6, జులై 2021, మంగళవారం

దీక్ష అంటే ఏమిటి

 దీక్ష అంటే ఏమిటి? అవి ఎన్ని?

          అనుషించపూనుకునే ఆచార నియమాన్ని దీక్ష అని లేదా పనిమీద పట్టుదల అని అంటారు. శిష్యులకు వారి వారి బుద్ధి పాటవములోని తరతమ  బేధాలను అనుసరించి గురువులు దీక్షలు ఇస్తారు. అవి మూడు రకాలు.


1.మనోదీక్చ:- తాబేలు తన మనస్సులో పిల్లల సంగతి తలచుకొంటేనే ఆ పిల్లలు కు ఆకలి తీరి సంతృప్తిగా ఉంటాయి. అలాగే తన వాత్సల్యపూరితమైన సత్సంకల్పంతో శిష్యుల్ని తరింప చేస్తారు గురువులు.

2.ద్రుగ్ధీక్చ:- చేపలు గుడ్లను పెట్టి తదేక ద్రుష్టి తో ఆ అండాలను చూస్తూండగా అవి చిట్లి పిల్లలు అవుతాయి. అలాగే తమ శిష్యులను కరుణామయ ద్రుష్టి తో తిలకించి సత్య బోధ గావించి తరింపజేస్తారు గురువులు.

3.స్పర్శదీక్చ:- పక్చులు గుడ్లు పెట్టి తమ రెక్కల తో కప్పి వాటి వాటి పరిమితి కాలంలో పొదిగి పిల్లలు ను చేస్తాయి అలాగే శిష్యుని నుదుటి పై చేయి ఉంచి "నీవిక జనన మరణ దుఃఖ ప్రవాహం నుండి విముక్తడయ్యావు. బ్రహ్మ నీ నుదుట వ్రాసిన వ్రాతను యిదే తుడుచుచన్నానని" శిష్యుని తరింపజేస్తారు గురువులు.

కామెంట్‌లు లేవు: