శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
రాజా! నేనింతవరకూ ఎప్పుడూ ఎవరిమీదా దేనికీ కోప్పడలేదు. ఇప్పుడు కూడా మిమ్మల్ని నేనేమీ
శపించలేదు. ఏ పాపమూ ఎరుగని నా కళ్ళు పొడిచిన పాపం బహుశ విన్నూ నీవాళ్ళనూ పట్టిపీడిస్తున్నట్టుంది.
దేవీభక్తులకు అపరాధం చేస్తే ఇంతే. హరిహరాదులయినా సరే దుఃఖాలపాలు కావలసిందే. శాస్తిఅనుభవించవలసిందే. ఇప్పుడు నేనేమి చెయ్యను, ఎలా జీవించాలి. అసలే వృద్ధుణ్ణి, ఇప్పుడు అంధుణ్ణి.
నాకు సేవలు ఎవరు చేస్తారు? ఎలా బతకను?
మహర్షీ! సేవకులను కావలసినంతమందిని నేను నియమిస్తాను. భక్తితాత్పర్యాలతో అహర్నిశలూ
నీకు సేవలు చేస్తారు. తపస్వులు అల్పక్రోధులన్నారు. ఇంతటితో మమ్మల్ని క్షమించమని మరొకసారి
అభ్యర్థిస్తున్నాను.
మహారాజా! గుడ్డివాడినైపోయాను. ఇదా నిర్జనారణ్యం. ఎలా తపస్సు చేసుకోగలను ? నువ్వు
సేవకుల్ని నియమిస్తావు, సరే వాళ్ళు శ్రద్ధగా సేవించొద్దూ! వాళ్ళు నీవాళ్ళు. నన్ను ప్రేమగా
చూసుకుంటారా ? క్షమించమని నిజంగా నువ్వు అడుగుతున్నట్టయితే ఒక పని చెయ్యి. నీ కుమార్తెను
నా సేవకు నియమించు. అది నాకు హాయిగా ఉంటుంది. నేను సంతృప్తి చెందితే నీకూ నీ సైనికులకూ
ఈ మూత్రబంధనం తొలగిపోతుంది. ఆలోచించుకుని కన్యాదానం చెయ్యి. ఇందులో తప్పేమీ లేదు.
నేను తపస్విని.
చ్యవనుడు చేసిన ఈ ప్రతిపాదన శర్యాతి గుండెల్లో ప్రకంపనాలు పుట్టించింది. ఇస్తానని కానీ
ఇవ్వననికానీ ఏమి చెప్పలేకపోయాడు. అంధుడు, వృద్ధుడు, కురూపి పైగా తపస్వి ఇతడికి దేవకన్యలాంటి
మా అమ్మాయిని ఇస్తే సుఖపడుతుందా? అమ్మాయి సుఖంమాట అలా ఉంచు, నేను సుఖంగా
జీవించగలనా? నా అనారోగ్యం కుదుటపడటానికి కూతురి సుఖాలను త్యాగం చెయ్యనా? ఎంత
పనికిమాలినవాడైనా చేస్తాడా? మంచీచెడూ తెలిసి నేనెలా చెయ్యను? ఇతడితో సంసారం ఎలా చేస్తుంది?
ఏమి సుఖపడుతుంది? యౌవనంలో ఉన్న సుందరాంగి తనకు తగిన భర్త కావాలని కోరుకుంటుందే తప్ప
ఇలాంటి వృద్ధుణ్ణి అంధుణ్ణి ఇష్టపడుతుందా? అనురూప భర్త దొరికినా ఆ వయస్సులో మన్మథుణ్ణి
తృప్తిపరచడం అసంభవమంటారు. ఇంకా ఇలాంటి మగడితో సంసారమైతే చెప్పాలా!
కోవాత్మనః సుఖార్థాయ పుత్ర్యాస్ససారజం సుఖమ్ ।
హరతేఽల్పమతిఃపాపో జానన్నపి శుభాశుభమ్ ॥
యౌవనే దుర్జయః కామో విశేషేణ సురూపయా।
ఆత్మతుల్యం పతింప్రాప్య కిము వృద్దం విలోచనమ్||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి