29, అక్టోబర్ 2023, ఆదివారం

ఓకాళహస్తీశ్వరా

 "ఇల్లో,ముంగిలియో,యనుంగుజెలులో,యీడైనచుట్టంబులో,/

ఇల్లాలో,కొడుకో,తరింపవశమే,యేపోఁడుముల్లేక? మా/

పల్లెం గోరినవెల్లనుంగలవు తెప్పల్గాఁగ నీకిచ్చెదన్/

జెల్లంబో! యిట నొంటినుండ కటు విచ్చేయంగదే లింగమా!


కాళహస్తి మహాత్మ్యము.-3వ ఆ-70 ప: ధూర్జటి మహాకవి;


ఓకాళహస్తీశ్వరా! ఈఅడవిలో ఒంటరిగా యెందుకున్నావయా? నీకిక్కడ యిల్లుందా?వాకలుందా? ప్రాణ స్నేహితులా? వరసైనబంధువులా? పెళ్ళామా,పిల్లలా? నీకెవరున్నారయ్యాయిక్కడ? చాల్చాల్లే! మాపల్లెకురా నీకపకోరినవన్నీ కో కొల్లుగా యిస్తా.ఇంకయీఒంటరిగా యీఅటవీ నివాసంచాలుగానీ ఓలింగమయ్యో! యికనైనా మాపల్లెకురావయ్యా!!


     తన్నిని నిరుపమానమైన భక్తికీపద్యంప్రతీక! తన్నడొకబోయ.పామరుడు.అడవిలో వేటాడవచ్చి అటనొకచెట్టునీడలో నున్న శివలింగమును జూచెను. పురాకృత సుకృత విశేషమున నాదేవదేవునిపై భక్తియంకురింప, తనపల్లియకు రమ్మని స్వామిని బ్రతిమిలాడుట,ప్రస్తుత విషయము.

         ధూర్జటి పాత్రోచితమైన భాషనుపయోగించి, యీఘట్టమునకు వన్నెగూర్చినాడు.ఈపద్యమునందు పఃరయోగింపఁబడిన పదములన్నియు తెలుగు పదములేయగుట గమనింపదగినయంశము.

          పామరుడగు తిన్నడు అమరభాషాపదములనుపయోగింపనేరడుగదా? అందుచేతనే దేసి పద ప్రయోగమునకే కవి ప్రాధాన్యమొసంగెను.

ఇల్లు,ముంగలి,చెలులు,చుట్టాలు,పెళ్ళాము,కొడుకు,పోడుమి,పల్లె,తెప్పలు,ఇత్యాదిగా నన్నియు నచ్చతెలుగులే"తరింప వశమే" అను తత్సమపదమిళిత సమాసమొక్కటిదక్క,తక్కినదంతయు తేటతెనుగులమూట!🌷🙏🙏🙏🕉️🙏🙏🙏🌷🌷🌷🌷💐🌷🌷🌷🌷💐💐🌷

కామెంట్‌లు లేవు: