభ వాస్ఫార

'ష'ట్తింశ తత్త్వగత  

'స'కల సురముని వినుత

'హ'రి నేత్ర పదపద్మ- అంశిత భూధరపద్మ

'క్ష'ర రహిత చరిత్ర

- అక్షరాంక స్తోత్ర శ్రీ పర్వత లింగ 

*నమస్తే నమస్తే నమస్తే నమః*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

కలలో ఏం వస్తే

 🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

. *🌹తాళపత్ర గ్రంధం🌹*

( అనేక గ్రంథాల్లో దాగి ఉన్న జీవన ఆచార... ఆరోగ్య సాంప్రదాయ రహస్యాలు... స్థూల అక్షరాలతో...)

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

. *భాగం 10*


*84. కలలో ఏం వస్తే ఏ ఫలితం జరుగుతుంది?*


(అష్టాదశ పురాణాల నుంచి)

• అగ్నిని త్రాగినట్టు వస్తే జఠరాగ్ని వృద్ధి అవుతుంది.


• తెల్లని పూలూ, వస్త్రములు, తెల్లని పక్షులూ

లాభదాయకములు.


• తలలూ, భుజములూ, హస్తములూ వస్తే ధనవృద్ధి.


• అలాగే గుర్రమూ, ఎద్దూ, తామరపువ్వూ, ఏనుగూ

కనిపిస్తే ఊహించని ఐశ్వర్యము.


• సముద్రము లేదా నదిని దాటి అవతల తీరం

దాటినట్టు వస్తే మీ కార్యాల్లో విజయం సాధిస్తారు.


• సుందరమైన స్త్రీ ఒడిలో ఉన్నట్టు కలవస్తే

ధనలాభము.


• తామరాకులు కలలో వస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అట్టి శుభస్వప్నములు కన్నవారు మేల్కొని, ఆపై నిద్రింపక స్నానాదులతో శుచియై అయిన వారితో పంచుకుంటే మరింత త్వరితంగా ఫలితాన్ని పొందగలరు


*85. మనోభీష్టములు సిద్ధుంచుట కొరకు?*


*ఓం కామ - కామప్రద - కాంత - కామపాల-హరి - ఆనంద - మాధవ నమో నమః*

అని 108సార్లు శుచిగా మహావిష్ణువును

జపించవలయును.


*86. ఆయుర్వేదంలో రొంపకు చెప్పిన అమోఘమైన వైద్యం...?*


బాగా మరుగుతున్న నీటిలో ఓ ఇరవై తులసి

ఆకులు వేసి, బాగా ఉడికిన తర్వాత పంచదార, పాలు

పోసి మనం ఉదయం త్రాగే పానీయాలని వదలి తాగితే

రొంపతో పాటు జ్వరము కూడా రాకుండా

అరికడుతుందని చరకసంహిత శెలవిస్తోంది.


*87. స్నేహం ముసుగులో చేసే ద్రోహాలకి పోశిక్ష..........*


చితి మీద కాలుతున్న వాన్ని పీక్కుతినే అలాంటి

వాళ్ళ గురించి చర్చించడం కూడా పాపమే. మంచి

మనుష్యుల గూర్చీ, విషయాల గూర్చీ మాట్లాడుకుంటే

మనసు బావుంటుంది. మీకు అపకారమూ, నష్టమూ

చేసిన వారికి దూరంగా ఉండటమే వారికి

భగవంతుడిచ్చిన పెద్దశిక్ష.


*88. శత్రువుపై విజయము కొరకు?*


*ఓం రామ - పరుశురామ - నృసింహ - విష్ణు విక్రమ నమో నమః* అని 108 సార్లు శ్రీరామ మందిరంలో కూర్చొని జపించవలయును. అటుల ధ్యానించిన వారికి శత్రువులే మిత్రులుగా వచ్చి శరణు వేడుతారు.


*89. దక్షిణ దిశలోనున్న చింతచెట్టు చుట్టూ తిరిగితే వ్యాధులు నమయవుతాయా?*


సూర్యభగవానుడి కిరణాలు దక్షిణ దిశగానున్న

చింతచెట్టు తన దిశగా వచ్చే కిరణాలను ఆపి, తన

ఆమ్లగుణాన్ని కిరణాలతో కలిపి తన పరిధిలోని

ప్రదేశాన్నంతటికీ నీడనిచ్చి చల్లని గాలితో నింపేస్తుంది.

ఆ గాలి శరీరానికి ఎంతో ఆరోగ్యం కనుక మన పెద్దలు

అక్కడ గుడిని నిర్మింపచేసి ప్రదక్షిణలూ, పూజలూ

చెయ్యమన్నారు.


*90. రోజుకి ఎన్నిసార్లు పుక్కిలించాలని ఆయుర్వేదం చెబుతోంది?*


ఉదయాన్నే దంత ధావనము అయ్యాక పుక్కిలించిన నీరును ఎడమదిశగా వదలాలి. మూత్ర

విసర్జన చేస్తే నాలుగు సార్లూ, ఆ తర్వాత కార్యక్రమం

తర్వాత ఎనిమిదిసార్లూ, చక్కగా భోజనం అయ్యాక

పన్నెండు పర్యాయములూ, భార్యతో కలిసిన తర్వాత

పదహారుసార్లు పుక్కిలించాలని ఆయుర్వేదం

శెలవిస్తోంది. ఒక్కసారి పుక్కిలించగానే శరీరంలోని ఎన్నో వేల + గ్రంథులు ఉత్తేజం పొందుతాయి.


*91. ఉసిరిక పొడిని ఒంటికీ, తలకీ రాసుకొని స్నానం చేస్తే?*


జుట్టు వూడిపోదు. బట్టతల బాధలు లేకుండా,

వెంట్రుకలు నెరవకుండా, ఎక్కువ ఆయుష్షుతో

జీవిస్తారని ఆయుర్వేద శాస్త్రం శెలవిస్తోంది.


*92. పుట్టిన దగ్గర్నించి పోయేదాకా ఏడుపేనా?*


• తల్లి గర్భం నుంచి బైటికి రావటంతోనే ఏడుపు.

• బిడ్డకు పాలు చాలక పోతే ఏడుపు.

• పాలు ఎక్కువైతే అజీర్తి ఏడుపు.

• ఆటలాడటానికి పోనీయకపోతే ఏడుపు.

• చదువులో ప్రగతి లేకపోతే ఏడుపు.

• పరీక్షల్లో తుస్ మంటే ఏడుపు.

• నెగ్గితే పక్కవానికెక్కువచ్చాయని ఏడుపు.

• ఉద్యోగం రాలేదని ఏడుపు.

• వస్తే తనకన్నా పక్కవానికి జీతమెక్కువొస్తుందని

ఏడుపు.

• పెళ్ళయితే ఒక ఏడుపు, అవకపోతే మరొక ఏడుపు.

అందంగా భార్య ఉంటే ఒక ఏడుపు, వికారంగా

ఉంటే మరో ఏడుపు, గయ్యాళయితే ఇంకొక

ఏడుపు.

• బిడ్డలు కలగకపోతే ఏడ్పు, కలిగితే సాకలేక ఏడుపు.

• అల్లుడు మంచివాడు కాకపోతే ఏడ్పు, కోడలిపై

మరొకరకమైన ఏడుపు.

• వేరు కాపురం పెడితే ఏడుపు, ఉమ్మడిగా ఉంటే

కోడలు సరిగా చూడటం లేదని ఏడుపు.

• వయసొచ్చి రోగాలొస్తే ఏడుపు. తీరా పోతే చివరి ఏడుపు. ఇదీ మానవజీవిత ఏడుపుల గాథ.


*93. అరటిబోదెలో దీపం వెలిగించి వదిలితే మంచి భర్త లభిస్తాడా?*


పెళ్ళి కాని వారూ, అయిన వారూ, అరటి చెట్టు

బోదెలో దీపం వెలిగించి కోనేరు, నదుల్లో దీపాలు

వదులుతారు. పెళ్ళయిన వారు భర్త క్షేమం కోసమూ,

పెళ్ళికాని వారు మంచి భర్త లభిస్తాడని అరటి బోదెలో

వెలిగించిన దీపాన్ని ఉంచి వదలమంటారు పెద్దలు.

తెల్లవారుజామున లేవటము వల్ల, ఎంతో దూరం వెళ్ళి

+ ప్రశాంతంగా దీపాలు వదలటం ద్వారా పెళ్ళయిన వారికి

ఆ సమయంలో ప్రశాంతమైన గాలి శరీరంలోకి

ప్రవేశించి మరింత మెరుపుని వచ్చి తద్వారా భర్త ప్రేమను

అందుకుంటుంది. పెళ్ళికాని పిల్ల నలుగురు అమ్మలక్కల

దృష్టిలో పడి త్వరగా వివాహం అయ్యే అవకాశం

ఉంటుంది. భక్తితో పాటు మానవ కళ్యాణాలకు

అవసరమైన పద్ధతులే పెట్టారు మన పెద్దలు.


*94. విద్యాభివృద్ధి కొరకు?*


*ఓం పురుషోత్తమ నమో నమః* అని 108సార్లు సరస్వతిదేవి గూర్చి జపించాలి. అలా చేసినవారికి వాక్శు ద్ధితోపాటు జ్ఞాపకశక్తి పెరిగి విద్యాభివృద్ధి

జరుగుతుంది.                   


*రచన_* ✍️ *మైధిలి వెంకటేశ్వరరావు.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃


https://kavulu.blogspot.com/2024/05/blog-post_73.html


యోగవాసిష్ఠ రత్నాకరము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.                   *హరి ఓం*

 *ఓం శ్రీ మహాగణాధిపతయే నమః* 

*ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః* 

*ఓం నమో వసిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి శుకాదిభ్యః*

 

.    *🌹యోగవాసిష్ఠ రత్నాకరము🌹* 

*వైరాగ్య ప్రకరణము - 1వ అధ్యాయము* 

.    *🌹రాఘవ వైరాగ్య వర్ణనము🌹*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.              *శ్రీ వాల్మీకి రువాచ :-*

0051


*1-152*

*క ఉపాయో గతిః కా వా కా చిన్తా కః సమాశ్రయః* *కేనేయమశుభోదర్కా న భవేజ్జీవితాటవీ*


ఇట్టి స్థితియందు నాకు ఉపాయ మేమి? మార్గ మెయ్యది? దేనిని చింతించుదును? దేనిని ఆశ్రయించుదును? ఏ యుపాయముచే ఈ జీవితారణ్యము శుభప్రదము కాగలదు? 


*1-153*

*రాగద్వేష మహారోగా భోగపూగా విభూతయః* 

*కథం జన్తుం న బాధన్తే సంసారార్ణవచారిణమ్‌* 


సంసార సముద్రమందు చరించు మనుజుడు ఏమి యొనర్చినచో రాగద్వేషాత్మకములగు మహారోగములు, భోగసర్ప సమూహములు ఆతనిని పీడింపకుండును? 


*1-154*

*మనో మననశాలిన్యాః సత్తాయా భువనత్రయే* 

*క్షయో యుక్తిం వినా నాస్తి బ్రూత తామలముత్తమామ్‌.*


దృశ్యవిషయములను మననము చేయునట్టి వాసనాసహితమగు మనస్సు యొక్క నాశము ఉత్తమయుక్తి లేనిచో ముల్లోకములందును ఎన్నడును సంభవింపనేరదు. కాబట్టి ఓ మునీశ్వరా! అట్టి యుక్తిని నాకు లెస్సగ నుపదేశింపుడు.


                    *సశేషం.....*

        ❀┉┅━❀🛕❀┉┅━❀


*సేకరణ:* శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్. 

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

శతరుద్రీయము-52*

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

. *శతరుద్రీయము-52*

(వ్యాఖ్య: శ్రీ తురుమెళ్ళ మాధవ కుమార్)

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱


*చతుర్థానువాకము - 6 & 7వ యజుస్సులు*


*నమకనామాని : ఓం పరివంచతే నమః*



*6వ యజుస్సు :*


*నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చవో నమః!*


*వికృతరూపములలో నున్న మీకు నమస్కారము. అనేకములగు రూపములు గలిగిన మీకు నమస్కారము♪.*


*వివరణ:* 

 భగవంతుడు సుందరాకారుడు అంటారేమో అలా ఏమీ నియమం లేదు♪. వికారమైన రూపములలో కూడా ఆయన ఉన్నాడని చెప్పడం లక్ష్యం అయివుండ వచ్చు♪... 


మహాముని అష్టావక్రునికి విరూపుడు అనే పేరు వున్నది♪. అలాగే ఋగ్వేదంలో విరూపుల ప్రసక్తి వస్తుంది♪. ఇక విశ్వరూపులు అంటే ఏనుగులు, సింహాలు ఇలా అనేకమైన రూపాలన్నీ ఇందులో చెప్పబడ్డట్లుగా అనిపిస్తుంది♪.


*┈┉┅━❀ ❀ *┈┉┅━❀


*7వ యజుస్సు :*


*నమో మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చవో నమః!*


*సిద్ధులగు మీకు నమస్కారము. సామాన్యులగు మీకు నమస్కారము*


*వివరణ:*

*అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశిత్వము, వశిత్వము* -ఈ అష్టసిద్ధులు ఉన్నవారిని *మహద్భ్యులు* అంటారు. వీటిలో ఏ ఒక్కటి ఉన్నా లేదా ఒక్క శక్తిలో వెయ్యవవంతు వున్నా మనిషి ఆ సంఘంలో పేరు తెచ్చుకుంటాడు. 


మనకు సమాజంలో నాయకులుగానూ, తెలివితేటలు కలవారుగానూ కనబడేవారు వాళ్లకు తెలియకుండానే వీటిలో కొన్ని సాధించేందుకోసం పూర్వజన్మలో ప్రయత్నం చేసినవాళ్లయి వుంటారు. 


ఇక వీళ్లలోనే దేవుడు ఉంటాడా అంటే సామాన్యులలో గూడా ఉన్నాడు అని చెప్పేందుకోసమై *'క్షులకేభ్యః'* అని వాడారు. క్షుల్లకులు అనగా అత్యంత సామాన్యమైనవారు.


*(రేపు.... చతుర్థానువాకం 8 వ యజుస్సు)*


                    *సశేషం.....*

        ❀┉┅━❀🛕❀┉┅━❀


*సేకరణ:* శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్. 

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

702/24

*సప్తమ స్కంధం*


*కాననివాని నూతగొని కాననివాడు విశిష్ట వస్తువున్*

*గానని భంగి కర్మములు గైకొని కొందఱు కర్మబద్ధులై*

*కానరు విష్ణుఁ గొంద ఱటఁ గందురకించన వైష్ణవాంఘ్రిసం*

*స్థానరజోభిషిక్తులగు సంహృతకర్ములు దానవేశ్వరా!*


దానవులకు ప్రభువవైన ఓతండ్రీ! కళ్ళు లేని వాడొకడు ఏదో మేలైన వస్తువును చూడాలని మరొక గ్రుడ్డివాని చెయ్యి పట్టుకొన్నాడు. వానికి ఆ వస్తువు కానవస్తుందా? అలాగే కొందరు యజ్ఞం మొదలైన కర్మములను పట్టుకొంటారు. అవి వారికి తెగద్రెంచు కోవటానికి వీలులేని సంకెళ్ళయిపోతాయి. దానివలన విష్ణువును చూడలేని దౌర్భాగ్యం వారిని పట్టుకొంటుంది. కానీ వివేకం పండించుకొన్న జ్ఞానులు ఉందోలేదో అన్నంత స్వల్పంగా ఉన్న శ్రీమహావిష్ణువుపాదాల మీది దుమ్ముకణంతో తలమున్కలుగా స్నానమాడి కర్మబంధాలను త్రెంపివేసుకొని విష్ణుదర్శన మహాభాగ్యం పొందుతారు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

పంచాంగం

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏

        🌞 *పంచాంగం* 🌝

       🕉️ *_మే 5, 2024_* 🕉️

         🕉️ *ఆదివారం* 🕉️


🌻 *శ్రీ క్రోధి నామ సంవత్సరం*

🌻 *ఉత్తరాయణం*

🌻 *వసంత ఋతువు*

🌻 *చైత్ర మాసం*

🌻 *కృష్ణ పక్షం*


తిథి : *ద్వాదశి* సా3.36

వారం : *భానువాసరే*

             (ఆదివారం)

నక్షత్రం : *ఉత్తరాభాద్ర* సా6.15

యోగం : *వైధృతి* ఉ5.54

              & *విష్కంభం* రా2.52

కరణం : *తైతుల* మ3.36

              & *గరజి* రా2.26

వర్జ్యం : మర్నాడు       

                       *తె5.28నుండి*

దుర్ముహూర్తం : *సా4.34-5.25*

అమృతకాలం : *ఉ10.48-12.18*

రాహుకాలం : *సా4.30-6.00*

యమగండం : *మ12.00-1.30*

సూర్యరాశి : *మేషం*

చంద్రరాశి : *మీనం*

సూర్యోదయం : *5.36*

సూర్యాస్తమయం : *6.16*

----------------------------------------------------          

*లోకాః సమస్తాః సుఖినోభవంతు*

*సర్వే జనాః సుఖినోభవంతు*

      🙏 *శుభమస్తు* 🙏

----------------------------------------------------

      *గోమాతను పూజించండి*

      *గోమాతను సంరక్షించండి*

రాశి ఫలితాలు

 05-05-2024 

భాను వాసరః ఆదివారం 

రాశి ఫలితాలు

************

మేషం

ధన సంబంధిత వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలలో కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలు మిశ్రమంగా సాగుతాయి.

---------------------------------------

వృషభం

ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట చెందుతారు. సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు కలుగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి కలుగుతాయి

---------------------------------------

మిధునం

ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. స్ధిరాస్తి క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

---------------------------------------

కర్కాటకం

వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది. బంధు మిత్రుల నుండి వివాదాలకు చెందిన సమాచారం అందుతుంది. గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు.

---------------------------------------

సింహం

స్నేహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు అనుకూలత వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. కుటుంబసభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

కన్య

సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. అవసరానికి ధనం అందుతుంది. దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో స్వల్ప స్థానచలనాలు చోటు చేసుకుంటాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

తుల

నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపార కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులతో ఉన్న వివాదాలను పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయాలలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి.

---------------------------------------

వృశ్చికం

గృహమున సంతాన వివాహ శుభకార్య ప్రస్తావన వస్తుంది. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ధన సంబంధ వ్యవహారాలు కలిసివస్తాయి. ప్రయాణాలలో వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి ఉద్యోగాలు సానుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

ధనస్సు

సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు రెట్టించిన ఉత్సాహంగా సాగుతాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. దూర ప్రాంత బంధు మిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమౌతాయి. అన్నివైపుల నుండి అదాయం అందుతుంది.

---------------------------------------

మకరం

పాత రుణాలను కొంతవరకు తీర్చగలుగుతారు. దూరప్రాంత బంధు మిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తాయి. ధన పరంగా ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు చెయ్యడం మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మంచిది కాదు.

---------------------------------------

కుంభం

చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులు జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగ వ్యాపారములు మందకొడిగా సాగుతాయి.

---------------------------------------

మీనం

ఆప్తులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుచేసుకుని బాధపడతారు. ఇంటా బయట అనుకూలత పెరుగుతుంది. గృహమున శుభకార్యాలకు ధనవ్యయం చేస్తారు. వ్యాపారాలలో ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.

--------------------------------------------------------------

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

తపస్సు

 💎🌅  *_-|¦¦| శుభోదయమ్ |¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


  శ్లో𝕝𝕝 *న తపోనశనాత్తుల్యం*

       *న దానాత్పరమం సుఖమ్‌*।

       *న ధర్మస్తు దయాతుల్యో*

       *న జ్యోతిశ్చక్షుషా సమమ్‌*॥


తా𝕝𝕝 *ఉపవాసమును మించిన తపస్సు, దానమును మించిన సుఖము లేదు.... దయాతుల్యమైన ధర్మము, నేత్రముతో సమానమైన జ్యోతిస్సు లేదు*....

      

 ✍️🌸🌹🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

               🌷🌷🌷

*కలియుగాబ్ది 5125* *శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం  -‌ ద్వాదశి - ఉత్తరాభాద్ర -‌‌  భాను వాసరే* *05.05.2024.* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.




🙏🙏

నవ్వించే పేరుతో

నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం  అన్నారు జంద్యాల గారు.ఇదివరకు మనవాళ్ళు నవ్వు నాలుగు విధాలా చేటు అన్నారు. కాని ఇప్పుడు నవ్వు నలభై విధాలా గ్రేటు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.



నవ్వడం మూలాన జీవితంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలనుంచి దూరంగా ఉండొచ్చు.ఇప్పుడు మన దేశంలోకూడా నవ్వుల దినోత్సవాన్ని ఘనంగానే జరుపుకుంటున్నారు. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా నవ్వుల పండుగను ఆస్వాదిస్తున్నారు. 


నవ్వు గురించి బోలెడు విశ్లేషణలు ఉన్నాయి. ఆధునిక వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా చిరునవ్వు విలువ చెబుతూ ఉంటారు. నవ్వులు ఎన్నో రకాలు. నవ్వుకూ చిరునవ్వుకూ చాలా తేడా ఉంది. నవ్వీ నవ్వనట్లుగా, పెదాల మధ్య స్వచ్ఛమైన పువ్వుల్లా విచ్చుకునేదే చిరునవ్వు. అమెరికాలోని బాల్‌ మెమోరియల్‌ హాస్పిటల్‌ అనే సంస్థ 18 రకాల నవ్వులను గుర్తించింది.


నవ్వులు ఎన్ని ఉన్నా, చిరునవ్వు ప్రత్యేకతే వేరు. మనకు అత్యంత ఆత్మీయులు ఎదురైనప్పుడు మాటకన్నా ముందుగా మనసులోంచి ఉబికివచ్చే భావనే చిరునవ్వు. కొద్దిపాటి పరిచయాలను కూడా దృఢపరిచి, స్నేహంగా మార్చేశక్తి చిరునవ్వుకు సొంతం. ఇక నవ్వు విలువ తెలియక చాలా మంది నవ్వే తెలియనట్లు ఉండిపోతారు. కొందరు చీటికిమాటికి రుసరుసలాడుతూనే ఉంటారు. ప్రపంచాన్ని జయించే శక్తి అణ్వాయుధాల కన్నా, చిరునవ్వుకే ఉంది. ఇది శత్రువులైనా సులువుగా అర్థం చేసుకోగల శాంతి సంకేతం.


 ఏ వ్యక్తి అయినా నిరాశ, నిస్పృహలోంచి బయటపడాలంటే చిరునవ్వు ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం చిందించే చిరునవ్వు ఇతరుల బాధలను కూడా మాయం చేస్తుంది. చిరునవ్వుతో ఉన్న మోము మానసిక ఆరోగ్యానికి ప్రతిబింబంగా ఉంటుంది. అలాగే అభిప్రాయ బేధాలను కూడా దూరం చేయగల శక్తి చిరునవ్వుకే సాధ్యం. శరీరంలో రోగనిరోధక శక్తిని మింగేసే కార్టిసోల్‌ అనే పదార్థంపై చిరునవ్వు ప్రభావం చూపి, దాన్ని అణిచివేస్తుందని కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు.


వందసార్లు చిరునవ్వు నవ్వితే పది నిమిషాల వ్యాయామంతో సమానమవుతుందని అంటున్నారు. నగర జీవనంలో ఒత్తిళ్లతో కూడిన జీవనానికి చిరునవ్వు ఒక టానిక్‌లా పనిచేస్తుందని మనోవికాస నిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థులు, యువకులు, గృహిణులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల వారికి నవ్వు ద్వారా రిలాక్స్‌ అయ్యే లాఫింగ్‌ థెరపీ అవసరం.


ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరిదీ ఉరుకులు పరుగుల జీవనం. గడియారంలోని ముళ్లలా క్షణం వృథా కాకుండా చూసుకోవాలి. నిత్యం ఒత్తిళ్లే. విద్యార్థులకు చదువు, గృహిణులకు వంటావార్పు, ఇల్లు చక్కబెట్టుకోవడం, ఉద్యోగులకు కార్యాలయాల్లో గుట్టలుగా పేరుకుపోయిన ఫైళ్లు...ఇలా అన్ని వర్గాల వారూ మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఈ తరుణంలో ఇంట్లోని కుటుంబ సభ్యులను కూడా పరస్పరం చిరునవ్వుతో పలుకరించడం చాలా కుటుంబాల్లో మర్చిపోతున్నారు. పిల్లలైతే పాఠశాలకు ఆలస్యమైతే అసహనం, విసుగు, చిరాకు, భయం ముఖానికి అట్టిపెట్టుకుంటున్నారు.


 ఆఫీసుకు ఏమాత్రం ఆలసమైనా ఉద్యోగులు కుటుంబ సభ్యులను కసురుకుంటారు. చిరుబుర్రులాడుతారు. ఈ మానసిక ఒత్తిళ్లతో ఉదయం ఇంటినుంచి బయట పడుతున్నారు. దారిలో ఏ బాటసారి అడ్డు వచ్చినా, ఇతర వాహనాలు ముందు నిలిచి విసిగించినా తిట్లదండకం అందుకుంటారు. వీటిని అధిగమించేందుకే లాఫింగ్‌ థె రపీ అలవాటు చేసుకోవాలని యోగా నిపుణులు చెబుతున్నారు.


 ఎదుటివారు ఎంత మనసు గాయం చేస్తున్నా దాన్ని చిరునవ్వుతోనే సంతోషంగా జయించాలని వారు సూచిస్తున్నారు. ఒక చిన్న చిరునవ్వు వందమంది హిట్లర్లకు ఉన్నంత కోపాన్నికూడా జయిస్తుందని వారు చెబుతున్నారు. 


పెదవులపై విరిసీ విరియనట్లు మెరిసే చిరునవ్వుతో ఆత్మీయులకు మరింత ఆత్మీయంగా మెలగాలని వారు సూచిస్తున్నారు.చిరునవ్వులతో బతకాలి.ఎదుటి వారిని చిరునవ్వుతో పలుకరించి చూడండి. వారు మీకు ఆత్మీయులైపోతారు. ప్రశాంత వదనంతో ఉండి, సన్నటి స్మైల్‌ను మీ పెదవులపై జాలువార్చి చూడండి. నలుగురిలో మీరుంటే అక్కడ మీరే సెంట్రల్‌ అట్రాక్షన్‌గా మారిపోతారు. ద్వేషించే వారిని కూడా దగ్గరకు చేర్చే శక్తి ఈ ప్రపంచ భాషకు ఉంది. ముఖంపై చిరునవ్వు ఉంటే చాలు ప్రత్యేకంగా మళ్లీ మేకప్‌ వేసుకోవాల్సిన అవసరం రాదని అంటారు ప్రముఖ హాస్య నటుడు చార్లీ చాప్లిన్‌. 


నవ్వు మన వ్యక్తిత్వాన్ని అద్దంలా చూపిస్తుంది. ఒక నవ్వు కళ్లతో లోతుగా పలుకరిస్తుంది. మరో నవ్వు ఆత్మీయతను ప్రేరేపిస్తుంది.

ఇంకోనవ్వు నేరుగా హృదయపు లోతుల్లోకి తొంగిచూస్తుంది. అవతలి వాళ్లు మూడీగా ఉంటే మీ చిరునవ్వే వాళ్లలో ఉత్తేజాన్ని నింపుతుంది. లోపల ఏదో వెలితి, కలత ఉంటే బహుశా మీ చిరునవ్వు వారికి భరోసా కలిగిస్తుంది. మానవ సమాజంలో చిట్టిచిట్టి పాపాయిల బోసి నవ్వుల నుంచీ ఆవిర్భమైన ఈ నవ్వుల ప్రక్రియ వారు ఎదిగే క్రమంలో మానవ సంబంధాలను కలుపుకునేందుకు ఒక ఆభరణంగా నిలుస్తుంది. ఇంకా మనలోని సకల ఒత్తిళ్లను వెలికి పంపుకునేందుకు ఒక వాహికగా నిలుస్తుంది.


 పిల్లలు తమ తల్లిదండ్రులను చిరునవ్వుతో పలుకరించడం, అలాగే పెద్దలు కూడా పిల్లలను చిరునవ్వుతో నిద్రలేపడం, విసుగు, అలసట, కోపం, చిరాకు వంటివి ఇంట్లో ఎవరూ ప్రదర్శించకపోతే ఆఇల్లు చిరునవ్వుల లోగిలిగా మారుతుంది. చిరునవ్వును ఆభరణంగా పెట్టుకొని బయటకు బయలుదేరితే ఆరోజంతా సంతోషకరమైన సందర్భాలే ఎదురవుతాయి.

కాబట్టి అందరం నవ్వుతూ ఉందాం. ఇతరులను కూడా నవ్విస్తూ ఉందాం.అంతేగానీ నవ్వులుపాలు మాత్రం కాకూడదు. నవ్వించే పేరుతో ఇతరులను అపహాస్యం చేయకూడదు.