ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
15, సెప్టెంబర్ 2023, శుక్రవారం
ఊరు పచ్చళ్ళు.
🙏🙏Maa VOORU PACHALLU 🙏 🙏
రుచిగా శుచిగా సాంప్రదయ పద్ధతిలో మీ ఇంట్లో పెద్దవాళ్ళు ( అమ్మ,బామ్మ,అమ్మమ్మ లు) చేసినట్టుగా అనిపించేలా మా(మీ) ఊరు పచ్చళ్ళు.
⚱️⚱️Per kg rates⚱️⚱️
Chintakai tokku 400
Ucirikaya tokku. 400,
Tamota. 500
Pandu mirch. 400
Uppu goongara 400
Pandu mirch Goongara. 500
Aavakaya. 600
Magaya. 600
Uciri Aavakaya 600
Nuny goongura 550
Pandu mirch. 400
Nimmakaya. 500
Dabbakaya. 500
🍈🍈🍈🍈🍈
Gummadi odiyalu 700 rs
Minapa odiyalu 500 rs
Uru mirch. 500 rs
🌶️🌶️🌶️🌶️🌶️🌶️
Kandi podi. 600
Sanaga pappu podi 600
Nuvu podi 600
Vellu karapodi 600
Kandi pachadi podi 600
Idly n Dosa Chutney podi 600
Pasara Pachadi podi 600
(Chintakaya, Ucirikaya popu paydity
extra 100 rs)
Delivery charges extra
Order pi suply chayabadunu
Contact no.9912184312
Varalakshmi 🙏
మిత్రులు గానే కనిపిస్తారు.
*1913*
*కం*
మిత్రత్వము మదినిండగ
మిత్రులుగా గోచరించు మిక్కిలి రిపులున్.
శత్రుత్వము మిత్రత్వము
చిత్రితమగు చిత్తమందు చేకొను సుజనా.
*భావం*:-- ఓ సుజనా! మిత్రత్వము మనసు నిండితే పెద్ద శత్రువులు అయినా మిత్రులు గానే కనిపిస్తారు. మిత్రశత్రుత్వాలు మనసు లోనే చిత్రీకరించబడతాయని తెలుసుకొనుము.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
బ్రాహ్మణ సదనంలోని కళ్యాణ మండపాన్ని
TBSP విజ్ఞప్తి
తెలంగాణ బ్రాహ్మణ బంధువులందరికీ నమస్కారం. మే 31వ తేదీ నాడు మాన్యులు తెలంగాణ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభింపబడిన విప్రహిత బ్రాహ్మణ సదనంలోని కళ్యాణ మండపాన్ని అన్ని హంగులతో వినియోగంలోకి తీసుకొని రావడమైంది.
కళ్యాణ మండపంలో వివాహాలు ,ఉపనయనాలు తదితర కార్యక్రమాలు నిర్వహించుకోవాలని అనుకునే వారికి ఈ కళ్యాణ మండపము కేటాయింపబడుతుంది. దీనికై ఆన్ లైను లో దరఖాస్తు చేసుకొనవలెను. బ్రాహ్మణ పరిషత్ వెబ్ సైట్ https://brahminparishad.telangana.gov.in/ ను సందర్శించి అప్లికేషన్ సమర్పించవచ్చు. ఇది ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. వార్షిక ఆదాయం రూ :2 లక్షల రూపాయల కంటే తక్కువ ఉన్న BPL కుటుంబాలు ఆ మేరకు తహసీల్దార్ నుండి పొందిన ఆదాయ ధ్రువపత్రం సమర్పించినచో వారికి కల్యాణ మండపం ఉచితంగా ఇవ్వబడుతుంది.APL బ్రాహ్మణ కుటుంబాలకు రోజుకు(24 గంటలకు) రూ :10,000/- నామమాత్రపు రెంటు స్వీకరించి కళ్యాణ మండపం ఇవ్వబడుతుంది. బ్రాహ్మణేతరులకు శాఖాహార వంటకాలు మాత్రమే అనుమతిస్తూ రోజుకు రూ :50,000/- రూపాయల రెంటుతో కళ్యాణ మండపం ఇవ్వబడుతుంది.దీనికి సంబంధించి బ్రాహ్మణ సదనంలో ఒక కార్యాలయము ఓపెన్ చేయబడింది. ఇందులో ఫణి కిషోర్ అనే నాయబ్ తహసీల్దార్ మేనేజర్ గా నియమించబడినారు.మరిన్ని వివరాలకు మేనేజర్ ను సంప్రదించగలరు. మొబైల్ నెంబరు.9059301136 అదే విధంగా బొగ్గులకుంటలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చును. మొబైల్ నెంబరు:8688577169 మరియు ల్యాండ్ లైన్ నెంబర్:040-24754811
ఇట్లు
అడ్మినిస్ట్రేటర్
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు
మంచి అబ్బాయి
ఒక మంచి అబ్బాయి కథ:
అది 1997 సంవత్సరం, ఉత్తరప్రదేశ్ లోని ఆలిఘడ్ (Alighar) కి చెందిన ఒక యువకుడు ఢిల్లీ యూనివర్సిటీ లో డిగ్రీ పూర్తి చేశాడు. అతనిది మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబం. తండ్రి ప్రకాష్ శర్మ ఒక సాధారణ స్కూల్ టీచర్. ఆస్తిపాస్తులు ఏమీ లేవు, చిన్న ఇల్లు తప్ప. డిగ్రీ పూర్తి చేయగానే అతను ఒక చిన్న Software కంపెనీలో ఉద్యోగం లో చేరాడు. అందరి తల్లితండ్రులలా అతని తల్లితండ్రులు కూడా ఉద్యోగం వచ్చిన వెంటనే సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అక్కడి నుండీ మొదలయ్యాయి అతని తిప్పలు. ఒకటి కాదు, రెండు కాదు ఎన్నో సంబంధాలు పోయాయి. ఆడపిల్లల తల్లితండ్రులు ఒకపట్టాన పెళ్లికి ఒప్పుకునేవారు కాదు. జాతకాలు కలవలేదు, గ్రహాలు కలవలేదు, సస్టాష్టకాలు అడ్డంకి, దోషాలు, శాఖా బేదం, అబ్బాయి తల్లితండ్రులు పెద్దవాళ్ళు, అబ్బాయి తల్లితండ్రలు ఇంట్లో ఉంటే రేపు పెళ్లయ్యాక మా అమ్మాయి మీదనే చాకిరీ అంతా పడుతుంది, జీతం తక్కువ, ఆస్తులు పెద్దగా లేవు అని, ఇలా ఏవేవో కారణాలు చెప్పి No అనేవారు. కొంతమంది అమ్మాయిలు అయితే పెళ్లి చూపుల సమయం లో direct గా అతని మొహం మీదనే నువ్వు handsome గా లేవు, బండగా ఉన్నావు, పొట్ట ఉంది, మాకు అందంగా ఉన్న అబ్బాయి కావాలి, Sixpack body ఉండాలి, నెలకి ఆరంకెల జీతం ఉండాలి, ఖరీదైన కార్లు ఉండాలి, అమెరికా లో settle అవ్వాలి, ఇవన్నీ నీలో లేవు అంటూ పెళ్లికి ఒప్పుకోలేదు. ఇలాగే ఏదో ఒక కారణం తో ఎన్నో సంబంధాలు పోయేవి. వెతకని సంబంధం లేదు, చూడని పిల్ల లేదు. తల్లితండ్రులు అతని పెళ్లి గురించి చేయని ప్రయత్నం లేదు, మొక్కని దేవుడూ లేడు. ఇదిలా ఉండగా అతను 2000వ సంవత్సరం లో One97 Communications పేరుతో సొంతంగా ఒక కంపెనీ ప్రారంభించాడు. అప్పటికి ఇంకా అతనికి తల్లితండ్రులు సంబంధాలు వెతుకుతూనే ఉన్నారు. ఈసారి ఇంకొక వింత పరిస్థితి ఎదురైంది. మీ అబ్బాయి సొంతగా కంపెనీ పెట్టుకున్నాడు, రేపు అది దివాళా తీస్తే మా అమ్మాయి చాలా ఇబ్బందులు పడాలి అంటూ మళ్ళీ ఆడపిల్లల తల్లితండ్రుల వింత ప్రశ్నలు వేయటం మొదలు పెట్టారు. నీ కంపెనీ మూసేసి ఏదైనా software ఉద్యోగం కానీ, ప్రభుత్వ ఉద్యోగం కానీ చూసుకుంటే ఆలోచిస్తాము అనేవారు మరికొందరు. ఇలా ఎంతోమంది అతనితో పెళ్లికి ఒప్పుకోలేదు. పదుల సంఖ్యలో సంబంధాలు పోయేవి. ఎవరు ఎన్ని మాటలు అన్నా, తన తల్లితండ్రులు దిగులు చెందినా అతనిలోని ఆత్మస్థైర్యం మాత్రం సడలలేదు. నీ requirements ఏంటి బాబు అని ఎవరైనా అడిగితే, మా తల్లితండ్రులని బాగా చూస్కునే అమ్మాయితే చాలు అని అతను వినయంగా బదులిచ్చేవాడు. అంతకుమించి అతనికి వేరే ఆశలు లేవు. ఎంత ప్రయత్నించినా సంబంధం కుదరలేదు. కాలం గడుస్తూ ఉండగా, దాదాపు 8ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత 2005వ సంవత్సరం చివరి నాటికి అతనికి మృదుల పరాశారన్ అనే అమ్మాయితో పెళ్లి కుదిరింది.
ఎన్ని కష్టాలు ఎదురైన, ఎన్ని అవమానాలు ఎదురైన అతనిలోని ప్రతిభ, పట్టుదల, కార్యదీక్షత ముందు విధి ఓడిపోయింది. 2012 లో అతను PAYTM పేరుతో స్థాపించిన ఒక కంపెనీ అతని జీవితాన్నే మలుపు తిప్పింది.అక్కడితో అతని విజయాల పరంపర మొదలైంది. సంస్థ ఎంత ఎత్తుకు ఎదిగింది అంటే అతని సంస్థలో అనీల్ అంబానీ(Reliance Capital), వారెన్ బఫెట్(ప్రపంచ కోటీశ్వరుడు) Berkshire Hathaway కంపెనీ, చైనా బాంకు(ANT Corporation), కెనడా ప్రభుత్వం, Soft Bank వంటి ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేంతగా. అతని సంస్థలో ప్రస్థుతం 10 మంది CEO లు, 18000 మంది ఉద్యోగస్తులు, 10 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. అతని ఆస్తి ప్రస్తుతం 20,000 వేల కోట్లు దాటింది అని ఒక అంచనా. FORBES పత్రిక అత్యంత ప్రతిభావంతమైన వ్యాపారవేత్తలలో జాబితాలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ ల సరసన అతని పేరు కూడా ఉంది. అతనే "విజయ్ శేఖర్ శర్మ" , Paytm Group Founder & CEO. విచిత్రం ఏంటంటే అతనీతో పెళ్లి ఇష్టం లేదని, అందంగా లేడనీ, ఆస్తులు లేవనీ ఛీత్కరించిన ప్రతి అమ్మాయి కూడా తర్వాత విజయ్ శేఖర్ శర్మ ఫోటోని Forbes పత్రిక front పేజీ లో చూసుకుంటూ అతనిని మిస్ అయ్యామే అని బాధపడ్డవారే.ఎంతోమంది అమ్మాయిలు ఒకప్పుడు అతని ఫోటో ని చెత్తబుట్టలో పడేసారు. కానీ ఇప్పుడు అతనితో ఒక చిన్న selfie కోసం ఎగబడేవారు ఎందరో !! HCL సంస్థ వ్యవస్థాపకుడు శివ నాడార్, మిట్టల్ స్టీల్ కంపెనీ చైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ కధలు కూడా ఇంచుమించు ఇలాంటివే.
ఇందులలో చెప్పవల్సింది ఏంటంటే (ముఖ్యంగా ఆడపిల్లల తల్లితండ్రులకు) ఒక అబ్బాయి జాతకం బాగలేదనో, అతనికి జీతం తక్కువనో, అతని తల్లితండ్రులు పెద్దవాళ్ళు అనో, అందంగా లేడనో, Sixpack లేదనో, America H1B వీసా లేదనో అబ్బాయిలని కాదనకండి. ఒకరి జాతకం ఇలాగే ఎల్లకాలం ఉంటుందని, మధ్యతరగతి అబ్బాయికి ఇస్తే మన అమ్మాయి అత్తారింట్లోకి వెళ్ళాక కష్టాలు పడుతుందనీ అన్నీ ముందే వూహించుకుని పెళ్లిళ్లు కాదనటం సరికాదు. అన్నిటికీ మించి మా అమ్మాయి ఫలానా డిగ్రీలు చదివింది, అంతకంటే ఎక్కువ చదివిన అబ్బాయి మాత్రమే కావాలి లేదా ఫలానా యూనివర్సిటీలలో చదివిన వారు మాత్రమే కావాలి అంటే ఎలా ?? ఎంతసేపూ ఈ సంబంధం కంటే ఇంకా మంచి option వస్తుందేమో, అదీ కాకపోతే ఇంకా ఇంకా better option వస్తుందేమో అని ఎదురు చూస్తూనే ఉంటే ఈ మధ్యలో మీరు విజయ్ శేఖర్ శర్మ లాంటి వారిని ఎందరినో మిస్ కావచ్చు. ఒకరి తలరాత ఇంతే అని నిర్ణయించటానికి మనమెవ్వరం, భగవంతునికంటే గొప్పవారమేమీ కాదుగా. ఏదో ఒకనాటికి ఎంతో గొప్ప సంబంధం వస్తుందని ఎదురుచూస్తూ వచ్చిన మంచి అబ్బాయిలందరినీ కాదంటే ఎలా ?? అన్నిటికీ మించి మధ్యతరగతి అబ్బాయిలంటే ఈ మధ్య ఆడపిల్లల తల్లితండ్రులకు చులకన మరీ ఎకువైపోయింది. ఏమి !! వారి జీవితం అంటే మరీ అంత చిన్నచూపా ?? పుట్టుకతోనే ఎవరూ కోటీశ్వరులు కాలేరు కదా. ఇవాళ జీవితం లో అత్యంత ఎత్తుకు ఎదిగిన గొప్పవారందరు ఒకప్పుడు దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినవారే కదా!! దానికి నేను చెప్పిన కుర్రాడి కధ ఒక ఉదాహరణ కాదా ? ఈరోజున దేశం మొత్తం Paytm products వాడుతున్నారు అంటే విజయ్ శేఖర్ శర్మ లాంటి వారు ఎంత ఎత్తుకు ఎదిగి ఉంటారో వేరే చెప్పాలా ?? ఒకరి అదృష్టాన్ని ముందే ఎలా అంచనా వేయగలం అని అడగకండి!! ఆత్మవిశ్వాసాన్ని, కష్టాన్నీ, తెలివిని నమ్ముకున్న ప్రతీ కుర్రాడు జీవితంలో ఏదైనా సాధించగలడు. అది అర్ధం చేసుకోండి అంటున్నాను నేను. కష్టపడి చదివి, ఉద్యోగం చేస్తూ, తల్లితండ్రుల విలువ, కుటుంబ విలువలు తెలిసిన ప్రతీ కుర్రాడు మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూస్కోగలడు. అందులో అనుమానమే లేదు.
Middle class boys are the best material in the world. There is no doubt about it.
కాదంటారా !!
బసవ పురాణం - 32 వ భాగము.....!!
🎻🌹🙏బసవ పురాణం - 32 వ భాగము.....!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸అది విని చౌడయ్య ‘‘శివ శివా! బసవడు చనిపోయాడనే వార్త విన్నాను. ఇంక కల్యాణమేమిటి?’’ అని దుఃఖపడి నందీశా! లేచిరా! అని పిలిచాడు.
🌿వెంటనే ఖణేలుమని రంకెలేస్తూ నందీశుడు భూమిలోంచి సజీవుడై వచ్చాడు. అలాగే ఒక కన్యకు కూడా చౌడయ్య ప్రాణం పోశాడు. చౌడయ్య పోతుండగా నది పొంగి వుంది.
🌸దారికడ్డం తొలుగు అన్నాడు చౌడయ్య. నది భయపడి తగ్గి దారి ఇచ్చింది.చౌడయ్య మహిమ విని ఆయనంటే గిట్టని ఇతర మతస్థులు ఒక గోనెసంచీని మనిషి రూపంలో చసి దానిని విమానమెక్కించి మునీశ్వరుడు
🌿చచ్చిపోయాడు బాబో అని ఏడుస్తూ చౌడయ్యకు ఎదురు వచ్చారు. చౌడయ్య వాళ్ల మాయ గ్రహించి చిరునవ్వు నవ్వి రా! మునీశ్వరా! దిగిరా!’’ అన్నాడు.
🌸గోనె సంచే మనిషిగా మారి విమానం దిగివచ్చి చౌడయ్యకు నమస్కారం చేశాడు. అంతటితో ఊరుకోక ఆ మునీశ్వరుడు తన కృతక రూపం సృజించిన అన్యమతస్థుల మీద విరుచుకొనిపడ్డారు.
🌿దానితో వారు భయపడి చౌడయ్య పాదాలను శరణు కోరారు. చౌడయ్య వారి నందరినీ కరుణించారు.
సురియ చౌడయ్య కథశివానందు డనే యోగి శ్రీశైలంలో తపస్సు చేస్తూ ఉండేవాడు.
🌸కొందరు గంధర్వకన్యలు గగనమార్గాన పోతూ ఆయనను చూచి పరిహసించారు. వారు క్షమాభిక్ష కోరగా కల్యాణ నగరంలో బొమ్మయ్య అనే భక్తుడు పుడతాడు.
🌿అతని చేతిలో మరణించి కైలాస ప్రాప్తి పొందండి అన్నాడు. గంధర్వ కన్యలు మృగాలై జన్మించారు. తెలుగు బొమ్మయ్య ఒకనాడు పూజార్థం అరణానికి పక్రై పోగా మృగాలు తమ్ము చంపి శాపమోక్షం గావింపవలసిందని ప్రార్థించాయి.
🌸వాటి కోరికపై బొమ్మయ్య విల్లంబులు దాల్చి మృగ సంహారం చేసి వాటికి తిరిగి గంధర్వ దేహం ప్రసాదించాడు.ఏకాంత రామయ్యగారి కథకల్యాణ నగరంలో ఏకాంత రామయ్యగారనే మహాభక్తుడు ఉండేవాడు.
🌿ఆయన ముప్పొద్దులా కైలాసానికి వెళ్లి వచ్చేవాడు. ఒకనాడు చెప్పుల కాళ్లతో జైనుడొకడు శివాలయానికి రాగా ఏకాంత రామయ్య కోపించాడు. అప్పుడు జైనుడు మా మతం వేరు, మీ మతం వేరు.
🌸అంతగా శివుడే గొప్ప అయితే నీ తల తిరిగి మళ్లీ తెప్పించమను- నేను నమ్ముతాను’ అన్నాడు. ‘ఓరోరి జైనుడా! తల తిరిగి తెప్పించడం గొప్ప కాదురా- ఎందరో భక్తులు లోగడ అలా చేశారు.
🌿తల తిరిగి ఏడు రోజులుండి మళ్లీ తెప్పిస్తాను చూడు’ అని ఏకాంత రామయ్య ఆ గుడిలో బసవడూ బిజ్జలుడూ మొదలైన వారంతా చూస్తూ వుండగా తల నరుక్కుని ఏడు రోజులు
🌸కల్యాణనగర వీధులలో తిరిగి ఎనిమిదవ నాడు తిరిగి తన తలను తన మొండంతో అతుక్కున్నాడు. దానితో జైనుడు ఓడిపోయాడు. జైనాలయాలు పడగొట్టబడ్డాయి.
🌷కరిశుని కథ
🌿తిరునావలూరు అనే నగరంలో తిరునావకరిశుడు అనే జైనుడు ఉండేవాడు. అతడు ఒకసారి శూలవ్యాధితో పడరాని బాధలన్నీ పడి మంచం పట్టాడు. అప్పుడు బంధువులొకరు వచ్చి ‘ఈమాటలతో వైద్యాలతో లాభం లేదు.
🌸పంచాక్షరీ మంత్రోపదేశం పొంది శివదీక్ష స్వీకరించు, లేకుంటే బ్రతకడం కష్టం’ అని చెప్పారు.అది విని కరిశుడు అంగీకరించాడు. భస్మ ప్రభావంతో అతడి శూలవ్యాధి నయమైంది.
🌿కరిశుడు శివదీక్ష స్వీకరించాడు. దానితో జైనులు మండిపడి కరిశుణ్ణి పట్టుకొని ఏనుగు ముందు పడేశారు. గజచర్మధారి భక్తుణ్ణి ఏనుగు తాకడానికి భయపడింది. విషం పెట్టారు. విషధరు భక్తుణ్ణి విషమేం చేస్తుంది?
🌸నిప్పుల్లో పడేశారు. జిహ్వాంతకుని భక్తుణ్ణి చిచ్చు ఏమి చేస్తుంది? నీళ్ళల్లో పడేశారు. జలమేళి బంటుకు జలమేమి భయం? దానితో వారంతా భయపడి కరిశుని శరణు కోరారు. కరిశుడు వారందరికి శివదీక్షనిప్పించాడు.
🌷ఇరుత్తాండి కథ
🌿తిరువారూరులో ఇరుత్తాండి అనే శివభక్తుడు ఉండేవాడు. అతడు పుట్టుగుట్ట. శివుని కోవెలముందు కొలను తవ్వుతూ కాలం గడపాలని భావించి గునపంతో మట్టి త్రవ్వుతూ గుర్తుగా శంఖులు కట్టిన ఒక త్రాడును ఉంచుకున్నాడు.
🌸జైనులు అది చూచి ఇరుత్తాండిని బాధపెట్టాలని శంఖులు తెంపారు. చివరకు తాడు కూడా కోసివేశారు. శివుడు ఇరుత్తాండికి కళ్ళు ఇచ్చాడు. ఇరుత్తాండి అన్యాయులైన జైనుల మదము అణచాడు....సశేషం...🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
యోగవాసిష్ఠమ
శ్రీమద్రామాయణంలో శ్రీరామచంద్రునికి బాల్యంలో పరిస్థితుల ప్రభావానికి వైరా గ్యం కలుగుతుంది. ఆ సమయంలో విశ్వామిత్రుని మాట ప్రకారం వశిష్ఠ మహర్షి రామునకు దివ్యమైన ఉపదేశాన్ని ఇస్తాడు. అదే యోగవాసిష్ఠమని పేరొందినది. అం దులో మొదటి అధ్యాయం వైరాగ్యమునకు చెందినది. ప్రాపంచిక సుఖాలు తుచ్ఛమైనవిగా భావించినప్పుడే భక్తి కలుగుతుంది.
వశిష్ఠుడు శ్రీరామునిగాంచి ”వత్సా! నీవు ఏమి త్యజించదలిచావు? నీవు రాజభవనం వదలి అడవికి వెళ్ళాలనుకుంటే చిన్న కుటీరం అవసరమవుతుంది. చిన్న వస్త్రం ధరించాలి. కౌపీనం అవసరమౌతుంది. మంచి భోజనం వదలి కందమూలఫలాదులను తినాలి. అందు వలన మనస్తే బంధనానికి కారణమవుతుంది. మనస్సే ముక్తినిస్తుంది. మనసులో విషయ వాంఛలు లేనపుడు మానవుడు ముక్తుడవుతాడు.
విషయాలను చింతన చేస్తే మనస్సుకు భయం కల్గుతుంది. విషయ చింతన త్యజిస్తే శాం తి లభిస్తుంది. స్వప్న జగత్తు వలన అజ్ఞానం కలుగుతుంది. నిద్రనుండి మేలుకొనిన పిదప స్వప్న రూపం కన్పించదు. సుఖదు:ఖాలు అజ్ఞానం వలన కలుగుతాయి. ఇవి మనస్సుకు చెం దిన ధర్మాలు. రాగద్వేషాల వలన క్రొత్త ప్రారబ్దం మొదలవుతుంది. జ్ఞాని ప్రారబ్దాన్ని యోగం చేత నశింపజేస్తాడు. సాధన చేస్తూ మనస్సు చెడకుండా ఉండాలని జాగరూకత కలిగి వ్యవ హరించాలి. ఈ జగత్తు సంకల్పం నుండి ఉత్పన్నమయినది. శాంతిని పొందాలంటే ప్రపం చాన్ని వదలవలసిన పనిలేదు. కానీ చింతించడం వదలినప్పుడే మనస్సు శాంతిస్తుంది.
భగవంతుని స్వరూపంలో మనస్సు లయమయినపుడే ముక్తి లభిస్తుంది. బాహ్యం నుం డి చేసిన త్యాగం త్యాగం కాదు. అది అహంకారం అవుతుంది. కావున మనస్సు చెడకుండా జాగ్రత్తపడాలి. నీవు అన్నీ వదలి అరణ్యానికి వెళ్ళినా జగత్తు నీవెంట వస్తుంది. సత్పురుషులు మాత్రమే ఆసక్తిని త్యజిస్తారు. బ్రహ్మ జ్ఞానాన్ని గురించి చర్చించాలిగానీ, ద్రవ్యాన్ని ప్రేమించే వాడు నిజమైన జ్ఞానికాడు. జ్ఞానానికి చెందిన సప్తభూమికలను నీకు వివరిస్తాను. అవి వరు సగా శుభేచ్ఛ- సువిచారణ- తనుమానస- సఖాపత్తి- అసాపక్తి- భూమిక పదార్థ భావన- తుర్యగా భూమికలు.
మొదటిది శుభేచ్ఛ. ఆత్మకల్యాణం కోసం ఒక బ్రహ్మ నిష్ఠగల గురువును ఆశ్రయించి, ఆత్మసాక్షాత్కారం తీవ్రమైన కోరికనే శుభేచ్ఛ అంటారు. రెండవది సువిచారణ. సద్గురువు చేసిన ఉపదేశాలను మోక్షమార్గం చూపు శాస్త్రాలను పదేపదే చింతన చేయడం. మూడవ భూమిక ‘తనుమానసి- శ్రవణ- మనన నిధి-ధ్యాసల ద్వారా విషయాలయందు దేనివలన అనాసక్తి కలుగుతుందో బుద్ధికి సూక్ష్మత లభించునో అదే తను మానస అవుతుంది.
ఈ మూడు భూమికలు సామాన్య కోవకు చెందినవి. మిగిలిన నాలుగు జ్ఞానకోటికి చెంది నవి. పై మూడింటి కొరకు సగుణ బ్రహ్మ చింతన చేయాలి. ఇవి సిద్ధించిన పిదప అవిద్య నశి స్తుంది. నాలుగవ భూమిక ‘సఖాపత్తి’. దీనికి చెందిన పురుషులు ‘బ్రహ్మవిద్’ అవుతారు. ఐదవ భూమిక ‘అనాసక్తి’. చిత్తమునందు పరమానందం, నిత్య బ్రహ్మాత్మ భావం, సాక్షాత్కార రూప మైన చమత్కారమే అనాసక్తి అవుతుంది. ఇక ఆరవది ‘పదార్థ భావన భూమిక’. పదా ర్థములందు దృఢమగు అవిశ్వాస స్థితి ఏదైతే వున్నదో దానిని పదార్థ భావన అంటారు. దీని లో దేహధ్యాస వుండదు. చివరకు ఉన్మాద స్థితి కలుగుతుంది.
చివరగా ఏడవది ‘తుర్యగా భూమిక’. ఏ స్థితిలో పురుషుడు పరమాత్మను ఆత్మస్వరూ పంగా భావిస్తాడో అదే తుర్యగా అంటారు. మీరు పరమాత్ములు. జగత్కల్యాణం కొరకు మీర వతరించారు. మీరు లీలలను చూపిస్తూ వుంటారు. మీ పావన నామం చేత జీవుని మనస్సు బాగుపడుతుంది. శ్రీరామా! తండ్రి పుత్రుల సంబంధం నిజమైనది కాదు. జీవేశ్వరుల సంబంధం నిజమైనది. శరీ రం ఉన్నంతవరకూ వ్యవహారం కొనసాగించవలసి ఉం టుంది. భగవంతుని విస్మరించడం మహాపాపం. వ్యవ హారం పవిత్రంగా ఉన్నప్పుడే భక్తి స్థిరపడుతుంది. దృష్టి లో భగవంతుని ఉంచుకొంటే ఆచరణ భక్తిమయమవు తుంది. మనస్సుతో భగవత్ స్మరణ చేస్తూ వుండాలి. భక్తికి అంతం లేదు. మన జీవితంలో ప్రతి వ్యవహారం భక్తిమ యమగునట్లుగా జీవించాలి. ఈశ్వరుని ప్రేమించే వాని కర్మలన్నీ పూజా స్వరూపమే అవుతాయి.
సత్పురుషులు మౌనంగా వుండి ఉపదేశం చేస్తారు. వారి ఆచరణ ప్రజల మనస్సులలో భక్తిని- జ్ఞానాన్ని కలు గజేస్తుంది. శ్రీరామునికి వశిష్ఠ ముని అందించిన దివ్య సందేశం విని దశరథునికి ఆనందం కలిగింది. ‘మీ ఆజ్ఞ అయిందా’ అని శ్రీరాముడు తండ్రిని అడుగుతాడు. దశ రధుడు రాముడిని ”విశ్వామిత్రుని యాగ సంరక్షణ కు వెళ్తావా?” అని అడిగితే రాముడు వెంటనే మీరెలా ఆదే శిస్తే అలానే చేస్తాను అన్నాడు. వశిష్ఠుడు ఆనందంతో శ్రీ రాముని పలుకులు విని ఎంతో ఆనందించాడు. ఆశీర్వ దించి పంపాడు. సత్పురుషుల సాంగత్యంలోనే మేలు కలుగుతుంది. సుఖ సంతోషాలు పొందుతారు. తన ఉప దేశం ఫలించినందులకు ఎంతగానో ఉప్పొంగిపోయాడు వశిష్ఠ మహర్షి.
⚜ శ్రీ సురంగ్ థిలా మందిర్
🕉 మన గుడి : నెం 179
⚜ ఛత్తీస్‌గఢ్ : సిర్పూర్ జిల్లా
⚜ శ్రీ సురంగ్ థిలా మందిర్
💠 ఛత్తీస్‌గఢ్ ఎల్లప్పుడూ కళలు మరియు సంస్కృతికి నిలయంగా ఉంది.
పురాతన భారతీయ దేవాలయాలు వాటి నిర్మాణం వెనుక కొన్ని సైన్స్ ఉన్నాయి. 'మాయతం' అనేది ప్రాచీన భారతీయ గ్రంథం, ఇది భారతీయ దేవాలయాల వాస్తు శిల్పానికి ఆధారం అని నమ్ముతారు.
చరిత్ర ప్రకారం, వాస్తుశిల్పుల దేవతలరాజు మయాసురుడు భారతదేశం అంతటా అనేక అందమైన నిర్మాణాలను నిర్మించాడు. అటువంటి పురాతన దేవాలయం సిర్పూర్‌లో ఉన్న శివుని సురంగ్ తిల దేవాలయం.
💠 సిర్పూర్, మధ్యయుగ గ్రంధాలలో శ్రీపూర్ (సంపద నగరం) అని కూడా సూచించబడుతుంది.
ఇది ఛత్తీస్‌గఢ్‌లోని మహానది ఒడ్డున ఉన్న పట్టణం.
1872లో బ్రిటిష్ ఇండియా అధికారి అయిన అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్ ఇక్కడి లక్ష్మణ్ (లక్ష్మణ) ఆలయాన్ని సందర్శించి నివేదించిన తర్వాత ఈ ప్రదేశం పురావస్తుపరంగా ప్రాముఖ్యత సంతరించుకుంది.
చైనీస్ యాత్రికుడు హ్యూన్ త్సాంగ్ జ్ఞాపకాలలో సిర్పూర్ మఠాలు మరియు దేవాలయాల ప్రదేశంగా పేర్కొనబడింది.
💠 11 వ శతాబ్దంలో సంభవించిన బలమైన భూకంపం కారణంగా ఆలయం యొక్క మధ్య భాగం కాకుండా ఆలయంలోని దాదాపు మొత్తం భాగం ధ్వంసమైంది. కానీ ఆలయం యొక్క మధ్య భాగం ఇప్పటికీ 1600 సంవత్సరాలకు పైగా ఉంది.
ఇంజనీర్లు నమ్ముతున్న దాని వెనుక కారణం ఏమిటంటే, ఆలయం యొక్క భూకంప వ్యతిరేక నిర్మాణం. 80 అడుగుల లోతులో మూడు సమాంతర సొరంగాలు భూగర్భంలో విస్తరించి ఉన్నాయి. 1600 సంవత్సరాల నిర్మాణ ఆలయ మధ్య భాగం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటానికి ఇదే కారణం.
💠 ఈ ఆలయ అధ్యయనం నుండి బయటపడిన మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ బరువైన రాళ్లను కట్టడానికి ఉపయోగించే రసాయన బైండర్ ఒక రకమైన ఆయుర్వేద పేస్ట్, ఇది ఇంజనీర్లు నిర్మాణానికి ఉపయోగించే ఆధునిక సిమెంట్ బైండర్ కంటే 20 రెట్లు బలంగా ఉంటుంది. మరియు ఈ ఆయుర్వేద పేస్ట్ తుప్పు నిరోధకతను కలిగి ఉంటుంది మరియు అందువల్ల ఇంత పెద్ద నిర్మాణాన్ని చాలా కాలం పాటు నిలబడేలా చేస్తుంది.
💠 2005-06లో సురంగ్ తిలా యొక్క అపారమైన ఆలయం వెలికితీయబడింది. ఆలయ ప్రాంగణం విస్తారమైన ప్రాంతాన్ని కలిగి ఉంది మరియు ప్రధాన ఆలయం 37 నిటారుగా ఉన్న సున్నపురాయి మెట్లతో ఎత్తుగా ఉంది.
💠 ఈ ఆలయాన్ని ఛత్తీస్‌గఢ్‌లోని సిర్పూర్ గ్రామంలో 7వ శతాబ్దంలో మహాశివగుప్తుడు నిర్మించాడు. ఈ ఆలయాన్ని పంచాయతన ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించారు, మధ్యలో ప్రధాన ఆలయం మరియు మూలల్లో నాలుగు ఆలయాలు ఉన్నాయి.
ప్రధాన ఆలయంలో ఐదు గర్భాలయాలు ఉన్నాయి, వాటిలో నాలుగు నాలుగు వేర్వేరు రంగుల శివలింగాలను కలిగి ఉంటాయి మరియు ఐదవది పూజ కోసం లోపల గణేష విగ్రహాన్ని కలిగి ఉంది.
కాంప్లెక్స్ ప్రాంతం వేదికపై మూడు తాంత్రిక ఆలయాలను కలిగి ఉంది, అవి బ్రహ్మ, విష్ణు మరియు శివులకు అంకితం చేశారు.
💠 1960 తర్వాత, ముఖ్యంగా 2003 తర్వాత జరిగిన త్రవ్వకాలలో 22 శివాలయాలు, 5 విష్ణు దేవాలయాలు, 10 బుద్ధ విహారాలు, 3 జైన విహారాలు, 6వ/7వ శతాబ్దపు మార్కెట్ మరియు స్నాన-కుండ్ (స్నానపు గృహం) లభించాయి.
💠 ఇది ఛత్తీస్‌గఢ్‌లోని సిర్పూర్ వద్ద మహానది ఒడ్డున ఉంది. అది పెద్ద కోటలా కనిపిస్తుంది.
చాలా చరిత్ర పుస్తకాలలో సురంగ్ తిలా గురించిన ప్రస్తావన మీకు కనిపించదు. ఎందుకంటే, ఈ ఆలయం 2006లో మాత్రమే వెలికి తీయబడింది.
12వ శతాబ్దంలో భూకంపం తర్వాత 900 ఏళ్లపాటు మట్టితో కప్పబడి ఉంది.
💠 సమయాలు : సురంగ్ తిలా ఆలయం ఉదయం 10:00 నుండి సాయంత్రం 06:00 వరకు తెరిచి ఉంటుంది
💠 ప్రవేశ రుసుములు :
భారతీయ సందర్శకులకు 25 రూ.,
విదేశీ సందర్శకులకు 300 రూ.
సంస్కృత భారతీ* *2*
*సంస్కృత భారతీ*
*2*
*ద్వితీయ పాఠః*
*కరోమి* = చేయు చున్నాను, కరోతి = చేయుచున్నాడు, కరోషి
=చేయుచున్నావు,
కుర్వన్తి = చేయుచున్నారు, కుర్మః = చేసెదము, కరోతు/కురు = చేయుము,కుర్వన్తు = చేయుము(చేయండి)(బహువచనం/గౌరవవచనం),
*వదతి* = చెప్పుచున్నాడు,ఇదే విధంగా వదసి,వదామి వర్తిస్తాయి. వదన్తి = చెప్పుచున్నారు. వదతు/వద = చెప్పుము,వదన్తు = చెప్పండి, వదామ = చెప్పెదము.
*భవామి*= అగుచున్నాను,ఇదేవిధంగా భవసి, భవతి, భవన్తి, భవతు/భవ, భవన్తు,భవామ వర్తిస్తాయి.
*గఛ్ఛామి* = వెళ్ళుచున్నాను, ఇలాగే గఛ్ఛసి, గఛ్ఛతి, గఛ్ఛన్తి,గఛ్ఛతు/గఛ్ఛ,గఛ్ఛామ *ఆగచ్ఛామి* = వచ్చు చున్నాను, ఆ అనే ఉపసర్గను చేర్చ గా ఇటువంటి పదాల అర్థం మనవైపునకు అనగా వచ్చుటకు గా మారుతుంది.
*ఉదా*:-- గఛ్ఛతి = వెడలు చున్నాడు, ఆగఛ్ఛతి = వచ్చుచున్నాడు, ఇదే విధంగా ఆగఛ్చసి,ఆగఛ్ఛసి,ఆగఛ్ఛన్తి,ఆగఛ్ఛ, ఆగఛ్ఛామ..ఇలా ఇంచుమించు గా అన్ని ధాతువు లనూ అనువర్తనం చేయవచ్చు.అలాగే నయతి = తీసుకొని వెడలు చున్నాడు, ఆనయతి = తీసుకుని వచ్చు చున్నాడు.
కొన్ని ధాతువులకు మాత్రం కొంత వ్యత్యాసం వస్తుంది.
*సాధారణంగా మనం ఉపయోగించే కొన్ని ధాతువులు ఉత్తమ పురుష(స్వంతము) రూపంలో*
*అటామి* = తిరుగుచున్నాను(roaming).
*భణామి*/ భాషయామి = మాట్లాడుచున్నాను. *ఖాదామి* = తిను చున్నాను., అస్మి = ఉన్నాను, ఇఛ్ఛామి = కోరుకొను చున్నది., *పృఛ్ఛామి* = అడుగు చున్నాను,
*శ్రుణోమి* = వినుచున్నాను, ఇక్కడ శ్రుణ్వన్తి = విను చున్నారు.
*పశ్యామి* = చూచు చున్నాను,
*దర్శయామి* = చూపుచున్నాను,
*చలామి* = కదులుతున్నాను,
*క్రీడామి* = ఆడుచున్నాను,
*భరామి* = భరించు(ధరించు) చున్నాను,.
ఇలా ఈ రూపాలను మధ్యమ ,ప్రధమ పురుష రూపాలకు కూడా అనువర్తించుకొనవచ్చు. అయితే కొన్ని రూపాంతరాలలో కొన్ని మార్పు లు ఉంటాయి, అవి చర్చోపచర్చలలో తెలుసుకొనవచ్చును.
*----*
అత్ర = ఇక్కడ, తత్ర = అక్కడ, కుత్ర = ఎక్కడ?, ఇదం = ఇది, తత్ = అది, కిం = ఏది?, ఇదానీం = ఇప్పుడు, తదా = అప్పుడు, కదా = ఎప్పుడు??, ఇథ్థం / ఈదృశీ = ఇలా, తథా/ తాదృశీ = అలా, కథం/ కీదృశీ = ఎలా?, ఏతాని = ఇన్ని, తాని = అన్ని, కాని = ఎన్ని?, ఇలాగే సా,ఏషా,కా అనేవి స్త్రీ లింగాలు. తే = వారు, ఏతే = వీరు, కే = ఎవరు?
*ప్రయోగ విభాగః*
*ప్ర*:--- త్వం కిం కరోషి-- నీవు ఏమి చేయుచున్నావు??
*స*:-- అహం లిఖామి-- నేను రచించు(రాయు) చున్నాను.
*ప్ర*:--- భవన్తః కుత్ర గఛ్ఛన్తి-- మీరు ఎక్కడ కు వెళ్ళుచున్నారు??
*స*:-- అహం పాఠశాలాం ప్రతి గఛ్ఛామి-- నేను పాఠశాల కు(కొరకు=ప్రతి) వెళ్లుచున్నాను.
*ప్ర*:-- సః కిం ఖాదతి-- వాడు ఏమి తినుచున్నాడు?
*స*:-- సః ఫలం ఖాదతి.-- వాడు ఫలం తినుచున్నాడు.
*ప్ర*: సః కుత్రతః ఆగఛ్ఛతి?.. వాడు ఎక్కడినుండి వచ్చుచున్నాడు?,
*స*:-- సః కార్యాలయతః ఆగఛ్ఛతి... వాడు కార్యాలయం నుండి వచ్చుచున్నాడు.
..... *శుభం భూయాత్*
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ***
సంస్కృత భారతీ* *1*
*సంస్కృత భారతీ*
*1*
*ప్రథమ పాఠః*
అహం = నేను, వయం=మేము/మనము, త్వం = నీవు, భవాన్ = మీరు(గౌరవవాచకం) యూయం = మీరు, మమ/మదీయ = నాయొక్క, తవ/త్వదీయ = నీయొక్క, భవదీయ = మీయొక్క, (భవ అనేది గౌరవవాచక సూచకము) యుష్మదీయ = మీయొక్క అస్మత్ = మాయొక్క/మనయొక్క,తస్య = అతని యొక్క
సః = వాడు, సా= ఆమె, తే = వారు, తత్ = అది, తాని = అవి. తైః = వారిని, తేభ్యః = వారి కొరకు, తేషాం = వారియొక్క, తేషు = వారి యందు, తస్మై = వారి కొరకు,
వీటన్నిటికీ ముందు 'ఏ' ను చేర్చినచో మనసమీపములుగా మారును. ఇలా ఉపసర్గ(పదానికి ముందు చేర్చే వర్ణము/అక్షరము) చేర్చినప్పుడు ఒక్కొక్కప్పుడు ఆ పదం లోని ఇతర అక్షరాలలో కూడా కొంత మార్పు వస్తుంది,ఉదాహరణకు సః, ఏ *షః* గా మారుతుంది.
*ఉదా* ఏషః = వీడు,ఏషా = ఈమె,ఏతత్ = ఇది...ఇలా
******
అస్మి = ఉన్నాను, స్మః = ఉన్నాము, అసి = ఉన్నావు, అస్తి = ఉన్నది/ఉన్నాడు, సంతి = ఉన్నారు/ఉన్నాయి. అస్తు = అగుగాక
*****
"క' కారము సంస్కృతమున ప్రశ్నాక్షరము, ఉదాహరణకు కిం = ఏమిటి?, కః = ఎవరు?, కా = ఎవతె?,కాని = ఎన్ని, కస్మై/ కస్యకృతే = ఎవరికొరకు, కైః = ఎవరిని, కేభ్యః = ఎవరి యొక్క, కథం = ఎలా!??, కుత్ర = ఎక్కడ?, కదా?= ఎప్పుడు?, ....ఇలా.
అలాగే వా అని చివర లో చేర్చినప్పుడు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది.
ఉదాహరణకు త్వం రామః వా!?? అంటే నీవు రాముడవా ? అని అర్థం.
నామం = పేరు, గ్రామం = ఊరు.సమయః / కాలః = కాలము, మరిన్ని పదాలు మనకు వ్యావహారికంగానూ, నిఘంటువు లలోనూలభిస్తాయి. అలాగే ఈ సమూహం లో అడిగిననూ తెలుపగలరు.
*---*
*ప్రయోగభాగః*
*ప్రశ్న* :-- తవ నామ కిం = నీ పేరు ఏమిటి?
*సమాధానం*:--మమ నామ శ్రీనివాస శర్మా,
*ప్ర*:-- తవ గ్రామం కిం ?
*స*:-- మమ గ్రామం రాజమహేంద్రవరం
*ప్ర*:-- తస్య గ్రామం కిమ్?
*స*:-- భాగ్య నగరమ్,
*శుభం భూయాత్*
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
అమ్మగా వర్ధిల్లాలనుకుంటుంది.
*1911*
*కం*
ఆడది కోరుకొనేదిల
యాడతనము కన్నమిన్న యమ్మతనంబౌ.
ఆడది గా బతుకీడ్చుచు
నమ్మగ వర్ధిల్లనెంచు నాడది సుజనా.
*భావం*:-- ఓ సుజనా! ఆడది తన ఆడతనముకన్నా గొప్పగా అమ్మతనము కోరుకుంటుంది. స్త్రీ ఆడది గా బతుకు చూ అమ్మగా వర్ధిల్లాలనుకుంటుంది.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
వినాయక చవితి 18వ తేదీన
తెలుసుకోండీ... 13923
తెలియజేయండీ....
జ్యోతిర్వాస్తు మంజూష .....748
*వినాయక చవితి నిర్ణయం*
2023 భాద్రపద శుద్ధ
చవితి వినాయక చతుర్థి
ఎప్పుడు చేయాలి అనే విషయం పై ప్రస్తుతం నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులలో వాదోపవాదాలువినవస్తూ ఉన్నాయిఏది ఏమైనప్పటికీ
జ్యోతిష్య సిద్ధాంతులు, పీఠాధిపతులు మఠాధిపతులు
ఒక్కొక్కరు ఒక్కొక్కవిధానాన్ని ప్రకటిస్తూ ఉంటే,, హిందూ ధర్మవాదులు చివరికిఎవరిని
అనుసరించాలి అనేసంశయం తో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సందర్భంలో
వినాయక చవితి నిర్ణయం పై ఉన్నశాస్త్రీయ విధానాన్ని
మీ దృష్టికి తీసుకురాదలచాను.
అందుకే పెద్దలు,పండితులవద్ద నుండి సేకరించిన కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను.
వినాయక చవితి నిర్ణయం పై వివరణ
దిన్ద్వయేపి వర్తేత మధ్యాహ్నే చేత్ చతుర్థికా
తదా పూర్వైవ కర్తవ్యా
న పరాతు కదాచన
గణనాధవ్రతే గ్రాహ్య
తృతీయా సహితా సదా
చతుర్థీ త్వన్యదేవస్య
వ్రతే గ్రాహ్యా పరాన్వితా
ఇలా చాలా శ్లోకాలు
చతుర్థీ మధ్యాహ్న వ్యాప్తి ఉన్నది చూసి వ్రతమును
ఆచరించాలని ఉన్నవి.
చతుర్థీ గణనాధస్య
పరవిద్ధా ప్రశస్యతే
జయయుక్తానకర్తవ్యా
సర్వధా శుభకాంక్షిభిః
ప్రహారద్వయపర్యన్తం
చతుర్థీ యదివర్తతే
పరవిద్ధైవ కర్తవ్యా
పూర్వవిద్ధం పరిత్యజేత్
పంచమీ యుక్త చతుర్థీ మధ్యాహ్న వ్యాప్తి ఉన్నది గ్రహించాలని ఇంకొన్ని గ్రంథాలు చెప్తున్నాయి తృతీయా యుక్త చతుర్థీ ని వర్జించాలి అని కూడా ఉన్నది.
ప్రహారద్వయ అను శబ్దం తో రెండు రోజులు చతుర్థీ మధ్యాహ్న వ్యాప్తి ఉన్నచో రెండవ రోజును గ్రహించాలి అని ఉన్నది.
మధ్యాహ్న వ్యాప్తే: షఢా భేధ:
అని మధ్యాహ్న వ్యాప్తి చెందిన తిథులు ఆరు రకాలు ,వాటిలో
మొదటిదిపూర్వదిన వ్యాప్తి మనకు ప్రథమ పక్షే పూర్వా గ్రాహ్య అని పూర్వ దినమున
మధ్యాహ్న కాలం ఉన్నది గ్రహించాలని ఉన్నది,ఇంకా పక్షములు ఉన్నవి కానీ ప్రధానంగా ఐతే ఇలా తీసుకోవాలని చెప్పారు. ఏతావాత్, ఆ పక్షమునకు వస్తే *మనకు18,19 లలో మధ్యాహ్న తిథి వ్యాప్తి 18 న వచ్చినది కాబట్టి 18 న వ్రతమును ఆచరించడం*
ఉత్తమమనితెలుస్తుంది.
జ్యోతిష్య గ్రంథాలు
ఏమంటున్నాయో
పరిశీలిస్తే...
*1.కాలమాధవీయము*
పరేద్యురేవామధ్యాహ్నవ్యాప్తౌ విఘ్నస్యచోత్తరా| అన్యధా పూర్వ విధైవ
మాత్ర యోగ ప్రశస్థితః
మరోసారి రోజు మధ్యాహ్నమున పూర్తిగా చెవిటి ఉన్నచో మరుసటిరోజే ఆచరించవలెను
2. **ధర్మసిందు*:-
"పరదినేసంపూర్ణ
మధ్యహ్న వ్యాపినీ తథాపరైవ"
సంపూర్ణ మధ్యాహ్న వ్యాపిని కల పరదినమందే ఆచరించవలెను.
*3. *నిర్ణయ సింధు* :-
"పరదినేఏవ అంశేన
సాకల్యేనా వ
మధ్యాహ్న వ్యాప్తాభావే
సర్వపక్షేషు పూర్వా
గ్రాహ్య "
పర్వదినముల లో చవితి మధ్యాహ్నం కాలమున కొంత గాని పూర్తిగా గాని లేనప్పుడు ముందు రోజే చవితిని
ఆచరించవలెను.
4. **భవిష్యత్*
*పురాణము*
"పరదినేఏవ అంశేన
సాకల్యేనా వ
మధ్యాహ్న వ్యాప్తౌపర |
అన్యధా పూర్వా చతుర్థి గణనాథస్య మాతృవిద్దా ప్రశస్యతే
మధ్యాహ్న వ్యాపినీ చేత్స్యాత్ పరత:చేత్
పరేహనీ "
నిర్ణయ సింధులో మరొకటి రోజు గురించి చెబుతూ మాతృ విద్దా ప్రశస్యతే అనే వాక్యమును బోధక వాక్యము గాను పరత: చేత్ పరేహనీ అనేది విధాయక వాక్యముగాను తెలియజేశాను. కావున సంపూర్ణ కర్మ కాలవ్యాప్తిగల అనగా మధ్యాహ్న వ్యాప్తి గలది అని తెలిపెను .కనుక
*వినాయక చవితి 18వ తేదీనp చేయటమే శ్రేయోదాయకము.*
సర్వం శ్రీపరమేశ్వరార్పణమస్తు
సర్వారాయుళ్లు
ఏరీ అలనాటి సర్వారాయుళ్లు?
"శ్రీ లక్ష్మీ కాఫీ హోటల్"
"పరమేశ్వర బ్రాహ్మణ కాఫీ హోటల్"
"ధనలక్ష్మీ ఆర్యవైశ్య కాఫీ హోటల్"
"సుబ్బారావుగారి కాఫీ భోజన హోటల్"
వీధిలోకి వెళ్ళగానే కనిపించే హోటల్లోకి అడుగుపెట్టగానే ముందు గదిలో టేబుల్ మీద పెద్ద సైజ్ రేడియో, బిల్లులను గుచ్చడానికి దబ్బనం లాంటి ఒక పరికరం, ఒకటో రెండో చాకోలెట్స్ సీసాలు పెట్టుకుని కుర్చీలో ఒక పెద్దమనిషి కూర్చుని కనిపిస్తాడు. అతని కుర్చీ వెనుక పదిరకాల దేవుళ్ళ ఫోటోలు గోడకు తగిలించి ఉంటాయి. అగరొత్తులు సుగంధాలు విరజిమ్ముతాయి. లోపలకి వెళ్ళగానే హాల్లో మూడు నాలుగు వరుసల్లో టేబుళ్లు, టేబుల్ కు అటూ ఇటూ రెండు కుర్చీలు కనిపిస్తాయి. మనం ఏదొక కుర్చీలో కూర్చోగానే బట్లర్ లేదా సర్వర్ వస్తారు. "టేబుల్ క్లీన్" అని కేకపెడతాడు. క్షణంలో ఒక వ్యక్తి వచ్చి తడిగుడ్డతో టేబుల్ మొత్తాన్ని కసకసా తుడిచేసి వెళ్ళిపోతాడు.
"ఏమున్నాయి?" ప్రశ్నిస్తాము. "ఇడ్లీ వడ ఉప్మా పూరి ఉల్లిదోసె సాదాదోస పెసరట్టు ఉప్మా పెసరట్టు" అని ఫుల్ స్టాప్, కామాలు లేకుండా ఆరనిముషంలో ఇరవై రకాల టిఫిన్ల దండకాన్ని చదువుతాడు. అలా ఒకసారి కాదు...రోజుకు కనీసం రెండు వందలసార్లైనా ఆ దండకాన్ని చదువుతాడు. అన్నీ విని సరిగా వినపడనట్లు ముఖం పెట్టి కొంతమంది మళ్ళీ అడుగుతారు. ఏమాత్రం విసుక్కోకుండా మళ్ళీ చెబుతాడు. ఆర్డర్ ఇవ్వగానే వెళ్లి రెండు మూడు నిముషాల్లో ప్లేట్ లో తీసుకుని వస్తాడు.
కొన్నిసార్లు ఉదయం వేళల్లో రద్దీగా ఉన్న సమయంలో ఒకేసారి నాలుగైదు ప్లేట్లను కూడా ఒకదానిమీద మరొకదాన్ని పెట్టి తీసుకొస్తాడు. నలుగురి దగ్గర ఆర్డర్ తీసుకుని కిచెన్ లోకి అన్నీ తెచ్చి ఎవరెవరు ఏమి అడిగారో వారికి కచ్చితంగా వాటినే ఇస్తాడు. చిన్నపొరపాటు కూడా జరగదు.
ఇడ్లీ సాంబార్ చాలా ఫేమస్. దానికి సాంబార్ ఇడ్లీ అని చెప్పాలి. మామూలు ఇడ్లీ అంటే ఇడ్లీ ప్లేట్ లో కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, కొద్దిగా కారప్పొడి తో తెస్తాడు. సింగిల్ సాంబార్ ఇడ్లీ అని చెబితే పెద్ద ప్లేట్ లో ఒక్క ఇడ్లీ తీసుకొచ్చి పెద్ద లోటాతో సాంబార్ తెచ్చి పళ్లెం నిండా పోస్తాడు. పావు లీటరు పైగానే ఉంటుంది. కొంతమంది ఆ ఒక్క ఇడ్లీకే మళ్ళీ సాంబార్ వేయించుకుంటారు.
తిన్న తరువాత "ఇంకేమి కావాలి సార్" అడుగుతాడు. "కాఫీ" అనగానే గ్లాసులో నురగలతో కాఫీ తెచ్చి ఇచ్చి చెవి పైభాగంలో దోపుకున్న పెన్సిల్ తీసుకుని జేబులొనించి చిన్న కాగితం ముక్క తీసి ఎంత అయిందో రాసి ఇస్తాడు. నేను తొలిసారి హోటల్లో తిన్నపుడు రెండు ఇడ్లీ పావలా. పూరీ రెండు అర్ధరూపాయి. కాఫీ ఇరవై పైసలు అని గుర్తు. ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ పూరి, తిని కాఫీ తాగితే తొంభై అయిదు అయిదు పైసలు అయ్యేది. రూపాయి నోటు ఇచ్చి "మిగిలింది ఉంచుకో" అనేసి వెళ్ళిపోయేవారు కొందరు.
1975 ప్రాంతంలో ఆంధ్రాలో కానీ, తెలంగాణాలో కానీ, తమిళనాడులో కానీ చిన్న చిన్న ఊర్లలో రెండు ఇడ్లి పావలా, రెండు పూరి అర్ధ రూపాయి, ఉల్లిపాయ దోసె అర్ధ రూపాయి ఉండేవి. స్వీట్ యాభై గ్రాముల బరువున్న ముక్క యాభై పైసలు.
అయితే ఈ సర్వర్లు కొందరు యజమానులు మోసం చేసేవారు. ఎలాగంటే వీరు విధుల్లో లేనపుడు వ్యాపారులు, ఉద్యోగస్తుల ఇళ్లకు వెళ్లి అయిదు రూపాయలు, పదిరూపాయలు అప్పుగా తీసుకునేవారు. వాటిని తీర్చడం వాళ్ళ వల్లయ్యేది కాదు. అందుకని వారు హోటల్ కు వచ్చినపుడు టిఫిన్ బిల్ రెండు రూపాయలు అయితే రూపాయిన్నర వేసి ఇచ్చేవారు. వంటవాళ్లు లోపల ఎక్కడో ఉండేవారు. యజమాని ముందుగదిలో గల్లా పెట్టె దగ్గర ఉండేవాడు. చిన్న చిన్న ఊళ్లు కావడం వలన అందరూ ఒకరికొకరు పరిచయం కలిగి ఉండేవారు. అందువలన వారు ఏమి తిన్నారు ఎంతయింది అనే విషయాలు పట్టించుకునేవారు కారు. ఈ సర్వర్లు చేసే మోసాల కారణంగా కొంతమంది యజమానులు దివాళా తీసి హోటల్ ను మూసెయ్యాల్సి వచ్చేది. తొందరగా మేలుకున్న యజమాని ఆ సర్వర్ ను నాలుగు తన్ని బయటకు గెంటేసేవాడు.
1995 వరకు మన రాష్ట్రాల్లో దాదాపు అన్ని హోటల్స్ ఇలా సర్వర్లతో కళకళలాడేవి. కానీ, ఆ తరువాత సెల్ఫ్ సర్వీస్ టిఫిన్ సెంటర్స్ వచ్చేసాయి. రోడ్డు పక్కన బండ్లు పెట్టుకుని టిఫిన్స్ అమ్మే పధ్ధతి వచ్చింది. హోటళ్లలో అయిదు రూపాయలు ఉండే దోశ బయట బండిమీద ఒక్క రూపాయి ఉండేది. 2000 ప్రాంతంలో అనుకుంటాను..దిల్సుఖ్నగర్ వేంకటాద్రి టాకీస్ ముందు వరుసగా పది బండ్లు ఉండేవి. వారు ఒక్క రూపాయితో దోసెను అమ్మటం స్టార్ట్ చేశారు. వారి దెబ్బకు అక్కడే ఉన్న హరిద్వార్ హోటల్ దివాళా తీసి మూతపడింది. హరిద్వార్ లో అప్పుడు దోశ అయిదు రూపాయలు!
సర్వర్లను పోషించడం ఆర్థికభారం అని భావించిన హోటళ్ల యజమానులు సెల్ఫ్ సర్వీస్ హోటళ్లను ప్రారంభించారు. వీటిలో ముందుగానే టోకెన్ తీసుకోవాలి. టోకెన్ చూపిస్తేనే మనకు టిఫిన్ ప్లేట్ ఇస్తారు. కూర్చోడానికి కుర్చీలు తీసేసారు. గోడకు కొట్టిన ఒక పొడవాటి చక్క మీద ప్లేట్ పెట్టుకుని నిలుచుని తినాలి. చట్నీ మళ్ళీ కావాలంటే మనమే వెళ్లి వేయించుకోవాలి. ఈ సంప్రదాయం కారణంగా వేలాదిమంది సర్వర్లు ఉపాధిని కోల్పోయారు.
ఏ మాటకామాటే చెప్పుకోవాలి. పెద్ద పెద్ద కార్పొరేట్ హోటళ్లలో టిఫిన్లకన్నా బయట బండ్ల మీద అమ్మే టిఫిన్లే నాకు నచ్చుతాయి. మన కళ్ళముందే చేస్తారు. ఉప్పుకారాలు మన అభిరుచికి తగినట్లుగా ఉంటాయి. నిన్న జూబిలీ హిల్స్ లో ఒక పెద్ద హోటల్ కు వెళ్ళాము టిఫిన్ చేద్దామని. అక్కడ రెండు ఇడ్లీ 120 రూపాయలు. రెండు పూరి 180 రూపాయలు. ఉల్లిపాయ దోశ 200 రూపాయలు. ఇడ్లీ గోరువెచ్చగా ఉన్నాయి. సాంబార్ ఉగ్గుగిన్నెతో తెచ్చాడు. నాలుగుసార్లు మళ్ళీ అడగాల్సివచ్చింది. చట్నీ ఎంత పల్చగా ఉన్నదంటే దానికన్నా మంచినీళ్లు చాల చిక్కగా ఉంటాయి. ఉప్పు కారం అనేవి అనే రెండు పదార్ధాలు ఈ ప్రపంచంలో ఆ ఉంటాయని ఆ హోటల్ యజమానులకు తెలుసో తెలియదో తెలియదు. ఇద్దరం తిని అయిదు వందల బిల్లు కట్టి వెంటనే NTV ఆఫీస్ సమీపంలో ఒక బండి హోటల్ ఉంటే వెళ్ళాము. సాంబార్ పెద్ద గంగాళంలో కుతకుత ఉడుకుతుంది. దానిలో పాతిక వడలు మునకలు వేస్తున్నాయి. పొగలు కక్కుతున్న ఆ సాంబార్ ను చూడగానే ప్రాణం లేచివచ్చింది. ఇడ్లీ అడిగాం. పెద్ద పేపర్ కప్పులో ఇడ్లీ వేసి నిండా సాంబార్ పోసి, ప్లేట్లో పెట్టి కొబ్బరి చట్నీ వేసి ఇచ్చాడు. అమృతం కూడా అంత రుచిగా ఉండదేమో! ఒక్క ఇడ్లీకే పావు లీటర్ సాంబార్ అయిపోగా మళ్ళీ బౌల్ నిండా పోశాడు. ఇద్దరం చెరో రెండు ఇడ్లీ తింటే ముప్ఫయి అయిదు రూపాయలు అయింది బిల్! .
మళ్ళీ ఆ పాత రోజులు వస్తాయా? అలాంటి వాతావరణాన్ని మళ్ళీ చూడగలమా?
ఒక మిత్రుని సౌజన్యం తో
సనాతన ధర్మము-
సనాతన ధర్మము-దాని విశిష్టత
ప్రస్తుత చర్చనీయాంశమగు 'సనాతన ధర్మము-దాని విశిష్టత"ను షడ్విధములు గా విభజించవచ్చును. (1) ధర్మము - దాని నిర్వచనము, (2) సనాతన ధర్మము-దాని నిర్వచనము, (3) సనాతన ధర్మము యొక్క ప్రబోధములు, (4) ధర్మాచరణ యొక్క విశిష్టత, (5) సనాతన ధర్మము యొక్క విశిష్టత, (6) ధర్మరాహిత్యము యొక్క దుష్ఫలితము.
పై విషయములను క్రమముగా ఒక్కొక్కటి సవిస్తారముగా చర్చించెదము. 1. ధర్మము-దానియొక్క నిర్వచనము
ప్రప్రథముగా ధర్మమననేమి, దానియొక్క నిర్వచనమేమి యను విషయమును విచారించెదము.
'ధర్మ’మను పదము సంస్కృతములోని 'ధృ' యను బీజశబ్దము నుండి పుట్టినది. 'ధృ' యను శబ్దమునకు అర్ధము 'ధరించునది' లేక 'భరించునది' లేక 'సంరక్షించు నది'. కాబట్టి 'ధర్మ' పదమును ఈ క్రింది విధముగా నిర్వచించిరి.
1) ‘ధరతి విశ్వం ఇతి ధర్మః' - విశ్వమును ధరించునది లేక సంరక్షించునది ధర్మం.
2) 'ధరతి లోకం వేతి ధర్మః' - లోకమును లేక ప్రపంచమును ధరించునది లేక సంరక్షించునది ధర్మమని తెలియబడున
3) ‘యతో భ్యుదయ నిఃశ్రేయస సిద్ధిః స ధర్మః' ఇహలోకమునందు అభ్యుదయమును, పరలోకమునందు శ్రేయస్సును కల్గించునది ధర్మం. -
4) సంవర్త స్మృతి క్రింది విధముగా నిర్వచించుచున్నది
'యస్మిన్ దేశే య ఆచారః పారంపర్య క్రమాగతః ! ఆమ్నాయై రవిరుద్ధ శ్చ స ధర్మః పరికీర్తితః ॥
'వేద విరుద్ధము కానటువంటిదియు, దేశములోని ఏ ప్రాంతములోనైనను పారంపర్యముగా అనుసరింపబడుతూ వస్తున్న సదాచారమును ధర్మమందురు'.
5) మరియు, భగవాన్ శ్రీ వ్యాసమహర్షి మహాభారతములో క్రిందివిధముగా నిర్వచించినాడు.
'ధారణాద్ధర్మ ఇత్యాహుః ధర్మో ధారయతే ప్రజాః। యత్ స్యాద్ధారణ సంయుక్తం స ధర్మ ఇతి నిశ్చయః|
'ఏదైతే ధరించునో లేక సంరక్షించునో దానిని ధర్మమందురు. ధర్మము ప్రజలను సంరక్షించును. ఏదైతే రక్షణాయుతమై (రక్షణతో గూడి) యున్నదో దానినే ధర్మమందురు. ఇది నిశ్చయము.
కనుక, మానవాళి మనుగడకు ధర్మమే ఆధారం. ధర్మము యొక్క బలము చేతనే విశ్వము నడచుచున్నది. ధర్మము పూర్తిగా నశించినపుడు, మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లి, విశ్వము గూడ నశించును. అందులకే “సత్యం వద, ధర్మం చర” యను వేదవాక్కు అతి ప్రసిద్ధమయినది. ప్రతి మానవుడు “సత్యాన్ని పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి" యని శ్రుతిమాత ప్రబోధించుచున్నది. ఇదియే మన భారతీయ సంస్కృతికి పునాది.
II. సనాతన ధర్మము దాని యొక్క నిర్వచనము
ఇపుడు, సనాతన ధర్మమననేమి, దాని యొక్క నిర్వచనమేమి యను విషయమును తెలిసికొందము.
సనాతన ధర్మమును చతుర్విధములుగా నిర్వచించవచ్చును.
మొదటిది :
"సనాతనస్య ధర్మ ఇతి సనాతన ధర్మః" 'సనాతునుని (శాశ్వతుని లేక పరమాత్ముని) యొక్క ధర్మమును సనాతన ధర్మమందురు'. ఇది షష్ఠీతత్పురుష సమాసము. స్ధాపిత, స్థాపక సంబంధమును తెలుపుచున్నది. సనాతనుడైన భగవానుని చేత స్ధాపింపబడినదగుటచే దీనిని సనాతన ధర్మమందురు. ఉదా హరణకు క్రైస్తవులు, మహమ్మదీయులు, బౌద్ధులు-క్రీస్తును, మహమ్మదును, బుద్ధుని ఆయా మతముల యొక్క స్థాపకులుగా విశ్వసింతురు. అలాగుననే, సనాతన ధర్మము సనాతనుడైన భగవానునిచేతనే అమలు జరపబడినది గాని మరి ఏ మానవుని చేతను గాదని స్పష్టమగుచున్నది.
సనాతన ధర్మము తప్ప మిగిలిన ధర్మములను రెండు విధములుగా విభజించ వచ్చును. (1) భూతకాలములో ఉండి వర్తమానములో లేనివి, (2) భూతకాలములో
'సనాతన ధర్మము-దాని విశిష్టత 28
లేక వర్తమానములో ఉన్నవి. సనాతన ధర్మము ఈ రెండు తెగలకు సంబంధించినది గాదు. సనాతన ధర్మము అన్ని ధర్మముల కంటే ముందునుండి ఉన్నది, ఇపుడు గూడ జీవించియున్నది. కాని, దీనియొక్క భవిష్యత్తు ఏమిటి? యను ప్రశ్న రావచ్చును. దీనికి సమాధానమిచ్చునపుడు మనము ప్రకృతి నియమమును మనస్సులో నుంచు కొనవలయును. ఏదైతే పుట్టుతుందో అది గిట్టక తప్పదు - "యజ్జన్యమ్ తదనిత్యమ్”. ఈ నియమమును ఉల్లంఘించుటకు ఎవరికిని సాధ్యము కాదు. ఉల్లంఘించుట ఇంతకు ముందు జరిగియుండలేదు; భవిష్యత్తులో గూడ జరగబోదు. ఉదాహరణకు భగవానుడు సహితము ధర్మసంస్థాపనార్ధమై అనేక రూపములలో అవతరించినపుడు గూడ ఆ కార్యము నెరవేరిన వెంటనే తన అవతారమును చాలించుచున్నాడు. ప్రకృతి నియమమును ఉల్లంఘింప భగవానునికి సహితము సాధ్యము కాదు.
సనాతన ధర్మమునకు పుట్టుక అంటూ లేదు గాబట్టి, గిట్టుట గూడ ఉండదు. ఇది శాశ్వతమైనది, ఆద్యంతములు లేనిది.
రెండవ నిర్వచనము
“సనాతనశ్చాసౌ ధర్మశ్చ ఇతి సనాతన ధర్మః" - సనాతనమైనది (శాశ్వతమైనది) మరియు ధర్మమును అయినదగుటచే దీనిని సనాతనధర్మమందురు. ఇది కర్మధారయ సమాసము.
సనాతనుడైన భగవానునిచేత స్ధాపింపబడుటచేతనే దీనిని సనాతనధర్మ మనలేదు, ఇది స్వతః సనాతన మగుటచేతను దీనిని సనాతన ధర్మమనిరి. సనాతన ధర్మమునకు ఆద్యంతములు లేవు. ఇది సృష్టితో పాటు ఆవిర్భవించుచున్నది. సృష్టి యున్నంతవరకు ఇదియు నిలిచియే యుండును. ప్రళయకాలములో సహితము ఇది నశించుట లేదు. అపుడు గూడ ఇది బీజరూపములో ఉండి, మరల సృష్టి మొదలయినపుడు ఇది గూడ ప్రజలను సంరక్షించుటకున్ను, వారి నైతిక విలువలను పెంచుటకున్ను ఆవిర్భవించుచున్నది. సృష్టితో పాటు ఇదియు భ్రమించుచునే యుండును. అందువలన సనాతనధర్మమునకు ఆదియును, అంతమును లేదు. శాశ్వతమైనది.
అంతియే గాక, ప్రజల యొక్క నైతిక విలువలను పెంచుటకు కావలసిన ప్రబోధములను చేయుచున్నది. అందుచే ఇది ధర్మమును అయియున్నది. కాబట్టి, ఇది సనాతనము అయి యున్నది మరియు ధర్మమును అయి యున్నది. కనుక, దీనిని “సనాతన ధర్మ”మనిరి.
4 | iN+ : సనాతన ధర్మము-దాని విశిష్టత
మూడవ నిర్వచనము
ఇచట గూడ "సనాతన ధర్మము” కర్మధారయ సమాసములోనే చెప్పబడినది. కాని, “సనాతన”యను పదమునకు రెండవ నిర్వచనములో చెప్పినదానికంటే, కొంత విశేషమైన అర్ధమును ప్రతిపాదించుట జరిగినది. ఇచట దీనిని ఈ క్రింది విధముగ నిర్వచించవచ్చును.
“సదా భవః సనాతనః, సనాతనం కరోతి ఇతి సనాతనయతి! సనాతన యతీతి సనాతనః ! సనాతనశ్చాసౌ ధర్మశ్చ ఇతి సనాతన ధర్మః " ‘శాశ్వతముగా నిలిచి యుండునది సనాతనము, ఒక వ్యక్తిని సనాతనునిగా జేయునది గూడ సనాతనము, ఏదైతే సనాతనము మరియు ధర్మము అయియున్నదో అది సనాతన ధర్మము.
సనాతన ధర్మము, సనాతనుడైన భగవానునిచేత స్థాపింపబడిన దగుటయే గాక, తాను స్వతః సనాతనమగుటయు మరియు దానిని విశ్వసించి, ఆచరించిన వారిని ‘సనాతనులను’గా గూడ జేయును -అనగ వారికి అమృతత్వమును ప్రసాదించును. ఇన్ని కారణములచే దీనిని “సనాతన ధర్మ”మనిరి.
ఇపుడు, సనాతన ధర్మము నాచరించువారికి ఏ విధమైన అమృతత్వము లభించును? అనిన ప్రశ్న ఉదయించును. దానికి సమాధానము నాల్గవ నిర్వచనము లో విపులీకరించబడినది.
నాల్గవ నిర్వచనము
"సనాతనయతి ఇతి సనాతనః" 'సనాతనుని చేయును గాన సనాతన'మని పైన చెప్పబడినది. ఏవిధమైన సనాతనత్వమును ప్రసాదించును అనిన ఆ విష యము ఇపుడు విపులముగా వివరించబడినది. “సనాతనయతి" అనిన పదమునకు అర్ధము “సనాతనం పరమాత్మ స్వరూపం ప్రాపయతి ఇతి" అనగా పరమాత్మ స్వరూపమును పొందుటకు సనాతన ధర్మము మనకు సహకరించును.
త్రికరణశుద్ధితో సనాతన ధర్మము నాచరించు వ్యక్తులు ఆత్మ సాక్షాత్కారమును పొంది, పరమాత్మలో లీనమగుదురు. మోక్షమును బొందుదురు. ఇదియే సనాతన ధర్మము యొక్క గొప్పతనము. భారతదేశము ఆధ్యాత్మికముగ ఉచ్ఛస్థితిలో నుండుటకు ఇదియే కారణము.
సనాతన ధర్మము - దాని విశిష్టత....
5
భారతీయ సంస్కృతీ భవనము విదేశీయదాడులను ప్రతిఘటించి, ఈనాటికిని చెక్కుచెదరక, తన శోభను కోల్పోవక నిలిచియున్నదంటే, దానికి కారణము సనాతన ధర్మము వేసిన దృఢమైన, బలీయమైన పునాదులే.
సనాతనధర్మము శ్రుతి, స్మృతి, పురాణాలలో మహోన్నతమైన దైవీయ దృష్టితో దర్శనాత్మకముగా ప్రవచించిన సర్వధర్మ క్రోడీకరణ.
సనాతన ధర్మమునకు మూలాధారములను మనుస్మృతి ఈ క్రింది విధముగ సూచించుచున్నది.
శ్లో ॥ వేదః స్మృతిః సదాచారః స్వ స్య చ ప్రియమాత్మనః | ఏతచ్చతుర్విధం ప్రాహుః సాక్షాద్దర్మస్య లక్షణమ్ ||
(మను. II-12)
1) వేదములు, 2) స్మృతులు, 3) సాధుసంత్ల యొక్క ఆచార వ్యవహారములు, 4) ఆత్మకు ఆహ్లాదమును కలిగించు సత్కర్మలు - ఈ నాల్గు లక్షణములపై సనాతన ధర్మము ఆధారపడియున్నది.
సనాతన ధర్మము జీవుడు తన ఉపాధిగతమైన పరిధులలో ఎలా ప్రవర్తిస్తే తరిస్తాడో బోధిస్తుంది.
సనాతన ధర్మము ముఖ్యముగా సత్యవాక్పరిపాలన, అహింసాపాలన, సత్ప్రవర్తన (సచ్ఛీలత), శాంతి, త్యాగము, దయ, క్షమించుట, ఇంద్రియ నిగ్రహము, పరోపకార పరాయణత, క్షమ (ఓర్పు లేక సహనము), ద్వేషరహితము, క్రోధరహితము, అస్తేయము (పరుల వస్తువులను దొంగిలించకుండుట), నీతి, నియమము, ధర్మతత్పరత మొదలగు దైవీ సంపత్తిని పెంపొందించుకొని, మానవుడు తన జీవితమును దివ్యమయ మొనర్చుకొని, జీవిత పరమ లక్ష్యమైన 'మోక్షమును' బడయుటకు కావలసిన ప్రేరణనిచ్చును.
దైవీ సంపత్తికి కావలసిన గుణములను శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో క్రింది విధముగా పేర్కొన్నాడు.
శ్లో॥ అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగ వ్యవస్ధితిః |
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవమ్ ||
4)
సనాతన ధర్మము-దాని విశిష్టతలు
శ్లో॥ అహింసా సత్య మక్రోధ స్వాగశ్శాంతి రపైశునమ్। దయా భూతే ష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్ || శ్లో॥ తేజః క్రమా ధృతి శ్శాచ మద్రోహెూ నాతిమానితా |
భవన్తి సంపదం దైవీ మభిజాతస్య భారత ! ॥
(16-1,2,3)
'అర్జునా! అభయము, చిత్తశుద్ది, జ్ఞానోపాయమునందు దృఢమగు నిష్ఠ, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞము, వేదాధ్యయనము, తపస్సు, సరళత, అహింస, సత్యవాక్పాలన, అక్రోధము, త్యాగము, శాంతస్వభావము, పరనిందను విడచుట, భూతదయ, లోభము లేకుండుట, మృదుత్వము, లజ్జ కలిగియుండుట, చాంచల్యము లేకుండుట, తేజస్సు, ఓర్పు, ధైర్యము, పరిశుభ్రత, వైరభావము లేకుండుట నిరభిమానిత్వము-ఈ గుణములన్నియు దైవీసంపదలో పుట్టినవానికి ఉండెడి లక్షణములు'.
మనుస్మృతి ధర్మము యొక్క ముఖ్యమైన పది లక్షణములను సూచించుచున్నది.
శ్లో॥ ధృతిః క్షమా దమో స్తేయం శౌచమింద్రియ నిగ్రహః | ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మ లక్షణమ్ ॥ (మను. VI-92)
'ఓర్పు, క్షమ, దమము, అస్తేయము, శౌచము, ఇంద్రియనిగ్రహము, ధీ, విద్య, సత్యము, అక్రోధము (క్రోధరహితము) ఇవి ధర్మము యొక్క పది లక్షణములు’.
సనాతన ధర్మము ప్రప్రథమముగా మనుష్యజన్మము యొక్క వైశిష్ట్యమును వేనోళ్ళ పొగడుచున్నది. మరియు ధర్మాచరణ చేత ఈ మానవజన్మను ఎలా సార్ధకము చేసికొనవలయునో బోధించుచున్నది.
మనుష్యజన్మ అతి దుర్లభమైనదనియు, అది దైవకృప వలననే లభించుననియు సనాతన ధర్మము చాటుచున్నది.
శ్లో॥ దుర్లభం త్రయమేవై తత్ దైవానుగ్రహ హేతుకమ్ |మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః ॥
'మనుష్యత్వము, మోక్షమునందు కోరిక, మహాపురుషులనాశ్రయించుట మూడును లభించుట చాలాకష్టము. అవి దైవానుగ్రహం వలనగాని లభింపవు'. అందుచేత మానవజన్మను సార్ధకము చేసికొనవలయును. 3
* సనాతన ధర్మము - దాని విశిష్టత 32-31.40
మానవుడు విషయభోగములను త్యజించి, దైవచింతనయందు నిమగ్నుడైయుండి, మోక్షమును బడయవలయునని సనాతనధర్మము నొక్కి వక్కాణించుచున్నది.
"ఎహి తన కర ఫల విషయ నభా ఈ । స్వర్గఉ స్వల్ప అంత దుఃఖదాఈ”
(తులసీదాసు)
ఈ మనుష్యజన్మ విషయభోగముల ననుభవించుటకు మనకు లభించలేదు. ఈ జన్మ స్వర్గవాసుల కంటెను చాలా ప్రశస్తమైనది. స్వర్గవాసులు తమ సత్కర్మల యొక్క ఫలమును స్వల్పకాలము ననుభవించి, మరల మర్త్యలోకము (భూలోకము) నకు తిరిగి రావలసినదే (క్షీణే పుణ్యేమర్త్యలోకం విశంతి -గీత), కాని మానవుడు ధర్మాచరణ చేతను, తపస్సుచేతను మోక్షమును బడయుటకు అవకాశమున్నది. ఈ అవకాశము స్వర్గలోకవాసులకు గూడలేదు. వారియొక్క అంతిమదశ దుఃఖదాయకమైనది. కాబట్టి, మనుష్యజన్మ దేవతల కంటెను మిన్నయైనదని శ్రీతులసీ దాసు వెల్లడిచేయుచున్నాడు.
ఇదే విషయమును శ్రీకృష్ణ పరమాత్మ గూడ భగవద్గీతలో అర్జునునికి బోధించినాడు. శ్లో!! తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం
క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి | ఏవం త్రయీధర్మ మనుప్రపన్నాః
గతాగతం కామకామా లభంతే ॥
‘వారు విశాలమగు స్వర్గసుఖము ననుభవించి, పుణ్యము క్షీణించినంతట మనుష్య లోకమున ప్రవేశింతురు. వేదత్రయ కర్మకాండను శరణుబొందు కామదాసులకు రాకపోకల యాతనలు తప్పవు'.
కాబట్టి, మానవుడు లౌకిక సుఖముల కొరకు కర్మకాండను శరణుబొందక, రాకపోకల యాతనల ననుభవింపక, అనన్య చింతనతో భగవానుని సేవించి, మోక్షమును బడయవలయునని సనాతనధర్మము బోధించుచున్నది.
సౌందర్యలహరి🌹* *శ్లోకం - 22*
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
. *🌹సౌందర్యలహరి🌹*
*శ్లోకం - 22*
🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷
*భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం*
*ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః |*
*తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్యపదవీం*
*ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదామ్ ||*
సౌందర్యలహరి లో మణిపూస వంటిది ఈ శ్లోకం. సాధకులు నిత్యమూ పారాయణ చేయదగినది.
ఓ భవానీ ఇది మహా మహిమ కల నామం. ఉమా, లలిత, శివా వలె. భవుని శక్తి భవాని. భవుడు అంటే అయినవాడు, ఎప్పుడూ వున్నవాడు. సత్, భవ అనే మాటలకు ఒకే అర్థం. శివుడు సత్ అయితే అమ్మవారు సతి. అలాగే భవుడు- భవాని.
త్వం దాసే మయి = నేను నీ దాసుడనమ్మా! అట్టి నాపై నీ దయను ప్రసరింపజేయమని ప్రార్థన చేద్దామనుకుంటు *భవానీ త్వం* అని అనగానే మిగిలిన స్తోత్రం చెప్పకుండానే వెనువెంటనే అనుగ్రహం చూపించి, పసి పిల్లవాడిని తల్లి కూర్చోపెట్టుకున్నట్లు నీ ఒడిలో కుర్చోపెట్టుకుంటావు. విష్ణు, బ్రహ్మాదులు కూడా అర్చించే స్థానం అది. అలాగ నన్ను కరుణించి నాకు మోక్షం ప్రసాదిస్తావు.
నేను దాసుడను (దాసోహం) అని మొదలుపెట్టిన నన్ను వెంటనే 'సోహం' స్థాయికి (నీవే నేను) తీసుకువెళ్తావు. 'దాసోహం' ద్వైతం; సోహం 'అద్వైతం'. *భవాని త్వం* అని సంబోధనగా కాకుండా, కర్మపరంగా చెప్పుకుంటే, నేను నీవుగా అవుతున్నాను అని. భవం అంటే అగుట, కలుగుట కదా! అమ్మవారికి నీరాజనాలిచ్చే బ్రహ్మేంద్రాదులు, ఆమె ఒడిలో బిడ్డలాగా కూర్చొనే ముక్తుడైన సాధకుడికి కూడా నీరాజనాలిచ్చినట్లే కదా!
🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
పాలవెల్లి
🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*పాలవెల్లి ఎందుకు కడతారు?*
వినాయక చవితి రోజున *పాలవెల్లి* ఎందుకు కడతారో మనలో చాలా మందికి తెలియదు...మన పెద్దలు కట్టారని మనమూ కడుతున్నాం... వాళ్ళు ఎందుకు కట్టారో, వారిని మనం ఎందుకు అనుకరిస్తున్నామో తెలుసుకుందాం.....
వినాయక చవితి రోజున సాగే ప్రతి ఆచారమూ ఇతర పండుగలకి భిన్నంగానే సాగుతుంది. వాటిలో పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి. పాలవెల్లి లేకపోతే గణేశుని పూజకి ఏదో లోటుగానే కనిపిస్తుంది.
ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే...అందుకు ఒకటేంటి చాలా కారణాలే కనిపిస్తాయి....
*ఈ అనంత విశ్వంలో భూమి అణువంతే! ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్నే నక్షత్రాలు కోటానుకోట్లు కనిపిస్తాయి. ఒక పాలసముద్రాన్నే తలపిస్తాయి. అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటాము. ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతారు.
గణేశుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా! ప్రకృతిలో సృష్టి, స్థితి, లయలనే మూడు స్థితులు కనిపిస్తాయి. గణేశుని పూజలో ఈ మూడు స్థితులకూ ప్రతీకలని గమనించవచ్చు. ఈ భూమిని (సృష్టి) సూచించేందుకు మట్టి ప్రతిమను, జీవాన్ని (స్థితి) సూచించేందుకు పత్రినీ, ఆకాశాన్ని (లయం) సూచించేందుకు పాలవెల్లినీ ఉంచి ఆ ఆరాధనకి ఓ పరిపూర్ణతని ఇస్తాము.
*గణపతి'* అంటే గణాలకు అధిపతి, తొలిపూజలందుకునే దేవత. మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే కదా! ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం అనుకోవచ్చు. అలా పాలవెల్లిని సమస్త దేవతలకూ ప్రతికగా భావించవచ్చు.
పాలవెల్లి అంటే పాలపుంతే అని తేలిపోయింది. మరి అందులో నక్షత్రాలు ఏవి! అందుకే వెలగపండుని కడతాము. దాంతో పాటుగా మొక్కజొన్నపొత్తులు, మామిడిపిందెలు, జామ, దానిమ్మలాంటి పండ్లనీ కడతాము. ఇవన్నీ వివిధ ఖగోళవస్తువులకు సూచన అన్నమాట.
ఏ దేవతకైనా షోడశోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ. కానీ వినాయకుడంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు కదా! పైగా గాణపత్యం అనే శాఖ ప్రకారం ఆయనే ఈ ప్రపంచానికి అధిపతి. అలాంటి స్వామికి ఛత్రంగా ఆ పాలవెల్లి కాక మరేముంటుంది.
గణపతి పూజ ఆడంబరంగా సాగే క్రతువు కాదు. మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో భగవంతుని కొలుచుకునే సందర్భం. బియ్యంతో చేసిన ఉండ్రాళ్లు, చెట్ల మీద పత్రి లాంటి వస్తువులే ఇందులో ప్రధానం. ఏదీ లేకపోతే మట్టి ప్రతిమను చేసి, పైన పాలవెల్లిని వేలాడదీసి, గరికతో పూజిస్తే చాలు....పండగ అంగరంగవైభవంగా సాగిపోయినట్లే! పసుపు రాసి కుంకుమబొట్లు పెట్టిన పాలవెల్లి గణేశుని పూజకి అద్భుతమైన శోభనిస్తుంది....✍️
🌷🙏🌷
లోకాస్సమస్తాస్సుఖినోభవన్తు!
అజ్ఞానము తో కప్ప బడి
🌸🌼ಬೆಳಗಿನ 🌅 ಸೂಳ್ನುಡಿ🌼🌸
*ಆಯುರತ್ಯಂತಚಪಲಂ*
*ಮೃತ್ಯುರೇಕಾಂತನಿಷ್ಠುರಃ |*
*ತಾರುಣ್ಯಂ ಚಾತಿತರಲಂ*
*ಬಾಲ್ಯಂ ಜಡತಯಾ ಹೃತಮ್ ||*
(ಯೋಗವಾಸಿಷ್ಠ-ಶ್ರೀರಾಮನ ಜಿಜ್ಞಾಸೆ)
ಈ ಆಯುಷ್ಯವೆನ್ನುವುದು ಅತ್ಯಂತ ಚಪಲವಾದುದು, ಅಸ್ಥಿರವು. ಮೃತ್ಯುವಾದರೋ ಬಹಳ ನಿಷ್ಠುರನಾಗಿ, ಕ್ರೂರವಾಗಿ ಎದುರುನೋಡುತ್ತಿರುವನು. ಈ ಜೀವನು ‘ಯೌವನ’ವೆಂಬ ಅಂದಗಾತಿ ಸಖಿಯನ್ನು, ಜಾಣೆಯಾದ ಮೋಸಗಾತಿಯನ್ನು ನೋಡಿ ತನ್ನ ವಿವೇಚನೆಯನ್ನು ಕಳೆದುಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾನೆ. ಅಂತಹ ಯೌವನವು ನಿಲ್ಲತಕ್ಕುದಲ್ಲ. ಇನ್ನು ಬಾಲ್ಯವೋ ದಟ್ಟವಾದ ಅಜ್ಞಾನದಿಂದ ಆವೃತವಾಗಿ ಕಳೆದುಹೋಗುವುದೇ ಆಗಿದೆ.
ఆయుష్షు మిక్కిలి చపల మైనది. మృత్యువు క్రూరంగా ఎదురు చూస్తోంది. యవ్వనం క్షణికమైనది. జీవి యవ్వనమనే అందమైన మోసగత్తే అయిన సఖి ని చూసి వివేకం కోల్పోతున్నాడు. ఇంక బాల్యం దట్టమైన అజ్ఞానము తో కప్ప బడి ఉన్నది.
*🌷🌺🙏 ಶುಭದಿನವಾಗಲಿ! 🙏🌺🌷*
తెలివైన వ్యక్తి
🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝
*_యస్య కృత్యం న జానన్తి*
*మన్త్రం వా మన్త్రితం పరే౹*
*కృతమ ఏవాస్య జానన్తి*
*స వై పణ్డిత ఉచ్యతే||_*
భావం: *ఒక పనిని నెరవేర్చిన తర్వాత వారి చర్యలు, ప్రవర్తన, గోప్యత మరియు ఆలోచనల గురించి అవగాహన కలిగి ఉన్న వ్యక్తి తెలివైన వ్యక్తికి పర్యాయపదంగా ఉంటాడు*.....
🧘♂️🙏🪷 ✍️🙏
జీవితమనే పయనమ్ముకు
*1909*
*కం*
జీవితమనే పయనమ్ముకు
చావు చివరి గమ్యమౌను జనులెల్లరికిన్.
చావకమునుపొనరించిన
పావనకర్మలకు నీవు బ్రతుకుదు సుజనా.
*భావం*:-- ఓ సుజనా! జీవితం అనే ప్రయాణం లో చావనేది చివరి గమ్యం. చనిపోయే లోపుగా నీవు చేసి న పవిత్ర కర్మల వలన నీవు మళ్ళీ బ్రతుకుతావు.
*సందేశం*:-- మనిషి చనిపోయిన తరువాత బతికేది అతను చేసి న మంచిపనులే. అందుకే బతికి ఉన్నప్పుడే మంచి పనులు చేయాలి.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
Blood donation
BLOOD ఎవరికయినా కావాలంటే , Sri A.Venkat Rao గారు ,Advocate, Phone no.955 31 12233., వీరు Blood donation Group కలదు ,దయచేసి ,వీరిని Contact చేయ్యండి .
భారతమాతను
శ్లోకం:☝️
*రత్నాకరాధౌతపదాం*
*హిమాలయకిరీటినీమ్ |*
*బ్రహ్మరాజర్షిరత్నాఢ్యాం*
*వందే భారతమాతరం ||*
భావం: అమూల్యమైన రత్నాలతో నిండిన (హిందూ మహా) సముద్రముచే తన పాదాలు కడుగబడేది, హిమాలయ పర్వతశ్రేణులే కిరీటముగా అలంకరించబడినది, బ్రహ్మర్షులు, రాజర్షులు వంటి తపస్వీ రత్నాలు సమృద్ధంగా ఉన్న భారతమాతను నేను పూజిస్తున్నాను.🙏
పంచాంగం 15.09.2023 Friday,
ఈ రోజు పంచాంగం 15.09.2023 Friday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు నిజ శ్రావణ మాస కృష్ణ పక్ష: అమావాస్య తిధి భృగు వాసర: ఉత్తరఫల్గుని నక్షత్రం శుభ యోగ: నాగవం తదుపరి కింస్తుఘ్నం కరణం ఇది ఈరోజు
అమావాస్య ఉదయం 07:08 వరకు.
ఉత్తరఫల్గుని ఈ రోజు పూర్తిగా ఉంది .
సూర్యోదయం : 06:07
సూర్యాస్తమయం : 06:15
వర్జ్యం : మధ్యాహ్నం 12:53 నుండి 02:40 వరకు.
దుర్ముహూర్తం : పగలు 08:33 నుండి 09:21 వరకు తిరిగి మధ్యాహ్నం 12:35 నుండి 01:24 వరకు.
రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.
యమగండం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.
శుభోదయ:, నమస్కార:
voters
An appeal to voters of the Hyderabad District to verify their and family members names in the electoral rolls by visiting https://voters.eci.gov.in or Voter Helpline App and if found any family members are in different polling stations or required any correction in name, relation name, DOB, house no. & photo etc., are requested to apply in Form-8 through the above website or App or at ERO Office.
DEO-Hyderabad & Commissioner, GHMC
శివపార్వతులమధ్య
శివపార్వతులమధ్య వ్యత్యాసము!
కవిసామ్రాట్ విశ్వనాధ!
11. నీవో యౌవనమూర్తి వౌదు వసురానికంబు మ్రదించు శి
క్షావైశద్యము పొల్చు నీతనువు నీశా! అన్నపూర్ణాంబికా
దేవిం జూచిన వృద్ధవోలె మదికిన్ దీపించు దాంపత్య మీ
భావం బెవ్వఁ డెఱుంగు శైలతనయా ప్రాణేశ! విశ్వేశ్వరా
ఓ విశ్వేశ్వరా! పార్వతీప్రాణనాథా!
ఈశా!
నీవా- అసురసమూహములను శిక్షించు స్పష్టతగల యౌవనము
గల శరీరముగలవాడవు.
అన్నపూర్ణమ్మతల్లియో- తలపండినవృద్ధ!అనిపించును.
మీదాంపత్య రహస్యంబెరిగినవాడెవ్వరయ్యా?!
దేవదేవుడవు.
సదాత్రిదశులకు ఆదిదేవుడవు.
యౌవనముగూడుగట్టినదొరవి.
రాక్షసశిక్షా దక‌్షుడవు. వారినిమ్రందించుబలశాలివి.
కనుక యౌవనము రూపుగట్టిన దార్ఢ్యమునీది!
ఇక అన్నపూర్ణమ్మ --
శ్రీనాథుడనినట్లు---
"వేదపురాణశాస్త్రపదవీనదవీయసియైన పెద్దముత్తైదువ!"
యుగయుగాలుగాఎందరు జీవులకో ప్రాణదాత్రియై తలపండిన వృద్ధ!
తిలతండులన్యాయమునచెప్పదగు కేశపాశమనినాడు కవిసార్వభౌముడు!
కాశీ క్షేత్రంలో శివునికేఅన్నభిక్ష ఇడిన మహామాత- అన్నపూర్ణాదేవి!
ఎంత వింత దంపతులుమీరు!
విశ్వేశ్వర శతకము-
రసజ్ఙభారతి సౌజన్యంతో!
తిట్లలో దీవెన!
తిట్లలో దీవెన!
"ఆలినొల్లకయున్నవానమ్మమగని,
అందులోపలనున్న వానక్క మగని,
నమ్మినాతనిజరచు దానమ్మసవతి,
సిరులు మీకిచ్చు నెప్పట్ల గరుణతోడ;
-అజ్ఙాత చాటువు.
అమ్మమగడు,అక్కమగడు, దానమ్మమగడు, అంటూపరుషోక్తులు
వినిపించినా,పైపద్యం చాలా చమత్కార
భాసురమైనది.శ్రీమహాలక్ష్మిపరంగా ఆశీర్వదిస్తూ చెప్పిన ప్రస్తుత పద్యంలో చాలా విశేషార్ధం దాగియుంది.
ఫలానా వారు మాకు దూరపు బంధువులు అనిచెప్పుకుంటూఉండటంలోకంలోకంలదుగదా! ఆవ్యక్తియొక్కబంధుత్వాన్ని వివరించాలంటే,అతనిజెందిన యెంతోమందిని ప్రస్తావించవలసివస్తుంది.
అలాగే ఇక్కడ లక్ష్మీ దేవిని చెప్పటానికి ఎంతోమందినిపేర్కొంటూ,వారివారి సంబంధ బాంధవ్యాలను చెప్పుకుంటూ వచ్చాడీకవిగారు. ఈసంబంధాలనేపధ్యంలో యెన్నోదివ్యచరితలు మనకు మనస్సుల్లోమెదలుతాయి.ఆయాపౌరాణిక సన్నివేశాలు స్ఫురణకు రాగానే మనస్సులోదివ్యమైన భక్తిభావం పరిమళిస్తుంది.
ఇంతకీ ఇందులోనున్న చమత్కారమేమిటో అర్ధమవటంలేదుగదూ? దాని మర్మ మిది.
ఆలినొల్లనవాడు-భీష్ముడు;వానియమ్మ-గంగమ్మ;ఆమెమగడు-సముద్రుడు.
అందులోపలనున్న(వాడు)-సముద్రంలోదాగినమైనాకుడు; వానియక్క-పార్వతి;ఆమెమగడు-శంకరుడు;అతనినమ్మినవాడు-రావణుడు;అతనిచెరచునది-అతనిచావుకు కారణమైనది సీత;ఆమెతల్లి-భూదేవి;ఆమెకుసవతి-
శ్రీమహాలక్ష్మి; దయతో-కరుణతో ;నెప్పట్ల-నెల్లవేళల; సిరులనిచ్చుత-సంపదలనొసంగుగాక!(శ్రీమహాలక్ష్మి మీకు నెల్లపుడు సంపదల నిచ్చుగాక!
అని ఆశీస్సులు!!🌷🌷🌷🌷🙏💐🙏🙏🌷🌷