29, అక్టోబర్ 2023, ఆదివారం

3d art


 

Good night


 

Tudi janma


 

Tunka puri


 

China restaurant


 

Dosa in Mumbai


 

Srisaila


 

Puri sea beach


 

Fiji fruits


 

Non stop fountain


 

Rail bus


 

Chips making


 

Tirumala places to visit


 

Bridge creater


 

Automatic


 

Swamivaari darsanam


 

Himaja kalyani Gaatram


 

Service charge


 

Draaksha pallu


 

మనుస్మృతి

 --------

మనుస్మృతి 

-------------


"మనువాదం, మనుస్మృతి" అంటూ విద్వేషవాదులు సమాజానికి, సాటి మనిషికీ పనికిరాని ఆపై హానికరమైన అసాంఘీక శక్తులు అఱుస్తూ, అలజడిని సృష్టిస్తూ తమ పబ్బంగడుపుకోవడం, మేధావులవడం మనం చూసూనే ఉన్నాం. 


అసలు ఏది మనువాదం? ఏది మనుస్మృతి? మనువు ఎవరు? మనువులు ఎంత మంది? ఈ ప్రశ్నలకు  జవాబులు తెలిస్తే మనుస్మృతి అని అనబడుతున్న దానిపై స్పష్టత వచ్చేస్తుంది.


మనస్మృతి అని చెప్పబడుతున్న దాంట్లో 60 నించి 70 శాతం ప్రక్షిప్తమే. పరిశోధనల ద్వారా ఈ విషయం నిరూపించబడింది. నిజానికి మనువు ఒకరు కాదు. పురాణ నిర్ణయం ప్రకారం ఈనాటి ప్రపంచం 7వ మనువుకు చెందిన వైవశ్వత మన్వంతరం. ఇంతకు ముందు 6 మనువుల‌ కాలాలు అంటే మన్వంతరాలు గతించాయి. అలాంటప్పుడు ఏ మనవుకు చెందినది ఇవాళ మనం మాట్లాడుకుంటున్న మనుస్మృతి?  వాస్తవానికి మనువు చారిత్రిక వ్యక్తేనా కాదా? పౌరాణికంగా మనువు సామాజిక బ్రాహ్మణుడు కాదు.‌ 


ఇప్పుడు మనం మనుస్లృతి అని అనుకుంటున్న దాన్ని 1887లో మద్రాస్  హైకోర్ట్ నిజమైనది కాదని తేల్చి తీర్పు చెప్పింది.


ఆ తప్పుడు మనుస్మృతి పుస్తకాన్ని మనకు తెలియజేసింది ఎవరు? విల్యం జోన్స్ అన్న ఇంగ్లిష్ వాడి చేత 1794లో ఈ తప్పుడు మనుస్మృతి సంకలనంఐ ప్రకటించబడింది. అప్పటికి దొరుకుతున్న 50కి పైగా వేర్వేఱు ప్రతుల్నుంచి ఎన్నిక చేసి తనకు కావాల్సిన విధంగా మనుస్మృతి అన్న దాన్ని తయారు చేశాడు దుష్టుడు విల్యం జోన్స్. ఇది తప్పుడదని మద్రాస్ హై కోర్ట్ 1887లోనే తేల్చి నిర్ణయించి ఒక కేసులో తీర్పుగా చెప్పింది. ఈనాటి అసాంఘీక శక్తులకు, ప్రజా విరోధులకు ఉండాల్సినంత చదువులేకపోవడం వల్ల ఈ సత్యం తెలియరాలేదు.


ఇవాళ మన దేశం రాజ్యాంగబద్ధమై ఉంది. మనుస్మృతి బద్ధం కాదు. వర్తమానంలో మన దేశంలో మనుస్మృతికి ప్రాసంగికత లేదు. తప్పుడదని ఎప్పుడో తేలినదాన్ని పట్టుకుని, ప్రస్తుతంలో ప్రాసంగికతలేని దాన్ని పట్టుకుని ఇప్పుడు రాద్ధాంతం చెయ్యడం ఏమిటి? 


మౌలికంగా మనుస్మృతి అన్నది బైబిల్, ఖుర్ ఆన్ లలాగా ఒక మత గ్రంథం కాదు. కొన్ని సూచనల, ఆలోచనల, సలహాల, మార్గదర్శకాల సంకలనం మాత్రమే మనుస్మృతి.  విధించబడిన నిబంధనలు ఏవీ మనుస్మృతిలో లేవు. నిజానికి సనాతనం లేదా వైదికంలో  ఎక్కడా ఆదేశాలు (commandments), నిబంధనలు ఏ ఋషి ద్వారా కూడా చెప్పబడలేదు. కొందఱు ఋషులు మానవాళి మేలు కోసం కొన్ని అనువైన,‌ విలువైన విషయాల్ని చెప్పారు. వాటిని పాటించమని సూచించారే కానీ కత్తి మెడపై పెట్టి ఆచరించాల్సిందే అని బెదిరించలేదు.


గోతమ బుద్ధుడు  తన కాలానికి అందుబాటులో ఉన్న మనువు ఉవాచల్ని యథాతథంగా తీసుకున్న సందర్భాలున్నాయి.‌ "దేని ఫలితం మేలు చేస్తుందో అది సత్యం" అని మనువు మాటగా  తెలియ వచ్చిన దాన్ని బుద్ధుడు తీసుకుని తన మాటగానూ చెప్పాడు. ఈ మాట మహాభారతంలోనూ ఉంది.‌ జాన్సన్ అన్న ‌పాశ్చాత్య తత్త్వవేత్త కూడా ఈ మాట అన్నాడు. అసలు‌ ఇంత గొప్ప మాట ప్రపంచంలోనే మొదటసారి మనువు మాటగానే తెలియవచ్చింది. 


మనువు పేరుతో పేరుకున్న అవాస్తవాలనుంచి‌‌, అలజడి నుంచి, అసాంఘీక చర్యల నుంచి, "మనువు, మనువాదం" అంటూ చెలరేగుతున్న హానికరమైన వ్యక్తులనుంచి మనకు రక్షణ, విముక్తి అత్యవసరం.


తథాస్తు‌.


-సేకరణ మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ

దేవాలయాలలో వసతి సౌకర్యం



 క్షణాల్లో ఓపెన్ అవుతుంది*


☎️దేవాలయాలలో వసతి సౌకర్యం కోసం  : https://goo.gl/gDaGJ4

🕉️ఎ పి లో   జిల్లాల వారి దేవాలయాల వివరాలు   : https://goo.gl/Qzhzis

🕉️రాష్ట్రాల వారీగా దేవాలయాల సమాచారం  : https://goo.gl/VnNaj5

🕉️జ్యోతిర్లింగాల క్షేత్రాల వివరాలు  : https://goo.gl/X9NBUe

🕉️శక్తిపీఠాలు సమాచారం  : https://goo.gl/LtvStS

🕉️గ్రూప్ టెంపుల్స్  : https://goo.gl/N9xD8M

🕉️ఆరుపడైవీడు క్షేత్రాల కోసం  : https://goo.gl/HqGR8P

🕉️పంచారామ క్షేత్రాల వివరాలు  : https://goo.gl/ygX5hW

🕉️పంచభూత క్షేత్రాల వివరాలు  : https://goo.gl/pqtgxj

🕉️తిరుమల గురించి  : https://goo.gl/mb2DGD

🕉️శ్రీకాళహస్తి గురించి : https://goo.gl/UJbxmF

🕉️కాశి గురించి  : https://goo.gl/DZzKa1

🕉️రామేశ్వరం గురించి  : https://goo.gl/yyH424

🕉️అరుణాచలం గురించి  : https://goo.gl/eFbKNE

🕉️మదురై గురించి : https://goo.gl/1Ntthd

🕉️శ్రీశైలం గురించి  : https://goo.gl/ZUfFHo

📀కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి  : https://goo.gl/A5UU7v

🕉️ప్రసిద్ధ శైవ క్షేత్రాలు  : https://goo.gl/mn2K3y

🕉️మహాభారతం పుస్తకాలూ  : https://goo.gl/v1XuqV

🕉️భాగవతం పుస్తకాలూ  : https://goo.gl/9fMcDp

🕉️టెంపుల్ క్విజ్ ఆడండి  : https://goo.gl/nrhsBK

అరుణాచలశివ 🌹

 ఈ ముఖ్యమైన సమాచారాన్ని అందరూ పొందటానికి 

➡️అందరికి షేర్ చేయండి 🙏🙏🙏

శ్రీ మహాదేవ్ మందిర్

 🕉 మన గుడి : నెం 223





⚜ గోవా  : తంబిడి సుర్ల 


⚜ శ్రీ  మహాదేవ్ మందిర్


💠 ఇది శివుని ఆలయం మరియు పొరుగున ఉన్న కర్ణాటకలోని ఐహోల్‌ లోని ఆలయాలను గుర్తుకు తెస్తుంది. 

తాంబ్డి సుర్ల మహాదేవ్ ఆలయం గోవాలోని పురాతన శివాలయం (12వ శతాబ్దం) భగవాన్ మహావీర్ వన్యప్రాణుల అభయారణ్యంలో మరియు కర్ణాటక సరిహద్దుకు సమీపంలో ఉంది.  


💠 గోవాలోని పురాతన హిందూ దేవాలయం, దట్టమైన అడవిలో దాగి ఉన్నందున పోర్చుగీసు వారి నుండి బయటపడింది.

కదంబ రాజవంశం ప్రారంభ మధ్యయుగ కాలంలో ఉత్తర కర్ణాటక మరియు ప్రస్తుత గోవాలోని భాగాలను పాలించింది, మొదట ప్రత్యర్థులు మరియు తరువాత వాతాపి చాళుక్యుల సామంతులు.  


💠 ఈ చిన్న ఆలయం చాళుక్యుల మరియు హొయసల స్థపతిల ప్రభావాన్ని చూపుతుంది.  చిన్న ఆలయంలో సాధారణ గర్భ గృహ గర్భగుడి, ఒక అంతరాల వసారా మరియు నాలుగు స్తంభాల ముఖ-మండపం కూర్చున్న నందిని కలిగి ఉంది.


💠 దివాన్ హేమత్రి పర్యవేక్షణలో కదంబ రాజు మరియు రాణి కమల్ దేవి 1145 లో నిర్మించారు. ఇది మొఘల్ ఆక్రమణదారుల దోపిడీలను తట్టుకుంది.  దట్టమైన మరియు దట్టమైన పచ్చటి అడవుల మధ్య మరియు భగవాన్ మహావీర్ వన్యప్రాణుల అభయారణ్యం మధ్యలో మంత్రముగ్దులను చేసే ఆకర్షణతో నెలకొని ఉంది.  కదంబ-యాదవ శైలి వాస్తుశిల్పంలోని విమానం, స్తంభాలు మరియు ఆలయం వైపులా క్లిష్టమైన శిల్పాలు చాలా అద్భుతమైనవి మరియు అందంగా ఉన్నాయి.  ఇది గోవాలోని అతి పురాతనమైన శివాలయం మరియు కదంబ శైలి వాస్తుశిల్పంతో మిగిలి ఉన్న ఏకైక ఆలయం.  


⚜ ఆలయ చరిత్ర ⚜


 💠 గ్రామస్తుల ప్రకారం, ఆలయాన్ని పురాతన చరిత్రతో అనుసంధానించే ఒక కథ ఉంది, బహుశా దాని మూలాలను పాండవుల కాలం నాటిది.

రాణి కమలా దేవి కర్నాటకలోని తన రాజ్యం నుండి తంబాడి సుర్ల మీదుగా చందోర్‌కు వ్యాపారం కోసం ప్రయాణిస్తుందని వారు నమ్ముతారు.  

ఆమె ప్రయాణాలలో, ఆమె మరియు ఆమె దళాలు విశ్రాంతి తీసుకోవడానికి విరామం తీసుకుంటారు మరియు వారి దేవతను గౌరవించటానికి పూజలు చేస్తారు.  

ఈ శివుని ఆరాధనను సులభతరం చేయడానికి, రాణి కమలా దేవి ఈ ప్రదేశంలో ఒక ఆలయాన్ని నిర్మించింది, దీనిని మనం ఇప్పుడు తాంబాడి సుర్ల ఆలయంగా పిలుస్తాము.  

గోవా మరియు కర్ణాటక మధ్య చారిత్రక సంబంధానికి ఋజువుగా, పురాతన మార్గం ఇప్పటికీ ఉనికిలో ఉంది మరియు చురుకుగా ఉపయోగించబడుతోంది.


 💠"మరో గుంపు గ్రామస్తులు భిన్నంగా నమ్ముతున్నారు, పాండవులు గోవాలో అజ్ఞాతవాస  సమయంలో ఆలయ నిర్మాణం ప్రారంభమైందని సూచిస్తున్నారు.  అయినప్పటికీ, వారు దానిని పూర్తి చేయలేకపోయారు మరియు పనిని అసంపూర్తిగా వదిలివేయవలసి వచ్చింది.  

ఇది తరువాత కదంబ రాజవంశం యొక్క రాణి కమలా దేవి ద్వారా పూర్తి చేయబడింది అని


💠 అయితే, ఈ కథలు ఊహాజనితంగా పరిగణించబడుతున్నాయని గమనించడం ముఖ్యం, మరియు ఆలయం యొక్క నిజమైన మూలాలు రహస్యంగా ఉన్నాయి.  

ఆ యుగం నుండి ప్రత్యక్ష సాక్షులు లేరని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు, ఎందుకంటే ఈ ప్రాంతంలోని ప్రస్తుత నివాసులు సుమారు 200 సంవత్సరాల క్రితం మాత్రమే అక్కడ స్థిరపడ్డారు.  పర్యవసానంగా, ఖచ్చితమైన చారిత్రక రికార్డులను ఇంకా చేర్చవలసి ఉంది మరియు గోవా ప్రభుత్వం కూడా సాపేక్షంగా ఇటీవలే ఆలయాన్ని కనుగొంది.  దేవాలయం యొక్క అంతుచిక్కని గతం నేటికీ సందర్శించే వారి ఊహలను దోచుకుంటూనే ఉంది.


💠 ఈ ఆలయ మండపం మధ్యలో తల లేని నంది (ఎద్దు, శివుడి వాహనం) ఉంది, దాని చుట్టూ నాలుగు సరిపోలే స్తంభాలు ఉన్నాయి.  కదంబ రాజ్యం యొక్క చిహ్నం " ఏనుగు గుర్రాన్ని తొక్కడం" ఒక స్తంభం యొక్క పునాదిపై చెక్కబడింది.  


💠 ఈ ఆలయంలో విష్ణువు, కాలభైరవుని అందమైన మూర్తులు ఉన్నాయి.

 దేవకోష్ఠాలలో శివ పార్వతి, గణేశుడు మరియు బ్రహ్మ మరియు అష్టభుజ తామరలతో చేసిన అద్భుతమైన పైకప్పు శిల్పం.  

నంది మండపం 3 వైపులా తెరిచి ఉంది మరియు 4 పూర్తి స్తంభాలు మరియు 6 అర్ధ స్తంభాలు ఉన్నాయి. 

 ఈ ఆలయం పశ్చిమ ఘాట్ దిగువన పచ్చని అడవి మధ్యలో ఉంది.  దాని ప్రక్కన ఒక అందమైన  నది ప్రవహిస్తుంది.


💠  మహాశివరాత్రి పండుగను చుట్టుపక్కల గ్రామాలలో నివసించే స్థానిక ప్రజలు ఆలయంలో వైభవంగా మరియు ఉత్సాహంగా జరుపుకుంటారు.  

ఈ ఆలయం చాలా దుర్గమమైన ప్రదేశంలో నిర్మించబడింది మరియు అప్పటి ప్రధాన స్థావరాలకు దూరంగా ఉంది.  

సగటు గోవా ఆలయంతో పోలిస్తే ఈ ఆలయం చిన్నది


💠 తంబ్ద్రి సుర్ల పంజిమ్ నుండి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు ఇది ప్రధానంగా మారుమూల ప్రాంతంగా గుర్తించబడింది.  

ఆలయానికి నేరుగా చేరుకోవడానికి ప్రజా రవాణా ఎంపికలు పరిమితం.

అన్నంతో మధు చేరినా

 *సుభాషితం*

---------------

🌺

*యథాన్నం మధుసంయుక్తం*

      *మధువాన్యేన సంయుతం ౹* 

      *ఏవం తపశ్చ విద్యా చ*

 *సంయుక్తం భేషజం మహత్ ౹౹* 🌺

    

*భావం :  అన్నంతో మధు చేరినా,లేక మధువే వేరే దేనిలో చేరినా అది మందు అయినట్టుగానే,విద్య,తపస్సు ఒక్కటి అయినపుడు అన్ని రకాల కొరతలను పోతాయి.*

🌺✍🏽

Return


 

శివుడు” మమ్మల్ని రక్షించుగాక

 కస్త్వం శూలీ మృగయ భిషజం నీలకంఠః ప్రియేఽహం

కేకామాకాంకురుపశుపతిర్నోఽవదృశ్యేవిషాణే

స్థాణుర్ముగ్ధేనవదతితరుర్జీవితేశశ్శివాయాః

గచ్ఛాటవ్యామితిహతవచఃపాతునశ్చంద్రచూడః


పార్వతీ -“ కస్త్వం?” ఎవరు నీవు

శివుడు  - “శూలీ” , శూలిని( శూలం చేత ధరించినవాడిని)నొప్పి కలవాడనీ అర్థం ఉంది , అందుకే 


పా-“మృగయ భిషజం” , ఐతే మంచి వైద్యుణ్ణి వెతుక్కో😃


శి- “నీలకంఠః ప్రియే అహం” , ఓ ప్రియా నేను నీలకంఠుడిని(గరల పానం చేత నీలమైన కంఠం కలవాడు) నెమలి అని అర్థం కూడా ఉంది (దాని కంఠం కూడా నీలమే కదా) అందుకే 


పా- “కేకాం ఏకాం కురు” , “నువ్వు నెమలివైతే ఒక కేక వెయ్యి “

అంటుంది


అప్పుడు 


శి- “పశుపతిః” , నేను పశుపతిని అంటాడు , పశుపతి అంటే పశువులనాయకుడు ఐన గొప్ప వృషభం అనే అర్థాన్ని పార్వతి చమత్కారంగా అన్వయుంచుకొని


పా-“నో అవదృశ్యే విషాణే” అంటుంది ,  అంటే నువ్వు వృషభరాజువైతే 

 “కొమ్ములు కనపడవేంటి” ? అని,


అప్పుడు 


శి-“ స్థాణుః ముగ్ధే” 


“అమాయకురాలా ! నేను స్థాణువును “


స్థాణువు అంటే కదలని , ఉలుకు పలుకుూ లేని చెట్టు అనే అర్థం తీసుకన్న పార్వతి ఇలా అంటుంది


పా- “న వదతి తరుః” , 

“చెట్టు మాట్లాడదు కదా”🤔


అప్పుడు శివుడు , ఇలా కాదు దేవిని ఆటపట్టిద్దాం అని 


శి- “జీవితేశః శివాయాః”


శివా అంటే పార్వతి , శివాజీవితేశ్వరుడిని,  “శివా”  కి భర్త ను అంటాడు , 


శివా అంటే “నక్క” అనే అర్థం కూడా ఉంది , దాన్ని ఉపయోగించి ఆ పార్వతి ,


“గఛ్ఛ అటవ్యాం “ , అడవిలో తిరక్కుండా ఇక్కడికొచ్చావేంటీ!?


 అని 😃 నవ్వతుంది 


“ఇతి హతవచః పాతు నః చంద్రచూడః” 


ఇలా పార్వతి చేత వాగ్యుధ్ధం లో ఓడిపోయిన “చంద్ర చూడుడైన” 


“శివుడు” మమ్మల్ని రక్షించుగాక అని కవి ప్రార్థన చేస్తూ , చమత్కారంగా చంద్ర చూడ అనే పేరు చెప్తే శివుడు గెలిచే వాడు కదా అని శివుడు గెలిచే ఉపాయాన్ని కూడా శ్లోకంలో పొందు పరిచాడు . ఎందుకంటే చంద్రచూడుడు లోకంలో శివుడొక్కడే కదా!😃

బ్రాహ్మణ శాకాహారభోజనము

 శబరిమల యాత్రకు వెళ్తున్న వారికి,దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు, స్వాములకు, అయ్యప్పలకు, భవానీలకు, చక్కటి శుభవార్త. ఆంధ్ర,తెలంగాణ, ముంబై,ఢిల్లీ, తమిళనాడు,కేరళ కర్ణాటక, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, దక్షిణ ప్రదేశ్ లలో బ్రాహ్మణ శాకాహారభోజనము, ఉల్లి వెల్లుల్లి లేకుండా మడిగా, సూచిగా వండి అందజేస్తాము. మీరు చేయవలసినదల్లాఒక్కరోజు ముందుగా మాకు తప్పక తెలియచేయవలెను


*ANDHRA PRADESH*

విజయవాడ: మోహన్ గారు7396881404

విజయవాడ:మధువని9182554800

కదిరి,                         9032690554

కాకినాడ హరి గారు:            08142729222

విజయవాడ శర్మగారు.79896 44180

వైజాగ్ సంతోషి గారు:         8501062405

వైజాగ్ : సాయిశర్మ             7032324851

గుంటూరు, ప్రకాశం:సాయి గారు: 7989585295

నరసరావుపేట: శర్వాణి గారు7989521739

నెల్లూరు 093469 43145

ఒంగోలు సునీత గారు:       9290777270

తిరుపతి:లక్ష్మి గారు       9959859227

ఎలమంచిలి లక్ష్మీ గారు;+91 83674 75200


*Kerala*

*Kottayam railway station*

లలిత గారు9447136023

*కేరళ త్రిసూర్*

096567 77404


*MUMBAI CSTM/ DADAR/ THANE/ KALYAN/ LTT/ BANDRA*

శివరామన్ శర్మ గారు+91 74484 08447


*TAMILNADU*

చెన్నై తాంబరం స్టేషన్ :        7395932954

మధురై,:నారాయణ క్యాటరింగ్:9842191826

శ్రీరంగం:జై శ్రీ గారు:+91 94871 80737

అరుణాచలం లక్ష్మికాంత్       8870218670


*KARNATAKA*

బెంగళూరు ద్రాక్షాయిని గారు  9738979748

బెంగళూరు శర్మగారు:         8892447050


*TELANGANA*

సికింద్రాబాద్: ప్రసన్న గారు                     9032910106

సికింద్రాబాద్: the Lunch home                    9885785556

రామగుండం,పెద్దపల్లి, శర్మగారు9849259500


*NORTH, EAST, WEST*


న్యూఢిల్లీ ఫణి కుమార్          9650873730

వారణాసి : శైలజ గారు        6387716431

నాగపూర్:                       9505651387

షిర్డీ : అనిల్ గారు              9511111585


మీ వద్దకు మీరు కోరిన విధంగా టిఫిన్, భోజనం,పులిహార,దద్దోజనం అందజేస్తాము.

దయచేసి ఒక రోజు ముందుగా ఆర్డర్ చేయండి ఇది నలుగురికి ఉపయోగపడే పోస్ట్ తప్పకుండా షేర్ చేయండి🙏

Gambler


 

Chain making


 

Break fast in vandebharath


 

New car purchase


 

Hot pot food in China


 

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


రాజా! నేనింతవరకూ ఎప్పుడూ ఎవరిమీదా దేనికీ కోప్పడలేదు. ఇప్పుడు కూడా మిమ్మల్ని నేనేమీ

శపించలేదు. ఏ పాపమూ ఎరుగని నా కళ్ళు పొడిచిన పాపం బహుశ విన్నూ నీవాళ్ళనూ పట్టిపీడిస్తున్నట్టుంది.

దేవీభక్తులకు అపరాధం చేస్తే ఇంతే. హరిహరాదులయినా సరే దుఃఖాలపాలు కావలసిందే. శాస్తిఅనుభవించవలసిందే. ఇప్పుడు నేనేమి చెయ్యను, ఎలా జీవించాలి. అసలే వృద్ధుణ్ణి, ఇప్పుడు అంధుణ్ణి.

నాకు సేవలు ఎవరు చేస్తారు? ఎలా బతకను?

మహర్షీ! సేవకులను కావలసినంతమందిని నేను నియమిస్తాను. భక్తితాత్పర్యాలతో అహర్నిశలూ

నీకు సేవలు చేస్తారు. తపస్వులు అల్పక్రోధులన్నారు. ఇంతటితో మమ్మల్ని క్షమించమని మరొకసారి

అభ్యర్థిస్తున్నాను.


మహారాజా! గుడ్డివాడినైపోయాను. ఇదా నిర్జనారణ్యం. ఎలా తపస్సు చేసుకోగలను ? నువ్వు

సేవకుల్ని నియమిస్తావు, సరే వాళ్ళు శ్రద్ధగా సేవించొద్దూ! వాళ్ళు నీవాళ్ళు. నన్ను ప్రేమగా

చూసుకుంటారా ? క్షమించమని నిజంగా నువ్వు అడుగుతున్నట్టయితే ఒక పని చెయ్యి. నీ కుమార్తెను

నా సేవకు నియమించు. అది నాకు హాయిగా ఉంటుంది. నేను సంతృప్తి చెందితే నీకూ నీ సైనికులకూ

ఈ మూత్రబంధనం తొలగిపోతుంది. ఆలోచించుకుని కన్యాదానం చెయ్యి. ఇందులో తప్పేమీ లేదు.

నేను తపస్విని.

చ్యవనుడు చేసిన ఈ ప్రతిపాదన శర్యాతి గుండెల్లో ప్రకంపనాలు పుట్టించింది. ఇస్తానని కానీ

ఇవ్వననికానీ ఏమి చెప్పలేకపోయాడు. అంధుడు, వృద్ధుడు, కురూపి పైగా తపస్వి ఇతడికి దేవకన్యలాంటి

మా అమ్మాయిని ఇస్తే సుఖపడుతుందా? అమ్మాయి సుఖంమాట అలా ఉంచు, నేను సుఖంగా

జీవించగలనా? నా అనారోగ్యం కుదుటపడటానికి కూతురి సుఖాలను త్యాగం చెయ్యనా? ఎంత

పనికిమాలినవాడైనా చేస్తాడా? మంచీచెడూ తెలిసి నేనెలా చెయ్యను? ఇతడితో సంసారం ఎలా చేస్తుంది?

ఏమి సుఖపడుతుంది? యౌవనంలో ఉన్న సుందరాంగి తనకు తగిన భర్త కావాలని కోరుకుంటుందే తప్ప

ఇలాంటి వృద్ధుణ్ణి అంధుణ్ణి ఇష్టపడుతుందా? అనురూప భర్త దొరికినా ఆ వయస్సులో మన్మథుణ్ణి

తృప్తిపరచడం అసంభవమంటారు. ఇంకా ఇలాంటి మగడితో సంసారమైతే చెప్పాలా!

కోవాత్మనః సుఖార్థాయ పుత్ర్యాస్ససారజం సుఖమ్ ।

హరతేఽల్పమతిఃపాపో జానన్నపి శుభాశుభమ్ ॥


యౌవనే దుర్జయః కామో విశేషేణ సురూపయా।

ఆత్మతుల్యం పతింప్రాప్య కిము వృద్దం విలోచనమ్||

పద్యభారతికి నమస్సులు*

 *పద్యభారతికి నమస్సులు*

            ==================

         *వాసి* గల *శివా*

     ::::::::::::::::::::::::::::::::::::::   

శ్వేత నాగము, హిమముల సిత   

         కమలము

సింహ కర్ఫూరముల,  సిగశశిలను

నంది నధిగమించు ధవళ సుందరుండ

ఏల గరళము మ్రింగితో నీల కంఠ!

(బసవరాజీయము లోని శ్లోకం ఆధారంగా)

చల్లని కొండ వాసమయి, చల్లని 

          గంగను పైన దాల్చుచున్

చల్లదనంబు నిచ్చు సిగ జాబిలి

         గల్గియు, చూడ్కులందునన్

చల్లదనంబు గ్రుమ్మరిలు శాంకరి

    దేహము నాక్రమింపగా

చల్లని దేవుడన్నయశ సంపద 

        పొందుట న్యాయమే శివా!           (మదీయ భక్తి సుమము-నిందాస్తుతి)

        ౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭

 రచన: - తంగిరాల వెంకట

నరసింహ కుమార్,నెల్లూరు

నవగ్రహా పురాణం🪐* . *68వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *68వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*చంద్రగ్రహ చరిత్ర - 6*


*"రోహిణీ ! నీలో ఇంత స్వార్థం దాగి ఉందని , మీ అమ్మా , నేనూ ఊహించలేకపోయాం. ఆశల పల్లకిలో ఊరేగుతూ భర్త మందిరంలో ప్రవేశించిన ఇరవై ఆరుగురు అక్కచెల్లెళ్ళ సౌభాగ్యాన్ని కొల్లగొట్టుతున్నావు. భావావేశంలో భర్త చేసే తప్పును దిద్దే బాధ్యత భార్యది. నీ ధర్మాన్ని విస్మరించావు. నువ్వు చంద్రుడి ప్రథమ పత్నివి కావు. చతుర్థ పత్నివి. దుర్మార్గంగా ప్రథమ స్థానాన్ని ఆక్రమించావు. ఆత్మ పరిశీలన చేసుకుని అక్కచెల్లెళ్ళకు క్షమాపణ చెప్పి , అందరితో కలిసి మెలసి జీవించు !"*


*“అలాగే నాన్నగారూ...”* రోహిణి సన్నటి కంఠంతో అంది. *"నేను వస్తాను. వాళ్ళకు అన్యాయం జరిగితే మళ్ళీ వస్తాను !"* అంటూ దక్షప్రజాపతి ఆవలకి నడిచాడు.


రోహిణి నీరసంగా మంచం మీద వాలింది.


తండ్రిని వీడ్కొలిపి మందిరంలోకి వచ్చిన అశ్వినికీ , ఆమె చెల్లెళ్ళకూ మందిరాన్ని ఆవరించిన నిశ్శబ్దం స్వాగతం పలికింది. తండ్రి హితబోధ తమ పెనిమిటిలో పరివర్తన తెస్తుందని నమ్మిన దక్షపుత్రికలకు నిరాశ ఎదురైంది.


మామగారి మాటలకు భయపడి ఒక్కసారిగా వెంటనే మార్పుని వ్యక్తం చేయడానికి చంద్రుడికి భేషణం అడ్డువచ్చి ఉంటుందని చేల్లెళ్ళతో అంది అశ్విని. నెమ్మది నెమ్మదిగా తమను చేరదీస్తాడనీ అంది. తమకు తాత్కాలికంగా ఓదార్చును అందిస్తున్న అశ్విని విశ్లేషణను మిగిలిన దక్షపుత్రికలందరూ విశ్వసించారు.


ఆ రాత్రి ఏకాంతంలో తండ్రి హెచ్చరికను గుర్తు చేసుకుంటూ భయపడుతున్న రోహిణీని చూసి చంద్రుడు తేలికగా నవ్వాడు.


*"మీ తండ్రిగారి హుంకరింపునకు నేను భయపడను. ఆయనకు తెలీదు నా మీద ఎవ్వరి శాపాలూ పనిచేయవు. దక్షప్రజాపతి బృహస్పతి కన్నా గొప్పవాడా ? మహేంద్రుడిని మీంచిన ప్రభావమా అయనది ? గురువు భార్యతో ప్రణయం సాగించాను. నన్ను పోలిన అందగాణ్ణి పుత్రుడిగా పొందాను. అంత జరిగినా ఆ బృహస్పతి నన్ను ఎందుకు శపించలేదు ? ఆయనను ఆదుకున్న ఇంద్రుడు ఎందుకు నన్ను శపించలేదు !"* సగర్వంగా ఆంటూ ఆగి , సమాధానం చెప్పమన్నట్టు రోహిణి వైపు దూశాడు.


*"ఎందుకు శపించలేదు స్వామీ ?"* సమాధానంగా ప్రశ్న సంధించింది రోహిణి.


చంద్రుడు నవ్వాడు. ఆ నవ్వు అహంకారంతో పదునెక్కింది. *“అనసూయా , అత్రి దంపతుల అనుంగుపుత్రుడైన నీ అందాల చంద్రుడి మీద అన్యుల శాపాలు ప్రభావం చూపవు!"*


*"అయితే నా ముగ్గురు అక్కలూ , ఇరవై ముగ్గురు చెల్లెళ్ళూ..."* అంటూ ఏదో చెప్పబోయింది రోహిణి.


*"ఆ సోదరీ బృందం అలా పడి ఉంటారు !"* చంద్రుడు నిష్కర్షగా అన్నాడు. *"ఈ చంద్రుడు రోహిణీ ప్రియుడు ! రోహిణీ దాసుడు ! రోహిణీ నాథుడు ! ఆ దక్షపుత్రికలు దక్షపుత్రికలుగానే ఉంటారు. చంద్రపత్నులు కారు , కాలేరు !”*


*"స్వామీ..."*


చంద్రుడు పళ్ళు కొరికాడు. అతని బుగ్గలు అదిరాయి. *"అనుమతి లేకుండా పుట్టినింటికి వెళ్ళి , నా మీద అభియోగాలు మోపి , దక్షప్రజాపతిని వెంట తీసుకు వచ్చి , బెదిరించాలని చూస్తారా ? ఈ చంద్రుడి నిర్ణయం రేపు తెలుస్తుంది వాళ్ళకు.”*


రోహిణి చంద్రుడి దగ్గరగా వచ్చింది. ఆగ్రహం ప్రత్యక్షమవుతున్న అతని ముఖంలోకి ఆనందంగా చూసింది. నెమ్మదిగా తన చెంపను అతని వక్షభాగం మీద ఆన్చింది.


*"స్వామీ...మీ ఆగ్రహం...”*


*"నీ తనువు తాకగానే అనురాగంగా మారి పోతుంది !"* చంద్రుడు నవ్వుతూ రోహిణి చుట్టూ చేతుల్ని బిగించాడు. 


తమ శయనాగారంలోకి వస్తున్న వ్యక్తిని చూడగానే ఇరవై ఆరుగురు దక్షపుత్రికలూ ఆశ్చర్యపోయారు. అప్రయత్నంగా అందరూ ఒకేసారి లేచి నిలబడ్డారు.


అందరిలోనూ ఒకటే ఆలోచన. ఒకే ఆశాభావం - తమ పతిదేవుడిలో మార్పు నెమ్మది , నెమ్మదిగా వస్తున్నట్టుంది.


*"మీ కోసమే వచ్చాను ,"* అందరినీ కలయజూస్తూ అన్నాడు చంద్రుడు. అతని మాట ఇరవై ఆరు ముఖాల మీద చిరు నవ్వును అద్దిన కుంచెలా పనిచేసింది.


*"రోహిణిని స్వీకరించినట్టు మిమ్మల్ని... ఎవ్వర్నీ... నేను స్వీకరించను !"* చంద్రుడి మాట ఈ సారి ఇరవై ఆరు ముఖాల మీద మెరిసిన చిరునవ్వును ఆశ్చర్యహస్తంలా తుడిచివేసింది.


*"అనుమతి లేకుండా పుట్టినింటికి వెళ్ళారు. నా మీదా , రోహిణి మీదా అభియోగాలు మోపి , ఉన్నది ఒకటి , లేనివి రెండూ కలగపిలి , రెచ్చగొట్టి మీ తండ్రిని నా మీద యుద్ధానికి తీసుకువచ్చారు. అది మీ అవిధేయత. అది మీ అహంకారం !"* చంద్రుడి మాటలకు అతనిలోంచి పొంగుతున్న కోపం పదునుపెడుతోంది.


*"మీ తండ్రే కాదు, ఆయన తండ్రి వచ్చి హెచ్చరించినా ఈ చంద్రుడు లెక్కించడు. కోపాలకూ , శాపాలకు భయపడిపోయి పరిచారికలుగా పడి ఉన్న మిమ్మల్ని పడకటింటికి ఆహ్వానిస్తానని భ్రమపడవద్దు. నాకు రోహిణి ఇష్టభార్య. మీరందరూ మా ఇద్దరికీ పరిచారికలు. ఇది త్రికాల సత్యం !"*


అశ్వినీ , ఆమె చెల్లెళ్ళూ నిర్ఘాంతపోయి ప్రతిమల్లా నిలుచున్నారు. వాళ్ళ శ్వాస చలనం కూడా కంటికి ఆనడం లేదు. వాళ్ళందరూ ప్రతిమలు కారనీ , సజీవ శిల్పాలనీ లిఖించి చూపుతున్నట్టు అందరి బుగ్గల మీదా కన్నీళ్ళు గీతలు గీస్తున్నాయి.

రోహిణి వచ్చి భర్త ప్రక్కన నిలుచుంది. నిదానించి తన సోదరీమణుల ముఖాలను తృప్తిగా చూస్తూ ఉండిపోయింది. ఆమె పెదవులు నవ్వుతున్నాయి. ఆమె కళ్ళు నవ్వుతున్నాయి. *"విన్నారుగా ! ఇక్కడ మీ స్థానాలేమిటో తెలుసుకున్నారుగా. ఇప్పుడింక మీ శాశ్వత కర్తవ్యం నిర్ణయించుకోండి.”* రోహిణి తుది తీర్పు ఇస్తున్నట్టు కటువుగా అంది.


ఆమె మాటనూ , మాటతీరునూ మెచ్చుకుంటూ చంద్రుడి చెయ్యి పామును పెనవేస్తున్న మరొక పాములా రోహిణి చేతిని అల్లుకుంది. 


సోదరి మాటలు విన్న దక్షపుత్రికల కళ్ళు క్షణంలో ఎర్రబడ్డాయి. అందాకా జారిన అశ్రుధారల్ని ఆర్పివేయడానికి ఆవిర్భవించిన నిప్పుకణాల్లా ఉన్నాయి ఆ కళ్ళు !


*"ఏమిటా చేతకాని మౌనం ? ఈ మందిరానికి మహారాణి చెప్పిందిగా , ఏం చేయాలో నిర్ణయించండి. పరిచారికలుగా ఉండటానికి ఇష్టపడితే , ఎవరెవరు ఏయే గృహకృత్యాలు చేయాలో రోహిణి వివరిస్తుంది !”* చంద్రుడి మాటలలో నిర్దయ స్పష్టంగా ధ్వనించింది.



ప్రతిమల్లా ఉండిపోయిన దక్షపుత్రికలలో మొట్టమొదట అశ్వినికి చలనం వచ్చింది. ఆమె ద్వారం వైపు అడుగులు వేసింది. ఆ అడుగుల సవ్వడిలో నిర్ణయం ధ్వనిస్తోంది. చెల్లెళ్ళు ఆమె వెంటే నడిచారు. *"ఏమిటా అహంకారం ? ఎవరి పని ఏమిటో తెలుసుకోరా ?”* రోహిణి గద్దించింది. వాళ్ళ వైపు తిరిగి చూస్తూ.


మందిర ముఖ ద్వారం వైపు గుంపుగా వెళుతున్న దక్షపుత్రికలను చంద్రుడు కళ్ళు చిట్లించి చూస్తున్నాడు. రోహిణి అతని చేతిని పట్టుకొని నడుస్తోంది. అశ్వినీ , ఆమె చెల్లెళ్ళూ మందిర ముఖ ద్వారం దాటి దూరంగా వెళ్ళిపోతున్నారు.


ముఖద్వారం వద్ద జంటగా నిలబడి రోహిణీ చంద్రులు చిరునవ్వుతో వాళ్ళనే చూస్తున్నారు. చంద్రుడు తలతిప్పి , రోహిణి కళ్ళల్లోకి చూశాడు. *"ఉద్వాసన చక్కగా చెప్పావు ! ఈ క్షణం నుంచి మందిరమూ , మందిరంలోని ఏకాంతమూ మనవే !"*


*"ఉద్వాసనకు ఊపిరి పోసిందెవరు ?"* రోహిణి చిపిలిగా నవ్వుతూ చంద్రుడి ముందుకు జరిగింది. ఆమె తల వెనుక భాగం చంద్రుని ఎద మీద ఆనింది. ఆమె చేతులు రెండూ తీగల్లా పైకి లేచి , అతని మెడ చుట్టూ 'కైదండ'గా మారాయి. చంద్రుడి చేతులు రెండూ రోహిణి సన్నటి నడుమును కొలత వేస్తున్నాయి.


దక్షపుత్రికలు మలుపు తిరిగి ఆ ఇద్దరి చూపులకు అందకుండా అంతర్ధానమయ్యారు.


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 78*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 78*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*శక్తిని ప్రసారం చేయగల³ సమర్థత*


 నరేంద్రునిలోఒక అసాధారణ శక్తి పెంపొందడాన్ని గుర్తించాడు. ఆ శక్తిని పలువురికి ప్రసారం చేయడం ద్వారా వారి మనస్సులలో పరివర్తన కలిగించే సమర్థత తనకు ఉన్నట్లు అతడు గ్రహించాడు. 

 

శివరాత్రి పర్వదినాన  భజన, పూజ, ధ్యానాదుల సాధనలలో యువకులు మునిగి పోయారు. మొదటి యామ పూజ పూర్తయింది. ఒక్కొక్కరుగా పలువురు బయటికి వచ్చారు. తన హుక్కా సిద్ధం చేయమని నరేంద్రుడు ఒకరికి పురమాయించాడు. గదిలో కాళీ, నరేంద్రుడు మాత్రమే ఉన్నారు. 


అప్పుడు తనలోని శక్తిని పరీక్షించాలనే ఉత్సుకత నరేంద్రునిలో జనించింది. ఆతడు కాళీతో, "కాళీ, నేను ధ్యానం ప్రారంభిస్తాను. కాసేపయ్యాక నన్ను తాకు" అంటూ ధ్యానంలో మగ్నుడయ్యాడు.


బయటికి వెళ్లిన వ్యక్తి హుక్కా సిద్ధం చేసి తిరిగి వచ్చినప్పుడు సంభ్రమాశ్చర్యాలు కలిగించే ఒక దృశ్యం చూశాడు. నరేంద్రుడూ, కాళీ ధ్యానంలో లయించి ఉన్నారు. కాళీ కుడిచేయి నరేంద్రుని కుడి మోకాలు మీద ఉంది; ఆ చేయి వణకసాగింది. కాసేపటికి నరేంద్రుడు కళ్లు తెరిచాడు.


నరేంద్రుడు : కాళీ! చేయి తీసేయి. నీకు ఏమనిపించింది? 


కాళీ : విద్యుచ్ఛక్తి నా శరీరంలో ప్రసరించినట్లుగా అనిపించింది. నా చేతులు వణికాయి.


యువకుడు : నువ్వు నరేంద్రుని తాకడం వల్లనే నీ చేతులు వణికాయా? 


కాళీ అవును. ఎంత ప్రయత్నించినప్పటికీ నా చేతులు వణకడం ఆపలేక పోయాను.


శివరాత్రి పూజలు కొనసాగాయి. కాళీ ధ్యానంలో లయించిపోయాడు. ఇలా అతడు ప్రగాఢ ధ్యానంలో మునిగిపోవడం ఎవరూ ఇంతదాకా చూడలేదు. నరేంద్రుణ్ణి తాకడం వల్లనే ఇది సాధ్యమయిందని అందరూ భావించారు. '


వేకువజామున 4 గంటలకు నాలుగవ యామ పూజలు ముగిశాయి. అప్పుడు పూజామందిరంలోకి వచ్చిన శశి, నరేంద్రునితో, “గురుదేవులు నిన్ను పిలుస్తున్నారు” అన్నాడు. శశితోబాటు నరేంద్రుడు మేడ మీదకు వెళ్లాడు. ఆతణ్ణి చూడడమే ఆలస్యం, గురుదేవులు చీవాట్లు పెడుతున్న ధోరణిలో,


 "ఏమిటిది? పొదుపు చేయడానికి బదులు ఖర్చు చేయడమా? మొదట అవసరమైనంత మేరకు పొదుపు చేయి. ఎక్కడ ఎప్పుడు దానిని ఖర్చు చేయాలో తరువాతే నీకు తెలుస్తుంది, జగజ్జననే స్వయంగా దానిని నీకు గ్రహింపజేస్తుంది. నీ శక్తిని కాశీలోకి ప్రసరింపజేయడం ద్వారా అతడి కెంత హాని కలిగించావో తెలుసా? 

 

భఅతడు ఒక ప్రత్యేక మార్గంలో పురోగమిస్తున్నాడు. ఆరో నెలలో వాటిల్లిన గర్భస్రావంలా అది నిష్ప్రయోజనమైపోయింది. పోనీలే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదట ఆలోచనారహితంగా ఏ పనీ చేయవద్దు. ఇంకా నయం, మరింత అనర్ధం జరగక పోవడం కాళీ అదృష్టం" అన్నారు.


మౌనంగా నరేంద్రుడు బయటికి వచ్చేశాడు. 

( నరేంద్రుడు ఇలా అన్నాడు

"ఆశ్చర్యచకితుడనయ్యాను. పూజా సమయంలో జరిగింది యావత్తు ఆయనకు తెలిసిపోయింది. ఆయన నన్ను చీవాట్లు పెడుతున్నప్పుడు మౌనం వహించడం తప్ప మరేం చేయగలను!" )🙏


*సేకరణ :- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 68*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 68*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*భుజాశ్లేషా న్నిత్యం పురదమయితుః కంటకవతీ*                       

*తవ గ్రీవా ధత్తే ముఖకమలనాళ శ్రియమియమ్ |*

*స్వత శ్శ్వేతా కాలా ఽగరు బహుళ జంబాలమలినా*

*మృణాళీలాలిత్యం వహతి యదధో హారలతికా ‖*  


భుజాశ్లేషాన్నిత్యం పురదమయితుః కంటకవతీ = తల్లీ, త్రిపురారి ప్రక్కన నీవు ఆసీనురాలవైనప్పుడు ఆయన నిన్ను తన భుజముతో నీ కంఠమును కౌగలించుకొనగా, నీకు పులకింత చేత రోమాంచము కలుగుతుంది.


తవ గ్రీవా ధత్తే ముఖకమలనాళ శ్రియమియమ్ = అప్పుడు నీ ముఖపద్మమునకు నాళము వలె నీ కంఠము కనబడుతుంది.  


  స్వతః శ్వేతా కాలాగరు బహుళ జంబాలమలినా మృణాలీ లాలిత్యం వహతి యదధో హారలతికా = సహజముగా తెల్లనైన నీ కంఠము, దాని క్రింద నీవు ధరించిన తెల్లని మేలి ముత్యాల హారము, నీవు పూసుకున్న నల్ల అగరు గంధము తో నీలివర్ణమును పొంది తామర తూడు వలె నున్నది.


చమత్కారయుక్తముగా చెప్పుకోవలెనంటే, అమ్మవారి తెల్లని కంఠమును స్వామి కౌగలించుకొనగా, ఆయన కంఠముపైని నీలి మచ్చ వలన అమ్మవారి కంఠము, ఆమె ధరించిన ముత్యాల హారము కూడా నీలి వర్ణములో కనబడుతున్నవని. అదే విధముగా, అమ్మవారికి కలిగిన రోమాంచము, ఆమె కంఠమును పోలిన తామర తూడుకు కల సూక్ష్మమైన కేసరములవలె కనబడుతున్నవని. అర్థనారీశ్వర తత్త్వాన్ని భజిస్తున్నప్పుడు ఇటువంటి కవితాత్మకమైన భావనలు కలగటం సహజం.


          🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

Story behind photo


 

Namona aalayam


 

Married life


 

Series connection


 

Three watsapp numbers


 

Hero


 

పేదరాశి పెద్దమ్మ కథలు





 *పేదరాశి పెద్దమ్మ కథలు* తెలుగు వారి సొంతం.

ప్రముఖ కథా రచయిత *ఏ.ఎన్.జగన్నాధశర్మగారి* కలం నుంచి వెలువడిన ఈ *పేదరాశి పెద్దమ్మ కథ తులసి* వినండి

గ్రహణ శాంతి

 

శుభక్రుత్ నామ సంవత్సర పంచాంగ

సింహ - తుల - ధనుస్సు - మీన రాశులవారికి మధ్యమ ఫలము


మిథు - కరా - వృశ్చిక- కుంభ రాశులవారికి శుభ ఫలము


గ్రహణ శాంతి


జన్మరాశుల యందు, జన్మనక్షత్రములయందు, అధమ ఫలమునిచ్చు రాశులయందు చంద్రగ్రహణములు సంభవించిన యెడల చంద్రబింబమును వెండితోను, రవి నాగబింబములను బంగారముతోను చేయించి చంద్రగ్రహణముకాని నేతితో నిండిన కంచుపాత్రయందుంచి, తిలవస్త్ర దక్షిణను సంపాదించి గ్రహణ మధ్య కాలానంతరము నందు 

“మమజన్మరాశి, జన్మనక్షత్ర, చతుర్థాద్యరిష్టస్థాన స్థితగ్రహణ సూచిత సర్వారిష్ట ప్రశాంతి పూర్వక, ఏకాదశస్థానస్థిత గ్రహణ సూచి శుభ ఫలప్రాప్త్యర్థం బింబదానం కరిష్యే" 

అని సంకల్పము చేసి ఆ రవిచంద్ర రాహులను

 "తమోమయ మహాభీమ సోమసూర్య విమర్దనః హేమతారా ప్రదానేన మమ శాంతిప్రదోభవ| విధుంతుదనమస్తుభ్యం సింహికానందనాచ్యుత। దానేనానేన నాగస్య రక్షమాం వేధజాద్భయాత్ 

అను మంత్రమును అనేక పర్యాయము లుచ్చరించి చంద్రగ్రహణముకాన ఘృతపూర్ణ కాంస్యపాత్ర యందుంచిన ఆ ప్రతిమలను యథాశక్తి తిలవస్త్ర దక్షిణలతో ||


గ్రహణ సూచితారిష్ట వినాశార్థం శుభఫల ప్రాప్త్యర్థంచ తుభ్యమహం సంప్రదదేన మమ॥ 


అను దాన వాక్యములతో పూజింపబడిన బ్రాహ్మణునకు దానమీయవలెను.



Vedamula

 https://youtu.be/UY4c1Afh07Q?si=TUdaWSIo2IVPihgS


ఆది వారం {భాను వాసరః}* *రాశి ఫలితాలు

 *29-10-2023*

*ఆది వారం {భాను వాసరః}*

*రాశి ఫలితాలు*

*మేషం*

దూరపు బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది. వృత్తి ఉద్యోగ  విషయాల్లో అధికారులతో చర్చలు సఫలమౌతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

*వృషభం*

ఇతరులతో ఊహించని వివాదాలు  కలుగుతాయి.  కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు.  సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున  విలువైన వస్తువుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. దైవ చింతన పెరుగుతుంది. 

*మిధునం*

శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఋణదాతల   నుండి ఒత్తిడి  పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు తప్పవు. వృత్తి వ్యాపారాలలొ మిశ్రమ ఫలితాలుంటాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. 

*కర్కాటకం*

నూతన వస్త్రాభరణాలు  కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి అనుకూలత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో మీ నిర్ణయాలు  అందరికి నచ్చేవిధంగా ఉంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.

*సింహం*

ప్రారంభించిన పనులలో జాప్యం కలుగుతుంది. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ఇంటా బయట  దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలలలో స్వంత ఆలోచనలు కలసి రావు. దైవ చింతన కలుగుతుంది.

*కన్య*

ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది. ఇంటాబయటా సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలలో  నష్టాలు అధిగమించి లాభాల పొందుతారు. ఉద్యోగమున  అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి.  స్థిరాస్తి  కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

*తుల*

కీలక వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దూర  దేశ  సంచారం చేయవలసి వస్తుంది. అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో  తొందర పడి మాట్లాడటం మంచిది కాదు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు.

*వృశ్చికం*

ధనాదాయ మార్గలు పెరుగుతాయి. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. దీర్ఘాకాలిక రుణాలు తీర్చగలుగుతారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. శారీరక మానసిక ప్రశాంతత  లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

*ధనస్సు*

చుట్టుపక్కల వారితో స్ధిరాస్తి  వివాదాల కలుగుతాయి. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. కొన్ని  వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులు లభించిన   అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇంటా బయటా   గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

*మకరం*

సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గృహనిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సంతాన ఆరోగ్యం విషయంలో శుభ  వార్తలు అందుతాయి.

*కుంభం*

అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బందిపడతారు. దూరప్రయాణాలు వాయిదా పడుతాయి. ధన  విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి  ఉద్యోగాలలో  నిలకడ లోపిస్తుంది. కొందరి ప్రవర్తన మానసికంగా మరింత చికాకు పరుస్తుంది.

*మీనం*

కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల  సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

🕉️

ఓకాళహస్తీశ్వరా

 "ఇల్లో,ముంగిలియో,యనుంగుజెలులో,యీడైనచుట్టంబులో,/

ఇల్లాలో,కొడుకో,తరింపవశమే,యేపోఁడుముల్లేక? మా/

పల్లెం గోరినవెల్లనుంగలవు తెప్పల్గాఁగ నీకిచ్చెదన్/

జెల్లంబో! యిట నొంటినుండ కటు విచ్చేయంగదే లింగమా!


కాళహస్తి మహాత్మ్యము.-3వ ఆ-70 ప: ధూర్జటి మహాకవి;


ఓకాళహస్తీశ్వరా! ఈఅడవిలో ఒంటరిగా యెందుకున్నావయా? నీకిక్కడ యిల్లుందా?వాకలుందా? ప్రాణ స్నేహితులా? వరసైనబంధువులా? పెళ్ళామా,పిల్లలా? నీకెవరున్నారయ్యాయిక్కడ? చాల్చాల్లే! మాపల్లెకురా నీకపకోరినవన్నీ కో కొల్లుగా యిస్తా.ఇంకయీఒంటరిగా యీఅటవీ నివాసంచాలుగానీ ఓలింగమయ్యో! యికనైనా మాపల్లెకురావయ్యా!!


     తన్నిని నిరుపమానమైన భక్తికీపద్యంప్రతీక! తన్నడొకబోయ.పామరుడు.అడవిలో వేటాడవచ్చి అటనొకచెట్టునీడలో నున్న శివలింగమును జూచెను. పురాకృత సుకృత విశేషమున నాదేవదేవునిపై భక్తియంకురింప, తనపల్లియకు రమ్మని స్వామిని బ్రతిమిలాడుట,ప్రస్తుత విషయము.

         ధూర్జటి పాత్రోచితమైన భాషనుపయోగించి, యీఘట్టమునకు వన్నెగూర్చినాడు.ఈపద్యమునందు పఃరయోగింపఁబడిన పదములన్నియు తెలుగు పదములేయగుట గమనింపదగినయంశము.

          పామరుడగు తిన్నడు అమరభాషాపదములనుపయోగింపనేరడుగదా? అందుచేతనే దేసి పద ప్రయోగమునకే కవి ప్రాధాన్యమొసంగెను.

ఇల్లు,ముంగలి,చెలులు,చుట్టాలు,పెళ్ళాము,కొడుకు,పోడుమి,పల్లె,తెప్పలు,ఇత్యాదిగా నన్నియు నచ్చతెలుగులే"తరింప వశమే" అను తత్సమపదమిళిత సమాసమొక్కటిదక్క,తక్కినదంతయు తేటతెనుగులమూట!🌷🙏🙏🙏🕉️🙏🙏🙏🌷🌷🌷🌷💐🌷🌷🌷🌷💐💐🌷

ధనము మితిమీరి

 ధనము మితిమీరి తనచెంత దాచుకొనిన

 చీకు, చింతల మది నిండి చెరచు నెంతొ 

ప్రాప్త లాభ దృష్టి పరిమితార్జన చేత 

కలిగి మనసు శాంతికలితమగును


ధనము ఎక్కువుగా ఉన్నట్లైతే చీకు చింతలు ఎక్కువ అవుతాయి. పరిమిత సంపాదన వల్ల లాభంతో పాటు మనశ్శాంతి కలుగుతుంది

ఆదివారం, అక్టోబరు 29, 2023*

 ఓం శ్రీ గురుభ్యోనమః

*ఆదివారం, అక్టోబరు 29, 2023*

 *శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

   *దక్షిణాయనం - శరదృతువు*

*ఆశ్వయుజ మాసం - బహళ పక్షం*

తిథి : *పాడ్యమి* రా12.31 వరకు  

వారం  : *ఆదివారం* (భానువాసరే)

నక్షత్రం : *అశ్విని* ఉ6.54 వరకు

యోగం: *సిద్ధి* రా10.13 వరకు

కరణం : *బాలువ* మ1.15 వరకు

          తదుపరి *కౌలువ* రా12.31 వరకు

వర్జ్యం: *సా4.13 - 5.46*

దుర్ముహూర్తము : *సా3.55 - 4.41* 

అమృతకాలం    : *రా1.31 - 3.04*                    

రాహుకాలం       : *సా4.30 - 6.00*

యమగండ/కేతుకాలం : *మ12.00 - 1.30*

సూర్యరాశి: *తుల* || చంద్రరాశి: *మేషం*

సూర్యోదయం: *6.01* || సూర్యాస్తమయం:5.27

సుభాషితమ్

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 


శ్లో"  


*_బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి_*౹

*_సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత_*౹ 

*_లక్ష్మీలసత్ కుచసరోరుహ రాజహంస_*౹ 

*_లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్_*౹౹


_- *శ్రీ _శ్రీలక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రమ్* _ - 02


 భా: 

బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు,మరుత్తులు, సూర్యుడు మొదలగు దేవతల కిరీటములు మోడిన పాదములు కల, మెరిసే పాదములు శోభను ఇనుమడించగా, లక్ష్మీ దేవి స్తన ద్వయము వద్ద రాజహంస యైన, ఓ లక్ష్మి నృసింహా! నీ కరముల యొక్క రక్షణను [శరణును] నాకు ప్రసాదించుము.

నీతికథలు-172*

 👉 *నీతికథలు-172* 👈


 *ఒకమంచి అబ్బాయికథ* 


అది 1997 సంవత్సరం, ఉత్తరప్రదేశ్ లోని ఆలిఘడ్ (Alighar) కి చెందిన ఒక యువకుడు ఢిల్లీ యూనివర్సిటీ లో డిగ్రీ పూర్తి చేశాడు. అతనిది మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబం. తండ్రి ప్రకాష్ శర్మ ఒక సాధారణ స్కూల్ టీచర్. ఆస్తిపాస్తులు ఏమీ లేవు, చిన్న ఇల్లు తప్ప. డిగ్రీ పూర్తి చేయగానే అతను ఒక చిన్న Software కంపెనీలో ఉద్యోగం లో చేరాడు. అందరి తల్లితండ్రులలా అతని తల్లితండ్రులు కూడా ఉద్యోగం వచ్చిన వెంటనే సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అక్కడి నుండీ  మొదలయ్యాయి అతని తిప్పలు. ఒకటి కాదు, రెండు కాదు ఎన్నో సంబంధాలు పోయాయి. ఆడపిల్లల తల్లితండ్రులు ఒకపట్టాన పెళ్లికి ఒప్పుకునేవారు కాదు. జాతకాలు కలవలేదు, గ్రహాలు కలవలేదు, సస్టాష్టకాలు అడ్డంకి, దోషాలు, శాఖా బేదం, అబ్బాయి తల్లితండ్రులు పెద్దవాళ్ళు, అబ్బాయి తల్లితండ్రలు ఇంట్లో ఉంటే రేపు పెళ్లయ్యాక మా అమ్మాయి మీదనే చాకిరీ అంతా పడుతుంది, జీతం తక్కువ, ఆస్తులు పెద్దగా లేవు అని, ఇలా ఏవేవో కారణాలు చెప్పి No అనేవారు. కొంతమంది అమ్మాయిలు అయితే పెళ్లి చూపుల సమయం లో direct గా అతని మొహం మీదనే నువ్వు handsome గా లేవు, బండగా ఉన్నావు, పొట్ట ఉంది, మాకు అందంగా ఉన్న అబ్బాయి కావాలి, Sixpack body ఉండాలి, నెలకి ఆరంకెల జీతం ఉండాలి, ఖరీదైన కార్లు ఉండాలి, అమెరికా లో settle అవ్వాలి, ఇవన్నీ నీలో లేవు అంటూ పెళ్లికి ఒప్పుకోలేదు. ఇలాగే ఏదో ఒక కారణం తో ఎన్నో సంబంధాలు పోయేవి. వెతకని సంబంధం లేదు, చూడని పిల్ల లేదు. తల్లితండ్రులు అతని పెళ్లి గురించి చేయని ప్రయత్నం లేదు, మొక్కని దేవుడూ లేడు. ఇదిలా ఉండగా అతను 2000వ సంవత్సరం లో One97 Communications పేరుతో సొంతంగా ఒక కంపెనీ ప్రారంభించాడు. అప్పటికి ఇంకా అతనికి తల్లితండ్రులు సంబంధాలు వెతుకుతూనే ఉన్నారు. ఈసారి ఇంకొక వింత పరిస్థితి ఎదురైంది. మీ అబ్బాయి సొంతగా కంపెనీ పెట్టుకున్నాడు, రేపు అది దివాళా తీస్తే మా అమ్మాయి చాలా ఇబ్బందులు పడాలి అంటూ మళ్ళీ ఆడపిల్లల తల్లితండ్రుల వింత ప్రశ్నలు వేయటం మొదలు పెట్టారు. నీ కంపెనీ మూసేసి ఏదైనా software ఉద్యోగం కానీ, ప్రభుత్వ ఉద్యోగం కానీ చూసుకుంటే ఆలోచిస్తాము అనేవారు మరికొందరు. ఇలా ఎంతోమంది అతనితో పెళ్లికి ఒప్పుకోలేదు. పదుల సంఖ్యలో సంబంధాలు పోయేవి. ఎవరు ఎన్ని మాటలు అన్నా, తన తల్లితండ్రులు దిగులు చెందినా అతనిలోని ఆత్మస్థైర్యం మాత్రం సడలలేదు. నీ requirements ఏంటి బాబు అని ఎవరైనా అడిగితే, మా తల్లితండ్రులని బాగా చూస్కునే అమ్మాయితే చాలు అని అతను వినయంగా బదులిచ్చేవాడు. అంతకుమించి అతనికి వేరే ఆశలు లేవు. ఎంత ప్రయత్నించినా సంబంధం కుదరలేదు. కాలం గడుస్తూ ఉండగా, దాదాపు 8ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత 2005వ సంవత్సరం చివరి నాటికి అతనికి మృదుల పరాశారన్ అనే అమ్మాయితో పెళ్లి కుదిరింది. 


ఎన్ని కష్టాలు ఎదురైన, ఎన్ని అవమానాలు ఎదురైన అతనిలోని ప్రతిభ, పట్టుదల, కార్యదీక్షత ముందు విధి ఓడిపోయింది. 2012 లో అతను PAYTM పేరుతో స్థాపించిన ఒక కంపెనీ అతని జీవితాన్నే మలుపు తిప్పింది.అక్కడితో అతని విజయాల పరంపర మొదలైంది. సంస్థ ఎంత ఎత్తుకు ఎదిగింది అంటే అతని సంస్థలో అనీల్ అంబానీ(Reliance Capital), వారెన్ బఫెట్(ప్రపంచ కోటీశ్వరుడు) Berkshire Hathaway కంపెనీ, చైనా బాంకు(ANT Corporation), కెనడా ప్రభుత్వం, Soft Bank వంటి ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేంతగా. అతని సంస్థలో ప్రస్థుతం 10 మంది CEO లు, 18000 మంది ఉద్యోగస్తులు, 10 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. అతని ఆస్తి ప్రస్తుతం 20,000 వేల కోట్లు దాటింది అని ఒక అంచనా. FORBES పత్రిక అత్యంత ప్రతిభావంతమైన వ్యాపారవేత్తలలో జాబితాలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ  ల సరసన అతని పేరు కూడా ఉంది. అతనే "విజయ్ శేఖర్ శర్మ" , Paytm Group Founder & CEO. విచిత్రం ఏంటంటే అతనీతో పెళ్లి ఇష్టం లేదని, అందంగా లేడనీ, ఆస్తులు లేవనీ ఛీత్కరించిన ప్రతి అమ్మాయి కూడా తర్వాత విజయ్ శేఖర్ శర్మ ఫోటోని Forbes పత్రిక front పేజీ లో చూసుకుంటూ అతనిని మిస్ అయ్యామే అని బాధపడ్డవారే.ఎంతోమంది అమ్మాయిలు  ఒకప్పుడు అతని ఫోటో ని చెత్తబుట్టలో పడేసారు. కానీ ఇప్పుడు అతనితో ఒక చిన్న selfie కోసం ఎగబడేవారు ఎందరో !!  HCL సంస్థ వ్యవస్థాపకుడు శివ నాడార్, మిట్టల్ స్టీల్ కంపెనీ చైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ కధలు కూడా ఇంచుమించు ఇలాంటివే.


ఇందులలో చెప్పవల్సింది ఏంటంటే (ముఖ్యంగా ఆడపిల్లల తల్లితండ్రులకు) ఒక అబ్బాయి జాతకం బాగలేదనో, అతనికి జీతం తక్కువనో, అతని తల్లితండ్రులు పెద్దవాళ్ళు అనో, అందంగా లేడనో, Sixpack లేదనో, America H1B వీసా లేదనో అబ్బాయిలని కాదనకండి. ఒకరి జాతకం ఇలాగే ఎల్లకాలం ఉంటుందని, మధ్యతరగతి అబ్బాయికి ఇస్తే మన అమ్మాయి అత్తారింట్లోకి వెళ్ళాక కష్టాలు  పడుతుందనీ అన్నీ ముందే వూహించుకుని పెళ్లిళ్లు కాదనటం సరికాదు. అన్నిటికీ మించి మా అమ్మాయి ఫలానా డిగ్రీలు చదివింది, అంతకంటే ఎక్కువ చదివిన అబ్బాయి మాత్రమే కావాలి లేదా ఫలానా యూనివర్సిటీలలో చదివిన వారు మాత్రమే కావాలి అంటే ఎలా ??  ఎంతసేపూ ఈ సంబంధం కంటే ఇంకా మంచి option వస్తుందేమో, అదీ కాకపోతే ఇంకా ఇంకా better option వస్తుందేమో అని ఎదురు  చూస్తూనే ఉంటే ఈ మధ్యలో మీరు విజయ్ శేఖర్ శర్మ లాంటి వారిని ఎందరినో మిస్ కావచ్చు. ఒకరి తలరాత ఇంతే అని నిర్ణయించటానికి మనమెవ్వరం, భగవంతునికంటే గొప్పవారమేమీ కాదుగా. ఏదో ఒకనాటికి ఎంతో గొప్ప సంబంధం వస్తుందని ఎదురుచూస్తూ వచ్చిన మంచి అబ్బాయిలందరినీ కాదంటే ఎలా ?? అన్నిటికీ మించి మధ్యతరగతి  అబ్బాయిలంటే ఈ మధ్య ఆడపిల్లల తల్లితండ్రులకు చులకన మరీ  ఎకువైపోయింది. ఏమి !! వారి జీవితం అంటే మరీ అంత చిన్నచూపా ?? పుట్టుకతోనే ఎవరూ కోటీశ్వరులు కాలేరు కదా. ఇవాళ జీవితం లో అత్యంత ఎత్తుకు ఎదిగిన గొప్పవారందరు ఒకప్పుడు దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి  వచ్చినవారే కదా!! దానికి నేను చెప్పిన కుర్రాడి కధ ఒక ఉదాహరణ కాదా ? ఈరోజున దేశం మొత్తం Paytm products వాడుతున్నారు అంటే విజయ్ శేఖర్ శర్మ లాంటి వారు ఎంత ఎత్తుకు ఎదిగి ఉంటారో వేరే చెప్పాలా ?? ఒకరి అదృష్టాన్ని ముందే ఎలా అంచనా వేయగలం అని అడగకండి!!  ఆత్మవిశ్వాసాన్ని, కష్టాన్నీ, తెలివిని నమ్ముకున్న ప్రతీ కుర్రాడు  జీవితంలో ఏదైనా సాధించగలడు. అది అర్ధం చేసుకోండి అంటున్నాను నేను. కష్టపడి చదివి, ఉద్యోగం చేస్తూ, తల్లితండ్రుల విలువ, కుటుంబ విలువలు తెలిసిన ప్రతీ కుర్రాడు మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూస్కోగలడు. అందులో అనుమానమే లేదు. 

Middle class boys are the best material in the world. There is no doubt about it.


కాదంటారా !!


🙌సర్వేజనాః సుఖినోభవంతు 🙌


శ్రీ ధర్మశాస్త సేవాసమితి 🐆 విజయవాడ 🏹 7799797799

ఆనందంగా

 

               

జీవితంలో ఒకరు ఆనందంగా ఉన్నారంటే వాళ్ళకు కష్టాలు ఏమీ లేవని కాదు...

ఎన్ని కష్టాలొచ్చినా వాటిని ఎదుర్కొనే  ధైర్యం వారికి ఉందని అర్థం.

Hari om yatri Nivas



 Hari om yatri Nivas

We are happy to invite you All To 

Hari om yatri Nivas Located In Lanka Backside Of Sankatamoksha Hanuman Temple

Two Kms To Kasi vishweshwar swamy Temple Half Km to Assi Ghat 1km To kedhar ghat

Providing All Types Of Rooms And Dormantry AC and Non AC


Narayana Seva (Annadhanam)


Travels and Pickup Drop Auto Facility Available 


Guiding Services 


All Types Of Poojas And pitru karamas Perform By Telugu And Tamil Scholar Purohit 


Aghraja Annandha Nilayam


Kasi Garbha vasam (9months and nine days stay in Kasi)


           Hari Om Yatri Nivas 

Behind V2 Mart, Opp GPS Public school

Lanka

( backside of Sankatamoksha Hanuman )

Contact

Abburu Hari Hara Sastry

9918774933 

Sri V L Narsimha Rao

8464880428

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో"   *_బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి_*౹

*_సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత_*౹ 

*_లక్ష్మీలసత్ కుచసరోరుహ రాజహంస_*౹ 

*_లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్_*౹౹


_- *శ్రీ _శ్రీలక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రమ్* _ - 02


 *భా: బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు,మరుత్తులు, సూర్యుడు మొదలగు దేవతల కిరీటములు మోడిన పాదములు కల, మెరిసే పాదములు శోభను ఇనుమడించగా, లక్ష్మీ దేవి స్తన ద్వయము వద్ద రాజహంస యైన, ఓ లక్ష్మి నృసింహా! నీ కరముల యొక్క రక్షణను [శరణును] నాకు ప్రసాదించుము*..... 


🧘‍♂️🙏🪷 ✍️🙏

ఆలోచనాలోచనాలు

((((( ఆలోచనాలోచనాలు ))))) సంస్కృత సూక్తి సుధ.🙏                                ***** సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్.                నబ్రూయాత్ సత్యమప్రియమ్!                  ప్రియంచ నానృతం బ్రూయాత్, ఏష ధర్మః , సనాతనః!                            భద్రం భద్రమితి బ్రూయాత్,    భద్రమిత్యేవ వావదేత్!!         ఎప్పుడూ నిజం చెప్పాలి. ఆ చెప్పే నిజాన్ని కూడా ఇష్టంతో చెప్పాలి. అయితే సత్యాన్నైనా అప్రియం చెప్పరాదు. అట్లాగే ప్రియమైనదైననూ, అసత్యం పలుకరాదు. ఇది అనాది నుండి వస్తున్న ధర్మం. భద్రం అనగా శుభం. కాబట్టి ఒకరికి ప్రియం పలికేటప్పుడు " భద్రం" అని పలకాలి.                        ***** యద్యత్పరవశం కర్మ, తత్తద్యత్నేన వర్జయేత్! యద్యదాత్మ వశంతుస్యాత్! తత్తత్సేవేత యత్నతః!!                           ఎప్పుడైనా సరే పరాధీనమైన కార్యాలను విడిచిపెట్టాలి. తన అధీనమైన పనిని ఎంత ప్రయత్నించి అయినా పూర్తి చెయ్యాలి.                    ***** సర్వం పరవశం దుఃఖం, సర్వమాత్రవశం సుఖం, ఏతద్విద్యాత్సమాసేన లక్షణం సుఖ దుఃఖయోః!!      పరాధీనమైన పనులన్నీ కూడా దుఃఖాన్ని తెచ్చిపెడతాయి. తన అధీనమైన పనులన్నీ ఎప్పుడూ సుఖాన్ని కలిగిస్తాయి.                         ***** విప్రాణాం జ్ఞానతో జ్యేష్ఠః, క్షత్రియాణాంతు వీర్యతః ! వైశ్యానాం ధాన్యధనతః, శూద్రాణాం ఏవ జన్మతః!!                        బ్రాహ్మణులలో జ్ఞానం కలవాడే పెద్ద. క్షత్రియులలో బలపరాక్రమాలు గలవాడే పెద్ద. వైశ్యులలో ధనధాన్యసంపత్తి కలవాడే పెద్ద. శూద్రులలో వయస్సు మీరినవాడిన వ్యక్తినే పెద్దగా గౌరవిస్తారు.                ***** విత్తం బంధుర్వయః కర్మ, విద్యా భవతి పంచమీ, ఏతాని మాన్యస్థానాని గరీయో యద్యదుత్తరమ్!!                  ధనికుని కంటే బంధువు శ్రేష్ఠుడు. బంధువు కంటే వయో వృద్ధుడు శ్రేష్ఠుడు. వయోధికుని కంటే క్రియావంతుడు అధికుడు. క్రియావంతుని కంటే విద్యావంతుడు అధికుడు. విద్యావంతుని కంటే మిగిలినవారు క్రమంగా తక్కువని భావం.               ***** న స్నానమాచరెద్సుక్త్వా, నాతుం నమహానిశి,                   నవా సోభి ర్వినాజస్రం, నవిజ్ఞాతే జలాశయే!!            అన్న తిన్న తర్వాత స్నానం చెయ్యరాదు. రోగంతో ఉన్నప్పుడు, అర్థరాత్రి వేళ స్నానం చెయ్యకూడదు. వంటిపై వస్త్రములు లేకుండా స్నానం చెయ్యకూడదు. తనకు తెలియని మడుగులలో దిగి స్నానం చెయ్యకూడదు.                     ***** వైరిణం నోపసేవేత, సహాయం చైవ వైరిణః!          అధార్మికం తస్కరంచ, తదైవ పరయోసితమ్!!             శత్రువు, శత్రువుకు సహాయం చేసేవాడు, లేదా శత్రువుకు స్నేహితుడు, ధర్మహీనుడు, దొంగ, పరస్త్రీ -- వీరితో ఎప్పుడూ సహవాసం.చెయ్యరాదు. దీనివలన చిక్కులు, ఆపదలు ఏర్పడతాయి.        ***** క్షత్రియం చైవ సర్పంచ, బ్రాహ్మణంచ బహుశ్రుతం, నావ మన్యేత వై భూష్ణుః,కృశానపి కదాచన!!                             వృద్ధి లోకి రాదలచినవాడు ఎప్పుడైననూ రాజు(పాలకుని) తో‌, పాముతో, పండితుడైన విప్రునితో, వైరం ఉంచుకోకూడదు. ( దాని వలన తనకు మేలు జరుగకపోగా అపకారమే జరుగుతుంది)                    చివరగా ఒక " ఆర్య ధర్మానికి " సంబంధించిన ఒక మహత్తర శ్లోకం.            శతం విహాయ భోక్తవ్యం,        సహస్రం స్నానమాచరేత్!        లక్షం విహాయ దాతవ్యం,       కోటిం త్యక్త్వా హరిం భజేత్!!                                    తప కోసం వేచివున్న వందమందిని విడచి అయినా భోజనం చెయ్యాలి. అట్లాగే వెయ్యి మందిని విడచి స్నానం చెయ్యాలి. లక్షమందిని విడిచిపెట్టి అయినా దానం చెయ్యాలి. కోటి మందిని విడచిపెట్టి "" భగవత్ ధ్యానం"" చెయ్యాలి. అన్నిటికన్నా ముఖ్యం భగవద్ధ్యానం అని శ్లోక సారాంశం.                             తేది 29--10--2023, ఆదివారం, శుభోదయం.

__స్త్రీధర్మములు

 *__స్త్రీధర్మములు-_*

హరిద్రాం కుంకుమం చైవ సిందూరం కజ్జలం తథా కూర్పాసంకంచ తాంబూలం మాంగల్యాభరణం శుభం  కేశసంస్కారకబరీ కర కర్ణవిభూషణం భర్తురాయుష్య మిచ్ఛంతీ దూరయేన్నక్వచిత్సతీ..... 

తా!!పసుపు కుంకుమ సిందూరము కాటుక రైక తాంబూలము మంగళసూత్రము కొప్పుదువ్వుకొనుట చేతులచెవుల భూషణములు ధరించుటనివి భర్త్రాయుష్యము గోరెనేని నెప్పుడును విడువకూడదు....



_-"స్త్రీ కేశవపన విషయః"ధర్మశాస్త్ర గ్రంధే!-_*

శ్లో"కేశానాం వపనం నాస్తి నారీణాం వ్రత సత్రయోః|మహాదోషేషు సర్వేషు ఛేదయేదంగుళ ద్వయం|

రాజావా రాజపుత్రోవా బ్రాహ్మణోవా బహుశ్రుతః|

కేశానాం వపనం హిత్వా ప్రాయశ్చిత్తం సమాచరేత్|విద్వద్విప్ర నృపస్త్రీణాం నేష్యతే కేశవాపనం|

ఋతే మహాపాతకినో గోహంతు శ్చావకీర్ణినః|

ఈ విధముగా ధర్మశాస్త్ర గ్రంధాలు ఘోషిస్తున్నాయి.. "సువాసినీ స్త్రీలకు"భర్త ఉండగా? పూర్తి ముండనం పనికిరాదు.

ఆదివారం, అక్టోబరు 29,2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


ఆదివారం, అక్టోబరు 29,2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం

తిథి:పాడ్యమి రా12.31 వరకు  

వారం:ఆదివారం (భానువాసరే)

నక్షత్రం:అశ్విని ఉ6.54 వరకు

యోగం:సిద్ధి రా10.13 వరకు

కరణం:బాలువ మ1.15 వరకు తదుపరి కౌలువ రా12.31 వరకు

వర్జ్యం:సా4.13 - 5.46

దుర్ముహూర్తము:సా3.55 - 4.41

అమృతకాలం:రా1.31 - 3.04

రాహుకాలం:సా4.30 - 6.00

యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30

సూర్యరాశి: తుల

 చంద్రరాశి: మేషం 

సూర్యోదయం:6.01 సూర్యాస్తమయం:5.27


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

దత్త మాట

 *దత్త మాట..*


 *కాలం ఏ సన్నివేశాన్ని మర్చిపోదు.*


*కర్మ రూపంలో గుర్తుచేస్తూనే ఉంటుంది..* 


*కర్మ కాలితే కాలంలో గతించిన మర్మాలే సాక్షాలై నిలువునా దహించి వేస్తాయి..* 


*కళ్ళతో చూసిన నిజాలకూ చెవులతో విన్న ప్రశ్నలకూ నోటితో విసిరిన నిందలకూ తెర వెనుక నడిచిన భాగోతానికి సంక్షిప్త సమాధానమే 'కర్మ'*


*కాబట్టి కర్మ చాలా శక్తివంతమైనది. కాల గమనంలో వెంటాడుతున్నే ఉంటుంది. కర్మ బరువై కాలగర్భంలో భవిష్యత్ ని  ముంచేస్తుంది.*


*నువ్వు ఏది చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది.* 


*కుళ్ళు కుతంత్రాలు నుండి బయటపడి తోటివారికి స్వచ్ఛమైన సహసహకారం అందించు. దైవ చింతనతో కూడిన జీవనం మిక్కిలి ఆనందదాయకం, భావితరాలకు ఆదర్శం*

*బామ్మ..మనుమరాలు..*

 *బామ్మ..మనుమరాలు..*


"బాబూ ప్రసాదూ..నేను కామేశ్వరిని మద్రాస్ నుంచి మాట్లాడుతున్నాను..బాగున్నావా?..ఏం లేదు నాయనా..మా రెండో అబ్బాయి కృష్ణమోహను..వాడి భార్యా..పిల్లలూ మొన్ననే అమెరికా నుంచి వచ్చారు..వచ్చే శనివారం నాడు వాళ్ళు మొగిలిచెర్ల కు వచ్చి..ఆ దత్తాత్రేయ స్వామి ని దర్శించుకుంటారు..నీకు వీలుంటే వాళ్లకు ఒక రూమ్ అట్టి పెట్టు..వాడిని నువ్వు చూడలేదు..అక్కడికి రాగానే నా పేరు చెపుతాడు.." అని ఫోన్ లో చెప్పారు.."అలాగేనమ్మా.." అన్నాను..కామేశ్వరి గారి స్వస్థలం నెల్లూరు..మాకు వారి కుటుంబం తో దూరపు బంధుత్వం కూడా వున్నదని మా అమ్మా నాన్న గార్లు (శ్రీ పవని శ్రీధరరావు, నిర్మల ప్రభావతి గార్లు )  చెపుతుండేవారు..మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు సిద్ధిపొందిన తొలినాళ్లలో కామేశ్వరి గారు తన భర్త తో కలిసి మాలకొండకు వచ్చారు..అక్కడ మా తల్లిదండ్రుల ద్వారా శ్రీ స్వామివారి గురించి విని..వాళ్ళతో పాటే అదే ఎడ్ల బండిలో మొగిలిచెర్ల కు వచ్చారు..ఆరోజు రాత్రికి మా ఇంట్లోనే బస చేసి..ప్రక్కరోజు ఆదివారం నాడు ఉదయాన్నే శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకున్నారు..స్వామివారి సమాధి ని దర్శించగానే..కామేశ్వరి గారు ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు..ఐదారు నిమిషాల పాటు ఆవిడ వెక్కి వెక్కి ఏడ్చారు..మా తల్లిదండ్రులకు అర్ధం కాలేదు..కొద్దిగా ఆందోళన పడ్డారు..మరి కొద్దిసేపటికి కామేశ్వరి గారు అక్కడే నేల మీద పడుకొని కళ్ళు మూసుకున్నారు..


"కామేశ్వరి అప్పుడప్పుడూ ఇలా ప్రవర్తిస్తుందండీ..చాలా మంది డాక్టర్ల కు చూపించాను..ఫలితం లేదు..ఒక్కొక్కసారి గంటసేపు అలానే వుంటుంది.." అని ఆవిడ భర్త చెప్పారు.."మరేం భయం లేదు నాయనా..అమ్మాయికి త్వరలో నయమవుతుంది..స్వామివారి వద్ద అమ్మాయిలోని ఈ చేష్ట బైటబడింది..ఇక ఇబ్బంది రాదు.." అని మా అమ్మగారు ఆయనతో చెప్పారు..మరో అరగంటలో కామేశ్వరి గారు లేచి కూర్చున్నారు.."ఏదో భయంకరమైన బరువున్న వస్తువు నా తల లోంచి తీసివేసినట్లు గా ఉంది వదినా..చల్లటి చేయి నా నుదిటి మీద పెట్టినట్లు అనిపించింది.." అని కామేశ్వరి గారు చెప్పారు..స్వామివారి సమాధికి అందరూ నమస్కారం చేసుకొని తిరిగి వచ్చారు..మరో ఆరు నెలల తరువాత కామేశ్వరి గారు మా అమ్మగారికి ఉత్తరం ద్వారా..స్వామివారి సమాధి దర్శించుకున్న రోజు నుంచీ మళ్లీ ఈరోజు వరకూ తనకు ఎలాటి వికారమూ కలుగలేదని..తాను సుఖంగా కాపురం చేసుకుంటున్నాననీ తెలిపారు..ఆ తరువాత కొన్నాళ్ళకు వాళ్ళు మద్రాస్ (చెన్నై) వెళ్లి..అక్కడే స్థిరపడ్డారు..కామేశ్వరి గారి భర్త గారు జీవించి ఉన్న రోజుల్లో..ప్రతి సంవత్సరం ఆ దంపతులు స్వామివారి సమాధి దర్శించుకొనే వారు..ఆ తరువాత..కామేశ్వరి గారు ఇంటికే పరిమితం అయ్యారు..


ఆ ప్రక్క శనివారం నాడు కామేశ్వరి గారి అబ్బాయి కృష్ణమోహన్..తన భార్యా పిల్లలతో కలిసి శ్రీ స్వామివారి మందిరానికి వచ్చాడు..ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి అడిగాడు..పల్లకీసేవ లో పాల్గొంటానని చెప్పాడు.."ప్రసాద్ గారూ ఇక్కడికి రావడానికి ఒక ముఖ్య కారణం వుందండీ..మా అమ్మాయికి ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల వయసు..అప్పుడప్పుడూ కడుపులో నొప్పి అని మెలికలు తిరిగిపోతుంది..భరించలేనంతగా బాధ పడుతుంది..అలా రెండు మూడు గంటలు బాధపడుతుంది..మళ్లీ తగ్గిపోతుంది..అక్కడ డాక్టర్లకు చూపించాను..కానీ సంతృప్తి లేదు..ఎప్పుడు ఆ నొప్పి వస్తుందో తెలీదు..తాత్కాలికంగా కొన్ని మాత్రలు వాడుతుంది..శాశ్వత పరిష్కారం కనబడలేదు..అమ్మతో చెపితే..ఇక్కడికి వెళ్లి స్వామివారి సమాధి వద్ద అమ్మాయి చేత మొక్కుకోమని చెప్పు..ఆ స్వామి దయ ఉంటే అన్నీ సర్దుకుంటాయి..అని మమ్మల్ని బలవంతం చేసి..తన అనుభవం కూడా చెప్పి..ఇక్కడికి పంపిందండీ..అందుకోసం వచ్చాము.." అన్నాడు.."ఈరోజు పల్లకీసేవ లో పాల్గొనండి..రేపుదయం స్వామివారి సమాధి వద్దకు వెళ్లి ప్రార్ధించండి.." అని చెప్పాను..అలాగే అన్నారు..


ప్రక్కరోజు ఉదయం ప్రభాతసేవ పూర్తి కాగానే..కృష్ణమోహన్ తన కుటుంబం తోసహా స్వామివారి సమాధిని దర్శించుకొన్నాడు..తరువాత స్వామివారి ఉత్సవమూర్తి వద్ద అర్చన చేయించుకున్నాడు..అందరూ వెళ్లి మంటపం లో కూర్చున్నారు..సరిగ్గా అరగంట తరువాత..కృష్ణమోహన్ కూతురు ఒక్కసారిగా ఏడవటం మొదలుపెట్టింది..మంటపం లో పడుకొని..అటూ ఇటూ పొర్లడం చేయసాగింది..ఒక పది పదిహేను నిమిషాలు అలా చేసి..కళ్ళు మూసుకొని పడుకుంది..కృష్ణమోహన్, అతని భార్యా తల్లడిల్లి పోతున్నారు..మరో పది నిమిషాలకు ఆ అమ్మాయి లేచి కూర్చుంది..తన తల్లి వద్దకు వెళ్లి..ఆవిడ ఒళ్ళో తల పెట్టుకొని పడుకున్నది.."ఎలా ఉన్నది నీకు.." అని ఆవిడ ఆ అమ్మాయిని అడిగింది.."ఇప్పుడు బాగానే ఉంది అమ్మా.." అన్నది..ఆరోజు మధ్యాహ్నం దాకా ఆ కుటుంబం ఆ మంటపం లోనే వున్నారు..సాయంత్రం తిరిగి స్వామివారి సమాధి మరోసారి దర్శించుకొని వెళ్లిపోయారు..


మరో రెండు నెలల తరువాత..కృష్ణమోహన్ నాకు ఫోన్ చేసి..ఆరోజు తరువాత అమ్మాయికి మళ్లీ నొప్పి రాలేదని చెపుతూ.."ఏమిటో విచిత్రంగా ఉంది ప్రసాద్ గారూ..మా అమ్మకూ స్వామివారే నయం చేశారు..నా కూతురికి స్వామివారే నయం చేశారు..మా అమ్మ చెప్పినప్పుడు...మొదట్లో నేను చాదస్తం అని అన్నాను..కానీ ఆవిడ బలవంతం చేసి అక్కడికి పంపడం..అమ్మకు ఎలా జరిగిందో..నా కూతురికీ అలానే జరగడం..అంతా మాయ లాగా ఉన్నది..ఊహకు అందడం లేదు..స్వామివారికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా తెలియడం లేదు..మరో రెండు నెలల్లో మేము ఇండియా వచ్చేస్తున్నాము..ఇక అక్కడే ఉంటాము..రాగానే స్వామివారి దర్శనం చేసుకుంటాము..స్వామివారి వద్ద ఒక శనివారం, ఆదివారం అన్నదానానికి అయ్యే ఖర్చు నేను భరిస్తాను..కాదనకండి.." అన్నాడు.."మరో రెండురోజుల్లో దత్తదీక్ష ప్రారంభం అవుతుంది..ఆ సమయం లో దీక్షాధారుల అన్నప్రసాదం కొరకు విరాళంగా ఇవ్వండి.." అన్నాను.."అలా అయితే ప్రతి ఏడూ దత్తదీక్ష సమయం లో మా కుటుంబం కొఱకు రెండురోజులు అట్టిపెట్టండి..ఆ అవకాశం మాకు ఇవ్వండి..స్వామికి నేరుగా ఏమీ సమర్పించలేము..కానీ దీక్ష తీసుకున్న స్వాములకు ఆహారం అందించినా..అది స్వామివారికే చెందుతుంది.." అన్నారు.. 


మరో గంట తరువాత కామేశ్వరి గారు ఫోన్ చేసి.."మా వాడు నీతో మాట్లాడాడు కదా..స్వామివారు నాకు మరో మేలు చేసారు నాయనా...మా అబ్బాయి ఇక ఇక్కడే వుంటాడట..నాకూ ఈ వయసులో తోడు కోసం వాళ్ళను ఇక్కడికి రప్పిస్తున్నారు..ఆయన్ను నమ్ముకున్నాను..నా బాగోగులు ఆయనే చూసుకుంటున్నారు.." అన్నారు..కామేశ్వరి గారు మరో మూడేళ్లకు మరణించారు..ఆవిడ ఏలోటూ లేకుండా తృప్తిగా కన్నుమూశారు..కృష్ణమోహన్ కుటుంబం స్వామివారి దర్శనానికి అప్పుడప్పుడూ వస్తూనే వున్నారు..ఆయన కూతురు వివాహం చేసుకొని..ఇప్పుడు హాయిగా కాపురం చేసుకుంటోంది..


నమ్మినవాళ్ళ బాగోగులు స్వామివారే చూసుకుంటారు..ఇది సత్యం!!


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..స్పీసర్ నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

గోళీసోడా తాగు#.

 #గోళీసోడా తాగు#. 

&&&&&&&&&&&&&

తిరునల్వేలికి చందిన శివం పరమాచార్య స్వామివారి భక్తుడు. స్వామివారి దర్శనార్థమై అప్పుడప్పుడు కాంచీపురం వస్తుంటాడు. ఎప్పుడు దర్శనానికి వచ్చినా, స్వామివారి దగ్గరకు వెళ్ళడం కాని, వారితో మాట్లాడడం కాని చేసేవాడు కాదు. కేవలం స్వామివారి ముందు కూర్చుని వారిని చూస్తూ సంతోషపడేవాడు. ఒక్కోసారి అలా కొన్నిరోజులపాటు చేసేవాడు. ఈ శివన్ చాలా సాత్వికుడు. ఆహారపు అల్వాట్లు కూడా చాలా సాత్వికమైనవే. ఎప్పుడూ నుదుటన విభూతి పెట్టుకునేవాడు. అతని ఆహార్యము, పనులు చూడగానే చాలా భక్తి తత్పరుడు అని ఎవరికైనా తెలుస్తుంది. 


ఒకసారి దర్శనం తరువాత సెలవు పుచ్చుకోవడానికి స్వామివద్దకు వెళ్ళాడు. సమాన్యంగా స్వామివారు వెళ్ళమన్నట్టు చేతితో సంజ్ఞ చేసేవారు. కాని ఆరోజు శివంతో స్వామివారు, “బయలుదేరుతున్నవా? సరే కనీసం వెళ్ళే దార్లో సోడా అయినా తాగు” అని సెలవిచ్చారు. 


శివం తన ఊరికి బయలుదేరాడు. చంగల్పేట్ కు వచ్చి తిరునల్వేలికి బయలుదేరాడు. అదే బస్సులో ఆకతాయిలైన ఒక నలుగురు యువకులు కూడా ఎక్కారు. చాలా అల్లరి చేస్తూ ప్రయాణీకులతో గొడవపడుతూ వారికి ఇబ్బంది కలిగిస్తూ ప్రయాణిస్తున్నారు. శివం తనపాటికి తాను ఊరికే కూర్చున్నాడు. ఆ తిరునల్వేలికి వెళ్ళే బస్సు మధురై దరిదాపుల్లో ఉండగా, ఒక చిన్న గ్రామంలో ఆపారు. శివం బస్సులో నుండి బయటికి చూడగా, ఒకచిన్న అంగడిలో గోళీసోడా వరుసగా పేర్చబడి ఉంది. పరమాచార్య స్వామివారు మాటలు గుర్తుకురావడంతో, అతడికి కూడా కొద్దిగా దాహంగా అనిపించడంతో బస్సుదిగి వెళ్ళి సోడా తాగడానికి అంగడి దగ్గరకు వెళ్ళాడు. 


సోడాతాగి బస్సు ఎక్కి తన సీటువద్దకు రాగానే అక్కడ ఉండాల్సిన తన సంచీ కనబడలేదు. అతని సంబంధించిన వస్తువులు, డబ్బు మొదలైనవి అందులోనే ఉంచుతాడు. ఆ గాభరాలో ఉండాగా ఆ నలుగురు యువకులు అమర్యాదగా అతడిపై అరుస్తూ, “నీ సంచీ వెనుకనున్న సీట్లలో పడేసాము. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. మాకు ఈ సీటు కావాలి” అని నిర్లక్ష్యంగా చెప్పారు. 


శివం తన సంచీ ఉన్న సీటు దగ్గరికి వెళ్ళి కూర్చుని ప్రయాణం కొనసాగించాడు. సరిగ్గా గంట ప్రయాణం తరువాత అతను పర్యాణిస్తున్న ఆ బస్సుకు పెద్ద ప్రమాదం జరిగింది. అతను ఇంతకు ముందు కూర్చున్న సీట్లో కూర్చున్న ఇద్దరు కుర్రవాళ్ళు మృత్యువాత పడ్డారు. 


శివం ఆ సంఘటనను చూసి మ్రాన్పడిపోయాడు. ఎప్పుడూ లేనిది పరమాచార్య స్వామివారు సోడా తాగమని ఎందుకు చెప్పారో, ఆ బస్సు అక్కడ ఎందుకు ఆగిందో, అతను ఆ అంగడిలోని సోడాను ఎందుకు చూసాడో, దాహార్తిగా అనిపించి బస్సు దిగి సోడా ఎందుకు తాగాడో అన్నీ అతనికి అర్థమై కళ్ళముందు మెదలసాగాయి.


పరమాచార్య స్వామివారి కారుణ్యం అంత గొప్పది. 


శ్రీ చారుకేశి, శక్తి వికటన్ ప్రచురణ... **కంచిపరమాచార్యవైభవం*.!!!

గీర్వాణ వాణి

 గీర్వాణ వాణి 


వృథా వృష్టిః సముద్రేషు వృథా తృప్తేషు భోజనం

వృథా దానం ధనాఢ్యేషు వృథా దీపో దివాపి చ.


సముద్రంలో వర్షం కురవటం , తృప్తుడైనవానికి మళ్ళీ భోజనం పెట్టటం వృథా. ధనవంతునకు దానం చేయటం, పగటిపూట దీపం వెలిగించటం వృథా.

ముసలితనం

 *విధి విసిరే చివరి అస్త్రం "ముసలితనం"*


వృద్ధాప్యపు బందిలదొడ్డిలో నువ్వు  ఒంటరివి.

వృద్ధోపనిషత్ లోని  ప్రతీ పేజీ 'మసకే', సాయం తక్కువ. సలహాలు ఎక్కువ. మనిషి ఏడో ఋతువే "వృద్ధాప్యం".

కాలధర్మంలో దేహధర్మమే "వృధ్ధాప్యం".

మంచం మీద వెల్లకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు. గగనంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి. ఈ లోకంలో పుట్టిన ప్రతీవాడు"వృద్ధోపనిషత్"

లో భాగస్వామి కాక తప్పదు. జీవితం భళ్లున తెల్లవారుతుంది. మెల్లగా చీకటి పడుతుంది. వృద్ధుడికి వెన్నుపై కళ్ళుంటాయన్న ఓ నానుడి 

వుంది. అంటే వృద్ధాప్యంలో వెనుక చూపే తప్ప ముందు చూపు వుండదు. జీవితంలో మనం ఎన్నో సాధించి ఉండవచ్చు గాక. మన కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చు గాక అయితే వృద్ధాప్యంలో  దాన్నెవరూ గుర్తించరు. అసలు పట్టించుకోరు.‌ ఓ సారి సీనియర్ సిటిజన్ బడిలోకి అడుగుపెడితే సమాజం మన గురించి పట్టించుకోదు. పాత వస్తువులా ఓ పక్కన పడేస్తుంది. "ఆరోజుల్లో నేను" అంటూ గత వైభవ చర్విత చర్వణం తప్ప భవిష్యత్ ఆలోచన వుండదు. కాళ్ళు, కీళ్ళు, ఒళ్ళు సడలి, కదల్లేక, మెదల్లేక, దేహాన్ని వదల్లేక, ఏమీ చేయలేక, వృద్ధులు పడే మనోవ్యధ అంతా ఇంతా కాదు.‌

వృద్ధాప్యం అనేసరికి అదేదో శాపంగా భావిస్తుంటారు జనం. నిజానికి వృద్ధాప్యం శాపమో

పాపమో కాదు. అది ప్రకృతి పరమధర్మం. వృద్ధాప్యం రాగానే బయటివాళ్ళు సరే కుటుంబ సభ్యులు‌ కూడా చులకనగాచూస్తారు. నిన్న మొన్నటిదాకా తలొంచిన వానపాములు సైతం 

తలెగరేసి, నిలదీస్తాయి. లెక్కలు అడగటం మొదలెడతాయి.

"ఏమండీ / నాన్నగారూ." అంటూ విధేయంగా వుండే  భార్యాపిల్లలు కూడా ధిక్కరించడం మొదలు పెడతారు. వాళ్ళేదో పుడింగులన్నట్లు లేనిపోని సలహాలు, సూచనలిస్తుంటారు. ఏంమాట్లాడినా, యేం చేసినా వాళ్ళకు నచ్చదు సరికదా 'చాదస్తం' అంటూ కరివేపాకులా తీసిపారేస్తారు. లోకువగా చూస్తారు. మధ్యతరగతి కుటుంబం అయితే, మనం సంపాదించిన డబ్బు ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా? లేక చూసీ చూడనట్టు మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో మన పక్క గదిలో మనవాళ్ళే చర్చిస్తూ ఉంటారు.

అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్క గదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లవారుతుంది. ఆరాత్రి నిద్ర కరువవుతుంది.

చివరి మజిలీ !!

మనిషి జీవన ప్రయాణంలో చివరి మజిలీ వృద్ధాప్యం. మనం కాదనుకున్నా కూడా కోరి వస్తుంది వృధ్ధాప్యం. మనిషి జీవితం ఋతువులతో ముడిపడి వుంటుంది. వసంత ఋతువుతో మొదలయ్యే కాలం శిశిరంతో ముగుస్తుంది. వసంతకాలం మన పుట్టుక అనుకుంటే, శిశిరం వృద్ధాప్యం. వసంతంలో ప్రకృతి ఆకుపచ్చగా, రంగురంగుల పూలతో మురిపిస్తుంది.మనసు ఉల్లాసభరితమవుతుంది. ఇక శిశిరానికొచ్చేసరికి ఆకులు పండి, ఎండి, రాలి, చెట్లు మోడులవుతాయి. అలాగే వృద్ధాప్యంలో మనిషి దేహం కూడా ఒడలి, ఎండిన మోడవుతుంది. అయితే వృద్ధాప్య దశకు చేరుకున్నారంటే జీవితంలో వాళ్ళు ఎన్నెన్ని చూసివుంటారు. ఎంత అనుభవంగడించి వుంటారో!ఒక్క సారి ఆలోచిస్తే తెలుస్తుంది. అందుకే వృద్ధుల్ని భారంగా కాకుండా గౌరవంగా చూడాలి. వారి అనుభవాన్ని యువతరం చూపుడువేలుగా తీసుకొని ముందుకు నడవాలి.

అప్పుడు వాళ్ళ భవిష్యత్తు మహత్తరంగా వుంటుంది. కానీ దురదృష్టంయేమంటే, వృద్ధుల్ని గౌరవించడం అటుంచి  అసలు లెక్కేచేయరు. కొందరైతే ముసలాళ్ళను భరించలేక  వృద్ధాశ్రమాల పాలు చేస్తారు. ఇవాళ మనం చేసిందే రేపు మన పిల్లలు కూడా చేస్తారన్న సోయి ఏమాత్రం వుండదు.

ఏతావాతా వృద్ధాప్యం శాపంగా మారుతుంది. యవ్వనంలో హెల్త్ ఇన్సూరెన్స్ మానేసి ఆ డబ్బు పిల్లల కాలేజీ ఫీజు కట్టేస్తాం. మధ్య వయసులో సంపాదించింది ఖర్చుపెట్టి పిల్లల్ని విదేశాలకు పంపుతాం. నా కొడుకు అమెరికాలోనో, ఇంకేదో దేశంలో వున్నాడనో, కూతురు ఆస్ట్రేలియా లోనో ఇంకేదో దేశంలో ఉన్నదనో గర్వంగా చెప్తూ ఫాల్స్ ప్రిస్టేజి ఫీలవుతాం. అంతా బాగానే వుంటుంది. పిల్లలూ విదేశాల్లో సెటిలైపోయి బాగుంటారు. మన వృద్ధాప్యంలో మాత్రం వాళ్ళు కనీసం చూడటానికి

కూడా రారు. అప్పుడప్పుడు సీజనల్ గా వచ్చే సెల్ ఫోన్ కాల్స్ తోనే సరిపెట్టుకోవాలి. తృప్తి పడాలి. కొడుకో, కూతురో, మనవడో గుర్తొచ్చి, వాళ్ళతో మాట్లాడాలని ఫోన్ చేస్తే 'సారీ.! బిజీ.' అంటూ సమాధాన మొస్తుంది.

పుట్టిన కొత్తలో పక్క మీద శిశువు నెలల తరబడి కదలకుండా ఎలా ఉంటుందో, వృద్ధాప్యంలో తిరిగి అదే పరిస్థితి సంభవిస్తుంది. అయితే ఒకటే చిన్నప్పుడు ఆలనాపాలనా చూసుకోవటానికి కన్నతల్లి

ఉంటుంది. వృద్ధాప్యంలో ఎవరూ వుండరు. అదృష్టం

బాగుంటే అప్పుడప్పుడూ వచ్చి పలకరించే కూతురు తప్పదన్నట్టు సేవలు చేసే కోడలూ వుండొచ్చు.

అనాథాశ్రమంలో అయితే  వాళ్ళు కూడా ఉండరు.

అయితే ఇది అందరికీ జరుగుతుందని కాదు.

కొందరుంటారు అదృష్టవంతులు తల్లిదండ్రుల్ని  ప్రేమించే పిల్లలూ వుంటారు. అలాంటివాళ్ళు తల్లిదండ్రులు వృద్ధులైనా నెత్తిన పెట్టుకొని ఎంతో ప్రేమతో చూసుకుంటారు. బతుకంతా బుద్ధిబలం మీద ఆధారపడ్డ వారికి ముసలితనం కన్నా పెద్ద శిక్ష వుండదేమో? బాగా

బతికిన మహామహులే ముసలితనం రాగానే దిగజారి హీనమై పోవడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి అవస్థను

తలుచుకుంటేనే భయమేస్తుంది. భగవాన్.!

ఇలాంటి దురవస్థ ఎవరికీ రాకూడదు. ఇందులో నుంచి అందర్నీ తప్పించు తండ్రీ.

వృద్ధాప్యం శాపం కాదు.

ఓ వరం. 

ఏకాంతంలో సంగీతాన్ని వింటూ కాలక్షేపం చెయ్యొచ్చు.

ఓపిక, సదుపాయముంటే పెరటి మొక్కల్ని పరిరక్షిస్తూ కాలం గడపోచ్చు.

చిన్న పిల్లలుంటే కొద్ది సేపు వారికి ఇంటరెస్టు ఉన్న టాపిక్స్ కబుర్లు చెప్పుకోవచ్చు, ఆడుకోవచ్చు.

ఏం చేసినా అఫెక్షన్ బ్యాంక్ లో ఆప్యాయతని క్రెడిట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే మనం మానసికంగా ఇలా ప్రిపేర్ అవుతామో? మన 

వృద్ధాప్యాన్ని ఓ పది సంవత్సరాలపాటు వాయిదా వెయ్యొచ్చు.

సో… ఇప్పటికే సీనియర్ సిటిజన్స్ అయిన వారు,

భవిష్యత్తులో సీనియర్ సిటిజన్స్ కాబోయేవారు జీవితాల మీద ఓ లుక్కేసి వుంచుకోండి.!🙏

ఆలోచనాలోచనాలు

 ((((( ఆలోచనాలోచనాలు ))))) సంస్కృత సూక్తి సుధ.🙏                                ***** సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్.                నబ్రూయాత్ సత్యమప్రియమ్!                  ప్రియంచ నానృతం బ్రూయాత్, ఏష ధర్మః , సనాతనః!                            భద్రం భద్రమితి బ్రూయాత్,    భద్రమిత్యేవ వావదేత్!!         ఎప్పుడూ నిజం చెప్పాలి. ఆ చెప్పే నిజాన్ని కూడా ఇష్టంతో చెప్పాలి. అయితే సత్యాన్నైనా అప్రియం చెప్పరాదు. అట్లాగే ప్రియమైనదైననూ, అసత్యం పలుకరాదు. ఇది అనాది నుండి వస్తున్న ధర్మం. భద్రం అనగా శుభం. కాబట్టి ఒకరికి ప్రియం పలికేటప్పుడు " భద్రం" అని పలకాలి.                        ***** యద్యత్పరవశం కర్మ, తత్తద్యత్నేన వర్జయేత్! యద్యదాత్మ వశంతుస్యాత్! తత్తత్సేవేత యత్నతః!!                           ఎప్పుడైనా సరే పరాధీనమైన కార్యాలను విడిచిపెట్టాలి. తన అధీనమైన పనిని ఎంత ప్రయత్నించి అయినా పూర్తి చెయ్యాలి.                    ***** సర్వం పరవశం దుఃఖం, సర్వమాత్రవశం సుఖం, ఏతద్విద్యాత్సమాసేన లక్షణం సుఖ దుఃఖయోః!!      పరాధీనమైన పనులన్నీ కూడా దుఃఖాన్ని తెచ్చిపెడతాయి. తన అధీనమైన పనులన్నీ ఎప్పుడూ సుఖాన్ని కలిగిస్తాయి.                         ***** విప్రాణాం జ్ఞానతో జ్యేష్ఠః, క్షత్రియాణాంతు వీర్యతః ! వైశ్యానాం ధాన్యధనతః, శూద్రాణాం ఏవ జన్మతః!!                        బ్రాహ్మణులలో జ్ఞానం కలవాడే పెద్ద. క్షత్రియులలో బలపరాక్రమాలు గలవాడే పెద్ద. వైశ్యులలో ధనధాన్యసంపత్తి కలవాడే పెద్ద. శూద్రులలో వయస్సు మీరినవాడిన వ్యక్తినే పెద్దగా గౌరవిస్తారు.                ***** విత్తం బంధుర్వయః కర్మ, విద్యా భవతి పంచమీ, ఏతాని మాన్యస్థానాని గరీయో యద్యదుత్తరమ్!!                  ధనికుని కంటే బంధువు శ్రేష్ఠుడు. బంధువు కంటే వయో వృద్ధుడు శ్రేష్ఠుడు. వయోధికుని కంటే క్రియావంతుడు అధికుడు. క్రియావంతుని కంటే విద్యావంతుడు అధికుడు. విద్యావంతుని కంటే మిగిలినవారు క్రమంగా తక్కువని భావం.               ***** న స్నానమాచరెద్సుక్త్వా, నాతుం నమహానిశి,                   నవా సోభి ర్వినాజస్రం, నవిజ్ఞాతే జలాశయే!!            అన్న తిన్న తర్వాత స్నానం చెయ్యరాదు. రోగంతో ఉన్నప్పుడు, అర్థరాత్రి వేళ స్నానం చెయ్యకూడదు. వంటిపై వస్త్రములు లేకుండా స్నానం చెయ్యకూడదు. తనకు తెలియని మడుగులలో దిగి స్నానం చెయ్యకూడదు.                     ***** వైరిణం నోపసేవేత, సహాయం చైవ వైరిణః!          అధార్మికం తస్కరంచ, తదైవ పరయోసితమ్!!             శత్రువు, శత్రువుకు సహాయం చేసేవాడు, లేదా శత్రువుకు స్నేహితుడు, ధర్మహీనుడు, దొంగ, పరస్త్రీ -- వీరితో ఎప్పుడూ సహవాసం.చెయ్యరాదు. దీనివలన చిక్కులు, ఆపదలు ఏర్పడతాయి.        ***** క్షత్రియం చైవ సర్పంచ, బ్రాహ్మణంచ బహుశ్రుతం, నావ మన్యేత వై భూష్ణుః,కృశానపి కదాచన!!                             వృద్ధి లోకి రాదలచినవాడు ఎప్పుడైననూ రాజు(పాలకుని) తో‌, పాముతో, పండితుడైన విప్రునితో, వైరం ఉంచుకోకూడదు. ( దాని వలన తనకు మేలు జరుగకపోగా అపకారమే జరుగుతుంది)                    చివరగా ఒక " ఆర్య ధర్మానికి " సంబంధించిన ఒక మహత్తర శ్లోకం.            శతం విహాయ భోక్తవ్యం,        సహస్రం స్నానమాచరేత్!        లక్షం విహాయ దాతవ్యం,       కోటిం త్యక్త్వా హరిం భజేత్!!                                    తప కోసం వేచివున్న వందమందిని విడచి అయినా భోజనం చెయ్యాలి. అట్లాగే వెయ్యి మందిని విడచి స్నానం చెయ్యాలి. లక్షమందిని విడిచిపెట్టి అయినా దానం చెయ్యాలి. కోటి మందిని విడచిపెట్టి "" భగవత్ ధ్యానం"" చెయ్యాలి. అన్నిటికన్నా ముఖ్యం భగవద్ధ్యానం అని శ్లోక సారాంశం.                             తేది 29--10--2023, ఆదివారం, శుభోదయం.

శివవిష్ణు దేవుళ్ళ సల్లాపము

 శివవిష్ణు దేవుళ్ళ సల్లాపము...


విష్ణువు: ఈ వస్త్రమేమిటయ్యా!?

శివుఁడు: ఏనుగును తరింపఁజేయు విధమున,

విష్ణువు: సర్పహారమో!?

శివుఁడు: పానుపున,

విష్ణువు: విషాహారమెక్కడిది?

శివుఁడు: కాళీయసర్ప మద దమన నాట్య లీల

విష్ణువు: గంగ ధార ఎందుకయ్యా!?

శివుఁడు: త్రివిక్రముని కాలిగోటి నుంచి ఉద్ధరింౘబడినట్టిది.


  ఇలా శ్రేయఃపరమైన శ్రీశుఁడైన (లక్ష్మీపతి) విష్ణు భగవానుని మఱియు శ్రీశుఁడైన (విషహరుఁడు) శివ దేవుని పరస్పర లీలలు లోకమునకు కళాత్మకమైన సద్గతులనొసంగునవిగా నిలుౘుగాక.

పంచాంగం 29.10.2023 Sunday

 ఈ రోజు పంచాంగం 29.10.2023  Sunday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస కృష్ణ పక్ష: ప్రతిపత్తి తిధి భాను వాసర: భరణి  నక్షత్రం సిద్ది యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం ఇది ఈరోజు పంచాంగం.


పాడ్యమి రాత్రి 01:55 వరకు.

భరణి రా.తె 04:41 వరకు .

సూర్యోదయం : 06:17

సూర్యాస్తమయం : 05:42

వర్జ్యం : మధ్యాహ్నం 03:01 నుండి 04:32 వరకు.

దుర్ముహూర్తం : సాయంత్రం 04:11 నుండి 04:56 వరకు.


రాహుకాలం : సాయంత్రం  04:30  నుండి 06:00 వరకు 


యమగండం : మద్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.  



శుభోదయ:, నమస్కార:

పూజాకార్యక్రమాల సంకల్పము

 **********

*శుభోదయం*

*********

సంధ్యా వందన మరియు

 ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ. 29.10..2023

ఆది వారం (భాను వాసరే) 

**************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ  సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే

శరదృతౌ

ఆశ్వయుజ మాసే కృష్ణ పక్షే ప్రతి పత్తిథౌ (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భాను వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.


ఇతర పూజలకు

 శ్రీ శోభకృత్  నామ సంవత్సరే దక్షిణాయనే

శరత్ ఋతౌ  ఆశ్వయుజ మాసే  కృష్ణ పక్షే ప్రతి పత్తిథౌ

భాను వాసరే అని చెప్పుకోవాలి.


ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.6.01

సూ.అ.5.28

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 


శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు

ఆశ్వయుజ మాసం 

కృష్ణ పక్షం పాడ్యమి రా.12.25 వరకు. 

ఆది వారం. 

నక్షత్రం అశ్వని ఉ.6.59 వరకు.


అమృతం రా. 1.38 ల 3.11 వరకు. 

దుర్ముహూర్తం సా.3.57 ల 4.43 వరకు.

వర్జ్యం సా. 4.18 ల‌ 5.51 వరకు .

యోగం సిధ్ధి రా.10.10 వరకు.

కరణం బాలవ మ.1.07 వరకు.

కరణం కౌలవ రా.12.26 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే.

రాహు కాలం సా. 4.30 ల 6.00 వరకు. 

గుళిక కాలం మ. 3.00 ల 4.30 వరకు. 

యమగండ కాలం మ.12.00 ల 1.30వరకు. .

.***********

పుణ్యతిధి ఆశ్వయుజ బహుళ పాడ్యమి. 

.**********

*శ్రీ పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,

(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)

S2,/C92, 6 -3 -1599/92,బి 

Sachivalayanagar,

Vanasthalipuram,

Rangareddy Dist, 500 070,

80195 66579.

.**********

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

*శ్రీ స్వామివారి కోరిక...*

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

  

*శ్రీ స్వామివారి కోరిక...*


*(పదకొండవ రోజు)*


శ్రీధరరావు గారితో కేశవులు గారికి పరిచయం ఏర్పడ్డాక..శ్రీ స్వామివారి గురించి ఇద్దరూతరచూ ముచ్చటించుకునే వారు..కాలం గడచిపోతోంది..

శ్రీ స్వామివారి గురించిన ప్రాథమిక సమాచారం విన్న ప్రభావతి గారి మనసులో ఏమూలో వున్న చిన్నపాటి సందేహాలు కూడా తీరిపోయాయి..ఒక నిజమైన సాధకుడికి సేవ చేసుకునే భాగ్యం తమ దంపతులకు కలిగిందని ఎంతో ఆనందపడ్డారు..నిజానికి శ్రీధరరావు గారు మొదటినుంచీ శ్రీ స్వామివారు సాధారణ మానవ మాత్రుడు కాదని..ఒకానొక సిద్ధపురుషుడు ఈ రూపంలో తమ దగ్గరకు వచ్చాడని భావిస్తూ వున్నారు..అదే నిజమయ్యింది..శ్రీ స్వామివారి పరిచయం తరువాత ఆ దంపతుల జీవన శైలిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి..


శ్రీధరరావు, ప్రభావతి దంపతులు యధావిధిగా ప్రతి శనివారం మాలకొండకు వెళ్లి వస్తున్నారు..మాలకొండ వెళ్లిన ప్రతిసారీ శ్రీ స్వామివారిని కలిసిరావడం వారి పర్యటనలో ఒక భాగం అయిపోయింది..శ్రీ స్వామివారు కూడా ఈ దంపతులు వచ్చేసమయానికి కొద్దిగా అటూ ఇటుగా..పార్వతీదేవి మఠానికి చేరుకునేవారు..ఒక్కొక్కసారి ఆయన తపస్సాధన లో మునిగిపోయివుంటే..శ్రీధరరావు గారు ప్రభావతి గారు కొద్దిసేపు ఎదురుచూసి..తిరిగి తమ గ్రామానికి చేరుకునేవారు..


అలా ఒక శనివారం సాయంత్రం నాలుగు, ఐదు గంటల ప్రాంతంలో..శ్రీ స్వామివారిని కలుద్దామని ఈ దంపతులిద్దరూ పార్వతీదేవి మఠం వద్ద వేచి ఉన్నారు..కొద్దిసేపటికే శ్రీ స్వామివారు శివాలయం వద్దనుంచి మెల్లిగా దిగివచ్చి..పార్వతీదేవికి సాష్టాంగ నమస్కారం చేసుకుని..వీరిద్దరి ఎదురుగ్గా పద్మాసనం వేసుకుని కూర్చున్నారు..ఆయన ముఖం ఎంతో ప్రశాంతంగా ఉంది..చల్లటి చిరునవ్వు..ఆప్యాయత ఉట్టిపడే చూపు..ఉదయం నుంచీ మాలకొండ లక్ష్మీ నృసింహుడి దర్శనం.. ఆ తరువాత కొండ శిఖరం పై ఉన్న లక్ష్మీ అమ్మవారి ఆలయం..ఇవన్నీ ఎక్కి దిగి..మళ్లీ పార్వతీదేవి మఠం దాకా మెట్ల మార్గంలో వచ్చిన బడలిక అంతా..శ్రీ స్వామి వారి ప్రసన్న వదనం చూడగానే మటుమాయం అయింది..


"ధ్యానం లో ఉండగా బ్రాహ్మణ దంపతులిద్దరూ వచ్చారని ఆదేశం వచ్చిందమ్మా..వెంటనే లేచి ఇలా వచ్చేసాను..శ్రీధరరావు గారూ మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి..అమ్మవారి ఆజ్ఞ కూడా అయింది..చెప్పమంటారా?.." అన్నారు శ్రీ స్వామివారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని.."చెప్పండి.." అన్నారు..


"ఈ మాల్యాద్రి లక్ష్మీ నృసింహుడి కొండమీద..ఈ శివ పార్వతుల సమక్షం లో నా తపస్సాధన పూర్తి అయింది..త్వరలో నేను ఆశ్రమం నిర్మించుకొని...అందులో కొరవ సాధన చేసి..మోక్ష ప్రాప్తిని పొందాలి..ఆశ్రమ నిర్మాణం కొరకు నాకు స్థలం కావా!ఈ..అది మీరు ఏర్పాటు చేయాలి.." అన్నారు గంభీరంగా..


శ్రీధరరావు ప్రభావతి గార్లు ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు..వాళ్ళిద్దరి హృదయాలలో శ్రీ స్వామివారి కోరిక కలవరం కలిగించింది..మళ్లీ ఇద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు..ప్రభావతి గారు ఏదో అడుగబోయేంతలో శ్రీధరరావు గారు కల్పించుకుని.."మీరు త్వరపడకండి స్వామీ..మేము ఇంటికెళ్లి ఆలోచించుకుని మళ్లీ మిమ్మల్ని కలుస్తాము..సావకాశంగా ఈ విషయం గురించి మాట్లాడుకుందాము..మనం కూర్చుని కూలంకషంగా చర్చించుకుని ఆపై ఒక నిర్ణయానికి వద్దాము.." అన్నారు..


శ్రీధరరావు గారు ఎంతో సంయమనంతో చెప్పిన మాటలు విన్న స్వామివారు.."మీరూ ఆలోచించండి..కానీ ఈ క్షేత్రం లో నా సాధన పూర్తి కావొచ్చింది..ఇక ఇక్కడ ఎక్కువ కాలం వుండే పరిస్థితి లేదు..మీరు చెప్పినట్లే మళ్లీ త్వరలో..( త్వరలో అన్నమాట శ్రీ స్వామివారు నొక్కి చెప్పారు..) ఈ సంకల్పం నెరవేరుతుంది..ఇప్పటికే పొద్దు కూకుతోంది..మీరు మళ్లీ మొగలిచెర్ల వెళ్ళాలి..ఇక బైలుదేరండి.." అన్నారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లు శ్రీ స్వామి వారికి నమస్కారం చేసి, పార్వతీదేవి మఠం వద్దనుండి మెట్లు దిగి, తమ గూడు బండిలో కూర్చుని మొగలిచెర్లకు పయనం అయ్యారు..


అప్పటిదాకా ఓపిక పట్టివున్న ప్రభావతి గారు..ఇక ఆగలేక పోయారు.."శ్రీవారూ..ఇదేమిటి?..ఈయన ఈ కోరిక కోరాడు?..పాపం కేశవులు గారు ఎంతో ఆశపెట్టుకుని ఆశ్రమం కొరకు  ఇస్తానన్న భూమి వద్దన్నారు..మనలను మాత్రం తానే అడిగారు..ఈ క్షేత్రం లో చేసే సాధన కన్నా..జన బాహుళ్యం లోకి వచ్చి, ఆశ్రమం కట్టుకొని చేసే సాధన ఏ విధంగా సాగుతుంది..సాధారణ మనుషుల మధ్యకు వస్తే..ఇతరత్రా కోరికలు పట్టవా?..మామూలు ప్రలోభాలకు లొంగిపోరా?.." అని అడిగారు..శ్రీధరరావు గారు మాత్రం నిశ్చింతగా.."నువ్వు ఇలా ఆవేశంగా మాట్లాడతావనే..నేను ముందుగా గ్రహించి..నేనే స్వామివారితో మళ్లీ చర్చిద్దామని చెప్పాను ప్రభావతీ..కాలం మన జీవితాలను ఏ మలుపు తిప్పుతుందో తెలీదు..అన్నీ పరిశీలిద్దాము..చూద్దాం..ఏం జరుగుతుందో.." అన్నారు..ఈ జవాబుతో ప్రభావతి గారు సంతృప్తి చెందలేదు..ఆవిడ మనసులో రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి..


శ్రీ స్వామివారి వివరణ... రేపటి భాగంలో..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్: 94402 66380 & 99089 73699).

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు -  ఆశ్వీయుజ మాసం - కృష్ణ పక్షం  - ప్రతిపత్ -   భరణి - భాను వాసరే* (29.10.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.



https://youtu.be/ScqNN_WjV_0?si=Swo-zK64uoVZ2FLp



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*