6, జులై 2021, మంగళవారం

సంస్కృత మహాభాగవతం*

 *06.07.2021  


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము -  డెబ్బది ఏడవ అధ్యాయము*


*శ్రీకృష్ణుడు సాళ్వుని వధించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*77.30 (ముప్పదియవ శ్లోకము)*


*ఏవం వదంతి రాజర్షే ఋషయః కే చ నాన్వితాః|*


*యత్స్వవాచో విరుధ్యేత నూనం తే న స్మరంత్యుత॥11512॥*


పరీక్షిన్మహారాజా! పూర్వాపర విషయములను ఎరుగని కొంతమందిని గురుంచి కొందరు ఋషులు ఇట్లు పలుకుట స్వవచో వ్యాఘాతమని వారు తలంపకుందురు.


*77.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*క్వ శోకమోహౌ స్నేహో వా భయం వా యేఽజ్ఞసంభవాః|*


*క్వ చాఖండితవిజ్ఞానజ్ఞానైశ్వర్యస్త్వఖండితః॥11513॥*


అజ్ఞానులలో ఉండెడి శోకమోహములు, స్నేహభయములు ఎక్కడ? పరిపూర్ణ విజ్ఞానజ్ఞానైశ్వర్య సంపన్నుడగు శ్రీకృష్ణునిలో అవి సంభవించుట ఎక్కడ? - అది అసంభవము.


*77.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*యత్పాదసేవోర్జితయాఽఽత్మవిద్యయా హిన్వంత్యనాద్యాత్మవిపర్యయగ్రహమ్|*


*లభంత ఆత్మీయమనంతమైశ్వరం కుతో ను మోహః పరమస్య సద్గతేః॥11514॥*


శ్రీకృష్ణభగవానుని పాదములను సేవించినవారికి (నామశ్రవణ కీర్తనాది రూపమున సేవించినవారికి)  ఆత్మజ్ఞానము లభించును. అట్టి ఆత్మజ్ఞానులు తమకు అనాదినుండి (అనేకజన్మలనుండి) సంక్రమించిన దేహాత్మ బుద్ధిరూప మోహమును పారద్రోలుదురు. అంతేగాదు వారు అట్టి ఆత్మజ్ఞాన ప్రభావమున అఖండైశ్వర్యమును (మోక్షమును) పొందుదురు. ఇక సత్పురుషులకు పరమగతియైన (పరమాశ్రయుడైన) శ్రీకృష్ణునిలో మోహము ఎట్లుండును?


*77.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*తం శస్త్రపూగైః ప్రహరంతమోజసా శాల్వం శరైః శౌరిరమోఘవిక్రమః |*


*విద్ధ్వాచ్ఛినద్వర్మ ధనుః శిరోమణిం సౌభం చ శత్రోర్గదయా రురోజ హ॰॥11515॥*


సాల్వుడు శ్రీకృష్ణునిపై బలముకొద్దీ శరపరంపరను ప్రయోగించుచు ఆయనను దెబ్బతీయసాగెను. అప్పుడు అమోఘపరాక్రమ సంపన్నుడైన ఆ ప్రభువు తన బాణములతో సాల్వుని గాయపఱచి, అతని కవచమును, ధనుస్సును, కిరీటమును ఛిన్నాభిన్నమొనర్చెను. ఇంకను తన  గదాఘాతముతో శత్రువు (సాల్వుని) యొక్క సౌభవిమానమును తుత్తునియలు గావించెను.


*77.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*తత్కృష్ణహస్తేరితయా విచూర్ణితం పపాత తోయే గదయా సహస్రధా|*


*విసృజ్య తద్భూతలమాస్థితో గదాముద్యమ్య  శాల్వోఽచ్యుతమభ్యగాద్ద్రుతమ్॥11516॥*


శ్రీకృష్ణుని గదాప్రహారములతో సౌభము వేలకొలది ముక్కలై సముద్రజలములలో పడిపోయెను. అది విడిపోకముందే సాల్వుడు భూతలమునకు దిగి, గదను చేబూని, వేగముగా శ్రీకృష్ణునివైపునకు దూసికొనివచ్చెను.


*77.36 (ముప్పది ఐదవ శ్లోకము)*


*ఆధావతః సగదం తస్య బాహుం భల్లేన ఛిత్త్వాథ రథాంగమద్భుతమ్|*


*వధాయ శాల్వస్య లయార్కసన్నిభం బిభ్రద్బభౌ సార్క ఇవోదయాచలః॥11517॥*


గదను తీసికొని పరుగుపరుగున వచ్చుచున్న సాల్వునియొక్క బాహువును శ్రీకృష్ణుడు బల్లెముతో ఛేదించెను. పిమ్మట శౌరి సాల్వుని సంహరించుటకై ప్రళయకాల సూర్యునివలె వెలుగొందుచు అద్భుతముగానున్న తన చక్రమును చేతబట్టెను. అప్పుడు ఆ స్వామి సూర్యునితోగూడిన ఉదయగిరివలె శోభిల్లెను.


*77.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*జహార తేనైవ శిరః సకుండలం  కిరీటయుక్తం పురుమాయినో హరిః|*


*వజ్రేణ వృత్రస్య యథా పురందరో బభూవ హాహేతి వచస్తదా నృణామ్॥11518॥*


కర్ణకుండలములతో, మణికిరీటములతో విలసిల్లుచున్న ఆ మాయావి (సాల్వుని) శిరస్సును శ్రీహరి (శ్రీకృష్ణుడు) ఆ చక్రముతో వృత్రాసురుని శిరస్సును ఇంద్రుడు  వజ్రాయుధముతో వలె ఖండించెను. అప్పుడు సాల్వుని పక్షమునకు చెందిన సైనికులు ఎల్లరును హాహాకారములు గావించిరి.


*77.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*తస్మిన్ నిపతితే పాపే సౌభే చ గదయా హతే|*


*నేదుర్దుందుభయో రాజన్ దివి దేవగణేరితాః|*


*సఖీనామపచితిం కుర్వన్ దంతవక్త్రో రుషాభ్యగాత్॥11519॥*


మహారాజా! శ్రీకృష్ణుని గదాఘాతమునకు సౌభము సముద్రమున కూలిపోగా, పాపాత్ముడు సాల్వుడు నిహతుడుకాగా, ఆకసమున దేవతలు దుందుభులను మ్రోగించిరి. అదే సమయమున దంతవక్త్రుడు తన మిత్రులైన శిశుపాలుడు, సాల్వుడు మొదలగువారిని హతమొనర్చిన శ్రీకృష్ణునిపై పగదీర్చుకొనుటకు మిగుల క్రుద్ధుడై దాడికి దిగెను.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే సౌభవధో నామ సప్తసప్తతితమోఽధ్యాయః  (77)*


ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, ఉత్తరార్ధమునందలి *శ్రీకృష్ణుడు సాళ్వుని వధించుట* అను డెబ్బది ఏడవ అధ్యాయము (77)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కొవ్వు గురించి విశేషాలు

 శరీరము నందు ఏర్పడు కొవ్వు గురించి విశేషాలు - 



  *  శరీరములో అంతర్గత రసాయన చర్యల వలన ఉత్పత్తికాని Linoleic Acid కొవ్వులో ఉంటుంది. ఇది శరీరానికి చాలా అవసరం . 


 *  నరాలవ్యవస్థ సజావుగా పనిచేయుటకు కొవ్వు చాలా అవసరం . 


 *  కొవ్వు శరీరంలో కొన్ని ప్రత్యేక కణాలలో నిలువ ఉంటుంది. ఈ ప్రత్యేక కణాలు చర్మం అడుగున మెత్తలు ( Pads of tissue ) గా ఏర్పడటమే కాక కీళ్లు మరికొన్ని అవయవాలని కుదుపుల నుంచి కాపాడుతూ వాటికి ఇన్సులేషన్ గా ఉపయోగపడును. 


 *  కొవ్వు వేడి నుంచి మరియు చలి నుంచి మనల్ని కాపాడును. శరీరంలో నిలువ అయ్యి ఉన్న కొవ్వు కేంద్రీకృత శక్తి కింద ఏర్పడి అవసరమైన సందర్భాలలో శరీరానికి ఇంధనంగా ఉపయోగపడును . 


 * శరీరపు కొవ్వు కండరాల సంకోచ వ్యాకోచాలకు సహాయపడును. 


 *  ఆరోగ్యవంతుడు అయిన పురుషుడిలో సుమారు 15 కిలోల కొవ్వు నిలువ ఉండును. ఈ కొవ్వు సుమారు రెండు నెలలపాటు అతడి ప్రాణాన్ని నిలబెట్టును . బాగా భారీకాయులు అయిన మనుషులలో 100 కిలోల దాకా నిలువ కొవ్వు ఉండును. ఇది ఒక సంవత్సరం పాటు అతని ప్రాణాన్ని నిలబెట్టును . 


 *  స్త్రీ లలో కొవ్వు పిరుదుల వద్ద , తొడల వద్ద ఎక్కువ నిలువ ఉండును. అది వాళ్లకు గర్భధారణ కోసము , స్తన్యమును ఇవ్వటం కొరకు ఇంధనముగా ఉపయోగపడును. 


              పురుషులలో కొవ్వు పొట్ట భాగాన ఎక్కువ నిలువ ఉండును. అది పురుషులకు అతి త్వరగా శక్తిని ఇచ్చుటకు ఇంధనంగా ఉపయోగపడును. 


 *  కొవ్వులోని యాసిడ్  శరీరకణాల గోడల తయారీకి సహకరించును.ఆంగ్లము నందు Cell walls అంటారు. 


 *  శరీరం ఎదుగుదలకు సహకరించును. 


 *  చర్మపోషణం కొరకు మరియు సెక్స్ పరమైన పునరుత్పత్తికి ఉపకరించును. 


 *  కొవ్వులో మిళితమయ్యే A , D , E ,  K  విటమిన్లు జీర్ణకోశము నుంచి రక్తములో ప్రవేశించడానికి కొవ్వు ఉపకరిస్తుంది. 


 *  ఒక గ్రాము కొవ్వు ద్వారా 9 కేలరీల  శక్తి లభ్యం అగును. ఇది కార్బోహైడ్రేట్స్  అందించే శక్తికి రెట్టింపు 



        మరింత విలువైన సమాచారం తరవాతి పోస్టు నందు వివరిస్తాను. పూర్తి వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


    గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు


ఆత్మజ్ఞాని

 ఆత్మజ్ఞాని.....*


నేను ఈ క్షేత్రం కాదు.. క్షేత్రజ్ఞుడను.. ఆత్మను.. పరమాత్మను అనే నిశ్చయ జ్ఞానం కలిగి ఉంటాడు ఆత్మజ్ఞాని.


తనకి ఓక శరీరం ఉన్నట్లు.. ఆ శరీరంలో తానునున్నట్లు.. ఏవేవో కర్మలు చేస్తున్నట్లు ఇతరుల దృష్టికి కనిపిస్తున్నా తన దృష్టిలో మాత్రం శరీరమూ లేదు. ఆ శరీరం ద్వారా చేయబడుతున్న కర్మలతో సంబందమూ లేదు. ఆ శరీరం ఉన్నా అతడికి లేనట్లే. కనుక "ముక్తుడే". అతడికిక ఏ ప్రారబ్ధమూ లేదు.


జ్ఞానాగ్నిలో అతడి సంచిత కర్మలన్నీ దగ్ధమై పోయినవి. కనుక వాటిలో నుండి ప్రారబ్ధ కర్మలంటూ వచ్చేది లేదు. ప్రారబ్ధం లేదు గనుక జన్మ లేదు. అలాగే అతడు ముక్తిని పొందినవాడు గనుక అతడికి ఆగామి కర్మలు కూడా ఉండవు. ఎందుకంటే అతడు ఏదో అలోచించి కర్మలు చేసే వాడు కాదు. 


కర్తృత్వంతో కర్మలు చేసే వాడు కాదు. నిర్లిప్తంగా.. ఏ ఆలోచనా లేకుండా అతడి దేహం ద్వారా కర్మలు జరిగిపోతాయి. కనుక అతడికి ఏ ఫలమూ ఉండదు. అతడు ఎలా ప్రవర్తించినా తిరిగి జన్మలేదు. అనే మాట జ్ఞాని యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పేమాటయే

ఆత్మ దర్శనం

 💐ఎవరైతే సమస్త సృష్టిలో సర్వవ్యాపిని చూడగలుగుతారో, వారికే ఆత్మ దర్శనం కలుగుతుంది.💐


   ప్రతి మనిషిలో ముఖ్యంగా మూడు కోరికలు ఉంటాయి. జీవించాలి... మరణం ఉండకూడదు. సంపాదించాలి... మితం ఉండకూడదు. ఆనందించాలి... హద్దులు ఉండకూడదు. ఎవరైతే వీటిని దూరంగా ఉంచగలు గుతారో వారిని మానవాతీతులుగా భావించాలి. మనిషి మొదటినుంచి తాను ఉన్న స్థితిలో రాజీ పడలేక ఇంకా దేనికోసమో తపనతోనే జీవిస్తున్నాడు. అనంతాన్ని జయించాలన్న కోరిక ఒక్క మనిషిలోనే కనిపిస్తుంది.


‘మీరు ఇంకా ఒక్క గంట మాత్రమే బతుకుతారని ముందుగా తెలిస్తే, ఎలా ఉంటుందో... ఆ స్థితిలోనే జీవించాలి’ అంటారు జిడ్డు కృష్ణమూర్తి.


ఆ రహస్యం తెలిసిన మరుక్షణమే తనకు సంబంధించినవన్నీ తనవారికి ధారాదత్తం చేయడానికి ఆ గంట వ్యవధి సరిపోదని బాధపడతాడు మనిషి. త్యజించాల్సిన శరీరాన్ని బతికించాలన్న తపనతోనే, విలువైన సమయాన్ని వృథా చేస్తాడు. కానీ తాను చేరుకోవాల్సిన సహజ స్థితి గురించి ఆలోచించడు.


 

కర్మ ఫలాల్ని జన్మ జన్మలుగా అనుభవిస్తున్నాడు. అయినా దేహం ఉండగానే విముక్తి కోసం సాధన మార్గం సుగమం చేసుకోలేక పోతున్నాడు.


రామకృష్ణ పరమహంస పొందిన నిర్వికల్ప సమాధి, రమణ మహర్షి పొందిన సహజస్థితి, బుద్ధుడు పొందిన జ్ఞానోదయం... ఇవన్నీ వారు అంతఃకరణాన్ని, ఇంద్రియాలను, సమస్త భోగ సామగ్రిని త్యజించి సాధించారు. ఆశారహితులై శారీరక కర్మలను చేసినట్టు కనిపించినా, వాటి ఫలితం అంటకుండా జీవించబట్టే అవి సిద్ధించాయి.


మనిషి సహజ స్థితిని పొందడానికి సన్యాసం అవసరం లేదంటారు జిడ్డు కృష్ణమూర్తి.


మరణం తరవాతే సహజస్థితి సిద్ధిస్తుంది అనేది అపోహ. వాస్తవానికి మనిషి నశించేవాడు కాదు, స్వేచ్ఛారహితుడు అంతకంటే కాదు. నిజమైన మనిషి అంటే ఆత్మ. ఆత్మ నిజస్వరూపం సచ్చిదానందం. అనంత ఆకాశంలో సర్వవ్యాపకమైన సర్వస్వాన్ని ప్రకాశింపజేసేదే సత్‌, చిత్‌, ఆనందం. నిత్యమైన, మరణం లేని, పతనం లేని పరమాత్మతత్వం ఇదే.


 

దాన్ని పొందడానికి చేసే సాధనలో అహం అడ్డు పడుతూ ఉంటుంది. అహం అనే ప్రవాహం మీద తేలుతూ సహజస్థితి చేరే సాధన చేయడం అసాధ్యం. అహం హద్దులు దాటి, దాని ఆద్యంతాలు తెలుసుకోవడానికి అంతఃచైతన్యమనే నిచ్చెన ఎక్కాలి. అప్పుడే స్పష్టత ఏర్పడుతుంది. చైతన్య ఉన్నత స్థితిని చేరుకోవడానికి చేసే ప్రయత్నమే నిజమైన సాధన.


సూర్యుడి వేడికి సముద్ర జలాలు ఆవిరై, మేఘాలుగా మారతాయి. అవి హిమాలయాల ఎత్తుకు ఎగురుతాయి. ఆవిరి అణువుల నిజస్వరూపం సముద్రమే. తమ మూలస్థానమైన సముద్రాన్ని తిరిగి చేరడానికి ఆ అణువులు నిరంతరం తాపత్రయపడతాయి. ఆకాశంలో సంచరిస్తూ తిరుగుతుంటాయి. సమయం రాగానే వర్షించి, అనంత సాగరంలో ఐక్యమై సహజస్థితికి చేరుకుంటాయి. అన్ని నీటి బిందువులూ సముద్రాన్ని చేరనట్లే, ఎంత సాధన చేసినా కర్మఫల శేషం వీడిపోనిదే సహజస్థితి సిద్ధించదు. కర్మ బంధాలనుంచి విముక్తి పొంది, ఆత్మను గుర్తించి, ఇంద్రియాల పరిధిని అధిగమించడానికి చేసే ప్రయత్నం నిరంతరం కొనసాగాలి. ఎవరైతే సమస్త సృష్టిలో సర్వవ్యాపిని చూడగలుగుతారో, వారికే ఆత్మ దర్శనం కలుగుతుంది. ఆ స్థితిని నిలబెట్టుకోవడమే యోగం.


భారతదేశంలో ఎన్నో వేల సంవత్సరాల క్రితమే, ఎంతో మంది తపోధనులు తమ యోగవిద్య ద్వారా, ఉన్నతమైన ఆధ్యాత్మిక చైతన్యంతో అస్తిత్వ సమస్యలకు పరిష్కారం కనుగొన్నారు. తమ ఆధ్యాత్మికతతో అహం తాలూకు వాస్తవ స్వరూపం తెలుసుకొని, భవబంధ విముక్తులు అయ్యారు.


🙏

కృష్ణా అనుకోరా

 నిరంతర సంఘర్షణ// ఇది నా ఒక్కడికేనా? అసల సంఘర్షణ ఎందుకు వస్తోంది, ఎందుకీ ఆరాటం, ఏది దొరికితే, ఏది సంపాదిస్తే ఇక ఈ ఆరాటం, పోరాటం తగ్గుతుంది? డబ్బా, పదవా, పేరా...అబ్బే ఇవి అవసరాలు. కేవల సుఖాలు ఇచ్చేవి. ఇవన్నీ వచ్చి పోయేవే కదా. ఇవి కాదు, ఎప్పటికీ శ్రేయస్సు నిచ్చేది, తరగని ఆనందం ఇచ్చేది కావాలి. అంటే శ్రేయోదాయకాలు కావాలి. ఇవి నాకు ఎక్కడ దొరుకుతాయి? ఎలా దొరుకుతాయి, నా అన్వేషణ, ఘర్షణ ఆగేదెప్పుడు? లీలగా స్ఫురించింది. మాధవా అనుకో రా అని, కృష్ణా అనుకోరా అని. కృష్ణా..అనేశాను అప్రయత్నంగా. ఆ అనుభూతి ఇదని కచ్చితంగా చెప్పలేను కానీ, అందరిలో ఉన్నా నేను ఒక్కడినే, నాతో ఆయన ఒక్కడే అనిపించింది. ఆ రూపం, ఆ మురళీ రవం..గోలోకం అంటే అదే కావచ్చు. ఎప్పటికీ ఇక్కడే ఉంచెయ్ స్వామీ, ఇక వెళ్లను.. అంటుంటే..ఆయన నవ్వుతున్నాడు. ఆ చిదా నందం శాశ్వతం కావాలనిపించింది. ఠక్కున మాయమయ్యాడు. మళ్లీ సంఘర్షణ మొదలైంది. కాకపోతే ఒక్కటి అర్థమైంది. ఎవరి స్మరణ చేస్తే క్షణకాలం ఆనందం కలిగిందో ఆయనను క్షణం కూడా మరువకుండా ఉంటే ఆ ఆనందం క్షణికం కాదని, శాశ్వత మవుతుందని, ఇక సంఘర్షణకు తావులేదని. ఇది స్వగతమో, స్వానుభవమో, రచనో, పైత్యమో, నా వెర్రితన మో నాకే తెలియదు.// ఆదూరి వేంకటేశ్వర రావు.

దీక్ష అంటే ఏమిటి

 దీక్ష అంటే ఏమిటి? అవి ఎన్ని?

          అనుషించపూనుకునే ఆచార నియమాన్ని దీక్ష అని లేదా పనిమీద పట్టుదల అని అంటారు. శిష్యులకు వారి వారి బుద్ధి పాటవములోని తరతమ  బేధాలను అనుసరించి గురువులు దీక్షలు ఇస్తారు. అవి మూడు రకాలు.


1.మనోదీక్చ:- తాబేలు తన మనస్సులో పిల్లల సంగతి తలచుకొంటేనే ఆ పిల్లలు కు ఆకలి తీరి సంతృప్తిగా ఉంటాయి. అలాగే తన వాత్సల్యపూరితమైన సత్సంకల్పంతో శిష్యుల్ని తరింప చేస్తారు గురువులు.

2.ద్రుగ్ధీక్చ:- చేపలు గుడ్లను పెట్టి తదేక ద్రుష్టి తో ఆ అండాలను చూస్తూండగా అవి చిట్లి పిల్లలు అవుతాయి. అలాగే తమ శిష్యులను కరుణామయ ద్రుష్టి తో తిలకించి సత్య బోధ గావించి తరింపజేస్తారు గురువులు.

3.స్పర్శదీక్చ:- పక్చులు గుడ్లు పెట్టి తమ రెక్కల తో కప్పి వాటి వాటి పరిమితి కాలంలో పొదిగి పిల్లలు ను చేస్తాయి అలాగే శిష్యుని నుదుటి పై చేయి ఉంచి "నీవిక జనన మరణ దుఃఖ ప్రవాహం నుండి విముక్తడయ్యావు. బ్రహ్మ నీ నుదుట వ్రాసిన వ్రాతను యిదే తుడుచుచన్నానని" శిష్యుని తరింపజేస్తారు గురువులు.

మార్తాండ భైరవారాధ్యా

 785. 🔱🙏  మార్తాండ భైరవారాధ్యా  🙏🔱

ఎనిమిది అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు *మార్తాండ భైరవారాధ్యాయై నమః* అని చెప్పాలి.

మార్తాండ భైరవ = మార్తాండ భైరవునిచే, 

ఆరాధ్యా = ఆరాధింపబడునది. ఈ భైరవుల గురించి మరికొన్ని విశేషాలు 276 నామం అయిన 'భైరవీ' అనే నామ వివరణలో కూడా ఇవ్వబడినాయి.

ఎనిమిది మంది భైరవుల సమష్టి రూపాన్ని 'మహాభై రవుడు' గా అర్థం చేసుకోవచ్చును. ఆదిత్య మండలంలో మధ్యన ఉండే నారాయణుడ్లే ' మహాభైరవుడు' అంటారు. మహాభైరవుడు - అమ్మవారిని చక్కగా ఆరాధించి, అమ్మవారి అనుగ్రహం వలన సూర్య తేజస్సును పొందాడు. అప్పటి నుండే మార్తాండ భైరవుడనే నామంతో పిలవబడ్డాడు. ఈ మార్తాండ భైరవునిచే ఆరాధించబడింది కాబట్టి - అమ్మవారు, 'మార్తాండ భైరవారాధ్యా'.

శ్రీమన్నగర వర్ణనలో చెప్పబడినట్లు ఇరువది రెండవ ఆవరణానికి దేవత ఈ మార్తాండ భైరవుడే ! ఈ మార్తాండ భైరవుడు తన ఇద్దరు భార్యలైన చక్షుష్మతీ, ఛాయాదేవిలతో కలసి అమ్మవారిని ఆరాధిస్తాడు.

ఉచ్ఛ్వాస నిశ్వాసలకు, మనం పలుకుదామన్న ఇచ్ఛకు మధ్య ఉన్నవారే భైరవులు. మనం పలక బోయే మాటకు ఉత్పత్తి కేంద్రంగా ఉండే వాడు మార్తాండ భైరవుడైతే, వాక్కులాగా బయటకు వచ్చేవాళ్ళు భైరవులు అవుతారు. అందుకే భైరవులకు సమష్టి రూపం మార్తాండ భైరవుడౌతాడు. ఈ మార్తాండ భైరవ మంత్రానికి “సయశ్చాయం పురుషే యశ్చాసావా దిత్యే సఏక!' అనేవి మూలమంత్రాలుగా తైత్తిరీయంలో చెప్పబడతాయి. గ్రామాల్లో ఈ మంత్ర ఉపాసన చేస్తే - త్వరితంగా వ్యాపించే అంటు వ్యాధులు, తరుణ వ్యాధులు త్వర త్వరగా దూరమై గ్రామ ప్రజలు కాపాడబడతారు. ఈ ఉపాసనలో తెల్ల జిల్లేడు, ఉమ్మెత్తల వాడకం కూడా ఉంటుంది. ఉమ్మెత్త (ఉన్మత్త) మానసిక రుగ్మతలను కూడా పోగొడుతుంది. (ఈ విషయం276 నామ వివరణలో విపులంగా చెప్పబడినది).

‘మార్తాండ భైరవునిచే ఆరాధింపబడునది' అని ఈ నామానికి అర్థం.


🙏ఓం ఐం హ్రీం శ్రీం మార్తాండ భైరవారాధ్యాయై నమః🙏

🌷శ్రీ  మాత్రే  నమః 🌷

బలమైన ప్రతి పక్షాలు వచ్చాయి 👌*

 *👌 2014తరువాత మనకు, బలమైన ప్రతి పక్షాలు వచ్చాయి 👌*

*🔹 కేంద్రంలో ఒక్క కుంభకోణం కూడా జరగనివ్వకుండా కాపలా కాస్తున్నారు. ఈ ప్రతిపక్షాలను 2054 వరకు మనం ప్రతిపక్షాలుగానే ఉంచుదాం. రాహుల్ గాంధీ నేతృత్వంలో మన ప్రతిపక్షాలు చాలా బాగా పనిచేస్తున్నాయి. మీరు గమనించారో లేదో, గత 68 ఏళ్లలో మొదటిసారి, గట్టి-ప్రతిపక్షం వచ్చింది, బిజెపిపై నిరంతరం ఒత్తిడి తెచ్చి. ప్రభుత్వ-వాగ్దానాలన్నీ  అమలయ్యేలా చేస్తోంది.*

*1) బిజెపి రాఫెల్ తెస్తామన్నప్పుడు "ఎప్పుడు తెస్తారు? ఎలా తెస్తారు. తెచ్చి చూపించండి అని.. ప్రతిపక్షాలు గోల. కేంద్ర ప్రభుత్వం రాఫెల్‌ను తెచ్చేసింది.*

*2) బిజెపి 'CAA తెస్తామనగానే "ఎప్పుడు తెస్తారు? ఎలా తెస్తారు. తెచ్చి చూపించండి అని. ప్రతిపక్షాలు మళ్ళీ గోల. వాళ్ల దెబ్బకి, కేంద్ర ప్రభుత్వం CAA తీసుకుని రాక తప్పలేదు.*

*3) బిజెపి 370 ఆర్టికల్ రద్దు అనగానే 'ఎప్పుడు రద్దు చేస్తారు? ఎలా తొలగిస్తారు. తొలగించి చూపించండి. ప్రతి పక్షాలు మళ్ళీ గోల-గోల. ఆ గోలకే, కేంద్ర ప్రభుత్వం 370 ను తొలగించాల్సి వచ్చింది.*

*4) బిజెపి రామాలయం నిర్మిస్తామనగానే "ఎప్పుడు నిర్మిస్తారు ఎలా ఎలా నిర్మిస్తారు. చేసి చూపించండి చూద్దాం. ప్రతిపక్షాలు. మళ్ళీ అరిచాయి. ప్రతిపక్షాల  దెబ్బకి బిజెపి రామ మందిరాన్ని నిర్మించాల్సి వచ్చింది.*

*ఇలాంటి మరెన్నో పనులు ఉన్నాయి. చరిత్రలో సమర్థవంతంగా ఒత్తిడి తెచ్చే ప్రతిపక్షాలను ఎప్పుడూ చూడలేదు. దేశ ప్రయోజనాల కోసం రాబోయే ఎన్నికల్లో కూడా. మళ్లీ అధికారంలోకి రాబోయే బీజేపీపై ఒత్తిడి ఉండాలంటే. మళ్లీ ఇలాంటి ప్రతిపక్షాలే కావాలి. చాలా చాలా సంవత్సరాలు ఉండాలి!*


*ప్రతిపక్షాల యొక్క తదుపరి ప్రశ్నలు!*


*POK ఎప్పుడు తెస్తారు?*

*జనాభా నియంత్రణ చట్టం ఎప్పుడు ?+++++ so many*

give a lift in the vehicle, it is illegal & you will lose your license ... !! *

 * If you give a lift in the vehicle, it is illegal & you will lose your license ... !! *


 Some of the provisions in the Indian Motor Vehicle Act are *Unclear*.  People are NOT aware of certain rules.


Thus; a Car Owner has been punished under the Indian Motor Vehicle Act for ‘minor assistance’ made unknowingly as doing an illegal act.


 *Read what happened with Nitin Nair from Mumbai*


On the morning of the 18th of last month in Tangar, he was on his way to the office.  It was raining then.  Some buses were overcrowded.  Some buses arrived very late. Thus those who had to go to the office urgently were asking for a ‘lift’.  


So in the area called Aerroly Circle, 3 people asked Nitin Nair for a ‘lift’.  One of them was an old man in his 60s and two other worked in a reputed IT company.  They had to go to an area called Gandhi Nagar.  Nitin Nair had to cross Gandhi Nagar to go to his office. Nitin Nair, thus understanding their situation, generously loaded the trio into his car.  


A police officer stopped the car shortly after.  Who were the traveling powers?  Nitin Nair told the police officer what happened.


The police officer immediately confiscated Nitin Nair's license and handed over a receipt for the fine to Nitin Nair.  Why this sentence?  Nitin Nair did not understand that.


 Therefore, he asked the police officer for an explanation. The police officer gave a shocking answer that *it is illegal to give a lift to unknown persons.*


Nitin Nair did not believe this and thought that the police officer was rounding up to take bribe.  But the police officer behaved very harshly.  The next day he came to the police station, paid up the fine and asked for his license back. But he was only handed over the receipt for the fine. He had to come back empty handed.


Nitin Nair went back to the police station the next day. He was informed about *Section 66 in The Motor Vehicles Act, 1988*. Police said he was convicted under the Necessity for Permits, so he had to go to court and pay a fine and get his license revoked.


Nitin was now thoroughly confused and worried. He consulted with lawyers.  Only then did it become clear to him that indeed really as per the law, *it was illegal to give a lift to unknown persons in a private vehicle.*


Nitin Nayan, who went to court with no other option, pleaded guilty before the judge to the ‘crime’ of converting his personal car into a passenger car by giving ‘lifts’ to unknown persons with the intention of helping.


 He was fined Rs 2,000.


After completing the court proceedings, Nitin Nair went back to the police station and was warned, *If you give anyone a lift again, your license will be confiscated.*


Nitin Nair, who was very upset about this, had poured his grunt on the Facebook page that if there were such laws, even if someone was dying on the road, no one would come forward to help.


 It is true that there are rules in the Indian Motor Vehicle Act that no person should use his private vehicle as a passenger vehicle or a freight vehicle. There are two reasons for this law.


The first reason is that some people use their own non-T-permit vehicles as taxis, to avoid paying taxes.  In this way they are making money illegally.


 The second reason is the safety of the vehicle owner.  If a lift is given to an unknown person, the owner of the vehicle may be harmed by a previously unknown person when the person arrives in the no-man's-land area.  This is why this law has been enacted and implemented.


*So think twice before Giving a Lift to anyone unknown*.  Let your friends and relatives know that such a Law exists.🤔🙄

వర్ణమాలతో పెళ్లి ఆహ్వానం*

 👌 *వర్ణమాలతో పెళ్లి ఆహ్వానం* 👏

—————————————౼౼౼౼౼౼.                    

 😊 బాగుంది.. మీరూ చూడండి! 👍 

                                                     *అ* - *అరుదైన* అమ్మాయి

 *ఆ* - *ఆకతాయి* అబ్బాయి

 *ఇ* - *ఇద్దరికి* 

 *ఈ* - *ఈడు* జోడి కుదిరి

 *ఉ* - ఉంగరాలను తొడిగి

 *ఊ* - ఊరంతా ఊరేగించారు

 *ఋ* - *ఋణాల* కోసం 

 *ఎ* - *ఎ* వరెవరినో అడుగుతూ ఉంటే

 *ఏ* - *ఏనుగు* లాంటి కుభేరుడితో అడిగి

 *ఐ* - *ఐశ్వర్యం* అనే కట్నం ఇచ్చి

 *ఒ* - *ఒకరికి* ఒకరు వియ్యంకులవారు

 *ఓ* - *ఓర్పుతో* ఒప్పందం చేసుకొని

 *ఔ* - *ఔదార్యాని* ఇరు కుటుంబాలకు

 *అం* - *అందించాలని* కోరుకుంటూ

 *అ* : - *అ* : అంటూ

 *క* - *కలపతో* తయారయిన పత్రికలపై 

కలంతో రాసిచ్చి

 *ఖ* - *ఖడ్గలతో* నరికిన పందిరి ఆకులను

 *గ* - *గడప* ముందుకు తీసుకొచ్చి

 *ఘ* - *ఘనమైన* ఏర్పాట్లు చేయించి

 *చ* - *చాపుల* (బట్టలు)నింటిని కొని

 *ఛ* - *ఛత్రం* (గొడుగు) పట్టి గండదీపాని

 *జ* - జరిపిస్తూ

 *ఝ* - *ఝాము* రాత్రి దాక

 *ట* - *ట* పకాయలను కాలుస్తూ

 *ఠ* - *ఠీవిగా* (వైభవంగా)

 *డ* - *డ* ప్పులతో

 *ఢ* - *ఢం* ఢం అని శబ్దాలతో సాగుతుంది

 *ణ* - కంక *ణా* లు చేతికి కట్టుకొని

 *త* - *తట్టలో* తమలపాకులు పట్టుకొని

 *థ* - థమన్(మ్యూజిక్ డైరెక్టర్) డప్పులతో

 *ద* - *దగ్గరి* బంధువులను పిలిచి

 *ధ* - *ధ* నవంతులను కూడా పిలిచి

 *న* - *న* అనే నలుగురిని పిలిచి

 *ప* - *పది* మందిని పలకరిస్తూ

 *ఫ* - *ఫంక్షన్* కి రావాలని చెప్తూ

 *బ* - *బ* లగాలతో బంగార దుకాణాలకు వెళ్లి

 *భ* - *భటువులని* (ఆభరణాలు) కొని

 *మ* - *మంగళ* స్నానాలు చేయించి, రాజసూయ

 *య* - *యాగం* లాంటి పెళ్లి కి 

 *ర* - *రా* రండోయ్ వేడుక చూద్దాం అని చెప్పి

 *ల* - *లక్షణమైన* 

 *వ* - *వధూవరులను* మీరు

 *శ* - *శతమానం* భవతి అని

 *ష* - *షరతులు* లేకుండా ఆశీర్వదించడానికి

 *స* - *సప్తపది* (పెళ్లి) వేడుకలో

 *హ* - *హంగు* ఆర్భాటాలతో రెడీ అయిన మండపంలో

 *ళ* - క *ళ* త్రం (భార్య) కాబోతున్న ఆమె ప్రక్కన వరుడు కూర్చొని

 *క్ష* - *క్షత్రియ* చెంత ఉండే బ్రాహ్మణుల సాక్షిగా జరిగే ఈ పెళ్లి కి

 *ఱ* - *ఱారండి* 

😃

 *ఈ వర్ణమాల పెళ్లి* 

 *వైకుంఠాన మళ్లీ* ....👍

శ్రీకృష్ణ దేవరాయలు [తి. తి. దే. శాసనాలు

 1. క్రీ.శ 1429 జూలై 6 వ తేదీ నాటి మంగినపూడి (ప్రకాశంజిల్లా) శాసనంలో మహామండలేశ్వర దేవరాయమహారాయల కాలంలో మంగినపూడి చెరువు ఖిలమై వుండగా .....


ఇందులో ఖిలమై అంటే


2. బొమ్మరాజు శింగరాయలు పంపిన మంచిరాజు, సింగమలి రాజు, ఆదిపరెడ్డి, వల్లభరెడ్డి, నారపరెడ్డి, మేంకలరెడ్డి, వెంకారెడ్డి, బుసిరెడ్డి, కొంమిరెడ్డి మున్నగువారు మరమ్మతులు చేసి తలా రెండు మర్తురుల భూమి ప్రతిఫలంగా తీసుకొనేటట్లుగా  చెప్పబడ్డది. 


ఇందులో మర్తురుల భూమి అంటే 


3. అట్లే 1514 జూలై 6 వ తేదీ నాటి తిరుమల శాసనంలో శ్రీకృష్ణ దేవరాయలు ప్రతాపరుద్రగజపతిపై దండెత్తి అతడిని కొండవీడు దాకా "యిరగబొడిచి" ఉదయగిరి దుర్గాన్ని గైకొని తిరిగి విజయనగరం పోతూ తిరువేంగళనాథుని దర్శనానికి తిరుమలదేవి,చిన్నాదేవిలతో తిరుమల విచ్చేసి వారితో అమూల్య ఆభరణాలను సమర్పించినట్లు చెప్పబడ్డది.


యిందులో యిరగబొడిచి అంటే 


4.అట్లే అదే రోజున అదే చోట అదే సందర్భంలో యివ్వబడిన మరోశాసనంలో రాయలవారు కూడా అనేక కానుకలనిచ్చి పొత్తపినాటిలోని తాళపాక గ్రామాన్ని దేవుని అమృతపడికి, నివేదనలకు యిచ్చినట్లు, ఆ ప్రమాదంలో నిర్దేశించిన కొంతభాగం రాయలవారిచే స్థాపించబడ్డ సత్రాలలో బ్రాహ్మణుల పోషణకు వుపయోగించునట్లుగా చెప్పబడ్డది. [తి. తి. దే. శాసనాలు III నెం 68].


యిందులో పొత్తపినాటి అంటే


యిందులో నివేదనలకు యిచ్చినట్టు అంటే


5. అట్లే అదే రోజున అదే సందర్భంలో రాయలవారి మరో దేవేరి చిన్నాదేవి కూడా అనేకమైన కానుకలు సమర్పించి తొండ మండలంలోని ముధిడియూరును సమర్పించినట్లు చెప్పబడ్డది. [టి.టి.డి.శాసనాలు III నెం 71.]


యిందులో తొండమండలమంటే

*విష్ణు సహస్ర నామం

 *విష్ణు సహస్ర నామం..* 


*(చివరి భాగం.)*


సహస్రనామం లో ఉన్న వెయ్యి మాటలు 1000 మంత్రాలు అయినప్పటికీ మొత్తం స్తోత్రాన్ని ఒకటే మంత్రం గా కుడా పరిగణిస్తారు. మాలా మంత్రము అనే పేరు విష్ణు సహస్రనామానికి ఒక్క దానికే సరిగ్గా అన్వయిస్తుంది. అంగన్యాస కరన్యాస సహితంగా ఈ మాలా మంత్ర పారాయణ చేస్తారు. అంగన్యాస కరన్యాసాలు అన్ని మంత్రాలకు  ఉంటాయి. ఋషి చందస్సు దేవత బీజం శక్తి మంత్రం కీలకం అస్త్రం నేత్రం కవచం ఇవన్నీ చాలా మంత్రాలకు ఉంటాయి. తర్వాత దిగ్బంధనం ధ్యానం వినియోగం ఉంటాయి. 


*విష్ణు సహస్రనామం లో మాత్రమే " ఆనందం పర బ్రహ్మేతి యోనిః " అనే విలక్షణమైన ప్రయోగం ఉంటుంది. ఆనంద స్వరూపుడు అయిన పరబ్రహ్మమే మూలము అని దాని అర్థం. ఇది సరిగ్గా అర్థం చేసుకుంటే వేదాంతాన్ని విడిగా చదువుకో అక్కర్లేదు.  అద్భుతమైన భావన..*


 సంధ్యా వందనమప్పుడు ఆచమనం తోపాటూ చెప్పుకునే  కేశవ నామాలు విష్ణు సహస్రనామం లో ఉన్నాయి. అలాగే నారాయణ కవచం లో ఉండే నామాలన్నీ కూడా ఈ విష్ణు సహస్రనామం లో ఉన్నాయి. అందువల్ల విష్ణు సహస్రనామ పఠనం వల్ల నారాయణ కవచంపఠన ఫలితం కూడా వస్తుంది. 


ఆదిశంకరులవారు నేను రాయవలసింది ఇంకేమన్నా మిగిలి ఉందా సూచించండి అని శిష్యులందరినీ అడిగారుట. ఒక్కొక్కరిని వాళ్లకు తోచిన విషయాన్ని ఒక ఆకు మీద రాసి తెమ్మన్నారట. అందరూ రాసింది చూస్తే అన్ని ఆకుల మీద విష్ణు సహస్రనామానికి భాష్యం రాయండి అని ఉందట. అది శంకర భాష్యానికి అదే ప్రాతిపదిక.


శంకరాచార్యులవారు స్తోత్ర లక్షణాలను వివరిస్తూ ప్రతి స్తోత్రం లోనూ నమస్కారము ఆశీర్వాదము సిద్ధాంతము అనంత శక్తి నిరూపణము, దివ్యైశ్వర్య వివరణ, ప్రార్థన అని ఆరు అంగాలు ఉండాలి అని సూత్రీకరించారు. ఆయన చేసిన అన్ని స్తోత్రాలలో నూ అలా ఆరు అంగాలు ఉంటాయి. వ్యాసుడు రచించిన విష్ణు సహస్రనామ స్తోత్రంలో ప్రార్థన లేదు.  సర్వ ప్రహరణాయుధ అనేది వ్యాసుల వారు రాసిన 1000 వ నామం. దాని తర్వాత శంకరులవారు "వనమాలీ గదీ.... వాసుదేవోz భిరక్షతు" శ్లోకాన్ని కలిపి 1008 నామాలు చేశారు.  అప్పుడు "అట్టి శ్రీ మహావిష్ణువు మమ్ములను రక్షించుగాక" అనే ప్రార్థన సిద్ధించింది. ఆ శ్లోకం వ్యాస భారతంలో ఉండదు. 


విష్ణు సహస్ర నామాలు విడివిడిగా మంత్రాలుగా కానీ మాలామంత్రం గా గానీ అంగన్యాస కరన్యాసాలు మొదలైన నియమాలేవీ లేకుండా స్త్రీలూ పిల్లలూ అన్ని వర్ణాల వాళ్ళు కంఠతా పట్టి స్తోత్రం లాగా కూడా చదువుకోవడానికి అనువుగా ఉంటుంది.


వ్యాసుడు రచించిన విష్ణు సహస్రనామం లో వెయ్యి విడి నామాలు లేవు. కొన్ని నామాలు రెండుసార్లు కొన్ని నామాల మూడు సార్లు అలా మళ్లీ మళ్లీ వచ్చాయి. ఉదాహరణకు వాసుదేవ నామము వసు ప్రద నామము రెండు రెండు సార్లు వచ్చ్చాయి.  ఒకే అర్థం వచ్చే రెండు మూడు నామాలు  శ్రీపతి శ్రీధర వంటివి వాడారు.  వాటికి ఆదిశంకరులవారు ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త అర్థం చెబుతూ భాష్యం రాసి పునరుక్తి దోషం లేకుండా చేశారు. 


ఆదిశంకరులు తన భజ గోవింద స్తోత్రంలో  "గేయం గీతా నామ సహస్రం" అన్న చోట గీతా అంటే భగవద్గీత అని. నామ సహస్రం అంటే విష్ణు సహస్రనామం అనీ రూఢి గా చెప్పారు. ఆయన ఉద్దేశంలో వేరే సహస్రనామాలు సహస్రనామాలే  కావు.


*ఉపాసకులకు ఆధ్యాత్మిక వాదులకు సాధారణ భక్తులకు అందరికీ ఉపయోగ పడేది విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామం మోక్షానికి సులభమూ సుఖమూ అయిన మార్గము...*


*పవని నాగ ప్రదీప్*

అకాల మృత్యువు లకు కారణం

 అకాల మృత్యువు లకు కారణం ప్రకృతియే. ప్రకృతిని శాసిధ్దామా లేక రక్షిద్దామా. ప్రకృతి దాని ధర్మం విరుద్దంగా అనగా సమ తుల్యత లేకపోవుట యనగా మానవ జీవనమునకు అనుగుణంగా లేక పోవుటకు కారణం మానవుడేనా.అయితే దీనికి మూలకారణం పరిశీలించిన శక్తి ధర్మ పరంగా యనగా సూత్ర పరంగా వ్యాప్తి చెందినది. యిది అంతటా వకే విధంగా వ్యాప్తి చెంది యుండలేదు. వక్కొక్క స్థల కాల, గమన, లక్షణముల వలననే యీ ప్రకృతిలో మార్పులు కలుగుచున్నవి. పరమేశ్వర పరమేశ్వర శక్తి శాంత స్వభావము ప్రకృతి శాంతి లక్షణము. శివ విష్ణు తత్వములు రెండును శాంత స్వభావము ఎల్లప్పుడు. ప్రకృతి అధర్మ వర్తనమే వారి కోపానికి కారణము. ఏ మానవుడైనా కోపంగా వున్నాడు యనగా వారి మన స్సుకు విరుద్దంగా ఎదుట వారి  ప్రవర్తనయే. అనగా అది ధర్మ మైనా అధర్మమైనాసరే. మన లాగానే శివ విష్ణు తత్వములు కూడా సృష్టిలో శక్తికి భాగములే.వారు ఎల్లప్పుడు శాంత స్వభావము తో శక్తి రూపంలో ప్రకృతిని ఆరాధన. మనం కూడా అటులనే ప్రవర్తించుట జీవ సాధు లక్షణము. లేనిది జీవుని రాక్షస ప్రవృత్తి ప్రకృతికి వినాశనానికి. రెండు తత్వములు ముందు రూపం లేదు. ఎందుకనగా అది సమస్త వ్యాప్తమైనది. రెండును వకటే కాని వకటే నిర్గుణం వకటి సగుణము.సగుణముగానే ఆరాధన. దీనివలన నిర్గుణతత్వం యనగా సగుణముగానే పరిమితి కలది పదార్ధం కనుక . నిర్గుణమునకు పరిమితి లేదు. బ్రహ్మాండ వ్యాప్తదేహా...శక్తి వ్యాప్త పరిమాణం కొలత (మెజర్మెంటు) తెలియదు. అది విశ్వ వ్యాప్తమై చైతన్య మైన అణు ఆత్మ శక్తి. దాని రూపం కూడా తెలియదు విష్ణు వ్యాప్తం వలెనే. మూడవది ధాతుపరమైన పంచభూతాత్మక తత్వం బ్రహ్మ పదార్ధ తత్వం

అది రూపముగా మారి జీవ మూలకారణం.సృష్టి సమస్తం బ్రహ్మ నుండే. సమస్త పదార్ధ ధాతు లక్షణము బ్రహ్మ పదార్ధమే. రుద్ర శక్తిని వ్యాప్తిని తెలియుటయే రుద్రం ప్రశ్న తెలుపుట. ప్రతీ మంత్రం శక్తిని దాని వ్యాప్తమును పదార్ధ లక్షణమును తెలుపుచున్నది.మాషాశ్చమే, తిలాశ్చమే, ముద్గాశ్చమే,ఖల్వాశ్చమే, గోధూమాశ్చమే,...అణవశ్చమే, శ్యామాకాశ్చమే... యిలా ప్రతీదీ సూత్ర ప్రకారం పేరు

ప్రకృతి వ్యాప్తమును పదార్ధ లక్షణమును తెలుపుచున్నది. అది మానవుడేయని మానవునికి తెలియుటయే ఙ్ఞానమని ప్రకృతియని ఋషులు వేద పరంగా వివరించుట జరిగినది. దీనికి ముఖ్యం పదార్ధ రూపంలో గల దేహము, లింగ రూపం. దానికి మూలమైన అగ్ని, నీటి లక్షణమే. మనిషి స్నానం లింగాభిషేకం వకటే. రెండును కర్మ రూపంలో చేయదగినవి.స్నానం జీవ చైతన్యమునకు దేహము,జీవుడికి రెండింటికి యిది అవసరమే. శివ కేశవ తత్వంలో *సుకేషుమే హరిమాణం. *అని అరుణ మంత్రం లో. హరి మా అణం, సు కేషు మే. మే జీవుని యెుక్క శక్తి అణం యని అది హరి రూపంలో విష్ణు రూపంలో వ్యాప్తి .స, ష ,రెండింటి తేడా గమనించిన స  సత్ ష ఉష ,కాంతి సుషుమ, మారుట యనునది సుకేషుమే. కే జీవ తత్వం గా మారుట. సత్ కాంతి  మారుటయనే క్రియ ప్రకృతి. మారని యెడల సత్ గురించి తెలియదు ఉష మారిన గాని.ఉష యనగానే కొంత తెలిసినది కాంతి రూపంలో మారిందని. శక్తి యెుక్క నిర్గుణ వ్యాప్తి సగుణముగానే మారుటయు జీవ లక్షణము.సగుణము పదార్ధ ఙ్ఞానము. నిర్గుణంలో జీవ లక్షణము తెలియదు సగుణమైనగాని. రూపంగా మారిన హరి తత్వమే జీవ మూలం. అనంతమైన ఙ్ఞానమును తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

*శ్రీలలితా సహస్రనామ భాష్యము *931వ నామ మంత్రము *

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*931వ నామ మంత్రము* 06.07.2031


*ఓం మానవత్యై నమః*


చిత్తసమున్నతి గలిగినది జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మానవతీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం మానవత్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులను ఆ పరమేశ్వరి సర్వదా ఆపదలందు కాపాడుచు, ధనకనకవస్తువాహన సమృద్ధి కలుగజేస్తూ, పరమాత్మపై ఎనలేని భక్తిప్రపత్తులను సుస్థిరముచేసి తరింపజేయును.


పరమేశ్వరి అభిమానవతి. ఉత్కృష్టురాలననే చిత్తౌన్నత్యము కలిగినది. నవదుర్గలుగాను, వివిధ గ్రామదేవతలుగా అవతరించినను, జన్మజన్మలయందును కూడా పరమేశ్వరునే భర్తగా పొందిసయంతటి మహాపతివ్రత. *కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత* కామేశ్వరునికి మాత్రమే తెలిసిన, సౌభాగ్యమృదుత్వాలతో కూడిన ఉరుద్వయంగలిగి  శివశక్త్యౌక్యము నిరూపితమైనంతటి మహాపతివ్రత. గనుకనే శ్రీమాత *మానవతీ*. యని అనబడినది. శివునిలో సగందేహమును తన సొంతము చేసుకొనినంతటి  *స్వాధీనవల్లభ* గనుకనే ఆ శ్రీమాత *మానవతీ* యని అనబడినది. భండాసుర, మహిషాసురాది రాక్షసులను సంహరించి, దేవతలను కాపాడినది *(దేవకార్యసముద్యత)* గనుకనే *మానవతీ* యని అనబడినది.


వాడవాడలా, కొండలలోను, వనములందు - ఎల్లెడల లలితాపరమేశ్వరిగా, అష్టాదశ శక్తిపీఠాధీశ్వరిగా, గ్రామదేవతగా కొలువబడిన విశేషమైన కీర్తిప్రతిష్ఠలు గలిగినది గనుకనే *మానవతీ* యని అనబడినది.


మువురమ్మలకు మూలపుటమ్మయై, కుడియెడమలందు లక్ష్మీసరస్వతులు చామరములచే సేవింపబడినంతటి గౌరవాదరణములుగలిగి *మానవతీ* యని స్తుతింపబడుచున్నది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

సంస్కృత మహాభాగవతం


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము -  డెబ్బది ఏడవ అధ్యాయము*


*శ్రీకృష్ణుడు సాళ్వుని వధించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*77.9 (తొమ్మిదవ శ్లోకము)*


*వీక్ష్య తత్కదనం స్వానాం నిరూప్య పురరక్షణమ్|*


*సౌభం చ శాల్వరాజం చ దారుకం ప్రాహ కేశవః॥11491॥*


శ్రీకృష్ణుడు ద్వారకకు చేరినంతనే తనవారికిని సాల్వసైన్యములకును మధ్య జరుగుచున్న యుద్ధమును గమనించెను. సౌభము, పురరక్షణమునకై బలరాముని నియమించి, దారుకునితో (సారథితో) ఇట్లనెను-


*77.10 (పదియవ శ్లోకము)*


*రథం ప్రాపయ మే సూత శాల్వస్యాంతికమాశు వై|*


*సంభ్రమస్తే న కర్తవ్యో మాయావీ సౌభరాడయమ్॥11492॥*


"సారథీ! నా రథమును వెంటనే సాల్వుని సమీపమునకు చేర్చుము. ఈ సాల్వుడు గొప్ప మాయావి. ఇతని పోకడలను చూచి నీవు ఏమాత్రమూ తొట్రుపడవద్దు"


*77.11 (పదకొండవ శ్లోకము)*


*ఇత్యుక్తశ్చోదయామాస రథమాస్థాయ దారుకః|*


*విశంతం దదృశుః సర్వే స్వే పరే చారుణానుజమ్॥11493॥*


శ్రీకృష్ణప్రభువు ఇట్లు ఆదేశించినంతనే దారుకుడు రథమును సాల్వుని కడకు నడపెను. గరుడధ్వజముగల రథముపై ఆ స్వామి రణరంగమున ప్రవేశించుటను అచటనున్న యాదవవీరులను, సాల్వుని యోధులు చూచిరి.


*77.12 (పండ్రెండవ శ్లోకము)*


*శాల్వశ్చ కృష్ణమాలోక్య హతప్రాయబలేశ్వరః|*


*ప్రాహరత్కృష్ణసూతాయ శక్తిం భీమరవాం మృధే॥11494॥*


*77.13 (పదమూడవ శ్లోకము)*


*తామాపతంతీం నభసి మహోల్కామివ రంహసా|*


*భాసయంతీం దిశః శౌరిః సాయకైః శతధాచ్ఛినత్॥11495॥*


పరీక్షిన్మహారాజా! సాల్వుడుగూడ శ్రీకృష్ణుని చూచెను. అప్పటికే గదుడు మున్నగువారిచే అతని బలములు  దాదాపు హతమైయుండెను. అంతట అతడు కృష్ణుని రథసారథియగు దారుకునిపై *శక్తి* ని ప్రయోగించెను. అది యుద్ధరంగముస భీకరధ్వనులను గావించుచు విజృంభించెను. ఆకాశమున ఉల్కవలె తన కాంతులను దశదిశలను నింపుచు, అతివేగముగా సారథిపై బయటకు వచ్చుచున్న ఆ శక్తిని జూచి, శ్రీకృష్ణుడు తన శరాఘాతమలచే దానిని వందలకొలది ముక్కలు గావించెను.


*77.14 (పదునాలుగవ శ్లోకము)*


*తం చ షోడశభిర్విద్ధ్వా బాణైః సౌభం చ ఖే భ్రమత్|*


*అవిధ్యచ్ఛరసందోహైః ఖం సూర్య ఇవ రశ్మిభిః॥11496॥*


పిమ్మట ఆ ప్రభువు సాల్వునిపదునాఱు బాణములతో కొట్టెను. మఱియు సూర్యుడు తన కిరణములచే ఆకాశమును వలె, గగనతలమున పరిభ్రమించుచున్న ఆసౌభవిమానమును,  ఆ స్వామి తన బాణజాలముచే కప్పివేసెను.


*77.15 (పదిహేనవ శ్లోకము)*


*శాల్వః శౌరేస్తు దోః సవ్యం సశార్ఙ్గం శార్ఙ్గధన్వనః|*


*బిభేద న్యపతద్ధస్తాచ్ఛార్ఙ్గమాసీత్తదద్భుతమ్॥11497॥*


అంతట సాల్వుడు శారఙ్గ ధనుస్సుతో విలసిల్లుచున్న శ్రీకృష్ణునిఎడమభుజమును తన బాణముతో కొట్టెను. వెంటనే ఆ ధనుస్సు ఆ స్వామి చేతినుండి క్రింద పడిపోయెను.  మెఱుపు వేగముతో జరిగిన ఆ దృశ్యము అద్భుతావహమైయుండెను.


*77.16 (పదహారవ శ్లోకము)*


*హాహాకారో మహానాసీద్భూతానాం తత్ర పశ్యతామ్|*


*వినద్య సౌభరాడుచ్చైరిదమాహ జనార్దనమ్॥11498॥*


గగనతలమునందును, భూతలమునందును ఉండి ఆ అద్భుత సంఘటనను చూచినవారు అందఱును హాహాకారములు చేయసాగిరి. అప్పుడు సాల్వుడు బిగ్గరగా గర్జించుచు కృష్ణునితో ఇట్లనెను-


*77.17 (పదిహేడవ శ్లోకము)*


*యత్త్వయా మూఢ నః సఖ్యుర్భ్రాతుర్భార్యా హృతేక్షతామ్|*

.

*ప్రమత్తః స సభామధ్యే త్వయా వ్యాపాదితః సఖా॥11499॥*


*77.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*తం త్వాద్య నిశితైర్బాణైరపరాజితమానినమ్|*


*నయామ్యపునరావృత్తిం యది తిష్ఠేర్మమాగ్రతః॥11500॥*


"మూర్ఖుడా! మాకు మిత్రుడు, సోదరుడు ఐన శిశుపాలుని భార్యను (శిశుపాలునికి ఇచ్చి పెండ్లిచేయుటకై నిశ్చయింపబడిన రుక్మిణిని మేము అందరము చూచుచుండగనే అపహరించితివి. అంతేగాక ధర్మరాజుయొక్క రాజసూయ యాగసభలో మా మిత్రుడైన శిశుపాలుడు ఏమరుపాటుతో సుండగా అతనిని అన్యాయముగా పొట్టనబెట్టుకొంటివి. నిన్ను నీవు అజేయునిగా భావించుకొనుచున్నావు. నేడు నీవు నా యెదుట నిల్చినచో, నా నిశిత శరములతో నిన్ను తిరిగిరాని లోకములకు పంపెదను".


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి డెబ్బది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి లీలలు..


*పుప్పాల లక్షమ్మ ..*


దాదాపు 12 సంవత్సరాల క్రితం సంఘటన ఇది..చావు బతుకుల్లో ఉన్న ఓ యువతిని తీసుకుని..ఆమెకు దగ్గర సంబంధీకులు మొగలిచెర్ల గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికొచ్చారు..వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందేమో..ఆమె పరిస్థితి చూస్తే.. కొద్ది రోజులకన్నా ఎక్కువకాలం బ్రతికేటట్లుగా అనిపించడం లేదు..కుడి దవడ మీద పెద్ద పుండు..లోపలి భాగానికి రంధ్రం పడివుంది..మాట లేదు..కేవలం ఎముకల గూడు లాగా బక్కచిక్కిపోయి ఉన్నది..

నోటి కాన్సర్ వచ్చిన వాళ్ళ లాగా భయానకంగా ఉన్నది..పూర్తిగా ఆశ వదిలేసి, చివరి ప్రయత్నంగా శ్రీ దత్తాత్రేయుని సన్నిధికి చేర్చారు..ఒకరంగా ఈమెను  వదిలించుకునే ప్రయత్నం లోనేే వాళ్ళు వచ్చారు..ఎలాగూ ఈమనిషి బ్రతకడం కష్టం..ఈ స్వామి దగ్గర వదిలేసి వెళ్లిపోదామని వాళ్ళు అనుకున్నారు..బ్రతికిఉన్న నాలుగు రోజులూ చూడటానికి ఎవరో ఒకరు దగ్గరుంటే చాలు..అని నిర్ణయించుకున్నారు..తమలోనే ఉన్న ఒక ముసలామెను ఈ మనిషి కి తోడుగా ఉంచాలని నిర్ణయించుకున్నారు..అది వాళ్ళ ఆలోచన..కానీ దైవ తలంపు వేరుగా ఉంటుంది కదా!..


వివరాల్లోకి వెళితే... ఆమె పేరు పుప్పాల లక్ష్మీదేవి, నెల్లూరు జిల్లా, కొండాపురం మండలం, వెలిగండ్ల గ్రామ నివాసి..


ఇక లక్షమ్మ ఏ నిమిషంలో ఆ స్వామి సన్నిధిలో అడుగుపెట్టిందో తెలీదు కానీ, త్వరలోనే చనిపోతుంది, ఎక్కువ రోజులు  బ్రతుకదు అనుకున్న లక్ష్మీ దేవి లో మార్పు కనబడసాగింది..తాను బ్రతకాలంటే తనకు ఉన్న ఏకైక మార్గం..ఆ దత్తాత్రేయుడిని మనసా వాచా నమ్మడమే..సర్వస్య శరణాగతి చెందడమే..అని లక్షమ్మ నిశ్చయించుకున్నది..శ్రీ స్వామివారి తీర్ధాన్ని తీసుకునేది..రోజులు గడుస్తున్నాయి..లక్షమ్మ తన మనసులో ఎంతగా ప్రార్ధించిందో..ఏయే మ్రొక్కులు మ్రొక్కుకున్నదో..ఆ దత్తాత్రేయుడి కే తెలియాలి..శ్రీ స్వామివారి కరుణ జాలువారింది..ఎప్పుడూ స్వామి మంటపంలో పడుకునే ఉండే లక్ష్మీ దేవి మెల్లగా ఒక్కొక్క అడుగు వేయసాగింది..దవడ నుంచి నోటిలోకి ప్రాకి, భయంకరంగా కనపడే ఆ పుండు మానడం మొదలుపెట్టింది..ఏ మందు వాడటం లేదు..కేవలం స్వామి వారి వీభూది తప్ప..మూడుపూటలా హారతి, తీర్ధం తీసుకునే అలవాటు చేసుకున్నది..మేమంతా లక్షమ్మా అని పిలిచేవాళ్ళం..(ఈ క్షణం లో ఆమె గురించి ఇలా పోస్ట్ పెడదామని అనుకున్నప్పుడే ఆమె పూర్తీ పేరు లక్ష్మీ దేవి అని నేను తెలుసుకున్నాను..)


కొన్నాళ్ళకు ఆ నోటి పుండు క్రమంగా తగ్గుముఖం పట్టింది..కొద్దీ కొద్దిగా ఆహారం తీసుకోసాగింది..మాట్లాడటం మర్చిపోయిన  లక్షమ్మ కు మాటలూ స్పష్టంగా వచ్చాయి..స్వామి వారి భజనలో ఇతరులతో కలిసి గొంతు కలిపి పాడటం చేయసాగింది..ప్రతిరోజూ నియమానుసారంగా శ్రీ స్వామివారి గుడి చుట్టూ..ఎవరి చేయూతా లేకుండా తానే ప్రదక్షిణాలు చేయసాగింది..


మేమందరమూ లక్షమ్మ కోలుకోవడం కళ్ళారా చూస్తూనే ఉన్నాము..ప్రస్తుతం లక్షమ్మ అని మాచేత పిలువబడే ఆ పుప్పాల లక్ష్మీదేవి శాశ్వత చిరునామా శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరమే..ప్రతిరోజూ శ్రీ స్వామివారి ప్రభాత సేవకు తులసి, పూలూ కోసుకొచ్చి ఇస్తుంది.. భజనలో స్వామి వారి పాటలు గొంతెత్తి పాడుతుంది.. శ్రీ స్వామివారి మండపం లోనే నిద్ర పోతుంది..


ఆప్తులు అనుకున్న వాళ్ళు..చివరకు కట్టుకున్న వాడు కూడా  అనారోగ్యంతో ఉన్న తనను  అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళినా...తను మాత్రం ఆ దత్తాత్రేయుడి పాదాలే నమ్ముకున్నది..ఆ స్వామి వద్దే తన శేష జీవితమని నిశ్చయించుకున్నది..ప్రతి సంవత్సరం దత్తదీక్ష తీసుకుంటుంది..సర్వకాల సర్వావస్థలయందూ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి స్మరణే ధ్యాసగా జీవిస్తున్నది..


శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరంలో ఉన్న మేమమందరమూ మామూలుగా మాటల సందర్భంలో చెప్పుకునే ఓ మాట.."అంతెందుకు, మనమంతా లక్షమ్మను చూడటం లేదూ..అంతకంటే స్వామి లీల చెప్పుకోవాలా"? అని..


సర్వం..

శ్రీ దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).