29, అక్టోబర్ 2023, ఆదివారం

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 78*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 78*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*శక్తిని ప్రసారం చేయగల³ సమర్థత*


 నరేంద్రునిలోఒక అసాధారణ శక్తి పెంపొందడాన్ని గుర్తించాడు. ఆ శక్తిని పలువురికి ప్రసారం చేయడం ద్వారా వారి మనస్సులలో పరివర్తన కలిగించే సమర్థత తనకు ఉన్నట్లు అతడు గ్రహించాడు. 

 

శివరాత్రి పర్వదినాన  భజన, పూజ, ధ్యానాదుల సాధనలలో యువకులు మునిగి పోయారు. మొదటి యామ పూజ పూర్తయింది. ఒక్కొక్కరుగా పలువురు బయటికి వచ్చారు. తన హుక్కా సిద్ధం చేయమని నరేంద్రుడు ఒకరికి పురమాయించాడు. గదిలో కాళీ, నరేంద్రుడు మాత్రమే ఉన్నారు. 


అప్పుడు తనలోని శక్తిని పరీక్షించాలనే ఉత్సుకత నరేంద్రునిలో జనించింది. ఆతడు కాళీతో, "కాళీ, నేను ధ్యానం ప్రారంభిస్తాను. కాసేపయ్యాక నన్ను తాకు" అంటూ ధ్యానంలో మగ్నుడయ్యాడు.


బయటికి వెళ్లిన వ్యక్తి హుక్కా సిద్ధం చేసి తిరిగి వచ్చినప్పుడు సంభ్రమాశ్చర్యాలు కలిగించే ఒక దృశ్యం చూశాడు. నరేంద్రుడూ, కాళీ ధ్యానంలో లయించి ఉన్నారు. కాళీ కుడిచేయి నరేంద్రుని కుడి మోకాలు మీద ఉంది; ఆ చేయి వణకసాగింది. కాసేపటికి నరేంద్రుడు కళ్లు తెరిచాడు.


నరేంద్రుడు : కాళీ! చేయి తీసేయి. నీకు ఏమనిపించింది? 


కాళీ : విద్యుచ్ఛక్తి నా శరీరంలో ప్రసరించినట్లుగా అనిపించింది. నా చేతులు వణికాయి.


యువకుడు : నువ్వు నరేంద్రుని తాకడం వల్లనే నీ చేతులు వణికాయా? 


కాళీ అవును. ఎంత ప్రయత్నించినప్పటికీ నా చేతులు వణకడం ఆపలేక పోయాను.


శివరాత్రి పూజలు కొనసాగాయి. కాళీ ధ్యానంలో లయించిపోయాడు. ఇలా అతడు ప్రగాఢ ధ్యానంలో మునిగిపోవడం ఎవరూ ఇంతదాకా చూడలేదు. నరేంద్రుణ్ణి తాకడం వల్లనే ఇది సాధ్యమయిందని అందరూ భావించారు. '


వేకువజామున 4 గంటలకు నాలుగవ యామ పూజలు ముగిశాయి. అప్పుడు పూజామందిరంలోకి వచ్చిన శశి, నరేంద్రునితో, “గురుదేవులు నిన్ను పిలుస్తున్నారు” అన్నాడు. శశితోబాటు నరేంద్రుడు మేడ మీదకు వెళ్లాడు. ఆతణ్ణి చూడడమే ఆలస్యం, గురుదేవులు చీవాట్లు పెడుతున్న ధోరణిలో,


 "ఏమిటిది? పొదుపు చేయడానికి బదులు ఖర్చు చేయడమా? మొదట అవసరమైనంత మేరకు పొదుపు చేయి. ఎక్కడ ఎప్పుడు దానిని ఖర్చు చేయాలో తరువాతే నీకు తెలుస్తుంది, జగజ్జననే స్వయంగా దానిని నీకు గ్రహింపజేస్తుంది. నీ శక్తిని కాశీలోకి ప్రసరింపజేయడం ద్వారా అతడి కెంత హాని కలిగించావో తెలుసా? 

 

భఅతడు ఒక ప్రత్యేక మార్గంలో పురోగమిస్తున్నాడు. ఆరో నెలలో వాటిల్లిన గర్భస్రావంలా అది నిష్ప్రయోజనమైపోయింది. పోనీలే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదట ఆలోచనారహితంగా ఏ పనీ చేయవద్దు. ఇంకా నయం, మరింత అనర్ధం జరగక పోవడం కాళీ అదృష్టం" అన్నారు.


మౌనంగా నరేంద్రుడు బయటికి వచ్చేశాడు. 

( నరేంద్రుడు ఇలా అన్నాడు

"ఆశ్చర్యచకితుడనయ్యాను. పూజా సమయంలో జరిగింది యావత్తు ఆయనకు తెలిసిపోయింది. ఆయన నన్ను చీవాట్లు పెడుతున్నప్పుడు మౌనం వహించడం తప్ప మరేం చేయగలను!" )🙏


*సేకరణ :- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: