శ్లో ॥ జకారో జన్మ విచ్ఛేదః పకారో పాపనాశకః । జన్మ పాప వినాశిత్వాత్ జప ఇత్యభి ధీయతే ॥
“జ” అనగా జన్మ విచ్ఛేదనము చేయునది 'ప' అనగా పాపమును నశింప చేయునది అని అర్థము. రెంటిని నశింప చేయుట చేతనే జపమని పేరు గల్గినది. నిశ్చల మనస్సుతో దైవము మీద మనస్సు కేంద్రీకరించి తత్ మంత్ర దేవతా మూర్తి యొక్క గుణ రూపములను మనస్సు నందుంచుకొని జపించవలెను. మంత్రము యొక్క భావమును పునశ్చరణ చేయుచు ఆ భావమును వివిధ పర్యాయములు దేవతా రూపము నందు ఐక్యము చేయుటయే జపము. మనో వాక్కాయ కర్మణములతో కాపాడమని దైవమును రక్షణకై శరణాగతి వేడుటవలననే పరిపూర్ణ ఫలము నివ్వగలదు. జపము అంటే మాలను వ్రేళ్లతో త్రిప్పుచు మనస్సు ఎక్కడో ఉంచి జపము చేయుట కాదు. పరిశుద్ధ భావముతో చేయవలసినది జపము. “యద్భావం తద్భవతి" అంటే మనస్సు నందు ఏ భావమును ఉంచుకోనే దమో, ఫలములు కూడా వాటి ననుసరించియే యుండునన్న ఆర్యోక్తి గుర్తుంచుకొని సద్భావన. సత్చేంతనలతో, ఏకాగ్ర బుద్ధితో జపము నాచరించ వలయును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి