15, సెప్టెంబర్ 2023, శుక్రవారం

వినాయక చవితి 18వ తేదీన

 తెలుసుకోండీ... 13923

తెలియజేయండీ....

జ్యోతిర్వాస్తు మంజూష .....748

*వినాయక చవితి నిర్ణయం*



2023 భాద్రపద శుద్ధ

 చవితి వినాయక చతుర్థి

ఎప్పుడు చేయాలి అనే విషయం పై ప్రస్తుతం నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులలో వాదోపవాదాలువినవస్తూ ఉన్నాయిఏది ఏమైనప్పటికీ

జ్యోతిష్య సిద్ధాంతులు, పీఠాధిపతులు మఠాధిపతులు

ఒక్కొక్కరు  ఒక్కొక్కవిధానాన్ని ప్రకటిస్తూ ఉంటే,,   హిందూ ధర్మవాదులు చివరికిఎవరిని

అనుసరించాలి అనేసంశయం తో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సందర్భంలో

వినాయక చవితి నిర్ణయం పై ఉన్నశాస్త్రీయ విధానాన్ని

మీ దృష్టికి తీసుకురాదలచాను.

అందుకే పెద్దలు,పండితులవద్ద నుండి సేకరించిన కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను.


 వినాయక చవితి నిర్ణయం పై వివరణ


దిన్ద్వయేపి వర్తేత మధ్యాహ్నే చేత్ చతుర్థికా

తదా పూర్వైవ కర్తవ్యా

న పరాతు కదాచన

గణనాధవ్రతే గ్రాహ్య

 తృతీయా సహితా సదా 

చతుర్థీ త్వన్యదేవస్య

 వ్రతే గ్రాహ్యా పరాన్వితా


ఇలా  చాలా శ్లోకాలు


 చతుర్థీ మధ్యాహ్న వ్యాప్తి ఉన్నది చూసి వ్రతమును

ఆచరించాలని ఉన్నవి.


చతుర్థీ గణనాధస్య

 పరవిద్ధా ప్రశస్యతే

జయయుక్తానకర్తవ్యా

 సర్వధా శుభకాంక్షిభిః

ప్రహారద్వయపర్యన్తం

 చతుర్థీ యదివర్తతే

పరవిద్ధైవ కర్తవ్యా

 పూర్వవిద్ధం పరిత్యజేత్


పంచమీ యుక్త చతుర్థీ మధ్యాహ్న వ్యాప్తి ఉన్నది గ్రహించాలని ఇంకొన్ని గ్రంథాలు చెప్తున్నాయి తృతీయా యుక్త చతుర్థీ ని వర్జించాలి అని కూడా ఉన్నది. 

ప్రహారద్వయ అను శబ్దం తో రెండు రోజులు చతుర్థీ మధ్యాహ్న వ్యాప్తి ఉన్నచో రెండవ రోజును గ్రహించాలి అని ఉన్నది. 

మధ్యాహ్న వ్యాప్తే: షఢా భేధ:

అని మధ్యాహ్న వ్యాప్తి చెందిన తిథులు ఆరు రకాలు ,వాటిలో

మొదటిదిపూర్వదిన వ్యాప్తి మనకు ప్రథమ పక్షే పూర్వా గ్రాహ్య అని పూర్వ దినమున

మధ్యాహ్న కాలం ఉన్నది గ్రహించాలని ఉన్నది,ఇంకా పక్షములు ఉన్నవి కానీ ప్రధానంగా ఐతే ఇలా తీసుకోవాలని చెప్పారు. ఏతావాత్, ఆ పక్షమునకు వస్తే *మనకు18,19 లలో మధ్యాహ్న తిథి వ్యాప్తి 18 న వచ్చినది కాబట్టి 18 న వ్రతమును ఆచరించడం*

ఉత్తమమనితెలుస్తుంది.


 జ్యోతిష్య గ్రంథాలు

 ఏమంటున్నాయో

 పరిశీలిస్తే...

 *1.కాలమాధవీయము* 

 పరేద్యురేవామధ్యాహ్నవ్యాప్తౌ విఘ్నస్యచోత్తరా| అన్యధా పూర్వ విధైవ

 మాత్ర యోగ ప్రశస్థితః


 మరోసారి రోజు మధ్యాహ్నమున పూర్తిగా చెవిటి ఉన్నచో మరుసటిరోజే ఆచరించవలెను


2. **ధర్మసిందు*:-


 "పరదినేసంపూర్ణ

మధ్యహ్న వ్యాపినీ తథాపరైవ"


 సంపూర్ణ మధ్యాహ్న  వ్యాపిని కల పరదినమందే ఆచరించవలెను.

*3. *నిర్ణయ సింధు* :-


"పరదినేఏవ అంశేన

 సాకల్యేనా వ

 మధ్యాహ్న వ్యాప్తాభావే

 సర్వపక్షేషు పూర్వా

 గ్రాహ్య "

 పర్వదినముల లో చవితి మధ్యాహ్నం కాలమున కొంత గాని పూర్తిగా గాని లేనప్పుడు ముందు రోజే చవితిని

 ఆచరించవలెను.


4.    **భవిష్యత్*  

        *పురాణము*


"పరదినేఏవ అంశేన

సాకల్యేనా వ

మధ్యాహ్న వ్యాప్తౌపర |

 అన్యధా పూర్వా చతుర్థి గణనాథస్య  మాతృవిద్దా ప్రశస్యతే 

 మధ్యాహ్న వ్యాపినీ చేత్స్యాత్ పరత:చేత్ 

పరేహనీ "

 నిర్ణయ సింధులో మరొకటి రోజు గురించి చెబుతూ మాతృ విద్దా ప్రశస్యతే అనే వాక్యమును బోధక వాక్యము గాను పరత: చేత్ పరేహనీ అనేది విధాయక వాక్యముగాను తెలియజేశాను. కావున సంపూర్ణ కర్మ కాలవ్యాప్తిగల అనగా మధ్యాహ్న వ్యాప్తి గలది  అని తెలిపెను .కనుక

 *వినాయక చవితి 18వ తేదీనp చేయటమే శ్రేయోదాయకము.*

  


    సర్వం శ్రీపరమేశ్వరార్పణమస్తు

కామెంట్‌లు లేవు: