5, మే 2024, ఆదివారం

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

702/24

*సప్తమ స్కంధం*


*కాననివాని నూతగొని కాననివాడు విశిష్ట వస్తువున్*

*గానని భంగి కర్మములు గైకొని కొందఱు కర్మబద్ధులై*

*కానరు విష్ణుఁ గొంద ఱటఁ గందురకించన వైష్ణవాంఘ్రిసం*

*స్థానరజోభిషిక్తులగు సంహృతకర్ములు దానవేశ్వరా!*


దానవులకు ప్రభువవైన ఓతండ్రీ! కళ్ళు లేని వాడొకడు ఏదో మేలైన వస్తువును చూడాలని మరొక గ్రుడ్డివాని చెయ్యి పట్టుకొన్నాడు. వానికి ఆ వస్తువు కానవస్తుందా? అలాగే కొందరు యజ్ఞం మొదలైన కర్మములను పట్టుకొంటారు. అవి వారికి తెగద్రెంచు కోవటానికి వీలులేని సంకెళ్ళయిపోతాయి. దానివలన విష్ణువును చూడలేని దౌర్భాగ్యం వారిని పట్టుకొంటుంది. కానీ వివేకం పండించుకొన్న జ్ఞానులు ఉందోలేదో అన్నంత స్వల్పంగా ఉన్న శ్రీమహావిష్ణువుపాదాల మీది దుమ్ముకణంతో తలమున్కలుగా స్నానమాడి కర్మబంధాలను త్రెంపివేసుకొని విష్ణుదర్శన మహాభాగ్యం పొందుతారు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

కామెంట్‌లు లేవు: